counting
-
అనుమానాలను నివృత్తి చేస్తాం..రండి!
సాక్షి, న్యూఢిల్లీ: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు ప్రతీ దశలోనూ పారదర్శకంగా జరిగాయని కేంద్ర ఎన్నికల సంఘం(సీఈసీ) స్పష్టం చేసింది. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పోలింగ్, కౌంటింగ్ సమయంలో అవకతవకలు జరిగాయని, ఆధారాలు చూపేందుకు అపాయింట్మెంట్ ఇవ్వాలని కాంగ్రెస్ రాసిన లేఖకు ఈసీ స్పందించింది. అనుమానాల నివృత్తి కోసం డిసెంబర్ 3న ఢిల్లీలోని తమ కార్యాలయానికి రావాలని కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి బృందాన్ని ఈసీ ఆహ్వానించింది. ఎన్నికల ప్రక్రియ ప్రతి దశలోనూ కాంగ్రెస్‌తోపాటు అన్ని రాజకీయ పార్టీ అభ్యర్థులు/ఏజెంట్ల ప్రమేయం ఉందని వివరించింది. ఓటింగ్ సరళిపై ఎలాంటి అనుమానాలకు అక్కర్లేదని, పోలింగ్ బూత్‌ల వారీగా అభ్యర్థులందరికీ ఆ డేటాను పూర్తిస్థాయిలో అందుబాటులో ఉంచామని నొక్కి చెప్పింది. కాంగ్రెస్ పార్టీకి ఉన్న చట్టపరమైన ఆందోళనలను, అనుమానాలను పరిశీలించి రాతపూర్వకంగా బదులిస్తామని ఈసీ స్పష్టం చేసింది. తాజా అసెంబ్లీ ఎన్నికల్లో 288 స్థానాలకు మహాయుతి కూటమిలోని బీజేపీ 132, శివసేన (షిండే) 57, ఎన్సీపీ (అజిత్) 41 సీట్లు సాధించగా, మహా వికాస్ అఘాడీ పక్షాలైన కాంగ్రెస్‌కు 16, శివసేన (ఉద్ధవ్)కు 20, ఎన్సీపీ (శరద్) పార్టీకి 10 స్థానాలు దక్కడం తెలిసిందే. -
ఉత్కంఠ రేపుతున్న ప్రజాతీర్పు..
-
By Election Results: యూపీ ఉప ఎన్నికల్లో బీజేపీదే హవా
న్యూఢిల్లీ: దేశంలోని 15 రాష్ట్రాల్లోని 48 అసెంబ్లీ స్థానాలు, 2 లోక్‌సభ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల ఫలితాలు శనివారం(నవంబర్23) వెలువడ్డాయి. మహారాష్ట్రలో ఒక ఎంపీ సీటు, కేరళలోని వయనాడ్ ఎంపీ సీటుకు ఉప ఎన్నికలు జరగ్గా వయనాడ్‌ను కాంగ్రెస్ గెలుచుకుంది. ఇక్కడ కాంగ్రెస్ తరపున పోటీ చేసిన ఆ పార్టీ అగ్రనేత ప్రియాంకగాంధీ 4లక్షలకుపైగా రికార్డు మెజారిటీ సాధించారు. మహారాష్ట్రలోని నాందేడ్ ఎంపీ సీటును బీజేపీ తన ఖాతాలో వేసుకుంది. ఉత్తరప్రదేశ్..48 సీట్లలో యూపీలో కీలకమైన 9 సీట్లున్నాయి. యూపీలో ఆరు అసెంబ్లీ స్థానాలను బీజేపీ తన ఖాతాలో వేసుకోగా రెండు చోట్ల సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ) గెలిచింది. వెస్ట్‌బెంగాల్..వెస్ట్‌బెంగాల్‌లో ఆరు అసెంబ్లీ సీట్లకు జరిగిన ఉప ఎన్నికల్లో అధికార టీఎంసీ మళ్లీ సత్తా చాటింది. ఇక్కడ ఆరింటికి ఆరు స్థానాలను మమతా బెనర్జీ పార్టీ కైవసం చేసుకుంది. బీహార్..బీహార్‌లో నాలుగు అసెంబ్లీ స్థానాల ఉప ఎన్నికల్లో ఎన్డీయే క్లీన్ స్వీప్ చేసింది.ఇక్కడ తరారీ (బీజేపీ ), రామ్‌గఢ్ (బీజేపీ), బేలాగంజ్ (జేడీయూ), ఇమామ్‌గంజ్ (హెచ్ఏఎం(ఎస్))రాజస్థాన్..రాజస్థాన్‌లో ఉప ఎన్నికలు జరిగిన 7 అసెంబ్లీ సీట్లలో బీజేపీ 5 గెలుచుకుంది. ఒక సీటులో కాంగ్రెస్ ఆధిక్యంలో ఉండగా భారత్ ఆదివాసీ పార్టీ(బీఏడీవీపీ) ఒక సీటు గెలుచుకుంది. కర్ణాటక..కర్ణాటకలోని 3 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో మూడింటిని అధికార కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది. కర్ణాటకలోకి శిగ్గావ్ ఉప ఎన్నికలో మాజీ సీఎం బసవరాజ్ బొమ్మై తనయుడు భరత్ బొమ్మై ఓటమి13 వేలకుపైగా ఓట్లతో బొమ్మైపై గెలుపొందిన కాంగ్రెస్ అభ్యర్థి యాసిర్ అహ్మద్ ఖాన్ పఠాన్పంజాబ్.. పంజాబ్‌లో మొత్తం నాలుగు స్థానాలకు ఉప ఎన్నికలు జరగగా మూడింటిలో ఆమ్ఆద్మీపార్టీ, ఒక సీటులో కాంగ్రెస్ పార్టీ గెలుపొందాయి. కేరళ..కేరళలో రెండు అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నకలు జరగగా ఒక చోట అధికార సీపీఎం మరొకచోట కాంగ్రెస్ విజయం సాధించాయి. 4 లక్షల రికార్డు మెజారిటీతో గెలిచిన ప్రియాంక గాంధీ 👉కేరళలోని వయనాడ్ లోక్‌సభ స్థానంలో కాంగ్రెస్ మరోసారి భారీ విజయం సాధించింది. కాంగ్రెస్ అభ్యర్థి ప్రియాంకా గాంధీ సీపీఐ అభ్యర్థి సత్యన్ మొకేరిపై 4లక్షల 10 వేల ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. గతంలో రాహుల్‌గాంధీ ఇదే స్థానం నుంచి 3,64,422 ఓట్ల ఆధిక్యత సాధించారు. 👉కేరళలోని పాలక్కాడ్ అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. కాంగ్రెస్ అభ్యర్థి రాహుల్ మమ్కూతిల్ 18,840 ఓట్ల భారీ తేడాతో బీజేపీ అభ్యర్థి సి కృష్ణకుమార్‌పై విజయం సాధించారు.అస్సాం.. అస్సాంలోని నాలుగు అసెంబ్లీ సీట్లకు ఉప ఎన్నికలు జరగగా నాలుగింటిలో రెండింటిని అధికార బీజేపీ ఒకటి కాంగ్రెస్ ఒకటి ఏజీపీ గెలుచుకున్నాయి. సిక్కిం..సిక్కింలోని రెండు అసెంబ్లీ సీట్లకు ఉప ఎన్నిక జరగగా రెండు సీట్లలో ఎస్కేఎం గెలుపొందింది. గుజరాత్..గుజరాత్లో ఒక అసెంబ్లీ సీటుకు ఉప ఎన్నిక జరగగా ఒక్క సీటులో బీజేపీ గెలుపొందింది. చత్తీస్‌గఢ్..ఛత్తీస్‌గఢ్‌లో ఒక అసెంబ్లీ సీటుకు ఉప ఎన్నిక జరగగా దానిని బీజేపీ గెలుచుకుంది.ఉత్తరాఖండ్..ఉత్తరాఖండ్‌లోని కేదార్నాథ్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక జరగగా ఇక్కడ బీజేపీ గెలుపొందింది. మేఘాలయ..మేఘాలయాలోని ఒక అసెంబ్లీ సీటుకు ఉప ఎన్నిక జరగగా ఈ సీటును ఎన్పీపీ పార్టీ తన ఖాతాలో వేసుకుంది.ఇది కూడా చదవండి: Jharkhand Election Result: ఇంటర్నెట్ సేవలు నిలిపివేయాలి: జేఎంఎం -
US Election Results 2024: ట్రంప్‌కు 50.8 శాతం, హారిస్‌కు 47.5 శాతం
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజేతగా నిలిచిన రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ తన మెజారిటీని మరింతగా పెంచుకునే దిశగా సాగుతున్నారు. విజయానికి 270 ఎలక్టోరల్ ఓట్లు అవసరం కాగా ఆయనకు ఇప్పటికే 295 ఓట్లు సాధించారు. ఆయన ప్రత్యర్థి, డెమొక్రాట్ అభ్యర్థి కమలా హారిస్ 226 ఓట్లు సాధించారు. మొత్తం 50 రాష్ట్రాల్లోనూ ఇంకా కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతూనే ఉన్నా 48 రాష్ట్రాల్లో ఇప్పటికే ఫలితం తేలింది. అరిజోనా, నెవడాల్లో మాత్రమే తేలాల్సి ఉంది. ఆ రెండు రాష్ట్రాల్లో కూడా ట్రంపే ఆధిక్యంలో కొనసాగుతున్నారు. వాటిలోని 17 ఎలక్టోరల్ ఓట్లు కూడా ఆయన ఖాతాలోనే పడితే ఆయన మొత్తం 312 ఓట్లు సాధిస్తారు. ఇది 2016లో తొలిసారి అధ్యక్షునిగా నెగ్గినప్పుడు సాధించిన ఓట్ల కంటే (304) అధికం. ట్రంప్‌కు ఇప్పటిదాకా 50.8 శాతం, హారిస్‌కు 47.5 శాతం ఓట్లొచ్చాయి. ఆయన 7,27,34,149 ఓట్లు, హారిస్ 6,80,49,758 ఓట్లు సాధించారు. కాంగ్రెస్‌లో... అధ్యక్షునితో పాటు కాంగ్రెస్‌కు కూడా ఎన్నికలు జరిగాయి. సెనేట్‌లోని 100 స్థానాల్లో 34 సీట్లకు, ప్రతినిధుల సభలోని మొత్తం 435 స్థానాలకు పోలింగ్ జరిగింది. వీటితో పాటు 11 రాష్ట్రాల గవర్నర్ పదవులకు, పలు రాష్ట్రాల అసెంబ్లీలకు, స్థానిక సంస్థలకు కూడా ఎన్నికలు జరిగాయి. బిల్లుల ఆమోదంలో అత్యంత కీలక పాత్ర పోషించే సెనేట్‌లో నాలుగేళ్ల అనంతరం రిపబ్లికన్లు మెజారిటీ సాధించారు. ఇప్పటిదాకా వెల్లడైన ఫలితాల్లో వారి స్థానాల సంఖ్య మెజారిటీ మార్కును దాటి 52కు చేరింది. డెమొక్రాట్లకు 45 స్థానాలకు పరిమితమయ్యారు. డెమొక్రాట్లు ఇప్పటికే 3 సీట్లను రిపబ్లికన్లకు కోల్పోయారు. ప్రతినిధుల సభలో కూడా రిపబ్లికన్ల హవాయే సాగుతోంది. మెజారిటీకి 218 సీట్లు కావాల్సి ఉండగా వారికిప్పటికే 206 సీట్లు దక్కాయి. డెమొక్రాట్లు 192 సీట్లే గెలుచుకున్నారు. వారిప్పటికే 4 సీట్లను రిపబ్లికన్లకు కోల్పోయారు. మరో 37 స్థానాల్లో ఫలితాలు రావాల్సి ఉంది. -
US Elections 2024: మరి ఓట్ల లెక్కింపు ఎలా?
యూఎస్ స్టేట్స్లో పోలింగ్ నడుస్తోంది. మొదటి దశ, చివరి దశల పోలింగ్ ముగిసిన వెంటనే.. ఓట్ల లెక్కింపు మొదలవుతుంది. అమెరికాలో పేపర్ బ్యాలెట్ పద్ధతిలోనే ఎన్నికలు జరుగుతాయని తెలిసిందే. ఓటింగ్ మెషీన్లపై అక్కడి ఓటర్లలో నమ్మకం లేకపోవడం అందుకు ప్రధాన కారణం. అయితే అక్కడి ఎన్నిక విధానం తరహాలో కౌంటింగ్ కూడా కాస్త భిన్నంగానే ఉంటుంది. మన దగ్గర పోస్టల్ బ్యాలెట్ తర్వాత ఈవీఎంల లెక్కింపు ఉంటుంది కదా. కానీ, అమెరికాలో సాధారణంగా ఎన్నికలు జరిగిన రోజే పోలైన ఓట్లను మొదట లెక్కిస్తారు. తర్వాత మెయిల్ బ్యాలెట్లను లెక్కిస్తారు. దేశాల నుంచి వచ్చిన ఓట్లను, మిలటరీ బ్యాలెట్లను ఆ తర్వాత లెక్కిస్తారు. ఇందుకోసం..కాన్వాసింగ్(canvassing) ప్రక్రియ ద్వారా ఎన్నికైన స్థానిక ఎన్నికల అధికారులు ఓట్లను పరిశీలించి లెక్కిస్తారు. ఎన్ని ఓట్లు పోలయ్యాయి? ఓటర్ల జాబితాలో ఎన్ని పేర్లున్నాయి? అనేది పోలుస్తూ.. అర్హత గల ప్రతిఓటూను లెక్కించేలా చూడటమే వీరి పని.బ్యాలెట్‌పై ఏమైనా మరకలు ఉన్నాయా?.. బ్యాలెట్ పాడైపోయిందా?.. ఇలా కక్షుణ్ణంగా పరిశీలిస్తారు. ఒకవేళ అభ్యంతరంగా అనిపిస్తే.. డాక్యుమెంటేషన్ చేసి దర్యాప్తు చేస్తారు. అలాగే.. కౌంటింగ్ బ్యాలెట్లను ఎలక్ట్రానిక్ స్కానర్లతో జతచేస్తారు. దీనివల్ల ఫలితాల పట్టిక కనిపిస్తుంది. కొన్ని పరిస్థితుల్లో ఎలక్ట్రానిక్ స్కానర్లతో కాకుండా మాన్యువల్‌గానూ లెక్కిస్తారు. మరికొన్ని సమయాల్లో రెండుసార్లు కౌంటింగ్ జరుపుతారు. అయితే.. కాన్వాస్‌లో ఎవరు పాల్గొనాలనేదానిపై కఠిన నిబంధనలుంటాయి. -
99 శాతం బ్యాటరీతో బీజేపీ గెలిస్తే.. 70 శాతంతో కాంగ్రెస్ గెల్చింది
న్యూఢిల్లీ: ప్రతికూల ఫలితాలిచి్చన హరియాణా అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ పద్ధతి, ఈవీఎంల పనితీరును కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా తప్పుబట్టింది. కొన్ని జిల్లాల్లో ఓట్ల లెక్కింపు ప్రక్రియలో అవకతవకలు జరిగాయని ఆరోపించింది. ‘‘ ఈ ఎన్నికల్లో ప్రజాస్వామ్యం(లోక్తంత్ర) ఓడిపోయింది. మరో వ్యవస్థ(తంత్ర) అక్రమంగా గెలిచింది’’ అంటూ బీజేపీ నేతృత్వంలోని కేంద్రప్రభుత్వం కుట్రకు పాల్పడిందని పరోక్షంగా విమర్శించారు. ఢిల్లీలో ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో పార్టీ ప్రధాన కార్యదర్శి(కమ్యూనికేషన్స్) జైరాం రమేశ్ మీడియా సమావేశంలో మాట్లాడారు. 99 శాతం బ్యాటరీతో బీజేపీ గెలిస్తే.. 70 శాతంతో కాంగ్రెస్ గెల్చింది ‘‘ ప్రజాతీర్పును అపహాస్యం చేస్తూ, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ వెల్లడైన ఫలితాలివి. వీటిని మేం ఒప్పుకోం. పారదర్శకమైన, ప్రజాస్వామ్యయుత పద్ధతి ఓటమిపాలైంది. హరియాణా అంకం ఇక్కడితో ముగిసిపోలేదు. ఇది ఇంకా కొనసాగుతుంది. బ్యాటరీ 99 శాతం నిండిన ఈవీఎంలలో బీజేపీ గెలిస్తే, 70 శాతం బ్యాటరీ ఉన్న ఈవీఎంలలో కాంగ్రెస్ గెలిచింది. ఇందులో కుట్ర దాగుంది. 12 నుంచి 14 నియోజకవర్గాల్లో అభ్యర్థుల నుంచి ఇలాంటి ఫిర్యాదులే వెల్లువెత్తుతున్నాయి. ఎన్నికల ప్రక్రియలో అన్యాయం జరిగితే మొదట ఆశ్రయించేది ఎన్నికల సంఘాన్నే.పారదర్శకంగా పనిచేయాల్సిన రాజ్యాంగబద్ధ సంస్థ అది. అందుకే తీవ్రమైన ఈ అంశంపై లిఖితపూర్వకంగా కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదుచేస్తాం. నిరీ్ణత గడుపులోగా చర్యలు తీసుకోవాలని పట్టుబడతాం. ఓట్ల లెక్కింపు, ఈవీఎంల పనితీరుపై చాలా నియోజకవర్గాల్లో సందేహాలు పెరిగాయి. ప్రతి ఒక్కరితో మాట్లాడాం. ఇది విశ్లేషణల సమయం కాదు. మా నుంచి విజయాన్ని లాక్కున్నారు. వ్యవస్థను అధికార పార్టీ దుర్వినియోగం చేసింది. క్షేత్రస్థాయిలో మార్పు కోరుకుంటున్నారనే వాస్తవం ప్రతి ఒక్కరికీ తెలుసు. దీనికి ఫలితాలు దర్పణం పట్టట్లేవు.ఫలితాలను కాంగ్రెస్ అంగీకరించకపోవడానికి ప్రధాన కారణం కౌంటింగ్, ఈవీఎంల పనితీరు, సమగ్రత ప్రశ్నార్థకంలో పడటమే. దాదాపు 3–4 జిల్లాల్లోని 12–14 నియోజకవర్గాల్లో ఓట్ల లెక్కింపు విధానం, ఈవీఎంల పనితీరుపై అనుమానాలు రేకెత్తుతున్నాయి. స్థానిక యంత్రాంగంపై తీవ్రమైన ఒత్తిడి మోపారు. ఇదంతా కేంద్ర, రాష్ట్రాల్లోని డబుల్ ఇంజిన్ ప్రభుత్వ ఒత్తిడే’’ అని జైరాం రమేశ్ అన్నారు. 200 ఓట్ల తేడాతో ఓడారు : ‘‘ 200 ఓట్లు, 300 ఓట్లు, 50 ఓట్లు.. ఇలా అత్యల్ప ఓట్ల తేడాతో అభ్యర్థులు ఓడారు. చక్కని ఆధిక్యత కనబరిచిన అభ్యర్థులు హఠాత్తుగా 100–200 ఓట్ల తేడాతో ఓడిపోవడమేంటి?. అవకతవకలు, అక్రమాల వల్లే ఇది సాధ్యం. అనూహ్య, దిగ్భ్రాంతికర పరిణామమిది. మార్పును కోరుకుంటూ హరియాణా ప్రజలు ఆశించిన దానికి, వాస్తవ పరిస్థితులకు విరుద్ధంగా వెల్లడైన ఫలితమిది’’ అని జైరాం ఆరోపించారు. ఎందుకంత నెమ్మది? : అంతకుముందు మధ్యాహ్నం వేళ జైరాం కేంద్ర ఎన్నికల సంఘానికి ఒక లేఖ రాశారు. ‘‘ ఉదయం 9 గంటల నుంచి 11 గంటల దాకా ఈసీఐ వెబ్సైట్లో అప్డేట్స్ అనూహ్యంగా నెమ్మదించాయి. దీనికి కారణమేంటి? అదమ్‌పూర్ కాంగ్రెస్ అభ్యర్థి చందర్ ప్రకాశ్ 1,268 ఓట్ల తేడాతో విజయం సాధించారు. కానీ ఆయనకు గెలుపు సరి్టఫికేట్ ఇవ్వట్లేదు. ఈసీ వెబ్సైట్లో కూడా ఆయన గెలిచినట్లుగా చూపించట్లేదు. చివరి మూడు రౌండ్ల అప్డేట్స్ ఇవ్వట్లేదు. అనవసర ఆలస్యానికి కారణమేంటి?’ అని జైరాం ప్రశ్నించారు. ఆలస్యం జరగలేదు: ఈసీ : ఈసీ అప్డేట్స్ ఆలస్యమయ్యాయని కాంగ్రెస్ చేసిన ఆరోపణలపై కేంద్ర ఎన్నికల సంఘం స్పందించింది. ‘‘ ఆరోపణల్లో నిజం లేదు. బాధ్యతారాహిత్యంతో, తప్పుడు ఉద్దేశాలతో నిరాధార ఆరోపణలు చేస్తున్నారు. ఎన్నికల నిబంధనల రూల్ నంబర్ 60 ప్రకారం ఆయా కౌంటింగ్ కేంద్రాల అధికారులు నడుచుకున్నారు. హరియాణా, జమ్మూకశీ్మర్‌లో లెక్కింపుపై అప్డేట్స్ ఆలస్యమయ్యాయన్న మీ మెమొరాండంలో ఎలాంటి వాస్తవాలు లేవు. ప్రతి ఐదు నిమిషాలకు అన్ని నియోజకవర్గాల నుంచి 25 రౌండ్ల ఫలితాలు అప్డేట్ అవుతూనే ఉంటాయి’ అని ఈసీ వివరణ ఇచి్చంది. ఈసీ వివరణపై కాంగ్రెస్ అసహనం వ్యక్తంచేసింది. ‘‘ తటస్థ వైఖరిని అవలంబించాల్సిన ఈసీ ఏకపక్షంగా విపక్ష పార్టీ విన్నపాలను తోసిపుచ్చడం సహేతుకం కాదు. ఫిర్యాదుపై సంప్రదింపుల స్థాయిని ఈసీ దిగజార్చింది’’ అని జైరాం అన్నారు. -
ఉప ఎన్నికల్లో ఎన్డీయేకు షాక్.. ఇండియా కూటమి జోరు
ఢిల్లీ, న్యూఢిల్లీ: ఏడు రాష్ట్రాల్లో 13 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో ఇండియా కూటమి భారీ విజయాన్ని అందుకుంది. ఏకంగా 10 స్థానాల్లో ఇండియా కూటమి విజయం సాధించగా.. కేవలం రెండు స్థానాల్లోనే ఎన్డీయే కూటమి విజయాన్ని అందుకుంది. మరో స్థానంలో ఇండిపెండెంట్ అభ్యర్థి విజయం సాధించారు. కాగా, ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభం నుంచే ఇండియా కూటమి అభ్యర్థులు లీడింగ్‌లో కొనసాగారు. ఇక, బెంగాల్ తృణముల్ కాంగ్రెస్ క్లీన్ స్వీప్ చేసింది. నాలుగు స్థానాల్లో ఉప ఎన్నికలు జరుగగా అన్ని స్థానాల్లో టీఎంసీ అభ్యర్థులు గెలుపొందారు. బెంగాల్‌లోని రాయిగంజ్ (కృష్ణ కల్యాణి), రణఘాట్ సౌత్ (ముకుత్ మణి అధికారి), బాగ్ద (మధుపర్ణ ఠాకూర్), మాణిక్తలా(సప్తి పాండే) విజయం సాధించారు. ఇక్కడ బీజేపీకి గట్టి షాక్ తగింది. మరోవైపు.. హిమాచల్ ప్రదేశ్‌లోని డెహ్ర, నలగార నియోజకవర్గాల్లో కాంగ్రెస్ విజయం సాధించగా.. హమీర్పూర్ స్థానంలో బీజేపీ గెలుపొందింది. ఇక, మధ్యప్రదేశ్‌లోని అమర్వర అసెంబ్లీలో బీజేపీ అభ్యర్ధి కమలేష్ ప్రతాప్ సింగ్ విజయం సాధించారు. పంజాబ్‌లోని జలంధర్ వెస్ట్ స్థానం నుంచి ఆమ్ ఆద్మీ అభ్యర్థి మోహిందర్ భగత్ విజయం అందుకున్నారు. తమిళనాడులోని విక్రవండి అసెంబ్లీ స్థానంలో డీఎంకే అభ్యర్థి అన్నియుర్ శివ ఘన విజయం సాధించారు. ఉత్తరాఖండ్‌లోని బద్రీనాథ్ (లాక్ పత్ సింగ్), మంగళూర్(క్వాజి మొహమ్మద్ నిజాముద్దిన్) కాంగ్రెస్ విజయభేరి మోగించింది. కాగా, బీహార్‌లోని రూపౌలి స్థానంలో స్వతంత్ర అభ్యర్థి శంకర్ సింగ్ గెలుపొందడం ఆసక్తికరంగా మారింది. మొత్తంగా.. ఉప ఎన్నికల ఫలితాలు ఇండియా కూటమి బూస్ట్ ఇవ్వగా, ఎన్డీయే కూటమికి షాకిచ్చాయి.సీఎం సతీమణి విజయం..హిమాచల్ ప్రదేశ్‌లోని దేహ్రాలో రాష్ట్ర ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ సుఖు సతీమణి, కాంగ్రెస్ అభ్యర్థి కమలేశ్ ఠాకుర్ విజయం సాధించారు. తన సమీప భాజపా అభ్యర్థిపై 9వేల ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. నాలాగఢ్ స్థానంలో కాంగ్రెస్ నేత హర్దీప్ సింగ్ బవా 8,990 ఓట్ల తేడాతో భాజపా అభ్యర్థిపై విజయం సాధించారు. ఇక, హమీర్పుర్ స్థానంలో భాజపా అభ్యర్థి ఆశీష్ శర్మ గెలుపొందారు.బెంగాల్లో తృణమూల్ క్లీన్‌స్వీప్..పశ్చిమ బెంగాల్లో ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు గెలుపొంది జోరుమీదున్న తృణమూల్ కాంగ్రెస్.. తాజా ఉప ఎన్నికల్లోనూ హవా కొనసాగించింది. ఇక్కడ రాయ్‌గంజ్, రాణాఘాట్, బాగ్దా, మాణిక్తలా.. నాలుగు స్థానాల్లోనూ టీఎంసీ అభ్యర్థులు విజయం సాధించారు. ఇక, ఉత్తరాఖండ్‌లో మంగలౌర్, బద్రీనాథ్ స్థానాలను కాంగ్రెస్ దక్కించుకుంది.పంజాబ్ బైపోల్ ఆప్‌దే..పంజాబ్‌లోని జలంధర్ స్థానంలో ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థి మోహిందర్ భగత్ విజయం సాధించారు. తన సమీప భాజపా అభ్యర్థి షీతల్‌పై 37వేల ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. తమిళనాడులోని విక్రావండి స్థానంలో డీఎంకే అభ్యర్థి అన్నియుర్ శివ విజయం సాధించారు. మధ్యప్రదేశ్‌లోని అమర్వాడాలో భాజపా నేత కమలేశ్ షా గెలుపొందారు. బిహార్‌లోని రూపౌలి స్థానంలో స్వతంత్ర అభ్యర్థి శంక్ సింగ్ జయకేతనం ఎగురవేశారు. Assembly by-elections: Out of 13 Assembly seats, Congress won four seats. TMC won 4 seats. AAP won the Jalandhar West seat in Punjab. BJP won 2 seats, DMK won 1 seat. Independent candidate Shankar Singh won on Rupauli seat of Bihar. pic.twitter.com/lJWtsVWI46— ANI (@ANI) July 13, 2024 -
జగన్నాథ రహస్యం!
లక్షలాది భక్తజనం పాల్గొనే విశ్వవిఖ్యాత రథయాత్రతో ప్రపంచవ్యాప్తంగా పేరొందిన పూరీ జగన్నాథుని ఆలయం మరోమారు పతాక శీర్షికలకెక్కింది. రాజుల నుంచి మొదలుకుని సామాన్యుల దాకా శతాబ్దాలుగా జగన్నాథస్వామికి సమర్పించుకున్న కానుకల చిట్టా గుట్టు వీడబోతోంది. ఆదివారం ఆలయం దిగువన ఉన్న ఆభరణాల నిల్వ గది(రత్న భండార్)ని దాదాపు 40 సంవత్సరాల తర్వాత లెక్కింపు కోసం తెరవబోతున్నారు. విషసర్పాలు ఉండొచ్చన్న వార్తల నేపథ్యంలో అత్యయిక ఔషధాలను సిద్ధంచేసి వైద్యులు, పాములు పట్టే వాళ్లను వెంటబెట్టుకునిమరీ పురావస్తు, ప్రభుత్వ అధికారులు లోనికి వెళ్లబోతున్నారు. జగన్నాథుడికి చెందిన వజ్ర, వైఢూర్యాలు, గోమేధిక, పుష్యరాగాలు, కెంపులు, రత్నాలు, స్వర్ణాభరణాలు, వెండి తదితరాల బరువును తూచి, వాటి నాణ్యతను పరిశీలించి వేరే గదిలో సురక్షితంగా భద్రపరచాలని నిర్ణయించారు. చాన్నాళ్ల క్రితం గది తాళం చెవులు పోగొట్టి ఒడిశాలోని బిజూజనతాదళ్ సర్కార్ ఆలయ సంపద సంరక్షణలో విఫలమైందని బీజేపీ అసెంబ్లీ ఎన్నికలవేళ ఆరోపణలు గుప్పించడంతో గది తలుపులు తెరచి సంపదను సరిచూడాలన్న డిమాండ్ మళ్లీ ఊపందుకుంది. అయితే గది తెరవడంపై శనివారం తుది నిర్ణయం తీసుకుంటామని ఒడిశా న్యాయశాఖ మంత్రి పృథ్వీరాజ్ హరిచందన్ శుక్రవారం చెప్పారు.180 రకాల ఆభరణాలు1978లో గదిని తెరచి ఆభరణాలు, వెండి, బంగారం నిల్వలను లెక్కించి మళ్లీ పొడవాటి చెక్కపెట్టెల్లో భద్రపరిచారు. ఆనాడు అన్నింటినీ లెక్కించడానికి 70 రోజులు పట్టింది. గదిలో 180 రకాలకు చెందిన అమూల్యమైన ఆభరణాలు స్వామివారికి ఉన్నట్లు సమాచారం. స్వచ్ఛమైన పసిడి ఆభరణాలు 74 రకాలున్నాయి. ఒక్కోటి 100 తులాల బరువైన పురాతన ఆభరణాలూ ఉన్నాయి. ‘‘ 1978లో సంపద లెక్కించారు. అయితే జీర్ణావస్థకు చేరిన కొన్ని ఆభరణాల రిపేర్ పనుల కోసం 1985 జూలై 14వ తేదీన గది తెరిచారు. అప్పుడు నేనూ వెళ్లా. 9 అడుగుల పొడవు, 3 అడుగుల ఎత్తు ఉన్న 15 చెక్కపెట్టెల్లో ఆభరణాలను జాగ్రత్తగా భద్రపరిచారు. వెలకట్టలేని ఆభరణాలతోపాటు ఎంతో బంగారం, వెండి నిల్వలు గదిలో దాచారు. పెద్ద సింహాసనం, ఉత్తరభారత భక్తులు జగన్నాథ, బలభద్రులకు సమర్పించిన అరటిపువ్వు ఆకృతి చెవిదిద్దులు ఇలా ఎన్నో విభిన్న ఆభరణాలు అక్కడున్నాయి. తర్వాత గది తలుపులు మూసి రెండు రకాల తాళాలు వేసి సీల్‌వేశారు. తాళం చెవులను ట్రెజరీ ఆఫీస్ నుంచి వచ్చిన కలెక్టర్‌కు అందజేశాం’ అని ఆనాటి ఆలయ నిర్వహణ అధికారి రవీంద్ర నారాయణ మిశ్రా రెండేళ్ల క్రితం ఒక టీవీచానల్ ఇంటర్వ్యూలో చెప్పారు. 12వ శతాబ్దంలో పూరీ ప్రాంత రాజుకు లొంగిపోయిన సామంతరాజుల కిరీటాలు, యుద్ధంలో గెల్చుకున్న విలువైన సొత్తునూ రహస్య గదిలో భద్రపరిచారని తెలుస్తోంది.2018లో మరోసారి ప్రయత్నించి..పురాతన గది శిథిలమై గోడలకు చెమ్మ రావడంతో గది పటిష్టత, ఆభరణాల పరిరక్షణ నిమిత్తం గది తలుపులు తెరవాలని హైకోర్టు ఆదేశాల మేరకు 2018 ఏప్రిల్ 4వ తేదీన 16 మంది సభ్యుల భారత పురావస్తుశాఖ నిపుణుల బృందం గది తెరిచేందుకు వెళ్లింది. అయితే తాళం చెవి అదృశ్యమయిందన్న వార్తల నడుమ వెనుతిరిగింది. అయితే కిటికీ నుంచి చూసి గది గోడలు దెబ్బతిన్నట్లు, పైకప్పు పెచ్చులు ఊడినట్లు నిర్ధారించుకున్నారు. ఈ తతంగం అంతా 40 నిమిషాల్లో ముగిసింది. చీకటిగదిని మళ్లీ 40 ఏళ్ల తర్వాత తెరుస్తున్న నేపథ్యంలో ఈసారైనా అన్ని ఆభరణాలు, బంగారం, వెండి నిల్వలను సరిచూసి శిథిల గదికి బదులు నూతన గదిలో సురక్షితంగా దాచాలని సగటు పూరీ జగన్నాథుని భక్తుడు కోరుకుంటున్నాడు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఫలితంపై ఉత్కంఠ
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక కౌంటింగ్.. అప్డేట్స్హోరాహోరీగా సాగిన తెలంగాణ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఫలితంపై ఉత్కంఠ నెలకొంది. మూడో రోజు.. కొనసాగుతున్న పట్టభద్రుల ఉప ఎన్నిక రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపుఇప్పటివరకు 44 మంది అభ్యర్థులను ఎలిమినేట్తీన్మార్ మల్లన్న ( కాంగ్రెస్) : 1,23,873రాకేష్ రెడ్డి (బీఆర్ఎస్): 1,04,990గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి: 43,797గెలుపు కోటాకు −31,222 ఓట్ల దూరంలో కాంగ్రెస్ అభ్యర్థి మల్లన్నగెలుపు కోటాకు 50105 ఓట్ల దూరంలో బీఆర్ఎస్ అభ్యర్ధి రాకేష్స్వతంత్ర అభ్యర్థి అశోక్ ఎలిమినేషన్ ప్రక్రియ పూర్తిఅశోక్ ఫలితాలను వెల్లడించని అధికారులుఅశోక్ ఎలిమినేషన్ ప్రాసెస్ తర్వాత మొదలుకానున్న బీజేపీ అభ్యర్థి రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో శుక్రవారం మధ్యాహ్నానికి 37 మంది ఎలిమినేట్కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్నకు 1,23,410 ఓట్లు, బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డికి 1,04,676 ఓట్లు, బీజేపీ అభ్యర్థి గుజ్జల ప్రేమేందర్ రెడ్డికి 43,571 ఓట్లు, స్వతంత్ర అభ్యర్థి అశోక్‌కు 29,862 ఓట్లు గెలుపు కోటాకు 31,685 ఓట్ల దూరంలో కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న ఉండగా, 50,419 ఓట్ల దూరంలో బీఆర్ఎస్ అభ్యర్ధి రాకేష్ రెడ్డి ఉన్నారు.మొదటి ప్రాధాన్యత ఓట్లలో గెలుపునకు సరిపడా ఓట్లు ఎవరికీ రాలేదు. కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్నకు అత్యధిక ఓట్లు (1,22,813) వచ్చినా, 18,565 ఓట్ల ఆధిక్యంలో ఉన్నా.. గెలుపునకు సరిపడా ఓట్లు మాత్రం సాధించలేకపోయారు. గెలుపు కోసం 1,55,095 ఓట్లు సాధించాల్సి ఉంది. గురువారం రాత్రి 10 గంటలకు ఎలిమినేషన్ ప్రక్రియ ద్వారా రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు ప్రారంభించారు. -
ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్‌లో గోల్ మాల్.. రాకేష్ రెడ్డి సీరియస్
సాక్షి, నల్లగొండ: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల కౌంటింగ్ తీరుపై బీఆర్ఎస్ అభ్యర్ధి రాకేష్ రెడ్డి అసహనం వ్యక్తం చేశారు. ఉప ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియలో గోల్మాల్ జరిగిందని ఆయన ఆరోపించారు. ఈ మేరకు కౌంటింగ్ కేంద్రం వద్ద గురువారం ఆయన మాట్లాడుతూ.. మూడో రౌండ్లో కాంగ్రెస్‌కు మూడు వేలు ఆధిక్యం వస్తే నాలుగు వేలకు పైగా ఆధిక్యం వచ్చినట్లు ప్రకటించారని ఆరోపించారు. తాము అభ్యంతరం చెప్పినా ఆర్వో పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. మూడో రౌండ్ నుంచి అనుమానం ఉందని చెప్పినా కనీస స్పందన లేదని దుయ్యబట్టారు.ఎన్నికల ఫలితాలు తారుమారు చేస్తే కౌంటింగ్ బైకాట్ చేస్తామని చెప్పారు రాకేష్ రెడ్డి. దీనిపై ఎన్నికల సంఘం స్పందించాలని కోరారు. రిటర్నింగ్ అధికారిపై ఎలక్షన్ కమిషన్‌కు ఫిర్యాదు చేస్తామని తెలిపారు. అధికారుల తీరు ఫలితాలను తారుమారు చేసేలా ఉందన్నారు. తమ అభ్యంతరాలకు వివరణ ఇచ్చాకే రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కంపు జరపాలని డిమాండ్ చేశారు.ఇదిలా ఉండగా ఎమ్మెల్సీ ఉప ఎన్నిక కౌంటింగ్ కొనసాగుతోంది. తాజాగా మూడో రౌండ్ ఫలితాలు వెల్లడయ్యాయి. మూడో రౌండ్ లో కాంగ్రెస్ అభ్యర్థి చింతపండు నవీన్( తీన్మార్ మల్లన్న) లీడ్‌లో ఉన్నారు. ఆయనకు ఈ రౌండ్లో 4207 ఓట్ల ఆధిక్యత లభించింది.మూడు రౌండ్లు ముగిసే సమయానికి కాంగ్రెస్ అభ్యర్థి చింతపండు నవీన్( తీన్మార్ మల్లన్న కాంగ్రెస్) 1,06,234.. రాకేష్ రెడ్డి (బీఆర్ఎస్) 87,356.. ప్రేమేందర్ రెడ్డి( బీజేపీ) 34,516.. అశోక్ (స్వతంత్ర) 27,493 ఓట్లు పడ్డాయి. చెల్లిన ఓట్లు 2,64,216 కాగా చెల్లని ఓట్లు 15784గా ఉన్నాయి. ప్రస్తుతానికి తీన్మార్ మల్లన్న 18878 ఆధిక్యంలో ఉన్నారు. ఇప్పటి వరకు 2 లక్షల 88 వేల ఓట్ల మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు పూర్తి చేయగా. మరో 48013 ఓట్లను అధికారులు లెక్కిస్తున్నారు. -
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఫలితం.. కౌంటింగ్‌లో హైడ్రామా
నల్లగొండ, సాక్షి: నల్లగొండ - వరంగల్ - ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక కౌంటింగ్ అప్డేట్స్ముగిసిన ఎమ్మెల్సీ ఉప ఎన్నిక మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు18,565 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్న నవీన్(మల్లన్న)మొదటి స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి చింతపండు నవీన్( తీన్మార్ మల్లన్న)122813 మొదటి ప్రాధాన్యత ఓట్లు సాధించిన నవీన్( మల్లన్న)బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డికి 104248 ఓట్లుబీజేపీ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డికి 43313 ఓట్లుస్వతంత్ర అభ్యర్థి అశోక్ 29697 ఓట్లుగెలుపు కోటా 155095 గా నిర్ణయంమొత్తం చెల్లిన ఓట్లు 310189చెల్లని ఓట్లు 25824మొత్తం పోలైన ఓట్లు 336013చింతపండు నవీన్(తీన్మార్ మల్లన్న) గెలుపుకు కావాల్సిన రెండో ప్రాధాన్యత ఓట్లు 32282బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డి గెలుపుకి కావాల్సిన రెండో ప్రాధాన్యత ఓట్లు 50847మరికాసేపట్లో ఎలిమినేషన్ ప్రక్రియ ప్రారంభం100 నుంచి 500 ఓట్ల ఎలిమినేషన్ చేయడానికి సుమారు 4 గంటల సమయం: అధికారులు నల్గొండ ఖమ్మం వరంగల్ పట్టభద్రుల ఉప ఎన్నిక కౌంటింగ్ లో అవకతవకలపై సీఈఓ కార్యాలయంలో ఫిర్యాదు చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి బీఆర్ఎస్ లీగల్ టీంకౌంటింగ్ లో అవకతవకలు జరుగుతున్నాయని వెంటనే ఆర్వో ఆదేశాలు జారీ చేయాలని కౌంటింగ్ ప్రక్రియ పారదర్శకంగా చేయాలని ఫిర్యాదు చేసిన కౌశిక్ రెడ్డిముందు నుంచి రిటర్నింగ్ ఆఫీసర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా పనిచేస్తున్నారని ఆరోపణతమకు వచ్చిన ఓట్లు కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి చూపిస్తున్నారని ఆగ్రహంనల్లగొండముగిసిన ఎమ్మెల్సీ ఉప ఎన్నిక మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు18,565 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్న నవిన్(మల్లన్న)మొదటి స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి చింతపండు నవీన్( తీన్మార్ మల్లన్న)122813 మొదటి ప్రాధాన్యత ఓట్లు సాధించిన నవీన్( మల్లన్న)బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డికి 104248 ఓట్లుబీజేపీ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డికి 43313 ఓట్లుస్వతంత్ర అభ్యర్థి అశోక్ 29697 ఓట్లు కాసేపట్లో సీఈఓ వికాస్ రాజ్ ను కలవనున్న బీ ఆర్ ఎస్ నేతలు.నల్గొండ, వరంగల్, ఖమ్మం పట్టభద్రుల ఉప ఎన్నిక కౌంటింగ్ ఆపాలని, అక్కడ జరుగుతున్న కౌంటింగ్ లో అవకతవకలపై ఫిర్యాదు చేయనున్న నేతలు.కౌంటింగ్ అధికారులు కౌంటింగ్ సక్రమంగా చేయటం లేదని ఫిర్యాదు చేయనున్న ఎంఎల్ఏ కౌశిక్ రెడ్డి, ఇతర బీ ఆర్ ఎస్ నేతలు నల్లగొండ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల కౌంటింగ్ కేంద్రం వద్ద బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డి మాట్లాడుతూ.. ఉప ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియలో నిన్నటి నుండి గోల్ మాల్ జరిగిందిమూడో రౌండ్ లో కాంగ్రెస్ కు మూడు వేలు ఆధిక్యం వస్తే నాలుగు వేలకు పైగా ఆధిక్యం వచ్చినట్లు ప్రకటించారుమేం అభ్యంతరం చెప్పినా ఆర్వో పట్టించుకోవడం లేదుమూడో రౌండ్ నుంచి అనుమానం ఉందని చెప్పినా కనీస స్పందన లేదుఎన్నికల ఫలితాలు తారుమారు చేస్తే కౌంటింగ్ బైకాట్ చేస్తాంఎన్నికల సంఘం స్పందించాలిరిటర్నింగ్ అధికారిపై ఎలక్షన్ కమిషన్ కు ఫిర్యాదు చేస్తాంఅధికారుల తీరు ఫలితాలను తారుమారు చేసేలా ఉందితమ అభ్యంతరాలకు వివరణ ఇచ్చాకే రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కంపు జరపాలి నల్లగొండ జిల్లాఎమ్మెల్సీ ఉప ఎన్నికల నాలుగో రౌండ్ ఫలితాల వెల్లడిలో తీవ్ర జాప్యంనాలుగో రౌండ్ తొలి ప్రాధాన్యత ఓట్లు లెక్కింపు పూర్తై మూడు గంటలుఅయినా ఫలితాలు వెల్లడించని అధికారులు👉ముగిసిన నాలుగో రౌండ్ తొలి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపుఅధికారికంగా వెలువడాల్సిన ఫలితాలు 👉నాల్గో రౌండ్లో చెల్లని ఓట్లను తొలగించి గెలుపుకు కావాల్సిన కోటాను తేల్చనున్న అధికారులుఇప్పటి వరకు ఎవరికీ యాభై శాతం ఓట్లు రాకపోవడంతో కీలకంగా మారిన రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపుసాయంత్రం ఆరు గంటల తర్వాత ఎలిమినేషన్ ప్రక్రియ ప్రారంభం👉మూడో రౌండ్ మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు పూర్తైంది. మూడో రౌండ్లోనూ కాంగ్రెస్ అభ్యర్థి చింతపండు నవీన్(తీన్మార్ మల్లన్న) లీడ్‌లో ఉన్నారు. అయితే.. మూడో రౌండ్లో 4,207 ఓట్ల ఆధిక్యం రాగా, ఓవరాల్‌గా 18,878 ఓట్ల ఆధిక్యంలో మల్లన్న కొనసాగుతున్నారు. మొత్తంగా ఇప్పటి వరకు 2 లక్షల 88 వేల ఓట్ల మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు పూర్తి అయ్యింది. మరో 48013 ఓట్ల లెక్కింపు చేస్తున్నారు అధికారులు. లీడ్ జాబితా.. ఎవరెవరికి ఎన్ని ఓట్లంటే..చింతపండు నవీన్( తీన్మార్ మల్లన్న కాంగ్రెస్) 1,06,234రాకేష్ రెడ్డి (బీఆర్ఎస్) 87,356ప్రేమేందర్ రెడ్డి( బీజేపీ) 34,516అశోక్ (స్వతంత్ర) 27,49318,878 ఓట్ల ఆధిక్యం లో తీన్మార్ మల్లన్నచెల్లిన ఓట్లు 2,64,216చెల్లని ఓట్లు: 23,784 -
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉపఎన్నిక కౌంటింగ్.. ఆధిక్యంలో తీన్మార్ మల్లన్న
సాక్షి, నల్గొండ: వరంగల్ -ఖమ్మం-నల్గొండ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు రెండో రౌండ్ పూర్తయింది. ప్రస్తుతం మూడో రౌండ్ కౌంటింగ్ సాగుతోంది. మొదటి రౌండ్లో 7,670 ఓట్ల ఆధిక్యంలో ఉన్న కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న.. రెండో రౌండ్లోనూ లీడ్‌లో కొనసాగారు. రెండు రౌండ్లు పూర్తయ్యే సరికి కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న 14,672 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. ఈ రౌండ్లో ఆయనకు 34,575 ఓట్లు పోల్ అయ్యాయి.రెండో రౌండ్ ఫలితాలుకాంగ్రెస్ అభ్యర్థి నవీన్(తీన్మార్ మల్లన్న)కు వచ్చిన ఓట్లు: 34,575బీఆర్ఎస్ అభ్యర్థి రాకేశ్ రెడ్డికి వచ్చిన ఓట్లు: 27,573బీజేపీ అభ్యర్థి ప్రేమిందర్ రెడ్డికి వచ్చిన ఓట్లు: 12,841స్వతంత్ర అభ్యర్థి అశోక్ కు వచ్చిన ఓట్లు: 11,018నల్గొండలోని దుప్పలపల్లిలో నిన్న(బుధవారం) ఉదయం 8 గంటలకు లెక్కింపు ప్రక్రియ ప్రారంభమైంది. -
జనరల్ ఎన్నికల ఫలితాలు 2024
-
ప్రతిభింబించని ఎగ్జిట్ పోల్ అంచనాలు
-
ఆధిక్యంలో సీఎం జగన్ సహా పలువురు వైఎస్సార్సీపీ అభ్యర్థులు
-
ప్రొద్దుటూరులో YSRCP ముందంజ
-
పులివెందులలో జగన్ ముందంజ
-
కడప ఎంపీ అభ్యర్థి అవినాష్‌రెడ్డి ఆధిక్యం
-
ప్రారంభమైన పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్
-
8 గంటలకే పోస్టల్ బ్యాలట్, ఈవీఎంల్లోని ఓట్ల లెక్కింపు ప్రారంభం
-
EVM కౌంటింగ్‌లో ప్రతి రౌండు 20 నుంచి 25 నిమిషాల సమయం
-
గెలిచేది జగనే ..ఎందుకంటే..
-
తెనాలి ఎమ్మెల్యే శివకుమార్ పూజలు
-
రాజస్థాన్‌లో బీజేపీ ముందస్తు సంబరాలు
2024 లోక్‌సభ ఎన్నికల ఓట్ల లెక్కింపు మరికాసేపట్లో ప్రారంభం కానుంది. 543 స్థానాలకు 7 దశల్లో ఓటింగ్ జరిగింది. భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ఎన్డీఏ, కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండీ అలయన్స్ రెండూ తమ తమ విజయాలను ప్రకటించుకుంటున్నాయి.ఫలితాలు వెలువడకముందే విజయోత్సవ సంబరాలు జరుపుకునేందుకు బీజేపీ సన్నాహాలు ప్రారంభించింది. ఎగ్జిట్ పోల్స్‌లో భారీ ఆధిక్యం సాధించిన తర్వాత, భారతీయ జనతా పార్టీ నేతల, కార్యకర్తల ఉత్సాహం తారా స్థాయికి చేరింది. అదే సమయంలో కాంగ్రెస్, ఇతర ప్రతిపక్ష పార్టీలు ఎగ్జిట్ పోల్స్‌ను తాము అస్సలు నమ్మడం లేదని పేర్కొన్నాయి.మరోవైపు ఓట్ల లెక్కింపునకు ముందే రాజస్థాన్‌లోని బీజేపీ కార్యాలయాన్ని అందంగా అలంకరించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రాజస్థాన్‌లోని 25 లోక్‌సభ స్థానాలకు జరిగిన ఎన్నికలకు సంబంధించిన ఓట్ల లెక్కింపునకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. ఓట్ల లెక్కింపునకు 13 వేల మందికి పైగా సిబ్బందిని నియమించినట్లు అధికారులు తెలిపారు. #WATCH | BJP party office in Rajasthan's Jaipur is decorated ahead of the Lok Sabha polls result, today.Vote counting of #LokSabhaElections to begin at 8 am.(Video Source: BJP, Rajasthan) pic.twitter.com/pq8MuZEemD— ANI (@ANI) June 4, 2024 -
మరికాసేపట్లో ప్రారంభం కానున్న కౌంటింగ్ ప్రక్రియ