Minor Girl
-
అప్పు తీర్చలేదని.. రాక్షస వివాహం!
యశవంతపుర: ఓ మహిళ అప్పు తీర్చలేదని ఆమె కూతురిని బలవంతంగా ఎత్తుకెళ్లారు. ఆమెను తన కొడుక్కి పెళ్లి చేశాడో వడ్డీ వ్యాపారి. బెళగావి నగరంలోని తళకవాడి పోలీసుస్టేషన్ పరిధిలో ఈ రాక్షస వివాహ ఘటన జరిగింది. వివరాలు.. ఒక మహిళ రూ.50 వేలును అప్పుగా తీసుకొంది. ఆమె సరిగ్గా వడ్డీని చెల్లించలేదు. దీంతో బంగారు ముక్కెరను లాక్కున్నాడు. ఆమె కూతురిని అపహరించి తన కుమారునికి వివాహం చేశాడు. అతడు బాలికపై బలవంతంగా లైంగికక్రియకు పాల్పడ్డాడు. న్యాయం చేయాలంటూ బాలిక శుక్రవారం బెళగావి తళకవాడి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీస్ కమిషనర్ యడా మార్టిన్ ఆదేశాలతో భర్త, అతని తల్లిదండ్రులు సహా మరికొందరిపై కేసు నమోదుచేసి బాలికను రక్షించారు. ఇప్పటివరకు ఇద్దరిని అరెస్టు చేశారు. బాలిక చదువుకునేలా సాయం చేస్తామని కమిషనర్ తెలిపారు. -
వాడో వికృత జీవి, చచ్చేదాకా జైల్లోనే!
అమాయకులైన మైనర్బాలికలను మభ్యపెట్టి అత్యంత అమానుషంగా అత్యాచారాలకు పాల్పడుతున్న వైనానికి అద్దం పట్టిన ఘటన ఇది. అంతేకాదు సోషల్ మీడియాలో పరిచయమైన వ్యక్తులను నమ్మడం, ప్రయాణాల్లో అపరిచితుల మాటలకు మోసపోవడం వల్ల జరిగే అనర్థాలకు నిదర్శనం కూడా. అసలు స్టోరీ ఏంటంటే..! వివరాలు ఇలా ఉన్నాయిఅది 2021, అక్టోబరు 18.. ఒక టీనేజ్ బాలికను మాయ చేసి, నీచాతి నీచంగా అత్యాచారానికి పాల్పడిన ఘటనకు మౌన సాక్ష్యంగా నిలిచిన రాత్రి అది. ఈ కేసులో నేరస్తుడు పేరు 35 ఏళ్ల మహమ్మద్ సాదిక్ ఖత్రీ. ఏడు నెలలకు తనతో షేర్ చాట్‌లో మాట్లాడుతున్న స్నేహితుడిని కలవడానికి ముంబై బయలుదేరింది 16 ఏళ్ల బాధిత బాలిక. వల్సాద్‌లోని పార్డి తాలూకాలో నివసిస్తుంది . మహారాష్ట్రలోని భివాండికి చెందిన అబ్బాయితో షేర్‌చాట్‌లో పరిచయమైంది. ఇద్దరూ ఏడు నెలల పాటు మాట్లాడుకున్నారు. తనను కలవాలని పట్టుబట్టడంతో ముంబైకి బయలుదేరింది. ఇక్కడే అమాయకంగా, బెరుకు బెరుకుగా కనిపించిన ఆ ‘లేడిపిల్ల’ పై కన్నేశాడు సాదిక్. ఆమెతో మాట కలిపి మాయ చేశాడు. బాలికను నమ్మించాడు.వసాయ్ రైలు స్టేషన్లో ఆగినప్పుడు, అతను ఆమెను బలవంతంగా రైలు నుండి దింపేశాడు. ముంబైకి తాను దగ్గరుండి తీసుకెడతానంటూ హామీ ఇచ్చాడు. వెనుకా ముందూ ఆలోంచకుండా అతగాడిని నమ్మడమే ఆమె జీవితంలో తీరని బాధను మిగిల్చింది. ఖత్రీ బాలికను ఏకాంత ప్రదేశానికి తీసుకెళ్లాడు. సెక్స్ ఉద్దీపన మాత్రలు వేసుకొని మరీ అమ్మాయిపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఐదు గంటల్లో మూడుసార్లు అత్యాచారం చేశాడు. ఆ తరువాత బాలికను అక్కడే వదిలేసి పారి పోయాడు. చివరకు ఆమె తన బంధువుకు సమాచారం ఇవ్వడంతో విషయం పోలీసులదాకా వెళ్లింది. ఫిర్యాదు అందిన వెంటనే నవ్సారి రూరల్ పోలీసులు అక్టోబర్ 24న ఖత్ర్ అరెస్టు చేశారు. ఆ సమయంలో అతని దగ్గర సిల్డెనాఫిల్ డ్రగ్స్ దొరికాయి. అతని దుస్తులపై రక్తపు మరకలను పోలీసులు గుర్తించారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా ఘటనా స్థలంలో పోలీసులు ఫోరెన్సిక్ బృందం బాలిక జుట్టుతో పాటు ,హెయిర్‌పిన్ తదితర కీలక సాక్ష్యాలను కూడా సేకరించింది. దీంతో ప్రాసిక్యూషన్ సాదిక్‌ను నేరస్తుడిగా తేల్చింది. తన కామాన్ని నెరవేర్చుకోవడానికి ఈ కేసు నిస్సహాయులను లేదా మైనర్లను వేటాడే వికృత మనస్తత్వాన్ని ప్రదర్శించిన వైనమని విచారణ సందర్భంగా కోర్టు వ్యాఖ్యానించింది. సాదిక్‌కు చివరి శ్వాసదాకా జీవిత ఖైదు విధిస్తూ తీర్పు చెప్పింది. ఇలాంటి కేసుల (మైనర్ బాలికపై అత్యాచారం కేసు) విచారణ సందర్భంగా న్యాయస్థానం శిక్షాస్మృతిలో మెతక వైఖరిని అవలంబించకూడదని కోర్టు పేర్కొంది. అంతేకాదు బాధితురాలు తరచూ తల్లిదండ్రులకు, పోలీసులకు, న్యాయవాదులకు, కోర్టుకు తాను పడిన శారీరక బాధను, కష్టాన్ని అనేకసార్లు వివరించవలసి వస్తుంది, ఇది ఆమెకు తీవ్ర మనోవేదనకు గురిచేస్తుందని కూడా, సున్నితంగా వ్యవహరించాలని కూడా కోర్టు సూచించింది. సమాజంలో మైనర్లపై లైంగిక వేధింపుల కేసులు పెరుగు తున్నప్పుడు, బాధితుల బాధను, ఆవేదనను అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందని తెలిపింది. -
మైనర్ బాలికపై దారుణం..
-
ప్రేమికుడే కాలయముడు!
మియాపూర్: మైనర్ అమ్మాయిని ఇన్‌స్ట్రాగాంలో పరిచయం చేసుకుని హత్యచేసి మృతదేహాన్ని నిర్మానుష్య ప్రాంతంలో పడేసిన సంఘటన మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఈ ఘటనలో ముగ్గురు నిందితులిని మియాపూర్ పోలీసులు అరెస్ట్ చేశారు. మియాపూర్ పోలీస్ స్టేషన్లో ఇన్స్పెక్టర్ క్రాంతి కుమార్ సోమవారం కేసు వివరాలను తెలిపారు. అశోక్ కుటుంబం మియాపూర్‌లోని టేకు నర్సింహనగర్లో నివాసముంటోంది. చిన్న కుమార్తె(17) గత నెల 20వ తేదీ నుంచి కనిపించడం లేదని బాలిక తల్లి మియాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఉప్పుగూడకు చెందిన విఘ్నేష్ అలియాస్ చింటు(22)పై అనుమానం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ఉప్పుగూడకు చెందిన విఘ్నేష్‌ను మియాపూర్ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా బాలికను నగరంలోని ఫలక్‌నుమా దేవాలయంలో పరిచయం చేసుకుని ఇన్‌స్టాలో చాటింగ్ చేసుకునేవారని చెప్పాడు. ఈ క్రమంలో వారు ప్రేమించుకున్నారు. దీంతో అమ్మాయి గత నెల ఇంటినుంచి వెళ్లిపోయింది. విఘ్నేష్ ఆ బాలికను మీర్పేట్లోని స్నేహితులు సాకేత్, కళ్యాణిల గదిలో ఉంచాడు. అమ్మాయి తరచూ పెళ్లిచేసుకోమని ఒత్తిడి చేయడంతో ఈ నెల 8న పెళ్లిచేసుకున్నట్లు దండలు మార్చుకుని ఫోటోలుదిగి అమ్మాయి తల్లిదండ్రులకు పంపించాడు. అనంతరం బాలికను హత్యచేయాలనే పథకం పన్నాడు. 8న విఘ్నేష్.. అమ్మాయి గొంతు నులిమి మొఖంపై దిండుపెట్టి ఊపిరాడకుండా చేసి హత్యచేశాడు. అదేరోజు అర్ధరాత్రి సాకేత్, కళ్యాణిలతో కలిసి మృతదేహాన్ని తరలించేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. సాకేత్.. బాలిక మృతదేహాన్ని ద్విచక్రవాహనంపై తీసుకువెళ్లి ఉప్పుగూడ దగ్గరలోని పారిశ్రామిక వాడలోని నిర్మానుష్య ప్రాంతంలో పడేసి చెత్తాచెదారం కప్పి అక్కడి నుండి వెళ్లిపోయాడు. విఘ్నేష్ తనకేమి తెలియనట్లు అమ్మాయి తల్లిదండ్రులకు కాల్ చేసి అమ్మాయి మీ దగ్గరకు వస్తుందని చెప్పి ఇక్కడి నుండి వెళ్లిందని, వచి్చందా అని అడిగాడు. అనుమానించిన తల్లిదండ్రులు మియాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో విఘ్నేష్‌ను విచారించగా నేరం చేసినట్లు ఒప్పుకున్నాడు. పారిశ్రామిక వాడకు వెళ్లి చూడగా మృతదేహం కుళ్లిపోయి గుర్తుపట్టలేని స్థితిలో మృతదేహం లభ్యమైంది. మృతదేహాన్ని స్వాదీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. పెళ్లిచేసుకోవాలని తరచూ ఒత్తిడి చేయడంతోనే హత్యచేసినట్లు తెలిపారు. హత్యచేసిన విఘ్నేష్, అతనికి సహకరించిన సాకేత్, కళ్యాణిలను మియాపూర్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు. -
మరో బాలికపై అఘాయిత్యం!
