భువనేశ్వర్: బిహార్‌లో విషాదం చోటుచేసుకుంది. బస్సు నడుపుతుండగా గుండెపోటుకు గురైన డ్రైవర్.. అప్రమత్తతో వ్యవహరించడంతో 60 ప్రయాణికుల ప్రాణాలు నిలిచాయి. కానీ దురదృష్టవశాత్తూ అతడు ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన బాలాసోర్ జిల్లాలోని పటాపూర్ చక్‌లో మంగళవారం ఉదయం జరిగింది.
పోలీసుల వివరాల ప్రకారం.. పశ్చిమబెంగాల్‌కు చెందిన పర్యాటకులతో ఓ బస్సు బాలాసోర్‌లోని పంచలింగేశ్వరాలయం వైపు వెళ్తుంది. మార్గ మధ్యంలో బస్సు డ్రైవర్ గుండెపోటుకు గురయ్యాడు. ఛాతీతో ఉన్నట్టుండి నొప్పి రావడంతో వెంటనే బస్సును పక్కను నిలిపివేశాడు. అనంతరం అతడు స్పృహ కోల్పోయాడు.
దీంతో తీవ్ర భయందోళనకు గురైనన ప్రయాణికులు వెంటనే స్థానికుల సాయంతో దగ్గర్లోని ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే అప్పటికే అతను ప్రాణాలు విడిచినట్లు వైద్యులు ప్రకటించారు. మృతిచెందిన డ్రైవర్‌ను షేక్ అక్తర్‌గా గుర్తించారు. అతడి అప్రమత్తతో ప్రయాణికులకు ప్రాణాపాయం తప్పింది. ప్రమాద సమయంలో బస్సులో 60 మంది ప్రయాణికులు ఉన్నారు.
చదవండి: మాకు నితీష్ అవసరం లేదు: రాహుల్
Comments
Please login to add a commentAdd a comment