ప్రధాని, హోంమంత్రికి వైఎస్సార్‌సీపీ ఎంపీ లేఖ | Tirupati Mp Gurumurthy Letter To Prime Minister And Home Minister | Sakshi
Sakshi News home page

ప్రధాని, హోంమంత్రికి తిరుపతి ఎంపీ గురుమూర్తి లేఖ

Apr 1 2025 5:46 PM | Updated on Apr 1 2025 7:12 PM

Tirupati Mp Gurumurthy Letter To Prime Minister And Home Minister

సాక్షి, ఢిల్లీ: తిరుమలలో వరుసగా జరుగుతున్న భద్రత వైఫల్యాలపై కేంద్రం జోక్యం చేసుకోవాలని కోరుతూ.. ప్రధానమంత్రి, హోం మంత్రి, హోంశాఖ కార్యదర్శికి వైఎస్సార్‌సీపీ ఎంపీ గురుమూర్తి లేఖ రాశారు. ‘‘వైకుంఠ ఏకాదశి రోజున ఆరుగురు భక్తులు తొక్కిసలాటలో చనిపోయారు. అన్నదానం క్యూ కాంప్లెక్స్‌లో భక్తులను నియంత్రించలేక తొక్కిసలాట జరిగింది. నాన్ వెజ్ పదార్థాలను కొండపైకి తీసుకెళ్లి తిన్న ఘటనలు జరిగాయి’’ అని లేఖలో ఆయన పేర్కొన్నారు.

‘అలిపిరి చెక్‌ పాయింట్‌ను దాటుకుని సులభంగా గంజాయి, ఆల్కాహాల్‌ తీసుకెళ్తున్నారు. పవిత్రమైన పాప వినాశనం డ్యామ్‌లో నిబంధనలకు విరుద్ధంగా బోట్లను తిప్పారు. మార్చి 31న మతిస్థిమితం లేని వ్యక్తి బైక్‌పై తిరుమల కొండపైకి చేరుకున్నాడు. టీటీడీ పరిపాలన అస్తవ్యస్తంగా మారింది. దానివల్లే సమన్వయ లోపం, భద్రత లోపం తలెత్తింది. తిరుమల జాతీయ ప్రాధాన్యత కలిగిన పవిత్ర పుణ్యక్షేత్రం. వరుసగా జరుగుతున్న భద్రతా వైఫల్యంపై కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని తగిన చర్యలు తీసుకోవాలి’’ అని ఎంపీ గురుమూర్తి డిమాండ్‌ చేశారు.

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement