Anand Mahindra Talks About Friendship By Sharing Video - Sakshi
Sakshi News home page

Anand Mahindra: స్నేహానికి అసలైన అర్థం... ఆనంద్‌ మహీంద్రా మెచ్చిన వీడియో!

Published Fri, Apr 8 2022 3:04 PM | Last Updated on Fri, Apr 8 2022 5:29 PM

Anand Mahindra Posted Turtle Video On Twitter Talk About friendship - Sakshi

Anand Mahindra talks about friendship: సోషల్‌ మీడియాలో ఎ‍ప్పుడూ యాక్టివ్‌గా ఉండే ఆనంద్‌ మహింద్రా ఒక వైరల్‌ వీడియోని ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశారు. ఈ వీడియో స్నేహం విలువ, స్నేహితుడి అంటే ఎలా ఉండాలో చెబుతుందని అన్నారు. స్నేహం గురించి పెద్ద ఉపన్యాసమే ఇచ్చారు. అసలు ఇంతకీ ఆ వీడియోలో ఏముంది అనే కదా!.

వివరాల్లోకెళ్తే... ఆ వీడియోలో రెండు తాబేళ్లు ఉన్నాయి. అందులో ఒక తాబేలు వెనక్కి తిరగబడి ఇబ్బందిపడుతోంది. దీంతో ముందు వెళ్తున్న తాబేలు తనతో పాటు మరో తాబేలు రావడం గమనించింది. దీంతో ఆ తాబేలు ఆగి మరీ వెనక్కి వచ్చి అవస్థలు పడుతున్న ఆ తాబేలుకు సాయం చేస్తుంది. దీంతో ఆ తాబేలు హమ్మయ్య అనుకుంటూ చకచక వెళ్లిపోతుంది.

ఈ వీడియో ప్రముఖ వ్యాపార దిగ్గజం ఆనంద్‌ మహింద్రాని ఆకర్షించింది. ఈ మేరకు ఆయన ఈ వీడియోని సోషల్‌ మీడియాలో షేర్‌ చేయడమే కాకుండా ట్విట్టర్‌లో... స్నేహానికి అసలైన అర్ధం ఇదే కదా. మనం సమస్యల్లో ఉన్నప్పుడూ మనకు చేయూత నిచ్చి మన కాళ్లపై తిరిగి నిలబడేలా చేసేవాడు నిజమైన స్నేహితుడు. ప్రతిఒక్కరు తమ జీవితంలో మంచి స్నేహితుడి కలిగి ఉండటానికి మించిన గొప్పవరం ఇంకొకటి లేదు." అని అన్నారు.

(చదవండి: రిక్షాలో మినీ గార్డెన్‌...ఫోటోలు వైరల్)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement