turtle
-
World Turtle Day: నారి.. తాబేలు మేలు కోరి!
తాబేలు నడకల గురించి తక్కువ చేసి నవ్వుకునే కాలం కాదు ఇది. ప్రమాదం అంచున ఉన్న తాబేలు జాతి గురించి సీరియస్‌గా మాట్లాడుకోవాల్సిన సమయం ఇది. చెన్నైకి చెందిన సుప్రజ నుంచి లక్నోకు చెందిన అరుణిమ సింగ్ వరకు ఎంతోమంది నారీమణులు తాబేళ్ల సంరక్షణకు విశేష కృషి చేస్తున్నారు..చుట్టుపక్కల చూడరా...ముంబైకి చెందిన మోడల్ సౌందర్య గార్గ్ సెంట్రల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫిషరీస్ ఎడ్యుకేషన్ కార్యాలయానికి సమీపంలోని చెత్తకుప్పలో ఒక ప్లాస్టిక్ బ్యాగ్ కదలడం చూసి ఆ బ్యాగును ఓపెన్ చేసింది. అందులో చావు బతుకుల మధ్య ఊగిసలాడుతున్న ఒక పెద్ద తాబేలు కనిపించింది. వెంటనే ల్యాబ్ అండ్ యానిమల్ వెల్ఫేర్ సొసైటీ హెల్ప్ లైన్‌కు ఫోన్ చేసింది. అక్కడి నుంచి వచ్చిన వాలంటీర్ సూచనలతో తాబేలును ఇంటికి తీసుకెళ్లి నీటిలో పెట్టింది. ఆ తరువాత ఆ తాబేలునుపాస్–రెస్క్యూ టీమ్‌కు అప్పగించింది.‘నేను–నా పని అని మాత్రమే... అని కాకుండా చుట్టుపక్కల కూడా తొంగి చూడాలి. ఇంటికి వెళ్లడానికి ఆలస్యం అవుతుందని ఆరోజు సౌందర్య అనుకొని ఉంటే, తాబేలే కదా వదిలేద్దాం అనే నిర్లక్ష్యంలో ఉండి ఉంటే ఒక జీవి బతికేది కాదు’ అంటుంది యానిమల్ వెల్ఫేర్ ఆఫీసర్ నిషా సుబ్రమణ్యియన్. దిల్లీలో మార్నింగ్ వాక్కు వెళుతున్న ఒక మహిళ రోడ్డుపై తాబేలును గమనించి రక్షించింది. దీని తాలూకు వీడియో వైరల్ కావడమే కాదు నీటిలో ఉండాల్సిన తాబేళ్లు రోడ్డు మీదికి ఎందుకు వస్తున్నాయి? వాటిని రక్షించడానికి ఏంచేయాలి?’ అనే విషయం మీద సోషల్ మీడియాలో చర్చ కూడా జరిగింది.ఆ విషాదంలో నుంచే..కొన్ని సంవత్సరాల క్రితం ప్రపంచ ప్రఖ్యాత పర్యావరణవేత్త డా.జేన్ గుడాల్పై వచ్చిన నేషనల్ జియోగ్రాఫిక్ డాక్యుమెంటరీని చూసింది చెన్నైకి చెందిన సుప్రజ ధరణి. ‘ప్రతి ఒక్కరు తమవంతుగా కృషి చేస్తే పర్యావరణానికి మేలు జరుగుతుంది’ అనే మాట ఆమెకు బాగా నచ్చడమే కాదు ‘నా వంతుగా ఏం చేయగలను’ అని ఆలోచించింది.సుప్రజఒకరోజు పెరియ నీలంకరై బీచ్‌లో మార్నింగ్ వాక్ చేస్తున్న సుప్రజ ఒడ్డున కనిపిస్తున్న తాబేలు దగ్గరికి వెళ్లింది. అది చని΄ోయి ఉంది. దాని శరీరంపై పదునైన తీగలతో కోతలు కోశారు. ఈ దృశ్యం తనని చాలా బాధ పెట్టింది. ఒక రకంగా చె΄్పాలంటే కొన్ని రోజుల వరకు ఆ బాధ తనని వెంటాడింది.ఈ నేపథ్యంలోనే తాబేళ్ల సంరక్షణకు నడుం బిగించింది. పుస్తకాలు చదవడం, మత్స్యకారులతో మాట్లాడం ద్వారా తాబేళ్ల గురించి ఎన్నో విషయాలు తెలుసుకుంది. ఆ తరువాత ట్రీ ఫౌండేషన్ (ట్రస్ట్ ఫర్ ఎన్విరాన్మెంట్, ఎడ్యుకేషన్, కన్జర్వేషన్ అండ్ కమ్యూనిటీ డెవలప్మెంట్)కు శ్రీకారం చుట్టింది. తాబేళ్ల సంరక్షణ విషయంలో చేసిన కృషికి గుర్తింపుగా డిస్నీ వరల్డ్ వైడ్ కన్జర్వేషన్ అవార్డ్, సీ వరల్డ్‌లాంటి ఎన్నో అవార్డ్లు అందుకుంది సుప్రజ.విజ్జీ–ది టర్టిల్ గర్ల్..భారతదేశ మొట్టమొదటి మహిళా హెర్పెటాలజిస్ట్, టర్టిల్ ఫీల్డ్ బయోలజిస్ట్గా గుర్తింపు పొందింది జె.విజయ. చిన్న వయసులోనే చని΄ోయింది. అయితే ఆమె తన జీవితంలో ఎక్కువ భాగం తాబేళ్ల సంరక్షణ కోసం కృషి చేసింది. మద్రాస్ క్రొకడైల్ బ్యాంక్ పక్కన ఉన్న టర్టిల్పాండ్ దగ్గర ఆమె స్మారక చిహ్నం ఉంది. మద్రాస్ స్నేక్పార్క్లోకి వాలంటీర్‌గా అడుగుపెట్టింది విజయ.విజయఅప్పుడు ఆమె మద్రాస్‌లోని ఎతిరాజ్ కాలేజీ జువాలజీ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్. స్నేక్పార్క్లో రకరకాల తాబేళ్లను వేరు వేరు వ్యక్తులకు అప్పగించేవారు. అలా విజ్జీకి మంచినీటి తాబేళ్లను అప్పగించారు. అక్కడితో మొదలైన తాబేళ్లతో చెలిమి ఎంతో దూరం వెళ్లింది. ఉత్తర్‌ప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్ నుంచి పశ్చిమ బెంగాల్‌లోని కోల్కత్తా వరకు తాబేళ్లకు ఎదురవుతున్న ముప్పు, సంరక్షణ గురించి ఎంతో పరిశోధన చేసింది. తాను తెలుసుకున్న వాటిని అక్షరబద్ధం చేసింది.అరుణోదయం..ఉత్తర్‌ప్రదేశ్‌లోని లక్నోకు చెందిన అరుణిమ సింగ్ వేలాది తాబేళ్లను రక్షించింది. తాబేళ్ల జీవితం, వాటిప్రాధాన్యత, సంరక్షణ గురించి ఎన్నో విద్యాలయాల్లో విద్యార్థుల కోసం అవగాహన సదస్సులు నిర్వహించింది. తాబేళ్ల సంరక్షకురాలిగా దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన అరుణిమ సింగ్ తన బాటలో ఎంతోమందిని నడిపిస్తోంది.గ్రీన్ టర్టిల్స్.. మీరు పచ్చగా బతకాలిఆకుపచ్చ తాబేళ్లు (చెలోనియా మైడాస్) ప్రమాదం అంచున అంతరించి΄ోయే జాతుల జాబితాలో ఉన్నాయి. లక్షద్వీప్ దీవుల్లో ఆకుపచ్చ తాబేళ్లపై గతంలో జరిగిన పరిశోధనలను పీహెచ్డీ స్టూడెంట్ నుపుల్ కాలే మరింత ముందుకు తీసుకువెళుతోంది. సముద్రపు గడ్డి మైదానాలు తగ్గడంలాంటివి గ్రీన్ టర్టిల్స్పై ఎలాంటి ప్రభావాన్ని చూపుతుంది అనేది తన పరిశోధనలో తెలుసుకుంది.నుపుల్ కాలే‘సముద్ర తాబేళ్ల గురించి అధ్యయనం చేయడానికి ఎన్నో సవాళ్లు ఎదురవుతున్నాయి’ అంటుంది కాలే. యూనివర్శిటీలో ఒకరోజు ‘గ్రీన్ టర్టిల్స్ గురించి పనిచేయడంపై ఆసక్తి ఉందా?’ అని అడిగారు లెక్చరర్. ‘ఉంది’ అని చెప్పింది. ఆ తరువాత గ్రీన్ టర్టిల్స్కు సంబంధించి శ్రీలంకలో ఫీల్డ్‌వర్క్ చేసింది.‘గూడు కట్టుకోవడానికి ఒక గ్రీన్ టర్టిల్ బీర్‌లోకి వచ్చిన దృశ్యం తొలిసారిగా చూశాను. ఆ దృశ్యం చెక్కుచెదరకుండా ఇప్పటికీ నా మదిలో నిలిచిపోయింది’ అంటుంది కాలే.ఇవి చదవండి: ఈ నడక ఎంతో ఆరోగ్యం అంటున్నారు.. నిపుణులు! -
తాబేలు మాసం తిని తొమ్మిదిమంది మృతి.. 78 మందికి అనారోగ్యం!
