Tirupati
-
తిరుపతి : సామూహిక సూర్యనమస్కార్–2025 (ఫొటోలు)
-
ఐపీఎస్ సుబ్బారాయుడుపై కూటమి సర్కారు ఎనలేని ప్రేమ
-
కారు ప్రమాదంలో దంపతుల మృతి: Tirupati
-
యువకులపై ఏనుగుల దాడి..ఒకరు మృతి
-
దేవుడి సంపద మీద పచ్చ ముఠా కన్నేసిందా ?
-
టీటీడీలో వరుస ఘటనలపై కేంద్రం సీరియస్
సాక్షి ప్రతినిధి, తిరుపతి: తిరుమలలో వరుస ఘటనలను కేంద్ర హోం శాఖ తీవ్రంగా పరిగణించింది. శ్రీవారి లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిసిందంటూ ఏకంగా సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించడం.. వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల జారీ సందర్భంగా ఈ నెల 8న తిరుపతిలో జరిగిన తొక్కిసలాట జరిగి ఆరుగురు మృతి చెందడం, పదుల సంఖ్యలో భక్తులు గాయపడటం.. ఈ ఘటన గురించి మరచిపోక ముందే 13న లడ్డూ కౌంటర్లో అగ్ని ప్రమాదం జరగడంపై కేంద్రం దృష్టి సారించింది.తొక్కిసలాట, అగ్ని ప్రమాదంపై టీటీడీ నుంచి నివేదిక కోరింది. వరుస పరిణామాలకు సంబంధించి క్షేత్ర స్థాయిలో పర్యటించి, వాస్తవాలు తెలుసుకోవాలని కేంద్ర హోం శాఖ అడిషనల్ సెక్రటరీ సంజీవ్ కుమార్ జిందాల్‌కు ఆదేశాలు జారీ చేసింది. సంజీవ్ కుమార్ జిందాల్ ఆదివారం తిరుమలకు వస్తారని టీటీడీ చైర్మన్‌కు లేఖ పంపింది. అయితే ఆయన పర్యటన వాయిదా పడినట్లు శనివారం రాత్రి తిరిగి సమాచారం అందించింది. టీటీడీ చరిత్రలో కేంద్రం జోక్యం చేసుకోవడం ఇదే మొదటిసారి. కాగా, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటికీ నుంచి టీటీడీని రాజకీయంగా వాడుకోవడంపై దృష్టి సారించింది. ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది భక్తుల మనోభావాలు దెబ్బ తింటాయన్న విచక్షణ మరచి, సీఎం స్థానంలో ఉన్న చంద్రబాబు శ్రీవారి ప్రసాదాల్లో జంతువుల కొవ్వు కలిసిందంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. క్రౌడ్ మేనేజ్మెంట్లో టీటీడీకి ఉన్న రికార్డుకు మచ్చ తీసుకొస్తూ కనీస ఏర్పాట్లు చేయకుండానే ఈ నెల 8న తిరుపతిలో వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల కోసం ఒక్కసారిగా క్యూలైన్ గేట్లు తెరిచారు. ఫలితంగా తొక్కిసలాట జరిగి ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన మరువక ముందే తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం కౌంటర్లో షార్ట్ సర్కూట్‌తో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. పదుల సంఖ్యలో కౌంటర్లు, క్యూలలో వేలాది భక్తులు ఉన్న సమయంలో ఈ ఘటన జరిగడం ఆందోళనకు గురి చేసింది. వీటన్నింటికీ తోడు లోకేశ్ మనిషి లక్ష్మణ్‌కుమార్ ‘సూడో’ అదనపు ఈఓగా చెలరేగిపోతుండటం పట్ల టీటీడీ యంత్రాంగం మండిపడుతోంది. -
సనాతన ధర్మం అంటే ఇదేనా పవన్!
తిరుపతి కల్చరల్: సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు ఏర్పాటు చేసి సనాతన ధర్మాన్ని రక్షించాలని తిరుపతి సభలో హిందూ డిక్లరేషన్ ప్రకటించిన డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్ తిరుమల క్షేత్రంలో ధర్మానికి విరుద్ధంగా సాగుతున్న విషయాలపై ఎందుకు నోరు మెదపటం లేదని పలువురు స్వామీజీలు, హిందూ సంఘాల ప్రతినిధులు ప్రశ్నించారు. సనాతన ధర్మం అంటే ఇదేనా అని నిలదీశారు. తిరుమలలో అపచారాలు, తిరుమల కొండకు సమీపంలో చేపడుతున్న ముంతాజ్ హోటల్ నిర్మాణాలను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ టీటీడీ పరిపాలనా భవనం ఎదుట శనివారం స్వామీజీలు, హిందూ సంఘాల ప్రతినిధులు నిరసన తెలిపారు. డిప్యూటీ సీఎం ఫోటోలతో కూడిన ప్లకార్డులు ప్రదర్శించి గోవింద నామస్మరణలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా స్వామీజీలు, హిందూ సంఘాల ప్రతినిధులు ఏమన్నారంటే..సనాతన ధర్మం రక్షణ అంటే ఇదేనా?తిరుమల శ్రీవారు తమ కులదైవమని సీఎం చంద్రబాబు ప్రకటిస్తే.. హిందూ డిక్లరేషన్ అంటూ పవన్‌కళ్యాణ్ సభపెట్టి సనాతన ధర్మానికి విరుద్ధంగా వ్యవహరిస్తూ హిందువుల మనోభావాలను దెబ్బతీస్తున్నారు. చట్ట విరుద్ధంగా ముంతాజ్ హోటల్‌కు అనుమతులు ఇస్తూ దగా చేయడం దుర్మార్గం. చెప్పిందొకటి చేసేది మరొకటిగా కూటమి ప్రభుత్వ ధోరణి ఉంది. – శ్రీనివాసానంద సరస్వతి స్వామీజీ, అధ్యక్షుడు, ఏపీ సాధు పరిషత్పవిత్రతకు భంగం కలిగిస్తే శంఖారావం పూరిస్తాంతిరుమల పవిత్రతకు భంగం కలిగించే పనులకు స్వస్తి చెప్పకపోతే గోవింద శంఖారావం పూరించి కూటమి ప్రభుత్వాన్ని పెకిలిస్తాం. సనాతన ధర్మం అంటూ ప్రగల్భాలు పలికిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తిరుమల క్షేత్రంలో ధర్మ విరుద్ధ పనులు సాగుతున్నా ప్రశ్నించకపోవడం సిగ్గుచేటు. మందు, మాంసాహార విందుల సౌకర్యాలతో కూడిన ముంతాజ్ హోటల్ ఏర్పాటును హిందూ సమాజం వ్యతిరేకిస్తోంది. – తుమ్మా ఓంకార్, తిరుక్షేత్రాల పరిరక్షణ సమితి అధ్యక్షుడురాజకీయం చేయడం దుర్మార్గంతిరుమలను రాజకీయ క్షేత్రంగా మార్చి ధర్మబద్ధతకు తూట్లు