Odisha
-
ఒడిశా పురుషుల హాకీ జట్టు సంచలనం... తొలిసారి జాతీయ టైటిల్ సొంతం
సుదీర్ఘ చరిత్ర కలిగిన జాతీయ సీనియర్ పురుషుల హాకీ చాంపియన్‌షిప్‌లో కొత్త చాంపియన్ అవతరించింది. చెన్నైలో శనివారం ముగిసిన ఈ ప్రతిష్టాత్మక చాంపియన్‌షి ప్లో ఒడిశా జట్టు తొలిసారి టైటిల్‌ను సొంతం చేసుకుంది. ఏకపక్షంగా సాగిన ఫైనల్లో ఒడిశా జట్టు 5–1 గోల్స్ తేడాతో మూడుసార్లు చాంపియన్ హరియాణా జట్టును బోల్తా కొట్టించి జాతీయ చాంపియన్‌గా నిలిచింది. ఒడిశా తరఫున శిలానంద్ లాక్రా (48వ, 57వ, 60వ నిమిషాల్లో) మూడు గోల్స్ సాధించగా... రజత్ ఆకాశ్ టిర్కీ (11వ నిమిషంలో), ప్రతాప్ లాక్రా (39వ నిమిషంలో) ఒక్కో గోల్ చేశారు. హరియాణా జట్టుకు జోగిందర్ సింగ్ (55వ నిమిషంలో) ఏకైక గోల్ అందించాడు.96 ఏళ్ల చరిత్ర కలిగిన జాతీయ చాంపియన్‌షిప్‌లో ఒడిశా జట్టుకిదే తొలి టైటిల్ కావడం విశేషం. మూడో స్థానం కోసం జరిగిన మ్యాచ్‌లో ఉత్తరప్రదేశ్ జట్టు 2–1తో మణిపూర్ జట్టును ఓడించింది. -
ఆంధ్రా ఒడిషా బోర్డర్లో పెద్దపులి కలకలం
సాక్షి,శ్రీకాకుళం: ఆంధ్రా-ఒడిశా బోర్డర్లో పెద్దపులి సంచారం కలకలం రేపుతోంది. పెద్దపులి కదలికలతో సరిహద్దు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అటవీ శాఖ అధికారులు హెచ్చరించారు. కాశీబుగ్గ రేంజ్ ఫారెస్ట్ అధికారి ఏ.మురళీకృష్ణ ఆదేశాల మేరకు ఇచ్ఛాపురం మండలంలోని పలు గ్రామాలలో పులి కోసం అటవీ సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టారు.ఒంటరిగా రాత్రిపూట పొలాలకు వెళ్లొద్దని గ్రామస్తులకు అటవీ అధికారులు సూచించారు.ఇటీవలే ఒడిశాలోని గంజాం జిల్లా జయంతిపురంలో యువకుడిపై పెద్దపులి దాడిచేసి తీవ్రంగా గాయపరిచింది.ఇదీ చదవండి: AP: ఆమెకు టెర్రర్ -
Namami Gange గంగానదిపై మహిళా జవాన్లు
శుభ్రత ఎక్కడుంటే మహిళలు అక్కడుంటారు. లేదా, మహిళలు ఎక్కడుంటే శుభ్రత అక్కడ ఉంటుంది. శుభ్రంగా ఉంచటం అన్నది మహిళల సహజ నైజం. మహిళలే కాదు, దైవత్వం కూడా శుభ్రత ఉన్న చోట కొలువై ఉంటుంది. ‘క్లీన్లీనెస్ ఈజ్ నెక్స్›్ట టు గాడ్లీనెస్’ అనే మాట వినే ఉంటారు.ఇంటిని, సమాజాన్ని శుభ్రంగా ఉంచటంలో కీలక బాధ్యతను వహిస్తున్న మహిళలే ఇప్పుడు తాజాగా దైవకార్యం వంటి ‘స్వచ్ఛ గంగా’ ఉద్యమ ప్రచారాన్ని చేపట్టారు. గంగానదిని ప్రక్షాళన చేయవలసిన అవసరం గురించి, గంగా ప్రవాహానికి అడ్డుగా ఉన్న చెత్తాచెదారాన్ని తొలగించటం గురించి ప్రజల్లో అవగాహన కలిగించటం కోసం మొత్తం 20 మంది మహిళలు గంగానదిపై నవంబర్ 4న రెండు తెప్పల్లో ర్యాలీగా బయల్దేరారు! ఉత్తరాఖండ్, తెహ్రీ ఘరేవాల్ జిల్లాలోని దేవప్రయాగ పట్టణం నుంచి మొదలైన ఈ ‘ఆల్ ఉమెన్ రివర్ ర్యాఫ్టింగ్’... మొత్తం 2,500 కి.మీ. దూరాన్ని 53 రోజుల పాటు ప్రయాణించి డిసెంబర్ 26న పశ్చిమబెంగాల్లోని గంగా సాగర్ వద్ద ముగుస్తుంది. అందరూ మహిళలే ఉన్న ఇలాంటి ఒక సుదీర్ఘమైన రివర్ ర్యాఫ్టింగ్ దేశంలో జరగడం ఇదే మొదటిసారి. మరొక విశేషం కూడా ఉంది. వీళ్లంతా బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బి.ఎస్.ఎఫ్) దళానికి చెందిన మహిళలు. బి.ఎస్.ఎఫ్. మహిళా విభాగం, ‘నమామి గంగే’ ప్రాజెక్టు కలిసి ఉమ్మడిగా ఈ రివర్ ర్యాఫ్టింగ్ను నిర్వహిస్తున్నాయి. ర్యాఫ్టింగ్ ప్రారంభానికి ముందు మహిళా శక్తికి, సాధికారతకు సంకేతంగా 11 మంది బాలికల పాదాలకు నమస్కరించి పూజలు జరిపారు. ఆ తర్వాత ‘తెప్పలు’ కదిలాయి. ఈ ప్రచారానికి బి.ఎస్.ఎఫ్. సబ్ ఇన్స్పెక్టర్ ప్రియా మీనా నాయకత్వం వహిస్తున్నారు. దేశ సరిహద్దుల్లో విధి నిర్వహణలో ఉన్న మహిళా జవాన్లలో 20 మందిని కఠిన ర్యాఫ్టింగ్ శిక్షణ తర్వాత ఇందుకోసం ఎంపిక చేశామని మీనా అన్నారు. ‘‘రెండు తెప్పలుగా సాగే ఈ బోటింగ్ యాత్రలో భాగంగా గంగా తీరం వెంబడి 43 పట్టణాలలో ఈ తరం యువతీ యువకులకు ‘పరిశుభ్రతకు, నిరంతరాయ ప్రవాహానికి’ అనువుగా గంగానదిని ప్రక్షాళన చేయాలన్న సందేశాన్ని అందిస్తాం’’ అని ఆమె తెలి΄ారు. మరొక విశేషం.. వీరితో జలశక్తి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ‘నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగ’ చేతులు కలపటం. శుభ్రత దైవంతో సమానం అన్నప్పుడు, దైవ సమానంగా భారతీయులు కొలిచే గంగానదిని శుభ్రంగా ఉంచాలన్న సందేశంతో ప్రచారోద్యమం చేపట్టిన మహిళాశక్తి కూడా కొలవదగినదే. స్తుతించతగినదే. వారి మాట ఆలకించతగినదే. -
కోణార్క్ సూర్య రథచక్రం రాష్ట్రపతి భవనంలో...
ఒడిశాలోని కోణార్క్ సూర్య దేవాలయం యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశం. ఈ కోణార్క్ సూర్య రథ చక్రాన్ని పోలిన నాలుగు ఇసుకరాయి ప్రతిరూపాలను ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ కల్చరల్ సెంటర్ అమృత్ ఉద్యాన్ లో ఏర్పాటు చేశారు.కోణార్క్ చక్రం భారతదేశ సాంస్కృతిక వారసత్వానికి చిహ్నం. సాంస్కృతిక, చారిత్రక అంశాలను సందర్శకులకు పరిచయం చేసే దశల్లో భాగంగా, భారతదేశం గొప్ప వారసత్వాన్ని తెలుసుకోవడానికి ప్రోత్సహించే లక్ష్యంతో దీనిని ఏర్పాటు చేసినట్టు రాష్ట్రపతి కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది.కోణార్క్ సూర్య దేవాలయం యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్లో ఒకటి. ఒడిషా ఆలయ నిర్మాణ శైలికి పరాకాష్టగా దీనిని చెప్పుకోవచ్చు. ఇది సూర్య భగవానుడిని మోసుకెళ్లే బృహత్తర రథం ఆకారంలో నిర్మించబడింది. (చదవండి: అమెరికాలో ... శాస్త్రీయ నృత్య రూపకంగా దుర్యోధనుడు) -
బాలాసోర్ దుర్ఘటన కేసు: ముగ్గురు నిందితులకు బెయిల్
భువనేశ్వర్: ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలో గతేడాది జరిగిన రైలు ప్రమాదం దేశవ్యాప్తంగా సంచలన సృష్టించింది. ఈ విషాద ఘటనలో 290 మందికి పైగా మృతిచెందారు. ఈ ప్రమాద ఘటన కేసులో అరెస్టైన ముగ్గురు నిందితులకు ఒరిస్సా హైకోర్టు మంగళవారం షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.నిందితులు మొహమ్మద్ అమీర్ ఖాన్, అరుణ్ కుమార్ మహంత , పప్పు యాదవ్‌లను జులై 7, 2023న సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(సీబీఐ).. ప్రమాదం జరగడానికి నిర్లక్ష్యం వహించిన కారణంగా అరెస్టు చేసిన విషయం తెలిసిందే. జస్టిస్ ఆదిత్య కుమార్ మోహపాత్ర నేతృత్వంలోని సింగిల్ జడ్జి బెంచ్.. ఒక్కొక్కరికి రూ.50 వేల పూచికత్తుతో బెయిల్ మంజూరు చేయాలని ఆదేశించింది.షాలిమార్-చెన్నై సెంట్రల్ కోరమాండల్ ఎక్స్‌ప్రెస్, బెంగళూరు-హౌరా సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్, గూడ్స్ రైలు 2 జూన్, 2023న బాలాసోర్‌లోని బహనాగా బజార్ స్టేషన్ సమీపంలో ఢీకొన్నాయి. ఈ ఘనటలో 290 మందికి పైగా మరణించగా.. సుమారు 1,200 మందికి పైగా గాయపడ్డారు.అయితే.. ఉన్నత స్థాయి రైల్వే విచారణలో ప్రమాదానికి ప్రధాన కారణం.. తప్పు సిగ్నలింగ్ అని తేలింది. -
కృనాల్ పాండ్యా సెంచరీ.. హ్యాట్రిక్ విజయాలు.. హార్దిక్ పోస్ట్ వైరల్
రంజీ ట్రోఫీ 2024-25 ఎడిషన్‌లో బరోడా జట్టు కెప్టెన్ కృనాల్ పాండ్యా జోరు కొనసాగుతోంది. ఇప్పటికే రెండు హాఫ్ సెంచరీలు చేసిన ఈ బ్యాటింగ్ ఆల్‌రౌండర్.. తాజాగా శతకంతో మెరిశాడు. ఒడిశాతో మ్యాచ్‌లో 143 బంతులు ఎదుర్కొని 119 పరుగులు సాధించాడు. కృనాల్ ఇన్నింగ్స్‌లో 15 ఫోర్లు, 4 సిక్సర్లు ఉన్నాయి.ఇక ఈ మ్యాచ్‌లో బరోడా ఒడిషాపై ఏకంగా ఇన్నింగ్స్ 98 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ నేపథ్యంలో టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా తన అన్న కృనాల్ పాండ్యాపై ప్రశంసలు కురిపించాడు. ‘‘మా అన్నయ్య.. ముందుండి జట్టును నడిపిస్తున్నాడు. టాప్ సెంచరీ.. నీ శ్రమకు తగ్గ ఫలితం’’ అంటూ ఇన్‌స్టా స్టోరీలో రాసుకొచ్చాడు.కాగా రంజీ తాజా సీజన్లో కృనాల్ పాండ్యా సారథ్యంలోని బరోడా వరుస విజయాలతో దూసుకుపోతోంది. తొలి మ్యాచ్‌లో ముంబైని 84 పరుగుల తేడాతో చిత్తు చేసిన ఈ జట్టు.. రెండో మ్యాచ్‌లో సర్వీసెస్‌ను 65 రన్స్ తేడాతో ఓడించింది. ఈ క్రమంలో వడోదర వేదికగా ఒడిశా జట్టుతో శనివారం మొదలైన మ్యాచ్‌లో టాస్ ఓడిన బరోడా తొలుత బౌలింగ్ చేసింది.అయితే, బరోడా బౌలర్ల ధాటికి ఒడిశా బ్యాటర్లు ఎక్కువసేపు క్రీజులో నిలవలేకపోయారు. తొలి ఇన్నింగ్స్‌లో 193 పరుగులకే ఆలౌట్ అయ్యారు. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన బరోడాకు ఓపెనర్ శైవిక్ శర్మ(96) శుభారంభం అందించగా.. మిడిలార్డర్లో విష్ణు సోలంకి(98) దుమ్ములేపాడు. ఇక వీరికి తోడుగా కృనాల్ పాండ్యా కెప్టెన్ ఇన్నింగ్స్‌తో అలరించాడు. ఫలితంగా బరోడా మొదటి ఇన్నింగ్స్‌లో 456 పరుగులు చేసి.. 263 పరుగులు ఆధిక్యంలో నిలిచింది.అయితే, బరోడా బౌలర్లు మరోసారి చెలరేగడంతో ఒడిశా 165 పరుగులకే కుప్పకూలింది. ఈ క్రమంలో సోమవారం నాటి మూడో రోజు ఆటలోనే ఫలితం తేలింది. బరోడా ఒడిశాపై ఇన్నింగ్స్ 98 రన్స్ తేడాతో జయభేరి మోగించి హ్యాట్రిక్ విజయాన్ని నమోదు చేసింది. కాగా హార్దిక్ పాండ్యా సౌతాఫ్రికా పర్యటన సందర్భంగా పునరాగమనం చేయనున్నాడు.చదవండి: Ind vs Aus: 17 కిలోల బరువు తగ్గి.. ఆసీస్ టూర్‌కు ఎంపికైన పేసర్ View this post on Instagram A post shared by Krunal Himanshu Pandya (@krunalpandya_official) -
ఒడిశాకు తప్పిన తుఫాను ముప్పు: సీఎం మోహన్
