బాలికకు గ్రోత్‌ హార్మోన్‌ కేసులో కీలక మలుపు | Big Twist In Growth Hormone Case Of Minor Girl | Sakshi
Sakshi News home page

నా కూతుర్ని వారిద్దరే టార్చర్‌ పెట్టారు.. వీడియో బయటపెట్టిన తల్లి

Published Mon, Jun 12 2023 7:38 PM | Last Updated on Mon, Jun 12 2023 7:41 PM

Big Twist In Growth Hormone Case Of Minor Girl - Sakshi

విజయనగరం: జిల్లాలో ఇటీవల వెలుగు చూసిన బాలిక గ్రోత్‌ హార్మోన్‌ కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. తన తల్లి తనను శారీరకంగా, మానసికంగా వేధించేదని.. ఇంటికి వచ్చిన వారితో సన్నిహితంగా ఉండమని, తనకు హార్మోన్ టాబ్లెట్లు ఇచ్చి శరీరం పెరిగేలా చేసిందని.. తనను చదువుకోనివ్వకుండా టార్చర్ చేసేదని.. ఒక మైనర్‌ బాలిక చైల్డ్ లైన్‌కు ఫిర్యాదు చేసింది. అయితే.. ఈ ఫిర్యాదులో వాస్తవం లేదని ఆమె తల్లి చెబుతోంది.

దీనికి సంబంధించి బాధిత బాలిక తల్లి ఒక వీడియోను బయపెట్టింది. తన కుమార్తెకు ఎటువంటి గ్రోత్‌ హార్మోన్స్‌, స్టెరాయిడ్స్‌ వంటివి ఇవ్వలేదని బాలిక తల్లి వాదిస​ఓతంది. తన కుమార్తెను మెడికల్‌ టెస్టులకు అనుమతించి వాస్తవాలు విచారించాలని తల్లి డిమాండ్‌ చేస్తోంది. తన కుటుంబానికి సన్నిహితుడైన అయి వ్యక్తి బాలికను ట్రాప్‌ చేశాడని ఆమె ఆరోపిస్తోంది. టెన్త్‌లో మెరిట్‌ స్టూడెంట్‌ అయిన తన బిడ్డకు దెయ్యం పట్టిందని భూత వైద్యం పేరిట పాస్టర్‌ అభిషేక్‌ పాల్‌, దేవరాజ్‌లు పలుమార్లు లైంగిక దాడి చేశారని చెబుతోంది. వారి అఘాయిత్యం చేసిన వీడియో బయటకు వస్తుందనే కారణంతో బాలికతో చైల్డ్‌ లైన్‌కు తప్పుడు ఫిర్యాడు చేయించారని పేర్కొంది. 

మైనర్‌ బాలికపై అభిషేక్‌ పాల్‌ అనే వ్యక్తి మరో వ్యక్తి చేసిన భౌతిక దాడి దృశ్యాలు సుమోటోగా తీసుకున్న బాలల హక్కుల కమిషన్‌ చైర్మన్‌ కేసల అప్పారావు జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. దీనిలో భాగంఆ వారి సెల్‌ఫోన్‌లు స్వాధీనం చేసుకుని వీడియోలను పరిశీలించే పనిలో పడ్డారు పోలీసులు. అదే సమయంలో అభిషేక్‌ పాల్‌, దేవరాజ్‌లను పోలీసులు విచారిస్తున్నారు.

కాగా, 15 ఏళ్ల కుమార్తెను  వ్యభిచార కూపంలోకి దింపాలని, అనంతరం సినీ, టీవీ రంగంలోకి పంపించాలంటూ హార్మోన్‌ ఇంజెక్షన్లు, స్టెరాయిడ్స్‌ను తల్లే వాడించినట్లు ఇటీవల  ఒక వార్త సంచలన సృష్టించింది. ఆ బాలిక శరీర భాగా­లు విపరీతంగా పెరిగేలా.. యుక్తవయసు అమ్మా­యి­లా కనిపించేలా చేసేందుకు హార్మోన్‌ ఇంజెక్షన్లు, ట్యాబ్లెట్లను వాడించినట్లు బాధిత బాలిక ఫిర్యాదు చేయడంతో అసలు విషయం వెలుగుచూసింది. తాజాగా ఈ కేసులో కొత్త కోణం వెలుగు చూడటంతో ఆ కేసు ఇంకా ఎన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి. 
తల్లి ఘాతుకం.. బాలిక శరీర భాగాలు పెరిగేందుకు ఇంజెక్షన్లు, టాబ్లెట్లు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement