న్యూఢిల్లీ: దేశంలోని 15 రాష్ట్రాల్లోని 48 అసెంబ్లీ స్థానాలు, 2 లోక్‌సభ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల ఫలితాలు శనివారం(నవంబర్23) వెలువడ్డాయి. మహారాష్ట్రలో ఒక ఎంపీ సీటు, కేరళలోని వయనాడ్ ఎంపీ సీటుకు ఉప ఎన్నికలు జరగ్గా వయనాడ్‌ను కాంగ్రెస్ గెలుచుకుంది. ఇక్కడ కాంగ్రెస్ తరపున పోటీ చేసిన ఆ పార్టీ అగ్రనేత ప్రియాంకగాంధీ 4లక్షలకుపైగా రికార్డు మెజారిటీ సాధించారు. మహారాష్ట్రలోని నాందేడ్ ఎంపీ సీటును బీజేపీ తన ఖాతాలో వేసుకుంది.
ఉత్తరప్రదేశ్..
48 సీట్లలో యూపీలో కీలకమైన 9 సీట్లున్నాయి. యూపీలో ఆరు అసెంబ్లీ స్థానాలను బీజేపీ తన ఖాతాలో వేసుకోగా రెండు చోట్ల సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ) గెలిచింది.
వెస్ట్‌బెంగాల్..
వెస్ట్‌బెంగాల్‌లో ఆరు అసెంబ్లీ సీట్లకు జరిగిన ఉప ఎన్నికల్లో అధికార టీఎంసీ మళ్లీ సత్తా చాటింది. ఇక్కడ ఆరింటికి ఆరు స్థానాలను మమతా బెనర్జీ పార్టీ కైవసం చేసుకుంది.
బీహార్..
బీహార్‌లో నాలుగు అసెంబ్లీ స్థానాల ఉప ఎన్నికల్లో ఎన్డీయే క్లీన్ స్వీప్ చేసింది.
ఇక్కడ తరారీ (బీజేపీ ), రామ్‌గఢ్ (బీజేపీ), బేలాగంజ్ (జేడీయూ), ఇమామ్‌గంజ్ (హెచ్‌ఏఎం(ఎస్))
రాజస్థాన్..
- రాజస్థాన్‌లో ఉప ఎన్నికలు జరిగిన 7 అసెంబ్లీ సీట్లలో బీజేపీ 5 గెలుచుకుంది. ఒక సీటులో కాంగ్రెస్ ఆధిక్యంలో ఉండగా భారత్ ఆదివాసీ పార్టీ(బీఏడీవీపీ) ఒక సీటు గెలుచుకుంది.
కర్ణాటక..
- కర్ణాటకలోని 3 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో మూడింటిని అధికార కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది.
- కర్ణాటకలోకి శిగ్గావ్ ఉప ఎన్నికలో మాజీ సీఎం బసవరాజ్ బొమ్మై తనయుడు భరత్ బొమ్మై ఓటమి
- 13 వేలకుపైగా ఓట్లతో బొమ్మైపై గెలుపొందిన కాంగ్రెస్ అభ్యర్థి యాసిర్ అహ్మద్ ఖాన్ పఠాన్
పంజాబ్..
- పంజాబ్‌లో మొత్తం నాలుగు స్థానాలకు ఉప ఎన్నికలు జరగగా మూడింటిలో ఆమ్‌ఆద్మీపార్టీ, ఒక సీటులో కాంగ్రెస్ పార్టీ గెలుపొందాయి.
కేరళ..
- కేరళలో రెండు అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నకలు జరగగా ఒక చోట అధికార సీపీఎం మరొకచోట కాంగ్రెస్ విజయం సాధించాయి.
4 లక్షల రికార్డు మెజారిటీతో గెలిచిన ప్రియాంక గాంధీ
👉కేరళలోని వయనాడ్ లోక్‌సభ స్థానంలో కాంగ్రెస్ మరోసారి భారీ విజయం సాధించింది. కాంగ్రెస్ అభ్యర్థి ప్రియాంకా గాంధీ సీపీఐ అభ్యర్థి సత్యన్ మొకేరిపై 4లక్షల 10 వేల ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. గతంలో రాహుల్‌గాంధీ ఇదే స్థానం నుంచి 3,64,422 ఓట్ల ఆధిక్యత సాధించారు.
👉కేరళలోని పాలక్కాడ్ అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. కాంగ్రెస్ అభ్యర్థి రాహుల్ మమ్‌కూతిల్ 18,840 ఓట్ల భారీ తేడాతో బీజేపీ అభ్యర్థి సి కృష్ణకుమార్‌పై విజయం సాధించారు.
అస్సాం..
అస్సాంలోని నాలుగు అసెంబ్లీ సీట్లకు ఉప ఎన్నికలు జరగగా నాలుగింటిలో రెండింటిని అధికార బీజేపీ ఒకటి కాంగ్రెస్ ఒకటి ఏజీపీ గెలుచుకున్నాయి.
సిక్కిం..
సిక్కింలోని రెండు అసెంబ్లీ సీట్లకు ఉప ఎన్నిక జరగగా రెండు సీట్లలో ఎస్‌కేఎం గెలుపొందింది.
గుజరాత్..
గుజరాత్‌లో ఒక అసెంబ్లీ సీటుకు ఉప ఎన్నిక జరగగా ఒక్క సీటులో బీజేపీ గెలుపొందింది.
చత్తీస్‌గఢ్..
ఛత్తీస్‌గఢ్‌లో ఒక అసెంబ్లీ సీటుకు ఉప ఎన్నిక జరగగా దానిని బీజేపీ గెలుచుకుంది.
ఉత్తరాఖండ్..
ఉత్తరాఖండ్‌లోని కేదార్‌నాథ్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక జరగగా ఇక్కడ బీజేపీ గెలుపొందింది.
మేఘాలయ..
మేఘాలయాలోని ఒక అసెంబ్లీ సీటుకు ఉప ఎన్నిక జరగగా ఈ సీటును ఎన్‌పీపీ పార్టీ తన ఖాతాలో వేసుకుంది.
ఇది కూడా చదవండి: Jharkhand Election Result: ఇంటర్నెట్ సేవలు నిలిపివేయాలి: జేఎంఎం
Comments
Please login to add a commentAdd a comment