ఆఫ్రికన్ దేశం టాంజానియాకు సమీపంలోని జాంజిబార్ దీవులలో తాబేలు మాంసం తిన్న తొమ్మదిమంది మృతి చెందారు. వీరిలో ఎనిమిదిమంది పిల్లలతో పాటు ఒక మహిళ కూడా ఉన్నారు. ఈ ఘటనలో 78 మంది అనారోగ్యం పాలయ్యారు. వీరందరినీ స్థానిక అధికారులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. హానికరమని తెలిసినా సముద్ర తాబేలు మాంసాన్ని జాంజిబార్‌వాసులు ఎంతో ఇష్టంగా తింటారు. ఒక్కోసారి ఈ మాంసం కారణంగా పలువురు ప్రాణాలు కోల్పోతుంటారు. తాజాగా జరిగిన ఘటన గురించి మకోని జిల్లా వైద్యాధికారి డాక్టర్ హాజీ బక్రీ మాట్లాడుతూ విషపూరితమైన ఆహారం తిన్నకారణంగా ఒక మహిళతో పాటు ఎనిమిదిమంది చిన్నారులు మృతి చెందారని తెలిపారు. మరో 78 మంది అనారోగ్యంపాలై చికిత్స పొందుతున్నారన్నారు. వీరంతా సముద్ర తాబేలు మాసం తిన్నారని లేబొరేటరీ పరీక్షల్లో నిర్ధారితమయ్యిందని తెలిపారు. ఈ ఘటన దదిమిలా ఉన్నతాధికారులు విపత్తు నిర్వహణ బృందాన్ని ఘటన జరిగిన ప్రాంతానికి పంపారు. ప్రభుత్వం సముద్ర తాబేలు మాంసాన్ని తినవద్దని అక్కడి ప్రజలను కోరింది. కాగా 2021 నవంబర్‌లో పెంబాలో తాబేలు మాంసం తిని మూడేళ్ల చిన్నారితో సహా ఏడుగురు మృతి చెందారు. ఆ సమయంలో మరో ముగ్గురు అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చికిత్స పొందారు. -
ఆలివ్ రిడ్లే.. సముద్రంలోకి వెడలె
సాక్షి, అమరావతి: ఆలివ్ రిడ్లే తాబేళ్ల సంరక్షణ చర్యల్లో భాగంగా ట్రీ ఫౌండేషన్, రాష్ట్ర అటవీ శాఖ రాష్ట్రంలోని సముద్ర తీరప్రాంతం వెంబడి ఈ ఏడాదిలో ఇప్పటివరకు 3,036 తాబేళ్ల గూళ్లను రక్షించాయి. ఆ గూళ్లలో 3.41 లక్షల గుడ్లను కాపాడగా.. వాటినుంచి 2.39 లక్షల తాబేళ్ల పిల్లలు పుట్టుకొచ్చాయి. వాటన్నిటినీ సముద్రంలోకి వదిలారు. శ్రీకాకుళం, విజయ నగరం, కృష్ణా, బాపట్ల, ఒంగోలు, నెల్లూరు, తిరుపతి, సూళ్లూరుపేట జిల్లాల్లోని తీర ప్రాంతాల్లో ఆలివ్ రిడ్లే తాబేళ్ల సంరక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ నెల 23న అంతర్జాతీయ తాబేళ్ల దినోత్సవం సందర్భంగా అటవీ శాఖ ఈ వివరాలను విడుదల చేసింది. ట్రీ ఫౌండేషన్ అటవీ శాఖతో కలిసి గత 16 సంవత్సరాలుగా సముద్ర తాబేళ్ల రక్షణ, సముద్ర జీవ సంరక్షణలో పాలుపంచుకుంటోంది. ఈ 16 సంవత్సరాల్లో ఇప్పటివరకు 33.68 లక్షలకు పైగా సముద్ర తాబేలు పిల్లలను సముద్రంలో వదిలారు. వేల కిలోమీటర్లు ప్రయాణించి.. ఆగ్నేయ సముద్ర తీర ప్రాంతంలోని ఒడిశా, ఆంధ్రా ప్రాంతాలు ఆలివ్ రిడ్లే జాతి తాబేళ్లు గుడ్లు పెట్టడానికి అనువైనవి. ఏటా ఈ తీరాల్లో గుడ్లు పెట్టేందుకు వేల తాబేళ్లు సముద్రంలో వేల కిలోమీటర్లు ప్రయాణించి ఈ తీరానికి వచ్చి గుడ్లు పెడతాయి. తీరంలో గుడ్లు పెట్టిన తాబేళ్లు వెళ్లిపోయాక.. ఆ గూళ్లు ప్రమాదంలో పడుతున్నాయి. అందుకే చాలా సంవత్సరాలుగా ట్రీ ఫౌండేషన్ వంటి సంస్థలు అటవీ శాఖతో కలిసి వాటి సంరక్షణకు నడుం బిగించాయి. వెయ్యి తాబేళ్లలో ఒకటే.. ప్రతి ఆడ తాబేలు ఒక సీజన్లో (డిసెంబర్ నుంచి మార్చి) రెండుసార్లు గుడ్లు పెట్టడానికి సముద్రం నుంచి తీర ప్రాంతానికి వస్తుంది. గుడ్డు నుంచి పిల్ల బయటకు రావడానికి 48 నుంచి 60 రోజులు పడుతుంది. ఉష్ణోగ్రత 25 నుంచి 30 డిగ్రీలుంటే.. మగ పిల్లలు, 30 నుంచి 35 డిగ్రీలుంటే ఆడ పిల్లలు జన్మిస్తాయి. గుడ్డు నుంచి బయటకు వచ్చిన పిల్ల తాబేళ్లు నక్షత్రాలు, చంద్రుడి వెలుతురు ఆధారంగా సముద్రంలోకి చేరుకుంటాయి. పిల్ల తాబేళ్లకు బొడ్డు దగ్గర యోక్ సాక్ (పచ్చసొనలా) ఉంటుంది. దీని ద్వారానే పిల్ల తాబేళ్లకు 48 గంటల వరకు పోషకాహారం అందుతుంది. అందుకే గుడ్డు నుంచి బయటకు వచ్చిన పిల్ల తాబేళ్లను వెంటనే సముద్రం తీరంలో విడిచిపెట్టాలి. ఈ పనిని చాలాకాలంగా మేం చేస్తున్నాం. పుట్టిన తాబేళ్లకు వాటి మెదడు కణాల చూట్టూ మేగ్నటైట్ సెల్స్ ఉంటాయి. ఇవి వాటికి జీపీఎస్‌లా ఉపయోగపడతాయి. అందుకే ఆడ తాబేళ్లు 12 నుంచి 15 సంవత్సరాలకు అవి పుట్టిన తీరానికి గుడ్లు పెట్టడానికి వస్తాయి. వెయ్యి తాబేలు పిల్లలు సముద్రంలోకి వెళితే గుడ్లు పెట్టే సమయానికి ఒకే ఒక తాబేలు మాత్రమే మిగులుతుంది. మిగిలిన 999 పిల్లలు పెద్ద చేపలకు ఆహారమైపోతాయి. – డాక్టర్ సుప్రజ ధారిని, ఛైర్పర్సన్, ట్రీ ఫౌండేషన్ -
ఆపరేషన్ చేసి.. తాబేలుకు ప్రాణం పోశారు
అనకాపల్లి: కుక్కల దాడిలో తీవ్రంగా గాయపడ్డ తాబేలుకు ఆపరేషన్ చేసి ఓ వైద్యాధికారి జీవం పోశారు. స్థానిక యువకులు సకాలంలో స్పందించడంతో ఒక మూగ జీవి ప్రాణం నిలబడింది. వివరాలు.. వడ్డాది పెద్దేరు నదిలో తాబేళ్లు సంచరిస్తూ ఉంటాయి. శనివారం తాబేలు ఒకటి గుడ్లు పెట్టడానికి ఒడ్డుకు వచ్చింది. అక్కడే ఉన్న వీధి కుక్కలు దానిపై దాడి చేశాయి. తీవ్రంగా గాయపడ్డ తాబేలు పేగులు బయటకు వచ్చేయడంతో విలవిల్లాడింది. ఈ విషయం గమనించిన స్ధానిక యువకులు దగ్గర్లోనే ఉన్న ప్రభుత్వ పశువైద్యాధికారి శివకుమార్‌కు ఈ విషయం తెలిపారు. వెంటనే స్పందించిన వైద్యుడు తాబేలును ఆస్పత్రికి తీసుకొచ్చి వైద్య సేవలు అందించారు. ఆధునిక పద్ధతిలో శస్త్రచికిత్స నిర్వహించి ప్రాణాలు కాపాడారు. తీవ్ర గాయాలైన మూగజీవికి ఆపరేషన్ చేసి ఆదుకున్నందుకు వైద్యు డు శివకుమార్‌ను స్థానికులు అభినందించారు. -
అవును...ఇది నిజమే!
♦ అన్‌ఫ్రెండ్’ అనే మాట ఫేస్‌బుక్‌కు ముందు ఉందా? అనే ప్రశ్నకు చాలామంది చెప్పే జవాబు ‘లేదు’ అని. అయితే 13వ శతాబ్దానికి చెందిన కవి లయమన్ కవితలో ఈ పదం కనిపిస్తుంది. అప్పటి ఇంగ్లీష్‌ను అర్థం చేసుకోవడం కొంచెం కష్టమే అయినా అర్ధం కాకుండా మాత్రం పోదు! ♦ ‘హెడ్‌లెస్ చికెన్ మాన్స్టర్’ గురించి ఎప్పుడైనా విన్నారా? నిజానికి దీనికీ చికెన్‌కు ఎలాంటి సంబంధం లేదు. ‘హెడ్‌లెస్ చికెన్ మాన్స్టర్’ అనేది ఒక రకమైన సముద్రపు దోసకాయ. సదరన్ ఒషియన్కు సమీపంలో దీన్ని కనుగొన్నారు. ♦ ‘టర్టిల్ అనగా ఏమిటి?’ ప్రశ్నకు అందరి నుంచి వినిపించే జవాబు...తాబేలు. స్కాట్లాండ్లో మాత్రం దీనికి వేరే అర్ధం ఉంది. ఎవరి పేరు అయినా ఎంతకూ గుర్తుకు రాని సందర్భంలో, అసహనానికి, తట్టుకోలేని కో పానికి గురయ్యే సమయంలో ఉపయోగించే మాట ఇది. -
కూర మాడిందని భార్యను చంపేసి.. గుట్టుచప్పుడు కాకుండా..!
భువనేశ్వర్: కూర మాడిపోయిందనే కోపంతో ఓ వ్యక్తి భార్యను దారుణంగా కొట్టి చంపేశాడు. గుట్టుచప్పుడు కాకుండా ఇంటి వెనకాల పూడ్చిపెట్టాడు. ఆపై తన భార్య నెల రోజులుగా కనిపించటం లేదని బుకాయించే ప్రయత్నం చేశాడు. పోలీసులు తమదైన శైలీలో విచారించగా.. అసలు విషయం బయటపెట్టాడు. ఒడిశాలోని సంబల్పూర్ జిల్లాలో జరిగిన ఈ దారుణ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. 35 ఏళ్ల బాధితురాలి మృతదేహాన్ని బయటకు తీసి పోస్ట్‌మార్టం నిర్వహించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నెల రోజుల క్రితం బద్మాల్ పంచాయతీలోని రౌత్‌పారా గ్రామానికి చెందిన రంజన్ బడింగ్(36) అనే వ్యక్తి అక్రమంగా వేటాడి తాబేలును ఇంటికి తీసుకొచ్చాడు. తన భార్య సావిత్రిని కూర చేయమని చెప్పాడు. అయితే, వంట చేస్తుండగా అది కాస్త మాడిపోయింది. దీంతో తాగిన మత్తులో ఉన్న నిందితుడు భార్యతో గొడవకు దిగాడు. తీవ్రంగా కొట్టటంతో ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. ఆమెను అలాగే వదిలేసి ఇంట్లోంచి వెళ్లిపోయాడు. రాత్రి తిరిగి వచ్చే సరికి ఆమె ప్రాణాలు కోల్పోయింది. దీంతో గుట్టుచప్పుడు కాకుండా మృతదేహాన్ని ఇంటి వెనకాల ఖాళీ స్థలంలో పూడ్చిపెట్టాడు. తనపై కోపంతో ఇంట్లోంచి వెళ్లిపోయిందని అందరి నమ్మించే ప్రయత్నం చేశాడు. బాధితురాలి తల్లి పోలీసులను ఆశ్రయించగా విషయం వెలుగులోకి వచ్చింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు గ్రామానికి వెళ్లారు. వారిని చూసిన నిందితుడు పరారయ్యేందుకు ప్రయత్నించాడు. పోలీసులు, గ్రామస్థులు కలిసి పట్టుకోవటంతో చేసిన నేరాన్ని అంగీకరించాడు. నిందితుడిని అరెస్ట్ చేసి మృతదేహాన్ని పోస్ట్‌మార్టానికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. ఇదీ చదవండి: స్నేహితుడిని బెదిరించి.. సాఫ్ట్వేర్ ఇంజినీర్‌పై 10 మంది గ్యాంగ్ రేప్ -
Viral Video: ఏయ్ బిడ్డా.. ఇది నా అడ్డా!
దాహమేసి దప్పిక తీర్చుకోవడానికి ఓ కొలను దగ్గరికి వెళ్లింది ఓ సింహం. అయితే.. అప్పటికే నీళ్లలో ఉన్న తాబేలు.. దానిని తాగనీయకుండా పదే పదే అడ్డుకుంది. ఒక దగ్గరి నుంచి మరో చోటికి వెళ్లిన కూడా సింహాన్ని సతాయిస్తూ ఇబ్బంది పెట్టింది. ఎవడైతే నాకేంటి అనుకుందో ఏమో.. తన అడ్డాకి వచ్చిన సింహాన్ని అలా ఇబ్బంది పెట్టింది ఆ తాబేలు. సింహం కూడా ఆ చిట్టితాబేలును ఏం చేయకుండానే పక్కకు వెళ్లి నీళ్లు తాగే ప్రయత్నం చేసింది. ఈ వీడియో కొత్తదా? పాతదా?.. ఎక్కడ, ఎప్పుడు, ఎవరు తీశారో తెలియదుగానీ.. మిగతా జంతువుల్ని భయపెట్టే సింహానికి చుక్కలు చూపించిందంటూ కామెంట్లు చేస్తున్నారు కొందరు. View this post on Instagram A post shared by Finest of World (@finestofworld) ఇదిలా ఉండగా.. కొంత కాలం కిందట వైకల్యం ఉన్న ఓ శునకం.. సుఖంగా నిద్రిస్తున్న రెండు సింహాలపైకి మొరుగుతున్న ఎగబడ్డ వీడియో ఒకటి వైరల్ అయిన సంగతి గుర్తుండే ఉంటుంది. ప్రస్తుతం పైన తాబేలు వీడియో ట్రెండ్ అవుతున్న క్రమంలో.. ఈ పాత వీడియో సైతం మళ్లీ ట్రెండింగ్‌లోకి రావడం విశేషం. -
పర్యావరణ నేస్తాలు ఆలివ్ రిడ్లేలు
విజయనగరం పూల్‌బాగ్: ఆలివ్‌రిడ్లేలుగా పిలిచే సముద్ర తాబేళ్లకు పర్యావరణ నేస్తాలుగా పేరుంది. తీరప్రాంతంలో పరిశ్రమలు అధికం కావడం, సముద్రంలో పెద్దబోట్లు తిరుగుతుండడంతో వీటి మనుగడ కష్టంగా మారింది. అలాంటి సమయంలో అటవీశాఖ వన్యప్రాణి విభాగం అధికారులు తాబేళ్ల సంరక్షణకు శ్రీకారం చుట్టి తీరం వెంబడి పునరుత్పత్తి కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఆరేళ్ల కాలంలో 1,52,232 గుడ్లను సేకరించారు. 1,22,658 తాబేలు పిల్లలను సముద్రంలోకి వదిలారు. జిల్లాలోని భోగాపురం, పూసపాటిరేగ మండలాల్లోని 28 కిలోమీటర్ల మేర సముద్రతీరంలో 2014వ సంవత్సరంలో విజయనగరం అటవీశాఖ వన్యప్రాణి విభాగం 10 ఆలివ్‌రిడ్లే పునరుత్పత్తి కేంద్రాలు ఏర్పాటు చేసింది. పెంపకం ఎలా చేపడతారంటే? ప్రతి సంవత్సరం జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలల్లో సముద్రంలోని ఆడ తాబేలు తీరానికి చేరుకుని గుడ్లు పెడుతుంది. వాటిని నక్కలు, అడవి పందులు ధ్వంసం చేయకుండా అటవీశాఖ సిబ్బంది చర్యలు తీసుకుంటున్నారు. తాబేళ్ల పునరుత్పత్తికి ఏ ప్రాంతం అనుకూలమో ముందుగా గుర్తిస్తారు. ఆప్రాంతంలో మిని హ్యాచరీలు ఏర్పాటు చేసి అందులో రెండు నుంచి మూడు అడుగుల సైజు గుంతలు తవ్వి గుడ్లు ఉంచుతారు. గుంతల్లో ఉంచిన గుడ్లనుంచి పిల్లలు బయటకు వచ్చేందుకు 45 నుంచి 60 రోజుల సమయం పడుతుంది. డిసెంబర్ నుంచి జూన్ వరకు ఉత్పత్తికేంద్రాల ద్వారా తాబేళ్లను అభివృద్ధి చేస్తారు. ఈ ప్రక్రియకు ట్రీ ఫౌండేషన్ అనే స్వచ్ఛంద సంస్థ సహకరిస్తోంది. ఈ సంవత్సరం జనవరి, ఫిబ్రవరి నెలల్లో పెట్టిన గుడ్లును సురక్షిత ప్రాంతాల్లో ఉంచి 25మంది కాపలాదారులను నియమించారు. చంపినా, తిన్నా నేరమే తాబేళ్లను వేటాడి చంపినా, వాటి గుడ్లను తిన్నా వన్యప్రాణి సంరక్షణ చట్టం 1972 కింద నేరంగా పరిగణిస్తారు. ఈ నేరానికి మూడు సంవత్సరాల నుంచి ఏడు సంవత్సరాల వరకు జైలు శిక్ష, జరిమానా విధిస్తారు. ఇవి గుడ్లు పెట్టే సమయంలో తీరం వెంబడి 500 మీటర్ల పరిధిలో పర్యావరణానికి హాని కలిగించే పనులు చేపట్టకూడదు. పర్యావరణ పరిరక్షణకు ఏం చేస్తాయంటే? తాబేళ్లు సముద్రంలోని పాచి, మొక్కలు, వివిధ రకాల వ్యర్థ పదార్థాలను తింటూ జలాలు కలుషితం కాకుండా చేస్తాయి. దీంతో తీరప్రాంతాల్లో నివశించే ప్రజలకు సముద్రపు గాలి సోకడం వల్ల అంటు వ్యాధులు రావని అధికారులు చెబుతున్నారు.సముద్రంలో ఆక్సిజన్ పెంచేందుకు ఇవి ఎంతగానో దోహదపడతాయి. అడ్డదిడ్డంగా ఉండే సీ గ్రాస్‌ను తాబేళ్లు తినడంతో సీ గ్రాస్ బెడ్ ఏర్పడుతుంది. దీంతో సముద్రంలో ఉన్న జీవరాశులు బెడ్‌పై గుడ్లు పెట్టి సంతాన ఉత్పత్తి చేస్తాయి. ఈ మేరకు మత్స్య సంపద పెరుగుతుంది. ఇదీ ప్రత్యేకత ఆలివ్‌రిడ్లే సుమారు 45 కిలోల బరువు, మూడడుగుల పొడవు, ఒకటిన్నర అడుగు వెడల్పు ఉంటుంది. పుట్టిన పిల్ల మూడు సెంటీమీటర్ల పొడవు, అరంగుళం వెడల్పు ఉంటుంది. ఆడ తాబేలు ఒడ్డుకు వచ్చి 60 నుంచి 150 వరకు గుడ్లు పెడుతుంది. మగ తాబేలు 25–30 డిగ్రీల ఉష్ణోగ్రత, ఆడ తాబేలు 30–32 డిగ్రీల ఉష్ణోగ్రత ఉంటేనే బయటకు వస్తాయి. ఆడ తాబేళ్లు పిల్లలుగా ఉన్నప్పుడు ఏ తీరం నుంచి సముద్రంలోకి వెళ్తాయో పెద్దయ్యాక అదే తీరానికి వచ్చి గుడ్లు పెడతాయి. తాబేలు 300 నుంచి 400 సంవత్సరాల వరకు జీవిస్తుంది. ఉన్నతాధికారుల ఆదేశాలతో చర్యలు ఉన్నతాధికారుల ఆదేశాలతో ఆలివ్‌రిడ్లేలను సంరక్షించే బాధ్యతను తీసుకున్నాం. తాబేళ్ల వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి. భోగాపురం, పూసపాటిరేగ మండలంలోని సముద్ర తీర ప్రాంతంలో 1,69,509 గుడ్లను సేకరించి పునరుత్పత్తి కేంద్రాల ద్వారా 1,38,738 పిల్లలను ఉత్పత్తిచేసి సముద్రంలో విడిచిపెట్టాం. కాంపా బయోడైవర్సిటీ స్కీం ద్వారా వచ్చిన నిధులతో ఈ కార్యక్రమాలు చేపడుతున్నాం. – ఎస్ వెంకటేష్, జిల్లా అటవీఅధికారి, విజయనగరం -
స్నేహానికి అసలైన అర్థం... ఆనంద్ మహీంద్రా మెచ్చిన వీడియో!
Anand Mahindra talks about friendship: సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే ఆనంద్ మహింద్రా ఒక వైరల్ వీడియోని ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ఈ వీడియో స్నేహం విలువ, స్నేహితుడి అంటే ఎలా ఉండాలో చెబుతుందని అన్నారు. స్నేహం గురించి పెద్ద ఉపన్యాసమే ఇచ్చారు. అసలు ఇంతకీ ఆ వీడియోలో ఏముంది అనే కదా!. వివరాల్లోకెళ్తే... ఆ వీడియోలో రెండు తాబేళ్లు ఉన్నాయి. అందులో ఒక తాబేలు వెనక్కి తిరగబడి ఇబ్బందిపడుతోంది. దీంతో ముందు వెళ్తున్న తాబేలు తనతో పాటు మరో తాబేలు రావడం గమనించింది. దీంతో ఆ తాబేలు ఆగి మరీ వెనక్కి వచ్చి అవస్థలు పడుతున్న ఆ తాబేలుకు సాయం చేస్తుంది. దీంతో ఆ తాబేలు హమ్మయ్య అనుకుంటూ చకచక వెళ్లిపోతుంది. ఈ వీడియో ప్రముఖ వ్యాపార దిగ్గజం ఆనంద్ మహింద్రాని ఆకర్షించింది. ఈ మేరకు ఆయన ఈ వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేయడమే కాకుండా ట్విట్టర్లో... స్నేహానికి అసలైన అర్ధం ఇదే కదా. మనం సమస్యల్లో ఉన్నప్పుడూ మనకు చేయూత నిచ్చి మన కాళ్లపై తిరిగి నిలబడేలా చేసేవాడు నిజమైన స్నేహితుడు. ప్రతిఒక్కరు తమ జీవితంలో మంచి స్నేహితుడి కలిగి ఉండటానికి మించిన గొప్పవరం ఇంకొకటి లేదు." అని అన్నారు. The phrase ‘Turning turtle’ means to be flipped upside down. But after seeing this I think it should mean helping a friend in need. One of the greatest gifts in life is to have a buddy who helps you get back on your feet and Rise. pic.twitter.com/7VpINFzJdm — anand mahindra (@anandmahindra) April 8, 2022 (చదవండి: రిక్షాలో మినీ గార్డెన్...ఫోటోలు వైరల్) -
విశాఖ బీచ్ : బుడి బుడి అడుగుల బుల్లి తాబేళ్లు (ఫొటోలు)
-
తాబేలు.. గుండె గుభేలు
ఏదో బాడీ బిల్డర్ పోటీల్లో తాబేలు తన కండలు చూపిస్తున్నట్టుంది గదా ఫొటో చూస్తుంటే. ఎదురుగా ఉన్నవాళ్లు భయపడిపోయేలా కోపంగా చూస్తోంది కదా. ఇదో గ్రీన్ సీ టర్టల్. గాలపగోస్లో ట్రిప్‌లో ఉండగా ఇటాలియన్ ఫొటోగ్రాఫర్ డానియెలె కొమిన్ దీని ఫొటో తీశారు. ‘సముద్రంలోకి హామర్హెడ్స్ షార్క్‌ల ఫొటోలు తీయడానికని కొమిన్ బయలుదేరా. అది మిట్టమధ్యాహ్నం సమయం. కెమెరా సెట్ చేసుకుని డైవ్ చేశా. ఆ నీళ్లు పచ్చగా ఉన్నాయి. వెలుతురు సరిగా లేదు. సరైన ఫొటోల కోసం కెమెరాను సరి చేయడానికి చాలా సమయం పట్టింది’ అని తన కష్టాన్ని వివరించారు ఫొటోగ్రాఫర్. -
భలే ఉన్నాయ్.. తాబేళ్లు కావు, హోటల్ భవనాలు
ఏరియల్ వ్యూలో తీసిన ఫొటో ఇది. ఇందులో తాబేళ్లు వరుసగా కొలువుదీరినట్లు కనిపిస్తోంది కదూ! ఇవి తాబేళ్లు కావు, హోటల్ భవనాలు. థాయ్‌లాండ్‌లోని హువాహిన్ ప్రాంతంలో ఉన్న ఖావో తావో రిజర్వాయర్‌లో ఇలా తాబేలు ఆకారంలో నీటిలో తేలియాడే హోటల్ భవంతులను నిర్మించారు. (క్లిక్: సగం కొట్టేసిన బిల్డింగ్‌లా కనిపిస్తోందా.. అలా అనుకుంటే పొరపాటే!) పూర్తిగా వెదురుతోను, స్థానికంగా దొరికే ప్రకృతిసిద్ధమైన నిర్మాణ పదార్థాలతో వీటిని నిర్మించారు. ఈ హోటల్ భవంతుల్లో బస చేయడానికి పర్యాటకులు పెద్దసంఖ్యలో ఇక్కడకు చేరుకుంటున్నారు. డెర్సిన్ స్టూడియో కంపెనీకి చెందిన ఆర్కిటెక్ట్ సారావుత్ జాన్సెంగ్ ఆరామ్ ఎంతో శ్రమించి, ఈ కూర్మహర్మ్యాలకు రూపకల్పన చేశారు. (చదవండి: ప్రపంచంలోనే పొడవైన మెట్రో లైన్.. ప్రత్యేకతలు ఇవే!) -
నడి రోడ్డుపై ఈ అమ్మడు చేసిన పనికి నెటిజన్లు ఫిదా
సాక్షి, ముంబై: మానవత్వాన్ని చాటుకునేందుకు ఎక్కడ ఎలా, ఏం చేస్తున్నాం అనేది అవసరం లేదు. ఈ ప్రపంచంలో మనతోపాటు కలిసి జీవిస్తున్నచిన్ని ప్రాణులను కూడా కాపాడుకోవాల్సింది మనుషులుగా మనపై ఉంది. ఇలా రోడ్డుపై వెడుతున్న ఓ మహిళ తాబేలును ఆదుకునేందుకు స్పందించిన తీరు నెటిజనులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఈ ఘటనకు సంబంధించినవీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. అసలే మందగమని అయిన తాబేలు ఎలా ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు గానీ రోడ్డుపై చిక్కుకుంది. అథ్లెట్‌లా చక్కటి ఫిట్నెస్తో కనిపిస్తున్న ఒకమహిళదీన్ని గమనించా తాబేలును రక్షించేందుకు ముందుకొచ్చారు. రెండు వస్త్రాల సాయంతో దాన్ని పట్టుకుని రోడ్డుమీదినుంచి పక్కకు తీసుకెళ్లారు. ప్రస్తుతం ఈ వీడియో ఇంటర్నెట్లో లైక్స్, కమెంట్స్‌తో దూసుకు పోతోంది. హార్ట్ ఎమోజీలతో నెటిజన్లు తాబేలును రక్షించినందుకు మహిళను తెగ మెచ్చుకుంటున్నారు. -
వైరల్: చేప కడుపులో తాబేలు చక్కర్లు!
ఫ్లోరిడా : బ్రతికున్న చేప కడుపులో ప్రాణాలతో ఉన్న తాబేలును గుర్తించారు బయోలజిస్టులు. ఈసంఘటన అమెరికాలోని ఫ్లొరిడాలో ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాల్లోకి వెళితే.. కొద్దిరోజుల క్రితం ఫ్లోరిడాలోని ఫిష్ అండ్ వైల్డ్ లైఫ్ రీసెర్చ్ సెంటర్ బయోలజిస్టులు అక్కడి ఓ చెరువులో లార్జ్మౌత్ బాష్ చేపను పట్టుకున్నారు. అనంతరం దాన్ని ల్యాబ్‌కు తెచ్చి పరిశోధనకు ఉంచారు. దాని లింగాన్ని కనుగొనే నేపథ్యంలో పొట్టలో ఏదో కదులుతున్నట్లు వారు గుర్తించారు. జాగ్రత్తగా చేప నోటిని తెరిచి చూడగా ఓ బ్రతికున్న తాబేలు కనిపించింది. వెంటనే దాన్ని బయటకు తీసి చెరువులో వదిలేశారు. లార్జ్మౌత్ బాష్ చేప కడుపులో బ్రతికున్న తాబేలును గుర్తించటం సాధారణంగా జరగదని వారు తెలిపారు. ప్రస్తుతం ఈ సంఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై స్పందిస్తున్న నెటిజన్లు.. ‘‘ ఆ పెద్ద నోటి చేప గట్టిగా ఉన్న తాబేలు పైచిప్పను ఎలా నమలగలననుకుంది’’.. ‘‘ తాబేలుకు భూమ్మీద నూకలున్నాయి’’.. ‘‘ బ్రతికున్న చేప కడుపులో తాబేలు బ్రతికుండటం.. ఓ అద్భుతం’’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. చదవండి : గడ్డం గీయటానికి రూ. 4 లక్షల గోల్డ్ రేజర్ ఇంటర్వ్యూలలో ఫెయిల్.. బాధతో 9 ప్లాస్టిక్ సర్జరీలు -
తాబేలుతో అంత వీజీ కాదు!
న్యూయార్క్ : ఎంతటి బలవంతులైనా అన్ని విషయాల్లో విజయం సాధించటం అన్నది సాధ్యపడదు. కొన్నికొన్ని సార్లు సృష్టిలోపాల కారణంగా ఓటమి పాలుకాక తప్పదు. అలాంటి పరస్థితే ఎదురైంది ఓ మొసలికి. మామూలుగా మొసలి నోట చిక్కిన ఏ జీవికైనా మరణం 99 శాతం ఖాయమైనట్లే. కానీ, ఓ తాబేలు మాత్రం చావు(మొసలి)నోట్లోకెళ్లి బయటకు వచ్చేసింది. చాలా కాలం క్రితం అమెరికాలోని సౌత్ కరోలినా.. హిల్టన్ హెడ్ ఐలాండ్‌లోని ఓ ఇంటి వెనుక భాగంలో ఓ మొసలి తాబేలును నోట కరుచుకుంది. ( దొంగ కోతి: ఫోన్ ఎత్తుకెళ్లి సెల్ఫీలు ) దాన్ని కొరికి మింగేయటానికి ప్రయత్నించింది. కానీ, తాబేలు పైడిప్ప గట్టిగా ఉండటం వల్ల జారిపోసాగింది. దానికి తోడు మొసలి పళ్ల మధ్య పడి అది కొద్దిగా సేఫ్ అవుతూ వచ్చింది. అటువైపు, ఇటువైపు జారి చివరకు దాన్నుంచి తప్పించుకుంది. మొసలి కూడా దాన్ని పట్టుకుని తినే ఓపిక లేనట్లు వదిలేసింది. తాబేలు బ్రతుకు జీవుడా అంటూ అక్కడినుంచి తుర్రుమంది. 2017 ప్రాంతానికి చెందిన ఈ వీడియోను ఐఆర్ఎస్ అధికారి నవీద్ త్రుంబు తాజాగా తన ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేశారు. దీంతో వీడియో కాస్తా వైరల్‌గా మారింది. ( కూతురి బర్త్‌డే: ఆ తండ్రి కోరిక ఇదే! ) Thick skin and a strong mind are essential if you want to survive in this world. Nobody can break you down if you don't let them. -Unknown pic.twitter.com/NePsZm5REq — Naveed Trumboo IRS (@NaveedIRS) September 15, 2020 -
అరుదైన పసుపు పచ్చని తాబేలు
-
ఈ అరుదైన తాబేలును చూశారా?
సాక్షి, భువనేశ్వర్: మనం ఇప్పటి వరకూ ఎన్నో రకాల తాబేళ్లు చూసి ఉంటాం. సాధారణంగా తాబేళ్లు నలుపు, బూడిద రంగులో ఉంటాయి. వాటినే మనం చూస్తూ ఉంటాం. అయితే ఒడిశాలో అరుదైన పసుపు పచ్చని తాబేలు వెలుగులోకి వచ్చింది. పసుపు వర్ణంతో ధగధగలాడుతున్న ఈ తాబేలు బాలాసోర్ జిల్లాలో ప్రత్యక్షమైంది. సుజాన్‌పూర్ గ్రామంలో ఈ తాబేలును గమనించిన స్థానికులు... అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. ఈ సందర్భంగా వన్యప్రాణి శాఖ వార్డెన్ భానూమిత్ర ఆచార్య మాట్లాడుతూ ‘ఇది అరుదైన తాబేలు జాతి. ఇప్పటివరకూ ఇలాంటి తాబేలును చూడలేదు’ అని తెలిపారు. ఇందుకు సంబంధించిన వీడియోను ఐఎఫ్ఎస్ అధికారి సుశాంత్ నందా ట్విటర్లో పోస్ట్ చేశారు. తాము కూడా ఇప్పటివరకూ ఇలాంటి తాబేలును చూడలేదంటూ నెటిజన్లు వ్యాఖ్యానించారు. కాగా గత నెలలో కలహండి జిల్లా ధరమ్‌గఢ్ ప్రాంతంలో రోడ్డు నిర్మాణ పనులు సందర్భంగా అరుదైన తాబేలు కనిపించిన విషయం తెలిసిందే. -
అపురూప తాబేలు
భువనేశ్వర్(ఒడిశా): చిత్రంలో కనిపిస్తున్న అపురూప తాబేలు రాష్ట్ర సచివాలయం పరాసరాల్లో తారసపడింది. సచివాలయం గ్రిడ్ ప్రాంగణంలో తిరుగాడుతుండంగా సిబ్బంది గుర్తించారు. స్నేక్ హెల్ప్‌లైన్ వర్గాలకు సమాచారం అందజేశారు. ఈ వర్గం రంగంలోకి దిగి దీనిని సురక్షితంగా చేజిక్కించుకుంది. ఈ జాతి తాబేళ్ల పూర్వపరాల కోసం ఎవరికీ అవగాహన లేనట్లు సిబ్బంది తెలిపారు. అరుదైన తాబేలు సచివాలయం ప్రాంగణానికి ఎలా చేరిందోనని ఉత్కంఠ సర్వత్రా నెలకొంది. నగరం శివారులోని నందన్‌కానన్ జంతు ప్రదర్శనశాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. -
ఆలయంలో బంగారు రంగు కూర్మము ప్రత్యక్షం
కనగల్ : మండలంలోని శేరిలింగోటం చెరువు కట్టపై ఉన్న శ్రీ కట్టమైసమ్మ అమ్మవారి ఆలయంలోకి మంగళవారం బంగారు రంగుతో ఉన్న తాబేలు వచ్చింది. పక్కనే చెరువు ఉన్నందున అందులోంచి తాబేలు వచ్చినట్లు గ్రామస్తులు తెలిపారు. కూర్మానికి స్థానికులు కుంకుమ చల్లి పూజలు చేశారు. విష్ణుమూర్తి దశావతారాల్లో కూర్మావతారం ఒకటైనందున ఆలయంలో తాబేలు ప్రత్యక్షం కావడంతో భక్తిశ్రద్ధలతో పూజలు చేశారు. కార్యక్రమంలో సర్పంచ్ పోషమల్ల లింగయ్య తదితరులు పాల్గొన్నారు. -
వాహనంలో తరలిస్తున్న 420 తాబేళ్ల స్వాధీనం
చింతూరు(తూర్పుగోదావరి): ఆంధ్రప్రదేశ్ నుంచి ఒడిశాకు అక్రమంగా తరలిస్తున్న 10 క్వింటాళ్ల తాబేళ్లను తూర్పు గోదావరి జిల్లా లక్కవరం ప్రాంత అటవీ అధికారులు ఆదివారం పట్టుకున్నారు. తాబేళ్ల అక్రమ రవాణా సమాచారం తెలుసుకున్న రేంజ్ అధికారి ఉషారాణి ఆంధ్రా, ఒడిశా సరిహద్దు ప్రాంతమైన కొత్తపల్లి సమీపంలో సీలేరు నది వద్ద ఆదివారం వాహనాల తనిఖీ చేపట్టారు. రాజమండ్రి నుంచి వచ్చిన టాటా ఏస్ వాహనాన్ని తనిఖీ చేయగా 8 మూటల్లో కట్టి ఉంచిన 420 తాబేళ్లు లభ్యమయ్యాయి. డ్రైవర్ పరారవ్వగా, ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకుని పోలీసులకు అప్పగించామని రేంజ్ అధికారి తెలిపారు. తాబేళ్లను రాజమండ్రి నుంచి కొత్తపల్లి మీదుగా ఒడిశాకు రవాణా చేయబోతుండగా పట్టుకున్నామని చెప్పారు. కాగా, ఆ తాబేళ్లను మోతుగూడెం వద్ద సీలేరు నదిలో వదిలారు. -
బతికున్న తాబేలు కీచైన్లు..
సాక్షి: కొన్ని దేశాల పేర్లు చెబితే అక్కడ ప్రసిద్ధి చెందిన ప్రాంతాలు, వస్తువులు, కట్టడాలు గుర్తుకురావడం సహజం. అలాగే చైనా పేరు చెబితే గ్రేట్‌వాల్ ఆఫ్ చైనా, నెల రోజుల పాటు జరిగే నూతన సంవత్సర వేడుకలు.. లాంటివి గుర్తుకు వస్తాయి. కానీ వీటికి మించిన ప్రత్యేకత లు చైనా షాపింగ్‌లో ఉన్నాయి. ఆ ప్రత్యేకతలేమిటో, ఆ షాపింగ్ విశేషాలేమిటో ఈ రోజు తెలుసుకుందాం..! వెరై 'టీ'.. చైనాలో పాండా డంగ్ టీ ప్రత్యేకమని తెలుసు. దాని తర్వాత ఇక్కడ మరో టీ కూడా ప్రసిద్ధి. ఎందుకంటే ఇది పెళ్లికాని అమ్మాయిలు నోటితో తీసిన టీ. చాలా వింతగా అనిపిస్తుంది కదూ! కాని అక్కడ ఒక టీ కంపెనీ అవలంభిస్తున్న వ్యాపార టెక్నిక్ ఇది. ఇందులో పెళ్లి కాని అమ్మాయిలను మాత్రమే పనికి తీసుకుంటారు. ఆ అమ్మాయిలు టీ ఆకులను తమ చేతితో కోయరు. నోటితో కత్తిరిస్తారు. ఆకులు వేసుకునే బుట్టను కూడా చేతితో పట్టుకోకుండా మెడలో తగిలించుకుంటారు. ఈ కంపెనీ తయారు చేసే టీకి చైనాలో చాలా డిమాండ్ ఉంది. రోబోలు తయారు చేసే ఆహారం.. నూడుల్స్ నుంచి చిల్లీ చికెన్ వరకు రోబోలు తయారుచేసే ఆహారం చాలా రుచిగా ఉంటుందట. రోబో చేతులకున్న మెటాలిక్ వేళ్లు ఆహారానికి కొత్త రుచిని చేకూరుస్తున్నాయని అంటున్నారు. 2011లో క్యురన్కాన్ అనే వ్యక్తి ప్రయోగాత్మకంగా వంటచేసే రోబోలను తయారు చేశాడు. అది విజయం సాధించడంతో రోబో వంటను అందించే అనేక రెస్టారెంట్లు వెలిశాయి. ప్రజలు కూడా వీటికే ఎక్కువ మొగ్గు చూపుతున్నారు. అతడు ఒక్కో రోబోను రూ. 1,50,000 కు విక్రయించాడు. డబ్బాల గాలి.. చైనాలో వాతావరణ కాలుష్యం అక్కడి ప్రజలను అనారోగ్య సమస్యలకు గురిచేస్తోంది. దీన్ని సొమ్ము చేసుకోవాలని కొన్ని కంపెనీలు స్వచ్ఛమైన గాలిని డబ్బాలలో బంధించి అమ్ముతున్నాయి. మిలియనీర్లు వీటిని ఎక్కువగా వినియోగిస్తున్నారు. మనం స్వచ్ఛమైన నీటికి డబ్బులు ఖర్చుపెట్టినట్టు చైనా వాసులు ఇప్పుడు స్వచ్ఛమైన గాలికోసం ఎక్కువగా ఖర్చుచేస్తున్నారట. మరుగుజ్జు పార్కు.. చైనాలో మరుగుజ్జులందరినీ ఒక చోటికి తరలించారు. సుమారు 13,000 ఎకరాల విస్తీర్ణంలో వారికి అన్ని వసతులు కల్పించి, దాన్ని ఒక ప్రత్యేక పార్కుగా మార్చేశారు. అక్కడి ప్రజలతో పాటు, పర్యాటకులు కూడా ఈ ప్రాంతాన్ని సందర్శించి వీరితో కాసేపు సరదాగా గడపొచ్చు. బతికున్న తాబేలు కీచైన్లు.. మీరు చాలా రకాల కీచైన్లను వాడుంటారు. బతికున్న జీవులను ఎప్పుడైనా కీచైన్లుగా ఉపయోగించారా.. ఇలాంటి సరదా తీరాలంటే చైనాలో షాపింగ్ చేయాల్సిందే. ఒక ప్లాస్టిక్ కవరులో కావలసిన ఆక్సిజన్, విటమిన్లు ఉన్న నీటిని నింపి అందులో తాబేలు వంటి చిన్న చిన్న జీవులను ఉంచి, వాటిని కీ చైన్లుగా అమ్ముతారు. కొందరు వీటిని అదృష్టంగా భావించి కొంటుంటే, మరికొందరు ఆ అమాయక జీవులకు స్వేచ్ఛ కల్పించడానికి కొంటున్నారు. ట్రాఫిక్ జాం నుంచి తప్పిస్తారు.. జనాభాలో ప్రపంచంలోనే తొలి స్థానంలో ఉన్న చైనాలో ట్రాఫిక్ జామ్‌లు సర్వసాధారణం. ఒక్కోసారి అవి క్లియర్ అవడానికి గంటల నుంచి రోజుల సమయం పట్టొచ్చు. ఇలా ట్రాఫిక్‌లో ఇరుక్కుపోయిన వారి కోసం ఒక ప్రైవేటు కంపెనీ ప్రత్యేక సర్వీసును ప్రారంభించింది. వారికి ఫోను చేస్తే వచ్చి ట్రాఫిక్‌లో చిక్కుకున్న వ్యక్తిని బైక్‌పై ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా గమ్యస్థానం చేరుస్తారు. కారును కూడా ట్రాఫిక్ తగ్గాక వారే తెచ్చి ఇంటి దగ్గర అందచేస్తారు. దీనికి తగిన రుసుము చెల్లించాలి. -
బస్సుబోల్తా 30మందికి గాయాలు
శ్రీకాకుళం: ఆర్టీసీ సమ్మెతో ప్రజలు ప్రైవేట్ వాహనాలని ఆశ్రయిస్తూ ప్రమాదాల బారిన పడుతున్నారు. శ్రీకాకుళం జిల్లా పెద్దపాడు జంక్షన్ వద్ద అదుపుతప్పిన ప్రైవేట్ బస్సు బోల్తా పడటంతో 30 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. ఈ సంఘటన గురువారం ఉదయం చోటు చేసుకుంది. క్షతగాత్రులను రిమ్స్ అస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. -
త్రీమంకీస్ - 48
డైలీ సీరియల్ - క్రైమ్ కామెడీ సస్పెన్స్‌థ్రిల్లర్ - 48 - మల్లాది వెంకటకృష్ణమూర్తి తాబేలు ఓటమిని అంగీకరించలేదు. ఆలోచించి కుందేలుని మళ్ళీ పోటీకి పిలిచింది. ఈసారి కుందేలు వేగంగా పరిగెత్తి ఫినిష్ లైన్‌కి ముందున్న ఓ చెరువు దగ్గర ఆగిపోయింది. దానికి ఈత రాదు. తాబేలు నింపాదిగా వచ్చి, చెరువులోకి దూకి, ఈది అవతల ఒడ్డున ఉన్న ఫినిష్ లైన్‌కి చేరుకుని గెలిచింది. ఈసారి నీతి ఏమిటి? గెలుపు కోసం నీ మార్గాన్ని మార్చుకో. ‘‘కథ ఇంకా పూర్తి కాలేదు బ్రదర్. ఇది ముఖ్యమైన కథ. సరే. కుందేలు తాబేలుని మళ్ళీ పరుగు పోటీకి పిలిచి, తాబేలుతో - ‘చెరువు గట్టు దాకా నువ్వు నా భుజాన కూర్చో. చెరువుని దాటేప్పుడు నీ భుజం మీద నేను కూర్చుంటాను’ అని చెప్పింది. అందుకు తాబేలు ఒప్పుకుంది. ఆ ప్రకారం కుందేలు, దాని భుజం మీది తాబేలు చెరువు దాకా చేరుకున్నాయి. చెరువులోని నీళ్ళల్లో ఈదే తాబేలు వీపు మీద కుందేలు కూర్చుని చెరువుని దాటింది. ఆ రెండూ సమానంగా ఒకేసారి ఫినిషింగ్ లైన్‌ని చేరి రెండూ గెలిచాయి. నీతి ఏమిటి? ఎవరినైనా ఓడగొట్ట లేకపోతే వాళ్ళతో చేతులు కలిపి నెగ్గు. నన్ను నువ్వు నెగ్గలేవు. సఖ్యత వల్ల ఇద్దరికీ మంచిదే. శతృత్వం వల్ల నీకు మాత్రమే నష్టం. ఏమంటావు?’’ మర్కట్, వానర్లు ఆ మాటల్ని మెచ్చుకుంటూ వెంటనే చప్పట్లు కొట్టారు. ‘‘సరే’’ కోపాన్ని దిగమింగుకుని దుర్యోధన్ చెప్పాడు. ‘‘జాగ్రత్త. మాట తప్పితే జైల్లోంచి ఒక్కరూ బయటకి వెళ్ళలేరు. జైల్లోంచి అంతా గమనిస్తూంటాం. రేపు రాత్రి పథకం ఏమిటి?’’ కపీష్ అడిగాడు. ‘‘రేపు రాత్రి గార్డ్ మా అందరి సెల్స్ తాళాలు తెరుస్తాడు. పోలీసులు మర్నాడు కట్టి పడేసిన అతన్ని చూస్తారు. తేలు తేలు అని అరిచినందుకు తెరిచానని చెప్తాడు’’ దుర్యోధన్ చెప్పాడు. ‘‘ఇందాక నువ్వు ఫోన్ చేసింది అతనికే నన్నమాట.’’ ‘‘అదీ తెలుసా?’’ దుర్యోధన్ ఉలిక్కి పడ్డాడు. ‘‘మాకు అంతా తెలుసు. నువ్వు ఎన్ని మిల్లీ లీటర్ల మూత్రం పోసావో కూడా మాకు తెలుసు. ఏ సెల్ లోంచి సొరంగం తవ్వారు?’’ వానర్ అడిగాడు. ‘‘టు నాట్ టు సెల్ లోంచి’’ దుర్యోధన్ ఓడిపోయిన వాడి మొహం పెట్టి చెప్పాడు. ‘‘సొరంగం ఏ మేరకి తీశారేమిటి?’’ కపీష్ అడిగాడు. ‘‘దేనికి?’’ దుర్యోధన్ కోపంగా ప్రశ్నించాడు. ‘‘నేను చదివింది ఇంజనీరింగ్ కోర్స్. సొరంగం చుట్టు కొలత మూడు అడుగులు ఉంటే అంతకు రెట్టింపు సీలింగ్ పైన ఉండాలి. అంటే మూడడుగుల సొరంగానికి కనీసం ఆరు అడుగుల మట్టిపైన ఉండాలి. లేదా అది కూలే ప్రమాదం ఉంది. అదీ లెక్క.’’ ‘‘నాకా లెక్కలు తెలీవు కాని నా చిన్నప్పుడు నేను మా నాన్నతో దొంగతనాలకి వెళ్ళేవాడిని. ఆయన కన్నపు దొంగ. ఇలాంటి వాటిలో నాకు అనుభవం ఎక్కువ. నేను తీసిన ఏ సొరంగం ఇంత దాకా కూల్లేదు.’’ ‘‘ఇంకేం?’’ అతను దూరంగా వెళ్ళాక మిత్రులు ముగ్గురూ తమకి జైల్లో తారసపడ్డ ముగ్గురు భామల గురించి ఒకరికొకరు చెప్పుకున్నారు. ‘‘డాక్టర్ మూలిక ప్రవర్తన మీతో ఎలా ఉంది?’’ వానర్ అడిగాడు. ‘‘మామూలుగానే ఉంది. ఏం?’’ మర్కట్ అడిగాడు. ‘‘నాతో మాత్రం పేషెంట్ - డాక్టర్ల మధ్య సంబంధంలా లేదు...’’ తన అనుభవాన్ని వివరించాడు. వెంటనే మర్కట్ సన్నగా ఈల వేసి చెప్పాడు. ‘‘నిన్ను రోజూ పిలుస్తోందా? నువ్వు చెప్పిన దాన్ని బట్టి మూలిక నీతో ప్రేమలో పడింది అని తెలుస్తోంది. ఏమంటావ్?’’ ‘‘అవును. నాతో కూడా ఒకరు ప్రేమలో పడ్డారు. పేరు రుధిర’’ కపీష్ రుధిర గురించిన విషయాలు చెప్పాడు. ‘‘నా జోడీ గురించి మీ ఇద్దరికీ తెలుసు. ఆమె పేరు వైతరణి అని కూడా మీకు తెలుసు’’ మర్కట్ చెప్పాడు. ‘‘మనం పారిపోయేందుకు వాళ్ళేమైనా ఉపయోగిస్తారేమో చూద్దాం. లేదా కనీసం మనకి బెయిల్ అయినా ఇప్పించవచ్చు. కాబట్టి వాళ్ళని ఆ భ్రమలోనే ఉంచుదాం’’ కపీష్ చెప్పాడు. జైలర్ రోల్ కాల్ తీసుకున్నాక విజిల్ ఊది చెప్పాడు. ‘‘అంతా మీ మీ సెల్స్‌కి వెళ్ళండి.’’ 13 ఆ రాత్రి మెస్‌లో గార్డ్లు ఎప్పటిలా ఖైదీల మీద ఓ కన్నేసి ఉంచారు. భోజనాల దగ్గర ఎప్పటిలా మిత్రులు ముగ్గురూ ఒకేచోట కూర్చుని గొంతు తగ్గించి మాట్లాడుకోసాగారు. ‘‘అడుగో దుర్యోధనుడు. నేను వెళ్ళి మేజిక్ నేర్పి వస్తాను’’ చెప్పి కపీష్ లేచాడు. దుర్యోధన్ ముందు కూర్చుని చెప్పాడు. ‘‘నేనో మేజిక్ చేయనా? ఈ లడ్డూ ఉంది చూశావు? దీన్ని నువ్వు స్పెషల్ ఖైదీ అని పెట్టి ఉంటారు. దీన్ని ఎలా మాయం చేస్తున్నానో చూడు’’ చెప్పి దాన్ని కుడి చేత్తో అందుకుని, బల్ల కింది ఎడం చేతిలోకి దాన్ని పడేసి కుడి చేతిని పైకి విసిరేసి పైకి చూడసాగాడు. అంతా కూడా పైకి చూస్తూండగా ఆ లడ్డూని విసిరేస్తే మర్కట్ దాన్ని పట్టుకున్నాడు. ‘‘మాయం! లడ్డూ మేజిక్ బాలేదూ? కావాలంటే నన్ను వెతకండి’’ నవ్వుతూ రెండు చేతులూ పైకి ఎత్తి పెట్టి లేచి నిలబడుతూ చెప్పాడు. వాళ్ళల్లో కదలిక లేదు. అంతా కపీష్ ధైర్యానికి, దుర్యోధన్ స్పందించకపోవడానికి ఆశ్చర్యపోయారు. గుసగుసలు మొదలయ్యాయి. (దేవుడ్ని నవ్వించడం ఎలా?) -
శరణం... గురు చరణం...
గురు బ్రహ్మ భారతీయ సంప్రదాయంలో గురువుది అత్యున్నతమైన స్థానం. గురువు అనుగ్రహం లేకుండా ఎవ్వరూ జీవిత లక్ష్యాలను సాధించలేరు. తల్లి, తండ్రి, గురువు, అతిథి- ఈ నలుగురు ప్రత్యక్ష గురువులు. భగవంతుని తల్లి, తండ్రి, గురువుల రూపంలోను, తల్లి, తండ్రి, గురువులను భగవంతుని రూపంలోను దర్శించి ఆరాధించడం భారతీయ సంప్రదాయం. సద్గురువును, సదాచార్యుని పొందడం గొప్ప అదృష్టం. యోగ్యత ఉన్న వ్యక్తుల చెంతకు భగవంతుడే ఒక సద్గురువును పంపిస్తాడట. సద్గురువును పొందడానికి యోగ్యత కలగాలంటే సత్సంగంలోనూ, ఆధ్యాత్మిక కార్యకలాపాలలోనూ పాల్గొనడమే సరైన మార్గం. జగద్గురువు ఆదిశంకరులు, భగవద్రామానుజులు, షిరిడి సాయిబాబా వంటివారు కూడా సద్గురు చరణారవిందాలను సేవించినవారే! ఎందుకంటే... నీటిలోని చేప తన చూపుతోను, తాబేలు తన స్పర్శతోను తమ పిల్లలని సాకినట్లుగా, శిష్యులను ఉత్తములుగా తీర్చిదిద్దగలిగిన మహనీయులే గురువులు. ప్రపంచంలో ఉన్న అనేక రకాల ఆధ్యాత్మిక సాధనలలో ఏది ఎవరికి తగినది? అన్నదానిని సాధకుని యోగ్యతను బట్టి, అవగాహన స్థాయిని బట్టి నిర్ణయించేది, ఉపదేశించేది గురువే. కనుక మన ధర్మంలో గురువుకు ప్రత్యేక స్థానం ఉండటం వల్ల గురువును దైవంగాను, ఒక్కోసారి దైవం కన్న మిన్నగాను పరిగణించే ఆచారం అనాదిగా వస్తోంది. అపార జ్ఞానరాశిగా పోగు పడి ఉన్న వేదాలను నాలుగుగా విభజించి, అష్టాదశ పురాణాలను విరచించి, పంచమవేదం వంటి భారత మహేతిహాసాన్ని రచించిన తేజోమూర్తి వేదవ్యాసుడు. వేదవాఙ్మయానికి మూల పురుషుడయిన వ్యాసుడు జన్మించిన ఆషాఢపూర్ణిమను వ్యాసపూర్ణిమగా జరుపుకుంటున్నాం. అపర నారాయణుడయిన ఈయన వల్లనే మన సంస్కృతి సంప్రదాయాలు ప్రపంచమంతటా పరిఢవిల్లాయి. బ్రహ్మసూత్రాలను నిర్మించి, కర్మ, జ్ఞాన, భక్తి మార్గాలను పటిష్టం చేసిన ఆ వశిష్ఠుని ముని మనుమడయిన వ్యాసుని ఈ రోజు అర్చించడం భారతీయుల కర్తవ్యం. గురువులలో మొట్టమొదటి వాడు శ్రీకృష్ణుడు. అంతకన్నా ముందు దత్తాత్రేయులవారు. ఆ తర్వాత వేదవ్యాసుడు, ఆయన తర్వాత ఆదిశంకరాచార్యులు, షిరిడి సాయిబాబా, శ్రీ రామకృష్ణ పరమహంస, స్వామి వివేకానంద, భగవాన్ సత్యసాయి బాబా తదితరులు. వీరెవ్వరితోనూ మనకు ప్రత్యక్షమైన అనుబంధం ఉండచ్చు, ఉండకపోవచ్చు. అయితే మనకు విద్యాబుద్ధులు నేర్పి, మనం గౌరవప్రదమైన స్థానంలో నిలబడేందుకు బాటలు పరిచిన మన గురువులతో మనకు అనుబంధం, సామీప్యం తప్పనిసరిగా ఉండి ఉంటుంది కాబట్టి గురుపూర్ణిమ సందర్భంగా వారిని స్మరించుకోవటం, సేవించుకోవటం, సన్మానించుకోవటం సముచితం, సందర్భోచితం. ఒకవేళ మనకు అందుకు వీలు లేనట్లయితే, కనీసం మన పిల్లలకైనా ఆ అవకాశం కల్పించటం, వారి చేత వారి గురువులకు పాదాభివందనం చేయించటం, సమ్మానింపజేయడం మన కనీస ధర్మం. (ఈ నెల 12న గురుపూర్ణిమ సందర్భంగా) - డి.వి.ఆర్