bus driver
-
నా దారి రహదారి
అవని నుంచి అంతరిక్షం వరకు మహిళలు అసాధారణ విజయాలు సాధించి తమ సత్తా చాటుతున్నా.... ఇంకా లింగవివక్షతతో కూడిన బోలెడు ఆశ్చర్యాలు మిగిలే ఉన్నాయి. ఫిలింనగర్ బస్తీలో మక్కల మాధవి బస్ డ్రైవర్‌గా స్టీరింగ్ పట్టినప్పుడు... ‘ఇదేందీ!’ అని ఆశ్చర్యపోయిన వాళ్లే ఎక్కువ. ‘పెద్ద బస్పు నడపడం నీ వల్ల ఏమవుతుందమ్మా!’ అని నిరాశ పరిచిన వారే ఎక్కువ. అయినా సరే...‘నా దారి రహదారి’ అంటూ మాధవి దూసుకువెళుతూ తన డ్రైవింగ్ స్కిల్స్‌తో శభాష్ అనిపించుకుంటోంది...హైదరాబాద్ ఫిలింనగర్‌లోని గౌతమ్‌నగర్ బస్తీలో నివసించే మక్కల మాధవి భర్త రాజేష్ ‘జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్’ బస్సు డ్రైవర్‌గా గత పది సంవత్సరాలుగా పని చేస్తున్నాడు. ఇదే బస్సులో మాధవి అటెండర్‌గా పని చేసేది. భర్త బస్సు నడుపుతున్న తీరు చూసి డ్రైవింగ్‌పై ఆసక్తి పెంచుకుంది. స్కూల్ మైదానంలో భర్త ద్వారా డ్రైవింగ్‌లో శిక్షణ తీసుకొని ఏడాది క్రితం నుంచే బస్సు నడపడం మొదలుపెట్టింది. స్కూల్ చైర్మన్, ప్రిన్సిపాల్‌తోపాటు టీచర్లు కూడా ఆమె పట్టుదలకు ఫిదా అయ్యారు. ప్రోత్సహించారు. పూర్తి అనుభవం వచ్చాకే స్కూల్ బస్సు నడుపుతానని జేహెచ్‌పీఎస్ యాజమాన్యానికి తెలియజేసింది.డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవడానికి ఆర్టీఏ కార్యాలయానికి వెళ్లిన మాధవిని చూసి ‘బక్కపల్చగా ఉన్న ఈమె బస్సు ఏం నడుపుతుంది!’ అని అధికారులు వ్యంగ్యంగా మాట్లాడటమే కాకుండా బస్సు నడపడానికి తిరస్కరించారు. అయితే మాధవి ఏమాత్రం నిరాశ పడలేదు. మూడోసారి వెళ్ళి ఒకసారి తాను బస్సు నడపడం చూడాలని, నచ్చకపోతే లైసెన్స్ ఇవ్వొద్దని వేడుకుంది. ఎత్తు, ఒంపుల్లో బస్సును నడిపించి ఎలాగైనా అనర్హురాలిగా చేసి పంపాలనుకున్న అధికారులు మాధవి బస్సు నడిపించే తీరు చూసి ఆశ్చర్యపోయారు. అభినందించారు. పరీక్షలో పాస్ కావడంతో మాధవికి డ్రైవింగ్ లైసెన్స్ మంజూరు చేశారు. స్కూల్ యాజమాన్యం కూడా ఆమెను మరింత ప్రోత్సహిస్తూ పిల్లలను తీసుకురావడం, ఇంటి దగ్గర దింపేందుకు బస్సు నడిపే బాధ్యతను అప్పగించింది. గో ఎ హెడ్డ్రైవింగ్ చేస్తానని చెప్పినప్పుడు నా భర్త కాస్త భయపడ్డాడు. అయితే నాకు నేర్పించే క్రమంలో గ్రౌండ్లో నా డ్రైవింగ్ చూసి ఆయనకు భయం పోయింది. దీంతో మెల్లమెల్లగా ప్రతిరోజూ అదే గ్రౌండ్లో రెండు గంటలపాటు డ్రైవింగ్ప్రాక్టిస్ చేసేదాన్ని. బస్సు డ్రైవింగ్ పూర్తిగా వచ్చాక ఇక వెనక్కి తిరిగి చూసుకోలేదు. స్కూల్ యాజమాన్యం, టీచర్లు వెన్ను తట్టి ప్రోత్సహించడం, బస్సు నడుపుతున్నప్పుడు గో ఏ హెడ్ అని పిల్లలు అరవడం నాకు ఉత్సాహాన్ని ఇచ్చింది.– మక్కల మాధవి – పురుమాండ్ల నరసింహారెడ్డి,సాక్షి, హైదరాబాద్ -
డీజే టిల్లూ ‘కొట్టూ కొట్టూ...’
పలమనేరు (చిత్తూరు): ఓంశక్తి మాల ధరించి అమ్మవారి దర్శనానికి వెళ్లిన భక్తులకు డీజే టిల్లూ డ్యాన్సు చుక్కలు చూపించిన సంఘటన ఆదివారం పలమనేరులో వెలుగు చూసింది. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. పలమనేరు రెవెన్యూ డివిజన్లోని చౌడేపల్లి మండలం పుదిపట్ల పంచాయతీ మిట్టూరుకు చెందిన 34 మంది ఓంశక్తి భక్తులు ప్రైవేటు బస్సును రూ.1.25లక్షలకు మాట్లాడుకొని ఆలయాల సందర్శనకు ఈ నెల 22న బయల్దేరారు. బస్సు అద్దెకు చెల్లించిన మొత్తం పోగా మిగిలిన పదివేలను స్వగ్రామంలో బస్సు దిగినాక ఇస్తామని తెలిపారు. ఈ టూరిస్ట్ బస్సు తమిళనాడు, కర్ణాటకలోని పలు దేవాలయాల సందర్శనానంతరం బయలుదేరింది. ఈ నేపథ్యంలో బాగేపల్లి వద్ద డ్రైవర్ అరవింద్ డీజిల్‌కు డబ్బులిస్తేనే బస్సు కదులుతుందని ఆపేశాడు. దీంతో ప్రయాణికులు, డ్రైవర్ మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. దీనిపై ఆగ్రహించిన బస్సు డ్రైవర్ మహిళలపై దాడికి దిగాడు. తనకు డబ్బులు మొత్తం ఇస్తేనే బస్సు కదులుతుందని తెగేసి చెప్పారు. వారు ఇవ్వకపోవడంతో కర్ణాటకలోని ధర్మస్థలం వద్ద ప్రయాణికులను బస్సులోంచి దింపేశాడు. దీంతో పిల్లాపాపలతో వారంతా రాత్రిపూట రోడ్డుపై పడుకోవాల్సి వచ్చింది. ఆపై అందరూ కలిసి డబ్బులు సమకూర్చుకుని అదే బస్సులో ప్రయాణం మొదలు పెట్టారు. మార్గమధ్యంలో బస్సులోని వారు డీజే టిల్లు వీడియో సాంగ్ పెట్టాలని డిమాండ్ చేశారు. అయితే బస్సులో వీడియో పనిచేయడం లేదని డ్రైవర్ చెప్పాడు. అప్పుడేమో అన్నీ ఉన్నాయని చెప్పి ఇప్పుడు ఇలా చేస్తే ఎలా అని మళ్లీ డ్రైవర్‌తో ప్రయాణికులతో గొడవ మొదలైంది. ఈ నేపథ్యంలో బస్సులోని కొందరు యువకులు డీజే టిల్లు డ్యాన్స్‌లు మొదలు పెట్టారు. దీంతో డ్రైవర్ బస్సును పలమనేరు సమీపంలోని పెట్రోల్ బంకు వద్ద ఆపేసి తమ యజమానికి ఫోన్ చేశాడు. అక్కడికి చేరుకున్న యజమాని, డ్రైవర్లు స్థానిక యూనియన్ నాయకులతో కలసి సమస్యను పరిష్కరించారు. బస్సు గ్రామానికి వెళ్లిన తరువాత మిగిలిన అద్దె ఇచ్చేలా నిర్ణయించారు. దీంతో ఓంశక్తి భక్తులు ఊరు చేరుకున్నారు. -
పుష్ప 2 సినిమా చూసొచ్చి బస్సు ఎత్తుకెళ్లిన దుండగుడు
అనకాపల్లి జిల్లా: నర్సీపట్నం ఆర్టీసీ డిపో నుంచి తుని వెళ్లాల్సిన ఆర్టీసీ అద్దె బస్సు ఆదివారం అర్ధరాత్రి చోరీకి గురైంది. కాంప్లెక్స్ ఆవరణలో బస్సు నిలిపి ఉంచిన అనంతరం క్లీనర్ తాళాలు మరిచిపోయి ఇంటికి వెళ్లిపోయాడు. తుని వెళ్లేందుకు డ్యూటీ డ్రైవర్ కాంప్లెక్స్‌కు వచ్చి చూసే సరికి పార్క్ చేసిన ప్రదేశంలో బస్సు లేదు. డ్రైవర్ వెంటనే బస్సు యజమాని దాట్ల గీతంరాజుకు విషయం చెప్పాడు. యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు సీసీ టీవీ ఫుటేజ్‌ను పరిశీలించి గాలింపు చేపట్టారు. చింతపల్లికి సమీపంలోని చింతలూరు వద్ద పోలీసులు బస్సుతో పాటు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు సాధిక్ బాషా తమిళనాడుకు చెందిన వ్యక్తిగా పోలీసులు తెలిపారు. చింతలూరు వద్ద… pic.twitter.com/E4jhNy1bXl— Telugu Scribe (@TeluguScribe) December 24, 2024 -
బస్సు డ్రైవర్ కు గుండెపోటు..
-
‘చిల్లర’ పొరపాట్లు.. పెద్ద శిక్షలు!
టికెట్ జారీ యంత్రం (టిమ్) ద్వారా కండక్టర్ విధులను కూడా నిర్వహించే డ్రైవర్ అతను. బస్సు నడుపుతుండగా రిజర్వేషన్ చేయించుకొని తదుపరి స్టాప్‌లో ఎక్కాల్సిన ప్రయాణికుడు ఫోన్ చేశాడు. ఆ ఫోన్ మాట్లాడుతుండగా ఫొటో తీసిన ఓ ప్రయాణికుడు దాన్ని సోషల్ మీడియాలో ఉంచడంతో డ్రైవర్‌ను ఉన్నతాధికారులు తొలుత సస్పెండ్ చేసి ఆ తర్వాత ఉద్యోగం నుంచి తొలగించారు. అయితే ఇంటి ఫోన్ కాల్స్ మాట్లాడుతూ సస్పెండ్ అయిన చరిత్ర ఆయనకు ఉందని.. అందుకే తొలగించాల్సి వచ్చిందనేది అధికారుల మాట.ఒకేసారి నలుగురు ప్రయాణికులు ఎక్కారు. ఆ తొందరలో పొరపాటున పురుష ప్రయాణికుడికి కండక్టర్ జీరో టికెట్ (మహాలక్ష్మి పథకంలో మహిళలకు జారీ చేయాల్సిన టికెట్) జారీ చేశాడు. తదుపరి స్టాప్‌లో చెకింగ్ సిబ్బంది తనిఖీ చేసి కండక్టర్‌పై కేసు నమోదు చేశారు. దాని ఆధారంగా ఉద్యోగం నుంచి తొలగించారు. కావాలనే జీరో టికెట్ జారీ చేసి టికెట్ చార్జీ రుసుము తీసుకున్నాడన్నది తనిఖీ సిబ్బంది ఆరోపణ.సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఆర్టీసీ)లో ‘చిల్లర’కారణాలతో గత మూడేళ్లలో వందలాది మంది సిబ్బంది ఉద్యోగాలు కోల్పోయారు. విధుల్లోకి తిరిగి తీసుకోవాలని ఎన్నిసార్లు వేడుకున్నా (అప్పీళ్లు) కుదరదని సంస్థ తేలి్చచెప్పడంతో వారంతా తాజాగా మూకుమ్మడిగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి ఫిర్యాదు చేశారు. దీంతో ఈ పరిణామం ఆర్టీసీలో ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. తీవ్రంగా పరిగణిస్తూ..: ఆర్టీసీలో ‘చిల్లర’వివాదాలు కొత్తకాదు. టికెట్ల జారీలో జరిగే పొరపాట్లను సంస్థ తీవ్రంగా పరిగణిస్తోంది. రూ. 10 తేడా వచి్చనా విధుల నుంచి తప్పిస్తోంది. ఇక డ్రైవింగ్‌లో నిర్లక్ష్యంగా వ్యవహరించే వారిని సైతం తొలగిస్తోంది. మూడేళ్లుగా వివిధ కారణాలతో ఏకంగా 600 మందికి ఉద్వాసన పలికింది. అయితే వారంతా డిపో మేనేజర్ మొదలు ఎండీ వరకు అన్ని కార్యాలయాల చుట్టూ తిరుగుతుండటంతో గత నెలలో అప్పీళ్ల మేళా నిర్వహించింది. వివిధ కోణాల్లో వారి కేసులను సమీక్షించి 180 మందిని తిరిగి విధుల్లోకి తీసుకుంది. మిగతా 420 మందిని మాత్రం పక్కనపెట్టేసింది.దీంతో వారంతా సంస్థ తీరును నిరసిస్తూ రోడ్డెక్కారు. వేతన సవరణ, పాత బకాయిలు, ప్రభుత్వంలో ఆర్టీసీ ఉద్యోగుల విలీనం, సీసీఎస్, పీఎఫ్ బకాయిలు చెల్లింపు సహా వివిధ డిమాండ్లపై నిత్యం కారి్మకులు గొంతెత్తుతున్న వేళ 420 మంది రోడ్డెక్కడం ఆర్టీసీకి తలనొప్పిగా మారింది. ఉద్వాసనకు గురైన వారి వాదన ఓ రకంగా ఉంటే అధికారుల మాట మరోరకంగా ఉంటోంది. వారిలో ఎవరి వాదన సరైందో తేలాల్సి ఉంది.వెంటనే విధుల్లోకి తీసుకోవాలి ‘టిమ్’లో టికెట్ ప్రింట్ కాకపోవడం వల్ల పెన్నుతో టికెట్ నంబర్ రాసే క్రమంలో చేసిన పొరపాటుకు ఓ డ్రైవర్‌ను సస్పెండ్ చేశారు. టిమ్ యంత్రం వాడకంలో చిన్న పొరపాట్లు చేసిన మరికొందరిని తప్పించారు. చిన్నచిన్న సమస్యలు, చిల్లర విషయాలపై ఆర్టీసీ యాజమాన్యం ఏకంగా ఉద్యోగాలు తీసేస్తే ఎలా? ఆర్థిక ఇబ్బందుల దృష్ట్యా కొందరు కూలీలుగా మారుతున్నారు. అలా వారం క్రితం ఓ మాజీ కండక్టర్ గుండెపోటుతో చనిపోయాడు. వెంటనే మమ్మల్ని విధుల్లోకి తీసుకోవాలి. – ఉద్యోగాలు కోల్పోయిన ఆర్టీసీ సిబ్బంది బృందం ప్రతినిధి రాజేందర్ ఊరికే ఉద్యోగాలు తొలగించం.. ఆర్టీసీ కారి్మకులకు ఎంతో ప్రాధాన్యం ఉంటుంది. వారి సంక్షేమానికే ప్రయతి్నస్తాం తప్ప వారి ఉద్యోగాలు తొలగించాలని చూడం. ఓ తప్పు చేసినట్లు తేలితే వివిధ కోణాల్లో సమీక్షించడంతోపాటు ఆ ఉద్యోగి గత చరిత్రను పరిశీలించి తదనుగుణంగా చర్యలు తీసుకుంటాం. ఒకట్రెండు సార్లు తప్పు చేస్తే హెచ్చరించి వదిలేస్తాం. తప్పును పునరావృతం చేస్తే వేటు వేస్తాం. మద్యం సేవించి విధులకు వచ్చే డ్రైవర్ల విషయంలో మాత్రం కఠినంగా ఉంటాం. – ఓ ఆర్టీసీ అధికారి మాట -
ఆకతాయికి బుద్ధి చెప్పిన బస్సు డ్రైవర్
-
Video: బస్సు డ్రైవర్‌కు గుండెపోటు.. 50 మంది ప్రాణాలు కాపాడిన కండక్టర్
ఇటీవల గుండెపోటు మరణాలు గణనీయంగా పెరుగుతున్నాయి. చిన్న పిల్లల నుంచి యువకులు, మధ్య వయస్సు వారు ఇలా అందిరినీ ఆకస్మిక గుండెపోటు కలవరానికి గురిచేస్తోంది. తాజాగా బస్సు నడుపుతుండగా డ్రైవర్ ఉన్నట్టుండి గుండెపోటుకు గురయ్యాడు. అయితే గమనించిన కండక్టర్ అప్రమత్తతో వెంటనే బస్సును రోడ్డు పక్కన సురక్షితంగా నిలిపడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటన కర్ణాటకలో వెలుగుచూసింది.బెంగళూరు మెట్రోపాలిటన్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ పరిధిలోని దాసనపుర బస్ డిపోలో కిరణ్(39) డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. . నెలమంగళ నుంచి యశ్వంత్‌పూర్‌కు బస్సు నడుపుతుండగా అకస్మాత్తుగా తీవ్రమైన ఛాతీ నొప్పి వచ్చి స్పృహ కోల్పోయాడు. బస్సులోని సీసీటీవీ కెమెరాలో ఈ దృశ్యాలు రికార్డయ్యాయి.డ్రైవర్ కుప్పకూలడంతో బస్సు అదుపు తప్పి ముందు వెళ్తున్న బస్సును రాసుకుంటూ వెళ్లింది. వెంటనే అప్రమత్తమైన బస్సులోని కండక్టర్ డ్రైవర్‌ను లేపే ప్రయత్నం చేస్తూనే డ్రైవింగ్ సీట్లోకి వెళ్లి బస్సును సురక్షితంగా నిలిపివేశాడు. దీంతో బస్సులోని 50 మంది ప్రాణాలు నిలిచాయి. ఆ తర్వాత డ్రైవర్ కిరణ్‌ను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అయితే, అతడు అప్పటికే మరణించినట్టు వైద్యులు నిర్ధారించారు. బస్సును నిలిపివేసి ప్రయాణికుల ప్రాణాలు కాపాడిన కండక్టర్‌ను ఆర్టీసీ అధికారులు ప్రశంసించారు.In Bengaluru: When the bus driver suffered a heart attack, BMTC bus conductor Obalesh jumped on the driver’s seat and took control of the steering🫡 (Sadly Bus Driver Passed away due to Cardiac arrest) https://t.co/PgpTz6ENxt— Ghar Ke Kalesh (@gharkekalesh) November 6, 2024 -
స్టీరింగ్ మీదే సిటీ బస్ డ్రైవర్ మృతి
దొడ్డబళ్లాపురం: సిటీ బస్సు నడుపుతుండగా డ్రైవర్‌కు గుండెపోటు వచ్చి స్టీరింగ్ మీదే తుది శ్వాస విడిచిన సంఘటన బెంగళూరు పరిధిలోని నెలమంగల తాలూకా బిన్నిమంగల బస్టాండు వద్ద చోటుచేసుకుంది. కిరణ్‌కుమార్ (40).. దాసనపుర బస్ డిపో బీఎంటీసీ బస్సు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఆరేళ్లుగా ఆయన ఉద్యోగంలో ఉన్నారు. బుధవారం ఉదయం బస్సు నడుపుతుండగా కిరణ్‌కు గుండెపోటు వచ్చింది. వెంటనే బస్సును రోడ్డు పక్కన సురక్షితంగా నిలిపి అలాగే ప్రాణాలు వదిలాడు. కండక్టర్, ఇతర ప్రయాణికులను ఆయనను ఆస్పత్రికి తరలించగా, అప్పటికే చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. అస్వస్థతకు గురికాగానే శరీరం సహకరించకున్నా బస్సును నేర్పుగా రోడ్డు పక్కకు నిలిపిన దృశ్యాలు, స్టీరింగ్ మీదకు పడిపోయిన దృశ్యం బస్సులోని సీసీ కెమెరాలో రికార్డయింది. ఆ దృశ్యాలు వైరల్ అయ్యాయి. నెలమంగల పట్టణ పోలీసులు కేసు నమోదు చేశారు. -
డ్రైవర్ అన్న డాన్స్ అదుర్స్
-
ఈ డ్రైవర్ ను మహిళ ఏం చేసిందో చూడండి
-
గుద్దుకుంటూ పోయిన బస్సు..
-
విషాదం: బస్సు డ్రైవర్‌కు గుండె పోటు.. 20 మంది పిల్లల్ని కాపాడి
తమిళనాడు పెను ప్రమాదం తప్పింది. ఓ వ్యాన్ డ్రైవర్ తను మరణిస్తూ.. 20 మంది పిల్లల ప్రాణాలను కాపాడాడు. డ్రైవర్ సాహాసాలను మెచ్చిన సీఎం స్టాలిన్ అతడి కుటుంబానికి రూ. 5 లక్షల పరిహారం అందజేస్తామని హామీ ఇచ్చారు. తిరూప్పూర్ జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది..వివరాలు.. వెల్లకోయిల్లో బుధవారం సెమలయ్యప్పన్ అనే 49 ఏళ్ల బస్సు డ్రైవర్ ఓ ప్రైవేటు పాఠశాలకు నుంచి విద్యార్ధులను వాళ్ల ఇంటి వద్ద దింపడానికి బయల్దేరాడు. దారి మధ్యలో ఉన్నట్టుండి ఛాతిలో నొప్పి రాడంతో బస్సు డ్రైవర్ అతి కష్టం మీద వాహనాన్ని రోడ్డు పక్కన ఆపాడు. అతని భార్య కూడా అదే స్కూల్లో హెల్పర్‌గా పనిచేస్తుంది. ఈ ఘటన జరిగినప్పుడు ఆమె కూడా అందులోనే ఉంది.బస్సు రోడ్డు పక్కన ఆగిన కాసేపటికే అతడు గుండెపోటుతో కుప్పకూలిపోయాడు. వెంటనే గమనించిన స్థానికులు అతడిని ఆస్పత్రికి తరలించగా అప్పటికే డ్రైవర్ చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు. అయితే అతడు మరణించే ముందు సుమారు 20 మంది విద్యార్థుల ప్రాణాలను కాపాడిన డ్రైవర్ వీరోచిత చర్యపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.మృత్యువు అంచున ఉన్న చిన్నారుల ప్రాణాలను కాపాడిన డ్రైవర్‌ను తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ‘తన ప్రాణం ప్రమాదంలో ఉన్నప్పటికీ, అతను పాఠశాల విద్యార్థుల విలువైన ప్రాణాలను కాపాడాడు. అతని కర్తవ్య భావం, ఆత్మబలిదానాలకు మేము ఆయనకు నమస్కరిస్తున్నాము’. అని స్టాలిన్ ఒక ప్రకటనలో తెలిపారు. కాగా.. మృతుడు సెమలయ్యప్పన్ కుటుంబానికి రూ.5 లక్షల చొప్పున పరిహారం అందజేస్తామని సీఎం స్టాలిన్ ప్రకటించారు. డీఎంకే మంత్రి ఎంపీ సామినాథన్ మృతుల కుటుంబాలకు చెక్కును అందజేశారు. -
Viral Video: ఆర్టీసీ బస్సులో చెలరేగిన మంటలు.. డ్రైవర్ అలెర్ట్ అవ్వడంతో
బెంగళూరు: కర్ణాటక రాజధాని బెంగళూరులో పెను ప్రమాదం తప్పింది. రహదారిపై వెళ్తున్న బస్సులో హఠాత్తుగా మంటలు చెలరేగాయి. వెంటనే అప్రమత్తమైన డ్రైవర్ వెంటనే బస్సు దిగి ప్రయాణికులను ఖాళీ చేయడంతో ప్రమాదం తప్పింది. ఎంజీ రోడ్డులో కోరమంగళ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సులో ఈ ఈ ఘటన వెలుగు చూసింది. నగరం నడిబొడ్డున ఎంజీ రోడ్డులోడ్రైవర్ ఇంజన్ స్టార్ట్ చేయడంతో బస్సులో మంటలు చెలరేగాయి. వెంటనే డ్రైవర్లో బస్సులోని వారందరినీ కిందకు దింపాడు. అయితే బస్సు మాత్రం పూర్తిగా మంటల్లో కాలిపోయింది. బస్సు నుంచి మంటలు, పొగలు రావడంతో చుట్టు పక్కల జనాలు భయబ్రాంతులకు గురయ్యారు.ఈ ప్రమాదంలో ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగి మంటలను అదుపులోకి తీసుకొచ్చాయి. అక్కడే ఉన్న వారు బస్సు కాలిపోవడాన్ని వీడియో తీశారు. ఇందులో అగ్నిమాపక సిబ్బంది దానిని ఆర్పడానికి ప్రయత్నించినప్పుడు బస్సులో మంటలు, పొగలు పైకి లేవడం కనిపిస్తోంది. అయితే ఇంజిన్ బాగా వేడెక్కడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు బీఎంటీసీ వర్గాలు తెలిపాయి.🚨 A BMTC bus caught fire 🔥 at MG Road. No casualties reported. 🚒Source: @bangalore360_#Bengaluru #BMTC pic.twitter.com/SlZuGQz2Om— North BangalorePost (@nBangalorepost) July 9, 2024 -
పొలాల్లోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు.. ఒక్కసారిగా..
కరీంనగర్: దుబ్బపల్లి గ్రామశివారులో ఆర్టీసీ బస్సు శుక్రవారం అదుపుతప్పి పొలాల్లోకి దూసుకెళ్లింది. కరీంనగర్ నుంచి మంథని వైపుకు వెళ్తున్న ఆర్టీసీ బస్సు.. దుబ్బపల్లి శివారులోకి చేరుకుంది. ఇదే సమయంలో డ్రైవర్ రతన్ గుట్కా వేసుకుంటున్నాడు. పక్కనుంచి లారీ వెళ్తుంగా ఆర్టీసీ డ్రైవర్ స్టీరింగ్ రోడ్డువైపు తిప్పాడు. దీంతో బస్సు అదుపుతప్పి రాజీవ్ రహదారి పక్కన చెట్లపొదల్లోకి దూసుకెళ్లి ఆగిపోయింది. ఆ సమయంలో బస్సులు దాదాపు 40మందికి పైగా ప్రయాణుకులు ఉన్నారు. ఇందులో దేవిక(సెంటినరీకాలనీ), మల్లయ్య(మంథని), శ్రీరాముల స్వామి(కరీంనగర్) తలకు గాయాలు తీవ్రగాయాలు కాగా, మితాగా వారికి స్వల్ప గాయాలయ్యాయి. ప్రయాణికుడు శ్రీరాముల స్వామి ఫిర్యాదు మేరకు డ్రైవర్‌పై కేసు నమోదు చేసినట్లు ఎస్సై శ్రావణ్‌కుమార్ వివరించారు. -
బస్సు డ్రైవర్‌కు గుండెపోటు.. 60 మందిని కాపాడి, చివరికి..
భువనేశ్వర్: బిహార్‌లో విషాదం చోటుచేసుకుంది. బస్సు నడుపుతుండగా గుండెపోటుకు గురైన డ్రైవర్.. అప్రమత్తతో వ్యవహరించడంతో 60 ప్రయాణికుల ప్రాణాలు నిలిచాయి. కానీ దురదృష్టవశాత్తూ అతడు ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన బాలాసోర్ జిల్లాలోని పటాపూర్ చక్‌లో మంగళవారం ఉదయం జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం.. పశ్చిమబెంగాల్‌కు చెందిన పర్యాటకులతో ఓ బస్సు బాలాసోర్‌లోని పంచలింగేశ్వరాలయం వైపు వెళ్తుంది. మార్గ మధ్యంలో బస్సు డ్రైవర్ గుండెపోటుకు గురయ్యాడు. ఛాతీతో ఉన్నట్టుండి నొప్పి రావడంతో వెంటనే బస్సును పక్కను నిలిపివేశాడు. అనంతరం అతడు స్పృహ కోల్పోయాడు. దీంతో తీవ్ర భయందోళనకు గురైనన ప్రయాణికులు వెంటనే స్థానికుల సాయంతో దగ్గర్లోని ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే అప్పటికే అతను ప్రాణాలు విడిచినట్లు వైద్యులు ప్రకటించారు. మృతిచెందిన డ్రైవర్‌ను షేక్ అక్తర్‌గా గుర్తించారు. అతడి అప్రమత్తతో ప్రయాణికులకు ప్రాణాపాయం తప్పింది. ప్రమాద సమయంలో బస్సులో 60 మంది ప్రయాణికులు ఉన్నారు. చదవండి: మాకు నితీష్ అవసరం లేదు: రాహుల్ -
హెల్మెట్ ధరించి గమ్యస్థానానికి..
దామరగిద్ద: బస్సు డ్రైవర్ హెల్మెట్ ధరించడం ఏంటని అనుకుంటున్నారా? అవును మీరు చూస్తున్నది నిజమే.. హైదరాబాద్ నుంచి నారాయణపేటకు ఆర్టీసీ బస్సు బయల్దేరగా.. కొడంగల్ సమీపంలో డ్రైవర్ ముందున్న అద్దం ఒక్కసారిగా పగిలిపోయింది. డ్రైవర్ తిరుపతయ్యతో పాటు కండెక్టర్ రఘువీర్‌కు గాజుముక్కలు తగిలి చేతివేళ్లకు గాయాలయ్యాయి. మరోవైపు ముసురు.. చల్లని గాలితో బస్సును నడపడం డ్రైవర్‌కు కష్టసాధ్యంగా మారింది. ఈ క్రమంలో కొడంగల్ నుంచి బస్సు డ్రైవర్ హెల్మెట్ సహాయంతో బస్సు నడిపి ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానానికి చేర్చారు. -
సడన్ బ్రేక్ వేసిన డ్రైవర్.. బలైన కండక్టర్
భూదాన్‌పోచంపల్లి : ఆర్టీసీ బస్సు డ్రైవర్ సడన్‌బ్రేక్ వేయడంతో ఫుట్‌బోర్డు నుంచి జారి కిందపడి కండక్టర్ మృతిచెందాడు. భూదాన్‌పోచంపల్లి జలాల్పురం గ్రామశివారులో ఆదివారం సాయంత్రం జరిగిన ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. దిల్సుఖ్నగర్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు 50 మందికి పైగా ప్రయాణికులతో ఆదివారం సాయంత్రం 6.20గంటలకు పోచంపల్లి నుంచి సొంత డిపోకు బయలుదేరింది. బస్సులో బిహార్ రాష్ట్రానికి చెందిన కోళ్ల ఫారాల్లో పనిచేసే దాంజిరామ్ కూడా జలాల్పురం వరకు టికెట్ తీసుకున్నాడు.బస్సు జలాల్పురం దాటగానే కండక్టర్ దేవినేని సత్తిరెడ్డి(59) ప్రయాణికులకు టికెట్లు ఇస్తూ ముందు ఫుట్‌బోర్డు వైపు వచ్చాడు. ఇదే క్రమంలో దాంజిరామ్ తాను దిగాల్సిన స్టేజీ దాటిపోతుందని భావించి వేగంగా కదులుతున్న బస్సులోంచి ఒక్కసారిగా కిందికి దూకాడు. గమనించిన బస్సుడ్రైవర్ పోచంపల్లికి చెందిన మక్తాల సాయి సడెన్ బ్రేక్ వేయడంతో ముందు ఫుట్‌బోర్డు సమీపంలో ఉన్న కండక్టర్ బస్సులోంచి జారి కిందరోడ్డుపై పడటంతో తలకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుడిని అంబులెన్స్‌లో హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందాడు. బస్సులోంచి దూకిన దాంజిరామ్ తలకు తీవ్రగాయాలు కాగా అతడిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. మృతిచెందిన కండక్టర్ సత్తిరెడ్డి హైదరాబాద్‌లోని మన్సురాబాద్‌లో స్థిరనివాసం ఉంటున్నాడు. ఇతనికి భార్య, కుమారుడు ఉన్నారు. బస్సు డ్రైవర్ మక్తాల సాయి ఏడాది క్రితం భూదాన్‌పోచంపల్లి మండల శివారులో బైక్‌ను ఢీకొట్టి వాహనదారుడి మృతికి కారణమయ్యాడు. దాంతో అప్పుడు ఇతనిపై కేసు నమోదయ్యింది. ఈ మేరకు బస్సు డ్రైవర్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ విక్రమ్‌రెడ్డి తెలిపారు. -
అక్కకు బై చెప్పేందుకు వెళ్లి.. ఒక్కసారిగా..
సాక్షి, హైదరాబాద్: స్కూల్ బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం ఓ పసివాడి ప్రాణాన్ని బలితీసుకుంది. అక్కను బస్సు ఎక్కించేందుకు బస్సు దగ్గరికి వెళ్లిన బాలుడు బస్సు ముందు టైరు కింద పడి మృతి చెందిన సంఘటన గురువారం హయత్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. నల్లగొండ జిల్లా, చిట్యాల మండలం, జనంపల్లికి చెందిన తన్నీరు శ్రీకాంత్ పోస్ట్‌మెన్‌గా పనిచేస్తూ పెద్దఅంబర్‌పేట్ మున్సిపాలిటీలోని కుంట్లూరు గణేష్‌నగర్ కాలనీలో నివాసం ఉంటున్నాడు. అతనికి కుమార్తె నిషిక, కుమారుడు పవన్ హర్షకుమార్(3) సంతానం. గురువారం ఉదయం పెద్దఅంబర్‌పేట్‌లోని కాండర్‌షైన్ పాఠశాలలో చదువుతున్న తన కుమార్తెను స్కూల్ బస్సు ఎక్కిస్తుండగా అతడి కుమారుడు హర్ష కూడా బస్సు వద్దకు వచ్చాడు. అక్కడే ఉన్న బస్సు అటెండర్ మల్లారెడ్డి బాలుడిని గమనించకపోవడంతో బస్సు డ్రైవర్ ఈశ్వర్ సెల్‌ఫోన్ మాట్లాడుతూ బస్సును ముందుకు తీశాడు. దీంతో బస్సు ముందు చక్రాలు చిన్నారి తలపై వెళ్లడంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. కళ్ల ముందే కొడుకు ప్రాణాలు పోవడంతో ఆ తల్లిదండ్రులు గుండెలు అవిసేలా విలపించారు. దీనిని గుర్తించిన కాలనీ వాసులు ప్రమాదానికి కారణమైన బస్సు డ్రైవర్‌ను పట్టుకుని పోలీసులకు అప్పగించారు. బాలుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
ప్రాణం పోయేలా ఉందన్నా.. పడేసి పోయారు!
కళ్లెదుటే మనిషి ప్రాణం పోతున్నా.. పట్టించుకోని రోజులివి. అలాంటి హేయనీయమైన ఘటనే తమిళనాడులో చోటు చేసుకుంది. బస్సు ప్రయాణంలో ఓ వ్యక్తికి గుండెపోటు రాగా.. డ్రైవర్, కండక్టర్ ఏమాత్రం దయ లేకుండా వ్యవహరించారు. నడిరోడ్డుపై వదిలేసి వెళ్లిపోవడంతో అతని ప్రాణం పోయింది! విరుదునగర్ జిల్లా శ్రీవిల్లిపుత్తూర్‌కి చెందిన జ్యోతిభాస్కర్ (50).. శంకరన్‌కోవిల్‌లోని ఓ హోటల్లో పనిచేస్తున్నాడు. హోటల్‌కు వెళ్లేందుకు సోమవారం ఉదయం ఓ ప్రైవేటు బస్సు ఎక్కాడు. రాజపాళెయం వద్ద జ్యోతిభాస్కర్‌కు గుండెనొప్పి రావడంతో తోటి ప్రయాణికులు కండక్టర్, డ్రైవర్‌కు చెప్పారు. అయితే వాళ్లు ఆయన్ని ఆస్పత్రికి తీసుకెళ్లలేదు. శంకరన్‌కోవిల్ రోడ్డు మీదకు దించి మానవత్వం లేకుండా వెళ్లిపోయారు. ఉదయాన్నే అక్కడే ఉన్న టీ దుకాణం తెరవడానికి వచ్చిన వ్యక్తి పడిపోయి ఉన్న జ్యోతిభాస్కర్‌ను చూసి పైకి లేపడానికి యత్నించాడు. చలనం లేకపోవడంతో అంబులెన్స్ ద్వారా రాజపాళెయం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతిచెందినట్లు నిర్ధారించారు. -
బస్సు నడిపిన పువ్వాడ..
ఇల్లెందు: రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ కాసేపు ఆర్టీసీ బస్సు డ్రైవర్‌గా మారారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందులో సోమవారం సాయంత్రం ఆర్టీసీ బస్ డిపోను మంత్రి ప్రారంభించారు. అనంతరం డ్రైవర్ సీట్లో కూర్చుని బస్సును కాసేపు నడిపారు. అంతకుముందు జరిగిన సభలో మంత్రి మాట్లాడుతూ.. కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆదివారం ఖమ్మం సభలో రైతుల గురించి మాట్లాడారని, ఆయనకు ఆ అర్హత లేదన్నారు. ధాన్యం కొనుగోలు చేయాలంటూ పంజాబ్, ఢిల్లీ రాష్ట్రాల రైతులు దేశ రాజధానిలో ఎన్నో రోజులు ఆందోళన చేసినా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోలేదని, అలాంటి వారు రైతుల గురించి మాట్లాడడమా? అని ప్రశ్నించారు. ఆ ఆందోళనలో ప్రాణాలు కోల్పోయిన రైతుల కుటుంబాలకు అమిత్ షా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. -
బస్సు డ్రైవర్ కూతురుకి లండన్‌లో ఉద్యోగం!
ఆమె నక్సల్స్‌తో హడలెత్తిపోయే ఊరు నుంచి మొదలైంది ఆమె బాల్యం. ఆమె చదువు కటిక దారిద్యం, నక్సల్స్ బెడద మధ్య భయం భయంగా సాగింది. అయినా వెరవక ఉన్నత చదువులు చదవడమే గాక ఏకంగా లండన్‌లో ఉద్యోగం కొట్టి.. ఔరా! అనిపించుకుంది ఓ బస్సు డ్రైవర్ కూతురు. అందరికీ ఆదర్శంగా నిలిచింది. ఆమె స్ఫూర్తివంతమైన విజయగాథ ఎలా సాగిందంటే.. చత్తీస్‌గఢ్ జిల్లాలోని సుక్మా జిల్లాలో నక్సల్స్ బాధిత దోర్నపాల్‌కి చెందిన బస్సు డ్రైవర్ కూతురు రియా ఫిలిప్. ఆ ప్రాంతం అంతా తీవ్రవాదుల భయం ఎక్కువ. ఎప్పుడూ పోలీసుల కర్ఫ్యూల, తుపాకీ మోతలు, ఆర్తనాదాలతో అట్టుడుకిపోతుండేది. అలాంటి నేపథ్యం నుంచి వచ్చించి రియా. అయినప్పటికీ బతుకు ప్రయాణం సాఫీగా సాగాలంటే ఒక్కటే ఆయుధం చదువు అని స్ట్రాంగ్ డిసైడ్ అయ్యింది. ఎన్ని భయాలు ముందున్నా వెరవక చదువుపై దృష్టి పెట్టింది. ఆమె తల్లి షోలీ ఫిలిప్ ప్రైవేటు స్కూల్ టీచర్ కాగా, తండ్రి రితేష్ ఫిలిప్ అదే స్కూల్లో బస్సు డ్రైవర్. మధ్య తరగతి కుటంబం అయినా తమ పిల్లలకు మంచి చదువు అందించాలనే కృత నిశ్చయంతో ఉన్నారు. పిల్లల చదువు కోసం ఎంత ఖర్చు పెట్టేందుకైనా ఆ జంట వెనుకాడలేదు. అలాగే పిల్లలు కూడా తల్లిదండ్రుల నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా ఉన్నత చదువులు చదివారు. అయితే ఆ కుటుంబ నక్సల్స్ భయంతో దుబ్బతోట గ్రామం నుంచి దోర్నపాల్‌కి తరలి వెళ్లిపోవడంతో తీవ్రమైన కష్టాల్లోకి కూరుకుపోయారు. అయినా పిల్లల చదువులకు మాత్రం ఎలాంటి ఆటంకం రానివ్వలేదు. అలాగే రియా కూడా వారి ఆశను ఒమ్ము కానియ్యకుండా బాగా చదవడమే గాక ముంబైలోని కోకిలాబెన్ ఆస్పత్రిలో నర్సుగా ఉద్యోగం సంపాదించింది. అక్కడ రెండేళ్ల పాటు సేవలందించింది. అలా సాగిన ఆమె ప్రయాణం యూకేలో ఉద్యోగం సంపాదించే స్థాయికి చేరుకుంది. చివరికి రియాకు లండన్‌లో మంచి ఉద్యోగం ఆఫర్ వచ్చింది. ఐతే ఆమె లండన్ వెళ్లేందుకు తల్లిదండ్రులు ఇంటిని తాకట్టుపెట్టి మరీ రూ 3 లక్షలు సమకూర్చారు. ఏమైతేనేం ఎన్నో కష్టాలను ఈదుకుంటూ..ఆమె లండన్‌లో ఏకంగా 21 లక్షల వార్షిక ప్యాకేజితో మంచి ఉద్యోగాన్ని సంపాదించింది. పైగా ఆమె తల్లిదండ్రులు కూతురు నెలవారి జీతం రూ లక్ష ఎనభై వేలని గర్వంగా చెప్పుకునేలా చేసింది. రియా విజయగాధని చూసి ఆమె బంధువులు కుటుంబ సభ్యులకి గర్వాన్ని కలిగించడమే గాక ఆమె జిల్లాలోని విద్యా వ్యవస్థ మెరుగపడేందుకు ప్రేరణ ఇవ్వడం విశేషం. ఇక కుటుంబం మద్దుతు ఉంటే ఏదైనా సాధించవచ్చని అంటోంది రియా. అదే సమయంలో విజయం అందుకోవాలంటే మన వద్ద సహనం, పట్టుదల తోపాటు అంకితభావం ఉండటం అత్యంత ముఖ్యం అని రియా పేర్కొంది. (చదవండి: మళ్లీ మహమ్మారి కొత్త వేరియంట్ కలకలం..భయం గుప్పెట్లో దేశాలు!) -
రద్దీ రోడ్డు.. ట్రాఫిక్ జామ్ కాకూడదని.. బస్ డ్రైవర్‌గా మారిన బెంగళూరు ఏసీపీ!