పొడవడం విడ్డూరం. సనాతన ధర్మం పేరుతో ఊకదంపుడు ప్రసంగాలు చేసిన పవన్‌కళ్యాణ్ నేడు తిరుమలలో సనాతన ధర్మానికి వెన్నుపోటు పొడిచే కార్యక్రమాలు సాగుతున్నా మాట్లాడకపోవడం దారుణం. ముంతాజ్ హోటల్ నిర్మాణం చేపట్టడం హేయమైన చర్య. తిరుమలకు మాంసాన్ని తీసుకెళ్లి పవిత్రతను దెబ్బతీసినా నిమ్మకు నీరెత్తినట్టు వ్యహరించడం చేతకానితనానికి నిదర్శనం. – శివానంద స్వామీజీ, ఏపీ సాధు పరిషత్ ప్రతినిధిహోటల్ అనుమతులు రద్దు చేయాలితిరుమల పవిత్రతకు భంగం కలిగించేలా అలిపిరి సమీపంలో చట్టవిరుద్ధంగా చేపడుతున్న ముంతాజ్ హోటల్ అనుమతులును వెంటనే రద్దు చేయాలి. తిరుమలలో పవిత్రత దెబ్బతీసే కార్యక్రమాల పట్ల పటిష్ట చర్యలు తీసుకోవాలి. కూటమి ప్రభుత్వం సనాతన ధర్మం పరిరక్షణను విస్మరించడం శోచనీయం. సీఎం చంద్రబాబు తిరుమల పవిత్ర మంటగలుస్తున్నా పట్టించుకోకపోవడం దారుణం– విజయ భాస్కర్, హిందూ సంఘాల ప్రతినిధి, కర్ణాటకపుట్టగతులుండవుతిరుమల శ్రీవారితో చెలగాటాలాడితే పుట్టగతులుండవు. సనాతన ధర్మ పరిరక్షణ, తిరుమల ప్రక్షాళనే లక్ష్యమన్న కూటమి అధికారంలోకి రాగానే అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తూ తిరుమల క్షేత్ర పవిత్రతను దెబ్బ తీస్తున్నారు. ముంతాజ్ హోటల్ నిర్మాణాలకు అనుమతులు ఇవ్వడమే ఇందుకు నిదర్శనం. తిరుమలకు మాంసం తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదు. – సాధు మహరాజ్, శ్రీజ్ఞానపీఠం ప్రతినిధిధర్మరక్షణకు చర్యలు చేపట్టాలితిరుమలలో వరుసగా సాగుతున్న అపవిత్ర కార్యక్రమాలకు స్వస్తి పలికి సనాతన ధర్మ పరిరక్షణకు కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టాలి. తిరుమల పవిత్రతను దెబ్బతీసేలా చేపడుతున్న ముంతాజ్ హోటల్ నిర్మాణాలను తక్షణమే నిలిపివేయాలి. భక్తుల మనోభావాలు దెబ్బతీసే చర్యలు కొనసాగితే ఆందోళనలు చేపట్టక తప్పదు.– కిరణ్, సనాతన ధర్మ పరిరక్షణ సమితి అధ్యక్షుడు -
తిరుమలలో వరుస ఘటనలు: కేంద్ర హోంశాఖ సీరియస్
తిరుపతి: తిరుమలలో ఇటీవల కాలంలో వరుసగా చోటు చేసుకున్న సంఘటనలపై కేంద్ర హోంశాఖ(Ministry of Home Affairs) సీరియస్‌గా ఉంది. దీనిలో భాగంగా కేంద్ర హోంశాఖ అదనపు కార్యదర్శి సంజీవ్ కుమార్ జిందాల్ తిరుమలలో పర్యటించనున్నారు. ఇప్పటికే ఈనెల 8 వ తేదీన తిరుమలలో జరిగిన తొక్కిసలాట, 13వ తేదీన లడ్డూ కౌంటర్ వద్ద జరిగిన అగ్ని ప్రమాద ఘటనలపై ఇప్పటికే కేంద్రం నివేదిక కోరింది. ఈ నేపథ్యంలో కేంద్రం హోంశాఖ అదనపు కార్శిదర్శి సంజీవ్ కుమార్ తిరుమలలో పర్యటించడం ప్రాధాన్యత సంతరించుకుంది.ప్రధానంగా తిరుమల తొక్కిసలాట ఘటన(Tirupati Stampede Incident)పై సోమవారం సమీక్షనిర్వహించనున్నట్లు తెలుస్తోంది. అలాగే టీటీడీ అధికారులతో హోంశాఖ అదనపు కార్యదర్శి సంజీవ్ కుమార్ జిందాల్ భేటీ కానున్నారు. వరుసగా తిరుమలలో చోటు చేసుకున్న ఘటనలపై టీటీడీ అధికారుల నుంచి నివేదిక కోరే అవకాశం ఉంది. తిరుమలలో వరుసగా చోటు చేసుకుంటున్న పరిణామాలు చర్చనీయాంశంగా మారిన నేపథ్యంలో కేంద్ర హోంశాఖ అదనపు కార్యదర్శి పర్యటనపై ఆసక్తి నెలకొంది.పాలకుల వైఫల్యం.. భక్తులకు శాపంఇటీవల వైకుంఠ ఏకాదశి సందర్భంగా టీటీడీ(TTD) పాలకుల మితిమీరిన ప్రచారం, అవగాహన రాహిత్యం, భద్రత ఏర్పాట్ల వైఫల్యం భక్తులకు శాపంగా మారింది. వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని పది రోజుల పాటు ఉత్తర ద్వార దర్శనం కల్పించనున్నట్లు టీటీడీ ప్రకటించింది. ఇందుకోసం తిరుపతి కేంద్రంగా భక్తులకు టోకెన్లను జారీ చేయాలని నిర్ణయించింది. ఈ క్రమంలో టీటీడీ చైర్మన్, అధికారులు నెల రోజుల నుంచి సమావేశాలు, సమీక్షలు నిర్వహించారు.తరచూ కౌంటర్ల ఏర్పాట్లను పరిశీలిస్తూ, సామాన్య భక్తులకు దర్శనం కల్పించడమే ముఖ్య ఉద్దేశమంటూ ఊదరగొట్టారు. అతి ప్రచారం కారణంగా వివిధ రాష్ట్రాల నుంచి లక్షలాది మంది భక్తులు తిరుపతికి పోటెత్తారు. భక్తుల రద్దీని అంచనా వేయడంలో టీటీడీ పూర్తిగా విఫలమైంది. ఆ స్థాయిలో ఏర్పాట్లు లేకపోవడంతో కౌంటర్ల వద్ద తీవ్ర గందరగోళం నెలకొంది. గురువారం ఉదయం 5 గంటల నుంచి మూడు రోజులకు సంబంధించి 1.20 లక్షల టోకెన్లను జారీ చేస్తామని ముందుగానే ప్రకటించడంతో సుమారు నాలుగు లక్షల మందికి పైగా భక్తులు తిరుపతి చేరుకున్నారు.బుధవారం తెల్లవారుజాము 5 గంటల నుంచే కౌంటర్ల వద్ద బారులు తీరారు. సాయంత్రానికి మరింత మంది తోడవ్వడంతో క్యూలైన్ల వద్ద రద్దీ పోటెత్తింది. సరిగ్గా ఇదే సమయంలో అధికారులు అనాలోచిత నిర్ణయంతో బుధవారం రాత్రి 8 గంటల నుంచే టోకెన్ల జారీ ప్రారంభించారు. దీంతో వేలాదిగా భక్తులు కౌంటర్ల వద్దకు పరుగులు పెట్టడం.. తోపులాట చోటుచేసుకోవడం.. ఆరుగురు మృతి చెందడం.. పదుల సంఖ్యలో భక్తులు గాయపడటం తెలిసిందే. తిరుమల లడ్డూ కౌంటర్ల వద్ద అగ్నిప్రమాదం -
మోసం చేసిన చంద్రబాబు వెంటనే రాజీనామా చేయాలి: మహిళలు
-
Magazine Story: చంపేసి సారీ చెప్తే సరిపోతుందా..?
-
తిరుపతి జిల్లాలో జోరుగా జల్లికట్టు సంబరాలు (ఫోటోలు)
-
డాక్టర్ అవతారమెత్తి.. చైన్ కొట్టేసి!
తిరుపతి తుడా : పేద రోగులే టార్గెట్‌గా రుయాలో దొంగలు హల్ చల్ చేస్తున్నారు... రోగుల సహాయకులుగా తరచూ పేషంట్ వార్డుల్లో తిరుగుతూ సెల్ఫోన్లు, పర్సులు దొంగతనం చేసే ముఠా ఇప్పుడు కొత్త అవతారం ఎత్తింది. ఏకంగా తెల్ల కోటు ధరించి డాక్టర్ వేషం ధరించి చోరీలకు పాల్పడడం కలకలం రేపుతోంది. రుయా ఆస్పత్రిలో తరచూ మొబైల్ ఫోన్లు, పర్సులు, ఏటీఎం కార్డులు, బైక్ దొంగతనాలు జరగడం సర్వసాధారణమైంది . ఈ క్రమంలోనే తెల్ల కోటుతో వచ్చి రోగులను బురిడీ కొట్టించి ఐదు సవర్ల బంగారు చైను చోరీ చేసిన యువతిని సెక్యూరిటీ సిబ్బంది అదుపులోకి తీసుకొని పోలీసులకు అప్పగించిన ఘటన మంగళవారం రుయాలో చోటుచేసుకుంది... వైఎస్సార్ జిల్లా వల్లూరుకు చెందిన శ్రీవాణి అనే యువతి అనస్తీషియా టెక్నీషియన్ అని రోగులకు చెప్పుకుంటూ అత్యవసర విభాగంలో తిరుగుతూ ఉండేది. ఈ క్రమంలో అప్పుడే రేణిగుంట నుంచి గాయాలతో వైద్యం కోసం వచ్చిన వెస్లీ అనే మహిళను గుర్తించి పరిచయం చేసుకుంది. అనంతరం స్కానింగ్ కోసం తీసుకెళ్లి ఒంటిపై నగలు తీసేయాలని సూచించింది. వెస్లీ తన ఒంటిపై ఉన్న రెండు బంగారు చైన్లు, రెండు బంగారు గాజులను తీసి ఆ యువతి చేతికి ఇచ్చి బయట తన భర్తకు ఇవ్వాలని చెప్పింది. అయితే శ్రీవాణి చేతివాటం ప్రదర్శించి ఐదు సవర్ల బంగారు గొలుసును తన బ్యాగులో వేసుకొని మిగిలిన వస్తువులను వెస్లీ భర్త చేతికి ఇచ్చింది. ఇందులో మరో చైన్ ఉండాలని వెస్లీ భర్త విక్టరీ అడగడంతో మాకేం తెలుసు అంటూ ఆ యువతి అక్కడినుంచి వెళ్లిపోయింది. స్కానింగ్ నుంచి బయటికి వచ్చిన వెస్లీ నగలు చూసి అందులో ఒక చైన్ లేకపోవడాన్ని గుర్తించి వెంటనే సెక్యూరిటీ సిబ్బంది దృష్టికి తీసుకెళ్లింది. సెక్యూరిటీ వెంటనే అప్రమత్తమై గాలింపు చేపట్టారు. అక్కడే ఉన్న యువతిని గుర్తించి ఆమె బ్యాగులో బంగారు చైన్‌ను గుర్తించారు. వెస్ట్ పోలీసులకు యువతిని అప్పగించారు. -
తిరుపతిలోని శ్రీవిద్యానికేతన్ క్యాంపస్ వద్ద టెన్షన్ వాతావరణం
-
ప్రజలపై చంద్రబాబుకు చిత్తశుద్ది లేదు: YV Subba Reddy
-
తిరుమల: బంగారు బిస్కెట్ చోరీ ఘటన కీలక మలుపు
తిరుమల: తిరుమల (Tirumala) పరకామణిలో బంగారు బిస్కెట్ (Gold biscuit) చోరీ ఘటన కీలక మలుపు తిరిగింది. ఇటీవల 100 గ్రాముల బంగారు బిస్కెట్ దొంగలిస్తూ పట్టుబడిన నిందితుడిని తిరుమల వన్‌టౌన్ పోలీసులు తమదైన శైలిలో విచారణ చేపట్టడంతో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. తిరుపతికి చెందిన వీరిశెట్టి పెంచలయ్య శ్రీవారి పరకామణిలో అగ్రిగోస్ కంపెనీ ద్వారా కాంట్రాక్ట్ ఉద్యోగిగా రెండేళ్ల నుంచి పనిచేస్తున్నారు.ఇతను తొందరగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో ఏడాదిగా పరకామణిలోని గోల్డ్ స్టోరేజ్ గదిలో ఉంచే బంగారు వస్తువులను దొంగలిస్తూ వస్తున్నాడు. ఈ మేరకు అతనిపై నిఘా ఉంచగా.. ఈనెల 11న మధ్యాహ్నం గోల్డ్ స్టోరేజ్ గదిలో ఉన్న 100 గ్రాముల బంగారు బిస్కెట్‌ను దొంగలించి దానిని ట్రాలీకి ఉన్న పైపుల్లో దాచిపెట్టాడు. తనిఖీ సమయంలో టీటీడీ భద్రతా సిబ్బంది గుర్తించడంతో పెంచలయ్య పరారయ్యాడు.ఈ విషయమై టీటీడీ విజిలెన్స్ సిబ్బంది తిరుమల వన్‌టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నిందితుడిని అదుపులోకి తీసుకుని పోలీసులు విచారించారు. విచారణలో మొత్తం 555 గ్రాముల బంగారు బిస్కెట్లు, బంగారు ఆభరణాలు మొత్తం 655 గ్రాములు, 157 గ్రాముల వెండి వస్తువులను స్వా«దీనం చేసుకున్నారు.ఇదీ చదవండి: అన్నదాత ఇంట కానరాని సంక్రాంతి -
తిరుమల ఘాట్రోడ్లో బస్సు ప్రమాదం
తిరుపతి: తిరుమల ఘాట్రోడ్లో బస్సు ప్రమాదం(Bus Accident) జరిగింది. భక్తులను తీసుకుని వెళ్తున్న ఆర్టీసీ బస్సు.. ఘాట్రోడ్లో ప్రమాదానికి గురైంది. బస్సు అదుపు తప్పి, పిట్టగోడను ఢీకొట్టింది ఆర్టీసీ బస్సు . ఈ ఘటనలో పలువురు భక్తులకు(Several Devotees) గాయాలయ్యాయి. ఇందులో 10 మంది భక్తులకు తీవ్రగాయాలు కాగా వారిని ఆస్పత్రికి తరలించారు. అయితే గాయపడ్డవారిని ఆస్పత్రికి తరలించే క్రమంలో ట్రాఫిక్ జామ్ సమస్య అడ్డంకిగా మారి జాప్యం చోటు చేసుకుంది. ప్రమాదానికి గురైన ఆర్టీసీ బస్సు.. రోడ్డుకు అడ్డంగా నిలిచిపోయింది. ఫలితంగా కిలోమీటర్ మేర ట్రాఫిక్ జామ్ అయ్యింది. అలిపిరి వరకూ ట్రాఫిక్ జామ్ కావడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.తిరుమల లడ్డూ కౌంటర్ల వద్ద అగ్నిప్రమాదంఈరోజు తిరుమల(Tirumala) లడ్డూ కౌంటర్ల వద్ద అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. దీంతో భక్తులు భయబ్రాంతులకు గురై పరుగులు తీశారు. ఆపై సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ప్రమాదంలో ఎలాంటి నష్టం వాటిల్లలేదని సమాచారం.లడ్డూ కౌంటర్లలో 47వ నెంబర్ కౌంటర్ వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుంది. కౌంటర్లోని కంప్యూటర్ యూపీఎస్‌లో షార్ట్ సర్క్యూట్ రావడంతోనే ప్రమాదం జరిగినట్లు సిబ్బంది చెబుతున్నారు. మరోవైపు తిరుమల లడ్డూ కౌంటర్ల వద్ద నిత్యం భక్తుల రద్దీ ఉండడం సహజమే.అయితే ఇటీవల తిరుపతి తొక్కిసలాట ఘటన తర్వాత.. స్వామివారిని దర్శించుకుంటున్న భక్తుల సంఖ్యలో మార్పు కనిపిస్తోంది. ఈ క్రమంలో లడ్డూ కౌంటర్ల వద్ద అగ్నిప్రమాదంతో ఒక్కసారిగా అలజడి చేలరేగగా.. కాసేపు అక్కడున్న భక్తులు అందోళనకు గురయ్యారు.చదవండి: తిరుపతి తొక్కిసలాట ఘటనపై వైఎస్సార్సీపీ న్యాయపోరాటం -
వేంకటేశ్వర స్వామి భక్తుల ప్రాణాలకు విలువలేదు అన్నట్లు కూటమి సర్కార్ వైఖరి
-
భోగి వేడుకల్లో మోహన్ బాబు కుటుంబం
రెండు తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సందడి మొదలైంది. ఇవాల్టి నుంచే భోగ భాగ్యాలు తీసుకొచ్చే భోగి పండుగ షురూ అయింది. నగరాలు బోసివేతున్న వేళ.. పల్లెలన్నీ కళకళలాడుతున్నాయి. ప్రతి ఒక్కరూ సంతోషాలతో ఈ పొంగల్‌ను సెలబ్రేట్ చేసుకుంటున్నారు.తాజాగా సినీ నటుడు మోహన్ బాబు సైతం భోగి వేడుకల్లో పాల్గొన్నారు. తిరుపతి జిల్లాచంద్రగిరి మండలం రంగంపేటలోని శ్రీ విద్యానికేతన్‌లో భోగి మంటలు వేసి సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ భోగి వేడుకల్లో మోహన్ బాబు కుటుంబ సభ్యులు కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సంప్రదాయాలకు, విలువలకు ప్రతీకే సంక్రాంతి పండుగని మోహన్ బాబు అన్నారు. ఈ సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు.భోగి వేడుకల్లో మోహన్ బాబు మాట్లాడుతూ..'సాంప్రదాయాలకు, విలువలకు ప్రతీక సంక్రాంతి. రైతు సుభిక్షంగా ఉంటేనే సంక్రాంతి వేడుకగా జరుపుకుంటా. సంతోషంగా జరుపుకునే ఈ పండుగ వేళ ముఖ్యంగా యువత జాగ్రత్త వహించాలి' అని అన్నారు. భోగి వేడుకల్లో ప్రతి ఒక్కరూ సంతోషంగా పండుగను మోహన్ బాబు తనయుడు మంచు విష్ణు ఆకాంక్షించారు. ఈ సందర్భంగా భక్త కన్నప్ప సినిమాను ఏప్రిల్ 25న విడుదల చేస్తున్నామని తెలిపారు. జల్లికట్టుకు రంగంపేట ఫేమస్.. అందుకే యువత జాగ్రత్తగా ఉండాలని మంచి విష్ణు సూచించారు. ప్రతి ఒక్కరూ సంతోషంగా పండుగను సెలబ్రేట్ చేసుకోవాలని.. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. -
బాబు బినామీ ముఠా గుప్పిట్లో శ్రీవారి ఆలయం..!
