
సాక్షి, తిరుమల: తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)లో విద్యార్థులతో చేపట్టిన కానుకల లెక్కింపు ప్రయోగం మంచి ఫలితాలు ఇస్తోంది. పరకామణిలోని కానుకలు విద్యార్థులు లెక్కించడంతో సోమవారం మధ్యాహ్నం 2.30 గంటలకే లెక్కింపు పూర్తయింది. మంగళవారం సాయంత్రం 5 గంటల వరకు హుండీ కానుకల లెక్కింపు జరుగనుంది. సిబ్బంది కొరత కారణంగా రోజురోజుకు నగదు నిల్వలు పెరిగిపోతున్నాయి. దీంతో విద్యార్థులతో హుండీ కానుకల లెక్కింపు చేయిస్తే ఎలా ఉంటుందనే దానిపై అధికారులు కసరత్తు ప్రారంభించారు. సోమవారం విద్యార్థులతో లెక్కింపు చేయించడంతో సమస్యకు పరిష్కారం లభించింది. శ్రీవారి సేవకుల స్థానంలో విద్యార్థులతో శాశ్వత ప్రాతిపదికన కానుకలు లెక్కింపు చేయించే యోచనలో ఉన్నట్లు టీటీడీ ప్రత్యేకాధికారి ధర్మారెడ్డి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment