Balasore
-
బస్సు డ్రైవర్‌కు గుండెపోటు.. 60 మందిని కాపాడి, చివరికి..
భువనేశ్వర్: బిహార్‌లో విషాదం చోటుచేసుకుంది. బస్సు నడుపుతుండగా గుండెపోటుకు గురైన డ్రైవర్.. అప్రమత్తతో వ్యవహరించడంతో 60 ప్రయాణికుల ప్రాణాలు నిలిచాయి. కానీ దురదృష్టవశాత్తూ అతడు ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన బాలాసోర్ జిల్లాలోని పటాపూర్ చక్‌లో మంగళవారం ఉదయం జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం.. పశ్చిమబెంగాల్‌కు చెందిన పర్యాటకులతో ఓ బస్సు బాలాసోర్‌లోని పంచలింగేశ్వరాలయం వైపు వెళ్తుంది. మార్గ మధ్యంలో బస్సు డ్రైవర్ గుండెపోటుకు గురయ్యాడు. ఛాతీతో ఉన్నట్టుండి నొప్పి రావడంతో వెంటనే బస్సును పక్కను నిలిపివేశాడు. అనంతరం అతడు స్పృహ కోల్పోయాడు. దీంతో తీవ్ర భయందోళనకు గురైనన ప్రయాణికులు వెంటనే స్థానికుల సాయంతో దగ్గర్లోని ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే అప్పటికే అతను ప్రాణాలు విడిచినట్లు వైద్యులు ప్రకటించారు. మృతిచెందిన డ్రైవర్‌ను షేక్ అక్తర్‌గా గుర్తించారు. అతడి అప్రమత్తతో ప్రయాణికులకు ప్రాణాపాయం తప్పింది. ప్రమాద సమయంలో బస్సులో 60 మంది ప్రయాణికులు ఉన్నారు. చదవండి: మాకు నితీష్ అవసరం లేదు: రాహుల్ -
బాలాసోర్ రైలు ప్రమాదానికి అదే కారణం.. చార్జిషీట్లో సీబీఐ
భువనేశ్వర్: అనేక కుటుంబాల్లో విషాదాన్ని నింపిన బాలాసోర్ రైలు ప్రమాదం కేసు విచారణలో భాగంగా సీబీఐ చార్జిషీటు దాఖలు చేసింది. ఈ కేసులో ఇప్పటికే అరెస్టైన ముగ్గురు అధికారులు సాక్ష్యాలను తారుమారు చేసేందుకు కూడా ప్రయత్నించారంటూ చార్జిషీటులో పేర్కొంది. దేశ చరిత్రలోనే అత్యంత విషాదకరమైన సంఘటనగా నిలుస్తూ బాలాసోర్ రైల్వే ప్రమాదంలో 290 మంది మరణానికి కారణమైంది. సిగ్నల్ వైఫల్యం కారణంగానే ప్రమాదం జరిగిందని భావిస్తూ అందుక్కారణమైన సీనియర్ సెక్షన్ ఇంజినీర్ అరుణ్ కుమార్ మహంత, సెక్షన్ ఇంజినీర్ మొహమ్మద్ అమిర్ ఖాన్, టెక్నీషియన్ పప్పు కుమార్ లను జూలైలోనే అరెస్టు చేయగా తాజాగా వారిపై హత్యానేరం తోపాటు సాక్ష్యాలను తారుమారు చేసే ప్రయత్నం కూడా చేశారని చార్జిషీటులో అభియోగాలను మోపింది సీబీఐ. బహనగా స్టేషన్ సమీపంలోని గేటు నెంబర్ 94 లెవెల్ క్రాసింగ్ వద్ద LC గేటు నెంబర్ 79 సర్క్యూట్ దయాగ్రామ్ ఆధారంగా మరమ్మతు పనులను పర్యవేక్షించిన మహంత అన్ని పనులు పూర్తయిన తర్వాత విధి నిర్వహణలో అలసట కనబరుస్తూ టెస్టింగ్ నిర్వహించాలి. అందులో ఏమైనా వైఫల్యాలు ఉంటే మార్పులు చేసి వాటిని సరిచేయాలి. కానీ మహంత నిర్లక్షయంగా వ్యవహరిస్తూ టెస్టింగ్ నిర్వహించలేదని, ఇంటర్‌లాకింగ్ ఇన్స్టాలేషన్ కూడా ప్రణాళికాబ్యాద్మగా లేవని.. ఈ కారణాల వల్లనే మూడు రైళ్లు ఢీకొన్నాయని సీబీఐ చార్జిషీటులో పేర్కొంది. #BREAKING | Central Bureau of Investigation (CBI) files chargesheet in Balasore Train accident case. #CBI #BalasoreTrainAccident #Balasore #BalasoreTrainTragedy WATCH #LIVE here- https://t.co/6CjsNJ9CEq pic.twitter.com/9rSEOROykp — Republic (@republic) September 2, 2023 ఇది కూడా చదవండి: వారిని తలకిందులుగా వేలాడదీస్తాం: అమిత్ షా -
నిర్లక్ష్యంపై వేటు!
భువనేశ్వర్: బాలాసోర్ జిల్లా బహనాగా బజార్ రైల్వేస్టేషన్ సమీపంలో జూన్ 2న జరిగిన ఘోర రైలు ప్రమాదం నేపథ్యంలో విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించారనే ఆరోపణలపై ఏడుగురు ఉద్యోగులను రైల్వేశాఖ తొలగించింది. ఈ ప్రమాదంలో 294మంది ప్రాణాలు కోల్పోగా, దాదాపు 1,100 మందికి పైగా గాయపడ్డారు. ఈ మేరకు చేపట్టిన చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకుంది. వీరిలో ముగ్గురు ప్రస్తుతం సీబీఐ రిమాండ్‌లో ఉన్న ముగ్గురు ఎస్ఎండ్టీ అధికారులు కూడా ఉన్నారని ఆగ్నేయ రైల్వే జనరల్ మేనేజర్ అనీల్‌కుమార్ మిశ్రా తెలిపారు. వీరితో ప్రమాదానికి నిర్లక్ష్య వైఖరి ప్రదర్శించిన సిబ్బందిగా గుర్తించిన బహనాగా బజార్ స్టేషన్ మాస్టర్, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్, మెయింటైనర్లను సస్పెండు చేసినట్లు సమాచారం. బహనాగా బజార్, బాలాసోర్ రైల్వే స్టేషన్లను సౌత్ఈస్ట్ రైల్వే జీఎం, డీఆర్ఎం బుధవారం ప్రత్యక్షంగా సందర్శించారు. అనంతరం సిబ్బందికి వ్యతిరేకంగా చర్యలు చేపట్టారు. ఈ అధికారులు బాలాసోర్ ఎంపీ ప్రతాప్‌చంద్ర షడంగితో కలిసి గోపీనాథ్‌పూర్ రైల్వే స్టేషన్‌ను కూడా సందర్శించారు. ఈ సందర్భంగా బాలాసోర్–నీలగిరి సెక్షన్‌ను పర్యవేక్షించారు. సీబీఐ అరెస్ట్ చేసిన ముగ్గురు రైల్వే ఉద్యోగులు సీనియర్ సెక్షన్ ఇంజినీర్(సిగ్నల్), అరుణ్‌కుమార్ మహంత, సీనియర్ సెక్షన్ ఇంజినీర్ మహ్మద్ అమీర్‌ఖాన్, టెక్నీషియన్ పప్పుకుమార్ లను మరో 4 రోజులు రిమాండ్ కొనసాగించారు. ఈ మేరకు సీబీఐ ప్రత్యేక కోర్టు నుంచి అనుమతి లభించింది. అప్రమత్తంగా ఉండి ఉంటే..! ఈ దుర్ఘటన పురస్కరించుకుని ఆగ్నేయ సర్కిల్ రైల్వే భద్రతా కమిషనర్(సీఆర్ఎస్) సమర్పించిన విచారణ నివేదిక బహనాగా బజార్ స్టేషన్ వద్ద జరిగిన ప్రమాదానికి సిగ్నలింగ్ సమస్యలతో సహా అనేక మానవ లోపాలను ఎత్తి చూపింది. దీని ఆధారంగా రైల్వేశాఖ అధికారులు.. బాధ్యులుగా భావిస్తున్న వారిని విధుల నుంచి తొలగించినట్లు తెలుస్తోంది. సీఆర్ఎస్ విచారణ పట్ల పలు రాజకీయ పక్షాలు విశ్వసనీయత ప్రదర్శించిన విషయం తెలిసిందే. రైలు దుర్ఘటనల్లో ఈ వర్గం విచారణ అత్యంత పారదర్శకతతో అనుబంధ లోటుపాటులను పటిష్టంగా ఖరారు చేయగలుగుతుందని పలు వర్గాల్లో నమ్మకం బలపడి ఉంది. సీబీఐ విచారణ నేరపరమైన ప్రమేయాన్ని వెలికి తీయగలుగుతుంది. రైల్వే శాఖా పరమైన అంశాలను రైల్వే భద్రతా కమిషనర్ విచారణ తేటతెల్లం చేస్తుందని విశ్వసిస్తున్నారు. ఈ విచారణ పూర్తయి, కేంద్ర ప్రభుత్వానికి నివేదిక దాఖలు చేయడం పూర్తయ్యింది. సీఆర్ఎస్ విచారణ మానవ తప్పిదపరమైన లోపాలు ఘోర దుర్ఘటనను ప్రేరేపించాయని స్పష్టం చేసింది. ఆగ్నేయ రైల్వే జనరల్ మేనేజర్ అనీల్‌కుమార్ మిశ్రా మాట్లాడుతూ.. ‘ప్రమాదానికి దారితీసిన కారణాలపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(సీబీఐ) దర్యాప్తు చేస్తోంది. ఈ వర్గం నివేదిక కోసం వేచి ఉన్నాం. మరోవైపు విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఏడుగురు రైల్వే ఉద్యోగుల వ్యతిరేకంగా శాఖాపరంగా చర్యలు తీసుకోవడం జరిగింది. వీరు విధి నిర్వహణలో మరింత అప్రమత్తంగా ఉంటే ప్రమాద నివారణ సాధ్యమయ్యేదని భావిస్తున్న’ట్లు పేర్కొన్నారు. ప్రయాణికుల డిమాండ్ దృష్ట్యా విశాఖ–కాశీ వీక్లీ రైలు కొనసాగింపు భువనేశ్వర్: ప్రయాణికుల ఆసక్తి దృష్ట్యా విశాఖపట్నం–బనారస్(కాశీ) మధ్య నడుస్తున్న వీక్లీ ప్రత్యేక రైళ్ల సేవలను పొడిగించినట్లు తూర్పుకోస్తా రైల్వే ప్రకటించింది. ఈ రైళ్లలో ద్వితీయ శ్రేణి ఎయిర్ కండిషన్–1, తృతీయ శ్రేణి ఎయిర్ కండిషన్–3, స్లీపర్ శ్రేణి–12, సాధారణ శ్రేణి–2, ద్వితీయ శ్రేణి కమ్ లగేజీ, దివ్యాంగుల కోచ్‌లు–2 సౌకర్యం అందుబాటులో ఉంటాయి. ఇది విశాఖపట్నం, బనారస్ స్టేషన్ల మధ్య సింహాచలం, కొత్తవలస, విజయనగరం, బొబ్బిలి, పార్వతీపురం, రాయగడ, మునిగుడ, కెసింగ, టిట్లాగఢ్, బొలంగీర్, బర్గడ్ రోడ్, సంబల్పూర్, ఝార్సుగుడ, రౌర్కెలా, హతియా, రాంచీ, మూరి, బర్కకానా, లాతేహర్, డాల్తోగంజ్, గర్వా రోడ్, డెహ్రీ ఆన్ సోన్, ససారాం, భబువా రోడ్, పండిట్ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ, వారణాసి స్టేషన్లలో ఆగుతుంది. ► 08588 విశాఖపట్నం–బనారస్ వీక్లీ స్పెషల్ రైలు జూలై 19నుంచి ఆగస్టు 30 వరకు ప్రతి బుధవారం మధ్యాహ్నం 12.30 గంటలకు విశాఖపట్నం నుంచి బయలుదేరి, మరుసటి రోజు సాయంత్రం 4.30 గంటలకు బనారస్ చేరుకుంటుంది. ► తిరుగు ప్రయాణంలో 08587 బనారస్–విశాఖపట్నం వీక్లీ స్పెషల్ జూలై 20 నుంచి ఆగస్టు 31 వరకు ప్రతి గురువారం ఉదయం 6 గంటలకు బనారస్ నుంచి బయలుదేరి మరుసటి రోజు రాత్రి 8.30 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది. ఈ క్రమంలో ఉభయ దిశల్లో ఈ రైళ్లు 7 సార్లు రవాణా అవుతాయి. ఆలస్యంగా రైళ్లు.. భువనేశ్వర్: దక్షిణాది ప్రాంతాల మధ్య రాకపోకలు చేస్తున్న పలు ప్రయాణికుల రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలో తిరుగు ప్రయాణంలో బయల్దేరాల్సిన స్టేషన్ వేళలను సవరించి, సర్దుబాటు చేసి నడిపిస్తున్నట్లు రైల్వేశాఖ తెలిపింది. బుధవారం షాలీమార్ నుంచి బయల్దేరాల్సిన 12841 అప్ షాలీమార్–ఎంజీఆర్ చైన్నె సెంట్రల్ కోరమండల్ ఎక్స్‌ప్రెస్ రైలు నిర్థారిత సమయం మధ్యాహ్నం 3.20 గంటలు కాగా సాయంత్రం 5 గంటలకు బయలు దేరుతుందని ప్రకటించారు. బుధవారం రాత్రి 11.55 గంటలకు హౌరా నుంచి బయల్దేరాల్సిన 12839 అప్ హౌరా–ఎంజీఆర్ చైన్నె సెంట్రల్ మెయిల్ గురువారం ఉదయం 5 గంటలకు ఆలస్యంగా బయలు దేరుతుందని ప్రకటించారు. బుధవారం ఉదయం 10.35 గంటలకు బయలుదేరాల్సిన 12864 డౌన్ ఎస్‌వీఎంటీ బెంగుళూరు–హౌరా ఎక్స్‌ప్రెస్ వేళలు సవరించి మధ్యాహ్నం 1గంటకు ఆలస్యంగా నడిపించినట్లు తెలిపారు. -
Odisha Tragedy: ఒడిశా రైలు ప్రమాద ఘటనలో ఏడుగురి సస్పెన్షన్..
ఒడిశా: ఒడిశా రైలు ప్రమాద ఘటనలో రైల్వే భద్రతా కమీషనర్ నేతృత్వంలో జరుగుతున్న విచారణలో ఘోర ప్రమాదానికి కారణమైన ఏడుగురు అద్యోగులను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది దక్షిణ తూర్పు రైల్వే శాఖ. వీరిలో ఇదే కేసులో అంతకు ముందు సీబీఐ అరెస్టు చేసిన ముగ్గురు అధికారులు కూడా ఉన్నారు. ఈ సందర్బంగా దక్షిణ తూర్పు రైల్వే డివిజన్ మేనేజర్ అనిల్ కుమార్ మిశ్రా మీడియా సమావేశాన్ని నిర్వహించి ఈ విషయాన్ని ప్రకటించారు. సస్పెన్షన్ కు గురైన అధికారులు ఏమాత్రం జాగ్రత్త వ్యవహరించి అప్రమత్తంగా ఉన్నా ఇంతటి ఘోరం జరిగి ఉండేది కాదని, వారి నిర్లక్ష్యంగానే ఈ ప్రమాదం జరిగిందని ఆయనన్నారు. మొదట అరెస్టైన ముగ్గురు, 24 గంటల క్రితం అరెస్టైన మరో ఉద్యోగి తోపాటు మరో ముగ్గురుని సస్పెండ్ చేస్తున్నట్లు అనిల్ మిశ్రా తెలిపారు. అంతకు ముందు సీబీఐ అరెస్టు చేసిన ముగ్గురు ఉద్యోగులు సీనియర్ సెక్షన్ ఇంజనీర్ అరుణ్ కుమార్ మహంత, సెక్షన్ ఇంజనీర్ మహమ్మద్ అమిర్ ఖాన్, టెక్నీషియన్ పప్పు కుమార్ లకు మరో నాలుగు రోజుల రిమాండ్ పొడిగించాలని సీబీఐ కోరిన విషయం తెలిసిందే. జూన్ 2న బాలాసోర్ సమీపంలో మూడు రైళ్లు ఢీకొన్న ఘోర ప్రమాదంలో 298 మంది ప్రాణాలు కోల్పోయారు. సుమారు 1200 మందికి పైగా గాయపడ్డారు. ఎన్నో కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపిన ఈ దుర్ఘటనలో ఎందరో దిక్కులేని వారయ్యారు. ఇంకెందరో నిరాశ్రయులయ్యారు. ఇప్పటికింకా 41 మృతదేహాలను గుర్తించడానికి ఎవ్వరూ రాకపోవడం అత్యంత విచారకరం. #OdishaTrainTragedy: Seven Railway staff including the three employees, who were earlier arrested, suspended, informs South-Eastern Railway GM Anil Kumar Mishra #Odisha pic.twitter.com/MbL6jHYNsp — OTV (@otvnews) July 12, 2023 ఇది కూడా చదవండి: కార్మికుడికి రూ.24. 61 లక్షలు టాక్స్ కట్టమంటూ నోటీసులు..? -
‘బాలాసోర్’లా త్వరలో ఘోర రైలు ప్రమాదం!
సాక్షి, హైదరాబాద్: ఒడిశాలోని బాలాసోర్‌లో ఇటీవల జరిగిన ఘోర రైల్వే ప్రమాదం వంటిదే ఢిల్లీ–హైదరాబాద్ రైల్వే మార్గంలో జరగబోతోందంటూ ఓ ఆగంతకుడు రాసిన లేఖ కలకలం రేపుతోంది. బాలాసోర్‌లో ఒక గూడ్స్ రైలు, రెండు ప్రయాణికుల రైళ్లు ఢీకొని వందల మంది చనిపోవడం, ఆ ప్రమాదం వెనుక విద్రోహ చర్య కూడా ఉండే అవకాశంపై సీబీఐ దర్యాప్తు జరుగుతుండటం తెలిసిందే. ఈ క్రమంలో అదే తరహా మరో ప్రమాదం జరగబోతోందంటూ నాలుగైదు రోజుల కింద వచ్చిన లేఖతో రైల్వే అధికారులు అప్రమత్తమయ్యారు. ఢిల్లీ–హైదరాబాద్ మార్గంలో సిగ్నలింగ్ వ్యవస్థలను, ట్రాక్ పరిస్థితిని తనిఖీ చేస్తున్నారు. ప్రతి రైలును క్షుణ్నంగా తనిఖీ చేయాలని, సిబ్బంది అంతా జాగ్రత్తగా ఉండాలని దక్షిణ మధ్య రైల్వే జీఎం ఆదేశించారు. ఇక రైల్వే పోలీసుల ఫిర్యాదు మేరకు సదరు లేఖ ఎక్కడి నుంచి వచ్చిది, ఎవరు రాశారన్నది తేల్చేందుకు రాష్ట్ర పోలీసులు ప్రయత్నిస్తున్నారు. చదవండి: పెళ్లికి ముందే వరకట్న వేధింపులు.. నిశ్చితార్థం జరిగిన మరుసటి రోజే.. -
ఒడిశా దుర్ఘటన.. అతడి ఇంటికి సీబీఐ సీల్
ఢిల్లీ/భువనేశ్వర్: ఒడిశా దుర్ఘటనకు సంబంధించి సీబీఐ దర్యాప్తులో ఆసక్తికర పరిణామం ఒకటి చోటు చేసుకుంది. ఈ కేసుకు సంబంధించి ఓ ఇంటికి సోమవారం సీల్ వేసింది దర్యాప్తు సంస్థ. అదే టైంలో బాలాసోర్ యాక్సిడెంట్ హ్యాష్ ట్యాగ్‌తో అమీర్‌ఖాన్ అనే పేరు ట్విటర్లో ట్రెండ్ అవుతోంది. భారతీయ రైల్వేస్‌లో సిగ్నల్ జూనియర్ ఇంజినీర్‌గా పని చేస్తున్న అమీర్ ఖాన్, అతని కుటుంబంతో సహా ఘటన తర్వాత నుంచి కనిపించకుండా పోయాడు. ఈ క్రమంలో సోమవారం హడావిడిగా అతను ఉంటున్న ఇంటికి చేరుకున్న అధికారులు తాళం గమనించాక.. సీల్ వేసి మరీ వెళ్లడం గమనార్హం. ఆపై సోరోలోని తెంటెయ్ ఛక్‌లో ఉన్న బాహానాగా స్టేషన్ మాస్టర్ ఇంటికి సైతం సీబీఐ బృందం వెళ్లింది. అయితే.. ఈ వ్యవహారంలో మరో ఆసక్తికరమైన విషయం ఇప్పుడు బయటకు వచ్చింది. సిగ్నల్ జేఈ అయిన అమీర్ ఖాన్ బాలాసోర్ ప్రమాద ఘటన జరిగిన రీజియన్‌లోనే పని చేస్తున్నాడు. జూన్ 2వ తేదీ రాత్రి బాలాసోర్ రైలు ప్రమాద ఘటన జరగ్గా.. రంగంలోకి దిగిన సీబీఐ సిగ్నల్ జేఈని రహస్య ప్రదేశంలోకి తీసుకెళ్లి మరీ ప్రశ్నించినట్లు తెలుస్తోంది. దర్యాప్తు సంస్థకు అతనిపై అనుమానాలు ఉన్నాయి. అందుకే నిఘా వేసింది. ఆ తర్వాతే అతను కుటుంబంతో సహా కనిపించకుండా పోయాడు. భారతీయ రైల్వేస్‌లో జూనియర్ సిగ్నల్ ఇంజినీర్ పని ఏంటంటే.. పాయింట్ మెషీన్లు, ఇంటర్‌లాకింగ్ సిస్టమ్‌లు, సిగ్నల్‌లతో సహా సిగ్నలింగ్ పరికరాల ఇన్స్టాలేషన్, నిర్వహణ, మరమ్మత్తును చూసుకుటారు. రైలు సేవలను సాఫీగా మరియు సురక్షితంగా నిర్వహించడంలో ఇవే కీలక పాత్ర పోషిస్తాయి. ఎవరీ జేఈ అమీర్ ఖాన్ ఈ ఉదయం నుంచి ట్విటర్లో బాలాసోర్ ప్రమాదం మళ్లీ ట్రెండ్ అవుతోంది. అందుకు జేఈ అమీర్ ఖాన్ కూడా ఓ కారణం. అతని గురించి వివరాలు తెలుసుకునేందుకు చాలామంది ఆసక్తి చూపుతున్నారు. సోరోలో అన్నపూర్ణ రైలు మిల్లు దగ్గర అతని అద్దె ఇల్లు ఉంది. ఒడిశా ఘోర ప్రమాదం తర్వాత అతని కదలికలపై నిఘా వేసింది సీబీఐ. అతని స్వస్థలం ఏంటి? నేపథ్యం ఏంటన్న విషయాలనూ సీబీఐ వెల్లడించడం లేదు. ఇదీ చదవండి: పోస్ట్‌మార్టం చేస్తుండగా.. గుండె కొట్టుకుంది! -
ఒడిశా: ప్రమాద స్థలంలో ఇంకా మృతదేహాలు ఉన్నాయా?
