TTD
-
తిరుమల సమాచారం ఇలా.. నేడు ఏప్రిల్ నెల దర్శన టికెట్ల విడుదల
సాక్షి, తిరుమల: తిరుమలకు సంబంధించి నేటి సమాచారం ఇలా ఉంది. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. తిరుమల శ్రీవారి దర్శనానికి 15 కంపార్ట్మెంట్స్లో భక్తులు వేచి ఉన్నారు. ఇక, సర్వదర్శనానికి 15 గంటల సమయం పడుతోంది.తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి ప్రత్యేక దర్శనానికి 5 గంటలు పడుతోంది. ఇక, నిన్న శ్రీవారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 56,225లుగా ఉండగా.. నిన్న తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య 19,588. గురువారం శ్రీవారి హుండీ ఆదాయం 3.95 కోట్లుగా ఉంది.మరోవైపు.. నేడు ఏప్రిల్ నెల ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను టీటీడీ విడుదల చేయనుంది. ఏప్రిల్ నెలకు సంబంధించిన ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను ఈరోజు ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది. ఇక తిరుమల, తిరుపతిలలో గదుల కోటాను కూడా విడుదల చేయనుంది. తిరుమల, తిరుపతిలో ఏప్రిల్ నెల గదుల కోటాను ఈరోజు మధ్యాహ్నం మూడు గంటలకు ఆన్లైన్లో విడుదల చేస్తారు.ఇదిలా ఉండగా.. ఈ నెల 27వ తేదీన శ్రీవారి సేవ సాధారణ, నవనీత, పరాకామణి సేవ కోటాను ఉదయం 11 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు యధా ప్రకారం విడుదల చేస్తారు. కాగా, https://ttdevasthanams.ap.gov.in వెబ్సైట్ ద్వారా మాత్రమే శ్రీవారి ఆర్జితసేవలు, దర్శన టికెట్లు బుక్ చేసుకోవాలని టీటీడీ సూచించింది. -
23 నుంచి శ్రీవారి సర్వ దర్శనానికి టోకెన్లు ఇవ్వనున్న టీటీడీ
-
TTD: తిరుమల శ్రీవారికి రూ. 6 కోట్ల విరాళం
తిరుమల: తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామికి చెన్నైకి చెందిన వర్ధమాన్ జైన్ అనే భక్తుడు టీటీడీ ట్రస్టులకు రూ.6 కోట్లు విరాళంగా అందించారు. తిరుమల ఆలయంలోని రంగనాయకుల మండపంలో ఆయన ఎస్వీబీసీ కోసం రూ.5 కోట్లు, ఎస్వీ గోసంరక్షణ ట్రస్ట్ కోసం రూ. కోటి విలువైన డిడిలను టిటిడి అదనపు ఈవో శ్రీ సిహెచ్ వెంకయ్య చౌదరికి అందజేశారు. టీటీడీ ట్రస్టులకు గతంలో దాత అనేక మార్లు విరాళంగా అందజేశారు. -
Tirumala : ముగిసిన వైకుంఠ ద్వార దర్శనాలు
తిరుపతి: తిరుమల శ్రీవారి ఆలయంలో ఆదివారం అర్ధరాత్రి వైకుంఠ ద్వారాలు మూతపడ్డాయి. పదిరోజుల పాటు దాదాపు 6.83 లక్షల మంది శ్రీవారిని దర్శించుకుని.. ఉత్తరద్వార ప్రవేశం చేశారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఈ నెల పదో తేదీన వైకుంఠ ద్వారాలను తెరిచిన విషయం తెలిసిందే. ఇవ్వాల్టి నుండి యదావిధిగా కొనసాగుతున్న దర్శనాలునేడు తిరుమలలో భక్తుల రద్దీ కొంత తక్కువగా ఉంది. ఉచిత సర్వ దర్శనానికి 10 కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్న భక్తులు. నిన్న (ఆదివారం) 70,826 మంది స్వామివారిని దర్శించుకోగా 22,625 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ. 3.68 కోట్లు సమర్పించారు. టైమ్ స్లాట్ (SSD) దర్శనానికి 1 కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్న భక్తులు దర్శనానికి 1 గంటల సమయం . దర్శన టిక్కెట్లు లేని భక్తులకు 10 గంటల్లో దర్శనం లభిస్తోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన భక్తులకు 5 గంటల్లో దర్శనం లభిస్తోంది. -
దేవుడి సంపద మీద పచ్చ ముఠా కన్నేసిందా ?
-
తిరుమలలో కొనసాగుతున్న వైకుంఠద్వార దర్శనాలు
సాక్షి, తిరుమల: తిరుమలలో శనివారం (జనవరి 18) 9వ రోజు వైకుంఠ ద్వార దర్శనాలు కొనసాగుతున్నాయి. గత ఎనిమిది రోజులలో తిరుమలేశుని వైకుంఠ ద్వారం ద్వారా మొత్తం 5లక్షల 36 వేల 277 మంది దర్శించుకున్నారు. ఇలా ఉండగా ఆదివారం(జనవరి 19)తో వైకుంఠ ద్వార దర్శనాలు ముగియనున్నాయి. తిరుమలలో భక్తుల రద్ది సాధారణంగా ఉంది. శనివారం అర్ధరాత్రి వరకు 75,931 మంది స్వామివారిని దర్శించుకున్నారు. వీరిలో 25,717 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. కానుకల రూపంలో హుండీలో రూ.3.40 కోట్లు సమర్పించారు. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన భక్తులకు 5 గంటల్లో దర్శనం లభిస్తోంది. నేడు విఐపీ దర్శనాలు రద్దు -
టీటీడీలో వరుస ఘటనలపై కేంద్రం సీరియస్
సాక్షి ప్రతినిధి, తిరుపతి: తిరుమలలో వరుస ఘటనలను కేంద్ర హోం శాఖ తీవ్రంగా పరిగణించింది. శ్రీవారి లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిసిందంటూ ఏకంగా సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించడం.. వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల జారీ సందర్భంగా ఈ నెల 8న తిరుపతిలో జరిగిన తొక్కిసలాట జరిగి ఆరుగురు మృతి చెందడం, పదుల సంఖ్యలో భక్తులు గాయపడటం.. ఈ ఘటన గురించి మరచిపోక ముందే 13న లడ్డూ కౌంటర్లో అగ్ని ప్రమాదం జరగడంపై కేంద్రం దృష్టి సారించింది.తొక్కిసలాట, అగ్ని ప్రమాదంపై టీటీడీ నుంచి నివేదిక కోరింది. వరుస పరిణామాలకు సంబంధించి క్షేత్ర స్థాయిలో పర్యటించి, వాస్తవాలు తెలుసుకోవాలని కేంద్ర హోం శాఖ అడిషనల్ సెక్రటరీ సంజీవ్ కుమార్ జిందాల్‌కు ఆదేశాలు జారీ చేసింది. సంజీవ్ కుమార్ జిందాల్ ఆదివారం తిరుమలకు వస్తారని టీటీడీ చైర్మన్‌కు లేఖ పంపింది. అయితే ఆయన పర్యటన వాయిదా పడినట్లు శనివారం రాత్రి తిరిగి సమాచారం అందించింది. టీటీడీ చరిత్రలో కేంద్రం జోక్యం చేసుకోవడం ఇదే మొదటిసారి. కాగా, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటికీ నుంచి టీటీడీని రాజకీయంగా వాడుకోవడంపై దృష్టి సారించింది. ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది భక్తుల మనోభావాలు దెబ్బ తింటాయన్న విచక్షణ మరచి, సీఎం స్థానంలో ఉన్న చంద్రబాబు శ్రీవారి ప్రసాదాల్లో జంతువుల కొవ్వు కలిసిందంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. క్రౌడ్ మేనేజ్మెంట్లో టీటీడీకి ఉన్న రికార్డుకు మచ్చ తీసుకొస్తూ కనీస ఏర్పాట్లు చేయకుండానే ఈ నెల 8న తిరుపతిలో వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల కోసం ఒక్కసారిగా క్యూలైన్ గేట్లు తెరిచారు. ఫలితంగా తొక్కిసలాట జరిగి ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన మరువక ముందే తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం కౌంటర్లో షార్ట్ సర్కూట్‌తో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. పదుల సంఖ్యలో కౌంటర్లు, క్యూలలో వేలాది భక్తులు ఉన్న సమయంలో ఈ ఘటన జరిగడం ఆందోళనకు గురి చేసింది. వీటన్నింటికీ తోడు లోకేశ్ మనిషి లక్ష్మణ్‌కుమార్ ‘సూడో’ అదనపు ఈఓగా చెలరేగిపోతుండటం పట్ల టీటీడీ యంత్రాంగం మండిపడుతోంది. -
తిరుమలలో మద్యం, మాంసం
-
తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనం.. భక్తుల రద్దీ ఇలా..