సాక్షి, అమరావతి: తిరుమల చరిత్రలో తొలిసారిగా తొక్కిసలాట జరగటం, ఆరుగురి ప్రాణాలను హరించడం వెనుక అసలు కుట్ర బట్టబయలైంది. శ్రీవారి ఆలయం పవిత్రత, సంప్రదాయాలకు భంగం కలిగిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు ఏకంగా ఆ వ్యవస్థనంతటినీ తన బినామీలైన ప్రైవేటు ముఠా ఆధిపత్యంలోకి తేవడం, వారి నిర్వాకంతోనే ఈ ఘటన జరిగిందన్న విషయం వెలుగులోకి వచ్చింది. పైగా, ఆ నిందను వైఎస్సార్సీపీపై వేసేందుకూ టీడీపీ నేతలు వెనుకాడలేదు. ఇప్పుడు అసలు కుట్ర చంద్రబాబుదేనన్న విషయం బట్టబయలైంది. ఇంతకు ముందు శ్రీవారి ప్రసాదంలో కల్తీ నెయ్యి అంటూ లేని అపోహలు సృష్టించిన చంద్రబాబు.. ఇప్పుడు ఏకంగా ఆలయంలోకి ప్రైవేటు వ్యక్తులను ప్రవేశపెట్టి తన గుప్పిట్లోకి తీసుకొనేందుకు సాగించిన గూడుపుఠాణి బట్టబయలైంది.ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) పరిజ్ఞానాన్ని అందించే ముసుగులో చంద్రబాబు తన బినామీ ముఠాను టీటీడీలో అనధికారికంగా చేర్చారు. తిరుమలలో క్యూలైన్ల నిర్వహణ, దర్శనాలు, ప్రసాదం పంపిణీ.. ఇలా సమస్తం ఆ ముఠాకే కట్టబెట్టాలన్న దురాలోచనకు తెగించారు. అందుకోసం ప్రయోగాత్మకంగా వైకుంఠ ఏకాదశి దర్శనం టికెట్ల జారీని ఆ ముఠాయే పర్యవేక్షించడం, సరైన ప్రణాళిక లేక తొక్కిసలాటకు దారి తీసి ఆరుగురు భక్తుల దుర్మరణానికి కారణమైందన్న అసలు నిజం వెలుగులోకి వచ్చింది. తిరుమల ఆలయాన్ని గుప్పిట పట్టేందుకు చంద్రబాబు బినామీ ముఠా చేస్తున్న కుతంత్రాన్ని కొన్ని నెలలుగా పరిశీలిస్తున్న టీటీడీ వర్గాలు అసలు విషయాన్ని ‘సాక్షి’కి సాధికారికంగా వెల్లడించాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న శ్రీవారి అశేష భక్తకోటిని తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్న చంద్రబాబు కుట్ర ఇదిగో ఇలా ఉంది..టీటీడీలో బాబు బినామీలు పాగా..పవిత్రమైన తిరుమల శ్రీవారి ఆలయంపై తన బినామీలకు పెత్తనం కట్టబెట్టి, యావత్ టీటీడీ వ్యవస్థను హైజాక్ చేయాలని చంద్రబాబు కుట్ర పన్నారు. అందుకోసం ఏఐ పరిజ్ఞానాన్ని టీటీడీకి అందిస్తారంటూ ప్రైవేటు వ్యక్తులను టీటీడీలోకి ప్రవేశపెట్టారు. 2014–19 మధ్య టీడీపీ ప్రభుత్వ హయాంలో ఫైబర్‌నెట్ కుంభకోణంలో ప్రధాన నిందితుడిగా ఉన్న వేమూరి హరికృష్ణ నేతృత్వంలోనే ఈ కుతంత్రానికి తెరతీశారు. చంద్రబాబు ఏరికోరి నియమించిన తిరుమల అదనపు ఈవో వెంకయ్య చౌదరి అందుకు పూర్తి సహకారం అందిస్తున్నారు. వీరి సహకారంతో చంద్రబాబు కుమారుడు, మంత్రి నారా లోకేశ్‌కు సన్నిహితులైన లక్ష్మణ్ కుమార్, చందు తోట అనే ఇద్దరు సాఫ్ట్వేర్ నిపుణులు గుట్టుచప్పుడు కాకుండా టీటీడీలోకి ప్రవేశించారు.వాస్తవానికి టీటీడీలో ఏదైనా పోస్టు ఇవ్వాలన్నా, కన్సల్టెంట్‌గా నియమించాలన్నా అధికారికంగా ఉత్తర్వులు ఇవ్వాలి. టీటీడీ పాలకమండలి తీర్మానం చేయాలి. కానీ ఎలాంటి అధికారిక ఉత్తర్వులు, టీటీడీ పాలకమండలి తీర్మానం లేకుండానే లక్ష్మణ్ కుమార్, చందు తోట టీటీడీలోకి దర్జాగా ప్రవేశించారు. ఓ కేంద్ర మంత్రి వద్ద గతంలో పీఎస్‌గా పని చేశానని చెప్పుకునే లక్ష్మణ్ కుమార్ ఏకంగా టీటీడీ అధికారిక సమావేశాల్లో పాల్గొంటున్నారు. అదనపు ఈవో వెంకయ్య చౌదరి పక్కనే ఆయనకు కుర్చీ వేసి మరీ ప్రొటోకాల్ మర్యాదలు అందిస్తున్నారు.ఆయనకు ప్రత్యేక ఛాంబర్, వాహనం, ఇతర సౌకర్యాలను కల్పించడం గమనార్హం. అంటే టీటీడీలోకి అనధికారికంగా, అక్రమంగా ప్రవేశించిన ప్రైవేటు వ్యక్తులకు రాచమర్యాదలు కూడా కల్పిస్తున్నారు. అదీ భక్తులు తిరుమల ఆలయంలో సమర్పించిన కానుకల నిధుల నుంచీ..ఆలయాన్ని గుప్పిటపట్టే కుట్ర..ఏఐ పరిజ్ఞానాన్ని టీటీడీ వ్యవస్థలో ప్రవేశపెట్టడానికి లక్ష్మణ్ కుమార్, చందు తోట సహకరిస్తున్నారని టీటీడీ వర్గాలే చెబుతున్నాయి. ఆ మేరకు అధికారిక నోటిఫికేషన్ ఏమీ జారీ చేయలేదు. ఎందుకంటే.. ఏఐ పరిజ్ఞానం పేరుతో తిరుమల–తిరుపతిలో అన్ని వ్యవస్థలనూ బినామీలకు కట్టబెట్టాలన్నది చంద్రబాబు అసలు కుట్ర. తిరుమలలో గదుల కేటాయింపు, శ్రీవారి ఆలయం క్యూలైన్ల నిర్వహణ, టికెట్ల జారీ, దర్శనాలు, ప్రసాదం పంపిణీ.. ఇలా అన్నింటినీ ఆ ముఠా ఆధిపత్యంలోకి తేవడమే అసలు వ్యూహం. వేలాదిమంది టీటీడీ ఉద్యోగులతో పటిష్టంగా ఉన్న వ్యవస్థను క్రమంగా నీరుగార్చి.. తన బినామీ ముఠాకే తిరుమల శ్రీవారి ఆలయంతోపాటు టీటీడీపై గుత్తాధిపత్యం కట్టబెట్టాలన్నది అంతిమలక్ష్యం. అంటే తిరుమలలో గదులు, దర్శనం, ప్రసాదాలు ఇలా ఏదైనా ఈ ముఠా ద్వారానే జరగాలి.వైకుంఠ ఏకాదశి టికెట్లపై ప్రయోగంతిరుమల శ్రీవారి ఆలయంలో క్యూలైన్ల నిర్వహణ, టికెట్ల జారీ వ్యవస్థను గుప్పిట పట్టేందుకు రూపొందించిన విధానాన్ని వైకుంఠ ఏకాదశి టికెట్ల జారీలో ప్రయోగాత్మకంగా పరీక్షించాలని ఆ ముఠా భావించింది. వేమూరి హరికృష్ణ, లక్ష్మణ్ కుమార్, చందు తోట కొన్ని రోజులుగా తిరుమల–తిరుపతిలోనే తిష్ట వేసి అదే పనిలో ఉన్నారు. పైలట్ ప్రాజెక్టును తిరుమలలో నిర్వహించే అవకాశం లేదు. అందుకే ముందుగా తిరుపతిలో పరీక్షించాలని భావించారు. అందుకే ఈసారి వైకుంఠ ఏకాదశి టికెట్ల జారీ ప్రక్రియను ఉద్దేశçపూర్వకంగా తిరుపతిలో 8 కేంద్రాల్లో ఏర్పాటు చేశారు. కానీ, చంద్రబాబు బినామీ ముఠా రూపొందించిన విధానం పూర్తిగా బెడిసికొట్టింది. వారు చెప్పినట్టుగా టీటీడీ అధికార యంత్రాంగం చేయడంవల్లే టికెట్ల జారీ అస్తవ్యస్తంగా తయారైంది. భక్తులు గంటల తరబడి రోడ్లపై నిరీక్షించి తీవ్ర ఇబ్బందులు పడాల్సివచ్చింది. చివరికి తొక్కిసలాటకు దారి తీసి ఆరుగురు భక్తులను బలి తీసుకుంది.పరారైన బాబు ముఠాతమ ప్రయోగం వికటించి, ఆరుగురు మరణించారని తెలియగానే చంద్రబాబు బినామీ ముఠా బిచాణా ఎత్తేసింది. వేమూరి హరికృష్ణ, లక్ష్మణ్ కుమార్, చందు తోట తిరుమల నుంచి గుట్టుచప్పుడు కాకుండా జారుకున్నారు. ఈ వ్యవహారమంతా బయటకు రాకూడదని తిరుపతిలో చంద్రబాబు పెద్ద డ్రామా నడిపించారు. ఆయన తిరుపతిలో అధికారులపై చిందులు తొక్కినట్టుగా డ్రామా నడిపి, నేరుగా బాధ్యతలేని అధికారులపై చర్యలు తీసుకుని అసలు విషయాన్ని కప్పిపుచ్చేందుకు యత్నించారు. కాగా, తిరుమలలో కొన్ని నెలలుగా చంద్రబాబు బినామీ ముఠా బాగోతంపై టీటీడీ వర్గాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. పవిత్రమైన తిరుమల ఆలయం ప్రాశస్త్యాన్ని దెబ్బతీసేందుకు, సనాతన సంప్రదాయాలను కాలరాసేందుకు, భారీ ఆర్థిక దోపిడీకి చంద్రబాబు బినామీ ముఠా పన్నాగం పన్నిందని ధ్వజమెత్తుతున్నాయి. -
తిరుపతి జూపార్క్ రోడ్డులో చిరుత కలకలం
సాక్షి, తిరుపతి: జూపార్క్ రోడ్డులో చిరుత కలకలం రేపింది. సైన్స్ సెంటర్ వద్ద రోడ్ క్రాస్ చేస్తున్న చిరుతను బైక్ ఢీకొట్టింది. దీంతో టీటీడీ ఉద్యోగి మునికుమార్ బైక్ నుంచి పడి తీవ్రంగా గాయపడ్డారు. రుయాకు ఆసుపత్రికి తరలించారు. అటవీ ప్రాంతంలోకి చిరుత పారిపోయింది.కాగా, ఎస్వీయూలో చిరుత కదలికలనూ ప్రత్యేకంగా అమర్చిన 10 సీసీ కెమెరాల ద్వారా గుర్తించినట్టు ఫారెస్ట్ అధికారులు ఎఫ్ఆర్ఓ సుదర్శన్, వన్యప్రాణి జీవశాస్త్రవేత్త సౌజన్య తెలిపారు. ఈ మేరకు వారు శుక్రవారం వర్సిటీ రిజిస్ట్రార్ భూపతి నాయుడును కలిసి వర్సిటీ ప్రాంగణంలో చిరుత కదలికలపై పూర్తి సమాచారాన్ని అందించారు. అటవీశాఖ అధికారులు మాట్లాడుతూ వర్సిటీలో ప్రధానంగా రాత్రి ఒంటిగంట సమయంలో జంటలు జంటలుగా తిరుగుతున్నారని జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు.క్యాంటీన్ల వద్ద ఆహార వ్యర్థాల నిర్వహణ సరిగా లేదని, దీంతో వీధి కుక్కల సంఖ్య పెరుగుతోందని తెలిపారు. వర్సిటీ విద్యార్థులు, ఉద్యోగులు, పాదచారులు, వర్సిటీలోకి వచ్చే బయటి వ్యక్తులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రాత్రి 8 నుంచి ఉదయం 7 గంటల వరకు వర్సిటీలో తిరగకూడదని, ఎక్కడబడితే అక్కడ కూర్చోకూడదని స్పష్టం చేశారు. చిరుత తనకన్నా చిన్న సైజు కలిగిన జంతువులను, కుక్కలను, జింకలను, ఆవులు, గేదెలను ఆహారంగా తీసుకెళుతుందన్నారు.వర్సిటీలో కుక్కల బెడద చిరుతకు మంచి అవకాశంగా చేసుకుందని, వ్యర్థ ఆహార పదార్థాల నిర్వహణను క్యాంటీన్ల వద్ద, హాస్టల్లో విధిగా పాటించాలని చెప్పారు. కుక్కల కోసం పాదచారులు ఆహారాన్ని అందించకూడదన్నారు. జాగ్రత్త పట్టికలను ఏర్పాటుచేసి అందులో ఈ మెయిల్స్ వాట్సాప్, ఫోన్ నంబర్ల వివరాలు ఉంచాల ని సూచించారు. వర్సిటీకి అడవి దగ్గరగా ఉండడం వల్ల ఇక్కడ నివాసం ఉండేవారు పెంపుడు జంతువులు పెంచుకోకూడదని సూచించారు. చిరుత సంచారాన్ని గుర్తిస్తే వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించాలని కోరారు.ఇదీ చదవండి: ఎటు చూసినా సంక్రాంతి రద్దీ.. ప్రత్యేక రైళ్లతో ప్రయాణికులకు చుక్కలే -
Big Question: తొక్కిసలాట వెనుక జనసేన కార్యకర్తలు.. ప్రజా శక్తిలో సంచలన వార్త!
-
భక్తులు పోతేనేం.. మనోళ్లు భద్రమే..!
‘సామాన్య భక్తులు ప్రాణాలు కోల్పోయారు...! అయితేనేం..! మనోళ్లు సేఫ్ కదా...! ఇక కేస్ క్లోజ్ చేద్దాం..’... సీఎం చంద్రబాబు తేల్చి చెప్పేశారు!!‘ప్రజల దృష్టి మళ్లించేందుకు ఆడిన ఆగ్రహం డ్రామా అవసరం లేదు.. ఇక చాల్లే.. తగ్గు..!’... ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌కు సంకేతం ఇచ్చారు!! ‘అయితే ఓకే అంటూ ముందస్తు వ్యూహం ప్రకారం పవన్ గప్‌చుప్...!’’‘అయినాకానీ పవన్ జోరుకు బ్రేకులు వేయమని బీఆర్ నాయుడుకు ఆదేశం..!’‘ఎవరో చెబితే మేం చేస్తామా?.. క్షమాపణలు చెప్పాలనడంపై బీఆర్ నాయుడు ప్రతి స్పందన!!సాక్షి, అమరావతి: టీడీపీ కూటమి ప్రభుత్వం ఘోర వైఫల్యంతోనే తిరుపతిలో ఎన్నడూలేని విధంగా తొక్కిసలాట సంభవించి ఆరుగురు భక్తులు ప్రాణాలు కోల్పోయారని సర్వత్రా తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. సీఎం చంద్రబాబే ప్రధాన ముద్దాయి అని యావత్ భక్త కోటి మండిపడుతుండటంతో సర్కారు వైఫల్యాలను కప్పిపుచ్చేందుకు ప్రభుత్వ పెద్దలు పక్కా పన్నాగంతో రంగంలోకి దిగారు. ఈ దుర్ఘటన తమను కలచి వేసిందని మొసలి కన్నీళ్లు కారుస్తూ తిరుపతిలో హై డ్రామాకు తెర తీశారు. సీఎం చంద్రబాబు అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు... చిందులు తొక్కినట్టు వీడియో కెమెరాల ఎదుట కపట నాటకాన్ని రక్తి కట్టించారు. కానీ చంద్రబాబు కుయుక్తులు బెడిసి కొట్టాయి. ఇవి కచ్చితంగా సర్కారీ హత్యలేనని యావత్ ప్రజానీకం తేల్చి చెప్పింది. దీంతో కొందరు అధికారులపై చర్యలు తీసుకుని విషయాన్ని పక్కదారి పట్టించేందుకు యత్నించారు. ఒక్క దెబ్బకు రెండు పిట్టలు అన్నట్లుగా అదే సమయంలో గతంలో తాము చెప్పినట్లుగా రాజకీయ ప్రత్యర్థులపై అక్రమ కేసులు నమోదు చేయని టీటీడీ అధికారులపై చర్యలకు ఉపక్రమించడం చంద్రబాబు కుట్రలకు నిదర్శనం. వైఫల్యానికి కారకులైన తన అస్మదీయ అధికారులపై మాత్రం ఎలాంటి చర్యలూ తీసుకోకుండా వారిని కాపాడుతుండటం గమనార్హం. ఈ పరిణామాలన్నీ ఒక్కటే స్పష్టం చేస్తున్నాయి.. తిరుపతి దుర్ఘటన పూర్తిగా ప్రభుత్వ వైఫల్యమేనని నిగ్గు తేలుస్తున్నాయి. మరోవైపు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ బాధిత కుటుంబాలకు క్షమాపణ చెప్పి ఈ డ్రామాలో తన వంతు పాత్రను రక్తి కట్టించారు. పనిలో పనిగా టీటీడీ చైర్మన్, ఈవో, అదనపు ఈవో కూడా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అందుకు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు ససేమిరా అనడం గమనార్హం. సీఎం ఆదేశాల మేరకే ఆయన ఇలా స్పందించినట్లు తెలుస్తోంది. అయితే ఆ తర్వాత ఆయన మాట మార్చినా పవన్ కళ్యాణ్ సూచనను మొదట తిరస్కరించడం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక సీఎం చంద్రబాబు సమక్షంలోనే టీటీడీ చైర్మన్, ఈవో పరస్పర ఆరోపణలతో అసలు విషయాన్ని బయట పెట్టారు. తిరుమల ఆలయ వ్యవహారాల్లో టీటీడీ, ప్రభుత్వంలో అన్ని స్థాయిల్లో ఏమాత్రం సమన్వయం లేదని తేల్చి చెప్పారు. ఈ నిర్వాకాలు, వైఫల్యాల కారణంగానే తొక్కిసలాట చోటు చేసుకుని అమాయక భక్తులు మృత్యువాత పడినట్లు చంద్రబాబు సమీక్ష సాక్షిగా నిర్ధారణ అయింది.చైర్మన్, అదనపు ఈవో సేఫ్తిరుపతిలో భక్తుల దుర్మరణం దుర్ఘటనకు బాధ్యులైన అస్మదీయ అధికారులను టీడీపీ కూటమి ప్రభుత్వం నిస్సిగ్గుగా వెనకేసుకొచ్చింది. చంద్రబాబు సామాజికవర్గానికి చెందిన వారిపై చర్యలు తీసుకోవడం లేదని సోషల్ మీడియాలో నెటిజన్లు ఏకి పారేస్తున్నారు. టీటీడీ చరిత్రలో కనీవిని ఎరుగని విషాదానికి బాధ్యత వహించి టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు రాజీనామా చేయాలి. ఆయన సమ్మతించకపోయినా ప్రభుత్వమే ఆయనతో రాజీనామా చేయించాలి. కానీ ఆయన్ను చంద్రబాబు పల్లెత్తు మాట అనలేదు. ఎన్నికల్లో టీడీపీకి బాకాగా పని చేసిన టీవీ5 చానల్‌కు బీఆర్ నాయుడు అధినేత కావడం దీనికి ప్రధాన కారణం. ఇక శ్రీవారి ఆలయం దర్శనాలు, సౌకర్యాల కల్పనకు ప్రధాన బాధ్యత వహించాల్సింది తిరుమల అదనపు ఈవో