సాక్షి టాస్క్‌ఫోర్స్, తిరుపతి: తిరుపతి జిల్లాలో మూడున్నరేళ్ల బాలికపై హత్యాచార ఘటనను మరువకముందే.. సోమవారం మరో బాలికపై దారుణం చోటుచేసుకుంది. గాయాల పాలై ముళ్లపొదల్లో అపస్మారక స్థితిలో మూలుగుతున్న బాలికను గుర్తించిన తండ్రి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. బాలిక తండ్రి కథనం ప్రకారం.. తిరుపతి జిల్లా యర్రావారిపాలెం మండలం యల్లమంద దళితవాడకు చెందిన 14 ఏళ్ల బాలిక సమీపంలోని జెడ్పీ హైస్కూల్లో పదో తరగతి చదువుతోంది. ఎప్పటిలా సోమవారం పాఠశాలకు వెళ్లింది. సాయంత్రం అవుతున్నా.. ఇంటికి రాకపోవటంతో బాలిక తండ్రి కంగారుపడి పాఠశాలకు వెళ్లాడు. బాలిక పాఠశాలలో లేకపోవటంతో వెతకటం ప్రారంభించాడు. గ్రామానికి సమీపంలోని ముళ్లపొదల్లోంచి మూలుగు వినిపించడంతో లోనికి వెళ్లి చూశాడు. బాలిక తీవ్రగాయాలతో అపస్మారక స్థితిలో ఉండటాన్ని చూసి చలించిపోయాడు. అక్కడే సపర్యలు చేసి ఏం జరిగిందని బాలికను ఆరా తీశాడు.పొట్టపై తన్ని.. చాకుతో దాడిపాఠశాల ముగిసిన తరువాత బాలిక నడచుకుంటూ ఇంటికి బయలుదేరింది. వెనుకవైపు నుంచి పల్సర్ బైక్‌పై మాస్క్‌లు ధరించి వచ్చిన ఇద్దరు దుండగులు బాలికను అడ్డగించారు. వెంటతెచ్చుకున్న మత్తు మాత్రలను నీళ్లలో కలిపి తాగమని బాలికను బలవంతం చేశారు. అందుకు నిరాకరించడంతో ఇద్దరు దుండగులు కాలితో ఆమె పొట్టపై తన్నారు. ఆపై చాకుతో దాడిచేసి బలవంతంగా మత్తు మందు కలిపిన నీటిని తాగించారు. అనంతరం ఎవరికో వీడియో కాల్చేసి.. ఈ అమ్మాయేనా? కాదా? అని అడిగి తెలుసుకున్నారు. తరువాత ముళ్లపొదల్లోకి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడినట్టు చెబుతున్నారు. మత్తు మందు తాగించాక గంటకుపైగా బాలిక స్పృహలో లేదు. స్థానికుల సహాయంతో బాలికను ఆమె తండ్రి యల్లమంద పీహెచ్‌సీకి తీసుకెళ్లారు. ప్రాథమిక చికిత్స అనంతరం బాలికను పోలీసులు జీపులో పీలేరు ప్రభుత్వాస్పపత్రికి తరలించారు. తండ్రిని సర్పంచ్ ఓబులేసు, వైఎస్సార్సీపీ నాయకుడు నాగార్జునరెడ్డి కారులో తీసుకుని పోలీసు వాహనాన్ని వెంబడించారు.కేసులో అనేక సందిగ్ధాలు: ఎస్పీ కార్యాలయంయర్రావారిపాలెం మండలం యల్లమంద గ్రామంలో బాలికపై అత్యాచారం జరిగినట్టు ప్రచారం ప్రచారం చేస్తున్నారని.. దీనిపై యర్రావారిపాలెం పోలీసులు అన్ని కోణాల్లో విచారణ చేస్తున్నారని తిరుపతి జిల్లా ఎస్పీ కార్యాలయం సోమవారం రాత్రి ఒక ప్రకటనలో పేర్కొంది. విచారణలో అనేక సందిగ్ధాలు వ్యక్తం అవుతున్నాయని తెలిపింది. అయితే, విచారణ పూర్తికాకముందే కొంతమంది సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలకు పాల్పడుతున్నారని, వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. విచారణ అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని, కేసు నమోదు చేసి నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆ ప్రకటనలో పేర్కొంది.ఆ దుండగుల్ని ఉరి తీయాలిబాలికపై చాకుతో దాడిచేసి.. మత్తు మందు కలిపిన నీళ్లు తాగించి దారుణానికి ఒడిగట్టిన ఇద్దరు నిందితులను గుర్తించి అరెస్ట్ చేయాలని బాలిక తండ్రి కోరారు. నిందితులిద్దరినీ పట్టుకుని ఉరి తీయాలని డిమాండ్ చేశారు. అలా చేస్తేనే తమకు న్యాయం జరుగుతుందని చెప్పారు.దోషులను శిక్షించే వరకు వదలం: చెవిరెడ్డిమైనర్ బాలికపై దారుణం జరిగిందన్న సమాచారం అందుకున్న చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి హుటాహుటిన యల్లమంద దళితవాడకు చేరుకున్నారు. అనంతరం బాలిక చికిత్స పొందుతున్న ప్రభుత్వ ఆస్పత్రికి చేరుకుని బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. ఘటనకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. బాలికకు మెరుగైన చికిత్స అందించాలని అధికారులను కోరారు. దారుణ ఘటనకు కారుకులైన వారిని వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. దోషులను శిక్షించే వరకు వదిలేది లేదని స్పష్టం చేశారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. -
రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ నిర్వీర్యమైంది: ఆర్కేరోజా
సాక్షి,తిరుపతిజిల్లా: రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేదని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలు,చిన్నారులపై దారుణాలు ఎక్కువగా జరుగుతున్నాయని మాజీ మంత్రి ఆర్కే రోజా విమర్శించారు. ఎంఆర్పురంలో హత్యాచారానికి గురైన చిన్నారి కుటుంబాన్ని శనివారం(నవంబర్ 2) పుత్తూరు ప్రభుత్వ ఆసుపత్రి వద్ద తిరుపతి జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు భూమన కరుణాకరరెడ్డితో కలిసి రోజా పరామర్శించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ‘ రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ నిర్వీర్యం అయిపోయింది. నిందితుడు గంజాయి,మద్యం మత్తులో ఈ దారుణానికి ఒడిగట్టాడు. రాష్ట్రంలో గంజాయి మత్తులో పెట్రేగి పోతున్నారు. బాధిత కుటుంబానికి వెంటనే రూ.20 లక్షలు ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలి. గత ప్రభుత్వం లో తీసుకు వచ్చిన దిశ యాప్‌ను పటిష్టం చేయాలి’అని రోజా డిమాండ్ చేశారు.ఇదీ చదవండి: మూడేళ్ల చిన్నారిపై హత్యాచారం -
AP: మూడేళ్ల చిన్నారిపై హత్యాచారం
సాక్షి,తిరుపతి: తిరుపతి జిల్లాలో మూడేళ్ల చిన్నారి హత్యాచారం ఘటన సంచలనం రేపింది. వడమాలపేట మండలం ఏఎంపురంలో శుక్రవారం(నవంబర్ 1) సాయంత్రం ఈ దారుణం చోటు చేసుకుంది. ఈ ఘటనపై జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు మాట్లాడుతూ ‘ఏఎం పురంలో ఇంటి దగ్గర ఉన్న చిన్నారిని చాక్లెట్లు కొనిస్తాను అని మాయమాటలు చెప్పి సుశాంత్ అనే అబ్బాయి తీసుకుని వెళ్ళాడు. నిందితుడు సుశాంత్ చాలా నమ్మకంగా ఆడించినట్లు నటించి చిన్నారిని తీసుకు వెళ్లి అత్యాచారం చేసి హత్య చేశాడు. చట్ట పరంగా నిందితుడికి కఠినంగా శిక్ష పడేలా చూస్తాం’అని తెలిపారు. కాగా, శుక్రవారం సాయంత్రం తాము ఇంటి నుంచి పనిమీద బయటికి వెళ్లి వచ్చేసరికి పాప కనిపించలేదని తల్లదండ్రులు మమత,మధులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. సుశాంత్ అనే అతను తాము బయటికి వెళ్లేటపుడు పాపతో ఆడుకుంటున్నాడని పోలీసులకు వారు చెప్పారు. దీంతో పోలీసులు సుశాంత్‌ను అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా అసలు విషయం బయటపడింది. పాప మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. పుత్తూరు ఆస్పత్రిలో పాప మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు. ఇదీ చదవండి: బాలికపై గ్యాంగ్‌రేప్ -
బాలికపై గ్యాంగ్‌రేప్: వికారాబాద్ జిల్లా
దోమ: మాయమాటలతో ఓ బాలికను లోబర్చుకున్న ఓ యువకుడు, నలుగురు మైనర్లు ఆమెపై పలుమార్లు లైంగికదాడికి పాల్పడ్డారు. దీంతో ఆమె గర్భం దాల్చింది. ఎస్ఐ ఆనంద్‌కుమార్ తెలిపిన వివరాల ప్రకారం...వికారాబాద్ జిల్లా దోమ మండలంలోని ఓ గ్రామంలో ఎనిమిదో తరగతి చదువుతున్న బాలిక(13)తో అదే ఊరికి చెందిన సంతోష్ సన్నిహితంగా ఉండేవాడు. ఈ చనువును అవకాశంగా తీసుకొని ఆమెపై లైంగికదాడికి పాల్పడ్డాడు.ఈ విషయం సంతోష్ స్నేహితులైన నలుగురు మైనర్లకు తెలియగా, బాలికను బ్లాక్మెయిల్ చేసి అఘాయిత్యానికి పాల్పడ్డారు. విషయం బయటకు చెప్పొద్దని హెచ్చరించడంతో వీరి అఘాయిత్యాలను ఆరు నెలలుగా మౌనంగా ఆ బాలిక భరిస్తోంది. ఈ క్రమంలో గత నెల 28వ తేదీన పాఠశాల నుంచి ఇంటికి వెళుతున్న బాలికను సంతోష్ తన ఇంటికి తీసుకెళ్లాడు. అప్పటికే నలుగురు మిత్రులు అక్కడకు చేరుకున్నారు. అంతా కలిసి బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డారు.సాయంత్రం వరకే స్కూల్ నుంచి రావాల్సిన బాలిక రాత్రి ఆలస్యంగా ఇంటికి రాగా, తల్లి నిలదీయడంతో బోరున విలపించింది. జరిగిన విషయాన్ని తల్లికి వివరించింది. దీంతో వెంటనే పీఎస్‌కు వెళ్లిన బాలిక తల్లి ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఐదుగురిని పరిగిలోని డీఎస్పీ కార్యాలయానికి తరలించగా, నిందితులపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. అనంతరం కోర్టులో హాజరుపర్చారు. బాలికను సఖి సెంటర్‌కు తరలించి, వైద్య పరీక్షలు చేయించారు. ప్రస్తుతం బాలిక రెండు నెలల గర్భిణి అని వైద్యులు నిర్ధారించారు.గంజాయి మత్తు కారణమా?గ్రామాల్లో గంజాయి విచ్చలవిడిగా లభిస్తోందని, ఈ మత్తులోనే వారు ఏం చేస్తున్నారో తెలియని పరిస్థితి నెలకొందని స్థానికులు చెబుతున్నారు. నగరం నుంచి గ్రామాలకు గంజాయి సరఫరా అవుతోందని, దీనికి బానిసలుగా మారిన యువత విచక్షణ కోల్పోయి వ్యవహరిస్తున్నారని ప్రజలు మండిపడుతున్నారు. -
డాక్టర్ లేరు.. వైద్య పరికరాలూ లేవంట!
నరసరావుపేట టౌన్ : పల్నాడు జిల్లాలో ఓ మైనర్ బాలిక కేసులో వైద్యుల నిర్లక్ష్యం, ప్రభుత్వ అసమర్థత వెలుగుచూసింది. కిడ్నాప్‌కు గురైన బాలికకు వైద్య పరీక్షల నిర్వహణలో ఓ ఏరియా ఆస్పత్రి డొల్లతనం బట్టబయలైంది. బాధితురాలిని రాత్రి 11 గంటల ప్రాంతంలో తీసుకొస్తే.. డాక్టర్ 12.30కు తీరిగ్గా వచ్చారు. పైగా.. పరీక్షల నిర్వహణకు అవసరమైన పరికరాలు ఆస్పత్రిలో లేవని.. వాటిని బయట నుంచి తెచ్చుకోమని స్లిప్పై రాసివ్వడంపై వివాదాస్పదమవుతోంది. వివరాలివీ.. నరసరావుపేట పట్టణానికి చెందిన పదహారేళ్ల మైనర్ బాలికను వినుకొండ పట్టణానికి చెందిన వెంకటేష్ ప్రేమ పేరుతో వంచించి గత సోమవారం ఇంటి నుంచి బలవంతంగా తీసుకెళ్లాడు. బాలిక తల్లి ఇచ్చిన ఫిర్యాదుతో వన్‌టౌన్ పోలీసులు మంగళవారం కిడ్నాప్, పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. వినుకొండలో బాలికను గుర్తించిన పోలీసులు ఆమెను నరసరావుపేటకు తీసుకొచ్చారు. రెండ్రోజులపాటు బాలికను నిందితుడు తన వద్దే నిర్బంధించడంతో పోలీసులు వైద్య పరీక్షల నిమిత్తం బాలికను రాత్రి 11గంటలకు ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు.కానీ, ఆ సమయంలో వైద్యపరీక్షలు చేసేందుకు నైట్‌డ్యూటీ డాక్టర్ అందుబాటులో లేరు. రాత్రి 12.30 గంటలకు తీరుబడిగా వచ్చిన డాక్టర్ తమ వద్ద మెడికల్ పరీక్షలకు అవసరమైన వైద్య పరికరాలు, లిక్విడ్స్, గ్లౌజులు అందుబాటులో లేవని చెప్పారు. పరీక్షలు నిర్వహించాలంటే బయట నుంచి వాటిని తెచ్చుకోవాలంటూ బాధితులకు స్లిప్ రాసి ఇచ్చారు.కానీ, అప్పటికే అర్థరాత్రి దాటడంతో మెడికల్ షాపులు మూసేశారు. దీంతో.. బాధితురాలికి సకాలంలో చేయాల్సిన వైద్య పరీక్షలు నిలిచిపోగా.. బుధవారం ఉదయం వైద్య పరికరాలు తీసుకురావడంతో దాదాపు 12 గంటల తర్వాత బాధితురాలికి వైద్య పరీక్షలు నిర్వహించారు. బంధువుల ఆందోళన..ప్రభుత్వాసుపత్రిలో సౌకర్యాలు, వైద్యులు అందుబాటులో లేకపోవడంపై బాధితురాలి బంధువులు ఆందోళనకు దిగారు. పరీక్షల నిర్వహణలో తీవ్ర జాప్యం జరగడంతో సాక్ష్యాలు చెదిరిపోయి కేసు నీరుగారిపోతుందేమోనని వారు ఆవేదన చెందుతున్నారు. పరీక్షలకు అవసరమైన కనీస పరికరాలు జిల్లా కేంద్రమైన నరసరావుపేటలోని ఏరియా ఆసుపత్రిలో లేకపోవటంపట్ల వారు మండిపడ్డారు. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన డ్యూటీ డాక్టర్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. -
తల్లిపై కన్నేసి.. చిన్నారిని చంపి...
సుభాష్‌నగర్: బాలికను కిడ్నాప్ చేసి హత్యకు పాల్పడిన కేసులో నిందితుడి పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ తరలించారు. బుధవారం సూరారం పోలీస్ స్టేషన్లో మేడ్చల్ ఏసీపీ శ్రీనివాస్‌రెడ్డి వివరాలు వెల్లడించారు. అదిలాబాద్ పాటగూడకు చెందిన సుమ భర్త రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో ఇద్దరు కుమార్తెలతో సహా నగరానికి వలస వచ్చి స్థానిక జీవన్ జ్యోతినగర్‌లో నివాసం ఉంటోంది. ఈ క్రమంలో అదే గ్రామానికి చెందిన ప్రభాకర్‌తో గత కొంతకాలంగా సహజీవనం చేస్తుంది. అదే జిల్లాకు చెందిన తిరుపతి కూడా జీవన్ జ్యోతినగర్లోనే ఉంటున్నాడు. ఈ నేపథ్యంలో అతడికి ప్రభాకర్‌తో పరిచయం ఏర్పడింది. దీంతో తరచూ ప్రభాకర్ ఇంటికి వచ్చే తిరుపతి అతడితో కలిసి మద్యం తాగుతూ, పిల్లలతో చనువుగా ఉండేవాడు. ఈ క్రమంలో సుమపై కన్నేసిన తిరుపతి, ఇద్దరు పిల్లలతో పాటు ప్రభాకర్‌ను అంతమందించి ఆమెను లోబర్చుకోవాలని పథకం వేశాడు. ఇందులో భాగంగా ఈ నెల 12న మధ్యాహ్నం సుమ పెద్ద కూతురు జోత్స్నను (7) హత్య చేసేందుకు బయటికి తీసుకెళ్లిన తిరుపతి అవకాశం దొరక్క ఇంటికి తీసుకువచ్చాడు. మళ్లీ సాయంత్రం చిన్నారిని తీసుకెళ్లిన అతను బాసరగడి గ్రామ సమీపంలోని చెట్ల పొదల్లో కత్తితో పొడిచి హత్య చేశాడు. బాలిక మృతదేహాన్ని ప్లాస్టిక్ కవర్లో చుట్టి, గోనె సంచీలో మూట కట్టి తిరిగి ఇంటికి వచ్చాడు. ఏమీ తెలియనట్లు ప్రభాకర్‌తో కలిసి జ్యోత్స్న ఆచూకీ కోసం గాలిస్తున్నట్లు నటించారు. బాధితుల ఫిర్యాదు మేరకు సూరం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నాలుగు బృందాలుగా ఏర్పడి సీసీ కెమెరాలు పరిశీలించగా తిరుపతి సదరు బాలికను తీసుకెళ్లినట్లు నిర్ధారించారు. అతడిని అదుపులోకి తీసుకుని విచారించగా నేరం అంగీకిస్తూ బాలికను హత్య చేసిన ప్రదేశాన్ని చూపించాడు. దీంతో పోలీసులు అతడిని అరెస్టు చేసి బుధవారం రిమాండ్‌కు తరలించారు. నిందితుడిని పట్టుకోవడానికి కృషి చేసిన సిబ్బందికి రివార్డు అందజేసినట్లు ఏసీపీ పేర్కొన్నారు. -
బాలికపై అత్యాచార యత్నం
శ్రీకాళహస్తి : తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి పట్టణంలోని సంత మైదానం వద్ద శనివారం ఐదేళ్ల బాలికపై అత్యాచార యత్నానికి ఒడిగట్టిన గుర్తుతెలియని యువకుడిని స్థానికులు పట్టుకుని దేహశుద్ధి చేశారు. స్థానికుల కథనం మేరకు.. సంతమైదానం సమీప ప్రాంతానికి చెందిన ఐదేళ్ల బాలికను గుర్తుతెలియని యువకుడు స్కూటర్ పై తీసుకొచ్చి నిర్మాణంలో ఉన్న ఇంటి మిద్దెపైకి బలవంతంగా ఎత్తుకెళ్లాడు. అటుగా వెళ్తున్న సుబ్బలక్ష్మి అనే యువతి అతని వాలకంపై అనుమానంతో గమనించింది. ఆపై విషయాన్ని స్థానికులకు చెప్పింది. దీంతో స్థానికులు మిద్దెపైకి వెళ్లి బాలికపై అఘాయిత్యం చేయబోతున్న యువకుడిని పట్టుకుని కరెంట్ స్తంభానికి కట్టేసి చితకబాదారు. అనంతరం ఒకటో పట్టణ పోలీసులకు అప్పగించారు. పోలీసులు యువకుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదుచేశారు. -
దోషులకు ఉరిశిక్ష విధించాలి: సీఎం మమత
కోల్‌కతా: కుల్తాలీ బాలిక హత్యాచారం కేసును పోక్సో చట్టం కింద నమోదు చేయాలని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పోలీసులను ఆదేశించారు. ఆమె ఆదివారం మీడియాతో మాట్లాడారు. ఈ కేసులో దోషులకు మూడు నెలల్లో ఉరిశిక్ష విధించాలని పోలీసులను కోరారు. శనివారం దక్షిణ 24 పరగణాల జిల్లా కుల్తాలీలోని ఓ కాలువలో పదేళ్ల బాలిక శవమై కనిపించిన విషయం తెలిసిందే. ‘నేరానికి రంగు, కులం, మతం లేదు. పోక్సో చట్టం కింద కుల్తాలీ కేసు నమోదు చేసి మూడు నెలల్లోగా దోషులకు ఉరిశిక్ష పడేలా చూడాలని పోలీసులను కోరుతున్నా. ఏదైనా నేరం నేరమే. దానికి మతం లేదా కులం లేదు. నేరస్థులపై కఠిన చర్యలు తీసుకోవాలి. అత్యాచారం కేసుల్లో దర్యాప్తు జరగుతున్న సమయంలో మీడియా విచారణ చేయటం ఆపివేయాలి’ అని అన్నారు.మరోవైపు.. బాలిక హత్యాచారంపై ఆదివారం దక్షిణ 24 పరగణాలలో నిరసనలు చెలరేగాయి. బాధ్యులను కఠినంగా శిక్షించాలని ప్రజలు డిమాండ్ చేశారు. ఈ ఘటనపై బాధితురాలి కుటుంబానికి న్యాయం చేయాలని బీజేపీ నిరసనలకు దిగింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సుకాంత మజుందార్, అగ్నిమిత్ర పాల్ నిరసనల్లో పాల్గొన్నారు.ఈ కేసుకు సంబంధించి ఓ అనుమానితుడిని పశ్చిమ బెంగాల్ పోలీసులు అదుపులోకి తీసుకున్నామని పోలిసులు తెలిపారు. సౌత్ 24 పరగణాల పోలీసు సూపరింటెండెంట్ పలాష్ చంద్ర ధాలీ మీడియాతో మాట్లాడారు. ‘‘బాలిక ట్యూషన్ నుంచి తిరిగి వస్తుండగా సాయంత్రం తప్పిపోయింది. రాత్రి 8 గంటల వరకు ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. శనివారం(నిన్న) విచారణ ప్రారంభించాం. విచారణ తర్వాత ఈ రోజు ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకున్నాం. బాలికను తానే హత్య చేశానని నిందితుడు చెప్పాడు. ప్రభుత్వం ఇటువంటి కేసులపై చాలా సీరియస్‌గా ఉంది. ఈ కేసులో అన్ని కోణాల్లో దర్యాప్తు జరుగుతోంది’’ అని తెలిపారు. అయితే... ఈ కేసులో పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని బాలిక అత్త ఆరోపణలు చేశారు. బాధితురాలి శరీరంపై తీవ్రమైన గాయాలు ఉన్నాయని, అవయవాలు విరిగిపోయాయని అన్నారామె. నిందితులకు శిక్ష విధించాలని ఆమె డిమాండ్ చేశారు.చదవండి: వైద్యురాలి ఉదంతం మరవకముందే.. బెంగాల్లో మరో దారుణం -
వైద్యురాలి ఉదంతం మరవకముందే.. బెంగాల్లో మరో దారుణం
కోల్‌కతా: కోల్‌కతా ఆసుపత్రిలో వైద్యురాలిపై హత్యాచార ఘటనకు మరువకముందే బెంగాల్లో మరో దారుణం వెలుగుచూసింది. వైద్యురాలి ఘటనపై సీఎం మమతా బెనర్జీ. బెంగాల్ ప్రభుత్వంపై ఇప్పటికీ విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో.. కోచింగ్ క్లాస్‌కు వెళ్లిన 11 ఏళ్ల బాలిక అనుమానాస్పద స్థితిలో మృతిచెందడం కలకలం రేపుతోంది.బాలికను కిడ్నాప్ చేసి హత్య చేసి ఉంటారని అనుమానాలు రావడంతో స్థానికుల నుంచి ఆగ్రహ జ్వాలలు వెల్లువెత్తాయి. ఘటనకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టారు. పశ్చిమ బెంగాల్‌లోని 24 పరగణాస్ జిల్లాలో ఈ ఘోరం చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. 11 ఏళ్ల బాలిక కోచింగ్ క్లాస్‌కు హాజరయ్యేందుకు శుక్రవారం ఇంటి నుంచి వెళ్లింది. రాత్రి అయినా తిరిగి రాకపోవడంతో ఆమె కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాలిక కోసం గాలిస్తున్న క్రమంలో శనివారం తెల్లవారుజామున 3.30 గంటల సంమయంలో ఓ పొలంలో ఆమె మృతదేహం లభ్యమైంది. ఒంటినిండా గాయాలు ఉండటంతో కిడ్నాప్ చేసి హత్య చేసి ఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తంచేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించారు. వాటి ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని పోలీసులు పేర్కొన్నారు. అయితే ఈ దారుణానికి ఒడిగట్టినట్లు అనుమానిస్తున్న మోస్తకిన్ సర్దార్ అనే 19 ఏళ్ల యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనతో ఆగ్రహించిన గ్రామస్థులు తీవ్ర నిరసన వ్యక్తంచేశారు. నిందితుడిపైవ వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. కర్రలతో పోలీసుస్టేషన్‌పై దాడి చేసి, అవుట్ పోస్ట్‌కు నిప్పుపెట్టారు. దీంతో పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు భద్రతా బృందాలను మోహరించారు.కాగా బాలికను అత్యాచారం చేసి చంపేసి ఉంటారని బీజేపీ ఆరోపిస్తోంది. ఇన్ని అఘాయిత్యాలు జరుగుతున్నా బెంగాల్ ప్రభుత్వం నిందితులపై కఠిన చర్యలు తీసుకోకపోవడం వల్లే మరో అమాయక బాలిక ప్రాణాలు కోల్పోయిందని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సుకాంత మజుందార్ మండిపడ్డారు. ముఖ్యమంత్రి మమతాబెనర్జీ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. -
బాలికను వేధించాడని.. రైల్వే ఉద్యోగిపై ప్రయాణికుల దాష్టీకం
న్యూఢిల్లీ: రైలులో మైనర్ బాలికను లైంగికంగా వేధించాడనే ఆరోపణలతో బాధితురాలి కుటుంబ సభ్యులు, ఇతర ప్రయాణికులు రైల్వే ఉద్యోగిని కొట్టి చంపారు. ఈ ఘటన హమ్సఫర్ఎక్స్ప్రెస్ రైలులో గురువారం వెలుగుచూసింది. వివరాలు.. బిహార్‌లోని సివాన్కుచెందిన కుటుంబం బుధవారం న్యూఢిల్లీకి వెళ్తున్న హమ్ సఫర్ ఎక్స్‌ప్రెస్ ఎక్కారు. రైలులోని థర్డ్ ఏసీ కోచ్‌లో ప్రయాణిస్తున్నారు.అయితే రాత్రి 11.30 గంటలల సమయంలో సమయంలో అయితే అదే కోచ్‌లో ప్రయాణిస్తున్న గ్రూప్ డీ రైల్వే ఉద్యోగి ప్రశాంత్ కుమార్ .. కుటుంబంలోని 11 ఏళ్ల భాలికను తన సీటు వద్ద కూర్చొబెట్టుకున్నాడు. తర్వాత బాలిక తల్లి వాష్‌రూమ్‌కు వెళ్లగా.. చిన్నారి పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడు. ఆమెపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడుమహిళ వాష్‌రూమ్ నుంచి తిరిగి రాగానే, బాలిక తల్లి వద్దకు పరిగెత్తి, ఆమెను పట్టుకొని ఏడవడం ప్రారంభించింది. తల్లిని వాష్‌రూమ్‌కి తీసుకెళ్లి జరిగిన విషయం చెప్పింది. దీంతో రైల్వే ఉద్యోగి ప్రశాంత్ కుమార్ ప్రవర్తనపై ఆ మహిళ తన భర్త, మామతోపాటు కోచ్‌లోని ఇతర ప్రయాణికులకు చెప్పింది. రైలు లక్నోలోని ఐష్బాగ్ జంక్షన్‌కు చేరుకోవడంతోదీంతో అతడ్ని ఆ కోచ్ డోర్ వద్దకు తీసుకెళ్లారు. కోపోద్రిక్తులైన కుటుంబ సభ్యులు, ఇతర ప్రయాణికులు కదులుతున్న రైలులోనే గంటన్నరపాటు నిందితుడిని కొట్టారు.అనంతరం రైలు ఉదయం 4.35 నిమిషాలకు ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్ సెంట్రల్ చేరుకోగా.. నిందితుడుని రైల్వే పోలీసు అధికారులు అప్పగించారు. బాలికను వేధించినట్లు అతడిపై ఫిర్యాదు చేశారు. తీవ్రంగా గాయపడిని ప్రశాంత్ కుమార్‌ను ఆసుపత్రికి తీసుకెళ్లగా.. అప్పటికే అతను చనిపోయినట్లు వైద్యులు ధృవీకరించారు. మృతుడిది బిహార్‌లోని ముజఫర్‌పూర్ జిల్లాలోని సమస్త్‌పూర్ గ్రామానికి చెందిన వాడిగా గుర్తించారు.అయితే బాలిక కుటుంబం, ఇతర ప్రయాణికులు కుట్రతో ప్రశాంత్ కుమార్‌ను హత్య చేసినట్లు మృతుడి కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో ఇరువర్గాల ఫిర్యాదులపై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
అనకాపల్లిలో మైనర్‌పై అత్యాచారం
అనకాపల్లి: మైనర్ బాలిక(14)పై అత్యాచారం చేసి, గర్భవతిని చేసిన ఇంటర్ విద్యార్థిపై పోక్సో కేసు నమోదు చేసినట్లు రూరల్ ఎస్ఐ తేజేశ్వరరావు బుధవారం తెలిపారు. ఎస్ఐ తెలిపిన వివరాలు. వి.మాడుగుల మండలం కింతలివల్లాపురం గ్రామానికి చెందిన కుటుంబం పనుల నిమిత్తం అనకాపల్లి మండలం ఊడేరు గ్రామానికి వలస వచ్చారు. అదే గ్రామానికి చెందిన 17 ఏళ్ల ఇంటర్ విద్యార్థి బాలికపై అత్యాచారం చేశాడు. ప్రస్తుతం 5వ నెల గర్భవతి. బాలిక తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తేజేశ్వరరావు తెలిపారు. -
US: అమ్మాయి అనుకుని చాటింగ్.. భారత విద్యార్థికి 12 ఏళ్ల జైలు
న్యూయార్క్: ఉన్నత చదువులు చదవడానికి అమెరికా వెళ్లి బుద్ధి వక్రీకరించి 12 ఏళ్ల జైలు శిక్షకు గురయ్యాడు ఓ భారత విద్యార్థి. స్టూడెంట్ వీసా మీద అమెరికా వెళ్లిన ఉపేంద్ర ఆడూరు(32) భారత విద్యార్థి సోషల్ మీడియాలో 13 ఏళ్ల బాలిక అనుకుని ఓ వ్యక్తితో చాటింగ్ మొదలుపెట్టాడు. తన లైంగిక వాంఛ తీర్చుకునేందుకు మభ్యపెట్టే విధంగా సందేశాలు పంపాడు. అంతటితో ఆగకుండా ఆ ఖాతాకు అశ్లీల చిత్రాల మెసేజ్‌లు కూడా పెట్టాడు. ఏకంగా ఓ రోజు టైమ్ ఫిక్స్ చేసుకుని ఆ బాలికను కలవడానికి వెళ్లాడు. ఇక్కడే అతడికి ఎదురైంది పెద్ద ట్విస్టు. ఉపేంద్ర అనుకున్నట్లు ఆ ఖాతా 13 ఏళ్ల బాలికది కాదు.మైనర్ల మీద లైంగికనేరాలకు పాల్పడే వారిని వలపన్ని పట్టుకునేందుకు ఓ ప్రైవేట్ డిటెక్టివ్ క్రియేట్ చేసిన నకిలీ ఖాతా. ఉపేంద్ర బాలికను కలిసేందుకు మీటింగ్ స్పాట్‌కు వెళ్లగానే పోలీసులు పట్టుకున్నారు. అతడి ఫోన్ లాక్కుని అందులోని అశ్లీల వీడియోలు స్వాధీనం చేసుకున్నారు. ఈ వ్యవహారమంతా 2022 సెప్టెంబర్ 20 నుంచి అక్టోబర్ 6 మధ్యలో జరిగింది. ఈ కేసులో ఉపేంద్రకు 12 ఏళ్ల జైలు శిక్షతో పాటు రిలీజ్ అయిన తర్వాత మరో 10 ఏళ్లు పోలీసుల పర్యవేక్షణలో ఉండాలని కోర్టు తీర్పిచ్చింది. -
దళితుడి లాకప్‌డెత్?
సాక్షి, నంద్యాల : రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన ముచ్చుమర్రి మైనర్ బాలిక హత్యాచారం కేసు విచారణలో కీలక పరిణామం చోటుచేసుకుంది. పోలీసుల అదుపులో ఉన్న అనుమానితుల్లో ఒక దళిత వ్యక్తి శనివారం లాకప్‌డెత్‌కు గురైనట్లు తెలుస్తోంది. విచక్షణారహితంగా కొట్టడంతో పాటు థర్డ్ డిగ్రీ ఉపయోగించడంవల్లే అతని ప్రాణాలు పోయినట్లు బంధువులు ఆరోపిస్తున్నారు. అంతకుముందు.. మైనర్ బాలిక హత్యాచారం ఘటనతో సంబంధం ఉన్న అనుమానంతో పోలీసులు కొందరిని అదుపులోకి తీసుకుని విచారించారు. వారిచ్చిన సమాచారంతో గురువారం సాయంత్రం మరో ఆరుగురిని నందికొట్కూరు, ముచ్చుమర్రి ప్రాంతంలో అదుపులోకి తీసుకున్నారు. వీరిని మొదట జూపాడు బంగ్లా పోలీస్‌స్టేషన్‌కు తరలించి అక్కడ రెండు గంటల పాటు విచారించినట్లు స్థానికులు చెబుతున్నారు. పోలీసుల దెబ్బలు తాళలేక నిందితులు అరిచిన అరుపులు తమకు వినిపించాయని వారంటున్నారు.అయితే, ఈ విచారణలో నలుగురు వ్యక్తులకు ఈ ఘటనతో సంబంధంలేదని తేలడంతో వారిని వదిలేసి అంబటి హుస్సేన్ అలియాస్ యోహాన్ (36), అంబటి ప్రభుదాస్‌ను తమదైన శైలిలో గట్టిగా విచారించారు. వీరిద్దరినీ మిడుతూరు పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లి శుక్రవారం అంతా విపరీతంగా కొట్టినట్లు సమాచారం. ఆ తర్వాత నంద్యాల పట్టణంలోని సీసీఎస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు. అయితే, హుస్సేన్ మిడుతూరులో మృతిచెందితే నంద్యాల సీసీఎస్‌కు తరలించి ఆ తర్వాత ఆసుపత్రికి తరలించారా? లేక సీసీఎస్ పోలీస్‌స్టేషన్‌లో మృతిచెందిన తర్వాత ఆసుపత్రికి తీసుకెళ్లారా అన్న దానిపై స్పష్టతలేదు.బంధువులతో రాజీ..ఇక హుస్సేన్ చనిపోయాడన్న సమాచారం తెలుసుకున్న బంధువులు శనివారం ఉదయాన్నే ముచ్చుమర్రి, నందికొట్కూరు నుంచి నంద్యాలకు బయల్దేరారు. మార్గమధ్యంలోనే పోలీసులు వీరిని అడ్డుకుని రహస్య ప్రాంతానికి తరలించారు. అక్కడ లాకప్‌డెత్ విషయంలో రాజీకి ప్రయత్నించినట్లు సమాచారం. వీరితో సంతకం చేయించుకున్న తర్వాత మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించారు. అప్పటివరకు క్యాజువ్యాలిటీలోనే ఉ.6 నుంచి సా.4 వరకు మృతదేహాన్ని ఉంచారు. ఆయాసంతో చనిపోయాడంట..ఇక బాధితులతో రాజీ ప్రయత్నం సఫలం కావడంతో జిల్లా ఎస్పీ కార్యాలయం శనివారం రాత్రి ఒక ప్రకటన విడుదల చేసింది. హుస్సేన్‌ను అదుపులోకి తీసుకుని నందికొట్కూర్ పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్తుండగా నిందితుడు పోలీస్ వాహనం నుంచి దూకి పారిపోయే ప్రయత్నం చేశాడని తెలిపారు. అప్రమత్తమైన పోలీసులు హుస్సేన్‌ను పట్టుకోవడంతో తనకు ఆయాసంగా ఉందని, గుండెనొప్పిగా ఉన్నట్లు పోలీసులకు తెలిపాడని.. దీంతో పోలీసులు అతన్ని నంద్యాల ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారని పేర్కొన్నారు. (నిజానికి.. దగ్గర్లోని నందికొట్కూరు ఆస్పత్రికి తరలించకుండా 60 కి.మీ దూరంలోని నంద్యాలకు తరలించారు.) డాక్టర్లు పరిశీలించి చనిపోయినట్లు నిర్ధారించారని ఆ ప్రకటనలో తెలిపారు. అలాగే, మిడుతూరు పోలీస్‌స్టేషన్‌లో ఈ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్పీ కార్యాలయం ఆ ప్రకటనలో తెలిపింది.నోట్లో గుడ్డలు కుక్కి మరీ..నిజానికి.. హుస్సేన్, ప్రభుదాస్ ఇద్దరూ అన్నదమ్ములు. మైనర్ బాలిక హత్యాచారం కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న నిందితులలో ఒక బాలుడికి వీరు మేనమామ అవుతారని గ్రామస్తులు చెబుతున్నారు. ఘటన జరిగిన తర్వాత నిందితుల్లో ఒకరైన పదో తరగతి బాలుడు ఇచ్చిన సమాచారం మేరకు మృతదేహాన్ని మాయం చేయడంలో హుస్సేన్ ప్రధాన పాత్ర పోషించాడని పోలీసుల విచారణలో తేలినట్లు విశ్వసనీయ సమాచారం.దీంతో మృతదేహం ఎక్కడ వేశారు.. ఆ సమయంలో ఎవరెవరున్నారు అన్న కోణంలో విచారణ సాగింది. ఈ సందర్భంగా మృతుడిని విచక్షణారహితంగా కొట్టినట్లు బంధువులు ఆరోపిస్తున్నారు. హుస్సేన్ రెండు చేతులు, వేళ్లు, కాళ్లు ఉబ్బిపోయి కనిపిస్తున్నాయి. డొక్క, వీపు భాగంలో గట్టిగా కొట్టిన ఆనవాళ్లు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కొట్టే సమయంలో బాధితుడు అరవకుండా నోట్లో గుడ్డ పేలికలు పెట్టినట్లు తెలుస్తోంది. చనిపోయిన తర్వాత మృతుడి నోరు తెరుచుకుని ఉండడం ఇందుకు బలాన్ని చేకూరుస్తోంది.రాజీ కుదిర్చిన టీడీపీ నేత?.. గుట్టుగా అంత్యక్రియలుమరోవైపు.. లాకప్‌డెత్ కేసులో నియోజకవర్గానికి చెందిన టీడీపీ ప్రజా ప్రతినిధి తండ్రి రాజీ కుదిర్చినట్లు సమాచారం. చనిపోయిన వ్యక్తి కుటుంబానికి ఆర్థిక సాయం చేయడంతో పాటు కుటుంబంలో ఇద్దరికి ఉద్యోగాలిస్తామని చెప్పి రాజీచేసినట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది.ఆ నేత ఇచ్చిన హామీ మేరకు హుస్సేన్ మృతిపై బంధువులు ఎలాంటి ఫిర్యాదు చేయలేదని సమాచారం. ఇదిలా ఉంటే.. హుస్సేన్ మృతదేహాన్ని పోలీస్ ఎస్కార్ట్ సాయంతో అంబులెన్స్ ద్వారా రాత్రి ఎనిమిది గంటల సమయంలో నంద్యాల నుంచి పాత ముచ్చుమర్రికి తరలించి అక్కడి శ్మశాన వాటికలో ఉంచారు. కుటుంబ సభ్యులను మాత్రమే అక్కడికి అనుమతిచ్చి అంత్యక్రియలు గుట్టుగా పూర్తిచేయించారు. మృతుడికి తల్లి, ముగ్గురు సోదరులు, ఇద్దరు అక్కలు ఉన్నారు. తాళం వేసి పోస్టుమార్టం?మరోవైపు.. మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో హుస్సేన్ మృతదేహాన్ని పోస్ట్‌మార్టానికి తరలించారు. సాయంత్రం ఐదు గంటల సమయంలో ప్రొ. డాక్టర్ రాజశేఖర్ దీనిని పూర్తిచేశారు. ఈ గదికి లోపల వైపు తాళం వేసి మరీ ఈ ప్రక్రియను చేపట్టారు. ఇతర సిబ్బంది, మీడియా ప్రతినిధులు ఎవరూ అటువైపు వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు. పోస్టుమార్టం ప్రక్రియను వీడియో రికార్డ్ చేశారు. లాకప్‌డెత్ కానప్పుడు తాళంవేసి రహస్యంగా పోస్ట్‌మార్టం చేయించాల్సిన అవసరమేంటని బంధువులు ప్రశ్నిస్తున్నారు. అధికారం అండతో కేసును లాకప్‌డెత్ కాకుండా ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.మిడుతూరు నుంచి నంద్యాల సీసీఎస్‌కు అక్కడి నుంచి ఆస్పత్రికి..ఇక పోలీసులు కొట్టిన దెబ్బలు తట్టుకోలేక శనివారం తెల్లవారుజామున హుస్సేన్ మృతిచెందినట్లు తెలిసింది. కానీ, ప్రభుదాస్ ఎలా ఉన్నాడు? ఎక్కడ ఉన్నాడనే సమాచారం తెలీకపోవడంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన చెందారు. అంతకుముందు.. హుస్సేన్‌ను హుటాహుటిన నంద్యాల సర్వజన ఆస్పత్రిలోని క్యాజువల్ వార్డుకు తరలించారు. పోలీసులు రోగుల సహాయకులను అక్కడ నుంచి పంపించేసి వార్డులోకి ఎవరూ వెళ్లకుండా కాపలా ఉన్నారు.హుస్సేన్‌ను మిడుతూరు నుంచి నంద్యాల సీసీఎస్ స్టేషన్‌కు అక్కడి నుంచి ప్రభుత్వాస్పత్రికి ఉదయం 5–6 గంటల సమయంలో తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. అప్పటి నుంచి నంద్యాల డీఎస్పీ రవీంద్రనాథ్‌రెడ్డితో పాటు ఆరుగురు సీఐలు, నలుగురు ఎస్ఐలు దాదాపు 30 మంది కానిస్టేబుళ్లు ఆస్పత్రిని తమ ఆధీనంలో ఉంచుకున్నారు. మీడియా సిబ్బంది ఎవరూ ఆసుపత్రిలోకి రాకుండా అడ్డుకున్నారు. అయినా, మృతుడి ఫొటోలు మీడియాకు లభ్యం కావడంతో వాటిని పోలీసులే దగ్గరుండి మరీ తొలగించారు.విచారణలో సస్పెండ్ అయిన పోలీసులు?మైనర్ బాలిక హత్యాచారం ఘటనలో విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించారనే ఆరోపణలు రావడంతో ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్, మరో సబ్ ఇన్స్పెక్టర్ను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. కేసులో మొదటి నుంచి వీరు ఉండడంతో సస్పెండ్ అయిన తర్వాత కూడా వీరు పోలీసు విచారణలో పాల్గొన్నట్లు అత్యంత శ్వసనీయంగా తెలిసింది. అనుమానితులను అదుపులోకి తీసుకున్న తర్వాత విచారణ చేసే సమయంలో వీరిద్దరూ సంఘటన స్థలంలోనే ఉన్నట్లు సమాచారం. -
తీరిక లేదా అనితమ్మా!?
సాక్షి, అనకాపల్లి: సొంత జిల్లాలో బాలికను ఒక దుండగుడు పాశవికంగా కత్తితో పొడిచి చంపినా.. రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనితకు పట్టడంలేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కనీసం బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించకపోవడంపై గ్రామస్తులు మండిపడుతున్నారు. ప్రధానంగా బాలిక మృతదేహం ఆస్పత్రిలో ఉన్న సమయంలో పక్కనే జరిగిన ఒక సన్మాన కార్యక్రమానికి హాజరైన ఆమె బాలిక కుటుంబ సభ్యులను ఓదార్చే ప్రయత్నం చేయకపోవడం ఇప్పుడు జిల్లాలో చర్చనీయాంశమవుతోంది. రాంబిల్లి మండలం కొప్పుగుండుపాలెంలో ఈనెల 6వ తేదీ సాయంత్రం 9వ తరగతి చదువుతున్న బద్ది దర్శిని (14) అనే బాలికను బోడాబత్తుల సురేష్ కత్తితో దాడిచేసి దారుణంగా హత్యచేసిన విషయం తెలిసిందే. ఘటన జరిగి నాలుగు రోజులైనా ఇప్పటివరకు నిందితుడి ఆచూకీ లేదు. మైనర్ బాలిక హత్యకేసు విషయంపై రాష్ట్ర ప్రభుత్వం నుంచి బాధిత కుటుంబానికి ఎటువంటి భరోసా దక్కలేదు. ఎమ్మెల్యేగా, మంత్రిగా ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లాలో బాలిక హత్య కేసుపట్ల హోంమంత్రి కనీసం దృష్టిసారించకపోగా.. బాధిత కుటుంబానికి ధైర్యం కూడా చెప్పకపోవడంపట్ల గ్రామస్తులు దుమ్మెత్తిపోస్తున్నారు. దొరకని నిందితుని ఆచూకీ..ఘటన జరిగి నాలుగు రోజులైనా నిందితుడి ఆచూకీ దొరకలేదు. నిజానికి.. నిందితుడు సురేష్ ఒక నేరానికి సంబంధించి జైలుకెళ్లి బెయిల్‌పై విడుదలయ్యాడు. ఈ నేపథ్యంలో అతడిపై పోలీసులు నిఘా పెట్టకపోవడం కూడా ఈ హత్యకు దారితీసిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. బెయిల్ మీద వచ్చాక బస్సులో ఒకరోజు బాధితురాలి వెంటపడ్డాడని.. ఈ విషయం వెంటనే పోలీసుల దృష్టికి బాలిక తండ్రి వెంకటరమణ తీసుకువెళ్లినా పట్టించుకోలేదని చెబుతున్నారు.ఈ విషయమై మంత్రి అనితను మీడియా సమావేశంలో ఒక విలేకరి ప్రశ్నించగా.. అదే నిజమైతే సదరు పోలీసు అధికారిపై చర్యలు తీసుకుంటామని చెప్పి ఆ విషయాన్ని విస్మరించారని స్థానికులు గుర్తుచేస్తున్నారు. ఇదిలా ఉంటే.. నిందితుడు ఆచూకీ తెలిపిన వారికి రూ.50 వేలు నగదు బహుమతి ఇస్తామని పోలీసులు ప్రకటించి అతని ఫొటోలు విడుదల చేశారు. -
గంజాయి అలవాటు చేసి మరీ గ్యాంగ్ రేప్
మేడ్చల్, సాక్షి: నగరంలో ఘోరం జరిగింది. మైనర్ బాలికపై ఐదుగురు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. బాలిక గర్భం దాల్చడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. కాచిగూడకు చెందిన మైనర్‌కు సదరు యువకులు గంజాయి అలవాటు చేశారు. ఆ మత్తులో ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. అయితే బాలిక భయంతో ఈ ఘోరాన్ని ఎవరికీ చెప్పడకుండా ఉండిపోయింది. ఈలోపు శరీరంలో మార్పులు రావడంతో బాధితురాలిని, తల్లి నిలదీసింది. దీంతో జరిగిన ఘోరాన్ని బాలిక తల్లికి వివరించింది. బాలిక తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన కాచిగూడ పోలీసులు.. ఆ కేసును నేరెడ్‌మెట్‌కు బదిలీ చేశారు. పరారీలో ఉన్న యువకుల కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. -
భార్యకు గర్భం.. భర్తకు జైలు
మైసూరు: మైసూరు జిల్లాలోని హెచ్డి కోటె తాలూకాలోని బూదనూరు హాడి గ్రామానికి చెందిన నాగేష్ (25) అనే యువకుడు ఆదే గామానికి చెందిన మైనర్ బాలికను పెళ్ళి చేసుకున్నాడు, బాలిక ఇటీవల గర్భం దాల్చడంతో విషయం పోలీసులకు చేరి భర్తపై పోక్సో కేసు పెట్టారు. ఏడాది క్రితం అదే గ్రామానికి చెందిన బాలిక (16)తో నాగేష్కు కుటుంబ సభ్యులు పెళ్లి చేశారు. బాలిక గర్భవతి కావడంతో అన్నూరు పిహెచ్సీలో వైద్య పరీక్షల కోసం వెళ్లింది. వైద్యురాలు బాలికకు ఇంకా మైనారిటీ తీరలేదని గమనించి పోలీసులకు ఫిర్యాదు చేసింది. 18 ఏళ్లు నిండాకుండా పెళ్లి చేయడం, గర్భవతిని చేయడం చట్ట విరుద్ధం కాబట్టి, పోలీసులు నాగేష్‌ను పోక్సో కేసులో అరెస్టు చేసి జైలుకు తరలించారు. -
యడ్యూరప్పకు హైకోర్టులో ఊరట
బెంగళూరు: మైనర్ బాలికపై లైంగిక వేధింపుల కేసులో కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి బి.ఎస్.యడ్యూరప్పకు శుక్రవారం హైకోర్టులో ఊరట లభించింది. యడ్యూరప్పను అరెస్టు చేయవద్దని కర్నాటక హైకోర్టు సీఐడీ పోలీసులను ఆదేశించింది. పోస్కో చట్టం కింద నమోదైన కేసును విచారిస్తున్న సీఐడీ ఎదుట ఈనెల 17న హాజరుకావాలని బీజేపీ సీనియర్ నేత, 81 ఏళ్ల యడ్యూరప్పను హైకోర్టు ఆదేశించింది. -
మైనర్‌ను గర్భవతిని చేసి నిమ్స్‌లో వదిలేశాడు!
లక్డీకాపూల్ (హైదరాబాద్): నల్లగొండ జిల్లాకు చెందిన ఓ యువకుడు.. మాయమాటలు చెప్పి ఓ మైనర్ బాలికను లోబర్చుకున్నాడు.. ఆమె గర్భం దాల్చడంతో గుట్టుచప్పుడు కాకుండా హైదరాబాద్‌లోని ‘నిమ్స్ (నిజాం వైద్య విజ్ఞాన సంస్థ)’ఆస్పత్రికి తీసుకువచ్చాడు.. తనకు పరిచయం ఉన్న ఓ ఉద్యోగి సాయంతో నిమ్స్ అధికారిని కలిశాడు.. ఆ అధికారి సహకారంతో మైనర్ గర్భిణిని నిమ్స్ ఆస్పత్రిలో అడ్మిట్ చేయించాడు. కానీ ఈ విషయం బయటికి లీకైంది. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు పోలీసులు రంగంలోకి దిగి సమగ్ర దర్యాప్తు చేపట్టారు. మూడు రోజులుగా ఆస్పత్రిలో.. నల్లగొండ జిల్లా నకిరేకల్ ప్రాంతానికి చెందిన ఓ బాలిక (16 ఏళ్లు) కడుపులో నొప్పితో బాధపడుతోందని చెప్తూ.. ఒక యువకుడు మూడు రోజుల క్రితం నిమ్స్ ఆస్పత్రికి తీసుకువచ్చాడు. అప్పటికే ఆమె నాలుగు నెలల గర్భవతి అని, ఆమెను వదిలించుకోవాలనే ఉద్దేశంతోనే తీసుకువచ్చాడని సమాచారం. ఈ విషయం వెలుగులోకి రాకుండా ఉంచేందుకు నిమ్స్‌లో తనకు తెలిసినవారితో కలసి ప్రయత్నించాడ ని తెలిసింది.వైద్యులు బాలికకు వైద్య పరీక్షలు చేసినప్పుడు.. ఆమె గర్భవతి అని గుర్తించినా, కప్పిపుచ్చే ప్రయ త్నం జరిగినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. నిజానికి ఆమెకు చికిత్స ఏదీ అవసరం లేకున్నా.. ఆశ్రయం ఇచ్చే ఉద్దేశంతో మిలీనియం బ్లాక్ రూమ్ నంబర్ 322లో ఇన్‌పేషెంట్‌గా చేర్చుకున్నట్టు తెలిసింది. వారు ఇలా ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ విషయం బయటికి పొక్కింది. విషయం సీరియస్‌గా మారుతోందని గుర్తించిన నిమ్స్ వర్గాలు.. బుధవారం బాలికను ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేసి చేతులు దులుపుకొనేందుకు ప్రయత్నించాయని సమాచారం. అయితే పోలీసులు నిమ్స్‌కు చేరుకుని బాలికను నల్లగొండకు తరలించినట్టు ప్రచారం జరుగుతోంది. బాలికను మోసం చేసిన సదరు యువకుడు ఆమెకు బావ అవుతాడని ఓవైపు.. ఓ మాజీ ప్రజాప్రతినిధి కుమారుడే కారణమని మరోవైపు ప్రచారం జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే పోలీసులు ఈ వ్యవహా రంపై మౌనం వహిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.మెడికో లీగల్ కేసు కిందే వైద్యం చేశాంసదరు బాలిక కడుపులో నొప్పితో బాధపడుతూ నిమ్స్‌కు వచ్చింది. ఆమెకు వైద్య పరీక్షలు చేయించిన తర్వాతే గర్భవతి అని తేలింది. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చాం. మెడికో లీగల్ కేసు (ఎంఎల్సీ)గా పరిగణించే, ఆ తరహాలో నమోదు చేశాకే వైద్య పరీక్షలు నిర్వహించారు. ఇదే విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాం. – ప్రొఫెసర్ నగరి బీరప్ప, నిమ్స్ డైరెక్టర్ -
మైనర్ బాలిక చేరదీత
అడ్డగుట్ట: ఇంట్లో నుంచి పారిపోయి వచ్చిన మైనర్ బాలికను ఆర్పీఎఫ్ పోలీసులు చేరదీసి హోంకు తరలించిన ఘటన సికింద్రాబాద్ జీఆర్పీ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఎస్ఐ వెంకట్‌రెడ్డి తెలిపిన మేరకు.. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో శనివారం అనుమానాస్పదంగా కుమారి(16) అనే బాలిక సంచరిస్తోంది. ఈ క్రమంలో ఆరీ్పఎఫ్ పోలీసులు ఆమెను విచారించగా ఇంటి నుంచి పారిపోయి వచ్చినట్లు చెప్పింది. దీంతో సదరు బాలికను చేరదీసిన ఆర్పీఎఫ్ పోలీసులు ఆఫ్జల్‌గంజ్‌లోని ఎస్ఆర్డీ హోం కు తరలించారు. -
Bengaluru: యడ్యూరప్పపై లైంగిక దాడి కేసు.. మాజీ సీఎం రియాక్షన్ ఇదే..
బెంగళూరు: కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నేత బీఎస్ యడ్యూరప్పపై లైంగికదాడి కేసు నమోదైంది. తన కూతురిపై యడ్యూరప్ప లైంగికదాడి చేశారని ఓ 17 ఏళ్ల బాలిక తల్లి బెంగళూరులోని సదాశివనగర్ పోలీస్‌స్టేషన్‌లో కేసు పెట్టింది. పోక్సో చట్టం కింద యడ్యూరప్పపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఒక కేసులో సాయం అడిగేందుకు ఫిబ్రవరి 2న యడ్యూరప్ప ఇంటికి వెళ్లినపుడు తన కూతురిపై లైంగిక దాడికి పాల్పడ్డారని ఫిర్యాదులో బాలిక తల్లి పేర్కొన్నట్లు సమాచారం. యడ్యూరప్ప ఇప్పటికి మూడుసార్లు కర్ణాటక సీఎంగా పనిచేశారు. 2021లో యడ్యూరప్ప సీఎం పదవికి రాజీనామా చేశారు. ఇంటికి వస్తే సాయం చేశాను.. పోలీసులు కేసు పెట్టారు.. తనపై లైంగిక దాడి కేసు నమోదవడంపై యడ్యూరప్ప స్పందించారు. ఒక మహిళ కూతురిని తీసుకొని ఫిబ్రవరి 2వ తేదీన తన ఇంటికి వచ్చిన మాట నిజమేనని చెప్పారు. ఆమెకు ఒక కేసు విషయంలో సాయం అవసరమైతే పోలీస్ కమిషనర్‌కు స్వయంగా ఫోన్ చేశానని చెప్పారు. అయితే ఆ తర్వాత అనూహ్యంగా ఆమె తనకు వ్యతిరేకంగా మాట్లాడటం ప్రారంభించిందన్నారు. తర్వాత పోలీసులు తనపై పోలీసులు కేసు నమోదు చేశారని, ఈ కేసు వెనుక రాజకీయ కారణాలున్నాయా లేదా అనేది చెప్పలేనన్నారు. ఏం జరుగుతుందో చూద్దామన్నారు. ఇదీ చదవండి.. అవినీతి నిర్మూళనే మా సిద్ధాంతం.. మోదీ -
పరీక్షకు వచ్చిన విద్యార్థినిపై యాసిడ్ దాడి!
కర్ణాటకలోని మంగళూరులో హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. నగరంలోని కడబా ప్రాంతంలో 17 ఏళ్ల మైనర్ బాలికపై ఓ యువకుడు యాసిడ్ దాడి చేశాడు. బాధితురాలు స్థానిక పాఠశాలలో 12వ తరగతి చదువుతోంది. ఆ బాలిక సోమవారం ఉదయం పరీక్ష రాసేందుకు పరీక్షా కేంద్రానికి వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. పరీక్షా కేంద్రం వద్ద కాపుగాసిన 23 ఏళ్ల అబిన్ ఆమెపై యాసిడ్ విసిరాడు. దీనిని గమనించిన అక్కడున్నవారు నిందితుడిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం అబిన్ కేరళకు చెందినవాడని, ఎంబీఏ చదువుకున్నాడని తెలిపారు. అతనికి బాధితురాలితో గతంలో పరిచయం ఉంది. నిందితుడు అబిన్ బాధితురాలు కేరళలో ఒకే ప్రాంతంలో ఉండేవారని పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం బాధితురాలికి వైద్యులు చికిత్సనందిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.