విజయనగరం (క్రైమ్): ఆ బాలిక తల్లి దారి తప్పింది. పెళ్లయిన కొన్నేళ్లకే మొదటి భర్తకు విడాకులిచ్చింది. ఆ తరువాత సబ్ ఇంజనీర్‌ను వివాహం చేసుకుంది. కొంతకాలానికి అతనితోనూ తెగతెంపులు చేసుకుని వ్యభిచారం ప్రారంభించింది. చివరకు తన 15 ఏళ్ల కుమార్తెను కూడా వ్యభిచార కూపంలోకి దింపాలని, అనంతరం సినీ, టీవీ రంగంలోకి పంపించాలని భావించింది. ఆ బాలిక శరీర భాగాలు విపరీతంగా పెరిగేలా.. యుక్తవయసు అమ్మాయిలా కనిపించేలా చేసేందుకు హార్మోన్ ఇంజెక్షన్లు, ట్యాబ్లెట్లను వాడించడం మొదలుపెట్టింది.
తల్లి చేష్టలను భరించలేక బాధిత బాలిక 1098 నంబర్‌కు ఫోన్‌చేసి చైల్డ్ లైన్‌ను ఆశ్రయించింది. వివరాల్లోకి వెళితే.. నవోదయ పాఠశాలలో చదువుతున్న ఓ బాలిక ఇటీవల పదో తరగతి పరీక్షలు రాసి అత్యుత్తమ శ్రేణిలో ఉత్తీర్ణత సాధించింది. ఆ బాలిక విజయనగరంలో ఉంటున్న తల్లి దగ్గరకు ఇటీవల వచ్చింది. తెలియని వ్యక్తులు తరచూ ఇంటికి రావడం.. తల్లి తనముందే వారితో వ్యభిచరించడాన్ని భరించలేక.. తల్లితో విభేదించింది. బాలికను కూడా తన మాదిరిగానే ఇంటికి వచ్చే వ్యక్తులతో చనువుగా ఉండాలని తల్లి ఒత్తిడి చేయడాన్ని తట్టుకోలేకపోయింది.
శరీర భాగాలు పెరిగేందుకు ఇచ్చే ఇంజెక్షన్లు, టాబ్లెట్ల వల్ల అనారోగ్యానికి గురయింది. ఈ పరిస్థితుల్లో తల్లి ఒత్తిడిని తట్టుకోలేక గురువారం రాత్రి చైల్డ్‌లైన్ 1098కి కాల్ చేసి రక్షణ కోరింది. రంగంలోకి దిగిన చైల్డ్‌లైన్ సభ్యులు, దిశ పోలీసులు ఆ బాలికను దిశ స్టేషన్‌కు తీసుకువచ్చి విచారణ జరిపారు. బాలిక నుంచి ఫిర్యాదు తీసుకున్నాక అదేరోజు రాత్రి స్వధార్ హోమ్‌కు తరలించారు.
అనంతరం విశాఖలోని ప్రభుత్వ బాలికల పునరావాస కేంద్రంలో చేర్పించారు. బాలిక సంక్షేమం చూడాలంటూ పునరావాస కేంద్రం సూపరింటెండెంట్‌కు రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ చైర్మన్ కేసలి అప్పారావు సూచించారు. ఈ విషయాన్ని విజయనగరం ఎస్పీ ఎం.దీపిక దృష్టికి తీసుకువెళ్లారు. బాలిక తల్లిని అదుపులోకి తీసుకుని చిల్డ్రన్స్ కోర్టులో విచారణ జరిపారు.
Comments
Please login to add a commentAdd a comment