బెంగళూరు: బెంగళూరులో బస్సు డ్రైవర్ తీవ్ర అస్వస్థతకు గురికావడంతో.. ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ రామచంద్ర స్వయంగా బస్సు నడిపారు. అసలు ఏం జరిగిందంటే.. బెంగళూరులో విపక్ష పార్టీల సమావేశం జరిగింది. దీనికి వివిధ రాష్ట్రాల నుంచి విపక్ష పార్టీల నేతలు హాజరయ్యారు. వీవీఐపీల (ప్రతిపక్ష నేతల సమావేశం) షెడ్యూల్ కారణంగా ఓల్డ్ ఎయిర్పోర్ట్ రోడ్డులో ట్రాఫిక్ నిర్వహణ బాధ్యతను ఏసీపీ రామచంద్ర చూసుకుంటున్నారు. అకస్మాత్తుగా రూట్ 330 డ్రైవర్ అస్వస్థతకు గురికావడంతో ఆ బస్సును రోడ్డుపైనే ప్రయాణికులతో సహా నిలిపివేశారు. తక్షణమే ఘటన స్థలానికి చేరుకున్న ఏసీపీ రామచంద్ర.. అనారోగ్యంతో ఉన్న ఆ డ్రైవర్‌ను బోవరింగ్ ఆసుపత్రికి తరలించి, వైద్య సహాయం అందించేలా అంబులెన్స్‌ను ఏర్పాటు చేశారు. బస్సు రోడ్డుపై నిలిచిపోయిన కారణంగా ట్రాఫిక్ రద్దీకి కారణమయ్యే అవకాశం ఉందని గ్రహించి.. ఏసీపీ ఆ సమస్యను పరిష్కరించే బాధ్యతను స్వయంగా తానే తీసుకున్నారు. డ్రైవర్ సీటులో కూర్చుని బస్సును ఒక కిలోమీటరుకు పైగా నడుపుతూ కార్పొరేషన్ పార్కింగ్ ప్రదేశంలో బస్సును పార్క్ చేశారు. ఇదంతా బస్సులో ఉన్న ప్రయాణికులు వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయగా అది కాస్త వైరల్‌గా మారింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఏసీపీ స్పందించిన తీరుపై అభినందిస్తూ కామెంట్లు పెడుతున్నారు. Thank you for the care and compassion # LifeSaverCop @DgpKarnataka @CPBlr @alokkumar6994 @masaleemips @BlrCityPolice @blrcitytraffic @mybmtc@BMTC_BENGALURU #BMTC Small act of kindness, duty, compassion & respect for life is thy name of #NammaBengaluruPolice 👏 Contd 01 pic.twitter.com/LI0isc1NoX — Shubha Lakshmi (@Shubha_Lakshmi_) July 17, 2023 చదవండి ఆస్ట్రేలియా బీచ్‌లో చంద్రయాన్-3 రాకెట్ శకలం.. ఇస్రో చీఫ్ క్లారిటీ -
భారీ వర్షాలు.. బస్ డ్రైవర్లు, కండక్టర్లకు టీఎస్ఆర్టీసీ సూచనలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో అతి భారీ వర్షాలు కురుస్తున్న సందర్భంగా టీఎస్ఆర్టీసీ డ్రైవర్లందరూ ప్రమాదాలను నివారించాలని సంస్థ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి తెలిపారు. వర్షాల నేపథ్యంలో విధి నిర్వహణలో ఏమాత్రం అలసత్వం వహించవద్దని సూచించారు. రాష్ట్రంలో వారం రోజులపాటు అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిన సందర్భంగా డ్రైవర్లందరూ భద్రత సూచనలు పాటించాలని కోరారు. ఆయన మాట్లాడుతూ.. ఆర్టీసీ సంస్థ ఎంతో కాలంగా ప్రయాణికుల భద్రతకు మారుపేరుగా నిలించిందన్నారు. జాతీయ స్థాయిలో అతి తక్కువ ప్రమాద రేటులో అనేక అవార్డులు అందుకుందని గుర్తుచేశారు. ఆర్టీసీ సంస్థలో సుశిక్షుతులైన డ్రైవర్లు ఉన్నారని, అయినా వర్షాకాలంలో మరోసారి భద్రతా నియమాలను మననం చేసుకుని తూ.చ పాటిస్తూ సురక్షిత డ్రైవింగ్ చేయడం ఎంతైనా అవసరం ఉందన్నారు. జాగ్రత్త సూచనలు 1. వర్షం కురుస్తున్నప్పుడు వేగ నియంత్రణ పాటించాలి 2. మలుపుల వద్ద ఇండికేటర్‌ను ఉపయోగించాలి. 3. ముందు వెళ్ళే వాహనాలతో సురక్షిత దూరాన్ని పాటించాలి. దట్టమైన వర్షం ఉన్నచోట హారన్ ఉపయోగించాలి. 4. వర్షం కురుస్తున్నప్పుడు డ్రైవింగ్ చేయనపుడు వైపర్ వాడాలి. హెడ్‌లైన్‌ను lowbeamలోఫాగ్ lights తప్పనిసరిగా వాడాలి. వైపర్లను కండిషన్లో ఉంచుకోగలరు. బస్సు వేగాన్ని తగ్గించి నిదానంగా వెళ్లాలి. 5. చెరువులు కుంటలు నిండిన చోట నీటి ప్రవాహాన్ని పరిశీలించి జాగ్రత్తగా వాహనాన్ని నడపాలి. నదులు కల్వర్టులు ఎక్కువ నీటి ప్రవాహం ఉంటే ఎట్టి పరిస్థితుల్లో దాటే ప్రయత్నం చేయవద్దు. 6. Windscreen గ్లాసులను వైపర్‌తో బయట వైపు శుభ్రపరచవలెను. లోపల వైపు ఏదైనా క్లాత్‌తో శుభ్రపరచాలి. 7. డ్యూటికి బయలుదేరుటకు ముందే వైపర్, హెడ్ లైట్స్ పనితీరును పరిశీలించుకొనవలెను. తెల్లవారుజామున 3-5 గంటల సమయములో సమీప బస్ స్టేషన్ నందు ఆపుకొని నీళ్ళతో ముఖంకాళ్ళు చేతులు శుభ్రపరుచుకోవాలి. 8. రోడ్డు మరమ్మత్తులో ఉన్నపుడు బస్సును నిదానంగా నడిపించాలి. డ్యూటికి వచ్చే ముందు తగిన విశ్రాంతి తీసుకోవాలి. 9. దట్టమైన వర్షం ఉన్న సమయంలో ఇతర వాహనాలను ఓవర్ టేక్ చేయరాదు. 10. అకస్మాత్తుగా సడన్ బ్రేక్ వేయకూడదు. వర్షం పడుతున్నప్పుడు తప్పకుండా లైట్లు వేసి వాహనాన్ని నియంత్రణలో నడపాలి. 11. వర్షం కురుస్తున్న సమయంలో డ్రైవింగ్ చేయునపుడు ఎదురుగా వచ్చే వాహనదారులతో ప్రమాదం జరిగే అవకాశం ఉన్నది కనుక ఎట్టి పరిస్థితులో Wrong Route లో వెళ్లరాదు. 12. సెంట్రల్ లైన్ క్రాస్ చేయరాదు. 13. అకస్మాత్తుగా బస్సు యొక్క దిశను మార్చకూడదు. 14. అతివేగంగా బస్సును నడపరాదు. 15. అకస్మాత్తుగా ఇండికేటర్ వేయడం వలన వెనుక వచ్చే వాహనాలతో ప్రమాదం జరిగే అవకాశం ఉన్నది కనుక సడన్ గా ఇండికేటర్ వేయకూడదు. 16. రోడ్డు మరమ్మత్తులో ఉన్నపుడు అతి వేగం తో డ్రైవింగ్ చేయరాదు. 17. బ్రేక్ సిస్టమ్ నుంచి ఎలాంటి ఏయిర్ లీకేజీలు ఉన్నాయో గమనించాలి. 18. ఘాట్ రోడ్డు ప్రయాణంలో ఎట్టి పరిస్థితిలోనూ బస్సును న్యూట్రల్ చేసి నడవకూడదు. 19. హైదరాబాద్ నగర శివారులో ప్రయాణికులకు అసౌకర్యం కలగకుండా సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చాలి. నగరంలో మ్యాన్ హోల్స్ మరియు రద్దీ ప్రదేశాలలో కండక్టర్ సహాయంతో వాహనాన్ని నడపగలరు. 20. బస్సులో ఫుట్ బోర్డు ప్రయాణాన్ని నివారించాలి, ఫుట్ బోర్డు లో ఉన్న ప్రయాణికులను బస్సు లోపలికి చేర్చుకోవాలి. 21. నగరంలో అనేక మంది ప్రయాణికులు నడిచే బస్సు ఎక్కడం జరుగుతుంది. దీని ద్వారా ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. వారి గమ్య స్థానం లోనే కండక్టర్, డ్రైవర్ గారు ఆపగలరు, బస్సులోకి చేర్చుకోగలరు. 22. ఫోన్ మాట్లాడుతూ, ఒంటిచేత్తో డ్రైవింగ్ చేయవద్దు. 23. అతి భారీ వర్షాలు కురుస్తున్న సందర్భంగా తడిసిన కరెంటు స్తంభాలను ముట్టుకోరాదు. 24. తడి చేతులతో విద్యుత్ ప్రవాహం ఉన్న స్విచ్ బోర్డులను తాకరాదు. ఎంతో పేరున్న ఆర్టీసీ సంస్థ.. ప్రయాణికులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా డ్రైవర్లు, కండక్టర్లు సురక్షితంగా బస్సులు నడిపి ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకొని సంస్థకు సహకరించాలని సంస్థ చైర్మన్, నిజామాబాద్ గ్రామీణ నియోజకవర్గ శాసనసభ్యులు బాజిరెడ్డి గోవర్ధన్ సూచనలు జారీ చేశారు.. -
మహిళా డ్రైవర్‌కు కారును గిఫ్ట్‌గా ఇచ్చిన కమల్ హాసన్
ప్రముఖ నటుడు, మక్కల్ నీధి మయ్యమ్ (ఎంఎన్ఎం) పార్టీ అధినేత కమల్ హాసన్ గొప్ప మనసు చాటుకున్నారు. వివాదంలో చిక్కుకొని ఉద్యోగం కోల్పోయిన మహిళా బస్డ్రై వర్కు మహిళకు కారును గిఫ్ట్‌గా ఇచ్చి ఆశ్యర్యపరిచారు. కొయంబత్తూర్‌కు చెందిన మహిళా డ్రైవర్ షర్మిలను కమల హాసన్ తన కార్యాలయానికి పిలిపించుకొని ‘కమల్ కల్చరల్ సెంటర్’ ద్వారా కారును బహుమతికి అందించారు. ఇప్పటివరకు ఉద్యోగిగా ఉన్న ఆమె.. ఇకపై ఎంతో మందికి ఉపాధి కల్పించే విధంగా ఎదగాలని ఆకాంక్షించారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. ‘కొయంబత్తూర్ మహిళా బస్ డ్రైవర్ షర్మిల చుట్టూ ఇటీవల జరిగిన చర్చతో కలత చెందాను. తన వయసులోని ఎంతో మంది యువతకు ఆమె ఆదర్శం. షర్మిల కేవలం డ్రైవర్‌గా మాత్రమే ఉండిపోకూడదు. తనలాంటి అనేకమంది షర్మిలలను తీర్చిదిద్దాలని నేను ఆశిస్తున్నా. కమల్ కల్చరల్ సెంటర్ తరఫున ఆమెకు కారును అందిస్తున్నాం. దానిని ఆమెకు అద్దె సర్వీసుల కోసం వినియోగించుకోవచ్చు. అలాగే గొప్ప పారిశ్రామికవేత్తగా ఎదిగి మరెందరికో ఉపాధి కల్పించాలని ఆశిస్తున్నా’ అని కమల్ పేర్కొన్నారు. (చదవండి: రెచ్చిపోయిన దొంగలు.. గన్‌తో బెదిరించి.. కారును అడ్డగించి.. వీడియో వైరల్..) కాగా, 24 ఏళ్ల షర్మిల కొయంబత్తూరులో తొలి మహిళా డ్రైవర్. గాంధీపురం నుంచి సోమనూర్ వరకు వ్రైవేటు సంస్థకు చెందిన బస్సును నడుపుతున్నారు. గతంలో బీజేపీ నేత వనతి శ్రీనివాసన్ ఈమె బస్సులో ప్రయాణించగా.. గత శుక్రవారం ఉదయం డీఎంకే ఎంపీ కనిమొళి.. షర్మిల నడిపిన ప్రైవేటు సంస్థకు చెందిన బస్సులో కోయంబత్తూరులోని గాంధీపురం నుంచి పీలమేడు వరకు ప్రయాణించారు. అయితే, షర్మిల పబ్లిసిటీ మోజులో పడిందని ఆ బస్సు యాజమాన్యం ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది. మరోవైపు బస్ కండక్టర్ మాటలు నమ్మి యాజమాన్యం తనను అవమానపర్చిందని, అందుకే కలల కొలువుకు దూరమైనట్టు షర్మిల మాట్లాడిన వీడియో వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే. (చదవండి: కనిమొళి అభినందన.. ఆమె ఉద్యోగం పోయిందా?.. అసలేం జరిగిందంటే..) Coimbatore's first woman bus driver #Sharmila who quit her job after a controversy erupted over issuing of bus ticket to DMK MP Kanimozhi, has now been presented a new car by MNM leader #KamalHaasan to continue her journey as an entrepreneur. @IndianExpress pic.twitter.com/SyMS059KvS — Janardhan Koushik (@koushiktweets) June 26, 2023 -
ధోని చెన్నై సూపర్ కింగ్స్ టీమ్ మేట్ పాపం ఇప్పుడు మాత్రం బస్ కండక్టర్
-
డ్రైవర్ దాష్టీకం.. బస్సు ఆపకుండా మహిళలపైకి దూసుకెళ్లి
తుమకూరు(బెంగళూరు): టికెట్ కలెక్షన్ రాలేదనే కోపంతో మహిళా ప్రయాణికులను ఎక్కించుకోకుండా బస్సును ముందుకు తీసుకెళ్తున్న డ్రైవర్ చర్యను మహిళలు అడ్డుకోగా వారిపైకి బస్సును దూకించేందుకు యత్నించాడు. ఈ ఘటన తుమకూరు జిల్లా కొరటెగెరె నాగేనహళ్లి గేట్ వద్ద జరిగింది. చామరాజనగర జిల్లా కొళ్లేగాల నుంచి కొందరు మహిళలు జిల్లాలోని గోరవనహళ్లి మహాలక్ష్మి అమ్మవారి ఆలయానికి వచ్చారు. అమ్మవారిని దర్శించుకున్న అనంతరం స్వగ్రామానికి వెళ్లేందుకు నాగేనహళ్లి గేట్ వద్ద వేచి ఉన్నారు. ఆ మార్గంలో వచ్చిన కేఎస్ ఆర్టీసీ బస్సును ఆపేందుకు ప్రయత్నించారు. అయితే అప్పటికే కలెక్షన్ లేదని బాధతో ఉన్న డ్రైవర్ బస్సును ఆపలేదు. దీంతో మహిళలు బస్సు ముందుకు వెళ్లి ఆపే ప్రయత్నం చేయగా డ్రైవర్ వారిపైకి వాహనాన్ని ఎక్కించే ప్రయత్నం చేశాడు. డ్రైవర్ ప్రవర్తనపై మహిళలంతా తహసీల్దార్‌కు ఫిర్యాదు చేశారు. అనంతరం తహసీల్దార్ మునిశామి రెడ్డి మహిళలకు వేరే బస్సును ఏర్పాటు చేశారు. బస్సు డ్రైవర్‌పై చర్యలు తీసుకుంటామని హామీనిచ్చారు. చదవండి: Aryan Dubey Rebirth Story: ‘ఆవిడ మా ఆవిడే..’ పునర్జన్మ చెబుతూ హడలెత్తిస్తున్న కుర్రాడు! -
ఈ సీటు నాదంటూ డ్రైవరుతో గొడవ.. చివరికి
