uttarpradesh
-
UP By-election: క్రిమినల్ కేసులో ఎమ్మెల్యే సభ్యత్వం రద్దయి.. ఉపఎన్నిక జరిగిన చోట..
లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని తొమ్మిది అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరిగాయి. తాజాగా ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు కూడా వెలువడ్డాయి. ఈ ఫలితాలు సమాజ్‌వాదీ పార్టీకి కీలకంగా మారాయి. ముఖ్యంగా కాన్పూర్‌లోని సీసామవు అసెంబ్లీ స్థానంపై సమాజ్‌వాదీ పార్టీ జాతీయ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ గంపెడు ఆశలు పెట్టుకున్నారు.సీసామవు అసెంబ్లీకి చెందిన సమాజ్‌వాదీ ఎమ్మెల్యే ఇర్ఫాన్ సోలంకి ఒక క్రిమినల్ కేసులో దోషిగా తేలిన దరిమిలా అతని సభ్యత్వం రద్దయ్యింది. అనంతరం ఇక్కడ ఉప ఎన్నిక జరిగింది. కాగా భారతీయ జనతా పార్టీకి చెందిన రాకేష్ సోంకర్ 1996లో ఇక్కడ నుంచి విజయం సాధించారు. డీలిమిటేషన్ తర్వాత ఈ సీటు ముస్లింల ప్రాబల్యం కలిగినదిగా మారింది. తదనంతరం ఎస్పీ నేత ఇర్ఫాన్ సోలంకి 2012 నుంచి 2022 వరకు ఇక్కడ నుంచి ఎన్నికల్లో గెలుస్తూ వస్తున్నారు.కాన్పూర్‌లోని సీసామవు స్థానం అఖిలేష్ యాదవ్‌కు బలమైన స్థానాల్లో ఒకటి. అయితే ఇప్పుడు సీసామవు అసెంబ్లీ సీటు అటు బీజేపీ, ఇటు ఎస్పీకి ప్రతిష్ఠాత్మకంగా నిలిచింది. సీసామవు స్థానం నుంచి బీజేపీ తరపున సురేశ్ అవస్థీ బరిలో నిలిచారు. ఈసారి సీసామవు అసెంబ్లీ స్థానంలో ఎస్పీ, కాంగ్రెస్‌లు పొత్తు పెట్టుకుని పోటీ చేయడం బీజేపీకి పెద్ద సవాల్‌గా మారింది. 2022 అసెంబ్లీ ఎన్నికల్లో ఈ స్థానం నుంచి ఇర్ఫాన్ సోలంకీకి 79,163 ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్‌కు 5,616 ఓట్లు రాగా, బీజేపీకి 66,897 ఓట్లు వచ్చాయి. ఇది కూడా చదవండి: Delhi air pollution: కాస్త ఉపశమనం.. ఊపిరికి ఊరట -
వెనక్కి నడవమంటున్నారా?
మహిళల భద్రత కోసమని చెబుతూ ఈమధ్య ఉత్తరప్రదేశ్ మహిళా కమిషన్ కొన్ని మూర్ఖపు సలహాలిచ్చింది. వాటి ప్రకారం... మగ టైలర్లు ఆడవాళ్ల దుస్తుల కొలతలు తీసుకోకూడదు; మగవాళ్లు జిమ్ముల్లో ఆడవాళ్లకు ట్రెయినర్లుగా ఉండకూడదు. వాళ్ల ఉద్దేశం మంచిదే కావొచ్చు. కానీ ఇది ఇంకో రకమైన తాలిబనిజం అవుతుంది. ఎందుకంటే, ఇలాంటివి చివరకు మహిళలకు కీడే చేస్తాయి. వారి వ్యక్తిగత ఎంపికకు భంగం కలిగిస్తాయి. ఇది ఇంతటితోనే ఆగుతుందా? ఫిజియోథెరపిస్టులుగా, దంతవైద్యులుగా, డాక్టర్లుగా, ఉపాధ్యాయులుగా పనిచేస్తున్న మహిళల పరిస్థితి ఏమిటి? వీరందరినీ కేవలం మహిళలకు మాత్రమే సేవలందించేలా చేయాలా? అందుకే ఈ ప్రతిపాదనలు హాస్యాస్పదమైనవే కాదు, అర్థంలేనివి కూడా!మన మంచి కోసమేనని చెబుతూ కొందరు తరచూ కొన్ని పిచ్చి సూచనలు చేస్తూంటారు. వీటిని నేను పెద్దగా పట్టించుకోను. కానీ ఈ మధ్య ఉత్తరప్రదేశ్ మహిళా కమిషన్ కొన్ని మూర్ఖపు సలహాలిచ్చింది. అవి ఎంత మూర్ఖమైనవంటే మనం వాటిని గట్టిగా పట్టించుకోవాల్సిన అవసరం ఉంది. వీటిపట్ల మౌనంగా ఉంటే, అవన్నీ సమ్మతమే అనుకునే ప్రమాదముంది.‘బహిరంగ, వాణిజ్య స్థలాల్లో మహిళల భద్రతను పెంచడం ఎలా?’ అన్న అంశంపై ఈ సూచనలు వచ్చాయి. ఉద్దేశం చాలామంచిది. కానీ ప్రతిపాదించిన సలహాలు మాత్రం నవ్వు పుట్టించేలా ఉన్నాయి. మగ టైలర్లు ఆడవాళ్ల దుస్తుల కొలతలు తీసుకోకూడదన్నది ఒకానొక సలహా. అలాంటప్పుడు పురుషులు మహిళల వస్త్రాలు కూడా తయారు చేయకూడదా? మహిళలు మాత్రమే సిద్ధం చేయాలా? బహుశా ఇది ఇకపై అమల్లోకి తెస్తారేమో! సెలూన్లలోనూ మహిళలకు క్షౌర క్రియలు చేయడం ఇకపై పురుషులకు నిషిద్ధం. అలాగే జిమ్, యోగా సెషన్లలోనూ మగవాళ్లు మహిళలకు శిక్షణ ఇవ్వడానికి అనుమతి లేదు.ఇంతటితో అయిపోయిందనుకోకండి. అన్ని పాఠశాలల బస్సు ల్లోనూ మహిళా సెక్యూరిటీ సిబ్బంది ఉండాలన్న సలహా కూడా వచ్చింది. బహుశా పురుషులు ఎవరూ యువతులను, చిన్న పిల్లలను భద్రంగా ఉంచలేరని అనుకున్నారో... వారి నుంచి ముప్పే ఉందను కున్నారో మరి! మహిళల వస్త్రాలమ్మే చోట మహిళా సిబ్బంది మాత్రమే ఉండాలట. పురుషులను అస్సలు నమ్మకూడదన్న కాన్సెప్టు నడుస్తోందిక్కడ. మహిళలను ప్రమాదంలో పడేయకుండా పురుషులు వారికి సేవలు అందించలేరన్నమాట.ఉత్తరప్రదేశ్ మహిళా కమిషన్ చైర్పర్సన్ బబితా చౌహాన్ ఈ సలహాలు, సూచనలపై ఏమంటున్నారంటే... మహిళల భద్రతను పటిష్ఠం చేసేందుకు మాత్రమే కాకుండా, మహిళల ఉపాధి అవకాశా లను మెరుగుపరిచేందుకు కూడా వీటిని ఉద్దేశించినట్లు చెబుతున్నారు. ఈ సలహాలను ‘‘మహిళల భద్రత కోణంలోనూ, అలాగే ఉపాధి కల్పన కోణంలోనూ’’ ఇచ్చినట్టు మొహమాటం లేకుండా ఆమె చెబు తున్నారు. ఇంకోలా చెప్పాలంటే, రకరకాల ఉద్యోగాల్లో పురుషులపై నిషేధం విధిస్తున్నారన్నమాట. తద్వారా మహిళలకు కొత్త రకమైన అవకాశాలు కల్పిస్తున్నారనుకోవాలి. సరే... వీటి ద్వారా మనకర్థమయ్యేది ఏమిటి? అసలు ఏమైనా అర్థముందా వాటిల్లో? అలాటి ప్రతిపాదనలు అవసరమా? న్యాయ మైనవేనా? అనవసరంగా తీసుకొచ్చారా? మరీ నమ్మశక్యం కాని విధంగా ఉన్నాయా? ఇప్పటివరకూ చెప్పినదాన్ని బట్టి నా ఆలోచన ఏమిటన్నది మీకు అర్థమై ఉంటుంది. కొంచెం వివరంగా చూద్దాం. మొదటగా చెప్పు కోవాల్సింది... ఈ ప్రతిపాదనల వెనుక పురుషులపై ఉన్న అప నమ్మకం గురించి! పురుష టైలర్లు, క్షురకులు, దుకాణాల్లో పనిచేసే వారి సమక్షంలో మహిళల భద్రతకు ముప్పు ఉందని భావిస్తున్నారు. చిన్నపిల్లల రక్షణ విషయంలోనూ మనం మగ సిబ్బందిని నమ్మడం లేదంటే... వాళ్లకేదో దురుద్దేశాలను ఆపాదిస్తున్నట్లే! పైగా... ఈ ప్రతిపాదనలు కాస్తా మహిళల జీవితాల తాలూకు వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించేవి కూడా! తాము సొంతంగా నిర్ణయాలు తీసుకునే అవకాశం లేకుండా చేస్తున్నాయి. పురుషులు బాగా రాణిస్తున్న రంగాల్లో, వారి సేవలను తాను వినియోగించు కోవాలని ఒక మహిళ నిర్ణయించుకుంటే ఈ ప్రతిపాదనల పుణ్యమా అని అది అసాధ్యమవుతుంది. ఇంకోలా చూస్తే ఇది తాలిబనిజంకు ఇంకో దిశలో ఉన్న ప్రతిపా దనలు అని చెప్పాలి. అఫ్ఘానిస్తాన్‌లో తాలిబన్లు మహిళలను తిరస్క రిస్తున్నారు. ఇక్కడ పురుషులను మహిళలకు దూరంగా ఉంచు తున్నారు. వారి దుర్మార్గమైన మనసులను విశ్వసించకూడదు; కాబట్టి వారిని మహిళలకు దూరంగా ఉంచాలి.ఇప్పుడు చెప్పండి... ఈ ప్రతిపాదనలు వాస్తవంగా అవసరమా? ఇలాగైతే పురుషుల దుస్తులమ్మే దుకాణాల్లో మహిళలు పని చేయకూడదు మరి! మహిళా జిమ్ శిక్షకులు పురుషులకు ట్రెయినింగ్ ఇవ్వకూడదు. ఫిజియోథెరపిస్టులుగా, దంతవైద్యులుగా, డాక్టర్లుగా, ఉపాధ్యాయులుగా పనిచేస్తున్న మహిళల పరిస్థితి ఏమిటి? వీరందరినీ కేవలం మహిళలకు మాత్రమే సేవలందించేలా చేద్దామా?పురుష రోగులకు, వినియోగదారులకు సేవలు అందించడానికి అను మతిద్దామా? మగ శిక్షకులు, దుకాణాల్లోని మగ సేవకులను నమ్మలేని పరిస్థితి ఉన్నప్పుడు... స్త్రీలు పేషెంట్లుగా, వినియోగదారులుగా వచ్చినప్పుడు వాళ్లు ఎలా ఎక్కువ నమ్మకస్తులవుతారు?నేను ఇదంతా ఎందుకు చెబుతున్నానో మీకు ఇప్పటికి అర్థమైందనే అనుకుంటున్నా. పురుషులు నిర్వహిస్తున్న పనులపై నమ్మకం లేకపోతే... మహిళలపై కూడా అదే అవిశ్వాసం ఉంటుంది కదా! అప్పుడు అదే ప్రశ్న కదా ఉత్పన్నమయ్యేది! పురుషులను అస్సలు నమ్మడం లేదని చెప్పడం ద్వారా ఉత్తరప్రదేశ్ మహిళా కమిషన్ చైర్పర్సన్ ఏ రకమైన సందేశం ఇవ్వదలచుకున్నారు?కొంచెం ఆలోచించి చూడండి. మహిళల విషయంలో వివక్ష చూపేవారిని మిసోజినిస్ట్ అంటూ ఉంటారు. ఈ లెక్కన బబితా చౌహాన్‌ను మిసాండ్రిస్ట్ అనాలి. మహి ళల పట్ల వివక్ష చూపడం ఎంత తప్పో... పురుషులపై చూపడం కూడా అంతే తప్పు. అయితే మిసోజినీ గురించి మనకు కొద్దోగొప్పో పరిచయం ఉంది కానీ మిసాండ్రిస్టుల విషయం నేర్చుకోవాల్సే ఉంది. ఈ పనికిమాలిన విషయానికి మనం బబితా చౌహాన్‌కు కృతజ్ఞులుగా ఉండాలి.కరణ్ థాపర్ వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ -
యూపీ ఆస్పత్రి ఘటన.. దర్యాప్తునకు నలుగురు సభ్యుల కమిటీ
లక్నో: ఉత్తర్‌ప్రదేశ్ ఝాన్సీలోని ఆస్పత్రిలో జరిగిన ఘోర అగ్నిప్రమాదం ఘటనపై దర్యాప్తునకు రాష్ట్ర ప్రభుత్వం ఒక కమిటీ ఏర్పాటు చేసింది. ఉత్తరప్రదేశ్ ఆరోగ్యశాఖకు చెందిన నలుగురు ఉన్నతాధికారులతో కూడిన కమిటీ అగ్నిప్రమాద ఘటనపై దర్యాప్తు జరిపి ఏడు రోజుల్లో ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాల్సి ఉంటుంది. కమిటీ వైద్యవిద్య డీజీ నేతృత్వంలో దర్యాప్తు జరపనుంది. కాగా,ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఝాన్సీ మెడికల్ కాలేజీలో అగ్నిప్రమాదం సంభవించి 10 మంది శిశువులు మృతి చెందిన విషయం తెలిసిందే.ఇదీ చదవండి: యూపీలో ఘోరం.. 10 మంది పసికందుల సజీవదహనం -
Jhansi Hospital Fire: 25 మంది చిన్నారులను కాపాడిన ‘కృపాలుడు’
ఝాన్సీ: యూపీలోని ఝాన్సీలోగల మహారాణి లక్ష్మీబాయి మెడికల్ కాలేజీలో అగ్నిప్రమాదం సంభవించి, 10 మంది శిశువులు సజీవ దహనమయ్యారు. ఈ ఘోర ప్రమాదం దరిమిలా ఆస్పత్రి పర్యవేక్షణకు సంబంధించిన అంశాలపై పలు ప్రశ్నలు తలెత్తుతున్నాయి.ఈ ఘటనకు ప్రత్యక్ష సాక్షిగా నిలిచిన కృపాల్ సింగ్ రాజ్‌పుత్ మీడియాకు పలు వివరాలు వెల్లడించారు. ‘అనారోగ్యంతో బాధ పడుతున్న నా మనుమడిని ఆస్పత్రిలో చేర్పించాను. పిల్లాడు ఉంటున్న వార్డులో శుక్రవారం రాత్రి 10 గంటలకు షార్ట్ సర్క్యూట్ కారణంగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. వెంటనే ఆ గదిలోనికి వెళ్లాను. ఆ వార్డులోని 18 పడకలపై 50 మందికిపైగా పిల్లలున్నారు. ఒక బెడ్‌పై ఆరుగురు శిశువులు ఉన్నారు. చుట్టూ మంటలు వ్యాపించాయి. అతికష్టం మీద 25 మంది పిల్లలను బయటకు తీసుకు వచ్చాను. నేను చూస్తుండానే 10 మంది శిశువులు కాలి బూడిదయ్యారు. నా కుమారుడు క్షేమంగానే ఉన్నాడు’ అని తెలిపారు. ప్రమాదంలో చిక్కుకున్న 25 మంది చిన్నారులను ప్రాణాలతో కాపాడిన కృపాల్ సింగ్‌ను ఆసుపత్రి సిబ్బంది, ఇతరులు అభినందనలతో ముంచెత్తారు. కాగా వైద్య కళాశాలలో కేవలం 18 పడకలపై 54 మంది చిన్నారులకు చికిత్స అందించడాన్ని చూస్తుంటే ఇక్కడ సరైన మౌలిక సదుపాయాలు లేవని తెలుస్తోంది. అలాగే అగ్నిమాపక భద్రతా ఏర్పాట్లు సరిగా లేకపోవడంతో ఇంతటి దారుణ పరిస్థితి తలెత్తింది. ఉత్తరప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి బ్రిజేష్ పాఠక్ బాధిత కుటుంబాలను పరామర్శించారు. ప్రమాదానికి కారకులైనవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని బ్రిజేష్ పాఠక్ పేర్కొన్నారు.ఇది కూడా చదవండి: Medical College Fire: చిన్నారుల మృతి హృదయవిదారకం: ప్రధాని మోదీ -