న్యూఢిల్లీ:'దానా' తుఫాను ఒడిశా తీరం దాటిన నేపధ్యంలో ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ పరిస్థితిని సమీక్షించారు. ఇకపై రాష్ట్రం సురక్షితమని, అధికారుల టీమ్ వర్క్ కారణంగా ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని ఆయన పేర్కొన్నారు.విలేకరుల సమావేశంలో సీఎం మాఝీ మాట్లాడుతూ, ఇప్పటివరకు ఎనిమిది లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించామని, విద్యుత్ లైన్ల పునరుద్ధరణ పనులు కొనసాగుతున్నాయన్నారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో సహాయక చర్యలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు. ‘ఒడిశా ఇప్పుడు సురక్షితంగా ఉంది. తుఫాను తాకిడి తరువాత, పరిస్థితిని సమీక్షించాము. అధికారుల సమిష్టి కృషి కారణంగా, ఎటువంటి ప్రాణనష్టం వాటిల్లలేదు. మేము ఎనిమిది లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించాం. సహాయ కేంద్రాల్లో వారికి వసతి కల్పించాం. విద్యుత్ లైన్ల మరమ్మతు పనులు జరుగుతున్నాయి. 1.75 లక్షల హెక్టార్లలో పంటలు నాశనమైనమయ్యాయి. బుధబలంగ నది ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది’ అని పేర్కొన్నారు. The deep depression (remnant of severe cyclonic storm “DANA”) over north Odisha remained practically stationary during past 6 hours, weakened into a Depression over the same region and lay centred at 2330 hrs IST of yesterday, the 25th October near latitude 21.4°N and longitude… pic.twitter.com/Bb7LrXjHTT— India Meteorological Department (@Indiametdept) October 25, 2024'దానా' తుఫాను గంటకు ఏడు కి.మీ వేగంతో వాయువ్య దిశగా కదులుతున్నట్లు భారత వాతావరణ శాఖ ఒక పోస్ట్‌లో ఒకటి తెలిపింది. ఇది ఉత్తర ఒడిశా మీదుగా పశ్చిమ దిశలో పయనించి, రానున్న 12 గంటల్లో మరింత బలహీనపడే అవకాశం ఉందని పేర్కొంది. తుఫాను ప్రభావం గురించి భారత వాతావరణ శాఖ సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ సోమనాథ్ దత్తా మాట్లాడుతూ ఒడిశాలోని కొన్ని జిల్లాల్లో ఒకటి రెండు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ఇక తుపాను ప్రభావం గురించి పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.ఇది కూడా చదవండి: అందరి చూపు షిల్లాంగ్ వైపే -
దానా దంచేస్తోంది
-
దానా తుపాను : 86 రైళ్లు రద్దు చేయడంతో ప్రయాణికులు తిప్పలు (ఫొటోలు)
-
భోజనం తింటే..బుల్లెట్ బండి ఫ్రీ
-
దానా తుఫాన్ ఉగ్రరూపం
-
ఒడిశా-బెంగాల్లో 'దానా' విధ్వంసం (ఫొటోలు)
-
తీరం దాటిన ‘దానా’ తీవ్ర తుపాను
సాక్షి, విశాఖపట్నం: తీవ్ర తుపాను ‘దానా’ తీరం దాటింది. అర్ధరాత్రి 1:30 నుండి 3:30 మధ్య తీరాన్ని తాకింది. ఒడిశాలోని బిత్తర్‌కని నేషనల్ పార్క్, ధమ్రా మధ్య తీరాన్ని తాకినట్టు వాతావరణ శాఖ ప్రకటించింది. తీరం దాటే సమయంలో గంటకు 110 నుంచి 120 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి. ఒడిశా సముద్ర తీరం అల్లకల్లోలంగా మారింది. ఉత్తరాంధ్ర పోర్టుల్లో మూడో నెంబర్ ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరించారు. భద్రక్, జగత్సింగ్పూర్, బాలాసోర్‌లో భారీ వర్షం కురుస్తోంది. పలు చోట్ల చెట్లు, విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి. ఒడిశాలో 7వేల పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. లొతట్టు ప్రాంతాల్లోని హైరిస్క్ జోన్ల నుంచి ఆరు లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. తుపాను ప్రభావంతో ఏకంగా 400లకు పైగా రైళ్లు రద్దు అయ్యాయి. కోల్‌కతా, భువనేశ్వర్ ఎయిర్‌పోర్ట్‌ల్లో సేవలను గురువారం సాయంత్రం నుంచే నిలిపివేశారు.బంగాళాఖాతంలో ఏర్పడిన దానా తుపాను కదలికలను ఇస్రో ప్రయోగించిన ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ (ఈఓఎస్–06), ఇన్శాట్–3డీఆర్ ఉపగ్రహాలు ఎప్పటికప్పుడు సమాచారాన్ని అందిస్తూ వస్తున్నాయని ఇస్రో తన అధికారిక వెబ్సైట్లో గురువారం తెలియజేసింది. 2022 నవంబర్ 26న పీఎస్ఎల్వీ సీ–54 రాకెట్ ద్వారా ప్రయోగించిన ఈఓఎస్–06, 2016 సెప్టెంబర్ 8న జీఎస్ఎల్వీ ఎఫ్–05 రాకెట్ ద్వారా ప్రయోగించిన ఇన్శాట్–3డీఆర్ ఉపగ్రహాలు విపత్తులను ముందస్తుగా గుర్తించి మానవాళికి మేలు చేస్తుండటంలో ప్రముఖపాత్ర పోషిస్తున్నాయనడానికి ఇదే నిలువెత్తు నిదర్శనం.ఈ నెల 20న బంగాళాఖాతంలో ఏర్పడిన తుపాను సముద్రపు గాలి నమూనాలను బట్టి ఈఓఎస్–06 ఉపగ్రహం ముందస్తుగా గుర్తించింది. మేఘాలను బట్టి ఇన్శాట్–3డీఆర్ ఉపగ్రహం ఈ తుపానును ముందస్తుగా గుర్తించింది. తుపాను బెంగాల్, ఒడిశా మీదుగా వెళ్లి తీరం దాటింది. ఈ విషయాన్ని ఈ రెండు ఉపగ్రహాలు ముందస్తుగా ఇచ్చిన సమాచారంతో అధికారులు అప్రమత్తమై ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడానికి ఉపయోగపడ్డాయి. దీనివల్ల ఆస్తినష్టం, ప్రాణనష్టం వాటిల్లకుండా చర్యలు తీసుకునే అవకాశం చిక్కింది. -
భయపెడుతున్న దానా.. ప్రచండ గాలులతో వర్ష సూచన!
Dana Cyclone Updates:తీవ్ర తుఫానుగా ‘దానా’ వాయువ్య బంగాళాఖాతంలో కదులుతోంది. గడిచిన 6 గంటల్లో 12 కి.మీ వేగంతో ఉత్తర వాయువ్య దిశగా తుపాను కదులుతోంది. పారాదీప్ (ఒడిశా)కు ఆగ్నేయంగా 260 కి.మీ, ధమర (ఒడిశా)కి 290 కి.మీ, సాగర్ ద్వీపానికి (పశ్చిమ బెంగాల్) దక్షిణంగా 350 కి.మీ దూరంలో తుపాను కేంద్రీకృతం అయినట్లు వాతావరణ అధికారుతెలిపారు.దానా తుపాను ప్రభావంతో ఒడిశాలో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ డైరెక్టర్ మనోరమా మొహంతి తెలిపారు. ఈ రాత్రి (గురువారం) అత్యధిక వేగంతో గాలి వీస్తుందని చెప్పారు.‘‘ దానా తుపాను గత అర్ధరాత్రి తీవ్ర తుఫానుగా మారింది. ఇది గత 6 గంటల్లో 12 కి.మీ/గంట వేగంతో వాయువ్య దిశగా కదులుతోంది. బంగాళాఖాతం వాయువ్య దిశలో తీవ్ర తుపానుగా కదులుతోంది’’అని అన్నారు.#WATCH | Bhubaneswar, Odisha | On cyclone 'Dana', Director IMD, Manorama Mohanty says, "The cyclone Dana has intensified into a severe cyclonic storm in last midnight and it is moving north-westward with the speed 12km/hr during last 6 hours and now it is lying over central and… pic.twitter.com/Cff2mVTNgh— ANI (@ANI) October 24, 2024దానా తుపాను భయపెడుతున్న నేపథ్యంలో తీరం దాటకముందే ఒడిశా ప్రభుత్వం అప్రమత్తమైంది. సుమారు 10 లక్షల మందిని తరలించాలని ప్రభుత్వం అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ దానా తుపాను.. గురువారం లేదా శుక్రవారం భిటార్కనికా , ధమ్రా మధ్య తీరం దాటనుందని వాతావరణ శాఖ అధికారలు తెలిపారు. మరోవైపు.. దానా తుపాను నేపథ్యంలో పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం కూడా అప్రమత్తమై.. కోల్‌కతా, భువనేశ్వర్ విమానాశ్రయాల్లో నేటి నుంచి రేపు(శుక్రవారం) ఉదయం వరకు కార్యకలాపాలు నిలిపివేసింది.#CycloneDanaLies around 200kms off #Odisha coast at 5.30 am IST on 24th Oct. It is likely to landfall today evening/night (a tough time for relief personnel due to darkness) as a very severe cyclonic storm with expected windspeed of 120 kmph.Take care.@Windycom @zoom_earth pic.twitter.com/6PxsR7MGnS— Prof RV (@TheTechocrat) October 24, 2024 ఒడిశాలోని అనేక తీర జిల్లాల నుంచి దాదాపు 10 లక్షల మంది ప్రజలను తరలించడానికి ఒడిశాలోని అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. భారత వాతావరణ శాఖ (IMD) ప్రకారం.. 120 కిలోమీటర్ల వేగంతో కదులుతున్న ఈ దానా తుపాను ఒడిశాలోని సగం జనాభా ప్రభావం చూపే ప్రమాదం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.It appears that #Dana is approaching #Cyclone strength and Category 2+ is on the cards as it approaches #India. Hopefully dry air will weaken it before landfall#wx #wxtwitter #tropicswx #CycloneDana #CycloneAlert pic.twitter.com/R8McN71Fnv— Hurricane Chaser Chase (@hurricane_chase) October 24, 2024 ఈ తుపాను బుధవారం రాత్రి 11.30 గంటల సమయానికి పారాదీప్ (ఒడిశా)కి ఆగ్నేయంగా 330 కి.మీల దూరంలో, ధమర (ఒడిశా)కి 360 కి.మీ దక్షిణ-ఆగ్నేయంగా, సాగర్ ద్వీపానికి (పశ్చిమ బెంగాల్) దక్షిణ-ఆగ్నేయంగా 420 కి.మీ దూరంలో కేంద్రీకృతమై ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అయితే.. ఈ తుపాను ఒడిశాలోని భిటార్కనికా నేషనల్ పార్క్ , ధామ్రా ఓడరేవుల మధ్య తీరం దాట వచ్చని వాతావరణ అధికారులు అంచనా వేస్తున్నారు.In view of Cyclone DANA's impact on the coastal region of West Bengal, including Kolkata, it has been decided to suspend the flight operations from 1800 IST on 24.10.2024 to 0900 IST on 25.10.2024 due to predicted heavy winds and heavy to very heavy rainfall at Kolkata. pic.twitter.com/jhd4E7S3NS— Kolkata Airport (@aaikolairport) October 23, 2024 మరోవైపు.. దానా తుపాను ప్రభావంతో పశ్చిమ బెంగాల్‌లోని ఉత్తర, దక్షిణ 24 పరగణాలు, పుర్బా , పశ్చిమ మెదినీపూర్, ఝర్గ్రామ్, కోల్‌కతా, హౌరా , హుగ్లీ జిల్లాల్లో గురువారం, శుక్రవారం భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలోనే కోల్‌కతా విమానాశ్రయం గురువారం సాయంత్రం 6 గంటల నుండి రేపు(శుక్రవారం) ఉదయం 9 గంటల వరకు విమాన కార్యకలాపాలను నిలిపివేసింది.🚨 Breaking NewsDon't be alarmed by potential storm 'seeds'.Be careful,be safe. Life is precious.I strongly believe that we all can successfully face the storm this time together as before. #EveryLifeIsPrecious #CycloneDana #Odisha#CycloneDana#BRICS2024 pic.twitter.com/a4bGjDLG3L— Akhilesh Yadav (@Akhiles61939129) October 24, 2024 అదేవిధంగా భువనేశ్వర్ విమానాశ్రయం ఈరోజు సాయంత్రం 5 నుండి శుక్రవారం ఉదయం 9 గంటల వరకు విమాన కార్యకలాపాలను నిలిపివేయనున్నట్టు తెలుస్తోంది. ఇక.. దానా తుపాను నేపథ్యంలో ఒడిశా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల మీదుగా నడిచే దాదాపు 200 రైళ్లను రద్దు చేశారు. ఒడిశాలో, బుధవారం సాయంత్రం నాటికి సుమారు 3 లక్షల మందిని, పశ్చిమ బెంగాల్ 1.14 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. -
‘దానా’ తుపాన్ టెన్షన్.. ఏపీకి భారీ వర్ష సూచన
సాక్షి విశాఖపట్నం: బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర తుపాను ‘దానా’ టెన్షన్ పెడుతోంది. బుధవారం ఉదయానికి తుపానుగా, గురువారం తెల్లవారుజామున తీవ్ర తుపానుగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. తుపాను ప్రభావంతో ఏపీలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.దానా తుపాను ముప్పు ఏపీ, ఒడిశా, పశ్చిమబెంగాల్, తమిళనాడుకు పొంచి ఉంది. ఒడిశా, బెంగాల్ వద్ద తీరం దాటే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ భావిస్తోంది. పశ్చిమ మధ్య బంగాళాఖాతం తీరం వెంబడి గంటకు 45-65 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. దీని ప్రభావంతో విజయనగరం, పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయి. మరో నాలుగు రోజులు అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశముంది. ఇక, తమిళనాడులో ఈశాన్య రుతుపవనాలు చురుకుగా కదులుతున్నాయి. వీటి ప్రభావంతో రాయలసీమలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.మరోవైపు.. బెంగాల్లో ఏడు జిల్లాలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించారు. రెడ్ అలర్ట్ ప్రకటించింది. దీంతో, అధికారులు అప్రమత్తమయ్యారు. సహయక చర్యలు చేపట్టారు. ఇక, తుపాను నేపథ్యంలో పలు రైలు సర్వీసులను రైల్వే శాఖ రద్దు చేసింది. 23, 24, 25వ తేదీల్లో తూర్పు కోస్తా రైల్వే పరిధిలో పలు రైళ్లను రద్దు చేశారు. గురువారం అత్యధికంగా 37 సర్వీసులు రద్దయ్యాయి. అలాగే, విశాఖ-భువనేశ్వర్ మధ్య రాకపోకలు సాగించే వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలును 24న రద్దు చేశారు.24న రద్దు చేసిన రైళ్లు..సికింద్రాబాద్ - భువనేశ్వర్హైదరాబాద్ - హౌరాసికింద్రాబాద్ - హౌరాసికింద్రాబాద్ - మల్దాటౌన్25న రద్దు చేసిన రైళ్లు:..హౌరా - సికింద్రాబాద్షాలిమార్ - హైదరాబాద్సిల్చార్ - సికింద్రాబాద్ #CycloneDana beauty in bay. Massive intensification seen under favorable conditions. First set of rains from cyclone feeder bands will commence in coastal parts of #Odisha from today evening. Stay tuned for more updates. #Danacyclone pic.twitter.com/o0oro4X4ZX— Eastcoast Weatherman (@eastcoastrains) October 23, 2024 -
64 ఏళ్ల వయసులో ఎంబీబీఎస్ సీటు : రిటైర్డ్ ఉద్యోగి సక్సెస్ స్టోరీ
ఒక్కసారి ఉద్యోగంలో చేరి సంసార బాధ్యతల్లో చిక్కుకున్న తరువాత తమ కిష్టమైంది చదువుకోవడం అనేది కలే, దాదాపు అసాధ్యం అనుకుంటాం కదా. కానీ ఈ మాటలన్నీ ఉత్తమాటలే తేల్చి పారేశాడు ఒక రిటైర్డ్ ఉద్యోగి. వినడానికి ఆశ్చర్యంగా ఉందా? నమ్మలేకపోతున్నారా? అయితే ఒడిశాకు చెందిన జైకిశోర్ ప్రధాన్ గురించి తెలుసుకోవాల్సిందే. ప్రస్తుతం ఈయన సక్సెస్ స్టోరీ నెట్టింట చక్కర్లు కొడుతోంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) రిటైర్డ్ ఉద్యోగి జై కిశోర్ ప్రధాన్ అందరినీ ఆశ్చర్యపరుస్తూ 64 ఏళ్ల వయసులో ఎంబీబీఎస్ కోర్సులో చేరారు. 2020లో నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (NEET UG)లో విజయవంతంగా ఉత్తీర్ణత సాధించారు. ఎస్బీఐలో డిప్యూటీ మేనేజర్‌గా ఉద్యోగ విధులు నిర్వర్తించిన ఆయన రిటైర్మెంట్ తరువాత అందరిలాగా రిలాక్స్ అయిపోలేదు. డాక్టరవ్వాలనే తన చిరకాల వాంఛను తీర్చుకొనేందుకు రంగంలోకి దిగారు. వైద్య విద్య ప్రవేశానికి గరిష్ట వయోపరిమితి నిబంధన లేకపోవడంతో దృఢ సంకల్పంతో నడుం బిగించారు. అందుకోసం పెద్ద వయసులోనూ కూడా కష్టపడి చదివి జాతీయ స్థాయిలో వైద్యవిద్య ప్రవేశాల కోసం నిర్వహించే నీట్ లో అర్హత సాధించారు.ఎవరీ జై కిశోర్ ప్రధాన్జై కిశోర్ ప్రధాన్ స్వస్థలం ఒడిశాలోని బార్ గఢ్ ప్రాంతం. బాల్యం నుంచే డాక్టర్ అవ్వాలని కలలు కనేవారు. 1974లో మెడికల్ ఎంట్రన్స్ ర్యాంకు రాకపోవడంతో ఆశలు వదిలేసుకున్నారు. బీఎస్సీడిగ్రీ పూర్తి చేసి ఎస్బీఐలో ఉద్యోగం సంపాదించారు. ఈ సమయంలో తండ్రి అనారోగ్యానికి గురయ్యారు. చికిత్స తీసుకుంటున్న సమయంలో తండ్రి అనుభవించిన బాధ, కళ్లారా చూసిన జై కిశోర్ ఎప్పటికైనా డాక్టర్ అవ్వాలని నిర్ణయించుకున్నారట.జై కిశోర్ జీవితంలో మరో విషాదం వైద్య వృత్తిపై ఉన్న ప్రేమతో తన పెద్దకుమార్తెను డాక్టర్న చేయాలని ఎంతగానో ఆశపడ్డారు. అయితే, దురదృష్టవశాత్తూ ఆమె ఎంబీబీఎస్ చదువుతుండగా, అనారోగ్యంతో కన్నుమూయడం విషాదాన్ని నింపింది. అయితే తన రెండో కుమార్తెను కూడా మెడిసిన్ చదివిస్తుండటం విశేషం. సాధించాలన్న పట్టుదల ఉండాలేగానీ అనుకున్న లక్ష్యం చేరేందుకు వయసుతో సంబంధం లేదని జై కిశోర్ చాటి చెప్పారు. -
Visakhapatnam: 30 షాపులకు దరఖాస్తు చేసిన ఒడిశా మద్యం వ్యాపారి
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: విశాఖలో మద్యం వ్యాపారంపై ఆధిపత్యం చెలాయించాలనుకున్న సిండికేట్‌కు తీవ్ర పోటీ ఎదురవుతోంది. ఒడిశాకు చెందిన వ్యాపారి వివేక్ సాహు సిండికేట్‌కు ఊహించని షాక్‌నిచ్చారు. నోయిడాకు చెందిన కొంత మంది మద్యం వ్యాపారులు కూడా ఇక్కడ వ్యాపారంపై కన్నేశారు. విశాఖలో మద్యం దుకాణాల కోసం కొంత మంది సిండికేట్‌గా ఏర్పడి ఎక్కువ దరఖాస్తులు రాకుండా అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఎవరెవరు ఏయే షాపులను దక్కించుకోవాలనే విషయంపై సోమవారం రాత్రి సీతమ్మధారలోని ఒక మద్యం వ్యాపారి గెస్ట్‌హౌస్‌లో సమావేశమయ్యారు. ప్రధానంగా 8 మంది మద్యం సిండికేట్ల మధ్య ప్రాథమికంగా అంగీకారం కుదిరినట్టు తెలుస్తోంది. అయితే.. ఇందుకు భిన్నంగా ఒడిశాకు చెందిన మద్యం వ్యాపారి వివేక్ సాహు ఏకంగా 30 షాపులకు దరఖాస్తు చేశారు. నోయిడాకు చెందిన వ్యాపారులు 10 షాపుల వరకూ దరఖాస్తు చేస్తున్నట్టు సమాచారంతో స్థానిక సిండికేట్ కంగుతింది. ఆయా వ్యాపారులకు లాటరీలో షాపులు దక్కితే... వాటిని ఏ విధంగా చేజిక్కించుకోవాలనే అంశంపై తాజాగా సిండికేట్ సభ్యులు చర్చలు జరుపుతున్నట్టు సమాచారం.సిండికేట్ నేతృత్వంలో మార్పు.. కొత్త ఎమ్మెల్యే ప్రవేశంవిశాఖ మద్యం సిండికేట్ మొదటగా దరఖాస్తులు ఎక్కువ రాకుండా అడ్డుకునే ప్రయత్నాలు చేశారు. ఇందుకోసం మద్యం వ్యాపారంలో ఉన్న ప్రధానమైన 8 మంది సిండికేట్‌గా ఏర్పడ్డారు. ఈ సిండికేట్ మొన్నటివరకు ముందుండి నడిపించిన ఎమ్మెల్యే స్థానంలో.. కొత్త ఎమ్మెల్యే సారథ్యం వహించేలా ప్రణాళిక రచించారు. తద్వారా షాపులకు ఎక్కువ పోటీ రాకుండా జాగ్రత్తపడ్డారు. మరోవైపు ఇప్పటికే ప్రభుత్వ మద్యం దుకాణం నడుస్తున్న భవనాల వద్ద వ్యవహారం మొదలుపెట్టారు. ఆయా భవన యజమానులతో మాట్లాడుకుని.. అవి తమకే వచ్చేలా చూసుకున్నారు. ఇందుకోసం ఎకై ్సజ్ శాఖలోని కొద్ది మంది అధికారులు కూడా సహకరించినట్టు తెలుస్తోంది. ప్రభుత్వ మద్యం దుకాణాలున్న భవనాన్ని ఫలానా మద్యం వ్యాపారులకే అద్దెకు ఇవ్వాలని కొద్ది మంది అధికారులు చర్చలు జరిపారు. అలా అయితేనే మీకు పాత అద్దెలను సక్రమంగా వచ్చేలా చూస్తామని.. లేని పక్షంలో ఇబ్బందులు తప్పవని కొద్ది మందిని బెదిరించినట్టు తెలుస్తోంది. కాగా.. లాటరీ పూర్తయిన తర్వాత వ్యాపారులు షాపులను 12నే తెరిచేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. అంతేకాకుండా ప్రధానమైన ప్రాంతాలన్నింటిలో తమ షాపులే ఉండేలా జాగ్రత్తపడ్డారు. ఒకవేళ ఎవరైనా కొత్తవాళ్లకు షాపులు వస్తే.. భవనాలు దక్కకుండా, ప్రధానమైన ప్రాంతాల్లో వారు వ్యాపారం చేయకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ఈ పరిస్థితుల్లో ఒడిశా, నోయిడా నుంచి మద్యం వ్యాపారులు రంగంలోకి దిగడంతో ఒక్కసారిగా కంగుతిన్నారు.విశాఖలో తక్కువ దరఖాస్తులుఉమ్మడి విశాఖ జిల్లాలో 331 మద్యం షాపులకు ప్రభుత్వం దరఖాస్తులను ఆహ్వానించింది. ఇందులో విశాఖ జిల్లా పరిధిలోని 155 షాపులకు గానూ మంగళవారం సాయంత్రం 5 గంటల సమయానికి 878 దరఖాస్తులు వచ్చాయి. అంటే ఒక్కో షాపునకు సగటున 6 దరఖాస్తులు కూడా రాలేదు. అనకాపల్లి జిల్లాలో 136 షాపులకుగానూ 1,076 దరఖాస్తులు వచ్చాయి. అంటే ఒక్కో షాపునకు 8 దరఖాస్తులు వచ్చాయి. అల్లూరి జిల్లాలో 40 మద్యం షాపుల్లో 36 షాపులకు మాత్రమే దరఖాస్తులు రాగా... మరో 4 షాపులకు దరఖాస్తులు రాలేదు. 36 షాపులకు మొత్తం 330 దరఖాస్తులు వచ్చాయి. సాధారణంగా విశాఖలో మద్యం వ్యాపారానికి భారీగా డిమాండ్ ఉంటుంది. ఒక్కో షాపునకు కనీసం 40 నుంచి 50 మంది పోటీపడతారని ఊహించారు. ఇందుకు భిన్నంగా దరఖాస్తుల ప్రక్రియ ముగిసే సమయానికి సగటున 10 మందికి మించి పోటీపడే పరిస్థితులు కనిపించడం లేదు. ఈ పరిస్థితుల్లో ఒడిశా, నోయిడాల నుంచి పోటీ రావడంతో సిండికేట్ సభ్యులు తర్జనభర్జన పడుతున్నారు. ఎలాగైనా వారికి షాపులు రాకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఒక వేళ లాటరీలో షాపులు వస్తే వాటిని ఎలా చేజిక్కించుకోవాలనే విషయంపై చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. -
మహాలక్ష్మి కేసులో షాకింగ్ ట్విస్ట్
భువనేశ్వర్: బెంగళూరులో సంచలనం సృష్టించిన మహలక్ష్మి హత్య కేసులో ట్విస్ట్ చోటు చేసుకుంది. ఈ కేసు నిందితుడు ముక్తి రంజన్ రాయ్ అనుమానాస్పద రీతిలో మృతి చెందాడు. ఒడిషాలోని తన సొంత ఊరికి పారిపోయిన అతను.. ఆత్మహత్య చేసుకుని ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. బెంగళూరులో మహాలక్ష్మి అనే మహిళను చంపి ముక్కలుగా నరికి ఫ్రిడ్జిలో దాచిన ఉదంతం గురించి తెలిసిందే. ఈ కేసులో ముక్తీ రంజన్ రాయ్‌ను తొలి నుంచి అనుమానిస్తున్నారు పోలీసులు. ఈ క్రమంలో భద్రక్(ఒడిషా) జిల్లా పాండి గ్రామానికి పారిపోయిన రాయ్.. సమీపంలోని కూలేపాడు గ్రామానికి వెళ్లి ఓ చెట్టుకు ఉరేసుకున్నాడు. ఘటనా స్థలంలో ఓ స్కూటీ, అందులో నోట్ బుక్ ఉన్నాయని ఒడిషా పోలీసులు చెబుతున్నారు. అందులో మహాలక్ష్మిని తానే చంపానని, ఆ బాధతోనే బలవనర్మణానికి పాల్పడుతున్నట్లు ముక్తి రంజన్ రాయ్ రాసినట్లు నోట్ దొరికిందని తెలిపారు. అయితే.. బెంగళూరు పోలీసులు దీనిని ధృవీకరించుకోవాల్సి ఉంది. గత శనివారం ఫ్రిజ్‌లో ఉన్న శవం వాసన రావడంతో అసలు విషయం బయటపడింది. అయితే చాలా తొందరగానే బెంగళూరు పోలీసులు ఈ కేసును చేధించగలిగారు. సెప్టెంబర్ 1 నుంచి మహాలక్ష్మి మాల్‌కు వెళ్లడం లేదు. అదే రోజు నుంచి ముక్తి కూడా పనికి వెళ్లలేదు. బహుశా హత్య సెప్టెంబర్2వ తేదీనే జరిగి ఉండొచ్చని పోలీసులు అంచనా వేస్తున్నారు. మహాలక్ష్మి(26) బెంగళూరులోని ఓ మాల్లో పని చేస్తోంది. భర్త నుంచి ఆమె దూరంగా ఉంది. ఈ క్రమంలో మాల్లోనే పని చేస్తున్న ముక్తి రంజన్‌కు దగ్గరైంది. అయితే గత కొంతకాలంగా మహాలక్ష్మి.. మరో వ్యక్తితో చనువుగా ఉంటోందని భర్త హేమంత్ దాస్ పోలీసులకు తెలిపాడు. ఈ క్రమంలోనే ప్రియురాలిపై కోపం పెంచుకున్న ముక్తి రంజన్.. ఆమెను కిరాతకంగా హత్య చేసి ఉంటాడని బెంగళూరు పోలీసులు భావిస్తున్నారు. అయితే దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. -
వరద బాధితులకు అండగా..!
