
లక్నో: ఉత్తర ప్రదేశ్‌లో(Uttar Pradesh) ఘోర రైలు ప్రమాదం తృటిలో తప్పింది. ప్రయాణిస్తున్న రైలు బోగి రెండుగా విడిపోయాయి. 200 మీటర్ల మేర ప్రయాణించాయి. బోగి విడిపోవడంపై అప్రమత్తమైన రైల్వే అధికారులు వెంటనే ఆ రైలు ఆపేయడంతో పెను ప్రమాదం తప్పింది.
పోలీసుల సమాచారం మేరకు..బీహార్ నుంచి ఒడిశాలోని పురి ప్రాంతానికి నందన్ కానన్ ఎక్స్‌ప్రెస్ (Nandan Kanan Express ) బయలుదేరాల్సి ఉంది. అయితే, మార్గం మధ్యలో ఉత్తర ప్రదేశ్‌లో పండిట్ దీనదయాల్ ఉపాధ్యాయ్ స్టేషన్ (Pandit Deen Dayal Upadhyaya (DDU) లో నందన్ కానన్ ఎక్స్‌ప్రెస్ బోగీ విడిపోయింది.
#WATCH | Chandauli, Uttar Pradesh: The coupling of the Nandan Kanan Express broke near the Pandit Deen Dayal Upadhyaya (DDU) Junction, splitting it into two parts. pic.twitter.com/QjqUHN7tfe
— ANI UP/Uttarakhand (@ANINewsUP) March 4, 2025
ట్రైన్ ఆరు బోగీలు విడిపోయి 200 మీటర్లు ముందుకు వెళ్లిపోయాయి. మిగతా 15 బోగీలు వెనకే ఉన్నాయి. బోగీలు విడిపోవడంతో రైల్లోని ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. ప్రాణ భయంతో కేకలు వేశారు. దీంతో అప్రమత్తమైన రైల్వే సిబ్బంది ట్రైన్‌ను నిలివేశారు. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. ప్రయాణికుల్ని సురక్షితంగా మరో కోచ్‌కు తరలించారు.
అనంతరం, రైలు బోగీ విడిపోవడంపై రైల్వే అధికారులు ఆరా తీశారు. ఈ క్రమంలోనే రైలు కప్లింగ్ విరిగిపోయిన విషయాన్ని గుర్తించారు. సుమారు నాలుగు గంటల పాటు శ్రమించి దాన్ని మళ్లీ అతికించారు.
Comments
Please login to add a commentAdd a comment