ఒడిశాలో రైలు ప్రమాదం జరిగిన స్థలం దగ్గర విపరీతమైన దుర్వాసనలు వెలువడుతున్నాయి. దీనిపై ఫిర్యాదు చేసిన స్థానికులు అక్కడ ఇంకా మృతదేహాలు ఉన్నాయనే అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. దీనిపై ఫిర్యాదు అందగానే రైల్వే అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని దుర్వాసన రావడానికి గల కారణాలను తెలుసుకునే పనిలో పడ్డారు. భువనేశ్వర్ అది ఒడిశాలోని బాలాసోర్ పరిధిలోని బహనాగా బాజార్ రైల్వే స్టేషన్. వారం రోజుల క్రితం (జూన్ 2)న ఈ స్టేషన్ సమీపంలో ఘోర రైలు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో 288 మంది ప్రయాణికులు మృతిచెందారు. ఈ ఘటన జరిగిన 7 రోజులు గడిచినా ఇప్పటికీ బహనాగా బాజార్ ప్రజలు ప్రమాద దృశ్యాలను మరువలేకపోతున్నారు. బహనాగా బాజార్ ప్రాంతంలో ఉంటున్నవారు చెబుతున్న దానిప్రకారం సంఘటనా స్థలంలో ఇంకా మృతదేహాలు ఉండే అవకాశం ఉంది. అటువైపు వెళుతున్నప్పుడు దుర్వాసన వెలువడుతోందని వారు చెబుతున్నారు. దీనిపై ఫిర్యాదులు వెల్లువెత్తిన దరిమిలా రైల్వే అధికారులు సంఘటనా స్థలంలో తనిఖీలు చేపట్టగా, ఒక్క మృతదేహం కూడా లభ్యం కాలేదు. ఘటనా స్థలంలో రెండు సార్లు పరిశీలనలు సౌత్ ఈస్ట్రన్ రైల్వే సీపీఆర్ఓ ఆదిత్య కుమార్ చౌదరి మాట్లాడుతూ ఎన్డీఆర్ఎఫ్ సంఘటనా స్థలంలో రెండుసార్లు పరిశీలనలు జరిపిందని, ఆ తరువాతనే సైట్ క్లియరెన్స్ ఇచ్చిందని తెలిపారు. ఇది జరిగిన తరువాత కూడా స్థానికుల ఫిర్యాదుతో రాష్ట్రప్రభుత్వ అధికారుల బృందం సంఘటనా స్థలంలో పరిశీలనలు జరిపిందన్నారు. అయితే సంఘటనా స్థలంలోవున్న గుడ్ల కారణంగానే ఈ విధమైన దుర్వాసన వస్తున్నదన్నారు. ఇది కూడా చదవండి: దేశానికి మరో ముప్పు ఉంది దుర్ఘటన సమయంలో 4 టన్నుల గుడ్ల రవాణా రైల్వే సీపీఆర్ఓ తెలిపిన వివరాల ప్రకారం యశ్వత్‌పూర్- హౌరా ఎక్స్‌ప్రెస్‌లో సుమారు 4 టన్నుల గుడ్లు లోడ్ చేశారు. ప్రమాద సమయంలో ఆ గుడ్లన్నీ పగిలిపోయాయి. ఈ ఘటన జరిగి ఏడు రోజులు కావడంతో ఆ గుడ్లన్నీ విపరీతంగా కుళ్లిపోయాయి. అందుకే ఇప్పుడు ఆ ప్రాంతంలో విపరీతమైన దుర్వాసన వస్తున్నదన్నారు. ఈ గుడ్ల చెత్తను తొలగించేందుకు బాలాసోర్ మున్సిపల్ సిబ్బంది సహాయం తీసుకుంటున్నామన్నారు. ఇది కూడా చదవండి: మృతదేహాలను ఉంచిన స్కూల్ కూల్చివేత -
కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ యాక్సిడెంట్ వీడియో
-
ఒడిశా కోరమాండల్ ప్రమాద వీడియో వైరల్!
Balasore Train Accident Video Viral: ఒడిశా బాలేశ్వర్ వద్ద ఘోర ప్రమాదానికి గురైన కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ ప్రమాద వీడియో ఇదేనంటూ ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పైగా ఒడిశా ఛానెల్స్ కూడా ఈ వీడియోను అధికారికమేనంటూ తెరపైకి తెచ్చాయి. ప్రమాదానికి ముందు క్షణాలంటూ ఆ వీడియో ఆధారంగా కథనాలు ప్రసారం చేస్తున్నాయి. మీరు ఒకవేళ సున్నిత మనస్కులు అయితే గనుక దయచేసి ఈ వీడియో చూడకండి. ఒడిశాలో జూన్ 2వ తేదీ సాయంత్రం కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ ఘోర ప్రమాదానికి గురైంది. అయితే ప్రమాదానికి ముందు వీడియో అంటూ ఒకటి వైరల్ అవుతోంది. అందులో కోరమాండల్ ఎక్స్‌ప్రెస్‌గా చెప్తున్న రైలులో.. రైల్వే సిబ్బంది కోచ్ ఫ్లోర్ ను శుభ్రం చేస్తున్నాడు. సాయంత్రం ఏడు గంటల ప్రాంతంలో ప్రయాణికులు ప్రశాంతంగా కొందరు పడుకోగా.. మరికొందరు తమ పనుల్లో బిజీగా ఉన్నారు. ఎవరో తన మొబైల్లో అదంతా రికార్డు చేస్తున్నారు. అంతలో.. ఒక్కసారిగా కల్లోల పరిస్థితి.. హాహాకారాలతో వీడియో ఆగిపోయింది. ఈ వీడియోనే కోరమాండల్ప్రమాద వీడియో అంటూ విస్తృతంగా షేర్ అవుతోంది. కానీ ఇది ఒడిశా రైలు ప్రమాదానికి చెందినదా ? కాదా ? అనే విషయంపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. రైల్వేశాఖ, ఒడిశా అధికార యంత్రాంగం సైతం దీనిపై స్పందించాల్సి ఉంది. ఇదిలా ఉంటే.. ఒడిశా ఘోర ప్రమాదంలో మృతుల సంఖ్య 288కి చేరింది. ఈ మృతదేహాల్లో ఇంకా 82 మందిని గుర్తించాల్సి ఉంది. బాడీలు పాడైపోయే అవకాశం ఉండడంతో వీలైనంత త్వరగా వాటిని బంధువులకు అప్పగించే ప్రయత్నంలో అధికారులు తలమునకలయ్యారు. డీఎన్ఏ టెస్టులు సహా చివరి ఆప్షన్‌గా ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్‌ని ఉపయోగించాలని నిర్ణయించారు. -
Odisha tragedy: 51 గంటల నాన్‌స్టాప్ ఆపరేషన్.. ఆయన వల్లే ఇదంతా!
కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ ప్రమాదం జరిగిన తీరు.. అక్కడి దృశ్యాలను చూసిన వాళ్లెవరైనా.. అది ఎంత తీవ్రమైందో అంచనా వేసేయొచ్చు. అలాంటిది సహాయక చర్యల దగ్గరి నుంచి.. తిరిగి పట్టాలపై ఆ రూట్లో రైళ్లు పరుగులు తీయడం దాకా.. అంతా జెట్స్పీడ్తో జరిగింది. మునుపెన్నడూ లేనంతగా కేవలం 51 గంటల్లో ఈ ఆపరేషన్ ముగిసింది. ఎలా?.. అందుకు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రధాన కారణమని చెప్పొచ్చు. గతంలో మన దేశంలో రైలు ప్రమాదాలు జరిగినప్పుడల్లా.. రైల్వే మంత్రిని రాజీనామా చేయాలనే డిమాండ్ తెరపైకి రావడం, అందుకు తగ్గట్లే కొందరు రాజీనామాలు చేసిన సందర్భాలు ఉన్నాయి. కానీ, బాలాసోర్ ఘటన వేళ.. అశ్విని వైష్ణవ్ త్వరగతిన స్పందించిన తీరు, స్వయంగా ఆపరేషన్‌ను ఆయనే దగ్గరుండి పరిశీలించడం లాంటివి ఆయన మీద ప్రతికూల విమర్శలు రాకుండా చేశాయి. ⛑️ ప్రమాదం జరిగిన గంటల్లోపే రైల్వే మంత్రి అశ్వని వైష్ణవ్ ఘటనా స్థలికి చేరుకున్నారు. సీఎం నవీన్ పట్నాయక్ కంటే ముందుగానే.. వేకువ ఝామున అక్కడికి చేరుకుని ప్రమాద తీవ్రతను, సహాయక చర్యలను ఆయన పర్యవేక్షించడం మొదలుపెట్టారు. అక్కడి నుంచి సహాయ, పునరావాస చర్యల వేగం ఊపందుకుంది. అశ్వినీ వైష్ణవ్ ఒకప్పుడు బాలాసోర్ జిల్లాకు కలెక్టర్ గా పనిచేశారు. అలాగే.. 1999లో ఒరిస్సా(ఇప్పటి ఒడిశా) భారీ తుఫాను ముప్పును సమర్థంగా ఎదుర్కొన్న అనుభవమూ ఆయనకు ఈ సందర్భంగా పనికొచ్చాయి. ⛑️ జరిగింది భారీ ప్రమాదం. గత రెండు దశాబ్దాల్లో ఇలాంటిది ఎరిగింది లేదు. ఒకవైపు శవాల గుట్టలు.. మరోవైపు పెద్ద సంఖ్యలో బాధితులు. పకడ్బందీ కార్యాచరణ, ప్రణాళిక లేకుండా ఈ ఆపరేషన్ ముందుకు తీసుకెళ్లడం కష్టం. ఆ స్థానంలో ఎవరున్నా ఇబ్బందిపడేవాళ్లేమో!. కానీ, విపత్తుల నిర్వహణపై ఆయనకున్న అవగాహన, గత అనుభవం.. బాలాసోర్ ప్రమాద వేళ సాయపడింది. అధికారులతో మాట్లాడి, సాంకేతిక సమస్యలను అధిగమించే వ్యూహ ప్రణాళిక సిద్ధం చేశారు. స్వయంగా ఆయనే దగ్గరుండి అంతా పర్యవేక్షించారు. VIDEO | Union Railway Minister Ashwini Vaishnaw inspects the restoration work at the triple train accident site in Odisha’s Balasore. pic.twitter.com/U7Xno9BDpt — Press Trust of India (@PTI_News) June 4, 2023 ⛑️ 2, 300 మంది సిబ్బంది.. రైల్వే శాఖ నుంచి ఎనిమిది బృందాలు వెంటనే రంగంలోకి దిగాయి. ప్రతి రెండు బృందాలను సీనియర్ సెక్షన్ ఇంజనీర్లు వేర్వేరుగా పర్యవేక్షించారు. ఆ సీనియర్ సెక్షన్ ఇంజనీర్లపై డివిజనల్ రైల్వే మేనేజర్, జనరల్ మేనేజర్ పర్యవేక్షణ కొనసాగింది. వారిని రైల్వే బోర్డు సభ్యులు పర్యవేక్షించారు. #WATCH | Odisha: Union Railway Minister Ashwini Vaishnaw takes stock of the restoration work that is underway overnight at the site where #Balasoretrainaccident took place pic.twitter.com/TkulNKv3H7 — ANI (@ANI) June 3, 2023 ⛑️ బాధితులను వేగంగా ఆసుపత్రులకు తరలించడం, ఆసుపత్రుల్లో చేరిన వారికి మెరుగైన చికిత్స అందేలా చూసేందుకు కూడా మంత్రి అశ్విని వైష్ణవ్ ఆదేశాలు ఇచ్చారు. రైల్వే బోర్డు చైర్మన్ ను కటక్ హాస్పిటల్ కు, డైరెక్టర్ జనరల్ హెల్త్ ను భువనేశ్వర్ హాస్పిటల్ కు పంపించారు. ⛑️ నాలుగు కెమెరాలను క్షేత్రస్థాయి సిబ్బందికి అందించారు. ప్రమాద స్థలంలో సహాయక కార్యక్రమాల తీరును ఆ కెమెరాల సాయంతో సీనియర్ అధికారులు నిరంతరం పర్యవేక్షించారు. ఎప్పటికప్పుడు పురోగతిని మంత్రికి అందించారు. సాధ్యమైనంత మేర మరణాలను తగ్గించడం, ! బాధితులకు మెరుగైన చికిత్స అందించడం, వేగంగా పునరుద్ధరణ పనులు చేపట్టడం.. ⛑️ ఇవే లక్ష్యాలుగా ఆయన ఆధ్వర్యంలో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగింది. అలా 51 గంటల్లోనే మంత్రి అశ్విని వైష్ణవ్ నాయకత్వంలో రైలు సేవలను పునరుద్ధరించగలిగారు. ఈ నెల 2న రాత్రి ఒడిశాలోని బాలాసోర్ జిల్లా బహానగ రైల్వే స్టేషన్ సమీపంలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. లూప్ లైన్ లో ఆగి ఉన్న గూడ్స్ రైలును కోరమాండల్ ఎక్స్ ప్రెస్ 130 కిలోమీటర్ల వేగంతో ఢీకొట్టింది. బోగీలు పట్టాలు తప్పాయి. అదే సమయంలో మెయిల్ లైన్ లో వెళుతున్న యశ్వంత్ పూర్ హౌరా ఎక్స్ ప్రెస్ పట్టాలు తప్పిన కోరమాండల్ బోగీలను ఢీకొట్టింది. ఈ ఘోర ప్రమాదంలో ఇప్పటికి 288 మంది మరణించారు. -
బాలాసోర్ ఘటనపై సీబీఐ ఎఫ్ఐఆర్
భువనేశ్వర్: బాలాసోర్ రైలు ప్రమాద దుర్ఘటనపై సీబీఐ దర్యాప్తు మొదలైంది. మంగళవారం ఉదయం ఘటనా స్థలానికి టెక్నికల్ టీంతో పాటుగా చేరుకున్నారు సీబీఐ అధికారులు. ఆపై ఐపీసీలోని వివిధ సెక్షన్ల ప్రకారం.. సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ ఉదయం ప్రమాదం జరిగిన రైల్వే ట్రాక్, సిగ్నల్ రూమ్‌ను సీబీఐ అధికారుల బృందం పరిశీలించింది. ఆపై ప్రమాద స్థలికి దగ్గర్లో ఉన్న బహనాగా బజార్ రైల్వే స్టేషన్‌కు చేరుకుని.. అక్కడి అధికారులతో మాట్లాడి వివరాలు సేకరించింది. ఆపై రైల్వే పోలీసులు నమోదు చేసిన కేసు ఆధారంగానే సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. ఒడిశా పోలీసులు ఇదివరకే ఈ ప్రమాద ఘటనపై కేసు ఫైల్ చేశారు. నిర్లక్ష్యం, ప్రాణ హాని తలపెట్టడం లాంటి అభియోగాలను అందులో నమోదు చేశారు.ఇంటర్ లాకింగ్ సిస్టమ్ మార్చడమే ప్రమాదానికి కారణమని రైల్వే శాఖ ఇదివరకే ప్రకటించుకుంది. ఈ కోణంలోనే సీబీఐ దర్యాప్తు కొనసాగనుందని తెలుస్తోంది. సిగ్నల్ ఫెయిలా? మరేదైనా కారణమా? అనే కోణాల్లో దర్యాప్తు కొనసాగుతోంది. మరోవైపు ఈ ఘటనపై భద్రతా కమిషన్ విచారణ కొనసాగుతోంది. మానవ తప్పిదమా? విధ్వంసమా? లేదంటే సాంకేతిక తప్పిదామా?.. సీబీఐ దర్యాప్తులో ఏం తేలనుందో చూడాలి. జూన్ 2వ తేదీ సాయంత్రం ఏడు గంటల ప్రాంతంలో జరిగిన మూడు రైళ్ల ఢీ ఘోర ప్రమాదం.. 278 మంది బలిగొంది(ఇప్పటివరకు). మరో 800 మంది గాయలపాలయ్యారు. ఇదీ చదవండి: ఒడిశా ఘటన.. అయినవాళ్లు ఎక్కడ? -
బాలాసోర్‌లోని ప్రమాద స్థాలానికి సీబీఐ అధికారులు
-
‘బాలాసోర్’ కళ్లు తెరిపిస్తుందా?
ఒడిశాలోని బాలాసోర్ సమీపంలో రైళ్లు ఢీకొన్న ఘోర ఉదంతం చోటు చేసుకుని మూడు రోజులు గడుస్తోంది. ఇప్పటికీ అనేక కుటుంబాలు తమ ఆప్తుల ఆచూకీ తెలియక తల్లడిల్లుతున్నాయి. 187 మృత దేహాలను ఇంకా గుర్తించాల్సివుందంటున్నారు. శుక్రవారం సంజె చీకట్లు అలుముకుంటున్న వేళ హౌరా నుంచి చెన్నైకి వేగంగా వెళ్తున్న కోరమండల్ ఎక్స్‌ప్రెస్ లూప్ లైన్లోకి ప్రవేశించి అక్కడున్న గూడ్స్ రైలును ఢీకొట్టడం, ఆ ప్రమాదంలో చెల్లాచెదురుగా పడిన బోగీల్లో ఒకటి రెండు పక్క ట్రాక్‌పై పడడం, ఆ ట్రాక్‌పై వెళ్లే బెంగళూరు– హౌరా యశ్వంత్‌పూర్ ఎక్స్‌ప్రెస్ సైతం ప్రమాదంలో చిక్కుకోవడం ఊహకందని ఉత్పాతం. మృతుల సంఖ్య 275 వరకూ ఉండగా, 1100 మంది గాయపడ్డారు. వీరిలో కనీసం వందమంది వరకూ తీవ్ర గాయాలపాలైనవారున్నారు. విద్రోహ చర్యనో, సాంకేతిక తప్పిదమో ఇంకా నిర్ధారించాల్సే ఉన్నా ఆ దుర్ఘటన వందలాది కుటుంబాల భవితవ్యాన్ని తలకిందులు చేసింది. అనేకులు శాశ్వత అంగవైకల్యం బారినపడ్డారు. సహాయ బృందాలు వచ్చేలోగా స్థానికులు చూపిన చొరవ ఎన్నో ప్రాణాలను కాపాడింది. ఇది విద్రోహ చర్య కావొచ్చని ప్రాథమికంగా నిర్ధారణకొచ్చామని రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ చెబుతున్నారు. కారకులెవరో కూడా తెలిసిందంటున్నారు. ఈ వ్యవహారంలో సీబీఐ దర్యాప్తు కూడా ఉంటుంది. ఉద్దేశపూర్వకంగా ఎలక్ట్రానిక్ ఇంటర్ లాకింగ్ వ్యవస్థలో మార్పులు చేయడాన్ని కొట్టిపారేయ లేమన్నది రైల్వే అధికారుల మాట. చెప్పడానికి ఇది బాగానేవున్నా... ఆ వ్యవస్థలో లోపాన్ని గుర్తించి మొన్న ఫిబ్రవరిలో నైరుతి రైల్వే జోన్ చీఫ్ ఆపరేటింగ్ మేనేజర్ రాసిన లేఖ విషయంలో దేశవ్యాప్తంగా తీసుకున్న చర్యలేమిటో ఉన్నతాధికారులు వెల్లడించాలి. ఆ లేఖలోని అంశాలు భీతి గొలుపుతాయి. ఆ నెల 8న బెంగళూరు నుంచి న్యూఢిల్లీ వెళ్లే సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్‌కు ఇప్పుడు బాలాసోర్‌లో కోరమండల్‌కు ఎదురైన లాంటి సమస్యే వచ్చింది. మెయిన్ లైన్లో పోవచ్చని వచ్చిన సిగ్నల్‌కు భిన్నంగా ట్రాక్ మారటాన్ని గమనించి లోకో పైలట్ వెంటనే రైలును నిలిపివేశాడు.లేకుంటే అది కూడా పెను ప్రమాదంలో చిక్కుకునేది. మన దేశంలో అత్యాధునిక వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు వరసగా పట్టాలెక్కుతున్నాయి. అహ్మదాబాద్ – ముంబై మధ్య బుల్లెట్ ట్రైన్ పనులు నడుస్తున్నాయి. కానీ మన రైల్వేల పనితీరు అంతంత మాత్రమే. రోజూ మన రైళ్లు 2 కోట్ల 20 లక్షల మంది ప్రయాణికుల్ని గమ్యస్థానాలకు చేరుస్తున్నాయి. 1950లో ఉన్న మన రైల్వే ట్రాక్‌ల నిడివి 53,596 కిలోమీటర్లయితే, ఇప్పుడది 68,100 కి.మీ.కి చేరుకుంది. అప్పట్లో మన రైల్వే ట్రాక్‌ల నిడివిలో సగం కన్నా తక్కువగా...అంటే 21,800 కి.మీ. మాత్రమే ఉన్న చైనాలో 1997 నాటికి 66,000 కిలోమీటర్లకు చేరుకోగా, ప్రస్తుతం అది 1,55,000 కి.మీ ఉందని అంచనా. అంటే మనకు రెట్టింపు అన్నమాట. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ అధికారంలోకి వచ్చేనాటికి ఉన్న కేటాయింపులతో పోలిస్తే ఇప్పుడు రైల్వే కేటాయింపులు అయిదు రెట్ల వరకూ పెరిగిన మాట వాస్తవమే అయినా... దానికి తగినట్టు సదుపాయాలు పెరుగు తున్న దాఖలా గానీ, మెరుగైన బోగీలు తెస్తున్న తీరు గానీ కనబడటం లేదు. భద్రతా అంశాలు సరేసరి. తరచుగా రైళ్లలో ప్రయాణించేవారికి ఇవన్నీ నిత్యానుభవం. ప్రభుత్వ రంగ ఉద్యోగాలు రోజురోజుకూ కుంచించుకుపోతున్నాయి. రైల్వే శాఖ కూడా దీనికి మినహాయింపు కాదు. మొన్న జనవరి గణాంకాల ప్రకారం ఆ శాఖలో 3.12 లక్షల నాన్ గెజిటెడ్ పోస్టులు ఖాళీగా పడి వున్నాయి. వీటిల్లో చాలా పోస్టులు భద్రత, నిర్వహణ, ఇంజినీరింగ్ విభాగాలకు సంబంధించినవే. సెంట్రల్ రైల్వేలో భద్రతకు సంబంధించిన విభాగంలో 28,650 పోస్టులుంటే అందులో సగం ఖాళీలే. కొత్త రైళ్లు వస్తున్నాయి. వాటి వేగం కూడా పెరుగుతోంది. కానీ అందుకు తగినట్టుగా ట్రాక్‌లు ఉంటున్నాయా? సిబ్బంది పెరుగుతున్నారా? పాలకులు ఆత్మవిమర్శ చేసుకోవాలి. వేగవంతమైన రైళ్లు వచ్చాయని సంబరపడుతున్నాం గానీ...ఇప్పటికీ మన రైళ్ల సగటు వేగం గంటకు 50 కిలోమీటర్లు మించడం లేదు. దీన్ని అయిదేళ్లలో 75 కిలోమీటర్లకు పెంచుతామని 2017లో రైల్వే బోర్డు ప్రకటించింది. కానీ అది కలగా మిగిలిందని ఇటీవలే కాగ్ అక్షింతలు వేసింది. జపాన్, చైనా, టర్కీ, ఫ్రాన్స్, జర్మనీ, బ్రిటన్లలో రైళ్ల సగటు వేగం 150 – 250 కిలోమీటర్ల మధ్య ఉంటుంది. మన రైళ్ల సగటు వేగం నాసిరకంగా ఉన్నా భద్రతాపరంగా మెరుగైన స్థితిలో ఉండలేకపోతున్నాం. రైళ్లు పెరిగినా, వాటి వేగం పుంజుకున్నా అందుకు అనుగుణంగా ట్రాక్‌లు పెరగకపోవటం వల్ల ఉన్న ట్రాక్‌లపైనే ఒత్తిడి పెరుగుతోంది. ట్రాక్‌ల నిర్వహణ, విద్యుత్, సిగ్నలింగ్ వ్యవస్థల పర్యవేక్షణ వంటివి సక్రమంగా సాగటం లేదు. మరమ్మత్తుల కోసం రైళ్లను ఆపాల్సి రావటంతో ‘సూపర్ ఫాస్ట్’ భుజకీర్తులు తగిలించుకున్న రైళ్లు కూడా సకాలంలో గమ్యం చేరటం లేదు. రైళ్లను ఎక్కువగా వినియోగించేది సామాన్యులు, మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి పౌరులు. ఇప్పుడు ప్రమాదంలో చిక్కుకున్న కోరమండల్, యశ్వంత్‌పూర్ ఎక్స్‌ప్రెస్‌ల మృతుల్లో ఎక్కువ మంది వలస వెళ్లక తప్పని బడుగుజీవులే కావటం యాదృచ్ఛికం కాదు. బాలాసోర్ ఉదంతం మన పాలకుల కళ్లు తెరిపించాలి. ఇతర సర్కారీ కొలువుల మాటెలావున్నా భద్రతకు అగ్ర ప్రాధాన్యమిచ్చి రైల్వేల్లో కొన్నేళ్ళుగా అలా ఉంచేసిన లక్షలాది ఖాళీలన్నిటినీ భర్తీ చేయాలి. ఆదాయం తప్ప మరేమీ పట్టని ధోరణి ఇకనైనా మారాలి. మౌలిక సదుపాయాల మెరుగుదల, భద్రతకు ప్రాధాన్యం లాంటి అంశాల్లో రాజీ పనికిరాదు. -
బాలేశ్వర్ లో ఎటుచూసినా కన్నీటి సూడులే
-
ఒడిశా రైలు ప్రమాదం: అయినవారి ఆచూకీ తెలియక...
ఒడిశాలోని బాలాసోర్‌లో అత్యంత ఘోర రైలు ప్రమాదం చోటుచేసుకున్న విషయం విదితమే. ఈ ప్రమాదంతో 275కు పైగా ప్రయాణికులు మృతిచెందారు. 1175 మంది ప్రయాణికులు గాయపడ్డారు. ఈ ప్రమాదం చాలా కుటుంబాల్లో తీవ్ర విషాదం నింపింది. మృతుల సంఖ్య వందల్లో ఉండటంతో వారిని గుర్తించడం కష్టంగా మారింది. మరోవైపు రైలులో వెళ్లిన తమ వారు ఎలా ఉన్నారో, ఎక్కడున్నారో తెలియక ఇప్పటికీ చాలామంది ఆసుపత్రులలో వెదుకులాట సాగిస్తున్నారు. అటువంటివారిలో విజేంద్ర రిషిదేవ్ ఒకరు. ఆయన తన కుమారుడు సూరజ్ ఆచూకీ తెలియక తల్లడిల్లిపోతున్నారు. ఈ నేపధ్యంలో అతను బాలాసోర్ చేరుకుని బహానాగా హైస్కూలులోని శవాగారం దగ్గరకు వచ్చి కుమారుని కోసం వెదుకులాట సాగించారు. అయినా ఫలితం లేకపోయింది. సూరజ్ తన అన్నదమ్ములతో కలసి ఉద్యోగవేటలో చెన్నై వెళుతున్నారు. ఇంతలోనే ఈ ప్రమాదం చోటుచేసుకుంది. 40 ఏళ్ల విజేంద్ర బీహార్‌లోని పూర్ణియాలో కూలి పనులు చేస్తుంటాడు. టెన్త్ పాసయిన సూరజ్ తన సోదరునితో కలసి చెన్నైలో ఉద్యోగం చేయాలని బయలుదేరాడు. మరో బాధితుడు వినోద్ దాస్ ఈ ప్రమాదంలో తన భర్య ఝరన్ దాస్(42), కుమార్తె విష్ణుప్రియదాస్(24), కుమారుడు సందీప్ దాస్(21)లను కోల్పోయాడు. 48 ఏళ్ల వినోద్ దాస్ తన కుటుంబ సభ్యుల మృతదేహాలను గుర్తుపట్టారు. వారి మృతదేహాలు ఎన్ఓసీసీఐ పార్కువద్ద ఏర్పాటు చేసిన శవాగారంలో ఉన్నట్లు గుర్తించారు. కాగా బీహార్‌లోని సమస్తీపూర్ జిల్లాకు చందిన అజోతీ పాశ్వాన్ ఈ రైలు ప్రమాదంలో గాయపడ్డారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ తాను బెంగళూరు నుంచి వస్తున్నానని, తనతోపాటు తన భార్య, ఏకైక కుమారుడు కూడా ఉన్నారన్నారు. తన భార్య గాయాలపాలై చికిత్స పొందుతున్నదని, కుమారుని ఆచూకీ ఇంతవరకూ లభ్యంకాలేదని తెలిపారు. చదవండి: బాలాసోర్ రైలు ప్రమాదం: ‘కూతురి మొండితనమే ప్రాణాలు నిలబెట్టింది’ -
ట్రాక్ పునరుద్ధరణ తర్వాత వందే భారత్ రైలు ట్రయిల్ రన్
-
ఒడిశా రైలు ప్రమాదం.. 51 గంటల్లోనే ట్రాక్ రెడీ..
భువనేశ్వర్: ఒడిశాలోని బాలాసోర్‌లో జరిగిన రైలుప్రమాదం స్థలంలో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ప్రమాదం జరిగిన ప్రాంతంలో రెండు ట్రాక్‌ల పునరుద్ధరణ పూర్తయ్యింది. కేవలం 51 గంటల్లోనే.. ప్రమాదస్థలంలో ధ్వంసమైన ట్రాక్ పునరుద్ధరణ పనులు పూర్తిచేసింది. ఒడిశా- పశ్చిమబెంగాల్ రూట్లో యధావిధిగా రైళ్ల రాకపోకలు సాగుతున్నాయి. ట్రాక్ పునరుద్ధరణ తర్వాత వందేభారత్ రైలు ట్రయల్ రన్ చేపట్టారు. హౌరా-పుదుచ్చేరి ఎక్స్‌ప్రెస్‌కు అనుమతించారు. రద్దు చేసిన అన్ని రైళ్లను రీషెడ్యూల్ చేస్తున్నారు. కాగా దేశాన్ని కుదిపేసిన ఒడిశా రైళ్ల ప్రమాదంపై సీబీఐ విచారణ జరిపించాలని రైల్వే శాఖ నిర్ణయించింది. ప్రమాదానికి మూలకారణాన్ని, ఈ ‘నేరపూరిత’ చర్యకు ప్రధాన కారకులను ఇప్పటికే గుర్తించినట్టు ఆదివారం రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ ప్రకటించిన కాసేపటికే ఈ మేరకు ప్రకటన వెలువడింది. ప్రమాదంలో మరణించిన వారి తుది సంఖ్యను . 275గా రైల్వే శాఖ ఆదివారం ప్రకటించింది. #WATCH | Howrah - Puri Vande Bharat Express crosses from Odisha’s Balasore where the deadly #TrainAccident took place on June 2. Indian Railways resumed train movement on the affected tracks within 51 hours of the accident. pic.twitter.com/myosAUgC4H — ANI (@ANI) June 5, 2023 -
కోరమండల్ ప్రమాద భాదితులతో చెన్నైకి ప్రత్యేక రైలు
-
ఐరన్ ఓర్‌తో ఉన్న గూడ్స్‌ను కోరమండల్ ఢీకొట్టింది: జయవర్మ సిన్హా
ఢిల్లీ: ఒడిశాలోని బాలాసోర్ వద్ద ఘోర రైలు ప్రమాద ఘటన కీలక విషయాలు వెల్లడించారు రైల్వే బోర్డు మెంబర్ జయవర్మ సిన్హా. సిగ్నలింగ్ సమస్య వల్లే ప్రమాదం జరిగినట్టు ప్రాథమిక విచారణలో తేలిందన్నారు. బహనాగ స్టేషన్ వద్ద ప్రమాదం జరిగిందని చెప్పుకొచ్చారు. కాగా, రైలు ప్రమాద ఘటన నేపథ్యంలో రైల్వే బోర్డు మెంబర్ జయవర్మ ఆదివారం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్బంగా జయవర్మ సిన్హా మాట్లాడుతూ.. ఈ ప్రమాదానికి ఓవర్ స్పీడ్ కారణం కాదు. ఈ ప్రమాద సమయంలో కోరమండల్ ఎక్స్‌ప్రెస్ గంటకు 128 కిలోమీటర్ల వేగంతో వస్తోంది. యశ్వంత్‌పూర్ ఎక్స్‌ప్రెస్ గంటకు 124 కిలోమీటర్ల వేగంతో నడుస్తోంది. రెండు రైళ్లు నిర్ధేశిత వేగంతోనే వెళ్తున్నాయి. #WATCH | The goods train did not get derailed. Since the goods train was carrying iron ores, the maximum damage of the impact was on Coromandel Express. This is the reason for a huge number of deaths and injuries. The derailed bogies of Coromandel Express came on the down line,… pic.twitter.com/DnjheT8NSn — ANI (@ANI) June 4, 2023 కోరమండల్ రైలు లూప్ లైన్లోకి వెళ్లింది. బహనాగ స్టేషన్ వద్ద రెండు లూప్లైన్లు, రెండు మెయిన్ లైన్స్ ఉన్నాయి. లూప్ లైన్లో ఉన్న గూడ్స్ రైలులో భారీగా ఐరన్ ఓర్ ఉంది. గూడ్స్ రైలును కోరమండల్ రైలు ఢీకొట్టింది. దీంతో, ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉంది. అయితే, సిగ్నలింగ్ సమస్యల వల్లే ప్రమాదం జరిగినట్టు ప్రాథమిక విచారణలో తేలింది. రైలు ప్రమాదంపై సమగ్ర దర్యాప్తు చేస్తున్నామని స్పష్టం చేశారు. ఇది కూడా చదవండి: రైలు ప్రమాద బాధితులకు అండగా నిలిచిన సీఎం జగన్.. పరిహారం వివరాలు ఇవే.. -
దేశంలో రైలు ప్రమాదం ఎక్కడ జరిగిన ఆ ప్రభావం కాజీపేట జంక్షన్పైనే...
కాజీపేట రూరల్: కోరమండల్ ఎక్స్‌ప్రెస్ ఘటనతో ప్రజలు ఒక్కసారిగా ఉలికిపాటుకు గురయ్యారు. దేశంలో ఎక్కడైనా రైల్వే వ్యవస్థకు ఆటంకాలు, ప్రమాదాలు జరిగితే ఆ ప్రభావం కాజీపేట జంక్షన్‌పై పడుతుంది. చాలారైళ్లు కాజీపేట మీదుగా వెళ్లాల్సి ఉంటుంది. వరంగల్, కాజీపేట రైల్వేస్టేషన్ల మీదుగా ప్రతి రోజూ 200 వరకు రైళ్ల రాకపోకలు సాగిస్తుంటాయి. ఒడిశా రాష్ట్రం బాలాసోర్ వద్ద కోరమండల్ ఎక్స్‌ప్రెస్ ఘటన ఎలా జరిగింది.. ఎంతమంది చనిపోయారు, అందులో తెలంగాణ వారు ఎవరైనా.. ఉన్నారా.. ఉమ్మడి జిల్లావాసులు ఎవరైనా ఉన్నారా అని తెలుసుకునేందుకు ప్రజలు ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో గతంలో కాజీపేట సబ్ డివిజన్ పరిధిలో జరిగిన పలు రైలు దుర్ఘటనలను జనాలు మరోసారి గుర్తు చేసుకుంటున్నారు. కాపలాలేని రైల్వేగేట్లు కాజీపేట సబ్ డివిజన్ పరిధిలో రైల్వేశాఖ కాపలా లేని రైల్వేగేట్లను ఎత్తివేసింది. కాజీపేట–ఆలేరు, వరంగల్ రూట్లో, హసన్‌పర్తి రూట్లో రైల్వే లెవెల్‌క్రాసింగ్ గేట్లు సుమారు 30 వరకు ఉన్నాయి. ఈ గేట్ల వద్ద గేట్మెన్లు విధులు నిర్వహిస్తున్నారు. వందేభారత్ ఎక్స్‌ప్రెస్ ప్రవేశంతో 160 కేఎంపీహెచ్ స్పీడ్‌తో ఈ రైలు వెళ్తున్న నేపథ్యంలో రైల్వే గేట్ల స్థానంలో ఆర్యూబీ నిర్మాణాలు చేపట్టాలని రైల్వేశాఖ నిర్ణయించి అన్ని రైల్వే జోన్లకు ఆదేశాలు జారీ చేయగా అధికారులు ప్రతిపాదనల పనిలో నిమగ్నమయ్యారు. టార్గెట్, ఎకనామీ పేరుతో రైల్వే ఉన్నతాధికారులు వర్క్ టార్గెట్, ఎకనామీ, రైల్వే యూనిట్ల ఎత్తివేత, రైళ్ల నిర్వాహణ లోపం, ప్రైవేటీకరణ పేరుతో సిబ్బందిని కుదిస్తూ, తక్కువ మందితో ఎక్కువ పని చేయిస్తున్నారని కార్మిక నాయకులు ఆరోపిస్తున్నారు. పెంచిన రైళ్లకు అనుగుణంగా సిబ్బందిని భర్తీ చేయడంలో రైల్వే విఫలమవుతోందని అంటున్నారు. ఎల్‌హెచ్‌బీ బోగీలు డేంజర్ ప్రస్తుతం ఎల్‌హెచ్‌బీ బోగీలను రైల్వేశాఖ ప్రవేశపెట్టి నడిపిస్తోంది. ఈ కోచ్‌లు చాలా తేలికపాటిగా ఉంటాయని, ట్రాక్‌పై త్వరగా వేగం అందుకుంటాయని రైల్వే నాయకులు అంటున్నారు. ఏమైన రైలు ప్రమాదాలు జరిగితే బోగీలు చల్లా చెదురైతాయని చెబుతున్నారు. గతంలో రైలు బోగీలు మందపు ఐరన్‌తో తయారు చేసేవని, ట్రాక్‌పై కావాలి్సన వేగంతో వెళ్లేవని, ప్రమాదాలు జరిగినప్పుడు బోగీల ప్రమాద తీవ్రత తక్కువగా ఉండేదని అంటున్నారు. కోరమండల్ ఘటనలో ఎల్‌హెచ్‌బీ బోగీలు ఉండడం వల్లే తీవ్రత పెరిగిందన్న అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈస్ట్‌కోస్ట్ ఎక్స్‌ప్రెస్‌లు రద్దు వరంగల్, కాజీపేట జంక్షన్ మీదుగా షాలిమార్–హైదరాబాద్ (18045) ఎక్స్‌ప్రెస్, హైదరాబాద్–షాలిమార్ (18046) ఎక్స్‌ప్రెస్‌ను దక్షిణ మధ్య రైల్వే అధికారులు శనివారం రద్దు చేస్తున్నట్లు ప్రకటి ంచినట్లు స్థానిక అధికారులు తెలిపారు. కోరమండ ల్ ఎక్స్‌ప్రెస్ ఘటనతో ఈ రైళ్లను రద్దు చేస్తున్నట్లు, మరికొన్ని రైళ్లను విజయవాడ అవతల రూట్లోను ంచి దారి మళ్లించి నడిపిస్తున్నట్లు వారు తెలిపారు. కాజీపేట సబ్ డివిజన్ పరిధిలో జరిగిన రైలు దుర్ఘటనలు 1954 సెప్టెంబర్ 27న జనగామ జిల్లాలోని యశ్వంతపూర్ వాగులో నిజాముదీ్దన్ (దక్షిణ్) ఎక్స్‌ప్రెస్ బోగీలు కొట్టుకుపోగా 300మంది మృత్యువాత పడ్డారు. 1983లో రాళ్లపేట–ఆసిఫాబాద్ మధ్య తమిళనాడు ఎక్స్‌ప్రెస్ పట్టాలు తప్పిన ఘటనలో 640 మంది చనిపోయారు. అప్పటి తమిళనాడు ముఖ్యమంత్రి ఎంజీఆర్ ఘటన స్థలికి చేరుకున్నారు. ► 1986లో మంచిర్యాల–రవీంద్రఖని మధ్య బ్రిడ్జి వంతెన తెగడంతో దక్షిణ్ ఎక్స్‌ప్రెస్ బోగీలు కొట్టుకుపోయాయి. ఈ ఘటనలో 300మంది ప్రయాణికులు మరణించారు. ► వరంగల్ రైల్వేస్టేషన్లో 2003 జూలై 2న గోల్కొండ ఎక్స్‌ప్రెస్ బ్రేక్‌లు ఫెయిల్యూర్ అయి షాండ్హంప్లోకి దూసుకెళ్లగా కంట్రో ల్ కాక అండర్ బ్రిడ్జి కింద చేపల మార్కెట్‌పై బోగీలు పడ్డాయి. ఈ ఘటనలో 22మంది చనిపోయారు. 110మంది గాయపడ్డారు. ► 2008 జూలై 31న అర్ధరాత్రి గౌతమి ఎక్స్‌ప్రెస్ తాళ్లపూసపలి్ల–కేసముద్రం మధ్య అగ్నిప్రమాదానికి గురై 21మంది మరణించారు. ► 2010లో జమ్మికుంట రైల్వేగేట్‌లో స్కూల్ బస్సును భాగ్యనగర్ ఎక్స్‌ప్రెస్ ఢీకొట్టిన ఘటనలో విద్యార్థి మృతిచెందాడు. ► 2006లో ఘన్పూర్– నష్కల్ రైల్వేస్టేషన్ల మధ్య వాగు వద్ద గోదావరి ఎక్స్‌ప్రెస్‌ను రైల్వే పెట్రోల్మెన్లు సూర్య, చంద్రంలు అప్రమత్తంగా వ్యవహరించి నిలిపి పెద్ద ప్రమాదాన్ని తప్పించారు. -
బాలాసోర్ రియల్ హీరోలు
ఒడిశాలోని బాలాసోర్‌లో జరిగిన రైలు ప్రమాదం అందరినీ కంటతడి పెట్టిస్తోంది. ఎక్కడో దూరాన ఉంటూ, ఈ వార్త విని తల్లడిల్లిపోతున్నవారి సంగతి అలా ఉంచితే, అక్కడే ఉంటూ సహాయక చర్యల్లో పాల్గొంటున్నవారి మనోభావాలు ఎలా ఉంటాయో అర్థం చేసుకోవడం ఎవరికైనా కష్టమే. రైలు ప్రమాద క్షతగాత్రులకు సహాయం అందించేందుకు సంఘటనా స్థలానికి చేరుకున్న యువకులు మీడియాతో తమకు ఎదురైన అనుభవాలను పంచుకున్నారు. ఈ ప్రాంతంలో తాము ఎక్కడ కాలు మోపినా మాంసపు ముద్దలు, తెగిపడిన అవయవాలు కనిపిస్తున్నాయన్నారు. కొందరు క్షతగాత్రులు తమ ప్రాణాలు కాపాడాలంటూ ఆర్తనాదాలు చేస్తున్నారని తెలిపారు. ఇలాంటి అరుపులు విన్నవెంటనే తాము పరిగెత్తుకుంటూ వెళ్లి బాధితులకు సాయం అందిస్తున్నామన్నారు. అలాగే కొన్ని వందల మృతదేహాలను వెలికితీశామన్నారు. బాధితులు వీరిని రియల్ హీరోలుగా అభివర్ణిస్తున్నారు. ఇలాంటి రియల్ హీరోలలో ఒకరైన 38 ఏళ్ల తుకన్ దాస్ మాట్లాడుతూ తాను ఇక్కడకు ఒక మందిరం నిర్మాణ పనుల నిమిత్తం వచ్చానని, రైలు ప్రమాదం జరిగిందని తెలియగానే పరిగెత్తుకుంటూ వచ్చి సహాయ చర్యల్లో పాల్గొంటున్నానని తెలిపారు. తాను ఒక బోగీలోకి దూరి వెళ్లి చూడగా.. 60 మృతదేహాలు కనిపించాయని, అక్కడే ఉన్న కొందరు ప్రయాణికులు తమను కాపాడాలంటూ ఆర్తనాదాలు చేశారని అన్నారు. వెంటనే తాను వీలైనంతమందికి సాయం అందించానని తెలిపారు. ఇదేవిధంగా స్థానికంగా ఉంటున్న కొందరు యువకులు రైలు బోగీల్లో చిక్కుకున్న వారిని కాపాడేందుకు ముందుకు వచ్చారు. వారు మీడియాతో మాట్లాడుతూ తాము 150కిపైగా మృతదేహాలను బయటకు తెచ్చామన్నారు. అలాగే బాధితులను సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. కాగా బాలాసోర్‌లో శుక్రవారం జరిగిన రైలు ప్రమాదంలో ఇప్పటి వరకూ 288 మంది మరణించారు. సంఘటనా స్థలంలో సహాయక కార్యకలాపలు కొనసాగుతున్నాయి. -
ఉమ్మడి ప్రకాశం నుంచి యశ్వంతపూర్ రైలు ఎక్కిన 30 మంది..
‘చెల్లాచెదురుగా పడిన మృతదేహాలు.. తీవ్రంగా గాయపడిన ప్రయాణికులు.. రక్తపు మడుగులా తయారై భయానకంగా మారిన ప్రమాద స్థలిని చూస్తే గుండె బరువెక్కుతోంది. ఈ ఘోర ప్రమాదం సంభవించిన రైల్లో తామూ ప్రయాణించామన్న విషయం తలుచుకుంటేనే భయమేస్తోంది. అప్పటి వరకూ తమతో కలిసి ప్రయాణం చేసిన వారు మృత్యువాత పడటం తీవ్రంగా కలచివేస్తోంది.’ అంటూ యశ్వంతపూర్– హౌరా ఎక్స్‌ప్రెస్ రైలులో ప్రయాణించిన ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి ప్రకాశం జిల్లా నుంచి ఈ రైలులో సుమారు 30 మంది ప్రయాణికులు ఎక్కగా.. అందులో ఆరుగురు మాత్రమే ప్రమాదం సంభవించినప్పుడు రైలులో ఉన్నారు. వారు కూడా క్షేమంగా ఉన్నారని తెలుసుకుని అందరూ ఊపిరి పీల్చుకున్నారు. పలు రైల్వేస్టేషన్లలో హెల్ప్‌డెస్‌్కలు ఏర్పాటు చేశారు. ఒంగోలు టౌన్: ఒడిషాలోని బాలేశ్వర్ సమీపంలోని బహనాగ్‌బజార్ వద్ద జరిగిన ఘోర రైలు ప్రమాదం వార్త విన్న ఒంగోలు వాసులు ఉలిక్కిపడ్డారు. గురువారం ఒంగోలు మీదుగా హౌరా వెళ్లిన యశ్వంత్‌పూర్ ఎక్స్‌ప్రెస్‌లో ఉమ్మడి ప్రకాశం జిల్లా నుంచి సుమారు 30 మంది ప్రయాణికులు ఎక్కారు. ఒంగోలులో 12 మంది, చీరాలలో మరో 18 మంది ఎక్కారు. జనరల్ బోగిలో ఎంతమంది ప్రయాణికులు ప్రయాణించారన్నది తెలియదు. వీరిలో ఏడుగురు ప్రయాణికులు వైజాగ్‌లో, 12 మంది విజయనగరంలో, ముగ్గురు పలాసలో దిగిపోయారు. అలాగే ఒకరు విజయవాడ, మరొకరు మచిలీపట్నంలో దిగినట్లు సమాచారం. వీరు కాకుండా చీరాల పట్టణానికి చెందిన ఆరుగురు వస్త్ర వ్యాపారులు రైలులోనే ప్రయాణించారు. ఈ రైలులో ప్రయాణించిన వారితో సాక్షి మాట్లాడింది. యశ్వంత్‌పూర్ రైలు ప్రమాదానికి గురైనట్లు తెలిసి ఆందోళనకు గురయ్యామని తెలిపారు. విశాఖపట్నం నార్త్ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు తమ్ముడు గంటా చిరంజీవి కుటుంబ సభ్యులతో కలిసి ఈ రైలులో ప్రయాణం చేసిన వారిలో ఉన్నారు. ఆయన జరుగుమల్లి మండలం కామేపల్లిలో వ్యవసాయం చేస్తుంటారు. కూతురు వినితకు ఏపీఎస్సీ మెయిన్ పరీక్షలు జరుగుతుండడంతో భార్య విజయలక్షి్మతో కలిసి వైజాగ్ వెళ్లారు. తాను ప్రయాణం చేసిన యశ్వంత్‌పూర్ రైలు ప్రమాదానికి గురి కావడం కలిచివేసిందని ఆయన అన్నారు. కామేపల్లికి చెందిన తక్కెళ్లపాటి పద్మ అనే మహిళ వైజాగ్‌లో నివాసముంటున్న కూతురు, అల్లుడు వద్ద ఉంటున్నారు. ఇటీవల ఆమె జరుగుమల్లి మండలం కాÐమేపల్లి వచ్చారు. నాలుగు రోజులు ఉండి ఆమె కూతురు వద్దకు తిరుగు ప్రయాణమయ్యారు. అయితే ఒంగోలు రైల్వేస్టేషన్‌కు చేరుకున్న ఆమెకు రైలు రావడం ఆలస్యమవుతుందని తెలిసింది. సాయంత్రం 7.46 గంటలకు రావాల్సిన రైలు 4 గంటలు ఆలస్యంగా రాత్రి 11.30కి వచ్చింది. దీంతో అలసిపోయిన ఆమె రైలు ఎక్కగానే నిద్రలోకి జారుకున్నారు. మరుసటి రోజు శుక్రవారం సాయంత్రం యశ్వంత్‌పూర్ రైలు పట్టాలు తప్పిందని, వందల మంది అశువులుబాశారని తెలిసి గుండెల్లో రాయి పడ్డట్టయిందన్నారు పద్మ. టీవీలో యాక్సిడెంట్ దృశ్యాలు చూస్తుంటే గుండెలు తరుక్కుపోతోందని వాపోయారు. అప్పటి వరకు తమతో కలసి ప్రయాణించిన వారిలో చాలా మంది మృత్యువాత పడడం జీరి్ణంచుకోలేకపోతున్నామన్నారు. నాగులప్పలపాడు మండలం టి.అగ్రహారానికి చెందిన జాగర్లమూడి వెంకటేశ్వర్లు వైజాగ్‌లో ఓ వివాహానికి హాజరయ్యేందుకు భార్య అమ్మనితో కలిసి యశ్వంతపూర్ రైలులో బయలుదేరి వెళ్లారు. ఒడిషాలో రైలు ప్రమాదం జరిగినట్లు తెలిసి ఖిన్నుడయ్యారు. స్వగ్రామం నుంచి బంధువులు, స్నేహితులు ఫోన్లు చేస్తున్నారని, అయితే తాము సురక్షితంగా ఉన్నామని తెలియజేశామని చెప్పారు. నిర్మానుష్యంగా ఒంగోలు రైల్వేస్టేషన్... ఒడిషా రైలు ప్రమాదం నేపథ్యంలో పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు రైల్వే శాఖ ప్రకటించింది. దీంతో ఒంగోలు మీద నుంచి హౌరా వైపు వెళ్లే రైళ్లన్నీ రద్దయ్యాయి. ప్రయాణికులు వారి ప్రయాణాలను రద్దు చేసుకున్నారు. ఇదిలా ఉండగా ప్రతిరోజు ఒంగోలు నుంచి సుమారు వందకుపైగా రైళ్లు రాకపోకలు సాగిస్తుంటాయి. ఢిల్లీ, ఒడిషా, పశి్చమ బెంగాల్, తమిళనాడు, అస్సాం, జమ్ము కశీ్మర్‌తో పాటుగా మొత్తం పది రాష్ట్రాలకు ఇక్కడి నుంచి రైలు సౌకర్యం ఉంది. ప్రతిరోజు వేలాది మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తుంటారు. ఎప్పుడు చూసినా ప్రయాణికులతో రద్దీగా కనిపించే ఒంగోలు రైల్వేస్టేషన్ నిర్మానుష్యంగా కనిపించింది. ఇదిలా ఉండగా షాలీమార్ నుంచి చెన్నై బయలుదేరిన కోరమాండల్ ఎక్స్‌ప్రెస్‌లో ఒంగోలుకు చెందిన ఇద్దరు ప్రయాణికులు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ విషయంలో ఇప్పటి దాకా రైల్వే పోలీసులకుగానీ, రైల్వే అధికారులకుగానీ ఎలాంటి సమాచారం లేదు. ఒంగోలులో కోరమాండల్ రైలుకు స్టాపింగ్ లేదని అధికారులు తెలిపారు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఒంగోలు రైల్వేస్టేషన్‌తో పాటు గిద్దలూరు, యర్రగొండపాలెం, ఇంకా పలు రైల్వేస్టేషన్లలో అధికారులు హెల్ప్‌డెస్క్ ఏర్పాటు చేశారు. -
AP: మీ వాళ్ల ఫొటో, వివరాలు వాట్సాప్ చేయండి.. నెంబర్ ఇదే..
సాక్షి, అమరావతి: ఒడిషాలో ఘోర రైలు ప్రమాద ఘటన చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో ఏపీవాసుల వివరాలు, భద్రత కోసం ప్రభుత్వం కీలక చర్యలు తీసుకుంది. ఈ నేపథ్యంలో ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఓ ప్రకటన విడుదల చేసింది. కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ ప్రమాద ఘటనలో క్షత్రగాత్రుల సమాచారం కోసం విపత్తుల సంస్థ ఎమర్జెన్సీ ఆపరేషన్ సెంటర్ 24/7 కంట్రోల్ రూమ్ నెంబర్స్ ఇచ్చింది. మిస్సయిన వారి సమాచారం కోసం ఈ 1070, 112, 18004250101 ఫోన్ చేయాలని సూచించింది. అలాగే, 8333905022 నెంబర్‌కు ప్రయాణికుడి ఫొటో, ఇతర వివరాలను వాట్సాప్‌లో పంపించాలని తెలిపింది. అనంతరం, వివరాల ఆధారంగా పోలీసు శాఖతో సమన్వం చేసుకుని బాధితులకు వివరాలు తెలియజేయనున్నట్టు అధికారులు తెలిపారు. మరోవైపు, రైలు ప్రమాద ఘటనలో ఏపీకి చెందిన ప్రయాణికులు మృత్యువాత నుంచి దాదాపు బయటపడ్డారని, పద్దుల సంఖ్యలో ప్రయాణికులు గాయాలతో బయటపడ్డారని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ చెప్పారు. ప్రమాదంలో గాయపడిన ప్రయాణికులను ఒడిశా, భువనేశ్వర్, ఏపీ ప్రాంతాలోని వివిధ ఆసుపత్రులకు తరలించిన అనంతరం మంత్రి అమర్నాథ్, ముగ్గురు ఐఏఎస్, ముగ్గురు ఐపీఎస్ అధికారులతో కూడిన ఉన్నత స్థాయి సమావేశం ఆదివారం ఉదయం బాలాసోర్ లో నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి అమర్నాథ్ మాట్లాడుతూ.. కోరమండల్ ఎక్స్‌ప్రెస్‌లో 309 మంది ఏపీకి చెందినవారు ప్రయాణిస్తున్నారు. అలాగే, ఏపీ నుంచి హౌరా వైపు 33 మంది ప్రయాణిస్తున్నారు. ఈ 342 మందిలో 330 మందిని గుర్తించామని పేర్కొన్నారు. ఇందులో ఇప్పటివరకు 331 మందిని గుర్తించామని, ఇంకా 11 మందిని గుర్తించాల్సి ఉందన్నారు. గుర్తించిన వారిలో 14 మంది క్షతగాత్రులని, వీరిలో 10 మంది రిజర్వేషన్ కంపార్ట్మెంట్లో, నలుగురు క్షతగాత్రులు జనరల్ కంపార్ట్మెంట్లో ఉన్నారని చెప్పారు. ఇదే బోగీలో ప్రయాణిస్తున్న గురుమూర్తి అనే ఒక వ్యక్తి మాత్రం మరణించారని అమర్నాథ్ వెల్లడించారు. కాగా, ఇంకా గుర్తించవలసిన వారి వివరాల కోసం అధికారులు నిరంతరం ప్రయత్నిస్తున్నారని, విశాఖపట్నం, విజయవాడ, రాజమండ్రి, ఏలూరులో ఏర్పాటుచేసిన కంట్రోల్ రూమ్ లలో తమ వారు కనిపించడం లేదని ఇప్పటివరకు ఎవరూ రాలేదని, ఇప్పటికీ తమ వారి ఆచూకీ కోసం 8333905022 నంబర్ వాట్సాప్‌కు ఆచూకీ లభ్యం కాని వారి ఫోటోలు పంపిస్తే అధికారులు వారి వివరాలు సేకరిస్తారని మంత్రి అమర్నాథ్ చెప్పారు. ఇలా ఉండగా రాష్ట్రానికి చెందిన 16 అంబులెన్స్‌లను, 10 మహాప్రస్థానం వాహనాలను భువనేశ్వర్ లో అందుబాటులో ఉంచామని, మరో ఐదు అంబులెన్సులను బాలాసోర్ వద్ద సిద్ధంగా ఉంచామని చెప్పారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన కొంతమందిని భువనేశ్వర్ లోని అపోలో హాస్పిటల్ తరలించామని, ఇద్దరిని విశాఖలోని సెవెన్ హిల్స్ హాస్పిటల్ కు, ఒకరిని విశాఖ ఆరిలోవలోని అపోలోకు తరలించినట్టు తెలిపారు. ఇది కూడా చదవండి: Odisha Accident: కొడుకు శవాన్ని చేతుల్తో మోశా.. -
కోరమండల్ ఎక్స్‌ప్రెస్‌కు ఆ పేరు ఎలా వచ్చిందంటే..
జూన్ 2న ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలో అత్యంత ఘోర రైలు ప్రమాదం సంభవించింది. ఒక గూడ్సు రైలును వెనుక నుంచి కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో కోరమండల్ ఎక్స్‌ప్రెస్‌కు చెందిన 12 బోగీలు పట్టాలు తప్పి, పక్కనున్న ట్రాక్‌పైకి దొర్లాయి. ఆ సమయంలో ఆ ట్రాక్ మీదుగా యశ్వంత్‌పూర్-హౌరా ఎక్స్‌ప్రెస్ వెళ్తోంది. అవి యశ్వంత్‌పూర్-హౌరా ఎక్స్‌ప్రెస్‌ను ఢీకొన్నాయి. దాంతో ఈ ప్రమాద తీవ్రత మరింత పెరిగింది. అయితే గూడ్సును కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ ఢీకొనడమే ఘటనకు ప్రధాన కారణమని భావిస్తున్నారు. అయితే కోరమండల్ ఎక్స్‌ప్రెస్‌కు ఆ పేరు ఎలా వచ్చిందో ఇప్పుడు తెలుసుకుందాం. కోరమండల్ ఎక్స్‌ప్రెస్ హౌరాలోని షాలీమార్ స్టేషన్ నుంచి చెన్నై వరకూ నడుస్తుంది. ఈ రైలు ప్రతిరోజూ నడుస్తుంది. అలాగే నాలుగు రాష్ట్రాల మీదుగా అంటే పశ్చిమ బెంగాల్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్, తమిళనాడుల గుండా ప్రయాణిస్తుంది. కోరమండల్ తీరం అనేది భారత్‌కు ఆగ్నేయ తీరం. కోరమండల్ తీరం వెంబడి నడుస్తున్నందునే ఈ ఎక్స్‌ప్రెస్ రైలుకు ఈ పేరు వచ్చింది. ఈ రైలులో ప్రయాణించేవారు కోరమండల్ తీరంలోని సుందర దృశ్యాలను తిలకించవచ్చు. ఈ మార్గంలో దట్టమైన అడవులతో పాటు పలు చారిత్మాక, సాంస్కృతిక స్థలాలు కూడా దర్శనమిస్తాయి. కోరమండల్ తీరం సుమారు 22,800 చదరపు కిలోమీటర్ల మేరకు వ్యాప్తిచెందింది. ఇది సముద్ర మట్టానికి 80 మీటర్ల ఎత్తులో ఉంది. కోరమండల్ తీరం వ్యవసాయానికి కూడా ఎంతో పేరుగాంచింది. ఈ ప్రాంతంలో వరితో పాటు వివిధ రకాల పప్పు ధాన్యాలు కూడా పండుతాయి. చెరకు పంట కూడా పండుతుంది. అలాగే చేపల పెంపకం, షిప్పింగ్ లాంటి పరిశ్రమలకు నెలవుగా ఉంది. -
విజయవాడకు చేరుకున్న రైలు ప్రమాదం నుంచి బయటపడిన ప్రయాణికులు
-
Odisha Accident: కొడుకు శవాన్ని చేతుల్తో మోశా..
బాలాసోర్: ఒడిశా మూడు రైళ్ల ప్రమాదంలో ఎన్నో కన్నీటి కథలు మనసుని పట్టి కుదిపేస్తున్నాయి. ఎప్పటికైనా తనకి తలకొరివి పెడతాడని అనుకున్న కొడుకు శవాన్నే చేతులతో మోయాల్సి రావడం ఆ తండ్రి కన్నీరు మున్నీరవుతున్నాడు. బీహార్‌లో మధువనికి చెందిన లాల్జీ సాగై చెన్నైలో గార్డుగా పని చేస్తున్నాడు. తన ఇద్దరు కుమారులు సుందర్, ఇందర్లను కూడా చెన్నైకి తీసుకువెళితే కుటుంబం హాయిగా బతికేయవచ్చునని అనుకున్న ఆ తండ్రి వారిని తీసుకువెళ్లడానికి సొంతూరుకి వచ్చాడు. అక్కడ్నుంచి కోల్‌కతాకి వచ్చి కోరమండల్ ఎక్స్‌ప్రెస్ ఎక్కారు. రైలు ప్రమాదంలో తండ్రి లాల్జీ , చిన్న కుమారుడు ఇందర్ ప్రాణాలతో మిగిలితే కొడుకు సుందర్, బావమరిది దిలీప్ మృత్యు ఒడికి చేరుకున్నారు. ‘‘కళ్ల ముందే నా కొడుకు గాయాలతో పడిపోయాడు. నా చేతుల్తో మోసుకుంటూ కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కి తెచ్చాను. అప్పటికే ప్రాణం పోయిందని డాక్టర్లు చెప్పారు. విధి మా కుటుంబం మీద పగ పట్టింది’’ అంటూ పుత్ర శోకంతో కన్నీరుమున్నరవుతున్నాడు. మొబైల్ ఫ్లాష్ వెలుగులోనే.. కోరమండల్ ఎక్స్‌ప్రెస్ ప్రమాదం గురించి తెలుసుకున్న వెంటనే చుట్టుపక్కలున్న స్థానికులు అందరికంటే ముందుగా ప్రమాద స్థలికి చేరుకున్నారు. చిమ్మ చీకట్లో బోగిల్లోకి వెళ్లడానికి వారు తమ మొబైల్ ఫోన్లలో ఫ్లాష్ లైట్లలోనే సహాయ కార్యక్రమాలు సాగించారు. తమ చేతులతోనే బోగీ అద్దాలు పగులగొట్టి లోపలకి వెళ్లి క్షతగాత్రుల్ని బయటకి తీసినట్టు పూర్ణ చంద్ర మాలిక్ అనే రైతు చెప్పాడు. ‘‘బాధితుల రోదనలు వింటూ ఉంటే మనసు కదిలిపోయింది. వారిని కాపాడడం కోసం నా చేతుల్తో బోగీ అద్దాలు పగుల గొట్టా. లోపల భయంకరమైన దృశ్యం కనిపించింది. కొంతమందికి కాళ్లు, చేతులు తెగిపడి ఉన్నాయి. మరికొందరు రక్తపు మడుగులో పడి ఉన్నారు. కాసేపు అందరం షాక్‌కి లోనయ్యాం. వెంటనే తేరుకొని మాకు చేతనైన సాయం చేశాం. 30 మందిని బయటకు తీసి ఆస్పత్రికి తరలించాం’’ పూర్ణ చంద్ర మాలిక్ వివరించారు. రైలు స్పీడ్‌ను వీడియో తీస్తుండగా.. కోల్‌కతా నుంచి కటక్ వెళ్లడానికి కోరమండల్ ఎక్స్‌ప్రెస్ ఎక్కిన మాణికల్ తివారీ అనే ఒక వ్యాపారి రైల్లో వీడియో తీస్తుండగా ప్రమాదం జరిగింది. అదృష్టవశాత్తూ అతను ప్రాణాలతో బయటపడ్డాడు. రైలు ఎంత స్పీడ్‌గా వెళుతోందో తన కుటుంబ సభ్యులకు చూపించాలన్న ఉత్సాహంతో అతను కిటికీ దగ్గర కూర్చొని వీడియో తియ్యడం మొదలు పెట్టాడు. హఠాత్తుగా బోగి చిమ్మచీకటిగా మారిపోయి పొగతో నిండిపోయింది. ఆయన చేతులు రక్తమోడడం మొదలైంది. ఒక్క క్షణం అతనికి ఏమీ అర్థం కాలేదు. బోగి అంతా పొగతో నిండిపోవడంతో అతను ఎలాగో బయటకి వెళ్లాడు. పట్టాలపై శవాల్ని చూసిన తర్వాత కానీ అతనికి ఎంత ఘోరమైన ప్రమాదం జరిగిందో అర్థం కాలేదు. ‘‘అంతా సెకండ్లలో జరిగిపోయింది. అదృష్టం బాగుండి నేను బతికి బయటపడ్డాను. నా ఎదురుగా యువజంటలో భర్త మరణించాడు. భార్య మిగిలి ఉంది. ఈ రోజు ఒక బ్లాక్ ఫ్రైడే’’ అని తివారీ చెప్పారు. మందుల కోసం డబ్బులు పంపిస్తానని తిరిగిరాని లోకాలకు.. అనారోగ్యంతో ఉన్న తండ్రికి మందుల ఖర్చులకి డబ్బులు పంపిస్తానని చెప్పి బయల్దేరిన ఆ యువకుడు తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయాడు. బీహార్‌కు చెందిన రాజా పటేల్ (26) అనే యువకుడు ఇతర వలస కూలీలతో కలిసి కేరళ వెళ్లడానికి కోరమండల్ ఎక్స్‌ప్రెస్ ఎక్కి ప్రమాదంలో ప్రాణాలు పోగొట్టుకున్నాడు. రైలు ప్రమాదంలో కొడుకు మరణించాడని తెలిసిన తండ్రి భోలన్ కుప్పకూలిపోయాడు. ఆ కుటుంబానికి పటేల్ సంపాదనే జీవవనాధారం. వెన్నుముకకి సంబంధించిన సమస్యతో బాధపడుతున్న తండ్రి భోలన్ ఇంటికే పరిమితమయ్యాడు. దీంతో నెల తిరిగేసరికల్లా కొడుకు పంపే డబ్బుల కోసమే వారు ఎదురు చూస్తుంటారని పొరుగింట్లో ఉన్న అవినాశ్ పాండే చెప్పాడు. నిద్రలోనే మృత్యుఒడిలోకి.. బాలాసోర్: పెను ప్రమాదం పలు సెకన్లలోనే ముగిసిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. అధికారులు, ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం.. శుక్రవారం సాయంత్రం 6.50 గంటల నుంచి 7.10 మధ్యకాలంలోనే ఈ ప్రమాదం సంభవించింది. అంటే కొద్దిసేపట్లోనే అంతా ముగిసిందని, ఆ సమయంలో ప్రయాణికులు నిద్రలో ఉన్నట్లు తెలుస్తోంది. ఎక్కువ మంది ప్రయాణికులు నిద్ర మత్తులో ఉంటడంతో అసలేం జరుగుతుందో తెల్సుకునేలోపే అంతా జరిగిపోయిందని, తప్పించుకునే అవధికూడా లేదని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. పట్టాల మధ్య చిక్కుకున్న వారిని కాపాడేందుకు విపత్తు స్పందన దళ సభ్యులు శతథా శ్రమిస్తున్నారు. వీరికి స్థానికులు అండగా నిలిచి తమ వంతు సాయం చేస్తున్నారు. ఇప్పటికే మానవత్వంతో ఎంతో మంది స్థానికులు వయోబేధంతో సంబంధం లేకుండా ఆస్పత్రులకు తరలివచ్చి రక్తదానానికి సిద్ధపడ్డారు. వీరికి నెటిజన్లు సలామ్ కొడుతున్నారు. క్షతగాత్రులు, వారి బంధువులతో ఆస్పత్రులు కిక్కిరిసిపోయాయి. వేగంపై తప్ప భద్రతపై దృష్టి లేదు ‘రైల్వే వ్యవస్థ విస్తరించే కొద్దీ అవసరమైన సంఖ్యలో ఉద్యోగాల భర్తీ జరగాలి. కానీ ప్రస్తుతం రైల్వేలో దాదాపు రెండున్నర లక్షల ఖాళీలున్నాయి. రైళ్లను వేగంగా నడిపేలా విదేశాలతో పోటీ పడుతున్న రైల్వే, అక్కడి వ్యవస్థ తరహాలో ఇక్కడ ఏర్పాటు చేయటంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. గంటకు 130 కి.మీ. వేగంతో రైళ్లు పరుగెత్తాలన్నప్పుడు దిగువ సిమెంటు కాంక్రీట్ ట్రాక్ ఉండాలి, కానీ మన వద్ద నేరుగా నేలపైనే కంకర పరిచి ఏర్పాటు చేస్తున్నారు. అంత వేగాన్ని ఇది తట్టుకోలేదు. వేగం కంటే భద్రత ముఖ్యమన్న విషయాన్ని గుర్తించాలి’ – శంకరరావు, సీనియర్ రైల్వే కార్మిక నేత ఊహాగానాలొద్దు.. ‘‘రైలు ప్రమాదాలు చోటు చేసుకున్నప్పుడు అవి ఎలా జరిగాయనే ఊహాగానాల జోలికి వెళ్లొద్దు. ప్రమాదానికి అసలు కారణాన్ని రైల్వే సేఫ్టీ కమిషనర్ తేలుస్తారు. అందుకు తగ్గ అర్హతలున్న వారే ఆ పోస్టులో ఉంటారు. ప్రమాదాలకు అసలు కారణాలు తేలాకగాని కారణాలను విశ్లేషించలేం. ఆ ప్రమాదం నేపథ్యంలో ఆ అధికారి బృందం కొన్ని సిఫారసులు చేస్తుంది. వాటికి తగ్గ చర్యలు తీసుకోవాలి’’ - స్టాన్లీబాబు, మాజీ జీఎం. ఇది కూడా చదవండి: అదే జరిగితే ప్రమాదం తప్పేదా? -
పెద్దకర్మకు వచ్చి ప్రాణాలు కోల్పోయాడు.. ముగ్గురు సోదరులు మృత్యువాత
బాలాసోర్: ఒడిశా రైలుప్రమాద ఘటనలో పలు హృదయవిదారక దృశ్యాలు ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్నాయి. సంబంధిత కథనాలు జాతీయ మీడియాలో కనిపించాయి. అందులో ఒడిశాకు చెందిన రమేశ్ జెన అనే వ్యక్తి విషాదగాథ కూడా ఉంది. బాలేశ్వర్‌కు చెందిన ఒకావిడకు రమేశ్, సురేష్ అనే ఇద్దరు కుమారులున్నారు. వారిలో పెద్దవాడైన రమేశ్ చాలా సంవత్సరాల క్రితమే చెన్నైకి వెళ్లి స్థిరపడ్డారు. ఇటీవల రమేశ్ తల్లి కాలంచేశారు. దీంతో గత నాలుగు రోజుల క్రితం ఆయన సొంతూరు బాలేశ్వర్‌కు వచ్చారు. పెద్దకర్మ తదితర కార్యక్రమాలు చూసుకుని తిరిగి చెన్నైకి బయల్దేరారు. శుక్రవారం రాత్రి ప్రమాదానికి గురైన కోరమాండల్ ఎక్స్‌ప్రెస్‌లోనే రమేశ్ ప్రయాణించారు. ఘటనలో ప్రాణాలు కోల్పోయాడు. అన్న మృతిపై తమ్ముడు సురేశ్ మాట్లాడారు. ‘ తల్లిమరణంతో దాదాపు 14 సంవత్సాల తర్వాత అన్నయ్య ఇంటికొచ్చారు. కార్యక్రమాలు అన్నీ చూసుకున్నాక స్వయంగా నేనే అన్నను రైల్వేస్టేషన్లో దిగబెట్టారు. రైలు ఎక్కుతా నువ్వు వెళ్లిపో అని చెబితే సరేనన్నా. అన్నయ్యను చూడటం అదే చివరిసారి అవుతుందని కలలో కూడా అనుకోలేదు. రాత్రిపూట రైలు ప్రమాదం వార్త తెల్సి వెంటనే అన్నకు ఫోన్‌చేశా. ఫోన్ లిఫ్ట్‌చేయలేదు. కొద్దిసేపయ్యాక ఎవరో ఆ మొబైల్ నుంచి ఫోన్‌చేసి ప్రమాదంలో మీ అన్నయ్య చనిపోయాడని చెప్పారు. మరణవార్త విని హుతాశుడినయ్యా. పరుగున ఘటనాస్థలికి వెళ్లా. మొత్తం వెతికినా లాభంలేకుండా పోయింది. చివరకు బాలేశ్వర్ జిల్లా ఆస్పత్రిలో విగతజీవిలా పడి ఉన్న అన్నయ్యను చూసి తట్టుకోలేకపోయా’ అని తమ్ముడు వాపోయాడు. ముగ్గురు సోదరులు మృత్యువాత బారుయిపూర్: బాలాసోర్ ప్రమాద ఘటన పశ్చిమబెంగాల్లోని దక్షిణ 24 పరగణాల జిల్లాకు చెందిన ముగ్గురు సోదరుల కుటుంబాల్లో విషాదం నింపింది. ఈ ముగ్గురూ బతుకుదెరువు కోసం తమిళనాడుకు వెళ్తూ మృత్యువాతపడ్డారు. చరనిఖలి గ్రామానికి చెందిన హరన్ గయెన్(40), నిషికాంత్ గయెన్(35), దిబాకర్ గయెన్(32)లు ఏటా తమిళనాడుకు వచ్చి వ్యవసాయ పనులు చేసుకుంటూ ఉంటారు. ముగ్గురూ ఇటీవలే సొంతూరుకు వచ్చి, తిరిగి కోరమండల్ ఎక్స్‌ప్రెస్ రైలులో చెన్నై వెళ్తూ ప్రమాదంలో అసువులు బాశారు. ఈ వార్తతో స్వగ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి. కుటుంబసభ్యులు హతాశులయ్యారు. అన్నదమ్ముల్లో పెద్దవాడైన హరన్‌కు ఒక కొడుకు, ఇద్దరు పెళ్లయిన కూతుళ్లున్నారు. భార్య అనాజిత మానసిక సమస్యతో బాధపడుతోంది. నిషికాంత్‌కు భార్య, ఒక కొడుకు, కూతురు ఉన్నారు. ఇద్దరూ మైనర్లే. దిబాకర్‌కు భార్య, ఇద్దరు కుమారులున్నారు. ఇది కూడా చదవండి: అందుకే ఈ ప్రమాదం.. కోరమండల్ ప్రమాదం వేళ తెరపైకి కొత్త వాదన -
‘కవచ్’ పరిశోధనలకే పదేళ్లు.. అలా జరిగితే ప్రమాదం తప్పేదా?
సాక్షి, హైదరాబాద్: అత్యంత వేగంగా వందే భారత్ రైళ్లను తయారు చేసి, సర్వీసులను పట్టాలెక్కిస్తున్న భారతీయ రైల్వే, ప్రయాణికుల భద్రతలో అత్యంత తీవ్ర నిర్లక్ష్యాన్ని అవలంబిస్తోంది. పరస్పరం రైళ్లు ఢీకొనకుండా కాపాడే వ్యవస్థ విషయంలో నిర్లక్ష్యంతో అమాయక ప్రయాణికుల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. రైళ్లపై భరోసాతో వాటిలో ప్రయాణిస్తున్నవారు ప్రమాదాల్లో చిక్కుకొని ప్రాణాలు వదులుతున్నారు. పదేళ్ల జాప్యం.. రైళ్లు పరస్పరం ఢీకొనకుండా వ్యవస్థను రూపొందించడానికి ప్రయోగాల పేరుతో ఏకంగా పదేళ్ల విలువైన కాలాన్ని రైల్వే అధికారులు హరించారు. కానీ ఇప్పటివరకు ఆ పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తేలేకపోయారు. ప్రయోగాలకు వేదికైన దక్షిణ మధ్య రైల్వే పరిధిలో కొంత ఏర్పాటు చేసి మిగతా చోట్ల చేతులెత్తేశారు. శుక్రవారం రాత్రి ప్రమాదం జరిగిన హౌరా–చెన్నై మార్గం దేశంలోనే కీలక రైల్వే లైన్. ఆ మార్గంలో కూడా రైల్వే కవచ్ ఏర్పాటు చేయలేకపోయింది. ఎందుకీ దుస్థితి.. రైల్వే నెట్వర్క్ తక్కువగా ఉండి, ఎక్కువ సంఖ్యలో రైళ్లు తిప్పే మన దేశంలో.. ఎదురెదురుగా వచ్చి రైళ్లు ఢీకొనే పరిస్థితి తరచూ ఉండేది. సిగ్నలింగ్ వైఫల్యమో, మానవ తప్పిదమో.. తరచూ ఒకే ట్రాక్ మీద ఎదురెదురుగా రైళ్లు వచ్చేవి. ప్రమాదాలు నివారించేందుకు విదేశాల నుంచి పరిజ్ఞానాన్ని దిగుమతి చేసుకోవాలనుకున్నా, ఖరీదు ఎక్కువ కావటంతో సొంతంగానే రూపొదించాలని రైల్వే నిర్ణయించింది. అనుబంధ పరిశోధన సంస్థ రీసెర్చ్ డిజైన్ అండ్ స్టాండర్డ్ ఆర్గనైజేషన్ (ఆర్డీఎస్ఓ)కు బాధ్యతను అప్పగించింది. అది కొంతకాలం ప్రయోగాలు చేసి 2013లో తొలుత రైల్ కొలీజన్ అవాయ్‌డెన్స్ సిస్టం(టీకాస్)ను సిద్ధం చేసింది. ప్రయోగాల కోసం వికారాబాద్–వాడీ–సనత్‌నగర్ సెక్షన్లను ఎంపిక చేశారు. 260 కి.మీటర్లలో ఆ వ్యవస్థను ఏర్పాటు చేసి పరిశీలించారు. కవచ్‌గా మార్చి.. ఐదేళ్ల క్రితం దానిని ‘కవచ్’గా మార్చి పరిజ్ఞానాన్ని మరింత అప్‌గ్రేడ్ చేశారు. 2022 ఫిబ్రవరి నాటికి జోన్ పరిధిలో 615 కి.మీ. మేర ఆ వ్యవస్థను ఏర్పాటు చేశారు. ప్రయోగాలు విజయవంతమయ్యాయని, వ్యవస్థను అంబాటులోకి తెస్తామని అధికారులు ఎప్పటికప్పుడు ప్రకటిస్తూ వస్తున్నారు. ఆ వ్యవస్థను దేశవ్యాప్తంగా ఏర్పాటు చేసేందుకు రైల్వే బోర్డు అనుమతించినా.. పనులు మాత్రం ముందుకు సాగటం లేదు. గతేడాది చివరలో ప్రస్తుత రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ స్వయంగా రైలు లోకో ఇంజిన్‌లో కూర్చుని ప్రయోగాలను పరిశీలించారు. ప్రతి సంవత్సరం 5 వేల కి.మీ. మేర దాన్ని ఏర్పాటు చేసి, దేశమంతటా విస్తరిస్తామని పేర్కొన్నారు. గత సంవత్సరమే ఢిల్లీ–ముంబై, ఢిల్లీ–హౌరా మార్గాల్లోని 2 వేల కి.మీ.నిడివిలో ఏర్పాటు చేయనున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. కిలోమీటర్‌కు రూ.50 లక్షలు.. కవచ్ పరిజ్ఞానాన్ని ఏర్పాటు చేయాలంటే కిలోమీటరుకు రూ.50 లక్షల వరకు ఖర్చవుతుందని అధికారులు తేల్చారు. ఇది రైల్వేకు పెద్ద భారంగా మారింది. పనులు వేగంగా పూర్తి చేయాలంటే బడ్జెట్ నిధుల్లో సింహభాగం దానికే ఖర్చు చేయాలి. దీంతో దక్షిణ మధ్య రైల్వే పరిధిలో 1450 కి.మీ.మేర ఏర్పాటు చేయటం మినహా ఎక్కడా ఏర్పాటు చేయలేదు. ఏమిటీ కవచ్? కవచ్ పరిజ్ఞానం రైలు ఇంజిన్లతోపాటు ట్రాక్ వెంట కొనసాగుతుంది. మధ్యమధ్య ఫ్రీక్వెన్సీ టవర్లు ఏర్పాటు చేస్తారు. రైల్వే స్టేషన్లలో, రైళ్లలో ప్రత్యేక కవచ్ యంత్రాలను అమరుస్తారు. ట్రాక్‌పై ప్రతి కిలోమీటర్‌కు ఒకటి చొప్పున ఆర్ఎఫ్ఐడీ ట్యాగ్‌లను ఏర్పాటు చేస్తారు. రేడియో ఫ్రీక్వెన్సీ సిగ్నళ్ల కోసం నిర్ధారిత ప్రాంతాల్లో 40 మీటర్ల ఎత్తున్న టవర్లను ఏర్పాటు చేస్తారు. కమ్యూనికేషన్ టవర్, జీపీఎస్, రేడియో ఇంటర్ఫేజెస్లతో అనుసంధానిస్తారు. ఎలా పనిచేస్తుంది? - రైళ్ల కదలికలను ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాలనే సూత్రంపై ఇది పనిచేస్తుంది. - దేశంలో రైలు ప్రమాదాలకు ప్రధాన కారణమవుతున్న సిగ్నల్ జంప్‌ను ఇది అప్రమత్తం చేస్తుంది. నిర్ణీత పరిధిలోపు అదే లైన్లో ఇంకొక రైలు ఉందని గుర్తిస్తే ఆటోమేటిక్‌గా రైలును ఆపేస్తుంది. - సిగ్నల్ దాటేసి వెళ్లడం, వేగంగా ప్రయాణించడం వంటి సందర్భాల్లోనేకాదు దట్టంగా మంచు కమ్ముకున్న అననుకూల వాతావరణంలోనూ పలుమార్లు లైన్–సైడ్ సిగ్నల్స్‌ను ఇస్తూ పైలట్‌కు సాయపడుతుంది. - లెవల్–క్రాసింగ్ వద్ద తనంతట తానుగా విజిల్స్ వేస్తుంది. రైలు నియంత్రణ కోల్పోయిన సందర్భాల్లో ప్రమాదం ఉందంటూ సంబంధిత వ్యవస్థకు తక్షణం హెచ్చరికల ద్వారా సమాచారాన్ని చేరవేస్తుంది. - రైలు బ్రేకు ఫెయిలైనప్పుడు కూడా ఈ వ్యవస్థ సమర్ధవంతంగా పనిచేసి రైలును నిలిపివేయగలదు. హారన్ కొట్టాల్సిన చోట కొట్టకున్నా.. ఈ వ్యవస్థ తనంతట తానుగా ఆ పని చేస్తుంది. కొసమెరుపు: దేశీయంగా ఈ వ్యవస్థను ఏర్పాటు చేయలేక చేతులెత్తేస్తున్న రైల్వే శాఖ, ఆ పరిజ్ఞానాన్ని విదేశాలకు విక్రయించేందుకు మాత్రం సిద్ధమని ప్రకటించింది. ఇది కూడా చదవండి: ఆప్తుల ఆర్తనాదాలతో బహనాగా బజార్ రైల్వేస్టేషన్.. -
బాలాసోర్ లో క్షతగాత్రులను పరామర్శించిన మంత్రి అమర్నాథ్
-
ఒడిశా రైలు దుర్ఘటన.. క్షతగాత్రులను తీసుకెళ్తున్న బస్సుకు ప్రమాదం
ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలో జరిగిన రైలు దుర్ఘటన గాయపడిన వారిని తీసుకెళ్తున్న బస్సు ప్రమాదానికి గురైంది. పశ్చిమబెంగాల్లోని మేదినీపూర్‌లో శనివారం వ్యాన్‌ను బస్సు ఢీకొట్టింది. పశ్చిమ బెంగాల్‌కు చెందిన కొందరు ప్రయాణికులు ఒడిశా రైలుప్రమాదంలో గాయపడ్డారు. వీరిని ప్రత్యేక బస్సులో రాష్ట్రంలోని వివిధ ఆసుపత్రులకు తరలిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో పలువురికి చిన్న గాయలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని సహాయ చర్యలు ప్రారంభించారు. బస్సు ప్రమాదంలో గాయపడిన బాధితులను తరలించేందుకు ప్రత్యామ్నాయ మార్గాల్లో ఆసుపత్రులకు తరలించారు. రోడ్డు ప్రమాదంతో మేదినీపూర్ జాతీయ రహదారిపై కాసేపు ట్రాఫిక్ స్తంభించింది. అయితే రైళ్ల ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడి తమ ఊర్లకు వెళ్తున్న ప్రయాణికులు మరోసారి బస్సు ప్రమాదంలో గాయపడటం స్థానికంగా కలకలం రేపింది. మరోవైపు బాలాసోర్‌లోని బహనగ స్టేషన్ సమీపంలో శుక్రవారం రాత్రి 7 గంటలకు మూడు రైళ్లు ఢీకొన్న ఘటనలో మృతుల సంఖ్య 288కు చేరింది. దాదాపు 900 మంది గాయపడ్డారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. చదవండి: ఒడిశా రైలు ప్రమాద బాధితులకు అండగా సోను సూద్ ఒడిశా నుంచి చెన్నై బయలుదేరిన ప్రత్యేక రైలు.. బాధితుల వివరాలివే.. -
రైలు ప్రమాద ఘటనాస్థలాన్ని సందర్శిస్తున్న ప్రధాని మోదీ
-
Odisha Train Accident: ప్రమాదానికి కారణం ఏంటో చెప్పిన రైల్వే శాఖ
ఒడిశాలోని బాలాసోర్‌లో జరిగిన భీకర రైళ్ల ప్రమాదంలో మృతిచెందిన వారి సంఖ్య 280కు చేరింది. బెంగళూరు- హౌరా సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్, షాలిమార్-చెన్నై సెంట్రల్ కోరమాండల్ ఎక్స్‌ప్రెస్, గూడ్స్ రైలు ఢీకొన్న ఘటనలో 900 మంది గాయపడ్డారు. అయితే ఈ దుర్ఘటన ఎలా జరిగిందన్న దానిపై ఇప్పటివరకు కచ్చితమైన కారణాలు తెలియరాలేదు. కానీ ప్రమాదానికి సిగ్నల్ ఫెయిల్యూరే కారణమని రైల్వే శాఖ వెల్లడించింది. ఈ మేరకు ఒడిశా రైలు ప్రమాదంపై ప్రాథమిక నివేదికను నిపుణుల బృందం రైల్వే శాఖకు అందించింది. కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ లూప్ లైన్లోకి తప్పుగా వెళ్లడమే ప్రమాదానికి కారణమని ఈ నివేదికలో వెల్లడైంది. సిగ్నల్ ఫెయిల్యూర్ కారణంగానే ప్రమాదం చెన్నై వెళ్తున్న కోరమాండల్ ఎక్స్‌ప్రెస్‌కు సిగ్నల్ లభించకపోవడంతో ప్రమాదం జరిగిందని తేలింది. మొదట సిగ్నల్ ఇచ్చినా ఆ తరువాత దానిని ఆపేశారని, దీంతో కోరమండల్ రాంగ్ ట్రాక్‌పైకి వెళ్లాల్సి వచ్చిందని తెలిపింది. మెయిన్‌లైన్ బదులు లూప్లైన్లోకి వెళ్లడంతో.. లూప్లైన్లో ఉన్న గూడ్స్‌ను రైలును కోరమాండల్ ఢీకొట్టి పట్టాలు తప్పిందని నిపుణుల బృందం తేల్చింది. దీని బోగీలు పక్క ట్రాక్‌పైన పడగా.. అదే సమయంలో ఆ ట్రాక్‌పైకి వచ్చిన బెంగళూరు-హౌరా ఎక్స్‌ప్రెస్ వీటిని ఢీకొట్టింది. దీంతో ఈ రైలు బోగీలు కూడా పట్టాలు తప్పాయని అని రైల్వే శాఖ తమ నివేదికలో వెల్లడించింది. కాగా శుక్రవారం ఒడిశా బాలాసోర్ వద్ద ప్రమాదానికి గురై కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ ఘటన పెను విషాదానికి కారణమైన విషయం తెలిసిందే. కేవలం 20 నిమిషాల వ్యవధిలోనే మూడు రైళ్లు ప్రమాదానికి గురయ్యాయి. ముగిసిన సహాయక చర్యలు : రైల్వే శాఖ ఒడిశా రైలు ప్రమాదంలో సహాయక చర్యలు పూర్తయినట్లు రైల్వే శాఖ ప్రతినిధి అమితాబ్ శర్మ తెలిపారు. రైల్వే ట్రాక్ పునరుద్ధరణ పనులు మొదలుపెట్టినట్లు పేర్కొన్నారు. ప్రమాదం ఎలా జరిగిందన్న దానిపై పూర్తిస్థాయి విచారణ చేపడతామని అన్నారు. భవిష్యత్‌లో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకుంటామన్నారు. అయితే ప్రమాదం జరిగిన బాలాసోర్ మార్గంలో కవచ్ వ్యవస్థ లేదని ఆయన తెలిపారు. దాని వల్లే ప్రమాదం తీవ్రత అధికంగా మారిందని పేర్కొన్నారు. ఆ రూట్లో కవచ్ సిస్టమ్ లేదు ప్రస్తుతం రెస్క్యూ ఆపరేషన్ ముగిసిందని, ఇక రైల్వే లైన్ పునరుద్దరణ పనులు మొదలుపెడుతున్నామని, ప్రమాదం జరిగిన రూట్లో కవచ్ రక్షణ వ్యవస్థ లేదని తెలిపారు. కాగా రైలు ప్రమాదాలను నివారించేందుకు దేశవ్యాప్తంగా కవచ్ వ్యవస్థను భారత రైల్వేశాఖ డెవలప్ చేస్తోంది. కవచ్ అనేది ఆటోమెటిక్ ట్రైన్ ప్రొటెక్షన్ సిస్టమ్. దీనిని మూడు భారతీయ సంస్థలతో కలిసి రిసెర్చ్ డిజైన్ అండ్ స్టాండర్స్ ఆర్గనైజేషన్ సంయుక్తంగా అభివృద్ధి చేశాయి. సమయానికి బ్రేక్ వేయడంలో డ్రైవర్ ఫెయిల్ అయితే కవచ్ సిస్టమర్ రైలు వేగాన్ని ఆటోమెటిక్‌గా నియంత్రిస్తుంది. Drone footage of #TrainAccident #CoromandelExpress pic.twitter.com/XCSnJJ0Tcg — Rail Vandi (@rail_vandi) June 3, 2023 Scary Visuals of Balasore Train Accident.. ☺️☺️ . .#TrainAccident #CoromandelExpress #CoromandelExpressAccident #BalasoreTrainAccident #tupaki #Odisha @tupakinews_ pic.twitter.com/mnfCCTqdhA — Tupaki (@tupakinews_) June 3, 2023 -
Odisha Train Accident Reason: రైలు ప్రమాదానికి సిగ్నల్స్ ఫెయిల్యూరే కారణం: రైల్వే శాఖ
-
రైలు ప్రమాదంపై సీఎం మమతా సంచలన వ్యాఖ్యలు
-
ఒడిశా రైలు ప్రమాదం: తెలుగు ప్రయాణికుల కోసం హెల్ప్ లైన్లు ఇవే
