
సాక్షి, భువనేశ్వర్: మనం ఇప్పటి వరకూ ఎన్నో రకాల తాబేళ్లు చూసి ఉంటాం. సాధారణంగా తాబేళ్లు నలుపు, బూడిద రంగులో ఉంటాయి. వాటినే మనం చూస్తూ ఉంటాం. అయితే ఒడిశాలో అరుదైన పసుపు పచ్చని తాబేలు వెలుగులోకి వచ్చింది. పసుపు వర్ణంతో ధగధగలాడుతున్న ఈ తాబేలు బాలాసోర్ జిల్లాలో ప్రత్యక్షమైంది. సుజాన్‌పూర్ గ్రామంలో ఈ తాబేలును గమనించిన స్థానికులు... అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు.
ఈ సందర్భంగా వన్యప్రాణి శాఖ వార్డెన్ భానూమిత్ర ఆచార్య మాట్లాడుతూ ‘ఇది అరుదైన తాబేలు జాతి. ఇప్పటివరకూ ఇలాంటి తాబేలును చూడలేదు’ అని తెలిపారు. ఇందుకు సంబంధించిన వీడియోను ఐఎఫ్‌ఎస్ అధికారి సుశాంత్ నందా ట్విటర్‌లో పోస్ట్ చేశారు. తాము కూడా ఇప్పటివరకూ ఇలాంటి తాబేలును చూడలేదంటూ నెటిజన్లు వ్యాఖ్యానించారు. కాగా గత నెలలో కలహండి జిల్లా ధరమ్‌గఢ్ ప్రాంతంలో రోడ్డు నిర్మాణ పనులు సందర్భంగా అరుదైన తాబేలు కనిపించిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment