mother
-
కోల్‌కతా డాక్టర్ కేసు: దోషి సంజయ్ తల్లి సంచలన వ్యాఖ్యలు
కోల్‌కతా:ఆర్జీకర్ ఆస్పత్రి ట్రైనీ డాక్టర్‌పై హత్యాచారం కేసులో ప్రధాన నిందితుడు సంజయ్ రాయ్‌ను కోల్‌కతా కోర్టు ఇప్పటికే దోషిగా తేల్చింది. కోర్టు తీర్పుపై సంజయ్రాయ్ తల్లి మాలతీరాయ్ స్పందించారు. తన కొడుకు తప్పు చేస్తే కచ్చితంగా తగిన శిక్ష విధించాల్సిందేనన్నారు. తనకు కూడా ముగ్గురు కుమార్తెలున్నారని, తన కుమారుడు చేసిన తప్పును ఓ మహిళగా ఎప్పటికీ క్షమించనని చెప్పారు.మహిళా డాక్టర్ పడిన బాధను,నరకాన్ని అర్థం చేసుకోగలనన్నారు.ఓ అమ్మాయి పట్ల ప్రవర్తించిన తీరుకుగాను సంజయ్‌కు జీవించే హక్కు లేదన్నారు. అతడికి మరణ శిక్ష విధించినా తమకు ఎటువంటి అభ్యంతరం లేదని చెప్పారు.చనిపోయిన వైద్యురాలు తనకు కూతురితో సమానమని, కుమార్తెకు ఇటువంటి పరిస్థితి వస్తే ఏ తల్లీ ఊరుకోదన్నారు.ఈ కేసుపై సుప్రీం కోర్టుకు వెళ్తారా అని మీడియా అడిగిన ప్రశ్నకు సంజయ్ సోదరి మాట్లాడుతూ తమకు ఆ ఉద్దేశం లేదని స్పష్టం చేశారు. అతడు ఇలాంటి దారుణానికి ఒడిగడతాడని తామెప్పుడూ అనుకోలేదన్నారు.అయితే నేరం జరిగిన ప్రాంతంలో సంజయ్‌తో పాటు మరికొంతమంది ఉన్నట్లు కథనాలు వస్తున్నాయని,ఈ విషయంపై పోలీసులు,సీబీఐ క్షుణ్ణంగా దర్యాప్తు చేసి తగిన శిక్ష విధించాలని కోరారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ కేసులో సంజయ్రాయ్ ఎంత శిక్ష విధించబోయేదీ సిల్దా కోర్టు సోమవారం తేల్చనుంది. సంజయ్‌రాయ్‌కి మరణశిక్ష విధించే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయన్న ప్రచారం జరుగుతోంది. ముప్పైఒక ఏళ్ల ట్రైనీ డాక్టర్ మృతదేహాన్ని గత ఏడాది ఆగస్టు 10న ఆర్జీకర్ ఆస్పత్రి సెమినార్‌హాల్‌లో గుర్తించిన విషయం తెలిసిందే. ఈ హత్యాచార ఘటన జరిగిన 162 రోజుల తర్వాత ఈ కేసులో శనినవారం సిల్దా కోర్ట తీర్పువెలువరించింది. విచారణలో భాగంగా కోర్టు 100 మందికిపైగా సాక్షులను విచారించింది. ఈ కేసులో అరెస్టయినప్పటి నుంచి సంజయ్రాయ్ కుటుంబ సభ్యులెవరు అతడిని కలవడానికి ప్రయత్నించలేదు. అతడి తరపున కేసు వాదించడానికి కూడా న్యాయవాదిని కోర్టే న్యాయ సహాయంలో భాగంగా నియమించింది. -
తల్లే కూతురు పెళ్లిని ఆపేసింది..! ట్విస్ట్ ఏంటంటే..
కూతురు పెళ్లి చేసుకుని ఆనందంగా భర్త, అత్తమామలతో ఉండాలని కోరుకుంటారు ఏ తల్లిదండ్రులైనా. అందుకోసం ఆచితూచి మరీ వెతికి వెతికి మంచి సంబంధం తెచ్చుకుంటారు. అన్నేళ్లుగా అపురూపంగా పెంచుకున్న కూతుర్ని ఇంకో ఇంటికి పంపించేటప్పుడూ.. అక్కడ కూడా అంతే ఆనందంగా సంతోషంగా జీవించాలని కోరుకుంటాం. అలా ఆలోచించే ఓ తల్లి తన కూతురు పెళ్లిని పెళ్లి పీటల మీదే అర్థాంతరంగా ఆపేసింది. ఆమె తీసుకున్న ఈ నిర్ణయాన్ని చూసి అక్కడ వేదికపై ఉన్నవారు, వరుడు తరుపు వారు కంగుతిన్నారు. అయితే ఆ తల్లి ఇలాంటి అనూహ్య నిర్ణయం ఎందుకు తీసుకుందో తెలిస్తే..ఆమెను అభినందించకుండా ఉండలేరు.ఎందుకంటే..ఈ అనూహ్య సంఘటన బెంగళూరులో చోటు చేసుకుంది. ఇంకొద్దిసేపులో అంగరంగ వైభవంగా పెళ్లి జరగనుంది. సరిగ్గా ఆ సమయంలో వధువు తల్లి ఈ పెళ్లిని రద్దు చేసుకుంటున్నాం..ప్లీజ్ వెళ్లిపోండని వరుడిని, అతని కుటుంబ సభ్యులను వేడుకుంది. ఇదేంటి కరెక్ట్‌గా ఈ టైంలో ఇలా అంటుందని అంతా విస్తుపోయారు. కానీ అక్కడున్న కొంతమంది ఆమె సరైన నిర్ణయం తీసుకుందనే అనుకున్నారు. ఎందుకంటే సరిగ్గా పెళ్లితంతు సమయంలో కూడా వరుడు ఫుల్‌గా తాగి స్నేహితులతో కలిసి గొడవ చేశాడు. అక్కడున్న వారిని ఇబ్బందికి గురి చేశారు వరుడు, అతడి స్నేహితులు. దీంతో వధువు తల్లి ఇలాంటి షాకింగ్ నిర్ణయం తీసుకుంది. ఇప్పుడే అతడి ప్రవర్తన ఇలా ఉంది. భవిష్యత్తులో ఇంకెలా ఉంటుందనే భయంతో ఆ తల్లి ఇలాంటి నిర్ణయం తీసుకుంది. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. దీన్ని చూసిన నెటిజన్లు నిజంగా "ఇది చాలా ధైరవంతమైన నిర్ణయం. ఫైనాన్షియల్ పరంగా ఇంత ఖర్చు అయ్యిందే అనే ఆలోచనకు తావివ్వకుండా కూతురు భవిష్యత్తే ముఖ్యం అని ఇంత పెద్ద నిర్ణయం తీసుకుందా ఆ తల్లి, అందుకు ఎంతో ధైర్యం ఉండాలి కూడా అంటూ నెటిజన్లు ఆ తల్లి పై ప్రశంసలు జల్లు కురిపిస్తూ పోస్టులు పెట్టారు". View this post on Instagram A post shared by News For India (@news.for.india) (చదవండి: 'ఏది వడ్డించినా సంతోషంగా తింటా': మోదీ) -
గీతాభాస్కర్ సమర్పించు సంక్రాంతికి సకినాలు
గీతాభాస్కర్ సినిమాలలో నటిస్తే నటన ఎక్కడా కనిపించదు. పూర్తిగా సహజత్వమే. ఆమె ఏ ఫిల్మ్ ఇనిస్టిట్యూట్‌లోనూ శిక్షణ తీసుకోలేదు. ‘డెస్టినీస్ చైల్డ్’ అనే పుస్తకం రాస్తే.... ‘పుస్తకం అంటే ఇలా ఉండాలి నాయనా’ అనిపిస్తుంది. ఆమె పెద్ద పుస్తకాలు రాసిన పెద్ద రచయిత్రి కాదు. నటన అయినా రచన అయినా వంట అయినా... ఏదైనా ఇట్టే నేర్చుకోగల సామర్థ్యం గీతమ్మ సొంతం. గీత పుట్టి పెరిగింది చెన్నైలో. అయినప్పటికీ... ఆమె సకినాలు చేస్తే తెలంగాణ పల్లెకి చెందిన తల్లి చేసినంత రుచిగా ఉంటాయి. పెళ్లయిన తరువాత గీత... దాస్యం గీతాభాస్కర్ అయింది. అత్తగారిది పక్కా తెలంగాణ. తెలంగాణ అంటే ది గ్రేట్ సకినాలు. ఇక నేర్చుకోకుండా ఉంటారా! సకినాలు ఎలా చెయ్యాలి... నుంచి ఫ్యామిలి ముచ్చట్ల వరకు ‘సాక్షి’తో పంచుకున్నారు గీతాభాస్కర్. ఆమె మాటల్లోనే.. అరిసెల పిండిలానే సకినాల పిండి కూడా తయారు చేసుకోవాలి. మామూలుగా వరి పిండి అయితే గట్టిగా అయిపోతుంది. పైగా అంతకుముందు వేరే గోధుమ పిండిలాంటివి పట్టి ఉంటే... అదే గిర్నీలో ఈ పిండి పడితే సరిగ్గా ఉండదు. అదే తడి పిండి అనుకోండి వేరే పిండి ఏదీ పట్టరు... బియ్యం పిండి మాత్రమే పడతారు. అయితే అరిసెల పిండికి రోజంతా బియ్యం నానబెట్టాలి. కానీ సకినాలకి నాలుగు గంటలు నానబెడితే సరిపోతుంది.మా ఆయన ఉన్నప్పుడు ముగ్గుల పోటీకి తీసుకుని వెళ్లేవారు. ఒకసారి గవర్నర్ చేతుల మీదగా బహుమతి కూడా అందు కున్నాను. పండగ రోజున మంచి మంచి ముగ్గులు వేస్తుంటాను. నా ముగ్గులన్నీ డిఫరెంట్‌గా ఉంటాయి. దసరా, సంక్రాంతి అంటే ముగ్గుల పోటీలో నేను పాల్గొనాల్సిందే. ఆయన అలా తీసుకువెళ్లేవారు.– గీతాభాస్కర్ గీతా భాస్కర్ వేసిన ముగ్గునువ్వులు ఎక్కువ వేస్తాసకినాల పిండికి కొలతలు అంటూ ఉండవు. ఒక గ్లాసు పిండికి నేను పావుకిలో నువ్వులు వేస్తాను. నువ్వులు ఎక్కువ వేస్తే గ్యాప్ ఎక్కువ వస్తుంది... పైగా నువ్వుల నుంచి కూడా నూనె వస్తుంది కదా.. బాగా ఉడుకుతుంది. దాంతో సకినం కరకరలాడుతుంది. కొంతమందైతే పచ్చి నువ్వులు వేసేస్తారు. నేను చెన్నై నుంచి వచ్చినదాన్ని కదా... మాకు అక్కడ మురుకులు అలవాటు. అక్కడ వేయించిన నువ్వులు వేస్తారు. నేను సకినాల్లో అలానే వేస్తా. అసలు ఇక్కడికి వచ్చాకే నేను సకినాలు వండటం నేర్చుకున్నాను. సకినాలకి దొడ్డు బియ్యం బాగుంటుంది. నేను దాదాపు రేషన్ బియ్యమే వాడతాను. అవి ఎక్కువ పాలిష్ ఉండవు కాబట్టి సకినాలకి బాగుంటుంది. అలాగే వేరు శెనగ నూనె వాడతాను.అమ్మ వైపు... నాన్న సైడుమా తండ్రి, తల్లివైపు వాళ్లందరూ చెన్నైలో సెటిల్ అయ్యారు. నేను పుట్టింది, పెరిగిందీ అక్కడే. రెండు కుటుంబాల వాళ్లు బిగ్ బిజినెస్ పీపుల్. ఇక మా అమ్మగారివైపు అయితే పూర్తిగా కాస్మోపాలిటన్. ఆవిడ హార్స్ రైడ్ చేసేవారు. చెన్నైలో శివాజీ గణేశన్‌లాంటి స్టార్స్ ఉండే మలోని స్ట్రీట్‌లో మా తాత ఉండేవారు. పొలిటికల్‌గా ఆయనకు చాలా స్ట్రాంగ్ కనెక్షన్స్ ఉండేవి. నెహ్రూగారితో పరిచయం ఉండేది. మా అమ్మ బట్టలన్నీ సినిమా కాస్ట్యూమర్స్ కుట్టేవారు. ఇక నాన్నవైపు పూర్తిగా భిన్నం. వాళ్లు కూడా వ్యాపారవేత్తలే. నాన్న వాళ్లది పప్పుల వ్యాపారం. నాన్నగారి కుటుంబంలో అమ్మాయిలు బయటకు వెళ్లకూడదు... మగవాళ్లతో మాట్లాకూడదు... అలా ఉండేది. నేను ఇటు అమ్మవైపు అటు నాన్నవైపుఇలాంటి కాంబినేషన్లో పెరిగా. మా అమ్మ ఒక్కతే కూతురు. ఆమెకి ఇద్దరు బ్రదర్స్ ఉన్నారు. ఒక్కతే కూతురు కావడంతో రాణిలా పెంచారు. నాన్నవాళ్లు పదమూడుమంది. నాన్నమ్మ వాళ్లు బాగా ట్రెడిషనల్. ఇంటికి పెద్ద కోడలిగా అమ్మకి చాలా బాధ్యతలు ఉండేవి. అయితే అమ్మ ఎక్కడిది అక్కడే అన్నట్లుగా తనను మలచుకుంది. అత్తింటి విషయాలు పుట్టింటికి, అక్కడివి ఇక్కడ ఎప్పుడూ చెప్పలేదు. మా నాన్నమ్మ సైడ్‌లో పూర్తి ట్రెడిషనల్ పిండి వంటలు వండేవాళ్లు. అమ్మ సైడ్ కొంచెం డిఫరెంట్. అలా నాకు అమ్మ వల్ల, నాన్నమ్మ వల్ల వంటలు చేయడం అలవాటైంది. ఇక నేను పెళ్లి చేసుకుని ఇక్కడికి (తెలంగాణ) వచ్చాక పూర్తి భిన్నమైన వంటలు వండాల్సి వచ్చింది.అత్తింట్లోనే సకినాలు నేర్చుకున్నాఅత్తింటికి వచ్చాకే సకినాలు చేయడం నేర్చుకున్నాను. మా అత్తగారైతే అన్ని వంటలు బాగా వండుతావు... ఈ సకినాలు ఎందుకు చేయలేకపోతున్నావు... ఇవి కూడా చేయడం వస్తది అనేవారు. మా పెద్ద ఆడబిడ్డ, చిన్న ఆడబిడ్డ సకినాలు నేర్పించారు. మామూలుగా సకినాలకు ఉల్లికారం బాగుంటుంది. మా తరుణ్ (హీరో–దర్శకుడు– రచయిత తరుణ్‌భాస్కర్) కాస్త కారంగా తింటాడు. ఉల్లికారం తనకి తగ్గట్టుగా చేస్తాను. అయితే మా అత్తవాళ్లు ఉప్పు, కారం నూరి దానిమీద పచ్చి నూనె వేసేవారు. నేను కాస్త చింతపండు వేస్తాను. పండగకి అరిసెలు కూడా వండుతాను. యాక్చువల్లీ మా అమ్మ బాగా వండేది. నాకు కుదిరేది కాదు. అత్తింటికి వచ్చాక కూడా సరిగ్గా వండలేక΄ోయేదాన్ని. అయితే నా ఫ్రెండ్ వాళ్ల అమ్మ నేర్పించారు. అప్పట్నుంచి అరిసెలు చక్కగా మెత్తగా వండటం నేర్చుకున్నాను. ఇట్లు... బొబ్బట్లుఒకప్పుడు బుట్టలు బుట్టలు పిండివంటలు వండేవాళ్లు. మా ఇంట్లో మా అమ్మమ్మ, నాన్నమ్మ అలా వండటం చూశా. కానీ ఇప్పుడు ఒకట్రెండు కేజీలు వండటానికే కష్టపడిపోతున్నాం. అప్పట్లో పిండి దంచి వండేవాళ్లు. ఇప్పుడు అన్నింటికీ మిషన్ ఉంది. అయినా చేయలేకపోతున్నాం. కానీ బయట కొనుక్కుని తింటే అంత సంతృప్తి ఉండదు. ఇంట్లో వండితే పండగకి ఇంట్లో వండాం అనే తృప్తి ఉంటుంది. కానీ ఎందుకింత శ్రమ తీసుకుంటున్నావని తరుణ్ అంటుంటాడు. ఇప్పుడు తను కూడా బిజీ కాబట్టి హెల్ప్ చేసే వీలుండదు. కానీ నాకు పండగకి ఇంట్లో వండితేనే మనసుకి బాగుంటుంది. పోయిన గురువారం నాకు స్కూల్లో ఓ వర్క్‌షాప్ ఉంది. అలాగే కల్చరల్ డిపార్ట్మెంట్ వాళ్లు గవర్నమెంట్ సపోర్ట్‌తో ఓ నాలుగైదు ప్రోగ్రామ్స్ చేయమన్నారు. ఇంకా ‘ఇట్లు బొబ్బట్లు’ అని పిల్లలు తయారు చేస్తుంటారు. వాళ్లు పిలిస్తే వెళ్లాను. మా నాన్నగారు మాతోనే ఉంటారు. ఆయనకు 90 ఏళ్లు. ఆయన్ని చూసుకుంటూ, బయట పనులు చూసుకుని, ఇంటికొచ్చాక పిండి వంటలు మొదలుపెట్టా. ఇలా ఇంట్లో వండుకుంటే ఫీల్‌గుడ్ హార్మోన్‌తో మనసు హాయిగా ఉంటుంది. అది మన హెల్త్‌కి మంచిది. సకినాలు ఈ తరానికి నేర్పుదాంమన యంగర్ జనరేషన్‌కి మనం స్ఫూర్తిగా ఉండాలనుకుంటాను. ఇప్పుడు మనం వండితే భవిష్యత్తులో అప్పట్లో మన అమ్మ అలా వండేది కదా అనుకుంటారు. సో... యంగర్ జనరేషన్‌కి మన కల్చర్ అలవాటు చేయాలి. అందుకే మనం ఇంట్లోనే వండాలి. అమ్మ కష్టపడి వంట చేస్తుంటే పిల్లలకు హెల్ప్ చేయాలనిపిస్తుంది. మా తరుణ్ ఈ మధ్య ఓ రెండు రోజులు ఇంటికి రావడానికి కూడా కుదరలేదు. ఒక సినిమాకి డైలాగ్స్ రాస్తున్నాడు. ఆ స్ట్రెస్‌లో ఉన్నాడు. ఇంటికి వచ్చాక ఒక గిల్ట్తో ‘ఇంకో రెండు మూడు పేజీలు రాయాలమ్మా... అయిపోతుంది’ అన్నాడు. ఎంత బిజీగా ఉన్నప్పటికీ సకినాలు చేయడంలో నాకు హెల్ప్ చేశాడు (నవ్వుతూ). స్ట్రెస్ ఉంటే తరుణ్ ‘చెఫ్’మా తరుణ్‌కి కూడా వంటలంటే ఇష్టం. నేను చేస్తుంటే వచ్చి చేస్తుంటాడు. నేనేదైనా బాగా వండితే, ఎలా వండావు అని అడిగి తెలుసుకుంటాడు. మా ఇంటి పక్కనే మాకు బాగా పరిచయం ఉన్న ఫ్యామిలీ ఉంది. అలాగే మా ఆఫీసు ఒకటి క్లోజ్ చేశాం... ఆ ఆఫీసులో ఉన్న ఇద్దరు పిల్లలు మా ఇంట్లో ఉంటారు. ఇక ఆ ఫ్యామిలీ, ఈ పిల్లలు అందరూ కలిసి చేస్తుంటాం. మా నాన్న కూడా సలహాలు ఇస్తుంటారు. మా తరుణ్‌కి చాలా స్ట్రెస్ ఉండిందనుకోండి... అప్పుడు వంట చేస్తాడు. నా వంటిల్లు మొత్తం హైజాక్ అయి΄ోతుంది (నవ్వుతూ). వాడి బర్త్‌డేకి వాడికి తెలియకుండా వంటల బుక్ రాసి, గిఫ్ట్‌గా ఇచ్చాను. ఈ తరానికి నేర్పుదాంమన యంగర్ జనరేషన్‌కి మనం స్ఫూర్తిగా ఉండాలనుకుంటాను. ఇప్పుడు మనం వండితే భవిష్యత్తులో అప్పట్లో మన అమ్మ అలా వండేది కదా అనుకుంటారు. సో... యంగర్ జనరేషన్‌కి మన కల్చర్ అలవాటు చేయాలి. అందుకే మనం ఇంట్లోనే వండాలి. అమ్మ కష్టపడి వంట చేస్తుంటే పిల్లలకు హెల్ప్ చేయాలనిపిస్తుంది. మా తరుణ్ ఈ మధ్య ఓ రెండు రోజులు ఇంటికి రావడానికి కూడా కుదరలేదు. ఒక సినిమాకి డైలాగ్స్ రాస్తున్నాడు. ఆ స్ట్రెస్‌లో ఉన్నాడు. ఇంటికి వచ్చాక ఒక గిల్ట్తో ‘ఇంకో రెండు మూడు పేజీలు రాయాలమ్మా... అయిపోతుంది’ అన్నాడు. ఎంత బిజీగా ఉన్నప్పటికీ సకినాలు చేయడంలో నాకు హెల్ప్ చేశాడు (నవ్వుతూ). -
హై-ఎండ్ ప్రాజెక్ట్‌లో ఫ్లాట్స్ కొన్న హీరో వరుణ్ ధావన్ : ఎన్ని కోట్లో తెలుసా?
బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ మరోసారి వార్తల్లోకి వచ్చాడు. అయితే ఇది తన లేటెస్ట్ మూవీ ‘బేబీజాన్’ ఫ్లాప్ గురించి ఎంతమాత్రం కాదు. ముంబైలోని ఖరీదైన జుహూ ఏరియాలో రెండు లగ్జరీ అపార్ట్‌మెంట్స్‌ను కొనుగోలు చేశాడట. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట సందడి చేస్తోంది. ఇంతకీ ఎవరి కోసం ఆ ఫ్లాట్లు కొన్నాడు. తెలుసుకుందాం ఈ కథనంలో..ముంబైలోనిముంబైలోని అత్యంత ప్రీమియం జుహు ఏరియాలో ట్వంటీ అనే హై-ఎండ్ ప్రాజెక్ట్‌లో రెండు అపార్ట్మెంట్లను కొనుగోలు చేశాడు. వీటి ధర ఏకంగా రూ.86.92 కోట్లు. ఫ్యామిలీతో కలిసి ఒకటి భార్య నటాషా దలాల్ కోసం , మరోకటి తల్లి కరుణ్ ధావన్‌కోసం వీటిని సొంతం చేసుకున్నాడు.ఈ ట్వంటీ అనే బిల్డింగ్ లోని ఏడో అంతస్తులో ఒక ఫ్లాట్‌ను నటాషా దలాల్‌తో కలిసి కొన్నాడు. దీని విస్తీరం 5112 చదరపు అడుగులు. ధర రూ.44.52 కోట్లు. ఇందులో నాలుగు కారు పార్కింగ్ స్థలాలున్నాయట. ఇక తల్లి కోసం ఇక అదే బిల్డింగ్ ఆరో అంతస్తులో తన తల్లి కరుణా ధావన్‌తో కలిసి వరుణ్ మరో 4617 చదరపు అడుగుల అపార్ట్మెంట్ కొన్నాడు. దీని ధర రూ.42.4 కోట్లు. ప్రస్తుతం ఈ రెండూ ఇంకా నిర్మాణంలోనే ఉన్నాయి. ఈ ఏడాది మే 31వ తేదీలోపు వీటిని అందజేయనున్నారని స్క్వేర్ యార్డ్స్ రిపోర్ట్ ద్వారా తెలుస్తోంది. ఇక్కడ ఒక్కో అదరపు అడుగు విలువ రూ.60 వేల నుంచి రూ.1.3 లక్షల వరకు ఉంటుంది.విలాసవంతమైన ప్రాజెక్ట్ గురించి మరింత చెప్పాలంటే, ఇది ఇప్పటికే బాలీవుడ్ సెలబ్రిటీల్లో పెద్ద డిమాండ్ ఉన్న ఏరియా. ఈ ప్రాజెక్ట్‌లో ప్రీమియం సౌకర్యాలతో 3BHK , 4BHK నివాసాలు ఉన్నాయి. అలాగే ముంబైలోని జుహులో అమితాబ్ బచ్చన్ కు రెండు బంగ్లాలు ఉన్నాయి. అక్షయ్ కుమార్, అజయ్ దేవగన్, కాజోల్, గోవిందా తదితర హీరోలకు కూడా ఇక్కడ ఇళ్లున్నాయి. ఇక బాంద్రాలో బాలీవుడ్ స్టార్‌హీరోలు షారుక్ ఖాన్, సల్మాన్ ఖాన్ ఆమిర్ ఖాన్, సైఫ్ అలీఖాన్, కరీనా కపూర్ లాంటివాళ్ల నివాసాలు కూడా ఇక్కడే ఉన్నాయి. (ఎప్పటినుంచో ఐఏఎస్ కల..కానీ 13 ఏళ్లకే అనూహ్య నిర్ణయం)వరుణ్ ధావన్ తన చిన్నప్పటి నుంచి తన తండ్రి, నిర్మాత డేవిడ్ ధావన్ ద్వారా బాలీవుడ్‌తో దగ్గరి సంబంధాలతో పెరిగాడు. అయితే ధావన్ కుటుంబం మధ్యతరగతి జీవితాన్ని గడిపింది. 1990లలో డేవిడ్ అనేక విజయాలను అందించినప్పటికీ. నిర్మాత జీవితం దర్శకుడి జీవితం కంటే చాలా భిన్నంగా ఉంటుందని స్వయంగా ఒకసారి చెప్పుకొచ్చాడు. దర్శకుడిగా ఉన్నప్పటికీ తన తండ్రి పెద్దగా సంపాదించలేదన్నారు. అలా సింగిల్ బెడ్రూమ్ అపార్ట్మెంట్ నుంచి ముంబైలోని ఎలైట్ సెలబ్రిటీ హాట్‌స్పాట్‌లో రెండు లగ్జరీ రియల్ ఎస్టేట్లను కొనుగోలు దాకా వరుణ్ ఎదగడం విశేషమే మరి.ఇదీ చదవండి : రూ. 25 లక్షల ఐటీ జాబ్ వదిలేసి.. ఆర్గానిక్ వైపు జాహ్నవి జర్నీ!కాగా వరుణ్ ధావన్, కీర్తి సురేష్ జంటగా నటించిన మూవీ బేబీ జాన్. తమిళ బ్లాక్ బస్టర్ తేరి మూవీ రీమేక్‌గా దీన్ని తీసుకొచ్చారు. అయితే హిందీలో మాత్రం పెద్దగా సక్సెస్‌కాలేకపోయింది. కొత్త పెళ్లికూతురుగా పసుపుతాడుతో కీర్తి సురేష్ ప్రమోషన్స్‌లో పాల్గొన్నప్పటికీ పెద్దగా ఫలితం లేకపోయింది. ఒక విధంగా చెప్పాలంటే ‘బేబీ జాన్’ డిజాస్టర్ గా మిగిలి పోయింది. -
20 ఏళ్ల క్రితం అనాథల్నిచేసిన అమ్మ: వెతుక్కుంటూ వచ్చిన కూతురు, కానీ..!
ఢిల్లీకి రాజైనా తల్లికి బిడ్డే...జీవితంలో ఎంత ఎత్తుకు ఎదిగినా కన్నతల్లి స్పర్శకోసం మనసు ఆరాట పడుతుంది. అలా చిన్నతనంలోనే కన్నతల్లికి దూరమైన యువతి ఇపుడు జన్మనిచ్చిన తల్లికోసం అన్వేషిస్తోంది. రెండు దశాబ్దాలక్రితం అనుకోని పరిస్థితుల్లో అమ్మకు దూరమైన, పిల్లల విద్యలో పరిశోధకురాలు స్నేహ భారతదేశానికి తిరిగి వచ్చింది. అసలేంటీ స్నేహ స్టోరీ తెలుసుకుందాం పదండి!స్నేహకు సుమారు ఏడాదిన్నర వయసుండగా ఆమె తల్లి వదిలేసివెళ్లిపోయింది. ఈమెతోపాటు నెలల పసిబిడ్డ సోము కూడా అనాధలైపోయారు. ఇది గమనించిన ఇంటి యజమాని పోలీసులకు సమాచారం ఇచ్చింది. దీంతో పోలీసులు ఆ ఇంటికి వచ్చి ఇద్దర్నీ స్థానిక అనాథ ఆశ్రమంలో చేర్పించారు. ఐదేళ్లపాటు అక్కడే పెరిగారు.అయితే స్పెయిన్ నుంచి భారత్‌కు వచ్చిన ఒక జంట వీరి పాలిట దైవాలుగా మారారు. అనాధ ఆశ్రమంలో ఉన్న ఐదేళ్ల స్నేహ , నాలుగేళ్ల సోము ఇద్దర్నీ స్పానిష్ జంట జెమా వైదర్, జువాన్ జోష్ 2010లో దత్తత తీసుకుని తమ దేశానికి తీసుకువెళ్లి పోయారు. వీరిని సొంత బిడ్డల్లా పెంచుకుని ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దారు. ప్రస్తుతం స్నేహ వయసు 21 ఏళ్లు కాగా, చిన్నారుల విద్యలో పరిశోధనలు చేస్తోంది.అయితే, ఇటీవలే వారి మూలాలు ఒడిశాలో ఉన్నాయని జెమా దంపతులు స్నేహకు తెలిపారు. దీంతో తనకు జన్మనిచ్చిన తల్లి ఆచూకీ ఎలాగైనా తెలుసుకోవాలని స్నేహ పెంపుడు తల్లి జెమాతో కలిసి గత నెల 19న భారత్ (భువనేశ్వర్)కు చేరుకుంది. స్థానిక హోటల్లో ఉంటూ నయాపల్లిలోని ఇంటి యజమాని వద్దకు వెళ్లి అక్కడ తల్లిదండ్రుల పేర్లను తెలుసుకుంది. తల్లి పేరు బనలతాదాస్, తండ్రి సంతోష్ అని తెలిసింది. ఈ వివరాలతో పోలీసుల సాయంతో అమ్మకోసం వెదుకులాట ప్రారంభించింది. అలాగే అనాధాశ్రమంలో ఉన్న వివరాలతో వాటిని దృవీకరించుకుంది. ఈ విషయంలో మహిళా విశ్వవిద్యాలయం రిటైర్డ్ టీచర్ సుధా మిశ్రా ఆమెకు సాయం అందించారు.ఈ విషయాన్ని స్థానిక పోలీస్ కమిషనర్ దేవ్ దత్తా సింగ్ దృష్టికి తీసుకురాగా ఆయన సానుకూలంగా స్పందించారు. పోలీసులు విచారణ చేయగా, బానాలత కటక్ లో ఉన్నట్లు గుర్తించారు. అయితే జనవరి 6న స్నేహ తిరిగి స్పెయిన్ కు వెళ్లాల్సి ఉండటంతో తల్లిని కలుసుకోవడం సాధ్యం కాలేదు. అయితే తాను మార్చిలో తిరిగి ఇండియాకు వచ్చి తల్లి ఆచూకీ కోసం ప్రయత్నాలను కొనసాగిస్తానని చెప్పింది స్నేహ. స్నేహ తల్లిదండ్రులను గుర్తించడానికి పోలీసులు , పంచాయతీ కార్యకర్తల సహాయం తీసుకుంటామని ఇన్స్పెక్టర్ అంజలి ఛోట్రే చెప్పారు.స్నేహ అసలు తల్లిదండ్రులు ఎవరు?ఒడిశాకు చెందిన బనలతా దాస్, సంతోష్ స్నేహ తల్లిదండ్రులు. వీరు నలుగురు పిల్లలతో కలిసి భువనేశ్వర్‌లోని నయాపల్లిలో అద్దె ఇంటిలో ఉండేవారు. వంట మనిషిగా పని చేసే ఆమె భర్త, ఏమైందో తెలియదు గానీ పిల్లలు సహా భార్యను వదిలివేసి వెళ్లిపోయాడు. దీంతో బానాలత ఒంటరిదైపోయింది. అటు నలుగురు పిల్లలతో, కుటుంబ పోషణా భారమైంది. దీంతో ఇద్దరి పిల్లల్ని వదిలేసి మరో కొడుకు, కూతుర్ని తీసుకొని ఎటో వెళ్లిపోయింది. స్నేహ మా ఇంటి వెలుగుస్నేహ చాలా బాధ్యతగల కుమార్తె. మంచి విద్యావంతురాలు. ఆమె మా ఇంటి వెలుగు,ఆమెమా జీవితం అంటూ స్నేహ గురించి ప్రేమగా చెప్పుకొచ్చింది దత్తత తల్లి జెమా. అంతేకాదు జీవసంబంధమైన తల్లిని తెలుకోవాలన్న ఆరాటపడుతున్న కుమార్తెతోపాటు ఒడిశాలోని భువనేశ్వర్ రావడం విశేషం. ప్రస్తుతం స్నేహ చేస్తున్న ప్రయత్నం నెట్టింట వైరల్‌వుతోంది. త్వరలోనే తల్లీబిడ్డలిద్దరూ కలవాలని కోరుకుంటున్నారు నెటిజన్లు -
తల్లి చితికి నిప్పంటిస్తూ.. గుండెపోటుతో కుమారుని మృతి
ఒక్కోసారి మృతికి సంబంధించిన కొన్ని ఘటనలు రెండింతల విషాదాన్ని పంచుతాయి. ఒకేసమయంలో కుటుంబసభ్యులిద్దరు మృతి చెందడాన్ని ఎవరూ తట్టుకోలేరు. కన్నీరు పెట్టుకుంటారు. ఇటువంటి ఘటన హర్యానాలో చోటుచేసుకుంది. తన తల్లి చితికి నిప్పుపెడుతున్న ఒక కుమారుడు ఊపిరి తీసుకునేందుకు ఇబ్బంది పడుతూ, ఉన్నట్టుండి కింద పడిపోయాడు. చుట్టూ ఉన్నవారు అతనిని ఆస్పత్రికి తీసుకువెళ్లేలోగానే అతను మృతిచెందాడు. ఈ హృదయవిదారక ఘటన హర్యానాలోని గురుగ్రామ్‌లోగల సోహ్నాలో చోటుచేసుకుంది. తల్లీ కొడుకులు కొన్ని గంటల వ్యవధిలోనే మృతిచెందడం స్థానికులకు త్రీవ విషాదాన్ని పంచింది. ఈ ఘటనల అనంతరం బంధువులు తొలుత తల్లికి ఆ తర్వాత కుమారునికి అంత్యక్రియలు నిర్వహించారు.సోహ్నా పఠాన్ వాడా నివాసి ధరమ్ దేవి (92) వయోభారంతో మృతి చెందారు. ఆమె మృతదేహానికి అంత్యక్రియలు చేసేందుకు ఏర్పాట్లు చేశారు. ఆమె కుమారుడు సతీష్ (69) తల్లి చితికి నిప్పు పెడుతున్న సమయంలో ఛాతీ నొప్పికి లోనయ్యాడు. వెంటనే కుటుంబ సభ్యులు అతనిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. అక్కడి వైద్యులు సతీష్‌ను పరిశీలించి, మృతిచెందినట్లు తెలిపారు. కొద్దిరోజుల క్రితమే ధరమ్ దేవి భర్త మరణించారు. తల్లీకొడుకులు ఒకేసారి మృతి చెందడంతో పట్టణంలో తీవ్ర విషాదం నెలకొంది.ఇది కూడా చదవండి: మూడు యుద్ధాల వీరుడు.. నాలుగు భాషల నిపుణుడు.. 107లోనూ ఫిట్‌గా ఉంటూ.. -
‘అమ్మా’నవీయం!
గన్నవరం/కొమరోలు: కన్న తల్లులే బిడ్డలకు భారమవుతున్నారు. నవ మాసాలు మోసి కనీపెంచిన అమ్మలను అమానవీయంగా వదిలించుకుంటున్నారు. గన్నవరం సమీపంలో ఎముకలు కొరికే చలిలో శనివారం రాత్రి ఓ తల్లిని వదిలి వెళ్లగా, ప్రకాశం జిల్లా కొమరోలులో ఓ తల్లి వారం రోజులుగా నడిరోడ్డుపై నరకయాతన అనుభవిస్తున్నా.. కుమారుల మనసు కరగలేదు. ఎముకలుకొరిచే చలిలో 85 ఏళ్ల అవ్వ కృష్ణా జిల్లా గన్నవరం శివారు ఆల్ఫా హోటల్‌కు సమీపంలో శనివారం అర్ధరాత్రి 12 గంటల సమయంలో కారులో 85 ఏళ్ల ఓ వృద్ధురాలిని కొంత మంది వ్యక్తులు తీసుకొచ్చారు. కిందికి దింపి అక్కడో ఓ కుర్చీలో కూర్చోబెట్టి వెళ్లిపోయారు. చలికి గజగజ వణుకుతున్న ఆ వృద్ధురాలిని కొంతమంది గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. స్పందించిన గన్నవరం పోలీసులు అక్కడికి చేరుకుని వృద్ధురాలి ఆచూకీ తెలుసుకునే ప్రయత్నం చేశారు. అయితే ఆమె మాట్లాడలేని స్థితిలో ఉండడంతో స్థానిక బీకేఆర్ వృద్ధాశ్రమానికి తరలించారు. ఆమె వద్ద లభ్యమైన ఆధార్ కార్డులోని వివరాల ప్రకారం ఆమె గన్నవరం మండలం కొండపావులూరుకు చెందిన నక్కా లక్ష్మీకాంతంగా గుర్తించారు. ఆ వివరాల ఆధారంగా పోలీసులు ఆ వృద్ధురాలి కుటుంబ సభ్యులను పిలిపించే ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలిసింది. దుప్పటి కూడా లేక నడిరోడ్డుపైనే 75 ఏళ్ల అమ్మ ప్రకాశం జిల్లా కొమరోలు మండలం వెన్నంపల్లికి చెందిన కలిగవిన వెంకటలక్ష్మమ్మ(75) భర్త కొంత కాలం కిందట మృతిచెందాడు. అనంతరం ఆమె ముగ్గురు కుమారుల వద్ద ఉంటూ కాలం గడుపుతోంది. ఆస్తుల పంపకాల అనంతరం తల్లిని మాత్రం వారు పట్టించుకోవడం మానేశారు. ఏడాది కాలంగా ఓ గుడిసెలో వదిలేశారు. ప్రతినెలా వచ్చే వృద్ధాప్య పింఛన్‌ను కూడా వారే బలవంతంగా తీసుకెళుతున్నారు. వెంకట లక్ష్మమ్మ నివాసం ఉంటున్న గుడిసె కూడా శిథిలావస్థకు చేరి కూలిపోవడంతో ఇటీవల కుమారులు తల్లిని ఇళ్లకు తీసుకెళ్లి.. మళ్లీ వారం కిందట వెన్నంపల్లెలో నడిరోడ్డుపై వదిలేసి వెళ్లిపోయారు. దీంతో వారం రోజులుగా చలికి వణుకుతూ, ఎండకు ఎండుతూ నానా యాతనపడుతోంది.కట్టుబట్టలు తప్ప కనీసం దుప్పటి కూడా లేకపోవడంతో ఆ అమ్మ కష్టాలు వర్ణనాతీతం. గ్రామస్తులే అన్నం పెడుతున్నారు. వృద్ధురాలి దీన స్థితిని చూసి చలించిపోయి పోలీసులకు సమాచారం ఇచ్చారు. కొమరోలు ఎస్ఐ వెంకటేశ్వర్లునాయక్కు గ్రామానికి చేరుకుని కుమారులతో ఫోన్లో మాట్లాడారు. తల్లి బాగోగులు చూసుకోవాలని లేకుంటే.. అనాథాశ్రమానికి తరలిస్తామని చెప్పారు. -
పిల్లలతో కలిసి స్కూల్లో డ్యాన్స్ చేసిన అమ్మ
-
ట్రెండ్ సెటర్‌గా ఫస్ట్ ఏఐ మామ్ కావ్య మెహ్రా
ఒకరోజు... హాయ్ ఫ్రెండ్స్... నేను మీ కావ్య మెహ్రాని మాట్లాడుతున్నాను. ప్రెగ్నెన్సికి సంబంధించి నా గత జ్ఞాపకాలను ఈ రోజు మీతో పంచుకోవాలనుకుంటున్నాను.మరో రోజు...మీ పిల్లవాడు బడికి వెళ్లనని మారాం చేస్తున్నాడా? హోంవర్క్ చేయడానికి భయపడుతున్నాడా? ఈ సమస్యలను ఒక తల్లిగా ఎలా పరిష్కారం కనుగొన్నానో ఈరోజు మీకు చెబుతాను.ఇంతకీ ఎవరీ కావ్య మెహ్రా?కాల్పనికత, వాస్తవికతకు మధ్య హద్దును చెరిపేస్తూ వర్చువల్ ఇన్ఫ్లూయెన్సర్లు ‘వావ్’ అనిపిస్తున్నారు. ఈ కోవలో ఇప్పుడు తాజా సంచలనం... కావ్య మెహ్రా.మన దేశంలో మొట్టమొదటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) ఆధారిత మామ్ ఇన్ఫ్లూయెన్సర్గా కావ్య మెహ్రా సోషల్ మీడియాలో ట్రెండ్ సెట్టర్‌గా అవతరించింది. టెక్నాలజీ, మాతృత్వం కలగలిసిన ఈ మామ్ ఇన్‌ఫ్లూయెన్సర్‌ను ‘కలెక్టివ్ ఆర్ట్స్ నెట్వర్క్’ కంపెనీ రూపొందించింది.మాతృత్వానికి సంబంధించిన అన్ని అంశాల్లో ప్రేక్షకులను ఎంగేజ్ చేసే ఏఐ డిజైన్ మోడల్‌గా కావ్య మెహ్రాను తీర్చిదిద్దారు. ఇన్‌స్టాగ్రామ్‌లో కావ్య మెహ్రా బయోలో ‘భారతదేశపు మొట్ట మొదటి ఏఐ మామ్. పవర్డ్ బై రియల్ మామ్స్’ అనే పరిచయ వాక్యం ఉంటుంది.మన దేశంలోని వివిధ రంగాలకు చెందిన తల్లులు ఎదుర్కొనే దైనందిన జీవిత అనుభవాలు, భావోద్వేగాలకు కావ్య మాటలు అద్దం పడతాయి. వంట, కుటుంబ జీవితం, వ్యక్తిగత శ్రేయస్సు, మాతృత్వానికి సంబంధించిన అనేక అంశాలు కావ్య కంటెంట్‌లో ఉంటాయి. (మసాబా మెచ్చిన చ్యవన ప్రాశ ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు ఇలా!)ఆధునిక కోణంలో మాతృత్వానికి సంబంధించిన తన ఆలోచనలను ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్లతో షేర్ చేసుకుంటుంది. స్కిన్‌కేర్ రొటీన్స్ను ఫాలో అయ్యే కావ్య కుకింగ్‌ను, పెయింటింగ్‌ను ఎంజాయ్ చేస్తుంది.ఫేవరెట్ ఫుడ్ తయారు చేయడం నుంచి పండగ సంతోషం వరకు రకరకాల విషయాలను ఇన్‌స్టాలో పంచుకుంటుంది. ప్రెగ్నెన్సీ, చైల్డ్స్ డెవలప్మెంట్... మొదలైన ఫ్లాష్‌బ్యాక్ ఇమేజ్‌లను కూడా షేర్ చేస్తుంది. తాను ఎలాంటి తల్లి కావాలనుకుంటోందో ఒక పోస్ట్‌లో చర్చించింది కావ్య. ఎవరి ప్రేమ నీడలో అయితే పిల్లలు చల్లగా, భద్రంగా ఉండగలుగుతారో... అలాంటి తల్లి తాను కావాలని అనుకుంటుంది. ‘కావ్య కేవలం ఒక సాంకేతిక ఆవిష్కరణ మాత్రమే కాదు. సమాజానికి సంబంధించి నిజజీవిత అనుభవాల ప్రతిబింబం’ అంటున్నాడు ‘కలెక్టివ్ ఆర్టిస్ట్స్ నెట్వర్క్’ వ్యవస్థాపకుడు విజయ్ సుబ్రమణ్యం.సోషల్ మీడియాలో వైరల్ అయిన ఫస్ట్ ఏఐ మామ్ ఇన్ఫ్లూయెన్సర్ కావ్య మెహ్రపై నెటిజనులు ప్రశంసలు కురిపించారు. కొందరు మాత్రం మాతృత్వం గురించి డిజిటల్ అవతార్ చెప్పడం ఏమిటో అని పెదవి విరిచారు. కావ్య మెహ్రా ఏఐ పవర్డ్ మామ్ ఇన్ఫ్లూయెన్సర్ అయినప్పటికీ... ఎంతోమంది నిజజీవిత తల్లుల అనుభవాల నుంచి ఈ డిజిటల్ అవతార్‌ను సృష్టించారు. -
తల్లి ఆవేదన.. పట్టించుకోని కొడుకులు
-
తల్లి రైల్వే కూలీ.. బిడ్డకు పవర్ లిఫ్టింగ్‌లో బంగారు పతకం
రష్యాలో జరిగిన డబ్ల్యూపీపీఎల్ వరల్డ్ కప్ పవర్ లిఫ్టింగ్‌లో బంగారు పతకం సాధించి ప్రశంసలు అందుకుంటోంది కస్తూరి రాజమూర్తి. కస్తూరి కథ చాలామంది విజేతలతో పోల్చితే భిన్నమైనది. కస్తూరి తల్లి తిరువణ్ణామలై రైల్వేస్టేషన్లో పోర్టర్. తల్లి పెద్ద పెద్ద బ్యాగులు, సూటుకేసులు మోస్తుంటే ఆసక్తిగా చూసేది. తల్లికి సహాయంగా తాను కూడా చిన్న చిన్న బరువులు మోసేది. ఈ కష్టం ఊరకే పోలేదు. వెయిట్ లిఫ్టింగ్‌పై ఆసక్తి పెంచుకునేలా, పతకాలు గెలుచుకునేలా చేసింది.‘గెలుస్తాను అనుకోలేదు’ అంటుంది కస్తూరి రష్యాలో వెయిట్ లిఫ్టింగ్‌లో బంగారు పతకం గెలుచుకోవడం గురించి. ఎందుకంటే ఆమెను ఓటమి కంటే గెలుపు పలకరించిన సందర్భాలే ఎక్కువ. పోటీలో బరువు ఎత్తబోతున్నప్పుడు మా అమ్మ రైల్వేస్టేషన్లో బ్యాగులు ఎత్తి నెత్తి మీద మోసే దృశ్యాన్ని గుర్తు చేసుకున్నాను. మా అమ్మే నాకు స్ఫూర్తి. మరిన్ని పతకాలు గెలుచుకోవాలనుకుంటున్నాను. ఎలాంటి కష్టాలు లేకుండా అమ్మను చూసుకోవాలనుకుంటున్నాను’ అంటుంది కస్తూరి.తిరువణ్ణామలై ప్రాంతంలోని చెయ్యార్ అనే చిన్న గ్రామంలో పుట్టి పెరిగిన కస్తూరి అనుకోకుండా వెయిట్ లిఫ్టింగ్‌పై ఆసక్తి పెంచుకుంది. కొత్తూర్పురంలో స్థానిక ఇన్‌స్ట్రక్టర్ల దగ్గర వెయిట్‌లిఫ్టింగ్‌లో శిక్షణ తీసుకుంది. ఇల్లు వదిలి వేరే ఊళ్లో శిక్షణ తీసుకోవడానికి తల్లిదండ్రులు మొదట ఒప్పుకోకపోయినా కస్తూరి పట్టుదల చూసి ఆ తరువాత ఒప్పుకోక తప్పింది కాదు.కొత్తగా పరిచయం అయిన ఆట అయినప్పటికీ ఏడాదిలోపే జిల్లా పోటీలో 36 పతకాలు గెలుచుకుంది. వీసా కోసం దరఖాస్తు చేసుకోవడానికి డబ్బులు లేకపోవడంతో యూరప్‌లో పోటీ పడే అవకాశాన్ని కోల్పోయింది. ఇండియన్ పవర్ లిఫ్టింగ్ ఫెడరేషన్ సహకారంతో రష్యాలోని నోవోసిబిర్క్స్ వరల్డ్‌కప్ వెయిట్ లిఫ్టింగ్ పోటీలో పాల్గొంది. 75 కేజీల విభాగంలో డెడ్‌లిఫ్ట్ చేసింది.తాజాగా.... ఒలింపిక్ వెయిట్‌లిఫ్టింగ్ ట్రైనింగ్ కోసం తమిళనాడు స్పోర్ట్స్ డెవలప్మెంట్ అథారిటీ నుంచి కస్తూరికి ఫోన్ కాల్ వచ్చింది. అయితే ఈ కాల్ కస్తూరిని పెద్దగా సంతోష పరిచినట్లు లేదు. ‘ముందు నాకు ఉద్యోగం కావాలి. మా కుటుంబం మొత్తం అమ్మపైనే ఆధారపడింది. నాన్న అనారోగ్యంగా ఉన్నారు. మా అక్కాచెల్లెళ్లు ఉద్యోగాల కోసం వెదుకుతున్నారు. నా కుటుంబం ఆర్థికంగా బాగుండి, సంతోషంగా ఉంటేనే నేను ఆటలపై బాగా దృష్టి కేంద్రీకరించగలుగుతాను’ అంటోంది కస్తూరి రాజమూర్తి. -
‘అమ్మ’కు సుస్తీ చేస్తే? అమ్మ పనులు చేయడం వచ్చా?
ఇంట్లో ఎవరికైనా సుస్తీ చేస్తే అమ్మ వారికి సేవలు చేసి కోలుకునేలా చేస్తుంది. మరి అమ్మకు సుస్తీ చేస్తే? వంట ఎవరు చేయాలి?బాక్స్ ఎవరు కట్టాలి? అంట్ల పరిస్థితి ఏమిటి? అనారోగ్యం వల్ల ఆమెకు చిరాకు కలిగితే ఎలా వ్యవహరించాలి? ఎవరికి సుస్తీ చేసినా అమ్మ ఆరోగ్యంగా ఉంటే ఏమీ కాదు. కానీ అమ్మకు సుస్తీ చేస్తే ఇంటికే సుస్తీ అవుతుంది. మరి మనకు అమ్మ పనులు ఎన్ని వచ్చు? ఒక్క అమ్మ అందరి పనులూ చేస్తుంది. అందరూ కలిసి అమ్మ పనులు చేయలేరా? ఇది చలికాలం. సుస్తీ చేసే కాలం. బద్దకం కాలం. ఏ త్రోట్ ఇన్ఫెక్షనో, జ్వరమో, ఒళ్లు నొప్పులో, నీరసమో, ఏమీ చేయాలనిపించని నిర్లిప్తతో, ముసుగు తన్ని విశ్రాంతి తీసుకోవాలనే తలంపుతో ఒక రోజంతా అమ్మను మంచం కదలనివ్వక పోతే అమ్మ ఎన్ని పనులు చేస్తుందో ఇంట్లోని సభ్యులకు అర్థమవుతుంది. ఆ పనులన్నీ అమ్మ కోసం ఇంటి సభ్యులు చేయగలరా? చేయాలి.ఎవరికి చిరాకు?సాధారణంగా అమ్మకు అనారోగ్యం వస్తే నాన్నకు చిరాకుగా అనిపిస్తుంది. మరి నాన్న ఆఫీసుకు వెళ్లాలి. ఏవేవో పనులుంటాయి. టైముకు అన్నీ జరిగి΄ోవాలి. అమ్మ మంచం మీద ఉంటే అవి జరగవు. అప్పుడు నాన్నకు చిరాకు వేస్తుంది. ‘లేచి పనుల్లో పడితే సుస్తీ అదే పోతుంది’ అని ఎఫ్.ఆర్.సి.ఎస్ లెవల్లో సూచన కూడా చేస్తాడు. అమ్మకు బాగా లేక΄ోతే పిల్లలు నాన్నకు చెప్పాల్సిన మొదటి సంగతి– లీవ్ పెట్టు నాన్నా... రోజూ వెళ్లే ఆఫీసేగా అని. తనకు బాగా లేకపోతే భర్త కన్సర్న్తో లీవ్ పెట్టాడు అనే భావన అమ్మకు సగం స్వస్థత ఇస్తుంది. ఆ తర్వాత నాన్న అమ్మతో చెప్పాల్సిన మాట ‘నేను చూసుకుంటాను. నువ్వు రెస్ట్ తీసుకో’ అనే.పనులు పంచుకోవాలికొన్ని ఇళ్లల్లో తల్లిదండ్రులు పిల్లలకు ఆపిల్ పండు తొక్క తీయడం కూడా నేర్పరు. అలాంటి ఇళ్లలో ఇంకా కష్టం కాని కొద్దో గొప్పో పనులు చేసే పిల్లలు ఉంటే తండ్రి, పిల్లలు కలిసి ఏ మాత్రం శషభిషలు లేకుండా పనులు పంచుకోవాలి. బ్రేక్‌ఫాస్ట్ ఏమిటి? బ్రెడ్‌తో లాగించవచ్చు. మధ్యాహ్నం ఏమిటి? అన్నం కుక్కర్లో పడేసి, ఏదైనా ఊరగాయ, బాయిల్డ్ ఎగ్ కట్టుకుని వెళ్లవచ్చా? ఇల్లు సర్దే బాధ్యత ఒకరిది. పనిమనిషి ఉంటే ఆమె చేత అంట్లు తోమించి, ఉతికిన బట్టలు వైనం చేసే బాధ్యత ఒకరిది. ఈ పనులన్నీ అమ్మ తప్ప ఇంట్లో అందరూ చేయక పోతే ఆ ఇంట్లో అనవసర కోపాలు వస్తాయి. అవి గృహశాంతిని పోగొడతాయి. అసలే ఆరోగ్యం బాగలేకుండా ఉన్న అమ్మను అవి మరీ బాధ పెడతాయి. ఆమే ఓపిక చేసుకుని లేచి పని చేస్తే ఆరోగ్యం మరింత క్షీణించి లేని సమస్యలు వస్తాయి.అమ్మ పేరున మందు చీటిఏ ఇంటిలోనైనా అతి తక్కువ మందు చీటీలు ఉండేది అమ్మ పేరుతోనే. ఎందుకంటే సగం అనారోగ్యాలు ఆమె బయటకు చెప్పదు. ఒకవేళ చెప్పినా మెడికల్ షాప్ నుంచి తెచ్చి ఇవ్వడమే తప్ప హాస్పిటల్‌కు తీసుకువెళ్లడం తక్కువ. కాని అమ్మను కచ్చితంగా ఆస్పత్రికి తీసుకెళ్లాలి. డాక్టర్ సూచన ఆమెకు బలాన్ని ఇచ్చి లోపలి సందేహాలేవైనా ఉంటే పోగొడుతుంది. అమ్మ సరైన మందులతో తొందరగా కోలుకుంటుంది.అమ్మతో సమయంతనతో కాసింత సమయం గడపాలని అమ్మ కోరుకుంటుంది ఇలాంటప్పుడు. భర్త ఆమె దగ్గర కూచుని తీరిగ్గా కబుర్లు చెప్పవచ్చు. ఏవైనా జ్ఞాపకాలు నెమరు వేసుకోవచ్చు. మధ్య మధ్య ఆమెకు ఏదైనా సూప్ కాచి ఇచ్చి తోడుగా తనూ కాస్తంత తాగుతూ కూచుంటే అమ్మకు ఎందుకు బాగైపోదు..? పిల్లలు పాదాలు నొక్కుతూ కబుర్లు చెప్పవచ్చు. అమ్మ వర్కింగ్ విమన్ అయితే ఆఫీసుకు వెళ్లొద్దని ఇంకొన్నాళ్లు రెస్ట్ తీసుకోమని మారాం చేయొచ్చు. ఆ మారాం కూడా ఆమెకు మందే.కొంత ఖర్చు చేయాలిఅమ్మకు అనారోగ్యం అయితే అమ్మ వద్దు వద్దంటున్నా కొంత ఖర్చు చేయాలి. మంచి పండ్లు తేవాలి. వంట చేయలేని పరిస్థితి ఉంటే మంచిచోట నుంచి భోజనం తెచ్చుకోవాలి. మంచి హాస్పిటల్లో చూపించాలి. మందులు పూర్తి కోర్సు కొని వాడేలా చూడాలి. డాక్టర్లు పరీక్షలు ఏవైనా రాస్తే ఏం అక్కర్లేదు అని ఎగ్గొట్టకూడదు. అమ్మ కోసం కుటుంబం మొత్తం ప్రేమగా, సహనంగా, ఒళ్లు వొంచి పని చేసే విధంగా ఏ ఇంట్లో ఉండగలరో ఆ ఇంట్లో అమ్మ ఆరోగ్యంగా తిరుగుతుంది. తొందరగా కోలుకుంటుంది. ఇదీ చదవండి : తల్లి రైల్వే కూలీ.. బిడ్డకు పవర్ లిఫ్టింగ్‌లో బంగారు పతకం -
అమ్మా.. నేనూ నీతో వచ్చేస్తా...
పిల్లలు పెద్దవాళ్లు అయ్యాక, వాళ్ల చిన్ననాటి సంగతులు తలచుకుని తల్లిదండ్రులు మురిసిపోతుండటం మామూలే. అయితే వారి హృదయాన్ని మెలిపెట్టి పశ్చాత్తానికి లోను చేసే జ్ఞాపకాలూ కొన్ని ఉంటాయి. ప్రియాంక చోప్రా తల్లి మధు చోప్రాను ఇప్పటికీ బాధిస్తూ, కన్నీళ్లు పెట్టించే అలాంటి ఒక జ్ఞాపకం.. కూతురి చదువు విషయంలో తానెంతో కటువుగా ప్రవర్తించటం! ప్రియాంకను ఏడేళ్ల వయసులో బోర్డింగ్ స్కూల్లో చేర్పించారు మధు చోప్రా‘‘నేను మంచి తల్లిని కాదేమో నాకు తెలీదు. ‘వద్దమ్మా.. ప్లీజ్..’ అని ఎంత వేడుకుంటున్నా వినకుండా నేను ప్రియాంకను బలవంతంగా బోర్డింగ్ స్కూల్లో చేర్పించాను. ప్రతి శనివారం సాయంత్రం నా డ్యూటీ అయిపోయాక ట్రెయిన్ ఎక్కి ప్రియాంకను చూడ్డానికి బోర్డింగ్ స్కూల్‌కి వెళ్లే దాన్ని. ప్రియాంక అక్కడ నా కోసం ఎదురు చూస్తూ ఉండేది. తను ఆ వాతావరణంలో ఇమడలేక పోయింది. ‘‘అమ్మా.. నేనూ నీతో ఇంటికి వచ్చేస్తా..’’ అని నన్ను చుట్టుకుపోయి ఏడ్చేది. ఆ ఏడుపు ఇప్పుడు గుర్తొస్తే నాకూ కన్నీళ్లొచ్చేస్తాయి. ‘లేదు, నువ్విక్కడ చదువుకుంటే భవిష్యత్తు బాగుంటుంది’ అని చెప్పేదాన్ని. తనకేమీ అర్థమయ్యేది కాదు. తన కోసం నేను ఆదివారం కూడా అక్కడే ఉండిపోయేదాన్ని. అది చూసి ప్రియాంక టీచర్ ఒకరోజు నాతో ‘మీరిక ఇక్కడికి రావటం ఆపేయండి’ అని గట్టిగా చెప్పేశారు..‘ అని ‘సమ్‌థింగ్ బిగ్గర్ టాక్ షో’ పాడ్‌కాస్ట్‌కు ఇచ్చిన తాజా ఇంటర్వ్యూలో చెప్పారు మధు చోప్రా.ప్రియాంక తండ్రి అశోక్ చోప్రాకు ప్రియాంకను బోర్డింగ్ స్కూల్లో చేర్పించటం అస్సలు ఇష్టం లేదు. అయితే మధు చోప్రా తన నిర్ణయాన్ని మార్చుకోకపోవటంతో వారిద్దరి మధ్య గొడవలయ్యాయి. కొంతకాలం ఒకరితో ఒకరు మాట్లాడటం మానేశారు కూడా. (ఇప్పుడు ఆయన లేరు). ఆనాటి సంగతులను గుర్తు చేసుకుంటూ – ‘‘ప్రియాంక తెలివైన అమ్మాయి. ఆ తెలివికి పదును పెట్టించకపోతే తల్లిగా నా బాధ్యతను సరిగా నెరవేర్చినట్లు కాదు అనిపించింది. అందుకే లక్నోలోని లా మార్టినియర్ బోర్డింగ్ స్కూల్లో చేర్పించాలనుకున్నాను. అందులో సీటు కోసం ప్రియాంక చేత ఎంట్రెన్స్ టెస్టు కూడా రాయించాను. తను చక్కగా రాసింది. అడ్మిషన్ వచ్చేసింది. ఆ విషయాన్ని నా భర్తకు చెబితే ఆయన నాపై ఇంతెత్తున లేచారు. ‘ఇదే నీ నిర్ణయం అయితే, వచ్చే ఫలితానికి కూడా నువ్వే బాధ్యురాలివి’ అని అన్నారు. ఏమైతేనేం చివరికి అంతా బాగానే జరిగింది. ప్రియాంక తన కాళ్లపై తను నిలబడింది’’ అని ΄ాడ్కాస్ట్ ఇంటర్వ్యూలో చె΄్పారు మధు చోప్రా.పిల్లల భవిష్యత్తు కోసం తల్లితండ్రులు వారిని దూరంగా ఉంచవలసి వచ్చినందుకు బాధపడటం సహజమే. అయితే పిల్లల్ని ప్రయోజకుల్ని చేసే యజ్ఞంలో ఆ బాధ ఒక ఆవగింజంత మాత్రమే. -
తోట కాని తోట : చిరస్థాయిగా నిలిచిపోయే తోట!
అరటి గెల, గుమ్మడికాయలు, పనస, పైనాపిల్... ఇవన్నీ తోటలో పండుతాయి. డిజైనర్ జెంజుమ్ ఇత్తడి నమూనాలతో ఇంట్లో ఎప్పటికీ నిలిచి ఉండే పండ్లను, కూరగాయలను సృష్టించాడు. ‘ప్రకృతికి, అతని తల్లికి, తన జీవితానికి గుర్తుగా వీటిని సృష్టించాను’ అని చెబుతాడు జెంజుమ్. అరుణాచల్ ప్రదేశ్‌లోని టిర్బిన్ అనే చిన్న గ్రామంలో జన్మించిన ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ జెంజుమ్. తన చిన్ననాటి జ్ఞాపకాలను బతికించుకోవాలన్నది అతని తాపత్రయం. వినోదం అందుబాటులో లేని ప్రదేశంలో పెరిగినందున, 1980లలో చిన్న పిల్లవాడిగా అతని తీరిక పనిలో చెట్లు ఎక్కడం, తేనెటీగలను వెంబడించడం, నదుల్లో ఈత కొట్టడం, చేపలు పట్టడం, పర్వతాలలో హైకింగ్ చేయడం వంటివి ఉన్నాయి. ప్రకృతి అతని ఏకైక ఆట స్థలం. ఇప్పుడు ఆ ప్రకృతినే తన తొలి ఆర్ట్ షో ‘అపాసే’ను ప్రదర్శనకు పెట్టాడు, ఇది బెంజుమ్ స్థానిక గాలో మాండలికంలో అక్షరాలా ’వివిధ రకాల పండ్లు’ అని అర్ధం.జ్ఞాపకాల తోట‘‘మా ఊరిలో ప్రతి ఇంటికీ తోట ఉంటుంది. పువ్వులకు బదులుగా వాటిలో కూరగాయలు, పండ్లు పండిస్తాం. రైతు అయిన నా తల్లి ఎప్పుడూ గ్రామంలోనే ఉంటూ తన జీవితమంతా మా తోటలో పండ్లు, కూరగాయలు పండిస్తూ ఉండేది. వాటికి విత్తనాలు నిల్వచేసేది. అక్కడ సమయం గడపడం నా సృజనాత్మక పనిని లోతుగా ప్రభావితం చేసింది. ప్రకృతితో ఈ కనెక్షన్ ఇప్పుడు నా డిజైన్లలోకి విస్తరించింది. ఆ జ్ఞాపకాలను మళ్లీ పునశ్చరణ చేసి, వాటికి ఒక సాక్షాత్కార రూపం ఇవ్వాలన్న నా ప్రయత్నమే ‘అపాసే’’’ అని బెంజుమ్ చెబుతారు. ఇత్తడి ఫ్రూట్స్ఇత్తడితో రూపొందించిన 16 త్రీ–డైమెన్షనల్ ఫ్రూట్ మోడల్ అద్భుతంగా అనిపిస్తుంది. ప్రతి ఒక్క కళారూపం బెంజుమ్ తల్లి తోట నుండి ఒక పండు, కూరగాయలను సూచిస్తుంది. ఈ డిజైన్స్‌తో బెంజుమ్ ప్రదర్శన కూడా నిర్వహించాడు. 12, 44 అంగుళాల అరటి గెల, పైనాపిల్స్, బొప్పాయిలు, జాక్‌ఫ్రూట్స్, నిమ్మకాయలు, గుమ్మడికాయలు, దానిమ్మపండ్లు – కళాకారుడి పనితీరును వెలుగులోకి తెచ్చాయి. అరుణాచల్ ప్రదేశ్‌లోని రూపా అనే చిన్న గ్రామంలో టిబెటన్ మఠాల కోసం సాంప్రదాయ ఇత్తడి వస్తువులను రూ పొందించడంలో నైపుణ్యం కలిగిన స్థానిక కళాకారులు ఉన్నారు. రాష్ట్రంలోని పశ్చిమాన ఉన్న తవాంగ్, ఆసియాలో అతి ప్రాచీనమైన, రెండవ అతిపెద్ద బౌద్ధ ఆశ్రమానికి నిలయం ఉంది. ఆ ఆశ్రమాలను సందర్శించిన బెంజుమ్ నిజమైన పండ్లను అచ్చులుగా ఉపయోగించడం, వాటిని శాశ్వతమైన ఇత్తడి ప్రదర్శనలుగా మార్చడంపై ఆసక్తిని పెంచింది. బెంజూమ్ ఢిల్లీలో నివసిస్తున్నాడు. తన ఢిల్లీ తోటలో బెంజుమ్ మామిడి, బొ΄్పాయి, అవకాడో, సీతాఫలం, అరటి, నిమ్మకాయలు వంటి వివిధ రకాల పండ్లను సీజన్‌ను బట్టి పండిస్తాడు. అయితే అతనికి ఇష్టమైనది నారింజ. ‘‘నారింజ చెట్లు సాధారణంగా ముళ్లతో ఉంటాయి, కానీ చెట్ల వయస్సు పెరిగే కొద్దీ ముళ్ళు తగ్గిపోతాయి. నారింజ పండ్లను కోయడం, స్నేహితులతో కలిసి ఆడుకోవడం, ముళ్ల నుండి వచ్చిన కొద్దిపాటి గాయాలను తీర్చే పండ్ల మాధుర్యం నాకు చిన్ననాటి జ్ఞాపకాలుగా ఉన్నాయి’’ అని బెంజుమ్ గుర్తు చేసుకుంటాడు. కళను బతికించాలి..ఈశాన్య ప్రాంతానికి ప్రాతినిధ్యం వహించే కొద్దిమంది డిజైనర్లు, కళాకారులలో బెంజుమ్ ఒకరు. ‘ప్రక్రియ నెమ్మదిగా ఉంది, కానీ మొత్తానికి ప్రారంభమైంది. ఇప్పుడు ఈ ప్రాంతం నుండి కొత్త తరం యువ కళాకారులు ఉద్భవించడాన్ని నేను గమనించాను. వారిలో ఈ కళ పట్ల అవగాహన పెంచాలి, సృజనాత్మకతను మెరుగుపరచాలి’ అని వివరిస్తాడు బెంజుమ్. బెంజుమ్ ప్రతిభ బట్టలు డిజైన్ చేయడం, సినిమాల్లో నటించడం వరకే కాదు ఇప్పుడు ఈ కళారూపాలతో బిజీ అయిపోతే తిరిగి పెద్ద స్క్రీన్‌పై ఎప్పుడు చూస్తామని అక్కడి వారు అడుగుతుంటారు. బెంజుమ్ నవ్వుతూ ‘ముందు చేస్తున్న పనిపైనే సంపూర్ణ దృష్టి పెడుతున్నాను’ అంటారు జెంజుమ్. -
పీట్ హెగ్సెత్కు మహిళలంటే గౌరవం లేదు
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ తన సొంత టీమ్‌ను ఏర్పాటు చేసుకొనే పనిలో నిమగ్నమయ్యారు. కీలక శాఖలకు మంత్రులుగా ఇప్పటికే పలువురి పేర్లు ప్రకటించారు. అధ్యక్షుడిగా ట్రంప్ పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత వీరంతా మంత్రులుగా మారబోతున్నారు. కానీ, ట్రంప్ ఎంపికల పట్ల విమర్శలు వస్తున్నాయి. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నవారిని, లైంగిక వేధింపుల కేసుల్లో ఇరుక్కున్నవారిని ట్రంప్ మంత్రులుగా ఎంపిక చేశారంటూ అసంతృప్త స్వరాలు గట్టిగానే వినిపిస్తున్నా యి. ఆయన వినిపించుకుంటున్న దాఖలాలు కనిపించడం లేదు. అమెరికా రక్షణ శాఖ మంత్రిగా ఎంపికైన పెటీ హెగ్సెత్(44)పై ఆయన సొంత తల్లి పెనెలోప్ హెగ్సెత్ ఆరోపణలు చేయడం సంచలనాత్మకంగా మారింది. తన కుమారుడికి మహిళలంటే ఏమాత్రం గౌరవం లేదని, చులకనగా చూస్తాడని ఆమె తప్పుపట్టారు. చాలాఏళ్లు మహిళలతో అతడు అభ్యంతకరంగా ప్రవర్తించాడని ఆక్షేపించారు. తన బిడ్డ ప్రవర్తన సరైంది కాదని పేర్కొన్నారు. ఈ మేరకు 2018లో తన కుమారుడికి పెనెలోప్ పంపించిన ఈ–మెయిల్‌ను న్యూయార్క్ టైమ్స్ పత్రిక బహిర్గతం చేసింది. ‘‘నువ్వు(పీట్ హెత్సెత్) మహిళలతో అనుచితంగా ప్రవర్తిస్తుంటారు. వారిని చాలా చులకనగా చూడడం నీకు అలవాటు. ఆడవాళ్ల గురించి నోటికొచ్చినట్లు అబద్ధాలు చెప్తుంటావు. తప్పుడు ప్రచారం చేయడం నీకు ఇష్టం. అందుకే నిన్ను నేను ఎప్పటికీ గౌరవించలేను. ఒక తల్లిగా నీ ప్రవర్తన పట్ల మౌనంగా ఉండాలని ప్రయత్నించా. కానీ, నీ భార్యను ఘోరంగా వేధించావు. ఆమె చాలా మంచి అమ్మాయి. ఆమె అనుభవించిన బాధ ను తెలుసుకొని సహించలేకపోయాను. నీ ప్ర వర్తన పట్ల మేమంతా విసుగెత్తిపోయాం’’అని ఈ–మెయిల్లో పెనెలోప్ తన ఆవేదన వ్యక్తం చేశారు. హెగ్సెత్ రక్షణ శాఖ మంత్రిగా ఎంపిక కావడంతో ప్రస్తుతం ఈ అంశం అమెరికాలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో పెనెలోప్ స్పందించారు. కోపం, ఆవేశంతో అప్పట్లో తన కుమారుడిపై ఆగ్ర హం వ్యక్తం చేస్తూ ఈ–మెయిల్ పంపించానని, ఆ తర్వాత అతడికి క్షమాపణ చెప్పానని వెల్లడించారు. ఇదిలా ఉండగా, పీట్ హెగ్సెత్కు వివాహేతర సంభంధాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇలాంటి సంబంధంతో ఓ బిడ్డకు కూడా జన్మనిచ్చినట్లు సమాచారం. -
మాటల్లో వర్ణించలేను: బుమ్రా భావోద్వేగం.. రోహిత్ శర్మ భార్య రితికా రిప్లై వైరల్(ఫొటోలు)
-
తల్లి, కుమారుడి దారుణహత్య
మండవల్లి/కైకలూరు: ఏలూరు జిల్లా మండవల్లి మండలం గన్నవరంలో శుక్రవారం రాత్రి తల్లి, కొడుకు దారుణహత్యకు గురయ్యారు. శనివారం తెల్లవారి చుట్టుపక్కలవారు మృతదేహాలను గమనించడంతో హత్యలు వెలుగులోకి వచ్చాయి. ఆస్తి తగాదాల నేపథ్యంలో వీరి హత్య జరిగినట్లు అనుమానిస్తున్నారు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గన్నవరం గ్రామానికి చెందిన రొయ్యూరు సుబ్బారావు, నాంచారమ్మ దంపతులకు నగేష్‌బాబు (55) సంతానం. అతడు పుట్టిన తర్వాత నాంచారమ్మ మరణించడంతో ఆమె చెల్లెలు భ్రమరాంబను సుబ్బారావు రెండో వివాహం చేసుకున్నాడు. వీరికి సురేష్ (35) సంతానం. సుబ్బారావు 20 సంవత్సరాల కిందట మరణించాడు. నగేష్‌బాబు విజయవాడలో డ్రైవర్‌గా స్థిరపడ్డాడు. ఐటీడీపీలో యాక్టివ్ మెంబర్‌గా కొనసాగుతున్న సురేష్ స్వగ్రామంలోనే ఉంటున్నాడు. ఈ కుటుంబానికి గన్నవరంలో 40 సెంట్ల పొలం, ఒక భవనం, 6 సెంట్ల స్థలం తండ్రి ఆస్తిగా ఉన్నాయి. వీటి విషయంలో నగేష్‌బాబు, సురేష్‌ల మధ్య విభేదాలున్నాయి.కోర్టుల్లో కేసులు కూడా ఉన్నాయి. ఇటీవల 40 సెంట్ల పొలాన్ని చెరిసగం పంచుకున్నారు. భవనం విషయంలో గొడవలు ముదిరాయి. సురేష్ భార్య గాయత్రి తండ్రి సంవత్సరీకం కావడంతో భార్య, భర్త, పిల్లలు గురువారం ముసునూరు వెళ్లారు. తల్లి ఇంటివద్ద ఒంటరిగా ఉందని సురేష్ శుక్రవారం గన్నవరం వచ్చేశాడు. ఈ నేపథ్యంలో అర్ధరాత్రి ద్విచక్ర వాహనాలపై వచ్చిన దుండగులు ఇంట్లో మంచంపై పడుకున్న సురేష్ మెడను కోసి హత్యచేశారు. బయట పడుకున్న భ్రమరాంబను తలపై నరికి చంపేశారు. శనివారం తెల్లవారిన తరువాత భవనం వరండాలో రక్తపుమడుగులో ఉన్న భ్రమరాంబను చుట్టుపక్కలవారు గమనించారు. వచ్చి చూడగా రెండు హత్యలు వెలుగులోకి వచ్చాయి. ఘటనాస్థలాన్ని ఏలూరు డీఎస్పీ శ్రవణ్‌కుమార్, కైకలూరు సీఐ వి.రవికుమార్, ఎస్ఐ రామచంద్రరావు పరిశీలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం కైకలూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ ఆస్తి వివాదాల నేపథ్యంలోనే ఈ హత్యలు జరిగినట్టు భావిస్తున్నామన్నారు. మొదటి భార్య కుమారుడు నగేష్‌బాబు పాత్రతో పాటు ఇతర కారణాలపై విచారిస్తున్నట్లు చెప్పారు. -
కన్న తల్లికి జవాన్ సర్ ప్రైజ్
-
అమెరికాలో ఉద్యోగాన్ని వదిలేసి, ఇండియాలో రూ.120 కోట్ల కంపెనీ
సాధించాలనే తపన, ఆత్మవిశ్వాసం ఉండాలేగానీ అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవచ్చు. అలా అమెరికాలో ఐదెంకల జీతం వచ్చే ఉద్యోగాన్ని సైతం విడిచిపెట్టి తానేంటో నిరూపించుకుంది అహానా గౌతమ్. ముఖ్యంగా తల్లిపై ఉన్న నమ్మకంతో ముందడుగు వేసి, రూ. 120కోట్ల కంపెనీకి అధిపతిగా మారింది. అహానా గౌతమ్ సక్సెస్ స్టోరీ ఏంటో తెలుసుకుందామా!రాజస్థాన్‌లోని ఒక చిన్న నగరానికి చెందిన అహానా గౌతమ్ ఐఐటీ బాంబేలో కెమికల్ ఇంజినీరింగ్ , హార్వార్డ్ బిజినెస్ స్కూల్ లో (2014-2016) ఎంబీఏ పట్టా పుంచుకుంది. ఆ తరువాత ప్రోక్టర్ అండ్ గ్యాంబుల్ (P&G)లో నాలుగేళ్లు ఉద్యోగం చేసింది. అక్కడే ఆరోగ్యకరమైన భారతీయ ఫుడ్‌ను పరిచయం చేయాలనే ఆలోచన వచ్చింది. అధిక బరువుతో ఉండే ఆమె హెల్దీ ఫుడ్ ప్రాముఖ్యతను గుర్తించింది. అంతే 30 ఏళ్ల వయసులో కీలక నిర్ణయం తీసుకుంది. కృత్రిమ రంగులు, రుచులు ,శుద్ధి చేసిన చక్కెరలో అధికంగా ఉండే జంక్ ఫుడ్ నుంచిన బయటపడాలని లక్ష్యంగా పెట్టుకుంది. సొంతంగా ఆరోగ్యవంతమైన ఆరోగ్యాన్ని అందించే వ్యాపారం ప్రారంభించాలని ఉద్యోగం వదిలి భారత్ కు తిరిగివచ్చింది. తల్లి ఇచ్చిన ఆర్థిక సాయంతో 2019లో ‘ఓపెన్ సీక్రెట్’ అనే స్టార్టప్ కంపెనీని స్థాపించింది. కేవలం మూడేళ్లలోనే కంపెనీ ఆదాయాన్ని రూ. 120 కోట్లకు చేరేలా శ్రమించింది. ఓపెన్ సీక్రెట్ వ్యవస్థాపక సీఈవోగా విజయపథంలో దూసుకుపోతోంది. అనేక సవాళ్ల మద్య 2024 నాటికి కంపెనీ టర్నోవర్ రూ. 100కోట్లుగా ఉంది.అహానా గౌతమ్ ఏమంటారంటే.."ఈ రోజు నేను ఇలా ఉన్నాను అంటే.. అది మా అమ్మ వల్లనే. ఆమె ఎప్పుడూ నాకు రెండు విషయాలు చెబుతుండేది: నంబర్ వన్ విద్య చాలా ముఖ్యం. మీరు ఎవరు? ఎక్కడ నుంచి వచ్చారన్నది ముఖ్యం కాదు. విద్యే మన ప్రపంచంలో మార్పు తీసుకొస్తుంది, రెండోది ఆర్థికంగా స్వతంత్రంగా ఉండటం, ఒకసారి ఆర్థిక సాధికారత సాధిస్తే, జీవితంలో ఎలాంటి నిర్ణయాలైనా సంతోషంగా తీసుకోవచ్చు." అమ్మ చెప్పిన ఈ మాటలే తనలో స్ఫూర్తినింపాయని, ఐఐటి-బాంబే, హార్వర్డ్ బిజినెస్ స్కూల్‌కు వెళ్లి చదవడానికి ప్రేరణ నిచ్చాయని తెలిపింది అహానా. చివరికి ధైర్యంగా ఒక కంపెనీ స్థాపనకు నాంది పలికాయని వెల్లడించింది.అంతే కంపెనీని ప్రారంభించే ముందు వివాహం చేసుకోవాలని అందరూ పట్టుబడితే తనకు అండగా నిలబడి, ఆర్థిక సాయాన్ని అందించి వెన్నుదన్నుగా నిలబడ్డారంటూ తల్లి గర్వంగా చెబుతుంది. అహానా తల్లి కోవిడ్ రెండో వేవ్‌లో కరోనా కారణంగా చనిపోయారు. -
డాక్టర్‌పై ఏడు సార్లు కత్తితో దాడి ఘటన.. కుమారుడ్ని సమర్థించిన తల్లి
చెన్నై: తన తల్లికి సరిగ్గా వైద్యం చేయలేదని కోపంతో ఆమె కుమారుడు విఘ్నేష్ డాక్టర్‌పై ఏడుసార్లు కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో నిందితుడు విఘ్నేష్‌ని సమర్థిస్తూ ఆమె తల్లి మాట్లాడారు. అయ్యా.. నా మీదున్న ప్రేమే.. నా కుమారుడితో ఇంత పనిచేయించింది. వాడి తప్పేమీ లేదు. నాకు క్యాన్సర్ ఉంది. కీమో థెరఫీ అవసరం లేదని డాక్టర్ బాలాజీ చెప్పి వెళ్లిపోయారు. నేను ఆయనకు ఏమైనా శత్రువునా? అని ప్రశ్నించారు.చెన్నైలో కలకలం రేపిన ప్రభుత్వ వైద్యుడిపై దాడి ఘటనలో నిందితుడి తల్లి మీడియాతో మాట్లాడారు. నాకు క్యాన్సర్ స్టేజ్ 5లో ఉంటే గిండి కలైజ్ఞర్ సెంటినరీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి వైద్యులు స్టేజ్ 2 క్యాన్సర్ ఉందని చెప్పారు. అలా ఎలా చెబుతారు? ఆర్థిక ఇబ్బందుల కారణంగా అడయార్ క్యాన్సర్ ఆస్పత్రిలో చికిత్స చేయించుకో లేకపోయాను. ఈ (కలైజ్ఞర్ సెంటినరీ) ఆస్పత్రికి వస్తే క్యాన్సర్ విభాగ వైద్యుడు బాలాజీ నాకు మరో కీమోథెరపీ అవసరం లేదని చెప్పి వెళ్ళిపోయారు. నేను ఆయనకు శత్రువునా? అని ప్రశ్నిస్తూ.. డాక్టర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. అనారోగ్య సమస్య గురించి చెబుతుంటే డాక్టర్ బాలాజీ నావైపు చూసేందుకు ఇష్టపడలేదు. నాపై ఉన్న ప్రేమ విఘ్నేష్‌తో ఇంత పనిచేయించింది. విఘ్నేష్ హార్ట్ పేషెంట్. మూర్ఛతో బాధపడుతున్నాడని విచారం వ్యక్తం చేశారు. Prof.Balaji Jagannathan, Professor & HOD, Medical Oncology, Govt Kalaignar Hospital, #Chennai, stabbed by 7 times by criminal from Peringalathur, whose mother ws being Rx fr stage 4 lung #Cancer at this hospital.Prof Balaji is very, very serious now. 🙏. #MedTwitter #medX pic.twitter.com/eG2uN3mKqp— Indian Doctor🇮🇳 (@Indian__doctor) November 13, 2024 ఏం జరిగిందంటే?చెన్నై గిండిలోని కలైజ్ఞర్ సెంటినరీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో విధులు నిర్వహిస్తున్న క్యాన్సర్ విభాగ వైద్యుడు బాలాజీపై చెన్నై పెరుంగళత్తూర్కు చెందిన 25 ఏళ్ల విఘ్నేష్ కత్తితో దాడి చేశాడు. దాడిపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. నిందితుడు విఘ్నేష్‌ను అదుపులోకి తీసుకున్నారు. అయితే క్యాన్సర్ సమస్యతో బాధపడుతున్న తన తల్లికి డాక్టర్ బాలజీ సరైన వైద్యం అందిచం లేదనే ఆవేదనతో దాడి చేసినట్లు నిందితుడు పోలీసులకు వాంగ్మూలం ఇచ్చాడు. అంతేకాదు, తన తల్లికి సరైన చికిత్స అందించకపోవడంపై డాక్టర్ బాలాజీని అడిగానని, వైద్య ఖర్చులు ఇవ్వాలని అడిగితే తనను కిందకి నెట్టివేశాడని, దీంతో కత్తితో దాడిచేసినట్లు పేర్కొన్నాడు. ప్రస్తుతం వైద్యుడిపై దాడి ఘటన సంచలనంగా మారింది. -
ఎంత పనిచేశావ్ నాన్న.. భార్య కాపురానికి రావడం లేదని మనస్థాపంతో
సిద్దిపేట : భార్య కాపురానికి రావడం లేదని మనస్తాపంతో ఓ భర్త తన ఇద్దరు పిల్లలతో చెరువులోకి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. సిద్దిపేట టూ టౌన్ పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ప్రింటింగ్ ప్రెస్ నిర్వహించే తేలు సత్యం ముదిరాజ్ (48) తేలు శిరీష (26) భార్యభర్తలు. వాళ్లిద్దరికి అశ్వన్ నందన్(7), త్రివర్ణ (5) ఇద్దరు పిల్లలు. కానీ విధికి ఆ చింతలేని కుటుంబాన్ని చూసి కన్నుకుట్టింది. హాయిగా సాగిపోతున్న సంసారంలో మనస్పర్ధలు చిచ్చు పెట్టాయి. దీంతో రెండో భార్య తేలు శిరీష కొన్నినెలల క్రితం భర్త సత్యంను వదిలి పుట్టింటికి వెళ్లింది.పలు మార్లు కాపురానికి రావాలని కోరినా.. శిరీష కనికరించలేదు. దీంతో మనోవేధనకు గురైన సత్యం ప్రాణాలు తీసుకునేందుకు సిద్ధమయ్యారు. తాను ప్రాణాలు తీసుకుంటే పిల్లలు అనాధలవుతారని భావించిన సత్యం.. తన పిల్లలు (రెండో భార్య పిల్లలు) అశ్వన్ నందన్, త్రివర్ణలతో కలిసి సిద్దిపేట చింతల చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నారు.తండ్రి పిల్లలు కలిసి చింతల చెరువులో దూకడాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. చింతల చెరువులో దూకి బాధితుల్ని కాపాడేందుకు ప్రయత్నించారు. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగింది. ముగ్గురి ప్రాణాలు అనంతలోకాల్లో కలిసిపోయాయి. ఘటనా స్థలానికి చేరుకున్న సిద్ధిపేట టూ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. -
కెనడాకు పోనివ్వలేదని కన్నతల్లినే హత్య చేశాడు
న్యూఢిల్లీ: మత్తు మహమ్మారికి బానిసైన పెద్దకుమారుడు కన్నతల్లినే చంపేసిన ఘటన దేశ రాజధానిలో చోటుచేసుకుంది. ఆగ్నేయ ఢిల్లీ పోలీస్ కమిషనర్ రవిసింగ్ తెలిపిన వివరాల ప్రకారం దక్షిణ ఢిల్లీలోని బాదర్పూర్ ప్రాంతంలోని మోలార్‌బంద్ గ్రామంలో 52 ఏళ్ల సుర్జీత్ సింగ్ భార్య గీత, పెద్దకుమారుడు కృష్ణకాంత్(31), చిన్న కుమారుడు సాహిల్ బోలీ(27) తో కలిసి ఉంటున్నారు. సుర్జీత్ స్తిరాస్థి వ్యాపారికాగా సాహిల్ ఒక బ్యాంక్‌లో పనిచేస్తున్నాడు. పెద్దకొడుకు కృష్ణకాంత్ మాత్రం తాగుడు, మత్తుపదార్థాలకు బానిసై ఖాళీగా తిరిగేవాడు. తల్లి గీత ఎంతచెప్పినా వినేవాడు కాదు. పైగా కెనడాలో ఉద్యోగం చేస్తా, అక్కడికి వెళ్లి సెటిల్ అవుతానని డబ్బులు ఇవ్వాలని తరచూ గొడవ చేసేవాడు.‘‘నీకు పెళ్లిచేస్తే అంతా సర్దుకుంటుంది. తొలుత పెళ్లి. ఆ తర్వాతే కెనడా ఆలోచన’అని తల్లి వారించేది. నవంబర్ ఆరో తేదీ సాయంత్రం సైతం ఎవరూలేని సమయంలో తల్లితో కృష్ణకాంత్ ఇదే విషయమై తీవ్ర వాగ్వాదం జరిగింది. పట్టరాని కోపంతో కత్తితో తల్లిని పలుమార్లు పొడిచి చంపేసి తండ్రికి ఫోన్‌చేసి రప్పించాడు. పై గదిలో తల్లి చనిపోయి పడిఉందని, క్షమాపణలు చెప్పి పైకి తీసుకెళ్లాడు. రక్తపుమడుగులో పడి ఉన్న భార్యను చూసి సుర్జీత్ నిశ్చేష్టుడై నిల్చుంటే కొడుకు గదికి బయటి నుంచి తాళం వేసి పారిపోయాడు.ఇరుగుపొరుగు వారి సాయంతో తండ్రి ఎలాగోలా బయటపడి తల్లిని దగ్గర్లోని అపోలో ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఆమె మృతిచెందిందని వైద్యులు ధృవీకరించారు. విషయం తెల్సుకున్న పోలీసులు అదే ప్రాంతంలో కృష్ణకాంత్‌ను అరెస్ట్‌చేసి హత్యకు కారణాలు అడిగారు. ‘‘నేను జీవితంలో ఎదగకపోవడానికి నా తల్లే కారణం. కెనడాకు వెళ్లకుండా నాకు వ్యతిరేకంగా ఆమె క్షుద్రపూజలు చేయిస్తోంది. నేనిలా ఉండటానికి ఆమే కారణం’’అని చెప్పాడు. డ్రగ్స్‌కు బానిసైన ఇతడు తల్లిని చంపేందుకు ముందే పథకరచన చేశాడని, గతంలో ఒక కత్తిని ఇందు కోసమే కొన్నాడని పోలీసుల దర్యాప్తులో తేలింది. -
ఆమే నాకు స్ఫూర్తి.. తల్లిపై కమలాహారిస్ భావోద్వేగ ట్వీట్
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రాట్ పార్టీ అభ్యర్థి కమలాహారిస్ ఎక్స్(ట్విటర్)లో ఆసక్తికర పోస్టు చేశారు. ఆదివారం(నవంబర్ 3) చేసిన ఈ పోస్టులో కమల తన తల్లి శ్యామలా గోపాలన్‌ను గుర్తు చేసుకున్నారు. తన తల్లి ధైర్యం, ధృడ నిశ్చయాలే తనను ఇక్కడిదాకా తీసుకువచ్చాయని, ఆమె స్ఫూర్తితోనే తాను జీవితంలో చాలా సాధించగలిగానని తెలిపారు.తన తల్లి శ్యామలా గోపాలన్ 19 ఏళ్ల వయసులో ఒంటరిగా భారత్ నుంచి అమెరికా వచ్చారని పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా హారిస్ చేసిన చాలా ప్రసంగాల్లో తన తల్లి గురించి ప్రస్తావించడం గమనార్హం. 19 ఏళ్ల వయసులో అమెరికా వచ్చిన కమల తల్లి శ్యామలా గోపాలన్ రొమ్ము క్యాన్సర్‌పై పరిశోధనలు చేశారు. My mother, Dr. Shyamala Gopalan Harris, came to the United States from India alone at the age of 19. Her courage and determination made me who I am today. pic.twitter.com/nGZtvz2Php— Vice President Kamala Harris (@VP) November 2, 2024కాలిఫోర్నియాలోని బర్కిలీ యూనివర్సిటీలో చదువుకుంటుండగా జమైకా నుంచి వలస వచ్చిన డొనాల్డ్ హారిస్‌తో శ్యామలకు పరిచయమైంది. అనంతరం ఇద్దరు పెళ్లి చేసుకున్నారు. 1960లో వీరికి కమల జన్మించారు. కమల ఐదో ఏట తల్లిదండ్రులు విడాకులు తీసుకున్నారు. అప్పటి నుంచి కమల, ఆమె చెల్లి మాయలు తల్లి శ్యామల సంరక్షణలోనే పెరిగారు.ఇదీ చదవండి: అమెరికాను హారిస్ నాశనం చేశారు..నేనొస్తే ఆర్థికంగా అద్భుతాలే -
కంటతడి పెట్టిస్తున్న అమ్మ ప్రేమ.. తెగిపడిన కుమారుడి తలను ఒడిలో పెట్టుకుని లాలిస్తూ.. రోదిస్తూ
లక్నో: అయ్యో బిడ్డా.. అప్పుడే నీకు నూరేళ్లు నిండాయా! ఉన్నతంగా చదువుకుని నన్ను, మీ నాయనను మంచిగా చూసుకుంటావని చెబితవిగా ..అప్పుడే ఇంత పనైందేంది బిడ్డా అంటూ.. అల్లంతా దూరాన మొండం.. పక్కనే తెగి పడిన కుమారుడి తలను ఒడిలోకి తీసుకుని లాలిస్తూ.. రోదిస్తున్న తీరు చూసి చూపరులు కన్నీటి పర్యంతమయ్యారు.ఉత్తరప్రదేశ్‌లో భూ తగాదా ఓ 17 ఏళ్ల అనురాగ్‌ను బలి తీసుకున్నాయి. రెండు వర్గాల మధ్య జరిగిన భూ తగాదాలో ఓ వర్గం ప్రత్యర్థి వర్గానికి చెందిన బాలుడిని తలను నరకడంతో భయానక వాతావరణం నెలకొంది.గౌరబాద్‌షాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కబీరుద్దీన్ గ్రామంలో రెండు వర్గాల మధ్య భూతగాదా కొన్నేళ్లుగా కొనసాగుతూ వస్తుంది. తాజాగా, బుధవారం రోజు ఘర్షణ హింసాత్మకంగా మారింది. భూ తగాదాలో రామ్ జీత్ యాదవ్ కుటుంబం సభ్యులపై ప్రత్యర్థి వర్గం దాడులకు తెగబడింది. ఈ దాడులు జరిగే సమయంలో ప్రత్యర్థులు మారణాయుధాలతో రామ్ జీత్ కుమారుడు అనురాగ్ వెంటబడ్డారు.నిందితుల్లో ఓ వ్యక్తి అనురాగ్ తలను పదునైన కత్తి నరికాడు. దీంతో అతడి తల, మొండెం వేరయ్యాయి. అనంతరం నిందితుడు పరారయ్యాడు. అయితే కుమారుడి మృతితో తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. కొన్ని గంటల పాటు కుమారుడి తలను ఒడిలోకి తీసుకొని గుండెలవిసేలా రోదిస్తున్న తల్లిని చూసేవారి కళ్ళు కూడా చెమర్చాయి. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. దారుణానికి ఒడిగట్టిన నిందితుడి కోసం పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. -
తల్లి పడిన కష్టాలు చెప్పి ఏడిపించిన హీరో కిరణ్ అబ్బవరం (ఫొటోలు)