Uttar Pradesh: మట్టిలో కూరుకుని నలుగురు మహిళలు దుర్మరణం
కాస్గంజ్: ఉత్తరప్రదేశ్‌లోని కాస్గంజ్లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. కాస్గంజ్లోని కస్బా మోహన్పురా గ్రామంలోని కొందరు మహిళలు మట్టిని తవ్వేందుకు వెళ్లారు. ఆ సమయంలో మట్టిలో కూరుకుపోయి ముగ్గురు మహిళలు, ఒక బాలిక మృతిచెందారు.ఈ ప్రమాదంలో మరో నలుగురికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మరికొందరు మహిళలు మట్టిలో కూరుకుపోయారని స్థానికులు అంటున్నారు. వారిని బయటకు తీసేందుకు సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి.ఘటనా స్థలంలో కాస్గంజ్ జిల్లా అధికారి మేధా రూపమ్, ఎస్పీ అపర్ణ రజత్ కౌశిక్ ఉన్నారు. వీరు సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. మట్టిని తవ్వేందుకు వెళ్లిన ప్రత్యక్ష సాక్షి, గాయపడిన మహిళ హేమలత మీడియాతో మాట్లాడుతూ దేవతాన్ పండుగ సందర్భంగా కాటోర్ రాంపూర్‌లోని మహిళలు తమ ఇంటిలోని పొయ్యిలకు రంగులు వేయడానికి పసుపు మట్టిని తవ్వడానికి వెళ్లారన్నారు.ఈ సమయంలో ఒక్కసారిగా పైనుంచి భారీగా మట్టి పడిపోవడంతో ఈ ప్రమాదం చోటుచేసుకున్నదని తెలిపారు. ఈ ఘోర ప్రమాదంపై ముఖ్యమంత్రి యోగి విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపిన ఆయన, ఘటనాస్థలంలో సహాయక చర్యలు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.ఇది కూడా చదవండి: ప్రేమలో విఫలమై కాశ్మీరీ యువతి ఆత్మహత్య..! -
మహిళల దుస్తుల కొలతలు పురుషులు తీసుకోవద్దు
లక్నో: అసభ్యకరంగా తాకుతూ దురుద్దేశంతో వ్యవహరించే పురుషుల నుంచి మహిళలకు రక్షణ కల్పించడానికంటూ ఉత్తరప్రదేశ్ మహిళా కమిషన్ పలు సంచలనాత్మక సిఫారసులను రూపొందించింది. వీటి ప్రకారం పురుషులు..టైలరింగ్ షాపుల్లో మహిళల కొలతల్ని తీసుకోరాదు.సెలూన్లలో మహిళల జుత్తు కత్తిరించరాదు. దుస్తుల దుకాణాలు, జిమ్‌లు, కోచింగ్ సెంటర్లలో సీసీటీవీలను తప్పనిసరిగా ఏర్పాటు చేయాలి. స్కూల్ బస్సుల్లో భద్రత కోసం మహిళా సిబ్బందిని నియమించాలి..వంటివి ఉన్నాయి. అక్టోబర్ 28వ తేదీన సమావేశమైన కమిషన్ ఈ మేరకు నిబంధనలను ఆమోదించింది. బహిరంగ ప్రదేశాల్లో పురుషుల నుంచి మహిళలను వేరుగా ఉంచేందుకు, మహిళలకు భద్రతను మెరుగుపరిచేందుకు ఉద్దేశించిన ఈ మార్గదర్శకాలను అమలు చేయాలంటూ అన్ని జిల్లాల మేజి్రస్టేట్లకు లేఖలు రాసింది. ‘చాలా చోట్ల జిమ్‌లలో మగ ట్రెయినర్లు, మహిళల బొటిక్‌లలో మగ దర్జీలు ఉంటున్నారు. వీరు మహిళలతో అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నట్లుగా ఇటీవలి కాలంలో ఎక్కువ ఫిర్యాదులు వస్తున్నాయి’అని యూపీ మహిళా కమిషన్ చైర్పర్సన్ బబితా చౌహాన్ తెలిపారు. ‘టైలర్లుగా మగవాళ్లుండటంపై మాకెలాంటి సమస్యా లేదు. మహిళల కొలతల్ని పురుషులు తీసుకోడంపైనే మా అభ్యంతరమంతా’అని ఆమె వివరించారు. ‘ఇలాంటి అన్ని చోట్లా శిక్షణ పొందిన మహిళల్ని నియమించుకోవాలి. ఇందుకు కొంత సమయం పట్టొచ్చు. కానీ, ఈ నిబంధనలను అమలు చేయడం వల్ల మహిళలకు మరిన్ని ఉపాధి అవకాశాలు అందుబాటులోకి వస్తాయి’అని ఆమె తెలిపారు.ఇదీ చదవండి: సీఎం సమోసాలు ఎవరు తీసుకున్నారు.. సీఐడీ దర్యాప్తు -
యూపీ మదర్సాచట్టంపై సుప్రీంకోర్టు కీలక తీర్పు
న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్ మదర్సా చట్టం రాజ్యాంగ విరుద్ధమని అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు మంగళవారం(నవంబర్ 5) కొట్టివేసింది. మదర్సా చట్టంలో రాజ్యాంగ ఉల్లంఘన ఏదీ లేదని స్పష్టం చేసింది. 17 లక్షల మంది విద్యార్థులు మరియు 10,వేల మంది మదర్సా ఉపాధ్యాయులను రాష్ట్ర విద్యా వ్యవస్థలో సర్దుబాటు చేయాలనే అలహాబాద్ హైకోర్టు ఆదేశాలను అత్యున్నత న్యాయస్థానం తోసిపుచ్చింది.ఈ మేరకు సుప్రీంకోర్టు చీఫ్‌జస్టిస్ డీవై చంద్రచూడ్ ఆధ్వర్యంలోని త్రిసభ్య ధర్మాసనం తీర్పు వెలువరించింది. మదర్సాచట్టాన్ని పూర్తిగా కొట్టివేయనవసరం లేదని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం సుప్రీంకోర్టు ముందు వాదనలు వినిపించింది. అభ్యంతరాలున్న పలు సెక్షన్లను సమీక్షించవచ్చని తెలిపింది.ఇదీ చదవండి: అన్ని ప్రైవేటు ఆస్పత్రులు ప్రభుత్వానివి కావు: సుప్రీంకోర్టు -
తాతలు ఉత్తరాలు బట్వాడా చేసేవారని..
