biryani
-
'బిర్యానీ' పూర్తిగా మాంసం ఆధారిత వంటకమా?
ఆహార ప్రియులకు ఇష్టమైన వంటకాల్లో అగ్రస్థానం బిర్యానీదే. అంతేగాదు ఆన్లైన్ ఎక్కువ ఆర్డర్ చేసేది కూడా బిర్యానీ. అయితే ఈ వంటకం ఇరాన్లో ఉద్భవించిందని, మొఘల్ పాలన కారణంగా భారత ఉపఖండంలో నెమ్మదిగా భాగమైందని చెబుతుంటారు పాక నిపుణులు. ఆ విధంగా మనకు బిర్యానీ తెలిసిందేనది చాలామంది వాదన. అయితే అసలు బిర్యానీ అంటే మాంసంతో కలిపి చేసేదే బిర్యానీ అని, కూరగాయలతో చేసే వెజ్ బిర్యానీ అనేది బిర్యానీనే కాదని అంటున్నారు. నెట్టింట దీనిపై పెద్ద చర్చ నడుస్తోంది. మరీ ఇంతకీ వెజ్ బిర్యానీ అనేది ఉందా..?. మాంసం ఆధారిత వంటకమే బిర్యానీనా అంటే..వెజ్ లేదా నాన్ వెజ్ బిర్యానీ రెండూ వాటి రుచి పరంగా ఎవర్ గ్రీన్ అనే చెప్పొచ్చు. అయితే పాక నిపుణులు మాత్రం బిర్యానీ అనగానే మాంసంతోనే చేసే వంటకమని నమ్మకంగా చెబుతున్నారు. కానీ మరికొందరు మాత్రం కూరగాయలతో చేసినదే బిర్యానీ అని వాదిస్తున్నారు. ప్రముఖ చెఫ్‌లు పాక నిపుణులు బిర్యానీని పూర్వం సుగంధ ద్రవ్యాల తోపాటు, జంతువుల కొవ్వుని కూడా జోడించి మరింత రుచిని తీసుకొచ్చారని చెబుతున్నారు. అందువల్ల మాంసం లేకుండా తయారుచేసిన వంటకాన్ని నిజంగా "బిర్యానీ"గా పరిగణించలేమని అన్నారు. అయితే కాలక్రమే ఆహార వంటకాలు అభివృద్ధి చెందడంతో.. మాసంహారం తినని వాళ్ల కోసం ఇలా కూరగాయలు జోడించి చేయడంతో అది కాస్త వెజ్ బిర్యానీగా పిలవడం జరిగిందన్నారు. అయితే అది నిజమైన బిర్యానీ కాదని తేల్చి చెబుతున్నారు ప్రముఖ చెఫ్, ఫుడ్ ల్యాబ్ వ్యవస్థాపకుడు సంజ్యోత్ కీర్. అలాగే కూరగాయలు జోడించినంత మాత్రమే దానికి బిర్యానీ ఘమఘలు రావని, దానికి సుగంధ ద్రవ్యాలు తోడైతేనే.. కూరగాయలు రుచిగా మారి మనకు అద్భుతమైన వెజ్ బిర్యానీ సిద్ధమవుతుందని చెప్పారు. అందువల్ల కూరగాయలతో చేసినదాన్ని బిర్యానీగా పరిగణించరని అన్నారు. చాలామందికి ఇది నచ్చకపోయినా..వాస్తవం ఇదేనని అన్నారు. అలా అని వెజ్ బిర్యానీని కూడా తీసిపారేయలేం. ఎందుకంటే కాటేజ్ చీజ్ (పనీర్), సోయా బీన్, టోఫు, పుట్టగొడుగులు, జాక్‌ఫ్రూట్ (కథల్) లేదా ఖర్జూరం (ఖజూర్) వంటి కూరగాయలతో మరింత రుచికరంగా చేస్తున్నారు చెఫ్‌లు. చెప్పాలంటే..మాంసంతో చేసినన బిర్యానీ రుచి కూడా దానిముందు సరిపోదేమోనన్నంత టేస్టీగా ఉంటోందన్నారు చెఫ్ సంజ్యోత్ కీర్. (చదవండి: యూట్యూబ్ చూసి సెల్ఫ్ సర్జరీ..! వైద్య నిపుణుల స్ట్రాంగ్ వార్నింగ్) -
Bird Flu Effect: తగ్గిన చికెన్ బిర్యానీ సేల్స్
సాక్షి, హైదరాబాద్ : బిర్యానీ.. ఈ పేరు వినగానే మాంసాహార ప్రియులకు పండగే. లొట్టలు వేసుకుంటూ లాగించాల్సిందే. చికెన్ బిర్యానీ అంటే మరింత మక్కువ. కానీ.. ప్రస్తుతం నగరంలో చికెన్ బిర్యానీల విక్రయాలు తగ్గిపోయాయి. ఫిష్, మటన్ బిర్యానీల వైపు మొగ్గు కనిపిస్తోంది. చికెన్ బిర్యానీ అమ్మకాలు ఒక్కసారిగా పడిపోయాయి. దీని అంతటికీ కారణం బర్డ్‌ఫ్లూ ఎఫెక్ట్. ఈ వైరస్ కారణంగా కోళ్లు చనిపోతుండటంతో చికెన్ బిర్యానీల విక్రయాలు ఒక్కసారిగా పడిపోయాయి. చికెన్‌తో చేసే వంటకాలకూ డిమాండ్ తగ్గిపోవడంతో హోటళ్ల పరిశ్రమ లబోదిబోమంటోంది. ఈ పరిణామాలు చివరికి గిగ్‌వర్కర్లపైనా పడింది. టేక్ అవే.. ఇతర ఆన్లైన్ ఆర్డర్లు కూడా తగ్గిపోవడంతో స్విగ్గీ, జొమాటో తదితర ఆహార పదార్థాల సరఫరాల రంగంపైనా ప్రభావం చూపుతోంది. ఐకానిక్ చికెన్ బిర్యానీ పరిస్థితి ఇలావుంటే.. కోడిగుడ్ల అమ్మకాలు క్రమంగా పడిపోతున్నాయి. బర్డ్‌ఫ్లూ ప్రభావం మన రాష్ట్రంలో లేదని పౌల్ట్రీరంగం, ప్రభుత్వం నిత్యం చెబుతున్నా.. పక్క రాష్ట్రంలో దీని ఆనవాళ్లు భారీగా ఉండడంతో చికెన్, గుడ్డు తినే అంశంపై జనాలు ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తున్నారు. మాంసం, సీ ఫుడ్స్‌కే ప్రాధాన్యం.. గ్రేటర్ పరిధిలో ప్రతిరోజు 15 నుంచి 20 లక్షల చికెన్ బిర్యానీలు అమ్ముడవుతుండగా.. తాజాగా ఇవి సగానికి తగ్గిపోయినట్లు ప్రముఖ హోటల్ షాదాబ్ యజమాని స్పష్టం చేశారు. దీని స్థానంలో శాకాహార వంటకాలు లేదా మాంసం, సీ ఫుడ్స్‌కు ప్రాధాన్యమిస్తున్నట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. బర్డ్‌ఫ్లూ మూలంగా చికెన్ బిర్యానీ ఆర్డర్లు భారీగా తగ్గాయని షాదాబ్ హోటల్ యజమాని ఆదిల్ సోహెల్ ‘సాక్షి’కి తెలిపారు. ఈ నేపథ్యంలో చికె¯Œ ఆర్డర్‌ను కూడా తగ్గించినట్లు ఆయన చెప్పారు. ఈ స్థానాన్ని భర్తీ చేసేందుకు ఫిష్, మటన్‌ను ఎక్కువ వండి వడ్డిస్తున్నట్లు తెలిపారు. వీటికి డిమాండ్ పెరగడంతో వీటి సరఫరాదారులు ధరలు కూడా పెంచినట్లు ఆయన వివరించారు. ‘ఇంతకు ముందు మేం రోజుకు 70– 80 హండీల బిర్యానీ సిద్ధం చేసేవాళ్లం. బర్డ్ ఫ్లూ భయంతో చికెన్ బిర్యానీ విక్రయాలు తగ్గాయి. 30 హండీలు కూడా సేల్ కావటం లేదు. గతంలో మేం 15 హండీల మటన్ మాత్రమే విక్రయించేవాళ్లం. ప్రస్తుతం మటన్ బిర్యానీకి గిరాకీ పెరిగింది. గతంలో కంటే మూడు రెట్లు ఎక్కువగా దాదాపు 45 హండీల మటన్ బిర్యానీ విక్రయిస్తున్నాం’ అని అఫ్జల్‌గంజ్‌లోని న్యూ గ్రాండ్ çహోటల్ యజమాని మహ్మద్ హుస్సేన్ యావరీ తెలిపారు. కాగా.. సాధారణ రోజుల్లోనే గ్రేటర్ పరిధిలో 3 లక్షల కిలోల చికెన్ అమ్మకాలు ఉండగా.. ఆదివారం 10– 12 లక్షల కిలోలు అమ్మేవారు. ప్రస్తుతం లక్ష కిలోల చికెన్ విక్రయాలు కూడా జరగడం లేదు. తగ్గిన ఆన్లైన్ ఆర్డర్లు.. స్విగ్గీ ఆర్డర్లలో 90 శాతం చికెన్ బిర్యానీ ఉంటుంది. నాలుగు రోజులుగా స్విగ్గీ, జొమాటో నుంచి చికెన్ బిర్యానీలు ఆర్డర్ చేసే వారి సంఖ్య 70 శాతం మేరకు పడిపోయినట్లు సమాచారం. -
దొన్నె బిర్యానీ.. ఈ డిష్ వెరీ స్పెషల్
విభిన్న సంస్కృతుల సమ్మేళనం ‘హైదరాబాద్’లో ఒక్కో గల్లీ ఒక్కో ప్రత్యేకత సంతరించుకున్న విషయం విదితమే. ముఖ్యంగా ఆనాటి నుంచి విభిన్న రుచులకు సైతం భాగ్యనగరం కేంద్రంగా కొనసాగుతోంది. స్థానిక ఆహార వంటకాలు మొదలు విదేశాల కాంటినెంటల్ రుచుల వరకు మన నగరం విరాజిల్లోతోంది. ఈ ఆనవాయితీలో భాగంగానే ఈ మధ్య ‘దొన్నె బిర్యానీ’ సైతం నగరానికి చేరుకుంది.విశ్వవ్యాప్తమైన హైదరాబాద్ బిర్యానీ గురించి అందరికీ తెలుసు.. కానీ.. దొన్నె బిర్యానీ ఏంటనే కదా..?! ఇది కూడా దక్షిణాది ప్రత్యేక వంటకమే. కర్ణాటక, ప్రధానంగా బెంగళూరులో ఈ డిష్ వెరీ స్పెషల్. కొంత కాలంగా దొన్నె బిర్యానీ అక్కడక్కడా కనిపిస్తూనే ఉంది. అయితే బెంగళూరులో 90 ఏళ్లకు పైగా చరిత్ర ఉన్న శివాజీ మిలటరీ హోటల్ నగరంలోని మాదాపూర్‌కు విస్తరించింది. ఈ నేపథ్యంలో నగరంలో మరో కొత్త రుచి చేరిపోయిందని ఆహారప్రియులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.దక్షిణాది రుచులకు ఆదరణ.. బెంగళూరులోని ప్రముఖ శివాజీ మిలిటరీ హోటల్, నోరూరించే మాంసాహార వంటకాలకు ప్రసిద్ధి చెందింది. వందేళ్ల క్లబ్లో చేరబోతున్న ఈ ప్రముఖ భారతీయ హోటల్ మొదటిసారి మరో నగరంలో ఆవిష్కృతం అవడం, అది కూడా హైదరాబాద్‌ను ఎంచుకోవడంతో ఇక్కడి వైవిధ్యాన్ని మరింత పెంచుతోంది. కన్నడ వంటకాలు నగరంలో ఇది మొదటిసారి ఏమీ కాదు.. ఎస్ఆర్నగర్, మాదాపూర్, గచి్చ»ౌలి వంటి ప్రాంతాల్లో కన్నడ రుచులు ఇప్పటికే లభ్యమవుతున్నా.. పూర్తిస్థాయిలో అక్కడి రుచులకు ఆదరణ లభిస్తోందనడానికి ఇదో నిదర్శనం. దొన్నె బిర్యానీ, మటన్ ఫ్రై వంటి పలు వంటకాలకు ప్రసిద్ధి చెందిన శివాజీ హోటల్ హైదరాబాద్‌లోని మాదాపూర్ ప్రాంతంలో తమ సేవలను విస్తరించింది. 1935 నుంచి దక్షిణాదిలో తన ప్రత్యేకత పెంచుకున్న శివాజీ మిలిటరీ హోటల్ నగరవాసులకూ చేరువైంది. స్పైసీగా ఉండే మన హైదరాబాదీ బిర్యానీకి దొన్నె బిర్యానీ కాస్త బిన్నంగా ఉన్నప్పటికీ.. భౌగోళిక సమ్మేళనంలో భాగంగా ఇప్పటికే తెలుగు వారు సైతం ఈ బిర్యానీని రుచి చూస్తున్నారు. -
ఐస్‌క్రీమ్ బిర్యానీ...!
మీరు సరిగ్గానే చదివారు. ఐస్ క్రీమ్ బిర్యానీనే. బిర్యానీ అంటేనే మసాలా. ఇక ఐస్‌క్రీమ్.. తీపి. ఈ రెండింటికీ అభిమానులు ఎంతో మంది. అలాంటిది ఆ రెండు డిషెస్‌ను కలిపితే.. రుచెలా ఉంటుంది? రుచి సంగతి తెలియదు కానీ.. ఈ బిర్యానీని ముంబైకి చెందిన మహిళా కంటెంట్ క్రియేటర్ హీనా కౌసర్ తయారు చేశారు. వీడియోను ఇన్‌స్ట్రాగామ్‌లో షేర్ చేశారు. ఫొటోలో ఉన్న విధంగానే... హుండీలో బిర్యానీ... మధ్యలో స్ట్రాబెర్రీ ఐస్క్రీ స్కూప్. రెండు హుండీలను పట్టుకుని ఆమె వీడియోలో కనిపిస్తున్నారు. సాధారణంగా మసాలాలతో బంగారు వర్ణంలో ఘుమఘుమలాడే బిర్యానీ.. ఐస్‌క్రీమ్ రంగును పులుముకుని గులాబీ రంగులో మెరిసిపోతోంది. ఆ వీడియో ఇప్పుడు వైరలవుతోంది. ఆహార ప్రియులను విస్మయానికి గురిచేస్తోంది. హీనా సృజనాత్మకత ప్రత్యేకమైనదే అయినప్పటికీ, ఈ ప్రయోగం చాలా మంది ఆహార ప్రియులను అయోమయానికి గురిచేసింది. కంటెంట్ క్రియేటర్ హీనా బేకింగ్ అకాడమీని కూడా నడుపుతున్నారు. తన అకాడమీలో ఏడు రోజుల బేకింగ్ కోర్సు పూర్తయిన సందర్భంగా జరిగిన వేడుకల్లో భాగంగా ఈ ఫ్యూజన్ డిష్‌ను తయారు చేశారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
బిర్యానీ క్రేజ్ వేరే లెవల్.. 8.3 కోట్ల ఆర్డర్లు!
ప్రముఖ ఆన్లైన్ ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గీ(Swiggy) కొన్ని రోజుల్లో 2024 ఏడాది పూర్తవుతుండడంతో వార్షిక నివేదికను విడుదల చేసింది. ‘హౌ ఇండియా స్విగ్గీ ఇట్స్ వే త్రూ 2024’ పేరుతో విడుదల చేసిన ఈ రిపోర్ట్‌లో ఆసక్తికర విషయాలు పంచుకుంది2024లో 8.3 కోట్ల ఆర్డర్లతో వరుసగా తొమ్మిదో ఏడాది కూడా భారత్‌లో అత్యంత ప్రజాదరణ పొందిన వంటకంగా బిర్యానీ(Biryani) నిలిచింది. ముఖ్యంగా చికెన్ బిర్యానీకి 4.9 కోట్ల ఆర్డర్లు వచ్చాయి.2.3 కోట్ల ఆర్డర్లతో దోశ టాప్ బ్రేక్‌ఫాస్ట్‌గా నిలిచింది. 25 లక్షల మసాలా దోశ ఆర్డర్లతో బెంగళూరు అగ్రస్థానంలో నిలిచింది.డిన్నర్లోనే ఎక్కువ మంది ఫుడ్ ఆర్డర్ పెట్టారు. 21.5 కోట్ల ఆర్డర్లతో లంచ్ ఆర్డర్ల కంటే డిన్నర్ సమయాల్లో 29 శాతం పెరుగుదల నమోదైంది.అర్ధరాత్రి భోజనం చేయాలనుకునేవారికి చికెన్(Chicken) బర్గర్లు టాప్ ఛాయిస్‌గా నిలిచాయి. అర్ధరాత్రి నుంచి తెల్లవారుజామున 2 గంటల మధ్య 18.4 లక్షల ఆర్డర్లు నమోదయ్యాయి.ఇదీ చదవండి: 36,000 అడుగుల ఎత్తులో ‘ఛాయ్.. ఛాయ్..’బెంగళూరు వినియోగదారుడు పాస్తా విందు కోసం రూ.49,900 ఖర్చు చేయగా, ఢిల్లీకి చెందిన ఓ వ్యక్తి ఒకేసారి 250 ఉల్లిపాయ పిజ్జాలను ఆర్డర్ చేశాడు.స్విగ్గీ డైనౌట్(Dineout) ద్వారా 2.2 కోట్ల మంది వినియోగదారులకు రూ.533 కోట్లు ఆదా చేసినట్లు తెలిపింది. డిస్కౌంట్లలో రూ.121 కోట్లతో ఢిల్లీ అగ్రస్థానంలో నిలిచింది.స్విగ్గీ డెలివరీ భాగస్వాములు సమష్టిగా 1.96 బిలియన్ కిలోమీటర్లు ప్రయాణించారు. ఇది భారతదేశం చుట్టుకొలత కంటే చాలా రెట్లు ఎక్కువ. -
బిర్యానీయే బాస్!
సాక్షి, హైదరాబాద్: వంటకాల్లోకెల్లా బిర్యానీయే మరోసారి బాస్‌గా నిలిచింది. దేశంలోని ఆహారప్రియుల ఫేవరేట్ డిష్‌గా తన స్థానాన్ని నిలబెట్టుకుంది. దేశవ్యాప్తంగా ఆన్లైన్ ఆర్డర్లలో అత్యధికం మంది వినియోగదారులు కోరుకున్న వంటకంగా వరుసగా తొమ్మిదో సంవత్సరం అగ్రస్థానంలో నిలిచింది. ఈ ఏడాదిలో జనవరి 1 నుంచి నవంబర్ 22 మధ్య తమకు 8.3 కోట్ల బిర్యానీల ఆర్డర్లు వచి్చనట్లు ప్రముఖ ఫుడ్ డెలివరీ యాప్ స్విగ్గీ వెల్లడించింది. ఈ లెక్కన సెకనుకు 2 బిర్యానీల చొప్పున నిమిషానికి 158 బిర్యానీల ఆర్డర్లు నమోదైనట్లు తెలిపింది. ఈ మేరకు వివిధ రకాల ఆర్డర్ల వివరాలతో కూడిన దేశవ్యాప్త ఆహార ట్రెండ్స్‌తో వార్షిక నివేదికను విడుదల చేసింది.నివేదికలోని విశేషాలు ఇవీ.. ⇒ దేశవ్యాప్తంగా 2.3 కోట్ల ఆర్డర్లతో బిర్యానీ తర్వాత దోశ రెండో స్థానంలో నిలిచింది. ⇒ బ్రేక్‌ఫాస్ట్, లంచ్ సమయాలతో పోలిస్తేడిన్నర్ టైంలో ఏకంగా 21.5 కోట్ల ఆర్డర్లు వచ్చాయి. ఇది లంచ్ ఆర్డర్ల కంటే దాదాపు 29% ఎక్కువ. ⇒ అత్యధికంగా ఆర్డర్ చేసిన తీపి వంటకాలుగా రసమలై, సీతాఫల్ ఐస్‌క్రీం చార్ట్‌లలో అగ్రస్థానంలో ఉన్నాయి. ⇒ బెంగళూరులో ఓ వినియోగదారుడు పాస్తా కోసం ఈ ఏడాదిలో ఏకంగా రూ. 49,900 ఖర్చు చేశాడు. ⇒ ఈశాన్య రాష్ట్రమైన మేఘాలయాలో రాజధాని షిల్లాంగ్ ప్రజలు అత్యధికంగా ఆర్డర్ చేసిన వంటకం నూడుల్స్. ⇒ స్విగ్గీ డెలివరీ బాయ్స్ 196 కోట్ల కిలోమీటర్ల మేర ఆర్డర్ల డెలివరీలు పూర్తి చేశారు. ఇది కశీ్మర్ నుంచి కన్యాకుమారి వరకు 5.33 లక్షలసార్లు డ్రైవింగ్ చేయడంతో సమానం. ⇒ ముంబైకి చెందిన కపిల్ కుమార్ పాండే అనే స్విగ్గీ రైడర్ ఈ ఏడాది అత్యధికంగా 10,703 ఆర్డర్లను అందించగా, కోయంబత్తూరుకు చెందిన కాళీశ్వరి 6,658 ఆర్డర్లతో మహిళా డెలివరీ విభాగంలో తొలి స్థానంలో నిలిచారు. ⇒ బ్రేక్‌ఫాస్ట్‌గా 85 లక్షల దోసెలు, 78 లక్షల ఇడ్లీలతో దక్షిణాదివాసులు తమ ఆహార అలవాట్లను మరోసారి చాటారు. ⇒ బెంగళూరువాసులు 25 లక్షల మసాలా దోశలను ఆస్వాదించగా.. ఢిల్లీ, చండీగఢ్, కోల్‌కతా నగరాల ప్రజలు చోలే, ఆలూ పరాటా, కచోరీలను ఆరగించారు. ⇒ 24.8 లక్షల ఆర్డర్లతో దేశంలో అత్యధికంగా ఆర్డర్ చేసిన స్నాక్‌గా చికెన్ రోల్ నిలిచింది. చికెన్ మోమోస్ 16.3 లక్షల ఆర్డర్లను, ఆలూ ఫ్రై 13 లక్షల ఆర్డర్లతో ఆ తర్వాతి స్థానాల్లో నిలిచాయి. ⇒ చికెన్ బర్గర్ 18.4 లక్షల మిడ్నైట్ ఆర్డర్లలో టాప్‌లో నిలవగా రెండవ స్థానాన్ని చికెన్ బిర్యానీ దక్కించుకుంది. ⇒ ఢిల్లీలో ఓ కస్టమర్ ఒకే ఆర్డర్లో ఏకంగా 250 ఆనియన్ పిజ్జాలను ఆర్డర్ చేశాడు. -
బిర్యానీలో బ్లేడు కలకలం
-
ఆఫర్ అదిరింది
-
బావర్చిలో సిగరెట్ బిర్యానీ.. కస్టమర్ సర్ ప్రైజ్
-
ప్రముఖ రెస్టారెంట్.. బిర్యానీలో సగం తాగిన సిగరెట్ పీక!
సాక్షి,హైదరాబాద్ : చికెన్ బిర్యానీ అంటే..ఓ ఎమోషన్. శుభకార్యం ఏదైనా బిర్యానీ వంటంకం ఉండాల్సిందే. అలా భోజన ప్రియుల్ని నోరూరించే బిర్యానీ ఇప్పుడు అప్రఖ్యాతని మూగట్టుకుంటుంది.అయితే తాజాగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్‌రోడ్‌లోని ప్రముఖ రెస్టారెంట్ బిర్యానీలో సగం తాగిన సిగరెట్ పీక ప్రత్యక్షమైంది. ఓ కస్టమర్ బిర్యానీ తింటుండగా ప్లేట్లో సిగరెట్ పీకను చూసి షాక్ అయ్యాడు. అనంతరం, యాజమాన్యంపై వాగ్వాదానికి దిగారు. ప్రస్తుతం ఆ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. -
అమరన్ సక్సెస్.. స్వయంగా బిర్యానీ వడ్డించిన హీరో!
కోలీవుడ్ స్టార్ శివకార్తికేయన్ నటించిన తాజా చిత్రం అమరన్. ఈ దీపావళి సందర్భంగా అక్టోబర్ 31న థియేటర్లలో రిలీజైంది. సాయిపల్లవి హీరోయిన్గా నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. ఇప్పటికే రూ.300 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించింది. విడుదలై మూడు వారాలైనప్పటికీ కలెక్షన్స్ పరంగా రాణిస్తోంది. ఆర్మీ మేజర్ ముకుంద్ వరదరాజన్ జీవితం ఆధారంగా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు.అయితే ప్రస్తుతం శివ కార్తికేయన్ మరో మూవీతో బిజీగా ఉన్నారు. ఎస్కే23 వర్కింగ్ టైటిల్లో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సందర్భంగా అమరన్ సక్సెస్ సెలబ్రేషన్స్ నిర్వహించారు. షూటింగ్ సెట్లోనే ఈ వేడుకలు చేసుకున్నారు.అనంతరం మూవీ సిబ్బందికి భోజనాలు ఏర్పాటు చేశారు. హీరో శివ కార్తికేయన్ స్వయంగా అందరికీ బిర్యానీ వడ్డించారు. దీనికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. కాగా.. అమరన్ చిత్రాన్ని రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్, సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ ఇండియా సంయుక్తంగా నిర్మించాయి. ఈ చిత్రంలో భువన్ అరోరా, రాహుల్ బోస్, లల్లు, శ్రీకుమార్, శ్యామ్ మోహన్, గీతా కైలాసం కీలక పాత్రలు పోషించారు. #Sivakarthikeyan served Biryani to #SK23 crew members on celebrating #Amaran Blockbuster success ❤️🔥❤️🔥pic.twitter.com/uAzB5PbXqh— AmuthaBharathi (@CinemaWithAB) November 19, 2024 -
కసబ్‌కు కాంగ్రెస్ బిర్యానీ పెట్టింది: జేపీ నడ్డా
థానే: జాతీయ భద్రత విషయంలో కాంగ్రెస్ నిష్క్రియాత్మకంగా వ్యవహరించిందని ఆరోపిస్తూ, ఇందుకు నాటి 26/11 ముంబై ఉగ్రదాడులే ఉదాహరణ అంటూ కేంద్ర మంత్రి, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తీవ్ర స్థాయిలో కాంగ్రెస్‌పై విరుచుకుపడ్డారు. ముంబై దాడుల్లో దోషిగా తేలి, మరణశిక్ష పడిన పాక్ ఉగ్రవాది అజ్మల్ కసబ్‌కు కాంగ్రెస్ బిర్యానీ వడ్డించిందని నడ్డా ఆరోపించారు.మహారాష్ట్రలోని థానేలో జరిగిన ఎన్నికల ర్యాలీలో జేపీ నడ్డా ప్రసంగిస్తూ అప్పటి యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయన్స్ (యుపీఏ) ప్రభుత్వం పాకిస్తాన్ విషయంలో ఉదాశీన వైఖరి అవలంబించిందని నడ్డా ఆరోపించారు. 26/11 దాడుల సమయంలో యూపీఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నదన్నారు. అయితే ఉరీ, పుల్వామా ఉగ్రదాడుల సమయంలో ప్రధాని నరేంద్ర మోదీ తీసుకున్న నిర్ణయాత్మక చర్యలు ప్రశంసనీయమైనవని నడ్డా పేర్కొన్నారు. ప్రతిపక్ష పార్టీ జాతీయ ప్రయోజనాలను నిర్వీర్యం చేస్తోందని ఆరోపించారు.లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి రాజ్యాంగంలోని ఏబీసీ కూడా అర్థం కావడం లేదని నడ్డా ఎద్దేవా చేశారు. రాజ్యాంగం మత ప్రాతిపదికన రిజర్వేషన్లను అనుమతించదనే విషయం రాహుల్‌కు తెలియనట్లున్నదన్నారు. ఎన్నికలు జరగనున్న మహారాష్ట్ర, జార్ఖండ్‌లలో రాజ్యాంగ ప్రతులను చూపిస్తూ, ఉద్యోగాలు, విద్యలో రిజర్వేషన్లను తొలగించాలని బీజేపీ కోరుకుంటున్నదని ఓటర్లకు చెప్పడానికి రాహుల్ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.రాహుల్ గాంధీ బుజ్జగింపులు, ఓటు బ్యాంకు రాజకీయాలకు స్వస్తి చెప్పాలని సూచించారు. తెలంగాణ, కర్నాటకలో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ కోటా రద్దు చేసి, మైనారిటీలకు రిజర్వేషన్లు ఇవ్వాలని కాంగ్రెస్ కోరుకుంటోందని ఆరోపించారు. అయితే ప్రధాని మోదీ ఎప్పుడూ ఎవరిపైనా వివక్ష చూపలేదని నడ్డా పేర్కొన్నారు.ఇది కూడా చదవండి: యూపీ విషాదం.. మంటలు చెలరేగినా మోగని అలారం! -
బిర్యానీ-ఫ్లేవర్డ్ ఐస్‌క్రీమ్ ఎప్పుడైనా ట్రై చేశారా..?
ఐస్‌క్రీమ్ అంటే ఇష్టపడని వారెవరుంటారు. అయితే ఇప్పుడు వాటిలో రకరకాల ప్లేవర్లు మార్కెట్లో దర్శనమిస్తున్నాయి. వాటిలో కొన్ని టేస్ట్ బానే ఉన్నా చాలావరకు అంత బాగోవు. పండ్లు నుంచి స్వీట్స్‌తో తయారు చేసే ఎన్నో ఐస్‌క్రీంలు చూశాం కానీ ఇలాంటి ప్లేవర్డ్ ఐస్‌క్రీం మాత్రం చూసుండరు. అదికూడా అందరూ ఇష్టపడే బిర్యానీతో ఐస్‌క్రీం అంటే బాబోయ్ అనిపిస్తుంది కదూ..!. ఎలా ఉంటుందనే కదా డౌటు..?ఆకాశ్ మెహతా అనే సోషల్ మీడియా ఔత్సాహికుడు నెట్టింట ఒక రీల్ పోస్ట్ చేశాడు. అందుకోసం అని ఓ దుబాయ మాల్లోని ఐస్‌క్రీం స్టాల్లో వివిధ ఫ్లేవర్డ్ల ఐస్క్రీంలను ట్రై చేశాడు. ఆ దుకాణంలోని మెనూలో తనకు నచ్చిన కొన్ని ఐస్‌క్రీంలు సెలక్ట్ చేసుకున్నాడు. వాటి పేర్లు వరుసగా కెచప్, చిప్స్, బిర్యానీ, ఆలివ్ ఆయిల్, చాయ్ వంటి ఫ్లేవర్డ్ ఐస్‌క్రీంలు. ఆ తర్వాత ఒక్కొక్కటిగా ట్రై చేసి చూస్తున్నాడు. ముందుగా కెచప్ రుచి చూడగా..ఎలా ఉందనేది చెప్పలేను అని అన్నాడు. ఇక బిర్యానీ ప్లేవర్ చూడగానే ఈ ఐస్‌క్రీం కచ్చితంగా హిట్ అవుతుందని కితాబు ఇచ్చేశాడు. ఇక ఆలివ్ అద్భుతం అని, చిప్స్ ఆశ్చర్యపరిచేలా ఉందని, చాయ్ ఐస్‌క్రీం మాత్రం తనకిష్టమైన ఫ్లేవర్ అంటూ ఆ ఐస్క్రీంల రుచుల గురించి చెప్పుకొచ్చాడు. కానీ నెటిజన్లుమాత్రం ఇవేం ఐస్‌క్రీం ఫ్లేవర్డ్లు అని ఆకాశ్ పోస్ట్‌కి కామెంట్లు చేస్తున్నారు. View this post on Instagram A post shared by Akash Mehta (@mehta_a)(చదవండి: ‘బైక్ పింక్ సర్వీస్': ఓన్లీ మహిళా డ్రైవర్లే..!) -
‘బిర్యానీలో ఈగ’ వ్యవహారంలో బిగ్ ట్విస్ట్!
సాక్షి, నల్గొండ జిల్లా: చిట్యాల మండలం పెద్ద కాపర్తి శివారులో విలేజ్ ఆర్గానిక్ హోటల్ బిర్యానీలో ఈగ వ్యవహారంలో ట్విస్ట్ చోటుచేసుకుంది. ఫుల్లుగా తిని బిల్లు ఎగ్గొట్టేందుకు బిర్యానీలో ఈగ అంటూ నలుగురు బ్యాచ్ నాటకం ఆడారు. తినడం పూర్తయ్యాక పథకం ప్రకారం వెంట తీసుకెళ్లిన నూనెలో ఫ్రై చేసిన ఈగను బిర్యానీలో పెట్టారు. ఆ తర్వాత బిర్యానీలో ఈగ అంటూ నాటకానికి తెరలేపారు. ఫుడ్ సెక్యూరిటీ అధికారులకు ఫోన్ చేసి నానా హంగామా సృష్టించారు. వాట్సాప్ గ్రూపులో వీడియోను ఆ బ్యాచ్ షేర్ చేసింది.హోటల్ పై విమర్శలు రావడంతో సిబ్బంది... సీసీ ఫుటేజ్ పరిశీలించారు. ఈగను బయటకు తీసి బిర్యానీ వేసి కలుపుతున్నట్లు ఫుటేజీలో స్పష్టమైంది. గతంలోనూ పలు హోటల్స్ లో ఇదే రకంగా నాటకాలు ఆడినట్లు బ్యాచ్‌పై ఆరోపణలు ఉన్నాయి. సూర్యాపేట సమీపంలో ఓ ప్రముఖ హోటల్లోనూ ఇదేవిధంగా బిల్లు ఎగ్గొట్టినట్లు సమాచారం.ఇదీ చదవండి: ‘వారి పేర్లు డైరీలో రాసి పెట్టుకుంటున్నాం’ -
రజినీకాంత్ వేట్టయాన్.. వారికి బిర్యానీ వడ్డించిన డైరెక్టర్!
సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన తాజా చిత్రం వేట్టయాన్. టీజే జ్ఞానవేల్ డైరెక్షన్లో వచ్చిన ఈ చిత్రం దసరా సందర్భంగా థియేటర్లలోకి వచ్చింది. ఈనెల 10న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం తొలిరోజే మిక్స్డ్ టాక్‌ను సొంతం చేసుకుంది. అయినప్పటికీ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల పరంగా ఫర్వాలేదనిపించింది. సినిమా రిలీజైన పది రోజుల్లోనే రూ.129 కోట్ల నికర వసూళ్లు రాబట్టింది.బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో వసూళ్లు రావడంతో చిత్రబృందం సెలబ్రేట్ చేసుకుంది. తాజాగా వేట్టయాన్ చిత్రబృందం థ్యాంక్స్ గివింగ్ మీట్ పేరుతో చెన్నైలో సక్సెస్ సెలబ్రేషన్స్ నిర్వహించింది. ఈ వేడుకల్లో చిత్రబృందంతో పాటు పలువురు మీడియా ప్రతినిధులు కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈవెంట్‌కు హాజరైన ప్రతి ఒక్కరికీ భోజనాలు వడ్డించారు.(ఇది చదవండి: వేట్టయాన్ కలెక్షన్స్.. మ్యాజిక్ నంబర్‌కు దగ్గర్లో రజనీకాంత్)ఈ సక్సెస్ మీట్లో వేట్టయాన్ డైరెక్టర్ టీజే జ్ఞానవేల్ స్వయంగా చిత్రబృందంతో పాటు మీడియా ప్రతినిధులకు బిర్యానీ వడ్డించారు. దీనికి సంబంధించిన ఫోటోలను లైకా ప్రొడక్షన్స్ తన ట్విటర్ ఖాతాలో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కాగా.. ఈ సినిమాలో మంజు వారియర్, ఫహద్ ఫాజిల్, రానా దగ్గుబాటి, కిశోర్, అభిరామి, రితికా సింగ్, దుషారా విజయ్, రోహిణి ముఖ్యపాత్రల్లో కనిపించారు. ఈ సినిమాకు అనిరుధ్ రవిచందర్ సంగీతమందించారు. A gathering of gratitude and celebration! 🤩 The VETTAIYAN 🕶️ family comes together, thankful for the overwhelming support and love from the press and media. ✨ #VettaiyanRunningSuccessfully 🕶️ in Tamil, Telugu, Hindi & Kannada!@rajinikanth @SrBachchan @tjgnan… pic.twitter.com/W0yA6yqgYH— Lyca Productions (@LycaProductions) October 20, 2024 -
బిర్యానీలో కప్ప.. ట్రిపుల్ ఐటీ విద్యార్థుల ఆగ్రహం
సాక్షి,హైదరాబాద్: గచ్చిబౌలి ట్రిపుల్ఐటీలోని కదంబ మెస్‌లో విద్యార్థులకు ఇటీవల పెట్టిన బిర్యానీలో కప్ప ప్రత్యక్షమైంది. దీంతో విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బిర్యానీలో కప్ప రావడానికి మెస్ నిర్వాహకుల నిర్లక్ష్యమే కారణమని విద్యార్థులు మండిపడుతున్నారు. మెస్ నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. బిర్యానీలో కప్ప ప్రత్యక్షమైన ఫొటోను విద్యార్థులు ట్విటర్లో షేర్ చేశారు. మెస్ నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని తెలంగాణ ఫుడ్‌సేఫ్టీ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు.Shocked and horrified! Found a frog in my friend's meal today at Kadamba Mess (IIIT Hyderabad). This is completely unacceptable and poses a serious health risk! @cfs_telangana, please take immediate action! #FoodSafety #Unhygienic #Hyderabad #IIITHyderabad pic.twitter.com/VCCKM0kuob— ram manohar (@manoharrocksss) October 17, 2024 ఇదీ చదవండి: అశోక్‌నగర్‌లో మరోసారి ఉద్రిక్తత -
వాహ్.. బాస్మతి!
సాక్షి హైదరాబాద్: ఒక్కప్పుడు నవాబులు, ధనికుల ఇళ్లల్లో బాస్మతి బియ్యం వినియోగించేవారు. ఇప్పుడు ధరలు అందుబాటులోకి రావడంతో దాదాపుగా అన్ని వర్గాల ప్రజలు బాస్మతిని వినియోగిస్తున్నారు. నాడు బిర్యానీకే పరిమితంకాగా, ఇప్పుడు అన్ని రకాల వంటకాల్లో వినియోగిస్తున్నారు. మొదటి రకం సాధారణ బియ్యం కిలో ధర దాదాపు రూ. 70–80 ఉంది. అదే బాస్మతి హోల్‌సేల్ ధర కూడా దాదాపు అంతే. దీంతో నగరంలో బాస్మతి బియ్యం వినియోగం ఎక్కువైంది. గతంలో బిర్యానీ కోసం బాస్మతిని తప్పక వాడేవారు. కానీ, నేడు బగారా, పల్వా, లెమన్, కిచిడి, జీరా రైస్‌తోపాటు అన్ని రకాల వంటకాల్లో బాస్మతిని వినియోగిస్తున్నారు. ఉత్తరాది పంటకు నగరంలో ఆదరణ ధరలు తగ్గడంతో హైదరాబాద్, సికింద్రాబాద్ జంటనగరాల మార్కెట్లకు భారీ ఎత్తున బాస్మతి బియ్యం దిగుమతి అవుతోంది. బాస్మతి వరి పండే ఉత్తరాది రాష్ట్రాల నుంచి నగరానికి భారీగా దిగుమతులు పెరిగినట్టు వ్యాపారులు తెలిపారు. బేగంబజార్, కిషన్‌గంజ్, ఉస్మాన్‌గంజ్ టోకు మార్కెట్లు ఈ బియ్యం అమ్మకాలకు ప్రధాన కేంద్రాలుగా ఉన్నాయి. స్టార్ హోటళ్లు, ఇతర బిర్యానీ హోటళ్లన్నీ కూడా బాస్మతిని ఈ మార్కెట్ల నుంచే కొనుగోలు చేస్తుంటారని వ్యాపారులు అంటున్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో రోజుకు 60 వేల క్వింటాళ్ల సాధారణ బియ్యం వినియోగం అవుతుండగా, ఇందులో బాస్మతి బియ్యం దాదాపు 12 వేల క్వింటాళ్ల వరకూ ఉంటుందని మార్కెట్ వర్గాల అంచనా. పంజాబ్, హరియాణా, ఉత్తర్‌ప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో ఈసారి బాస్మతి ఉత్పత్తి భారీగా ఉండడంతో నగరానికి సరఫరా పెరిగింది. రిటైల్ మార్కెట్లో స్టీమ్ కేజీ బాస్మతి బియ్యం రూ.50 నుంచి రూ.65 వరకు లభిస్తున్నాయి. అదే రా బాస్మతి బియ్యం మొదటి రకం రూ.80–110 వరకు ధర పలుకుతోంది. ఉత్తరాది రాష్ట్రాల్లో పండే బాస్మతి వినియోగం ఢిల్లీ తప్ప ఇతర రాష్ట్రాల్లో తక్కువ. దక్షిణాది రాష్ట్రాలకు హైదరాబాద్ బాస్మతికి హబ్‌గా మారింది. దేశంలో ఢిల్లీ తరువాత గ్రేటర్‌లోనే ఎక్కువ వినయోగం ఉందని బేగంబజార్ వ్యాపారులు చెబుతున్నారు.సాధారణ బియ్యం ధరకే బాస్మతి బాస్మతి ఎక్కువగా పంజాబ్‌లో పండిస్తారు. ఉత్తరాది రాష్ట్రాల్లో బియ్యం వినియోగం తక్కువ.. హైదరాబాద్ బిర్యానీకి ఫేమస్. దీంతో హైదరాబాద్‌లో వినియోగం ఎక్కువ. మరోవైపు బాస్మతిని బిర్యానీలో తప్పక వినియోగిస్తారు. అయితే కోవిడ్ తరువాత బాస్మతి ఎగుమతులు అంతగా లేవు. దీంతో ధరలు చాలా కిందికి దిగి వచ్చాయి. సాధారణ బియ్యం ధరలకే బాస్మతి మార్కెట్లో లభిస్తోంది. – రాజ్‌కుమార్ ఠాండన్, కశ్మీర్‌హౌస్ నిర్వాహకుడు, బేగంబజార్ -
బిర్యాని కోసం వెళ్లి మృత్యువాత
కోదాడ: బిర్యాని తెచ్చుకుందామని కారులో బయలుదేరిన నాగం రవికుమార్ అలియాస్ మురళీకృష్ణ (45) కారుతో సహా వాగులో కొట్టుకుపోయి మృతి చెందడం స్థానికంగా విషాదాన్ని నింపింది. వివరాలు.. నాగం రవికుమార్ కోదాడ పట్టణ పరిధిలోని 34వ వార్డు మాతానగర్‌లో నివాసం ఉంటున్నాడు. ఇతడి స్వస్థలం ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు. కోదాడకు చెందిన నాగం రోజాను వివాహం చేసుకుని కోదాడలోనే స్థిరపడ్డాడు. గతంలో కోదాడలో వైన్స్ షాపు నడిపేవాడు. ఇతడి భార్య.. పిల్లల చదువు కోసం హైదరాబాద్‌లో ఉంటుండగా రవికుమార్ ఒక్కడే కోదాడలో ఉంటున్నాడు. శనివారం రాత్రి సుమారు 9 గంటల సమయంలో బిర్యాని తెచ్చుకుంటానని స్నేహితులతో చెప్పి కారులో బయలుదేరాడు. మాతానగర్ నుంచి టీచర్స్ కాలనీ మీదుగా బైపాస్ సమీపంలో ఉన్న దాబాకు ఒక్కడే బయలుదేరినట్లు అతడి మిత్రులు చెబుతున్నారు. ఉలక వాగు ఉధృతిని గమనించకపోవడంతోపాటు వంతెన తక్కు ఎత్తులో ఉండడంతో మధ్యలోకి వెళ్లిన తరువాత భయానికి కారు ఆపాడు. అంతలోనే వరద పెరగడంతో కారుతో సహా కొట్టుకుపోయాడని, అక్కడ ఎవ్వరూ లేకపోవడంతో గమనించలేదని స్నేహితులు చెబుతున్నారు. ఉదయం వాగులో కారు కనపడడంతో కోదాడ మాజీ సర్పంచ్ ఏర్నేనిబాబు క్రేన్ సాయంతో కారును బయటకు తీశారు. అందులో రవికుమార్ మృతి చెంది ఉన్నాడు. రవికుమార్‌కు భార్య రోజా, ఇద్దరు కుమారులు నాగం సాయితేజ, వెంకటేష్ ఉన్నారు. రవికుమార్ మృతదేహాన్ని సోమవారం కోదాడ ఎమ్మెల్యే పద్మావతి సందర్శించి నివాళులరి్పంచారు. -
బిర్యానీ ఆకుతో ఎన్ని లాభాలో తెలుసా..!
బిర్యానీ అంటే ఇష్టపడని వారుండరు. బిర్యానీకి మంచి ఫ్లేవర్‌ని ఇచ్చే బిర్యానీ ఆకులో ఎన్నో ఔషధ గుణాలున్నాయి. అయితే ఉప్మాలో కరివేపాకులా బిర్యానీలో వచ్చే బిర్యానీ ఆకును ఏరిపారేయడమే. కానీ వీటిని తీసుకోవడం వల్ల చాలా సమస్యలు దూరమవుతాయని తెలుసా? బిర్యానీ ఆకుల్లో యాంటీ ఆక్సిడెంట్స్, మినరల్స్, ఫైబర్స్ ఉన్నాయి. ఇవన్నీ ఆరోగ్యానికి చాలా మంచిది. దీనిని రెగ్యులర్‌గా తీసుకుంటే కడుపు నొప్పి, జలుబు, తలనొప్పి వంటి సమస్యల్ని దూరం చేస్తాయి. వీటితో ఇంకేం లాభాలున్నాయంటే..డీ టాక్సిఫికేషన్మూత్ర సంబంధిత సమస్యలు దూరమవుతాయి. బాడీ టాక్సిసిటీ తగ్గుతుంది. కిడ్నీలో రాళ్ళ సమస్య తగ్గుతుంది.యాంటీ క్యాన్సర్ గుణాలు..బిర్యానీ ఆకుల్లో యాంటీ క్యాన్సర్ గుణాలు ఉన్నాయి. వీటిని తీసుకోవడం వల్ల బాడీలోని క్యాన్సర్ సెల్స్ తగ్గుతాయి. దీంతో క్యాన్సర్ వంటి సమస్యల్ని ముందు నుంచే తగ్గించుకోవచ్చు. అంతేకాదు. వీటిలో ఉండే విటమిన్ సి, విటమిన్ ఈ, కెరోటినాయిడ్స్ బ్లడ్ కొలెస్ట్రాల్, యూరిక్ యాసిడ్ లెవల్స్‌ని తగ్గిస్తాయి. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్ గుణాలు, ఫైటోకెమికల్స్ ఆక్సిడేటివ్ స్ట్రెస్‌ని తగ్గిస్తాయి. దీంతోపాటు లివర్, కడుపు సంబంధిత సమస్యల్ని దూరం చేస్తాయి.డయాబెటిస్..బిర్యానీ ఆకులో ఉండే ఫైటో కెమికల్స్ షుగర్ ఉన్న వారికి చాలా మంచిది. దీనిని తీసుకుంటే టైప్ 2 డయాబెటిస్ తగ్గుతుంది.గుండె ఆరోగ్యానికి..పరిశోధనల ప్రకారం బిర్యానీ ఆకుల్లోని కొన్ని ఆర్గానిక్ కాంపౌండ్స్ గుండె గోడలను ఆరోగ్యంగా ఉంచుతాయి. చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. దీంతో గుండె సమస్యలు తగ్గుతాయి.ఎలా తీసుకోవాలి?బిర్యానీ ఆకుల్ని టీలా చేసుకుని తాగొచ్చు. దీనికోసం నీటిలో బిర్యానీ ఆకుల్ని వేసి మరిగించి తాగొచ్చు. అందులో దాల్చిన చెక్క వేస్తే మరీ మంచిది. (చదవండి: బరువు తగ్గడంలో 'పంచకర్మ' ది బెస్ట్!..అనుభవాన్ని షేర్ చేసుకున్న రోహిత్ రాయ్!) -
ఆ తీరమంతా..సువాసనంట
ఆ వంశధార తీరానికి చేరుతూనే బిర్యానీ సువాసన స్వాగతమంటూ పిలుస్తుంది. ఊరి పొలిమేరలోనే ఆ వాసనకు కడుపులో జఠరాగ్ని రాజుకుంటుంది. ఒక్కో వీధి దాటుకుంటూ వెళ్తుంటే ఆకలి అమాంతం పెరిగిపోతూ ఉంటుంది. ఎర్రగా కారం పట్టిన మాంసం ముక్కను మధ్యలో దాచుకున్న ఓ బిర్యానీ ముద్ద నాలిక కొసన తగలగానే కడుపు, మనసు రెండూ ఆనందాన్ని ప్రకటించేస్తాయి. వసప బిర్యానీ చేసే మాయ ఇది. 200 గడపలుండే ఈ చిన్న ఊరు బిర్యానీకి పెట్టింది పేరు.కొత్తూరు: కొత్తూరు నుంచి నివగాం వెళ్లే పాలకొండ–హడ్డుబంగి రోడ్డుకు ఆనుకుని ఉండే చిన్న గ్రామం పేరే వసప. కొత్తూరు నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంటుందీ ఊరు. ఊరు చిన్నదే అయినా నిత్యం ఒడిశా రాష్ట్రంలోని గుణుపూర్, హడ్డుబంగి, కాశీనగర్, పర్లాఖిమిడితో పాటు ఉమ్మడి జిల్లాలోని కొత్తూరు, పాతపట్నం, పలాస, పాలకొండ, సీతంపేట, హిరమండలం, భామినితో పాటు జిల్లా కేంద్రం శ్రీకాకుళం వాసులు కూడా నిత్యం ఇక్కడకు వస్తుంటారు. ఇక్కడి బిర్యానీ రుచి అలాంటిది మరి. శ్రీకాకుళానికి వీఐపీలు ఎవరు వచ్చినా ఇక్కడి నుంచి పొట్లాలు పట్టుకెళ్లాల్సిందే. నాణ్యమైన బియ్యం, మసాలా ది నుసుల వాడకమే ఇక్కడి రుచికి కారణమని తయారీ దారులు చెబుతుంటారు. వసప గ్రామంలో మొదటి సారిగా బిర్యానీ పెట్టిన కొయిలాపు వెంకటరావు దగ్గర రుచి భలేగా ఉంటుందని తిన్నవారు చెబుతుంటారు. ఆ రోడ్డుపక్కగా వెళ్తూ బిర్యానీ కొనని వారంటూ ఎవరూ ఉండరంటే అతిశయోక్తి కాదు. ఉదయం 10 గంటలు నుంచి రాత్రి వరకు అక్కడ బిర్యానీ ఘుమఘుమలాడుతూనే ఉంటుంది. కార్తీకం వచ్చిదంటే చాలు ఇక్కడ ఖాళీ ఉండదు. శుభకార్యాల భోజనాలు, యువకులు పార్టీల కోసం వసపనే ఆశ్రయిస్తారు. అక్కడ మొత్తం 8 బిర్యానీ పాయింట్లు ఉన్నాయిప్పుడు.హైదరాబాద్‌లో నేర్చుకున్నా..దమ్ బిర్యానీ కోసం ముందుగా వేడి చేసిన నీటిలో బియ్యం ఎసరు పెడతాను. మసాలా దినుసులు మంచి కంపెనీలవి తీసుకుంటాను. నాణ్యమైన బియ్యం కొనుగోలు చేస్తాను. వీటితో నా శైలిలో దమ్ బిర్యానీ తయారు చేస్తాను. నేనూ హైదరాబాద్‌లోనే ఈ విద్య నేర్చుకున్నాను. – కొయిలాపు వెంకటరావురుచి అమోఘంవసప బిర్యానీ చాలా బాగుంటుంది. ఒడిశా నుంచి వచ్చి కొంటూ ఉంటాను. వెంకటరావు దగ్గర బిర్యానీ మరింత రుచికరంగా ఉంటుంది.– పి.రవి, హడ్డుబంగి, ఒడిశా -
బిర్యానీ తిన్నామంటే గోలీ సోడా పడాల్సిందే..
హే బాబూ.. ఓ గోలీ సోడా కొట్టవోయ్.. ఈ మాట విని ఎన్నేళ్లవుతుందో కదా..! ఒకప్పుడు ప్రతి ఊర్లో.. ప్రతి వీధిలో బండిపై గోలీ సోడా అమ్ముతుండేవారు. ఎండాకాలం వచి్చందంటే చాలు అలా గోలీ సోడా ఒకటి కడుపులో పడిందంటే ఎంతో హాయిగా ఉండేది. కాలక్రమేణా గోలీ సోడా స్థానంలోకి శీతల పానీయాలు వచ్చి చేరాయి. మళ్లీ ఇప్పుడు పాత రోజులు గుర్తు చేసేందుకు గోలీ సోడాలు మార్కెట్లోకి వచ్చేశాయి. అప్పట్లో వీటి టేస్ట్ చూసిన వారు.. ఆ టేస్ట్ తెలుసుకొని నేటి యువత వాహ్.. అంటున్నారు. గోలీ సోడా తాగితే చాలు ఫొటో తీసి సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు హైదరాబాద్ యువత. నగరంలో గోలీ సోడాకు పెరుగుతున్న క్రేజ్డిఫరెంట్ ఫ్లేవర్స్‌లో కలర్ఫుల్గా ..సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్న యూత్ ఒకప్పుడు తోపుడు బండ్లపై నిమ్మకాయ సోడా, సాదా సోడాలు అమ్ముతుండే వారు. ఇప్పుడు మాత్రం డిఫరెంట్ ఫ్లేవర్లలో అందుబాటులోకి వచ్చాయి. అలా హైదరాబాదీ బిర్యానీ తిన్నామంటే.. ఓ గోలీ సోడా పడాల్సిందే.. అన్నట్టు ట్రెండ్ సెట్ చేస్తున్నారు సిటీ యూత్. డిఫరెంట్ ఫ్లేవర్స్తోనే కాకుండా క్రేజీ కలర్స్‌లో దొరుకుతున్నాయి. పెద్ద పెద్ద మాల్స్, రెస్టారెంట్లలో గోలీసోడాల సీసాలను ఇప్పుడు అమ్ముతున్నారు. బ్లూబెర్రీ, వర్జిన్ మొజిటో, లెమనేడ్, నింబూమసాలా, యాపిల్ మొజిటో, ఆరెంజ్, రోజ్‌ఎసెన్స్ ఇలా వేర్వేరు ఫ్లేవర్స్‌లో కంపెనీలు తయారు చేస్తున్నాయి. లెమన్ ట్రీ, పర్పుల్ హేజ్, బెడ్ ఆఫ్ రోజెస్ం అంటూ పాపులర్ ఇంగ్లిష్ పాటల పేర్లు పెట్టి మరీ యువతను ఆకర్షిస్తున్నారు. దుకాణాలతో పాటు కొన్ని హోటళ్లూ, క్లబ్బులూ కాలేజీలకు కూడా ఈ సోడాలను సరఫరా చేస్తున్నారు. దాంతో అందరి దృష్టి మళ్లీ.. సోడావైపు మళ్లింది.ఆ టేస్టే వేరు.. గోలీ సోడా సీసా స్టైల్, కలర్, గోలీ కొడుతుంటే వచ్చే శబ్దం.. అందులోని సోడా అన్నీ ప్రత్యేకమే.. చిన్నప్పుడు ఊర్లలో ఒకటి, రెండు రూపాయలకు దొరికే సోడా తాగేందుకు ఎంతో ఎదురు చూసేవాళ్లం. సోడా తాగిన తర్వాత వచ్చే అనుభూతి వేరేలా ఉండేది. ఇప్పుడు కూడా ఎక్కడైనా సోడా బాటిల్ కని్పస్తే వేరే కూల్‌డ్రింక్స్ ఉన్నా కూడా గోలీ సోడా తాగుతుంటే వచ్చే మజానే వేరు. – సాయికిరణ్ మెగావత్, హిమాయత్నగర్ఆ శబ్దం వింటే.. అదో ఆనందం..పిల్లలకు గోలీ సోడా సరదా ఓ పట్టాన తీరేది కాదు. రబ్బరు కార్కుతో సోడా కొట్టగానే గోలీ లోపలికి వెళ్లినప్పుడు వచ్చే ఆ శబ్దానికి కళ్లనిండా ఆశ్చర్యమే. ఆ శబ్దం వింటే మనసుకు అదో తృప్తి. గోలీసోడాలో ఉండేది కార్బొనేటెడ్ నీళ్లే. మొదటగా 1767లో జోసెఫ్ ప్రిస్ట్లే అనే శాస్త్రవేత్త, కార్బన్‌డయాక్సైడ్‌ను నీటిలోకి పంపి, స్నేహితులకిస్తే, ఆ రుచి నచ్చడంతో అందులో పండ్ల ఫ్లేవర్లూ, చక్కెరలూ కలిపి సాఫ్ట్‌డ్రింక్స్ తయారు చేయడం ప్రారంభించారు. అందుకే సోడా కూడా ఓ సాఫ్ట్ డ్రింకే.. మొదట్లో సోడా నీళ్లని సాదా బాటిల్స్‌లోనే నింపేవారు. అయితే మూత బిగించేటప్పుడూ తీసేటప్పుడూ గ్యాస్ పోయేది. అలా వెళ్లిపోకుండా ఉండేందుకు ఇప్పుడు మనం చూస్తున్న కాడ్నెక్ బాటిల్‌ను రూపొందించారు. 1872లో హిరమ్ కాడ్ అనే బ్రిటిష్ ఇంజినీర్ దీన్ని తయారు చేశాడు. ఈ బాటిల్ మందంగా ఉంటుంది. -
2 రూపాయలకే బిర్యానీ.. రండి బాబు రండి..
-
క్రేజీ.. థీమ్స్.. వంట నుంచి వడ్డన దాకా..
ఆహారం వడ్డించడానికి ఇత్తడి పళ్లెం, నీళ్లు తాగడానికి రాగి, గాజు గ్లాసు, బిర్యానీ వండేందుకు మట్టి కుండలు, ఆహారం వడ్డించేందుకు ఇత్తడి గరిటెలు, స్పూన్లు.. ఇదంతా ఎప్పుడో పూర్వకాలం రోజులు అనుకుంటే పొరపాటు పడినట్లే.. హైదరాబాద్ నగరంలో తాజాగా హోటల్ యాజమాన్యాలు అవలంబిస్తున్న ట్రెండ్ ఇది. వివిధ రకాల థీమ్‌లతో ఏర్పాటు చేస్తున్న హోటల్స్‌లో రుచికరమైన ఆహారంతో పాటు, ఆహ్లాదకరమైన వాతావరణంలో యువతను ఆకట్టుకునేందుకు సెల్ఫీ పాయింట్లు, స్టార్ హీరోల ఫొటోలతో ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నారు. దీంతో ఫ్యాన్స్ సైతం ఖుషీ అవుతున్నారు. అదే సమయంలో కొత్తకొత్త పేర్లతో రెసిపీలను సిద్ధం చేస్తున్నారు. దీంతో ఆహార ప్రియులు లొట్టలేసుకుని తింటున్నారు. టీవల కాలంలో ఫుడ్ సేఫ్టీ అధికారులు పలు హోటళ్లపై దాడులు చేపట్టి, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న వారిపై కేసులు నమోదు చేస్తున్నారు. దీంతో కొందరు చేసిన చిన్న పొరపాట్లకు మొత్తం హోటల్ వ్యాపార రంగంపై ప్రభావం కనిపిస్తోంది. ఫలితంగా రొటీన్‌గా నడిచే హోటళ్లు ఆదరణ కోల్పోతున్నాయి. దీంతో ఈ ప్రభావం నుంచి బయటపడేందుకు ఎవరికి వారు ప్రత్యేకంగా బ్రాండ్ ఇమేజ్ క్రియేట్ చేసుకోవడం, దాన్ని ప్రమోట్ చేసుకోవడానికి కొత్తకొత్త ప్రయోగాలు చేస్తున్నారు. రొటీన్‌కు భిన్నంగా, కాస్త ధర ఎక్కువైనా మనకంటూ ఒక ల్యాండ్ మార్క్ ఏర్పాటు చేసుకోవాలని హోటల్ నిర్వాహకులు, యాజమాన్యాలు భావిస్తున్నాయి. ఆర్థికంగా వీటి నిర్వహణ భారమైనప్పటికీ పోటీ మార్కెట్లో తప్పదంటున్నారు. అదే సమయంలో ఆహారప్రియుల నుంచి ఊహించిన దానికంటే మంచి స్పందన వస్తుందని సంతోషపడుతున్నారు. పార్టీలకు ప్రత్యేకంగా ఏర్పాట్లువివాహాది శుభకార్యాలకు ఫంక్షన్ హాళ్లు ఉన్నాయి. చిన్న కుటుంబం పుట్టినరోజు పార్టీ చేసుకుందామంటే ఫంక్షన్ హాల్‌కు వెళ్లే పరిస్థితి ఉండదు. ఇటువంటి వారి కోసం హోటళ్లలో 20 నుంచి 30 సీటింగ్‌తో ప్రత్యేకంగా ఏర్పాట్లు చేస్తున్నారు. కాంప్లిమెంటరీగా కేకులు సైతం ఉచితంగా అందిస్తామంటున్నారు.బిర్యానీలకు స్థానిక పేర్లు..హైదరాబాద్ అంటేనే దమ్ బిర్యానీకి ఫేమస్. అయితే ఇటీవల కొత్తగా ఏర్పాటు చేసిన ఓ హోటల్లో వంటకాలకు స్థానిక పేర్లను పెడుతూ ఆకట్టుకుంటున్నారు. పాలకొల్లు ఫ్రై పీస్ బిర్యానీ, మొగల్తూరు మటన్ బిర్యానీ, రాజమండ్రి రొయ్యల బిర్యానీ, గుంటూరు మిర్చి కోడి బిర్యానీ, ఓజీ బిర్యానీ, నెల్లూరు చేపల పులుసు అంటూ కొత్తకొత్త పేర్లు మెనూలో కనిపిస్తున్నా యి. దీంతో పాటే దక్షిణ భారత దేశం రెసిపీలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. ఆహారం తయారీ విధానాన్ని యూట్యూబ్, ఫేస్బుక్, ఇన్‌స్టా, రీల్స్‌లో పోస్ట్ చేస్తున్నారు.మట్టి పాత్రలో..ప్రస్తుత రోజుల్లో మట్టి పాత్రల్లో వంట చేయడం గ్రామీణ ప్రాంతాల్లో సైతం కనుమరుగైందనే చెప్పాలి. స్టీల్, అల్యూమినియం పాత్రలు మన్నిక ఎక్కువగా వస్తాయని, అంతా అటువైపు మొగ్గుచూపుతున్నారు. అయితే నగరంలోని హోటల్స్‌లో మాత్రం ప్రధానంగా కుండ బిర్యానీకి మంచి ఆదరణ లభిస్తోంది. అందుకే కొన్ని హోటళ్లలో నేరుగా కుండలోనే బిర్యానీ వండి, వడ్డిస్తున్నారు. పార్సిల్ తీసుకునే వారికి నేరుగా కుండతోనే డెలివరీ ఇస్తున్నారు. దీన్ని ఆహార ప్రియులు ఆస్వాదిస్తున్నారు. ఆదరణ బాగుంది...ఒక థీమ్ ఎంపిక చేసుకున్నాం. మార్కెట్లో ప్రత్యేకంగా ఉండాలనుకున్నాం. ఖర్చుకు ఎక్కడా వెనుకాడలేదు. సాధారణంగా భోజనం తినే ప్లేట్లు రూ.200నుంచి 500లో లభిస్తాయి. అయినా ఇత్తడి ప్లేట్లు పెడుతున్నాం. ఒక్కో ప్లేటు ధర రూ.3500 వరకూ ఉంది. అలాగే యూత్ ఎక్కడికి వెళ్లినా సెల్ఫీ మస్ట్ అన్నట్లు ఉన్నారు. దీనికోసం కొంత ప్లేస్ కేటాయించాం. వినియోగదారుల అభిరుచికి అనుగుణంగా అప్డేట్ అవుతున్నాం. ఫుడ్ క్వాలిటీలో ఎక్కడా రాజీపడటంలేదు. అందుకే అందరి ఆదరణ పొందగలుగుతున్నాం. – ప్రసాద్, అశోక్, అద్భుతాహారం నిర్వాహకులు, రాయదుర్గం -
నేడు ప్రపంచ బిర్యానీ దినోత్సవం
రాహుల్‌గాంధీ రాజకీయాల్ని మరచిపోతారు.. సచిన్టెండూల్కర్ బ్యాటింగ్‌కు బదులు ఈటింగ్‌కి జై కొడతారు.. హైదరాబాద్ బిర్యానీ అంటే సెలబ్రిటీలకే సెలబ్రిటీ. శతాబ్దాల నాటి బిర్యానీ ఎప్పటికప్పుడు నగరాన్ని రుచుల విశ్వంలో రారాజుగా నిలబెడుతూనే ఉంది. నేడు ప్రపంచ బిర్యానీ దినోత్సవం.. ఈ సందర్భంగా లొట్టలేస్తూ నెమరేసుకుందాం..మన బిర్యానీ..కహానీ..దేశంలో అత్యధికంగా జనం ఆస్వాదిస్తోన్న ఆహారం బిర్యానీయే. అయితే అలా ఆర్డర్ ఇస్తున్న ప్రతి ఐదు బిర్యానీల్లో ఒకటి మనదేనట. ఆ విధంగా చూస్తే భాగ్యనగరం దేశానికి బిర్యానీ క్యాపిటల్‌గా మారిందన్నమాటే. దేశవ్యాప్తంగా సెకనుకు సగటున 2.5 బిర్యానీలు హాంఫట్ అవుతున్నాయట. గతేడాది నగరంలో 13 మిలియన్ల బిర్యానీలు స్విగ్గీ సర్వ్ చేసింది. అంటే అక్షరాలా కోటి 30లక్షలు.. నగరంలోని 1700కు పైగా రెస్టారెంట్లలో కేవలం ఒక్క స్విగ్గీ ద్వారా అమ్ముడవుతున్న బిర్యానీల సంఖ్యే ఇది. ఇక ఇతరత్రా మార్గాల ద్వారా జరిగే విక్రయాలను కలుపుకుంటే చెప్పనక్కర్లేదు. నగరంలో అమ్ముడయ్యే బిర్యానీల్లో తొలిస్థానం చికెన్ బిర్యానీ కాగా, రెండో స్థానం వెజ్ బిర్యానీ కావడం మరో విశేషం. ఆ తర్వాతి స్థానాల్లో చికెన్ దమ్ బిర్యానీ, మటన్ బిర్యానీలు ఉన్నాయి. తాజాగా టేస్ట్ అట్లాస్ నిర్వహించిన ఓ అధ్యయనంలో అత్యుత్తమ రుచుల్లో మన బిర్యానీ 6వ స్థానంలో నిలిచింది. బిర్యానీ అనే పదం పర్షియన్ భాషలోని బిరింజ్ నుంచి పుట్టింది. దీని అర్థం రైస్. బిర్యానీ మన దేశానికి 1398లో పరిచయం అయ్యిందట. హైదరాబాద్ నిజామ్స్, లక్నో నవాబులు బిరియానీ అంటే లొట్టలేసేవారట. మొఘలుల కాలంలో తరచూ యుద్ధాల్లో పాల్గొనే సైనికుల కోసం చేసిన ప్రత్యేక వంటకం ఇది. సైనికుల శక్తి సామర్థ్యాలను దృష్టిలో పెట్టుకుని మటన్, బియ్యం సమపాళ్లలో మేళవించి చెక్కల మంట మీద మసాలాలు, కుంకుమ పువ్వు దీనిలో కలిపి వండేవారట. నగరాన్ని పాలించిన నిజామ్ ఉల్ మల్్క.. బిర్యానీ విస్తరణ చరిత్రలో చెక్కుచెదరని పేరు తెచ్చుకున్నారు. స్థానిక వంటకాల శైలులను ఒకటొకటిగా కలుపుకుంటూ ఎన్నో కొత్త రుచులను అద్దుకుంది బిర్యానీ. ఇందులో నిజామ్స్ సృష్టించిన కచ్చి గోస్త్ బిర్యానీ ఒకటి. ఇటీవల మన దేశపు అగ్రగామి చెఫ్ సంజీవ్‌కపూర్ సైతం తన అభిమాన బిర్యానీ హైదరాబాద్‌లో పుట్టిన కచ్చి గోస్త్ బిర్యానీ గురించి చెప్పడం విశేషం. సిటీలో టాప్ బిర్యానీ సెంటర్లు ఇవే... ఏళ్ల నాటి నుంచి చారి్మనార్‌కు సమీపంలోని షాబాద్ హోటల్ బిర్యానీకి ఫేమస్. అదే క్రమంలో పాతబస్తీలోని దారుల్íÙఫాలోని నయాబ్, బంజారాహిల్స్‌లోని బిర్యానీ వాలా, హైదర్‌గూడలోని కేఫ్ బహార్, సికింద్రాబాద్‌లోని పారడైజ్, నారాయణగూడలోని మెహ్ఫిల్, టోలిచౌకిలోని షాగౌస్, ఫలుక్‌నుమా ప్యాలెస్‌లోని అదా, క్రాస్‌రోడ్స్‌లోని బావర్చి, పాతబస్తీలోని పిస్తా హౌజ్, పంజాగుట్టలోని మెరిడియన్ రెస్టారెంట్... తదితర పేర్లు నగరంలోని బిర్యానీప్రియులకు నిత్య స్మరణీయం. ఇవన్నీ దశాబ్దాలుగా బిర్యానీ ఫేవరెట్స్ కాగా.. ఇటీవలి కాలంలో మరికొన్ని రెస్టారెంట్స్ అత్యాధునిక హంగులతో రుచికరమైన బిర్యానీలను వడ్డిస్తున్నాయి. బహురూపాల్లో...⇒ బిర్యానీని సాధారణంగా హండి లేదా కుండలో వండడం అనేది ఏళ్లనాటి సంప్రదాయం. కానీ కుండలోనే వడ్డిస్తూ, పార్సిల్స్ కూడా అందిస్తున్నారు. ఆ తర్వాత డబ్బా బిర్యానీ వచి్చంది. ఇది కాంపాక్ట్ కంటైనర్‌లో అందించడం మొదలుపెట్టారు. ఆంధ్రప్రదేశ్‌లోని మారేడు మిల్లి బొంగులో బిర్యానీకి ఫేమస్. వెదురు బొంగుల్లో వండిన బిర్యానీని అలాగే వడ్డిస్తూ టేక్ అవే ఇస్తున్నారు. జూబ్లీహిల్స్‌లోని స్పైసీ వెన్యూ రెస్టారెంట్లో ఎంఎల్ఏ పొట్లం బిర్యానీ పేరుతో ఆమ్లెట్లో చుట్టి వడ్డిస్తూ పార్సిల్స్ చేస్తున్నారు. ⇒ కొత్తగా బకెట్ బిర్యానీ వచి్చంది. ఎరుపు, తెలుపు, బ్లూ.. ఇలా అనేక రంగుల బిర్యానీ బకెట్లు నగరవాలుకు కలర్‌ఫుల్ ట్రీట్ అందుబాటులోకి తెచ్చాయి. నగరంలోని ఓ రెస్టారెంట్లో బిర్యానీ–ఇన్–ఏ–వాటర్–వెస్సల్ కూడా రానుందని అంటున్నారు. అంతే కాదు కోన్‌లో బిర్యానీ, పిజ్జాలో బిర్యానీ, సమోసాలో బిర్యానీ, బిర్యానీ సుషీ రోల్స్, బిర్యానీ ఫ్లేవర్ ఐస్ క్రీం వంటివి ఆన్ ద వే అట.చవులూరించే వెరైటీలు... చికెన్, మటన్, వెజిటబుల్స్.. జోడించిన బిర్యానీలు ఓ వైపు లీడ్ చేస్తుండగా, నగరంలో ఉలవచారు బిర్యానీ, క్లాసిక్ హైదరాబాదీ బిర్యానీ, రిచ్ అండ్ క్రీమీ లక్నోవి బిర్యానీ. టాంగీ, ఫ్లేవర్ఫుల్ బాంబే బిర్యానీ వంటివి విభిన్న రకాల మేళవింపులతో అందుబాటులోకి వచ్చాయి. చైనీస్– ఆధారిత ఫ్రైడ్ రైస్ బిర్యానీ లేదా మెక్సికన్–ప్రేరేపిత బురిటో బిర్యానీ ఫ్యూజన్ బిర్యానీ... ఇలా ఫుడ్ లవర్స్‌కి పదుల సంఖ్యలో ఎంపిక అవకాశాలు అందిస్తున్నారు.మండీ వచి్చనా... ట్రెండీ మనదే..నగరంలోని బార్కాస్ ప్రాంతంలో పేరొందిన మండీ...బిర్యానీకి గట్టి పోటీ ఇస్తుందని అంచనా. అరబ్బుల వంటకమైన మండీ.. నగరంలో వేగంగా విస్తరించింది. అలా దాదాపు ఎనిమిదేళ్ల నుంచీ మండీ హవా మొదలైంది. అయితే ఇప్పటికీ బిర్యానీకి దరిదాపుల్లో కూడా రాలేకపోయిందంటే.. దటీజ్ హైదరాబాద్ బిర్యానీ అంటున్నారు సిటీ ఫుడ్ ఇండస్ట్రీ వర్గాలు. పొట్లం బిర్యానీ స్పెషల్బిర్యానీ రుచి, నాణ్యతతో పాటు కంటైనర్స్ కూడా ఇప్పుడు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. వెరైటీ కంటైనర్స్‌లో వడ్డించడం, పార్సిల్ చేయడం ద్వారా ఫుడ్ లవర్స్‌ని అట్రాక్ట్ చేస్తున్నారు. అయితే ఏదేమైనా ఫుడ్ క్వాలిటీ, టేస్ట్ ముఖ్యం. మా రెస్టారెంట్ స్పెషల్‌గా పొట్లం బిర్యానీ అందిస్తున్నాం. ఆమ్లెట్లో చుట్టిన బిర్యానీని సిటీలో ఎక్స్‌క్లూజివ్‌గా అందుబాటులోకి తెచ్చాం. – సంపత్, ద స్పైసీ వెన్యూ రెస్టారెంట్హైదరాబాద్ ఆవకాయతో.. అమెరికాలో బిర్యానీ..నగరవాసులు అనేకమంది విదేశాల్లో ముఖ్యంగా అమెరికాలో రెస్టారెంట్లు నిర్వహిస్తున్నారు. అక్కడ తెలుగువాళ్లు అధికంగా నివసించే చోట కూడా హైదరాబాద్ బిర్యానీ హల్చల్ చేస్తోంది. ‘మన ఇండియన్స్‌తో పాటు అమెరికన్లు కూడా హైదరాబాద్ బిర్యానీని బాగా ఇష్టపడతారు’ అంటూ చెప్పారు నగరంలోని మల్కాజ్గిరి ప్రాంతానికి చెందిన నగే‹Ù, సాయిప్రసాద్. ఈ బావా, బావమరుదులు ఇద్దరూ అమెరికాకు వలస వెళ్లి అక్కడ బావర్చి బిర్యానీ రెస్టారెంట్‌ను నిర్వహిస్తున్నారు. ఈ రెస్టారెంట్లో అందించే ఆవకాయ బిర్యానీ అక్కడ పాప్యులర్. దీని కోసం సునీత బంధువులు మల్కాజ్‌గిరిలో భారీ ఎత్తున ఆవకాయ పచ్చడి తయారు చేసి అమెరికాకు పంపిస్తున్నారు. తెల్లవారుజాము నుంచి అర్ధరాత్రి వరకూ... థియేటర్లలో షోస్ టైమింగ్స్లాగే నగరంలోనూ బిర్యానీ దొరికే వేళలు అంతకంతకూ విస్తరిస్తున్నాయి. నైట్‌లైఫ్‌తో పాటే మిడ్నైట్ బిర్యానీలు కూడా పుట్టుకొచ్చేశాయి. అబిడ్స్‌లోని గ్రాండ్ హోటల్ అర్ధరాత్రి బిర్యానీ విందుకు చిరునామాగానూ, అలాగే చాదర్‌ఘాట్ మిడ్నైట్ బిర్యానీలకు కేరాఫ్‌గా మారాయి. కొన్ని స్టార్ హోటల్స్ బిర్యానీ ప్రియులకు అర్ధరాత్రుళ్లు తలుపులు తెరుస్తున్నాయి. అలాగే తెల్లవారుజామున 4 గంటలకే వేడివేడి బిర్యానీని అందించే ట్రెండ్ ఇటీవలే ఊపందుకుంటోంది. మాదాపూర్, గచ్చి»ౌలి, బోరబండ, వివేకానందనగర్.. ప్రాంతాల్లో సందడి కనిపిస్తోంది. కాల్ సెంటర్లు, మాన్యుఫ్యాక్చరింగ్ కంపెనీలు, సాఫ్ట్వేర్ కంపెనీల్లో పనిచేసే ఉద్యోగులు నైట్ షిఫ్ట్‌ను ఈ బిర్యానీతో ముగించడానికి అలవాటు పడుతున్నారు.వుడ్ ఫైర్‌పై వండే కేటరర్.. సూపర్..నగరానికి చెందిన మహరాజ్ కేటరర్స్, ఎస్కె కేటరర్స్, ఎలిగెన్స్.. తదితర సంస్థలు వుడ్ ఫైర్ మీద వండి కేటరింగ్ చేస్తున్నారు. పెళ్లిళ్లు, వేడుకల్లో వీరి బిర్యానీలకు డిమాండ్ ఉంది. అలాగే హోటల్స్ విషయానికి వస్తే..బావర్చి, పంజాగుట్టలోని మెరిడియన్, ఫైవ్‌స్టార్ హోటల్ మారియట్‌లో బిదిరి అనే హైదరాబాద్ స్పెషల్ రెస్టారెంట్, ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లోని ఆస్టోరియా, పిస్తా హౌజ్‌లోని సాఫ్రాని బిర్యానీలు నా ఛాయిస్. –జుబైర్ అలీ, ఫుడ్ బ్లాగర్ -
ఈద్ ఉల్ అధా 2024: బిర్యానీ ఎక్కడ పుట్టింది? దీని కథేంటీ..?
బక్రీ ఈద్గా పిలిచే ఈద్ ఉల్ అధా ఈ ఏడాది ఇవాళే(జూన్ 17) బంధుమిత్రులతో చాలా ఆనందంగా జరుపుకుంటారు. ఇది త్యాగానికి గుర్తుగా జరుపుకునే విందు. అబ్రహం ప్రవక్త కొడుకు ఇస్మాయిల్ని బలి ఇవ్వమని కోరడం..దేవుడు జోక్యం చేసుకుని బలిగా పొట్టేలుని ఇవ్వడం గురించి ఖురాన్లో ఒక కథనం ఉంటుంది. అందుకు గుర్తుగా ఈ రోజున పొట్టేలు(మేక) బలి ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ..ఒక వ్యక్తి స్థానంలో మరోక జీవిని బలి ఇవ్వడం అనేది.. త్యాగం లేదా ఖుర్బానీ చరిత్రను గౌరవించేందుకు గుర్తుగా ఈ రోజుని ముస్లింలంతా జరుపుకుంటారు. ఈ రోజు మాంసంతో కలిపి వండే బిర్యానీని తయారు చేసి కుటుంబసభ్యులు, బంధుమిత్రులతో పంచుకుని తింటారు. ఈ పండుగ పురుస్కరించుకుని అసలు ఈ బిర్యానీ ఎక్కడ పుట్టింది..? ఎలా మన భారతదేశానికి పరిచయం అయ్యింది వంటి వాటి గురించి సవివరంగా తెలుసుకుందామా..!భారతదేశంలో అత్యంత మంది ఎక్కువగా ఆర్డర్ చేసే వంటకంగా ప్రసిద్ధ స్థానంలో ఉంది బిర్యానీ. కుల మత భేదాలు లేకుండా ప్రజలంతా ఇష్టంగా తినే వంటకం కూడా బిర్యానీనే. ఇంతలా ప్రజాధరణ కలిగిన ఈ వంటకం చరిత్ర గురించి సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం!. బిర్యానీ అన్న పదం 'బిరింజ్ బిరియాన్' (ఫ్రైడ్ రైస్) అనే పర్షియన్ పదం నుంచి పుట్టింది. అందుకే బిర్యానీ ఇరాన్లో పుట్టలేదన్న వాదనా వినిపిస్తుంటుంది. కానీ ఇరాన్లో ధమ్ బిర్యానీది ఘనమైన చరిత్ర. ఓ కుండలో మాంసాన్ని వేసి సన్నని మంటపైన చాలా సేపు దాన్ని ఉడికించి, ఆ మాంసంలోని సహజసిద్ధ రసాలు నేరుగా అన్నంలోకి ఊరేలా చేసి, ఆ పైన సుగంధ ద్రవ్యాలు జోడించి బిర్యానీ తయారుచేస్తారని ఆహార నిపుణులు చెబుతున్నారు. ఇక ఈ బిర్యానీ మొఘల్ చక్రవర్తుల ద్వారానే భారత్‌లోకి వచ్చిందన్న ప్రచారం ఉన్నా దానికి సరైన ఆధారాలు లేవు. అంతేగాదు దక్షిణ భారతంలోని దక్కన్ ప్రాంతానికి చెందిన నవాబులూ, యాత్రికుల ద్వారానే ఇరాన్ నుంచి అది దేశంలోకి ప్రవేశించిందన్నది ఎక్కుమంది చెబుతున్న వాదన. ఏదీఏమైనా..నవాబుల కుటుంబాలకే పరిమితమైన బిర్యానీ, నెమ్మదిగా తన రూపం మార్చుకుంది. భిన్నమైన ప్రాంతాల్లోని ప్రజల ఇష్టాలకు అనుగుణంగా విభిన్న సుగంధ ద్రవ్యాలను తనలో కలుపుకుంటూ, ఇప్పుడు ప్రతి ఒక్కరికీ కమ్మని రుచితో చేరువైంది. ఇక చరిత్ర కారుల అభిప్రాయం ప్రకారం..ఈ బిర్యానీ వంటకం మొఘల్ శకం, చక్రవర్తి షాజహాన్ భార్య బేగం ముంతాజ్ మహల్ కాలం నాటిదని ప్రసిద్ధ కథనం. ఆమె ఒకసారి పోషకాహార లోపంతో కనిపించిన సైనిక అధికారులను చూసి, వారి కోసం పోషకమైన, చక్కటి సమతుల్య భోజనాన్ని తయారు చేయమని తన రాజ ఖన్సామాలను (వంటచేసేవాళ్లుకు) ఆదేశించింది. దాని ఫలితంగా సుగంధ ద్రవ్యాలతో కూడిన ఈ బిర్యానీ వంటకం రూపొందిందని చెబుతుంటారు. మరో కథనం ప్రకారం..1398లో టర్క్-మంగోల్ విజేత తైమూర్ భారత సరిహద్దులను చేరుకున్నప్పుడు అతని సైన్యం కోసం ఈ బిర్యానీని వినియోగించారిని చెబుతారు. సైనికులు కోసం బియ్యం, సుగంధద్రవ్యాలు, మాంసంతో నిండిన కుండను వేడి గొయ్యిలో పాతి పెట్టేవారట. కొంత సమయం తర్వాత తీసి చూడగా బిర్యానీ తయారయ్యి ఉండేదట. ఇది యోధులకు మంచి పోషకాహార భోజనంగా ఉండేదట. ఎక్కువ సేపు ఆకలిని తట్టుకుని ఉండేవారట. ఇక పర్షియన్ పదంలో బిరియన్ అనే పదానికి అర్థం కాల్చడం. బిరింజ్ అంటే అన్నం. పూర్వకాలంలో చాలమంది గొప్ప పండితులు పర్షియా దేశం నుంచి భారతదేశానికి రావడం వల్లే ఈ ప్రత్యేకమైన వంటకం మనకు పరిచయమయ్యిందని చెబుతారు. అయితే మన దేశంలో మాత్రం ఈ బిర్యానీ మాంసం, బియ్యం సుగంధ ద్రవ్యాలతో కూడిన బిర్యానీని మాన్సోదన్ అని పిలుస్తారు. ప్రస్తుతం భారతదేశం అంతటా అనేక రూపాల్లో బిర్యానీ లభిస్తుంది. మన హైదరాబాద్ బిర్యానీ ఉత్తర, దక్షిణ అంశాలను టర్కిష్ ప్రభావాన్ని మిళితం చేస్తుంది. ఉత్తర భారతదేశంలో ముఖ్యంగా ఢిల్లీ, లక్నోలలో బాస్మతీ వంటి పొడవైన బియ్యంతో తయారు చేయగా, తమిళనాడు, కర్ణాటక, కేరళ సీరగ సాంబ లేదా కైమా బియ్యం వంటి పొట్టి ధాన్యాలతో తయారు చేస్తారు. ప్రతి బిర్యానీ సుగంధ్ర ద్రవ్యాలు, మాంసంతో ఆయా ప్రాంతాలకు అనుగుణమైన శైలిలో రూపొందుతుంది. ఈ బిర్యానీ వంటకం ఎలా ఏర్పడిందన్నది తెలియకపోయిన మన రోజూవారీ ఆహారంలో అందర్భాగం అయ్యింది. ముఖ్యంగా ఇలాంటి ఈద్ సమయంలో ప్రతి ముస్లిం ఇంట ఘుమఘమలాడే మటన్ బిర్యానీ ఉండాల్సిందే. (చదవండి: Eid Al-Adha 2024: మౌలిక విధులు..) -
ప్రాణం తీసిన ఒక్క రూపాయి
ఖిలా వరంగల్: వరంగల్‌లో దారుణం జరిగింది. ‘ఆ్రఫ్టాల్ నువ్వు ఒక ఆటోడ్రైవర్వు. ఒక్క రూపాయి ఎక్కువ కొట్టే మొగోడివా’..? అంటూ ఇద్దరి మధ్య జరిగిన చిన్న ఘర్షణ చివరికి ఒకరి ప్రాణం తీసింది. శనివారం వరంగల్ క్రిస్టియన్ కాలనీ గాం«దీనగర్‌లో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం ప్రకారం.. వరంగల్ మిల్స్‌కాలనీ గరీబ్‌నగర్ గొర్రెకుంటకు చెందిన ఇసంపెల్లి ప్రేమ్‌సాగర్ (38) ఆటోడ్రైవర్‌గా పనిచేస్తున్నాడు.శుక్రవారం రాత్రి 9 గంటల సమయంలో ప్రేమ్‌సాగర్ గాందీనగర్‌లోని ‘నబీ రూ.59కే చికెన్ బిర్యానీ’సెంటర్‌కు వెళ్లాడు. ఆదే సమయంలో గాందీనగర్‌కు చెందిన జన్ను అరవింద్ అక్కడికి చేరుకున్నాడు. ఇద్దరు స్నేహితులే. ఈ క్రమంలో ప్రేమ్‌సాగర్ బిర్యానీ తీసుకుని రూ.59కి బదులు రూ.60 ఫోన్‌పే ద్వారా చెల్లించాడు. పక్కనే ఉన్న అరవింద్ దీనిపై స్పందించి.. ‘ఒక్క రూపాయి ఎక్కువ కొట్టే మొగోడివి అయ్యావా’అంటూ ప్రేమ్‌సాగర్‌ను హేళన చేస్తూ మాట్లాడాడు. దీంతో ప్రేమ్‌సాగర్ ఒక్కసారిగా ఆవేశానికిలోనై ‘నేను ఏమైనా అడుక్కు తింటున్నానా.. ఏం మాట్లాడుతున్నావు’అంటూ అరవింద్‌ను నిలదీశాడు. మాటామాటా పెరిగి ఘర్షణకు దారితీసింది. తోపులాటలో అరవింద్, బలంగా ప్రేమ్‌సాగర్‌ను నెట్టివేయగా రోడ్డుపై పడిపోయాడు. దీంతో అతని తలకు బలమైన గాయమై చిన్నమెదడు చిట్లి ముక్కు, చెవుల్లోనుంచి రక్తస్రావం కావడంతో స్పృహ కోల్పోయాడు. అదే సమయంలో అక్కడికి చేరుకున్న ప్రేమ్‌సాగర్ తమ్ముడు విద్యాసాగర్‌తోపాటు అరవింద్ కలసి ఆటోలో ప్రేమ్‌సాగర్‌ను ఎంజీఎంకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ రాత్రి 1 గంట సమయంలో ప్రేమ్‌సాగర్ మృతిచెందాడు. వెంటనే అరవింద్ ఎంజీఎం నుంచి నేరుగా మిల్స్‌కాలనీ పోలీస్ స్టేషన్‌కు చేరుకుని పోలీసులకు లొంగిపోయాడు. మృతుడి సోదరుడు విద్యాసాగర్ ఫిర్యాదు మేరకు శనివారం అరవింద్‌పై హత్యా నేరం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్స్పెక్టర్ మల్లయ్య తెలిపారు. -
మండి బిర్యానీ రూ.వెయ్యి.. ట్రీట్మెంట్ రూ.లక్ష!
సాక్షి, రంగారెడ్డి జిల్లా: షాద్ నగర్ సాయిబాబా హోటల్లో దారుణం చోటుచేసుకుంది. మండి బిర్యానీ తిని కుటుంబం ఆసుపత్రి పాలైంది. కలుషిత బిర్యానీ తినడంతో వాంతులు, విరోచనాలతో అనారోగ్యానికి గురైయ్యారు. శంషాబాద్ ప్రైవేట్ ఆసుపత్రిలో బాధితులు చికిత్స పొందుతున్నారు. కలుషిత ఆహారం తినడం వల్లనే ఫుడ్ పాయిజన్ అయ్యిందని వైద్యులు చెబుతున్నారు.ఖమ్మంలో..ఖమ్మం నగరంలోని కొన్ని ప్రముఖ హోటళ్లలో ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు చేపట్టారు. బైపాస్ రోడ్డులో ఉన్న ఒక హోటల్లో వంటకు ఉపయోగించే కొబ్బరి పొడి, నూడుల్స్ వంటి రా మెటీరియల్‌లో కల్తిని గుర్తించారు.వినియోగదారులకు విక్రయించేందుకు తయారు చేసి నిల్వ ఉంచిన పలు చికెన్ కబాబ్‌లో ఫంగస్‌ను గుర్తించారు. ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నఇలాంటి హోటల్ పై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. -
బిర్యానీ తినేందుకు వెళ్తుండగా...
బన్సీలాల్‌పేట్: అర్ధరాత్రి బిర్యానీ తినేందుకు బైక్‌పై వెళ్తున్న బావబామ్మర్దులను మృత్యురూపంలో వచ్చిన మినీ బస్సు(స్వరాజ్ మజ్దా) కబళించింది. ఈ ప్రమాదంలో మరో యువకుడు స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. గాంధీనగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగిన ఈ సంఘటన వివరాలు సీఐ రాజు తెలిపిన ప్రకారం ఇలా ఉన్నాయి. గుంటూరు జిల్లా పిడుగురాళ్లకు చెందిన సూరగాయని యజ్ఞ నారాయణ (25) బతుకుదెరువు కోసం నగరానికి వలసవచ్చాడు. వాషింగ్ మిషన్ మెకానిక్‌గా పనిచేస్తూ పద్మారావునగర్ గంగపుత్రకాలనీలో నివాసం ఉంటున్నాడు. వృత్తిరీత్యా కెమెరామెన్‌గా పనిచేసే అతని బావమరిది కూరేటి సాయిపవన్ (32) గుంటూరు నుంచి అతన్ని కలిసేందుకు వచ్చాడు. ఆదివారం అర్ధరాత్రి అదే కాలనీలో ఉండే చీకటి సుబ్రమణ్యంతో కలిసి వీరు బిర్యానీ తినడానికి పల్సర్ బైక్‌పై ముషీరాబాద్‌కు వెళ్లారు. అక్కడ బిర్యానీ హోటల్ మూసివేసి ఉండడంతో ట్యాంక్‌బండ్‌పై ఉన్న హోటల్‌కు వెళదామని బయలుదేరారు. కవాడిగూడ హోటల్ మారియెట్ చౌరస్తా వద్దకు రాగానే..అదే సమయంలో లోయర్ ట్యాంక్‌బండ్ నుంచి వేగంగా వచి్చన మినీ బస్సు సిగ్నల్‌ను దాటేసి ముందువెళ్తున్న వీరి ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ఘటనలో యజ్ఞ నారాయణ తలకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందగా, తీవ్ర గాయాలపాలైన సాయిపవన్‌ను ఆస్పత్రికి తీసుకువెళ్లగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. సుబ్రమణ్యంకు స్వల్ప గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే మినీబస్సు డ్రైవర్ వాహనాన్ని వదిలేసి పరారయ్యాడు. సుబ్రమణ్యం ఇచి్చన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. -
రంజాన్ నెలలో 10 లక్షల బిర్యానీ ఆర్డర్లు లాగించేసిన హైదరాబాదీలు
బిర్యానీ.. ఈ పేరు వింటే చాలు నోటిలో నీళ్లు ఊరాల్సిందే. బిర్యానీ వాసనకే సగం కడుపు నిండిపోతుంది. ఎప్పుడు రెస్టారెంట్‌కు వెళ్లినా బిర్యానీ తినకుంటే మాత్రం భోజనం అసంపూర్తిగా అనిపిస్తుంటుంది. ఇక మన హైదరాబాద్ బిర్యానీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. హైదరాబాద్ బిర్యానీ ఘుమఘుమలకు ఒక్క తెలుగు వారేంటి.. దేశవిదేశీయులు ఫిదా అవ్వాల్సిందే. అంతటి గొప్ప పేరును కలిగిన బిర్యానీని రంజాన్ మాసంలో హైదరాబాద్ వాసులు తెగ లాంగించారట.. ఈ ఒక్క నెలలోనే ఏకంగా పది లక్షలు(1 మిలియన్) బిర్యానీ ఆర్డర్లు వచ్చాయని ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గీ వెల్లడించింది. బిర్యానీ ఆర్డర్లలో దేశవ్యాప్తంగా హైదరాబాద్ తొలి స్థానంలో నిలిచిందని పేర్కొంది. బిర్యానీతో పాటు హలీమ్ ఆర్డర్లలోనూ నగర వాసులు రికార్డు సృష్టించారని, నెల రోజుల వ్యవధిలో 5.3 లక్షల ఆర్డర్లు వచ్చినట్లు తెలిపింది. ఈ ఏడాది రంజాన్ మాసం మార్చి 11న ప్రారంభమైన విషయం తెలిసిందే. నేటితో(శుక్రవారం) ముగిసింది. ఈ క్రమంలో తాజాగా దేశవ్యాప్తంగా ఫుడ్ డెలివరీ ఆర్డర్ల గురించి వివరాలను స్విగ్గీ ప్రకటించింది. ఈ నెల రోజుల్లో దేశవ్యాప్తంగా ఏకంగా 60 లక్షల పేట్ల బిర్యానీ ఆర్డర్లు డెలివరీ చేసినట్లు తెలిపింది. మిగతా నెలలతో పోలిస్తే రంజాన్ నెలలో బిర్యానీ ఆర్డర్లు 15 శాతం పెరిగాయని పేర్కొంది. రంజాన్ సందర్భంగా సాయంత్రం 5:30 నుంచి 7 గంటల మధ్య ఇఫ్తార్ ఆర్డర్లు 34% పెరిగినట్లు స్విగ్గీ వెల్లడించింది. ఇఫ్తార్ ఆర్డర్లలోలో చికెన్ బిర్యానీ, మటన్ హలీమ్, సమోసా, ఫలుదా, ఖీర్‌లు టాప్ ప్లేస్‌లో ఉన్నట్లు చెప్పింది. హలీమ్ ఆర్డర్లలో ఏకంగా 1454.88 శాతం పెరుగుదల నమోదైందని, దీని తర్వాతి స్థానంలో ఫిర్ని ఆర్డర్లలో 80.97 శాతం, మాల్పువా ఆర్డర్లు 79.09 శాతం, ఫలుదా 57,93 శాతం, డేట్స్ 48.40 శాతం ఆర్డర్లు పెరిగాయని పేర్కొంది. -
ఫ్రెండ్స్‌కు కమ్మని బిర్యానీ వండిన స్టార్ హీరో
ఒక్కొక్కరికీ ఒక్కో పిచ్చి.. అలా తమిళ స్టార్ హీరో అజిత్‌కు బైక్స్ అన్నా.. బైక్ మీద విహరించడం అన్నా ఎంతో ఇష్టం. సినిమాల నుంచి కాస్త బ్రేక్ దొరికినా చాలు.. బైక్ మీద తనకు నచ్చిన ప్రాంతాలు చుట్టేస్తుంటాడు. అంతేకాదు.. చాలాసార్లు ప్రొఫెషనల్ రేసింగ్‌లో పాల్గొని అంతర్జాతీయ స్థాయిలోనూ గుర్తింపు తెచ్చుకున్నాడు. తన సినిమాల్లో కూడా బైక్‌పై చేజింగ్ సీన్లు, యాక్షన్ సీన్లు కనిపిస్తూ ఉంటాయి. ప్రస్తుతం అజిత్ విడాముయర్చి అనే సినిమాలో నటిస్తున్నాడు. ఇటీవల ఈ సినిమా షూటింగ్‌కు బ్రేక్ వచ్చింది. ఇంకేముంది తన ఫ్రెండ్స్‌తో కలిసి బైక్ రైడ్‌కు వెళ్లాడు. అక్కడ వారికోసం ప్రత్యేకంగా బిర్యానీ కూడా చేశాడు. స్నేహితులతో కలిసి ట్రిప్‌ను ఎంజాయ్ చేస్తున్న ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. సినిమాల విషయానికి వస్తే.. అజిత్ చేతిలో గుడ్ బ్యాడ్ అగ్లీ అని మరో సినిమా కూడా ఉంది. అధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. ఇది వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ కానుంది. Multitalented SOUL. 😘😘😘 #Ajith sir #VidaaMuyarchi #GoodBadUgly pic.twitter.com/mLyqLM0Vjv — Ashok Surya (@AshokSuryaOff03) March 21, 2024 Ride with Venus. It is #Ajith sir’s GAME #VidaaMuyarchi 🔥🔥🔥 pic.twitter.com/1vved9bWVp — Ashok Surya (@AshokSuryaOff03) March 20, 2024 చదవండి: శృంగార చిత్రంతో ఆస్కార్ వరకు.. ఎవరో గుర్తుపట్టారా..? -
వైరల్: అవునండీ... ఇది బిర్యానీ టీ
వేడి వేడిగా బిర్యానీ తింటే ఎంత మజా? ఆ తరువాత వేడి వేడిగా టీ తాగుతుంటే ఎంత మజా! ఆ మజాను ఈ మజాను మిక్స్ చేసి ‘బిర్యానీ టీ’ తయారుచేసింది ‘మాస్టర్ చెఫ్ 4’ విజేత నేహాదీపక్షా. టీ ఆకులు, దాల్చిన చెక్క, సోంపు, నల్లమిరియాలు, యాల కులు... మొదలైన వాటితో నేహా తయారు చేసిన ఈ ‘బిర్యానీ టీ’ చవులూరిస్తూ నెట్టింట వైరల్ అవుతుంది. వీడియో వైరల్ కావడం మాట ఎలా ఉన్నా నెటిజనులు మాత్రం రకరకాలుగా స్పందిస్తున్నారు. కొందరు ‘ఆహో ఓహో!’ అని పొగడ్తల దండకం అందుకుంటే, మరి కొందరు ‘బిర్యానీ టీ అంటే ఏమిటో కాదు వేడి వేడి బిర్యానీని వేడి వేడి టీలో కలపడం’ అని జోక్ చేస్తున్నారు. ఐస్‌క్రీమ్ రోల్ మేకర్ కూలింగ్ పాన్‌ను ఉపయోగించి ఒక చెఫ్ తయారుచేసిన ‘స్క్రీమ్టీ’కూడా ఈమధ్య నెట్‌లోకంలో హల్చల్ చేసింది. -
బిర్యానీ కోసం వెళ్లి.. ముగ్గురు మృతి
గద్వాల క్రైం: ఓ ప్రైవేట్ ఆస్పత్రి వైద్యుడి కుమార్తె జన్మదిన వేడుకలను సిబ్బంది సమక్షంలో ఆనందోత్సాహాల మధ్య జరుపుకొన్నారు. అనంతరం సిబ్బంది బిర్యానీ తినేందుకు వైద్యుడి కారులో హోటల్‌కు వెళ్లారు. అయితే డ్రైవర్ అత్యు త్సాహంతో అతి వేగంగా కారును నడపడంతో అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడి కక్కడే దుర్మరణం చెందగా.. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ విషాద ఘటన జోగుళాంబ గద్వాల మండలం జమ్మిచేడ్ వద్ద శనివారం తెల్లవారుజమున చోటు చేసు కుంది. ప్రత్యక్ష సాక్షులు, గద్వాల సీఐ శ్రీనివాసులు కథనం ప్రకారం వివరాలు.. గద్వాలలోని అనంత ఆస్పత్రిలో స్థానిక చింతల్‌పేటకు చెందిన ఆంజనేయులు (50) సెక్యూరిటీగా పనిచేస్తుండగా, వనపర్తిజిల్లా పెబ్బేరుకు చెందిన పవన్ (28), మల్దకల్ మండలానికి చెందిన నరేశ్ (23), పాల్వా యి గ్రామానికి చెందిన నవీన్, కేటీదొడ్డి మండలం మైల గడ్డకు చెందిన గోవర్ధన్ ల్యాబ్ టెక్నీషియన్లుగా పనిచేస్తున్నా రు. వైద్యుడు వెంకటేశ్ కూతురు పుట్టినరోజు ఉండటంతో శుక్ర వారం అర్ధరాత్రి సిబ్బంది సమక్షంలో వేడుకలు నిర్వ హించారు. ఆ తర్వాత ఆరుగురు సిబ్బంది బిర్యానీ తింటా మని చెప్పడంతో వెంకటేశ్ వారికి రూ.5వేలు ఇచ్చారు. డ్రైవర్ మ హబూబ్‌తో కలిసి ఆరుగురు అర్ధరాత్రి 12 గంటల సమయంలో ఎర్రవల్లి వైపు బయలుదేరారు. అయితే డ్రైవర్ నిర్లక్ష్యంగా, అతివేగంగా కారు నడిపి జమ్మిచేడ్ శివారులో కల్వర్టు వద్ద డివైడర్‌ను ఢీకొట్టాడు. దీంతో కారు గాల్లోఎగిరి 100 మీ టర్ల వరకు పల్టీలు కొట్టింది. ఈ క్రమంలోనే కారు పైభాగం (సన్‌రూఫ్) తెరుచుకోవడంతో ఆంజనేయులు, పవన్, నరేశ్ రోడ్డుపై చెల్లాచెదురుగా పడి అక్కడికక్కడే మృతిచెందారు. తీవ్ర గాయాలపాలైన డ్రైవర్ మహబూబ్, నవీ న్, గోవర్ధన్‌లను అనంత ఆస్పత్రికి తరలించారు. విషమంగా ఉన్న నవీన్‌ను మెరుగైన వైద్యం కోసం కర్నూలుకు తరలించారు. మృతుడు ఆంజనేయులు కుమారుడు నవీన్‌కుమార్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. -
బిర్యానీ గొడవ: కస్టమర్లపై దాడి.. రాజాసింగ్ సీరియస్
హైదరాబాద్: హైదరాబాద్‌లోని అబిడ్స్ గ్రాండ్ హోటల్లో బిర్యానీ విషయంలో గొడవ కాస్త పరస్పర దాడి దారి తీసింది. మటన్ బిర్యానీ సరిగా ఉడకలేదని.. డబ్బులు చెల్లించమని హోటల్ వెయిటర్లతో వినియోగదారులు చెప్పారు. దీంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం పెద్దది కావటంతో వెయిటర్లు వినియోగదారులపై కర్రలతో దాడి చేశారు. ఈ ఘటనలో 12 మంది యువతీ యువకులకు గాయాలై ఆస్పత్రి పాలయ్యారు. ఫిర్యాదు రావడంతో.. 10మంది వెయిటర్లపై పోలీసులు కేసు నమోదు చేశారు. సదరు హోటల్ యజమానిపై అబిడ్స్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కస్టమర్లపై దాడి చేసిన ముగ్గురు వెయిటర్లను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ విషయంపై స్పందించిన బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్.. ధూల్‌పేటకు చెందిన కస్టమర్లపై దాడి చేసినందుకు ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రాండ్ హోటల్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. చదవండి: బైరి నరేష్ అడ్డగింత.. వాహనం ఢీ కొట్టి అయ్యప్ప భక్తుడికి గాయాలు -
జైల్ మండి.. భలే ఉందండి
బిర్యానీ అంటే ఇష్టపడని వారు ఉండరు. మండి బిర్యానీ ఆరగించేందుకు బిర్యానీ ప్రియులు అమితంగా ఇష్టపడుతుంటారు. నల్లగొండ జిల్లా కేంద్రంలో మండి బిర్యానీకి ప్రత్యేకంగా పలు రెస్టారెంట్లు వెలిశాయి. అయితే వినూత్న రీతిలో పట్టణంలోని దేవరకొండ రోడ్డులో ‘ది న్యూ జైల్ మండి’ బిర్యానీ రెస్టారెంట్‌ను ఏర్పాటు చేశారు. రొటీన్‌కు భిన్నంగా జైల్ సెట్టింగ్‌లతో ఏర్పాటు చేసిన మండి రెస్టారెంట్ ఆకట్టుకుంటోంది. రెస్టారెంట్లో పూర్తిగా జైలు వాతావరణం ఉంటుంది. లోపలకి వెళితే జైల్లో ఉన్న అనుభూతి కలుగుతుంది. సాధారణంగా మండి బిర్యానీ రుచే వేరు. సౌదీ అరేబియాలో ఒక రకమైన బిర్యానీ ఇది. కారం పసుపు వాడకుండా 18 రకాల మసాల దినుసులతో వండుతారు. మండి బిర్యానీలో చికెన్ ఫ్రైడ్, క్రిస్పీ ఫ్రైడ్, చికెన్ జ్యూసీ, లాలీపాప్, మటన్ మండి, ఫిష్ మండి, ఫ్రాన్స్ మండి ఇలా చాలా రకాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా జైల్ మండిలో అందుబాటులో ఉన్నాయి. వినూత్నంగా ఏర్పాటు చేశాం మండీ బిర్యానీకి ఆదరణ బాగా ఉంది. రుచికరంగా ఉండడం వల్ల ప్రజలు ఆసక్తి కనబరుస్తున్నారు. చూడడానికి జైల్ నిర్మాణం కలిగి ఉండడం మా రెస్టారెంట్ ప్రత్యేకత. జైల్ మాదిరిగా సెల్‌లను ఏర్పాటు చేశాము. మొత్తం 7 సెల్లు ఉన్నాయి. ఫ్యామిలీ కోసం ప్రత్యేక సెల్ ఏర్పాటు చేశాము. – ఎ.దర్శన్, నిర్వాహకుడు ప్రత్యేక అనుభూతి జైల్ రూపంలో ఉండడం ఈ రెస్టారెంట్ ప్రత్యేకత. జైలులో కూర్చుని తిన్న ఫీలింగ్ మాకు కలుగుతుంది. స్నేహితులందరం కలిసి వారానికి రెండు నుంచి మూడు సార్లు వస్తుంటాము. రెస్టారెంట్ వినూత్నంగా ఉండడమే కాదు ఇక్కడ మండీ బిర్యానీ చాలా రుచికరంగా ఉంటుంది. ఫ్యామిలీ కూర్చోవడానికి ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు. – గణేష్, హిమగిరి కాలనీ, నల్లగొండ -
కొత్త పిన్ కోడ్‌తో బిర్యానీ డెలివరీ.. సిద్దమైన బావర్చి
క్రిస్మస్, న్యూ ఇయర్లను పురస్కరించుకుని హైదరాబాద్ వాసులకు బావర్చి రెస్టారెంట్.. స్విగ్గీతో కలిపి సుమారు 35 లక్షల వినియోగదారులకు తమ వంటకాన్ని అందించడానికి సన్నాహాలు చేస్తోంది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. బిర్యానీ ప్రియులకు మరచిపోలేని ఇయర్ ఎండ్ అనుభవాన్ని అందించడానికి హైదరాబాద్‌లో 31 అనే కొత్త పిన్ కోడ్‌తో అమీర్‌పేట్, గచ్చిబౌలి, మాదాపూర్, మణికొండ, నిజాంపేట్, నానక్‌రామ్‌గూడ మొదలైన ప్రాంతాల్లో 2023 డిసెంబర్ 22 నుంచి 2024 జనవరి 1 మధ్య స్విగ్గీ వినియోగదారులకు బావర్చి బిర్యానీ ప్రత్యేకంగా అందుబాటులో ఉంటుంది. RTC X రోడ్డులో ఉన్న బావర్చి రెస్టారెంట్ నగరంలోనే కాకుండా దేశంలోనే అత్యధికంగా అమ్ముడవుతున్న బిర్యానీ రెస్టారెంట్లలో ఒకటి. గత ఏడాది న్యూ ఇయర్ సందర్భంగా స్విగ్గీలో నిమిషానికి 3 బిర్యానీలను విక్రయించడం ద్వారా జాతీయ రికార్డు సొంతం చేసుకుంది. బిర్యానీకి ప్రసిద్ధి చెందిన ఈ రెస్టారెంట్.. చికెన్, మటన్ బిర్యానీ వంటి వంటకాలను వినియోగదారులకు అందిస్తోంది. దేశంలోని వేలాది రెస్టారెంట్లతో అనుభందం ఉన్న స్విగ్గీకి హైదరాబాద్ కూడా అతిపెద్ద మార్కెట్లలో ఒకటి. హైదరాబాద్ నగరంలో ఎక్కువ మంది వినియోగదారులకు బావర్చి రెస్టారెంట్‌ను అందుబాటులోకి తీసుకురావడం గురించి స్విగ్గీ నేషనల్ బిజినెస్ హెడ్ సిద్దార్థ్ భకూ మాట్లాడుతూ.. హైదరాబాద్ వాసులకు బిర్యానీ పట్ల ఉన్న ప్రేమ వర్ణించలేనిది. హౌ ఇండియా స్విగ్గీ నివేదిక 2023 ప్రకారం, దేశంలోని ఆర్డర్ చేసుకునే ప్రతి ఆరు బిర్యానీలలో ఒకటి హైదరాబాద్ బిర్యానీ ఉంటుందని వెల్లడించారు. -
ఏడాదంతా..ఇడ్లీలు, బిర్యానీలే!
సాక్షి, హైదరాబాద్: ఇడ్లీతో టిఫిన్.. బిర్యానీతో భోజనం... ఏడాదంతా ఇదే మెనూ! ఇద్దరు హైదరాబాదీ స్విగ్గీ కస్టమర్ల తీరిది. 2023లో ఓ ఇడ్లీ ప్రియుడు ఇడ్లీల కోసం వెచ్చించిన సొమ్ము అక్షరాల రూ. 6 లక్షలు. మరో బిర్యానీ ప్రియుడైతే ఏకంగా ఏడాదిలో 1,633 బిర్యానీలు ఆర్డర్ చేశాడు. అంటే రోజుకు నాలుగు బిర్యానీల కంటే ఎక్కువే ఆరగించాడు. దేశవ్యాప్తంగా ప్రతి ఆరు బిర్యానీ ఆర్డర్లలో ఒకటి హైదరాబాద్ నుంచే ఉందని ఫుడ్ డెలివరీ సంస్థ ‘స్విగ్గీ’వార్షిక నివేదిక వెల్లడించింది. అందులోని పలు ఆసక్తికర ఆర్డర్లివే.. బిర్యానీ తింటూ ఇండియా–పాకిస్తాన్ మ్యాచ్.. దేశవ్యాప్తంగా ప్రతి సెకనుకు 2.5 బిర్యానీల కోసం ఆర్డర్లు వచ్చాయి. ప్రతి 5.5 బిర్యానీ ఆర్డర్లలో ఒక వెజ్ బిర్యానీ ఉంది. కొత్తగా 20.49 లక్షల మంది యూజర్లు స్విగ్గీలో బిర్యానీలు ఆర్డర్ చేశారు. చంఢీగఢ్లోని ఓ బిర్యానీ ప్రియుల కుటుంబం అక్టోబర్‌లో జరిగిన భారత్–పాక్ ప్రపంచ క్రికెట్ కప్ మ్యాచ్ రోజున ఏకంగా 70 బిర్యానీలు ఆర్డర్ చేసింది. దేశవ్యాప్తంగా ఆ రోజు ప్రతి నిమిషానికి 250 బిర్యానీలను స్విగ్గీ డెలివరీ చేసింది. స్విగ్గీ డెలివరీ పార్ట్నర్స్ గతేడాది 16.64 కోట్ల కిలోమీటర్ల మేర విద్యుత్ వాహనాలు, సైకిళ్లపై ప్రయాణించి డెలివరీ చేశారు. గతేడాది అత్యధికంగా చెన్నైకి చెందిన వెంకటేశన్ 10,360, కొచి్చకి చెందిన సంథిని 6,253 ఆర్డర్లను డెలివరీ చేశారు. చిప్స్, బిస్కెట్ల కోసం రూ.31,748 ఖర్చు.. నిత్యావసరాలను విక్రయించే స్విగ్గీ ఇన్‌స్టామార్ట్‌లో కస్టమర్లు అత్యధికంగా పాలు, పెరుగు, ఉల్లిగడ్డల కోసం వెతికారు. జైపూర్‌కు చెందిన ఓ కస్టమర్ ఒక్క రోజులో 67 ఉత్పత్తులను ఆర్డర్ చేశాడు. చెన్నైకి చెందిన ఓ వ్యక్తి కాఫీ, జ్యూస్, బిస్కెట్లు, చిప్స్ కోసం ఒక్క ఆర్డర్లో అత్యధికంగా రూ. 31,748 ఖర్చు చేశాడు. అత్యంత వేగంగా ఢిల్లీలో ఒక కస్టమర్‌కు 65 సెకన్లలో నూడుల్స్ ప్యాకెట్లను డెలివరీ చేశారు. హైదరాబాద్, ముంబై కంటే బెంగళూరు నుంచి మామిడి పండ్ల కోసం ఎక్కువ ఆర్డర్లు వచ్చాయి. ఒక్క రోజులో 207 పిజ్జాలు.. చెన్నై, ఢిల్లీ, హైదరాబాద్ నుంచి ఒక్కో కస్టమర్ నుంచి గరిష్టంగా 10 వేల కంటే ఎక్కువే ఆర్డర్లు వచ్చాయి. భువనేశ్వర్‌లోని ఒక కస్టమర్ ఒక్క రోజులో 207 పిజ్జాలు ఆర్డర్ చేశారు. ముంబైకి చెందిన ఓ కస్టమర్ ఏడాదిలో రూ. 42.3 లక్షల విలువైన ఫుడ్ ఆర్డర్లు చేశాడు. ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీ ప్రాంతంలో జరిగిన ఓ పెద్ద పార్టీలో 269 ఐటెమ్స్ ఆర్డర్ చేశారు. దుర్గా పూజ సందర్భంగా దేశవ్యాప్తంగా 77 లక్షల రసగుల్లాల ఆర్డర్స్ వచ్చాయి. నవరాత్రి రోజుల్లో చాలా మంది ఫేవరేట్ ఆర్డర్ మసాలా దోశ. కేక్‌లే కేక్‌లు.. గార్డెన్ సిటీగా పేరొందిన బెంగళూరు కేక్ సిటీగా మారింది! 2023లో ఈ నగరంలో 85 లక్షల చాక్లెట్ కేక్స్ ఆర్డర్లు వచ్చాయి. ప్రేమికుల దినోత్సవం నాడు దేశవ్యాప్తంగా నిమిషానికి 271 కేక్స్ ఆర్డర్ చేశారు. నాగ్‌పూర్‌కు చెందిన ఓ కస్టమర్ ఒక్క రోజులో 92 కేక్‌లు ఆర్డర్ చేశాడు. బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్ సమయాల్లోనూ కేక్‌లు ఆర్డర్ చేయడం గమనార్హం. 2023లో వేగాన్ ఆర్డర్లు 146 శాతం మేర పెరిగాయి. అలాగే మిల్లెట్స్ ఆధారిత ఆహార ఉత్పత్తుల ఆర్డర్లు 124 శాతం మేర పెరిగాయి. బుక్ఫీట్, ఫాక్సీటేల్, జొవార్, బాజ్రా, రాగి, రాజ్గిరి వంటి డిషెస్ కోసం ఎక్కువ ఆర్డర్లు వచ్చాయి. -
చికెన్ ముక్క లేకుండా బిర్యానీ వడ్డించిన హోటల్.. రూ.30 వేలు పరిహారం!
కర్ణాటక: చికెన్ ముక్క లేకుండా బిర్యాని తినడం ఎంత అవమానకరమో మాంసప్రియులకు తెలుసు. అయితే మైసూరు బజ్జీలో మైసూరు ఉంటుందా?, అలాగే చికెన్ బిర్యానీలో చికెన్ ఉంటుందా? అని వాదించిన హోటల్‌కు కస్టమర్ కోర్టు ద్వారా షాక్ ఇచ్చాడు. ముక్క లేకుండా బిర్యాని ఇచ్చిన హోటల్ యాజమాన్యంపై కేసు వేసి కోర్టులో గెలిచి పరిహారం సాధించుకున్నాడు. రూ.30 వేలు ఇవ్వాలని కేసు.. వివరాలు.. బెంగళూరు ఐటీఐ లేఔట్ నివాసి కృష్ణప్ప.. మే నెలలో భార్యకు బాగాలేక వంట చేయలేదు. దీంతో స్థానిక ప్రశాంత్ హోటల్‌కు వెళ్లి రూ.150 పెట్టి చికెన్ బిర్యాని తీసుకున్నాడు. ఇంటికి తీసికెళ్లి పొట్లం విప్పి చూడగా అందులో చికెన్ ముక్కలు లేవు. దీంతో తీవ్ర మనోవేదనకు గురైన కృష్ణప్ప వినియోగదారుల కోర్టులో కేసు వేశాడు. సాక్ష్యం కోసం బిర్యాని ఫోటోలు, బిల్లు ఇచ్చాడు. తనకు రూ.30వేల నష్టపరిహారం అడిగాడు. కేసు పరిశీలించిన కోర్టు రూ.1000 పరిహారం, బిర్యానీ ధర రూ.150 తిరిగి ఇవ్వాలని హోటల్వారికి ఆదేశించింది. ఈ కేసులో కృష్ణప్ప తానే వాదించుకుని గెలిచాడు. కోడికూర కోసం భార్య హత్య.. 6 ఏళ్ల జైలు చికెన్కూర వండలేదనే కోపంతో భార్యను హత్య చేసిన కిరాతక భర్తకి కోర్టు 6 ఏళ్లు జైలు శిక్ష, రూ.10వేలు జరిమానా విధించిన సంఘటన దావణగెరె జిల్లా హరిహరలో చోటుచేసుకుంది. హరిహర తాలూకా మాగనహళ్లికి చెందిన కెంచప్ప భార్య శీలా కోడికూర వండలేదని గొడవ పెట్టుకున్నాడు. కోపం పట్టలేక కత్తితో పొడిచి హత్య చేసాడు. హరిహర గ్రామీణ పోలీసులు కోర్టులో చార్జ్‌షీట్ దాఖలు చేశారు. విచారణలో కెంచప్ప నేరం రుజువు కావడంతో కోర్టు పై విధంగా తీర్పు వెలువరించింది. కాగా, జైల్లో కెంచప్పకు వారానికి రెండుసార్లు మాంసాహారం లభిస్తుంది. -
సింగపూర్ ఆహార పోటీల్లో విజేతగా ‘బిరియాని’
హైదరాబాదీ వంటకం బిరియానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. సింగపూర్‌లో జరిగిన ఫేవరెట్ హాకర్ ఆహార పోటీల్లో ఈ హైదరబాదీ వంటకం విజేతగా నిలిచింది. ఈ పోటీల్లో మొత్తం 12 ఆహార పదార్థాలను విజేతలుగా ఎంపిక చేయగా అందులో బిరియాని ఒకటిగా నిలిచింది. అక్కడ బిరియాని తయారీకి ప్రసిద్ధి చెందిన హాజీ హనీఫా ఎం అన్సారీ ఈటింగ్ హౌజ్ బహుమతిని అందుకుంది. కర్బన ఉద్గారాలను తగ్గించడంలో భాగంగా పైప్డ్ గ్యాస్ వినియోగాన్ని ప్రోత్సహిస్తూ సిటీ ఎనర్జీ పీటీఈ లిమిటెడ్ అనే సంస్థ ఈ పోటీలను నిర్వహించింది. ఈ సంస్థ అక్కడి ఫుడ్ కోర్టులు, ఆహార దుకాణాలకు గ్యాస్‌ను సరఫరా చేస్తుంది. జులై 4 నుంచి సెప్టెంబర్ 15 వరకు దాదాపు రెండున్నర నెలలపాటు ఈ పోటీలు జరిగాయి. 13వ వార్షిక సిటీ హాకర్ (వీధి దుకాణాలు) ఫుడ్ హంట్‌లో భాగంగా సింగపూర్ ప్రత్యేకమైన హాకర్ సంస్కృతిని ప్రోత్సహించేందుకు నిర్వహించిన ఈ పోటీల్లో విజేతకు 500 సింగపూర్ డాలర్లు (సుమారు రూ.30 వేలు), మెడల్, సర్టిఫికెట్‌ను అందజేస్తారు. -
India-Pakistan Match: 70 బిరియానీలు ఆర్డర్ చేసిన కుటుంబం
క్రికెట్‌కు భారత్‌లో ఎంత ఆదరణ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అందులోనూ భారత్-పాకిస్తాన్ మ్యాచ్ అంటే ఆ క్రేజ్ మరింత ఎక్కువగా ఉంటుంది. అభిమానులు పనులన్నీ మానుకుని మరీ టీవీలకు అతక్కుపోతారు. టాస్ దగ్గర నుంచి మ్యాచ్ చివరి బాల్ వరకూ ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షిస్తారు. ప్రస్తుతం భారత్‌లో క్రికెట్ వరల్డ్ కప్ జరుగుతోంది. ఇందులో భాగంగా అక్టోబర్ 14న భారత్-పాకిస్తాన్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ సందర్భంగా చంఢీగడ్‌లో ఓ కుటుంబం ఫుడ్ డెలివరీ యాప్ స్విగ్గీలో ఏకంగా 70 బిరియానీలు ఆర్డర్ పెట్టింది.ఈ విషయాన్ని తెలియజేస్తూ స్విగ్గీ ‘ఎక్స్’ (ట్విటర్)లో ఒక పోస్టు పెట్టింది. దీనిపై యూజర్లు పలు రకాలుగా కామెంట్లు పెట్టారు. కాగా ఈ మ్యాచ్‌లో భారత్.. పాకిస్తాన్‌ను చిత్తుగా ఓడించింది. మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ 191 ఆలౌట్ అయింది. తర్వాత బ్యాటింగ్ చేసిన భారత జట్టు 30.3 ఓవర్లలలోనే లక్ష్యాన్ని చేధించింది. 7 వికెట్లతో ఘన విజయం సాధించింది. గతంలో ఆసియా కప్‌లో భాగంగా భారత్-పాకిస్తాన్ మ్యాచ్ జరిగినప్పుడు కూడా బెంగళూరుకు చెందిన ఓ మహిళ ఇలాగే 62 బిరియానీలు ఆర్డర్ పెట్టింది. 70 biryanis ordered by a household in chandigarh in one-go, seems they already know who's winning 👀 #INDvsPAK pic.twitter.com/2qQpIj5nhu — Swiggy (@Swiggy) October 14, 2023 -
పెరుగు అడిగితే చంపేశారు!
సాక్షి, హైదరాబాద్/పంజగుట్ట: బిర్యానీ తింటూ అదనంగా రైతా(పెరుగు) అడిగిన పాపానికి రెస్టారెంట్ సిబ్బంది ఓ యువకుడిపై విచక్షణా రహితంగా దాడి చేశారు. పోలీసులు వచ్చినా వారి ముందు కూడా కొట్టడం.. పోలీస్‌స్టేషన్‌లో ఊపిరి ఆడటం లేదని చెప్పినా పోలీసులు సైతం పట్టించుకోకుండా చివరి నిమిషంలో ఆస్పత్రికి తరలించడంతో అప్పటికే పరిస్థితి విషమించి చనిపోయాడు. పంజగుట్ట పోలీసుస్టేషన్ పరిధిలోని మెరీడియన్ రెస్టారెంట్లో ఆదివారం రాత్రి చోటు చేసుకున్న ఈ ఘటనపై పోలీసులు, ప్రత్యక్షసాక్షుల కథనం ప్రకారం.. మినరల్ వాటర్ వ్యాపారం చేసే పాతబస్తీ చాంద్రాయణగుట్టకు చెందిన మహ్మద్ లియాకత్ (32) ఆదివారం రాత్రి 10:30 ప్రాంతంలో తన స్నేహితులైన తొమ్మిది మందితో కలిసి పంజగుట్ట కూడలిలో ఉన్న మెరీడియన్ రెస్టారెంట్‌కు వచ్చారు. బిర్యానీ తింటున్న సమయంలో లియాకత్ రైతా అదనంగా కావాలని వెయిటర్‌ను కోరారు. రెండు సార్లు అడిగినా వెయిటర్ నుంచి నిర్లక్ష్యపు సమాధానం, పరుషపదజాలం రావడంతో లియాకత్‌కు, అతడికి వాగ్వాదం చోటు చేసుకుంది. పోలీసుల సమక్షంలోనే దాడి: దీంతో మరో ఇద్దరు వెయిటర్లు, రెస్టారెంట్ మేనేజర్, సూపర్వైజర్ వచ్చి విచక్షణారహితంగా లియాకత్‌తో పాటు అతడి స్నేహితులపై దాడికి దిగారు. ఇంతలో ఓ రెస్టారెంట్ ఉద్యోగి సమాచారంకో అక్కడకు చేరుకున్న పంజగుట్ట పోలీసుస్టేషన్ గస్తీ సిబ్బంది ఎదుటే రెస్టారెంట్ సిబ్బంది, నిర్వాహకులు లియాకత్ తదితరులపై దాడి కొనసాగించారు. ఈ దృశ్యాలు అక్కడ ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. పోలీసుల సమక్షంలోనే దాడి చేస్తూ రెస్టారెంట్‌పై అంతస్తు నుంచి కింది వరకు తీసుకువచ్చారని ప్రత్యక్షసాక్షులు చెప్తున్నారు. వీరి దెబ్బలు తాళలేకపోయిన లియాకత్ ఆయాసంతో అక్కడే కూలబడిపోయాడు. దీంతో పోలీసులు అతడితో పాటు స్నేహితులు మహ్మద్ జమీర్, మహ్మద్ నాసర్, మహ్మద్ ముస్తఫాను ఠాణాకు తీసుకువచ్చారు. ఠాణాకు తీసుకువచ్చినా నిర్లక్ష్యం... అప్పటికే లియాకత్ తనకు తీవ్రంగా ఆయాసం వస్తోందని, ఊపిరి అందట్లేదని చెప్తున్నా డ్యూటీలో ఉన్న ఎస్సై, కానిస్టేబుల్ పట్టించుకోలేదని అంటున్నారు. ‘నాటకాలు ఆడుతున్నావా..?’ అంటూ అతడినే గద్దించారు. కొద్దిసేపటికి లియాకత్ అక్కడే కుప్పకూలిపోవడంతో కారు తాళాలు ఇచ్చి స్నేహితులతోనే సోమాజీగూడలోని ప్రైవేట్ ఆస్పత్రికి పంపారు. ఆలస్యంగా ఆస్పత్రికి తీసుకెళ్ళడంతో... అప్పటికే లియాకత్ చనిపోయినట్టు ప్రైవేట్ ఆస్పత్రి వైద్యులు తెలిపారు. విషయం తెలుసుకున్న ఎంఐఎం పార్టీ ఎమ్మెల్సీ మీర్జా రహమత్ బేగ్ ఆస్పత్రి వద్దకు వచ్చి మృతుడి కుటుంబానికి న్యాయం చేయాలని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని బైఠాయించారు. ఆ మేరకు పోలీసులు హామీ ఇవ్వడంతో పరిస్థితి అప్పటికి సద్దుమణిగింది. వెస్ట్‌జోన్ డీసీపీ జోయల్ డెవిస్ పంజగుట్ట పోలీసులపై తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారని తెలిసింది. రెస్టారెంట్‌ను తాత్కాలికంగా మూసివేయించారని సమాచారం. మృతునికి భార్య, నలుగురు పిల్లలు ఉన్నారు. హత్య కేసు నమోదు... లియాకత్ స్నేహితుడు, బండ్లగూడకు చెందిన హస్ర చాంద్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు వెయిటర్లు బీహార్ వాస్తవ్యుడు, అమీర్‌పేట హాస్టల్లో ఉండే కృష్ణ సూర్య ప్రకాష్ (33), అమీర్‌పేట బాపూ నగర్‌కు చెందిన మెగావత్ పాండు (36), సరూర్‌నగర్‌కు చెందిన మేనేజర్ సయ్యద్ హఫ్తాబ్ హైదర్ (55), జగద్గిరిగుట్టకు చెందిన సూపర్వైజర్ అబ్దుల్ మోయిన్(40), సనత్‌నగర్‌కు చెందిన సూపర్వైజర్ మహ్మద్ అజీజుద్దీన్ (23)పై హత్య కేసు నమోదు చేశారు. మృతదేహానికి గాంధీ ఆస్పత్రి మార్చురీలో పోస్టుమార్టం పరీక్షలు పూర్తి చేసి కుటుంబీకులకు అప్పగించారు. -
ఇండియా-పాకిస్తాన్ మ్యాచ్.. 62 బిర్యానీలు ఆర్డర్ చేసిన మహిళ
వీకెండ్లు, పండగలు.. ఇలా సందర్భం ఏదైనా ఆన్లైన్లో ఫుడ్ ఆర్డర్ చేయడం సాధారణంగా మారిపోయింది. బంధువులు, స్నేహితులతో కలసి పార్టీలు చేసుకుంటున్నప్పుడు కాస్త ఎక్కువగానే ఫుడ్ ఆర్డర్ చేస్తుంటారు. అయితే బెంగళూరుకు చెందిన ఓ మహిళ మాత్రం ఏకంగా 62 బిర్యానీలు ఆర్డర్ చేసింది. శనివారం(సెప్టెంబర్ 2) భారత్-పాకిస్తాన్ (India-Pakistan match) ఆసియా కప్ (Asia Cup 2023) మ్యాచ్ జరుగుతున్న సందర్భంగా బెంగళూరు వాసి ఒకరు ఆన్లైన్ ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్ స్విగ్గీ (Swiggy)లో 62 బిర్యానీలను ఆర్డర్ చేశారు. దీని గురించి స్విగ్గీ సంస్థ ‘ఎక్స్’(ట్విటర్) (Twitter)లో షేర్ చేసింది. "బెంగళూరు నుంచి ఎవరో ఇప్పుడే 62 యూనిట్ల బిర్యానీలు ఆర్డర్ చేశారు? ఎవరు మీరు? ఎక్కడ ఉన్నారు? భారత్-పాకిస్తాన్ మ్యాచ్‌కి వాచ్ పార్టీని నిర్వహిస్తున్నారా? మేమూ రావచ్చా?" అంటూ రాసుకొచ్చింది. స్విగ్గీ పోస్ట్‌ను షేర్ చేసిన వెంటనే చాలా మంది ఇంటర్నెట్ యూజర్లు పోస్ట్‌పై కామెంట్ చేసేందుకు ఉత్సాహంగా ముందుకు వచ్చారు. ఆ వ్యక్తి ఎవరా అని చాలా మంది ఆశ్చర్యపోయారు. మ్యాచ్‌లో భారత్ గెలిస్తే ఫుడ్ ఫ్రీ పంపిస్తారా? అంటూ ఓ యూజర్ చమత్కరించారు. కానీ వర్షం కారణంగా పార్టీ అకస్మాత్తుగా ముగిసింది అంటూ మరొకరు నిట్టూర్చారు. కాగా శ్రీలంకలోని క్యాండీలో పల్లెకెలె అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరుగుతున్న భారత్-పాకిస్థాన్ గ్రూప్-స్టేజ్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 266 పరుగులు చేయగా వర్షం కురవడంతో పాకిస్తాన్ సెకెండ్ ఇన్నింగ్స్ ఆడకుండానే మ్యాచ్‌ను రద్దు చేశారు. సోమవారం ఇదే వేదికపై భారత్ నేపాల్‌తో తలపడనుంది. someone from bengaluru just ordered 62 units of biryanis?? who are you? where exactly are you? are you hosting a #INDvsPAK match watch-party?? can i come? — Swiggy (@Swiggy) September 2, 2023 -
తరచూ చికెన్ బిర్యానీ తింటున్నారా? ఫ్రీగా మీకు క్యాన్సర్, గుండెజబ్బులు
బిర్యానీ అంటే ఇష్టపడని వాళ్లు ఉండరేమో. చిన్నా,పెద్దా అని తేడా లేకుండా చాలామంది ఫేవరెట్ ఫుడ్ లిస్ట్‌లో బిర్యానీ ముందుంటుంది. అందులోనూ హైదరాబాద్ బిర్యానీ అంటే సెలబ్రిటీలు కూడా మనసు పారేసుకుంటారు. నాన్‌వెజ్‌లో ఎన్ని వెరైటీలు ఉన్నా చికెన్ బిర్యానీ ప్రత్యేకతే వేరు. అందుకే స్విగ్గీ, జొమాటో వంటి ఆన్లైన్ ఫుడ్ సర్వీస్ యాప్స్‌లోనూ బిర్యానీ మోస్ట్ సేలబుల్ డిష్. అయితే టేస్ట్ బాగుంది కదా అని రోజూ బిర్యానీ కుమ్మేస్తే మొదటికే మోసం వస్తుందంటున్నారు డాక్టర్లు. తరచూ బిర్యానీ తింటే ముప్పు తప్పందని హెచ్చరిస్తున్నారు. చాలామందికి ముక్కలేనిదే ముద్ద దిగదు. ఏదైనా అకేషన్, పార్టీ ఉంటే కశ్చితంగా బిర్యానీ ఉండాల్సిందే. ఈ క్రేజ్‌కు తగ్గట్లే ఇప్పుడు మార్కెట్లో ఎక్కడపడితే అక్కడ బిర్యానీ పాయింట్లు వెలిశాయి. అయితే ఇలా ఎప్పుడు పడితే అప్పుడు బిర్యానీలు తింటే ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదంటున్నారు ఆరోగ్య నిపుణులు. ముఖ్యంగా రెస్టారెంట్స్‌లో దొరికే బిర్యానీలో కార్బోహైడ్రేట్లు అధికంగా ఉంటాయి. వాటిలో వినియోగించే మసాలా దినుసులు,నాసీరకం పదార్థాల వల్ల కడుపులో లేనిపోని సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. కలర్స్‌తో క్యాన్సర్ అసలే మార్కెట్లో ఇప్పుడు కల్తీ బాగా పెరిగిపోయింది. కాదేదీ అనర్హం అన్నట్లు తినే తిండి దగ్గర్నుంచి తాగే నీళ్ల వరకు అన్నింటిని కల్తీ చేసి పడేస్తున్నారు కొందరు కేటుగాళ్లు. ప్రజల ఆరోగ్యాన్ని గాలికొదిలేసి ఇష్టమొచ్చినట్లు రంగులు, ఆర్టిఫిషియల్ ఎసెన్సులు వాడేస్తున్నారు. ఇలాంటి కలర్స్ వాడటం వచ్చే క్యాన్సర్ వచ్చే ప్రమాదం కూడా ఉంది. బిర్యానీ అధికంగా తింటే ఊబకాయం, గ్యాస్, గుండె సంబంధిత సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంది. చికెన్‌పై బాక్టీరియా చికెన్‌పై సాధారణంగా సాల్మొనెల్లా, క్యాంపిలోబాక్టర్ వంటి బ్యాక్టిరియా ఉంటుంది. కాబట్టి వండేముందు శుభ్రంగా కడిగి బాగా ఉడికిన తర్వాత మాత్రమే తినాలి. లేకపోతే ఈ బాక్టీరియా శరీరం లోపలికి చేరి అనేక అనారోగ్య సమస్యలకు దారితీస్తుంది. కానీ రెస్టారెంట్స్, హోటల్స్‌లో ఎంతవరకు హైజీన్ మెయింటైన్ చేస్తారన్నది చెప్పలేం. దీనివల్లే ఒక్కోసారి ఫుడ్ పాయిజనింగ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. తరచూ బయట బిర్యానీ తింటే గుండె సమస్యలు కూడా వస్తాయట. మేం రోజూ చికెన్ తింటున్నాం. మాకేం కాలేదు కదా అని వాదించే వాళ్లూ ఉంటారు. అయితే ఇప్పుడు సమస్యలు రాకపోయినా ప్రతిరోజూ బిర్యానీ, మసాలాలు ఎక్కువగా ఉండే వంటలు తింటే దీర్ఘకాలంలో అనేక సమస్యలు వస్తాయట. ముఖ్యంగా చిన్నపిల్లల్లో ఊబకాయంతో పాటు జీర్ణ సంబంధిత ఇబ్బందులు తలెత్తుతాయట. ప్రోటీన్ సంగతి సరే, మరి కొవ్వు? సాధారణంగా చికెన్‌లో ప్రోటీన్ అధికంగా ఉంటుందన్న విషయం తెలిసిందే. జిమ్, వర్కవుట్స్ చేసే వాళ్ల డైట్ లిస్ట్‌లో ప్రతిరోజూ చికెన్ ఉంటుంది. దీనివల్ల ప్రోటీన్ అధికంగా శరీరంలో చేరిపోయి కొవ్వు రూపంలో మారిపోతుంది. దీంతో మీకు తెలియకుండానే బరువు పెరుగుతారు. కాబట్టి రోజూ తినే అలవాటు మానుకొని వారానికి ఒకటి లేదా రెండు సార్లు తింటే మంచిదంటున్నారు వైద్యులు. -
క్రైమ్ బ్రాంచి పోలీసునని చెప్పి.. బిర్యానీ తెమ్మని.. ఇంతలో..
మెదక్: క్రైమ్ బ్రాంచి పోలీసునని పరిచయం చేసుకున్నాడు. హైదరాబాద్ వెళ్లాలని కారు కిరాయికి మాట్లాడుకున్నాడు. మార్గమధ్యలో ఓ హోటల్ వద్ద ఆపి డ్రైవర్‌ను బిర్యానీ తెమ్మని చెప్పాడు. అతడు వచ్చేలోపే కారుతో ఉడాయించాడు. ఈసంఘటన పటాన్చెరు పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండలం గంగాపూర్‌కు చెందిన గండ్ల నరేష్‌గౌడ్ కారు నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. ఈక్రమంలో శనివారం జహీరాబాద్‌లో ఉండగా ఓ అపరిచిత వ్యక్తి క్రైమ్ బ్రాంచి పోలీసునని సంగారెడ్డి వరకు కారు కిరాయికి కావాలని రూ. 2 వేలకు మాట్లాడుకున్నాడు. జహీరాబాద్ నుంచి వస్తుండగా మార్గమధ్యలో బుదేరా వద్ద ఓ దాబాలో లంచ్ చేసి, అక్కడి నుంచి సంగారెడ్డి పోలీస్‌స్టేషన్ వద్ద ఐదు నిమిషాలు ఆపమన్నాడు. అక్కడి నుంచి ఎస్పీ ఆఫీస్ వద్ద ఫోన్లో మాట్లాడాడు. జూబ్లీహిల్స్‌లో సాయంత్రం మీటింగ్ ఉందని డ్రైవర్‌కు తెలిపాడు. అదనంగా రూ. 3 వేలు కిరాయి అవుతుందని చెప్పగా సరే అన్నాడు. హైదరాబాద్ వైపు వస్తుండగా పటాన్చెరు మండలం రుద్రారం సమీపంలోని ఓ హోటల్ వద్దకు రాగానే మూడు బిర్యానీలు తీసుకురమ్మని డ్రైవర్‌కు చెప్పి రూ.1000 ఇచ్చాడు. దీంతో డ్రైవర్ బిర్యాని ఆర్డర్ చేశాడు. పది నిమిషాలు పడుతుందని హోటల్ నిర్వాహకుడు తెలపగా.. కారులో ఉన్న వ్యక్తికి చెప్పేందుకు వచ్చాడు. అప్పటికే అతడు కారుతో పరారయ్యాడు. ఈ మేరకు డ్రైవర్ నరేష్ ఆదివారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వారు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
క్యాంటీన్లో బిర్యానీ తిన్న విద్యార్థులు.. 40 మందికి అస్వస్థత, రహస్యంగా తరలించి..
సాక్షి, వరంగల్: జిల్లాలోని బట్టుపల్లి ఎస్సార్‌ప్రైమ్ క్యాంపస్‌లో ఫుడ్ పాయిజన్ కావడంతో కలకలం రేగింది. 40 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. 10 మందికి క్యాంపస్ లోనే చికిత్స అందించారు కాలేజీ సిబ్బంది. ఆదివారం రాత్రి చికెన్ బిర్యాని తిన్న విద్యార్థులు కడుపు నొప్పితో పాటు వాంతులు, విరోచనాలతో అస్వస్థత గురి కావడంతో 30 మందిని ఫాతిమా కొలంబియా మెడికేర్ ఆసుపత్రికి తరలించారు. 15 మంది కి చికిత్స చేసి డిశ్చార్జ్ చేసిన ఆసుపత్రి వర్గాలు, మరో 15 మందికి ఎమర్జెన్సీ వార్డులో చికిత్స అందిస్తున్నారు. రహస్యంగా ఆసుపత్రికి తరలించి వైద్య అందించడంతో పేరెంట్స్ తో పాటు విద్యార్థి సంఘాల నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎస్సార్ ప్రైమ్ నిర్వాహకులకు ఫీజుల వసూళ్ల మీద ఉన్న శ్రద్ధ పిల్లల ఆరోగ్యం పైన లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. (ప్రయాణికులకు టీఎస్ఆర్టీసీ శుభవార్త.. కొత్తగా ‘పల్లె వెలుగు టౌన్ బస్ పాస్’) పరిశుభ్రతను గాలికి వదిలేస్తున్నారని విమర్శిస్తున్నారు. ఎస్సార్ ప్రైమ్ గుర్తింపు రద్దు చేసి చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాల డిమాండ్ చేస్తున్నారు. యాజమాన్యం నోరు మెదుపకపోగా ఆసుపత్రి వైద్యులు మాత్రం విద్యార్థుల ఆరోగ్య నిలకడ ఉందని ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. (చదవండి: మానవత్వం చాటుకున్న కేటీఆర్.. రోడ్డు ప్రమాద బాధితులను కాన్వాయ్‌లో ఆసుపత్రికి తరలింపు) -
భర్తకు బిర్యానీలో నిద్రమాత్రలు.. ప్లాన్ ప్రకారం ప్రియుడు రాక.. అక్కడే ట్విస్ట్!
విజయనగరం క్రైమ్: వివాహేతర సంబంధం మోజులో ఉన్న భార్య కట్టుకున్న భర్తనే కడతేర్చాలని ప్రయత్నించింది. ఈ నేపథ్యంలో భర్తకు బిర్యానీలో నిద్రమాత్రలు కలిపి పెట్టింది. దీంతో భర్త నిద్రలోకి వెళ్లిన తర్వాత వివాహేతర సంబంధం పెట్టుకున్న వ్యక్తిని పిలిపించి నైలాన్‌తాడు మెడకు బిగించి హత్య చేసేందుకు ప్రయత్నించింది. ఈ క్రమంలో భర్తకు తెలివివచ్చి కేకలు వేయడంతో అందరూ పారిపోయారు. బాధితుడు తేరుకుని టూటౌన్ పోలీసులకు బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు టూటౌన్ సీఐ సీహెచ్.లక్ష్మణరావు గురువారం స్థానిక పోలీస్‌స్టేషన్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో తెలిపిన వివరాలిలా ఉన్నాయి. స్థానిక కుమ్మరివీధికి చెందిన కోటరాజు, భార్య శ్రీదేవి, పిల్లలు బుధవారం రాత్రి ఇంట్లో నిద్రకు ఉపక్రమించారు. శ్రీదేవికి చిన గోకవీధికి చెందిన గంధవరపు రఘుతో కొంతకాలంగా వివాహేతర సంబంధం ఉంది. ఈ సంబంధానికి అడ్డుగా ఉన్న భర్తను తప్పించాలనే ఉద్దేశంతో మట్టుబెట్టాలని ప్రణాళిక వేసింది. తన భర్తను చంపేయమని రఘుకు చెప్పింది. వెంటనే రఘు ఒక ఆర్ఎంపీ డాక్టర్ దగ్గర నుంచి నిద్రమాత్రలు కొని శ్రీదేవికి ఇచ్చాడు. అవి తీసుకుని శ్రీదేవి భర్త రాజుకు బుధవారం రాత్రి మటన్ బిర్యానీలో కలిపి తినిపించింది. వివరాలు వెల్లడిస్తున్న టూటౌన్ సీఐ సీహెచ్.లక్ష్మణరావు (వెనుక ముసుగులో నిందితులు) రాజు నిద్రలోకి జారుకున్న తర్వాత రఘుకు ఫోన్ చేసి ఇంటికి రమ్మని పిలవగా వరుసకు బావమరిది అయిన బొగ్గులదిబ్బకు చెందిన కేత శ్రీను సహాయం కోరి రూ. 20వేలకు ఒప్పందం కుదుర్చుకుని ఇద్దరూ వచ్చారు. వారు తెచ్చుకున్న నైలాన్ తాడును రాజు మెడకు బిగించి హత్య చేసేందుకు ప్రయత్నించగా మెలకువ వచ్చిన రాజు పెద్దగా కేకలు వేయడంతో అక్కడి నుంచి ఇద్దరూ పారిపోయా రు. ఈ మేరకు విచారణలో నిందితులు నేరాన్ని అంగీకరించడంతో రఘు, శ్రీను, శ్రీదేవిలను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. సమావేశంలో ఎస్సై షేక్ శంకర్ తదితరులు పాల్గొన్నారు. -
బిర్యానీపై హైదరాబాదీలకు తరగని మోజు.. కోటిన్నర బిర్యానీల ఆర్డర్!
గత ఆరు నెలల్లో హైదరాబాదీలు 72 లక్షలకు పైగా బిర్యానీ ఆర్డర్లను గత 12 నెలల్లో 150 లక్షల బిర్యానీ ఆర్డర్లను అందుకున్నారు. బిర్యానీపై తరగని మోజుకు, నగరానికి బిర్యానీకి మధ్య ఉన్న అనుబంధానికి అద్దం పడుతుంది. ధమ్ బిర్యానీ చాంపియన్... గత ఐదున్నర నెలల్లో, 2022 ఇదే కాలంతో పోలిస్తే నగరంలో బిర్యానీ ఆర్డర్లలో 8.39% వృద్ధి నమోదైంది. దమ్ బిర్యానీ 9 లక్షలకు పైగా ఆర్డర్లతో తిరుగులేని చాంపియన్‌గా నిలిచింది. 7.9 లక్షల ఆర్డర్లతో సువాసనగల ఫ్లేవర్డ్ బిర్యానీ తన సత్తా చాట గా, బ్యాచిలర్స్, సింగిల్స్‌కి అలవాటైన మినీ బిర్యానీ 5.2 లక్షల ఆర్డర్లను అందుకుంది. బిర్యానీ ప్రియత్వం ఓ రేంజ్లో ఉండటంతో నగరంలో దాదాపు 15,000 పైగా రెస్టారెంట్లు తమ మెనూలో బిర్యానీని తప్పనిసరి డిష్‌గా అందజేస్తున్నాయి. బిర్యానీలు అందించే రెస్టారెంట్స్ అత్యధికంగా ఉన్న ప్రాంతాల్లో కూకట్పల్లి, మాదాపూర్, అమీర్‌పేట్, బంజారాహిల్స్, కొత్తపేట్ – దిల్సుఖ్నగర్ ఉన్నాయి, కూకట్పల్లి టాప్... హైదరాబాద్‌లోని వివిధ ప్రాంతాల్లో ఆర్డర్ పరిమాణం పరంగా అత్యధిక బిర్యానీ వినియోగం జరిగింది. వీటిలో. కూకట్పల్లి నెంబర్ వన్ కిరీటం అందుకుంటోంది. ఆ తర్వా తి స్థానాల్లో వరుసగా మాదాపూర్, బంజారాహిల్స్, గచ్చిబౌలి కొండాపూర్ ఉన్నాయి. నగరవాసులు వేలూ లక్షల బిర్యానీలు హాంఫట్ మనిపిస్తున్నారు. ఏ యేటికాయేడు బిర్యానీ పై తమ ఇష్టాన్ని పెంచుకుంటూనే ఉన్నారు. ఆదివారం ప్రపంచ బిర్యానీ దినోత్సవం సందర్భంగా, ప్రముఖ ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్ స్విగ్గి నిర్వహించిన ఓ అధ్యయనం ఒక్క ఏడాదిలో.. కోటిన్నర బిర్యానీలు నగరం ఆరగించేసిందని తేల్చింది. – సాక్షి, సిటీబ్యూరో బిర్యానీ ఓ అనుభవం... నగరంలో బిర్యానీ ప్రియులతో మా ప్రయా ణం చాలా సుదీర్ఘమైనది. నగరవాసులకు బిర్యానీ అనేది కేవలం ఒక తినే వంటకం మాత్రమే కాదు అంతకు మించిన ఒక సంతోషకరమైన అనుభవం. ఈ ప్రపంచ బిర్యానీ దినోత్సవ వేడుకల్ని పురస్కరించుకుని రూ.199 నుంచే ప్రారంభం అవుతున్న మా బిర్యానీ వైరెటీలను నగరవాసులకు ఆస్వాదించవచ్చు. – కుశాగ్ర గుప్తా, వైస్‌ప్రెసిడెంట్, ప్యారడైజ్ ఫుడ్ కోర్ట్ -
గడువు ముగిసిన ఆహార పదార్థాలు.. హోటల్స్‌కు భారీ జరిమానా..
కడప అర్బన్ : కడప రీజినల్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారి, అదనపు ఎస్పీ షేక్ మాసుంబాష ఆదేశాల మేరకు మంగళవారం విజిలెన్స్ అధికారులు, జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారుల బృందం, కడప నగరపాలక సంస్థ శానిటరీ అధికారులు హోటళ్లపై విస్తృతంగా దాడులు నిర్వహించారు. కడప నగరంలోని ఐదు హోటళ్లలో గడువు ముగిసిన ఆహార పదార్థాలను గుర్తించి ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ యాక్ట్ 2006 కింద కేసులు నమోదు చేశారు. ఆయా హోటళ్లకు మొత్తం రూ.1,80,000 జరిమానా విధించారు. ఈ హోటళ్లలో రాజ్ మయూర గార్డెనియా యాజమాన్యానికి రూ.50,000, మయూర బేకరీకి రూ.60,000, ఆంధ్రరుచులుకు రూ.10,000, స్వప్న బార్ అండ్ రెస్టారెంట్‌కు రూ.40,000, రాయలసీమ స్పైస్‌కు రూ.20,000 జరిమానా విధించారు. ఈ మొ త్తాన్ని ఆయా హోటళ్ల యజమానులు కడప నగర పాలక సంస్థకు చెల్లించాలని ఆదేశించారు. ఈ తనిఖీలలో విజిలెన్స్ ఇన్స్పెక్టర్ టి.రెడ్డెప్ప, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ కె.విజయకిషోర్, జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారి ఎం.డి షంషీర్‌ఖాన్, మున్సిపల్ శానిటరీ ఇన్స్పెక్టర్లు సంయుక్తంగా పాల్గొన్నారు. రెస్టారెంట్లకు జరిమానా ప్రొద్దుటూరు : పట్టణంలోని పలు హోటళ్లు, రెస్టారెంట్లలో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ఆకస్మికంగా తనిఖీలు చేశారు. కడప విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారి షేక్ మాసుం బాషా, ఆఫీసర్ పూల రామకృష్ణ, సీఐ అశోక్‌కుమార్, ప్రొద్దుటూరు డివిజన్ ఫుడ్ సేప్టీ ఆఫీసర్ హరిత, మున్సిపల్ శానిటరీ ఇన్స్పెక్టర్లు కిరణ్, శ్రీనివాసరెడ్డి, గోవిందరెడ్డిలు తనిఖీల్లో పాల్గొన్నారు. పట్టణంలోని సాగర బార్ అండ్ రెస్టారెంట్, ఆంధ్ర కిచెన్, హైదరాబాద్ చెఫ్స్, సిప్ ఇన్ రెస్టారెంట్ అండ్ బార్ హోటల్లో తనిఖీలు చేశారు. కిచెన్‌లో పరిశుభ్రత, ఆహార పదార్థాల నాణ్యత పరిమితులను అధికారులు పరిశీలించారు. నాణ్యత ప్రమాణాలు పాటించని సాగర్ బార్ అండ్ రెస్టారెంట్‌పై రూ.50 వేలు జరిమానా విధించారు. ఆంధ్రకిచెన్ రెస్టారెంట్‌పై రూ.25 వేలు జరిమానా, హైదరాబాద్ చెఫ్స్ రెస్టారెంట్‌పై రూ.25 వేలు, సిప్ ఇన్ రెస్టారెంట్ అండ్ బార్‌పై రూ.50 వేలు జరిమానా విధించారు. ఆహార పదార్థాల నమూనాలను సేకరించి పరిశీలనకు స్టేట్ ఫుడ్ ల్యాబోరేటరీకి పంపించారు. ఈ సందర్భంగా విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారి మాసుం బాషా మా ట్లాడుతూ హోటల్, రెస్టారెంట్ వారు విని యోగదారులకు నాణ్యమైన పదార్థాలు అందించాలని తెలిపారు. భారత ఆహార సంస్థ నిర్దేశించిన ప్రమాణాలతో వంటకాలను తయారు చేసి అమ్మాలని చెప్పారు. ఆహార పదార్థాల్లో చైనా సాల్ట్, ఫుడ్ కలర్ ఇతర నిషేధిత పదార్థాలు వాడరాదని, పార్సిల్ విషయంలో ప్లాస్టిక్ కవర్లు వాడరాదని చెప్పారు. నాణ్యతా ప్రమాణాలు పాటించని సంస్థలపై భారీ ఎత్తున జరిమానా విధించడమే కాకుండా క్రిమినల్ కేసులు కూడా నమదు చేసి వ్యాపార సంస్థలు సీజ్ చేస్తామని హెచ్చరించారు. -
రూపాయి బిర్యానీ కోసం వెళ్తే రూ.235 జరిమానా
కరీంనగర్‌క్రైం: రూపాయి నోటుకు బిర్యానీ వస్తుందని ఆశపడి వెళ్లిన వారికి రూ.100 నుంచి రూ.235 వరకు జరిమానా పడింది. కరీంనగర్‌లోని తెలంగాణచౌక్ సమీపంలో కొత్తగా ప్రారంభించిన ఒక బిర్యానీసెంటర్ నిర్వాహకులు శుక్రవారం రూపాయి నోటు ఇచ్చిన వారికి బి ర్యానీ ఇస్తామని ప్రచారం చేశారు. ఇందుకోసం ప్రత్యేకంగా సమయాన్ని కూడా సూచించారు. ఈ విషయం సోషల్ మీడియాలో కూడా వైరల్ కావడంతో జనం రూపాయి నోటుకు బిర్యానీ కోసం ఎగబడ్డారు. అరగంటలో 800లకు పైగా బి ర్యానీ ప్యాకెట్లను కొనుగోలు చేసేశారు. చాలామందికి బిర్యానీ లభించకపోవడంతో హోటల్ ఎదుట ఆందోళనకు దిగారు. దీంతో భారీ ఎత్తున ట్రాఫిక్ జామ్ అయ్యింది. ట్రాఫిక్ పోలీసులు వచ్చి బిర్యానీసెంటర్ను మూసివేయించడంతోపాటు రోడ్లమీద అడ్డదిడ్డంగా పార్కింగ్ చేసిన వందమంది వాహనాలకు రూ.100 నుంచి రూ.235వరకు జరిమానా విధించారు. దీంతో కొందరు బిర్యానీ సెంటర్ నిర్వాహకుడిపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. -
IPL సీజన్లో స్విగ్గిలో అత్యధికంగా చికెన్ బిర్యానీ ఆర్డర్..!
-
అమ్మమ్మ చేతి బిర్యాని.. కోట్లు సంపాదించేలా..
RNR Co-Founder Ramya Ravi Success Story: కొంతమంది చదువులో రానించి ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారు, మరి కొందరు బిజినెస్ చేసి అనుకున్న లక్ష్యాన్ని చేరుకుంటారు. అయితే బెంగళూరుకు చెందిన ఒక యువతి బిర్యాని విక్రయిస్తూ కోట్లు సంపాదిస్తోంది. బిర్యానీ ఏంటి? కోట్లు సంపాదించడం ఏంటి అని మీకు సందేహం రావొచ్చు.. ఇది అక్షరాలా నిజం. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. మనకు బిర్యాని అనగానే హైదరాబాద్ గుర్తుకు వస్తుంది. అయితే దొన్నె బిర్యాని అంటే మొదట గుర్తొచ్చేది బెంగళూరు. ఈ దొన్నె బిర్యాని అమ్ముతూ కోట్ల రూపాయలు సంపాదిస్తోంది బెంగళూరుకు చెందిన 'రమ్య రవి' (Ramya Ravi). అమ్మమ్మ చేసే దొన్నె బిర్యాని తింటూ పెరిగిన ఈమె ఇప్పుడు ఆ బిర్యానితో బిజినెస్ చేస్తోంది. కరోనా మహమ్మారి ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న సమయంలో ఎంతో మంది ఉద్యోగాలు కోల్పోయారు, చాలా వ్యాపారాలు దెబ్బతిన్నాయి. ఆ సమయంలో రమ్య (2020లో) రూ. 5 లక్షల పెట్టుబడితో బిర్యాని వ్యాపారం ప్రారంభించాలని ముందడుగు వేసింది. అందరూ భయపడుతున్న సమయంలో ప్రారంభించిన ఈ బిజినెస్ ఊహకందని రీతిలో విజయ పథంలో పయనించడం మొదలు పెట్టింది. (ఇదీ చదవండి: ఐఏఎస్ వదిలి ఇండియాలో అతిపెద్ద తయారీదారుగా.. ఎవరీ బాలగోపాల్ చంద్రశేఖర్!) వ్యాపారం ప్రారంభమైన కొన్ని రోజుల్లోనే లాభాలు రావడం మొదలయ్యాయి. 2021-22 ఆర్థిక సంవత్సరం ఈమె బిజినెస్ టర్నోవర్ ఏకంగా రూ. 10 కోట్లకు చేరుకుంది. ప్రస్తుతం బెంగళూరు RNR దొన్నె బిర్యానీకి మారుపేరుగా నిలిచింది. బెంగళూరులో పుట్టి పెరిగిన ఈమె ది వ్యాలీ స్కూల్ నుంచి పాఠశాల విద్యను, క్రైస్ట్ కాలేజీ బీకామ్ పూర్తి చేసింది. ఆ తరువాత వ్యాపారంలో కొన్ని మెళుకువలను నేర్చుకోవడానికి హార్వర్డ్ యూనివర్సిటీ నుంచి మేనేజ్మెంట్లో కోర్స్ కూడా పూర్తి చేసింది. ఈమెకు శ్వేత, రవీనా అనే ఇద్దరు సోదరీమణులు కూడా ఉన్నారు. (ఇదీ చదవండి: అమ్మేది పాత బూట్లు.. సంపాదన రూ. కోట్లు - హైస్కూల్ డ్రాపౌట్ యువకుని సక్సెస్ స్టోరీ) ప్రారంభంలో బెంగళూరు నాగరబావి ప్రాంతంలో కేవలం 200 అడుగుల స్థలంలో హోటల్ ప్రారంభించింది. ఆ సమయంలో వారికి కేవలం ఒక వంటవాడు మాత్రమే ఉండేవాడు. వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా దినదినాభివృద్ధి చెందింది. వారు వ్యాపారం ప్రారంభించిన మొదటి నెలలోనే 10000 డెలివరీలు చేశారు. క్రమంగా డిమాండ్ భారీగా పెరగడంతో వ్యాపారం విస్తరించడంపై ద్రుష్టి సారించారు. ఇందులో భాగంగానే 2021లో బెంగళూరులోని జయనగర్‌లో రెస్టారెంట్ ప్రారంభించారు. వీరు ఇతర రెస్టారెంట్స్ మాదిరిగా కాకూండా టిన్ బాక్స్‌లలో బిర్యాని అందిస్తారు. ఈ విధానం చాలామందిని ఆకర్శించింది. ప్రస్తుతం భారీ లాభాల్లో పరుగులు పెడుతోంది -
ఐపీఎల్ 2023: ‘మోస్ట్ ఆర్డర్ డిష్’ టైటిల్ ఎవరిదో తెలుసా?
సాక్షి, ముంబై: రెండు నెలల పాటు క్రికెట్ ఫ్యాన్స్‌ను అలరించిన ఐపీఎల్ 2023 గుజరాత్ టైటన్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య సాగిన ఫైనల్ పోరుతో ముగిసింది. ఎంస్ ధోనీ నేతృత్వంలోని సీఎస్కే టైటిల్‌ను కైవసం చేసుకుంది. ఇది ఇలా ఉంటే ఫుడ్ సరఫరా సంస్థ స్విగ్గి కీలక విషయాన్ని వెల్లడించింది. ఐపీఎల్ సీజన్లో ట్రోఫీ బిర్యానీ గెల్చుకుంది, బిర్యానీ ‘మోస్ట్ ఆర్డర్ డిష్’ టైటిల్‌ను గెలుచుకుంది అంటూ ట్విట్ చేసింది. ఈ ఐపీఎల్ సీజన్లో బిర్యానీ ఆర్డర్ల వివరాలను స్విగ్గీ తాజాగా ప్రకటించింది. నిమిషానికి 212 బిర్యానీ ఆర్డర్లు వచ్చినట్లు వెల్లడించింది. ఎక్కువ మంది ఆర్డర్ చేసింది బిర్యానీనే అని, 12 మిలియన్లకు పైగా ఆర్డర్స్ వచ్చాయని పేర్కొంది. ఆర్డర్ చేసిన ప్రతి వెజ్ బిర్యానీకి, దేశవ్యాప్తంగా 20 నాన్-వెజ్ బిర్యానీలే. తొలి మ్యాచ్ నుంచి గ్రాండ్ ఫినాలే వరకు టోర్నీలో కేవలం క్రికెటర్సే కాదు స్విగ్గీ యూజర్లు కూడా నెక్ట్స్ లెవల్ అనిపించుకున్నారు. (Ravindra Jadeja వారెవ్వా జడేజా..అందుకో అప్రీషియేషన్ సూపర్ పిక్స్ వైరల్) ఈ సీజన్లో అత్యంత వేగవంతమైన డెలివరీ కేవలం 77 సెకన్లు. ఇది కోల్‌కతాలో జరిగింది. ఈ క్రికెట్ సీజన్లో 12 మిలియన్లకు పైగా ఆర్డర్లతో ఫుడ్ లీడర్ బోర్డ్‌లో ఆధిపత్యం బెంగుళూరు టాప్‌లో నిలిచింది.అలాగే ఢిల్లీకి చెందిన ఒక వినియోగదారు ఈ సీజన్లో అత్యధికంగా 701 సమోసాలను ఆర్డర్ చేశారు. అత్యధిక సింగిల్ ఆర్డర్ రూ.26,474. కాగా ఐపీఎల్ సీజన్ ఫీవర్‌ను క్యాష్ చేసుకున్న ఫుడ్ డెలివరీ సంస్థ రకరకాల ట్వీట్లతో సందడి చేసింది. చిత్ర విచిత్ర కామెంట్లతో ట్విట్టర్ లో నెటిజన్లను ఆకర్షించింది. కొన్నింటిపై ట్రోల్స్‌ను కూడా ఎదుర్కొంది. ఐపీఎల్ 2023 సీజన్ ఫైనల్ మ్యాచ్ వర్షం కారణంగా పదే పదే ఆగిపోతుండటంపై ‘అసలు ఆకాశంలో ఎవరు ఉల్లిగడ్డలు కోస్తున్నారబ్బా ఫన్నీ ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. (IPL 2023 విజేత, కెప్టెన్ ఎంఎస్ ధోని నెట్‌వర్త్ ఎంతో తెలుసా?) మరిన్ని బిజినెస్ వార్తలు కోసం చదవండి సాక్షి బిజినెస్ -
బిర్యానీ బిందాస్..ఏటీఎం సైతం వచ్చేసింది!
సాక్షి, అమరావతి: బిర్యానీకి ఉన్న క్రేజ్ ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దేశవ్యాప్తంగా రెస్టారెంట్లు, హోటళ్లలో అత్యధికులు ఆరగిస్తున్న వంటకాల్లో బిర్యానీదే అగ్రస్థానం. వివాహాలు, పుట్టిన రోజు వేడుకల్లోనూ బిర్యానీ తప్పనిసరి ఐటమ్‌గా మారిపోయింది. గల్లీ స్టాల్స్ నుంచి.. మాల్స్ వరకు బిర్యానీ ప్రియులను ఆకట్టుకునేందుకు కొత్త కొత్త పేర్లు ఫ్లేవర్లతో బిర్యానీలు మార్కెట్లోకి దూసుకొస్తున్నాయి. కుండల నుంచి డబ్బా వాలా వరకు.. కుండ నుంచి మొదలైన బిర్యానీ విక్రయాల ట్రెండ్ ఇప్పుడు స్టీల్ బిందె.. స్టీల్ బకెట్.. డబ్బాల్లో విక్రయించే వరకు చేరింది. కుండ, రెడ్ బకెట్, గ్రీన్ బకెట్, బ్లూ బకెట్, స్టీల్ బిందె, స్టీల్ డబ్బా, మండీ, బిగ్ థాలీ బిర్యానీ వంటి ఆకట్టుకునే ప్యాకింగ్లతో విక్రయాలు ఊపందుకున్నాయి. ఎంత మందికి.. ఎంత ధర అనే కేటగిరీని బట్టి కుండ, బకెట్, స్టీల్ బిందె, స్టీల్ డబ్బాల సైజులను ఎంపిక చేసి పార్శిల్ ఇస్తున్నారు. ఇంటిల్లిపాది ఆరగించాక మిగిలిన బకెట్, బిందె, డబ్బాలను ఇంట్లో వినియోగించుకునేందుకు ఆహార ప్రియులు ఆసక్తి చూపడంతో ఈ తరహా విక్రయాలకు డిమాండ్ పెరిగింది. నిన్న మొన్నటివరకు మెట్రోలకే పరిమితమైన ఈ కల్చర్ ఇప్పుడు గ్రామాలకూ పాకింది. స్విగ్గీ, జొమాటో తదితర ఆన్లైన్ సర్వీసుల ద్వారా కూడా కుండ, బకెట్, బిందె బిర్యానీలు ఆర్డర్ ఇస్తున్న వారి సంఖ్య పెరుగుతోంది. కుండ బిర్యానీ క్రేజే వేరు మట్టి కుండలో వండే బిర్యానీకి ఉండే క్రేజే వేరు. తొలినాళ్లలో కుండలోనే బిర్యానీ వండి విక్రయిస్తే.. ఇప్పుడు భారీ గిన్నెల్లో వండిన బిర్యానీని కుండల్లో నింపి విక్రయిస్తున్నారు. కోనసీమలోని రావులపాలెంలో కుండ బిర్యానీ ప్రాచుర్యం పొందింది. ఇప్పుడు విజయవాడ, విశాఖపట్నంతోపాటు రాష్ట్రంలోని ప్రముఖ పట్టణాలకు కుండ బిర్యానీ విక్రయాలు విస్తరించాయి. ఇప్పుడు ఉభయ తెలుగు రాష్ట్రాలతోపాటు పంజాబ్, బిహార్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లోనూ కుండ బిర్యానీ చాలా ఫేమస్ అయిపోయింది. కాగా.. రెడ్, గ్రీన్, బ్లూ బకెట్ బిర్యానీల ట్రెండ్ కూడా రాష్ట్రంలో ఇప్పుడు నడుస్తోంది. హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ తదితర నగరాల్లో వీటి విక్రయాలు పెరిగాయి. ఎంత మందికి బిర్యానీ కావాలో చెప్పి అందుకు తగిన ధర చెల్లిస్తే సరిపడా సైజు బకెట్లో బిర్యానీ పార్శిల్ ఇస్తున్నారు. కొన్ని రోజుల క్రితం విశాఖపట్నంలో స్టీల్ బిందె, స్టీల్ డబ్బా బిర్యానీలు రంగప్రవేశం చేయగా.. వాటికి మంచి డిమాండ్ ఏర్పడింది. బిర్యానీ ఏటీఎం వచ్చేసింది దేశంలో తొలిసారిగా తమిళనాడులోని కొలత్తూర్‌లో ఓ స్టార్టప్ కంపెనీ బిర్యానీ ఏటీఎం తెరిచింది. ఏటీఎం మెషిన్లో 32 అంగుళాలతో ఏర్పాటు చేసిన టచ్ స్క్రీన్‌పై వినియోగదారుడి పేరు, ఫోన్ నంబర్ నమోదు చేస్తే మెనూ వస్తుంది. కావాల్సిన బిర్యానీని ఎంపిక చేసి.. ధర మొత్తాన్ని క్రెడిట్ కార్డు లేదా యూపీఐ స్కాన్ ద్వారా చెల్లిస్తే.. మనం ఆర్డర్ ఇచ్చిన బిర్యానీ పార్శిల్ ఏటీఎం నుంచి అందుబాటులోకి వస్తుంది. -
బొంగు బిర్యానీ, బకెట్ బిర్యానీ, కుండ బిర్యానీ.. యాక్ ఛీ! బాత్రూం బిర్యానీ!
ప్రశాంత్‌నగర్ (సిద్దిపేట): ఘుమఘుమలాడే బిర్యానీ అంటే ఎవరికై నా ఇష్టమే.. కానీ బిర్యానీ తయారీకి ఉపయోగించే బియ్యం కడిగేది బాత్రూంలోని నీటితో అని తెలిస్తే?.. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ఓ రెస్టారెంట్లో బిర్యానీకి ఉపయోగించే బియ్యాన్ని బాత్రూంలోని నీటితో శుభ్రపరుస్తున్నారు. దీన్ని ఓ వినియోగదారుడు వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో వైరల్ అయ్యింది. ఈ వీడియోలో.. ఎందుకు బాత్రూంలో బిర్యానీ బియ్యం కడుగుతున్నారని నిర్వాహకుల్ని వినియోగదారుడు ప్రశ్నిస్తే.. నీటి సమస్య వల్ల ఇలా చేస్తున్నట్టు ఇచ్చిన సమాధానం స్పష్టంగా వినిపిస్తోంది. దీంతో నెటిజన్లు.. ‘బొంగు బిర్యానీ, బకెట్ బిర్యానీ, కుండ బిర్యానీ, బిందె బిర్యానీ, స్టీల్ డబ్బా బిర్యానీ.. ఇలా చాలా రకాలను మీరు చూసి ఉంటారు.. కానీ మా సిద్దిపేటలో సరికొత్త బిర్యానీ ఆవిష్కరించారు.. అదే బాత్రూం బిర్యానీ.. తినండి సూపర్ టేస్ట్’.. అంటూ.. సోషల్‌మీడియాలో సైటెర్లు విసురుతున్నారు. (చదవండి: రాష్ట్రంలో పెద్ద పులుల గాండ్రింపు!) -
Ramzan Special: 10 లక్షల బిర్యానీలు.. 4 లక్షల హలీమ్‌లు
సాక్షి, హైదరాబాద్: రంజాన్ మాసంలో హైదరాబాదీలు అభి‘రుచి’తీరా పండుగ చేసుకున్నారు. తరచూ తినే బిర్యానీల నుంచి పండుగ స్పెషల్ హలీమ్, మిఠాయి వంటకాల దాకా భారీగా లాగించేశారు. కేవలం ఒక్క ఫుడ్ డెలివరీ యాప్ స్విగ్గీ ద్వారానే ఏకంగా పది లక్షల బిర్యానీలు, 4 లక్షల హలీమ్‌లు ఆర్డర్ చేసి తెప్పించుకున్నారు. అన్ని రకాల వంటకాలు కూడా గతేడాదితో పోలిస్తే 20% ఎక్కువగా తెప్పించుకుని తిన్నారు. గురువారం స్విగ్గీ ఈ వివరాలను వెల్లడించింది. ఒక్క యాప్ ద్వారానే ఇంత ఫుడ్ లాగించేస్తే.. మిగతా యాప్‌లు, నేరుగా హోటళ్లలో తిన్న బిర్యానీలు, హలీమ్‌లు లెక్క ఇంకెంత పెద్దగా ఉంటుందో అర్థమవుతోందని నగరవాసులు చెప్తున్నారు. హలీమ్‌కు గులామ్.. రంజాన్ మాసంలో ఎప్పటిలాగే హలీమ్ కోసం ఆర్డర్లు వెల్లువెత్తాయి. తమ యాప్ ద్వారా 4 లక్షలకుపైగా హలీమ్‌లను ఆర్డర్ చేశారని స్విగ్గీ తెలిపింది. పండుగ స్పెషల్ హలీమ్ ఉన్నా బిర్యానీకి క్రేజ్ తగ్గలేదని పేర్కొంది. బిర్యానీ రాజధానిగా పేరును నిలబెట్టుకుంటూ తమ యాప్ ద్వారా 10 లక్షల బిర్యానీలను ఆర్డర్ చేశారని.. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఇది 20% ఎక్కువని వెల్లడించింది. చికెన్, పాలమూరు పొట్టేల్, పర్షియన్ స్పెషల్, ఇరానీ, డ్రైఫ్రూట్ వంటి హలీమ్‌లు అమ్ముడయ్యాయి. మరిన్ని వంటకాలకూ డిమాండ్ రంజాన్ సందర్భంగా మల్పువా, ఫిర్నీ, రబ్రీ వంటి మిఠాయి వంటకాలకూ డిమాండ్ పెరిగింది. ఈ స్పెషల్ ఐటమ్స్‌కు సంబంధించిన ఆర్డర్లు 20% పెరిగాయని స్విగ్గీ తెలిపింది. అత్యంత ప్రజాదరణ పొందిన ఖర్జూరంతో చేసిన ఇఫ్తార్ వంటకాలు, సమోసాలు, భాజియాలు ఉన్నాయని వివరించింది. రుచులకు చిరునామాలివీ.. హైదరాబాద్‌లో బిర్యానీ, హలీమ్ తదితర రుచులకు పేరొందిన ప్రముఖ రెస్టారెంట్లు పిస్తాహౌస్, ప్యారడైజ్, మెహఫిల్ తదితరాలకు భారీగా ఆర్డర్లు వెల్లువెత్తాయి. ఇక దాదాపు 5లక్షల వరకు డ్రైఫ్రూట్స్, ఖర్జూరాలకు సంబంధించిన ఆర్డర్లు వచ్చాయని స్విగ్గీ తెలిపింది. -
హైదరాబాద్‌లో 59 రూపాయలకే చికెన్ బిర్యానీ..ఎక్కడో తెలుసా
ఫుడ్ అన్నింటిలోనూ బిర్యానీకి క్రేజే వేరు. స్నాక్స్, స్టాటర్స్ అన్నింటికంటే ఎక్కువగా ఇష్టపడి తినేది బిర్యానీనే.. ఘుమ ఘుమలాడే బిర్యానిని టేస్ట్ చేయని వారు ఎవరు ఉంటారు చెప్పండి. వారానికి ఒకసారి అయినా బిర్యానీ నోట్లో పడాల్సిందే. అంతలా ఇష్టపడుతుంటారు. దేశంలో బిర్యానీ ప్రియుల సంఖ్య నానాటికీ పెరుగుతోంది. కస్టమర్ల అభిరుచికి, ఆదరణకు తగినట్లుగా సరికొత్త పద్ధతి రుచుల్లో ఫుడ్ అందుబాటులోకి వస్తున్నాయి. అయితే ఏ హోటల్, రెస్టారెంట్‌కు వెళ్లినా బిర్యానీ ధర ఎంత కాదన్న 200 ఉంటుంది. రెస్టారెంట్, టేస్ట్‌ను బట్టి ఇంక ధర ఎక్కువ కూడా ఉంటుంది. కానీ ఎప్పుడైనా బిర్యానీని రూ.59 రూపాయలకే రుచి చూశారా?.. వినడానికి ఆశ్యర్యంగా ఉంది కదూ!.. కానీ ఓ హోటల్ వాళ్లు నిజంగానే 59 రూపాయలకు బిర్యానీని అందిస్తున్నారు. ఈ బిర్యానీ పాయింట్ ఎక్కడో కాదు మన హైదరాబాద్‌లోనే. ‘కాకా 55’ బిర్యానీ పాయింట్లో 59 రూపాయలకే చికెన్ బిర్యానీ లభిస్తోంది. దమ్ బిర్యానీ 59 రూపాయలు ఉండగా.. ఇద్దరు తినాలనుకుంటే 120 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. అంతేగాక ఫ్రై బిర్యానీ కూడా రూ. 70కే దొరుకుతుంది. వీరికి హైదరాబాద్‌లో 3 ఔట్లెట్స్ ఉన్నాయి. నాంపల్లి బీజేపీ కార్యాలయం, కూకట్పల్లి సెకండ్ ఫేజ్, మూడో ఫేజ్ దగ్గర ఉన్నాయి. ఒక్కో హోటల్ వద్ద రోజూ 250 ప్లేట్స్ వరకూ సేల్స్ చేస్తున్నారు. ఆర్డర్లపై కూడా బిర్యానీ తయారు చేసి అందిస్తారు. ఏ పార్టీ ఉన్నా ఒక రోజు ముందు చెప్తే నోరూరించే బిర్యానీ ఆర్డర్ మనముందు ఉంచుతారు. కాస్ట్ తక్కువ ఉన్నా.. రుచి సూపర్‌గా ఉంటుందని అక్కడ తిన్నవారు చెబుతున్నారు. ఇంత తక్కువ ధరకు బిర్యానీ లభించడం హైదరాబాద్‌లోనే ఫస్ట్ టైం. మరి మీరూ కూడ టేస్ట్ చేయాలనుకుంటే కాకా 55 బిర్యానీ వద్దకు వెళ్లాల్సిందే.. వీళ్లకు స్విగ్గీ జొమాటలో కూడా సదుపాయం ఉంది. -
హలీం ఎలా తయారు చేస్తారంటే..
ఘుమఘుమలాడే సువాసనలు వెదజల్లుతూ.. నోట్లో వేసుకుంటే కరిగిపోయే.. హలీం, హరీస్.. రుచి అత్యంత మధురం.. వీటి పుట్టుపూర్వోత్తరాల్లోకెళితే.. హలీం, హరీస్‌ను తొలుత అరబ్ దేశాలలో మాత్రమే తయారు చేసేవారు. క్రమంగా ప్రపంచ వ్యాప్తంగా విస్తరించింది. మొఘల్ పాలకుల కాలంలో ఢిల్లీకి, నిజాం నవాబుల పరిపాలనలో హైదరాబాద్‌కు చేరిన హలీం, హరీస్ రుచులను తెలుగు సంస్కృతి మరింతగా ఆదరించింది. ఆ తరువాత అన్ని ప్రాంతాలకూ విస్తరించింది. బిర్యానీ ఎప్పుడూ ఉండేదే.. హలీం, హరీస్ మాత్రం రంజాన్ స్పెషల్. ఇల్లెందురూరల్: తెల్లవారుజామున సహరితో రోజా (ఉపవాస దీక్ష) ప్రారంభించి మనసంతా అల్హాహ్కి ఇచ్చేసినా, సాయంత్రం ఇఫ్తార్ వేళ ఏవరైనా హలీం, హరీస్‌లను రుచి చూడాల్సిందే. ప్రతిరోజూ పానీపూరీలు, పుల్కాలకు అలవాటు పడిన ప్రజలు రంజాన్ మాసంలో మాత్రం హలీం, హరీస్లే. ఇంతటి రుచికరమైన వంటకాలను ఆరగించేందుకు ముస్లింలతోపాటు అన్నివర్గాల ప్రజలు రంజాన్ మాసం కోసం ఎదురు చూస్తుంటారు. ఎలా తయారు చేస్తారంటే.. హలీం, హరీస్‌ల రుచి వంట మాస్టర్ తయారీ విధానంపైనే ఆధారపడి ఉంటుంది. వీటి తయారీ ప్రత్యేకంగా ఉంటుంది. దీన్ని రుచిగా తయారు చేయడానికి వంట మాస్టర్లు పడే శ్రమ అంతా ఇంతా కాదు. వీటిని తయారు చేసేందుకు ముందుగా ప్రత్యేకమైన మట్టి బట్టీ సిద్ధం చేస్తారు. దీనిలో పెద్ద పాత్ర ఉంచి కట్టెలతో మంట చేస్తారు. నానబెట్టిన గోధమ రవ్వ లేదా గోధుమలు వేసి హలీంకు అయితే మటన్, హరీస్‌కు అయితే చికెన్. ముక్కలు దానిలో వేసి నెయ్యి, నీరు పోసి ఉడికించడం ప్రారంభిస్తారు. ప్రతిరోజూ తెల్లవారు జామున ప్రారంభమైన ఈ వంటకం మధ్యాహ్నం 3 గంటలయితే కానీ పూర్తికాదు. అంతకు ముందే వేరుగా సిద్ధం చేసిన మసాలా దినుసులు, సుగంధ ద్రవ్యాలు వేసి ప్రత్యేకమైన కట్టె గంటెతో కలియబెట్టడం చేస్తారు. ఇలా 3, 4 గంటలు దంచడం, తిప్పడం చేస్తేనే పాత్రలో వేసిన ఆహార పదార్థాలన్నీ పేస్ట్‌లా తయారవుతాయి. దాన్ని ప్లేట్లలోకి తీసుకొని లెమన్, వేయించిన పల్చటి ఉల్లిగడ్డ ముక్కలతో కలిపి వడ్డిస్తారు. శేరువా కూడా ఇస్తారు. అలా.. పొగలు కక్కుతున్న హలీం, హరీస్‌లను నోట్లో వేసుకుంటే స్వర్గంలో ఉన్నట్టుంది అంటుంటారు వాటి రుచి చూసినవారు. అందుకే రంజాన్ మాసంలో మాత్రమే లభించే హలీం, హరీస్ రుచి చూసేందుకు ప్రజలు ఎదురు చూస్తుంటారు. పలు కూడళ్లలో విక్రయ కేంద్రాలు.. ఇంతకు ముందు చాలామంది హైదరాబాద్ వెళ్లి హలీం, హరీస్ రుచి చూసి ఇంటికి వచ్చాక నెలంతా మర్చిపోలేకపోయేవారు. మన ప్రాంతంలో కూడా లభిస్తే బాగుండని అల్లాను కోరుకునేవారు. అలాంటి వారి ఆశల ఫలితమేమో.. దశాబ్ధకాలంగా జిల్లా వ్యాప్తంగా ఇల్లెందు, కొత్తగూడెం, పాల్వంచ, మణుగూరు వంటి పట్టణ కేంద్రాలలో హలీం, హరీస్ సెంటర్లు వెలుస్తున్నాయి. ఫుడ్ రెస్టారెంట్లు, హోట ళ్లు కూడా ప్రత్యేకంగా హలీం, హరీస్ సెంటర్లను ఏర్పాటు చేసి ప్రతిరోజు సాయంత్రం రంజాన్ స్పెషల్ వంటకాలను ప్రత్యేకంగా అందిస్తున్నాయి. చాలా రుచిగా ఉంటుంది హలీం, హరీస్ పోషక విలువలతో కూడిన రుచికరమైన ఆహారం. రంజాన్ మాసంలో వీటిని ఇష్టపడని వారుండరు. గతంలో హైదరాబాద్ వంటిì నగరాలకు వెళ్లినప్పుడే మాత్రమే రుచిచేసే వాళ్లం. ఇప్పుడు అన్నిచోట్లా విక్రయించడం ఆనందంగా ఉంది. – సయ్యద్ అబ్ధుల్ భారీ, వెల్టింగ్ షాపు నిర్వాహకుడు, ఇల్లెందు అందుబాటు ధరల్లోనే.. హలీం తయారీ వెనుక ఎంత కష్టమున్నా అందరికీ అందుబాటులో ఉండే ధరల్లోనే విక్రయిస్తున్నాం. రంజాన్ మాసంలో హలీం రుచిని అందరికీ అందించాలనే లక్ష్యంతో ప్రత్యేకంగా స్టాల్‌ను ఏర్పాటు చేశాం. ఉపాధి కూడా ఉంటుంది. విక్రయాలు బావున్నాయి. – అమానుల్లాఖాన్, హలీం సెంటర్ నిర్వాహకుడు, ఇల్లెందు -
ఫుడ్ లవర్స్‌కు గుడ్ న్యూస్.. ఏటీఎంలో బిర్యానీ.. ఎక్కడుందో తెలుసా?
ATM.. ఈ పేరు వినగానే ఎవరికైనా డబ్బులు డ్రా చేసుకునే మిషన్ గుర్తొస్తుంది. వివిధ బ్యాంక్ ఖాతాదారులు ఏటీఎం కార్డుల ద్వారా డబ్బులు విత్ డ్రా చేసుకుంటారనే విషయం అందరికీ తెలిసిందే. ఇటీవల బంగారం కొనుక్కోవడానికి ఏటీఎం వచ్చాయి. తాజాగా మరో కొత్త ఏటీఎం అందుబాటులోకి వచ్చింది. భారత్‌లోనే మొట్టమొదటిసారి తమిళనాడులో బిర్యానీ ఏటీఎం తెరిచారు. దీని ద్వారా కేవలం నిమిషాల్లోనే వినియోగదారులు ఘుమఘుమలాడే బిర్యానీని పొందవచ్చు. చెన్నైకి చెందిన ఓ స్టార్టప్ కంపెనీ ఈ వినూత్న ఐడీయాతో ముందుకొచ్చింది. నగరంలోని కొలత్తూర్‌లో బాయ్ వీటు కల్యాణం (బీవీకే) ఈ బిర్యానీ ఏటీఎంలను ప్రారంభించింది. ఇది ప్రీమియం వెడ్డింగ్ స్టైల్ బిర్యానీని అందిస్తోంది. బిర్యానీకి ఉన్న డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకొని దీన్ని ఏర్పాటు చేసినట్లు దీని ప్రతినిధులు చెబుతున్నారు. దీనికి సంబంధించిన వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేయగా.. అది వైరల్ అయింది. ఇందులో ఫుడ్ ఎలా డెలివరీ అవుతుందో చూపిస్తోంది. ఈ బిర్యానీ ఏటీఎంలు ఎలా పనిచేస్తాయంటే.. సాధారణ ఏటీఎంల లోపల ఎలా ఉంటుందో ఈ బిర్యానీ ఏటీఎం కూడా అలాగే ఉంటుంది. ఈ ఔట్లెట్లో 32 అంగుళాలతో ఏర్పాటు చేసిన ఈ మెషిన్ లోని మెనూలో నుంచి కావాల్సిన బిర్యానీని టచ్ స్క్రీన్ పై ఎంచుకుని, పేరు, మొబైల్ నెంబర్ నమోదు చేయాల్సి ఉంటుంది. తరువాత బిర్యానీ ధరను డెయిట్/క్రెడిట్ కార్డులు లేదా యూపీఐ స్కానర్ ద్వారా చెల్లించాలి. డబ్బు చెల్లించిన అనంతరం స్క్రీన్‌పై కౌంట్ డౌన్ టైమర్ ఆన్ అవుతుంది. వేడి వేడి బిర్యానీ ఇంకెంత సేపట్లో వస్తుందో ఈ టైమర్ ద్వారా తెలుసుకోవచ్చు. నిర్ణీత సమయం పూర్తవగానే ఏటీఎం మెషిన్‌కు ఉన్న చిన్న డోర్‌ను తెరవగానే అందులోని బిర్యానీ పార్శల్‌ను తీసుకెళ్లిపోవడమే. సరికొత్త ఆలోచనతో వచ్చిన ఈ బిర్యానీ ఏటీఎం కస్టమర్లను ఆకట్టుకుంటుంది. దీనిపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. బీవీకే ఐడియా అద్భుతంగా ఉందంటూ కొనియాడుతున్నారు. చదవండి: ప్రాంక్ వీడియో.. తెలియక గర్ల్‌ఫ్రెండ్ ఎంత పని చేసిందంటే! View this post on Instagram A post shared by FOOD VETTAI (@food_vettai) -
క్యాన్సర్ డేంజర్ బెల్స్.. బయట ఫుడ్ ఎక్కువగా తినేవారికి అలర్ట్
విజయవాడ భవానీపురానికి చెందిన 42 ఏళ్ల వ్యాపారి శ్రీనివాస్(పేరు మార్చాం) అర్ధరాత్రి వరకూ బిజినెస్ వ్యవహారాలు చూస్తుంటారు. అనంతరం తరచూ స్నేహితులతో కలిసి బయట ఎక్కువగా నాన్‌వెజ్ వంటకాలు తింటుంటారు. ఇటీవల తరచూ కడుపునొప్పి రావడం, అరుగుదల తగ్గడంతో వైద్యుడి వద్దకు వెళ్లారు. వైద్యులు పరీక్షించి జీర్ణాశయ క్యాన్సర్‌గా నిర్ధారించారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామకు చెందిన ఓ ఉద్యోగి వారంలో నాలుగు రోజులు బయట హోటళ్లలో భోజనం చేస్తుంటాడు. నాన్‌వెజ్, బిర్యానీలు ఎక్కువగా తీసుకుంటుంటాడు. ఇటీవల ఆయనకు కడుపు నొప్పితో పాటు విరేచనంలో రక్తం పడటంతో వైద్యుడిని సంప్రదించాడు. పెద్ద పేగు క్యాన్సర్‌గా నిర్ధారణ అయింది. ఇలా వీరిద్దరే కాదు.. కల్తీ ఆహారం కారణంగా ఇటీవల పెద్దపేగు, జీర్ణాశయ, లివర్ క్యాన్సర్ కేసులు పెరుగుతున్నట్టు వైద్యులు చెబుతున్నారు. లబ్బీపేట(విజయవాడతూర్పు): ఆహారంలో కల్తీ, జీవనశైలి మార్పులు క్యాన్సర్‌కు దారితీస్తున్నాయి. ఇటీవల నమోదవుతున్న క్యాన్సర్ కేసులు వైద్యులను సైతం ఆందోళనకు గురిచేస్తున్నాయి. మధ్య వయస్సులోనే అన్నవాహిక క్యాన్సర్, జీర్ణాశయ, పెద్దపేగు, గర్భాశయ క్యాన్సర్ల బారిన పడుతున్నారు. అర్ధరాత్రి దాటాక కూడా రెస్టారెంట్లు, ఫుడ్ కోర్టుల్లో బిర్యానీల వంటివి ఎక్కువగా తీసుకోవడంతో పలువురికి జీర్ణాశయ వ్యాధులు మొదలై.. అనంతరం క్యాన్సర్‌కు దారి తీస్తున్నాయి. సమయ పాలన లేని ఆహారపు అలవాట్లు కొంపముంచుతున్నాయి. ఇటీవల నగరంలో నమోదవుతున్న క్యాన్సర్ కేసులు ఆందోళన కలిగిస్తున్నాయని వైద్యులు చెబుతున్నారు. నాలుగు పదుల వయస్సులోనే జీర్ణాశయ, పెద్దపేగు, లివర్ క్యాన్సర్ సోకుతున్నట్టు చెబుతున్నారు. అప్రమత్తం కాకుంటే రానున్న కాలంలో పెను ముప్పు పొంచి ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. కొంపముంచుతున్న కల్తీలు నాన్‌వెజ్ వంటకాలు ఆకర్షణీయంగా కనిపించేందుకు రసాయనాలు కలిసిన కారంపొడులను ఎక్కువగా వాడుతుంటారు. అంతేకాకుండా కొన్ని చోట్ల మృత జంతువుల కొవ్వు నుంచి తయారు చేసిన కల్తీ నూనెలను వినియోగించి వంటలు చేస్తుండటంతో జీర్ణకోశ వ్యాధులు పెరుగుతున్నాయని చెపుతున్నారు. కల్తీ ఆహారం జీర్ణకోశ, పెద్దపేగు, అన్నవాహిక క్యాన్సర్లకు కారణమవుతోందని, బయట ఆహారం తినడం సాధ్యమైనంత తగ్గించడం ఉత్తమమని వైద్యులు చెబుతున్నారు. మహిళల్లో ఒకప్పుడు బ్రెస్ట్, సర్వైకల్ క్యాన్సర్ కేసులు ఎక్కువగా నమోదయ్యేవి. ప్రస్తుతం సర్వైకల్ క్యాన్సర్ కేసులు తగ్గగా.. జీవనశైలి కారణంగా బ్రెస్ట్ క్యాన్సర్ కేసులు ఎక్కువగా నమోదవుతున్నట్టు వైద్యులు చెబుతున్నారు. అలాగే గర్భాశయ క్యాన్సర్ కేసులూ పెరుగుతున్నాయని చెబుతున్నారు. శారీరక శ్రమ లేకపోవడం, ఒబెసిటీ కారణంగా పట్టణవాసులు ఎక్కువగా గర్భాశయ క్యాన్సర్ల బారినపడుతున్నారని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అత్యవసరమైతేనే బయట తినాలి ఇటీవల జీర్ణాశయ, పెద్ద పేగు క్యాన్సర్లు పెరిగాయి. కల్తీ ఆహారం, నాన్‌వెజ్ ఎక్కువుగా తీసుకోవడమే దీనికి కారణంగా చెప్పొచ్చు. ఆహార పదార్థాలు కల్తీ అవుతున్న నేపథ్యంలో అత్యవసరమైతేనే బయట తినాలి. మాంసాహారంలో కలిపే రసాయనిక రంగులు క్యాన్సర్‌కు దారి తీస్తున్నాయి. – డాక్టర్ ఏవై రావు, క్యాన్సర్ వైద్య నిపుణులు -
ఇండియాలోనే బిగ్గెస్ట్ బిర్యానీ ప్లేట్.. ఒకేసారి 15-20 మంది తినేయొచ్చు
సాక్షి, హైదరాబాద్: శాకాహారం మాత్రమే తినే తనపేరిట మాంసాహార బిర్యానీ రావడం సంతోషంగా ఉందని నటుడు సోనూసూద్ పేర్కొన్నారు. కొండాపూర్‌లోని జిస్మత్ జైల్ మండి రెస్టారెంట్లో శనివారం సోనూసూద్ ఇండియాస్ బిగ్గెస్ట్ బిర్యానీ ప్లేట్‌ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎనిమిది అడుగుల విస్తీర్ణంలో ఉండే బిగ్గెస్ట్ ప్లేట్ బిర్యానీని ఒకేసారి 15 నుంచి 20 మంది తినవచ్చన్నారు. ఈ సందర్భంగా జిస్మత్ మండి నిర్వాహకులు గౌతమి, ధర్మ, గౌతమ్‌లను ఆయన అభినందించారు. త్వరలో విజయవాడ, గుంటూరు, నెల్లూరు, బెంగళూరులో బిగ్గెస్ట్ బిర్యానీ ప్లేట్‌ను సోనూసూద్‌తో అందుబాటులోకి తెస్తామని నిర్వాహకులు తెలిపారు. వృద్ధాశ్రమం ఏర్పాటు చేస్తా.. రాష్ట్రంలో ఒక వృద్ధాశ్రమం ఏర్పాటు చేస్తానని సినీ/చారిటీ స్టార్ సోనూసూద్ వెల్లడించారు. హైదరాబాద్‌తో తనకు దగ్గర అనుబంధం ఉందనీ, తన భార్య తెలుగు మహిళని తెలిపారు. నగరానికి చెందిన ఫిక్కీ లేడీస్ క్లబ్ ఆర్గనైజేషన్ (ఎఫ్ఎల్ఓ) ఆధ్వర్యంలో సోమాజిగూడలోని ఓ హోటల్లో ఏర్పాటు చేసిన ముఖాముఖిలో ఆయన మహిళా వ్యాపారవేత్తలతో మాట్లాడారు. ఆయనేమన్నారంటే.. ‘కరోనా తీవ్రత తగ్గిపోయినా సమస్యలతో మమ్మల్ని సంప్రదించేవారు తగ్గలేదు. ప్రస్తుతం షిరిడీలో ఒక వృద్ధాశ్రమం ఏర్పాటు చేస్తున్నాం. అలాగే తెలంగాణలో మరొకటి రానుంది. పంజాబ్‌లో దీనికి సంబంధించిన పనులు ప్రారంభమయ్యాయి సమీప భవిష్యత్తులో ప్రతి రాష్ట్రంలోనూ వృద్ధాశ్రమం, ఓ ఉచిత పాఠశాల ఉండేలా చూడాలనేది మా కోరిక. చాలా రాజకీయ పార్టీలు నన్ను తమవైపు తిప్పుకునేందుకు శాయశక్తులా ప్రయత్నించిన మాట వాస్తవమే. ఇప్పటికిప్పుడు రాజకీయాల్లోకి వచ్చే ఆసక్తి నాకు లేదు. చిత్ర పరిశ్రమలో ఇంకా చాలా చేయాల్సి ఉంది. చెక్‌లు అందించి సాయం చేయడం మాత్రమే కాదు.. చెక్‌లు అందించి, చారిటీలు చేసే వారు చాలా మంది ఉన్నారు. అయితే పర్సనల్ టచ్ చాలా ముఖ్యం. ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతున్న బాలికను నాగ్‌పూర్ నుంచి హైదరాబాద్‌కు విమానంలో తరలించాం. ఆమె సోదరుడు తోడుగా వచ్చాడు. కానీ, దురదృష్టవశాత్తూ ఆమెను రక్షించలేకపోయాం. ఆ తర్వాత ఆమె సోదరుడు కూడా మృతి చెందాడు. ఆమె తల్లిదండ్రులు తమ ఇద్దర్నీ కోల్పోయారు. దీంతో వీలైనప్పుడల్లా నాగ్‌పూర్‌లోని వారి తల్లిదండ్రులను కలవడం అలవాటు చేసుకున్నా. ఇదే నేను ఇష్టపడే పర్సనల్ టచ్.. అని సోనూసూద్ చెప్పారు. చదవండి: పబ్‌లు, ఫామ్‌హౌజ్‌లపై పోలీస్ రైడ్స్ -
కేరళలో మండి బిర్యానీ తిని యువతి మృతి.. వారంలో రెండో ఘటన
కేరళలోని కొట్టాయంలో ఇటీవల(డిసెంబర్ 29) ఓ ఈవెంట్లో ఆహారం తిని నర్సు అస్వస్థతకు గురై చనిపోయిన విషయం తెలిసిందే. ఫుడ్ పాయిజన్ కారణంగానే ఆమె మరణించినట్లు వార్తలు వినిపించాయి. ఈ ఘటన జరిగిన వారం రోజుల వ్యవధిలోనే రాష్ట్రంలో మరో విషాదం చోటుచేసుకుంది. మండి బిర్యానీ తిని 20 ఏళ్ల యువతి మృతిచెందింది. ఈ ఘటన కూడా ఫుడ్ పాయిజనింగ్‌కు సంబంధించి అనుమానాస్పద కేసుగా అనుమానిస్తున్నారు. వివరాలు.. కాసర్గోడ్ సమీపంలోని పెరుంబళకు ఎందిన అంజు శ్రీ పార్వతి డెసెంబర్ 31న రొమేనియా అనే రెస్టారెంట్ల నుంచి మండి బిర్యానీ (కుజిమంతి/కుళిమంతి) ఆర్డర్ చేసుకుంది. బిర్యానీ తిన్న తర్వాత అనారోగ్యానికి గురికావడంతో ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి మంగళూరులోని మరో ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ శనివారం ఉదయం మరణించింది. బాధితురాలి తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఫోరెన్సిక్ నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. మరోవైపు ఈ ఘటనపై రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జ్ విచారణకు ఆదేశించారు. ఈ ఘటనపై నివేదిక ఇవ్వాలని ఫుడ్ సేఫ్టీ కమిషనర్‌కు ఆదేశాలు జారీ చేశారు. మంత్రి ఆదేశాలంతో బాలిక తీసుకున్న ఆహారం, ఆమెకు అందించిన చికిత్సపై అధికారులు ఆరాతీస్తున్నారు. ఫుడ్ పాయిజనింగ్‌కు గురైన హోటళ్ల లైసెన్స్‌ను ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ యాక్ట్ (ఎఫ్ఎస్ఎస్ఏ) కింద రద్దు చేస్తామని తెలిపారు. చదవండి: Video: బాప్రే..! డ్రెస్ బటన్లలో కొకైన్.. రూ. 47 కోట్ల విలువైన డ్రగ్స్ సీజ్ -
ఐదు పైసలకే బిర్యానీ.. క్యూ కట్టిన జనం.. పోలీసుల లాఠీ చార్జ్
సాక్షి, బొమ్మలసత్రం: డిసెంబర్ 31 (2022 చివరి రోజు) సందర్భంగా నంద్యాల పట్టణంలోని క్లాసిక్ జైల్ రెస్టారెంట్ నిర్వాహకులు పాత 5 పైసల నాణెం ఇస్తే బిర్యానీ ఇస్తామంటూ ఆఫర్ ఇచ్చారు. దీని కోసం 5 పైసల నాణేలు తీసుకొచ్చి వందల మంది స్థానిక పద్మావతి నగర్‌లోని రెస్టారెంట్ వద్ద గుమిగూడారు. ప్రజలు భారీగా తరలిరావటంతో రహదారిలో ట్రాఫిక్ జామ్ అయింది. బిర్యానీ కోసం జనాల మధ్య తోపులాట జరిగింది. ఇంతలో అక్కడికి చేరుకున్న పోలీసులు స్వల్పంగా లాఠీ చార్జ్ చేయాల్సి వచ్చింది. జనాలను అక్కడి నుంచి పంపి రెస్టారెంట్‌కు పోలీసులు తాళం వేశారు. ఇందుకు కారణమైన రెస్టారెంట్ నిర్వాహకులపై కేసు నమోదు చేస్తామని డీఎస్పీ మహేశ్వరరెడ్డి తెలిపారు. చదవండి: (రేషన్ కార్డుదారులకు ఏపీ ప్రభుత్వం గుడ్‌న్యూస్) -
Warangal: బిర్యానీలో బొద్దింక
సాక్షి, వరంగల్: వరంగల్ హంటర్ రోడ్డులోని అవంత గ్రాండ్ హోటల్ నిర్వాహకుల అజాగ్రత్త వల్ల బిర్యానీలో బొద్దింక ప్రత్యక్షమైంది. స్థానికులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. అవంత గ్రాండ్ హోటల్‌కు బిర్యానీ తినేందుకు కొంత మంది యువకులు మంగళవారం మధ్యాహ్నం వెళ్లారు. వారికి వడ్డించిన బిర్యానీలో బొద్దింక కనిపించింది. దీంతో బల్దియా ఎంహెచ్ఓ రాజేష్‌కు ఫిర్యాదు చేశారు. బల్దియా అధికారులు అక్కడికి చేరుకుని బిర్యానీని పరిశీలించి హోటల్ నిర్వాహకులకు రూ.15వేల జరిమానా విధించినట్లు ఇన్స్పెక్టర్ వెంకన్న తెలిపారు. ఆ తర్వాత అదే యువకులపై హోటల్ నిర్వాహకులు మామునూరు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. చదవండి: వెజ్ బిర్యానీలో మాంసం బొక్కలు ప్రత్యక్షం.. కంగుతిన్న వ్యక్తి ఏం చేశాడంటే.. -
Hyderabad: చికెన్ బిర్యానీలో ఈగ.. బిర్యానీ హౌజ్‌కు జరిమానా
సాక్షి, హైదరాబాద్: ఓ బిర్యానీ హౌజ్ నిర్వాహకులకు రూ. 10 వేల జరిమానా విధిస్తూ వినియోగదారుల ఫోరం ఆదేశాలు జారీచేసినట్లు బాధితుడు బస్వరాజుల రాజేష్ బుధవారం వివరించారు. ఓయూ క్యాంపస్ న్యాయ కళాశాలలో చదువుతున్న రాజేష్ గత ఏడాది అక్టోబర్ 21న నల్లకుంటలోని ఓ బిర్యానీ హౌస్‌లో భోజనం చేస్తున్న సమయంలో ఈగ వచ్చింది. ఈ విషయాన్ని ఆయన నిర్వాహకులకు ఫిర్యాదు చేశారు. అయితే నిర్వాహకులు పట్టించుకోకుండా బిర్యానీకి బిల్లు వసూలు చేశారు. దీంతో రాజేష్ వినియోగదారుల ఫోరంలో కేసు వేశారు. ఫోరం వారు కేసును విచారణ చేపట్టి ఫిర్యాదుదారుడికి నష్టపరిహారంగా రూ. 10 వేలు చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది. తనకు జరిగినట్లు మరొకరికి జరగకూడదనే ఫోరంలో కేసు వేసినట్లు రాజేష్ పేర్కొన్నారు. చదవండి: (Hyderabad: పాతబస్తీకి మెట్రో కలేనా..?) -
చోటా సన్మాన్.. బడా దావత్! ప్లేట్ బిర్యానీకి రూ.700? మరో విశేషం ఏంటంటే!
సాక్షి, సిటీబ్యూరో: ప్రజాధనం దుర్వినియోగమవుతోంది. ధార్మిక సేవల కోసం వినియోగించాల్సిన సర్కారీ సొమ్ము పక్కదారి పడుతోంది. యాత్రికులకు ఉత్తమ సేవలు అందించినవారికి అవార్డుల పేరుతో హజ్ కమిటీ భారీగా నిధులను దుబారా చేసింది. ఆతిథులకు మెగా విందును ఏర్పాటు చేసి ఖజానాకు గండికొట్టింది. ప్లేట్ బిర్యానీకి ఏకంగా రూ.700 చెల్లించి భారీగా వెనకేసుకుంది. కేవలం 200 మంది అతిథులను మాత్రమే ఆహ్వానించినట్లు చెప్పుకున్న కమిటీ.. బిల్లుల చెల్లింపుల వరకు వచ్చేసరికి ఈ సంఖ్యను 350 చేసేసింది. ఇలా ఏకంగా రూ.3.5 లక్షలను ఈ దావత్‌కు వెచ్చించింది. మరో విచిత్రమేమింటే.. ఈ ఆతిథ్యమిచ్చిన హోటల్ హజ్ కమిటీ చైర్మన్‌ది కావడం మరో విశేషం. హజ్ యాత్రికుల కోసం శిబిరం ఏర్పాటు చేసేందుకు ఏటా బడ్జెట్లో రూ.2 కోట్లను ప్రభుత్వం కేటాయిస్తోంది. ఈ నిధులకు అదనంగా చైర్మన్ పలుకుబడిని ఉపయోగించి మరో రూ.2 కోట్లను ప్రభు త్వం నుంచి రాబట్టారు. ఆర్థిక సంవత్సరం దగ్గర పడుతుండటంతో మంచినీళ్లలా నిధులను ఖర్చు చేస్తున్న హజ్ యంత్రాంగం.. లెక్కా పద్దు కూడా చూసుకోవడంలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. (చదవండి: NGRI Hyderabad: ఆ గనుల్లో బంగారం కంటే విలువైన లోహం) -
అర్థరాత్రి ప్రభాస్ చేసిన ఆ పనికి ఫిదా అయిన సూర్య
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ మంచి భోజన ప్రియుడు అనే విషయం అందరికి తెలిసిందే. కొత్త కొత్త రుచులను ఆస్వాదించడం ఆయనకు అలవాటు. షూటింగ్ సమయంలో కూడా యూనిట్ మొత్తానికి తరచూ ఇంటి నుంచి భోజనం తెప్పిస్తుంటాడు. ఆయన ఇచ్చే ఆతిథ్యం గురించి సహ నటీనటులందరూ తరచూ చెబుతుంటారు. దీపికా పదుకొణె మొదలు అమితాబ్ వరకు చాలా మంది స్టార్స్ ప్రభాస్ ఆతిథ్యంపై ప్రశంసల వర్షం కురిపించారు. తాజాగా తమిళ్ స్టార్ సూర్య కూడా ప్రభాస్ ఆతిథ్యంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ప్రభాస్ తనకోసం చేయించిన బిర్యాని అద్భుతంగా ఉందని, జీవితంలో అంత టేస్టీ బిర్యాని తినలేదని చెప్పుకొచ్చాడు. తాజాగా సూర్య ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘నేను ఒకసారి షూటింగ్ కోసం హైదరాబాద్ వెళ్లాను. విషయం తెలుసుకున్న ప్రభాస్.. నన్ను డిన్నర్‌కి ఆహ్వానించగా.. సాయంత్రం 6 గంటలకు వస్తానని చెప్పాను. కానీ నా షూట్ పూర్తయ్యేసరికి రాత్రి 11 అయ్యింది. దాంతో టైమ్ అయిపోయింది ఇక డిన్నర్ కుదరదనుకుని.. ప్రభాస్‌కు సారీ చెబుదామనుకున్నా. రాత్రి 11.30గంటలకు హోటల్లో ప్రభాస్‌ని కలిశాను. షాకింగ్ ఏంటీ అంటే నా రూమ్‌కి వచ్చిన ప్రభాస్..‘ మీ కోసమే వెయిట్ చేస్తున్నా సర్..బిర్యానీ రెడీగా ఉంది. త్వరగా వచ్చేయండి ’అని అన్నారు. అయితే అది హోటల్ లేదా ప్రొడక్షన్ హౌస్ మెస్ నుంచో తెప్పించారేమో అనుకున్నా. కానీ వాళ్ల ఇంటి నుంచి అమ్మ చేసిన భోజనాన్ని తెప్పించాడు. నేను వచ్చే వరకు ప్రభాస్ తినకుండా నా కోసం ఎదురు చూశాడు. నా జీవితంలో అంత రుచికరమైన బిర్యానీని ఎప్పుడూ తినలేదు’ అని సూర్య చెప్పుకొచ్చాడు. -
ఇంగ్లండ్, పాకిస్తాన్ ఫైనల్.. బిర్యానీ కథ తెలుసుకోవాల్సిందే
అది 1992వ సంవత్సరం. పాకిస్తాన్, ఇంగ్లండ్ మధ్య మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్లో ఫైనల్ మ్యాచ్. ఆ మ్యాచ్‌లో అప్పటి పాక్ ఫాస్ట్‌బౌలర్ వసీం అక్రమ్ ఆల్‌రౌండ్ ప్రదర్శనతో జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. ముందు బ్యాటింగ్‌లో 33 పరుగులు చేసిన అక్రమ్.. ఆ తర్వాత బౌలింగ్‌లో మూడు కీలక వికెట్లు తీసి ఇంగ్లండ్‌ను శాసించాడు. అలా ఇమ్రాన్ ఖాన్ కెప్టెన్సీలో పాకిస్తాన్ తొలిసారి వరల్డ్‌కప్‌ను ముద్దాడింది. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచిన వసీం అక్రమ్ మాట్లాడుతూ.. మ్యాచ్‌కు ముందు రోజు రాత్రి తిన్న బిర్యానీ వల్లే ఈ ప్రదర్శన అంటూ సరదాగా కామెంట్ చేశాడు. అక్రమ్ మాటలు విన్న ఇప్తికర్ షా అనే వ్యక్తి తెగ సంతోషపడిపోయాడు.ఇఫ్తికర్ షా అంత సంతోషపడడానికి కారణం ఏంటో తెలుసా.. అక్రమ్ తిన్న బిర్యానీ ఈయన తయారు చేసిందే. అప్పటికే ఇప్తికర్ షా ఆస్ట్రేలియాకు వలస వెళ్లి 10 సంవత్సరాలైంది. 1992 వన్డే వరల్డ్‌కప్‌కు ఆస్ట్రేలియా ఆతిథ్యం ఇస్తుందని తెలియగానే.. తన స్వంత దేశమైన పాకిస్తాన్ ఆటగాళ్లకు బిర్యానీ రుచి చూపించాలని నిర్ణయం తీసుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న అక్రమ్ ఇప్తికర్ను తన వద్దకు పిలుపించుకొని బిర్యానీ చేసి పెట్టాలని ఆర్డర్ వేశాడంట. అక్రమ్ మాటలకు తెగ సంతోషపడిపోయిన ఇప్తికర్ ఎంతో ప్రేమతో బిర్యానీ తయారు చేసి అక్రమ్ సహా పలువురు ఆటగాళ్లకు రుచి చూపించాడు. కట్‌చేస్తే సరిగ్గా 30 సంవత్సరాల తర్వాత అదే పాకిస్తాన్ జట్టు మెల్బోర్న్ వేదిగా ఆదివారం(నవంబర్ 13న) ఇంగ్లండ్‌తో టి20 ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ ఆడనుంది. కొన్ని గంటల్లో మొదలుకానున్న ఫైనల్లో ఎవరు విజేతగా నిలుస్తారనేది ఆసక్తికరంగా మారింది. అయితే ఫైనల్ మ్యాచ్‌కు ముందురోజు అంటే శనివారం పాక్ ఆటగాళ్లు మెల్బోర్న్లోని షా మింట్ అండ్ యునివర్సిటీ ఫుడ్ స్ట్రీట్‌కు వెళ్లారు. అక్కడ తమకు ఇష్టమైన బిర్యానీ తిని ఇప్తికర్ షాను సంతోషపెట్టారు. 1992లో పాకిస్తాన్ వన్డే వరల్డ్‌కప్ గెలిచిన సమయంలో ఇప్తికర్ షా బిర్యానీ తినే తాను ఈ ప్రదర్శన చేసినట్లు అక్రమ్ అప్పట్లో మీడియాకు తెలపడం బాగా వైరల్ అయింది. అందుకే తాజాగా టి20 ప్రపంచకప్‌లో ఫైనల్ చేరిన పాక్ సెంటిమెంట్ ప్రకారం ఇప్తికర్ షా వద్దకు వచ్చి బిర్యానీ తిని వెళ్లారు. ఇక మ్యాచ్‌లో విజయం తమదేనని పాక్ జట్టు బలంగా నమ్ముతుంది. ఇది నిజమవుతుందో లేదో తెలియదు కానీ పాక్ ఆటగాళ్ల వల్ల తన బిర్యానీకి మంచి పేరు వచ్చిందని ఇఫ్తికర్ షా తెగ సంతోషపడుతూ పేర్కొన్నాడు. చదవండి: T20 WC 2022: ఫైనల్‌కు ముంగిట ఇంగ్లండ్ జట్టుకు బ్యాడ్ న్యూస్ -
భార్యాభర్తల మధ్య బిర్యానీ పంచాయితీ.. తనకూ కావాలని అడిగినందుకు
సాక్షి, చెన్నై: బిర్యానీ పంచాయితీ ఓ నిండు ప్రాణాన్ని బలిగొంది. క్షణికావేశంలో భర్త భార్యకు నిప్పటించడంతో ఆమె కన్నుమూసింది. ఈ ఘటన చెనైలోని ఠాగూర్‌నగర్, అయనవరంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రిటైర్డ్ రైల్వే ఉద్యోగి కరుణాకరణ్ (75), పద్మావతి (66) దంపతులు. వారికి ఇద్దరు కూతుళ్లు, ఇద్దరు కుమారులు. అందరికీ పెళ్లిళ్లయ్యాయి. ఎవరికి వారు భార్యబిడ్డలతో విడిగా ఉంటున్నారు. కరుణాకరణ్, పద్మావతి మరో చోట నివాసమంటున్నారు. ఒంటరిగా ఉండటం, వయసురిత్యా కారణాలతో పద్మావతి కొద్ది నెలలుగా మానసిక సమస్యలను ఎదుర్కొంటోంది. ఈక్రమంలోనే ఆ వృద్ధ భార్యభర్తలమధ్య సఖ్యత కొరవడింది. నిత్యం ఏదో ఒక విషయంలో గొడవపడుతుండేవారు. ఒకే ఇంట్లో ఉంటున్నా ఇద్దరూ మాట్లాడుకునేవారు కాదు. పిల్లలతో కూడా వారికి విభేదాలున్నాయి. ఇక మనస్పర్థల కారణంగా కరుణాకరణ్ కూడా భార్య బాగోగులు సరిగా చూసుకునేవాడు కాదు. ఆమెకు భోజనం కూడా ఉండేది కాదు. ఈ నేపథ్యంలో కరుణాకరణ్ మంగళవారం రాత్రి బయట నుంచి బిర్యానీ తెచ్చుకున్నాడు. ఆయనొక్కడే ఆరగించాడు. దీంతో రగిలిపోయిన పద్మావతి తనకు కూడా బిర్యానీ కావాలని ఆయనతో గొడవపడింది. (చదవండి: ఏడాది నుంచి మాటువేసి.. పొదల్లోకి లాక్కెళ్లి యువతిపై అత్యాచారం) ఇద్దరి మధ్య మాటామాటా పెరిగి తీవ్ర వాగ్వివాదానికి దారితీసింది. ఆవేశానికి లోనైన కరుణాకరణ్ ఇంట్లో ఉన్న కిరోసిన్‌ను పద్మావతిపై పోసి నిప్పటించాడు. ఆమె హాహాకారాలు చేస్తూ భర్తను పట్టుకుంది. ఇద్దరూ మంటల్లో తీవ్రంగా గాయపడ్డారు. ఆ ఇంట్లో నుంచి పొగలు రావడంతో చుట్టుపక్కలవారు తలుపులు బద్దలు కొట్టి వారిని ఆస్పత్రికి తరలించారు. పోలీసులకు సమాచారం అందించారు. కరుణాకరణ్‌కు 20 శాతం, పద్మావతికి 40 శాతం కాలిన గాయాలయ్యాయి. చికిత్స పొందుతూ పద్మావతి మరణించారు. కరుణాకరణ్ పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని అయనవరం పోలీసులు పేర్కొన్నారు. (చదవండి: ఓవైపు చంద్రగ్రహణం, మరోవైపు బిర్యానీ.. ఏంటిది? మీరు చెప్పేదేంటి? కొట్టుకునేవరకు వెళ్లిన పంచాయితీ) -
Lunar Eclipse: ఓవైపు చంద్రగ్రహణం, మరోవైపు బిర్యానీ.. ఏంటిది? మీరు చెప్పేదేంటి?
సాక్షి, భువనేశ్వర్: దేశవ్యాప్తంగా మంగళవారం చంద్రగ్రహణం కనువిందుచేసింది. ఇటానగర్, గుహవాటి, సిలిగురి ప్రాంతాల్లో సంపూర్ణ చంద్రగ్రహణం కనిపించగా.. కోల్‌కతా, భువనేశ్వర్, ఢిల్లీ, శ్రీనగర్, చెన్నై, గాంధీ నగర్, ముంబై, హైదరాబాద్ వంటి ప్రాంతాల్లో పాక్షిక చంద్రగ్రహణం కనిపించింది. కొందరు అనాదిగా వస్తున్న కొన్ని ఆచారాలను పాటించగా, మరికొందరు వాటిని లైట్ తీసుకున్నారు. ఈ నేపథ్యంలో ఒడిశాలో రెండో చోట్ల ఘర్షణలు చోటుచేసుకున్నాయి. రాజధాని భువనేశ్వర్‌లోని లోహియా అకాడెమీలో హేతువాద వర్గం నేడు (చంద్రగ్రహణం) బిర్యానీ ఫెస్టివల్ నిర్వహించింది. విషయం తెలుసుకున్న సంప్రదాయవాదులు అక్కడకు చేరుకుని చంద్రగ్రహణం రోజున వండిపెట్టిన ఆహారాన్ని తినడమేంటని అభ్యంతరం తెలిపారు. పూర్వ కాలం నుంచి వస్తున్న ఆచారాన్ని మంటగలుపుతారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇరు వర్గాల మధ్య మాటామాటా పెరిగి ఘర్షణకు దారితీసింది. దీంతో బిర్యానీ ఫెస్టివల్ నిర్వహిస్తున్నవారిపై సంప్రదాయవాదలు దాడికి పాల్పడ్డారు. హేతువాదులపై ఆవుపేడ, రాళ్లతో దాడి చేశారు. (చదవండి: Lunar Eclipse 2022: దేశవ్యాప్తంగా వీడిన చంద్రగ్రహణం) సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని లాఠీలకు పనిచెప్పారు. ఇరు వర్గాలను చెదరగొట్టి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. బెర్హాంపూర్లోనూ ఇలాంటి వెలుగుచూసింది. బిర్యానీ ఫెస్టివల్ నిర్వహణను సంప్రదాయవాదులు అడ్డుకున్నారు. అక్కడ ఏర్పాటు చేసిన స్టాళ్లను ధ్వంసం చేశారు. ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. పోలీసుల రాకతో పరిస్థితి సద్దుమణిగింది. సంప్రదాయవాదులు అంటున్నట్టుగా నిల్వ ఉంచిన ఆహారాన్ని స్వీకరిస్తే చెడు ప్రభావాలేమీ ఉండవని హేతువాదులు చెప్తున్నారు. అర్థంలేని ఆచారాలను పాటించాలని ఒత్తిడి చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నిస్తున్నారు. ఇటీవలి సూర్యగ్రహణం రోజున కూడా భువనేశ్వర్‌లో సంప్రదాయవాదులు, హేతువాదుల మధ్య బిర్యానీ పంచాయితీ వివాదానికి దారితీసింది. (చదవండి: చంద్ర గ్రహణం.. భారత్‌లో దీని ప్రభావమెంతంటే..) -
రెస్టారెంట్లో బిర్యానీ తింటున్నారా?.. అయితే మీకో చేదు వార్త
కర్నూలు: జిల్లాలోని పలు రెస్టారెంట్లు, హోటళ్లలో పాచిపోయిన ఆహార పదార్థాలను వేడి చేసి వడ్డిస్తున్నట్లు తేలింది. బార్ అండ్ రెస్టారెంట్లు, హోటళ్లలో ఆహార పదార్థాల నాణ్యతపై ఫిర్యాదుల నేపథ్యంలో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ డాక్టర్ శంకబ్రత బాగ్చి ఆదేశాల మేరకు.. ఆ విభాగం కర్నూలు ప్రాంతీయ అధికారి తిరుమలేశ్వరరెడ్డి నేతృత్వంలో శనివారం కర్నూలు జిల్లాలోని పలు రెస్టారెంట్లు, బార్లు, హోటళ్లలో అధికారులు నిర్వహించిన తనిఖీల్లో పలు అక్రమాలు వెలుగుచూశాయి. కుళ్లిన కూరగాయలు వినియోగించడం, పాచిపోయిన ఆహారాన్ని వేడి చేసి వడ్డిస్తున్నట్లు గుర్తించారు. వంటశాలలు అపరిశుభ్రంగా ఉన్నాయి. మాంసాహార పదార్థాలు రోజుల తరబడి ఫ్రిజ్‌లో ఉంచి అవసరమైనప్పుడు తీసి ఉడికించడం, లేదంటే వేడి చేసి మసాలాలు, రంగులు కలిపి రుచికరంగా తయారు చేసి అందిస్తున్నట్లు గుర్తించి పలు హోటళ్లు, రెస్టారెంట్లకు జరిమానాలు విధించారు. విజిలెన్స్ అధికారులతో పాటు ఫుడ్ సేఫ్టీ, తూనికలు కొలతలు, శానిటరీ సిబ్బంది తనిఖీల్లో పాల్గొన్నారు. డీఎస్పీ సుధాకర్‌రెడ్డి, సీఐలు నాగరాజు యాదవ్, కేశవరెడ్డి, ఏఏఓ షణ్ముఖ గణేష్, ఏజీ సిద్ధయ్య, ఎఫ్ఎస్ఓ శేఖర్‌రెడ్డి, రాముడు, తూనికలు కొలతల శాఖ అధికారి కుమార్, అనిల్ తదితరులు బృందాలుగా ఏర్పడి కర్నూలుతో పాటు కోడుమూరు, ఎమ్మిగనూరు ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించారు. కర్నూలులోని ల్యాటిట్యూడ్ రెస్టారెంట్లో ముందు రోజు వండిన ఆహార పదార్థాలు ఫ్రిజ్‌లో పెట్టి అవసరమైనప్పుడు వేడి చేసి వినియోగదారులకు సరఫరా చేస్తున్నట్లు గుర్తించారు. అలాగే రెడ్ ఫుడ్ కలర్ వాడినట్లు గుర్తించి రూ.5 వేలు జరిమానా విధించారు. అలాగే కర్నూలులోని మసాలా బౌల్ హోటల్, నాగార్జున పార్క్ లేన్ బేకర్స్‌లో వంటశాల అపరిశుభ్రంగా ఉండడంతో రూ.5 వేలు చొప్పున జరిమానా విధించారు. బావార్చీ మల్టీ రెస్టారెంట్లో ముందు రోజు వండిన ఆహార పదార్థాలు ఫ్రిజ్‌లో ఉంచి వేడిచేసి వినియోగిస్తున్నందుకు రూ.10 వేలు, అనిల్ బార్ అండ్ రెస్టారెంట్లో సరైన శుభ్రత లేని కారణంగా రూ.5 వేలు అపరాధ రుసుం విధించారు. అలాగే కోడుమూరు రెడ్డీస్ హోటల్లో డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్లు వాడుతున్నట్లు గుర్తించి 6ఏ కేసు నమోదు చేశారు. అలాగే కోడుమూరులోని శివ హోటల్లో వాటర్ బాటిళ్లు ఎంఆర్పీ కంటే రూ.5 అధికంగా విక్రయిస్తున్నట్లు గుర్తించి తూనికలు కొలతల శాఖ అధికారులు రూ.2 వేలు ఫైన్ వేశారు. ఎమ్మిగనూరులోని అమృత బార్ అండ్ రెస్టారెంట్, గ్రాండ్ మహల్ హోటళ్లలో వంటశాలలు అపరిశుభ్రంగా ఉన్నట్లు గుర్తించి రూ.10 వేలు, రూ.2 వేలు అపరాధ రుసుం విధించారు. చదవండి: చదివింది ఏడో తరగతి.. వామ్మో ఈమె మామూలు లేడీ కాదు.. షిఫ్ట్ కారులో వచ్చి.. -
విషాదం: స్నేహితుడి పుట్టిన రోజున బిర్యానీ కోసం వెళ్తూ..
సాక్షి, నల్గొండ: స్నేహితుడి పుట్టిన రోజు వేడుకను పురస్కరించుకుని బిర్యానీ కోసం మునుగోడుకు బయలుదేరిన స్నేహితుల బృందంలో ఒకరిని ట్రాక్టర్ రూపంలో మృత్యువు కబళించింది. ఈ విషాదకర ఘటన మునుగోడు మండలం గూడపూర్ గ్రామ సమీపంలో చోటు చేసుకుంది. గ్రామస్తులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని కొరటికల్ గ్రామానికి చెందిన దండు మణికంఠ(18) స్నేహితుల్లో ఒకరిది పుట్టిన రోజు. ఆ వేడుకను పురస్కరించుకుని మణికంఠ మరో ఎనిమిది మంది స్నేహితులతో కలిసి బిర్యానీ కోసం ఆటోలో మునుగోడుకు బయలుదేరారు. ఈ క్రమంలో అదే గ్రామానికి చెందిన కంభాల శేఖర్ ట్రాక్టర్ నడుపుకుంటూ కోరటికల్కు వస్తున్నాడు. గూడపూర్ సమీపంలోకి రాగానే స్నేహితులతో వెళ్తున్న ఆటో ఎదురుగా వస్తున్న ట్రాక్టర్ వెనక చక్రానికి తగిలింది. ఈ ప్రమాదంలో ఆటోలో డ్రైవర్ సీటు పక్కనే కూర్చొని ప్రయాణిస్తున్న మణికంఠ ట్రాక్టర్ చక్రం తగిలి కిందపడి పోయాడు. తీవ్రంగా గాయపడిన అతడిని 108 వాహనంలో నల్లగొండ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందాడు. దీంతో మృతుడి స్వగ్రామం కొరటికల్‌లో విషాదం అలుముకుంది. · -
పాతబస్తీలో బిర్యానీ ఫైట్ కలకలం.. అర్ధరాత్రి హోంమంత్రికి ఫోన్ చేసి
సాక్షి, హైదరాబాద్: పాతబస్తీలో బిర్యానీ ఫైట్ కలకలం సృష్టిస్తోంది. బిర్యానీ విషయంలో ఓ వ్యక్తి ఏకంగా తెలంగాణ హోం మంత్రి మహమూద్ అలీకి ఫోన్ చేశారు. అర్ధరాత్రి సమయంలో ఫోన్ చేసి ఎన్ని గంటల వరకు హోటల్ తెరచి ఉంచాలో చెప్పాలని అడిగారు. దీంతో మహమూద్ అలీ స్పందిస్తూ.. నేను హోంమంత్రిని.. నాకు వంద టెన్షన్లు ఉంటాయంటూ అర్ధరాత్రి ఫోన్ చేయడంపై అసహనం వ్యక్తం చేశారు. ఇదిలా ఉంటే, అర్ధరాత్రి వరకు బిర్యానీ విక్రయాలకు అనుమతి కోసం ఎంఐఎం నేతలు ఇప్పటికే హైదరాబాద్ సీపీని కలిసిన విషయం తెలిసిందే. మరోవైపు అర్ధరాత్రి వరకు బిర్యానీ విక్రయాలకు అనుమతి ఉందని ఎంఐఎం నేతలు తెలిపారు. చదవండి: (అనుమానాస్పద స్థితిలో సర్పంచ్ భార్య మృతి) -
చిచ్చు రేపిని బిర్యాని వంట... భార్యపై కత్తితో దాడి
ముంబై: ఒక వ్యక్తి తన భార్య రాత్రి భోజనానికి బిర్యాని వండలేదన్న కోపంతో కత్తితో తీవ్రంగా దాడి చేశాడు. ఈ ఘటన మహారాష్ట్రలోని లతూర్లో చోటుచేసుకుంది. ఆగస్టు 31 రాత్రి సదరు వ్యక్తి రాత్రి భోజనానికి బిర్యాని ఎందుకు వండలేదంటూ భార్యతో గొడవపడ్డాడు. ఈ విషయమై ఇద్దరి మద్య తీవ్ర వాగ్వాదం తలెత్తింది. దీంతో సదరు వ్యక్తి తన కుటుంబ సభ్యులు ఎంతగా చెబుతున్న వినకుండా భార్యని కత్తితో పొడిచి పరారయ్యాడు. సదరు వ్యక్తిని పోలీసులు విక్రమ్ వినాయక్ దేదేగా గుర్తించి అతనిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. బాధిత మహిళ తీవ్రంగా గాయపడిందని, ఆస్పత్రిలో చికిత్స పొందుతుందని వెల్లడించారు. ఐతే ఈ కేసు విషయమై ఇంకా ఎవర్నీ అదుపులోకి తీసుకుని అరెస్టు చేయలేదని పోలీసులు తెలిపారు. (చదవండి: మావగారిపై చేయిజేసుకున్న మహిళా పోలీసు: వీడియో వైరల్) -
ప్రజల ఆరోగ్యంతో చెలగాటం.. పాచిపోయిన బిర్యానీ, అన్నంలో ఈగలు
సాక్షి, వికారాబాద్: పది రోజులుగా కురుస్తున్న వర్షాలతో పల్లెలు, పట్టణాల్లో సీజనల్ వ్యాధుల భయం కనిపిస్తోంది. ఈ సమయంలో కల్తీ ఆహారం తీసుకున్నా, నాణ్యతా ప్రమాణాలు పాటించని చిరుతిండ్లు తిన్నా రోగాల బారిన పడక తప్పదు. జిల్లాలో అనేక హోటళ్లు, పాస్ట్ ఫుడ్ సెంటర్లు, దాబాలు వెలిశాయి. పలు చోట్ల నాసిరకం, కల్తీ పదార్థాలు, సరుకులతో వంటలు చేస్తున్నారు. దీంతో జనం అనారోగ్యం పాలవుతున్నారు. హోటళ్లు, దాబాలు, పాస్ట్‌ఫుడ్ సెంటర్లకు.. కిరాణా షాపుల యజమానులు నాణ్యత లేని పదార్థాలను విచ్చలవిడిగా విక్రయిస్తున్నారనే ఆరోపణలున్నాయి. సదరు దుకాణాలపై దాడులు చేసి తనిఖీలు నిర్వహించాల్సిన అధికారులు పెద్దగా పట్టించుకోవడం లేదు. జిల్లాలో పూర్తి స్థాయి ఫుడ్ ఇన్స్పెక్టర్ లేకపోవడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. సంబంధిత కార్యాలయంలోనూ సరిపడా సిబ్బంది లేక సమా ధానం చెప్పే వారు కరువయ్యారు. జిల్లాలో ఇన్చార్జ్ ఫుడ్ ఇన్స్పెక్టర్గా బాధ్యతలు చేపట్టిన అధికారి చుట్టపు చూపుగా వచ్చి వెళ్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో హోటళ్లు, దాబాలు, టిఫిన్ బండ్ల నిర్వాహకులు ఆడిందే ఆట పాట అనేలా వ్యాపారం సాగిస్తున్నారు. అనుమతులు లేకుండానే జిల్లాలోని వికారాబాద్, తాండూరు, పరిగి, కొడంగల్ పట్టణాలతో పాటు మండల కేంద్రాల్లో ఎలాంటి అనుమతులు లేకుండా హోటళ్లు, పాస్ట్‌ఫుడ్ సెంటర్లు వెలుస్తున్నాయి. వీటిలో తయారు చేసే భోజన సామగ్రి, నూనె నాణ్యత విషయాలు ఎవరికీ తెలియట్లేదు. తక్కువ ధరకు లభించే నాసిరకం సరుకులతో వంటకాలు చేస్తున్నారనే ప్రచారం ఉంది. చాలా హోటళ్లకు కనీసం మున్సిపల్, గ్రామ పంచాయతీల అనుమతి కూడా లేకపోవడం గమనార్హం. ఈ విషయంపై మున్సిపల్ అధికారులు, గ్రామ పంచాయతీ సెక్రటరీలు పెద్దగా పంటించుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయి. ఇదే అదనుగా వ్యాపారులు కల్తీ వస్తువులతో హోటళ్లు నడిపిస్తూ ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడుతున్నారు. పాచిపోయిన బిర్యానీ వికారాబాద్‌లోని పలు బిర్యానీ సెంటర్లలో పాచి పోయిన బిర్యానీ విక్రయిస్తున్నారే ఆరోపణలున్నాయి. రెండు మూడు రోజుల పాటు చికెన్‌ను ఫ్రిజ్‌లో పెట్టి బిర్యానీ చేసి అమ్ముతున్నారు. ఎన్టీఆర్ చౌరస్తాలోని ఓ బిర్యానీ సెంటర్లో తీసుకున్న అన్నంలో ఇటీవల పురుగులు వచ్చాయి. ఈ విషయంపై ఎవరికి ఫిర్యాదు చేయాలో తెలియక బాధితులు కొద్దిసేపు నిర్వాహకులతో గొడవపడి వెళ్లిపోయారు. న్యూ గంజ్‌లోని మరో బిర్యానీ సెంటర్లో వారం రోజుల క్రితం అన్నంలో ఈగలు దర్శనమిచ్చాయి. ఇదేమిటని అడిగితే నిర్లక్ష్యంగా సమాధానం ఇవ్వడమే కాకుండా, ఇదే బిర్యానీని మిగతా వారికి వడ్డించడం గమనార్హం. మరో హోటల్ నుంచి తీసుకువెళ్లిన ఇడ్లీ సాంబారులో బొద్దింక వచ్చిందని బాధితులు తెలిపారు. ఇలా ప్రతీ హోటల్లో నాసిరకం ఆహారం అమ్ముతున్నారనే ప్రచారం సాగుతోంది. ఎప్పుడూ తాళమే.. స్థానిక మున్సిపల్ కార్యాలయ ఆవరణలో ఫుడ్ సేఫ్టీ జిల్లా కార్యాలయం ఉంది. ఎప్పుడు చూసినా ఇది తాళం వేసే కనిపిస్తోంది. జిల్లా ఏర్పడ్డ తర్వాత గెజిటెడ్ ఫుడ్ ఇన్స్పెక్టర్, ఫుడ్ సేఫ్టీ అధికారి పోస్టులు కేటాయించారు. జూనియర్ అసిస్టెంట్, అటెండర్ ఉండాలి. కానీ ఈ కుర్చీలన్నీ ఖాళీగా ఉన్నాయి. రంగారెడ్డి జిల్లా ఫుడ్ ఇన్స్పెక్టర్కు వికారాబాద్ ఇన్చార్జ్ బాధ్యతలు ఇచ్చారు. ఏడాది కావస్తున్నా ఇప్పటి వరకు జిల్లాలో ఒక్కచోట కూడా తనిఖీలు చేసిన దాఖలాలు లేవు. హోటళ్లు, బేకరీలు, పాస్ట్‌ఫుడ్ సెంటర్లు, ఇతర ఆహార పదార్థాల షాపులను తనిఖీ చేయాల్సి ఉన్నా అధికారుల జాడ లేకపోవడంతో వ్యాపారులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. మార్కెట్లో నాణ్యత లేని సరుకులు, ఇతర ఆహార పదార్థాలు జోరుగా విక్రయిస్తుండటంతో వాటిని కొనుగోలు చేస్తున్న ప్రజలు అనారోగ్యం పాలై ఆస్పత్రుల్లో చేరుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి జిల్లాలో తనిఖీలు చేపట్టాలని కోరుతున్నారు. -
బిర్యానీ ఏదని అడిగాడని..
అచ్చంపేట రూరల్: తన బిర్యానీ ప్యాకెట్ కని పించడం లేదంటూ ఒక విద్యార్థి అడిగినందుకు మరో విద్యార్థి వసతి గృహం టెర్రస్ పైనుంచి కిందికి దూకేయడంతో అతని కాలు విరిగింది. ఈ సంఘటన నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేట సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల వసతిగృహంలో ఆదివారం జరిగింది. అమ్రాబాద్ మండలం ఎలమపల్లికి చెందిన రామస్వామి, సువ ర్ణ దంపతుల కుమారుడు చారగొండ రాజేశ్ స్థానిక పాఠశాలలో 8వ తరగతి చదువుతున్నా డు. ఆదివారం కావడంతో విద్యార్థులను చూ సేందుకు తల్లిదండ్రులు వచ్చారు. చికిత్స పొందుతున్న విద్యార్థి రాజేశ్ అదే తరగ తికి చెందిన అరుణ్ అనే విద్యార్థి తల్లిదండ్రులు బిర్యానీ ప్యాకెట్ తీసుకువచ్చారు. మధ్యాహ్నం అరుణ్ బిర్యానీ తిని మిగిలింది రాత్రికి తినేందుకు బాక్సులో పెట్టుకున్నాడు. కొద్దిసేపటి తర్వాత వచ్చి చూడగా బిర్యానీ ప్యాకెట్ కనిపించకపోవడంతో తోటి స్నేహితులను అడిగాడు. ఈ క్రమంలో రాజేష్‌ను ప్రశ్నించగా.. అతనేమీ మాట్లాడకుండా వసతిగృహం టెర్రస్‌పైకి ఎక్కి దూకేశాడు. వెంటనే పాఠశాల సిబ్బంది రాజేశ్‌ను అచ్చంపేట ప్రభుత్వ ఆస్పత్రికి తర లించారు. ఎడమ కాలు విరిగిందనే అనుమా నంతో మహబూబ్‌నగర్‌లోని ఒక ప్రైవేట్ ఆస్పత్రికి రిఫర్ చేశారు. -
హైదరాబాద్: చికెన్ బిర్యానీలో బల్లి.. కంగుతిన్న కార్పొరేటర్
-
హైదరాబాద్: చికెన్ బిర్యానీలో బల్లి.. కంగుతున్న కార్పొరేటర్
సాక్షి, హైదరాబాద్: అసలే ఆకలి. అందునా ఆర్డర్‌చేసిన చికెన్ బిర్యానీ రానే వచ్చింది. ఇంకేముంది! ఒక పట్టుపట్టడమే అనుకున్నాడా వ్యక్తి. కానీ, ఆబగా సగం బిర్యానీ తిన్న తర్వాత పగవాడికీ రాని పరిస్థితి అతనికి తలెత్తింది. బిర్యానీలో బల్లి దర్శనమిచ్చింది. యాక్! అనుకుంటూ తిన్న బిర్యానీ వాంతి చేసుకున్నాడు. ఇది ఎక్కడో ఏ మారుమూలో జరగలేదు. మన హైదరాబాద్‌లో.. ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లో ఉండే ఒక ప్రముఖ రెస్టారెంట్లో శుక్రవారం వెలుగుచూసిందీ ఘటన. వివరాలు ఇలా ఉన్నాయి.. నగరంలోని ఓ ప్రముఖ రెస్టారెంట్ నుంచి తెచ్చుకున్న చికెన్ బిర్యానీలో బల్లి ప్రత్యక్షమైంది. రాంనాగర్ డివిజన్ బీజేపీ కార్పొరేటర్ రవిచారి ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లోని ఓ రెస్టారెంట్ నుంచి బిర్యానీ ఆర్డర్ చేశాడు. సగం బిర్యానీ తిన్న తర్వాత అందులో బల్లి కనిపించడంతో షాక్ అయ్యాడు. దీంతో కంగుతిన్న కార్పొరేటర్ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు బిర్యానీని టెస్టింగ్ కోసం ఫుడ్ కంట్రోల్ ల్యాబ్‌కు పంపించారు. అదే విధంగా ఫుడ్ ఇన్స్పెక్టర్ బిర్యానీ సెంటర్ వద్దకు చేరుకొని తనిఖీలు నిర్వహిస్తున్నారు. చదవండి: వికారాబాద్: పెళ్లయిన 20 రోజులకే.. -
బిర్యానీ బిల్లు రూ.3 లక్షలు..! అవాక్కైన అధికారులు
కోల్‌కతా : బిర్యానీ అంటే ఇష్టపడని వారు ఎవరూ ఉండరు. ఏ రెస్టారెంట్‌కు వెళ్లినా ఎక్కువగా ఆర్డర్ ఇచ్చేది బిర్యానీనే. ఇంట్లోనూ బిర్యానీ ఎంతో ఇష్టంగా చేసుకొని తింటారు. చికెన్, మటన్, ఫిష్, మష్రూమ్ బిర్యానీ.. ఇలా ఎన్నో రకాలు ఉంటాయి. సాధారణంగా బయట హోటల్స్‌లో సింగిల్ బిర్యానీ రూ. 100 నుంచి 200 ఉండొచ్చు. అదే ఫ్యామిలీ ప్యాక్ అయితే రూ. 500 వరకు ఉంటుంది.. కానీ కొందరు బిర్యానీ కోసం రూ. 3 లక్షలు ఖర్చు చేశారట. ఆ బిల్లును ఓ ప్రభుత్వ ఆస్పత్రికి సమర్పించడంతో.. ఈ ఘటన వెలుగు చూసింది. బిర్యానీ కోసం లక్షల్లో బిల్లు పెట్టడంతో అధికారులు అవాక్కయ్యారు. పశ్చిమ బెంగాల్‌లోని కత్వా సబ్ డివిజనల్ ఆస్పత్రిలో ఈ వింత ఘటన జరిగింది. శోబిక్ ఆలం అనే వ్యక్తి ఇటీవలే ఆస్పత్రి సూపరింటెండెంట్‌గా బాధ్యతలు తీసుకున్నారు. ఆయన పెండింగ్‌లో ఉన్న బిల్లులను క్లియర్ చేయాలనుకున్నారు. కింగ్ షుక్ గోష్ అనే కాంట్రాక్టర్ ఫర్నీచర్, వాహనాలతో పాటు బిర్యానీని సరఫరా చేస్తుంటాడు. వీటన్నింటి ఖర్చులు కలపి సుమారు రూ. కోటి బిల్లు పెట్టాడు. అయితే అందులో బిర్యానీ కోసం దాదాపు రూ.3 లక్షలు, ఫర్నీచర్ కోసం 82 వేలు వెచ్చించినట్టు బిల్లు దాఖలు చేశాడు. వీటిని చూసి సూపరింటెండెంట్ షాక్ అయ్యారు. బిల్లులు అన్ని పరిశీలించి కాంట్రాక్టర్ సమర్పించిన వాటిలో 81 బిల్లులు బోగస్‌వే ఉన్నట్లు గుర్తించారు. దీంతో పెద్దఎత్తున అవినీతి జరిగినట్టు గుర్తించిన అధికారి.. ఈ బోగస్ బిల్లులను డిపాజిట్ చేసిన నిందితులపై పోలీసులకు ఫిర్యాదు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఆ బిల్లును ఆమోదించిన ప్రతి ఒక్కరిని విచారిస్తామని, దోషులగా తేలితే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని వైద్యాధికారులు చెప్పారు. చదవండి: ‘ఇళ్లు తగలబెట్టే హిందూత్వ కాదు..ఇంట్లో పొయ్యి వెలిగించే సిద్ధాంతం’ -
బిర్యానీ తగ్గేదేలే..!
నాన్ వెజ్ ప్రియుల నిలయమని నగరం నిరూపించుకుంది. రంజాన్ పండగ వేళ ఈ వంటకాల విక్రయాలు మరింత ఊపందుకున్నాయి. కులమతాలకు అతీతంగా ఆరగించే హలీం అమ్మకాల్లో ముందున్నా, చికెన్ బిర్యానీకి ఉన్న డిమాండ్ఏ మాత్రం తగ్గకపోవడం విశేషమని ఇప్పటికీ ఆర్డర్ల పరంగా అదే నంబర్ వన్ అని.. ఫుడ్ డెలివరీ యాప్ స్విగ్గీ అధ్యయనం తేల్చింది. సాక్షి, హైదరాబాద్: విభిన్న సంస్కృతులు, అభి‘రుచుల’ నిలయం నగరం. ఇక్కడి నాన్‌వెజ్ వంటకాల్లో బిర్యానీకి ఉన్న క్రేజ్ సంగతి చెప్పక్కర్లేదు. ఇక రంజాన్ సమయంలో అన్ని వంటకాల్నీ వెనక్కి నెట్టేస్తోంది హలీం. ఈ ఏడాది మాత్రం చికెన్ బిర్యానీ తన క్రేజ్‌ను నిలబెట్టుకుని హలీమ్ కన్నా డిమాండ్‌లో ఉందని స్టడీలో వెల్లడైంది. ‘ఆరు’గించినవి అవే.. రంజాన్ పండగ ప్రారంభమైన తర్వాత ఈ నెల 2 నుంచి 22 వరకూ సాయంత్రం 5 నుంచి 7 గంటల మధ్యలో ఆర్డర్ల ఆధారంగా ఈ అధ్యయనం నిర్వహించారు. దీనిప్రకారం అత్యధిక సంఖ్యలో నగరవాసులు ఆరగించిన వంటకాల్లో.. చికెన్ బిర్యానీ, హలీమ్, నీహారిస్, సమోసాలు, రబ్డి, మాల్పువా అగ్రస్థానంలో ఉన్నాయి. బిర్యానీ...అదే క్రేజ్... హలీమ్ హవా ఉన్నప్పటికీ బిర్యానీ పట్ల డిమాండ్ ఎంత మాత్రం తగ్గలేదని స్టడీ తేల్చింది. కేవలం 20రోజుల్లో 8 లక్షల చికెన్ బిర్యానీలు నగరవాసులు హాంఫట్ అనిపించారు. కేవలం ఒక్క డోర్‌డెలివరీ యాప్ ఆర్డర్ల ద్వారానే ఈ స్థాయిలో డిమాండ్ ఉంటే ఇక మొత్తంగా చూస్తే అది ఏ స్థాయిలో ఉంటుందో ఊహించవచ్చు. ‘ఆహా’లీం.. ఏడాదికోసారి జిహ్వల్ని పలకరించే హలీంను గత ఏడాది కన్నా 33 రెట్లు ఎక్కువగా సిటిజనులు ఆరగించారు. దీనిలో మటన్ హలీం తొలిస్థానం కాగా స్పెషల్ హలీం, చికెన్ హలీం, ముర్గ్ హలీంలు ఆ తర్వాత స్థానాల్లో ఉన్నాయి. రంజాన్ మాసంలోనే విరివిగా లభించే నిహారీ కూడా గత ఏడాదితో పోలిస్తే 30 రెట్లు ఎక్కువగా ఆదరణ పొందింది. అత్యధిక ఆర్డర్లు అందుకున్న వాటిలో ఇఫ్తార్ వంటకాలైన సమోసా, భజియా, రబ్డి, ఫిర్నీ, మాల్పువా.. ఉన్నాయి. ఇవి ఈ 20 రోజుల్లో ఏకంగా 4.5లక్షల ఆర్డర్లు సాధించాయి. ఇవి కాకుండా పనీర్ బటర్ మసాలా, చికెన్ 65, మసాలా దోశెలు ఉన్నాయి. ఇదే సమయంలో ఇడ్లీలు సైతం 17వేల ఆర్డర్లు పొందడం విశేషం కాగా. డిసర్ట్స్‌లో గులాబ్‌జామూన్, రస్‌మలాయి, డబుల్ కా మీఠాలు టాప్ త్రీలో ఉన్నాయి. టేస్టీ.. యూనిటీ.. కుటుంబం మొత్తాన్నీ ఒకే చోట చేర్చడమే రంజాన్ గొప్పతనం. ఇది నిజంగా జష్న్–ఏ–రంజాన్. అందర్నీ ఏకం చేసేలా విభిన్నరకాల అభి‘రుచుల’ను సంతృప్తి పరిచే విధంగా వెరైటీ డిషెస్‌ను రంజాన్ మోసుకొస్తుంది. అందుకే వీలున్నన్ని రంజాన్ వంటకాలను రుచిచూడాలని భావిస్తాం. – మితేష్ లోహియా, డైరెక్టర్, సేల్స్– మార్కెటింగ్, గోల్డ్ డ్రాప్ -
Multifunction Steamer: బిర్యానీ, నూడుల్స్, బార్బెక్యూ ఐటమ్స్ చేసుకోవచ్చు.. ధర 29 వేలు!
హైక్వాలిటీ హీట్ రెసిస్టెంట్ గ్లాస్ కవర్ కలిగిన ఈ ఎలక్ట్రిక్ హీట్ పాట్.. ట్రెండీ లుక్స్‌లోనూ.. పనితనంలోనూ సూపర్బ్. ఇరువైపులా ఇన్సులేటెడ్ హ్యాండిల్స్ కలిగిన ఈ డివైజ్‌ని వినియోగించడం చాలా సులభం. 5.5 లీటర్ల సామర్థ్యమున్న ఈ పాత్రలో చాలా వంటకాలను రుచికరంగా, ఎక్కువ పరిమాణంలో తయారు చేసుకోవచ్చు. దీన్ని కుకర్‌లా, స్టీమర్‌లా, గ్రిల్‌లా అన్ని రకాలుగానూ వినియోగించొచ్చు. స్నేహితులు, బంధువులు వచ్చినప్పుడు ఇలాంటి పరికరం ఇంట్లో ఉంటే.. ఎంత పనైనా చకచకా అయిపోతుంది. 2100 వాట్స్ కలిగిన ఈ ఎలక్ట్రిక్ వోక్‌లో బిర్యానీ వంటి పలు రైస్ ఐటమ్స్‌తో పాటు.. నూడుల్స్, కర్రీస్, బార్బెక్యూ ఐటమ్స్ ఇలా అన్నీ రకాలనూ తయారుచేసుకోవచ్చు. చికెన్, మటన్ వంటివి ఇందులో.. చాలా క్రిస్పీగా గ్రిల్ అవుతాయి. దీనికి ట్రాన్స్పరెంట్ మూత కూడా ఉంటుంది. టెంపరేచర్ ఎక్కువ అవుతుంటే ఆటోమేటిక్‌గా ఆఫ్ అవుతుంది. -ధర - 392 డాలర్లు (రూ.29,323) చదవండి: పొటాటోతో ఫ్యాటీ బాడీకి చెక్ చెప్పొచ్చా? -
ఖైదీ బిర్యానీ.. ఇది లేటేస్ట్ గురూ..
కాకినాడ/రాజమహేంద్రవరం సిటీ: లోకో భిన్న రుచి అంటారు. ఒక్కొక్కరికీ ఒక్కో అభిరుచి ఉంటుంది. ఏ విషయంలోనైనా కావచ్చు. ముఖ్యంగా ఆహారం విషయంలో ఇదెక్కువగా అందరిలో కనిపిస్తోంది. కొందరికి ఒక్క టిఫిన్ సెంటరే నచ్చుతుంది. మరొకరు తనకు నచ్చిన హోటల్లో తప్ప మరోచోట భోజనం చేయరు. ఏమైనప్పటికీ ఆహారాభిరుచికి ఇంచుమించు అందరూ అగ్రాసనం వేస్తారు. అందుకే వీరిని ఆకట్టుకోవడానికి కొన్ని సంస్థలూ ఇలానే వ్యవహరిస్తున్నాయి. ఇటీవలి కాలంలో ఫుడ్ సెంటర్లు, హోటళ్ల విషయంలో ఈ పరిణామం స్పష్టంగా కనిపిస్తోంది. చదవండి: రూ.10 వేలతో ప్రారంభించి.. రూ.10 కోట్లకు కాకినాడలో ఆహార ప్రియులను ఆకర్షించేందుకు ‘జైలు థీమ్’తో ఓ రెస్టారెంట్ ఏర్పాటైంది. భోజనం చేసే గది జైలులోని ఖైదీ సెల్లా ఉంటుంది. ఇక్కడ సర్వర్లు ఖైదీ డ్రెస్‌లు వేసుకుని మరీ వడ్డిస్తున్నారు. అంతేకాదు.. బిల్లును ‘బెయిల్’గా వ్యవహరిస్తున్నారిక్కడ. భానుగుడి సెంటర్లో కొత్త కాన్సెప్టుతో వచ్చిన ‘ఖైదీ బిర్యానీ’ రెస్టారెంట్ విశేషంగా ఆకట్టుకుంటోంది. లోపల పూర్తిగా జైలు వాతావరణాన్ని తలపించేలా దీనిని తీర్చిదిద్దారు. అడుగు పెట్టగానే చుట్టూ జైలు ఊసలతో కూడిన 16 క్యాబిన్లు దర్శనమిస్తాయి. 20 మందికి సరిపడా ఓ వీఐపీ సెల్ కూడా ఉంటుంది. జిల్లాలో చైనీస్, కాంటినెంటల్, చెట్టినాడు స్పెషల్ ఇలా వివిధ ప్రాంతాల ఫుడ్ కూడా వడ్డిస్తున్నారు. రావులపాలెం మార్గంలో కూడా రకరకాల ఐటెమ్స్‌తో ఫుడ్ బాగుంటుందని అటుగా దూర ప్రయాణాలు చేసేవారు లొట్టలేసు కుంటూ తింటూంటారు. ఖైదీ బిర్యానీ రెస్టారెంట్ పేరు వింటే ఫిదా ఫుడ్ మాట అటుంచితే కొన్ని రెస్టారెంట్లకు పెడుతున్న పేర్లు ఆసక్తి కలిగిస్తున్నాయి. ఈ పేర్లే భోజన ప్రియులను ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా కుర్రకారు అడుగులు ఇటువైపే పడుతున్నాయి. మచ్చుకు రాజమహేంద్రవరంలో కొన్ని పేర్లు ఇవి.. ‘కడుపు నింపుతాం, పొట్ట పెంచుదాం, నా పొట్ట నా ఇష్టం, పాతాళ భైరవి, మాయాబజార్, మిఠాయి పొట్లం, చిక్‌పెట్ దొన్నె బిర్యానీ హౌస్, పల్లెవంట,గోదావరి రుచులు ఇలా పలు రకాల పేర్లతో ఆహారప్రియుల మనసులు గెలుచుకొనేందుకు ప్రయత్నం చేస్తున్నారు. తినే ఆహారం ఒకటే అయినప్పటికీ వైవిధ్యభరితమైన పేర్లతో కస్టమర్ల మనసులో స్థానానికి ప్రయత్నిస్తున్నారు. రుచులకు బందీ కావల్సిందే.. ఆహార ప్రియులను మా హోటల్లో రుచులతో బందీ చేయాలన్నదే ‘జైల్ థీం’ ప్రధాన ఉద్దేశం. కాకినాడలో కొత్తదనంతో హోటల్ ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో ‘ఖైదీ బిర్యానీ’గా పేరు పెట్టాం. మేమిచ్చే ఆతిథ్యం, నాణ్యమైన ఆహారం, సరసమైన ధర చూసి ఆహార ప్రియులు మా ‘ఖైదీ బిర్యానీ’కి మళ్లీ మళ్లీ వచ్చేలా ఆకర్షించడమే ధ్యేయం. ప్రజలను బాగా ఆకట్టుకోగలమన్న నమ్మకం ఉంది. – నల్లపాటి సాయివేణు, ఖైదీ బిర్యానీ రెస్టారెంట్ యజమాని -
బొంగులో బిర్యానీ.. చికెన్, బాస్మతి రైస్‌తో అబ్బ! ఏమి రుచి..! ధరెంతో తెలుసా?
అనంతగిరి(విశాఖ జిల్లా): మన్యంలోని పర్యాటక ప్రాంతాల్లో బొంగు చికెన్ దొరకని ప్రదేశమే ఉండదు. బొంగు చికెన్‌కు అంత డిమాండ్ ఉంది. దీంతో పాటుగా ప్రస్తుతం బొంగు బిర్యానీకి కూడా అంతే డిమాండ్ పెరిగింది. మండలంలోని ప్రముఖ పర్యాటక కేంద్రమైన బొర్రాగుహలను సందర్శించేందుకు వస్తున్న పర్యాటకులకు, బొర్రా హోటల్ నిర్వహకులు బొంగు బిర్యానీని రుచి చూపిస్తున్నారు. బొంగుచికెన్ మాదిరిగానే బొంగు బిర్యానీ కూడా ఫేమస్ అయింది. మన్యంలోని పర్యాటక ప్రాంతాలను తిలకించేందుకు రెండు తెలుగు రాష్ట్రాలతో పాటుగా దేశవిదేశాల నుంచి పర్యాటకులు వస్తుంటారు. బొర్రా హోటల్లో తయారుచేస్తున్న బొంగు బిర్యానీ మన్యంలో దొరికే ఆహారంపై మొగ్గు చూపుతుంటారు. దీనిని దృష్టిలో పెట్టుకుని, స్థానికంగా ఉన్నవారు పర్యాటకులకు కొత్త రుచులను పరిచయం చేస్తున్నారు. బొర్రా గుహలను తిలకించేందుకు భారీగా తరలివచ్చే పర్యాటకుల కోసం హోటల్స్ వద్ద బొంగుచికెన్తో పాటుగా బొంగు బిర్యానీని అందుబాటులో ఉంచుతున్నారు. హోటల్లో ఇచ్చే ఒక బొంగు బిర్యానీ ఇద్దరికి సరిపోతుంది. దీని ధర రూ.500 నుంచి రూ. 600 వరకు ఉంది. చికెన్, బాస్మతి రైస్‌తో కలిపి ఎంతోరుచిగా దీనిని తయారు చేస్తున్నారు. బిర్యానీలో ఎన్నోరకాలు ఉండగా, పర్యాటక ప్రాంతాల్లో దొరికే బొంగు బిర్యానీ రుచే వేరంటూ పర్యాటకులు లొట్టలేసుకుని తింటూ కితాబు ఇస్తున్నారు. బొంగు బిర్యానీని రుచి చూడాలంటే మరెందుకు లేటు బొర్రా రావలసిందే. చదవండి: 20 సినిమాలకు పైగా షూటింగ్.. జానకిరాముడు, ప్రేమదేశం తీసింది అక్కడే.. -
మంచిర్యాలకు.. ధమ్ కి బిర్యానీ.. ‘మండి.. పదండి..’
ఆదివారమో, పండుగనో, ప్రత్యేక సందర్భం వచ్చిందంటే మాంసాహారం సాధారణంగా ఇళ్లలో ఉండే మెనూ ఇదే. కానీ రానురాను అభిరుచులు మారిపోతున్నాయి. ఓ రోజు అలా రెస్టారెంట్‌కు వెళ్లి, కొత్త రుచులను చూసేద్దాం అంటున్నారు పట్టణ ప్రజలు. సెలవు రోజుల్లో, పిల్లలు, పెద్దల పుట్టిన రోజులు, ఇతర వేడుకలు వచ్చాయంటే అంతా కలిసి సరదాగా రెస్టారెంట్‌కు వెళ్తున్నారు. అక్కడా కూడా ఎప్పటి మాదిరి చికెన్ బిర్యాని, మటన్ బిర్యానీలే కాకుండా వెరైటీ రుచులపై దృష్టిసారిస్తున్నారు. ఇలా మారుతున్న ప్రజల ఆహార అలవాట్లకు అనుగుణంగా రెస్టారెంట్లు ఏర్పాడుతున్నాయి. హైదరాబాద్ ధమ్కీ బిర్యాని అంటే ఎంత ఫేమసో... ఇప్పుడు మండి బిర్యాణి అంతే ఫేమస్‌గా మారుతోంది. ఈ బిర్యానిపై సండే స్పెషల్ కథనం మీకోసం. సాక్షి, మంచిర్యాల(ఆదిలాబాద్): హైదరాబాద్ దమ్కీ బిర్యానీలో మసాలా ఎక్కువగా ఉంటుంది. బిర్యానీలో వచ్చే చికెన్, మటన్ ముక్కలు ఉడికించి ఉంటాయి. కానీ మండి బిర్యానీలో మాత్రం మసాల చాలా తక్కువగా ఉంటుంది. కాజు, కిస్మిస్, డ్రైఫ్రూట్స్లతో పాటు, క్యారెట్, కొతిమీర తదితర వాటిని వేసి మండి బిర్యానినీ తయారు చేస్తారు. బిర్యానిని వేరుగా, చికెన్, మటన్ ముక్కలను వేరుగా చేసి, వాటిని ఒక్కచోట చేర్చి చికెన్, మటన్ మండి బిర్యానీలుగా చేస్తారు. ఈ మండి బిర్యాని ఎక్కువగా పాశ్చత్య దేశాలైన అరబ్, సౌదీ దేశాల్లో బాగా ఫేమస్, అయితే గత ఐదేళ్లుగా మంచిర్యాలలో అరేబియన్ నైట్స్, నవాబ్ వంటి పలు రకాల పేర్లతో మండి బిర్యాని కేంద్రాలు మంచిర్యాలలో ఐదు వరకు ఏర్పాటయ్యాయి. హైదరాబాద్ బిర్యానికి ఉన్న క్రేజ్ మండి బిర్యానికి ఉండడంతో, మాంసాహారులు దీనిపై ఆసక్తి చూపిస్తున్నారు. కుటుంబంలోని ప్రతి ఒక్కరు ఇంట్లో మాదిరిగా తినేలా టేబుళ్లను వేయకుండా, కిందనే పరుపులు వేసి మధ్యలో చిన్న టేబుల్‌ను ఏర్పాటు చేశారు. ఒకే ప్లేటులో తీసుకువచ్చే బిర్యానిని కుటుంబ సభ్యులు, స్నేహితులు కలిసి తినేవిధంగా ఏర్పాటు చేశారు. హాయిగా కింద కూర్చోని ప్రశాంతంగా మండి బిర్యాని తింటుంటే ఆ మజానే వేరు. ఫ్యామిలీతో వచ్చే వారికి, స్నేహితులతో వచ్చే వారికి వేర్వేరుగా మండి బిర్యాని తినేలా ఏర్పాట్లు చేయడంతో ప్రజలు ఆసక్తి చూపిస్తున్నారు. చదవండి: ఆ ధైర్యంతోనే.. దొంగ ప్యాంట్, నడుము పట్టుకుని గట్టిగా లాగినా -
భారత్‌లో బిర్యానీతో పాటు ఇది కూడా చాలా ఫేమస్..?
మోమోస్ ఫుడ్ భారతదేశంలో రికార్డుల మీద రికార్డు సృష్టిస్తుంది. ఈ మోమోస్ దేశవ్యాప్తంగా ముఖ్యంగా ఉత్తర భారతదేశంలో ఎక్కువగా తినే వంటకంగా నిలచింది. ఇటీవల ఫుడ్ డెలివరీ యాప్ జొమాటో విడుదల చేసిన నివేదికలో కూడా అదే విషయం వెల్లడైంది. జొమాటో నివేదిక ప్రకారం, 2021లో 1.06 కోట్లకు పైగా వినియోగదారులు ఈ మోమోలను ఆర్డర్ చేశారు. కరోనా మహమ్మారి కాలంలో కూడా మోమోస్ ఆహారాన్ని ఎక్కువగా ఆర్డర్ చేసినట్లు జొమాటో తెలిపింది. భారత్‌లో బిర్యానీతో పాటు మోమోస్ కూడా చాలా ఫేమస్ ఆహారంగా నిలుస్తున్నట్లు కంపెనీ తెలిపింది. జొమాటోలో అత్యంత ఎక్కువ మంది తినే ఆహార జాబితాలో మోమోస్ అగ్రస్థానంలో ఉంది. ఆన్ లైన్ ఫుడ్ డెలివరీ కంపెనీ జొమాటోలో గత ఏడాది 2021లో బిర్యానీని ఎక్కువగా ఆర్డర్ చేసినట్లు పేర్కొంది. భారతదేశంలో ప్రతి సెకనికి ఒక బిర్యానీని డెలివరి చేసినట్లు కంపెనీ తెలిపింది ఆ తర్వాత 2వ స్థానంలో దోసాను 8.8 మిలియన్లకు పైగా ఆర్డర్ చేసిన వంటకంగా వెల్లడించింది. అక్టోబర్ నెలలో జరిగిన భారత్ వర్సెస్ పాకిస్తాన్ టీ20 క్రికెట్ మ్యాచ్ సందర్భంగా జొమాటో నుంచి 10,62,710 మంది ఆన్ లైన్ ఆహారాన్ని ఆర్డర్ చేసినట్లు నివేదిక వెల్లడించింది. ఒక అహ్మదాబాద్ కస్టమర్ 2021లో రూ.33,000 విలువైన ఆహారాన్ని ఆర్డర్ చేసినట్లు జొమాటో తెలిపింది. జొమాటో, స్విగ్గీలలో ఎక్కువగా ఆర్డర్ చేసిన ఆహారంగా బిర్యానీ నిలిచింది. (చదవండి: అద్భుతం.. మైండ్‌తో ట్వీట్ చేసిన తొలి వ్యక్తి!) -
Swiggy Delivery: తెగ లాగించేశారట..!!
-
బంజారాహిల్స్: బిర్యానీ తినిపిస్తానని నాలుగేళ్ల చిన్నారిని గదిలోకి
సాక్షి, బంజారాహిల్స్: బిర్యానీ తినిపిస్తానని నాలుగేళ్ల చిన్నారిని తన గదిలోకి రప్పించిన యువకుడు లైంగిక దాడికి యత్నించిన ఘటన జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల సమాచారం మేరకు... యూసుఫ్‌గూడ రహ్మత్‌నగర్ సమీపంలోని సంతోషిమాతా టెంపుల్ వద్ద నివసించే నాలుగేళ్ల చిన్నారిని పక్కింట్లో నివసిస్తున్న శ్రీకాకుళం జిల్లాకు చెంది పెయింటర్ కోటేశ్వర్రావు ఈ నెల 20వ తేదీన మధ్యాహ్నం బిర్యానీ తిందాంరా అంటూ గదిలోకి పిలిచాడు. ఆమె వచ్చిన తర్వాత అసభ్యంగా ప్రవర్తించాడు. ఏడుస్తూ బయటికి వచ్చిన చిన్నారిని తల్లి ఏం జరిగిందని ప్రశ్నించగా కోటేశ్వర్రావు తన పట్ల ప్రవర్తించిన తీరును తల్లికి తెలిపింది. చిన్నారి తల్లి ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేసింది. జూబ్లీహిల్స్ పోలీసులు కోటేశ్వర్రావుకు ఐపీసీ సెక్షన్ 354(బి), పోక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేసి గాలింపు చేపట్టారు. చదవండి: కడుపునొప్పి పేరుతో భర్తను బయటకు పంపి.. క్షణాల్లో పెళ్లికూతురు మాయం లైంగిక దాడికి గురైన బాలికకు శిశువు జననం -
కేపీహెచ్బీలో దారుణం: ప్రాణం తీసిన ఆకలి
సాక్షి, కేపీహెచ్‌బీకాలనీ (హైదరాబాద్): ఆకలితో అలమటిస్తున్న ఓ వ్యక్తిపై మూకుమ్మడి దాడి జరగడంతో మృతి చెందిన ఘటన కేపీహెచ్‌బీ పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగు చూసింది. సీఐ కిషన్ కుమార్ వివరాల ప్రకారం.. ఒరిస్సాకు చెందిన రాజేష్ (32), భార్య, పిల్లలతో కలిసి మాదాపుర్‌లో ఉంటూ బాచుపల్లిలో నిర్మాణంలో ఉన్న ఓ భవనంలో కార్మికుడిగా పని చేస్తున్నాడు. బుధవారం రాత్రి పని ముగించుకొని ఇంటికి వచ్చే క్రమంలో జేఎన్టీయూహెచ్ మెట్రో స్టేషన్ పక్కనే ఉన్న మొఘల్స్ ప్యారడైజ్ రెస్టారెంట్ సెల్లర్‌లోకి వెళ్లాడు. అప్పటికే అక్కడ రెస్టారెంట్ మేనేజర్ అరవింద్ పుట్టిన రోజు వేడుకలు సిబ్బందితో కలిసి చేసుకుంటున్నారు. వాళ్లు తినగా మిగిలింది తనకు ఇవ్వమంటూ రాజేశ్ వాళ్లను వేడుకున్నాడు. కానీ, మానవత్వం మరిచిపోయారు. దొంగగా పొరబడి వాళ్లంతా అతన్ని చితకబాది వెళ్లిపోయారు. రాత్రంతా అక్కడే స్పృహ లేకుండా పడిఉన్న రాజేష్‌ను.. గురువారం ఉదయం హోటల్ సిబ్బంది గుర్తించారు. ఒరిస్సాలోని రాజేష్ తండ్రికి సమచారమివ్వగా అతను భార్య సత్యభామకు తెలుపడంతో ఆమె వెళ్లి ఇంటికి తీసుకొచ్చింది. ఇంటికి వెళ్లిన కాసేపటికే రాజేష్ మృతి చెందాడు. సత్యభామ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని హోటల్ సిబ్బందిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. రాజేష్‌కు ముగ్గురు కుమార్తెలు, ఒక కొడుకు ఉన్నట్లు తెలిసింది. చదవండి: భార్య, ప్రియుడి హత్య కేసు: భర్త అరెస్ట్ -
బిర్యానీలందు వసప బిర్యానీ వేరయా..!
వసప.. దాదాపు వెయ్యి జనాభా ఉన్న ఊరు. కానీ నిత్యం ఓ ఐదారొందల మంది అయినా ఆ ఊరి గడప తొక్కుతారు. చేతిలో పొట్లాలు, ముఖంపై నవ్వుతో బయటకు వెళ్తారు. వన భోజనాల సీజన్ అయితే చెప్పనక్కర్లేదు.. పసందైన సువాసనతో వసప దారిన వెళ్తున్న వారిని కూడా తన వైపు లాగేస్తుంటుంది. ఆ ఊరి బిర్యానీ మహత్యమది. చిన్న ఊరు, అంతకంటే చిన్న హొటళ్లు.. కానీ రుచి మాత్రం అమోఘం. పదిహేనేళ్లుగా అక్కడి చికెన్ బిర్యానీ అటు ఒడిశా, ఇటు ఆంధ్రా వాసులను తన దాసులుగా చేసుకుంది. ఎన్ని కొత్త రెస్టారెంట్లు పెట్టినా దీన్ని కొట్టే బిర్యానీ లేదంటే అతిశయోక్తి కాదు. కొత్తూరు: పేపర్‌పై విస్తరాకు.. అందులో ఆ మాత్రం బిర్యానీ.. మధ్యలో తళుక్కుమనే చికెన్ పీసులు.. వసప బిర్యానీ అని చెప్పే స్టాండర్డు గుర్తులవి. వాసన అదనం. రూ.120 పెడితే చేతిలోకి వచ్చేసే ఈ బిర్యానీకి ఎందుకంత ప్రత్యేకత అంటే సమాధానం కోసం వంశధార తీరంలో ఉన్న వసపకు వెళ్లా ల్సిందే. శ్రీకాకుళం జిల్లా కొత్తూరు మండలంలోని ఓ కుగ్రామం వసప. రెండు దశాబ్దాల కిందట వలసలు అధికంగా ఉన్న రోజుల్లో ఈ ఊరు నుంచి కూడా కొందరు హైదరాబాద్ వెళ్లారు. అక్కడ దమ్ బిర్యానీ తయారీ నేర్చుకున్నారు. గ్రామానికి చెందిన కొయిలాపు వెంకటరావు కూడా అందులో ఉన్నారు. అప్పట్లో దమ్ బిర్యానీ అంటే పల్లె వాసులకు పరిచయం లేని పేరే. పెళ్లి భోజనాల్లో తప్పితే హొటల్కు వెళ్లి బిర్యానీ తినే రోజులు కావవి. కానీ ఆ సమయంలోనే వెంకట రావు స్వగ్రామంలో దమ్ బిర్యానీ చేసి స్థానికులకు రుచి చూపించారు. రుచి చూసి మె చ్చుకోని వారు లేరు. అలా మొదలైన ప్రస్థానం పదిహేనేళ్లుగా రుచికరంగా కొనసాగుతోంది. కొత్తూరు, భామిని, సీతంపేట, మండలంతో పాటు హిరమండలం, పాతపట్నం, పాలకొండ, ఆమదావలస, శ్రీకాకుళం, సారవకోట, ఎల్‌ఎన్‌పేట ఒడిశాలోని కాశీనగర్, పర్లాఖిమి డి, గుణుపూర్, హడ్డుబంగి నుంచి కూడా జనాలు ఈ బిర్యానీ కోసం ఇక్కడకు వస్తుంటారు. ఐదారొందల గడప ఉండే గ్రామానికి ప్రతి నిత్యం ప్రత్యేక వాహనాలతో వందలాది మంది వస్తుంటారు. వన భోజనాల సమయంలో అయితే ఈ బిర్యానీకి మరింత గిరాకీ ఉంటుంది. వివాహాలు, శుభ కార్యాలకు ఎంత మందికైనా వీరు వండి పెడతారు. వెంకటరావు తయారు చేసే బిర్యానీకి మంచి పేరు రావడంతో మరికొందరు కూడా గ్రామంలో బిర్యానీ సెంటర్లు ప్రారంభించారు. ఇక్కడా రుచి బాగుండడంతో అన్ని చోట్లా మంచి వ్యాపారం జరుగుతోంది. నాణ్యతే ప్రధానం.. అన్ని చోట్లా బిర్యానీ తయారీకి వాడే సామగ్రినే వీరూ వాడతారు. తయారు చేసే పద్ధతి కూడా ఒకటే. కానీ ఇక్కడి వంట మాస్టర్ల హస్తవాసి బిర్యానీకి మంచి రుచిని అందిస్తోంది. నాణ్యమైన మసాలా దినుసులు, బాస్మతి బియ్యం తాజాగా ఉన్న మాంసం కొనుగోలు చేసి వెంటనే వంట చేయడం వల్ల బిర్యానీ రుచికరంగా ఉంటుందని వ్యాపారులు వెంకటరావు, రామస్వామి, రాంబాబు, సంగమ స్వామిలు తెలిపారు. కార్పొరేట్ హొటల్స్‌కు మించిన రుచి దీని సొంతమైనా ఒక పార్సిల్ ధర మాత్రం ఇప్పటికీ రూ.120. రుచి అమోఘం వసప బిర్యానీ మిగిలిన చోట్ల చేసిన బిర్యానీ కంటే ఎక్కువ రుచిగా ఉంటుంది. చాలా ఏళ్లుగా ఇక్కడి బిర్యానీ తింటున్నాను. పెద్ద పెద్ద హొటళ్ల కంటే ఇక్కడే బాగుంటుంది. ధర కూడా తక్కువ. – పిన్నింటి ప్రసాదరావు కుంటిభద్ర, కొత్తూరు మండలం ఒడిశా నుంచి వచ్చాం వసప బిర్యానీ బాగుందని తెలియడంతో ఒడిశాలోని కాశీనగర్ నుంచి వచ్చి ఇక్కడి బిర్యానీ టేస్టు చేశాం. చాలా రుచిరకంగా ఉంది. – ఇస్మాయిల్, మెగా లిఫ్ట్ ఇంజినీర్, కాశీనగర్ ఒడిశా పాతిక కిలోమీటర్ల నుంచి.. వసప బిర్యానీ తినడానికి పాతపట్నం నుంచి 25 కిలోమీటర్లు ప్రయాణించి వచ్చా. వసప బిర్యాని అనగానే నోరు ఊరిపోతుంది. తింటేనే తృప్తిగా ఉంటుంది. – తడక సోమేశ్వరరావు,పాతపట్నం టౌన్ -
హైదరాబాద్‌లో దమ్ బిర్యానీ మాత్రమే కాదు.. ఈ వెరైటీలు తెలుసా?
ఎక్కడో పుట్టి..ఎక్కడో పెరిగి.. బిర్యానీ ఎక్కడి నుంచి వచ్చింది..అసలు ఎప్పుడు తొలిసారిగా తయారు చేశారనే దానిపై ఎన్నెన్నో వాదనలున్నాయి. పర్షియా నుంచి మొఘల్స్ మన దేశానికి తీసుకువచ్చారనేది ఓ వాదన. తొలిసారిగా బిర్యానీ రుచులను 16వ శతాబ్దంలో మాత్రమే చవిచూశారని..ఆ తరువాత లోకల్ ఫ్లేవర్స్ కూడా జోడించి ప్రాంతాలను బట్టి ఇప్పుడున్న బిర్యానీలు తయారు చేస్తున్నారని చెబుతున్నారు. బిర్యానీ పుట్టుక క్రీస్తు పూర్వం 3వ శతాబ్దంలోనే అలెగ్జాండర్ దీనిని తీసుకువచ్చాడనేది మరో ప్రచారమూ ఉంది. ఎవరి వాదనలు ఎలాగున్నా.. బిర్యానీ ఇప్పుడు స్థానికీకరించబడిందన్నది మాత్రం నిజం. హైదరాబాద్ దమ్ బిర్యానీ.. కశ్మీరీ డ్రైఫ్రూట్స్ బిర్యానీ, నవాబుల కిచెన్ల నుంచి నేరుగా వచ్చిన లక్నోవీ బిర్యానీ.. సింధీ, మొగలాయి, మలబార్ అన్నీ విభిన్నం. సాక్షి, సిటీబ్యూరో: బిర్యానీ..ఆ మాటే చాలు ఆహారాభిమానులకు నోటిలో లాలాజలం ఊరటానికి! బాస్మతి బియ్యం, మాంసం లేదంటే కూరగాయలు.. కాదంటే పన్నీర్...మరో వెరైటీ..ఇలా బిర్యానీ గురించి చెప్పుకుంటూ పోతే అంతే ఉండదు. నగర ఆహారంలో ఎంతగానో మమేకమై.. అంతర్జాతీయ ప్రాముఖ్యత పొందిన హైదరాబాదీ గురించి చెప్పనక్కర్లేదు. ఇక ఈ బిర్యానీ ఇలా ఉంటే..నగరంలో మరెన్నో వెరైటీల బిర్యానీలు సైతం లభిస్తున్నాయి. అందులో కొన్ని మలబార్ బిర్యానీ, మొఘలాయ్, కలకత్తా, లక్కోవి, సింధీ పేరిట తయారు చేస్తున్న వెరైటీ బిర్యానీలు ఇప్పుడు నగరంలో హాట్ టాపిక్ అయ్యాయి. చదవండి: (నయా ట్రెండ్: నోరూరిస్తున్న బిర్యానీ.. తింటే వదల‘మండీ’) ►నగరంలో దమ్ బిర్యానీ కాకుండా ఇంకెన్నో రకాల బిర్యానీలూ కూడా లభ్యమవుతున్నాయి. ►భిన్న సంస్కృతి, విభిన్న సంప్రదాయాలు, కొత్తకొత్త అభిరుచులకు తగ్గట్టుగా ప్రస్తుతం నగరంలో పలు హోటల్స్, రెస్టారెంట్స్‌ల్లో దేశ వ్యాప్తంగా లభించే వివిధ రకాల బిర్యానీలు అంటుబాటులో ఉన్నాయి. హైదరాబాదీ బిర్యానీ.. వరల్డ్ ఫేమస్ హైదరాబాదీ బిర్యానీ నిజాం నవాబుల కిచెన్‌లో రూపుదిద్దుకున్నదనే నమ్మకం. ఇప్పటికీ మన నగరంలో ఉంది. మన హైదరాబాదీ బిర్యానీ ప్రధానంగా రెండు రకాలలో లభ్యమవుతుంది. ఒకటి పక్కీ బిర్యానీ అయితే మరోటి కచ్చీ బిర్యానీ. పక్కీ బిర్యానీ అంటే..బాస్మతి బియ్యం వేరేగా వండటంతో పాటుగా మాంసం కూడా ప్రత్యేకంగా వండి ఆ తర్వాత రెండింటినీ లేయరింగ్గా చేసి వండటం. కచ్చీ బిర్యానీ అంటే మాంసం, బాస్మతి బియ్యం, ఉల్లిపాయలు, డ్రై ఫ్రూట్స్..ఇలా అన్ని పదార్థాలు కలిపి, మైదాతో సీల్ చేసిన పాత్రలో ఉడికించి వండుతారు. నగరంలో ఎక్కువగా లభించేది ఈ బిర్యానీయే. మొఘలాయ్ బిర్యానీ అత్యంత రుచికరమైన బిర్యానీలలో ఇది ఒకటి. టోలిచౌకి ప్రాంతంలోని కొన్ని రెస్టారెంట్లు ఈ బిర్యానీ అందిస్తున్నాయి. మొఘల్ కిచెన్ నుంచి వచ్చిన అద్భుతమైన రుచులలో ఇది కూడా ఒకటి. పెరుగు, బాదం పేస్ట్, నెయ్యి, డ్రైఫ్రూట్స్, మాంసం లాంటి ముడి పదార్థాలతో ఇది తయారవుతుంది. మనహైదరాబాదీ బిర్యానీకి దగ్గర చుట్టం ఇది. ఆఫ్ఘనీ .. ఆఫ్ఘనీ బిర్యానీ కూడా నగరంలో లభిస్తుంది. అయితే పాతబస్తీలోని మొఘల్‌పురాలో ఒకటి రెండు చోట్ల ఇది రెగ్యులర్‌గా లభిస్తుంది. ఇందులో మసాలాలు తక్కువగా వినియోగిస్తారు. డ్రైఫ్రూట్స్‌తో పాటు జైఫల్, జావాత్రి, నెయ్యి ఎక్కువగా ఉపయోగిస్తారు. మలబార్ కేరళలోని మలబార్ ప్రాంతం నుంచి వచ్చిన ఈ బిర్యానీ సైతం దమ్ శైలిలోనే వండుతారు. స్వీట్ అండ్స్పైసీ బిర్యానీ ఇది. దీనిలోనూ పలు రకాలున్నాయి. అంటే ప్రాంతాన్ని బట్టిఫ్లేవర్లు కూడా మారుతుంటాయి. ఈ బిర్యానీ పంజాగుట్ట ప్రాంతంలోని పలు రెస్టారెంట్లలో ప్రత్యేకంగా అందిస్తున్నారు. సింధీ గుజరాతీలకు ప్రీతిపాత్రమైన బిర్యానీ ఇది. సింధ్ ప్రాంతపు రుచులను ఇది చవిచూపిస్తుంది. దీనిలో పచ్చిమిర్చి, రోస్టెడ్స్పైస్, పుదీనా, కొత్తిమీర, ఉల్లిపాయలు, డ్రైఫ్రూట్స్, పులిసిన పెరుగు వంటివి విరివిగా వాడతారు. సికింద్రాబాద్‌లోని ఎంజీ రోడ్డులోని సింధీ రెస్టారెంట్లో లభిస్తుంది. లక్నోవీ మన హైదరాబాద్ బిర్యానీకి దగ్గర చుట్టం ఈ లక్నోవీ బిర్యానీ. ఇది కూడా నిజామ్ల (అవధ్ ప్రాంతీయులు) కిచెన్‌లో రూపుదిద్దుకున్నదనే నమ్మకం. కాకపోతే మన హైదరాబాద్ బిర్యానీ అంత స్పైసీగా మాత్రం ఇది ఉండదు. దమ్పుక్త్ శైలిలో ఇది రూపుదిద్దుకుంటుంది. మీరాలంమండిలోని హోటల్స్‌లో ఈ బిర్యానీని ఆఫర్ చేస్తున్నారు. కలకత్తా బిర్యానీ.. ఈ లక్నోవీ బిర్యానీకి సబ్‌వేరియంట్ కలకత్తా బిర్యానీ. అదెలా అంటే, బ్రిటీషర్లను కలుసుకోవడానికి కలకత్తా వెళ్లిన అవధ్ నవాబు వాజీద్ అలీ షా ఫుడ్ పరంగా అమిత జాగ్రత్తలు తీసుకునేవాడు. ఎక్కడకు వెళ్లినా తన వంట వారిని వెంటపెట్టుకుని వెళ్లే అతను కలకత్తాకు కూడా అలాగే వెళ్లారట. అక్కడ చేసిన ప్రయోగాలకు ప్రతిరూపం కలకత్తా బిర్యానీ అన్నది ఓ వాదన. అయితే బెంగాలీల ఇతర వంటకాల్లాగానే కాస్త తియ్యదనం ఈ బిర్యానీలో ఉంటుంది. ఎల్లో రైస్, యోగర్ట్ బేస్డ్మీట్, బాయిల్డ్‌ఎగ్, బంగాళా దుంపలతో ఈ బిర్యానీ రూపుదిద్దుకుంటుంది. బెంగాలీ స్నేహితుల ఇళ్లలో మాత్రమే కాదు.. నగరంలో కొన్ని రెస్టారెంట్లలో జరిగే ఫుడ్ఫెస్టివల్స్ సమయంలో ఈ రుచులను ఆస్వాదించొచ్చు. ప్రత్యేంగా పాతబస్తీలోని ఘాన్సీబజార్‌లోని పలు బెంగాలీ హోటల్స్ అందుబాటులో ఉంది. -
నయా ట్రెండ్: నోరూరిస్తున్న బిర్యానీ.. తింటే వదల‘మండీ’
సాక్షి, పహాడీషరీఫ్: నగర వాసులను నోరూరిస్తోంది మండీ బిర్యానీ. ఇన్నాళ్లు హైదరాబాద్ బిర్యానీ రుచిని ఆస్వాదించిన ప్రజలు ఇప్పుడు అరబ్ వంటకమైన మండీ బిర్యానీపై మనసు పారేసుకుంటున్నారు. ముఖ్యంగా యువత ఈ బిర్యానీని ఆరగించేందుకు ఆసక్తి చూపుతున్నారు. జల్పల్లి, ఎర్రకుంట, షాయిన్‌నగర్, పహాడీషరీఫ్ ప్రధాన రహదారికి ఇరువైపులా ఈ మండీ హోటల్స్(మతామ్) పెద్ద ఎత్తున వెలుస్తున్నాయి. అరబిక్ భాషలో మండీ అంటే బిర్యానీ అని, మతామ్ అంటే హోటల్ అని అర్థం. ధరలు సాధారణ బిర్యానీలకు కాస్త అటూ ఇటు గానే ఉంటున్నాయి. ఒక్క ప్లేట్లో నలుగురు సంపూర్ణంగా తినవచ్చు. చదవండి: మూలుగుబొక్క బిర్యానీ..నగరంలో ఇప్పుడిదే ట్రెండ్ ! పౌష్టిక విలువలు పుష్కలం మండీ బిర్యానీ పూర్తిగా పోషక విలువలు కలిగిన ఆహారం. సాధారణ బిర్యానీలో ఉండే మసాల కారణంగా తరచూ ఆరగించే వారికి కొవ్వు పెరిగి వ్యాధుల బారిన పడుతుండడం సహజం. ఇదే విషయమై వైద్యులు కూడా హెచ్చరిస్తుంటారు.ఈ మండీ బిర్యానీ పూర్తి భిన్నం. ఇందులో ఎలాంటి మసాల వస్తువులు లేకపోవడంతో పాటు బాదం, పిస్తా, చిరంజీ, కిస్మిస్ తదితర డ్రై ఫ్రూట్స్‌ను కూడా వేస్తారు. ఎండుకారం అసలు వేయరు. తక్కువ మోతాదులో పచ్చి మిరపకాయల మిశ్రమం, తక్కువ ఉప్పు వేస్తారు. మండీలో కలుపుకొని తినేందుకు ఇచ్చే వెల్లుల్లి మిశ్రమం కూడా కొవ్వును తగ్గిస్తుందని డాక్టర్లు చెబుతున్నారు. చదవండి: బయట బిర్యానీ తింటున్నారా.. తస్మాత్ జాగ్రత్త! ఒకే పాత్రలో తినడమే ప్రత్యేకత సాధారణంగా హోటల్‌కు వెళ్లి ఎవరి ప్లేట్లో వారు అన్నం తినడం సహజం. కాని ఐదారుగురు వ్యక్తులు ఒకే ప్లేట్లో భోజనం చేయడం ఈ మండీ ప్రత్యేకత. ఇలా ఏ హోటల్లో చూసినా ఇదే కనిపిస్తుంది. నలుగురైదుగురు స్నేహితులు గ్రూప్‌గా వచ్చి సంయుక్తంగానే ఒకే ప్లేట్లో ఆరగిస్తూ తమ స్నేహబంధాన్ని చాటుకుంటారు. నగరంలోని కళాశాలల విద్యార్థులు ఐదారుగురు కలిసి వచ్చి తినడం సాధారణంగా కనిపిస్తోంది. ఈ హోటళ్లన్నీ అరబ్ స్టైల్‌ను అనుసరిస్తున్నాయి. ఏ మతామ్లోకి వెళ్లినా ఐదారుగురు కలిసి భోజనం చేసేలా చిన్న చిన్న గదులను నిర్మించి వాటిని పరదాలతో అందంగా ముస్తాబు చేసి ఉంచారు. మండీ తయారు చేసే విధానం.. మాంసం ఉడికించిన నీటిలోనే బియ్యాన్ని ఉడికించడం ఈ మండీ ప్రత్యేకత. మొదటగా మటన్/చికెన్ ముక్కలను పెద్ద పరిమాణంలో కట్ చేస్తారు. అనంతరం మాంసం ముక్కలకు తక్కువ మోతాదులో పచ్చి మిరపకాల మిశ్రమం, ఉప్పు, జైతూన్ ఆకు, పాలు, ధనియాలు, దాల్చన చెక్క, జాఫ్రాన్, జాపత్రి మిశ్రమాలను కలిపి గంట పాటు ఉంచుతారు. అనంతరం నీటిలో వేసి ఉడికిస్తారు. ఇలా ఉడికిన అనంతరం మాంసం బయటికి తీసి ఆ నీటిలోనే బియ్యం వేసి ఉడికిస్తారు. ఇలా బియ్యం ఉడికి మండీగా మారిన అనంతరం దానిలో ఖాజు, బాదం, పిస్తా, చిరంజీ, కిస్మిస్, ఖర్జూరను కలుపుతారు. ఉడికిన మాంసం ముక్కలను మంటపై కొద్దిగా కాలుస్తారు. అనంతరం ప్లేట్లో మండీ వేసి దానిపై ఈ మాంసం ముక్కలు, పచ్చి మిరపకాయలు, వెల్లుల్లి మిశ్రమాన్ని ఉంచి వినియోగదారులకు ఇస్తారు. ఆహారాన్ని బొగ్గుల పొయ్యిపైనే తయారు చేస్తున్నారు. బిర్యానీ తయారు చేసేందుకు అరబ్ దేశానికి చెందిన వంట మాస్టర్లనే వినియోగిస్తున్నారు. ప్రధాన రోహదారుల్లో వెలుస్తున్న హోటళ్లు ఎర్రకుంట ప్రధాన రహదారికిరువైపులా వెలిసిన మతామ్లతో ఆ రహదారిని ప్రస్తుతం మండీ రోడ్డుగా పిలుస్తున్నారు. ఎర్రకుంట బారా మల్గీస్ నుంచి మొదలుకొని షాహిన్‌నగర్ హైవే హోటల్ వరకు దాదాపు 30 మండీ మతామ్‌లు వెలిశాయటే ఎంత డిమాండ్ ఉందో తెలుసుకోవచ్చు. -
బెస్ట్ బిర్యానీ పంపినందుకు థ్యాంక్యూ ప్రభాస్.. వైరలవుతున్న కరీనా పోస్ట్
రెబల్ స్టార్ ప్రభాస్ తన కో యాక్టర్స్‌కి ఫుడ్ పార్టీ ఇస్తుంటాడనే విషయం తెలిసిందే. తాజాగా ‘ఆదిపురుష్’ సినిమాలో రావణ్ పాత్రలో నటిస్తున్న సైఫ్ అలీఖాన్‌కు ఈ పాన్ ఇండియా స్టార్ బిర్యానీ పంపించాడు. ఈ విషయమై బాలీవుడ్ బ్యూటీ, సైఫ్ భార్య కరీనా కపూర్ ఆదివారం ఇన్స్టాగ్రామ్ స్టోరీలో ఫొటో షేర్ చేసింది. దానికి.. ‘బాహుబలి బిర్యానీ పంపించాడంటే అది కచ్చితంగా బెస్ట్ అయ్యి ఉంటుంది. థ్యాంక్యూ ప్రభాస్, ఇలాంటి అద్భుతమైన భోజనం పంపినందుకు’ అని బ్యూటీ కామెంట్ రాసింది. ఫిట్నెస్ ఫ్రీక్ అయిన కరీనా ఫుడ్ లవర్ కూడా. తన సోదరి కరిష్మా కపూర్, బెస్ట్ ఫ్రెండ్స్‌తో కలిసి పుడ్ తింటూ ఎంజాయ్ చేస్తున్నా వీడియోలను ఎన్నో సార్లు సోషల్ మీడియాలో షేర్ చేసింది. దీంతో ప్రభాస్ పంపించిన బిర్యానీ ఆకలి పెంచింది అంటూ లొట్టలేస్తూ తినేసి ఆ విషయాన్ని ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంది. కాగా ఈ బ్యూటీ ప్రస్తుతానికి అమీర్‌ఖాన్‌తో కలిసి ‘లాల్ సింగ్ చద్దా’ నటించింది. ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. -
మూలుగుబొక్క బిర్యానీ..నగరంలో ఇప్పుడిదే ట్రెండ్ !
మొఘల్ కిచెన్‌లో రూపుదిద్దుకుని నాన్ వెజ్ ప్రియులకు ఇప్పుడెంతో ఇష్టమైన ఆహారంగా మారింది బిర్యానీ. ఎప్పడికప్పుడు బిర్యానీలో వెరైటీలు పుట్టుకొస్తున్నా చికెన్ బిర్యానీనే రాజభోగం. అందులో లెగ్పీస్కే అగ్రాసనం. ఇప్పుడా లెగ్పీస్కి ఛాలెంజ్ ఎదురైంది. నగరంలో సరికొత్త ట్రెండ్‌గా నల్లిబిర్యానీకి డిమాండ్ పెరుగుతోంది. ఊరూరా బిర్యానీ ఒకప్పుడు హైదరాబాద్ నగరానికి ప్రత్యేకం హైదరాబాద్ బిర్యానీ. కానీ దశాబ్ధ కాలంగా బిర్యానీ రెండు తెలుగు రాష్ట్రాల్లో విరివిగా విస్తరించింది. జిల్లా కేంద్రాలను దాటి మున్సిపాలిటీలకు చేరుకుంది. రోడ్డు పక్కన చిన్న షెడ్డులో కూడా టేక్ ఎవే సెంటర్లు పుట్టుకొచ్చాయి. ఇంతలా విస్తరిస్తున్నా ఎక్కడా బిర్యానీ క్రేజ్ తగ్గడం లేదు. పైగా కొత్త వెరైటీలు పుట్టుకొస్తున్నాయి. ముంబైలో బాగా ఫేమసైన నల్లి బిర్యానీ ఇప్పుడు హైదరాబాద్ రెస్టారెంట్లలో హల్చల్ చేస్తోంది. నల్లి బిర్యానీ బిర్యానీలో రారాజుగా ఉన్న చికెన్ బిర్యానీ పోటీగా ఎదుగుతోంది నల్లి బిర్యాని. మటన్‌లో నల్లి బొక్కలతో ప్రత్యేకంగా ఈ వంటకాన్ని తయారు చేయడంతో దీన్ని నల్లిబిర్యానీగా వ్యవహరిస్తున్నారు. సాధారణంగా బిర్యానీలో బాస్మతి రైస్, చికెన్ లేదా రైస్‌ను కలిపి వండుతారు. అయితే నల్లి బిర్యానీలో రైస్, నల్లి బొక్కలను వేర్వేరుగా వండుతారు. ఆ తర్వాత వీటిని కలిపి నల్లి బిర్యానీగా సర్వ్ చేస్తారు. మటన్‌లో ప్రత్యేక రుచిని కలిగి ఉండే నల్లి ఎముకలకు బిర్యానీ రెసీపీ తోడవడటంతో నల్లి బిర్యానీని లొట్టలెసుకుని తింటున్న వారి సంఖ్య పెరుగుతోంది. పెరిగిన డిమాండ్ హైదరాబాద్ నగరంలో నల్లి బిర్యానీ ట్రెండ్ క్రమంగా విస్తరిస్తోంది. బిర్యానీ ప్రియుల నుంచి డిమాండ్ ఎక్కువగా ఉండటంతో క్రమంగా నల్లి బిర్యానీ అందిస్తున్న రెస్టారెంట్లు, హోటళ్ల సంఖ్య పెరుగుతోంది. ముందుగా బంజార్‌హిల్స్, మసాబ్‌ట్యాంక్ దగ్గర రెస్టారెంట్లలో మొదలైన నల్లి బిర్యానీ ప్రస్థానం క్రమంగా హైదరాబాద్ నలుమూలలకు విస్తరిస్తోంది. సాధారణ బిర్యానీతో పోల్చితే రేటు నల్లి బిర్యానీ రేటు ఎక్కువ. అయినా సరే రేటు కంటే రుచే ముఖ్యం అంటూ నల్లిబిర్యానీకి షిఫ్ట్ అవుతున్నారు. నల్లి బిర్యానీ వండే చెఫ్‌లకు ప్రాముఖ్యత పెరిగిపోతుంది. చదవండి : అఫ్గన్ సంక్షోభం.. ఇలాగైతే బిర్యానీ రేట్లు పెరిగే ఛాన్స్! -
బిర్యానీ ప్రియులకు షాక్.. పెరిగిన రేట్లు!
అఫ్గన్ సంక్షోభం హైదరాబాద్ బిర్యానీపై ప్రభావం చూపెడుతోంది. బిర్యానీ రేట్లు పెరుగుతాయన్న ఊహాగానాలను నిజం చేస్తూ.. ఇప్పటికే చాలాచోట్ల రేట్లు పెంపును అమలు చేస్తున్నారు. హైదరాబాద్‌తో పాటు తెలంగాణలోని చాలా చోట్ల ఇప్పటికే బిర్యానీ రేట్లు పెరిగాయి. రేపు మొదటి తారీఖు (సెప్టెంబర్ 1) కావడంతో పెంచిన ధరలను అమలు చేయాలని మెజార్టీ రెస్టారెంట్ల ఓనర్లు నిర్ణయించారు. ప్రాథమిక సమాచారం ప్రకారం.. చిన్న, ఓ మోస్తరు రెస్టారెంట్లు సైతం మినిమమ్ 20 నుంచి 30 రూ. పెంచేశాయి. గరిష్టంగా రూ.100 దాకా పెరిగినట్లు తెలుస్తోంది. కొన్ని రెస్టారెంట్లు ఇప్పటికే మెనూను ఆన్లైన్ల్లో అప్డేట్ చేశాయి. పెంచిన ధరల్ని పార్శిల్‌కు సైతం వర్తింపజేయనున్నారు. అయితే కొన్ని రెస్టారెంట్లు వాటి ఆన్లైన్ ఆర్డర్లకు తప్ప.. దాదాపు మెజార్టీ హోటల్స్, రెస్టారెంట్లు బిర్యానీ రేట్లను పెంచేశాయి. సింగిల్, డబుల్ పీస్, జంబో, ఫ్యామిలీ ప్యాక్.. ఇలా దాదాపు అన్నింటిపైనా వడ్డింపు మొదలు కానుంది. కొన్ని రెస్టారెంట్లు ఆన్లైన్ బుకింగ్‌పై జీఎస్టీ, ప్యాకింగ్ చార్జీలు, డెలివరీ చార్జీలతో మోత మోగించడం ఇప్పటికే మొదలుపెట్టేశాయి. చిన్న చిన్న బిర్యానీ పాయింట్లు మాత్రం దాదాపు పాత రేట్లకే బిర్యానీని అందిస్తున్నాయి. బిర్యానీతో పాటు కబాబ్, రకరకాల మాంసాహార, శాఖాహార వంటకాల్లో వాడే డ్రై ఫ్రూట్స్, కొన్నిరకాల మసాల దినుసుల్ని అఫ్గనిస్థాన్ నుంచి భారత్ దిగుమతి చేసుకుంటోంది. ఆ దినుసుల వ్యాపారం మీద ఆధారపడి వేల కుటుంబాలు బతుకుతున్నాయి కూడా. అయితే, తాలిబన్ల ఆక్రమణ తర్వాత.. అక్కడి నుంచి వాటి దిగుమతి పూర్తి స్థాయిలో నిలిచిపోయింది. దీంతో మార్కెట్లో వాటి బల్క్ ధరలు అమాంతం పెరిగిపోయాయి. ఆ ప్రభావం ‘బిర్యానీ’పై పడగా.. రేట్లు పెంచక తప్పని పరిస్థితి నెలకొందని వ్యాపారులు చెప్తున్నారు. తిరిగి యథాస్థితి నెలకొంటే.. అప్పుడు రేట్ల తగ్గింపు గురించి ఆలోచిస్తామని కొందరు వ్యాపారులు అంటున్నారు. చదవండి: అఫ్గన్ సంక్షోభం.. ఇలాగైతే బిర్యానీ రేట్లు పెరిగే ఛాన్స్! -
ఎక్కువగా బిర్యానీ, ఫాస్ట్‌ఫుడ్ తింటున్నారా.. ఈ సమస్య రావొచ్చు
సాక్షి, విజయవాడ: విజయవాడ నగర యువత, చిన్నారులు బిర్యానీపై మనసు పారేసుకుంటున్నారు. బిర్యానీతోపాటు, నాన్‌వెజ్ వంటకాలను తరచూ లాగించేస్తున్నారు. ఆహారంలో నూనె, కార్పొహైడ్రేట్లు ఎక్కువగా ఉండటంతో చిన్న వయసులోనూ ఊబకాయులుగా మారి అనారోగ్యం పాలవుతున్నారు. మరోవైపు మధ్య వయస్సు, వృద్ధులు సంప్రదాయ, ఆర్గానిక్ ఆహారానికి మళ్లుతున్నారు. దీంతో నగరంలో ఆర్గానిక్ స్టాళ్లు వెలుస్తున్నాయి. నగరంలో బిర్యానీ, ఫాస్ట్‌ఫుడ్ వ్యాపారం జోరుగా సాగుతోంది. బిర్యానీ పాయింట్లు ఎక్కడపడితే అక్కడ వెలుస్తున్నాయి. కాలు బయట పెట్టకుండా జుమాటో, స్విగ్గీ వంటి ఆన్లైన్ సర్వీసుల ద్వారా ఇంటి వద్దకే వేడివేడిగా బిర్యానీ వచ్చేస్తున్నాయి. ఆన్లైన్లో ఆర్డర్ చేస్తున్న ఆహారంలో 90 శాతం నాన్ వెజ్ వంటకాలే ఉంటున్నాయి. ఇళ్లలో సైతం నూడిల్స్, బర్గర్లు వంటి వంటలను తయారు చేసుకుని లాగించేస్తున్నారు. ఫాస్ట్ ఫుడ్, బిర్యానీలు, కార్బోహైడ్రేడ్లు ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకోవడం యువత, చిన్నారుల్లో ఊబకాయానికి దారితీస్తోందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. చదవండి: కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్‌కు సన్మానం విజయవాడ గాయత్రి నగర్లో ఏర్పాటైన ఆర్గానిక్ స్టోర్ ఒబెసిటీతో ప్రమాదం ఇటీవల 26 ఏళ్ల యువకుడు బ్రెయిన్ స్ట్రోక్‌కు గురై ఆస్పత్రిలో చేరాడు. ఊబకాయం వల్ల మెటబాలిజం దెబ్బతిని, నియంత్రణ లేని మధుమేహం, అధికరక్తపోటు కారణంగా అతను బ్రెయిన్‌స్ట్రోక్‌కు గురైనట్లు వైద్యులు నిర్ధారించారు. చిన్నప్పటి నుంచి అధిక కార్బోహైడ్రేడ్లు ఉన్న ఆహారం తీసుకోవడం వల్ల ఈ సమస్య వచ్చినట్లు పేర్కొన్నారు. ఇలా చాలా మంది ఊబకాయంతో అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. చిన్నవయస్సులో ఒబెసిటీ ఉన్న వారిలో మధ్య వయస్సు వచ్చేసరికి మధుమేహం, రక్తపోటు, డైస్టిపీడెమియా వంటి వ్యాధులబారిన పడే అవకాశం ఉంది. బిర్యానీలు అధికంగా లాగించే వారిలో 90 శాతం మందికి ఫ్యాటీ లివర్ ఉంటున్నట్లు వైద్యులు చెపుతున్నారు. ఒబెసిటీ మహిళల్లో బ్రెస్ట్ క్యాన్సర్, ఒవేరియన్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది. రక్తనాళాల్లో కొల్రస్టాల్ గడ్డలు ఏర్పడి బ్రెయిన్‌స్ట్రోక్, హార్ట్ ఎటాక్ కూడా రావచ్చునని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. చదవండి: పుట్టింటి నుంచి అత్తింటి సారె తీసుకెళ్తూ.. ఇలా చేస్తే మేలు విద్యార్థులకు పాఠాలతోపాటు యోగా, ధ్యానంపై రోజూ గంట శిక్షణ ఇవ్వాలి. ఇంట్లో చిన్న చిన్న వ్యాయామాలు చేయాలి. కనీసం రోజులో ఏడు నుంచి ఎనిమిది గంటలపాటు నిద్రపోవాలి. ఆర్గానిక్ ఆహారానికి గిరాకీ మధ్య వయసు, వృద్ధుల ఆహార పద్ధతుల్లో మార్పులు వస్తున్నాయి. 45 ఏళ్ల వయసు దాటిన వారు పాత తరం ఆహార పద్ధతులను మళ్లీ అలవాటు చేసుకుంటున్నారు. అలాంటి వారి కోసం నగరంలో ఆర్గానిక్ పంటలు, ఆహార పదార్థాల స్టాళ్లు వెలుస్తున్నాయి. ఆర్గానిక్ కూరగాయలు, చిరుధాన్యాలను ఇటీవల కాలంలో ఎక్కువగా భుజిస్తున్నారు. -
ఆస్తి కోసం.. బిర్యానిలో నిద్రమాత్రలు కలిపి
జమ్మలమడుగు రూరల్: మానవ సంబంధాలు రోజురోజుకు మంట గలుస్తున్నాయి. ఆస్తి కోసం మమతానురాగాలను మరిచి మానవ మృగాలుగా ప్రవర్తిస్తున్నారు. ఎక్కడ వాటాకు వస్తాడోనని కిరాతకానికి ఒడిగట్టాడు మేనమామ. తన బావ మొదటి భార్య కుమారుడుని అంతమొందించాలని కుట్ర పన్నాడు. అతన్ని అడ్డు తొలగిస్తే యావదాస్తికి తన అక్క కుమారుడే వారసుడని భావించాడు. బిరియాని ప్యాకెట్టులో నిద్రమాత్రలు కలిపి హత్య చేసేందుకు కుట్ర పన్నాడు. ఈ సంఘటన బుధవారం దేవగుడిలో చొటు చేసుకొంది. పట్టణ సీఐ వెంకటేశ్వర్లు కథనం మేరకు.. జమ్మలమడుగు మండలం దేవగుడికి చెందిన సైలాస్‌కు 15 ఏళ్ల కిందట కనకమ్మతో వివాహం జరిగింది. వీరికి అఖిల్ అనే కుమారుడు జన్మించాడు. కొన్నేళ్ల తర్వాత కనకమ్మ మృతి చెందింది. సైలాస్ పుష్పలత అనే మహిళను రెండో వివాహం చేసుకున్నాడు. ఈమెకు ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. మొదటి భార్య కుమారుడు అఖిల్ జమ్మలమడుగు ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో చదువుతున్నాడు. సైలాస్‌కు రెండున్నర ఎకరాల భూమి ఉంది. ఆస్తిలో అఖిల్ వాటాకు వస్తాడని పుష్పలత తమ్ముడు రమేష్ దుర్బుద్ధితో ఆలోచించాడు. ఎలాగైనా అతన్ని అంతమొందించాలనుకున్నాడు. బుధవారం పట్టణానికి వచ్చి బిరియాని పాకెట్టు కొనుగోలు చేశాడు. అందులో కొన్ని నిద్రమాత్రలు వేసి మరో వ్యక్తి చేతికి ఇచ్చాడు. ‘మీ తండ్రి పంపించాడని అఖిల్‌కు ఇవ్వమని’చెప్పాడు. అఖిల్ తన స్నేహితులతో కలిసి బిరియాని తిన్నారు. కాసేపైన తర్వాత ముగ్గురు కుప్పకూలిపోయారు. గ్రహించిన అధ్యాపకులు, విద్యార్థులు స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు హత్య కేసు నమోదు చేసినట్లు సీఐ తెలియజేశారు. -
మున్సిపల్ కమిషనర్ నాన్‌వెజ్ ఆర్డర్ .. బిర్యానీలో బొద్దింకలు..
సాక్షి, నిర్మల్(ఆదిలాబాద్):‘చలో.. నడుబై మస్తు బిర్యానీ తిందాం..’ అంట పేరున్న హోటళ్లలో చాలామంది దావత్‌లు చేసుకోవడం సాధారణమైంది. పెద్దపెద్ద బిల్డింగ్‌లలో, హైఫై ఏర్పాట్లతో, ‘గ్రాండ్’గా ఉన్న పేర్లను చూసి పోతుంటారు. ఫైవ్‌స్టార్ రేంజ్లో ఆర్డరు తీసుకోవడం చూసి సంబరపడతారు. ‘ఆ.. రెండు చికెన్, ఒకటి మటన్ బిర్యానీ తీసుకురా.. చికెన్ల లెగ్‌పీస్ ఉండాలె..’అని ఆర్డర్లు ఇస్తుంటారు. ఇక ఆ తర్వాత హోటల్ వాళ్లు పైపై మెరుగులు అద్ది, వేడివేడీగా వడ్డిస్తారు. నచ్చిన తిండి ముందుకు వచ్చింది కదా.. అని ఏమాత్రం చూసుకోకుండా తింటే.. ఇక అంతే సంగతులు. మీ అదృష్టం కొద్ది అందులో ఏ పురుగులో, బొద్దింకలో ఫ్రీగా రావచ్చు. లేదంటే కుళ్లిన చికెన్, మురిగిన మటనే రంగులు అద్దుకుని మీకు అందవచ్చు. ఇదేంటీ.. ఇలా అంటారా..! జిల్లాకేంద్రంలో ఇలాగే జరిగింది. అదికూడా పోయిపోయి సాక్షాత్తు మున్సిపల్ అధికారులకే ఎదురు కావడం సర్వత్రా చర్చనీయాంశమైంది. అలా వెళ్తే.. ఏదో అలా.. సిబ్బంది కలిసి మధ్యాహ్న భోజనం చేద్దామని నిర్మల్ మున్సిపల్ కమిషనర్, ఇతర అధికారులు, సిబ్బంది స్థానిక మంచిర్యాల రోడ్డులో బయటకు ఆకట్టుకునేలా ఉన్న ఓ ‘గ్రాండ్’ హోటల్ కు వెళ్లారు. నాన్‌వెజ్ తినేందుకు ఆర్డర్ ఇచ్చారు. వారు ఇచ్చిన ఆర్డర్ మేరకు వేడీగా బిర్యానీలు వచ్చేశాయి. వాటిని తింటూ ఉంటే.. ముందుగా ఒకరికి ఓ పురుగు వచ్చింది. సర్లే.. ఏదో వచ్చిందనుకున్నారు. కాసేపటికే మరో ఇద్దరికీ అలాగే జరిగింది. ఇందులో ఏదో తేడా ఉందని మున్సిపల్ కమిషనర్ వెంటనే కిచెన్‌ను పరిశీలించేందుకు వెళ్లారు. అంతే.. అక్కడి వాతావరణం, ఫ్రిజ్‌లలో ఎప్పుడో నిల్వ చేసిన నాన్‌వెజ్‌లను చూసి అవాక్కయ్యారు. మిగతా అధికారులు, సిబ్బంది కూడా వచ్చి పరిశీలిస్తే.. అందులో కుళ్లిన చికెన్, మటన్, రెండుమూడు రోజుల క్రితం చేసి పెట్టిన లెగ్‌పీసులు నిల్వ చేసి ఉంచారు. పేరుకే పెద్ద హోటళ్లు.. జిల్లాలో చాలా హోటళ్లలో ఇదే తీరు ఉంది. పేరుకేమో పెద్ద హోటళ్లు కానీ.. లోపల కిచెన్లలో ఏమాత్రం పరిశుభ్రత పాటించడం లేదు. మున్సిపల్ అధికారులు పరిశీలింన సదరు ‘గ్రాండ్’లో హోటల్ కిచెన్‌రూం మధ్యలో నుం ఓపెన్ డ్రెయినేజీ ఉంది. వండిన బిర్యానీ పాత్రను దానిపైనే ఉంచారు. పక్కనే చెత్త, మురికిని పట్టించుకోకుండా అలాగే వండిన పదార్థాలను పెట్టేశారు. ఇక ఫ్రిజ్‌లలో కుక్కిన నాన్‌వెజ్‌ను చూస్తే ఎప్పుడో వారం క్రితం పెట్టినట్లు ఉన్నాయి. అందులో చాలా వరకు కుళ్లిపోయి. వాటినే కట్‌చేసి కస్టమర్లకు వండిస్తుండటం గమనా ర్హం. ఇక్కడే కాదు.. చాలా హోటళ్లల్లోన ఇలాంటి పరిస్థితే ఉంది. ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లు, చిన్న హోటళ్లలో మరీ దారుణంగా కనీస పరిశుభ్రతను పాటించడం లేదు. కల్తీ నూనెలను, కుళ్లిన పదార్థాలకు రంగులు అద్దుతూ వడ్డిం చేస్తున్నారు. తమ విధుల ప్రకారం తరచూ తనిఖీలు చేస్తే మున్సిపల్ అధికారులకు ఇలా ఎదురయ్యేది కాదని పలువురు సోషల్ మీడియాల్లో పోస్టులు పెట్టడం కొసమెరుపు. చర్యలు తప్పవు.. ప్రతి హోటల్లో కచ్చితంగా పరిశుభ్రత పాటించా లి. నిల్వ చేసినవి కాకుండా తాజా పదార్థాలతో వండినవే ప్రజలకు అందించాలి. లేనిపక్షంలో కఠిన చ ర్యలు తప్పవు. మంచిర్యాలరోడ్డులో గల హో టల్లో కిచెన్‌ను సీజ్ చేశాం. ర.50వేల ఫైన్‌కూడా వేశాము. యాజవన్యం సదరు జరిమానాను చెల్లించారు. –బాలకృష్ణ, మున్సిపల్ కమిషనర్ -
మహిళా ఐపీఎస్‌ను చిక్కులో పడేసిన ‘ఫ్రీ బిర్యానీ ఆర్డర్’
అధికారం చేతిలో ఉందని ఓ మహిళా పోలీస్ అధికారిణి చేసిన పని చివరికి ఆమెకు తలనొప్పిని తెచ్చిపెట్టింది. మహిళా ఐపీఎస్ అధికారిణి ఉచితంగా బిర్యానీ ఆర్డర్ చేయడం, ఈ విషయం ప్రభుత్వం వరకు చేరడంతో పోలీసు వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. దీనికి సంబంధించిన ఆడియో క్లిప్ శుక్రవారం సోషల్ మీడియాలో వైరల్ అవడంతో ఈ విషయం ఆ రాష్ట్ర హోంమంత్రి వరకు వెళ్లింది. వెంటనే ఈ ఘటనపై విచారించాలని పోలీసులను ఆదేశించారు. మహారాష్ట్రలో డిప్యూటీ కమిషనర్ ర్యాంకులో మహిళా ఐపీఎస్ అధికారిణి తన సబార్డినేట్‌తో విశ్రాంబాగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఏ రెస్టారెంట్లో మంచి బిర్యానీ దొరుకుతుందని అడిగి తెలుసుకున్నారు. దీనికి అతను దేశీ ఘీ రెస్టారెంట్ అక్కడ ఫేమస్ అని చెప్పడంతో మటన్ బిర్యానీ తెప్పించాలని కోరింది. రెస్టారెంట్ వాళ్లు డబ్బులు అడిగితే స్థానిక పోలీస్ ఇన్స్పెక్టర్తో మాట్లాడించమని చెప్పింది. ఎందుకంటే తమ పరిధిలో డబ్బులు చెల్లించాల్సిన అవసరం ఉందా అని మహిళా అధికారిణి అడిగింది. దీనికి సబార్డినేట్ ‘మేము ఎప్పుడు బయట నుంచి ఆహారం ఆర్డర్ చేసినా డబ్బులు చెల్లించేవాళ్లం’ అని చెప్పాడు. దీనిపై స్పందించిన మహిళా ఐపీఎస్ ‘ఇప్పుడు సమస్య ఏంటి మా పరిధిలో ఉన్న రెస్టారెంట్‌కు కూడా డబ్బులు చెల్లించాలా, అక్కడి ఇన్స్పెక్టర్ చూసుకుంటాడని తెలిపింది. అయితే దీనికి సంబంధించిన ఈ ఆడియో క్లిప్ నెట్టింట వైరల్‌గా మారడంతో ఈ విషయంపై ఐపీఎస్ అధికారిణి స్పందించింది. తన ఆడియో క్లిప్‌ను మార్ఫింగ్ చేశారని ఆరోపించింది. ఇదంతా సీనియర్ పోలీసు అధికారులను బదిలీ చేసే ప్రక్రియ జరుగుతున్నప్పుడు బయటపడిందన్నారు. ‘ఇది నాపై వ్యతిరేకంగా జరుగుతున్న కుట్ర. నేను చేస్తున్న జోన్లో కొన్నేళ్లుగా కొంతమంది ఇక్కడే పనిచేస్తున్నారు. వారి ఆర్థిక ప్రయోజనాలు ఇక్కడే ఉన్నాయి. ఈ కుట్రలో కొందరు సీనియర్ అధికారులు కూడా ఉన్నారు. నేను ఇక్కడ బాధ్యతలు స్వీకరించిన తరువాత వారి కార్యకలాపాలు ఆగిపోయాయి. అందుకే నన్ను తొలగించాలనే అక్కసుతో ఇదంతా చేశారు’ అని తెలిపారు. దీనిపై సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయించబోతున్నట్లు తెలిపారు. ఇదిలా ఉండగా ఈ తతాంగమంతా ఆ రాష్ట్ర హోం మంత్రికి చేరింది. ఈ విషయంపై విచారణ జరిపి నివేదిక సమర్పించాలని పూణే పోలీస్ కమిషనర్ని కోరారు. దీనిపై ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందన్నారు. -
5 పైసలకే నోరూరించే బిర్యానీ.. ఎగబడ్డ జనం
మధురై (తమిళనాడు): బిర్యానీ పేరు చెబితేనే మన నోరూరుతుంది. బిర్యానీ నచ్చని భోజనప్రియులు ఎవరు ఉండరంటే అతిశయోక్తి కాదు. అలాంటి బిర్యానీని కేవలం ఐదంటే ఐదు పైసలకు అందిస్తే ఇంకేం ఎగబడి తింటారు. ఇలాగే ఓ హోటల్ ప్రారంభ ఆఫర్‌గా ప్రకటిస్తే జనాలు ఎగబడి తిన్నారు. ఆ ఆఫర్ కొన్ని షరతులతో విధించినా కూడా అనూహ్య స్పందన రావడంతో ఆ హోటల్ కిటకిటలాడింది. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు వైరల్‌గా మారాయి. సెల్లూర్‌లో బిర్యానీ కోసం ఎగబడిన ప్రజలు తమిళనాడులోని మధురై జిల్లా సెల్లూర్‌లో సుకన్య బిర్యానీ హోటల్ ప్రారంభమైంది. ప్రారంభ ఆఫర్‌గా 5 పైసల నాణెం తీసుకొస్తే బిర్యానీ ఉచితంగా అందిస్తామని ప్రకటించారు. చెల్లని ఐదు పైసల నాణెం ఎవరి వద్ద ఉంటాయని భావించిన హోటల్ యాజమాన్యానికి ఊహించని రీతిలో స్పందన ఎదురైంది. పెద్ద ఎత్తున జనాలు ఐదు పైసల నాణెం తీసుకుని వచ్చి హోటల్ ముందు వరుస కట్టారు. చిన్నాపెద్దా అందరూ ఎగబడడంతో ఆ హోటల్ తాకిడిని తట్టుకోలేకపోయింది. 300 మందికి ఆ నాణెలు తీసుకొచ్చారు. అయితే బిర్యానీ ధ్యాసలో పడి కరోనా సోకే విషయాన్ని మరిచి ఎగబడ్డారు. అంతమంది తరలిరావడంతో యాజమాన్యం హోటల్ షట్లర్లు మూసేసింది. ఆలస్యంగా వచ్చిన కొందరు నాణెం ఇచ్చి బిర్యానీ అడగ్గా ఇవ్వలేదు. గతంలో దిండిగల్ పట్టణంలో కూడా ఇలాంటి ఆఫర్ ప్రకటించారు. జనాల తాకిడికి దుకాణం మూసివేసిన నిర్వాహకులు -
బయట బిర్యానీ తింటున్నారా.. తస్మాత్ జాగ్రత్త!
సాక్షి, రామచంద్రపురం: బిర్యానీ, నూడిల్స్, చికెన్ జాయింట్లు, మటన్ ధమ్ బిర్యానీ, పిజ్జాలు, బర్గర్లు, స్వీట్లు, పప్పులు, పాలు, నీళ్లు ఇలా కల్తీకి కాదు ఏదీ అనర్హం అన్నట్టు ఉన్నాయి. ఆహార పదార్థాల తయారీలో అక్రమాలకు పాల్పడడంతో ప్రజారోగ్యం దెబ్బతింటోంది. ఇటీవల కాలంలో ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లు, హోటల్స్‌లో సేల్స్ పెరగటంతో ప్రజారోగ్యాన్ని పక్కన పెట్టి తయారీలో విచ్చలవిడిగా ఎసెన్సులు, ఇతర రంగులను వాడుతున్నారు. ప్రజారోగ్యానికి పెద్ద పీట వేసిన ప్రభుత్వం వాటిని అరికట్టేందుకు సిద్ధమైంది. ఇటీవల ఆహార పదార్థాల కల్తీ నియంత్రణ అధికారులు హోటల్స్, సూపర్ మార్కెట్లు, బేకరీల్లో నిర్వహిస్తున్న ఆకస్మిక దాడుల్లో విచ్చలవిడి రంగుల వాడకం బయట పడింది. లెసెన్స్‌లు లేకుండా నిర్వహణ ఆహార పదార్థాలు తయారు చేసేవారు, నిల్వ చేసే వ్యాపారస్తులు, రవాణా చేసే సంస్థలు లైసెన్స్‌లు తీసుకోవాలి. ఆహార భద్రతా నియమావళి ప్రకారం లైసెన్సులు లేకుండా వ్యాపారం చేస్తే సెక్షన్ 63 ఎఫ్ఎస్ఎస్సీ యాక్ట్ 2006 ప్రకారం కేసులు నమోదు చేసి రూ. 5లక్షల జరిమానా, 6 నెలల జైలు శిక్ష విధిస్తారు. జిల్లాలో గల ఆహార పదార్థాల అమ్మకాలు, రవాణా, నిల్వ చేసే వ్యాపార, వాణిజ్య సంస్థలు 75శాతం లైసెన్సులు లేకుండానే నిర్వహిస్తున్నారని తెలుస్తోంది. రంగులు కలిపిన బిర్యానీ శాంపిల్స్‌ను తీస్తున్న ఫుడ్ కంట్రోల్ జాయింట్ కమిషనర్ పూర్ణ చంద్రరావు విస్తృతంగా దాడులు ఆహార కల్తీ నియంత్రణ అధికారులు విస్త్రృతంగా దాడులు నిర్వహిస్తున్నారు. మండపేట, రామచంద్రపురం పట్టణాల్లో హోటల్స్, సూపర్ మార్కెట్లపై దాడులు నిర్వహించగా ఆహార భద్రతా నియమాళికి విరుద్ధంగా విక్రయిస్తున్నట్లు గుర్తించారు. 90శాతం హోటల్స్ లైసెన్సులు లేకుండా వ్యాపారం చేస్తున్నట్లు వెలుగు చూసింది. 30కిపైగా చికెన్, పప్పులు, నిల్వ మాంసం, బిర్యానీ, వంటకాల్లో వాడుతున్న కలర్స్ వంటి వాటి శాంపిల్స్‌ను సేకరించిన అధికారులు పరీక్షల నిమిత్తం హైదరాబాద్‌లో ల్యాబ్‌కు పంపించారు. 15రోజుల్లో ఫలితాలు రానున్నాయి. వీటిని బట్టి ఆయా షాపులు, హోటల్స్‌పై చర్యలు తీసుకొంటారు. నిల్వ మాంసంతో సమస్యలు చికెన్, మటన్, బిర్యానీ, బేకరీల్లోను, స్వీట్స్ తయారీల్లోను ఎసెన్స్, సింథటిక్ రంగులు అధికంగా వేస్తుండటంతో క్యాన్సర్ వంటి వ్యాధులు సంక్రమించే అవకాశం ఉంది. హోటల్స్‌లో చికెన్, మటన్, రొయ్యలు ఎక్కువ రోజులు డీప్ ఫ్రిజ్‌లో ఉంచి వాడుతున్నారు. నిల్వ మాసం తింటే అజీర్తి సమస్యలు, ముఖ్యమైన అవయవాలు పనిచేయకపోవటం వంటి సమస్యలు వస్తాయి. -
వాళ్లందరికీ కమెడియన్ అలీ బిర్యానీ దావత్
వెంకటేష్, వరుణ్‌తేజ్ ప్రధానపాత్రల్లో నటించిన చిత్రం ఎఫ్ 2. ఫ్యామిలీ ఎంటర్టైనర్గా వచ్చిన ఈ చిత్రం బ్లాక్‌బస్టర్ హిట్‌ను నమోదు చేసుకుని రికార్డు సృష్టించిన విషయం తెలిసిందే. దీంతో డైరెక్టర్ అనిల్ రావిపూడి దీనికి సీక్వెల్‌ను ప్లాన్ చేశాడు. మళ్లీ ఇదే ఇద్దరు హీరోలను పెట్టి ఎఫ్ 3 సినిమా తీస్తున్నాడు. ఇందులో మెహరీన్, తమన్నా హీరోయిన్లుగా నటిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్లో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మిస్తున్నాడు. ఈ సినిమాలో కమెడియన్ అలీ ముఖ్య పాత్ర పోషిస్తున్నాడు. తాజాగా అతడు ఎఫ్ 3 మూవీ టీమ్‌కు మాంచి విందు భోజనం ఏర్పాటు చేశాడు. సెట్లో ఉన్నవారందరికీ మటన్ బిర్యానీ తినిపించాడు. అది కూడా ఇంట్లో సిద్ధం చేసిన బిర్యానీ! ఇంకేముందీ.. ఆ బిర్యానీని చూడగానే లొట్టలేసుకుని తిన్నారు చిత్రయూనిట్ సభ్యులు. బిర్యానీ ఎంతో రుచికరంగా ఉందంటూ అనిల్ రావిపూడి ఇన్‌స్టాగ్రామ్‌లో ఫొటో పోస్ట్ చేశాడు. 'అలీ గారు ఇంట్లో వండించి తీసుకొచ్చి మాకు వడ్డించారు' అని చెప్పుకొచ్చాడు. అయితే ఈ బిర్యానీ టేస్ట్‌ను హీరోహీరోయిన్లు మిస్ అయినట్లు తెలుస్తోంది. View this post on Instagram A post shared by Anil Ravipudi (@anilravipudi) -
బిర్యానీ బాలేదన్న యువకులపై హోటల్ సిబ్బంది దాడి
సాక్షి, హైదరాబాద్: స్నేహితుడితో కలిసి బిర్యానీ తినేందుకు వెళ్లగా హోటల్ సిబ్బంది చితకబాదిన సంఘటన హైదరాబాద్‌లోని మైలార్‌దేవ్‌పల్లిలో చోటుచేసుకుంది. మటన్ బిర్యానీ బాగా లేదని చెప్పడంతో మొదలైన వాగ్వాదం పరస్పరం దాడి చేసుకునే స్థాయికి చేరుకుంది. మైలార్‌దేవ్‌పల్లి ప్రాంతంలోని దుర్గానగర్‌లో ఉన్న మెఫిల్ హోటల్‌కు ఇద్దరు స్నేహితులు వచ్చారు. మటన్ బిర్యానీ ఆర్డర్ ఇచ్చి తింటుండగా రుచీ, నాణ్యత లేదని గుర్తించి హోటల్ సిబ్బందికి ఫిర్యాదు చేశారు. దీంతో వాగ్వాదం మొదలు కాగా ఆగ్రహంతో హోటల్ సిబ్బంది ఆ ఇద్దరు యువకులపై దాడికి పాల్పడ్డారు. హోటల్ సిబ్బంది దాడిలో ఒకరు తీవ్ర గాయాలయ్యాయి. లాక్డౌన్ నిబంధనలు పాటించకుండా యథాతథంగా మెఫిల్ విక్రయాలు కొనసాగుతున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. కర్ఫ్యూ సమయంలో రహాస్యంగా బిర్యానీ విక్రయిస్తున్న హోటల్ యాజమాన్యంపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ హోటల్‌పై గతంలో నాణ్యత లేని ఆహారం అందించడంతో భోజనప్రియులు ఆందోళన చేశారు. -
కేటీఆర్‌ని సోనూ సూద్ ఏమి కోరారో తెలుసా?
సాక్షి, హైదరాబాద్: మీరు రియల్ హీరో, మీరే రియల్ హీరో అంటూ ట్విట్టర్ వేదికగా ఒకరినొకరు పొగుడుకున్న తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్, నటుడు సోనూసూద్ మధ్య మరింత స్నేహం బల పడుతోంది. కరోనా మహమ్మారి నేపథ్యంలో మొదటినుంచీ వలసకార్మికులు మొదలు అపన్నులందరికీ అండగా నిలిచారు సోనూసూద్. అలాగే కరోనాకాలంలో, ముఖ్యంగా సెకండ్ వేవ్ రాష్ట్రాన్ని పట్టి కుదుపుతున్న తరుణంలో మంత్రి కేటీఆర్ ట్విటర్ ద్వారా చాలామందికి సాయం అందిస్తూ.. తన సహచరులతో కలిసి 24 గంటలూ బాధితులకు అండగా నిలుస్తున్నారు. ఈ నేపథ్యంలో ఒక నెటిజనుడు కేటీఆర్‌ను ప్రశంసిస్తూ మీరు రియల్ హీరో అంటూ ట్వీట్ చేశారు. దీనికి ఒక ప్రజా ప్రతినిధిగా, మంత్రిగా తన బాధ్యతను నిర్వర్తిస్తున్నానంటూ మంత్రి సమాధానం ఇచ్చారు. అంతేకాదు నిజానికి రియల్ హీరో సోనూసూద్ అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు. దీంతో ఒక్కసారిగా ట్విటర్లో సందడి నెలకొంది. దీనికి స్పందించిన సోనూ కాదు కాదు.. మీరే రియల్ హీరో అటూ కేటీఆర్‌ను అభినందించారు. కేటీఆరే నిజమైన హీరో అని, ఆయన నాయకత్వంలో తెలంగాణ అభివృద్ధి చెందుతోందని సోనూ పేర్కొనడం విశేషం. ఆ తరువాత మీరు ప్రారంభించిన సేవా కార్యక్రమాలను కొనసాగించాలని.. లక్షలాదిమందికి ప్రేరణగా నిలుస్తున్నారంటూ సోనూని కేటీఆర్ కొనియాడారు. కేటీఆర్, సోనూ సూద్‌ల ట్విటర్ స్టోరీ ఇంతటితో ముగియలేదు. డియర్ బ్రదర్ ఈసారి హైదరాబాద్ వచ్చినప్పుడు మిమ్మల్ని కలవాలని ఆశపడుతున్నా. నా మిషన్ కొనసాగుతూనే ఉంటుంది.. మీరు చాలామందికి స్ఫూర్తిగా నిలుస్తున్నారంటూ సోనూ సూద్ ట్వీట్ చేశారు. దీనికి సమాధానంగా.. ఎదురు చూస్తున్నా.. ఈసారి హైదరాబాద్ వచ్చినపుడు కలుద్దాం అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు. అంతే దీనికి ఏమాత్రం తగ్గని సోనూసూద్... కేటీఆర్‌ను ఏమి కోరారో తెలుసా.. తనకు హైదరాబాద్ బిర్యానీ సిద్ధంగా ఉంచాలన్నారు. అంతేకాదు ముంబై నుంచి మంచి రుచికరమైన వంటకాలను తీసుకొస్తానని హామీ కూడా ఇచ్చారు. చదవండి: అది నేను కాదు.. సోనూసూద్: కేటీఆర్ Yes brother, I will keep this mission ON. Completely looking forward to meet you, when I come to Hyderabad Next! You have been an inspiration for many! https://t.co/lJu202zrxd — sonu sood (@SonuSood) June 1, 2021 Same here sir. Will get some delicacies for you from Mumbai and you have to keep the Hyderabad biryani ready, really soon.🙏🇮🇳 https://t.co/SXQ1myvLrU — sonu sood (@SonuSood) June 1, 2021 -
రైస్‌లెస్ చికెన్ బిర్యానీ ఎలా తయారు చేయాలో తెలుసా?
బిర్యానీ నచ్చని భోజన ప్రియులు ఎవరు ఉండరంటే అతిశయోక్తి కాదు. బిర్యానీని ఎన్ని రకాలుగా తయారు చేసినా లొట్టలేసుకుని మరీ ఆరగిస్తాం. ఇంకా ఎందుకు ఆలస్యం, రైస్‌లెస్ చికెన్ బిర్యానీ ఎలా తయారు చేయాలో తెలుసుకోండి.. కావాల్సిన పదార్థాలు: చికెన్– 300 గ్రాములు; సేమియా– ఒక కప్పు; అల్లం వెల్లుల్లి పేస్టు– ఒక స్పూన్ ; నల్లమిరియాలు– ఒక స్పూన్ ; దాల్చిన చెక్క ముక్క– మీడియం సైజు ఒకటి; యాలకులు– ఆరు; లవంగాలు– రెండు; సోంపు– అర స్పూన్ ; నెయ్యి– రెండు స్పూన్లు; ఆయిల్– ఒక స్పూను; షాజిరా– అరస్పూన్ ; నల్ల జీలకర్ర– అర స్పూన్ ; బిర్యానీ ఆకు–ఒకటి; అనాస పువ్వు– ఒకటి; పచ్చిమిర్చి–మూడు; పుదీన– చిన్న కట్ట; ఉల్లిపాయలు– సన్నగా తరిగిన కప్పు ఉల్లి తరుగు; ఉప్పు– రుచికి సరిపడినంత; పసుపు– పావు స్పూన్ ; దనియాల పొడి– అర స్పూన్ ; కారం– అర స్పూన్ ; టమోట– ఒకటి; నీళ్లు – రెండు కప్పులు. తయారీ విధానం: ► ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకోవాలి. పాన్ వేడెక్కాక మిరియాలు, షాజీరా, దాల్చిన చెక్క, యాలకులు, అనాస పువ్వు, లవంగాలు, సోంపు వేసి దోరగా వేయించాలి. ఇవి చల్లారక అన్ని మిక్సీలో వేసి పొడిలాగ గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ► తరువాత బిరియానీ ఉడికేందుకు సరిపడా మరో పాన్ తీసుకుని దానిలో కొద్దిగా నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేడెక్కాక సేమియాను వేసి బంగారు వర్ణం వచ్చేంతవరకు వేయించి పక్కన పెట్టుకోవాలి. తరువాత అదే పాన్‌లో ఒక స్పూన్ నూనె, మిగిలిన నెయ్యి వేసి కాగిన తరువాత దానిలో నల్ల జీలకర్ర, బిర్యానీ ఆకు, చీలికలుగా కోసిన పచ్చిమిర్చి, పుదీనా ఆకులు, ఉల్లిపాయ తరుగు వేసి మగ్గనివ్వాలి. కాసేపయ్యాక ఈ పాన్‌లో చికెన్, అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు, దనియాల పొడి, కారం, గ్రైండ్ చేసిపెట్టుకున్న మసాల పొడి, కొద్దిగా ఉప్పు వేసి ఇరవై నిమిషాల పాటు ఉడకనివ్వాలి. ► పదినిమిషాలయ్యాక విత్తనాలు తీసేసి సన్నగా తరిగిన టమోట ముక్కలను వేయాలి. టమోటా ముక్కలు మగ్గిన తర్వాత రోస్ట్ చేసి పెట్టుకున్న సేమియా వేసి రెండు కప్పులు నీళ్లు పోయాలి. రెండు నిమిషాలు మగ్గిన తరువాత రుచికి సరిపడా ఉప్పువేసి మరికాసేపు ఉడకనివ్వాలి. చికెన్ ముక్కలు, సేమియా ఉడికాయని నిర్ధారించుకున్న తర్వాత స్టవ్ ఆపేసి పాన్‌ను ఐదు నిమిషాలపాటు అలాగే స్టవ్ మీద ఉంచాలి. ఐదు నిమిషాలయ్యాక వేడివేడిగా సర్వ్ చేసుకుంటే రైస్‌లెస్ చికెన్ బిర్యానీ ఎంతో రుచిగా ఉంటుంది. చాలా త్వరగా సింపుల్‌గా తయారయ్యే రైస్‌లెస్ చికెన్ బిర్యానీని మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. చదవండి: సుబ్బారావు గ్రేట్.. నారింజ రసం సూపర్ -
బిర్యానీ ఇవ్వలేదని హోటల్‌పై పెట్రోల్ బాంబు
తిరువళ్లూరు: ఉచితంగా బిర్యానీ ఇవ్వలేదని హోటల్‌పై పెట్రోల్ బాంబు విసిరిన ఘటన తిరువళ్లూరు జిల్లా తిరుమళిసైలో కలకలం రేపింది. అరుణాచలపాండ్యన్, మహారాజన్, గణేశన్ అనే ముగ్గురు వ్యక్తుల స్థానికంగా కస్తూరీ భవన్ పేరుతో హోటల్ నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో సోమవారం మధ్యాహ్నం కొందరు గుర్తుతెలియని వ్యక్తులు హోటల్‌కు వచ్చారు. రౌడీషీటర్ ఎబిన్ పేరు చెప్పి ఉచితంగా బిర్యానీ ఇవ్వాలని బెదిరించారు. బిర్యానీ అయిపోయిందని నిర్వాహకులు చెప్పడంతో ఆగ్రహించారు. ఎబిన్ అడిగితేనే బిర్యానీ లేదంటారా..? మీ సంగతి తేలుస్తాం అంటూ వెళ్లిపోయారు. కాసేపటి తర్వాత 4బైక్‌లపై 8మంది వచ్చి హోటల్‌పై పెట్రోల్ బాంబు విసిరారు. దీనిపై హోటల్ నిర్వాహకులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుల కోసం గాలింపు మొదలుపెట్టారు. చదవండి: చికెన్, మటన్ గొడవ..! నిండు ప్రాణం బలి -
హైదరాబాద్‌లో రూ. 60కే ‘తిన్నంత బిర్యానీ’
సాక్షి, హైదరాబాద్: నగరంలో బిర్యానీ అంటే తెలియనివారు ఉండరు. వారాంతపు సెలవుల్లో బిర్యానీ సెంటర్లల్లో జనాలు బారులు తీరుతారు. అయితే మంచి బిర్యానీ కోసం భాగ్యనగర వాసులు ఎక్కడినైనా వేళ్లడానికి ఆసక్తి చూపుతారు. చిన్నా, పెద్ద ఇష్టంగా ఆరగించే బిర్యానీ.. పెద్ద హోటళ్లలో లభిస్తున్నప్పటికీ సామాన్యులు తినాలంటే మాత్రం భారంగా మారుతోంది. కానీ, హైదరాబాద్‌లో ఇప్పుడు వేడివేడి బిర్యానీ కేవలం రూ. 60 లభిస్తోంది. అది ఎక్కడని అశ్చర్యపోకండి. ఉప్పల్ చౌరస్తా నుంచి రామంతాపూర్‌కు వెళ్లే మార్గంలో ‘తిన్నంత బిర్యానీ’ పాయింట్లో రుచికరమైన బిర్యానీ లభ్యమవుతోంది. వివరాలు.. ఉదయ్, కిరణ్ అన్నదమ్ములిద్దరు కలిసి స్టార్టప్‌గా ‘తిన్నంత బిర్యానీ’ పాయింట్ ప్రారంభించారు. బిర్యానీతోపాటు అదనంగా గ్రేవీ, సలాడ్, పెరుగు, స్వీట్, మినరల్ వాటర్ ఇస్తున్నామని తెలిపారు. అయితే ఇది పూర్తిగా శాకాహారంతో కూడిన బిర్యానీ. అయతే తిన్నంత బిర్యానీ పెడతామని పేర్కొన్నారు. ఇటీవలె బిర్యానీ సెంటర్‌ను ఏర్పాటు చేసినప్పటికీ జనాల్లో ఆదరణ పెరుగుతోందని తెలిపారు. తక్కువ ధర అని నాసిరకం కాకుండా బాస్మతి బియ్యాన్ని వినియోగిస్తున్నామని పేర్కొన్నారు. రోజు రూ. 1000 నుంచి రూ.1,500 వరకు పెట్టుబడి పెడుతున్నామని చెప్పారు. రోజు ఎంతో రద్దీగా ఉండే ఉప్పల్-రామంతాపూర్ మార్గంలో రూ.60 చెల్లించి ‘తిన్నంత బిర్యానీ’ పాయింట్లో బిర్యానీ తింటున్నామని, చాలా రుచిగా ఉందని స్థానికులు తెలిపారు. చదవండి: శని, ఆదివారాలు చెక్కులిచ్చినా.. లిక్కర్ ఇస్తాం -
ప్రపంచంలోనే మోస్ట్ కాస్ట్లీ బిర్యానీ ఇదే..
దుబాయ్ : ఏదైనా రెస్టారెంట్‌కి వెళ్లినా, ఫుడ్ ఆర్డర్ పెట్టుకోవాలనుకున్నా మనలో చాలా మందికి గుర్తొచ్చేది బిర్యానీ'. అన్ని రుచుల్లోనూ బిర్యానీ రుచి వేరయా అనడంలో ఎలాంటి సందేహం లేదు. విదేశాల్లోనూ బిర్యానీ లవర్స్ బోలెడు మంది ఉన్నారు. సాధారణంగా మన దగ్గర అయితే ప్లేటు బిర్యాని ధర రూ. 100 నుంచి రూ. 1000 దాకా ఉంటుంది. అందులో ఉపయోగించే మాంస పదార్థాలను బట్టి ఈ ధర కాస్త అటూఇటూగా ఉంటుంది. కానీ దుబాయ్‌లో దొరికే ఓ స్పెషల్ బిర్యానీ ధరెంతో తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే. అవును..దుబాయిలోని బాంబే బరో అనే రెస్టారెంట్లో లభించే బిర్యానీ ధర ఏకంగా 1000 దిర్హామ్‌లు. అంటే భారత కరెన్సీలో దాదాపు 19,700ల రూపాయలు. ‘రాయల్ గోల్డ్ బిర్యానీ’తో పిలిచే ఈ బిర్యానీ..పేరుకు తగ్గట్లుగానే గోల్డ్‌తో ఉంటుంది. అంటే ఎంతో రుచికరమైన బిర్యానీని 23 కేరట్ల గోల్డ్ ప్లేట్లో వడ్డిస్తారు. అందుకే ఇంత ఎక్కువ ధరన్నమాట. అంతేకాకుండా కాస్ట్‌కు తగ్గట్లు గానే ఈ బిర్యానీకి చాలా ప్రత్యేకతలు కూడా ఉన్నాయి. సాధారణంగా బిర్యానీలో ఒకే రకమైన అన్నం ఉంటుంది. కానీ రాయల్ గోల్డ్‌లో మాత్రం బిర్యానీ రైస్, కీమా రైస్, వైట్ రైస్, సాఫ్రాన్ (కుంకుమ పువ్వు) రైస్.. ఇలా మీ టేస్ట్‌కు తగ్గట్లు సర్వ్ చేస్తారన్నమాట. ఈ బిర్యానీ బరువు సుమారుగా 3 కేజీలు ఉంటుంది. దీంతో పాటు బంగారం రేకుల్లో చుట్టిన కశ్మీరీ లాంబ్ సీక్స్ కబాబ్స్, రాజ్‌పుత్ చికెన్ కబాబ్స్, ఢిల్లీ లాంబ్ చాప్స్, మొగలాయ్ కోఫ్తా, మలాయ్ చికెన్ రోస్ట్ కూడా ఉంటాయి. బిర్యానీపై బంగాళాదుంపలు, జీడిపప్పు,గుడ్లు,దానిమ్మ, పుదీనాలతో ఎంతో కలర్ఫుల్గా, అందంగా దీన్ని తీర్చిదిద్దుతారు. అంతేకాకుండా ఈ బిర్యానీ సర్వ్ చేయడానికి వచ్చే రెస్టారెంట్ సిబ్బంది సైతం బంగారు పూత కలిగిన డ్రెస్ కోడ్‌ను ధరిస్తారట. ప్రపంచంలో ఇప్పటివరకు అత్యంత ఖరీదైన బిర్యానీ ఇదేనని రెస్టారెంట్ నిర్వాహకులు చెబుతున్నారు. మీరు కూడా బిర్యానీ ప్రేమికులైతే, దుబాయ్‌కి వెళ్లినప్పుడు ఈ గోల్డ్ బిర్యానీని ఓ పట్టుపట్టండి. చదవండి : (దారుణం: ప్రియుడిని చంపి ఆ భాగాలతో బిర్యానీ..) (ప్రతీ సెకనుకో బిర్యానీ : స్విగ్గీ సీక్రెట్) -
దారుణం: ప్రియుడిని చంపి ఆ భాగాలతో బిర్యానీ..
రబాత్: ఉత్తర ఆఫ్రికాలో దారుణ సంఘటన చోటుచేసుకుంది. మరో యువతితో పెళ్లికి సిద్దమైన ప్రియుడిని హత్య చేసిన మహిళ అనంతరం అతడి ప్రైవేటు భాగాలను బిర్యాని వండిన దారుణ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. అంతేగాక ఆ బిర్యానినీ భవన నిర్మాణ కార్మికులకు పెట్టిన ఈ సంఘటన విని పోలీసులు సైతం విస్తుపోయారు. వివరాలు.. ఉత్తర ఆఫ్రికాలోని మొరాకోకు చెందిన 30 ఏళ్ల మహిళ ఏడేళ్లుగా ఓ వ్యక్తితో సహజీవనం చేస్తోంది. ఈ క్రమంలో అతడు మరో యువతితో సన్నిహితంగా ఉంటున్నట్లు ఆమె అనుమానించింది. ఇదే విషయం ప్రియుడిని అడుగగా అతడు ఆ యువతిని పెళ్లి చేసుకుంటున్నట్లు చెప్పాడు. దీంతో ఆ మహిళ ప్రియుడితో గొడవపడింది. ఈ క్రమంలో అతడిని హత్య చేసింది. అయితే ఈ విషయం బయటరాకుండా ఉండేందుకు అతడి మృతదేహాన్ని మాయం చేయాలనుకుంది. దీంతో అతడి శరీరాన్ని ముక్కలుగా కోసి అతడి ప్రైవేటు భాగాలు(పురుషాంగం, వృషణాలు)తో బిర్యానీ వండింది. దానిని పక్కనే భవన నిర్మాణం పనులు చేస్తున్న కూలీలకు వడ్డించింది. ఆ తర్వాత మిగిలిన శరీరా భాగాలను కుక్కలకు వేసింది. అయితే ఆ వ్యక్తి ఎంతకి ఇంటికి రాకపోవడం, అతడి ఫోన్ కూడా స్విచ్చాఫ్ రావడంతో మృతుడి కుటుంబ సభ్యులు అనుమానించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అతడి ఆచూకి కనిపించకపోవడంతో సదరు మహిళపై కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు సదరు మహిళ ఇంటిలో సోదాలు నిర్వహించారు. ఈ క్రమంలో పోలీసులు మిక్సీలో దంతాలు గుర్తించారు. వాటిని స్వాధీనం చేసుకుని పరీక్షించగా అవి మృతుడివే అని తేలడంతో పోలీసుల ఆమెను అదుపులోకి తీసుకున్నారు. విచారణలో నిందితురాలు చెప్పిన విషయాలకు పోలీసులు కూడా షాకయ్యారు. దీంతో సదరు మహిళపై కేసు నమోదు చేసి ఆమె మానసిక పరిస్థితి తెలుసుకునేందుకు పోలీసులు ఆస్పత్రికి తరలించారు. చదవండి: సంబంధం పెట్టుకోవాలని కానిస్టేబుల్ వేధింపులు డబ్బు వివాదం: కుటుంబంతో కలిసి భర్త హత్య -
బిర్యానీ ఆశ చూపి.. డ్రగ్స్ ఇచ్చి
కోల్‌కతా: ఎనిమిదేళ్ల బాలికపై అత్యాచారం, హత్య ఘటనను మరువక ముందే పశ్చిమ బెంగాల్లో మరో దారుణం వెలుగు చూసింది. చైల్డ్ పోర్నోగ్రఫికి బానిస అయిన ఓ వ్యక్తి, బాడీగార్డుగా పని చేస్తోన్న తన స్నేహితుడితో కలిసి తొమ్మిదేళ్ల చిన్నారిపై దారుణానికి ఒడిగట్టారు. బిర్యానీ ఆశ చూపి.. చిన్నారిపై సామూహిక అత్యాచారం చేశారు. వివరాలు.. కోల్‌కతా జోరాబగన్ ప్రాంతానికి చెందిన రణ్వీర్ తంతి అలియాస్ రఘువీర్ మార్బుల్ కట్టింగ్ టెక్నిషియన్‌గా పని చేస్తున్నాడు. మద్యం, చైల్డ్ పోర్నోగ్రఫికి బానిస అయ్యాడు. ఇక నిందితుడికి లాల్‌బజర్ ప్రాంతంలో ఉండే బాధితురాలి కుటంబంతో పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలో దారుణం జరిగిన నాడు రణ్వీర్, బాడీగార్డ్‌తో కలిసి బాధితురాలి ఇంటికి వచ్చాడు. ఆ సమయంలో ఆరు బయట ఆడుకుంటున్న చిన్నారికి బిర్యానీ ఆశ చూపి.. నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లారు. ఆ తర్వాత బాలికపై గ్యాంగ్ రేప్‌కు ఒడిగట్టారు. ఇక చిన్నారి బతికి ఉంటే తమను గుర్తు పడుతుందనే ఉద్దేశంతో బాలిక గొంతు కోసి హత్య చేశారు. పోస్ట్‌మార్టం రిపోర్టులో బాలికకు డ్రగ్స్ ఇచ్చినట్లు తెలుస్తోందని.. దీనిపై స్పష్టత రావాల్సి ఉందని పోలీసులు తెలిపారు. చదవండి: మైనర్‌పై ఐదు నెలలుగా.. 17 మంది -
బిర్యానీ తిన్న పదిమందికి అస్వస్థత
సాక్షి, హైదరాబాద్ : ఆనంద్‌బాగ్‌లోని ఓ మండిలో బిర్యాని తిన్న ఒకే కుటుంబానికి చెందిన పదిమంది అస్వస్థతకు గురైన సంఘటన మల్కాజిగిరిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. చాణక్యపురి కాలనీకి చెందిన ఓ కుటుంబం గత నెల 31 వ తేదీ మధ్యాహ్నం ఆనంద్‌బాగ్‌లోని మండిలో చికెన్ బిర్యానీ తిని ఇంట్లో ఉన్న వారికి తీసుకు వచ్చారు. రాత్రి మిగిలిన వారు కూడా తిన్నారు. మరుసటి రోజు నుంచి వాంతులు, జ్వరం, విరేచనాలు కావడంతో వివిధ ఆస్పత్రుల్లో చేరి చికిత్స పొందుతున్నారు. ఈ సంఘటన పై కుటుంబసభ్యుల్లో ఒకరైన రజనీకాంత్‌రెడ్డి మాట్లాడుతూ చిన్నారులు ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారని, సంఘటనకు బాధ్యులైన హోటల్ నిర్వాహకులపై జీహెచ్ఎంసీ అధికారులతో పాటు మల్కాజిగిరి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశామన్నారు. -
బిర్యానీ ఎఫెక్ట్: 145 మందికి అస్వస్థత
డిస్పూర్: అస్సాంలో ఫుడ్ పాయిజన్ కలకలం రేపుతోంది. ముఖ్యమంత్రి సర్బానంద సోనోవాల్ ముఖ్య అతిథిగా హాజరైన ఓ ప్రభుత్వ కార్యక్రమంలో ఫుడ్ పాయిజనింగ్ వల్ల 145 మంది అస్వస్థతకు గురయ్యారు. వీరిలో రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి హిమంత బిస్వా శర్మ కూడా ఉన్నారు. వివరాలు.. మంగళవారం రాష్ట్రంలోని కర్బీ ఆంగ్లాంగ్ జిల్లా డిఫు మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ అకాడమిక్ సెషన్ ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహించారు. దాదాపు 8,000 మంది ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఇక వీరందరికి బిర్యానీ ప్యాకెట్స్ ఇచ్చారు. ఇది తిన్న తర్వాత వారిలో పలువురు అస్వస్థకు గురయ్యారు. వీరిలో రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి హిమంత బిస్వా శర్మ కూడా ఉన్నారు. ఈ సందర్భంగా హిమంత బిస్వా శర్మ మాట్లాడుతూ.. ‘‘కార్యక్రమానికి వచ్చిన వారందరికి బిర్యానీ ప్యాకెట్స్ ఇచ్చాం. నేను కూడా అదే బిర్యానీ తిన్నాను. కాసేపటి తర్వాత అనారోగ్యానికి గురయ్యాను. చికిత్స తీసుకున్నాను. ప్రస్తుతం బాగానే ఉన్నాను. నాతో పాటు మరో 145 మంది అస్వస్థతకు గురయ్యారు. అందరిని ఆస్పత్రిలో చేర్చి వైద్యం అందిస్తున్నాం. వీరిలో 28 మందిని డిశ్చార్జ్ చేయగా.. మరో 118మందికి చికిత్స కొనసాగుతోంది. అందరూ బాగానే ఉన్నారు’’ అని తెలిపారు. (చదవండి: చద్ది బిర్యానీ పెట్టిందని వదినను..) ఈ సంఘటనకు దారితీసిన పరిస్థితులపై మెజిస్టీరియల్ విచారణకు ఆదేశించినట్లు కర్బీ ఆంగ్లాంగ్ డిప్యూటీ కమిషనర్ ఎన్జీ చంద్ర ధ్వాజా సింఘా తెలిపారు. ఈ కార్యక్రమానికి హాజరైన ఒక వ్యక్తి మంగళవారం రాత్రి ఆసుపత్రిలో మరణించాడు. అయితే అతను ఫుడ్ పాయిజన్ వల్ల చనిపోయాడా లేక వేరే కారణమా అనేది ఇంకా తెలియలేదు. అతడు తీసుకున్న ఆహార నమూనాలను సేకరించి పరీక్ష కోసం పంపారు. ఆసుపత్రిలో చేరిన వారు కడుపు నొప్పి, వాంతులతో బాధ పడుతున్నట్లు వైద్యులు తెలిపారు. -
బిర్యానీ సెంటర్లో కేథరిన్ సందడి
సాక్షి, రాజేంద్రనగర్: అత్తాపూర్‌లో చిక్‌పెట్ డోనీ బిర్యానీ సెంటర్‌ను సోమవారం సినీనటి కేథరిన్ ప్రారంభించారు. వంటకాలను టేస్ట్ చేశారు. అభిమానులతో సెల్ఫీలు దిగి సందడి చేశారు. ప్రముఖ వ్యాపారవేత డి.రమేష్ హైదర్‌గూడ పిల్లర్ నంబర్–143 వద్ద ఈ సెంటర్‌ను ఏర్పాటు చేశారు. జూబ్లీహిల్స్: రోడ్ నంబర్-36లోని చందూభాయ్ గ్రూప్‌నకు చెందిన ది డైమండ్ స్టోర్‌లో వెడ్డింగ్ సీజన్‌ను పురస్కరించుకొని సరికొత్త బ్రైడల్ కలెక్షన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ అరుదైన ఆభరణాలను సోమవారం మోడల్స్ ప్రదర్శించారు. కోవిడ్ కారణంగా అందరి క్షేమం కోసం మా స్టోర్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న కొనుగోలుదారులకు వర్చువల్‌గా కూడా ఆభరణాలు ఎంపిక చేసుకునే విధంగా అవకాశం కల్పిస్తోందన్నారు. -
వావ్ బాస్మతి.. బిర్యానీ రైస్‌కు భలే క్రేజ్
సాక్షి, హైదరాబాద్ : బిర్యానీ అంటేనే బాస్మతి రైస్...బాస్మతి రైస్ ఉంటేనే బిర్యానీ. చికెన్..మటన్..వెజ్..వెరైటీ ఏదైనా బాస్మతీ రైస్‌తో చేస్తేనే ఆ బిర్యానీకి ఘుమఘుమలాడే వాసన..అద్భుతమైన రుచీ వస్తుంది. ఉత్తరాదిలో పండించే ఈ రకం బియ్యానికి గ్రేటర్ వాసులు ఫిదా అవుతున్నారు. ఫంక్షన్లు, పెళ్లిళ్లు, హోటళ్లు, ఫుడ్‌సెంటర్లు, ఇళ్లల్లోని వారు రోజుకు దాదాపు 12 వేల క్వింటాళ్ల బాస్మతీ బియ్యాన్ని కొంటున్నారంటే..ఇక్కడ ఆదరణ ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఒక్కప్పుడు నవాబులు, సంపన్నుల ఇళ్లల్లో బాస్మతిని వినియోగించే వారని చెప్పేవారు. ప్రస్తుతం ధరలు అందుబాటులోకి రావడంతో అన్ని వర్గాల ప్రజలు ఈ రైస్‌ను వంటకాల్లో వినియోగిస్తున్నారు. గతంలో బిర్యానీకే పరిమితమైన బాస్మతి బియ్యం నేడు అన్ని రకాల వంటకాల్లోనూ వినియోగిస్తున్నారు. గత కొన్ని నెలలుగా ఇతర దేశాలకు ఎగుమతులు భారీగా తగ్గాయి. దీంతో సాధారణ బియ్యం ధరకే ఇక్కడ విక్రయిస్తున్నారు. వినియోగమూ ఎక్కువైంది. ఉత్తరాది పంటకు నగరంలో ఆదరణ గ్రేటర్లో వివాహాలు, వేడుకలు పెరగడంతో బాస్మతిని రికార్డు స్థాయిలో వినియోగిస్తున్నారు. ధరలు తగ్గడంతో జంటనగరాల మార్కెట్లకు భారీ ఎత్తున బాస్మతి బియ్యం దిగుమతి అవుతోంది. ప్రధాన మార్కెట్లయిన బేగంబజార్, కిషన్‌గంజ్, ఉస్మాన్‌గంజ్ టోకు మార్కెట్లు ఈ బియ్యం అమ్మకాలకు ప్రధాన కేంద్రాలుగా ఉన్నాయి. స్టార్ హోటళ్లు, ఇతర బిర్యానీ హోటళ్ల నిర్వాహకులు ఈ మార్కెట్ల నుంచే బాస్మతి రైస్‌ను కొనుగోలు చేస్తుంటారని వ్యాపారులు అంటున్నారు. ఇక సాధారణ జనం సూపర్మార్కెట్లు, షాపింగ్ మాల్స్, ఆన్‌లైన్‌లోనూ బాస్మతి రైస్‌ను భారీగా కొనుగోలు చేస్తున్నారు. తక్కువ ధరకు లభ్యమవుతుండడంతో ఇళ్లల్లోనూ చికెన్, మటన్ బిర్యానీలకు దీన్ని వినియోగిస్తున్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో రోజుకు 60 వేల క్వింటాళ్ల సాధారణ బియ్యం వినియోగం అవుతుండగా..ఇందులో బాస్మతి బియ్యం దాదాపు 12 వేల క్వింటాళ్ల వరకూ ఉంటుందని మార్కెట్ వర్గాల అంచనా. పంజాబ్, హర్యానా, ఉత్తర్‌ప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో ఈసారి బాస్మతి ఉత్పత్తి భారీగా ఉండడంతో నగరానికి సరఫరా పెరిగింది. రిటైల్ మార్కెట్లో స్టీమ్ కేజీ బాస్మతి బియ్యం రూ.50 నుంచి రూ.65 వరకు లభిస్తున్నాయి. రా బాస్మతి బియ్యం మొదటి రకం రూ.80–110 వరకు ధర పలుకుతుంది.ఉత్తరాది రాష్ట్రాల్లో పండే బాస్మతికి ఢిల్లీ తప్ప ఇతర రాష్ట్రాల్లో వినియోగం తక్కువ. దక్షిణాది రాష్ట్రాల్లో హైదరాబాద్ నగరం బాస్మతికి హబ్‌గా మారింది. దేశంలో ఢిల్లీ తర్వాత గ్రేటర్లో ఎక్కువగా వినియోగం ఉందని బేగంబజార్ వ్యాపారులు చెబుతున్నారు. బాస్మతి ఎక్కువగా పంజాబ్‌లో పండిస్తారు. ఉత్తరాది రాష్ట్రాల్లో ఈ బియ్యం వినియోగం తక్కువ. హైదరాబాద్ బిర్యానీకి ఫేమస్. దీంతో కూడా ఇక్కడ వినియోగం ఎక్కువైంది. కరోనా కారణంగా ఈ ఏడాది ఇతర దేశాలకు ఎగుమతులు అంతగాలేవు. దీంతో ధరలు చాలా తగ్గాయి. మామూలు రైస్ రేట్లకే బాస్మతి రైస్‌ను విక్రయిస్తున్నాం. – రాజ్‌కుమార్ టాండన్, కశ్మీర్ హౌస్ నిర్వాహకుడు, బేగంబజార్ -
చద్ది బిర్యానీ పెట్టిందని వదినను..
కోల్‌కతా : బిర్యానీ విషయంలో చోటుచేసుకున్న గొడవ ఓ ప్రాణాన్ని బలి తీసుకుంది. ఆడపడచు దెబ్బలు తాళలేక ఓ మహిళ గుండెపోటుతో మరణించింది. ఈ సంఘటన పశ్చిమ బెంగాల్లో సోమవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. కోల్‌కతా, డల్హౌసీ ప్రాంతానికి చెందిన ఫాల్గుణి బసు సోమవారం రోజు ఆడపడుచు కుమారుడికి బిర్యానీ చేసి పెట్టింది. అయితే కొద్దిసేపటి తర్వాత అతడికి వాంతులు కావటం మొదలుపెట్టాయి. దీంతో ఆడపడుచు శర్మిష్ట బసు (40) ఫాల్గుణి తన కుమారుడికి చద్ది బిర్యానీ పెట్టడం వల్లే వాంతులు అయ్యాయని ఆగ్రహం వ్యక్తం చేసింది. వదినపై దాడికి దిగి విచక్షణా రహితంగా కొట్టింది. ( విశాఖలో మరో ప్రేమోన్మాది ఘాతుకం) దెబ్బల కారణంగా ఫాల్గుణి గట్టిగా ఏడుస్తూ.. గుండెపోటు వచ్చి, నేలపై కుప్పకూలింది. ఫాల్గుణి అరుపులు విని అక్కడికి వచ్చిన భర్త నేలపై పడిఉన్న ఆమెను హుటాహుటిన ఆసుపత్రికి తరలించాడు. ఆమెను పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు తేల్చారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితురాలు స్క్రిజోఫ్రేనియా అనే మానసిక రుగ్మతతో బాధపడుతోందని, తరుచూ వింతగా ప్రవర్తిస్తోందని కుటుంబసభ్యులు తెలిపారు. -
స్టార్ హోటల్ నుంచి వీధి బండికి..
ముంబై: కరోనా మనుషులనే కాదు వారి జీవనోపాధిని కూడా కాటేసింది. దీంతో ఎంతోమంది జనాల బతుకులు రోడ్డు పాలయ్యాయి. ఆ బాధితుల్లో ఒకరే అక్షయ్ పార్కర్. ఈయన చేయి తిరిగిన వంటగాడు. ఇంటర్నేషనల్ స్టార్ హోటల్లో ఆయన కింద ఎందరో వంటగాళ్లు ఉండేవారు. తాజ్ ఫ్లైట్ సర్వీస్‌తో పాటు ప్రిన్సెస్ క్రూయిజ్‌లోనూ పని చేసేవాడు. కానీ కరోనా విపత్తు వల్ల ఎనిమిదేళ్లుగా పని చేస్తున్న ఉద్యోగం ఊడిపోయింది. చేతిలో చిల్లిగవ్వ లేదు. ఇలాగైతే బతుకు బండి ముందుకు సాగదని తెలసుకున్న అక్షయ్ ముంబై వీధిలో చిన్న స్టాల్ పెట్టుకుని బిర్యానీ వండుతూ నాలుగు పైసలు సంపాదిస్తున్నాడు. (వైరల్ వీడియో.. నిజం తెలిస్తే షాకవుతారు) ఆయన చేసే బిర్యానీ ఘుమఘుమలు మిమ్మల్ని తిననివ్వకుండా వదిలిపెట్టవు. ప్రస్తుతం ఆయన స్టోరీ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. స్టార్ హోటల్ నుంచి దిగి వచ్చి వీధిలో బండి పెట్టుకోవడం మామూలు విషయం కాదని నెటిజన్లు అతడిని కీర్తిస్తున్నారు. అతడి బిర్యానీ బండి వృద్ధిలోకి రావాలని ఆకాంక్షిస్తున్నారు. ఇక ఎంతైనా స్టార్ హోటల్ చెఫ్ కాబట్టి బిర్యానీ ధర కూడా కాస్త ఎక్కువగానే ఉంది. కిలో వెజ్ బిర్యానీ రూ.800 కాగా కిలో నాన్ వెజ్ బిర్యానీ రూ.900కు అమ్ముతున్నాడు. మీరూ ఆ బిర్యానీ రుచి చూడాలంటే ముంబైలోని దాదర్‌లో జేకే సావంత్ మార్గ్ ప్రాంతానికి వెళ్లి తీరాల్సిందే. (వైరల్: యువతి తలను కోసుకుని తినొచ్చు!!) -
‘రుచి’ చూపిస్తున్న ఎన్నికలు
సాక్షి, హైదరాబాద్: కరోనా వైరస్ దెబ్బతో ఆర్నెళ్లుగా విలవిల్లాడిన రెస్టారెంట్లు, హోటళ్లు ప్రస్తుతం కస్టమర్లతో కళకళ్లాడుతున్నాయి. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఎన్నికల పుణ్యమాని రాష్ట్రం నలమూలల నుంచి ప్రధాన పార్టీల నేతలు, కార్యకర్తలంతా వచ్చి ఇక్కడే తిష్టవేయడంతో హోటళ్లు కిటకిటలాడుతున్నాయి. ప్రస్తుతం నగరంలో 80 శాతం హోటళ్లు తెరుచుకోగా, మునుపటిగా భోజనం ఆరంగించేందుకు వస్తున్న కస్టమర్లు 75 శాతానికి చేరుకున్నారు. ఇక కార్యకర్తల కోసం పార్టీలు బల్క్‌గా ఇస్తున్న ఫుడ్ ఆర్డర్ల సంఖ్య పెరగ్గా, మరోపక్క హోమ్ డెలివరీలు పెరుగుతున్నాయని ఈ–కామర్స్ సంస్థలు చెబుతున్నాయి. (జీహెచ్ఎంసీ ఎన్నికలు: రచ్చ రంబోలా) హోటళ్లకు ఎన్నికల జోష్ రాష్ట్రంలో లాక్డౌన్ సమయంలో హోటళ్లు, రెస్టారెంట్లకు భారీ దెబ్బ తగిలింది. పూర్తిగా మూసివేయాల్సి రావడంతో అద్దెలు కట్టలేక, సిబ్బందికి జీతాలివ్వలేక యజమానులు నష్టపోయారు. తిరిగి జూన్ రెండో వారంలో వీటిని తెరిచేందుకు కేంద్రం అనుమతిచ్చింది. సామాజిక దూరం పాటించేలా, ‘కోవిడ్’ జాగ్రత్తలు పాటిస్తూ రెస్టారెంట్లలో మార్పుచేర్పులు చేసినా కరోనా కేసుల నేపథ్యంలో వినియోగదారులు పెద్దగా అటు వెళ్లలేదు. దీనికి తోడు చాలా రెస్టారెంట్లలో నిష్ణాతులైన వంటగాళ్లు సొంతూళ్లకు వెళ్లిపోయారు. వారిని తిరిగి రప్పించడం యజమానులకు కష్టమైంది. కొన్ని రెస్టారెంట్లను లాభాలను పక్కనపెట్టి నడిపించినా, వినియోగదారులు రాక, అద్దెలు కట్టలేక వాటిని మూసుకున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ పరిధిలో కరోనా కేసులు తగ్గడంతో హోటళ్లు, రెస్టారెంట్లకు వస్తున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ‘ఆగస్టు వరకు 79 శాతం రెస్టారెంట్లు మూతబడ్డాయి. అనంతరం 21 శాతం మేరకు తెరుచుకున్నా, అవి హోమ్ డెలివరీలకే ప్రాధాన్యమిచ్చాయి. ఇందులోనూ 17% తక్కువ సామర్థ్యంతో నడిచాయి. అక్టోబర్, నవంబర్లలో పరిస్థితి మెరుగైంది. మూతపడిన రెస్టారెంట్లలోని 52% తిరిగి తెరుచుకున్నాయి’ అని ఇటీవలి సర్వేలు వెల్లడించాయి. తాజాగా గ్రేటర్ ఎన్నికలు రావడంతో తెరుచుకున్న హోటళ్లకు కస్టమర్ల రాక రెట్టింపైంది. పెరిగిన బిర్యానీ ఆర్డర్లు నగరంలోని 150 డివిజన్లలో ప్రచారం చేసేందుకు హైదరాబాద్ చుట్టుపక్కల జిల్లాల నుంచి అన్ని ప్రధాన పార్టీల నేతలు వచ్చి ఇక్కడే మకాం వేశారు. పొరుగు జిల్లాల నుంచి ఆయా పార్టీలకు చెందిన కనీసం 5 వేల మంది చోటామోటా నాయకులు మందిమార్బలంతో హోటళ్లలో దిగారు. వీరందరికీ ఆయా పార్టీలు డివిజన్ల వారీగా హోటళ్లలో వసతి కల్పించడంతో అవన్నీ కళకళ్లాడుతున్నాయి. గ్రేటర్ ఎన్నికలతో కస్టమర్ల తాకిడి పెరిగిందని, సీటింగ్ సామర్థ్యం సైతం 50 నుంచి 75 శాతానికి పెరిగిందని గచ్చిబౌలిలోని హోటల్ యజమాని ఒకరు తెలిపారు. వారం రోజులుగా బల్క్‌గా రోజుకు రెండు నుంచి మూడు ఆర్డర్లు ఉంటున్నాయని కూకట్‌పల్లికి చెందిన మరో రెస్టారెంట్ యజమాని తెలిపారు. (‘మూసీ’ చుట్టూ అందరి ప్రదక్షిణం) ఇక ఆగస్టు, సెప్టెంబర్లలో వివిధ వెరైటీల వంటకాల మెనూని కుదించి, డిమాండ్ ఉన్న వాటినే కస్టమర్లకు అందించగా, ప్రస్తుతం డిమాండ్ పెరగడంతో అన్ని వెరైటీలను అందిస్టున్నట్లు ఆయన వెల్లడించారు. ఇక గత 15 రోజులుగా గ్రేటర్ పరిధిలో హోమ్ డెలివరీలు పెరిగాయని జొమాటో తన సర్వేలో వెల్లడించింది. ముఖ్యంగా చికెన్, మటన్ బిర్యానీ ఆర్డర్లు పెరిగాయని, ఒకే ఆర్డర్‌పై ఎక్కువ మందికి సరిపోయే భోజనం ఆర్డర్లు ఇస్తున్న వారి సంఖ్య సైతం పెరిగిందని డెలివరీ బాయ్‌లు చెబుతున్నారు. -
మ్యాగీ విత్ పెరుగు ట్రై చేశారా?!
మ్యాగీ.. చిన్నాపెద్దా తేడా లేకుండా అందరికి ఫేవరెట్ ఫుడ్ ఐటం. చాలా వరకు ఊరికే నీటిలో వేసి ఉడికించుకుని తింటారు. కొందరు మాత్రం పోపు వేసి కూరగాయలతో కలిపి వండితే.. మరి కొందరు ఎగ్, చికెన్‌తో ట్రై చేస్తారు. కానీ మ్యాగీని పెరుగతో ఎప్పుడైనా తిన్నారా. పేరు వినగానే ముఖం అదోలా మారిపోయింది కదా. చాలా మంది అస్సలు వినడానికి, ట్రై చేయడానికి ఇష్టపడని ఈ కాంబినేషన్‌ని ఓ యువతి నిజం చేసి చూసింది. మ్యాగీలో పెరుగు వేసుకుని తిన్నది. ‘మ్యాగీ అండ్ కర్డ్ ఇజ్ ఫుడ్ ఫర్ ద సౌల్’ పేరుతో ట్విట్టర్లో మ్యాగీలో పెరుగు కలిపిన ఫోటోని షేర్ చేసింది. ఇది చూసిన నెటిజనుల్లో ఎక్కువ మంది ‘ఏం టెస్ట్ తల్లి .. ఇంత చండాలంగా ఉంది’.. ‘మ్యాగీ మీద విరక్తి పుట్టించావ్గా’.. ‘అసాధ్యాన్ని సాధ్యం చేశావ్‌గా’ అని కామెంట్ చేస్తుండగా.. మరి కొందరు మాత్రం ‘అద్భుతం’.. ‘టేస్ట్ కోసం దానిలో మయోన్నైస్ కలపండి’ అంటూ సూచనలు చేస్తున్నారు. (చదవండి: నిన్ను చూస్తుంటే కడుపు మండుతోంది) Maggi and curd is food for the soul ❤️ pic.twitter.com/RmNRVRvnfw — Felon Mask (@acnymph) November 16, 2020 గతేడాది ఓ యువతి పాలు, గులాబీ రెక్కలతో స్వీట్ మ్యాగీ తయారు చేసింది. "చాక్లెట్ మ్యాగీ", "మ్యాగీ పానీపూరి" అనే విభిన్న వంటకాలు భోజన ప్రియులకు వికారం కలిగించిన విషయం తెలిసిందే. ఇవేకాక రసగుల్లా బిర్యానీ, చాక్లెట్ చికెన్ వంటి వింత వంటకాలు వైరలయిన సంగతి తెలిసిందే. -
పది పైసలకే బిర్యానీ.. ఎగబడ్డ జనం
సాక్షి, చెన్నై : దక్షిణ భారత్‌లో బిర్యానీ ప్రియులు అధికంగా ఉంటారు. చికెన్, మటన్ బిర్యానీ అంటే లొట్టలేసుకొని తినేవారు చాలా మంది ఉంటారు. బిర్యానీకి ఉన్న ఈ క్రేజ్‌తో చాలామంది వ్యాపారులు ఎప్పటికప్పుడు ఆఫర్లు ప్రకటిస్తున్నారు. వంద రూపాయలు, యాభై రూపాయలు, పదిరూపాలయకే బిర్యానీ అంటూ ఇప్పటివరకు రకరకాల ఆఫర్ల గురించి విన్నాం. అయితే ఇప్పుడు తాజాగా 10 పైసలకు బిర్యానీ దొరుకుతుంది. ఈ రోజు(అక్టోబర్ 11) బిర్యానీ డే. ఈ సందర్భంగా తమిళనాడు బిర్యానీ వ్యాపారులు భారీ ఆఫర్లను ప్రకటించారు. తిరుచ్చి, మధురై, దింగిగల్, చెన్నైలలో 10 పైసలకే బిర్యానీ అమ్మకాలు నిర్వహించారు. దీంతో భారీగా జనం ఎగబడ్డారు. కిలో మీటర్ల మేర బారులు తీశారు. కరోనా నిబంధనలను పట్టించుకోకుండా బిర్యానీ కోసం స్థానికులు క్యూకట్టారు. కోవిడ్ నిబంధనలను ఉల్లంఘించి బిర్యానీ ఆఫర్లను ప్రకటించిన వ్యాపారులపై మున్సిపల్ అధికారులు కేసు నమోదు చేశారు. ఇదిలావుంటే బెంగళూరులో ఓ ప్రముఖ రెస్టారెంట్ భారీ ఆఫర్ ప్రటించింది. దీంతో ఉదయం 4 గంటల నుంచే బిర్యానీ కోసం జనం క్యూ కట్టారు. దాదాపు 1.5 కిలో మీటర్ల మేర బిర్యానీ ప్రియులు బారుతీరుతారు. అక్కడ ప్రతి ఆదివారం ఇదే సీన్ కనిపిస్తుంది.కనీసం కరోనా నిబంధనలను కూడా వారు పాటించలేదని స్థానికులు అంటున్నారు. -
బెడిసికొట్టిన రసగుల్లా బిర్యానీ; నెటిజన్ల ఫైర్
కొత్త కొత్త వంటకాల ప్రయోగం చేయాలని చాలా మందికి ఆశగా ఉంటుంది. విభిన్న రకాల ఐటమ్స్‌ను కలిపి నూతన వంటకాన్ని కనుగొని అందరితో షేర్ చేయాలని అనుకుంటారు. కానీ అన్నిసార్లు అనుకున్నట్లు కుదరవు. కొన్ని అద్భుతంగా రుచికరమైనవిగా వస్తే మరి కొన్ని ఊహించని విధంగా బెడిసి కొడతాయి. ఇలా సోషల్ మీడియాలో నెటిజన్ల కోపానికి గురైన ప్రయోగాలు అనేకమున్నాయి. స్వీటీ మ్యాగీ, గులాబ్ జామున్కీ సబ్జీ, చికెన్ ఫ్రైడ్ రైస్ డిప్ప్‌డ్ ఇన్ చాకొలెట్ సాస్, మసాలా ఛాయ్ విత్ ఐస్ క్రీం. ఇవ్వన్నీ కూడా గతంలో నెట్టింట్లో అట్టర్ ప్లాప్ అయిన వంటకాలు. తాజాగా ఈ లిస్ట్‌లోకి మరో వంటకం చేరింది. అదే అంగూరి రసగుల్లా బిర్యానీ. చదవండి: సోషల్ మీడియానా మజాకా: వైరల్ వీడియో మాడ్లీ ఫుడ్ లవర్ అనే ఫేస్బుక్ పేజీ ‘అంగూరి రసగుల్లా బిర్యానీ’ వీడియోను పోస్టు చేసింది. నమ్మకపోతే బిర్యానీ నుంచి రాస్గుల్లాను కూడా ఈ వీడియోలో చూపిస్తోంది. ‘ఇది రసగుల్లా బిర్యానీ. మీరు నమ్మడం లేదా. ఇప్పుడే హరా భారా కేబాబ్, ఆలూ చాప్ మరియు దహి కా చట్నీ, ఫిర్నిలతో పాటు అంగూరి రసగుల్లా బిర్యానీని తిన్నాను. అంటూ పోస్టు చేశారు. అక్టోబర్ 4న షేర్చేసిన ఈ వీడియో నెటిజన్లను తీవ్ర కలవరపాటుకు గురిచేస్తోంది. ఈ వంటకం గురించి నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. అసలు ఇలాంటి వంటకం ఉంటుందని ఊహించలేదని, దయచేసి మరోసారి ఈ వంటకాన్ని చేయొద్దని వేడుకుంటున్నారు. మరొకరు ‘ముందుగా కోవిడ్.. ఇప్పుడు ఈ వంట.. 2020 నిజంగా వేస్ట్’ అంటూ విమర్శిస్తున్నారు. మరి ఈ వంటకాన్ని ట్రై చేయడానికి మీకు ధైర్యం ఉందా!. చదవండి: గోబీ మంచూరియా లాగిద్దామా.. -
వైరల్ వీడియో.. ఇట్స్ బిర్యానీ టైం బ్రో!
-
వైరల్ వీడియో.. ఇట్స్ బిర్యానీ టైం బ్రో!
బెంగళూరు: కరోనా వైరస్ కట్టడి కోసం దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధించిన సంగతి తెలిసిందే. అయితే మద్యం దుకాణాలు తెరిచేందుకు అనుమతిచ్చినప్పుడు చూడాలి జనాలను. షాపులు తెరవక ముందే వెళ్లి క్యూలో నిల్చున్నారు. దాదాపు ప్రతి మద్యం దుకాణం దగ్గర కిలోమీటర్ల మేర వరుసలో నిలబడిన జనాలను చూశాం. ప్రస్తుతం కర్ణాటకలో కూడా ఇదే సంఘటన చోటు చేసుకుంది. కాకపోతే అది మద్యం దుకాణం ముందు కాదు. ఓ రెస్టారెంట్ ముందు. అవును బిర్యానీ కోసం జనాలు ఓ హోటల్ ముందు కిలోమీటర్ మేర క్యూలో నిల్చున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో తెగ వైరలవుతోంది. ఆ వివరాలు చూడండి.. తాజాగా కర్ణాటకలో రెస్టారెంట్లు తెరవడానికి అనుమతించారు. ఈ క్రమంలో బెంగళూరుకు సమీపంలోని హోస్కోట్లోని ఆనంద్ రెస్టారెంట్ దమ్ బిర్యానీకి ప్రసిద్ధి చెందింది. (చదవండి: లాక్‌డౌన్‌లోనూ భలే లాగించేశారు..!) ఈ నేపథ్యంలో ఆదివారం రెస్టారెంట్ తెరుస్తున్నారనే సమాచారంతో బిర్యానీ ప్రియులు ఇలా హోటల్ వద్దకు చేరుకున్నారు. దాదాపు 1.5కిలోమీటరు పొడవున వందలాది మంది కస్టమర్లు రెస్టారెంట్ బయట క్యూ కట్టారు. దీన్ని కాస్త ఓ ట్విట్టర్ యూజర్ వీడియో తీసి షేర్ చేశారు. ‘ఇది ఏ బిర్యానీ.. ఉచితంగా ఇస్తున్నారా ఏంటి’ అంటూ షేర్ చేసిన ఈ వీడియో ప్రస్తుతం తెగ వైరలవుతోంది. ‘మద్యం దుకాణాల ముందు మాత్రమే ఇంత భారీ క్యూలు చూశాం.. బిర్యానీనా మజాకా’ అంటూ కామెంట్ చేస్తున్నారు నెటిజనులు. -
బిర్యానీ కోసం అక్కా తమ్ముడి గొడవ.. ఆత్మహత్య
మల్లాపూర్: అనుమానాస్పదంగా ఓ బాలిక ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన నాచారం పోలీస్‌స్టేషన్ పరిధిలో ఆదివారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. మల్లాపూర్ డివిజన్ దుర్గానగర్‌కు చెందిన ప్రశాంతి, రవి దంపతులకు ఓ కుమారుడు, కుమార్తె స్నేహ (11) ఉన్నారు. శనివారం తల్లిండ్రులు పనికి వెళ్లడంతో స్నేహా అన్నతో పాటు ఇంట్లోనే ఉంది. బక్రీద్ సందర్భంగా పక్కింటివారు బిర్యానీ ఇవ్వడంతో బిర్యానీ తినే సమయంలో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఆ తర్వాత కొద్ది సేపటికి సోదరుడు ఆడుకునేందుకు బయటికి వెళ్లగా ఇంట్లో ఎవరూ లేని సమయంలో స్నేహ టవల్‌తో డోర్ హ్యాండిల్‌కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. కుటుంబసభ్యులు ఆమెను నాచారం ఈఎస్ఐ ఆస్పత్రికి తరలించగా పరీక్షించిన వైద్యులు అప్పటికికే మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతురాలి తల్లి ప్రశాంతి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకోని దర్యాప్తు చేస్తున్నారు. -
లాక్‌డౌన్‌లోనూ భలే లాగించేశారు..!
సాక్షి, హైదరాబాద్: లాక్డౌన్ కాలంలోనూ మనోళ్లు తెగ లాగించేశారు. దేశంలోని తమకు నచ్చిన రెస్టారెంట్ల నుంచి ఇష్టమైన ఆహార పదార్థాలను ఆర్డర్ చేసి తమ జిహ్వ చాపల్యాన్ని భోజనప్రియులు సంతృప్తిపరుచుకున్నారు. వాటిలో అగ్రస్థానం బిర్యానీకే దక్కింది. కోవిడ్ వ్యాప్తి కారణం గా విధించిన లాక్డౌన్ కాలంలో కేవలం బిర్యానీ డెలివరీ కోసమే 5.5 లక్షల ఆర్డర్లు వచ్చాయట. బట్టర్ నాన్లు, మసాలా దోశలను మూడున్నర లక్షల మార్లు భోజనప్రియులు తెప్పించుకున్నారు. మూడున్నర లక్షల ‘రెడీటు కుక్ ఇన్స్టెంట్ నూడుల్స్ ప్యాకెట్స్’డెలివరీ అయ్యాయి. చాక్లెట్ లావా కేక్‌ను 1.3 లక్షల సార్లు, గులాబ్ జామూన్ ను 85 వేల పర్యాయాలు, మౌస్సె కేక్‌ను 28 వేల మార్లు ఆర్డర్ చేశారు. కరోనా వ్యాప్తి నిరోధకం దృష్ట్యా మాస్క్‌లు, శానిటైజర్లతో పాటు వ్యక్తు ల మధ్య దూరం పాటించడం తప్పనిసరి కావడంతో పుట్టినరోజు, పెళ్లిరోజుల వేడుకలు తగ్గిపోయాయి. పలు వురు పుట్టినరోజు వే డుకలను వీడియో కాల్స్, ఆన్లైన్లో వర్చువల్ కేక్ కటింగ్ సెష న్స్ ద్వారా జరుపుకున్నారట. ఇలా లాక్డౌన్ కాలం లో 1.2 లక్షల కేక్‌లు డోర్ డెలి వరీ అయ్యాయి.ఇక భారతీయులు తమకిష్టమైన ఏయే ఆహారపదార్ధాలను, ఎన్నిసార్లు తెప్పించుకున్నారన్న దానిపై ఆన్లైన్ ఫుడ్ ఆర్డరింగ్, డెలివరీ ప్లాట్‌ఫామ్ స్విగ్గీ ‘‘స్టాట్‘ఈట్’ఇస్టిక్స్ రిపోర్ట్.. ది క్వారంటైన్ ఎడిషన్’’ పేరిట తన తాజా నివేదికలో వెల్లడించింది. వరుసగా నాలుగో ఏడాది కూడా అత్యధికంగా ఆర్డర్ చేసిన ఆహారపదార్థాల్లో బిర్యానీనే అగ్రస్థానంలో నిలిచినట్టు ఈ సంస్థ తెలిపింది. మొత్తం 4 కోట్ల ఆర్డర్ల డెలివరీ..: భారత్‌లో దాదాపు రెండున్నర నెలల పాటు అమల్లో ఉన్న లాక్డౌన్ కాలంలో ఫుడ్, సరుకులు, మెడిసిన్స్,ఇతర వస్తువులు కలిపి 4 కోట్ల ఆర్డర్లను స్విగ్గీ డెలివరీ చేసింది. ఇవేకాకుండా 73 వేల శానిటైజర్, హాండ్ వాష్ బాటిళ్లు, 47 వేల ఫేస్‌మాస్క్‌లు కూడా ఇళ్లకు చేరవేసింది. లాక్డౌన్లో రోజూ రాత్రి 8 గంటలకు సగటున 65 వేల వంతున ‘మీల్ ఆర్డర్లు’వచ్చేవని పేర్కొంది. 32.3 కోట్ల కేజీల ఉల్లిపాయలు, 5.6 కోట్ల కేజీల అరటిపండ్లు: కరోనా టైంలో ఇంటి వంటనే అస్వాదించుకునే వారి కోసమూ వివి«ధ రకాల ఆహార పదార్ధాలు, నిత్యావసర సరుకులను సైతం స్విగ్గీ సరఫరా చేసింది. దేశంలో ఇంట్లోనే వంట చేసుకున్న వాళ్లు తమకిచ్చిన ఆర్డర్ల మేరకు 32.3 కోట్ల కిలోల ఉల్లిపాయలు, 5.6 కోట్ల కిలోల అరటిపండ్లను డెలివరీ చేసినట్టు ఈ సంస్థ తెలిపింది. లాక్డౌన్ సమయంలో తమ నిత్యావసర సరుకుల విభాగం ద్వారా ఈ పంపిణీ చేసినట్టు నివేదికలో తెలిపింది. -
ఎట్లా? ఆ టేస్ట్!.. హైదరాబాదీ దిగాలు
బిర్యానీ అంటే హైదరాబాద్...హైదరాబాద్ అంటేనే బిర్యానీ..ప్రపంచ పటంలో హైదరాబాద్ బిర్యానీకి అంతటి పేరుంది....గుర్తింపూ ఉంది. ఆ ఫ్లేవర్...ఆ టేస్ట్....ఆ క్రేజ్ సిటీ బిర్యానీ స్పెషల్. సామాన్యుడి నుంచి సెలబ్రిటీల వరకు అందరూ దీనికి ఫిదా అయినవాళ్లే!! బిర్యానీ రుచికి నోరూరనివాళ్లు ఉండరంటే అతిశయోక్తి కాదు. ఇది ఒకప్పటి మాట. కరోనా పుణ్యమాని ఘుమఘుమలాడే బిర్యానీ వాసన లేకుండా పోయింది. అంతోఇంతో బిర్యానీ విక్రయాలు చేస్తున్న కొన్ని కొన్ని హోటళ్లకు తమ సిబ్బందికి నేడు వేతనాలు ఇవ్వలేని పరిస్థితి నెలకొంది. దాదాపు 70శాతం విక్రయాలు పడిపోయాయి. కరోనాతో గ్రేటర్ హోటల్ రంగం కుప్పకూలింది. సిటీలో సుమారు 1000కిపైగా నాన్‌వెజ్ హోటళ్లు, రెస్టారెంట్ల పరిస్థితి దయనీయంగా మారింది. వెరైటీ డిష్‌లతో అలలారిన బిర్యానీ వైభవం ఒక్కసారిగా దిగాలైంది.పలు సంస్థలు 2019లోనిర్వహించిన సర్వేల్లో అత్యధిక ఆదరణ పొందిన వంటకంగా ప్రఖ్యాతి గడించింది. హైదరాబాదీలకు సమ్ థింగ్ స్పెషల్ అయిన బిర్యానీ ఇప్పుడు తినలేనంత దూరమైంది. ప్చ్...వైరస్ పోయేదెప్పుడో!! కడుపారా బిర్యానీ తినేదెప్పుడో ??(హైదరాబాద్ బిర్యానీ బెస్ట్..) సాక్షి, సిటీబ్యూరో: ఇవాళ దావత్ చేసుకుందాం... నైట్ ఏదైనా మంచి హోటల్ వెళ్లి బిర్యానీ తిందాంరా... చాలా రోజులైంది.. ఇలా నగర ప్రజలు వారం పది రోజులకోసారి బిర్యానీ ఆరగించేవారు. కానీ కరోనా ప్రభావంతో హోటలింగ్ మానేసారు. బయటకు వెళ్లి బిర్యానీని లాగించేయాలని ఉన్నా కరోనా దెబ్బకు రెస్టారెంట్లవైపు వెళ్లడమే మానేశారు. ఈ వైరస్సేలేకపోతే నగరంలోని వివిధ ప్రాంతాల్లో లభించే బిర్యానీ తినాల్సిందే రుచి చూడాల్సిందే.. అయితే గత మూడు నాలుగు నెలల నుంచి నగర ప్రజల బిర్యానీ రుచులు ఆస్వాదించడంలేదు. దీంతో ప్రపంచ ప్రసిద్ధి చెందిన బిర్యానీ విక్రయాలు దారుణంగా పడిపోయాయి. బిర్యానీది ప్రత్యేక స్థానం 2019లో అత్యధిక అదరణ పొందిన వంటకం బిర్యానీ ఎవర్గ్రీన్ ఫుడ్స్‌కు హైదరాబాదీ మదిలో ప్రత్యేక స్థానం ఉంటూనే ఉంది. నగరంలో విస్తృత శ్రేణి క్యుసిన్లు లభ్యమవుతు న్నప్పటికీ, ఏ తరహా ఫుడ్‌ను ఎక్కువగా అభిమానిస్తుంటారనేది ఆసక్తి కలిగించే అంశమే. ప్రతి రాష్ట్రానికి చెందిన వంటకాలు మన హైదరాబాదీ మదిలో ప్రత్యేక స్థానమే సంపాదించుకున్నప్పటికీ 2019లో అత్యధికంగా అదరణ పొందిన వంటకం బిర్యానీ అని పలు ఫుడ్ డెలివరీ సంస్థలు వెల్లడించాయి. 2019లో నిమిషానికి 95 బిర్యానీలను ఆర్డర్ చేసారని,. అంటే సెకనుకు 1.6 బిర్యానీలు. ఈ ప్లాట్‌ఫాం ద్వారా గతంలో విక్రయాలు జరిగాయి. వేతనాలివ్వలేని పరిస్థితి నగరంలో దాదాపు వెయ్యి వరకు నాన్‌వెజ్ హోటల్స్ ఉన్నాయి. ఇందులో బిర్యానీతో పాటు పలు రకాల తందూరి, మొగలాయి, చైనీస్, దక్కనీ వంటకాలు వడ్డించి.. విక్రయిస్తారు. ప్రస్తుతం కరోనా ప్రభాంవంతో చికెన్‌తో చేసే వివిధ రకాల డిష్‌ల అమ్మాకాలు 85–90 శాతం వరకు పడిపోయాయి. ఇక మటన్ ద్వారా చేసే వివిధ రకాల వంటకాలు 30–35 శాతం అమ్మకాలు జరుగుతున్నట్లు సర్వి హోటల్ నిర్వహకులు హుస్సేన్ తెలిపారు. హోటల్లలో కస్టమర్స్ లేక ఆదాయం రాక వర్కర్స్కు వేతనాలు ఇవ్వని పరిస్థితి నెలకొందని పలు హోటల్ యజమానులు తెలుపుతున్నారు. చాయ్‌తో పాటు ఇతర బేకరీ ఐటమ్స్ విక్రయాలు అవుతున్నాయి. వినియోగదారులు లేక చికెన్ బిర్యానీ ఆర్డర్లు లేకపోవడంతో పలు హోటళ్లలో చికెన్ బిర్యానీ తయారు చేయడం లేదు. దీంతో పాటు చికెన్‌తో తయారు అయ్యే ఇతర డిష్స్ కూడా తయారు చేయడంలేదు. 70 శాతం పడిపోయిన వ్యాపారం నగరంలో ఎన్నో హోటళ్లు.. మరెన్నో రెస్టారెంట్లు ఉన్నా కొత్తవి మాత్రం పుట్టుకొచ్చేవి (కరోనాకు ముందు). అయితే మూడు నెలల నుంచి కరోనా ప్రభావంతో గ్రేటర్లో హోటల్ రంగం కూప్పకూలింది. గ్రేటర్ జనం నాన్‌వెజ్ హోటల్ ఫుడ్ తినడానికి జంకుతున్నారు. దీంతో 70 శాతం హోటళ్లలో వ్యాపారం పడిపోయింది. ఈ పరిస్థితి ఎప్పుడూ రాలేదు కరోనాతో హోటల్ రంగం దారుణంగా పడిపోయిందని హోటల్ నిర్వహకులు అంటున్నారు. జనం హోటల్లో సిట్టింగ్ పక్కనపెడితే కనీసం ఆర్డర్లు కూడా రావడం లేదు. నగరం ఏర్పాటు నుంచి ఇలాంటి పరిస్థితులు ఎప్పుడూ రాలేదని పలువురు ఇరానీ హోటల్ యజమానులు చెబుతున్నారు. కరోనా ప్రభావం ఇలాగే కొనసాగిస్తే పూర్తిగా హోటల్ వ్యాపారం నష్టాల్లో కూరకుపోతుంది. కాస్తోకూస్తో ఆన్లైన్ ఆర్డర్లు వస్తున్నాయి. అవి కూడా బిర్యానీ యే. ఇతర చికెన్ వంటకాల ఆర్డర్లు రావటం లేదని హోటల్ నిర్వాహకులు తెలిపారు. -
హైదరాబాద్ బిర్యానీ బెస్ట్..
పూణె : హైదరాబాద్ బిర్యానీకి ఉన్న పాపులారిటీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే పూణెకు చెందిన ప్రముఖ రెస్టారెంట్ సైతం దీన్నే బిజినెస్ పాలసీగా ఎంచుకుంది. తమ రెస్టారెంట్లో స్వచ్ఛమైన హైదరాబాదీ బిర్యానీ లభిస్తుందని 'ఆన్సియంట్ హైదరాబాద్ బిర్యానీ' పేరుతో పూణెలో ఓ రెస్టారెంట్ తెరిచింది. ఇంత వరకూ బాగానే ఉన్నా హైదరాబాద్ బిర్యానీ తప్ప మిగతా ఏ బిర్యానీ అయినా అది పులావ్‌తో సమానం అంటూ అవుట్లెట్ ప్రచురించింది. అంతేకాకుండా ముంబై, పాకిస్తాన్లో లభించే బిర్యానీని సైతం అది ఒట్టి మటన్ మసాలా అంటూ వివాదాస్పద అవుట్‌లెట్‌ని ప్రచురించడంతో సోషల్ మీడియాలో పెద్ద రచ్చకు కారణమైంది. హైదరాబాద్ బిర్యానీ ప్రేమికులు దీన్ని సపోర్ట్ చేస్తుంటే..లక్నో , కోల్‌కతా ప్రాంత వాసులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు తమ బిర్యానీకి సరైన గుర్తింపు లభించడం లేదంటూ కేరళ వాసులు వాపోయారు. There is nothing but truth in this Biryani Policy. There is no lie. https://t.co/6qhO3tur6T — Wajahat "Wears a Mask Because of a Pandemic" Ali (@WajahatAli) July 1, 2020 అయితే సోషల్ మీడియాలో తీవ్ర దుమారాన్ని రేపుతున్న ఈ అవుట్‌లెట్‌పై స్పందించిన యజమాని..ఇది కేవలం ఫన్నీగా పెట్టిందని ఇతరుల మనోభావాలు, సంస్కృతిని దెబ్బతీయడం తమ ఉద్ధేశం కాదని పేర్కొన్నారు. అయితే హైదరాబాద్ వంటకాలను ఇష్టపడే వారు మాత్రం తమ బ్యానర్‌తో అంగీకరించారని తెలిపారు. లాక్డౌన్ కారణంగా ప్రస్తుతం రెస్టారెంట్ మూసివేశామని త్వరలోనే తెరిచేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు. -
బిర్యానీ కోసం భర్తపై అలిగి..
సాక్షి, చెన్నై: తనకు బిర్యానీ కొనివ్వలేదన్న మనస్తాపంతో భర్తపై అలిగి ఓ వివాహిత ఆత్మాహుతి చేసుకుంది. మహాబలిపురంలో ఈ ఘటన వెలుగు చూసింది. చెంగల్పట్టు జిల్లా మహాబలిపురం సమీపంలోని పూంజేరిలో మనోహరన్, శరణ్య దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి 11 ఏళ్ల కుమారుడు, తొమ్మిదేళ్ల కుమార్తె ఉన్నారు. మహాబలిపురంలోని శిల్ప తయారీ సంస్థలో మనోహరన్ పనిచేస్తున్నాడు. గురువారం తనకు బిర్యానీ తినాలని ఆశగా ఉందని, కొనిపెట్టాలని భర్తను శరణ్య కోరింది. అంతంత మాత్రమే నగదు ఉందని, మళ్లీ చూద్దామన్నట్టు చెప్పి ఇంటి నుంచి మనోహరన్ బయటకు వెళ్లాడు. మనస్తాపానికి గురైన శరణ్య భర్త మీద కోపంతో ఆయన బైక్‌లో ఉన్న పెట్రోల్‌ను తీసి, తనపై పోసుకుని నిప్పు అంటించుకుంది. మంటల్ని ఆర్పి ఆమెను చెంగల్పట్టు ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ అర్ధరాత్రి సమయంలో శరణ్య మృతిచెందింది. -
బావర్చీ బిర్యానీ తినాలనీ ఉందా?
సాక్షి, సిటీబ్యూరో(హైదరాబాద్): బావర్చీ బిర్యానీ తినాలనీ ఉందా? ఫుడ్‌ను ఆర్డర్ ఇవ్వాలనుకుంటున్నారా? అయితే మరో వారం రోజులు నిరీక్షించాల్సిందే. ఈ నెల 8 నుంచి హోటళ్లు తెరుచుకున్నా.. ఫుడ్ ఆర్డర్‌కు మాత్రం జర.. వెయిట్ ప్లీజ్ అంటూ సమాధానం వచ్చే అవకాశాలు లేకపోలేదు. కరోనా లాక్డౌన్ నుంచి హోటల్ రంగానికి మినహాయింపు లభించినా.. పూర్తిస్థాయిలో సర్వీస్ అందించే అవకాశాలు కనిపించడం లేదు. లాక్డౌన్లో హోటల్స్, రెస్టారెంట్లు, ఇతర అతిథ్య సేవారంగాలకు ఈ నెల 8 నుంచి మినహాయిస్తూ కేంద్రం గ్రీన్ సిగ్న్‌ల్ ఇచ్చినా.. హోటళ్లలో వంటావార్పు చేసే చెఫ్ నుంచి వెయిటర్ వరకు, మేనేజర్ల నుంచి సర్వీస్ బాయ్స్ వరకు అందుబాటులో లేకుండాపోయారు. ఒకవైపు సిబ్బంది కొరత వెంటాడుతుండగా.. మరోవైపు ఇప్పటికే విద్యుత్ బిల్లులు, టాక్స్‌లు, నిర్వహణ భారం తడిసి మోపెడు కావడంతో ఆర్థిక పరిస్థితి దయనీయంగా మారింది. వ్యాపారం పునఃప్రారంభించినా కరోనా భయంతో కస్టమర్స్ వస్తారనే భరోసా లేకుండాపోయింది. దీంతో హోటల్స్, రెస్టారెంట్లను నడిపేదెలా? అన్న ఆందోళన వ్యక్తమవుతోంది. హోటల్ రంగం కుదేల్.. లాక్‌డౌన్‌తో హైదరాబాద్ మహానగరంలో హోటల్ రంగం కుదేలైంది. పర్యాటక రంగాన్ని పడకేసేలా చేసింది. ఫలితంగా హోటళ్లు, రెస్టారెంట్లు, టూరిజం రంగాలు భారీగా దెబ్బతిన్నాయి. ఎక్కడికక్కడ హోటళ్లు మూతపడ్డాయి. రెస్టారెంట్లు బంద్ అయ్యాయి. హోటల్ రంగంపై ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆధారపడ్డ సుమారు సుమారు రెండు లక్షల మంది ఉద్యోగ, ఉపాధికి ముప్పు వాటిల్లింది. హోటల్స్, రెస్టారెంట్ల పరిస్థితి మరింత దయనీయంగా తయారైంది. వంట మాస్టర్స్ నుంచి క్లీనర్లు, బేరర్ల వరకు ఒక్కో రెస్టారెంట్లో సగటును 30 మందికి తగ్గకుండా పని చేసేవారు. లీజు తీసుకుంటే మాత్రం నెలకు కనిష్టంగా రూ.2లక్షల అద్దె చెల్లించాల్సిందే. వంటశాలలో గ్రైండర్లు, హీటర్లు, గ్రీజర్ల మోతలు సరేసరి. రెస్టారెంట్లోనూ ఏసీలు, ఫ్యాన్లు ఉండాల్సిందే. విద్యుత్ చార్జీలు కమర్షియల్ టారీఫ్‌లో గూబ గుయ్యిమనిపిస్తుంటాయి. ఈ పరిస్థితుల్లో లాక్డౌన్ తర్వాత తిరిగి రెస్టారెంట్లు కొనసాగేదెలా తెలియని పరిస్థితి నెలకొంది. హోటల్స్ పరిస్థితి కూడా రెస్టారెంట్లకు భిన్నంగా ఏమీ లేదు. లక్ష మందికిపైనే.. గ్రేటర్ హైదరాబాద్‌లోని హోటల్స్, రెస్టారెంట్లు, స్టార్ హోటల్స్, ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్‌లో షెఫ్స్, కుక్స్, హెల్పర్స్, సప్లయర్స్‌గా సుమారు లక్ష మందికి పైగా పనిచేస్తున్నారు. వీరిలో 70 శాతం వరకు మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, అసోం, మణిపూర్, ఒడిశా, మేఘాలయ రాష్ట్రాలకు చెందిన వారు ఉన్నారు. మిగిలిన 30 శాతమే స్థానికులు. లాక్‌డౌన్‌తో హోటల్ రంగం సిబ్బంది దాదాపు సుమారు 70 శాతం వరకు సొంతూళ్లకు వెళ్లిపోయారు. ఇప్పట్లో కూడా వచ్చే అవకాశాలు కానరావడం లేదు. ఇక స్టార్ హోటల్స్ సిబ్బందికి ఎలాంటి జీతాలు చెల్లించకపోగా, మే మాసంలో ఏకంగా నోటీసులు జారీ చేసి జీతాలు లేకుండా ఆగస్ట్ 31 వరకు సెలవుల్లో ఉండాలను ఆదేశించినట్లు తెలుస్తోంది. ధీమా కరువే.. లాక్డౌన్ మినహాయింపుతో హోటల్స్, రెస్టారెంట్స్, అతిథ్య రంగం వ్యాపారం పునః ప్రారంభించినా..వ్యాపారం జరుగుతుందనే గ్యారంటీ లేదన్న భావన నిర్వాహకులు పేర్కొంటున్నారు. లాక్‌డౌన్‌తో ఉపాధి లేకపోవడం, ప్రైవేటు ఉద్యోగులకు జీతాలు లేకపోవడం, ఉద్యోగంపై భరోసా లేకపోవడం తదితర కారణాలతో ప్రజల్లో కొనుగోలు శక్తిని తీవ్రంగా దెబ్బతీస్తాయని విశ్లేషిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఉద్యోగులు వీకెండ్స్ పేరుతో బయటకు వెళ్లడం, ఎంజాయ్ చేయడం వంటి వాటికి స్వస్తి చెప్పేస్తారని వ్యాపారులు పేర్కొంటున్నారు. కరోనా వైరస్ భయంతో పాటు ఇప్పట్లో ఎవరూ ఇల్లు కదిలే అవకాశం ఉండకపోవచ్చన్న భావన వ్యక్తమవుతోంది. దీంతో హోటళ్లను తిరిగి తెరిచినా వ్యాపారులు నిర్వహణ ఖర్చులను భారీగా తగ్గించుకోవాలనే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఆన్లైన్ టెక్ అవేపైనా ప్రభావం.. నగరంలో ఆన్లైన్ ఫుడ్ ఆర్డర్స్పైనా కరోనా ఎఫెక్ట్ పడింది. లాక్డౌన్లో ఆన్లైన్, టెక్ అవే ఫుడ్స్‌కు మినహాయింపు ఇచ్చినా.. వ్యాపారం మాత్రం పెద్దగా ముందుకు సాగడం లేదు. 12 గంటల్లో ఫుడ్ డెలివరీ బాయ్స్ 25 నుంచి 40 వరకు ఆర్డర్లు దొరికేవి. ఇప్పుడా సంఖ్య 2 నుంచి 5కు మించడం లేదనే ఆవేదన వ్యక్తవుతోంది. టెక్ అవే గిరాకీ కూడా పూర్తిగా ఐదు శాతానికి పడిపోయింది. ప్రభుత్వం ఆదుకోవాలి లాక్‌డౌన్‌తో ఆర్థికంగా దెబ్బతిన్న హోటల్ రంగాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. తాజా మినహాయింపుతో హోటళ్లను తెరిచినా అతిథుల రాక పెద్దగా ఉండకపోవచ్చు. జనం కొన్నాళ్లపాటు భయపడి ఇంట్లోనే ఉండిపోతారు. దీంతో బ్యాంకుల నుంచి తీసుకున్న అప్పులకు వాయిదాలు కట్టే పరిస్థితి కూడా హోటల్ నిర్వాహకులకు ఉండదు. కనీసం ఏడాది పాటు జీఎస్టీ రద్దు చేయాలి. విద్యుత్ చార్జీల్లో రాయితీలు కల్పించాలి. – ఎస్ వెంకట్‌రెడ్డి, తెలంగాణ రాష్ట్ర హోటల్స్ అసోసియేషన్ అధ్యక్షుడు -
ఎంత చెత్త వంటకం, యాక్!!
గులాబ్ జామున్ పావ్‌బాజీ, కుర్కురే మిల్క్ షేక్ వంటి వింతైన వంటకాల గురించి మీరు వినే ఉంటారు. తీపి వంటకాన్ని, మసాలా వంటకాన్ని మిక్స్ చేస్తే వచ్చిన సంకర జాతి వంటకాలు అవి. ఒకప్పుడు ఇంటర్నెట్లో తెగ చక్కర్లు కొట్టిన ఆ వంటకాలు నెటిజన్ల నుంచి భారీ అసహ్యాన్నే మూటగట్టుకున్నాయి. తాజాగా ఇలాంటి మరో వింతైన వంటకం నెటిజన్లను షాక్‌కు గురిచేస్తోంది. అదే ‘‘న్యూటెల్లా బిర్యానీ’’. బిర్యానీని, న్యూటెల్లాను కలిపి తయారు చేసిన వంటకం ఇది. ప్రస్తుతం ఈ వింత వంటకం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే బిర్యానీ లవర్స్ దీనిపై మండిపడుతున్నారు. ( ఏంటిది.. చచ్చిపోతే ఎవరు రెస్పాన్స్! ) ఈ వంటకంపై కొందరు నెటిజన్లు స్పందిస్తూ.. ‘‘ నేనిక ఈ భూమ్మీద ఉండలేను.. ఎంత చెత్త వంటకం, యాక్!!.. చెత్త ఐడియా, న్యూటెల్లాను ఎవరైనా బిర్యానీతో కలుపుతారా?.. ఈ వంటకాన్ని తయారు చేసినోడిని జైల్లో వేయాలి’’ అంటూ మండిపడుతున్నారు. మరికొంతమంది తమదైన శైలిలో మీమ్స్ పెడుతూ రెచ్చిపోతున్నారు. చదవండి : లిఫ్ట్‌లో నరకం అనుభవించిన చిన్నారి -
రంజాన్ వేళ 600 మందికి బిర్యానీ విందు
సింగపూర్: ప్రపంచవవ్యాప్తంగా ఉన్న ముస్లిం సోదరులు నేడు రంజాన్ పండుగ జరుపుకుంటున్నారు. అయితే కరోనా వైరస్ వ్యాప్తి వల్ల ఈ ఏడాది పండగ సంబరాలు ఎక్కడా కనిపించడం లేదు. లాక్డౌన్, సామాజిక దూరం నేపథ్యంలో ఎవరి ఇళ్లలో వారే పండగ జరుపుకుంటున్నారు. ఇళ్లలో ఉన్న వారి పరిస్థితి పర్లేదు.. మరి క్వారంటైన్లో ఉండే వారి సంగతి ఎలా. అక్కడ వారు పెట్టింది తినాలే తప్ప వేరే మార్గం లేదు. ఈ నేపథ్యంలో సింగపూర్‌కు చెందిన ఓ బిజినేస్ మ్యాన్ క్వారంటైన్లో ఉన్న వారికి బిర్యానీ విందు ఇచ్చి.. పండగ పూట వారికి తోడుగా నిలబడ్డాడు. దుష్యంత్ కుమార్ అనే వ్యక్తి దాదాపు 600 మంది వలస కూలీలకు బిర్యానీతో విందు ఇచ్చి పెద్ద మనసు చాటుకున్నాడు.(నిర్మానుష్యంగా మారిన ఈద్గాలు,మసీదులు) ఈ సందర్భంగా దుష్యంత్ మాటట్లాడడుతూ.. ‘భారత్, బంగ్లాదేశ్, పాకిస్తాన్, చైనా దేశాల నుంచి ఎంతో మంది ఇక్కడికి వస్తుంటారు. సాధారణంగా అయితే పండగ సమయానికి వారు కుటుంబ సభ్యులతో ఇంట్లో సంతోషంగా ఉండేవారు. కానీ ఈ సారి ఆ అవకాశం లేకుండా పోయింది. కరోనా వైరస్ వల్ల ఈ వలస కూలీలంతా ఇక్కడే క్వారంటైన్ కేంద్రాల్లో ఉండిపోయారు. పండగ పూట వారి ముఖంలో నవ్వు చూడాలనుకున్నాను. అందుకే నా భార్యతో కలిసి ఓ పెద్ద రెస్టారెంట్ కిచెన్‌లో దాదాపు 600 మందికి సరిపోను బిర్యానీ వండించాను’ అని తెలిపాడు. ఇదే కాక లాక్డౌన్ ప్రారంభం అయిన నాటి నుంచి ప్రతిరోజు 1000 మందికి భోజనం పెడుతు మంచి మనసు చాటుకుంటున్నాడు దుష్యంత్.(గోల్డీ కల్యాణం) -
క్వారంటైన్: బిర్యాని కోసం రగడ
బనశంకరి: నగరంలోని హజ్‌భవన్‌లో ఏర్పాటు చేసిన క్వారంటైన్లో ఉన్న పాదరాయనపుర దాడి నిందితులు తమకు బిర్యాని కావాలని పట్టుబడుతున్నారు. రామనగరజైలులో ఐదుగురికి కరోనా నిర్ధారణ కావడంతో అక్కడినుంచి 116 మందికిపైగా నిందితులను హజ్భవనంలోని క్వారంటైన్‌కు తరలించిన విషయం తెలిసిందే. జైలులో అందించే ఆహారాన్నే ఇక్కడ కూడా అందజేస్తున్నారు. అయితే వీరిలో కొందరు తమకు బిర్యాని భోజనం పెట్టాలని అధికారులపై ఒత్తిడి తీసుకువచ్చారు. దీంతో ఏం చేయాలో తెలియక అధికారులు తల పట్టుకుంటున్నారు. (ముప్పుతిప్పలు పెడుతున్న మూడు వైరస్లు) ప్రసూతి ఆసుపత్రిని మూసివేసిన బీబీఎంపీ హంపినగరలో ఓ మహిళకు కరోనా సోకడంతో మూడలపాళ్య ప్రసూతి ఆసుపత్రిని బీబీఎంపీ అధికారులు మూసివేశారు. మూడలపాళ్య ప్రసూతి ఆసుపత్రిలో సేవలందిస్తున్న డాక్టర్లు, నర్సులను క్వారంటైన్‌కు తరలించి ప్రసూతి ఆసుపత్రిని మూసివేశామని బీబీఎంపీ అధికారులు తెలిపారు. (లాక్డౌన్ ఎత్తివేతకు పంచతంత్రం!) -
ఆప్ విజయంలో ‘బిర్యానీ’ పాత్ర
సాక్షి, న్యూఢిల్లీ : ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు అనుగుణంగా అరవింద్ కేజ్రివాల్ నాయకత్వంలో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఘన విజయం సాధించింది. ఈ విజయంలో మసాలా దినుసులతో ఘుమ ఘుమలాడే ‘బిర్యానీ’ కూడా తనవంతు పాత్రను నిర్వహించిందని చెప్పవచ్చు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ‘బిర్యానీ’ ఓ రాజకీయ ఆయుధంగా మారడమే అందుకు కారణం. సీఏఏ, ఎన్ఆర్సీలకు వ్యతిరేకంగా ఢిల్లీలోని షహీన్ బాద్‌లో ఆందోళన చేస్తున్న వారికి ఆప్ ప్రభుత్వం ‘బిర్యానీ’ సరఫరా చేస్తోందని బీజేపీ ఎన్నికల ప్రచారం సందర్భంగా పదే పదే ఆరోపణలు చేసింది. ఆ పార్టీ ఐటీ విభాగం హెడ్ అమిత్ మాలవియా అయితే ‘షహీన్ బాద్‌లో బిర్యానీ పంచుతున్నారనడానికి ఇదిగో ప్రూఫ్, అదిగో ప్రూఫ్’ అంటూ ఏవో ఫొటోలతో ట్వీట్లపై ట్వీట్లు చేశారు. ఇలా ‘బిర్యానీ’ని ప్రతికూల ప్రచారానికి ఉపయోగించుకోవడం ఇదే మొదటి సారి కాదు. 2015లో ముంబై టెర్రరిస్టు దాడుల కేసు విచారణ సందర్భంగా పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉజ్వల్ నికమ్ ‘బిర్యానీ’ ఆయుధంగా ఉపయోగించారు. జైల్లో టెర్రరిస్ట్ అజ్మల్ కసబ్‌కు జైలు అధికారులు ‘బిర్యానీ’ పెడుతున్నారని ఆయన ఆరోపించారు. అప్పట్లో కసబ్‌కు పెరుగుతున్న మద్దతును దెబ్బతీయడానికే తాను ఆ అబద్ధపు ఆరోపణ చేశానని ఆ తర్వాత ఆయన వివరణ ఇచ్చుకున్నారు. దక్షిణాసియా ముస్లింలకు బహు పసందైన ‘బిర్యానీ’ని రాజకీయ ఆయుధంగా వాడినట్లయితే హిందువుల ఓట్లన్నీ కట్టకట్టుకొని తమకే పడతాయని బీజేపీ నేతలు ఆశించారు. అయితే ఆ నినాదాన్ని ఎవరు అంతగా పట్టించుకోలేదని ఎన్నికల ఫలితాలే సూచిస్తున్నాయి. నిమిషానికి 95 వేల ఆడర్లు భారత్‌లో ప్రతి నిమిషానికి 95 బిర్యానీల ఆర్డర్ వస్తోందని ఇంటికి ఆహారాన్ని సరఫరా చేస్తున్న అతి పెద్ద యాప్ ‘స్విగ్గీ’ లెక్కలు తెలియజేస్తున్నాయి. దేశంలో జాతీయ ఆహారంగా ‘బిర్యానీ’ని గుర్తించాలనే స్థాయికి దీని ప్రాధాన్యత పెరిగింది. భారత దేశ ఆహారాన్ని రుచి చూడాలనుకునే విదేశీయులు మొట్టమొదగా బిర్యానీ, ఆ తర్వాత బటర్ చికెన్‌ను శోధిస్తారని ‘ఎస్ఈఎం రష్’ 2019లో నిర్వహించిన ఓ సర్వే వెల్లడించింది. ధోని హోటల్ మారిన వైనం భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని హైదరాబాద్‌కు వచ్చినప్పుడు ఆయన బస చేసిన హోటల్లోకి బయటి నుంచి బిర్యానీని అనుమతించకపోతే ఆయన ఏకంగా హోటల్ నుంచే మకాం మార్చారు. పర్షియన్ పదం బిర్యాన్ నుంచి బిర్యానీ వచ్చింది. పర్షియన్లో బిరింజ్ అంటే బియ్యం అని అర్థం కూడా ఉంది. బిర్యానీ మొఘల్స్ వంటకమని, వారి నుంచి ఇది భారత్‌కు వచ్చిందని చెబుతారు. తుర్క్–మంగోల్ చక్రవర్తి తైమార్ 14వ శతాబ్దంలోనే ఈ వంటకాన్ని భారత్‌కు తీసుకొచ్చారనే వాదన కూడా ఉంది. నిజాం నవాబులు, లక్నో నవాబులు ఈ వంటకాన్ని అమితంగా ప్రేమించి ప్రాచుర్యంలోకి తెచ్చారు. పలు రకాల బిర్యానీలు హైదరాబాద్ దమ్ బిర్యానీకి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు ఉంది. సంప్రదాయ మొఘలాయ్ బిర్యానీ కూడా హైదరాబాద్‌లో దొరకుతుంది. అలాగే బెంగళూరు బిర్యానీ, కోల్‌కతా బిర్యానీ, ముంబై బిర్యానీ, లక్నో బిర్యానీ (పుక్కీ బిర్యానీ, అవద్) అంటూ ఏ ప్రాంతం బిర్యానీలకు ఆ ప్రాంతం ప్రత్యేకతలుండగా హైదరాబ్ దమ్, మొఘలాయ్, థలస్సరీ బిర్యానీలు దేశవ్యాప్తంగా పెద్ద నగరాల్లో దొరకుతున్నాయి. బిర్యానీ అంటే ప్రధానంగా మటన్‌తో చేసేదని, ఇప్పుడు చికెన్, ఎగ్, ఫిష్, ప్రాన్స్‌లతోపాటు విజిటెబుల్ బిర్యానీలు కూడా దొరకుతున్న విషయం తెల్సిందే. (హస్తిన తీర్పు : లైవ్ అప్డేట్స్) చదవండి : ఆప్ జోరు, వైరల్ మినీ మఫ్లర్‌మ్యాన్ -
బిర్యానీ తెమ్మంటే తేలేదని..
బంజారాహిల్స్: బిర్యానీ తెమ్మంటే తేలేదని భర్తపై అలిగిన మహిళ ఒంటిపై కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకొని ఆత్మహత్యాయత్నం చేసింది. ఈ ఘటన జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన మేరకు.. రహ్మత్‌నగర్‌లో వెంకటయ్య–పద్మ దంపతులు అద్దెకుంటున్నారు. గత మూడు రోజుల నుంచి పని ముగించుకొని ఇంటికి వచ్చేటప్పుడు బిర్యానీ తేవాలంటూ పద్మ భర్తను కోరుతూ వస్తున్నది. అయితే వెంకటయ్య పెడచెవిన పెట్టాడు. తాను ఎన్నిసార్లు అడిగినా బిర్యానీ తేవడం లేదంటూ అలిగిన పద్మ గురువారం తెల్లవారుజామున ఒంటిపై కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకుంది. పెద్ద ఎత్తున మంటల్లో చిక్కుకొని అరుస్తున్న భార్యపై నీళ్ళుపోసి మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు వెంకటయ్య యత్నిస్తున్న సమయంలోనే ఆమె 70 శాతం గాయాలతో విలవిల్లాడుతుండగా వెంటనే చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం పద్మ పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. జూబ్లీహిల్స్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
మన బిర్యానీకి ప్రపంచమే ఫిదా
న్యూఢిల్లీ : భోజన ప్రియులు అత్యధికంగా తినే ఆహార పదార్ధాల్లో బిర్యానీ ముందు వరసలో ఉంటుంది. ఇందులో నాన్ వెజ్ ప్రియులు ఎక్కువగా తీసుకునే ఆహరం చికెన్ బిర్యానీ. ఆదివారం వచ్చిందంటే చాలు ఇంట్లో తయారు చేసుకోనో లేదా ఫుడ్ యాప్స్‌లో ఆర్డర్ చేసుకొనో లొట్టలేసుకుంటూ తింటారు. ఇక ఆన్లైన్ బుకింగ్‌లో చికెన్ బిర్యానీది ఎప్పుడూ నెంబర్ వన్ ప్లేసే.ఇది ఒక్క హైదరాబాద్ లేదా ఇండియాకే పరిమితం కాదు.. ప్రపంచమంతా మన బిర్యానీకి ఫిదా అయిపోయింది. 2019 సంవత్సరానికి గానూ ఆన్ లైన్ ఫుడ్ యాప్ సెర్చ్ లో టాప్ 10 ఐటమ్స్ లో దీనికే తొలిస్థానం దక్కింది. ఆ తర్వాతి స్థానంలో బటర్ చికెన్, సమోసా, చికెన్ టిక్కా మసాలా, దోశ, తందూరి చికెన్, పాలక్ పనీర్, నాన్, దాల్‌మఖని, చాట్ వంటి భారత వంటకాలు నిలిచాయి. వీటి గురించి కూడా నెటిజన్లు పెద్ద సంఖ్యలో వెతుకుతున్నట్టు అధ్యయనంలో తేలింది. పంజాబీ ప్రత్యేక వంటకమైన బటర్ చికెన్ కోసం 4 లక్షలసార్లు వెతికారట. సమోసా కోసం 3.9 లక్షల సెర్చ్‌లు రాగా, చికెన్ టిక్కా మసాలా కోసం నెలకు సగటున 2.5 లక్షల సెర్చ్‌లు వస్తున్నట్లు సర్వే తెలిపింది.ప్రపంచంలోని అన్ని ప్రాంతాల్లో భారతీయులు ఉండడం వల్లే ఇండియన్ ఫుడ్స్ టాప్ లో ఉన్నాయని సర్వే పేర్కొంది. -
దళిత వ్యక్తి బిర్యానీ అమ్మాడని చితకబాదారు
-
‘బిర్యానీ అమ్మాడని చితకబాదారు’
సాక్షి, న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీ సమీపంలో దారుణం చోటుచేసుకుంది. దళిత వ్యక్తి బిర్యానీ అమ్ముతున్నాడనే ఆగ్రహంతో కొందరు అతనిపై దాడి చేసి తీవ్రంగా కొట్టిన ఘటన కలకలం రేపింది. గ్రేటర్ నోయిడాలోని రబుపురాలో జరిగిన ఈ దాడి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బిర్యానీ విక్రయిస్తున్న దళితుడు లోకేష్ (43)ను కులం పేరుతో దూషిస్తూ కొందరు భౌతిక దాడికి పాల్పడిన దృశ్యాలు ఈ వీడియోలో కనిపించాయి. శుక్రవారం ఈ ఘటన జరగ్గా వీడియో మాత్రం ఆదివారం వెలుగులోకి వచ్చింది. పలుసార్లు తాము హెచ్చరించినా అతను బిర్యానీ విక్రయిస్తున్నాడనే ఆగ్రహంతో వారు దళితుడిపై దాడికి తెగబడినట్టు స్ధానికులు తెలిపారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. కాగా ఈ ఘటనను ఖండిస్తూ నటి ఊర్మిళా మటోండ్కర్ ట్వీట్ చేశారు. భారతీయులుగా మనం అంటరానితనం పాటించడం మన సంస్కృతి కాదని, ఇది నాగరికం అనిపించుకోదని వ్యాఖ్యానించారు. దళితునిపై దాడి ఘటన సబ్ కా సాథ్..సబ్ కా వికాస్ ఉద్దేశానికి విరుద్ధమని ఆమె ట్వీట్లో పేర్కొన్నారు. -
‘మాసినేని’ బిర్యానీ తింటే ‘రంగు’పడుద్ది!
అనంతపురం న్యూసిటీ: ‘మాసినేని గ్రాండ్’ నగరం నడిబొడ్డున ఉన్న త్రీస్టార్ హోటల్.. ఇక్కడ పొరపాటున సామాన్యుడు భోజనం చేశాడంటే బిల్లు చుక్కలు చూడాల్సిందే. పోనీ నాణ్యమైన ఆహారం పెడుతున్నారంటే అదీ లేదు. రంగుల మిశ్రమంతో చేసిన ఆహార పదార్థాలు వడ్డిస్తూ ప్రజల ఆరోగ్యంతో ఆడుకుంటున్నారు. మంగళవారం ఫుడ్ సేఫ్టీ అధికారులు మాసినేనిలో తనిఖీలు నిర్వహించగా.. ఈ బాగోతం బయటపడింది. నగరంలోని కొన్ని హోటళ్ల నిర్వహణపై కలెక్టర్ గంధం చంద్రుడుకు ఇటీవల ఫిర్యాదులందాయి. దీంతో ఆయన హోటళ్లు, రెస్టారెంట్లను తనిఖీ చేయలని ఫుడ్ సేఫ్టీ అధికారులను ఆదేశించారు. ఆ మేరకు అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ శ్రీనివాసరెడ్డి, ఫుడ్ ఇన్స్పెక్టర్ నగరంలోని మాసినేని, హ్యాంగౌంట్స్, హరియాణా జిలేబీ సెంటర్లను తనిఖీ చేశారు. మాసినేని గ్రాండ్లో బిరియాని, చికెన్ తందూరిలో అధికంగా రంగులు కలిపినట్లు అధికారులు గుర్తించారు. ఇలా రంగులు కలపడం వల్ల కేన్సర్ వచ్చే ప్రమాదం ఉందని అధికారులు చెబుతున్నారు. మాసినేనిలోని ఆహార పదార్థాల శాంపిల్స్ తీసుకున్నారు. గతంలోనూ మాసినేని గ్రాండ్లో కుళ్లిన మాంసం, బూజు పట్టిన తినుబండారులు ఫుడ్‌సేఫ్టీ అధికారుల తనిఖీలో తేలిన విషయం విదితమే. కానీ అప్పట్లో టీడీపీ అండంతో ఎలాంటి కేసు నమోదు కాకుండా యాజమాన్యం తప్పించుకుంది. శాంపిల్స్ సేకరణ అనంతరం అధికారులు హ్యాంగౌట్స్‌లో తనిఖీ చేశారు. ఫ్రీజర్‌లో ఉంచి పలు ఆహార పదార్థాలను సేకరించారు. రంగులు అధికంగా వేసినట్లు గుర్తించారు. హర్యానా జిలేబీ నిర్వాహకులు నిబంధనలు పాటించకుండా టమాట సాస్ చేస్తుండగా.. అధికారులు శాంపిల్స్ సేకరించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ రెడ్డి, కరీముల్లా మాట్లాడుతూ, సేకరించిన ఆహార పదార్థాలను ల్యాబ్‌కు పంపుతామన్నారు. అక్కడి నుంచి వచ్చే నివేదిక ఆధారంగా వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. -
సారీ.. నో ఆనియన్ !
సాక్షి, సనత్‌నగర్ : ఉల్లి.. ఇటు వంటింట్లోనే కాదు అటు హోటళ్లు, రెస్టారెంట్లలోనూ కొండెక్కి కూర్చుంది. ధరలో సెంచరీ దాటేసిన దీనిని పట్టుకునేందుకు ఎవరి తరమూ కావట్లేదు. ఇప్పటికే ఇళ్లల్లో చాలా మటుకు ఉల్లికి స్వస్తి పలకగా, ఆ దిశగా పలు హోటళ్లు, రెస్టారెంట్లు సైతం పయనిస్తున్నాయి. కొన్ని రెస్టారెంట్లు ఏకంగా బిర్యానీలో ఉచితంగా ఇచ్చే ఆనియన్ సలాడ్‌కు ప్రత్యేక రేటు నిర్ణయించేశాయి. మరికొన్ని మొత్తంగా ఉల్లికి టాటా చెప్పేసి కీర, క్యారెట్‌తో ఆ స్థానాన్ని భర్తీ చేసేస్తున్నాయి. ఇక పలు హోటళ్లలో ఆనియన్ దోశ ఊసే ఎత్తడం లేదు. కొన్ని రోజుల పాటు ఉల్లితో ముడిపడి ఉన్న ఆహార పదార్థాలకు తాత్కాలిక బ్రేక్ వేస్తే మంచిదన్న అభిప్రాయానికొచ్చేశారు. ఉదయం అల్పాహారం దగ్గర నుంచి మధ్యాహ్నం లంచ్, సాయంత్రం స్నాక్స్, రాత్రి డిన్నర్ వరకు.. హోటల్, రెస్టారెంట్ వంటకాలు ఎక్కువగా ఆనియన్తో ముడిపడి ఉంటాయి. ఆహార ప్రియులు ఎక్కువగా ఆనియన్ తెప్పించుకుని మరీ తమకిష్టమైన వంటకాలతో కలిపి భుజించడం షరామామూలు. ఇక బిర్యానీకి ఆనియన్ కాంబినేషన్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అలాంటిది ఉల్లి ధరలు కొండెక్కి కూర్చోవడంతో హోటళ్లు, రెస్టారెంట్ల నిర్వాహకులు సైతం వాటి వాడకాన్ని తగ్గించేశారు. ఇక అంతగా వినియోగదారులను పోగొట్టుకోవడం ఇష్టం లేక అంతగా అవసరమైతే కొసరి కొసరి అందిస్తున్నారు. అది కూడా ఆనియన్ దోశ అయితేనే. బిర్యానీ, చపాతి, పరోటా ఇలా తదితర వంటకాల్లో ఉచితంగా ఇచ్చే ఆనియన్‌కు దాదాపుగా గుడ్‌బై చెప్పేశారు. ఇక ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లలో అయితే ఉల్లి ప్రసక్తే లేకుండాపోయింది. మలక్‌పేట మార్కెట్‌కు 18 వేల సంచులు చాదర్‌ఘాట్: కొండెక్కిన ఉల్లి ధరలు కాస్త తగ్గుముఖం పట్టాయని మార్కెట్ శాఖ అడిషనల్ డైరెక్టర్ పి.రవికుమార్ తెలిపారు. సోమవారం ఆయన మలక్‌పేట మార్కెట్లో ఉల్లి ధరలపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహారాష్ట్ర, కర్నూలు, కర్ణాటక, మహబూబ్‌నగర్‌ల నుంచి మలక్‌పేట మార్కెట్‌కు సోమవారం 18 వేల బ్యాగులు వచ్చాయన్నారు. క్వింటాకు రూ.4వేల నుంచి రూ.8 వేల వరకు ధర పలుకుతున్నట్లు చెప్పారు. కిలో ఉల్లి రూ.60 నుంచి 80 వరకు మార్కెట్లో లభ్యమవుతోందన్నారు. ఈజిప్ట్ నుంచి ఈ నెల 14, 15 తేదీల్లో రాష్ట్రానికి వెయ్యి క్వింటాళ్ల ఉల్లి దిగుమతి కానున్నట్లు వివరించారు. సమావేశంలో జాయింట్ డైరెక్టర్ శ్రీనివాస్, గ్రేడ్ 3 సెక్రటరీ నరేందర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఉప్మా దోశకు డిమాండ్.. పెరిగిన ఆనియన్ ధరలు ఉప్మా దోశకు డిమాండ్‌ను పెంచాయి. దోశలో ఏదో ఒకటి మిక్స్ చేసి తింటే గానీ మజా ఉండదని ఆహారప్రియులు చెప్పేమాట. ఈ క్రమంలో ఉల్లికి బదులుగా ఉప్మాను జత చేసి హోటల్ నిర్వాహకులు అందిస్తున్నారు. ఉప్మా దోశ సాధారణమే అయినప్పటికీ ఉల్లి పెరుగుదలతో ఎక్కువ మంది మెనూలో ఉప్మా దోశ చేరిపోయింది. కీర, క్యారెట్‌తో సరి.. ఒకప్పుడు ఉల్లి కంటే కీర, క్యారెట్ల ధర ఎక్కువ ఉండేవి. కానీ ఇప్పుడు పరిస్థితి తారుమారైంది. క్యారెట్, కీరల కంటే ఉల్లి డబుల్, త్రిపుల్ స్థాయిలో పెరగడంతో బిర్యానీ హోటళ్లు ఇప్పుడు ఆనియన్‌ను పక్కనపెట్టేశాయి. దీని స్థానంలో కీరను అందిస్తుండగా.. మరికొన్ని హోటళ్లు దానికి క్యారెట్ కూడా జతచేసి అందిస్తున్నాయి. చిన్న చిన్న హోటళ్ల దగ్గర నుంచి బడా రెస్టారెంట్ల వరకు కూడా ఇదే పరిస్థితి నెలకొంది. పెద్ద మొత్తంలోఆనియన్ తెచ్చి ఉచితంగా అందించే పరిస్థితి లేదని, ఒకప్పుడు సిల్వర్‌గా భావించే ఉల్లి ఇప్పుడు బంగారం సరసన చేరిపోయిందని రెస్టారెంట్ల నిర్వాహకులు చెబుతున్నారు. ఈ క్రమంలో ఆచితూచి కొనుక్కొని వాడాల్సిన పరిస్థితులు తలెత్తాయి. ఆనియన్ దోశ ఆపేశాం.. గతంలో బిర్యానీ, చపాతీ, పరోటా తదితర వంటకాలతో పాటు ఆనియన్ కూడా ఇచ్చేవాళ్లం. ధరలు పెరిగినప్పటి నుంచి ప్రస్తుతం ఆనియన్‌ను ఆపేశాం. ఈ పరిస్థితిని కస్టమర్లు కూడా అర్థం చేసుకుని సహకరిస్తున్నారు. ఇక ఆనియన్ దోశ అడిగినప్పుడు ఉప్మా దోశ గానీ లేక ప్లేన్ దోశ గానీ తీసుకోమని చెబుతున్నాం. కస్టమర్ పట్టుబడితే తప్ప ఆనియన్ దోశకు అంతగా ప్రాధాన్యమివ్వడం లేదు. – శ్రీనివాస్, అభి టిఫిన్స్, వివేకానందనగర్ రూ.4వేల భారం.. మొన్నటివరకు హోల్‌సేల్‌గా క్వింటాల్ ఉల్లిపాయలను వెయ్యి రూపాయలకు తీసుకునేవాణ్ణి. ప్రస్తుతం పెరిగిన ధరతో అదే క్వింటాల్ ఉల్లిపాయలను రూ.10 వేలకు తీసుకోవాల్సి వస్తోంది. అందుకే ప్రస్తుతం కస్టమర్లను పోగోట్టుకోవడం ఇష్టం లేక 50 కిలోలు మాత్రమే తీసుకుంటున్నాను. అయినా నాలుగు వేల రూపాయలకుపైగా భారం పడుతోంది. ధరలు పెంచితే వినియోగదారులు ఎక్కడ దూరం అవుతారోనని ఆ ఊసే ఎత్తడం లేదు. – వీరేశప్ప, ఉడిపి గ్రాండ్ హోటల్, కూకట్పల్లి వినియోగదారులు అర్థం చేసుకోవాలి.. మార్కెట్‌క వెళితే కిలో రూ.140 ఉండడంతో వెనక్కి తిరిగివచ్చేశాం. కొన్ని రోజులు ఆనియన్ దోశను ఆపివేయాలనే నిర్ణయానికి వచ్చాం. అందుకే హోటల్‌కు వచ్చిన కస్టమర్లకు ప్లేన్ దోశ, ఉప్మా దోశను మాత్రమే అందిస్తున్నాం. వినియోగదారులు కూడా పరిస్థితిని అర్థం చేసుకుని ఉల్లి దోశ జోలికి వెళ్లడం లేదు. ప్రజలు కూడా ఉల్లి వాడకాన్ని కొద్ది రోజులు నిలిపి చేస్తే ధరలు దిగి దిగి వస్తాయనే విశ్వసిస్తున్నాం. – భవాని, ఇడ్లీ ప్యూర్ వెజ్ అండ్ రెస్టారెంట్ కాసిన్ని తక్కువ ఇస్తున్నాం.. మార్కెట్లో ఉల్లి ధరలు చూస్తుంటే మతిపోతోంది. కానీ కస్టమర్లకు ఇవ్వక తప్పని పరిస్థితులు ఉన్నాయి. ఇంతకుముందు ఇచ్చినన్ని కాకపోయినా ఇప్పుడు కాస్త తక్కువ చేసి ఇస్తున్నాం. కొంత మంది కస్టమర్లు మళ్లీ కావాలని అడుగుతున్నారు. ధరలు తగ్గితే బాగుంటుంది. ఇవే ధరలు కొనసాగితే ఉల్లి లేకుండానే వంటలు చేయాల్సి వస్తుంది. – కుసుమ, చంద్రహవేలిహోటల్ నిర్వాహకురాలు, జూబ్లీహిల్స్ క్యాబేజీ తురుము.. క్యారెట్ ముక్కలు బంజారాహిల్స్: నగరంలోని పలు హోటళ్లు, రెస్టారెంట్లలో ఉల్లిగడ్డ పకోడీలో ఉల్లికి బదులు క్యాబేజీ, కాలిఫ్లవర్ వాడుతున్నారు. కట్‌మిర్చికి ఉల్లిపాయలు ఇవ్వడం మానేశారు. బిర్యానీ పక్కన కీర, నిమ్మకాయ ముక్కలు పెడుతున్నారు. ఇక కొన్ని హోటళ్లలో తమవద్ద ఉల్లిపాయలు లభించవని బోర్డులు ఏర్పాటు చేశారు. బిర్యానీ ముద్ద దిగడం లేదు బిర్యానీలోకి ఆనియన్ అడిగితే క్యాబేజీ తురుముతో పాటు కీరదోస ముక్కలు ఇస్తున్నారు. ఆనియన్ లేకపోతే బిర్యానీ తినడం చాలా కష్టంగా ఉంటుంది. దీంతో బిర్యానీ తినలేక రోటీ తిని పోవాల్సి వస్తోంది. ఏ రెస్టారెంట్‌కు వెళ్లినా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. డబ్బులు ఇస్తామని చెబుతున్నా ఆనియన్ సలాడ్ మాత్రం ఇవ్వడం లేదు. – సాయి, కృష్ణానగర్ ఓ హోటల్లో ఆనియన్ సలాడ్‌కు రూ.25 చెల్లించాలని పెట్టిన బోర్డు తక్కువ ఇస్తున్నారు.. రెస్టారెంట్లలో ఏది ఆర్డర్ చేసినా సలాడ్‌లో ఉల్లిపాయ ముక్కలు తక్కువగా ఇస్తున్నారు. మళ్లీ కావాలని అడిగినా స్పందించడం లేదు. చాలీచాలని ఉల్లిపాయలతో కాస్త అసంతృప్తిగానే కడుపు నింపుకోవాల్సివస్తోంది. బయట మార్కెట్లో ఉల్లి ధరల ప్రభావం ఇంట్లో ఉండేవారితో పాటు మాలాగే రెస్టారెంట్లకు వచ్చేవారికి కూడా కనిపిస్తోంది. – శ్రీశైలం, జూబ్లీహిల్స్ మొహమాటం లేకుండా చెప్పేస్తున్నాం.. ఆనియన్ లేదని కస్టమర్లకు నిర్మొహమాటంగా చెప్పేస్తున్నాం.. బోర్డులు కూడా పెట్టేశాం. బిర్యానీలో ఉల్లిపాయలకు బదులుగా కీరదోస ముక్కలను అందిస్తున్నాం. గత 15 రోజుల నుంచే ఇదే తరహాలో మా కస్టమర్లను బుజ్జగించాల్సి వస్తోంది. కొంత మంది ఆనియన్ లేదంటే బిర్యానీ తినకుండానే వెళ్లిపోతున్నారు.. – వాజిద్, గ్రీన్ బావర్చి హోటల్ యజమాని, కృష్ణానగర్ -
ఆ ఒక్కటీ అడక్కు!
సాక్షి, హైదరాబాద్: పొగలు కక్కుతున్న చికెన్ బిర్యానీ పక్కన ఉల్లిగడ్డ, నిమ్మకాయ ఉంటేనే నాలుకకు రుచి, మజా వస్తుంది. ఉల్లిగడ్డ లేని బిర్యానీని ఊహించలేం కూడా. ఆహార ప్రియులు చికెన్, మటన్ బిర్యానీ తింటున్నప్పుడే పక్కన ఉల్లిగడ్డ నంజుకోకపోతే తిన్నట్టు ఉండదు. అయితే, నెల రోజులుగా ఉల్లి ధర ఆకాశాన్నంటుతుండడంతో నోటికి ఉల్లి ముక్క దొరకడం లేదు. ప్రస్తుతం ఉల్లిగడ్డ బహిరంగ మార్కెట్లో రూ.80 నుంచి రూ.100 ఉంది. దీంతో బిర్యానీ సరఫరా చేసే హోటళ్లలో ఉల్లిగడ్డకు ‘నో’ చెప్పారు. ఉల్లిపాయ లేకుండానే బిర్యానీ సరఫరా చేస్తున్నారు. కీరాతో పాటు నిమ్మకాయ ప్లేట్లో పెట్టి బిర్యానీ పక్కన పెడుతున్నారు. ఉల్లిగడ్డ ఏదంటే.. ‘ఆ ఒక్కటీ అడక్కు’ అంటున్నారు. బిర్యానీ ధరతో సమానంగా ఉల్లి ధర పోటీ పడుతోందని నిర్వాహకులు చెబుతున్నారు. పాతబస్తీ, కొత్తబస్తీ అనే తేడా లేకుండా అన్ని హోటళ్లలోనూ బిర్యానీకి ఉల్లిగడ్డ లేకుండానే అందిస్తున్నారు. మరోవైపు ఉల్లి ధర పెరగడంతో కర్రీ పాయింట్లలో ధరలు కూడా పెంచేశారు. మరికొన్ని చోట్ల బిర్యానీ రేట్లు కూడా పెరిగిపోయాయి. -
కుళ్లిన మాంసంతో బిర్యానీ
ఇబ్రహీంపట్నం రూరల్: కుళ్లిన మాంసంతో బిర్యానీ తయారీ చేసి విక్రయిస్తున్న ఓ హోటల్‌పై మున్సిపల్ అధికారులు దాడి చేసి జరిమానా విధించారు. ఆదిబట్ల మున్సిపాలటీ పరిధిలోని మంగల్‌పల్లి గేట్ వద్ద ఇటీవల రెడ్ బావర్చి హోటల్ ప్రారంభమైంది. ఈ హోటల్లో కుళ్లిపోయిన కోడిమాంసం వాడుతున్నట్లు మున్సిపల్ అధికారులకు సమాచారం అందింది. దీంతో వారు శుక్రవారం ఆ హోటల్‌పై దాడి చేసి హోటల్‌ను పరిశీలించారు. ఈ పరిశీలనలో హోటల్లో కుళ్లిన మాంసం లభించింది. హోటల్ నిర్వాహకులపై అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. డబ్బుల కోసం ప్రజల ప్రాణాలతో చెలగాటమాడడం సరికాదని, మరోసారి ఇలాంటిది పునరావృతమైతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ సందర్భంగా హోటల్‌కు రూ.20 వేలు జరిమానా విధించారు. ఈ దాడిలో మున్సిపాలిటీ సిబ్బంది రాజశేఖర్, సదానందం, పర్వతాలు, సురేశ్ తదితరులు పాల్గొన్నారు. -
కుక్కర్ పలావ్‌ని సృష్టించిన ‘కూచిపూడి’
ఆవకాయ బిర్యానీ, పొట్లం బిర్యానీ, మిరియాల బిర్యానీ, రాజు గారి కోడిపలావ్... ఇలా కొత్త కొత్తఅవతారాలతో ఆకట్టుకుంటున్న సిటీ బిర్యానీకి మరో కొత్త లుక్. ఈసారి విశేషం ఏమిటంటే.. ఆ బిర్యానీకి రంగు, రుచి, రూపు అన్నీ మనమే ఇవ్వాలి. అంటే ఎలాంటి బిర్యానీ తినాలనుకుంటున్నామో అది మనమే డిజైన్ చేసుకోవచ్చునన్నమాట. అంటే మన ధమ్ మనదేనన్నమాట. ఇంకో విశేషం ఏమిటంటే.. దీనిని వండిన చోటే తినొచ్చు. ఇంటికొచ్చినిమిషాల్లో వండుకుని కూడా తినొచ్చు. సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్‌కీ బిరియానీకి ఉన్న అనుబంధం ఎలాంటిదో కొత్తగా చెప్పక్కర్లేదు. అయితే సిటీ బిరియానీల గురించి మాత్రం ఎప్పటికప్పుడు కొత్తగా చెప్పుకుంటూనే ఉండాలి. సిటీలోని బిర్యానీ లవర్స్ గురించి మాత్రమే కాదు ఇతర నగరాల నుంచి దాని కోసం ఇక్కడి దాకా వచ్చే ఫుడీస్ని కూడా మెప్పించేందుకు రోజుకో రకం కొత్త శైలిని పుట్టిస్తున్నాయి రెస్టారెంట్స్. అందులో భాగంగానే ఇప్పుడు కుక్కర్ పలావ్‌ని సృష్టించింది కూచిపూడి పలావ్. ఎంచుకో.. చవులూరించుకో.. ఏదైనా రెస్టారెంట్‌కి వెళ్లి ‘‘నాకు మటన్ బిర్యానీ కావాలి. తక్కువ స్పైసీగా ఉండాలి. రైస్ మాత్రం బాస్మతీయే ఉండాలి. మర్చిపోయా అందులోకి ఫ్రైడ్ ఎగ్ కూడా ఉండాలి..’’ ‘‘నాకు వెజిటబుల్ బిర్యానీ కావాలి. అందులో పనీర్ మిక్స్ చేయాలి. నట్స్ కూడా కలిపితే బెటర్, అయితే కేరట్స్ మాత్రం వద్దు’’. ఇలాంటి కోరికల లిస్ట్ బయటకు తీస్తే.. వెంటనే స్టివార్డ్ నుంచి మీకొచ్చే సమాధానం ‘‘మా దగ్గర ఉన్న బిర్యానీలు ఇవి. తింటే తిను లేకపోతే పో..’’దాదాపుగా ఇంతే కదా. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది గురూ. మియాపూర్లోనో, కేపీహెచ్బీలోనో రెస్టారెంట్‌కి వెళితే.. మీకు కావాల్సిన విశేషాల జాబితా రాసుకోవడానికి సిద్ధంగా ఉంటారు. అనంతరం మన ఆర్డర్ ప్రకారం అన్నీ మిక్స్ చేసేసి కుక్కర్లో వేసి మన ఎదురుగా టేబుల్ మీదే పెడతారు. లిక్విడ్.. ప్యాక్డ్ చాలా మంది ఇళ్లకు వెళుతూ వెళుతూ బిర్యానీ ప్యాక్ చేసి తీసుకెళతారు. ఇంట్లోకి వెళ్లి స్నానపానాదులన్నీ కానిచ్చి అరగంటో గంటో తర్వాత తీరుబాటుగా కంచం ముందు కూర్చునే సరికి చల్లగా లేదా చప్పబడిపోయిన బిర్యానీ నోటికి తగులుతుంది. అలా కాకుండా అచ్చం హోటల్లో వడ్డించినట్టు మనింట్లో మన కళ్ల ముందు ఆ ఘుమఘుమలు పొగలు సెగలు కక్కుతూ పరిమళ సహితంగా బిర్యానీ ఆస్వాదించాలంటే.. ఇంపాజిబుల్ అనుకుంటాం కదా. కానీ దీని కోసం లిక్విడ్ ప్యాక్ బిర్యానీ అందుబాటులోకి వచ్చింది. మసాలాలూ కర్రీ, రైస్ అన్ని మిక్స్ చేసిన ప్యాక్‌ని మనకు ఇస్తారు. మనం చేయాల్సిందల్లా ఇంటికి రాగానే దాన్ని ప్రెషర్ కుక్కర్ లేదా ఎలక్ట్రిక్ కుక్కర్లో వేసుకుని కాసేపాగి వేడిగా వడ్డించుకోని తినడమే. మరో విషయం దీన్ని కావాలంటే ఒకటి రెండ్రోజులు శుభ్రంగా ఫ్రిజ్‌లో పెట్టి నిల్వ చేసుకుని ఆ తర్వాత కూడా వండుకోవచ్చు. వినియోగదారుల అభిరుచులకు తగ్గట్టుగా.. ఇది ప్రపంచపు తొలి కస్టమైజ్డ్ పలావ్గా కుక్కర్లో వడ్డించే పలావ్, లిక్విడ్ పలావ్‌లు అని కూచిపూడి పలావ్ రెస్టారెంట్‌కు చెందిన వెంకట్ అంటున్నారు. భిన్న రకాల బిర్యానీలు అందుబాటులో ఉన్న పరిస్థితుల్లో భోజన ప్రియుల అభి‘రుచులు’ నిమిషానికి ఒకలా మారిపోతున్నాయని అంటున్న ఆయన ఎవరో తామిష్టం వచ్చినట్టు వండింది తినక తప్పని పరిస్థితి కన్నా తమ ఇష్టం వచ్చిన బిర్యానీ తమ శారీరక స్థితిగతులు, ఇష్టాఇష్టాలకు అనుగుణంగా తయారు చేసుకునే వెసులుబాటు ఉండడం నవతరాన్ని ఆకట్టుకునే అంశం అన్నారు. ‘‘కొందరు బిర్యానీ పొడి పొడిగా కొందరు తడిగా ఉండాలనుకుంటారు. అది కూడా చెప్పి తయారు చేయించుకునేంత ఫ్లెక్సిబులిటీ ఇందులో ఉంటుంది’’ అని చెప్పారు. టేబుల్‌కో కుక్కర్.. ప్రతి సీటింగ్కీ 1.2 లీటర్ల కుక్కర్ ఉంటుంది. రెస్టారెంట్లో కుకింగ్ టైమ్ (షుమారు 10 నిమిషాలు), కూలింగ్ టైమ్ (షుమారు 6 నిమిషాలు) మొత్తం 15 నిమిషాల నుంచి 20 నిమిషాల లోపు మనం డిజైన్ చేసుకున్న మన బిర్యానీ రెడీ. ఒక కుక్కర్లో ఇద్దరికి సరిపోయే పోర్షన్ వస్తుంది. దీనికి జతగా గోంగూర గ్రేవీ, పెరుగు పచ్చడి వగైరాలను అందిస్తారు. అదండీ.. ఇప్పుడు సిటీలో కొత్తగా అందుబాటులోకి వచ్చిన బిర్యానీ స్టోరీ.. ఇక మీ కుక్కర్ మీదే.. -
అంతా కల్తీ
సాక్షి, సిటీబ్యూరో: మీరు రోడ్డు వెంట వెళ్తుంటే పానీపూరీ.. కబాబ్.. బిర్యానీ.. పాయా ఇలా విభిన్న వంటకాలు నోరూరిస్తున్నాయా? కానీ వాటిని అపరిశుభ్ర వాతావరణంలో తయారు చేస్తే.. జిహ్వాచాపల్యం తీరడం మాటేమో గానీ.. వాంతులు, విరేచనాలతో మంచం పట్టడం ఖాయం. గ్రేటర్లో ఇప్పడు వైరల్ ఫీవర్లు విజృంభిస్తున్న నేపథ్యంలో కల్తీ ఆహారం కేసులు నగరవాసులను కలవరపెడుతున్నాయి. ఆహార కల్తీ నిరోధక చట్టాన్ని అమలు చేసేందుకు జీహెచ్ఎంసీలో సరిపడా ఫుడ్ ఇన్స్పెక్టర్లు అందుబాటులో లేకపోవడంతో పరిస్థితి రోజురోజుకూ విషమిస్తోంది. గ్రేటర్ పరిధిలో ఏడాదిలో సుమారు 3వేల ఆహార కల్తీ కేసులు నమోదైనట్లు అధికారులు పేర్కొంటున్నారు. మరో 978 మందికి నోటీసులు జారీ చేసినట్లు తెలిపారు. 23 మందిపై క్రిమినల్ కేసులున్నట్లు తెలిపారు. జరిమానా అరకొరే... ఆహార కల్తీ నిరోధక చట్టం కింద వివిధ రకాల ఉల్లంఘనలకు పాల్పడితే ప్రస్తుతం రూ.500 నుంచి రూ.3,000 వరకు మాత్రమే జరిమానాలు విధిస్తుండడంతో ఉల్లంఘనులు వెరవడం లేదు. అపరిశుభ్ర పరిసరాల్లో వండిన వంటకాలనే వినియోగదారులకు వడ్డిస్తున్నారు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. ఫుడ్‌ఇన్‌స్పెక్టర్ల తనిఖీల్లో అక్రమాలు బయటపడితే తక్కువ మొత్తంలో జరిమానాలను చెల్లించి చేతులు దులుపుకుంటుండడం గమనార్హం. ఇక జీహెచ్ఎంసీ పరిధిలో ఫుడ్ ఇన్స్పెక్టర్లు కేవలం 11 మంది మాత్రమే ఉన్నారు. సిబ్బంది కొరతతో నగరవ్యాప్తంగా తనిఖీలు చేయడం వీలుకావడం లేదు. వీరి సంఖ్యను 50కి పెంచాల్సి ఉంది. మొబైల్ ల్యాబ్స్ ఎక్కడ? ఆహార కల్తీని నిరోధించేందుకు మొబైల్ టెస్టింగ్ ల్యాబ్స్ ఏర్పాటు చేస్తామన్న బల్దియా అధికారులు... ఒక వాహనాన్ని ప్రవేశపెట్టినప్పటికీ అది అలంకారప్రాయంగానే మారింది. ఇవి కనీసం 50 వరకు అవసరమవుతాయని అధికారులు అంచనా వేస్తున్నారు. వీటిలోనూ 54 రకాల ఆహార కల్తీ పరీక్షలు నిర్వహించేలా వసతులు ఉండాలని స్పష్టం చేస్తున్నారు. ప్రస్తుతం నాచారంలోని ఫుడ్‌సేఫ్టీ ల్యాబ్‌లో ఫుడ్‌ఇన్‌స్పెక్టర్లు తీసుకున్న ఆహార నమూనాలను తనిఖీ చేస్తున్నారు. అయితే ఈ ప్రక్రియ ఆలస్యమవుతుండడంతో అక్రమార్కులు సులభంగా తప్పించుకుంటున్నారు. ఇక భారీ జరిమానాలు ఆహార కల్తీని నిరోధించేందుకు భారీ జరిమానాలు విధించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. కేబినెట్ ఆమోదంతో ఈ చట్టాన్ని త్వరలో అమల్లోకి తీసుకురావాలని యోచిస్తున్నట్లు సమాచారం. నూతన చట్టంలో ఆహార కల్తీకి పాల్పడే వారిపై జరిమానాలు... ప్రసుతం ఉన్న దానికి పది రెట్లు ఉంటాయని తెలిసింది. తద్వారా అక్రమార్కులు దారికొస్తారని అధికారులు పేర్కొంటున్నారు. అవసరమైతే క్రిమినల్ కేసులు నమోదు చేసేందుకు అవకాశం కల్పించాలని నిర్ణయించినట్లు తెలిసింది. కల్తీ ఆహారంతో రోగాలు కల్తీ ఆహారంతో వాంతులు, విరేచనాలు, డయేరియా, జీర్ణకోశ వ్యాధులు, టైఫాయిడ్, హెపటైటిస్, కామెర్లు తదితర వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉంది. అపరిశుభ్ర వాతావరణంలో తయారు చేసిన ఆహార పదార్థాలను తినకపోవడమే మంచిది. రుచి కోసం శుచి లేని ఆహారం తీసుకొని ఇబ్బందులకు గురికావొద్దు. ప్రస్తుతం వైరల్ ఫీవర్స్ పంజా విసురుతున్న నేపథ్యంలో సదా అప్రమత్తంగా ఉండాలి. – డాక్టర్ బీరప్ప,గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్, నిమ్స్ -
బిర్యానీలో చచ్చిన బల్లులను కలుపుతూ....
సాక్షి, గుంతకల్లు: బల్లి పడిని బిర్యానీని ఇచ్చారంటూ రైల్వే క్యాంటీన్ నిర్వాహకులను బెంబేలెత్తించి, నగదు దండుకోవాలనుకున్న ఓ ప్రయాణికుడిని రైల్వే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వివరాల్లోకి వెళితే.. సోమవారం మధ్యాహ్నం ఛత్రపతి శివాజీ టర్మినల్–కోయంబత్తూరుకు వెళ్లే కుర్లా ఎక్స్‌ప్రెస్ గుంతకల్లు రైల్వే జంక్షన్‌కు చేరుకుంది. అందులో ప్రయాణిస్తున్న సుందర్‌పాల్ అనే ప్రయాణికుడు 4వ ప్లాట్ఫారంలో ఉన్న మారయ్య రైల్వే క్యాంటీన్లో వెజ్ బిర్యానీ కొనుగోలు చేశాడు. అనంతరం అందులో బల్లి పడిందంటూ నేరుగా వెళ్లి డిప్యూటీ రైల్వే స్టేషన్ మాస్టర్ జార్జ్, కమర్షియల్ మేనేజర్ అనూక్‌కు ఫిర్యాదు చేశాడు. కంగారు పడ్డ వారు వెంటనే రైల్వే ఆస్పత్రి వైద్యురాలు భార్గవిని పిలిపించి ప్రాథమిక చికిత్స చేయించారు. అదే సమయంలో రైల్వే అధికారులు విచారణ చేపట్టగా అసలు విషయం వెల్లడైంది. బాధితుడిగా భావిస్తున్న సుందర్‌పాల్ పచ్చి మోసగాడుగా రైల్వే అధికారులు తేలింది. కావాలనే అన్నంలో చచ్చిన బల్లులను కలిపి రైల్వే క్యాంటీన్ యజమానుల బ్లాక్మెయిల్ చేసి డబ్బు గుంజేవాడిగా తెలుసుకున్నారు. ఇదే విషయాన్ని డీసీఎం కుమార్‌గౌరవ్, సీటీఐ వై.ప్రసాద్ స్పష్టం చేశారు. నాలుగు రోజుల క్రితం జబల్పూర్ రైల్వేస్టేషన్లో ఇలానే సమోసలో బల్లి వేసి నాటకమాడి ఆ కాంట్రాక్టర్ నుంచి రూ.30వేలు గుంజినట్లుగా తేలిందన్నారు. తిరిగి గుంతకల్లులోనూ అదే తరహాలో కాంట్రాక్టర్‌ను బెదిరించి రూ. 5 వేలు డిమాండ్ చేశాడని, దీనిపై అనుమానం వచ్చి ఆరా తీయగా అసలు విషయం వెలుగు చూసిందని వివరించారు. రైల్వే అధికారులు విచారణలో తాను వేసింది బల్లి కాదని సముద్రపు చేప అంటూ సుందర్‌పాల్ ధ్రువీకరించాడు. డబ్బు కోసం నాలుగైదు ప్రదేశాల్లో ఇదే తరహా మోసాలకు పాల్పడినట్లు అంగీకరించాడని పేర్కొన్నారు. -
విషంతో బిర్యానీ వండి భర్తకు పెట్టింది..
తిరువొత్తియూరు: వివాహేతర సంబంధానికి అడ్డు పడుతున్నాడని భర్తకు విషం కలిపిన బిర్యానీ పెట్టిన భార్య కోసం పోలీసులు గాలిస్తున్నారు. వేలూరు జిల్లా జోలార్‌పేట, ఏలగిరి కొండ అత్తనావూరుకు ప్రాంతానికి చెందిన సెల్వం (38) హోసూరులో ఉద్యోగం చేస్తున్నాడు. అతని భార్య జయమతి(33). వీరికి ఒక కుమార్తె ఉంది. జయమతి జోలార్‌పేటలో చదువుతున్న సమయంలో ఓ అధ్యాపకుడితో వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ విషయంలో దంపతుల మధ్య గొడవలు జరుగుతుండేవి. ఈ క్రమంలో గత 17వ తేదీ కుమార్తె పుట్టినరోజు నాడు సెల్వం హోసూరు నుంచి ఇంటికి వచ్చాడు. అదే రోజు వివాహేతర సంబంధం గురించి భార్య, భర్తల మధ్య ఘర్షణ ఏర్పడింది. దీంతో భర్తను కడతేర్చాలని నిర్ణయించుకున్న జయమతి బిర్యానీ వండి అందులో విషం కలిపి భర్తకు ఇచ్చింది. బిర్యానీ తిన్న సెల్వం వాంతులు చేసుకుంటూ సృహ తప్పాడు. అదే సమయానికి అక్కడికి వచ్చిన సెల్వం కుటుంబ సభ్యులు సెల్వాన్ని హుటాహుటిన కృష్ణగిరి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు పరారిలో వున్న జయమతి కోసం గాలిస్తున్నారు. -
అతి తక్కువకు బిర్యానీ కాంబో ప్యాక్
వేడి వేడి బిర్యానీ తినాలనుందా? వెరైటీగా అరిటాకులోనా? అది కూడా కేవలం 127 రూపాయలకే. అయితే కేరళలోని వియ్యూరు సెంట్రల్ జైలుకి ఆర్డర్ ఇవ్వాలి. అక్కడి జైలు అధికారులు ఖైదీలతో నోరూరించే వేడి వేడి బిర్యానీలను తయారుచేయించి స్థానిక ప్రజలకు ఆన్లైన్లో అమ్మకానికి పెట్టే సరికొత్త ఆలోచనకు శ్రీకారం చుట్టారు. తొలి దశలో బిర్యానీ కాంబో ధరని 127 రూపాయలుగా నిర్ణయించారు. నాణ్యత కు నాణ్యతా, రుచికరమైన బిర్యానీ అతి తక్కువ ధరలో అం దుబాటులోకి రావడంతో కేరళలోని వియ్యూరు ప్రజలు జైలు బిర్యానీ కోసం ఎగబడుతున్నారు. 300 గ్రాముల బిర్యానీ, ఒక రోస్టెడ్ చికెన్ లెగ్ పీస్, మూడు చపాతీలూ, ఒక కప్ కేక్, సలాడ్, పచ్చడి, ఒక లీటర్ వాటర్ బాటిల్‌తో పాటు సాంప్రదాయబద్ధంగా అరిటాకుని కూడా ప్యాక్ చేసి కాంబో ప్యాక్‌లో ఇస్తారు. ఆన్లైన్ ఫుడ్ డెలివరీ సంస్థ అయిన స్విగ్గీ తో ఒప్పందం చేసుకుని జైలు నుంచి పార్శిళ్లను వినియోగదారుల ముంగిళ్లలోకి చేర్చే ఏర్పాటు చేశారు జైలు అధికారులు. కేరళ జైళ్లలోని ఖైదీలు తయారు చేసిన వివిధ ఆహార పదార్థాలను ఫ్రీడం ఫుడ్ ఫ్యాక్టరీ ఎంటర్ప్రైజెస్ ద్వారా 2011 నుంచే అమ్మకానికి పెడుతున్నారు. అయితే ఆన్లైన్లో అమ్మకాలు మాత్రం ఇదే తొలిసారి అని వియ్యూరు సెంట్రల్ జైలు సూపరింటెండెంట్ నిర్మలానందన్ నాయర్ వెల్లడించారు. 2011 నుంచి ఖైదీలు చపాతీలు తయారు చేసి అమ్మడం మొదలుపెట్టారు. ప్రస్తుతం 100 మంది ఖైదీలు రోజుకి 25,000 చపాతీలు, 500 బిర్యానీలు తయారు చేస్తుండటం జైలు అధికారులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. -
హైదరాబాద్ బిర్యానీ ఎంతపని చేసింది?
సాక్షి, చెన్నై: బిర్యానీని ఆర్డర్ చేసిన యువతికి ఆన్లైన్ ఫుడ్ డెలివరీ సంస్థ చుక్కలు చూపించింది. బిర్యానీ రాకపోగా రూ.40 వేలు పోగొట్టుకోవాల్సి వచ్చింది. ఉబర్ ఈట్స్ సంస్థ చేసిన ఈ నిర్వాకంపై ఆ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. వివరాలు.. చెన్నై సౌకార్‌పేటకు చెందిన ప్రియా అగర్వాల్ (21) బుధవారం ఉదయం ఉబర్ ఈట్స్ కంపెనీకి ఆన్లైన్లో హైదరాబాద్ బిర్యానీ ఆర్డర్ చేసింది. బిర్యానీ ధర రూ.76 ఆన్లైన్ ద్వారానే చెల్లించింది. అయితే అకస్మాత్తుగా ఆర్డర్ క్యాన్సిల్ కావడంతో ఉబర్ ఈట్స్ కాల్ సెంటర్‌కు ఫోన్ చేయగా.. మీరు చెల్లించిన రూ.76 తిరిగి పొందాలంటే ముందుగా రూ.5 వేలు చెల్లించండి, మేము రూ.5,076 మీ ఖాతాలో జమ చేస్తామని తెలిపారు. వారు చెప్పిన ప్రకారమే రూ.5 వేలు చెల్లించినా డబ్బు వెనక్కి రాలేదు. దీంతో మరలా కాల్ సెంటర్‌ను సంప్రదించగా మరోసారి రూ.5 వేలు చెల్లించండని చెప్పారు. ఇలా 8 సార్లు రూ.5 వేల లెక్కన మొత్తం రూ.40 వేలు చెల్లించింది. అయితే ఆమె రూ.76తో పాటూ రూ.40 వేలను కూడా కోల్పోయింది. తాను మోసపోయినట్లు ఆలస్యంగా గ్రహించిన ప్రియా అగర్వాల్ చెన్నై వడపళని పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేయగా సైబర్ క్రైం పోలీసులు విచారణ జరుపుతున్నారు. -
హలీం, పలావ్ ఈటింగ్ పోటీ
సాక్షి, హైదరాబాద్: జూబ్లీహిల్స్‌లోని సోడాబాటిల్ ఓపెనర్ వాలా రెస్టరెంట్లో సోమవారం హలీమ్ – పలావ్ ఈటింగ్ పోటీలు నిర్వహించారు. ప్రత్యేక రంజాన్ మెనూతో ఏర్పాటు చేసిన ఈటింగ్ పోటీల్లో పెద్దసంఖ్యలో ఆశావాహులు పాల్గొన్నారు. 1.2 కేజీల హలీమ్ లాగించి భరత్ విజేతగా నిలవగా బాసిత్ అలీ రన్నరప్‌గా నిలిచాడు. 2.5 కేజీల పలావ్ ఆరగించి సౌమ్య ప్రకాష్ విజేతగా నిలవగా 1.5 కేజీల పలావ్ తిని అమిత్నాయర్ రన్నరప్‌గా నిలిచాడు. విజేతలకు నిర్వాహకులు బహుమతులు అందించారు. గత రెండేళ్ల నుంచి ఈటింగ్ పోటీలు నిర్వహిస్తున్నట్టు సోడాబాటిల్ ఓపెనర్ వాలా రెస్టరెంట్ నిర్వాహకులు తెలిపారు. పోటీలో పాల్గొన్న ఆశావహులు -
హలీం– పలావ్ ఈటింగ్ పోటీ
జూబ్లీహిల్స్: జూబ్లీహిల్స్‌లోని సోడాబాటిల్ ఓపెనర్ వాలా రెస్టారెంట్లో సోమవారం హలీమ్ – పలావ్ ఈటింగ్ పోటీలు నిర్వహించారు. ప్రత్యేక రంజాన్ మెనూతో ఏర్పాటు చేసిన ఈటింగ్ పోటీల్లో పెద్దసంఖ్యలో ఆశావాహులు పాల్గొన్నారు. 1.2 కేజీల హలీమ్ లాగించి భరత్ విజేతగా నిలవగా బాసిత్ అలీ రన్నరప్‌గా నిలిచాడు. 2.5 కేజీల పలావ్ లాగించి సౌమ్య ప్రకాష్ విజేతగా నిలవగా 1.5 కేజీల పలావ్ తిని అమిత్నాయర్ రన్నరప్‌గా నిలిచాడు. విజేతలకు నిర్వాహకులు బహుమతులు అందించారు. -
ఆ రాత్రి 20,000 ప్లేట్ల బిర్యానీ లాగించారు..
సాక్షి, న్యూఢిల్లీ : భారత్‌లో నూతన సంవత్సర వేడుకలంటే చిన్నా పెద్దా తేడా లేకుండా ఆనందోత్సాహాలతో కొత్త ఏడాదిని స్వాగతిస్తారు. 2018కి వీడ్కోలు పలుకుతూ 2019కు స్వాగతం చెబుతూ డిసెంబర్ 31 రాత్రి భారత్‌లో వేడుకలు మిన్నంటిన సంగతి తెలిసిందే. ఆ రోజు రాత్రి దేశవ్యాప్తంగా ప్రజలు 20,000కు పైగా ప్లేట్ల బిర్యానీని లాగించేశారని వెల్లడైంది. డిసెంబర్ 31 రాత్రి దేశమంతటా వేలాది బిర్యానీ ప్లేట్లు సరఫరా చేశారని, కొత్త ఏడాదికి అరగంట చేరువలోనే వందలాది ఆర్డర్లను అందచేశారని ఆహార ఆర్డర్, సరఫరా సంస్థ ఫుడ్‌పండా పేర్కొంది. కొత్త ఏడాదిని స్వాగతిస్తూ జనం బిర్యానీతో పాటు బ్లాక్ ఫారెస్ట్ చాక్లెట్ కేక్, చికెన్ రోల్స్, బర్గర్లు, ఫ్రైడ్ రైస్‌ను ఆస్వాదించారని తెలిపింది. 2018 చివరి రోజున హైదరాబాద్, ఢిల్లీ-ఎన్సీఆర్, బెంగళూర్, ముంబై, వైజాగ్ల్లో ఎక్కువ ఆర్డర్లు వచ్చాయని వెల్లడించింది. హైదరాబాదీలు ఎక్కువగా చికెన్ బిర్యానీని ఆర్డర్ చేయగా, ముంబై వాసులు మిల్క్‌షేక్‌లు, బర్గర్ల వైపు మొగ్గుచూపారని,ఇక దేశ రాజధాని ఢిల్లీ పౌరులు టిక్కా, బటర్ చికెన్లను ఇష్టంగా తిన్నారని తేలింది. ఇక ఐటీ సిటీగా పేరొందిన బెంగళూర్‌లో ఎక్కువగా చక్కెర లేని జ్యూస్‌లు, సలాడ్లను ఆర్డర్ చేశారని ఫుడ్‌పండా పేర్కొంది. -
సామల వంటలు
సామల టొమాటో పులావ్ కావలసినవి: సామలు – ఒక కప్పు, నెయ్యి/నూనె – 2 టీ స్పూన్లు ఉల్లి తరుగు – పావు కప్పుతరిగిన పచ్చి మిర్చి – రెండు క్యారట్ తరుగు – ఒక టేబుల్ స్పూను, కరివేపాకు – 2 రెమ్మలుఅల్లం తురుము – ఒక టీ స్పూనుఆవాలు – ఒక టీ స్పూను, పచ్చి సెనగ పప్పు – ఒక టీ స్పూనుమినప్పప్పు – ఒక టీ స్పూనుటొమాటో తరుగు – పావు కప్పు, పసుపు – పావు టీ స్పూనుమిరప కారం – పావు టీ స్పూను, కొత్తిమీర – ఒక టేబుల్ స్పూను, నీళ్లు, ఉప్పు – తగినంత, ఉడికించిన బఠాణీ – ఒక కప్పు తయారీ: సామలకు తగినన్ని నీళ్లు జత చేసి శుభ్రంగా కడిగి సుమారు రెండు గంటలపాటు నానబెట్టాలి. స్టౌ మీద కుకర్ ఉంచి వేడయ్యాక కొద్దిగా నెయ్యి/నూనె వేసి కాగాక ఆవాలు, పచ్చి సెనగ పప్పు, మినప్పప్పు, ఉల్లి తరుగు, అల్లం తురుము, పచ్చి మిర్చి తరుగు, ఉడికించిన బఠాణీలు, క్యారట్ తరుగు, కరివేపాకు వేసి దోరగా వేయించాలి. టొమాటో తరుగు, పసుపు, మిరప కారం వేసి మరోమారు కలపాలి. తగినన్ని నీళ్లు, ఉప్పు వేసి మరిగించాలి. సామలలో నీళ్లు ఒంపేయాలి. మరుగుతున్న నీటిలో సామలు వేసి కలియబెట్టి మూత పెట్టేయాలి. మూడు విజిల్స్ వచ్చాక దింపేయాలి. కొత్తిమీరతో అలంకరించి, కొబ్బరి చట్నీతో గాని, కొత్తిమీర చట్నీతో గాని వడ్డించాలి. 100 గ్రాముల ధాన్యాల్లో పోషకాలు, పీచు పదార్థం ఎంత? సామలు (Littile Millet) నియాసిన్ (Niacin)mg (B3) 1.5 రిబోఫ్లావిన్ (Rivoflavin)mg (B2) 0.07 థయామిన్ (Thiamine) mg (B1) 0.30 కెరోటిన్(Carotene)ug 0 ఐరన్ (Iron)mg 2.8 కాల్షియం (Calcium)g 0.02 ఫాస్పరస్ (Phosphorous)g 0.28 ప్రొటీన్ (Protein)g 7.7 ఖనిజాలు (Minerals) g 1.5 పిండిపదార్థం (Carbo Hydrate) g 65.5 పీచు పదార్థం (Fiber) g 9.8 పిండిపదార్థము/పీచు నిష్పత్తి (Carbo Hydrate/Fiber Ratio) 6.68 సామలు పుట్ట గొడుగుల బిర్యానీ కావలసినవి: సామలు – ఒక కప్పు, నెయ్యి – 2 టీ స్పూన్లు తరిగిన పుట్ట గొడుగులు – 100 గ్రా., ఉల్లి తరుగు – పావు కప్పుటొమాటో తరుగు – పావు కప్పు, అల్లం వెల్లుల్లి ముద్ద – ఒక టీ స్పూను పసుపు – అర టీ స్పూను, మిరప కారం – ఒక టీ స్పూనుగరం మసాలా – ఒక టీ స్పూను, ఉప్పు – తగినంతనీళ్లు – 2 కప్పులు (చిరు ధాన్యాలకి) + పావు కప్పు (పుట్టగొడుగుల మసాలాకి)కొత్తిమీర – ఒక కప్పు, పుదీనా – అర కప్పుతరిగిన పచ్చి మిర్చి – 1, ఏలకులు – 1, లవంగాలు – 4, బిర్యానీ ఆకు – 1దాల్చిన చెక్క – చిన్న ముక్క, జాపత్రి – చిన్న ముక్క సోంపు గింజలు – ఒక టీ స్పూనుజీలకర్ర – ఒక టీ స్పూను కరివేపాకు – 2 రెమ్మలు తయారీ: స్టౌ మీద బాణలి ఉంచి వేడయ్యాక సామలను వేసి దోరగా వేయించి తీసి పక్కన ఉంచాలి. స్టౌ మీద కుకర్ ఉంచి వేడయ్యాక, నెయ్యి వేసి కరిగించాలి. బిర్యానీ ఆకు వేసి వేయించాక, లవంగాలు, దాల్చిన చెక్క, ఏలకులు, జాపత్రి ముక్క, సోంపు గింజలు, జీలకర్ర వేసి దోరగా వేయించాలి. ఉల్లి తరుగు జత చేసి గోధుమరంగులోకి వచ్చేవరకు వేయించాక, టొమాటో తరుగు, అల్లం వెల్లుల్లి ముద్ద, గరం మసాలా, ఉప్పు, కారం, పసుపు, కరివేపాకు, పచ్చి మిర్చి తరుగు వేసి వేగనివ్వాలి. బాగా వేగిన తరవాత తరిగి ఉంచుకున్న పుట్టగొడుగులు, కొద్దిగా నీళ్లు పోసి ఉడికించాలి. సామలు జతచేయాలి. కొద్దిగా నీళ్లు, కొంచెం కరివేపాకు, పుదీనా ఆకులు వేసి మూత పెట్టి, రెండు విజిల్స్ వచ్చాక దింపేసి, మూత తీశాక కొత్తిమీరతో అలంకరించాలి. రైతాతో వడ్డించాలి. సామల దద్ధ్యోదనం కావలసినవి: సామలు – అర కప్పు, నీళ్లు – 2 కప్పులు పెరుగు – ముప్పావు కప్పు, కొబ్బరి పాలు – పావు కప్పు క్యారట్ – 3 టీ స్పూన్లు, కొత్తిమీర తరుగు – 2 టీ స్పూన్లు, ఉప్పు – తగినంత నెయ్యి/నూనె – ఒక టీ స్పూను, ఆవాలు – అర టీ స్పూను మినప్పప్పు – అర టీ స్పూను, కరివేపాకు – 2 రెమ్మలు తరిగిన పచ్చి మిర్చి – 2, అల్లం తురుము – ఒక టీ స్పూను తయారీ: ముందుగా సామలను శుభ్రంగా కడిగి, తగినన్ని నీళ్లు జత చేసి సుమారు రెండు గంటలపాటు నానబెట్టాలి. నీళ్లు ఒంపేసి తగినన్ని నీళ్లు జత చేసి స్టౌ మీద ఉంచి మెత్తగా ఉడికించాలి. ఉడికిన సామల అన్నాన్ని ఒక గిన్నెలోకి తీసుకుని, గరిటెతో మెత్తగా అయ్యేలా మెదపాలి. పెరుగు, కొబ్బరి పాలు జత చేసి కలియబెట్టాలి. స్టౌ మీద బాణలి ఉంచి వేడయ్యాక నూనె/నెయ్యి వేసి కాగనివ్వాలి. ఆవాలు, మినప్పప్పు, కరివేపాకు, పచ్చి మిర్చి తరుగు, అల్లం తురుము వేసి బంగారు రంగులోకి మారేవరకు వేయించాలి. క్యారట్ తురుము జత చేసి మరోమారు వేయించి, సామల అన్నంలో వేసి కలియబెట్టాలి. ఉప్పు జత చేసి బాగా కలియబెట్టాలి. కొత్తిమీరతో అలంకరించి, అల్లం చట్నీతో అందించాలి. సామల ఖీర్ కావలసినవి: సామలు – ఒక కప్పు, నెయ్యి – ఒక టేబుల్ స్పూను, జీడి పప్పు పలుకులు – 10 కిసిమిస్ – ఒక టేబుల్ స్పూను, బెల్లం పొడి – ఒక కప్పు కొబ్బరి పాలు – ఒక కప్పు, ఏలకుల పొడి – అర టీ స్పూను తయారీ: సామలను శుభ్రంగా కడిగి తగినన్ని నీళ్లు జత చేసి సుమారు రెండు గంటలు నానబెట్టాలి. స్టౌ మీద బాణలి వేడయ్యాక నెయ్యి వేసి కరిగాక జీడి పప్పు పలుకులు, కిస్మిస్ వేసి వేయించి పక్కన ఉంచాలి. సామలలోని నీళ్లు ఒంపేసి, తగినన్ని మంచినీళ్లు జత చేసి, స్టౌ మీద ఉంచి మెత్తగా అయ్యేవరకు ఉడికించాలి. కొబ్బరి పాలు జతచేయాలి. బెల్లం పొడి వేసి బాగా కలియబెట్టి, కొద్దిసేపు ఉడికించాలి. ఏలకుల పొడి, వేయించి ఉంచుకున్న జీడిపప్పులు, కిస్మిస్ జత చేసి కలిపి దింపేయాలి. వేడివేడిగా తింటే రుచిగా ఉంటుంది. -
షా.. కల్యాణి బిర్యానీ పంపించమని చెబుతాలే: ఒవైసీ
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ ఆపద్ధర్మ సీఎం కేసీఆర్ ముస్లింలకు బిర్యాని పంపిస్తున్నారని బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ఘాటుగా స్పందించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం కూకట్పల్లి రోడ్‌షో పాల్గొన్న ఒవైసీ మాట్లాడుతూ.. అమిత్ షా బిర్యానీ ఇష్టపడతారని తనకు తెలియదని, తెలిస్తే అప్పుడే కళ్యాణి బిర్యానీ పంపించమని కేసీఆర్‌కు చెప్పేవాడినన్నారు. ఆయనకు పెట్టకుండా కేసీఆర్ తమకు బిర్యానీ పెడుతున్నానరని అమిత్ షా కుళ్లుకుంటున్నారని, ఈ సారి ఖచ్చితంగా ఆయనకు కల్యాణీ బిర్యాని పార్సిల్ పంపిస్తామన్నారు. ఇతరులు బిర్యానీ తింటుంటే ఎందుకంత కడపు మంటా? అని అమిత్ షాను ఉద్దేశించి ప్రశ్నించారు. కావాలనుకుంటే వారు కూడా తినవచ్చని సలహా ఇచ్చారు. పాకిస్తాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ కూతరు పెళ్లికి ప్రధాని నరేంద్ర మోదీ ఆహ్వానం లేకుండా వెళ్లలేదా? అని, అప్పుడు తెలియదా అతనేం పెట్టారో అని నిలదీశారు. ఇక తెలంగాణ ఎన్నికల్లో టీఆర్ఎస్, మజ్లిస్ పార్టీల మధ్య కుదిరిన అవగాహన మేరకే ఒకరికొకరు సహకరించుకుంటున్నామన్నారు. ముస్లింలు అధికంగా ఉండే ప్రాంతాల్లో ఎంఐఎం నేతలు టీఆర్ఎస్కు ఓటు వేయాలంటూ ప్రచారం సాగిస్తున్నారు. కేసీఆర్ కూడా ఇప్పటికే ఎంఐఎం తమ మిత్రపక్షమని ప్రకటించిన విషయం తెలిసిందే. -
పొట్ట తీసేసేముందు ఒక్కసారి బిర్యానీ తింటా!!
గులామ్ అబ్బాస్.. దుబాయ్ ఓ ఇంజనీర్. ఈ వ్యక్తికి అకస్మాత్తుగా వాంతులు, భారీగా బరువు తగ్గిపోవడం జరిగింది. అసలేమైందో తెలియదు. కానీ అకస్మాత్తుగా తన శరీరంలో సంభవించిన ఈ మార్పులతో అబ్బాస్ ఒక్కసారిగా షాకైపోయాడు. వెంటనే డాక్టర్లను ఆశ్రయించాడు. డాక్టర్లు చెప్పిన విషయం తెలిసి కన్నీరుమున్నీరయ్యాడు. మూడు స్టేజ్ క్యాన్సర్ తన కడుపునంతా పాకేసిందని, ఇక బతకడం కష్టమని చెప్పారు. బతకాలంటే, తప్పనిసరి పరిస్థితుల్లో పొట్టను తీసేయాల్సిందేనని డాక్టర్లు సూచించారు. పొట్ట లేకుండా మనుగడ సాధించడం లేదా చనిపోవడం ఈ రెండే మార్గాలని డాక్టర్లు చెప్పారు. అయితే తన పిల్లలు తాను లేకుండా బతకాలని కోరుకోవడం లేదని, వారి లక్ష్యాలను తాను కళ్లారా చూడాలని కోరిక ఉందని, ఎలాగైనా తను బతకాలని అబ్బాస్ డాక్టర్లకు చెప్పాడు. అబ్బాస్ కోరిక మేరకు క్యాన్సర్ ప్రభావితమైన పొట్టను తొలగించడానికే డాక్టర్లు మొగ్గుచూపారు. అయితే సర్జరీ చేసే ముందు తన చిన్న కోరిక తీర్చాలని డాక్టర్లను వేడుకున్నాడు. అదేమిటంటే.. ఇక జన్మలో తనకు ఇష్టమైన తన భార్య చేసిన బిర్యానీ తినడం కుదరదు కాబట్టి, సర్జరీ చేసి పొట్టను తొలగించే ముందే ఒక్కసారి బిర్యానీ తినాలని కోరుకుంటున్నట్టు చెప్పాడు. అబ్బాస్ కోరికను డాక్టర్లు కూడా నెరవేర్చారు. కడుపు క్యాన్సర్ ప్రపంచవ్యాప్తంగా సంభవిస్తున్న క్యాన్సర్ సంబంధిత మరణాల్లో ఒకటిగా ఉంది. ఇలాంటి కేసులు ఈమధ్యన నమోదవుతూనే ఉన్నాయి. యువతకు ఈ క్యాన్సర్ ఎక్కువగా విస్తరిస్తుందని డాక్టర్లు చెప్పారు. అయితే ప్రస్తుతం ప్రతి ఒక్కరినీ కదిలిస్తున ఒకే ఒక్క ప్రశ్న.... పొట్ట లేకుండా అబ్బాస్ ఎలా బతకగలడు అని. అయితే పొట్ట లేకుండా బతకడమంటే.. అసలు తినకపోవడం కాదని, స్పైసీగా లేని, తక్కువ మొత్తంలో ఆహారం అబ్బాస్ తీసుకోగలగడని డాక్టర్లు చెబుతున్నారు. పొట్ట లేకుండా ఉన్న వారు తీసుకునే ఆహారాన్ని అన్నవాహిక నుంచి నేరుగా చిన్న ప్రేగులకు తరలించవచ్చని కన్సల్టెంట్ లాపరోస్కోపిక్ సర్జన్ డాక్టర్ అల్ మర్జూకీ తెలిపారు. తాము పెద్ద ప్రేగు క్యాన్సర్ సర్జరీలు చాలా చేశామని, కానీ పొట్టమొత్తం తీసేసే సర్జరీని చేయడం ఇదే తొలిసారని డాక్టర్ తెలిపారు. -
‘ప్యారడైజ్’ పేరు వాడుకోవడం అక్రమం
కలెక్టరేట్: హైదరాబాద్ బిర్యానీకి ప్రపంచ వ్యాప్తంగా పేరుంది. అందులోనూ నగరంలోని ప్యారడైజ్ బిర్యానీ అంటే మరింత క్రేజ్.. ఎన్నో దేశాల అతిథులు ప్యారడైజ్ బిర్యానీని ప్రశంసించారు. అంతటి పేరు ప్రఖ్యాతలుగాంచిన ‘ప్యారడైజ్’ పేరును కొన్ని ఫుడ్ కోర్టులు, బిర్యానీ సెంటర్లు అక్రమంగా వాడుకుంటున్నాయి. తమ సంస్థ పేరు వాడుకోవడంతో పాటు తమ సంస్థకు ఉన్న గుర్తింపును దెబ్బతీసేలా ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ తమ సంస్థను ప్రశ్నార్థకంగా మారుస్తున్నాయని ప్యారడైజ్ సంస్థ గతంలో సిటీ సివిల్ కోర్టును ఆశ్రయించింది. ప్యారడైజ్ సంస్థ ప్రతిపాదనలు, అభ్యర్థనలను పరిశీలించిన న్యాయస్థానం ప్యారడైజ్ పేరును వాడుకోవడం అక్రమమని తీర్పు చెప్పడమే కాకుండా ప్యారడైజ్ పేరుతో ఏర్పాటు చేసిన ఫుడ్‌కోర్టులు, హోటళ్ల బో ర్డులను తక్షణమే తొలగించాలని గురువారం సం బంధిత అధికారులను ఆదేశించింది. కోర్టు తీర్పుతో స్పందించిన అధికారులు ప్యారడైజ్ పే రుతో ఉన్న అక్రమ బోర్డులను శుక్రవారం తొల గించారు. సంస్థ పేరుతో ఉపయోగించిన ప్యా కింగ్ పరికరాలు, బాక్సులు, లేబుల్స్‌లను సీజ్ చేశారు.