ఒక బస్సులో జరిగిన హైడ్రామా చూస్తే ఎవ్వరికైనా పొట్ట చెక్కలైపోవాల్సిందే. ఒక బస్సులో కూర్చోవడానికి ఎక్కడా సీటులేక ఏకంగా డ్రైవర్ సీటులోనే కూర్చుంది ఒక మహిళ. కొద్దిసేపటికి డ్రైవర్ వచ్చి లేవమన్నా లేవలేదు సరికదా కావాలంటే నువ్వే వెళ్లి ఎక్కడైనా కూర్చోమంటూ ఉచిత సలహా కూడా ఇచ్చింది. ఆ మహిళతో పాటు ఆమె అత్తగారు కూడా వాదులాడటంతో వారిని ఒప్పించడం ఆ డ్రైవర్ వల్ల కాలేదు. చివరికి దౌర్జన్యం చేస్తే తప్ప డ్రైవరుకు తన సీటు దక్కలేదు. ఇంకెక్కడైనా కూర్చో.. అర్జెంటు పనిమీద ఎదో ఊరికి ప్రయాణం కట్టిన అత్తాకోడళ్లు బస్ స్టాండ్‌లో ఉన్న ఒక బస్సు ఎక్కారు. అత్తాకోడళ్లలో అత్తకు వెనక ఎక్కడో ఒక సీటు దొరకడంతో వెళ్లి కూర్చుంది. కానీ కోడలు మాత్రం బస్సులో ఎక్కడా సీటు లేక ఖాళీగా ఉందని నేరుగా వెళ్లి డ్రైవర్ సీటులో కూర్చుంది. తీరా బసు డ్రైవర్ వచ్చి అది నా సీటు నేను బసు డ్రైవింగ్ చేయాలి.. వెళ్లి వేరే చోట కూర్చోమని అడిగితే.. ఆ మహిళ ఇది నీ సీటు కాదు నాది, కావాలంటే నువ్వే వెళ్లి వేరెక్కడైనా కూర్చుని బస్సు నడపమని సలహా ఇచ్చింది. కోడలికి అత్త వత్తాసు.. కొద్దిసేపటికి వెనక ఉన్న అత్త కూడా కోడలితో కలిసి డ్రైవరుని దుర్భాషలాడారు. పాపం డ్రైవరుని ఒక్కడిని చేసి అత్తాకోడళ్లు ఒక్క అడుగు కూడా వెనక్కి వేయలేదు. చుట్టూ చేరిన జనం కూడా డ్రైవరుకు ఎటువంటి సాయం చేయకపోవడం విదూరం. చివరికి సహనం నశించిన డ్రైవరు ఆమెని బలవంతంగా కిందకు లాగితే గాని తన సీటు తనకు దక్కలేదు. ఎక్కడ జరిగిందో తెలియదు గాని, ఉత్తర భారతదేశంలోనే ఎక్కడో జరిగిన ఈ సంఘటన తాలూకు వీడియోని ఎవరో ఫోన్లో తీసి సోషల మీడియాలో అప్లోడ్ చేశారు. ఈ సంఘటన జరిగి రెండు నెలలైనా ఇప్పుడు వైరల్ కావడం విశేషం. మొదట ఇదేదో ప్రాంక్ వీడియో అనుకున్న చాలామందికి కొద్దిసేపు అత్తాకోడళ్ల మాటతీరు చూశాక గాని అర్ధం కాదు ఇది సీరియస్ మ్యాటరేనని.. వారికి బస్సు ఎలా నడుస్తుందన్న కనీస ఇంగిత జ్ఞానం కూడా లేదని. టెక్నాలజీ సాయంతో రాకెట్ వేగంతో కాలం దూసుకుపోతున్న రోజుల్లో ఇలాంటి అమాయకులు కూడా ఉన్నారా అని ఆశ్చర్యపోతున్నారు నెటిజన్లు. Indian travel diaries 😂😂😂 Lady and her bahu board a bus and bahu sits in the driver's seat. When the driver asks her to vacate the seat both ladies refuse and ask him to drive the bus from any other seat 😂😂😂 Only in India ! pic.twitter.com/NXScZnUlBG — Shirish Thorat (@shirishthorat) March 12, 2023 ఇది కూడా చదవండి: భర్తను చంపి విలాసవంతమైన జైళ్ల కోసం గూగుల్‌లో వెతికిన భార్య -
వైరల్ వీడియో ఎంత కష్టం వచ్చింది!.. చివరి సారిగా బస్సుకు ముద్దుపెట్టి
-
ఎంత కష్టం వచ్చింది!.. చివరి సారిగా బస్సుకు ముద్దుపెట్టి
తిరువొత్తియూరు(చెన్నై): ఉద్యోగ విరమణ పొందిన ప్రభుత్వ బస్సు డ్రైవరు చివరిసారిగా బస్సుకు ముద్దుపెట్టి కన్నీటిపర్యంతం అయ్యాడు. తమిళనాడు, మదురై తిరుప్పరకుండ్రం సమీపంలోని పైకరావుకు చెందిన ముత్తుపాండి (60). ఇతను 1993 నుంచి తిరుపరకుండ్రం ప్రభుత్వ రవాణా సంస్థలో డ్రైవర్‌గా పనిచేస్తున్నారు. ఈ క్రమంలో ముత్తుపాండి రిటైర్డ్ అయ్యారు. రిటైర్మెంట్ ముందు రోజు విధులు నిర్వహించి బస్సు నడుపుకుంటూ డిపోకు చేరారు. ఆ సమయంలో అతను సీటు నుంచి దిగడం ఇష్టం లేక స్టీరింగుకు ముద్దుపెట్టి తర్వాత కన్నీటి పర్యంతమయ్యాడు. బస్సు నుంచి దిగుతూ వందనం చేశాడు. బస్సు ముందు భాగానికి వెళ్లి తన రెండు చేతులతో బస్సును హత్తుకుని తడుముతున్నట్లు నిలబడి కన్నీరు పెట్టుకున్నారు. ఈ సంఘటనతో సహా ఉద్యోగుల కళ్లు చెమర్చాయి. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. చదవండి: Imran Khan: అరెస్టుతో నా పరువు పోయింది! 1,500 కోట్ల పరిహారం కోరుతూ NABకి లీగల్ నోటీసులు -
మహిళలకు బస్సు ఆపని డ్రైవర్.. సీఎం కేజ్రీవాల్ వార్నింగ్
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని ఆర్టీసీ బస్సు డ్రైవర్లకు ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్, ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ హెచ్చరికలు జారీ చేశారు. బస్టాప్‌లో మహిళల కోసం బస్సు ఆపని డ్రైవర్లపై కఠినమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. దీన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదన్నారు. కాగా 2019లో ఆప్ ప్రభుత్వం దేశ రాజధానిలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని ప్రారంభించింది. అప్పటి నుంచి ప్రతి ఏడాది ఎంత మంది మహిళలు ఈ అవకాశాన్ని వినియోగించుకుంటున్నారనే నివేదికను బడ్జెట్ సమావేశాల్లో కూడా చూపిస్తున్నారు. అయితే గత కొన్నిరోజులుగా మహిళలు ఉన్నచోట కొంతమంది డ్రైవర్లు బస్సు ఆపకుండానే వెళ్లిపోతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. దీనిపై చాలామంది మహిళలు ఫిర్యాదులు కూడా చేశారు. ఈ క్రమంలో తాజాగా ఓ డ్రైవర్ బస్టాప్‌లో మహిళలు ఉన్నచోట బస్సు ఆపకుండా వెళ్లిపోయాడు. ఇందులో ఓ బస్టాపులో ప్రయాణికుడు దిగేందుకు బస్సును స్లో చేసిన డ్రైవర్.. అక్కడనున్న మహిళలను ఎక్కించుకోకుండా ముందుకు కదిలించాడు. వారు బస్సు వెనక పరిగెడుతున్నా పట్టించుకోకుండా వెళ్లిపోయాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తాజా ఘటనకు సంబంధించి కేజ్రీవాల్ తీవ్రంగా స్పందించారు. సదరు వీడియో పోస్టు చేస్తూ.. మహిళలు ఉన్నచోట బస్సులు ఆపాల్సిందేనని, లేకుంటే సదరు డ్రైవర్లపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ‘మహిళలకు ప్రయాణం ఉచితం కాబట్టి కొంతమంది డ్రైవర్లు మహిళలను చూసి బస్సును ఆపడం లేదని ఫిర్యాదులు అందుతున్నాయి. దీనిని అస్సలు సహించేది లేదు. ఇలాంటి బస్సు డ్రైవర్‌పై కఠిన చర్యలు తీసుకుంటాం’ అని ట్వీట్ చేశారు. కాగా మహిళల కోసం బస్సు ఆపని సదరు డ్రైవర్‌ను గుర్తించి ప్రభుత్వం సస్పెండ్ చేసింది. చదవండి: 2 వేల నోటుపై వేటు.. సందేహాలొద్దు.. సమాధానాలివిగో! ऐसी शिकायतें आ रही हैं कि कुछ ड्राइवर महिलाओं को देखकर बस नहीं रोकते क्योंकि महिलाओं का सफ़र फ़्री है। इसे बिल्कुल बर्दाश्त नहीं किया जाएगा। इस बस ड्राइवर के ख़िलाफ़ सख़्त एक्शन लिया जा रहा है। pic.twitter.com/oqbzgMDoOB — Arvind Kejriwal (@ArvindKejriwal) May 18, 2023 -
బస్ నడుపుతుండగా స్పృహ కోల్పోయిన డ్రైవర్‌కు.. ఈ బుడ్డోడు ఏం చేశాడో చూశారా?
-
ఏం టైమింగ్ రా?.. 60 మందిని కాపాడాడు
Viral Video: పిల్లలను నేర్పాల్సింది విద్యాబుద్ధులు మాత్రమే కాదు.. సంఘంలో ఎలా మెలగాలన్నది కూడా!. సోషల్ మీడియాలో ఎరాలో పిల్లల్ని తప్పుదోవ పట్టించే రీతిలోనే ఉంటోంది చాలామంది తల్లిదండ్రుల పెంపకం. టెక్నాలజీ అవసరమే.. కానీ అది ఏ తరహాలో ఉండాలన్నది పిల్లలకు అలవాటు చేయాల్సింది పేరెంట్స్. ఇదంతా ఎందుకంటే.. తాజాగా ఏడో గ్రేడ్ చదివే ఓ చిన్నారి చేసిన పని.. ఏకంగా 60 మందికి పైగా ప్రాణాల్ని నిలబెట్టింది కాబట్టి. మిచిగాన్‌లో బుధవారం ఈ ఘటన జరిగింది. డ్రైవర్ కళ్లు తిరిగి పడితే.. ఓ విద్యార్థి సకాలంలో స్పందించాడు. డ్రైవర్ సీటులోకి దూకి.. ఎమర్జెన్సీ స్టాపర్ సాయంతో బస్సును ఆపేశాడు. ఆ ఘటన బస్సులోని సీసీటీవీ ఫుటేజీలో రికార్డయ్యింది. సాహసంగా ముందుకు దూకిన స్టూడెంట్ను దిల్లాన్ రీవ్స్గా గుర్తించిన అధికారులు అభినందించారు. బస్సును ఆపడమే కాదు.. ఎమర్జెన్సీ నెంబర్‌కు డయల్ చేయాలంటూ కేకలు వేశాడు ఆ స్టూడెంట్. అందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. -
డ్రైవర్‌కు గుండెపోటు.. స్నేహితులను కాపాడిన తోటి విద్యార్థి
-
శభాష్ డ్రైవరన్న.. చెరువులో మునిగిపోతున్న బాలికలను రక్షించి..
సాక్షి, బెంగళూరు: చెరువులో మునిగిపోతున్న ఇద్దరు బాలికలను ఆర్టీసీ డ్రైవర్ ప్రాణాలతో కాపాడిన ఘటన ఆదివారం సాయంత్రం తుమకూరు జిల్లా శిర తాలూకా హందికుంటె అగ్రహరలో చోటుచేసుకుంది. వివరాలు.. కేఎస్‌ఆరీ్టసీ డిపోకు చెందిన డ్రైవర్ మంజునాథ్ ఆదివారం సాయంత్రం ప్రయాణికులతో నాగప్పనకహళ్లి గేట్ మార్గంలో వస్తుండగా సుదూరంలో ఉన్న చెరువులో ఇద్దరు బాలికలు మునిగిపోతున్నట్లు గుర్తించాడు. వెంటనే బస్సును పక్కకు నిలిపి నీటిలో దూకాడు. ఇద్దరిని పట్టుకుని ఒడ్డుకు చేర్చాడు. డ్రైవర్ సాహసాన్ని ప్రతి ఒక్కరూ అభినందిస్తున్నారు. డ్రైవర్ మంజునాథ్ మాట్లాడుతూ... పిల్లలు మునిగిపోతుండగా అక్కడే చెరువు వద్ద తల్లి ఏడుస్తుండటాన్ని గమనించి వెంటనే బస్సు ఆపి చెరువులో దూకి చిన్నారులను రక్షించినట్లు చెప్పారు. ఈ సందర్భంగా మంజునాథ్‌ను డిపో మేనేజర్, సిబ్బంది ఘనంగా సన్మానించారు. -
గుండెపోటుతో కూడా బస్సును అదుపు చేసి
వెంకటాపురం(కె): టూరిస్ట్ బస్సుడ్రైవర్‌కు గుండెపోటు వచ్చినా.. బస్సుకు బ్రేక్ వేయడంతో తక్కువ వేగంతో పొలాల్లోకి దూసుకెళ్లింది. ప్రయాణికులకు ఏమీ కాలేదు కానీ డ్రైవర్‌ను ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందాడు. ఈ ఘటన ములుగు జిల్లా వెంకటాపురం(కె) మండలం అంకన్నగూడెం గ్రామ సమీపంలో శుక్రవారం సాయంత్రం చోటుచేసుకుంది. ప్రయాణీకుల కథనం ప్రకారం.. చిత్తూరు జిల్లా తవణంపల్లి మండలం ఉత్తర బ్రాహ్మణపల్లి గ్రామానికి చెందిన 45మంది శక్తి మాలలు ధరించి తీర్థ యాత్రల్లో భాగంగా శుక్రవారం మధ్యాహ్నం భద్రాచలం పర్ణశాల నుంచి యాదాద్రి శ్రీ లక్ష్మీనర్సింహస్వామి దేవస్థానానికి బయలుదేరారు. బస్‌డ్రైవర్ దేవ ఇరక్కమ్ (49) పర్ణశాల వద్ద నుంచే తనకు గుండె వద్ద నొప్పి వస్తోందని ఇబ్బందిగా ఉందని తెలిపాడు. దీంతో వేరే డ్రైవర్‌ను పిలిపించాలని ప్రయాణికులు సూచించారు. మరో డ్రైవర్ రావడానికి రెండు రోజులు పడుతుందని, అప్పటివరకు తానే బస్సు నడుపుతానని చెప్పి యాదాద్రికి బయలుదేరాడు. అంకన్నగూడెం గ్రామ శివారులోకి రాగానే డ్రైవర్‌కు గుండెనొప్పి తీవ్రమై ఒక్కసారిగా కుప్పకూలాడు. బస్సు నెమ్మదిగా ఉండడం, డ్రైవర్ నొప్పితో ఉన్నా బ్రేక్ వేయడంతో బస్సు పక్కనే ఉన్న చెట్ల పొదల్లోకి దూసుకెళ్లి ఆగింది. అపస్మారకస్థితిలో ఉన్న డ్రైవర్‌ను వెంటనే 108లో వెంకటాపురం వైద్యశాలకు తరలిస్తుండగా చనిపోయాడు. బస్సులోని 45మంది ప్రయాణికులు సురక్షితంగా ఉన్నారు. డ్రైవర్ నొప్పి ఉన్నా సమయస్ఫూర్తితో బ్రేక్ వేశాడని, లేదంటే పెనుప్రమాదం జరిగేదని ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేశారు. -
గుండెపోటుతో డ్రైవర్ మృతి.. పొలాల్లోకి దూసుకెళ్లిన బస్సు
-
చాయ్ ఎంత పనిచేయించింది..డ్రైవర్ని తిట్టిపోస్తున్న నెటిజన్లు!
భారతీయులకు చాయ్ అంటే ఎంత మక్కువ అనేది చెప్పనవసరం లేదు. అదీకూడా ఈ చల్లటి వాతావరణంలో వేడి వేడి అల్లం టీ సిప్ చేస్తే ఉండే ఆనందమే వేరు. ఐతే ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే ఇక్కడొక డ్రైవర్ ఆ చాయ్ మీద ఇష్టం కొద్ది ఏం చేశాడో వింటే ఆశ్చర్యంతో నోరెళ్లబెట్టడం ఖాయం. వివరాల్లోకెళ్తే...ఢిల్లీ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్(డీటీఓ) బస్సు డ్రైవర్ టీ కోసం ఏకంగా రద్దీగా ఉండే రహదారి మధ్యలో బస్సును ఆపేశాడు. దీంతో రోడ్డుపై ఒక్కసారిగా ట్రాఫిక్ జామ్ అవ్వడంతో ప్రజలు తీవ్ర అసహనానికి గురయ్యారు. ఇంతలో టీ కప్పుతో బయటకు వచ్చిన డ్రైవర్ దీన్ని గమనించి..ర్యాంగ్ ప్లేస్‌లో పార్క్ చేసినట్లు ఉన్నానుకుంటూ.. గబగబ టీకప్పుతో బస్సు వద్దకు వచ్చి స్టార్ట్ చేశాడు. అందుకు సంబంధించిన వీడియోని శుభ్ అనే వ్యక్తి ట్విట్టర్లో పోస్ట్ చేయడంతో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఆ వీడియోలో ఢిల్లీ యూనివర్సిటీ నార్త్ క్యాంపస్‌లో పేరుగాంచిన సుదామా టీ స్టాల్ అని, అందుకే డ్రైవర్ అక్కడ బస్సు ఆపాడని ఒక వాయిస్ ఓవర్ వస్తోంది. దీంతో నెటిజన్లు సదరు డ్రైవర్‌పై మండిపడుతూ.. అతని డ్రైవింగ్ లైసెన్స్‌ని రద్దు చేయాలని ఒకరు, మరోకరేమో అతన్ని ఎందుకు తిడుతున్నారు, సుదామా టీస్టాల్ కారణంగానే ఇది జరగిందంటూ కామెంట్ చేస్తూ ట్వీట్ చేశారు. men😭☕ pic.twitter.com/EDOSmxlnZC — Shubh (@kadaipaneeeer) January 2, 2023 (చదవండి: ఉద్యోగం నుంచి తీసేశారని..యజమానిపై కాల్పులు జరిపిన మాజీ ఉద్యోగి) -
పంత్‌ను ప్రత్యేకంగా కలిసిన ఇద్దరు.. ఎవరో తెలుసా?
డెహ్రడూన్: రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి కోలుకుంటున్న టీమిండియా యువ ఆటగాడు రిషబ్ పంత్‌ను సోమవారం ఇద్దరు వ్యక్తులు ప్రత్యేకంగా కలిశారు. వారెవరో కాదు.. అతడిని కాపాడిన రక్షకులు రజత్, నిషు. ఆస్పత్రికి వెళ్లి పంత్‌ను స్వయంగా కలిశారు. అతడి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. పంత్ ఒంటి నిండా బాండేజ్‌లు ఉన్నట్టు ఫొటోలో కనిపించింది. రిషబ్ పంత్ కారు ప్రమాదానికి గురైన వెంటనే అక్కడే ఉన్న రజత్, నిషు.. సకాలంలో స్పందించి అతడిని కారు నుంచి బయటకు తీసుకువచ్చారు. తర్వాత అక్కడికి వచ్చిన బస్ డ్రైవర్ సుశీల్ కుమార్.. అంబులెన్స్ ఏర్పాటు చేసి, పోలీసులకు ఫోన్ చేశారు. వీరు ముగ్గురి సహాయంతో పంత్ ప్రాణాలతో బయటపడ్డాడు. ప్రమాద సమయంలో పంత్‌ను తాము గుర్తించలేదని, అతడు క్రికెటర్ అన్న సంగతి తమకు తెలియదని రజత్, నిషు.. వార్తా చానళ్లకు ఇచ్చిన ఇంటర్వ్యూల్లో చెప్పారు. సుశీల్ కుమార్‌ను గణతంత్ర దినోత్సవం సందర్భంగా జనవరి 26న సత్కరించాలని ఉత్తరాఖండ్ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. అటు బీసీసీఐ కూడా రిషబ్ పంత్ ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామని ప్రకటన చేసింది. శ్రీలంకతో మంగళవారం టీ20 మ్యాచ్ ఆడుతున్న టీమిండియా ఆటగాళ్లు పంత్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ సందేశం పంపారు. (క్లిక్ చేయండి: మిస్ యూ పంత్! ప్లీజ్.. త్వరగా కోలుకో.. కలిసి ఆడుదాం!) -
సుశీల్ జీ మీకు రుణపడిపోయాం.. హ్యాట్సాఫ్: లక్ష్మణ్ ట్వీట్ వైరల్
Rishabh Pant Accident- VVS Laxman Hails Bus Driver: ‘‘మంటల్లో కాలిపోతున్న కారులో నుంచి రిషభ్ పంత్‌ను బయటకు తీసి.. బెడ్‌షీట్ చుట్టి.. వెంటనే అంబులెన్స్‌కు ఫోన్ చేసి.. తనను కాపాడిన హర్యానా డ్రైవర్ సుశీల్ కుమార్‌కు ధన్యవాదాలు. మీరు చేసిన సేవకు కృతజ్ఞులం. సుశీల్ జీ మీకు రుణపడిపోయాం’’ అంటూ టీమిండియా దిగ్గజం, జాతీయ క్రికెట్ అకాడమీ హెడ్ వీవీఎస్ లక్ష్మణ్ ఉద్వేగపూరిత ట్వీట్ చేశాడు. టీమిండియా యువ క్రికెటర్ రిషభ్ పంత్ ప్రాణాలతో బయటపడటానికి కారణమైన బస్సు డ్రైవర్ సుశీల్ కుమార్‌ను రియల్ హీరోగా అభివర్ణించాడు. అదే విధంగా.. కండక్టర్ పరంజిత్‌కు కూడా లక్ష్మణ్ ధన్యవాదాలు తెలియజేశాడు. పెద్ద మనసు రిషభ్‌ను కాపాడే క్రమంలో పరంజిత్.. సుశీల్‌కు సాయం చేశాడన్న లక్ష్మణ్.. వీరి సమయస్ఫూర్తికి సలాం కొట్టాడు. పంత్‌ను ప్రాణాలతో రక్షించిన సుశీల్, పరంజిత్లది పెద్ద మనసు అంటూ హ్యాట్సాఫ్ చెప్పాడు. కాగా టీమిండియా స్టార్ క్రికెటర్ రిషభ్ పంత్ శుక్రవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. ఈ యువ వికెట్ కీపర్ స్వయంగా కారు నడుపుకొంటూ స్వస్థలం ఉత్తరాఖండ్‌కు వెళ్తుండగా.. డివైడర్‌ను ఢీకొట్టాడు. దీంతో కారులో మంటలు చెలరేగాయి. ఈ విషయాన్ని గమనించిన సుశీల్ వెంటనే తమ బస్సు నిలిపివేసి.. అప్పటికే కారు నుంచి బయటపడేందుకు ప్రయత్నిస్తున్న పంత్‌ను మరికొంత మంది సాయంతో బయటకు తీశాడు. ఈ నేపథ్యంలో గాయాలతో బయటపడ్డ పంత్‌ను ఆస్పత్రికి తరలించగా చికిత్స జరుగుతోంది. కాగా భయంకరమైన యాక్సిడెంట్ నుంచి 25 ఏళ్ల పంత్ ప్రాణాలతో బయటపడటంలో సుశీల్ పాత్ర కీలకం. ఈ నేపథ్యంలో అతడిపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. వాళ్లకు ప్రోత్సాహకం టీమిండియా బ్యాటర్ రిషభ్ పంత్‌ను ప్రమాదం నుంచి కాపాడిన వారందరికీ సముచిత గౌరవం దక్కనుంది. ఈ విషయం గురించి ఉత్తరాఖండ్ డీజీపీ అశోక్ మాట్లాడుతూ.. ‘‘ఏదైనా రోడ్డు ప్రమాదం జరిగిన తర్వాత బాధితులకు మొదటి గంట సమయం అత్యంత కీలకం. గోల్డెన్ పీరియడ్. ఆ సమయంలో సరైన చికిత్స అందితే ప్రాణాలతో బయటపడే అవకాశం ఉంటుంది. ఇలాంటి సమయాల్లో సమయస్ఫూర్తితో వ్యవహరించి బాధితుడిని కాపాడిన వాళ్లను ప్రోత్సహించేందుకే కేంద్రం ది గుడ్ సామరిటన్ స్కీమ్ ప్రవేశపెట్టింది’’ అని తెలిపారు. కాగా రోడ్డు ప్రమాదాల్లో క్షతగాత్రులను వెంటనే ఆస్పత్రికి తరలించి సకాలంలో వైద్య సేవ అందేలా చేసిన వారికి రూ. 5 వేల నగదు ప్రోత్సాహకం ఇస్తారు. చదవండి: Pele: అటకెక్కిన అంతర్యుద్దం.. అట్లుంటది పీలేతోని! కానీ.. ఎంత ఎదిగినా... ఆయనకూ తప్పలేదు! ఘనంగా షాహిద్ ఆఫ్రిది కుమార్తె వివాహం.. హాజరైన షాహిన్ ఆఫ్రిది Gratitude to #SushilKumar ,a Haryana Roadways driver who took #RishabhPant away from the burning car, wrapped him with a bedsheet and called the ambulance. We are very indebted to you for your selfless service, Sushil ji 🙏 #RealHero pic.twitter.com/1TBjjuwh8d — VVS Laxman (@VVSLaxman281) December 30, 2022 -
పంత్‌ను కాపాడిన బస్ డ్రైవర్ ఆసక్తికర వ్యాఖ్యలు
టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ శుక్రవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం నుంచి త్రుటిలో ప్రాణాలతో బయటపడ్డాడు. పంత్ ప్రయాణిస్తున్న కారు.. ప్రమాదం బారిన పడడాన్ని మొదట చూసింది బస్ డ్రైవర్ సుశీల్ మన్. కారులో చిక్కుకున్న పంత్‌ను బయటకు లాగి ప్రాణాలు కాపాడింది ఆయనే. ప్రమాదం జరిగిన సమయంలో అసలు అక్కడ ఏం జరిగిందన్నది సుశీల్ మన్ స్థూలంగా వివరించాడు. సుశీల్ మాట్లాడుతూ.. ''నేను హరిద్వార్ వైపు నుంచి వస్తున్నా. ఢిల్లీ వైపు నుంచి వేగంగా వస్తున్న ఒక కారు ఒక్కసారిగా అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. అది చూసిన వెంటనే బస్సు ఆపాను. ఆ కారు బారికేడ్‌ను ఢీకొట్టి 200 మీటర్లు దూసుకెళ్లినట్టు తెలుస్తోంది. అయితే కారులో ఎవరున్నది తెలిసేలోపే మంటలు అంటుకున్నాయి. ఈలోగా కారులో నుంచి బయటికి రావడానికి ఆ వ్యక్తి ప్రయత్నిస్తున్నాడు. వెంటనే నేను బయటికి లాగాను. ఆ తర్వాత ''నాపేరు రిషబ్ పంత్ అని.. టీమిండియా క్రికెటర్ అని.. మా అమ్మకు ఫోన్ చేయండి'' అని ఆ వ్యక్తి నాతో చెప్పాడు. వాస్తవానికి నేను క్రికెట్ చూడను. పంత్ ఎవరో కూడా నాకు తెలియదు. ఆపదలో ఉన్న వ్యక్తిని కాపాడడం బాధ్యత. అందుకే వెంటనే అతన్ని(పంత్‌ను) బయటికి లాగి పక్కకు తీసుకెళ్లాను. ఇంతలో బస్‌లో మిగతావారు వచ్చి అతను క్రికెటర్ పంత్ అని చెప్పారు. ఆ తర్వాత కారులో ఇంకా ఎవరైనా ఉన్నారా అని తొంగి చూశాను. ఎవరు కనిపించలేదు. అయితే ఒక బ్లూబ్యాగ్ మాత్రం కనిపించింది. ఓపెన్ చేసి చూస్తే అందులో ఎనిమిది వేల రూపాయలు కనిపించాయి. పంత్‌ను ఆంబులెన్స్ ఎక్కించి ఆ తర్వాత బ్యాగ్‌ను అతనికి అందజేశాను. అక్కడి నుంచి పంత్‌ను డెహ్రాడూన్ ఆసుపత్రికి తరలించారు.'' అంటూ చెప్పుకొచ్చాడు. కాగా పంత్ ఆరోగ్య పరిస్థితిపై బీసీసీఐ అప్డేట్ ఇచ్చింది. ప్రస్తుతం అతడి ఆరోగ్యం నిలకడగా ఉందని తెలిపింది. తాను పంత్ కుటుంబ సభ్యులతో మాట్లాడినట్టు బీసీసీఐ కార్యదర్శి జై షా పేర్కొన్నారు. పంత్ ఆరోగ్యం నిలకడగా ఉందని, ఇంకా వైద్య పరీక్షలు జరుగుతున్నాయన్నారు. అతడికి అన్ని రకాల సాయం అందించేందుకు సిద్ధంగా ఉన్నట్టు చెప్పారు. త్వరగా కోలుకోవాలని జై షా ఆకాంక్షించారు. చదవండి: పంత్ పరిస్థితిపై బీసీసీఐ కీలక అప్డేట్ వేగంగా దూసుకొచ్చిన పంత్ కారు.. వీడియో వైరల్! ప్రమాదానికి కారణం?! -
డ్రైవర్ కు గుండెపోటు.. ఆగిఉన్న వాహనాలపై దూసుకెళ్లిన బస్సు
-
భారత్‌కు తిరిగి వస్తూ పాండ్యా ఏం చేశాడంటే!
టీమిండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా ఆన్ అండ్ ఆఫ్ ఫీల్డ్‌లో చాలా కూల్‌గా కనిపిస్తున్నాడు. ఒకప్పుడు పాండ్యా అంటే ఫైర్‌బ్రాండ్‌కు పెట్టింది పేరు. మైదానంలో బరిలోకి దిగాడంటే దూకుడైన ఆటతీరుతో అగ్రెసివ్నెస్ కనబడేవాడు. కానీ ఎప్పుడైతే గాయంతో ఆటకు దూరమయ్యాడో అప్పటి నుంచి పాండ్యా పూర్తిగా మారిపోయాడు. గాయం నుంచి కోలుకున్న తర్వాత ఐపీఎల్లో గుజరాత్ టైటాన్స్‌కు కెప్టెన్‌గా వ్యవహరించాడు. డెబ్యూ సీజన్లోనే గుజరాత్ టైటాన్స్ టైటిల్ కొట్టడంలో కెప్టెన్‌గా.. ఆటగాడిగా పాండ్యాదే కీలకపాత్ర. ఐపీఎల్ మొత్తంగా పరిణితితో కూడిన పాండ్యానే కనిపించాడు. ఆ తర్వాత టీమిండియాలోకి తిరిగి ఎంట్రీ ఇచ్చిన పాండ్యా అదే నిలకడను కొనసాగిస్తున్నాడు. టి20 ప్రపంచకప్ ముగిసిన తర్వాత టీమిండియా న్యూజిలాండ్ పర్యటనకు వచ్చింది. రోహిత్ గైర్హాజరీలో టి20 కెప్టెన్‌గా వ్యవహరించిన పాండ్యా టీమిండియాకు సిరీస్ విజయాన్ని అందించాడు. ప్రస్తుతం ధావన్ నేతృత్వంలో టీమిండియా మూడు వన్డేల సిరీస్ ఆడుతుంది. ఇప్పటికే తొలి వన్డే ఓడిన టీమిండియా ఆదివారం రెండో వన్డే ఆడనుంది. ఇక వన్డే సిరీస్‌కు పాండ్యాను ఎంపిక చేయలేదు. దీంతో స్వదేశానికి బయలుదేరిన పాండ్యా తన చర్యతో సోషల్ మీడియాలో వైరల్‌గా మారాడు. న్యూజిలాండ్ పర్యటనలో టీమిండియా ప్రయాణం చేసిన బస్సుకు డ్రైవర్‌గా ఉన్న వ్యక్తికి పాండ్యా తన జెర్సీని గిఫ్ట్‌గా ఇచ్చాడు. అంతేకాదు ఆ జెర్సీపై పాండ్యాతో పాటు ఇతర క్రికెటర్ల సంతకాలు కూడా ఉన్నాయి. దీనికి సంబంధించిన వీడియోనూ సదరు బస్ డ్రైవర్ షేర్ చేసుకున్నాడు. పాండ్యా ప్రేమతో ఇచ్చిన జెర్సీని తాను వేలం వేసే ప్రయత్నం చేస్తానని పేర్కొన్నాడు. Hardik Pandya's great gesture towards #TeamIndia's bus driver in New Zealand Watch @Vimalwa's special report here: https://t.co/HJz0NTcbFX#HardikPandya #OneCricket #crickettwitter pic.twitter.com/c0AibDvTIh — OneCricket (@OneCricketApp) November 26, 2022 చదవండి: మెస్సీపై అభిమానం దేశాలను దాటించింది -
ప్రయాణికులను కాపాడి.. మృత్యుఒడికి
బిట్రగుంట (శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా): బోగోలు మండలం కడనూతల సమీపంలో ఓ టూరిస్టు బస్సు డ్రైవర్ ప్రయాణికులను కాపాడి తాను మృత్యుఒడిలో ఒరిగిపోయాడు. దీంతో అయ్యప్ప భక్తులతో వెళుతున్న టూరిస్ట్ బస్సుకు గురువారం తృటిలో పెనుప్రమాదం తప్పింది. బస్సులోని అయ్యప్ప భక్తుల కథనం మేరకు.... కిర్లంపూడి మండలం తామరక గ్రామానికి చెందిన 45 మంది అయ్యప్ప భక్తులు శబరిమలలో దీక్ష పూర్తి చేసుకుని ఈ నెల 20న తిరుగు ప్రయాణమయ్యారు. కడనూతల వద్ద ఫ్లైఓవర్పైన విశాఖపట్నానికి చెందిన బస్సు డ్రైవర్ భాస్కర్ (39) గుండెపోటుకు గురయ్యాడు. ఊపిరి ఆడకపోవడంతో వెంటనే ప్రమాదాన్ని పసిగట్టి చాకచక్యంగా బస్సును ఫ్లైఓవర్‌పైనే ఒక పక్కగా నిలిపేశాడు. గుండెనొప్పిగా ఉందంటూ క్లీనర్‌కు చెబుతూనే కుప్పకూలి ప్రాణాలు వదిలాడు. బస్సు ఏమాత్రం అదుపుతప్పినా ఘోరప్రమాదం జరిగేదని ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేశారు. సమాచారం అందుకున్న బిట్రగుంట పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కావలి ఏరియా ఆస్పత్రికి తరలించారు. -
హెచ్ఎం చనువుతో.. టీచర్‌గా మారిన డ్రైవర్
సాక్షి, బంజారాహిల్స్: డ్రైవర్‌గా ఉండాల్సిన వ్యక్తి సదరు స్కూల్ హెచ్ఎం ఇచ్చిన చనువుతో ఏకంగా టీచర్‌గా మారాడు. ప్రతిరోజూ ఎల్కేజీ విద్యార్థులకు హాజరు తీసుకోవడంతో పాటు క్లాస్‌లు కూడా చెప్పేవాడు. ఇదే చనువుతో ఎల్కేజీ విద్యార్థినిపై అత్యాచారం చేసిన ఘటనలో ప్రస్తుతం చంచల్‌గూడ జైలులో ఊచలు లెక్కిస్తున్నాడు. సంచలనం సృష్టించిన బంజారాహిల్స్ రోడ్ నెం. 14 డీఏవీ పబ్లిక్ స్కూల్లో అత్యాచార ఘటనలో ప్రధాన నిందితుడు రజనీకుమార్, హెచ్ఎం మాధవిల కస్టడీ మంగళవారంతో ముగిసింది. వీరిని బుధవారం తిరిగి చంచల్‌గూడ జైలుకు తరలించారు. కస్టడీ విచారణలో పోలీసులు పలు విషయాలను రాబట్టారు. నిందితుడు రజనీకుమార్ పాఠశాలలో అన్ని తానై వ్యవహరించడమే కాకుండా ఏకంగా క్లాస్ తీసుకునేవాడని విచారణలో తేలింది. ప్రతిరోజూ ఓ క్లాస్ తీసుకోవడమే కాకుండా చిన్నారుల హాజరును కూడా నమోదు చేసేవాడని గుర్తించారు. పాఠశాలలోని సీసీ కెమెరాల వ్యవస్థ మొత్తం ఆయన పర్యవేక్షణలోనే ఉండటంతో తన అక్రమాలు వెలుగు చూడకుండా కొన్ని సీసీ కెమెరాల వైర్లను కట్ చేసిన విషయాన్ని నిందితుడు పోలీసుల ఎదుట అంగీకరించాడు. కొందరు టీచర్లు నిందితుడిపై ఫిర్యాదు చేసినా హెచ్ఎం మాధవి నిర్లక్ష్యంగా వ్యవహరించిన విషయం కూడా విచారణలో వెలుగు చూసింది. పాఠశాలలో ఏదైనా కార్యక్రమం జరిగితే తల్లిదండ్రులు డబ్బులను నేరుగా నిందితుడి అకౌంట్లోకే పంపించేవారని పోలీసులు గుర్తించారు. డ్రైవర్‌గా ఉండాల్సిన నిందితుడు టీచర్ అవతారం ఎత్తడంతో ఈ ఘటనలు చోటు చేసుకున్నట్లు దర్యాప్తులో తేలింది. స్కూల్లో ఇష్టారాజ్యం నెలకొనడం, క్రమ శిక్షణ లేకపోవడం ఇవన్నీ ఇన్చార్జి ప్రిన్సిపాల్ మాధవి నిర్వాకంతోనే జరిగినట్లుగా తేలింది. -
కామాంధుడి దాష్టీకం.. ఇల్లు నేలమట్టం
భోపాల్/రేవా: స్కూలు బస్సులోనే చిన్నారిపై అఘాయిత్యానికి పాల్పడాడు ఓ మృగం. మూడున్నరేళ్ల చిన్నారిపై కామాంధుడి దాష్టీకం ఆలస్యంగా వెలుగుచూసింది. భోపాల్‌లో ఈ నెల 8న ఈ దారుణం జరిగింది. నగరంలోని ఓ ప్రైవేట్ స్కూల్లో నర్సరీ చదివే చిన్నారి ఇంటికెళ్లాక.. ఆమె బ్యాగ్‌లో ఉండాల్సిన స్పేర్ దస్తులు మార్చేసి ఉన్నాయి. పైగా ప్రైవేట్ భాగాల్లో నొప్పిగా ఉందని తల్లికి చెప్పింది. తల్లి ఆరాతీయడంతో జరిగిన దారుణం వెలుగు చూసింది. బాధిత చిన్నారి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అంతకు ముందు ఘటనపై స్కూల్ యాజమాన్యాన్ని ప్రశ్నించగా.. వాళ్లు నిర్లక్ష్యంగా స్పందించారు. పైగా ఘటన జరిగిన రోజు బస్సులోని సీసీటీవీ ఫుటేజీని మాయం చేశార. దీంతో ఆ పేరెంట్స్ పోలీసులను ఆశ్రయించారు. ఫిర్యాదు మేరకు.. బస్సు డ్రైవర్‌ను, ఘటన జరిగినపుడు సహకరించిన మహిళా హెల్పర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని, పోక్సో సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. డ్రైవర్ అక్రమంగా నిర్మించిన ఇంటిని అధికారులు కూల్చేశారు. ఈ మేరకు అక్రమ కట్టడంగా పేర్కొంటూ నోటీసులు జారీ చేసిన అధికారులు.. పోలీసుల సమక్షంలో షాపురా ఏరియాలోని నిందితుడి ఇంటిని నేలమట్టం చేశారు. ఘటన గురించి తెలిసి ఆగ్రవేశాలతో ఉన్న స్థానికులతోనే ఆ ఇంటిని అధికారులు నేలమట్టం చేయించడం విశేషం. ఇదిలా ఉంటే.. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ వెల్లడించారు. స్కూల్ యాజమాన్యం ధోరణిపైనా మండిపడ్డారు హోం మంత్రి నరోత్తమ్ మిశ్రా. video courtesy: IBC24 ఇదీ చదవండి: నాకు మా అమ్మ కావాలి.. గుండెల్ని పిండేస్తున్న చిన్నారి రోదన -
హెల్మెట్ ధరించి బస్సు డ్రైవింగ్.. కారణం తెలిస్తే షాక్!
లక్నో: సాధారణంగా బైక్‌పై వెళ్తే హెల్మెట్ ధరిస్తాం. కానీ, కారు, బస్సు, ట్రక్కుల్లో హెల్మెట్ ధరించటం ఎప్పుడైనా చూశారా? ఓ డ్రైవర్ హెల్మెట్ ధరించి బస్సు నడిపిన సంఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని గాజియాబాద్‌లో జరిగింది. లోని బస్ డిపోకు చెందిన ఆ బస్సు డ్రైవర్ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. అసలు హెల్మెట్ ధరించిన కారణం తెలిస్తే మీరు షాకవుతారు. రోడ్డుపై వెళ్తున్న బస్సును ఓ వ్యక్తి వెంబడించి మరీ వీడియో తీశాడు. ఆ దృశ్యాలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. ఆ బస్సు రోడ్డు ప్రమాదానికి గురై అద్దాలు పూర్తిగా పగిలిపోయాయి. దీంతో గాయాలబారిన పడకుండా, వర్షం, గాలి నుంచి రక్షణ కోసం ఇలా డ్రైవర్ హెల్మెట్ ధరించినట్లు తెలుస్తోంది. ఆదివారం సాయంత్రం లోని బాగ్పత్ సరిహద్దులో ఈ సంఘటన జరిగింది. ప్రమాదం జరిగిన బస్సును డ్రైవర్ అలాగే డిపోకు తీసుకొచ్చినట్లు అధికారులు తెలిపారు. మరో బస్సును ఢీకొట్టటం వల్ల ముందు అద్దాలు పగిలిపోయాయని డ్రైవర్ చెప్పినట్లు వెల్లడించారు. Picture of UP Roadways bus clicked in Baghpat pic.twitter.com/0hkJAimkfG — Piyush Rai (@Benarasiyaa) July 17, 2022 ఇదీ చూడండి: కదులుతున్న ట్రక్కుపై సూపర్ హీరోలా ఫీట్లు.. వీడియో వైరల్ -
కండక్టర్‌ను వదిలేసి బస్సు రయ్
కర్ణాటక : కండక్టర్‌ను డ్రైవరు మరచిపోయి బస్సుతో బయల్దేరాడు. కొన్ని కిలోమీటర్లు వెళ్లాక సంగతిని తెలుసుకుని బస్సును నిలిపాడు. ఈ సంఘటన కొప్పళ జిల్లా బస్టాండులో చోటుచేసుకుంది. బస్సు కెఎ–37,ఎఫ్–0678, కొప్పళ బస్టాండ్ నుంచి మంగళవారం మధ్యాహ్నం 1 గంటకు బయలుదేరింది. దాదాపు 5 కి.మీ ప్రయాణించిన తరువాత ఓజనహళ్లి వద్దకు చేరుకోగా ప్రయాణికులు టికెట్ కోసం కండక్టర్ ఏడీ అని వెతకసాగారు. అప్పుడు బస్సు డ్రైవర్‌కు అర్థమైంది. వెంటనే అక్కడే బస్సును ఆపివేసి కండక్టర్‌కు కాల్ చేశారు. మీ వల్ల ఆలస్యమైందని ప్రయాణికులు డ్రైవర్‌కు చీవాట్లు పెట్టారు. కండక్టర్ బస్సు ఎక్కకపోతే నేనేం చేయాలని డ్రైవర్ వాపోయాడు. కండక్టర్ మరో బస్సులో అక్కడికి చేరుకుని టికెట్లు కొట్టడంతో అంతా సద్దుమణిగింది. -
యువతి చేతికి బస్సు స్టీరింగ్.. ప్రాణాలు గాల్లో కలిసేవి!