బహ్రాయిచ్ : ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఓ వ్యక్తి అత్యంత విచిత్రమైన రీతిలో పొట్టపోసుకుంటున్నాడు. జిల్లాకు చెందిన సురేష్ కుమార్ గత 40 ఏళ్లుగా పోస్ట్‌మ్యాన్ రూపంలో ఇంటింటికీ తిరుగుతున్నాడు. ప్రజల ముఖాల్లో చిరునవ్వులు పూయిస్తూ, తన కుటుంబాన్ని పోషించుకునేందుకు ఈ వింత పంథాను ఎంచుకున్నాడు. తన తాత, ముత్తాతల కాలం నుంచి తమ కుటుంబంలోని వారు ఉత్తరాలు బట్వాడా చేసేవారని సురేష్ కుమార్ మీడియాకు తెలిపారు. పూర్వంరోజుల్లో అతని పూర్వీకులు బ్రిటీష్ వారికి ఉత్తరాలు అందజేసేవారట. ఇప్పుడు సురేష్ పోస్ట్‌మ్యాన్ గెటప్‌తో అందరినీ పలుకరిస్తున్నాడు. దీనికి ప్రతిఫలంగా వారు ఏది ఇచ్చినా తీసుకుంటూ, దానితో కుటుంబాన్ని పోషిస్తున్నాడు.సురేశ్ ఉత్తరప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో పోస్ట్‌మ్యాన్ వేషధారణతో తిరుగుతుంటాడు. ఇంటింటికీ వెళ్లి మీ పేరు మీద ఉత్తరం వచ్చిందని వారికి చెబుతుంటాడు. వారు తొలుత అతనిని పోస్ట్‌మ్యాన్‌గా భావిస్తారు. తరువాత విషయం తెలుసుకుని, ఆనందంగా తమకు తోచినంత సురేష్‌కు ముట్టజెపుతుంటారు.స్థానికులు అతనిని పోస్ట్‌మ్యాన్ అని పిలుస్తుంటారు. సురేష్ కుమార్ పోస్ట్‌మ్యాన్ యూనిఫాం ధరించి, తలపై టోపీ పెట్టుకుంటాడు. అలాగే కళ్లద్దాలు కూడా పెట్టుకుంటాడు. చేతిలో వైర్లెస్ వాకీ-టాకీ కూడా ఉంటుంది. ఒకప్పుడు ఎంతో గొప్పగా వెలుగొందిన ఈ వృత్తిని అనుకరిస్తూ సురేష్ కుమార్ పొట్టపోసుకోవడం విశేషమే మరి.ఇది కూడా చదవండి: ఆ పేరుతో సర్టిఫికెట్ మార్చి ఇస్తాం -
18 అడుగుల శానిటరీ ప్యాడ్ రూపొందించి..
నోయిడా: మహిళల రుతుక్రమానికి సంబంధించిన అపోహలను తొలగించేందుకు, దీనిపై మరింత అవగాహనం పెంపొందించేందుకు యూపీలోని నోయిడాలో గల ఛాలెంజర్స్ గ్రూప్ గర్ల్స్ ఇంటర్ కాలేజ్ ప్రత్యేక కార్యక్రమం నిర్వహించింది.దీనిలో భాగంగా మహిళా సాధికారతకు చిహ్నంగా 81 అడుగుల పొడవు, 29 అడుగుల వెడల్పు కలిగిన శానిటరీ ప్యాడ్‌ను రూపొందించారు. ఛాలెంజర్స్ గ్రూప్ ట్రస్ట్ నిర్వహించిన ఈ కార్యక్రమంలో 1200 మంది బాలికలు పాల్గొన్నారు. ఆరు వేల శానిటరీ ప్యాడ్లను ఉచితంగా పంపిణీ చేశారు. బహిష్టు సమయంలో పరిశుభ్రత ప్రాముఖ్యత గురించి నిర్వాహకులు బాలికలకు అవగాహన కల్పించారు.వైద్య నిపుణురాలు శాలిని ఆధ్వర్యంలో పలు అవగాహనా కార్యక్రమాలు, క్విజ్ పోటీ, పోస్టర్ పోటీలను కూడా నిర్వహించారు. ఈ సందర్భంగా ఛాలెంజర్స్ గ్రూప్ వ్యవస్థాపకుడు, చైర్మన్ ప్రిన్స్ శర్మ మాట్లాడుతూ మహిళలు, బాలికలకు రుతుక్రమంలో పరిశుభ్రత, ఆరోగ్యంపై అవగాహన కల్పించేందుకు ‘ది పవర్ ఆఫ్ షీ’ అనే కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు. ఛాలెంజర్స్ గ్రూప్ మురికివాడలు, పాఠశాలలు, కళాశాలలను సందర్శిస్తూ, అక్కడి బాలికలకు రుతుక్రమం సమయంలో పాటించాల్సిన పరిశుభ్రత గురించి తెలియజేస్తుందన్నారు.ఇది కూడా చదవండి: కుటుంబ బాధ్యతల్లో బ్యాలెన్స్ అవసరం -
అటు అమ్మాయి, ఇటు వ్యాపారం, ఇలాంటి పెళ్లి ప్రకటన ఎపుడైనా చూశారా?
పెళ్లి చేసి చూడు.. ఇల్లు కట్టు చూడు అన్నది మనం ఎప్పటినుంచో వింటున్న సామెత. కానీ ఒక యువకుడు తన పెళ్లి కోసం వినూత్నంగా ప్రయత్నించాడు. కూటికోసం కాదు.. కాదు.. కళ్యాణం కోసం కోటి విద్యలు అన్నట్టు మ్యాట్రిమోనియల్ సైట్లో ఒక ప్రకటన ఇచ్చాడు. తనవ్యక్తిగత వివరాలతోపాటు, ఆదాయం గురించి చెప్పాడు. అంతేకాదు ఇంకో ట్విస్ట్ కూడా ఉంది. ప్రస్తుతం ఇది నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది.ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌కు చెందిన 26 ఏళ్ల ఇన్వెస్టర్ పెళ్లి ప్రకటన వివరాలు ఇలా ఉన్నాయిఒడ్డూ పొడుగు, ఇతర వివరాలతో పాటు తాను సంవత్సరానికి 29 లక్షల రూపాయలు సంపాదిస్తున్నట్లు పేర్కొన్నాడు. అలాగే తన ఆదాయం ప్రతీ ఏడాదీ 54 శాతం వృద్ధి చెందుతోందన్నాడు. ఇంతవరకు బాగానే ఉంది. తాను స్టాక్మార్కెట్లో పెట్టుబడులు పెట్టి బాగా లాభాలు ఆర్జిస్తున్నట్టు చెప్పుకొస్తూ తాను ఆర్థికంగా ఎలా నిలదొక్కుకున్నదీ వెల్లడించాడు. సేఫ్ ఇన్వెస్టింగ్ సంబంధించిన విజ్ఞానాన్ని స్వయంగా నేర్చుకున్నానని చెప్పాడు.అలా స్వీయ అనుభవంతో తన పెట్టుబడులు బాగా పెరిగాయని చెప్పాడు. ఆగండి.. స్టోరీ ఇక్కడితో అయిపోలేదు. మంచి లాభాలు సాధించాలంటే తన పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కూడా నా దగ్గర ఉందంటూ ఊరించాడు. "సురక్షిత పెట్టుబడి"కి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ అంటూ ఆఫర్ చేశాడు. ఆసక్తి ఉన్న ఎవరికైనా 16-స్లయిడ్ ప్రెజెంటేషన్ వాట్సాప్ ద్వారా పంపిస్తానని ప్రకటించాడు.What all bull market does to people. Rough calculations show that he was 10 year old when 2008 GFC hit us. @ActusDei - maybe someone from your team should reach out to him. Not for matrimonial but for that ppt! 😉 pic.twitter.com/9jAquIy1co— Samit Singh (@kumarsamit) October 6, 2024మాజీ-బ్యాంకర్ సమిత్ సింగ్ ఎక్స్‌లో ఈ పోస్ట్‌ను షేర్ చేశారు. దీంతో నెటిజన్లు అంతా బిజినెస్ భాషలోనే కమెంట్లు వెల్లువెత్తాయి. "షార్ట్ సెల్లర్ (స్టాక్మార్కెట్లో షేర్ నష్టపోతుంది తెలిసి ముందే అమ్మేయడం) ఇన్వెస్టర్లా కనిపిస్తున్నాడు అని ఒకరు, విన్-విన్ సిట్యువేషన్‌ని టార్గెట్ చేసినట్టున్నాడు, అటు అమ్మాయిని వెదుక్కోవడం ఇటు, తన పవర్‌పాయింట్ ప్రెజెంటేషన్‌ను కూడా ప్రచారం చేసుకోవడం రెండూ ఒకేసారి చేస్తున్నాడు అంటూ మరొకరు కమెంట్ చేశారు. ‘‘అమ్మో..ఇతగాడు తొందర్లోనే వారెన్ బఫెట్ అయిపోయేలా ఉన్నాడు’’, ‘‘అమ్మాయి లక్షణాలకు సంబంధించిఎలాంటి డిమాండ్ లేదట.. అంటే కాల్ ఆప్షన్’’ అన్నమాట, ‘‘ఇదేదో మోసంలా ఉంది, జాగ్రత్తగా ఉండాలి..’’ఇలా రకరకాల కమెంట్స్ పోస్ట్ చేశారు. మొత్తానికి పీపీటి కమ్, మేట్రిమోనియల్యాడ్ ఇంటర్నెట్లో హల్చల్ చేస్తోంది. -
