
స్నేహ (ఫైల్)
మల్లాపూర్: అనుమానాస్పదంగా ఓ బాలిక ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన నాచారం పోలీస్‌స్టేషన్ పరిధిలో ఆదివారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. మల్లాపూర్ డివిజన్ దుర్గానగర్‌కు చెందిన ప్రశాంతి, రవి దంపతులకు ఓ కుమారుడు, కుమార్తె స్నేహ (11) ఉన్నారు. శనివారం తల్లిండ్రులు పనికి వెళ్లడంతో స్నేహా అన్నతో పాటు ఇంట్లోనే ఉంది.
బక్రీద్ సందర్భంగా పక్కింటివారు బిర్యానీ ఇవ్వడంతో బిర్యానీ తినే సమయంలో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఆ తర్వాత కొద్ది సేపటికి సోదరుడు ఆడుకునేందుకు బయటికి వెళ్లగా ఇంట్లో ఎవరూ లేని సమయంలో స్నేహ టవల్‌తో డోర్ హ్యాండిల్‌కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. కుటుంబసభ్యులు ఆమెను నాచారం ఈఎస్‌ఐ ఆస్పత్రికి తరలించగా పరీక్షించిన వైద్యులు అప్పటికికే మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతురాలి తల్లి ప్రశాంతి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకోని దర్యాప్తు చేస్తున్నారు.