వెంకయ్య చౌదరే! తిరుపతిలో ఏర్పాటు చేసిన కౌంటర్లు కూడా శ్రీవారి ఆలయ దర్శనం టికెట్ల కోసమే. అయినా వెంకయ్య చౌదరిని ప్రభుత్వం కనీసం బదిలీ చేయలేదు. అస్మదీయ అధికారులకు రక్షణవైకుంఠ ఏకాదశి క్యూలైన్లను ప్రత్యక్షంగా పర్యవేక్షించాల్సిన బాధ్యత టీటీడీ విజిలెన్స్ డీఎస్పీ ఎన్టీ రామ్కుమార్దే. అయినా సరే ఆయనపై ప్రభుత్వం ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. టీటీడీ విజిలెన్స్ విభాగంలో ఆయన ప్రధాన రింగ్ మాస్టర్‌గా వ్యవహరిస్తున్నారు. తొక్కిసలాట సంభవించిన ప్రాంతాలు తిరుపతి ఈస్ట్ పోలీస్‌స్టేషన్ పరిధిలోకి వస్తాయి. ఆ ప్రాంత డీఎస్పీ వెంకటనారాయణపై ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. ఇదే అదనుగా సహకరించని అధికారులపై వేటుతిరుపతిలో తొక్కిసలాట ఘటనకు సంబంధించి బాధ్యులైన అనుకూల అధికారులను కాపాడుతున్న సీఎం చంద్రబాబు మరోవైపు నిబంధనల ప్రకారం నడుచుకుంటూ తమకు సహకరించని అధికారులకు పొగబెడుతున్నారు. ఇదే అదనుగా గతంలో అక్రమ కేసుల నమోదుకు తమకు సహకరించని వారిపై కక్ష సాధింపు చర్యలకు దిగారు. టీటీడీ విజిలెన్స్ ప్రధాన అధికారి (సీవీఎస్ఓ) శ్రీధర్‌ను ప్రభుత్వం బదిలీ చేయడం గమనార్హం. వైఎస్సార్సీపీ హయాంలో టీటీడీ చైర్మన్లుగా వ్యవహరించిన వైవీ సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్‌రెడ్డిపై అక్రమ కేసులు నమోదు చేయాలంటూ శ్రీధర్‌పై కూటమి ప్రభుత్వం తీవ్ర ఒత్తిడి తెస్తోంది. అయితే ఎలాంటి ప్రాథమిక ఆధారాలు లేకుండా కేసుల నమోదుకు ఆయన తిరస్కరించడంతో తిరుపతి దుర్ఘటనను అడ్డం పెట్టుకుని ప్రభుత్వం శ్రీధర్‌ను బదిలీ చేసింది. మరోవైపు తిరుమల శ్రీవారి ఆలయ దర్శనాలతో ఏమాత్రం సంబంధంలేని తిరుపతి జేఈవో గౌతమిని ప్రభుత్వం బదిలీ చేసింది. అదే రీతిలో డీఎస్పీ రమణకుమార్, క్యూలైన్ల నిర్వహణతో సంబంధం లేని టీటీడీ గోశాల డైరెక్టర్ హర్‌నాథ్‌రెడ్డిని సస్పెండ్ చేసింది.బీఆర్ నాయుడు, వెంకయ్య చౌదరిపై మంత్రుల ఫిర్యాదు.. వారించిన బాబుమంత్రులు అనగాని సత్య ప్రసాద్, ఆనం రాంనారాయణరెడ్డి గురువారం సీఎం చంద్రబాబు తిరుపతిలో నిర్వహించిన సమీక్షా సమావేశంలోనే టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, అదనపు ఈవో వెంకయ్య చౌదరి తీరుపై ఫిర్యాదు చేశారు. సీఎం చంద్రబాబు ఆ విషయాలు తరువాత మాట్లాడదామంటూ దాటవేశారు. బీఆర్ నాయుడు, వెంకయ్య చౌదరి ఎన్ని తప్పులు చేసినా పట్టించుకోబోనని సంకేతాలిచ్చారు. ఈవో బదిలీకి రంగం సిద్ధం..టీటీడీ ఈవో శ్యామలరావును బదిలీ చేయాలని ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించింది. అయితే వెంటనే బదిలీ చేస్తే ఆయనతోపాటు తిరుమల అదనపు ఈవో వెంకయ్య చౌదరిని కూడా బదిలీ చేయాల్సి ఉంటుంది. అందుకే కొద్ది రోజుల తరువాత శ్యామలరావుని బదిలీ చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈవోకు అవమానం...!టీటీడీ ఈవో శ్యామలరావును సాగనంపేందుకు సిద్ధమైన టీడీపీ కూటమి ప్రభుత్వం ఆయనకు పొగబెడుతోంది. తాజాగా సీఎం చంద్రబాబు తిరుపతిలో నిర్వహించిన సమావేశంలో టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు ఈవోను అందరి ఎదుట ఏక వచనంతో సంబోదిస్తూ తీవ్రంగా అవమానించారు. ఇక వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమల ఆలయానికి వచ్చిన ఈవో శ్యామలరావును చైర్మన్ బీఆర్ నాయుడు, అదనపు ఈవో వెంకయ్య చౌదరి ఉద్దేశపూర్వకంగానే అగౌరవపరిచేలా వ్యవహరించడం గమనార్హం. ఆలయంలో ఆయనతో ఎవరూ మాట్లాడకుండా, కనీస గౌరవం ఇవ్వకుండా మానసికంగా వేధిస్తున్నట్లు సమాచారం. సీఎం చంద్రబాబు దన్నుతోనే ఆయన సామాజికవర్గానికి చెందిన టీటీడీ చైర్మన్, అదనపు ఈవో ఇలా వ్యవహరిస్తున్నట్లు టీటీడీ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. -
మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలవాలి: ఉషశ్రీచరణ్
-
ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే తొక్కిసలాట జరిగింది
-
తిరుపతి తొక్కిసలాట విషాదం.. పద్మావతి హాస్పిటల్ వద్ద దృశ్యాలు