నేటి నుంచి యూపీ ఇంటర్నేషనల్ ట్రేడ్ షో
లక్నో: ఉత్తరప్రదేశ్ ఇంటర్నేషనల్ ట్రేడ్ షో (యూపీఐటీఎస్) నేటి (బుధవారం) నుంచి ప్రారంభం కానుంది. ఇది సెప్టెంబర్ 25 నుండి సెప్టెంబర్ 29 వరకకూ కొనసాగనుంది. గ్రేటర్ నోయిడాలోని ఇండియా ఎక్స్పో సెంటర్లో నేడు ఉపరాష్ట్రపతి జగ్దీప్ ధన్ఖర్ దీనిని ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, పరిశ్రమల శాఖ మంత్రి నంద్ గోపాల్ గుప్తా నంది తదితరులు హాజరుకానున్నారు.ఈ ప్రదర్శనను ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం, ఇండియా ఎక్స్పొజిషన్ లిమిటెడ్ సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. ప్రదర్శనలో 2500కి పైగా స్టాళ్లు ఏర్పాటు చేయనున్నారు. 70 దేశాల నుంచి దాదాపు 500 మంది విదేశీ కొనుగోలుదారులు ఈ అంతర్జాతీయ వాణిజ్య ప్రదర్శనను సందర్శించనున్నారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధిని ప్రతిబింబించేలా ఈ ప్రదర్శన ఉండనుంది. 'वैश्विक व्यापार का महाकुंभ'Uttar Pradesh International Trade Show के द्वितीय संस्करण का उद्घाटन आज माननीय उपराष्ट्रपति श्री जगदीप धनखड़ जी के कर कमलों से सम्पन्न होगा।कार्यक्रम में #UPCM श्री @myogiadityanath जी की भी गरिमामयी उपस्थिति रहेगी।दिनांक: 25 सितंबर 2024समय:… pic.twitter.com/wAk8ZggvqN— Government of UP (@UPGovt) September 25, 2024గ్రేటర్ నోయిడాలోని ఇండియా ఎక్స్పో మార్ట్‌లో జరిగిన ప్రీ-ఈవెంట్ బ్రీఫింగ్లో మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ (ఎంఎస్ఎంఈ) మంత్రి రాకేష్ సచన్ మాట్లాడుతూ ఈ ఏడాది ట్రేడ్ ఫెయిర్ గత సంవత్సరం కంటే మెరుగ్గా ఉంటుందని అన్నారు. యూపీ ఆర్థికాభివృద్ధికి యూపీఐటీఎస్ చిహ్నంగా మారిందని సచన్ తెలిపారు. ఈ సంవత్సరం ఐదు లక్షల మంది సందర్శకులు వస్తారని భావిస్తున్నామన్నారు.ఇది కూడా చదవండి: ప్రాణం తీసిన కొత్త ఫోను సంబురం -
స్నానం చేయడు.. గంగాజలం చల్లుకుంటాడు.. నా కొద్దీ పెనిమిటి!
భార్యా భర్తలమధ్య విభేదాలు వచ్చినపుడు విడిపోవడం సహజం. ఇక ఇద్దరి మధ్యా సంబంధాలు ఒక కొనసాగలేవు అనుకున్నపుడు విడాకులకు దరఖాస్తు చేసుకుంటారు. ఈ వ్యవహారం ఒక్కోసారి పరస్పర అంగీకారంతో ఈజీగా అయిపోతుంది కూడా. అయితే విడాకులకు సంబంధించి కొన్ని విస్తుపోయే కేసులు గతంలో చాలానే వెలుగులోకి వచ్చాయి. తాజాగా వెలుగులోకి వచ్చిన విడాకుల కేసు పలువురిని ఆలోచనలో పడేసింది. విషయం ఏమిటంటే..ఉత్తర ప్రదేశ్‌లోని ఆగ్రాలో 40 రోజులకే తన భర్త నుంచి విడాకులు కావాలంటూ కోర్టు మెట్లెక్కింది. విడాకులు తీసుకోవడానికి కారణం తెలిస్తే మాత్రం అవాక్కవ్వాల్సిందే. తన భర్త రాజేష్ 40 రోజుల్లో ఆరు సార్లు మాత్రమే స్నానం చేశాడనీ, దీంతో అతని శరీరం నుంచే ఆ దుర్వాసనను భరించలేక పోతోంది. పైగా వారానికోసారి పవిత్రంగా భావించే గంగాజలాన్ని చల్లుకుంటాడట. ఇక అతనితో జీవించడం తన వల్ల కాదని కోర్టును ఆశ్రయించింది. పెళ్లయినప్పటి నుంచీ అదీ తాను బలవంతంగా చేయగా కేవలం ఆరు సార్లుమాత్రమే స్నానం చేశాడు. దీంతో రాజేష్ భార్య మహిళ కుటుంబ సభ్యులు భర్త రాజేష్ పై వరకట్న వేధింపుల కేసు నమోదు చేసింది విడాకులు కావాలని కోరింది.అలిగి పుట్టింటికి వెళ్లింది. అయితే ఫ్యామిలీ కౌన్సెలింగ్ తరువాత డైలీ స్నానం చేసేందుకు పరిశుభ్రంగా ఉండేందుకు రాజేష్ ఒప్పుకున్నాడు. కానీ ఆ మహిళ అతడితో ఉండడానికి ఇష్టం పడటం లేదు. దీంతో మరోసారి సెప్టెంబర్ 22న కౌన్సిలింగ్ కు రావాలని వెల్లడించారు అధికారులు.కాగా ఇలాంటి అరుదైన కేసులు నమోదు కావడం ఇదే మొదటి సారి కాదు. భర్త కుర్ కురే ప్యాకెట్ ఇవ్వలేదని విడాకులు కోరిన ఘటన ఇటీవల ఆగ్రాలో వచ్చిన సంగతి తెలిసిందే. -
Uttar Pradesh: తప్పిన రైలు ప్రమాదం.. అనుమానిత వస్తువులు స్వాధీనం
కాన్పూర్: ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో తృటిలో ఘోర రైలు ప్రమాదం తప్పింది. కాన్పూర్‌లోని అన్వర్గంజ్-కాస్గంజ్ రైలు మార్గంలో భివానీకి వెళ్లే కాళింది ఎక్స్‌ప్రెస్ ప్రమాదానికి గురయ్యింది. వేగంగా వెళుతున్న ఈ రైలు.. పట్టాలపై ఎవరో ఉంచిన సిలిండర్‌ను బలంగా ఢీకొంది. ఈ ఘటన వెనుక కుట్ర దాగివుందని రైల్వే వర్గాలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి.మీడియాకు అందిన వివరాల ప్రకారం కాళింది ఎక్స్‌ప్రెస్ ప్రయాగ్‌రాజ్ నుండి కాన్పూర్ సెంట్రల్ మీదుగా భివానీకి వెళ్తోంది. శివరాజ్‌పూర్ సమీపంలో సిలిండర్‌తో పాటు మరికొన్ని వస్తువులను ఈ రైలు ఢీకొంది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న ఆర్పీఎఫ్ బృందం సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించింది.విచారణ అనంతరం ఆర్పీఎఫ్ ఇన్స్పెక్టర్ ఓపీ మీనా బృందం సిలిండర్‌ను స్వాధీనం చేసుకుంది. అలాగే సంఘటనా స్థలంలోపలు అనుమానాస్పద వస్తువులను కూడా స్వాధీనం చేసుకున్నారు. సిలిండర్ దొరికిన ప్రదేశంలో ఒక సీసాలో పసుపు రంగు పదార్థం, తెల్లటి పొడి కనిపించింది. రైలును కొద్దిసేపు నిలిపివేసి, ఆ మార్గాన్ని పరిశీలించిన అనంతరం ఆ రైలును ముందుకు వెళ్లేందుకు అధికారులు అనుమతించారు. ఈ ఘటనపై రైల్వే అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. -
యూపీలో మరో రైలు ప్రమాదం
ఉత్తరప్రదేశ్‌లో మరో రైలు ప్రమాదం చోటుచేసుకుంది. కాస్గంజ్-కాన్పూర్ రైల్వే లైన్లో కాస్గంజ్ నుంచి ఫరూఖాబాద్ వెళ్తున్న ప్యాసింజర్ రైలు ప్రమాదానికి గురయ్యింది. ట్రాక్‌పై ఉంచిన భారీ కర్ర దుంగను ప్యాసింజర్ రైలు బలంగా ఢీకొంది. దానిని రైలు ఇంజిన్ 550 మీటర్ల దూరంవరకూ ఈడ్చుకెళ్లడంతో ఇంజిన్ ముందు భాగంలో దుంగ ఇరుక్కుపోయింది. ఒక్కసారిగా పెద్ద శబ్ధం రావడంతో డ్రైవర్ రైలును నిలిపివేశారు.ఈ ఘటనలో ప్రమాదమేమీ జరగలేదు. సమాచారం అందుకున్న రైల్వే సీనియర్ సెక్షన్ ఇంజనీర్ గుర్తు తెలియని వ్యక్తులపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. కాన్పూర్ డివిజన్లో వారం వ్యవధిలో ఇది రెండో రైలు ప్రమాదం. గత శుక్రవారం నాడు పంకిలో బండరాయిని ఢీకొనడంతో సబర్మతి ఎక్స్‌ప్రెస్ బోగీలన్నీ పట్టాలు తప్పాయి. ఆ ఘటనపై విచారణ కొనసాగుతోంది. తాజాగా కాస్గంజ్ నుండి ఫరూఖాబాద్ వెళ్లే ప్రత్యేక రైలు (05389) భటాసా స్టేషన్ సమీపంలో ట్రాక్‌పై ఉంచిన భారీ కర్ర దుంగను ఢీకొంది. నాలుగున్నర అడుగుల పొడవున్న దుంగ బరువు 35 కిలోలు ఉంటుందని రైల్వే అధికారులు తెలిపారు.సెక్షన్ ఇంజనీర్ రైల్వే పాత్ జహీర్ అహ్మద్, ఆర్పీఎఫ్ ఇన్ చార్జి పోలీస్ స్టేషన్ ఆఫీసర్ అంకుష్ కుమార్, ఇంజన్ విభాగానికి చెందిన రాజేష్ కుమార్ సంఘటనా స్థలానికి చేరుకున్నారు. వారు ఆ కర్ర దుంగను తొలగించి 33 నిమిషాల తర్వాత రైలును పంపించారు. ఘటనా స్థలానికి 50 అడుగుల దూరంలో ఒక పొలంలో మృతదేహం పడివుండటాన్ని వారు గమనించి పోలీసులకు సమాచారమిచ్చారు. -
UP By Election : సంఘ్ చేతికి బీజేపీ ఉప ఎన్నికల బాధ్యతలు
మొన్నటి యూపీ లోక్‌సభ ఎన్నికల్లో నిరాశాజనక ఫలితాల తర్వాత బీజేపీలో అంతర్గత పోరు చోటుచేసుకుంది. ఇప్పుడు దీనిని ఆపేందుకు రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ముందుకొచ్చింది. ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, సంఘ్ నేత అరుణ్‌కుమార్‌ల సమక్షంలో సమావేశం జరిగింది.ప్రభుత్వం- సంఘ్ మధ్య మెరుగైన సమన్వయంతో పాటు ఉప ఎన్నికల వ్యూహం, పార్టీ ప్రతినిధుల నియామకం తదితర పలు అంశాలపై ఈ సమావేశంలో చర్చ జరిగింది. రాబోయే ఉప ఎన్నికల సన్నాహాల్లో బీజేపీతో పాటు సంఘ్ కార్యకర్తలను కూడా భాగస్వాములను చేయాలని సమావేశంలో నిర్ణయించారు.దాదాపు రెండున్నర గంటల పాటు సీఎం నివాసంలో జరిగిన ఈ సమావేశంలో.. పార్టీలో పరిస్థితి ఇలాగే కొనసాగితే మున్ముందు బీజేపీ నష్టపోవాల్సి వస్తుందని సంఘ్ నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో ముందస్తు ఎన్నికలతో పాటు ప్రభుత్వం, సంఘ్ మధ్య పరస్పర సమన్వయంపై చర్చ జరిగింది. రాబోయే ఉప ఎన్నికల్లో కీలక బాధ్యతలను సంఘ్‌కు అప్పగించాలని బీజేపీ నేతలు నిర్ణయించారు. ఉపముఖ్యమంత్రులు కేశవ్ ప్రసాద్ మౌర్య, బ్రజేష్ పాఠక్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు భూపేంద్ర చౌదరి, ఆర్గనైజేషన్ జనరల్ సెక్రటరీ ధరంపాల్ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. -
యూపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఎనిమిదిమంది మృతి
ఉత్తరప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. షికార్పూర్-బులంద్‌షహర్ రోడ్డులో పికప్ వ్యాన్, ప్రైవేట్ బస్సు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోగా, 21 మంది గాయపడ్డారు. మృతులంతా అలీఘర్ జిల్లాలోని అత్రౌలీ తహసీల్‌లోని రాయ్‌పూర్ ఖాస్ అహిర్ నాగ్లా గ్రామానికి చెందినవారు. గాయపడినవారంతా ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రాయ్‌పూర్ ఖాస్ అహిర్ నాగ్లా గ్రామానికి చెందిన 40 మంది పికప్ వ్యాన్‌లో ఘజియాబాద్ నుంచి అలీగఢ్ వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. వీరు బులంద్‌షహర్ రోడ్డులో ఉన్న ఒక ఫుడ్ కంపెనీలో పనిచేస్తుంటారు. ఆదివారం ఉదయం వీరంతా పికప్ వ్యాన్‌లో ఘజియాబాద్ నుంచి తమ ఇళ్లకు బయలుదేరారు. సేలంపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎదురుగా వస్తున్న ఒక ప్రైవేట్ బస్సు వీరు ప్రయాణిస్తున్న పికప్ వ్యాన్‌ను ఢీకొంది.ఈ ప్రమాదంలో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందగా, జిల్లా ఆస్పత్రిలో అత్యవసర చికిత్స పొందుతూ ముగ్గురు మృతి చెందారు. మరో 21 మంది గాయపడ్డారు. సమాచారం అందుకున్న వెంటనే ప్రభుత్వ అంబులెన్స్ ఘటనాస్థలికి చేరుకుంది. దానిలోని సిబ్బంది క్షతగాత్రులను జిల్లా ఆస్పత్రికి తరలించారు. జిల్లా మెజిస్ట్రేట్ చంద్రప్రకాష్ సింగ్, ఎస్ఎస్పీ శ్లోక్‌కుమార్ జిల్లా ఆస్పత్రికి చేరుకుని, క్షతగాత్రులను పరామర్శించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
పట్టాలు తప్పిన సబర్మతి ఎక్స్‌ప్రెస్
లక్నో: సబర్మతి ఎక్స్‌ప్రెస్ శనివారం(ఆగస్టు17) తెల్లవారుజామున పట్టాలు తప్పింది. ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్ రైల్వేస్టేషన్లో రైలు పెద్ద రాయిని గుద్దుకోవడంతో 12 బోగీలు పట్టాలు తప్పాయని నార్త్ సెంట్రల్ రైల్వే అధికారులు తెలిపారు.ఈ ప్రమాదంలో ప్రయాణికులెవరికీ ఏమీ కాకపోవడంతో రైల్వే అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే వారణాసి జంక్షన్ అహ్మదాబాద్ రూట్లో పలు రైలు సర్వీసులకు అంతరాయం కలిగింది. సబర్మతి ఎక్స్‌ప్రెస్ ప్రయాణికులను వేరే రైలులో గమ్యస్థానాలకు తరలించారు. -
ఆకతాయి పనితో కదులుతున్న ట్రైన్ నుంచి దూకిన ప్రయాణికులు
కదులుతున్న ట్రైన్లో మంటలు చెలరేగుతున్నాయనే అకతాయిలు చేసిన పుకార్లు ప్రయాణికులు ప్రాణాల మీదకు తెచ్చాయి. ఉత్తరప్రదేశ్ బిల్పూర్ రైల్వే స్టేషన్ సమీపంలో ప్యాసింజర్లు ప్రయాణిస్తున్న ట్రైన్లో మంటలు చెలరేగుతున్నాయని పుకార్లు వ్యాపించాయి. దీంతో ఆందోళనకు గురైన ప్రయాణికులు కదులుతున్న ట్రైన్ నుంచి బయటకు దూకారు. ఈ ప్రమాదంలో ఆరుగురు ప్రయాణికులు తీవ్రంగా గాయపడినట్లు రైల్వే పోలీస్ అధికారులు తెలిపారు.మొరాదాబాద్ డివిజన్ పరిధిలోకి వచ్చే బిల్పూర్ స్టేషన్ సమీపంలోని హౌరా-అమృత్సర్ మెయిల్ జనరల్ కోచ్‌లో ఈ సంఘటన జరిగింది . గాయపడిన వారిని అన్వారీ (26), అఖ్తరీ (45), కుల్దీప్ (26), రూబీ లాల్ (50), శివ శరణ్ (40), చంద్రపాల్ (35)లుగా గుర్తించారు. ఆరుగురు ప్రయాణికులను షాజహాన్‌పూర్ మెడికల్ కాలేజీలో చేర్చినట్లు జీఆర్పీ స్టేషన్ ఇన్ఛార్జ్ రెహాన్ ఖాన్ వెల్లడించారు. రైల్వే స్టేషన్లో గందరగోళంరైలు బరేలీలోని బిల్పూర్ స్టేషన్‌కు చేరుకోగానే గందరగోళం నెలకొంది. రైలులో మంటలు చెలరేగిపోయాయనే పుకారుతో ప్రయాణికులు ఆందోళనకు గురైరయ్యారు. భయాందోళనతో ట్రైన్ చైన్ లాగారు. చాలా మంది ప్రయాణికులు ఇంకా కదులుతున్న రైలు నుండి దూకడంతో తీవ్రంగా గాయపడ్డారు.రైల్లో చోటు చేసుకున్న ఘటనపై రెహాన్ ఖాన్ మాట్లాడుతూ.. కొంతమంది ఆకతాయిలు గాల్లో మంటలు వ్యాపించాయనే పుకార్లు పుట్టించినట్లు మా దృష్టికి వచ్చింది. పుకార్లు చేసిన అనంతరం ట్రైన్ చైన్ లాగినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ ఘటనపై రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్పీఎఫ్) దర్యాప్తు చేస్తుందని ఆయన తెలిపారు. భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటామని అన్నారు. -
సొంత పార్టీని యోగి ఫూల్ చేశారు: అఖిలేష్ కౌంటర్
లక్నో: ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్‌కు సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ) చీఫ్ అఖిలేష్ యాదవ్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. యోగి అంటున్నట్లు తానెవరినీ ఫూల్స్ చేయలేదని, లోక్‌సభ ఎన్నికల్లో యోగి ఆయన సొంత పార్టీ అధిష్టానాన్నే ఫూల్‌ను చేశారని అఖిలేష్ ఎద్దేవా చేశారు. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీలో సమాజ్‌వాదీ ఫ్లోర్‌లీడర్(ఎల్వోపీ)గా మాతా ప్రసాద్ పాండేను నియమించడంపై అఖిలేష్‌పై యోగి సెటైర్లు వేశారు. అసెంబ్లీ సెషన్ ప్రారంభం సందర్భంగా ప్రసాద్పాండేకు స్వాగతం చెబుతూనే ఎల్వోపీ పదవి ఇవ్వకుండా మామ శివపాల్‌యాదవ్‌ను అఖిలేష్ ఫూల్‌ను చేశారన్నారు. అఖిలేష్ ఎప్పుడూ భయపడుతూనే ఉంటాడని చురకలంటించారు.అయినా మామ శివపాల్‌కు మోసపోవడం అలవాటైపోయిందన్నారు. దీనికి స్పందించిన అఖిలేష్ తానెవరినీ ఫూల్‌ను చేయలేదని, యోగి ఏకంగా ఆయన పార్టీ హైకమాండ్‌నే ఫూల్‌ను చేశారని కౌంటర్ ఇచ్చారు. ఇక శివపాల్ యాదవ్ ఇదే విషయమై స్పందిస్తూ 2027లో యూపీలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఎస్పీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. సమాజ్‌వాదీపార్టీలో అందరం సమానమేనన్నారు. -
యూపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. తల్లికొడుకులు మృతి
లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఢిల్లీ-మీరట్ ఎక్స్‌ప్రెస్ హైవేపై రాంగ్ రూట్లో వేగంగా దూసుకువచ్చిన కారు రోడ్డుపై వెళుతున్న ఓ స్కూటర్‌ను బలంగా ఢీకొట్టింది. దీంతో స్కూటర్‌పై వెళుతున్న తల్లికొడుకులు రోడ్డుపై చాలా దూరం ఎగిరిపడ్డారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఇద్దరినీ ఆస్పత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందారు. శనివారం(జులై 20) జరిగిన ఈ ప్రమాద దృశ్యాలు సీసీటీవీలో నమోదయ్యాయి. ప్రమాదానికి కారణమైన కారు డ్రైవర్‌ను అరెస్టు చేశామని, కేసు దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు తెలిపారు. -
యూపీ, రాజస్థాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదాలు
లక్నో/జైపూర్: యూపీ, రాజస్థాన్‌లలో గురువారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదాల్లో మొత్తం 11 మంది మృతి చెందారు. రాజస్థాన్‌లోని బికనీర్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతి చెందారు. మృతులంతా హర్యానాకు చెందిన వారని సమాచారం. ప్రమాదంలో కారు ముందుభాగం నుజ్జునుజ్జవడంతో అందులో ఇరుక్కున్నవారి మృతదేహాలను బయటికి తీయడం కష్టంగా మారింది. ప్రమాద తీవ్రతకు కారులో నుంచి ఇద్దరు దూరంగా పడి అక్కడికక్కడే ప్రాణాలు వదిలారు. ఉన్నావోలో ఘోర ప్రమాదం.. అయిదుగురు మృతి ఉత్తరప్రదేశ్‌లోని లక్నో-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఉన్నావో వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఒక స్కార్పియో వాహనం వేగంగా ట్రక్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అయిదుగురు మృతి చెందారు. పలువురికి గాయాలయ్యాయి. స్కార్పియో ఢిల్లీ నుంచి అయోధ్య వెళుతున్నట్లు పోలీసులు చెప్పారు. -
యూపీ బీజేపీలో సమూల మార్పులు..?