ప్రయాణికులతో నిండిన ఓ బస్సును నడిపించడంలో తీవ్రమైన నిర్లక్ష్యం ప్రదర్శించాడో డ్రైవర్. అతని అజాగ్రత్త వల్ల బస్సులోని ప్రయాణికుల ప్రాణాలు గాల్లో కలిసేవి. ఆ డ్రైవర్ ఏం చేశాడంటే.. ప్రయాణికులతో నిండిన బస్సును తాను నడపకుండా ఓ విద్యార్థినికి స్టీరింగ్ ఇచ్చాడు. ఆమె బస్సును ప్రమాదకరంగా నడిపించింది. ఈ ఘటన జమ్ముకశ్మీర్‌లోని ఉధంపూర్ జిల్లాలో చోటు చేసుకుంది. ఉధంపూర్-లాండర్ మార్గంలో ప్రయాణిస్తున్న బస్సులో డ్రైవర్.. బస్సు స్టీరింగ్‌ను ఓ యువతి చేతికి ఇచ్చాడు. పైగా అది ఒక కొండ మార్గం. ఏ మాత్రం నిర్లక్ష్యం వహించినా బస్సు లోయలోకి దూసుకెళ్లే ప్రమాదం ఉంది. అయినప్పటికీ ఆ నిర్లక్ష్యంగా సదరు యువతితో బస్సును ప్రమాదకరంగా నడిపించాడు. ఈ సమయంలో బస్సులో ప్రయాణిస్తున్న ఒకరు తన మొబైల్ ఫోన్లో వీడియో రికార్డు చేశాడు. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ మారింది. అది కాస్త జమ్ముకశ్మీర్ ట్రాన్స్పోర్ట్ అధికారుల దృష్టికి వెళ్లింది. దీంతో అధికారులు వెంటనే స్పందించి.. యువతి డ్రైవ్ చేసిన బస్సును సీజ్ చేసినట్లు తెలిపారు. ఆ డ్రైవర్‌పైన అధికారులు చర్యలు చేపట్టి డ్రైవింగ్ లైసెన్స్, వాహనం పర్మిట్‌ను సస్పెండ్ చేసినట్లు పేర్కొన్నారు. అతని నిర్లక్ష్యంపై ప్రశ్నించేందుకు అధికారులు నోటీసులు కూడా జారీ చేసినట్లు వెల్లడించారు. ఈ వీడియోను వీక్షించిన నెటిజన్లు డ్రైవర్‌పై తీవ్రంగా విమర్శలు గుప్పిస్తున్నారు. #ViralVideo of negligent #driving: Careless driver lets a girl student drive a #bus full of passengers in J&K's #Udhampur. The license & permit of the driver has now been suspended for endangering lives of passengers. pic.twitter.com/AtdeBWQw4C — India.com (@indiacom) April 18, 2022 -
లోయలో పడ్డ బస్సు.. ప్రమాదానికి కారణాలివే..!
సాక్షి, తిరుపతి: అతివేగం, డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే బస్సు ప్రమాదం జరిగిందని చిత్తూరు జిల్లా డిప్యూటీ ట్రాన్స్‌ఫోర్ట్ కమిషనర్ ఎం.బసిరెడ్డి తెలిపారు. తిరుపతి సమీపంలోని భాకరాపేట వద్ద ప్రైవేటు బస్సు ప్రమాద ఘటనపై ఆయన స్పందిస్తూ.. ఘాట్ రోడ్లో మలుపు గుర్తించకుండా స్ట్రెయిట్‌గా వెళ్లడం వల్ల ప్రమాదం చోటుచేసుకుందని వివరించారు. చదవండి: 300 అడుగుల లోతు.. చిమ్మ చీకటి.. ప్రాణాలను పణంగా పెట్టి.. చెప్పినా డ్రైవర్ వినలేదు: పెళ్లికొడుకు వేణు బస్సు డ్రైవర్ అతివేగమే ప్రమాదానికి కారణమని క్షతగాత్రులు తెలిపారు. అతివేగం, డ్రైవర్ నిర్లక్ష్యమే ఈ ప్రమాదానికి కారణమని పెళ్లికొడుకు వేణు అన్నారు. స్పీడ్‌గా వెళ్లొద్దంటూ చెబుతున్నా డ్రైవర్ వినలేదని.. ఓవర్ స్పీడ్ కారణంగా బస్సు అదుపుతప్పి లోయలోకి దూసుకెళ్లిందన్నారు. రూయాలో 32 మంది, స్విమ్స్‌లో ఏడుగురు, బర్డ్ ఆసుపత్రిలో ఆరుగురికి క్షతగాత్రులకు చికిత్స అందిస్తున్నామని కలెక్టర్ తెలిపారు. బస్సు ప్రమాదంపై దర్యాప్తు చేస్తున్నామని అర్బన్ ఎస్పీ తెలిపారు. మృతులు వీరే.. ఈ ప్రమాదంలో 8 మంది మృతి చెందగా, 45 మంది గాయపడ్డారు.ప్రమాద సమయంలో 55 మంది బస్సులో ఉన్నారు. రసూల్(డ్రైవర్), మలిశెట్టి వెంగప్ప, గణేష్, కాంతమ్మ, మురళీ, యశస్విని, ఆదినారాయణ, బస్సు క్లీనర్ మృతి చెందారు. మరణించిన వారి కుటుంబాలకు రూ.2 లక్షలు సాయం.. బస్సు ప్రమాద ఘటనలో పెళ్లి బృందానికి చెందిన పలువురు మరణించడంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున సహాయం అందించాలని, గాయపడ్డవారికి రూ.50 వేల చొప్పున పరిహారం అందించాలన్నారు. అంతేకాకుండా బాధితులు కోలుకునేంతవరకూ క్షతగాత్రులకు నాణ్యమైన వైద్యం అందించాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. -
డ్రైవింగ్ చేసేందుకు డోర్ వద్దకు వెళ్లి నిల్చున్నాడు.. బస్సు తలుపు ఊడి..
సాక్షి,ప్రొద్దుటూరు: మరో ఐదు నిమిషాల్లో అతను డ్రైవింగ్ మారతాడు.. ఇందుకోసం డోర్ వద్ద నిల్చున్నాడు.. ఇంతలోనే లారీ రూపంలో మృత్యువు ముంచుకొచ్చింది. తెలంగాణా రాష్ట్రంలోని మహబూబ్‌నగర్ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరు ఆర్టీసీడిపోకు చెందిన ఆర్టీసీ డ్రైవర్ పి రూబెన్ (55) అక్కడిక్కడే మృతి చెందాడు. శుక్రవారం వేకువ జామున ఆర్టీసీ బస్సు ప్రమాదవశాత్తు ముందు వెళ్తున్న లారీని ఢీ కొనడంతో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. ఆర్టీసీ అధికారులు, సిబ్బంది కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. ప్రొద్దుటూరు డిపో నుంచి ఏపీ04 జెడ్ 0311 నంబర్ గల సూపర్ లగ్జరీ ఆర్టీసీ బస్సు 26 మంది ప్రయాణికులతో గురువారం రాత్రి 9 గంటలకు హైదరాబాద్‌కు బయలుదేరింది. పి రూబెన్(410219), ఎస్కే బాషా(411458) బస్సు డ్రైవర్లు. ప్రొద్దుటూరు నుంచి ఎస్కే బాషా డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్లాడు. మార్గం మధ్యలో ఎస్కే బాషా డ్రైవింగ్ మారాల్సి ఉంది. అంతవరకు నిద్రపోయిన రూబెన్ వేకువ జామున సుమారు 3.40 గంటల సమయంలో డ్రైవింగ్ మారేందుకు డోర్ వద్దకు వెళ్లి నిల్చున్నాడు. ఈ క్రమంలో మహబూబ్‌నగర్ జిల్లాలోని భూత్పూర్ సమీపంలోకి వెళ్లగానే తను డ్రైవింగ్ చేస్తానని, బస్సు నిలపాలని రూబెన్ అతన్ని అడిగాడు. కొంత దూరం వెళ్లాక దిగుతానని డ్రైవింగ్ చేస్తున్న ఎస్కే బాషా తెలిపాడు. జడ్చర్ల దాటిన తర్వాత ఎదురుగా వస్తున్న లారీని ప్రమాదవశాత్తు ఆర్టీసీ బస్సు ఢీ కొంది. ఈ ఘటనలో డోర్ ఊడిపోవడంతో అక్కడే నిల్చున్న రూబెన్ కింద పడి అక్కడిక్కడే మృతి చెందాడు. ఎడమవైపు వెళ్తున్న లారీ ఒక్కసారిగా కుడివైపునకు రావడంతో ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు, సిబ్బంది చెబుతున్నారు. ఈ ఘటనలో మరో డ్రైవర్ ఎస్కే బాషాతో పాటు ఐదుగురు ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. గాయపడిన వారిని అంబులెన్స్‌లో మహబూబ్‌నగర్ జిల్లా ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న ప్రొద్దుటూరు ఆర్టీసీడిపో మేనేజర్ మధుశేఖర్‌రెడ్డి, పలువురు యూనియన్ నాయకులు, కార్యాలయ అధికారులు హుటాహుటీనా సంఘటనా స్థలానికి వెళ్లారు. 25 ఏళ్ల నుంచి ఆర్టీసీ డ్రైవర్‌గా.. వైఎస్సార్ జిల్లా ఎర్రగుంట్లకు చెందిన రూబెన్‌కు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. కుమార్తె కొన్ని నెలల కిందట మృతి చెందింది. కుమారుల్లో ఒకరు అలహాబాద్‌లో, మరొకరు నంద్యాలలో చదువుకుంటున్నారు. రూబెన్ 1996లో ఏపీఎస్ ఆర్టీసీలో డ్రైవర్‌గా చేరాడు. కొన్నేళ్లు రాయచోటి డిపోలో పని చేశాడు. తర్వాత ప్రొద్దుటూరు డిపోలో విధులు నిర్వహిస్తున్నాడు. వృత్తి పట్ల ఎంతో నిబద్ధత కలిగిన డ్రైవర్‌గా అతను పేరు తెచ్చుకున్నాడని తోటి డ్రైవర్లు చెబుతున్నారు. కేఎంపీఎల్ విషయంలో చాలా సార్లు అధికారుల నుంచి ప్రశంశలు పొందాడన్నారు. ప్రొద్దుటూరు ఆర్టీసీ డిపోలో ఉద్యోగులు, యూ నియన్ నాయకులు రూబెన్‌కు నివాళులు అర్పించారు. ఆయన చిత్రపటానికి పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు. మంచి వ్యక్తిని కోల్పోయామని తోటి డ్రైవర్లు కన్నీటి పర్యంతమయ్యారు. చదవండి: శిల్పా చౌదరి కేసు: ఆ డబ్బంతా బ్లాక్‌ను వైట్ చేసేందుకే ఇచ్చారా? -
బస్ డ్రైవర్‌ను హగ్ చేసుకున్న కివీస్ స్టార్ బౌలర్.. వీడియో వైరల్
Trent Boult Hugs Bus Driver.. టి20 ప్రపంచకప్‌ను అందుకోవడంలో విఫలమైన న్యూజిలాండ్ చివరి మెట్టుపై బోల్తా పడింది. ఆస్ట్రేలియాతో జరిగిన ఫైనల్లో పరాజయం పాలైన కివీస్ మరోసారి అభిమానుల మనసులు గెలుచుకుంది. తాజాగా ఆ జట్టు స్టార్ బౌలర్ ట్రెంట్ బౌల్ట్ చేసిన పని సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. టి20 ప్రపంచకప్ ముగించుకొని టీమిండియా పర్యటనకు దుబాయ్ నుంచి భారత్‌కు బయలుదేరింది. ఈ నేపథ్యంలో న్యూజిలాండ్ జట్టు ఎయిర్పోర్ట్ వరకు బస్‌లో వచ్చింది. న్యూజిలాండ్ జట్టును తీసుకొచ్చిన బస్ డ్రైవర్ సంతోష్ బౌల్ట్‌ను కలవాలని భావించాడు. అడిగిందే తడవుగా బౌల్ట్ ఆ బస్ డ్రైవర్‌తో సెల్ఫీ దిగి ఆ తర్వాత అతన్ని హగ్ చేసుకొని సంతోషపరిచాడు. చదవండి: IND vs NZ: కివీస్‌తో తొలి టి20.. వెంకటేశ్ అయ్యర్‌పై ద్రవిడ్ దృష్టి ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక టీమిండియాతో మూడు టి20లు.. రెండు టెస్టులు ఆడనుంది. కివీస్ రెగ్యులర్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ టి20 సిరీస్‌కు దూరంగా ఉండనున్నాడు. అయితే టెస్టు సిరీస్‌కు మాత్రం అందుబాటులోకి రానున్నాడు. నవంబర్ 17న ఇరుజట్ల మధ్య తొలి టి20 మ్యాచ్ జరగనుంది. Finishing up at the @T20WorldCup with a hug from our bus driver Santhosh. Next stop Jaipur! #T20WorldCup #INDvNZ pic.twitter.com/BdHPCHyzrX — BLACKCAPS (@BLACKCAPS) November 15, 2021 -
బస్సు తగిలిందని తెలంగాణ ఆర్టీసీ బస్ డ్రైవర్‌పై కానిస్టేబుల్ ఉగ్రరూపం
మహబూబ్‌నగర్ క్రైం: బస్టాండ్‌లో విధులు నిర్వహించే ఓ కానిస్టేబుల్‌కు బస్సు తగిలిందని సదరు కానిస్టేబుల్ ఆర్టీసీ డ్రైవర్‌పై విచక్షణ రహితంగా దాడి చేశాడు. వివరాల ప్రకారం.. మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్‌లో టూటౌన్‌కు చెందిన ఓ కానిస్టేబుల్ డ్యూటీ చేస్తున్న క్రమంలో బస్టాండ్‌లో ఉన్నాడు. హైదరాబాద్ నుంచి రాయిచూర్ వెళ్తున్న ఆర్టీసీ బస్సు బస్టాండ్‌లో లోపలికి వస్తున్న క్రమంలో కానిస్టేబుల్ నడుచుకుంటూ వస్తున్న క్రమంలో బస్సు తగిలింది. దీంతో బస్సు డ్రైవర్ కిందకు దిగి కానిస్టేబుల్‌ను లేపడానికి ప్రయత్నించే క్రమంలో ఒక్కసారిగా అతనిపై దాడి చేసి ముఖంపై పిడిగుద్దులు గుద్దడంతో పాటు తీవ్రంగా కొట్టాడు. దీంతో ప్రయాణికులు, ఇతర ఆర్టీసీ సిబ్బంది కానిస్టేబుల్‌ను పట్టుకొని గదిలో వేశారు. అనంతరం టూటౌన్ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో కానిస్టేబుల్‌తో పాటు డ్రైవర్, కండక్టర్లను స్టేషన్‌కు తీసుకెళ్లారు. అయితే ఈ విషయంపై ఎలాంటి ఫిర్యాదు ఇవ్వలేదని టూటౌన్ ఎస్ఐ సైదయ్య తెలిపారు. (చదవండి: Vikarabad: ఇక్కడ డీజిల్ లీటర్ రూ.95, కర్ణాటకలో రూ. 85) -
‘ఎమ్మెల్యే కారుకే సైడ్ ఇవ్వవా’.. స్పందించిన ఎండీ వీసీ సజ్జనార్
సాక్షి, హైదరాబాద్: ‘ఎమ్మెల్యే కారుకే సైడ్ ఇవ్వవా..’అంటూ ఆర్టీసీ అద్దె బస్సు డ్రైవర్‌ను బెదిరించిన ఘటనలో షాద్‌నగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాలు.. ఆదివారం మధ్యాహ్నం వనపర్తి డిపోకు చెందిన ఆర్టీసీ అద్దె బస్సు షాద్‌నగర్ మీదుగా జడ్చర్ల వైపు వెళుతోంది. వెనుక నుంచి ఎక్స్‌యూవీ వాహనంలో వచ్చిన వ్యక్తులు షాద్‌నగర్ పరిధిలోని బూర్గులగేటు సమీపంలో జాతీయ రహదారిపై తమ వాహనాన్ని అడ్డంగా నిలిపారు. చదవండి: ఎమ్మెల్యే వాహనానికే సైడ్ ఇవ్వవా.. ఎమ్మెల్యే వాహనానికే సైడ్ ఇవ్వవా.. అంటూ బస్సు డ్రైవర్ రఘువర్ధన్‌రెడ్డితో దుర్భాషలాడారు. కర్రతో ఆయనపై దాడికి యత్నించారు. తాము ఎమ్మెల్యే అ నుచరులమంటూ హల్చల్ చేశారు.ఈ దృశ్యాల ను కొందరు ప్రయాణికులు సెల్ఫోన్లో చిత్రీకరించడంతో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. స్పందించిన ఎండీ వీసీ సజ్జనార్ బస్సు డ్రైవర్‌పై దాడికి యత్నించిన ఘటనపై ఆర్టీసీ ఎండీ సజ్జనార్ స్పందించారు. డ్రైవర్‌పట్ల అనుచిత వ్యాఖ్యలు చేస్తూ బెదిరింపులకు పాల్పడిన వారిపై స్థానిక ఠాణాలో ఫిర్యాదు చేయాలని ఆయన సూచనతో షాద్‌నగర్ డీఎం శివశంకర్, డ్రైవర్ రఘువర్ధన్‌రెడ్డి ఆదివారం రాత్రి షాద్‌నగర్ పోలీసులకు ఎక్స్‌యూవీ వాహనం నంబర్ (టీఎస్ 09 ఎఫ్ఏ 0809 ) ఆధారంగా ఫిర్యాదు చేశారు. ఈమేరకు ఐపీసీ 341, 353, 506, 290, 34 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ సుందరయ్య తెలిపారు. బెదిరింపులకు పాల్పడిన వారు హైదరాబాద్ ముషీరాబాద్ పరిధిలోని రాంనగర్ చెందిన వినోద్‌గా గుర్తించారు.ఈమేరకు అతడితోపాటు మరో వ్యక్తిపై కేసు నమోదు చేశారు. దాడికి యత్నించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. కేసు నమోదు విషయాన్ని ఎండీ సజ్జనార్ సోమవారం తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేశారు. చట్టం తన పని తాను చేస్తుంది. చట్టాన్ని పౌరులెవరూ తమ చేతుల్లోకి తీసుకోవద్దని సూచించారు. చట్టంముందు అందరూ సమానులేననన్నారు. పూర్తిస్థాయిలో విచారణ జరుపుతున్నామని పోలీసులు తెలిపారు. -
ప్రయాణికులకు బస్సు డ్రైవర్ షాక్.. ఏం చేశాడంటే..!
సాక్షి, నల్లగొండ: ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు డ్రైవర్, క్లీనర్ ఘరానా మోసానికి పాల్పడ్డారు. నార్కట్‌పల్లి వద్ద భోజనం కోసం బస్సును ఆపిన డ్రైవర్.. ప్రయాణికులను మధ్య మార్గంలో వదిలేసి లగేజీతో ఉడాయించారు. ట్రావెల్స్ బస్సులోనే 64 మంది ప్రయాణికుల లగేజీ ఉంది. నార్కట్‌పల్లి ఫంక్షన్ హాల్లో ప్రయాణికులు రాత్రంతా పడిగాపులు కాశారు. బాధితుల వద్దకు నకిరేకిల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య వెళ్లి సమాచారాన్ని తెలుసుకున్నారు. బాధితులకు న్యాయం చేస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. బస్సు ఆచూకీని త్వరగా గుర్తించాలని పోలీసులను ఎమ్మెల్యే కోరారు. చదవండి: బావతో ‘పెళ్లి ఖాయం’.. ఉరికి వేలాడుతూ కనిపించిన మహిళా కానిస్టేబుల్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం అస్సాంకు చెందిన కూలీలు, కేరళలోని ఎర్నకులంలో జీవనం కోసం వలస వెళ్లారు. కాగా స్వంత గ్రామానికి వెళ్లేందుకు కూలీలు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును బ్రోకర్ ద్వారా బుక్ చేసుకుని అస్సాంకు బయలు దేరగా, కూలీలను మార్గం మధ్యలో నార్కెట్‌పల్లి భోజన హోటల్ వద్ద కూలీలను దింపి, బస్ టైర్ రిపేర్ చేయించుకుని వస్తానని చెప్పిన డ్రైవర్.. ఉడాయించాడు. 4 గంటలు గడిచిన బస్సు రాకపోయేసరికి బిత్తరపోయిన కూలీలు.. మోసపోయామని గ్రహించి స్థానికుల సహాయంతో పోలీసులను ఆశ్రయించారు. వీరిలో ఏడుగురు మహిళలతో పాటు చిన్న పిల్లలు కూడా ఉన్నారు. -
చెరువులోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు..
విజయనగరం: విజయనగరం జిల్లాలో ఒక ఆర్టీసీ బస్సు అదుపుతప్పి చెరువులోకి దూసుకుపోయింది. దత్తిరాజేరు మండలం మారడాంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఎవరికి ప్రాణనష్టం జరగలేదు. కాగా, బస్సులో 79 మంది ప్రయాణికులున్నారు. పెను ప్రమాదం తప్పడంతో ప్రయాణికులు ఊపిరిపీల్చుకున్నారు. బస్సు విజయనగరం నుంచి సాలూరు వైపుకు వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుందని ఆర్టీసీ డ్రైవర్ తెలిపారు. -
ఏనుగు దాడి.. ప్రమాదంలోనూ ప్రశాంతంగా ఆలోచించిన డ్రైవర్
ఎంత ప్రమాదంలో ఉన్నా.. ప్రశాంతంగా ఉండటం, సమయస్ఫూర్తితో ఆలోచించడం ఎంత అవసరమో వైరల్ అయిన ఓ వీడియో మనకు చెబుతోంది. అడవుల్లో సంచరించే ఏనుగుల ప్రవర్తన అంచనా వేయడం చాలా కష్టం. గజరాజులు గ్రామాలపై ఏ విధంగా దాడి చేస్తున్నాయో, పంటలను ఏ విధంగా నాశనం చేస్తున్నాయో మనం తరచూ చూస్తున్నాం. గజరాజు అనూహ్యంగా అడవి మార్గం గుండా వెళ్తున్న బస్సుపైన దాడి చేయడం అంటే.. ఎంత ప్రమాదకరమైన పరిస్థితో మనం ఊహించవచ్చు. ఇటీవల ఇలాంటి దాడి తమిళనాడులోని నీలగిరి అడవుల్లో జరిగింది. కోటగిరి నుంచి మెట్టుపాళ్యం వెళ్తున్న ప్రభుత్వ బస్సు ముందు ద్రుడమైన ఏనుగు ఒకటి అనూహ్యంగా ప్రత్యక్షమైంది. బస్సుకు అడ్డుగా నిలిచింది. అది ఆగ్రహంగా ఉందని గ్రహించిన డ్రైవర్ బస్సు ఆపాడు. అద్దాలపై ఏనుగు దాడి చేసింది. అవి పగిలినా డ్రైవర్ కంగారు పడలేదు. బస్సులో ఉన్న వారిని వెనుకవైపునకు వెళ్లమని చెప్పాడు. బస్సు హార్న్ కొట్టడం గానీ, ముందుకు, వెనక్కి పోనివ్వడం గానీ చేయకుండా.. తాను కూడా సీటులోంచి లేచి వెనుకవైపునకు వెళ్లాడు. బస్సుతో తనకు ప్రమాదం లేదని గుర్తించిన ఏనుగు కొంతసేపటికి తన దారిన తాను వెళ్లిపోయింది. ఇదంతా బస్సులోని వ్యక్తి మొబైల్లో రికార్డు చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో పెట్టడంతో వైరల్‌గా మారింది. ప్రమాదకర పరిస్థితిని.. ప్రశాంతమైన ఆలోచనతో ఎదుర్కొన్న డ్రైవర్ సమయస్ఫూర్తిని నెటిజన్లు వేనోళ్ల కొనియాడుతున్నారు. అంతేగాక తమిళనాడు అటవీశాఖ ముఖ్య కార్యదర్శి సుప్రియా సాహు తన ట్విటర్ ఖాతాలో ఈ వీడియో పోస్టు చేశారు. చదవండి: (చేప కోసం వలేస్తే షార్కే పడింది) ‘‘ఆగ్రహంగా ఉన్న ఏనుగు దాడి చేస్తున్నా కంగారు పడకుండా ప్రశాంతంగా ఆలోచించిన డ్రైవర్‌పై ఎనలేని గౌరవం కలిగింది. ప్రయాణికులను బస్సులో వెనక్కి పంపడం ద్వారా వారిని సురక్షితంగా ఉంచారు. అందుకనే చెబుతారు ప్రశాంతంగా ఉంటే అద్భుతాలు చేయవచ్చు అని’’ అంటూ ఆమె ట్విటర్లో కామెంట్ చేశారు. రెండు రోజుల్లోనే ఈ పోస్టును 70 వేల మందికిపైగా వీక్షించారు. పోస్టు చూసిన వారంతా డ్రైవర్ సమయస్ఫూర్తిని మెచ్చుకుంటున్నారు. ‘‘ఇలాంటి విపత్కర పరిస్థితులను ఎదుర్కొనేలా డ్రైవర్లు ఉండాలి. ఇలాంటి డ్రైవర్లు ఉండటం తమిళనాడు ట్రాన్స్‌పోర్టు కార్పొరేషన్‌కు గర్వకారణం’’ అంటూ ఓ నెటిజన్ కామెంట్ చేశారు. చదవండి: (కరోనా పూర్తి నిర్మూలన అసాధ్యం!) Huge respect for the driver of this Government bus in Nilgiris who kept his cool even under the terrifying hits on the bus from an agitated tusker.He helped passengers move back safely, in an incident today morning. Thats why they say a cool mind works wonders VC- by a friend pic.twitter.com/SGb3yqUWqK — Supriya Sahu IAS (@supriyasahuias) September 25, 2021 -
ప్రతి అక్కా, చెల్లెలి రక్షణ బాధ్యతంతా నాదే..
ఇండోర్: సాధారణంగా పబ్లిక్ ట్రాన్స్‌పోర్టు రంగంలో పురుషులే అధికంగా కనిపిస్తారు. అయితే మారుతున్న సమాజంలో మహిళలు కూడా అన్ని రంగాల్లో ప్రవేశిస్తూ దూసుకేళ్తున్నారు. కేవలం పురుషులు మాత్రమే చేయగలరనే చాలా పనులను మహిళలు చేసి చూపుతున్నారు. వాహనాలు నడపటంలో కూడా మేము సైతం అంటున్నారు. తాజాగా రితూ నర్వాల్ అనే మహిళ మధ్యప్రదేశ్ రాష్ట్రంలో మొదటి మహిళా బస్ డ్రైవర్‌గా గుర్తింపు పొందారు. అత్యంత రద్దీగా ఉండే బస్ రాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్(బీఆర్టీఎస్) కారిడార్‌లో గురువారం ఆమె తన మొదటి ట్రిప్‌ను రాజీవ్ గాంధీ స్క్వేర్ నుంచి నిరంజన్పూర్ స్క్వేర్ వరకు బస్ నడిపి ప్రయాణికులను తీసుకువచ్చింది. బస్సుల్లో మహిళలు ఎక్కువగా ప్రయాణించాలని ప్రోత్సహిస్తూ అటల్ ఇండోర్ సిటీ ట్రాన్స్‌పోర్టు సర్వీస్ లిమిటెడ్( ఏఐసీటీఎల్) కొత్తగా ‘పింక్ బస్’ సేవలను ప్రారంభించింది. అందులో భాగంగానే ఇద్దరు మహిళలకు బస్ డ్రైవింగ్ శిక్షణ ఇచ్చారు. శిక్షణ పూర్తి చేసుకున్న నర్వాల్ గురువారం ట్రయల్ రన్లో తొలిసారి బస్‌ను సురక్షితంగా నడిపారు. ఏఐసీటీఎల్ ఇన్ఛార్జ్ సందీప్ సోని మాట్లాడుతూ.. శిక్షణ పూర్తి చేసిన ఇద్దరు మహిళ డైవర్లు సోమవారం నుంచి విధుల్లో చేరనున్నారని తెలిపారు. అన్ని పింక్ బస్సుల్లో డ్రైవర్లు, కండక్టర్లు మహిళలే ఉంటారని పేర్కొన్నారు. పింక్ బస్సులు కేవలం మహిళల కోసం కేటాయించామని, ఇప్పటికే మహిళా కండక్టర్లు ఉన్నారని మరి కొంతమంది మహిళా కండక్టర్ల, డ్రైవర్లను నియమిస్తామని చెప్పారు. అయితే బీఆర్టీఎస్ కారిడార్‌లో రోడ్డు చాలా క్లిష్టంగా ఉంటుందని, అందుకే మహిళా డ్రైవర్లకు ప్రత్యేక శిక్షణ ఇచ్చామని తెలిపారు. నా కల నిజమైంది ‘నేను ఎప్పటికైనా హెవీ మోటర్ వెహికల్ డ్రైవర్ కావాలకున్నా. బస్ లేదా ట్రక్ ఏదైనా నడపాలని కల కన్నాను. ఇప్పుడు నా కల నిజమైంది. నేను 28ఏళ్ల వయస్సులో.. 2015లో ఓ స్కూల్ బస్ నడపడంతో డ్రైవింగ్ మొదలుపెట్టాను’ అని నర్వాల్ తెలిపారు. బస్సులోని ప్రతీ అక్కా, చెల్లెలి రక్షణ తన బాధ్యత అని పేర్కొన్నారు. సొంత వాహనంతో డ్రైవింగ్ నేర్చుకున్నా మరో మహిళా డ్రైవర్ అర్చనా కాటేరా గతంలో మూడేళ్లు ఓ ఫైవ్ స్టార్ హోటల్‌కు డ్రైవర్‌గా పనిచేశారు. ‘నా సొంత వాహనంతో డ్రైవింగ్ నేర్చుకున్నా. మూడే నెలల డ్రైవింగ్ శిక్షణ తర్వాత ఫైవ్ స్టార్ హోటల్‌కు డ్రైవర్‌గా మూడేళ్లపాటు పనిచేశాను. తర్వాత మరో హోటల్‌కి మారాను. కోవిడ్-19 కారణంగా కుటుంబం కోసం ఆ ఉద్యోగం మానేశాను. ప్రస్తుతం నేను పింక్ డ్రైవర్‌గా నియమించబడ్డాను’ అని అర్చనా పేర్కొంది. -
బస్సు ఆపలేదని డ్రైవర్‌ను చితకొట్టాడు..
సాక్షి, డిండి(మహబూబ్‌నగర్) : ఆర్టీసీ బస్సు ఆపలేదని మద్యం మత్తులో ఉన్న ఓ వ్యక్తి డ్రైవర్‌పై దాడి చేసిన ఘటన బుధవారం రాత్రి మండలంలో చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. దేవరకొండ ఆర్టీసీ డిపోకు చెందిన ఏపీ 24 జెడ్ 0011 నంబరు గల బస్సు అచ్చంపేట నుంచి దేవరకొండ వైపు వెళ్తుంది. ఈ క్రమంలో మద్యం మత్తులో ఉన్న మండలంలోని కాటికబండతండాకు చెందిన రాత్లావత్ రమేష్ ఎర్రారం గేటు వద్ద ఆర్టీసీ బస్సు ఆపలేదని ద్విచక్రవాహనంపై వెళ్లి బస్సును ఓవర్టేక్ చేసి డ్రైవర్ కేతావత్ పత్యానాయక్‌పై దాడి చేశాడు. డ్రైవర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ.శోభన్‌బాబు తెలిపారు. -
ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్యాయత్నం
హన్మకొండ: అధికారుల వేధింపులు తట్టుకోలేక ఆ ర్టీసీ వరంగల్–1 డిపోకు చెందిన ఓ డ్రైవర్ ఆత్మహత్యకు యత్నించిన ఘటన ఆలస్యంగా వెలుగు చూ సింది. వరంగల్ 1 ఆర్టీసీ డీపోలో బస్సు డ్రైవర్‌గా విధులు నిర్వర్తిస్తున్న ఓ ఉద్యోగి సెలవులో ఉన్నా రు. అయితే విధులకు హాజరు కావాలని ఫోన్ ద్వా రా అధికారులు బలవంతం చేయడంతో ఒత్తిడి భ రించలేక ఓ సీసాలో పెట్రోల్ తీసుకుని డిపోకు చేరు కున్నాడు. డిపోలో అధికారులు కూడా డ్యూటీ చేయాల్సిందేనని చెప్పడంతో పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు యత్నించాడు. సహోద్యోగులు డ్రైవ ర్‌పై నీళ్లు పోయడంతో పెద్ద ప్రమాదం తప్పింది. డిపో మేనేజర్ భానుకిరణ్ అక్కడకు చేరుకుని ఘటన గురించి ఆరా తీశారు. సమస్యలు తన దృష్టికి తీసుకురావాలని, ఇటువంటి చర్యలకు పాల్ప డవద్దని చెప్పి డ్రైవర్‌ను ఇంటికి పంపించారు. ఆర్టీసీ కార్మికులను హింసకు గురిచేస్తే తిరుగుబాటు తప్పదు: థామస్‌రెడ్డి సుందరయ్య విజ్ఞాన కేంద్రం (హైదరాబాద్): ఆర్టీసీ కార్మికులను హింసకు గురిచేస్తే యాజ మాన్యంపై తిరుగుబాటు తప్పదని ఆర్టీసీ తెలంగాణ మజ్దూర్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.థామస్‌రెడ్డి హెచ్చరించారు. అధికారులు హింసించడం వల్లనే రాణిగంజ్ డిపోకు చెందిన తిరుపతిరెడ్డి ఆత్మహత్య చేసుకున్నాడని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఆర్టీసీ తెలంగాణ మజ్దూర్ యూనియన్ రాష్ట్ర సదస్సు జరిగింది. థామస్‌రెడ్డి మాట్లాడుతూ, ప్రభుత్వ సహకారంతోనే ఆర్టీసీ మనుగడ సాధ్యమవుతుందని, ప్రభుత్వరంగ సంస్థలు నష్టాల్లో ఉంటే ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపైన ఉందన్నారు. కవితక్క నాయకత్వంలోనే తమ యూనియన్ ముందుకు సాగుతుందని, ప్రభుత్వానికి పూర్తిగా సహకరిస్తామని పేర్కొన్నారు. -
బస్సు డ్రైవర్‌గా లంక స్పిన్నర్...
మెల్బోర్న్: సూరజ్ రణ్దీవ్ గుర్తున్నాడా... శ్రీలంక తరఫున ఏడేళ్ల అంతర్జాతీయ కెరీర్లో 12 టెస్టులు, 31 వన్డేలు, 7 టి20 మ్యాచ్‌లు ఆడిన ఆఫ్‌స్పిన్నర్. అతని ప్రదర్శనకంటే ఒకసారి మన సెహ్వాగ్ సెంచరీ పూర్తి చేయకుండా ఉద్దేశపూర్వకంగా ‘నోబాల్’ వేసిన బౌలర్‌గానే భారత అభిమానులకు బాగా తెలుసు. రెండేళ్ల క్రితం స్వదేశంలో చివరి ఫస్ట్ క్లాస్ మ్యాచ్ ఆడిన అతను ఉపాధిని వెతుక్కుంటూ ఆస్ట్రేలియాకు చేరుకున్నాడు. మెల్బోర్న్లో స్థానిక క్లబ్‌లలో క్రికెట్ ఆడుతున్నా... సంపాదన కోసం అతను మరో ఉద్యోగాన్ని చూసుకోక తప్పలేదు. దాంతో రణ్దీవ్ అక్కడ బస్సు డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. ఫ్రాన్స్ కంపెనీ ‘ట్రాన్స్‌డెవ్’ నిర్వహణలో నడుస్తున్న ప్రజా రవాణా బస్సులో అతను డ్రైవర్‌గా ఉన్నాడు. కొన్ని చిన్నస్థాయి క్రికెట్ దేశాల్లో ఆదాయం కోసం ఇతర పనులు చేయడం సాధారణమే అయినా... ఒక ఆసియా జట్టుకు అంతర్జాతీయ స్థాయిలో ఆడిన క్రికెటర్ చిరుద్యోగం చేయడం మాత్రం పెద్దగా కనిపించదు. 2011 ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున రణ్దీవ్ 8 మ్యాచ్‌లు ఆడి ఆకట్టుకునే ప్రదర్శనే (7.68 ఎకానమీ) కనబర్చాడు. లంక తరఫున రణ్దీవ్ 2016లో చివరి మ్యాచ్ ఆడాడు. అతనితోపాటు మరో ఇద్దరు క్రికెటర్లు చింతక జయసింఘే (శ్రీలంక–5 టి20లు), వాడింగ్టన్ వయెంగా (జింబాబ్వే–1 టెస్టు, 3 వన్డేలు) కూడా ఇదే కంపెనీలో డ్రైవర్లుగా పని చేస్తున్నారు. ఇక్కడ చదవండి: ‘అస్సలు నమ్మలేకపోతున్నా.. గర్వపడేలా చేశాడు’ -
ఎక్స్‌లేటర్‌పై కాలుతీసి బ్రేక్‌పై మోపడంతో...
