
ప్రాణాపాయంలో ఉన్న కన్నబిడ్డల్ని కాపాడుకునేందుకు తల్లి(Mother) ఎంతటి సాహసానికైనా పూనుకుంటుంది. తన కంఠంలో ఊపిరి ఉన్నంతవరకు, ఎలాంటి కష్టాన్నైనా లెక్క చేయకుండా, తనబిడ్డల్ని రక్షించుకుంటుంది. ఆఖరికి కౄర మృగాలు ఎదురొచ్చినా సరే తన ప్రాణాలను ఫణంగా పెట్టైనా కన్నపేగు బంధాన్ని కాపాడుకుంటుంది. తాజాగా ఇలాంటి ఉదంతమొకటి పలువుర్ని ఆకట్టు కుంటోంది. తన కొడుకును కాపాడుకునేందుకు ఒక తల్లి పడిన ఆరాటం విశేషంగా నిలుస్తోంది.
కన్న కుమారుడిని కూతురిని కాపాడుకునేందుకు ఓ తల్లి ఏకంగా చిరుతపులితోనే కొట్లాడింది. తెగించి పోరాడి చిరుతను అ డ్డుకుని తన ప్రాణాలు పోకుండా అడ్డుపడింది. తీవ్రంగా గాయపడిన బాలుడు గ్వాలియర్‌లోని ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఆ బాలుడికి దాదాపు 120 గాయాలైనాయి. వీటికి శస్త్రచికిత్స జరిగింది. అయితే చిరుతపులి లాలాజలం నుండి ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం ఉన్నందున అతణ్ని నిశితంగా పరిశీలిస్తున్నారు. మధ్యప్రదేశ్‌లోని షియోపూర్ జిల్లాలోని కునో నేషనల్ పార్క్ సమీపంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. కెమెరా ట్రాప్ ఫుటేజ్ ఆధారంగా వేటాడే జంతువు చిరుతపులి అని అధికారులు నిర్ధారించారు.
చదవండి: నాలుగు వారాల కొరియన్ డైట్ ప్లాన్ : 6 రోజుల్లో 4 కిలోలు
ఆ తల్లి పేరు సురక్ష ధకాద్. తన తొమ్మిదేళ్ల బాలుడు అవినాష్ ధకాడ్‌పై చిరుతపులి దాడి చేయడాన్ని గమనించింది. మృత్యుముఖంలోకి జారిపోతున్నబిడ్డను కాపాడుకునేందుకు తన పంజా విసిరింది. సోమవారం కునో నుండి కేవలం 4 కి.మీ దూరంలో ఉన్న బఫర్ జోన్ అయిన విజయ్‌పూర్, షియోపూర్‌లోని ఉమ్రికాల గ్రామంలో జరిగిన ఆ భయంకరమైన దాడిని స్థానిక మీడియాకు వివరించింది. "నేను అక్కడికి చేరుకునేసరికి, చిరుత నా కొడుకుపై దాడి చేసింది. వాడిని చేయి పట్టుకుని నా వైపుకు లాగాను. 50 మంది అతన్ని అవతలి వైపు నుండి లాగుతున్నట్లు అనిపించింది. అయినా నా శక్తినంతా ఉపయోగించాను. చివరికి, నేను నా కొడుకును దాని నోటినుంచి నుండి బయటకు తీశాను, కానీ అతని ముఖమంతా గాయాలే. రక్తం ప్రవహిస్తోంది. ఈరోజు, నా కొడుకు సురక్షితంగా ఉన్నాడు అంటూ తెలిపింది. కొడుకు ముఖం , మెడలోకి తన గోళ్లు , దంతాలను ఎలా గుచ్చుకుపోయాయో వివరించింది. బాధితుడు అవినాష్ ధకాడ్ తన ఇంటి ప్రాంగణంలో ఆడుకుంటుండగా, అడవి జంతువు అకస్మాత్తుగా అతనిపైకి దాడి చేసిందని తెలిపింది. తన కొడుకు అరుపులు విన్న వెంటనే, సమీపంలో పశువులకు ఆహారం పెడుతున్న సురక్ష, సంఘటనా స్థలానికి చేరుకుని, అవినాష్ జంతువు పట్టులో చిక్కుకున్నట్లు గుర్తించింది. చాలా నిమిషాల పాటు పోరాటం జరిగింది, ఆ సమయంలో ఆమె తన కొడుకును విడిపించడానికి తీవ్రంగా పోరాడింది.
ఇదీ చదవండి : ట్రెండింగ్ కర్రీ బిజినెస్ : సండే స్పెషల్స్, టేస్టీ ఫుడ్
కార్బెట్ ఫౌండేషన్ ఏర్పాటు చేసిన కెమెరా ట్రాప్‌లు కూడా అదే గ్రామంలో చిరుతపులి కదలికలను నిర్ధారించాయని లయన్ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఉత్తమ్ శర్మ తెలిపారు. "ప్రతి చిరుతను ఒక పర్యవేక్షణ బృందం 24/7 పర్యవేక్షిస్తోంది. ప్రతి చిరుత కదలిక , అవి ఎక్కడికి వెళ్ళాయో మాకు ఖచ్చితంగా తెలుసు. మీరు చారిత్రక వాస్తవాలను పరిశీలిస్తే, ప్రపంచంలో ఎక్కడా చిరుతపులి మానవుడిపై దాడి చేసినట్లు నమోదు కాలేదు, ప్రాణాంతకమైనది కాదు. భారతదేశంలోని చిరుతలు భిన్నంగా ప్రవర్తిస్తాయని తాను భావించడం లేదన్నారు. అయితే, అటవీ శాఖ ఈ అవకాశాన్ని తోసిపుచ్చింది, దాడి చేసే విధానం చిరుతపులి లక్షణం అని పేర్కొంది.
ఉమ్రికాల గ్రామం విజయ్‌పూర్ నుండి 27 కి.మీ దూరంలో ఉంది కానీ కునో నేషనల్ పార్క్ నుండి కేవలం 4 కి.మీ దూరంలో ఉంది, ఇక్కడ చిరుతలను తిరిగి ప్రవేశపెట్టారు. దాడికి ఒక రోజు ముందు చిరుతను చూసినట్లు కొంతమంది గ్రామస్తులు నివేదించారు.
చదవండి: నాలుగు వారాల కొరియన్ డైట్ ప్లాన్ : 6 రోజుల్లో 4 కిలోలు
Comments
Please login to add a commentAdd a comment