భువనేశ్వర్: రాష్ట్రంలో ఇటీవల సంభవించిన వరదలతో భారీ నష్టం సంభవించింది. ప్రధానంగా బాలాసోర్ జిల్లాలో పంటలు, ఇళ్లు తీవ్రంగా దెబ్బ తిన్నాయి. దీంతో బాధితులకు ప్రభుత్వ సాయం అందజేయనున్నట్లు ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝి ప్రకటించారు. పూర్తిగా దెబ్బ తిన్న ఇళ్లకు రూ.1.20 లక్షలు, పాక్షికంగా దెబ్బతిన్న పక్కా ఇళ్లకు రూ. 6,500, మట్టి ఇళ్లకు రూ.4 వేలు చొప్పున ఆర్థిక సాయం లభిస్తుందని పేర్కొన్నారు. జల దిగ్బంధంలో చిక్కుకున్న బాధితులకు దుస్తులు, వంట పాత్రల కోసం చెరో రూ.2,500 చొప్పున ఆర్థిక సాయం అందుతుందన్నారు.రైతులకు మేలుపంట నష్టానికి గురైన చిన్న, సన్నకారు రైతాంగానికి 1 హెక్టారు విస్తీర్ణపు వర్ష ఆధార పొలాల్లో పంట నష్టానికి రూ.8,500, సాగు నీటి వనరుల పొలాల్లో పంట నష్టానికి హెక్టారు విస్తీర్ణానికి రూ.17 వేలు, నిత్య పంట పొలాలకు హెక్టారుకు రూ.22,500 చొప్పున పరిహారం లభిస్తుంది. అయితే ఈ సాయం గరిష్ట పరిమితి 2 హెక్టార్లకు మాత్రమే పరిమితంగా పేర్కొన్నారు. ఇసుక మేట వేసిన పంట పొలాలకు పరిహారం కింద అతి తక్కువగా రూ.2200, గరిష్టంగా రూ.18 వేలు సన్నకారు, బలహీన రైతాంగానికి చెల్లిస్తారు. నదిగట్లు తెగి పొలాల్లో వరద నీరు పొంగిపొర్లి నష్టం ఏర్పడిన పరిస్థితుల్లో పీడిత వర్గాలకు కనీస పరిహారం రూ.5,000 కాగా, గరిష్ట పరిహారం రూ.47 వేలుగా పేర్కొన్నారు.మత్స్యకారులకు ప్యాకేజీవరదల ప్రభావంతో మత్స్యకారులకు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించారు. పూర్తిగా దెబ్బ తిన్న చేపల వేట పడవకు రూ.15 వేలు, పాక్షికంగా దెబ్బతిన్న పడవలకు రూ.6 వేలు చొప్పున పరిహారం చెల్లిస్తారు. పాక్షికంగా దెబ్బ తిన్న చేపల వలకు రూ.3 వేలు చొప్పున, పూర్తిగా దెబ్బతిన్న వలకు రూ.4 వేలు చొప్పున ఆర్థిక సాయం మంజూరు చేస్తారు. చేపల సాగు ఒక హెక్టార్ విస్తీర్ణం నష్టానికి రూ.10 వేలు చొప్పున పరిహారం మంజూరవుతుందని ప్రకటించారు.పాడి పశువులకు పరిహారంవరద తాకిడితో నష్టాలు సంభవించిన పాడి రైతులకు పరిహారం ప్రకటించారు. ఒక్కొక్క ఆవు, గేదెకి రూ.37,500, ఒక్కొక్క మేక, గొర్రెకి రూ.4 వేలు చొప్పున పరిహారం చెల్లిస్తారు. బండ్లు లాగే ఎడ్లు, బర్రెలు వంటి పశువుల నష్టానికి రూ.32 వేలు చొప్పున, దూడలు, గాడిద వంటి పశువుల నష్టానికి రూ.20 వేలు చొప్పున నష్ట పరిహారం నిర్ధారించారు. పశువులశాల పునరుద్ధరణ కోసం రూ.3 వేలు ఆర్థిక సాయం అందజేస్తారు. ఒక్కో కుటుంబానికి అత్యధికంగా 3 పెద్ద పాడి పశువులు లేదా 30 చిన్న పాడి పశువులు లేదా బండ్లు లాగే 3 పెద్ద పశువులు లేదా 6 చిన్న పశువులకు పరిహారం పరిమితం అవుతుందని స్పష్టం చేశారు.చేనేత వర్గాలకు సాయంవరద పీడిత చేనేత, హస్తకళ వర్గాలకు ముఖ్యమంత్రి సాయం ప్రకటించారు. ఈ వర్గపు యంత్ర పరికరాలు, పనిముట్ల నష్టానికి ఒక్కో వ్యక్తికి రూ.5 వేలు, అనుబంధ సరంజామా నష్ట పరిహారం కింద రూ.5 వేలు చొప్పున ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించారు.అపార నష్టంబాలాసోర్ జిల్లాలో వరదలతో రహదారులు, స్తంభాలు, పాఠశాలలు, ప్రాథమిక, సామూహిక ఆరోగ్య కేంద్రాలు, 11 కేవీ విద్యుత్ వ్యవస్థ, తాగునీరు పంపిణీ వ్యవస్థ, లఘు సాగు నీటి ప్రాజెక్టులు యువజన కేంద్రాలు, పంచాయతీ కార్యాలయాలు, అంగన్వాడీ కేంద్రాలు ఇతరేతర కట్టడాలు తీవ్రంగా దెబ్బ తిన్నాయి. అనుబంధ విభాగాలు, శాఖల క్షేత్ర స్థాయి నివేదిక ఆధారంగా వీటి పునరుద్ధరణ కోసం సముచిత ప్యాకేజీ ప్రకటించడం జరుగుతుందని ముఖ్యమంత్రి వివరించారు. -
పెన్షన్ కోసం 2 కిలోమీటర్లు పాక్కుంటూ వెళ్లిన 80 ఏళ్ల బామ్మ
కియోంఝర్(ఒడిశా): వృద్ధాప్య పెన్షన్ కోసం పండుటాకులాంటి బామ్మ పడరాని పాట్లు పడుతున్న దృశ్యం ఒడిశాలో కనిపించింది. పెన్షన్ కావాలంటే పంచాయతీ ఆఫీస్‌దాకా వచ్చి నువ్వే తీసుకో అని అధికారులు తెగేసి చెప్పడంతో 80 ఏళ్ల బామ్మ 2 కి.మీ.లు పాక్కుంటూ వెళ్లింది. శనివారం జరిగిన ఈ ఘటన తాలూకు వీడియో వైరల్ కావడంతో అధికారులపై అందరూ మండిపడుతున్నారు. ఒడిశా రాష్ట్రంలోని సీఎం మోహన్ చరణ్ మాఝీ సొంత జిల్లా కియోంఝర్లోని రైసాన్‌లో ఘటన జరిగింది. గ్రామంలోని పథూరీ దేహరీ అనే బామ్మ నడవలేని దుస్థితి. ఇలాంటి వృద్ధులకు ఇంటి వద్దే పెన్షన్ అందజేయాలని ఉత్తర్వులు ఉన్నాయి. కానీ వాటిని అమలుచేసిన నాథుడే లేడు. శనివారం గ్రామ పంచాయతీలో పెన్షన్లు ఇస్తున్న విషయం తెల్సుకుని బామ్మ బురద ఉన్న ఎర్రమట్టి బాట గుండా పాకుతూ వచ్చి పెన్షన్ తీసుకున్నారు. వృద్ధురాలు ఇంత కష్టపడి కార్యాలయానికి వస్తుంటే పట్టించుకోరా? అని బ్లాక్ డెవలప్మెంట్ ఆఫీసర్ గీతా ముర్మును కొందరు నిలదీశారు. విమర్శలు వెల్లువెత్తడంతో ఇకపై బామ్మకు ఇంటి వద్దే పెన్షన్ ఇస్తామని మాటిచ్చారు. ఆమెకు ఒక చక్రాల కుర్చీని సైతం అందజేశారు. ఇకపై ఇంటి వద్దే రేషన్ సైతం అందిస్తామని స్పష్టంచేశారు. -
అయ్యో.. బామ్మా..!
