
భక్తుడి వద్ద దొరికిన తాబేలు
తిరుమల: తరుమల కొండపైకి వెళ్లే భక్తులను తనిఖీలు చేయడమనేది సర్వసాధారణం. ఇలా ఒక భక్తుడ్ని తనిఖీ చేస్తే అతని బ్యాగులో తాబేలు కనిపించింది. ఇది అక్కడ తనిఖీ చేసే సిబ్బందికి కూడా కొత్తగానే అనిపించింది. తాబేలు ఏంటి.. బ్యాగులో ఎందుకు తీసుకెళుతున్నావ్ అని సదరు భక్తుడిని అడిగితే దిమ్మ తిరిగే సమాధానం వచ్చింది. తనకు దారిలో దొరికిందని, బ్యాగులో వేసుకున్నానని బదులిచ్చాడు. ఏమైనా విలువైన వస్తువులు దొరికితే దాన్ని దాచుకుంటారు.
మరి మనోడు తాబేలను బ్యాగులో వేసుకున్నానంటూ చెప్పిన సమాధానంతో అక్కడ సిబ్బందికి ఏమీ అర్థం కాలేదు. సర్లే అనుకుని దాన్ని స్వాధీనం చేసుకున్నారు టీటీడీ విజిలెన్స్ సిబ్బంది. ఆ తాబేలును ఫారెస్ట్ అధికారులకు అప్పగిస్తామని స్పష్టం చేశారు. అసలు తాబేలు కనిపిస్తే బ్యాగులో వేసుకున్నానంటూ అతను చెప్పిన సమాధానం చూస్తే నవ్వొస్తుంది కదూ.. ఇది అలిపిరి తనిఖీ కేంద్రం వద్ద చోటు చేసుకున్న ఘటన. తనిఖీలు చేస్తున్న క్రమంలో తాబేలు వ్యవహారం వెలుగుచూసింది.
తాబేళును స్వాధీనం చేసుకున్న విజిలెన్స్ అధికారులు