సాక్షి, తిరుమల: తిరుమల శ్రీవారి ఆలయానికి వైకుంఠ ద్వారా దర్శనాలు కొనసాగుతున్నాయి. రేపటితో వైకుంఠ ద్వారా దర్శనం ముగియనుంది. ఈ నేపథ్యంలో రేపు సర్వదర్శనానికి టోకెన్ల కేటాయింపు రద్దు చేశారు. మరోవైపు.. స్వామి వారి దర్శనం కోసం భక్తుల రద్దీ కొనసాగుతూనే ఉంది. ప్రస్తుతానికి భక్తుల రద్దీ సాధారణంగానే ఉంది.తిరుమలలో నిన్న స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 61,142 మంది ఉంది. టైమ్ స్లాట్ (SSD) దర్శనానికి 5 గంటల సమయం పడుతోంది. రూ.300 టికెట్ ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 4 గంటల సమయం పడుతోంది. నిన్న స్వామివారికి తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య 19,736 మంది కాగా.. స్వామివారి హుండీ ఆదాయం 3.51 కోట్లు. మరోవైపు.. టికెట్ ఉన్న భక్తులకు మాత్రమే వైకుంఠ ద్వార దర్శనానికి అనుమతిస్తోంది టీటీడీ. రేపటి వరకు భక్తులకు వైకుంఠ ద్వార దర్శనాలకు అనుమతి ఉంది. ఆదివారంలో వైకుంఠ ద్వార దర్శనాలు ముగియనున్నాయి. ఈ నేపథ్యంలో రేపు సర్వదర్శనానికి టోకెన్ల కేటాయింపును టీటీడీ రద్దు చేసింది. అలాగే, 20వ తేదీన సర్వ దర్శనంలో మాత్రమే స్వామి వారిని దర్శించుకునేందుకు భక్తులకు అనుమతి ఇచ్చింది. ఇక, 20 తేదీన వీఐపీ దర్శనాలను రద్దు చేసినట్టు టీటీడీ తెలిపింది.ఇక, శ్రీవారి ఆర్జితసేవా టికెట్ల ఏప్రిల్ నెల కోటా విడుదల చేయనుంది టీటీడీ. నేడు ఉదయం 10 గంటలకు ఆర్జిత సేవ ఆన్లైన్ లక్కీ డిప్ కోటా విడుదల చేయనున్నారు. సేవా టికెట్ల రిజిస్ట్రేషన్ కోసం జనవరి 18 నుండి 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఆన్లైన్లో నమోదు చేసుకోవచ్చు. జనవరి 21న ఆర్జిత సేవా టికెట్ల, వర్చువల్ సేవల కోటా విడుదల. జనవరి 23న ఉదయం 10 గంటలకు అంగప్రదక్షిణం టోకెన్లు. జనవరి 23 ఉదయం 11 గంటలకు శ్రీవాణి టికెట్ల ఆన్ లైన్ కోటా విడుదల, 23 మధ్యాహ్నం 3 గంటలకు వృద్ధులు, దివ్యాంగుల దర్శన కోటా విడుదల. జనవరి 24న ఉదయం 10 గంటలకు ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటా విడుదల. తిరుమల, తిరుపతిలలో ఏప్రిల్ నెల గదుల కోటాను జనవరి 24న మధ్యాహ్నం 3 గంటలకు ఆన్లైన్లో విడుదల చేస్తారు. https://ttdevasthanams.ap.gov.in వెబ్సైట్ ద్వారా మాత్రమే శ్రీవారి ఆర్జితసేవలు, దర్శన టికెట్లు బుక్ చేసుకోవాలి -
తిరుమలలో చాగంటికి అవమానం
తిరుమల శ్రీవారి దర్శనం కోసం వచ్చిన ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావుకు (chaganti koteswara rao) అవమానం జరిగింది. తిరుమలకు ఏడాదికి ఒకసారి వచ్చే ఆయనపై టీటీడీ తీరు తీవ్ర విమర్శలకు తావిస్తోంది. సాధారణంగా దర్శన సమయంలో వయసు రీత్యా బయోమెట్రిక్ నుంచి ఆయన వెళ్లే వెసులుబాటు ఉంది. కానీ చాగంటిని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ నుంచి ఆలయంలోకి అనుమతించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అలాగే గురువారం సాయంత్రం ఆరు గంటలకు తిరుపతి (Tirupati) మహతిలో ఆయన ప్రవచనం చేయాల్సి ఉంది. కానీ చివరి నిమిషంలో పరిపాలనా కారణాల రీత్యా చాగంటి ప్రవచనాలను టీటీడీ రద్దు చేసింది. ఎక్కడా ఆయనకు తగిన ప్రాధాన్యత ఇవ్వకపోవడం విమర్శలకు దారితీస్తోంది.19న ముగియనున్న శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనంతిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం ఎస్ఎస్డీ టోకెన్లపై గురువారం సాయంత్రం టీటీడీ (TTD) పరిపాలన భవనంలో టీటీడీ ఈవో జె.శ్యామలరావు ఉన్నతాధికారులతో సమీక్షించారు. 19వ తేదీన వైకుంఠ ద్వార దర్శనం ముగుస్తున్నందున ఈ టోకెన్లపై అదనపు ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరి, జేఈవో వీరబ్రహ్మం, జిల్లా కలెక్టర్ ఎస్.వెంకటేశ్వర్, ఎస్పీ మణికంఠ చందోలుతో ఈవో సమీక్షించారు. వైకుంఠ ద్వార దర్శనం చివరిరోజు ఈ టోకెన్ల జారీ శుక్రవారం (జనవరి 17)తో ముగిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. 20వ తేదీన దర్శనానికి 19న ఈ టోకెన్లు జారీ చేయరు. వారు సర్వదర్శనం క్యూలోనే దర్శనం చేసుకోవాలి. 19న ఆఫ్‌లైన్‌లో శ్రీ వాణి టిక్కెట్లు జారీ చేయరు. 20న టీటీడీ ప్రోటోకాల్ భక్తులను మినహాయించి వీఐపీ బ్రేక్ దర్శనం రద్దు చేశారు. ఈ కారణంగా జనవరి 19న బ్రేక్ దర్శనం కోసం ఎటువంటి సిఫార్సు లేఖలు స్వీకరించరు.ప్రయాగ్‌రాజ్‌లో వైభవంగా శ్రీవారి కల్యాణాలుఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళాలో (Maha Kumbh Mela) శ్రీవారి కల్యాణోత్సవాలను వైభవంగా నిర్వహించాలని ఈవో శ్యామలరావు అధికారులను ఆదేశించారు. జనవరి 18, 26, ఫిబ్రవరి 3, 12 తేదీల్లో జరిగే శ్రీవారి కల్యాణోత్సవాలకు భక్తులకు ఎలాంటి ఇబ్బందుల్లేకుండా ఏర్పాట్లు చేయాలని చెప్పారు. చదవండి: మహాకుంభమేళాకు తెలుగు రాష్ట్రాల నుంచి 10 లక్షల మందికిపైగా భక్తులుఈ నెల 29న మౌణి అమావాస్య, ఫిబ్రవరి 3న వసంత పంచమి, ఫిబ్రవరి 12న మాగ పౌర్ణమి, ఫిబ్రవరి 26న శివరాత్రి లాంటి ప్రధాన రోజుల్లో భక్తుల రద్దీ అధికంగా ఉంటుందని, టీటీడీ విజిలెన్స్ అధికారులు, ప్రయాగ్ రాజ్ పోలీసులు సమన్వయంతో భక్తులకు ఎలాంటి ఇబ్బందుల్లేకుండా క్యూలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. శ్రీవారి నమూనా ఆలయానికి వచ్చే భక్తులకు అవసరమైన సౌకర్యాలు కల్పించాలని, ఉచితంగా ఇచ్చే చిన్న లడ్డూలను తగినంతగా సమకూర్చుకోవాలని చెప్పారు.మహా కుంభమేళాలో నృత్య నీరాజనంప్రయాగ్రాజ్లో కొనసాగుతున్న మహా కుంభమేళాలో తిరుపతి కళాకారులు అద్భుత నృత్య కళా ప్రదర్శనలతో నీరాజనాలు అర్పించారు. మహా కుంభమేళా వద్ద శ్రీవారి నమూనా ఆలయంలో గురువారం స్వామివారి ఊంజల్ సేవ అనంతరం హిందూ ధర్మప్రచార పరిషత్, ఎస్వీ సంగీత, నృత్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం.ఉమాముద్దుబాల ఆధ్వర్యంలో కళాకారులు శాస్త్రీయ నృత్యాభినయాలతో భక్తులను విశేషంగా ఆకట్టున్నారు. కళాకారులు శరత్చంద్ర, శివప్రసాద్, ఉషాశ్రీ, వీణ శర్మ, హేమలతలు పుష్పాంజలితో ఆరంభించి.. శ్రీమన్నారాయణ, శివతాండవం, భో.. శంభో.. ఇట్టి ముద్దులాడే బాలుడు, వినాయక కౌతం, దశావతారం, అష్టపది, ముద్దుగారే యశోద.. వంటి కీర్తనలకు చక్కటి హావభావాలు, అభినయంతో నృత్యం చేసి అందరిలోనూ భక్తిపారవశాన్ని నింపారు. 144 ఏళ్లకు ఒకసారి వచ్చే మహా కుంభమేళాలో నృత్య ప్రదర్శన చేయడం తమ పూర్వ జన్మ సుకృతమని శరత్చంద్ర బృందం ఆనందం వ్యక్తంచేసింది. -
టీటీడీలో దోపిడీ దందా.. పక్కా ఆధారాలతో బయటపెట్టిన టీడీపీ నేత
-
Big Question: టీటీడీలో దొంగల ముఠా.. ప్రమాదం వెనక భారీ కుట్ర ?
-
టీటీడీలో లోకేష్ ప్రైవేట్ మనుషులు..మల్లాది విష్ణు రియాక్షన్
-
తిరుమల లడ్డూ కౌంటర్ల వద్ద అగ్నిప్రమాదం
తిరుపతి, సాక్షి: తిరుమల లడ్డూ కౌంటర్ల వద్ద అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. దీంతో భక్తులు భయబ్రాంతులకు గురై పరుగులు తీశారు. ఆపై సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ప్రమాదంలో ఎలాంటి నష్టం వాటిల్లలేదని సమాచారం. లడ్డూ కౌంటర్లలో 47వ నెంబర్ కౌంటర్ వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుంది. కౌంటర్లోని కంప్యూటర్ యూపీఎస్‌లో షార్ట్ సర్క్యూట్ రావడంతోనే ప్రమాదం జరిగినట్లు సిబ్బంది చెబుతున్నారు. మరోవైపు తిరుమల లడ్డూ కౌంటర్ల వద్ద నిత్యం భక్తుల రద్దీ ఉండడం సహజమే. అయితే.. ఇటీవల తిరుపతి తొక్కిసలాట ఘటన తర్వాత.. స్వామివారిని దర్శించుకుంటున్న భక్తుల సంఖ్యలో మార్పు కనిపిస్తోంది. ఈ క్రమంలో లడ్డూ కౌంటర్ల వద్ద అగ్నిప్రమాదంతో ఒక్కసారిగా అలజడి చేలరేగగా.. కాసేపు అక్కడున్న భక్తులు అందోళనకు గురయ్యారు. -
తిరుమలలో ‘లక్ష్మణ’ లీలలు!
అమరావతి: తిరుమల తిరుపతి దేవ స్థానం (టీటీడీ)లో ప్రైవేట్ వ్యక్తుల హవాకు సంబంధించి రోజుకో కొత్త విషయం వెలుగు చూస్తోంది. 2014– 19 మధ్య టీడీపీ ప్రభుత్వ హయాంలో ఫైబర్‌నెట్ కుంభకోణంలో ప్రధాన నిందితుడిగా ఉన్న వేమూరి హరికృష్ణ ఓ పక్క ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పేరుతో దేవస్థానంలో చక్రం తిప్పుతుంటే మరోవైపు లోకేశ్ మనిషిగా ముద్రపడ్డ లక్ష్మణ్‌కుమార్ ఏకంగా ‘సూడో’ అదనపు ఈఓగా చెలరేగిపోతున్నారు. అదన ఈఓ వెంకయ్య చౌదరి పక్కనే ఈయనకు కుర్చీవేసి ప్రొటోకాల్ మర్యాదలు అందిస్తున్నారంటే ఈయన హవా ఏ స్థాయిలో నడుస్తోందో అర్థంచేసుకోవచ్చు.లక్ష్మణ్‌కుమార్‌కు ఛాంబర్, వాహనం, ఇతర సౌకర్యాలను కల్పిస్తున్నారు. ఏ అధికారిక ఉత్తర్వులు లేకపోయినా టీటీడీలో తిష్టవేసి అందరినీ శాసిస్తున్న లక్ష్మణ్‌కుమార్ వ్యవహారం ఇప్పుడు టీటీడీలో హాట్ టాపిక్. టీటీడీలో ఎలాంటి ఉత్తర్వుల్లేకుండా అధికారిక సమావేశంలో పాలొ్గనడం, ఏఈఓతోపాటు సమీక్షల్లో ఉండడం.. నిఘా, ముఖ్యభద్రతాధికారి పాల్గొన్న సమావేశానికీ హాజరైన ఈ సూడో అడిషనల్ ఈఓ కథా కమామిషు ఇదీ..అంతటా ఆయనే..సీఎం కార్యాలయం నుంచి వచ్చే సిఫార్సు లేఖలతో పాటు, టీటీడీకి ప్రపంచం నలుమూలలు నుంచి వచ్చి దాతలిచ్చే విలువైన కానుక లపై ఈ సూడో ఏఈఓ ప్రత్యేక దృష్టిపెట్టినట్లు సమాచారం. కొందరు అజ్ఞాత భక్తులు స్వామివారికి కానుకలిచ్చే సమయంలో తమ పేరు చెప్పడానికి సైతం ఇష్టపడరు. అలాంటి వాటిపై సూడో ఏఈఓ అవతారమెత్తిన లక్ష్మణ్‌కుమార్ ఈ వ్యవహారాలన్నీ చక్కబెడుతున్నట్లు తెలుస్తోంది. తిరుమలలో వైకుంఠ ఏకాదశి నాడు విద్యుత్ దీపాలంకరణ బాధ్యతను దాత సహాయంతో అంతా లక్ష్మణ్‌కుమారే నడిపించినట్లు టీటీడీ వర్గాలు తెలిపాయి.ఆయన చూస్తేనే అదనపు ఈఓ సిఫారసు..తిరుమలలో అదనపు ఈఓ కార్యాలయంలో ఏ పని జరగాలన్న లక్ష్మణ్‌కుమార్ కనుసన్నల్లోనే జరగాలని.. ఆ తర్వాతే ఏఈఓ వెంకయ్యచౌదరి సంతకాలు చేస్తారని టీటీడీ ఉద్యోగులు చెబుతున్నారు. అసలు ఏ అర్హతతో ఈయన్ను ఏఈఓ కార్యాలయంలో ప్రత్యేక చాంబర్ ఏర్పాటుచేయాల్సి వచ్చింది? స్పెషల్ టైప్–05 నెంబర్ గెస్ట్‌హౌస్‌ను ఆయనకు ఎందుకు నివాసంగా ఏర్పాటుచేశారని వారు చర్చించుకుంటున్నారు. పైగా.. ఈయన ఏఈఓ కార్యాలయంలోనే అపవిత్ర కార్యక్రమాలకు పాల్పడుతున్నట్లు ఆరోపిస్తున్నారు.టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో తామేంచేసినా చెల్లుబాటవుతుందనేలా వీరు రాజ్యాంగేతర శక్తులుగా అవతరిస్తున్నారు. వ్యవస్థల్ని శాసిస్తూ, దోచుకునేందుకు తిరుమల కొండపై తిష్టవేశారని ఉద్యోగులు బాహాటంగానే విమర్శిస్తున్నారు. ఇక తిరుమలను ప్రక్షాళన చేస్తానంటూ ఎన్నికల ముందు చెప్పిన చంద్రబాబునాయుడు.. అధికారంలోకి వచ్చాక టీటీడీని ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి పెట్ట డమే ప్రక్షాళనా అని వారు సూటిగా ప్రశ్నిస్తున్నారు. అదనపు ఈఓకు అనుభవంలేకపోవడంతో..నిజానికి.. టీటీడీ అదనపు ఈఓగా ఉన్న వెంకయ్యచౌదరికి పాలనా అనుభవంలేకపోవడం, నిత్యం కార్యాలయ పనులపై పూర్తిస్థాయిలో పర్యవేక్షణ లేకపోవడంతో లక్ష్మణ్‌కుమార్ సూడో అడిషనల్ ఈఓ చెలామణి అవుతున్నారు. అసలు కస్టమ్స్ ఆఫీసర్‌గా పనిచేసిన వ్యక్తిని టీటీడీ అదనపు ఈఓగా ఎలా నియమిస్తారని భక్తులు ప్రశ్నిస్తున్నారు. పైగా.. తిరుమలలో జేఈఓ కార్యాలయంలో పనిచేసేందుకు ఐఏఎస్ అధికారులు ఎవరూ లేన్నట్లు ఐఆర్ఎస్ అధికారిని అదనపు ఈఓగా తీసుకురావడం.. దీనికితోడు మరో సూడో అదనపు ఈఓకు పెత్తనం ఇవ్వడం పవిత్ర తిరుమల భ్రష్టుపట్టిపోవడానికి దారితీస్తోందని కార్యాలయ సిబ్బంది మండిపడుతున్నారు.తిరుమలను చెప్పుచేతల్లో పెట్టుకునేందుకే..టీటీడీకి సంబంధించిన ప్రతి విషయం ఎంతో గోప్యంగా, భద్రంగా ఉంటుంది. కానీ, చంద్రబాబు ఈ మొత్తం వ్యవస్థను తన చెప్పుచేతుల్లో పెట్టుకునేందుకే లక్ష్మణ్‌కు ప్రత్యేక బాధ్యతలు అప్పగించినట్లు తెలుస్తోంది. ఆయన పరకామణి, పోటు, దాతలిచ్చే విరాళాలు, టీటీడీ ఈ– ఫైల్స్, టీటీడీ టెండర్లు తదితర వాటిపై పెత్తనం సాగిస్తున్నారు. రహస్య సమాచారం అంతా ఆయన చేతుల్లోకి తీసుకున్నారు. అలాగే, సిఫార్సు లేఖలు కూడా ఎవరికివ్వాలి, ఎవరికి ఇవ్వకూడదనే విషయాలనూ ఆయనే చూసుకుంటున్నారు. ఈయన చూసి ఓకే చేసిన తర్వాతే టీటీడీ ఏఈఓ, ఈఓ నిర్ణయం తీసుకునేలా వ్యవస్థను తన చెప్పుచేతల్లో పెట్టుకున్నారు. ఇలా కీలక వ్యవహారాలన్నీ చంద్రబాబు ఓ ప్రైవేట్ వ్యక్తికి అప్పగించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తిరుమలలో ఏ స్కాం జరిగినా బయటకు రాకుండా వ్యవస్థను ఏర్పరుచుకున్నారని టీటీడీ సిబ్బంది చర్చించుకుంటున్నారు. -
వీడని భయం!
తిరుమల శ్రీవారి కనులారా వీక్షించేందుకు భక్తులు ఎదురుచూస్తూ ఉంటారు. ప్రధానంగా వైకుంఠ ద్వార దర్శన భాగ్యం కోసం ఏడాది నుంచి ప్రయత్నిస్తుంటారు. అయితే తిరుపతిలో ఇటీవల జరిగిన తొక్కిసలాట ఘటన భక్తులను ఇప్పటికీ కలవరపెడుతోంది. టీటీడీ చరిత్రలోనే ఇలాంటి దుర్ఘటన ఇప్పటి వరకు చోటు చేసుకోలేదు. ప్రభుత్వ నిర్లక్ష్యంతోపాటు టీటీడీ బోర్డు, అధికారుల అవగాహన, బాధ్యత రాహిత్యం కారణంగా ఆరుగురు భక్తులు మృత్యువాత పడ్డారు. ఇప్పటికీ శ్రీవారి భక్తులను ఇదో పీడకలలా వెంటాడుతోంది. తొక్కిసలాట దృశ్యాలను టీవీలు, సామాజిక మాధ్యమాల్లో చూసిన భక్తులు నేటికీ భయాందోళనలోనే ఉన్నారు. భక్తజనం..తిరుపతి టాస్క్‌ఫోర్స్ : అత్యంత పవిత్రంగా భావించే వైకుంఠ ద్వార దర్శనానికి భక్తుల నుంచి స్పందన అంతంత మాత్రంగానే కనిపించింది. 13వ తేదీ సోమవారానికి సంబంధించి రెండు రోజుల ముందు శనివారం రాత్రి 9 గంటలకు టోకెన్లను కేటాయించనున్నట్లు టీటీడీ ప్రకటించింది. అదే రోజుకు సంబంధించి 46 వేల టోకెన్లను అందుబాటులో ఉంచింది. శ్రీనివాసం, విష్ణు నివాసం, అలిపిరి భూదేవి కాంప్లెక్స్‌లో మాత్రమే టోకెన్ల జారీ కేంద్రాలు ఏర్పాటు చేసింది. టోకెన్లు అందుబాటులో ఉన్నప్పటికీ భక్తుల రద్దీ మాత్రం ఆశించిన స్థాయిలో లేదు. శనివారం రాత్రి 9 గంటలకు ప్రారంభమైన టోకెన్ల జారీ ఆదివారం మధ్యాహ్నం సుమారు 15 గంటల పాటు కొనసాగింది. ఇదే సమయంలో క్యూలు జనం లేక బోసిపోయాయి.టోకెన్ ఉంటేనే దర్శనంవైకుంఠ ద్వార దర్శన టోకెన్ ఉంటేనే తిరుమల శ్రీవారి దర్శానానికి అనుమతిస్తామని టీటీడీ స్పష్టం చేయడంతో నడక మార్గం భక్తులుపూర్తిగా తగ్గిపోయారు. అలిపిరి మెట్ల మార్గంలో రెండు చోట్ల టోకెన్ పరిశీలించి భక్తులను అనుమతిస్తున్నారు. తొక్కిసలాటతో భక్తుల రద్దీ గణనీయంగా తగ్గిపోయింది. అయినా అధికారులు మాత్రం తొక్కిసలాట ముందు తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉండడంతో నడక మార్గం భక్తులకు కూడా తగ్గుముఖం పట్టారు. రద్దీ లేకున్నా తప్పనిసరి టోకెన్ అని తేల్చి చెబుతుండడంపై భక్తులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. టోకెన్ లేని భక్తులను కూడా ఎప్పటిలాగే అనుమతించి క్యూ కాంప్లెక్స్ నుంచి దర్శనానికి పంపించాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.