భువనేశ్వర్:పది కేజీల బియ్యం కోసం జరిగిన గొడవ హత్యకు దారి తీసింది. అది కూడా కన్నకొడుకు తల్లిని గొడ్డలితో నరికి చంపే దాకా వెళ్లింది. ఈ దారుణ ఘటన ఒడిశాలోని శరత్‌చంద్రాపూర్‌లో జరిగింది. అన్నదమ్ములైన రోహిదాస్,లక్ష్మికాంత్‌సింగ్‌ల మధ్య గొడవలు జరుగుతున్నాయి.ఈ క్రమంలో రోహిదాస్ 10 కిలోల బియ్యం కోసం తల్లి రాయ్‌బరిసింగ్‌తో గొడవ పెట్టుకున్నాడు.
బియ్యం ఇవ్వడానికి ఆమె తిరస్కరించడంతో గొడవ కాస్తా సీరియస్ అయి రోహిదాస్ గొడ్డలితో తల్లిపై దాడి చేశాడు. గొడ్డలితో దాడి చేయడంతో తల్లి అక్కడికక్కడే ప్రాణాలు వదిలింది.అనంతరం రోహిదాస్ గొంతు కోసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు.
అయితే ప్రాణాలతో బయటపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. దాడికి ఉపయోగించిన గొడ్డలిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ఇదీ చదవండి: భర్త వివాహేతర సంబంధం..భార్యా,కుమారుడి ఆత్మహత్య
Comments
Please login to add a commentAdd a comment