సాక్షి, విజయవాడ: రైలు ప్రమాద ఘటనపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాలతో అధికారులు ముమ్మర చర్యలు చేపట్టారు. కలెక్టర్ కార్యాలయాల్లో హెల్ప్ డెస్క్‌లు ఏర్పాటు చేశారు. కోరమండల్ రైలులో ఏపీకి చెందినవారి వివరాలను సేకరిస్తున్నారు. ప్రమాదంలో మరణించిన మృతుల ఫోటోలను సేకరిస్తున్నారు. డేటా ఆధారంగా రాష్టానికి చెందిన ప్రయాణికులపై ఆరా తీస్తున్నారు. ప్రమాద స్థలంలో వైద్య సేవలు, అంబులెన్స్‌లు సిద్ధం చేశారు. ఒడిశాకు ఏపీ అధికారుల బృందం రైలు ప్రమాదంలో 179 మంతి తెలుగువారు ఉన్నారని మంత్రి గుడివాడ అమర్నాథ్ తెలిపారు. మృతులు, గాయపడ్డవారు, మిస్సింగ్ వివరాల సమాచారాన్ని సేకరిస్తున్నామని పేర్కొన్నారు. సహాయక చర్యల కోసం అధికారుల బృందం ఓడిశా చేరుకుందన్నారు. విజయవాడలో దిగాల్సిన 39 మందిలో 23 కాంటాక్ట్‌లోకి వచ్చారని తెలిపారు. ఒడిశా రైళ్ల ప్రమాద ఘటన నేపథ్యంలో యంత్రాంగాన్ని అప్రమత్తం చేశామని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఢిల్లీ రావు తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్లో హెల్స్‌లైన్ ఏర్పాటు: 0866 2575833 చేశామని పేర్కొన్నారు. ప్రమాద ఘటనలో జిల్లా వాసులుంటే సమాచారం ఇవ్వాలని సూచించారు. రైల్వే అధికారులు ఇచ్చిన సమాచారం మేరకు రెండు రైళ్లలో 42 మంది విజయవాడలో దిగాల్సి ఉందన్నారు. కోరమండల్ రైలులో 39 మంది విజయవాడలో దిగాల్సి ఉందని కలెక్టర్ ఢిల్లీరావు తెలిపారు. వీరిలో 23 మందిని కాంటాక్స్ చేశాం.. వారంతా సురక్షితంగా ఉన్నారని తెలిపారు.. మిగిలిన 16 మందిని కాంటాక్ట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. యశ్వంత్‌పూర్ ఎక్స్‌ప్రెస్‌లో ముగ్గురు ప్రయాణికులు విజయవాడలో దిగాల్సి ఉంది. వారి ఫోన్ నెంబర్ల కోసం ప్రయత్నిస్తున్నామని పేర్కొన్నారు. కోరమండల్ రైలులో తెలుగు ప్రయాణికుల వివరాలు ►కోరమండల్ రైలులో మొత్తం 178 మంది తెలుగువారు ►విశాఖపట్నం వరకు 110, రాజమండ్రి వరకు26 మంది ►తాడేపల్లి గూడెం ఒకరు, విజయవాడ వరకు 39 మంది ►ఏలూరులో దిగాల్సిన ఇద్దరు సురక్షితం. చంద్‌పాల్‌ను స్థానిక ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. శ్రీకర్ ప్రశాంతి ఎక్స్‌ప్రెస్‌లో తిరుగు పయనమయ్యారు ►చీరాల నుంచి హౌరా వెళ్లాల్సిన ఆరుగురు ప్రయాణికులు సేఫ్. ఆరుగురిలో ఇద్దరిని సంప్రదించిన పోలీసులు ► తాడేపల్లిగూడెం రావాల్సిన ఇద్దరు ప్రయాణికులు సేఫ్. ఉమామహేశ్రరావు, రంజిత్ గాయాలతో బయటపడ్డారు. కాకినాడ వాసుల కోసం హెల్ప్‌లైన్ నెంబర్ ఒడిశాలోని బాలాసోర్ సమీపములో జరిగిన ఘోర రైలు ప్రమాదంలో కాకినాడ జిల్లా వాసులు ఎవరైనా చిక్కుకొని ఉంటే, వారి సహాయం జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రజల ప్రత్యేక హెల్ప్ డెస్క్‌ను ఏర్పాటు చేశారు. ►పోలీస్ కంట్రోల్ రూమ్ ఇన్స్పెక్టర్ -9490618506 ►పోలీస్ కంట్రోల్ రూమ్ -9494933233 తూర్పుగోదావరి జిల్లా... ►ఒడిశా బాలాసోర్‌లో ప్రమాదానికి గురైన కోరమండల్, యశ్వంతపూర్ రైళ్లలో రాజమండ్రికి రావాల్సిన ప్రయాణికులు.. ► మొత్తం ప్రయాణికులు 31 మంది ►వీరిలో రాజమండ్రి వాసులు-5 ►కాకినాడకు చెందినవారు-1 ►కొవ్వూరుకు చెందినవారు-1, పశ్చిమ బెంగాల్‌కు చెందిన వారు-- 12, చత్తీస్‌గఢ్‌కు చెందిన వారు-2, కోల్‌కతా-1 ►వీరిలో 22 సురక్షితంగా ఉన్నారు. కృష్ణాజిల్లా ఒడిశాలో జరిగిన రైలు ప్రమాదంలో కృష్ణా జిల్లా వాసులు ఎవరైనా చిక్కుకొని ఉంటే, వారి సహాయార్థం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ జాషువా ప్రత్యేక హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేశారు. సంప్రదించవలసిన హెల్ప్ లైన్ నెంబర్స్ ►పోలీస్ కంట్రోల్ రూమ్ ఇన్స్పెక్టర్ -8332983792 ►పోలీస్ కంట్రోల్ రూమ్ -9491068906 ఎస్బీ ఎస్ఐ - 9618336684 -
మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు
-
కోరమాండల్ ట్రైన్ లో ఏపీ వాసులు...
-
ప్రమాదానికి ప్రధాన కారణాలు ఇవే..
-
రైలు ఘటనపై NFIR జనరల్ సెక్రటరీ సంచలన విషయాలు
-
‘రైలు లూప్ లైన్లోకి ఎలా వెళ్లిందనేది మిస్టరీగా మారింది’
సాక్షి, ఢిల్లీ: ఒడిషాలోని బాలాసోర్ వద్ద ఘోర రైలు ప్రమాద ఘటన చోటుచేసుకున్న విషయం తెలిసిందే. కాగా, ఈ ప్రమాద ఘటనపై రైల్వే యూనియన్ నేత మర్రి రాఘవయ్య కీలక వ్యాఖ్యలు చేశారు. ఒడిషా రైలు ప్రమాదం ఒక మిస్టరీ అని కామెంట్స్ చేశారు. అయితే, ఒడిషా రైలు ప్రమాదంపై రాఘవయ్య స్పందించారు. ఈ సందర్భంగా ఆయన సాక్షితో మాట్లాడుతూ.. ఈ ప్రమాదంపై దర్యాప్తులోనే అన్ని నిజాలు బయటపడతాయి. కోరమండల్ ఎక్స్‌ప్రెస్ మెయిన్ లైన్లో వెళ్లేందుకు సిగ్నల్ ఇచ్చారు. అయినప్పటికీ రైలు లూప్ లైన్లో వెళ్లింది. లూప్ లైన్లోకి ఎలా వెళ్లిందనేది మిస్టరీగా మారింది. ఇందులో ఉగ్ర కుట్ర ఉంటుందని నేను అనుకోవడం లేదు. రైల్వేశాఖలో చాలా సంవత్సరాల నుంచి ఆటోమేటెడ్ సిగ్నల్ వ్యవస్థ నడుస్తోంది. రైల్వేలో కవచ్(యాంటీ కొల్యూషన్ డివైస్) వ్యవస్థ ఇంకా పూర్తి స్థాయిలో అమలు కాలేదు అని తెలిపారు. మరోవైపు, ఒడిషా రైలు ప్రమాదంపై సౌత్ సెంట్రల్ రైల్వే డివిజన్ రిటైర్డ్ మేనేజర్ వెంకటేశ్వర్రావు కూడా స్పందించారు. ఈ సందర్బంగా ఆయన సాక్షితో మాట్లాడుతూ.. రైలు ప్రమాద ఘటనపై పూర్తి విచారణ జరపాలి. సిగ్నలింగ్ వ్యవస్థ లోపంతోనే రైలు ప్రమాదం జరిగి ఉంటుంది. రైల్వే ట్రాక్ నిర్వహణలో అధికారులు శ్రద్ధ పెట్టాలి. ఎల్‌హెచ్‌బీ కోచ్‌లు ప్రమాదానికి గురికావు.. కానీ, అయ్యాయి అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇది కూడా చదవండి: చెల్లచెదురుగా పడ్డ మృతదేహాలు, తెగిపడ్డ అవయవాలు..జీవితంలో మర్చిపోలేని భయానక దృశ్యం -
ఒడిశా రైలు ప్రమాదంపై ఏపీ మంత్రి రియాక్షన్...
-
ప్రధాని మోదీ ఉన్నతస్థాయి సమీక్ష
-
బాలాసోర్ రైలు ప్రమాద ఘటన దృశ్యాలు
-
ఒడిశాలోని బాలాసోర్ మూడు రైళ్లు ఢీకొని ప్రమాదం
-
బాలాసోర్ రైలు ప్రమాద ఘటనలో కొనసాగుతున్న సహాయక చర్యలు
-
ఓవైపు మృత్యు ఘోష.. మరోవైపు మానవత్వం
భువనేశ్వర్: ఒడిశా బాలాసోర్ రైలు ప్రమాద ఘటనతో మృతుల సంఖ్య అంతకంతకు పెరుగుతూ పెను విషాదం అలుముకుంటున్న వేళ.. ఊహించని పరిణామాలు హ్యాట్సాఫ్ అనిపిస్తున్నాయి. ప్రమాదం గురించి తెలియగానే పదుల సంఖ్యలో స్థానికులు స్వచ్ఛందంగా అక్కడికి చేరుకుని సహాయక చర్యల్లో పాల్గొన్నారు. రైలు ప్రమాదం జరిగిన సమయంలో ఆ దగ్గర్లోనే నేనున్నా. స్థానికులం కొందరు గుంపుగా ఇక్కడికి వచ్చాం. సహాయక సిబ్బందితో చేయి కలిపాం. దాదాపు 300 మందిని బయటకు తీసి ఆస్పత్రికి తరలించాం అని గణేష్ అనే యువకుడు చెప్తున్నాడు. అదీగాక చీకట్లో సహాయక చర్యలకు విఘాతం ఏర్పడగా.. గ్యాస్ టార్చ్‌లు, ఎలక్ట్రిక్ కట్టర్లతోసహాయక సిబ్బంది రాత్రంతా శ్రమించింది. వాళ్లకు స్థానికుల్లో కొందరు యువకులు సహయపడడం గమనార్హం. #WATCH | Odisha CM Naveen Patnaik says, "...extremely tragic train accident...I have to thank the local teams, local people & others who have worked overnight to save people from the wreckage...Railway safety should always be given the first preference...The people have been… pic.twitter.com/PtyESk4ZuB — ANI (@ANI) June 3, 2023 ఒడిషా ప్రజలు.. ప్రత్యేకించి యువత ఆస్పత్రులకు రక్తదానం కోసం క్యూ కడుతున్నాయి. ఎన్జీవోలు, పలువురు సామాజిక కార్యకర్తలు వాట్సాప్ గ్రూపులు, సోషల్ మీడియాలో ఇచ్చిన పిలుపునకు యువత అనూహ్యంగా స్పందించింది. భువనేశ్వర్‌తో పాటు బాలేశ్వర్, భద్రక్, మయూర్భంజ్, కటక్‌లలో చికిత్స పొందుతున్న క్షతగాత్రుల కోసం రక్తం ఇవ్వడానికి బారులు తీరారు. రక్తదానానికి ముందుకు రావాలంటూ పిలుపుతో లొకేషన్లను షేర్ చేస్తూ వాట్సాప్ గ్రూపుల్లో సందేశాలు పంపుతున్నారు. విపత్కర పరిస్థితుల్లో ప్రాణాలను నిలబెట్టేందుకు కృషి చేసిన స్థానిక సహాయక బృందాలతో పాటు స్థానికులకూ సీఎం నవీన్ పట్నాయక్ కృతజ్ఞతలు తెలియజేశారు. #BalasoreTrainAccident | "I was nearby when this accident happened, we rescued around 200-300 people," says Ganesh, a local #OdishaTrainAccident pic.twitter.com/d8PkJNEPRY — ANI (@ANI) June 3, 2023 మరోవైపు 200 ఆంబులెన్స్‌లు, 50 బస్సులు, 45 మొబైల్ హెల్త్ యూనిట్లో బాలాసోర్‌లో ప్రమాదం జరిగిన స్థలం వద్ద మోహరించింది ఒడిశా ప్రభుత్వం. ఆర్మీ, ఎన్డీఆర్ఎఫ్ సహా 1,200 మంది సిబ్బంది సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. కోల్‌కతాతో పాటు పొరుగున ఉన్న రాష్ట్రాల నుంచి ప్రత్యేక దళాలు అక్కడికి చేరుతున్నాయి. ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ తరపున హెలికాఫ్టర్లు సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి. తమిళనాడు సీఎం స్టాలిన్ పరిస్థితిపై ఎప్పటికప్పుడూ ఆరా తీస్తున్నారు. ఒక్కరోజు సంతాప దినం ప్రకటించారాయన. అలాగే ఒక ప్రత్యేక బృందాన్ని అక్కడికి పంపాలని నిర్ణయించారు. We're going there to enquire for details. Tamil Nadu CM has spoken to Odisha CM. I will update you after reaching the spot. Hospital facilities are also ready for Tamilians in Tamil Nadu who got affected by Train accident: Tamil Nadu Min Udhayanidhi Stalin#BalasoreTrainAccident pic.twitter.com/ppj781skQn — ANI (@ANI) June 3, 2023 మరోవైపు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సైతం ప్రమాద ఘటనపై సమీక్ష నిర్వహించారు. అవసరమైన సహాయం అందించేందుకు సిద్ధంగా ఉండాలని అధికార యంత్రాంగాన్ని ఆదేశించారాయన. మంత్రి అమర్నాథ్ నేతృత్వంలో ఐఏఎస్ అధికారులతో కూడిన బృందాన్ని బాలాసోర్‌కు పంపించాలని నిర్ణయించారు. -
పగ తీర్చుకున్నాడు.. కాటేసి చంపేసిన పామును.. మెడలో వేసుకుని..
సాక్షి, భువనేశ్వర్: మనిషి పగతో పాము కథ ముగిసింది. మనిషి కాటుతో పాము మృతి చెందింది. ఇది కథ కాదు వాస్తవం. బాలేశ్వర్ జిల్లా దొరొడా గ్రామంలో బుధవారం ఉదయం ఈ ఆశ్చర్యకర ఘటన చోటు చేసుకుంది. భోళా శంకరుడి తరహాలో కాటేసి చంపేసిన పామును.. మెడలో వేసుకుని ఊరంతా తిరిగాడు ఓ ప్రబుద్ధుడు. మనసంతా నిండిన ఉక్రోషంతో పాము పట్ల పగ తీర్చుకున్నాడు. ఈ దృశ్యం గ్రామస్తులు, చూపరులను ఆశ్చర్యానికి గురి చేసింది. వివరాల్లోకి వెళ్తే... బాలేశ్వర్ జిల్లా దొరొడా గ్రామానికి చెందిన సలీమ్ నాయక్ తన పొలంలో బుధవారం ఉదయం తిరుగాడుతుండగా కాలిపై నాగుపాము కాటేసింది. అక్కడి నుంచి పారిపోతున్న సర్పాన్ని.. వెంబడించి పట్టుకున్నాడు. తనకు కాటేసినట్లే తాను కూడా పాముని కాటేసి చంపేయాలనుకున్నాడు. పాము రెండు చివర్లు తల, తోక పట్టుకుని మిగిలిన భాగం అంతా ఎక్కడికక్కడ కొరికేశాడు. మాంసం బయట పడేంత వరకు పట్టు వదలకుండా కొరికి, శాంతించాడు. బాధ తాళలేని పాము.. తన నోటితో తానే కాటేశాలా చేశాడు. దీంతో చనిపోయిన సర్పాన్ని మెడలో చుట్టుకుని ఊరిలో ఊరేగాడు. ఇది చూసిన వారి నోటమాట రాకుండా నివ్వెర పోయారు. అయితే పాము కాటుకు మాత్రం ఎటువంటి వైద్యం చేసుకోలేదు. పాము మంత్రం తెలిసిన తాంత్రికునిగా చెప్పుకొని, చికిత్స, వైద్యం నిరాకరించాడు. సంప్రదాయం ప్రకారం చంపిన పాముని దహనం చేయకుండా ఖననం చేయనున్నట్లు వివరించాడు. ఈ ఘటన పట్ల వన్యప్రాణుల సంరక్షణ వర్గాలు ఇంతవరకు స్పందించ లేదు. చదవండి: బొగ్గు కుంభకోణం, బెంగాల్ న్యాయమంత్రిపై సీబీఐ -
అదిరే.. ఆవు దూడకు బాలసారె..
కాకినాడ రూరల్: కాకినాడ రమణయ్యపేటలో వైద్యుడు గౌరీశేఖర్ బుధవారం ఆవుదూడకు బాలసారె మహోత్సవాన్ని నిర్వహించారు. ఆయన భార్య రమాదేవి, ఇద్దరు కుమార్తెలు వైద్యులుగానే స్థిరపడ్డారు. అల్లుళ్లు కూడా వైద్యులే. ఇంటిలోనే ఆస్పత్రిని నిర్వహిస్తున్న గౌరీశేఖర్‌కు చిన్నప్పటి నుంచి ఆవులంటే మక్కువ ఎక్కువ. ఇటీవల సుమారు రూ.50 వేలకు పుంగనూరు జాతి ఆవుదూడను కొన్నారు. దానికి మూడో నెల రావడంతో బుధవారం బంధుమిత్రులందరినీ పిలిచి బాలసారె వేడుకగా నిర్వహించారు. ఆవుదూడకు పట్టీలు అలంకరించి పూజలు అనంతరం ఊయలలో ఉంచి ఊపుతూ మంత్రోచ్చరణ చేయించి, ఆశీర్వచనలు ఇచ్చారు. అడబాల ట్రస్టు ఆధ్వర్యంలో ఆయనను సన్మానించారు. -
ఒక ఊరికథ..మంచిపని ఊరకే పోలేదు...ఎన్నో ఊళ్లకు స్ఫూర్తి ఇచ్చింది
బాలాసోర్ జిల్లా(ఒడిశా) బస్తా బ్లాక్‌లోని అంబక్చౌ అనే గ్రామం అది. ఊరు ఎప్పుడూ ప్రశాంతంగా ఉండదు. కరువు కావచ్చు కరోనా కావచ్చు మరేదైనా కష్టం కావచ్చు. ఉపాధి కష్టమయ్యేది. ఊళ్లోని మగవాళ్లు పనుల కోసం పట్టణాలు వెదుక్కుంటూ వెళ్లేవాళ్లు. అలా పట్టణాలకు వెళ్లి కొత్త అలవాట్లు నేర్చుకొని కష్టపడిన సొమ్మును మద్యానికి తగలేసిన వారు కూడా ఉన్నారు. ఇక ఆ ఊళ్లో మహిళల విషయానికి వస్తే ఊరు దాటిన సందర్భాలు వేళ్ల మీద లెక్కపెట్టుకోవచ్చు. ఇంటిపనులు పూర్తయిన తరువాత, ఆరుబయట కూర్చొని మాట్లాడుకుంటున్న సందర్భంలో ‘మనం ఎందుకు వ్యాపారం మొదలుపెట్టకూడదు!’ అన్నారు ఒకరు. కొందరు నవ్వారు. కొందరు ఆలోచించారు. ఆ మాట ఈ మాట పూర్తయిన తరువాత అందరూ ఒక ఆలోచనకు వచ్చారు. ఆవులను కొనాలని. తాము కూడబెట్టుకున్న డబ్బు, అప్పు చేసిన సొమ్ముతో 13 మంది మహిళలు కలిసి 10 ఆవులను కొనుగోలు చేశారు. ‘శివశంకర్’ పేరుతో స్వయంసహాయక బృందంగా ఏర్పడ్డారు. ‘వాటిని మేపడానికే మీ జీవితం సరిపోతుంది’ అని వెక్కిరించిన వాళ్లు ఉన్నారు. బృందంలోని సభ్యులలో చాలామంది భర్తల మూలంగా ఇబ్బంది పడ్డారు. భర్తలు భరించలేదు! ‘వాళ్ల మాటలు విని డబ్బు తగలేస్తావా?’ అంటాడు ఒక భర్త. ‘ఇంత డబ్బు నీ దగ్గర ఉందని ఎప్పుడూ చెప్పలేదేం’ అని ఈసడిస్తాడు ఒక భర్త. అయితే వారు వేటికీ చలించలేదు. మొదట పాలవ్యాపారం. ఆ తరువాత పెరుగు, నెయ్యి, వెన్న... మొదలైనవి అమ్మడం మొదలుపెట్టారు. ఆ ఊళ్లోనే కాదు... చుట్టు పక్కల ఊళ్లో నుంచి కూడా పాల ఉత్పత్తులు కొనడానికి వచ్చేవాళ్లు. ఆ తరువాత...రసగుల్లతో పాటు ఆ ప్రాంతంలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ‘చెన’లాంటి స్వీట్ల తయారీ మొదలుపెట్టారు. సమీప పట్టణమైన బాలాసోర్‌లో ఈ స్వీట్లను అమ్మే ప్రయత్నం మొదలుపెట్టినప్పుడు ‘పట్టణాల్లో మీ పల్లె మిఠాయిలు ఎవరు కొంటారు? అక్కడ పెద్ద పెద్ద స్వీట్‌షాప్‌లు ఉంటాయి’ అని వెనక్కిలాగే ప్రయత్నం చేశారు కొందరు. అయితే వారు వెనక్కి తగ్గలేదు. స్వీట్ హిట్æ ‘శివశంకర్ స్వీట్’ సూపర్ హిట్ అయింది! బాలాసోర్‌లోనే కాదు బధ్రక్, మహారాజ్‌గంజ్... మొదలైన పట్టణాలతో పాటు పశ్చిమబెంగాల్‌కు కూడా విస్తరించింది స్వీట్ల వ్యాపారం. ‘మొదట్లో భయమేసి వెనక్కి తగ్గుదాం అనుకున్నాను. కాని ఆతరువాత నాకు నేనే ధైర్యం చెప్పుకున్నాను. కొనసాగాను. శివశంకర్ బృందంలో నేను కూడా భాగం అయినందుకు గర్విస్తున్నాను’ అంటుంది మాలతి. ‘వారి మాటల్లోని నిజాయితీ, వారి ఉత్పత్తుల్లో కూడా కనిపిస్తుంది. ఎక్కడా కల్తీ ఉండదు. నాణ్యంగా ఉంటాయి’ అంటున్నాడు బాలాసోర్‌కు చెందిన వైద్యుడు చందన్. ఇది అతడి మాట మాత్రమే కాదు ఎంతోమంది మాట. అందుకే ‘శివశంకర్’ పాల ఉత్పత్తులకు మంచి పేరు వచ్చింది. అడ్వాన్స్డ్ టెక్నాలజీ కూడా ఉపయోగించడం ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నారు. ఒక మంచిపని ఊరకే పోదు! ఎన్నో ఊళ్లకు స్ఫూర్తిని ఇస్తుందని గెలుపుజెండా ఎగరేసి నిరూపించారు పదమూడు మంది మహిళలు. -
85,000 లీటర్ల లిక్కర్ లెక్క.. తిక్క కుదిర్చిన పోలీసులు..!