పోలీసుల దురుసు ప్రవర్తనశ్రీనివాసం వద్ద శనివారం రాత్రి 13వ తేదీకి సంబంధించిన టోకెన్లను తీసుకునేందుకు భక్తులు వచ్చారు. రద్దీ లేకపోయినప్పటికీ పోలీసులు, టీటీడీ సిబ్బంది దూకుడుగా వ్యవహరించారు. భక్తులతో వాగ్వాదానికి దిగి దురుసుగా ప్రవర్తించారు. దుర్భాషలాడడంతో భక్తులు సైతం ఆగ్రహం వ్యక్తం చేశారు. సుదూర ప్రాంతాల నుంచి శ్రీవారి దర్శనార్థం వస్తే ఇంత అమర్యాదగా వ్యవహరిస్తారా అంటూ ఆవేదన చెందారు. మహిళలు, చిన్నపిల్లలతో సైతం పోలీసులు, టీటీడీ విజిలెన్స్ సిబ్బంది అమానుషంగా ప్రవర్తించడం విమర్శలకు తావిస్తోంది. ఈ ఘటనను వీడియో తీస్తున్న భక్తులపై కూడా పోలీసులు దౌర్జన్యానికి దిగారు. ప్రస్తుతం ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.గోవిందా.. ఇంత చిన్నచూపా?సాక్షి ప్రతినిధి, తిరుపతి: తిరుపతి తొక్కిసలాట ఘటనలో మరణించిన బాధిత కుటుంబాల పట్ల ఇటు ప్రభుత్వం, అటు టీటీడీ వ్యవహరిస్తున్న తీరుపై భక్తులు తీవ్రంగా అసహనం వ్యక్తం చేస్తున్నారు. మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల చొప్పున పరిహారం అందజేస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. అయితే టీటీడీనే చెక్కులు పంపిణీ చేయనున్నట్లు చైర్మన్ బీఆర్ నాయుడు శనివారం రాత్రి వెల్లడించారు. బోర్డు సభ్యులతో కమిటీని నియమించి మృతుల కుటుంబాలను పరామర్శించి చెక్కులు పంపిణీ చేస్తామన్నారు. దీనిపై భక్తులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. మృతుల కుటుంబాలను సీఎం, టీటీడీ చైర్మన్ నేరుగా వెళ్లి పరామర్శించి చెక్కులు ఇచ్చేందుకు మనస్సు రాలేదా? అంటూ ప్రశ్నిస్తున్నారు.14వ తేదీ టోకెన్ల విడుదలవైకుంఠ ద్వార దర్శన టోకెన్లు ఒకరోజు ముందు జారీ చేసేలా టీటీడీ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఆ ప్రకారం 13వ తేదీకి సంబంధించిన టికెట్లను 11వ తేదీ రాత్రి 9 గంటల నుంచి పంపిణీ మొదలుపెట్టారు. 14వ తేదీకి సంబంధించి 12వ తేదీ రాత్రి నుంచి ఇవ్వాల్సి ఉండగా రద్దీ లేకపోవడంతో ఆదివారం మధ్యాహ్నం నుంచే టికెట్లు జారీ చేశారు.తలచుకుంటేనే భయమేస్తుందితిరుపతిలో వైకుంఠ ద్వార దర్శన టోకన్ల జారీ సమయంలో జరిగిన ఘటన తలచుకుంటేనే భయం వేస్తోంది. ఆ రోజు తిరుపతికి టోకెన్ల కోసం వచ్చాం. విషయం తెలిసి భయంతో ఊరికి వెళ్లిపోయాం. రష్ తగ్గింది అని సమాచారం అందగానే ఆదివారం మళ్లీ తిరుపతికి వచ్చి టోకెన్లు తీసుకున్నాం. క్యూలో ఇంకా భద్రత పెంచాల్సి అవసరముంది.– త్యాగరాజన్, భక్తుడు, తిరుత్తణిజాగ్రత్తలు తీసుకోవాలిప్రస్తుతం క్యూలు చాలా ఫ్రీగా ఉన్నాయి. ఇందుకు ప్రధాన కారణం భక్తులు ఇప్పుడు టోకెన్ల కోసం పెద్దగా రావడంలేదు, అందరూ భయపడిపోయారు. టీటీడీ అధికారులు, పోలీసులు ఇలాంటి ఘటనలు జరగకుండా జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంది. దేశవాప్తంగా తొక్కిసలాటపై చర్చించుకుంటున్నారు. శ్రీవారి దర్శనం విషయంలో సామాన్య భక్తులకు పెద్ద పీట వేయాలి. – మహాలక్ష్మి, భక్తురాలు, కోలార్రోదన వర్ణనాతీతంక్యూలో సరైన సదుపాయాలు లేకుండా భద్రతపై దృష్టి సారించకపోవడంతోనే ఇలాంటి ఘటన జరిగింది. ఎంత డబ్బులు ఇచ్చినా పోయిన మనిషిని తెచ్చివ్వలేరు. ఆ బాధను ఆ కుటుంబం జీవితాంతం అనుభవించాల్సిందే. తల్లికి దూరమైన బిడ్డ, భార్యకు దూరమైన భర్త రోదన వర్ణనాతీతం. వారికి కలిగిన నష్టం ఏవరూ తీర్చలేనిది. నాటి ఘటనను చూసినవారు చెబుతుంటేనే ఒళ్లు జలదరిస్తోంది.–ప్రమీలమ్మ, భక్తురాలు, గుంటూరు -
తిరుపతి తొక్కిసలాట ఘటన : ‘దైవ సన్నిధిలో అసువులు బాసడం అదృష్టం’
సాక్షి,విశాఖ : తిరుపతి తొక్కిసలాటలో చనిపోయిన వారిపై జగ్గంపేట టీడీపీ ఎమ్మెల్యే, టీటీడీ బోర్డు మెంబర్ జ్యోతుల నెహ్రూ సంచలన వ్యాఖ్యలు చేశారు. దైవ సన్నిధిలో అసువులు బాసడం ఒక రకంగా అదృష్టమని వ్యాఖ్యానించారు. చనిపోయిన వారిని ఉద్దేశించి మాట్లాడిన జ్యోతిల నెహ్రూ.. టీటీడీ చేతగానితనాన్ని సమర్ధించుకునే ప్రయత్నం చేయడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
చంద్రబాబు బినామీల ముఠా టీటీడీలో ఏం చేస్తోంది?
సాక్షి,తిరుపతి : పరమ పవిత్రమైన తిరుమల శ్రీవారి (ttd) ఆలయానికి అప్రతిష్టను తెచ్చి పెట్టిన సీఎం చంద్రబాబు (chandrababu naidu) తన బినామీలు లక్ష్మణ్ కుమార్, చందు తోటలు ఎవరో నిగ్గు తేల్చాలని టీటీడీ మాజీ చైర్మన్, వైఎస్సార్సీపీ ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షుడు భూమన కరుణాకరరెడ్డి (bhumana karunakar reddy) డిమాండ్ చేశారు.శ్రీవారి ఆలయంపై తన బినామీలకు పెత్తనం కట్టబెట్టి, యావత్ టీటీడీ వ్యవస్థను హైజాక్ చేయాలని సీఎం చంద్రబాబు చేస్తున్న కుట్రపై భూమన కరుణాకరరెడ్డి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘టీడీపీ పాలనలో టీటీడీ ప్రతిష్ఠ భ్రష్టు పట్టిపోయింది. ఆలయ పవిత్రతను దెబ్బతీస్తున్నారు. వీళ్ళ అసమర్ధత కారణంగా తొక్కిసలాట జరిగింది. వీరి అలసత్వం కారణంగా 6 మంది ప్రాణాలు కోల్పోయారు. 60 మందికి పైగా గాయపడ్డారు.ఫైబర్ నెట్ కుంభకోణంలో ప్రధాన నిందితుడు వేమూరి హరికృష్ణ అనుచరులు లక్ష్మణ్ కుమార్, చందులు. అసాంఘిక కార్యకలాపాలు చేస్తున్నారు అనేది ఉద్యోగస్తులే చెప్తున్నారు. ఎవరి లక్ష్మణ్ కుమార్, చందు తోట నిగ్గు తేల్చాలి. ఆర్టీఫిషల్ ఇంటిలిజెన్స్ పేరుతో సాఫ్ట్- వేర్ పేరుతో అనధికార వ్యక్తులు టీటీడీలో తిష్ట వేశారు. వెంకయ్య చౌదరినే ప్రధానంగా నిందితుడు. ఎలాంటి సంబంధం లేని జేఈవో గౌతమిపై వేటు చేశారు. దీనిపై నిజా నిజాలేంటే టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడే నిగ్గు తేల్చాలి.అడిషనల్ ఈవోను బదిలీ చేయాలి. టీటీడీలో బినామీల ముఠా కొండపై ఏమి చేస్తోంది. వేంకటేశ్వర స్వామిని స్వార్ధానికి వాడుకుంటున్నారు. డిప్యూటి సిఎం పవన్ కళ్యాణ్.. ఏ సంబంధం లేకపోయినా ప్రభుత్వం చేసిన నిర్వాకం వల్లే భక్తులు ప్రాణాలు కోల్పోయారని, అందుకు క్షమాపణ చెబుతున్నాను’అని అనడం అభ్యతరకరం. హత్యలు, అత్యాచారాలు చేసి క్షమించాను అంటే కోర్టులు, జడ్జీలు వదిలి వేయరు కదా.ఆరు మంది చనిపోతే తొక్కిసలాటలో చనిపోయినట్లు తక్కువ సెక్షన్లు పెట్టారు. మీరు క్షమాపణలు చెప్పడంలో కుట్ర ఉంది, దోషులను శిక్షించాలి. అధికారులపై చర్యలు, అరెస్టు చేయాలి అని ఉండి ఉంటే బావుండేది. దోషులు పై చట్ట పరంగా జరిగిన సంఘటనకు చర్యలు తీసుకుంటే ప్రజలు హర్షించే వారు’ అని అన్నారు. 👉చదవండి : వెంకటేశ్వర చూస్తున్నావా..? -
వెంకటేశ్వర చూస్తున్నావా..?
తిరుపతి,సాక్షి: తిరుపతి తొక్కిసలాటలో (tirupati stampede) మరణించిన బాధితుల కుటుంబాల పట్ల టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు (br naidu) అత్యంత అమానవీయంగా ప్రవర్తిస్తున్నారు. వారికి అందించే నష్టపరిహారంలో ఒంటెద్దు పోకడను ప్రదర్శిస్తున్నారు. తిరుమల తొక్కిస లాట బాధిత కుటుంబాలకు చంద్రబాబు ప్రభుత్వం టీటీడీ డబ్బులతో నష్టపరిహారం చెల్లిస్తోంది. అయితే ఈ నష్టపరిహారాన్ని చెల్లించేందుకు బీఆర్ నాయుడు ఏ ఒక్క బాధిత కుటుంబానికి వెళ్లలేదు. వారిని పరామర్శించడం లేదు. టీటీడీ సభ్యులు, టీడీపీ నేతల ద్వారా పరిహారం పంపిణీ చేస్తూ చేతులు దులుపుకుంటున్నారు.తిరుపతి మహా విషాదంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. మృతి చెందిన బాధిత కుటుంబాలకు టీటీడీ పాలక మండలి స్వయంగా క్షమాపణ చెప్పాలని వ్యాఖ్యానించారు. అయితే, పవన్ పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలను బీఆర్ నాయుడు లెక్క చేయడం లేదు. విశాఖలో హోంమంత్రి అనిత, టీడీపీ ఎమ్మెల్యేల ద్వారా పరిహారం అందించి మమ అనిపిస్తున్నారు. పైగా, ప్రభుత్వం తరుఫు నుంచి కాకుండా టీటీడీ డబ్బులతోనే మృతుల కుటుంబాలకు చంద్రబాబు ప్రభుత్వం ఈ ఎక్స్ గ్రేషియా చెల్లిస్తోంది. పరిహారం విషయంలో చంద్రబాబు, బీఆర్ నాయుడిపై శ్రీవారి భక్తులు మండిపడుతున్నారు. పోయిన ప్రాణాలు తిరిగొస్తాయా?క్షమాపణలు చెప్పితే పోయిన ప్రాణాలు తిరిగొస్తాయా?.. ఎవరో ఏదో చెప్పారని మేం స్పందించాల్సిన అవసరం లేదంటూ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వ్యాఖ్యలకు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు కౌంటర్ ఇచ్చారు.తొక్కిసలాట ఘటనకు టీటీడీ ఈవో శ్యామలరావు, అదనపు ఈవో వెంకయ్యచౌదరి, టీటీడీ చైర్మన్ బాధ్యత వహించాలని పవన్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.. మృతుల కుటుంబాలకు టీటీడీ బోర్డు, పోలీసులు క్షమాపణ చెప్పాలన్నారు. తొక్కిసలాట జరుగుతుంటే పోలీసులు చోద్యం చూసినట్లు తన దృష్టికి వచ్చిందన్నారు. పోలీసుల వైఫల్యంపైనే ఎక్కువ ఫిర్యాదులు వస్తున్నాయన్నారు. క్రౌడ్ మేనేజ్మెంట్ సరిగా జరగలేదన్నారు.మరోవైపు, టీటీడీ పాలకమండలి, ఈవో మధ్య వార్ కొనసాగుతోంది. అన్నమయ్య భవనంలో టీటీడీ పాలకమండలి అత్యవసర సమావేశం నిర్వహించింది. పాలకమండలి సభ్యులకు కనీస సమాచారం ఇవ్వడం లేదంటూ ఈవోపై సభ్యులు మండినట్లు సమాచారం.👉చదవండి : చింతించడం తప్ప చేసేదేమీ లేదు -
టీటీడీలో చక్రం తిప్పుతున్న బాబు బినామీ
-
తొక్కిసలాట ఎఫెక్ట్: వైకుంఠ ద్వార దర్శనానికి భారీగా తగ్గిన భక్తులు
సాక్షి, తిరుపతి: తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనానికి భక్తులు భారీగా తగ్గారు. దశాబ్ద కాలంలో అత్యల్పంగా వైకుంఠ ద్వార దర్శనాలు జరిగాయి. తిరుపతి తొక్కిసలాట(Tirupati stampede)తో భక్తులు భయబ్రాంతులకు గురవుతున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా భక్తులను టీటీడీ(TTD) భయబ్రాంతులకు గురిచేయడంతో కూటమి ప్రభుత్వంపై భక్తుల్లో అనుమానాలు కలుగుతున్నాయి. 70 వేలు టోకెన్లు విడుదల చేయగా కేవలం 53 వేల మంది భక్తులే దర్శనాలు చేసుకున్నారు. టీటీడీ వైఫల్యంతో భక్తులకు వైకుంఠ ద్వార దర్శనాలు దక్కలేదు. పోలీసులు దురుసు ప్రవర్తనశ్రీనివాసం గెస్ట్‌హౌస్ వద్ద పోలీసులు దురుసుగా ప్రవర్తించారు. దర్శనానికి వచ్చే భక్తులపై పోలీసులు చేయి చేసుకున్నారు. భక్తుల పట్ల సంయమనం పాటించాలని చెప్పున్నా పోలీసులు వినడం లేదు. దర్శనం టికెట్లకు క్యూలైన్లోకి వెళ్లేవారిని అడ్డగించడంపై భక్తుడు నిలదీశాడు.శనివారం రాత్రి నుంచి రెండో విడత టోకెన్ల జారీ ప్రారంభమైంది. భయంభయంగానే.. మొదటి విడత వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల పంపిణీ సందర్భంగా జరిగిన తొక్కిసలాట ఘటన భక్తులను కలవరపాటుకు గురిచేస్తోంది. శనివారం నుంచి రెండో విడత టోకెన్ల జారీ చేస్తుండడంతో పలువురు క్యూలైన్లోకి వెళ్దామా? వద్దా? అనే సందిగ్ధంలో పడ్డారు. తిరుపతి నగరంలో శ్రీనివాసం, విష్ణునివాసం, భూదేవి కాంప్లెక్స్‌లో టోకెన్లు పంపిణీ చేస్తున్నారు. ఈ సందర్భంగా భక్తులు నాటి చేదు ఘటన గురించే చర్చించుకుంటున్నారు. తొక్కిసలాట ఘటన విషయంలో ప్రభు త్వం, టీటీడీ తీసుకున్న చర్యలపైనా విమర్శలు గుప్పిస్తున్నారు.ఇదీ చదవండి: ఏడు చేపల కథ! -
బాబు బినామీ ముఠా గుప్పిట్లో శ్రీవారి ఆలయం..!
సాక్షి, అమరావతి: తిరుమల చరిత్రలో తొలిసారిగా తొక్కిసలాట జరగటం, ఆరుగురి ప్రాణాలను హరించడం వెనుక అసలు కుట్ర బట్టబయలైంది. శ్రీవారి ఆలయం పవిత్రత, సంప్రదాయాలకు భంగం కలిగిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు ఏకంగా ఆ వ్యవస్థనంతటినీ తన బినామీలైన ప్రైవేటు ముఠా ఆధిపత్యంలోకి తేవడం, వారి నిర్వాకంతోనే ఈ ఘటన జరిగిందన్న విషయం వెలుగులోకి వచ్చింది. పైగా, ఆ నిందను వైఎస్సార్సీపీపై వేసేందుకూ టీడీపీ నేతలు వెనుకాడలేదు. ఇప్పుడు అసలు కుట్ర చంద్రబాబుదేనన్న విషయం బట్టబయలైంది. ఇంతకు ముందు శ్రీవారి ప్రసాదంలో కల్తీ నెయ్యి అంటూ లేని అపోహలు సృష్టించిన చంద్రబాబు.. ఇప్పుడు ఏకంగా ఆలయంలోకి ప్రైవేటు వ్యక్తులను ప్రవేశపెట్టి తన గుప్పిట్లోకి తీసుకొనేందుకు సాగించిన గూడుపుఠాణి బట్టబయలైంది.ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) పరిజ్ఞానాన్ని అందించే ముసుగులో చంద్రబాబు తన బినామీ ముఠాను టీటీడీలో అనధికారికంగా చేర్చారు. తిరుమలలో క్యూలైన్ల నిర్వహణ, దర్శనాలు, ప్రసాదం పంపిణీ.. ఇలా సమస్తం ఆ ముఠాకే కట్టబెట్టాలన్న దురాలోచనకు తెగించారు. అందుకోసం ప్రయోగాత్మకంగా వైకుంఠ ఏకాదశి దర్శనం టికెట్ల జారీని ఆ ముఠాయే పర్యవేక్షించడం, సరైన ప్రణాళిక లేక తొక్కిసలాటకు దారి తీసి ఆరుగురు భక్తుల దుర్మరణానికి కారణమైందన్న అసలు నిజం వెలుగులోకి వచ్చింది. తిరుమల ఆలయాన్ని గుప్పిట పట్టేందుకు చంద్రబాబు బినామీ ముఠా చేస్తున్న కుతంత్రాన్ని కొన్ని నెలలుగా పరిశీలిస్తున్న టీటీడీ వర్గాలు అసలు విషయాన్ని ‘సాక్షి’కి సాధికారికంగా వెల్లడించాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న శ్రీవారి అశేష భక్తకోటిని తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్న చంద్రబాబు కుట్ర ఇదిగో ఇలా ఉంది..టీటీడీలో బాబు బినామీలు పాగా..పవిత్రమైన తిరుమల శ్రీవారి ఆలయంపై తన బినామీలకు పెత్తనం కట్టబెట్టి, యావత్ టీటీడీ వ్యవస్థను హైజాక్ చేయాలని చంద్రబాబు కుట్ర పన్నారు. అందుకోసం ఏఐ పరిజ్ఞానాన్ని టీటీడీకి అందిస్తారంటూ ప్రైవేటు వ్యక్తులను టీటీడీలోకి ప్రవేశపెట్టారు. 2014–19 మధ్య టీడీపీ ప్రభుత్వ హయాంలో ఫైబర్‌నెట్ కుంభకోణంలో ప్రధాన నిందితుడిగా ఉన్న వేమూరి హరికృష్ణ నేతృత్వంలోనే ఈ కుతంత్రానికి తెరతీశారు. చంద్రబాబు ఏరికోరి నియమించిన తిరుమల అదనపు ఈవో వెంకయ్య చౌదరి అందుకు పూర్తి సహకారం అందిస్తున్నారు. వీరి సహకారంతో చంద్రబాబు కుమారుడు, మంత్రి నారా లోకేశ్‌కు సన్నిహితులైన లక్ష్మణ్ కుమార్, చందు తోట అనే ఇద్దరు సాఫ్ట్వేర్ నిపుణులు గుట్టుచప్పుడు కాకుండా టీటీడీలోకి ప్రవేశించారు.వాస్తవానికి టీటీడీలో ఏదైనా పోస్టు ఇవ్వాలన్నా, కన్సల్టెంట్‌గా నియమించాలన్నా అధికారికంగా ఉత్తర్వులు ఇవ్వాలి. టీటీడీ పాలకమండలి తీర్మానం చేయాలి. కానీ ఎలాంటి అధికారిక ఉత్తర్వులు, టీటీడీ పాలకమండలి తీర్మానం లేకుండానే లక్ష్మణ్ కుమార్, చందు తోట టీటీడీలోకి దర్జాగా ప్రవేశించారు. ఓ కేంద్ర మంత్రి వద్ద గతంలో పీఎస్‌గా పని చేశానని చెప్పుకునే లక్ష్మణ్ కుమార్ ఏకంగా టీటీడీ అధికారిక సమావేశాల్లో పాల్గొంటున్నారు. అదనపు ఈవో వెంకయ్య చౌదరి పక్కనే ఆయనకు కుర్చీ వేసి మరీ ప్రొటోకాల్ మర్యాదలు అందిస్తున్నారు.ఆయనకు ప్రత్యేక ఛాంబర్, వాహనం, ఇతర సౌకర్యాలను కల్పించడం గమనార్హం. అంటే టీటీడీలోకి అనధికారికంగా, అక్రమంగా ప్రవేశించిన ప్రైవేటు వ్యక్తులకు రాచమర్యాదలు కూడా కల్పిస్తున్నారు. అదీ భక్తులు తిరుమల ఆలయంలో సమర్పించిన కానుకల నిధుల నుంచీ..ఆలయాన్ని గుప్పిటపట్టే కుట్ర..ఏఐ పరిజ్ఞానాన్ని టీటీడీ వ్యవస్థలో ప్రవేశపెట్టడానికి లక్ష్మణ్ కుమార్, చందు తోట సహకరిస్తున్నారని టీటీడీ వర్గాలే చెబుతున్నాయి. ఆ మేరకు అధికారిక నోటిఫికేషన్ ఏమీ జారీ చేయలేదు. ఎందుకంటే.. ఏఐ పరిజ్ఞానం పేరుతో తిరుమల–తిరుపతిలో అన్ని వ్యవస్థలనూ బినామీలకు కట్టబెట్టాలన్నది చంద్రబాబు అసలు కుట్ర. తిరుమలలో గదుల కేటాయింపు, శ్రీవారి ఆలయం క్యూలైన్ల నిర్వహణ, టికెట్ల జారీ, దర్శనాలు, ప్రసాదం పంపిణీ.. ఇలా అన్నింటినీ ఆ ముఠా ఆధిపత్యంలోకి తేవడమే అసలు వ్యూహం. వేలాదిమంది టీటీడీ ఉద్యోగులతో పటిష్టంగా ఉన్న వ్యవస్థను క్రమంగా నీరుగార్చి.. తన బినామీ ముఠాకే తిరుమల శ్రీవారి ఆలయంతోపాటు టీటీడీపై గుత్తాధిపత్యం కట్టబెట్టాలన్నది అంతిమలక్ష్యం. అంటే తిరుమలలో గదులు, దర్శనం, ప్రసాదాలు ఇలా ఏదైనా ఈ ముఠా ద్వారానే జరగాలి.వైకుంఠ ఏకాదశి టికెట్లపై ప్రయోగంతిరుమల శ్రీవారి ఆలయంలో క్యూలైన్ల నిర్వహణ, టికెట్ల జారీ వ్యవస్థను గుప్పిట పట్టేందుకు రూపొందించిన విధానాన్ని వైకుంఠ ఏకాదశి టికెట్ల జారీలో ప్రయోగాత్మకంగా పరీక్షించాలని ఆ ముఠా భావించింది. వేమూరి హరికృష్ణ, లక్ష్మణ్ కుమార్, చందు తోట కొన్ని రోజులుగా తిరుమల–తిరుపతిలోనే తిష్ట వేసి అదే పనిలో ఉన్నారు. పైలట్ ప్రాజెక్టును తిరుమలలో నిర్వహించే అవకాశం లేదు. అందుకే ముందుగా తిరుపతిలో పరీక్షించాలని భావించారు. అందుకే ఈసారి వైకుంఠ ఏకాదశి టికెట్ల జారీ ప్రక్రియను ఉద్దేశçపూర్వకంగా తిరుపతిలో 8 కేంద్రాల్లో ఏర్పాటు చేశారు. కానీ, చంద్రబాబు బినామీ ముఠా రూపొందించిన విధానం పూర్తిగా బెడిసికొట్టింది. వారు చెప్పినట్టుగా టీటీడీ అధికార యంత్రాంగం చేయడంవల్లే టికెట్ల జారీ అస్తవ్యస్తంగా తయారైంది. భక్తులు గంటల తరబడి రోడ్లపై నిరీక్షించి తీవ్ర ఇబ్బందులు పడాల్సివచ్చింది. చివరికి తొక్కిసలాటకు దారి తీసి ఆరుగురు భక్తులను బలి తీసుకుంది.పరారైన బాబు ముఠాతమ ప్రయోగం వికటించి, ఆరుగురు మరణించారని తెలియగానే చంద్రబాబు బినామీ ముఠా బిచాణా ఎత్తేసింది. వేమూరి హరికృష్ణ, లక్ష్మణ్ కుమార్, చందు తోట తిరుమల నుంచి గుట్టుచప్పుడు కాకుండా జారుకున్నారు. ఈ వ్యవహారమంతా బయటకు రాకూడదని తిరుపతిలో చంద్రబాబు పెద్ద డ్రామా నడిపించారు. ఆయన తిరుపతిలో అధికారులపై చిందులు తొక్కినట్టుగా డ్రామా నడిపి, నేరుగా బాధ్యతలేని అధికారులపై చర్యలు తీసుకుని అసలు విషయాన్ని కప్పిపుచ్చేందుకు యత్నించారు. కాగా, తిరుమలలో కొన్ని నెలలుగా చంద్రబాబు బినామీ ముఠా బాగోతంపై టీటీడీ వర్గాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. పవిత్రమైన తిరుమల ఆలయం ప్రాశస్త్యాన్ని దెబ్బతీసేందుకు, సనాతన సంప్రదాయాలను కాలరాసేందుకు, భారీ ఆర్థిక దోపిడీకి చంద్రబాబు బినామీ ముఠా పన్నాగం పన్నిందని ధ్వజమెత్తుతున్నాయి. -
ఏడు చేపల కథ!
‘‘చేపా చేపా ఎందుకు ఎండలేదు? గడ్డిమోపు అడ్డమొచ్చింది. మోపూ మోపూ ఎందుకు అడ్డమొచ్చావ్? ఆవు మేయలేదు’’. ఈ చేప సాకుల కథ తెలుగు వారందరికీ సుపరిచితమే. ఏడు మాసాల కింద ఏపీలో ఏర్పడిన కిచిడీ సర్కార్ పరిపాలనకూ, ఈ సాకుల కథకూ కొంత సాపత్యం కుదురుతుంది. ఒకపక్క జనానికి షాకుల మీద షాకులిస్తూనే మరోపక్క తన వైఫల్యాలకు సాకుల మీద సాకులు వెతుకుతున్న తీరు న భూతో న భవిష్యతి! పరిపాలన చేతగానితనం కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నది.శాంతి భద్రతల గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మేలు. రూల్ ఆఫ్ లా స్థానాన్ని రూళ్లకర్ర పెత్తనం ఆక్రమించింది. విద్యారంగం గుండెల మీద విధ్వంసపు గునపాలు దిగు తున్నాయి. ప్రజా వైద్యరంగాన్ని ప్రైవేట్ బేహారుల జేబులో పెట్టబోతున్నారు. సాగునీటి గేట్ల తాళాలు కంట్రాక్టర్ల చేతుల్లో పెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆర్థిక వ్యవస్థ అప్పులు చింపిన విస్తరిలా తయారైంది. ఇదీ కిచిడీ సర్కార్ ఏడు మాసాల సప్తపది.ప్రభుత్వ వైఫల్యాలు బట్టబయలైన ప్రతి సందర్భంలో దాన్నుంచి జనం దృష్టిని మళ్లించడం కోసం గోబెల్స్ ప్రచారాలను చేపట్టడం నిత్యకృత్యంగా మారిపోయింది. అవినీతికీ, అసమర్థతకూ ఏపీ కిచిడీ సర్కార్‌ను కేరాఫ్ అడ్రస్ అనుకోవచ్చు. కొద్దిపాటి సమీక్షా ప్రణాళికలతో నివారించగలిగిన విజయవాడ వరద ముంపును ముందుచూపు లేక పెను ప్రమాదంగా మార్చారు. సాకును మాత్రం పాత ప్రభుత్వం మీదకు నెట్టేందుకు శతవిధాల ప్రయత్నించారు. తిరుపతిలో జరిగిన తాజా విషాదంలోనూ అధినేతది అదే ధోరణి. కనీస ముందస్తు సమీక్షలు చేయకపోవడం, ఏర్పాట్లు లేకపోవడం, వ్యూహ రాహిత్యం, సమన్వయ లోపం, పోలీసు యంత్రాంగం మొత్తం ముఖ్యమంత్రి సేవలోనే తరించడం... ఈ దుర్ఘటనకు ప్రధాన కారణాలు.తమది రియల్‌టైమ్ గవర్నెన్సనీ, ఎక్కడేమి జరుగుతున్నదో ఎప్పటికప్పుడు తన కంప్యూటర్ దుర్భిణి ద్వారా తెలిసిపోతుందనీ చంద్రబాబు చెప్పుకుంటారు. లక్షలాదిమంది తరలివచ్చే వైకుంఠ ద్వార దర్శన కార్యక్రమానికి ఏర్పాట్లు సరిగ్గా జరగ లేదని ఎందుకు కనిపెట్టలేకపోయారో మరి! తీరా దుర్ఘటన జరిగిన తర్వాత సాకు వెతుక్కోవడానికి ఆయనకు జగన్ సర్కారే కనిపించింది. కాంగ్రెస్ పార్టీకి దేశంలో ఎదురులేని రోజుల్లో ఎక్కడ ఏ దుర్ఘటన జరిగినా, ప్రభుత్వ వైఫల్యం బయటపడ్డా వెంటనే ‘విదేశీ హస్తం’ మీదకు నెట్టేసేవారు. ఇప్పుడు చంద్ర బాబుకు జగన్ సర్కార్‌లో ఆ విదేశీ హస్తం కనిపిస్తున్నది.వైకుంఠ ద్వార దర్శనం టిక్కెట్లను తిరుమలకు బదులుగా తిరుపతిలోనే అందజేసే కార్యక్రమాన్ని వైసీపీ సర్కార్ ప్రారంభించిందనీ, అందువల్లనే తొక్కిసలాట జరిగిందనేది ఆయన ఉవాచ. తిరుపతిలోనే టిక్కెట్లివ్వడమనేది పనికిమాలిన కార్య క్రమం అయితే, దివ్యదృష్టీ – దూరదృష్టీ... రెండూ కలిగిన చంద్రబాబు సర్కార్ ఎందుకు దాన్ని రద్దు చేయలేదనేది సహ జంగా ఉద్భవించే ప్రశ్న. రద్దు చేయకపోగా, గతంలో ఎన్నడూ లేనివిధంగా అస్మదీయ పత్రికల్లో భారీ ప్రకటనలు గుప్పించి భక్తకోటిని ఎందుకు ఆహ్వానించినట్టు? పైగా మూడు రోజుల టిక్కెట్లు ఒకేసారి ఇస్తామని ఏపీతోపాటు పొరుగు రాష్ట్రాల్లో కూడా ఎందుకు దండోరా వేయించినట్టు?వైసీపీ ప్రభుత్వం ఉన్న రోజుల్లోనే తిరుమలలోని ఒక కేంద్రంతోపాటు తిరుపతిలో తొమ్మిది సెంటర్లు ఏర్పాటు చేసి, వైకుంఠ ద్వార దర్శనం టిక్కెట్లు అందజేసిన మాట వాస్తవం. కానీ అప్పుడెటువంటి తొక్కిసలాటలూ, దుర్ఘటనలూ జరగ లేదు. సాఫీగా జరిగిపోయింది. ఎందుకని? వైకుంఠ ద్వార దర్శనం సదవకాశాన్ని స్థానిక ప్రజలను దృష్టిలో ఉంచుకొని పది రోజులపాటు ఏర్పాటు చేశారు. తిరుపతికి వెలుపల ఎక్కడా ఎటువంటి ప్రకటనలూ ఇవ్వలేదు. స్థానికులు తీసుకోగా మిగిలితేనే ఇతర ప్రాంత ప్రజలు అడిగితే ఇచ్చే ఏర్పాట్లను చేశారు. ఇతర ప్రాంతాల వారికి ఆన్లైన్లో బుక్ చేసుకుని వచ్చే సౌకర్యం ఉండేది.ఈసారి రాష్ట్రంతో పాటు వెలుపల కూడా ‘రండహో’ అంటూ దండోరా వేయించిన పెద్దమనుషులు... చేయాల్సిన ఏర్పాట్లను మాత్రం గాలికొదిలేశారు. ఎనిమిది కేంద్రాల్లోనూ ఇదే పరిస్థితి. ఎనిమిదో తేదీ మధ్యాహ్నానికే లక్షల సంఖ్యలో భక్తులు కౌంటర్ల దగ్గరకు చేరుకున్నారు. వాళ్లకు ఏ రకమైన వసతులూ కల్పించలేదు. మంచినీళ్లిచ్చే దిక్కు కూడా లేదు. ఎని మిది కేంద్రాలకు గాను బైరాగిపట్టెడ, శ్రీనివాసం, రామచంద్ర పుష్కరిణి, విష్ణు నివాసం అనే నాలుగు కేంద్రాల దగ్గర భక్తుల సంఖ్య పెరిగిపోయి తొక్కిసలాట జరిగింది. బైరాగిపట్టెడ పరిస్థితి మరీ ఘోరం.అంతకంతకూ భక్తుల సంఖ్య పెరగడంతో కౌంటర్‌కు ఎదురుగా ఉన్న పార్కులోకి వారిని మళ్లించి తాళాలు వేశారు. అన్నపానీయాలు లేకుండా, కనీస వసతులు లేకుండా దాదాపు పది గంటలు ఉగ్గబట్టుకొని ఉండాల్సి వచ్చింది. మహిళలూ,వృద్ధుల పరిస్థితి వర్ణనాతీతం. శత్రు దేశాల ప్రజల్ని, సైనికుల్ని నిర్బంధించడానికి నాజీలు ఏర్పాటుచేసిన కాన్సంట్రేషన్ క్యాంపులకు ఈ పార్కు జైలు భిన్నమైనదేమీ కాదు. ఇన్ని లక్షల మందిని నిర్బంధ శిబిరాల్లో కుక్కి మానవ హక్కులను హరించి నందుకు టీటీడీ అధికారులే కాదు ప్రభుత్వ పెద్దలు కూడా శిక్షార్హులే!ప్రజలను గంటల తరబడి నిర్బంధంగా అన్న పానీయాలకూ, కనీస అవసరాలకూ దూరం చేయడం మానవ హక్కుల ఉల్లంఘన కిందకే వస్తుంది. ఇటువంటి నిర్బంధ శిబిరాల గేట్లను హఠాత్తుగా తెరిచినప్పుడు తొక్కిసలాటలు జరుగుతాయని, ప్రమాదాలు జరుగుతాయని ఊహించడానికి ‘డీప్ టెక్’ పరి జ్ఞానం అవసరం లేదు కదా! కామన్సెన్స్ చాలు. ప్రజల ప్రాణా లకు ముప్పు వాటిల్లే అవకాశం ఉందని తెలిసి కూడా ఎటువంటి ప్రకటనలూ చేయకుండా, అప్రమత్తం చేయకుండా అకస్మాత్తు చర్య ద్వారా తొక్కిసలాటకు దారితీయడం కూడా మానవ హక్కుల ఉల్లంఘనే!ఈ నేరానికి పెద్ద తలలే బాధ్యత వహించవలసి ఉంటుంది. మొక్కుబడిగా ఎవరో ఇద్దర్ని సస్పెండ్ చేసి, మరో ముగ్గుర్ని బదిలీ చేసి చేతులు దులిపేసుకుంటే సరిపోతుందా? అందు లోనూ వివక్ష. ఘటనకు సంబంధించి ప్రత్యక్షంగా బాధ్యత లేని వారిపై చర్యలు తీసుకొని, కీలక బాధ్యుల్ని వదిలేశారన్న విమ ర్శలు వెంటనే వెలువడ్డాయి. కీలక బాధ్యులు ప్రభుత్వ పెద్దలకు బాగా కావలసినవారు. వెంటనే తరుణోపాయాన్ని ఆలోచించిన చంద్రబాబు బంతిని పవన్ కల్యాణ్ కోర్టులోకి నెట్టారు. అధినేత మనసెరిగిన పవన్ ఓ గంభీరమైన సూచన చేశారు.జరిగిన ఘటన విషాదకరమైనదనీ, తనకు బాధ్యత లేకపోయినా క్షమాపణలు చెబుతున్నాననీ, అలాగే టీటీడీ చైర్మన్, ఈవో, తిరుమల జేఈవోలు కూడా క్షమాపణలు చెప్పాలనీ సూచించారు. అంటే ఇంత తీవ్రమైన నేరానికి క్షమాపణలు చెబితే సరిపోతుందన్న సూచన. బారా ఖూన్ మాఫ్! వారిపైన ఎటువంటి చర్యలూ లేకుండా క్షమాపణలతో సరిపెడతారన్నమాట! వారి శిరస్సుల మీద పవన్ కల్యాణ్ చేత మంత్ర జలం చల్లించి పాప ప్రక్షాళనం చేయించారనుకోవాలి. ఈ ఘటనతో ఏ సంబంధం లేని, కేవలం అడ్మినిస్ట్రేషన్ పనులకు మాత్రమే పరిమితమయ్యే తిరుపతి జేఈవో ఎందుకు బదిలీ అయ్యారో, ప్రధాన బాధ్యత తీసుకోవలసిన తిరుమల జేఈవో, ఈవో, టీటీడీ ఛైర్మన్లకు పాప విమో చనం ఎందుకు లభించిందో ఆ దేవదేవుడికే తెలియాలి.పాప విమోచనం దొరికిన ముగ్గురిలో కూడా ఇద్దరు మాత్రమే ప్రభుత్వాధినేతకు కావలసిన వారట! ఈవో శ్యామల రావుపై మాత్రం కత్తి వేలాడుతున్నదనీ, త్వరలోనే ఆయనను తప్పించడం ఖాయమనీ సమాచారం. ఇప్పుడే చర్య తీసుకుంటే తమకు కావలసిన వారిపై కూడా తీసుకోవలసి ఉంటుంది. కనుక కొంతకాలం తర్వాత ఆయనకు స్థానచలనం తప్పదంటున్నారు. తిరుపతి లడ్డూలో వాడే నెయ్యిలో కల్తీ జరిగిందనీ, దీనికి జగన్ సర్కారే బాధ్యత వహించాలనీ ఆమధ్య చంద్ర బాబు ఒక ప్రహసనాన్ని నడిపిన సంగతి తెలిసిందే. ఆ నాట కాన్ని రక్తి కట్టించడంలో ఈవో శ్యామలరావు విఫలమయ్యారనీ, ఫలితంగానే నాటకం రసాభాసగా మారిందనే అభిప్రాయం అధినేతకు ఉన్నదట!గత సెప్టెంబర్ మాసంలో విజయవాడ వరదల సందర్భంగా ప్రభుత్వ యంత్రాంగం దారుణ వైఫల్యం దరిమిలా ప్రజల దృష్టిని మళ్లించేందుకు తిరుపతి లడ్డుకు ఉపయోగించే నెయ్యిలో కల్తీ జరిగిందనీ, ఇందుకు జగన్ పాలనలోనే బీజం పడిందనే ప్రచారాన్ని కిచిడీ సర్కార్‌తోపాటు యెల్లో మీడియా కూడా పెద్ద ఎత్తున చేపట్టిన సంగతి తెలిసిందే. చివరకు అదంతా బోగస్ ప్రచారంగా తేలడానికి రెండు మాసాలు కూడా పట్టలేదు. జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో తిరు మల దేవస్థానం ప్రతిష్ఠ జాతీయంగా, అంతర్జాతీయంగా కూడా ఇనుమడించింది. టీటీడీ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా వందలాది దేవాలయాల నిర్మాణం జరిగింది. స్వల్పకాలంలో ఇన్ని ఆలయాల నిర్మాణాన్ని ఇంకెవరి హయాంలోనూ టీటీడీ చేపట్టలేదు. హిందువులకు పవిత్రమైన గోమాత సంరక్షణ కోసం వందల సంఖ్యలో గోశాలల నిర్మాణం కూడా జరిగింది. శ్రీ వేంకటేశ్వరస్వామి వారి కల్యాణోత్సవాలు దేశదేశాల్లో వైభవంగా జరిగాయి. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా పెద్ద జాబితానే ఉన్నది.తిరుమలను అపవిత్రం చేస్తున్నారనే ప్రచారాన్ని ఈ కిచిడీ గ్యాంగ్ ఆ రోజుల్లోనే ప్రారంభించింది. కానీ, ఎవరూ దాన్ని విశ్వసించలేదు. వారు అధికారంలోకి వచ్చిన తర్వాత లడ్డూ కల్తీ పేరుతో మరోసారి బురద చల్లాలని ప్రయత్నించి భంగ పడ్డారు. ఇప్పుడు తమ బాధ్యతా రాహిత్యానికి ఆరుగురు భక్తులు బలైతే... దాన్ని వైసీపీ ప్రభుత్వానికి చుట్టేందుకు చంద్రబాబు ప్రయత్నించడం, ప్రజల విజ్ఞతపై ఆయనకున్న చిన్న చూపుకు నిదర్శనం. అధికారంలోకి వచ్చిన ఏడు మాసాల్లో ఆయన ప్రభుత్వం ఎన్నికల హామీలను అమలు చేయలేదు. పైగా అన్ని రంగాల్లో వైఫల్యం! వాటినుంచి దృష్టి మళ్లించేందుకు నెలకోసారైనా ఒక పెద్ద డైవర్షన్ స్కీమ్‌ను రంగంలోకి దించుతున్నారు. ఇప్పటివరకు ఏడు మాసాల్లో ఎండబెట్టిన ఏడు డైవర్షన్ చేపల్లో ఒక్కటీ ఎండలేదు. చీమ కుట్టడంతోనే చేపల కథ ముగుస్తుంది. ఈ డైవర్షన్ చేపల కథ ముగింపు కూడా అలాగే ఉండనుంది.వర్ధెల్లి మురళిvardhelli1959@gmail.com -
Magazine Story: కలియుగ దైవానికి కళంకం తెచ్చిన కలి పుత్రులు
-
బయటకు వచ్చేద్దామనుకున్నాం.. అంతలోనే దుర్ఘటన
మద్దిలపాలెం: ‘అప్పటి వరకు ఇద్దరం కలిసి క్యూలో జాగ్రత్తగా ఉన్నాం. రద్దీగా ఉండటంతో లైనులో నుంచి బయటకు వెళ్లిపోదాం అనుకున్నాం. అదే సమయంలో రద్దీ అధికమవడంతో గేట్లు తెరిచారని చెప్పారు. ఒక్కసారిగా భక్తులు ముందుకు కదలడంతో తొక్కిసలాట జరిగింది. క్షణాల్లో నా భార్య రజనీ ప్రాణాలు కోల్పోయింది..’ అని గుడ్ల లక్ష్మారెడ్డి విలపించారు. తిరుపతిలో జరిగిన తొక్కిసలాటలో విశాఖపట్నంలోని మద్దిలపాలేనికి చెందిన గుడ్ల లక్ష్మారెడ్డి భార్య రజనీ మరణించిన విషయం తెలిసిందే. మద్దిలపాలెంలోని వారి ఇంటి వద్ద రజనీ మృతదేహానికి శుక్రవారం పలువురు నివాళి అర్పించారు. ఈ సందర్భంగా లక్ష్మారెడ్డి తిరుపతి క్యూలైనులో జరిగిన ఘోరం గురించి వివరిస్తూ కన్నీరుమున్నీరుగా విలపించారు. ‘క్యూలో ఉన్న ప్రతి ఒక్కరు 10వ తేదీన దర్శనం టికెట్ల కోసమే ఆరాటపడ్డారు. ఆ ఆరాటమే తొక్కిసలాటకు కారణమై భక్తుల ప్రాణాల మీదకు తీసుకొచి్చంది. మేం ఇద్దరం కలిసి జాగ్రత్తగా లైనులో వెళుతున్న సమయంలో ఒక్కసారిగా తోపులాట జరగడంతో విడిపోయాం. ఇంతలో రజనీ కోసం చూసే సరికి కనిపించలేదు. ఆ క్షణంలో అక్కడ ఏం జరుగుతుందో అర్థంకాలేదు. తేరుకుని చూసేసరికి రజనీ కనిపించకుండాపోయింది. తొక్కిసలాటలో తప్పిపోయిన రజనీ కోసం తీవ్రంగా వెతికా. ఎక్కడా జాడలేదు. నా ఫోన్ కూడా రజనీ బ్యాగులో ఉండిపోయింది. దీంతో అక్కడే ఉన్న ఆటో డ్రైవర్ ఫోన్ నుంచి కాల్ చేస్తున్నా పనిచేయలేదు. ఏం జరిగిందో తెలియదు... రెండు గంటల తర్వాత రజనీని ఆస్పత్రిలో చేరి్పంచారని సమాచారం అందింది. ఆ ఆస్పత్రి ఎక్కడుందో తెలియదు. చివరకు ఆటోలో అక్కడి చేరుకున్నా. వెళ్లి చూసే సరికి నా భార్య విగతజీవిగా పడి ఉంది. రజనీ ఒంటిపై ఒక్క గాయం కూడా లేదు. తొక్కిసలాటలో ఊపిరాడక చనిపోయిందనుకుంటున్నా...’ అని ఆవేదన వ్యక్తంచేశారు. అమ్మా... వద్దన్నా వినలేదు... ‘అమ్మా ఇప్పుడు వద్దు.. మరోసారి వెళ్లొద్దాం..’ అని కొడుకు హర్షవర్థన్ ఫోన్లో చెప్పినా రజనీ వినలేదని లక్ష్మారెడ్డి చెప్పారు. ‘చుట్టుపక్కలవారికి సుమారు పదిసార్లు వైకుంఠ ఏకాదశి దర్శనానికి వెళ్లిన అనుభవం ఉండడంతో వారితో కలిసి మేం తొలిసారి వెళ్లాం. పది మంది గ్రూపుగా వెళ్లగా, ఆదిలక్ష్మి అనే మహిళకు తొక్కిసలాటలో గాయాలయ్యాయి. ఆమె ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది..’ అని ఆయన తెలిపారు. అమెరికా నుంచి వచ్చి.. అమ్మ వద్ద సొమ్మసిల్లి..అమెరికా నుంచి హుటాహుటిన వచి్చన రజనీ కుమారుడు హర్షవర్థన్ రెడ్డి... తల్లి భౌతికకాయాన్ని చూసి సొమ్మసిల్లిపోయాడు. బంధువులు సపర్యలు చేయడంతో కొద్దిసేపటి తర్వాత తేరున్నాడు. తల్లి మృతదేహం వద్ద విలపిస్తూ హర్షవర్ధన్ కూర్చున్న తీరు అందరినీ కలచివేసింది. కాగా, ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు, కాంగ్రెస్ నాయకులు దండి ప్రియాంక తదితరులు రజనీ మృతదేహం వద్ద నివాళులర్పించారు. రజనీ తమ్ముడు అమెరికా నుంచి శనివారం విశాఖ వస్తారని, అతను రాగానే అంత్యక్రియలు నిర్వహిస్తామని లక్ష్మారెడ్డి తెలిపారు. ఊహించుకుంటేనే భయమేస్తోంది» మాకు పీడకలను మిగిల్చింది »మా ప్రాణాలను మేమే కాపాడుకోవాల్సి వచ్చిoది » తొక్కిసలాటలో క్షతగాత్రుల మనోగతంతిరుపతిలో వైకుంఠ ఏకాదశి టోకెన్ల కోసం వేచి ఉండగా జరిగిన తొక్కిసలాటను ఊహించుకుంటేనే భయమేస్తోందని క్షతగాత్రులు తెలిపారు. వైకుంఠ ద్వారా దర్శన టోకెన్ల జారీ కేంద్రం వద్ద చోటుచేసుకున్న తొక్కిసలాటలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్న క్షతగాత్రులు మాట్లాడుతూ.. తొక్కిసలాట సందర్భంగా భక్తుల అరుపులు, కేకలు, ఆర్తనాదాలు ఇప్పటికీ చెవుల్లో మారుమోగుతున్నాయని చెప్పారు. అక్కడ తొక్కిసలాటకు గల కారణం, సహాయక చర్యలు, ఆస్పత్రిలో అందుతున్న వైద్య సేవలపై వారు ఏమన్నారంటే.. – తిరుపతి తుడా/తిరుపతి కల్చరల్తొక్కిసలాటకు ఆ తాడే కారణంవైకుంఠ ద్వారదర్శనం కోసం మా ఊరి నుంచి 450మంది ఇంటిల్లిపాది బుధవారం తిరుపతిలోని బైరాగిపట్టెడ ప్రాంతంలోని కౌంటర్ వద్దకు చేరుకున్నాం. క్యూలైన్లలోనికి భక్తులను వదలకుండా పద్మావతి పార్క్‌లోకి పంపించేశారు. భక్తులతో పార్క్ నిండిపోయింది. రాత్రి 8గంటల సమయంలో టోకెన్లను జారీ చేస్తున్నట్లు హఠాత్తుగా ప్రకటించారు. పార్క్ గేట్లను ఒక్కసారిగా తీయడంతో వేలాది మంది పరుగులు పెడుతూ గేటు వద్దకు దూసుకొచ్చారు. అయితే గేటుకు రెండువైపులా రెండడుగుల ఎత్తులో కట్టి ఉన్న తాడును తొలగించకుండానే గేటును తెరిచారు. దీంతో ముందు వరుసలో ఉన్న మహిళలు తాడుకు తగులుకుని బోర్లా పడిపోయారు. వెనుక నుంచి వచ్చిన వందలాది మంది భక్తులు ఒకరిపై ఒకరు పడిపోవడంతో అంతమంది ప్రాణాలు కోల్పోయారు. తాడు లేకుంటే ఈ ప్రమాదం జరిగి ఉండేదే కాదు. – వెంకటేశ్, క్షతగాత్రుడు, రామసముద్రం, అన్నమయ్య జిల్లా మా వాళ్లను మేమే కాపాడుకున్నాం క్యూలైన్లలోకి వెళ్లేందుకు పార్క్ గేటు తెరవడంతో భక్తులు గుంపులుగా పరుగులు పెడుతూ దూసుకొచ్చారు. ముందుగా విశాఖ ప్రాంతానికి చెందిన భక్తులు తాడుకు తగులుకుని కింద పడిపోయారు. ఆ వెనుకే∙ఉన్న మాపైకి వందలాది మంది దూసుకురావడంతో తొక్కిసలాట జరిగింది. కిందపడ్డ మా వాళ్లను కాపాడుకునేందుకు 20 నిమిషాలు పట్టింది. సకాలంలో 108 రాకపోవడంతో ఆటోల్లో ఆస్పత్రులకు తీసుకెళ్లాం. – చిన్నరాజు, క్షతగాత్రురాలి భర్త, నరసాపురం, అన్నమయ్య జిల్లానా జీవితంలో అదో పీడకల కళ్ల ముందే భక్తులు కుప్పకూలిపోయారు. ముందు వరుసలో ఉన్న మహిళా భక్తులు కిందపడిపోయారు. వారిపై పదుల సంఖ్యలో భక్తులు పడ్డారు. కిందపడిన వారిలో నేనూ ఒకడిని. నా పై సుమారు 20మంది పడిపోయారు.వారిని పట్టించుకోకుండా వెనక నుంచి వచ్చే వారు తొక్కుకుంటూ వెళ్లిపోవడంతో 50మందికిపైగా గాయాలయ్యాయి. ఆరుగురు చనిపోవడానికి కూడా ఇదే కారణం. స్వయంగా అనుభవించిన ఈఘటన పీడకలగా మిగిలిపోతుంది. – చిన్న అబ్బయ్య, క్షతగాత్రుడు, రామసముద్రం, అన్నమయ్యజిల్లాభక్తులను నమ్మించి దగా చేశారు సామాన్య భక్తులకు ప్రాధాన్యత కల్పిస్తున్నామని టీటీడీ యాజమాన్యం నమ్మించి వారిని మోసం చేసింది. టికెట్ ఉన్నవారికే తిరుమలకు ప్రవేశం, స్వామిదర్శనం అంటూ నమ్మపలికారు. ఫలితంగా భక్తులు స్వామి దర్శన భాగ్యం కోసం అధిక సంఖ్యలో తిరుపతికి చేరుకున్నారు. ప్రచారానికి తగిన విధంగా ఏర్పాట్లు చేయకపోవడం వల్లే ఈ ఘటన జరిగింది. – ఎ.మధు, జై హిందూస్థాన్ పార్టీ,రాష్ట్ర ఎస్సీ సెల్ అధ్యక్షుడు.వైకుంఠానికే పంపారు వైకుంఠ ఏకాదశి నాడు స్వామి వారి దర్శన భాగ్యం కల్పిoచాలని కోరిన భక్తులను టీటీడీ వారిని నేరుగా వైకుంఠానికి పంపింది. టీటీడీలో ఏటా వైకుంఠ ఏకాదశి దర్శనం కల్పించడం ఆనవాయితీగా వస్తున్నా అదే అనుభవంతో ఏర్పాట్లు, పర్యవేక్షణ కొరవడడంతో భక్తులకు తీవ్ర కష్టాలు ఎదురయ్యాయి. అధికారుల నిర్లక్ష్యంతోనే భక్తులు మరణించారు. –ఎం.నీలకంఠ, హిందూ చైతన్య సమితి అధ్యక్షుడు. నేరుగా దేవుని దగ్గరకే పంపిన టీటీడీ శ్రీవారిని చూపాలని కోరిన భక్తులకు టీటీడీ నేరుగా దేవుని దగ్గరకు పంపడం అమానుషం. వైకుంఠ దర్శన టోకన్ల జారీలో భక్తుల పట్ల టీటీడీ, పోలీసులు చులకనగా మాట్లాడడం విడ్డూరం. తొక్కిసలాట సందర్భంగా భక్తులపై పోలీసులు లాఠీ చార్జ్ చేయడమేకాక ఎవరు రమ్మన్నారంటూ వ్యాఖ్యానించడం దుర్మార్గం. – తుమ్మ ఓంకార్, తిరుక్షేత్రాల రక్షణ సమితి అధ్యక్షుడు. కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యమే కారణం ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే ఆరుగురు భక్తులు మృతి చెందారు. భక్తులు తిరుమలకు రావాలంటే భయపడే పరిస్థితిని టీటీడీ యాజమాన్యం తీసుకొచ్చిoది. టీటీడీ యాజమాన్యం నిర్లక్ష్యమే ఇందుకు కారణం. – దిలీప్‌కుమార్, తిరుమల, తిరుపతి సంరక్షణ సంఘం అధ్యక్షుడు