లక్నో: ఉత్తరప్రదేశ్‌లో పార్టీని సమూల ప్రక్షాళన చేసేందుకు బీజేపీ హై కమాండ్ సిద్ధమైంది. ఇందులో భాగంగానే లక్నో విచ్చేసిన పార్టీ జాతీయ ప్రెసిడెంట్ నడ్డా డిప్యూటీ సీఎం కేశవ్‌ప్రసాద్ మౌర్య, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు భూపేందర్ చౌదరితో సుదీర్ఘ మంతనాలు జరిపారు. పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవితో సహా పలు స్థానాల్లో మార్పులు చేసే విషయమై చర్చించినట్లు తెలుస్తోంది.ఓబీసీల్లో పట్టుండంతో పాటు ఆర్ఎస్ఎస్ బ్యాక్‌గ్రౌండ్ ఉన్న డిప్యూటీ సీఎం మౌర్యకు పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవి ఇవ్వనున్నట్లు ప్రచారం జరుగుతోంది. మౌర్యకు, సీఎం ఆదిత్యనాథ్‌కు పొసగడం లేదని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇటీవల జరిగిన రెండు కేబినెట్ మీటింగ్‌లకు మౌర్య హాజరవకపోవడం చర్చనీయాంశమైంది.ఈ కారణంతోనే మౌర్య ప్రభుత్వం నుంచి తప్పుకుని పార్టీ చీఫ్‌గా వెళ్లే అవకాశముంది. పార్టీ గ్రూపులుగా చీలిపోయిందని కొందరు నేతలు నడ్డాకు ఫిర్యాదు చేశారు. ఇటీవల లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి ఎదురుదెబ్బ తగలడంతో దిద్దుబాటు చర్యలకు పార్టీ అధిష్టానం రంగంలోకి దిగింది. యూపీలో సీట్లు కోల్పోవడంతో కేంద్రంలో బీజేపీ ఒంటరిగా మ్యాజిక్‌ఫిగర్‌ను దాటలేక ఎన్డీఏ పార్టీలపై ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. -
యూపీలో బీజేపీ వెనుకంజ అందుకే.. యోగి సంచలన వ్యాఖ్యలు
లక్నో: లోక్‌సభ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ వెనుకబడడంపై సీఎం యోగి ఆదిత్యనాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు. అతి నమ్మకమే పార్టీ కొంప ముంచిందన్నారు. లక్నోలో ఆదివారం(జులై 14) జరిగిన బీజేపీ వర్కింగ్ కమిటీ మీటింగ్‌లో యోగి మాట్లాడారు. ‘ఎన్నికల్లో కొన్ని ఓట్లు, సీట్లు కోల్పోయాం.దీంతో గతంలో మన చేతిలో ఓడిపోయిన ప్రతిపక్షం ఎగిరెగిరి పడుతోంది. అంత మాత్రానా బీజేపీ వెనక్కి వెళ్లాల్సిన అవసరం లేదు. మనమెన్నో మంచి పనులు చేశాం. ప్రతిపక్షంలో ఉన్నపుడు ప్రజల కోసం పోరాడాం. అధికారంలోకి వచ్చాక శాంతిభద్రతలు, మౌలిక సదుపాయాలు పటిష్టం చేశాం. యూపీని మాఫియా రహితంగా చేశాం’అని యోగి అన్నారు. కాగా, ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో యూపీలో బీజేపీ కేవలం 33 ఎంపీ సీట్లు మాత్రమే గెలుచుకున్న విషయం తెలిసిందే. రాష్ట్రంలో ప్రతిపక్షపార్టీ సమాజ్‌వాదీ(ఎస్పీ) 37 సీట్లు గెలుచుకుని ముందంజలో నిలిచింది. -
యూపీలో వరదలు.. జలదిగ్బంధంలో వందల గ్రామాలు
భారీ వర్షాలకు తోడు నేపాల్ నుంచి వస్తున్న వరదనీరు ఉత్తరప్రదేశ్‌ను అతలాకుతలం చేస్తోంది. రాష్ట్రంలోని బహ్రైచ్, శ్రావస్తి, గోండా, బలరాంపూర్, అయోధ్య, అంబేద్కర్ నగర్, బారాబంకి, సీతాపూర్ పరిధిలోని దాదాపు 250 గ్రామాలు వరద నీటిలో చిక్కుకున్నాయి. అలాగే లఖింపూర్ ఖేరీలోని 150 గ్రామాలు, షాజహాన్‌పూర్‌లోని 30, బదౌన్‌లోని 70, బరేలీలోని 70, పిలిభిత్‌లోని 222 గ్రామాలకు చెందిన ప్రజలు వరద నీటిలోనే కాలం వెళ్లదీయాల్సిన పరిస్థితి ఏర్పడింది. వరదల కారణంగా పూర్వాంచల్‌లోని బల్లియాలో పలు ఇళ్లు కొట్టుకుపోయాయి. వరుసగా రెండవ రోజు ఢిల్లీ-లక్నో హైవేపై గర్రా నది వరద నీరు నిలిచిపోవడంతో ఈ మార్గంలో అధికారులు వాహనాల రాకపోకలను నిలిపివేశారు. మొరాదాబాద్- లక్నో మధ్య 22 రైళ్లను నెమ్మదిగా నడుపుతున్నారు. షాజహాన్‌పూర్‌లోని ప్రభుత్వ వైద్య కళాశాలలోకి వరద నీరు చేరడంతో బాధితులను సమీపంలోని ఆస్పత్రులకు తరలించారు.షాజహాన్‌పూర్ నగర శివార్లలోని హౌసింగ్ డెవలప్మెంట్ కాలనీతో సహా ఇతర లోతట్టు ప్రాంతాలకు చెందిన సుమారు 10 వేల మంది సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లారు. ఎన్డీఆర్ఎఫ్ బృందం 225 మందిని రక్షించింది. ఎస్ఎస్ కళాశాల లైబ్రరీలోని వందల పుస్తకాలు నీట మునిగాయి. ఖేరీ, షాజహాన్‌పూర్, బరేలీకి చెందిన ఆరుగురు వరద నీటిలో కొట్టుకుపోయారు. గురువారం ఉదయం 11 గంటలకు షాజహాన్‌పూర్ హైవేపైకి వరద నీరు రావడంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. -
ఉత్తరప్రదేశ్.. రక్తదానంలో నంబర్ వన్
రక్తదానం చేయడంలో ఉత్తరప్రదేశ్ ప్రజలు ముందున్నారు. రాష్ట్ర జనాభాలోని 14.61 శాతం మంది ప్రజలు 2023లో రక్తదానం చేసి, తమ సామాజిక సేవా భావాన్ని చాటుకున్నారు. రక్తదానం చేయడంలో యూపీ తర్వాత మహారాష్ట్ర రెండో స్థానంలో నిలవగా, గుజరాత్ మూడో స్థానంలో నిలిచింది.ఆర్టీఐ కార్యకర్త విపుల్ శర్మ దరఖాస్తుకు ప్రతిస్పందనగా కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తాజాగా ఈ-రక్తకోష్ పోర్టల్ డేటాను షేర్ చేసింది. దీనిలోని వివరాల ప్రకారం కరోనా మహమ్మారి తర్వాత దేశంలో రక్తదానం చేసేవారి సంఖ్య ప్రతి ఏటా 50 శాతానికి పైగా పెరుగుతోంది. రాష్ట్ర ఆరోగ్యశాఖ 2021లో 45 లక్షల యూనిట్ల రక్తం సేకరించగా, అది 2022 నాటికి 80 లక్షల యూనిట్లకు పెరిగింది. 2023లో దేశంలోని మూడు వేలకు పైగా బ్లడ్ బ్యాంక్‌లలో మొదటిసారిగా 1.29 కోట్ల యూనిట్ల రక్తాన్ని సేకరించారు. వీటిలో అత్యధికంగా 18.11 లక్షల యూనిట్ల రక్తాన్ని ఉత్తరప్రదేశ్‌లోని 400కు పైగా బ్లడ్ బ్యాంకులు అందించాయి.మహారాష్ట్రలో 15.20 లక్షల యూనిట్ల రక్తాన్ని సేకరించగా, గుజరాత్లో 10.51 లక్షల యూనిట్ల రక్తాన్ని సేకరించారు. అమెరికన్ రెడ్‌క్రాస్ సొసైటీ తెలిపిన వివరాల ప్రకారం ఒక మహిళ సగటున 4.3 లీటర్ల రక్తాన్ని కలిగి ఉంటుంది. ఒక పురుషునిలో సగటున 5.7 లీటర్ల రక్తం ఉంటుంది. ఒక ఆరోగ్యకరమైన వ్యక్తి ప్రతి రోజూ 400 నుండి రెండు వేల మిల్లీలీటర్ల రక్తాన్ని ఉత్పత్తి చేస్తాడు. ఒక వ్యక్తి ఒకసారి అర లీటరు రక్తాన్ని దానం చేయవచ్చు. 2018లో దేశంలోని 124 బ్లడ్ బ్యాంకులు ఈ-రక్తకోష్ పోర్టల్‌లో నమోదయ్యాయి. ఆ ఏడాది వీటిలో మొత్తంగా 35 లక్షల యూనిట్ల రక్తాన్ని సేకరించారు. 2019లో రక్తదానం 43 లక్షల యూనిట్లకు పెరిగింది. అయితే 2020లో కరోనా మొదటి వేవ్ సమయంలో కేవలం 40 లక్షల యూనిట్ల రక్తాన్ని మాత్రమే సేకరించారు.