భువనేశ్వర్: ఒడిశాలోని బాలాసోర్‌లో 85,000పైగా లీటర్ల దేశీయ మద్యంను పోలీసులు స్వాధీనం చేసుకుని ధ్వంసం చేశారు. ఈ ఘటనలో పోలీసులు ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశారు. పోలీసుల వివరాల ప్రకారం... బాలసోర్ జిల్లా ప్రధాన కార్యాలయం శివార్లలో ఉన్న పురుషా బాలసోర్ ప్రాంతంలో భారీగా దేశీయ మద్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ప్రాంతంలో ప్రతి మూడు ఇళ్లలో ఒకరు మద్యం తయారీలో నిమగ్నమైనట్లు పేర్కొన్నారు. దీనివల్ల కోవిడ్ లాక్డౌన్ సమయంలో నేరాల రేట్లు గణనీయంగా పెరిగినట్లు వెల్లడించారు. దీనిపై సమాచారం మేరకు ఒడిశాలోని బాలసోర్ పోలీసులు, ఎక్సైజ్ శాఖ అధికారులతో కలిసి ఆపరేషన్ నిర్వహించి, అనేక అక్రమ దేశీయ మద్యం తయారీ విభాగాలపై మంగళవారం దాడి చేశారన్నారు. చెరువుల లోపల దాచిన మద్యం గ్యాలన్లను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారని తెలిపారు. ఈ ఘటనపై బాలసోర్ ఎస్పీ సుధాన్షు మిశ్రా మాట్లాడుతూ, " మేము 70,000 లీటర్ల పులియబెట్టిన మద్యం పానకాన్ని ధ్వంసం చేశాం. దేశీయ మద్యం తయారీలో ముడిసరుకుగా ఉపయోగించే 'మహువా, మొలాసిస్, మద్యం తయారీ పాత్రలతో పాటు 12,000 లీటర్ల తయారుచేసిన మద్యాన్ని కూడా స్వాధీనం చేసుకున్నాం. ఈ కేసులో ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశామని.’’ తెలిపారు. మరో ఘటనలో బీహార్‌లోని పశ్చిమ చంపారన్ జిల్లాలో కల్తీ మద్యం సేవించి 12 మంది మరణించారు. ఈ మరణాలకు సంబంధించి కనీసం 16 మందిని అరెస్టు చేశారు. -
యాస్ తుపాను ‘అల’జడిలో జననం
భువనేశ్వర్: ‘యాస్’ తుఫాన్ అలజడి సమయంలోనూ పలు కుటుంబాల్లో ఆనందం వెల్లివిరిసింది. బాలాసోర్, భద్రక్, జగత్సింగ్పూర్, కేంద్రాపడా జిల్లాల్లో తుపాను ముంచెత్తుతున్న తరుణంలో పలువురు గర్భిణులు ప్రసవించారు. తల్లీబిడ్డలంతా క్షేమంగా ఉన్నట్లు రాష్ట్ర సమాచార, ప్రసార విభాగం ప్రకటించింది. నెలలు నిండిన గర్భిణులను అంబులెన్సుల్లో తుఫాన్‌కు ముందుగానే ప్రసూతి కేంద్రాల్లో చేర్చిన విషయం తెలిసిందే. జగత్సింగ్పూర్ జిల్లాలో నెలలు నిండిన 31 మంది గర్భిణుల్లో 10 మంది ప్రసవించినట్లు సమాచారం. ఇతర ప్రాంతాల సమాచారం అందాల్సి ఉంది. -
తీరం దాటిన యాస్ తుఫాను
-
Yaas Cyclone: తుపానుపై ఒడిశా అలర్ట్
భువనేశ్వర్: భారత వాతావరణ విభాగం జారీ చేస్తున్న సమాచారం మేరకు యాస్ తుపానుతో బాలాసోర్ జిల్లా ప్రధానంగా ప్రభావితమవుతుంది. పొరుగు జిల్లా భద్రక్‌పై కూడా తుపాను ప్రభావం పడవచ్చు. తుపాను ప్రభావంతో ప్రాణనష్టం జరగకుండా ప్రభుత్వ యంత్రాంగం కృషి చేస్తుందని, తుపానుకు ముందు, తర్వాత కూడా అనుక్షణం అప్రమత్తంగా ఉంటుందని అదనపు డైరెక్టర్ జనరల్ (శాంతిభద్రతలు) యశ్వంత్ జెఠ్వా ధైర్యం చెప్పారు. సోమవారం ఆయన బాలాసోర్ జిల్లాను ప్రత్యక్షంగా సందర్శించి అక్కడి ఏర్పాట్లను సమీక్షించారు. బాలాసోర్ జిల్లాలో 40 లోతట్టు గ్రామాల్ని గుర్తించి కచ్చా ఇళ్లలో ఉంటున్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించి ఆశ్రయం కల్పించేందుకు 1,200 శాశ్వత, తాత్కాలిక ఆశ్రయ కేంద్రాలు ఏర్పాటు చేశారు. సహాయ, పునరుద్ధరణ కార్యకలాపాల కోసం బాలాసోర్ జిల్లాకు అత్యధికంగా 12 యూనిట్ల ఒడిశా విపత్తు స్పందన దళం (ఒడ్రాఫ్) జవాన్లను పంపారు. వారితో పాటు జాతీయ విపత్తు స్పందన దళం (ఎన్డీఆర్ఎఫ్), అగ్ని మాపక దళం జవాన్లు కూడా చేరుకుంటారు. కోవిడ్-19 నిబంధనలతో వారంతా తుపాను అనంతర పునరుద్ధరణ కార్యకలాపాల్లో పాల్గొంటారు. ఈ ఏర్పాట్లపై బాలాసోర్ జిల్లా ఐజీ, ఎస్పీ ఇతర సీనియర్ అధికారులతో శాంతిభద్రతల అదనపు డీజీ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారికి పలు సూచనలు చేశారు. ఆధునిక యంత్రాలతో పునరుద్ధరణ తుపాను తదనంతర పునరుద్ధరణ కార్యకలాపాలు చేపట్టేందుకు రోడ్లు–భవనాల శాఖ 165, గ్రామీణ అభివృద్ధి విభాగం 313 ప్రత్యేక ఇంజినీరింగ్ బృందాల్ని రంగంలోకి దింపాయి. వారంతా అత్యాధునిక సహాయక, పునరుద్ధరణ యంత్ర పరికరాలతో సహాయక, పునరుద్ధరణ పనులు చేపడతారు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల రూ. 20 కోట్లు విలువ చేసిన యంత్రపరికరాల్ని కొనుగోలు చేసింది. వాటిలో టవ ర్ లైట్లు, సెర్చ్ లైట్లు, జనరేటర్లు, జేసీబీలు, హైడ్రా క్రేనులు, ఇన్ఫ్లేటబుల్ పడవలు, హై హ్యాండ్ హైడ్రాలిక్ చెట్టు కోత యంత్రాలు, గ్యాసు కట్టర్లు, ప్లాస్మా కట్టర్లు, సాట్ ఫోన్లు, వాకీటాకీలు ఉన్నాయి. ఈ ఆధునిక సామగ్రితో యాస్ తుపాను కార్యకలాపాలు చేపడతారని శాంతిభద్రతల అదనపు డైరెక్టరు జనరల్ యశ్వంత్ జెఠ్వా మీడియాకు తెలిపారు. -
రుద్రం.. శత్రు రాడార్లు ఇక ధ్వంసం
బాలాసోర్: భారత్, చైనా మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో ఎలాంటి ముప్పునైనా ఎదుర్కోవడానికి మన దేశం అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకుంటోంది. వరసగా క్షిపణి పరీక్షలు నిర్వహిస్తూ భారత వాయుసేనను బలోపేతం చేస్తోంది. శత్రు దేశాల రాడార్లను సర్వ నాశనం చేసే యాంటీ రేడియేషన్ క్షిపణి రుద్రం–1ను భారత్ విజయవంతంగా ప్రయోగించింది. భారత రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీఒ) పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన ఈ క్షిపణిని ఒడిశా తీరంలోని బాలాసోర్ నుంచి శుక్రవారం ఉదయం 10.30 గంటలకు విజయవంతంగా పరీక్షించింది. సుఖోయ్–30 యుద్ధ విమానం నుంచి ప్రయోగించిన ఈ క్షిపణి కచ్చితంగా తన లక్ష్యాలను ఛేదించడం ఒక మైలురాయిగా నిలి చిపోయింది. దూర ప్రాంతాల నుంచి శత్రువుల రాడార్ వ్యవస్థ, ట్రాకింగ్, రక్షణ, కమ్యూనికేషన్ వ్యవస్థలను నాశనం చేయడానికి ఈ క్షిపణిని అభివృద్ధి చేశారు. రుద్రం ప్రయోగం విజయంపై రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ హర్షం వ్యక్తం చేసి, శాస్త్రవేత్తలను అభినందించారు. ఇప్పటికే నిర్భయ, శౌర్య వంటి క్షిపణుల్ని ప్రయోగించి చూసిన భారత్ ఈ యాంటీ రేడియేషన్ క్షిపణి ప్రయోగంతో శత్రు దేశాల వెన్నులో వణుకు పుట్టిస్తోంది. రుద్రం ప్రత్యేకతలు ► దీన్ని సుఖోయ్–30ఎంకేఐ యుద్ధ విమానాలతో ప్రయోగించవచ్చు. ► శత్రువుల రాడార్, సమాచార వ్యవస్థను పూర్తిస్థాయిలో నిర్వీర్వం చేయగలదు. ► 0.6 మాక్ నుంచి 2 మాక్ వేగంతో ఈ క్షిపణి ప్రయాణిస్తుంది. అంటే ధ్వని వేగం కంటే రెండు రెట్లు ఎక్కువ వేగంతో ప్రయాణించగలదు. ► న్యూ జనరేషన్ యాంటీ రేడియేషన్ మిస్సైల్ (ఎన్‌జీఏఆర్‌ఎం) 500 మీటర్ల నుంచి 1,500 మీటర్ల ఎత్తు నుంచి ప్రయోగించవచ్చు. 250 కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాలను ఈ క్షిపణి సమర్థవంతంగా ఛేదిస్తుంది ► గగనతలం నుంచి ఉపరితలంపై ఉన్న లక్ష్యాలను ఛేదించే ఈ వ్యూహాత్మక క్షిపణిలోని పాసివ్ హోమింగ్ హెడ్ శత్రు దేశ రక్షణ వ్యవస్థ రేడియేషన్‌ను తట్టుకుంటూ లక్ష్యాలను ఛేదిస్తుంది. ► ఐఎన్ఎస్–జీపీఎస్ ద్వారా దూరంలోని లక్ష్యాలను కచ్చితత్వంతో ఛేదిస్తుంది. ► దీని ప్రయోగానంతరం శత్రుదేశాలు తమ రాడార్ వ్యవస్థను నిలిపివేసినా, ఇది లక్ష్యాలను నాశనం చేయగలదు. ► 2017లో అమెరికా ఈ తరహా యాంటీ రేడియేషన్ క్షిపణిని నావికా రంగంలో ప్రవేశపెట్టింది. అగ్రరాజ్యం సాధించిన మూడేళ్లలోనే భారత్ అలాంటి క్షిపణిని విజయవంతంగా ప్రయోగించడం విశేషం. -
విజయవంతంగా రుద్రం-1 క్షిపణి ప్రయోగం
భువనేశ్వర్ : శత్రుదేశాల నుంచి వచ్చే ముప్పును దీటుగా ఎదుర్కొనేందుకు భారత్ అన్ని విధాల సన్నాద్ధమవుతోంది. దేశ రక్షణ రంగంలో అత్యాధునిక ఆయుధ సంపత్తిని సిద్ధం చేసుకుంది. ఇందులో భాగంగానే వాయుసేన అమ్ముల పొదలోని తిరుగులేని అస్త్రాన్ని పరీక్షించింది. శత్రు దేశాల రాడార్లను మట్టి కరిపించే భారత రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీఓ) అభివృద్ధి చేసిన రుద్రం -1 క్షిపణిని శుక్రవారం విజయవంతంగా పరీక్షించింది. ఒడిశాలోని బాలాసోర్‌లో సుఖోయ్-30 నుంచి శుక్రవారం ఉదయం ప్రయోగించిన ఈ మిసైల్ నిర్దేశిత లక్ష్యాలను ఛేదించినట్లు డీఆర్డీఓ అధికారికంగా ప్రకటించింది. చదవండి: 'శౌర్యం' చూపుతున్న భారత క్షిపణి సుఖోయ్-30ఎంకేఐ యుద్ధ విమానం నుంచి కూడా ప్రయోగించిన ఈ మిసైల్ శత్రు దేశాల రాడార్లను, నిఘా వ్యవస్థలను దెబ్బతీయగలదు. ఇది కనిష్టంగా 500 మీటర్లు, గరిష్టంగా 15 కిలోమీటర్ల ఎత్తు నుంచి దీన్ని ప్రయోగించవచ్చు. ఇటీవల వరుసగా క్షిపణి పరీక్షలను డీఆర్డీవో నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. కొన్ని రోజుల క్రితమే భారత్.. స్మార్ట్ టార్పిడో మిస్సైల్‌ను పరీక్షించింది. క్షిపణి ప్రయోగం విజయవంతమవడంపై రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ హర్షం వ్యక్తం చేశారు. డీఆర్డీవో శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపారు. చదవండి: సరిహద్దుల్లో క్షిపణుల మోహరింపు -
'శౌర్యం' చూపుతున్న భారత క్షిపణి
సాక్షి, బాలాసోర్: గత వారం రోజులుగా డీఆర్డీవో వరుస క్షిపణులను ప్రయోగిస్తోంది. అధునాతన వర్షన్‌తో శౌర్యా అణు సామర్థ్యం గల బాలిస్టిక్ క్షిపణిని డీఆర్డీఓ శనివారం విజయవంతంగా పరీక్షించింది. భారత్- చైనా ఎల్ఏసీ వద్ద ఉధృత పరిస్థితులు నెలకొంటున్న నేపథ్యంలో ఈ క్షపణిని పరీక్షించడం ప్రాధాన్యం సంతరించికుంది. ఈ క్షపణి దాదాపు 800 కిలోమీటర్ల మేర లక్ష్యాన్ని ఛేదించే సామర్థ్యం కలదు. ఈ క్షిపణి ఆపరేట్ చేసేందుకు సులువుగా, తేలిగ్గా ఉంటుందని.. లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో చివరి దశకు చేరుకునే సరికి హైపర్సోనిక్ వేగంతో దూసుకెళ్తుందని అధికార వర్గాలు వెల్లడించాయి. వరుస పరీక్షలతో డీఆర్డీవో దూకుడు.. డీఆర్డీవో వరుస క్షిపణి పరీక్షలతో దూసుకెళ్తోంది. 'లేజర్ గైడెడ్ యాంటీ ట్యాంక్' క్షిపణిని మంగళవారం విజయవంతంగా పరీక్షించారు. గత పదిరోజుల వ్యవధిలో రెండో క్షిపణిని పరీక్షించిండం విశేషం. మహారాష్ర్టలోని అహ్మద్‌నగర్‌లో ఈ క్షిపణిని అభివృధి చేశారు. దీని రేంజ్ ఐదు కి.మి ఉంటుందని.. వివిధ లాంచ్‌ప్యాడ్స్ ద్వారా ప్రయోగించవచ్చని రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. బ్రాహ్మోస్... డీఆర్డీవో విజయవంతంగా ప్రయోగించిన మరో ఆయుద్ధం.. 'బ్రాహ్మోస్ సూపర్సోనిక్ క్రూజ్ క్షపణి'. 400 కి.మి రేంజ్‌తో లక్ష్యాన్ని ఛేదించగల శక్తి బ్రాహ్మోస్ ప్రత్యేకం. డీఆర్డీవో పీజే-10 ప్రాజెక్ట్ ద్వారా ఈ పరీక్ష నిర్వహించారు. ఇటువంటి క్షపణిని పరీక్షించడం ఇది రెండోసారి. -
అరుదైన పసుపు పచ్చని తాబేలు
-
ఈ అరుదైన తాబేలును చూశారా?
సాక్షి, భువనేశ్వర్: మనం ఇప్పటి వరకూ ఎన్నో రకాల తాబేళ్లు చూసి ఉంటాం. సాధారణంగా తాబేళ్లు నలుపు, బూడిద రంగులో ఉంటాయి. వాటినే మనం చూస్తూ ఉంటాం. అయితే ఒడిశాలో అరుదైన పసుపు పచ్చని తాబేలు వెలుగులోకి వచ్చింది. పసుపు వర్ణంతో ధగధగలాడుతున్న ఈ తాబేలు బాలాసోర్ జిల్లాలో ప్రత్యక్షమైంది. సుజాన్‌పూర్ గ్రామంలో ఈ తాబేలును గమనించిన స్థానికులు... అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. ఈ సందర్భంగా వన్యప్రాణి శాఖ వార్డెన్ భానూమిత్ర ఆచార్య మాట్లాడుతూ ‘ఇది అరుదైన తాబేలు జాతి. ఇప్పటివరకూ ఇలాంటి తాబేలును చూడలేదు’ అని తెలిపారు. ఇందుకు సంబంధించిన వీడియోను ఐఎఫ్ఎస్ అధికారి సుశాంత్ నందా ట్విటర్లో పోస్ట్ చేశారు. తాము కూడా ఇప్పటివరకూ ఇలాంటి తాబేలును చూడలేదంటూ నెటిజన్లు వ్యాఖ్యానించారు. కాగా గత నెలలో కలహండి జిల్లా ధరమ్‌గఢ్ ప్రాంతంలో రోడ్డు నిర్మాణ పనులు సందర్భంగా అరుదైన తాబేలు కనిపించిన విషయం తెలిసిందే. -
గుండెపోటుతో బీజేపీ ఎమ్మెల్యే మృతి
భువనేశ్వర్ : బాలాసోర్ నియోజకవర్గ ఎమ్మెల్యే, బీజేపీ నేత మదన్ మోహన్ దత్తా (61) కన్నుమూశారు. గుండెపోటుతో భువనేశ్వర్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం ఉదయ 9 :45గంటలకు తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని ఎమ్మెల్యే కుమారుడు మనస్ దత్తా అధికారికంగా ధ్రువీకరించారు. మదన్ మోహన్‌కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇంతకుముందు ఆయన పలు అనారోగ్య సమస్యలతో ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చికిత్స పొందినట్లు సమాచారం. 2019 ఎన్నికల్లో తొలిసారిగా బాలాసోర్ సర్దార్ నియోజకవర్గం నుంచి పోటీచేసి 13,406 ఓట్ల తేడాతో విజయం సాధించారు. మదన్ మోహన్ ఇకలేరన్న వార్త నన్ను షాక్‌కి గురిచేసింది ఆయన నాకు సోదరుడి లాంటి వారు అంటూ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ ట్వీట్ చేశారు. మదన్ మోహన్ మృతిపై ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్, బీజేపీ అధికార ప్రతినిధి గోలక్ మోహపాత్రాతో సహా పలువురు నేతలు సంతాపం ప్రకటించారు. (‘అందుకే మమతకు ఆహ్వానం లేదు’ ) -
అగ్ని–2 రాత్రి పరీక్ష విజయవంతం
బాలాసోర్ (ఒడిశా) : భూతలం నుంచి భూతలంలో ఉన్న లక్ష్యాలను ఛేదించే ఇంటర్మీడియట్ రేంజ్ బాలిస్టిక్ క్షిపణి ‘అగ్ని 2’కు మొదటిసారి రాత్రిపూట నిర్వహించిన పరీక్ష విజయవంతమైంది. ఒడిశా తీరంలోని డాక్టర్ అబ్దుల్ కలామ్ ద్వీపంలోని ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ (ఐటీఆర్) కాంప్లెక్స్ 4 నుంచి దీన్ని పరీక్షించామని రక్షణ శాఖ తెలిపింది. ఈ క్షిపణికి 2 వేల కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించగల సామర్థ్యం ఉంది. దాదాపు 20 మీటర్ల పొడవున్న ఈ క్షిపణి బరువు సుమారు 17 టన్నులు. మరో 1000 కేజీల పేలోడ్‌ను ఇది మోసుకెళ్లగలదు. అగ్ని–2 క్షిపణిని మొదటిసారి 1999 ఏప్రిల్ 11న పరీక్షించారు. చివరిసారిగా 2018 ఫిబ్రవరి 20న పరీక్షించిన ఈ క్షిపణి ఇప్పటికే సైన్యం అమ్ముల పొదిలో చేరింది. -
కవర్లో చిన్నారి మృతదేహం..
భువనేశ్వర్ : బాలాసోర్ జిల్లాలో గురువారం రాత్రి హృదయ విదారక ఘటన వెలుగుచూసింది. పాలిథీన్ కవర్లో ఓ శిశువు మృతదేహం దర్శనమిచ్చింది. పట్టణంలోని కమ్యునిటీ హెల్త్ సెంటర్ పరిసర ప్రాంతాల్లో ఓ శునకం చిన్నారి మృతదేహం పీక్కుతింటుండగా.. కొందరు గమనించి పోలీసులకు సమాచారమిచ్చారు. ఘటనస్థలికి చేరుకున్న పోలీసులు శిశువు మృతదేహాన్ని పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని విచారణ ప్రారంభించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
‘అవన్ని తప్పుడు కేసులే’
భువనేశ్వర్ : ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతోన్నారు ‘ఒడిషా మోదీ’ అలియాస్ ప్రతాప్‌చంద్ర సారంగి. ప్రధాని నరేంద్ర మోదీ కేబినెట్లో ప్రతాప్‌చంద్ర సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు, పశుసంవర్ధక శాఖ సహాయ మంత్రిగా స్థానం దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఆర్భాటాలకు ప్రాముఖ్యం ఇవ్వకుండా.. అతి సాధారణంగా జీవిస్తారు ప్రతాప్‌చంద్ర. ఈ క్రమంలో ప్రస్తుతం ఆయన జీవనశైలికి సంబంధించిన విశేషాలే కాకుండా.. మరి కొన్ని వివాదాస్పద అంశాలు కూడా వెలుగులోకొస్తున్నాయి. ప్రతాప్‌చంద్ర మీద ఏడు క్రిమినల్ కేసులున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. 2002లో మితవాద గ్రూపులు, బజరంగ్ దళ్‌తో కలిసి ఒడిషా అసెంబ్లీ మీద దాడి చేసిన కేసులో ప్రతాప్‌చంద్ర అరెస్టయ్యారనే వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాక 1999లో ఆస్ట్రేలియన్ క్రైస్తవ మత గురువు గ్రాహం సాయినెట్తో పాటు అతని ఇద్దరి పిల్లల్ని బజరంగ్ దళ్ సభ్యులు కృరంగా చంపేశారు. ఆ మూకకు ప్రతాప్చంద్రే నాయకత్వం వహించినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే ఈ ఆరోపణలు ఖండించారు ప్రతాప్‌చంద్ర. ఇవన్ని తప్పుడు కేసులని.. కావాలనే పోలీసులు తన మీద ఇలాంటి కేసులు పెట్టారని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘లంచం తీసుకునే పోలీసులకు వ్యతిరేకంగా నేను పోరాటం చేశాను. దాంతో వారు నా మీద ఇలా తప్పుడు కేసులు పెట్టారు. ఇవన్ని తప్పుడు ఆరోపణలు అని కోర్టులే తేల్చాయి. చాలా కేసులను కొట్టేశాయి’ అని తెలిపారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ తరఫున బరిలో నిలిచారు ప్రతాప్‌చంద్ర. ఆటోలో ప్రచారం నిర్వహిస్తూ సామాన్యులకు చేరువయ్యారు. అదే విధంగా ఏకంగా ప్రధాని నరేంద్ర మోదీ కూడా ప్రతాప్‌చంద్రకు మద్దతుగా ప్రచార సభలో పాల్గొని ఆయనకు అండగా నిలిచారు. ఈ క్రమంలో సంపన్నులు, మీడియా చానళ్లు, రాజకీయ నేపథ్యం ఉన్న ప్రత్యర్థి అభ్యర్థులను మట్టికరిపించి బాలాసోర్ నుంచి తొలిసారి ఎంపీగా గెలుపొందారు. ప్రధాని నరేంద్ర మోదీ జంబో కేబినెట్లో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు, పశుసంవర్ధక సహాయ మంత్రిగా పదవి దక్కించుకుని పలువురి దృష్టిని ఆకర్షించారు. (చదవండి : అప్పుడు టికెట్ పోయింది; ఇప్పుడేమో..) -
అప్పుడు టికెట్ పోయింది; ఇప్పుడేమో..
భువనేశ్వర్ : ప్రధాని నరేంద్ర మోదీ జెంబో క్యాబినెట్లో బీజేపీ ఎంపీ ప్రతాప్‌చంద్ర సారంగి సహాయ మంత్రిగా స్థానం దక్కించుకున్నారు. మోదీతో పాటు గురువారం ఆయన పదవీ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ క్రమంలో ఆయనకు సంబంధించిన కొన్ని ఆసక్తికర అంశాలు వెలుగులోకి వచ్చాయి. ఒడిశా మోదీగా పేరొందిన ప్రతాప్‌చంద్రకు 2009 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ టికెట్ ఇచ్చినప్పటికీ ఆయన స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగారు. అయితే పార్టీపై వ్యతిరేకత వల్లనో లేదా ప్రత్యర్థుల ఎత్తుల కారణంగానో ప్రతాప్‌చంద్ర ఇలా చేయలేదు. ఆయన అనుసరించే అతి సాధారణ జీవనశైలే ఇందుకు కారణం. ఆర్భాటాలకు పెద్దగా ప్రాముఖ్యం ఇవ్వని ప్రతాప్‌చంద్ర ఎన్నికల సమయంలోనూ బస్సులోనే ప్రయాణించేవారు. ఇందులో భాగంగా పార్టీ టికెట్‌ను బ్యాగులో పెట్టుకుని బస్సు ఎక్కగా దొంగలు బ్యాగ్‌ను కొట్టేశారు. దీంతో టికెట్ కూడా పోయింది. ఈ క్రమంలో నామినేషన్ గడువు సమీపించడంతో స్వతంత్ర అభ్యర్థిగానే పోటీ చేసి విజయం సాధించారు. ప్రజల నమ్మకం, విశ్వాసం చూరగొంటే జెండా, గుర్తుతో సంబంధం లేకుండా గెలుపొందవచ్చని నిరూపించారు. కాగా ఆరెస్సెస్ ప్రచారక్‌గా గుర్తింపు పొందిన ప్రతాప్‌చంద్ర సారంగి ఒడియాతో పాటు సంస్కృత భాషలో కూడా అనర్గళంగా మాట్లాడగలరు. ఎదుటివారు ఎంతటి వారైనా తన వాగ్ధాటితో మెప్పించగల చతురులు. 2004, 2009 అసెంబ్లీ ఎన్నికల్లో అధికార బీజేడీ హవాను తట్టుకుని ఎమ్మెల్యేగా గెలుపొందారు. గ్రామాల్లో సైకిల్‌పై తిరుగుతూ ప్రజల సమస్యలు తెలుసుకుంటూ వారితో మమేకమయ్యే ప్రతాప్‌చంద్ర.. 2019 సార్వత్రిక ఎన్నికల ప్రచారంలోనూ అదే పంథా అనుసరించారు. బీజేపీ టికెట్ సంపాదించిన ఆయన ఆటోలో ప్రచారం నిర్వహిస్తూ సామాన్యులకు చేరువయ్యారు. అదే విధంగా ఏకంగా ప్రధాని నరేంద్ర మోదీ కూడా ప్రతాప్‌చంద్రకు మద్దతుగా ప్రచార సభలో పాల్గొని ఆయనకు అండగా నిలిచారు. చదవండి : మోదీ కేబినెట్ @ 58 ఈ క్రమంలో సంపన్నులు, మీడియా చానళ్లు, రాజకీయ నేపథ్యం ఉన్న ప్రత్యర్థి అభ్యర్థులను మట్టికరిపించి బాలాసోర్ నుంచి తొలిసారి ఎంపీగా గెలుపొందారు. ప్రధాని నరేంద్ర మోదీ జంబో కేబినెట్లో సహాయ మంత్రిగా పదవి దక్కించుకుని పలువురి దృష్టిని ఆకర్షించారు. ఇక ప్రధాని నరేంద్ర మోదీతో పాటు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్, నితిన్ గడ్కారీ, ఎస్.జయశంకర్ సహా మొత్తం 58 మంది గురువారం మంత్రులుగా ప్రమాణం చేసిన సంగతి తెలిసిందే. వీరిలో 25 మంది కేబినెట్ మంత్రులు కాగా.. స్వతంత్ర హోదా కలిగిన మంత్రులు 9 మంది, సహాయ మంత్రులు 24 మంది ఉన్నారు. -
సూపర్‌పవర్‌గా.. ‘శక్తి’భారత్
సాక్షి, న్యూఢిల్లీ: అంతరిక్షంలో సూపర్‌పవర్‌గా ఎదిగే దిశగా భారత్ మరో ‘శక్తి’మంతమైన ముందడుగేసింది. ఒడిషాలోని బాలాసోర్‌లో బుధవారం ఉదయం 11.16 గంటలకు, భారత్ తన ఉపగ్రహ విధ్వంసక క్షిపణిని అంతరిక్షంలోకి విజయవంతంగా పంపింది. ఈ ప్రయోగంలో భూమి నుంచి 300 కి.మీల ఎత్తులోని ఒక ఉపగ్రహాన్ని కేవలం 3 నిమిషాల వ్యవధిలోనే ఏశాట్ (శాటిలైట్ విధ్వంసక క్షిపణి) కూల్చివేసింది. ప్రయోగం సఫలమవడంతో ఉపగ్రహాలను కూల్చివేసే సత్తా సాధించిన నాలుగో దేశంగా అమెరికా, రష్యా, చైనాల సరసన భారత్ సగర్వంగా నిలిచింది. మిషన్ శక్తి పేరుతో చేపట్టిన ఈ ప్రయోగ వివరాలను ప్రధాని మోదీ జాతినుద్దేశించి మాట్లాడుతూ వెల్లడించారు. ‘ఏశాట్ సక్సెస్ భారత్‌ను భూ, జల, వాయు మార్గాల్లోనే గాక అంతరిక్షంలోనూ మన ప్రయోజనాల్ని కాపాడుకునే సామర్థ్యాన్ని పెంచింది. శాస్త్రవేత్తల్ని చూసి ప్రజలందరూ గర్వపడుతున్నారు. ఏశాట్ ప్రయోగం సందర్భంగా భారత్ ఎటువంటి అంతర్జాతీయ ఒప్పందాలు, చట్టాల అతిక్రమణలకు పాల్పడలేదు. మేం ఏ దేశానికీ వ్యతిరేకం కాద’ని మోదీ తన ప్రసంగంలో తెలిపారు. (చదవండి : ‘శక్తి’మాన్ భారత్) ఏశాట్ ప్రయోగ విశేషాలు: - ఏశాట్ క్షిపణి తయారీలో 300 మంది డీఆర్డీవో శాస్త్రవేత్తలు, సిబ్బంది రాత్రింబవళ్లు చెమటోడ్చారు. - శత్రు క్షిపణులను క్షణాల్లో మట్టుపెట్టగల సత్తా ఏశాట్ సొంతం. - సెకనుకు 7.8 కి.మీ వేగంతో, ధ్వని కంటే 20సార్లు మించిన స్పీడుతో పరిభ్రమిస్తున్న ఉపగ్రహాన్ని అంతే కచ్చితత్వంతో కూల్చడం. - పృథ్వీ క్షిపణిలో వాడిన సాంకేతికతను ఏశాట్ నిర్మాణంలో కొంతమేర వినియోగించారు. మనకన్నా ముందెవరు? - మిషన శక్తి పేరుతో భారత్ ప్రయోగించిన ఉపగ్రహ విధ్వంస క్షిపణి వ్యవస్థను అమెరికా చాలా సంవత్సరాల కిందే అభివృద్ధి చేసుకుంది. తొలిసారి 1959, అక్టోబర్‌లో బోల్డ్ ఒరియన్ పేరుతో ఆ దేశం ప్రయోగాలకు తెరదీసింది. 1985లో ఏఎస్ఎమ్-135 పేరుతో అమెరికా మరోసారి ఈ తరహా ప్రయోగం చేసింది. - రష్యా 1950లోనే ఉపగ్రహ విధ్వంసక క్షిపణి వ్యవస్థకు సంబంధించిన పరిశోధనను శ్రీకారం చుట్టింది. 1963లో పాలియట్ రాకెట్ సహాయంతో రష్యా ఏశాట్ ప్రయోగం చేసింది. - చైనా ఏశాట్ ప్రయోగాన్ని జనవరి, 2007లో నిర్వహించింది. 2005, జూలై 7.. 2006, ఫిబ్రవరి 6లో రెండు విఫల ప్రయోగాల తర్వాత చైనా 2007లో విజయం సాధించింది. -
58 ఏళ్ల తండ్రి.. 30 ఏళ్ల కొడుకు ఒకే క్లాస్..!
భువనేశ్వర్: చదువుకోవాలన్న తపన ఉండాలే కానీ చదువుకు వయసు ఏ మాత్రం అడ్డంకి కాదని నిరూపించారు ఓ తండ్రి కొడుకులు. చదువుకు స్వస్తి చెప్పిన చాలా ఏళ్ల తర్వాత మళ్లీ పదో తరగతి పరీక్షలు రాసి పాసయ్యారు. ఒడిశాలోని బాలాసోర్ జిల్లాకు చెందిన అరుణ్‌కుమార్ బీజ్(58), అతని కొడుకు కుమార్ బిస్వాజిత్ బీజ్(30) ఇద్దరూ ఒకే సారి పదో తరగతి ఉత్తీర్ణులయ్యారు. కాగా తండ్రి కొడుకులకి ఒకే విధమైన మార్కులు(342) రావడం విశేషం. అరుణ్ కుమార్ ఓ సీనియర్ బీజేపీ లీడర్. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. ఆయన ఏడో తరగతి చదువుతుండగా తండ్రి చనిపోవడంతో చదువు మానేశాడు. రాజకీయంగా ఎదిగినా చదువుకోలేదన్న బాధ ఎపుడూ తనను వెంటాడేదని అరుణ్ తెలిపారు. ‘2014 ఎన్నికల సమయంలో అఫిడవిట్లో ఎడ్యుకేషన్ కాలమ్ ఖాళీగా వదిలేయడం వల్ల సిగ్గుతో తలదించుకున్నాను. అప్పుడే పదో తరగతి ఎలాగైనా పాస్ అవ్వాలని నిర్ణయించుకున్నాను. ఓపెన్ స్కూల్లో చేరి పదో తరగతి పాస్ కావడం సంతోషంగా ఉంది. ఇక 2019 ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్ ఇస్తే నా ఎడ్యుకేషన్ కాలమ్‌ని గర్వంగా పూర్తి చేస్తా’ అని అరుణ్ కుమార్ తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. బిస్వాజిత్ పదోతరగతి మధ్యలోనే మానేశాడు. అనంతరం బిజినెస్ చూసుకుంటూ మళ్లీ పరీక్షలకు హాజరు కాలేదు. ‘ఇంట్లో అందరూ చదువుకున్న వారే. నేను నాన్న మాత్రమే పదోతరగతి పాస్ కాలేదు. పదో తరగతి ఎలాగైనా చదువాలనే పట్టుదలతో ప్రతి ఆదివారం నేను, నాన్న తరగతులకు హాజరయ్యేవాళ్లం. మా పెద్ద అన్నయ్య కూడా చదువు విషయంలో అండగా నిలిచాడు. పదో తరగతి పాస్ అయినందుకు సంతోషంగా ఉంద’ని బిస్వాజిత్ తన ఆనందాన్ని పంచుకున్నారు. -
సీఎంపై కోడిగుడ్లు విసిరిన మహిళలు
భువనేశ్వర్: ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్‌కు చేదు అనుభవం ఎదురైంది. బుధవారం ఓ అధికారిక కార్యక్రమంలో పాల్గొన్న ఆయనకు నిరసన సెగ తగిలింది. మహిళలు అనూహ్యంగా ఆయనపై గుడ్ల వర్షాన్ని కురిపించారు. అయితే, ముఖ్యమంత్రికి ఆ గుడ్లు తాకలేదు. ముఖ్యమంత్రి లక్ష్యంగా గుడ్లు దూసుకురావడంతో.. ఆయన వ్యక్తిగత సిబ్బంది, అధికారులు అడ్డుగా నిలబడ్డారు. బాలాసౌర్లో ఈ ఘటన జరిగింది. ముఖ్యమంత్రి లక్ష్యంగా గుడ్లు విసిరిన మహిళలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
ముఖ్యమంత్రిపై కోడిగుడ్లు విసిరిన మహిళలు
-
క్రూడాయిల్ దొంగల ముఠా అరెస్ట్
బాలాసోర్ : భూగర్భ పైప్‌లైన్ నుంచి క్రూడాయిల్ దొంగిలిస్తున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. ఒడిశా రాష్ట్రంలోని పారదీప్-హల్దియా భూగర్భ పైప్ లైన్ నుంచి ముడి చమురు దొంగతనం జరుగుతోంది. దీనిపై దృష్టి పెట్టిన పోలీసులు రూప్సా వద్ద తొమ్మిది మంది సభ్యులు గల ముఠాను గురువారం అరెస్టు చేసినట్లు ఎస్పీ నితిశేఖర్ తెలిపారు. తమకందిన సమాచారం మేరకు ఆయిల్ చోరీ జరుగుతున్న ప్రదేశంపై పోలీసులు దాడిచేసి ముఠాను అరెస్టు చేశారన్నారు. ఈ ముఠా సభ్యులు ఉత్తరప్రదేశ్, పంజాబ్, పశ్చిమ బంగ, ఒడిశా రాష్ట్రాలకు చెందిన వారని ఆయన వివరించారు. -
క్షిపణుల ప్రయోగం సక్సెస్
-
క్షిపణుల ప్రయోగం సక్సెస్
బాలాసోర్ (ఒడిశా): భారత రక్షణదళం తన సామర్థ్యాన్ని పెంచుకొనే దిశగా మరో రెండు కొత్త క్షిపణులను విజయవంతంగా ప్రయోగించింది. ఇజ్రాయెల్ సాంకేతికతతో తయారు చేసిన ఉపరితలం నుంచి గగనతలంలోకి ప్రయోగించే సుదూర క్షిపణులను (ఎల్ఆర్ఎస్ఏఎం) ప్రయోగించింది. ఒడిశా తీరంలోని చాందీపూర్ ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ (ఐటీఆర్) నుంచి మొబైల్ లాంచర్ ద్వారా మంగళవారం ఉదయం 10:13 గంటలకు మొదటి ప్రయోగాన్ని, 14:25 గంటలకు రెండో ప్రయోగాన్ని నిర్వహించినట్లు డీఆర్డీవో శాస్త్రవేత్తలు తెలిపారు. ట్రయల్ పరీక్ష విజయవంతమైందన్నారు. ఉపరితలం నుంచి గగనతలంలో లక్ష్యాలను ఛేదించే భారత్, ఇజ్రాయెల్ రూపొందించిన మీడియం రేంజ్ క్షిపణిని ఈ ఏడాది జూన్ 30 జూలై 1 మధ్యన వరుసగా మూడుసార్లు విజయవంతంగా డీఆర్డీవో శాస్త్రవేత్తలు ప్రయోగించారు. ఉపరితలం నుంచి గగనతలంలో లక్ష్యాలను ఛేదించే లాంగ్ రేంజ్ క్షిపణి (ఎల్ఆర్-ఎస్ఏఎం)ని గతేడాది డిసెంబర్ 30న ఐఎన్ఎస్ కోల్‌కతా వాహక నౌకపై నుంచి కూడా విజయవంతంగా ప్రయోగించారు. -
అగ్ని-3 పరీక్ష మళ్లీ సక్సెస్
బాలాసోర్(ఒడిశా): అణు సామర్థ్యం కలిగిన అగ్ని-3 బాలిస్టిక్ క్షిపణి సోమవారం నిర్వహించిన ప్రయోగాత్మక పరీక్షలో విజయం సాధించింది. వినియోగ పరీక్షల్లో భాగంగా సైన్యం దీన్ని ఒడిశా తీరంలోని వీలర్ దీవి నుంచి ప్రయోగించింది. 3,000 కిలోమీటర్లకుపైగా దూరంలో ఉన్న లక్ష్యాలను ఈ క్షిపణి ఛేదించింది. ప్రయోగంలో ఇది దాదాపు 350 కిలోమీటర్ల ఎత్తు వరకు వెళ్లి... 3,000 డిగ్రీల ఉష్ణోగ్రతను తట్టుకుంటూ భూ వాతావరణంలోకి విజయవంతంగా ప్రవేశించింది. ‘‘స్ట్రాటజిక్ ఫోర్స్ కమాండ్(ఎస్ఎఫ్సీ) నిర్వహించిన ప్రయోగాత్మక పరీక్ష.. మంచి ఫలితాలు వచ్చాయి. పరీక్షలో అన్ని పరామితుల విషయంలోనూ క్షిపణి పూర్తిస్థాయిలో విజయవంతమైంది’’ అని డీఆర్డీఓ ప్రతినిధి రవి కుమార్ గుప్తా తెలిపారు. అగ్ని-3కి సైన్యం వినియోగ పరీక్షలు నిర్వహించడం ఇది రెండోసారి. తాజా ప్రయోగం క్షిపణిని సైన్యంలో ప్రవేశపెట్టేందుకు వీలుగా నిర్వహించిన ముందస్తు పరీక్ష. డీఆర్డీఓ శాస్త్రవేత్తలు సూచించిన మేరకు అన్ని ఆపరేషన్లను సైన్యం నిర్వహించింది. పరీక్షల్లో విజయం సాధించడంతో సైన్యంలో ప్రవేశపెట్టేందుకు ఈ క్షిపణి ఇప్పుడు అన్ని అర్హతలు సాధించినట్లయింది. అగ్ని-3 ప్రత్యేకతలివీ.. * ఇది రెండు దశల దృఢమైన ప్రొపెల్లెంట్ వ్యవస్థ కలిగి ఉంటుంది. * దీని పొడవు 17 మీటర్లు.. వ్యాసం 2 మీటర్లు.. బరువు దాదాపు 50 టన్నులు * 1.5 టన్నుల బరువున్న అణ్వస్త్రాలను ఇది మోసుకుపోగలదు. * అధునాతన నావిగేషన్, గెడైన్స్, నియంత్రణ వ్యవస్థలు కలిగిన ఈ క్షిపణి కోసం అధునాతన కంప్యూటర్ వ్యవస్థను వినియోగిస్తున్నారు.