ఈ చిత్రంలో కనిపిస్తున్న బామ్మ పేరు పథురి దెహురి. ఈమె వయస్సు దాదాపు 80 ఏళ్లు. వయోభారంతో నడవలేని పరిస్థితి ఆమెది. కానీ ప్రభుత్వం మంజూరు చేసే పింఛన్ డబ్బులే జీవనాధారం. దీంతో రోడ్డుపై పాకుకుంటూనే దాదాపు 2కి.మీ పాటు పింఛన్ డబ్బులు కోసం ప్రయాసలు పడుతూ మంగళవారం పింఛన్ ఇచ్చే ప్రదేశానికి వెళ్లింది. ఈ హృదయ విదారక ఘటన కెంజొహర్ జిల్లా రయిసుంవా గ్రామ పంచాయతీలో చోటుచేసుకుంది. ఇది చూసిన పలువురు ఆమెకు ఇంటి వద్దనే పింఛన్ ఇచ్చే ఏర్పాటు చేయాలని అధికారులను కోరుతున్నారు. – భువనేశ్వర్ -
రక్తదాన శిబిరం
పర్లాకిమిడి: స్థానిక బిజూ కల్యాణ మండపంలో జిల్లా అధికార యంత్రాంగం ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని కలెక్టర్ బిజయ కుమార్ దాస్ ముఖ్య అతిథిగా విచ్చేసి మంగళవారం ప్రారంభించారు. రక్తదానం వల్ల అత్యవసర పరిస్థితుల్లో క్షతగాత్రులకు మేలు జరుగుతుందన్నారు. శిబిరంలో 72 యూనిట్ల రక్తం సేకరించారు. కార్యక్రమంలో ఏడీఎం రాజేంద్ర మింజ్, సబ్ కలెక్టర్ అనుప్ పండా, జిల్లా పరిషత్ అదనపు సీడీఎం పృథ్వీరాజ్ మండల్, జిల్లా చికిత్సా అధికారి డాక్టర్ ప్రమోద్ కుమార్ పండా తదితరులు పాల్గొన్నారు.రాయగడ: జాతీయ సేవ దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లాలోని గుణుపూర్‌లో ఉన్న గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ (జీఐఈటీ) విశ్వవిద్యాలయంలో మంగళవారం మెగా రక్తదాన శిబిరం జరిగింది. ఈ శిబిరంలో 602 యూనిట్ల రక్తాన్ని సేకరించారు. బీడీవో సుభ్రాంజలి ప్రధాన్ ముఖ్య అతిథిగా హాజరై శిబిరాన్ని ప్రారంభించారు. శిబిరంలో రిజిస్ట్రార్ ఎన్వీ జగన్నాథరావు, విశ్వవిద్యాలయం కులపతి డాక్టర్ ఏవీఎన్ఎల్ శర్మ తదితరులు పాల్గొన్నారు. -
‘నెలసరి’ సెలవులకూ వేతనం: గళమెత్తిన ప్రియదర్శిని
నెలసరి లేదా పీరియడ్, ఈ సమయంలో మహాళలు అనుభవించే బాధ, వేదన వారికే మాత్రమే తెలుసు. ఇన్ని రోజులూ అదేదో పాపంలాగా, దేవుడిచ్చిన శాపంలాగా అనుకుంటూ ఆడవాళ్లు పంటి బిగువున ఆ బాధనంతా భరిస్తూ వచ్చారు. కానీ ఆ సమయంలో వారు పడే కష్టాలు ఇంట్లోని పురుషులకు, సమాజానికి కూడా అర్థం కావాలనే ఆరాటం ఎన్నాళ్ల నుంచో ఉంది. ఇందులో భాగంగా వచ్చిందే పీరియడ్ పెయిడ్ లీవ. దీనిపై ఒడిశాకు చెందిన సామాజిక ఉద్యమకారిణి రంజితా ప్రియదర్శిని (Ranjeeta Priyadarshini) ఐక్యరాజ్యసమితి (UN) సమావేశంలో గళమెత్తారు. నెలసరి రోజుల్లో మహిళలకు వేతనంతో కూడిన సెలవు ఇవ్వాలని ఆమె కోరారు. దీంతో జీతంలో కోత పడుతుందనే సంకోచం, భయం లేకుండా వారు సెలవు తీసుకోగలుగుతారని ఆమె తెలిపారు.రంజీతా ప్రియదర్శిని, న్యూయార్క్‌లోని 79వ యుఎన్‌జిఎలో జరిగిన ‘సమ్మిట్ ఆఫ్ ది ఫ్యూచర్’ కార్యక్రమంలో మహిళలకు చెల్లింపు రుతుస్రావ సెలవుల ఆవశ్యకతను నొక్కి చెప్పారు. నెలసరి విషయంలో సమాజంలో ఉన్న అపోహలను తొలగించేందుకు ఆమె కృషి చేస్తున్నారు. పెయిడ్ పీరియడ్ లీవ్‌ల కోసం ఆమె పోరాడుతున్నారు. తాను పని చేస్తున్నపుడు తనకెదురైన అనుభవం నుంచే ఆలోచన వచ్చినట్టు ప్రియదర్శిని తెలిపారు. ఈ సందర్బంగా తన అనుభవాన్ని పంచుకున్నారు. పీరియడ్స్ సమయంలో తన ఇబ్బంది కారణంగా సెలవు కోరినపుడు తనపై అధికారినుంచి అవమానాన్ని ఎదుర్కొన్నారు. దీంతో ఆమె ఉద్యోగానికి రాజీనామా చేసారు. ఆమె ప్రయత్నాలు రుతుక్రమ ఆరోగ్యం, మహిళల పరిస్థితిపై చర్చకు దారితీసింది.. మార్పునకు పునాది పడింది. ఇది ఒక్క భారతదేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా రుతుక్రమం సమయంలో మహిళలను అర్థం చేసుకునేందుకు, అవగాహన పెంచేందుక బాటలు వేసింది. మరోవైపు ఇదే అంశంపై త్వరలో బాలీవుడ్ చిత్రం కూడా విడుదల కానుంది. ఇదీ చదవండి: పారిస్ ఫ్యాషన్ వీక్‌లో ఐశ్వర్య కిల్లింగ్ లుక్స్, తొలిసారి అలియా అదుర్స్ -
ఉల్లంఘనులను వదలం
మిమ్నల్ని ఎవరూ చూడటం లేదంటూ ట్రిపుల్ రైడింగ్, సెల్‌ఫోన్ మాట్లాడుతూ బైక్ నడపడం, ఇతర ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడుతున్నారా? అయితే మీకు ఫైన్ పడినట్లే. జయపురంలో ఇటీవల సీసీ కెమెరాల పర్యవేక్షణలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అక్కడి నుంచే ఉల్లంఘనులను గుర్తించి జరిమానా విధిస్తున్నారు. శనివారం ఒక్కరోజే 18 మందికి ఫైన్ విధించినట్లు పట్టణ పోలీసు అధికారి రశ్మీరంజన్ దొలాయి ఆదివారం వెల్లడించారు.– జయపురం -
నువాఖాయి..ఆనందమోయి..
పశ్చిమ ఒడిశాలో సంప్రదాయ పండగల్లో ఒకటైన నువాఖాయి ఉత్సవాన్ని పురస్కరించుకుని రాయగడలోని బిజూ పట్నాయక్ ఆడిటోరియంలో ఆదివారం నిర్వహించిన ‘నువాఖాయి భేట్ ఘాట్’ పేరిట జరిగిన కార్యక్రమం ఆద్యంతం ఆనందోత్సాహాల నడుమ సాగింది. పశ్చిమ ఒడిశా నువాఖాయి కమిటీ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో సంబల్పూరి నృత్యాలు, నాటక ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వాహక అధికారి నిహారి రంజన్ కుహోరొ, వాటర్‌షెడ్ డైరెక్టర్ డాక్టర్ దయానిధి బాగ్, జిల్లా పౌరసంబంధాల శాఖ అధికారి బసంతకుమార్ ప్రధాన్, విద్యావేత్త డాక్టర్ డి.కె.మహంతి, పట్టణ ప్రముఖులు పాల్గొన్నారు.– రాయగడ