ఆదోని టౌన్: ఓ ఆర్టీసీ బస్సు డ్రైవర్ సమయస్ఫూర్తిగా వ్యవహరించడంతో ప్రయాణికులకు పెద్ద ప్రమాదం తప్పింది. కర్నూలు జిల్లా ఆదోని బస్టాండు నుంచి శనివారం ఉదయం 25 మందితో ఆర్టీసీ ఆర్డినరీ బస్సు మేళిగనూరుకు బయలు దేరింది. కుప్పగల్ సమీపంలోకి రాగానే ఒక్కసారిగా బస్సు కుదుపునకు గురైంది. అప్రమత్తమైన కండక్టర్ లక్ష్మన్న.. డ్రైవర్ బసయ్య వైపు చూశారు. ఆయన డ్రైవింగ్ సీట్లోనే కుప్పకూలడం గమనించారు. గట్టిగా కేకలు వేస్తూ డ్రైవర్‌ను అలర్ట్ చేయడానికి ప్రయత్నించారు. ఇంతలోనే ప్రయాణికులు కూడా డ్రైవర్ చెంతకు చేరుకుని కేకలు వేశారు. ప్రమాదాన్ని గుర్తించిన డ్రైవర్ సమయస్ఫూర్తితో వ్యవహరించి ఎక్స్‌లేటర్‌పై కాలుతీసి బ్రేక్‌పై మోపాడు. బస్సు కొంతదూరం వెళ్లి ఆగిపోయింది. కండక్టర్ వెంటనే 108కు సమాచారమిచ్చి డ్రైవర్‌ను ఆదోని ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తరలించారు. బీపీ పెరగడంతో అస్వస్థతకు గురైనట్లు గుర్తించిన వైద్యులు ఆయనకు చికిత్స చేశారు. -
ఎంజీబీఎస్‌లో డ్రైవర్ నిర్లక్ష్యం, చిన్నారి మృతి
అఫ్జల్‌గంజ్: అప్పటి వరకూ ఆ చిన్నారి తన కుటుంబ సభ్యులతో కలిసి ఆర్టీసీ బస్సులో పయనించాడు. ఆ పయనమే అతనికి మృత్యు గమనమైంది. బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం ముక్కుపచ్చలారని బాలుడి ప్రాణాన్ని బలి తీసుకుంది. కుటుంబ సభ్యుల్ని తీవ్ర శోకంలో ముంచివేసింది. ఈ విషాదకర ఘటన ఆదివారం అఫ్జల్‌గంజ్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని మహాత్మాగాంధీ బస్‌స్టేషన్‌లో చోటుచేసుకుంది. పోలీసులు, ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం.. నగరంలోని రాజేంద్రనగర్ ప్రాంతానికి చెందిన మహ్మద్ ఖలీల్‌కు కుమారుడు మహ్మద్ అహాన్ (3), ఓ కూతురు ఉన్నారు. మూడ్రోజుల క్రితం చిన్నారుల అమ్మమ్మ ఊరైన నిజామాబాద్‌కు కుటుంబ సభ్యులతో వెళ్లారు. తిరిగి ఆదివారం ఉదయం నిజామాబాద్ నుంచి ఆర్టీసీ బస్సులో నగరానికి బయలుదేరారు. మధ్యాహ్నం 2 గంటలకు ఎంజీబీఎస్‌కు చేరుకున్నారు. ప్లాట్‌ఫాం నంబర్ 74 వద్ద బస్సు దిగారు. కుటుంబ సభ్యులతో కలిసి మూడేళ్ల బాలుడు మహ్మద్ అహాన్ నడుచుకుంటూ వస్తున్నాడు. ఈ క్రమంలో ఇదే బస్సును డ్రైవర్ నిర్లక్ష్యంగా వెనక్కు తిప్పాడు. బస్సు గమనాన్ని గమనించని అహాన్ దాని చక్రాల కింద నలిగిపోయి అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. అల్లారుముద్దుగా పెంచుకుంటున్న కుమారుడు తమ కళ్లముందే అసువులు బాయడంతో ఆ కుటుంబం కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది. చదవండి: చెన్నైలో కిడ్నాప్.. ముంబైలో సజీవదహనం -
‘ఆమె’ డ్రైవర్
జమ్మూ – కథువా – పఠాన్‌కోట్ రహదారి పెద్ద పెద్ద ట్రక్కులు, వాహనాలతో బిజీగా ఉంటుంది. అలాంటి రహదారి మీద కథువా నుండి జమ్మూ వెళ్లే ప్రైవేట్ బస్సులో ఉన్న ప్రయాణికులు మొదట ఆశ్చర్యపోయారు బస్సు డ్రైవర్ని చూసి. తర్వాత సందేహించారు. కారణం ‘ఆమె’ బస్సు నడపగలదా? అని. తర్వాత తమ ప్రయాణానికి ఢోకా లేదని నిశ్చింతంగా కూర్చున్నారు. బస్సు గమ్యస్థానానికి చేరింది. ప్రయాణికులు ఒక్కొక్కరుగా దిగుతూ బస్సు డ్రైవర్‌కి అభినందనలు తెలిపారు. ఆ బస్సు డ్రైవరు పేరు పూజా దేవి. జమ్మూ కాశ్మీర్లో మొదటిసారి బస్సు నడిపిన మహిళగా పేరుపొంది పూజాదేవి. కతువా జిల్లాలోని సంధర్–భష్లో అనే మారుమూల గ్రామానికి చెందిన పూజాదేవికి డ్రైవింగ్ అంటే చాలా ఇష్టం. టీనేజ్ నుంచి కార్లు, మోటార్ సైకిళ్లు డ్రైవ్ చేస్తుండేది. ఆ వయసు నుంచే పెద్ద పెద్ద వాహనాలను నడపాలనుకునేది. పూజాదేవి తాను చేస్తున్న పని గురించి వివరిస్తూ ‘నా కుటుంబం మొదట్లో నాకు మద్దతు ఇవ్వలేదు. కానీ, నాకు వేరే ఉద్యోగం ఎంచుకునేంత పెద్ద చదువు లేదు. నాకు డ్రైవింగ్ పని వచ్చు. కుటుంబ పోషణకు డబ్బు కావాలి. నాకు వచ్చిన పని నుంచే ఉపాధి పొందవచ్చు కదా అనుకున్నాను. అందుకు ఇంట్లో వాళ్లు ఆడవాళ్లు అంత పెద్ద పెద్ద వాహనాలను ఎలా నడపగలరు. శక్తి సరిపోదు అన్నారు. కానీ, నేను వారి మాటలను పట్టించుకోలేదు. కమర్షియల్ వెహికిల్స్‌ను ఎలా నడపాలో తెలుసుకోవడానికి ఇప్పటి వరకు టాక్సీ నడుపుతున్నాను. కతువా నుండి జమ్మూ వరకు ట్రక్కు కూడా నడిపాను. ఈ వారమే ప్రైవేట్ బస్సు డ్రైవర్‌గా ఉద్యోగంలో చేరాను. ఇప్పుడిలా ప్రయాణికులను చేరవేసే బస్సు నడపడంతో ఎప్పటి నుంచో నాకున్న కల నెరవేరింది’ అని సంతోషం వెలిబుచ్చిన పూజను కలిస్తే ఎవ్వరైనా అభినందించకుండా ఉండలేం. పురుషులు మాత్రమే ప్రయాణికుల బస్సులను నడపగలరనే మూసను ముక్కలు చేయాలనుకున్న విషయాన్నీ పూజ ప్రస్తావిస్తారు. డ్రైవింగ్ ద్వారా ఉపాధి పొందాలని కోరుకునే మహిళలకు వారి కుటుంబాలు మద్దతు ఇవ్వాలని చెబుతుంది పూజ జమ్మూ కథువా పఠా¯Œ కోట్ రహదారి భారీ ట్రాఫిక్‌తో ఉంటుంది. ఇతర పురుష డ్రైవర్లు సైతం రాకపోకలు సాగించడం కష్టంగా ఉండి, సరిగ్గా విధులకు హాజరు కాకపోడంతో, ఈ ఉద్యోగం పూజకు ఇచ్చారు. తన శక్తిని నమ్మి డ్రైవింగ్ ఉద్యోగం ఇచ్చిన బస్సు యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలుపుతుంది పూజ. -
అర్థరాత్రి ఆర్టీసీ బస్సు విచిత్రం: వీడియో వైరల్
సాక్షి, నెల్లూరు : జిల్లాలో మంగళవారం విచిత్రం చోటుచేసుకుంది. డ్రైవర్ లేకుండా ఆర్టీసీ బస్సు ముందుకెళ్లింది. ఈ ఘటన రాపూరు డిపోలో జరిగింది. నెల్లూరు టూ రాజపేట సర్వీస్ బస్సును డ్రైవర్ సోమవారం రాత్రి డిపోలో పార్క్ చేశాడు. ఈ క్రమంలో తెల్లవారు జామున 3 గంటటకు దానంతట అదే ఇంజిన్ స్టార్ట్ అయ్యి బస్సు 100 మీటర్లు ముందుకెళ్లింది. అంతేగాక బస్సు స్టాప్ వద్ద కూడా ఆగకుండా రెండు మెట్లు ఎక్కి పోల్‌ను ఢీకొట్టి ఆగింది. అయితే ఇంజిన్ వైరింగ్ టచ్ వల్ల బస్సు స్టార్ట్ అయి ఉండవచ్చని సిబ్బంది భావిస్తున్నారు. కాగా బస్సు ముందుకెళ్లిన దృశ్యాలు సీసీ టీవీ ఫుటేజీలో రికార్డయ్యాయి. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. -
వైరల్‌గా మారిన బస్ డ్రైవర్ ఫొటో.. ఎందుకంటే?..
జమ్మూకశ్మీర్ : ఓ మహిళా బస్ డ్రైవర్‌కు సంబంధించిన ఫొటో ఒకటి నెట్టింట్ చక్కర్లు కొడుతోంది. కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ షేర్ చేసిన ఆ ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక్కడ విశేషం ఏమిటంటే జమ్మూకశ్మీర్‌లోని కథువా జిల్లాకు చెందిన పూజా దేవీ అనే మహిళ మొదటి మహిళా బస్ డ్రైవర్ కావడం. ‘‘జమ్మూకశ్మీర్ మొదటి మహిళా బస్ డ్రైవర్ పూజా దేవి. నువ్వు కధువా జిల్లాకు చెందినదానివైనందుకు గర్వంగా ఉంది’’ అని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ అన్నారు. ( వెలుగులోకి వేల ఏళ్ల నాటి ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు ) డ్రైవర్ సీట్లో కూర్చున్న ఆమె విక్టరీ సంకేతం చూపిస్తున్న ఫొటో డిసెంబర్ 25న షేర్ అవ్వగా ఇప్పటి వరకు 4,500 లైకులు సొంతం చేసుకుంది. దీనిపై స్పందిస్తున్న నెటిజన్లు.. ‘‘ ఓ గొప్ప ప్రారంభం.. మహిళలు అన్ని రంగాల్లో ముందుకు దూసుకెళ్తున్నారు... ఓ మహిళ తలుచుకుంటే ఏదైనా సాధించగలదు, దేశాన్ని కూడా పాలించగలదు... ఇతర మహిళలకు మీరు స్పూర్తిగా నిలుస్తున్నారు.’’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. (భార్యకు చిరకాలం గుర్తుండిపోయే గిఫ్ట్) -
డ్రైవర్ సమయస్పూర్తి: ప్రాణాలు పోతున్నా..
సాక్షి, కృష్ణా : గుండెపోటు కారణంగా ప్రాణాలు పోతున్నా సమయస్పూర్తిగా వ్యవహరించి ప్రయాణికుల ప్రాణాలు కాపాడాడు ఓ బస్సు డ్రైవర్. ఈ సంఘటన ఆదివారం జిల్లాలోని జి. కొండూరు మండలంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. గంపలగూడెం మండలం పెనుగోలుకు చెందిన కృష్ణారావు అనే డ్రైవర్ నడుపుతున్న ఆర్టీసి బస్సు తిరువూరు నుంచి విజయవాడ బయలుదేరింది. జి. కొండూరు మండలం లక్కిరెడ్డి సమీపంలోకి రాగానే డ్రైవర్‌కు గుండెపోటు వచ్చింది. ( పేర్నినానిపై హత్యాయత్నం: కొత్త కోణం..) అయితే నొప్పి ప్రాణాలు తీస్తున్నప్పటికి స్టీరింగ్‌ను వదలక, సమయస్పూర్తితో బస్సును పక్కకు నిలిపాడు. దీంతో పెను ప్రమాదం తప్పింది. అయితే డ్రైవర్ కృష్ణారావు బస్సులోనే ప్రాణాలు విడిచాడు. మృతదేహాన్ని పోలీసులు మైలవరం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. -
రోడ్డు మీద వరి పండించాడు
సాక్షి, తిరువనంతపురం: రహదారికి ఇరువైపులా అశోకుడు చెట్లు నాటించాడని చదివాం.కాని ఈ ఉద్యోగం లేని బస్ డ్రైవర్ రోడ్డు పక్కన కొద్దిపాటి స్థలంలో తోట పెంచుతున్నాడు. వరిని కూడా పండిస్తున్నాడు. ఈ తోటలోని వస్తువులు ఊరి వారికి ఉచితం. త్రిచూర్‌కు గంట దూరంలోని పెరిన్‌జనమ్ అనే పల్లెలో అనిల్ కుమార్ అనే వ్యక్తి సాధించిన పచ్చదనం ఇది.అనిల్ కుమార్ అంటే ఊళ్లో అందరికీ గౌరవం. అతని గురించి వింటే మనకూ గౌరవం కలుగుతుంది. కేరళలోని త్రిచూర్‌కు దగ్గరగా ఉండే ‘పెరిన్‌జనమ్’ అనే పల్లె అతనిది. ప్రయివేట్ ట్రాన్స్‌పోర్ట్‌లో బస్ డ్రైవర్‌గా పని చేసేవాడు. అతనికి ఊళ్లో వ్యవసాయానికి బెత్తెడు స్థలం కూడా లేదు. అతను సంప్రదాయ రైతు కూడా కాదు. కాని నేలంటే విపరీతమైన ప్రీతి. ఒక మొక్కకు ప్రాణం పోయడం అంటే అమిత ఇష్టం. ఊళ్లో రోడ్డుకు ఇరువైపులా ఒక గజం మేర వెడల్పుతో మట్టి మార్జిన్ ఉంది. ఇలాంటి మార్జిన్ ప్రతి ఊళ్లో ప్రతి రోడ్డుకూ ఉంటుంది. ఆ మార్జిన్ నేల చాలు తనకు అనుకున్నాడు అనిల్ కుమార్. ఆ నేలలో మెల్లగా కూరగాయ మొక్కలు పెంచడం మొదలెట్టాడు. ఊరి పంచాయతీ ఇది గమనించింది. ‘రోడ్డు రాకపోకలకు అంతరాయం కలిగించను. ఈ కాయగూరలు నేను అమ్ముకొని తినను’ అని అన్నాడు. పంచాయతీ అంగీకరించింది. ఇక అనిల్ కుమార్ పని మొదలయ్యింది. డ్యూటీ లేనప్పుడల్లా రోడ్డుకు ఇరువైపులా అన్ని రకాల కాయగూరలూ సాగు చేశాడు. కొన్ని మొక్కలు ప్రభుత్వం వారి నుంచి తెచ్చుకున్నాడు. కొన్నిమొక్కలు గ్రామస్తులే ఇచ్చారు. విత్తనాలు కూడా ఇచ్చారు. చెట్లు ఏపుగా పెరిగాయి. కాయలు కాశాయి. ‘మేం కోసుకోవచ్చా’ అని ఊరివాళ్లు అడిగితే ‘నన్ను అడిగే పనే లేదు’ అని జవాబు చెప్పాడు. ఒక అందమైన తోటే రోడ్డు పక్కన వెలియడం అందరికీ ఆశ్చర్యం. సంతోషం. అనిల్ కుమార్ మీద గౌరవం అలా పెరిగింది. అంతే కాదు... ఆ గజం స్థలంలోనే గ్రామస్తులు వద్దని వారిస్తున్నా, ఓడిపోతావ్ అని హెచ్చరిస్తున్నా వరి వేసి ఆశ్చర్యపరిచాడు. వరి ఆ జానాబెత్తెడు స్థలంలోనే విరగపండింది. లాక్డౌన్ తర్వాత అనిల్ కు ఉద్యోగం పోయింది. అయినా సరే ఈ తోట మీద బతికే పని పెట్టుకోలేదు. ‘ఊరి స్థలం ఇది. దాని మీద వచ్చేది ఊరికే’ అంటాడు. అప్పుడప్పుడు అతడు కొన్ని కాయగూరలను కోసి ఇంటికి తీసుకెళ్లాడు నిజమే కాని ‘అలా కోయకపోతే అవి పాడవుతాయి... మొక్కల్ని పాడు చేస్తాయి’ అని జవాబు చెబుతాడు. ‘ఇలా ప్రతి ఊళ్లో చేయవచ్చు. ఆ సందేశం అందించడానికే ఈ పని చేస్తున్నాను’ అంటాడు అనిల్. కూరగాయల మధ్య మధ్య అతడు పూల మొక్కలను పెంచాడు. పూలు విరబూసి ఆ దారంతా ఎంతో అందంగా ఉంటుంది. అందమైన పనులు చేసే కొందరు మనుషులను చూసి మిగిలిన అందరినీ ఈ ధరిత్రి మోస్తూ ఉంటుంది. -
మాస్క్ పెట్టుకోమన్నందుకు ప్రాణం తీశారు
బయోన్నె : బస్సులో ఎక్కిన ప్రయాణికులకు మాస్క్ పెట్టుకోవాలని సూచించిన బస్ డ్రైవర్‌ను ఇష్టం వచ్చినట్లుగా చితకబాదారు. గాయపడిన ఆ వ్యక్తి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం కన్నుమూశాడు. తమ మంచి కోసం చెప్పినా అర్థం చేసుకోకుండా ఒక మనిషి నిండు ప్రాణం అన్యాయంగా తీసిన ఘటన ప్రాన్స్‌లో చోటుచేసుకుంది. వివరాలు.. 59 ఏళ్ల ఫిలిప్పే మంగీల్లాట్ వృత్తి రిత్యా బస్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఫ్రాన్స్‌లోని బయోన్నెకు బస్ నడుపుతుంటాడు. ఈ సందర్భంగా వారం కిందట ఫిలిప్పే నడుపుతున్న బస్సులోకి ముగ్గురు వ్యక్తులు ఎక్కారు. అయితే ముగ్గురు మాస్కులు ధరించకపోవడంతో వెంటనే మాస్కులు ధరించాల్సిందిగా ఫిలిప్పే తెలిపాడు. మీరు మాస్కు ధరించకపోతే బస్సు ముందుకు కదలదని, ఇక్కడే దింపేస్తానని పేర్కొన్నాడు. దీంతో ఆగ్రహించిన ముగ్గురు వ్యక్తులు ఫిలిప్పేపై ఇనుపరాడ్‌తో విచక్షణారహితంగా కొట్టారు. తలకు బలమైన గాయం కావడంతో అపస్మారక స్థితిలోకి వెళ్లిన ఫిలిప్పేను అక్కడే వదిలేసి ఆ ముగ్గురు పరారయ్యారు.(గొంతు కోసి.. అడవిలో వదిలేసి) సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ఫిలిప్పేను ఆసుపత్రికి తరలించారు. పోలీసులు ఈ విషయాన్ని అతని కుటుంబసభ్యులకు చేరవేశారు. కాగా చికిత్స పొందుతున్న ఫిలిప్పేకు తలకు బలమైన గాయం కావడంతో బ్రెయిన్ డెడ్ అయిందని డాక్ఠర్లు పేర్కొన్నారు. శుక్రవారం కుటుంబసభ్యుల అనుమతితో ఫిలప్పేకు వెంటిలేటర్ తొలగించిన కాసేపటికే మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. ఫిలిప్పేపై విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డ ముగ్గురు వ్యక్తులపై మర్డర్ కేసు కింద కేసు నమోదు చేశామని, వారి కోసం గాలిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. -
ఇంతకీ ఎవరీ కల్పన?
కోల్‌కతాలో బస్సు నడపడం అంత తేలికైన పనికాదు. ఇరుకైన రోడ్లు, ట్రాఫిక్, రద్దీగా ఉండే నివాస–మార్కెట్ ప్రాంతాలు.. ప్రతి ట్రిప్‌ని కష్టంగా మారుస్తాయి. అయినా సరే ఆ వీధుల్లో పీ.. పీ.. పీ.. అని హారన్ కొడుతూ ఒడుపుగా స్టీరింగ్ తిప్పుతూ బస్సు నడుపుతోంది బక్కపల్చగా ఉన్న ఓ యువతి. ఆమె పేరు కల్పనా మొండల్. వయసు 21. ఆమెను చూసిన ప్రయాణికులు ఒక మహిళ అయి ఉండి బస్సు ఎలా నడిపిస్తుంది అని ఆసక్తిగా తెలుసుకునే ప్రయత్నం చేస్తుంటారు. ఇంతకీ ఎవరీ కల్పన? ఆమె ఎందుకు బస్సు నడిపిస్తోంది? కల్పనా మొండల్ గురించి మనకు పెద్దగా తెలియదు. కానీ, సోషల్ మీడియాలో బాగా ప్రాచుర్యం పొందిన బస్సు డ్రైవర్. కోల్‌కతా శివారులోని నోసారిలో కల్పన కుటుంబం ఉంది. ఆర్థిక పరిస్థితుల కారణంగా తను చదువుకోలేదు. కుటుంబంలో నలుగురు సభ్యులు. అక్క, తల్లి, తండ్రి, తను. అందరూ ఇంటిలాంటి ఒక గదిలో ఉంటున్నారు. కల్పన తండ్రి సుభాష్ ప్రైవేట్ బస్సు డ్రైవర్‌గా పని చేసేవాడు. చిన్నప్పుడు తండ్రికి సాయంగా ఉండటానికి తరచూ కల్పన కూడా బస్సులో వెళ్లేది. తండ్రి రోజుకు రెండు రూపాయలు ఇచ్చేవాడు. ఆ డబ్బులతో కల్పన మిఠాయి కొనుక్కొనేది. బస్సు డ్రైవింగ్ చేయగా వచ్చే తండ్రి ఆదాయంతోనే నడిచే ఆ కుటుంబం ఓ రోజు పెద్ద కుదుపుకు లోనయ్యింది. తండ్రికి ధైర్యం చెప్పి.. రెండేళ్ల క్రితం కల్పన తండ్రి ప్రమాదానికి గురయ్యాడు. ఆ ప్రమాదంలో రెండు కాళ్లకు ఆపరేషన్ అయ్యి మెటల్ ప్లేట్స్ వేశారు. కుటుంబం గడిచే పరిస్థితి లేక కల్పన తనే కుటుంబాన్ని పోషించాలని నిర్ణయించుకుంది. ‘డ్రైవింగ్ నేర్చుకొని ముందు కాలనీలోనే ట్రక్కులు నడిపేది. గోడౌన్లకు లోడు చేర్చేది. మేజర్ అయిన తర్వాత లైసెన్స్ తీసుకొని బస్సు నడపడం నేర్చుకుంది. నాకు వెన్నుదన్నుగా నిలిచింది’ అంటూ కూతురు గురించి గొప్పగా ఉత్సాహంగా చెబుతూ ఉంటాడు సుభాష్, ‘ఆపరేషన్ అయ్యాక మేటల్ ప్లేట్స్ కారణంగా నా కాళ్లను వంచలేకపోయాను. దీంతో మానసికంగా చాలా కృంగిపోయాను. అలాంటి సమయంలో నా కూతురు కల్పన హామీ ఇచ్చింది నేను కుటుంబాన్ని నడుపుతాను అని. అప్పటికే చుట్టుపక్కల కాలనీలలో రాత్రిపూట కొన్నాళ్లపాటు డ్రైవింగ్ నేర్చుకుంటూ ప్రయత్నించింది. బాగా నేర్చుకున్నప్పటికీ 34సి మార్గంలో (ఎస్ప్లానేడ్–బరానగర్) బస్సు యజమాని కల్పనకు బస్సు ఇవ్వడానికి అంగీకరించలేదు. ఎందుకంటే అది చాలా రద్దీ రూటు. వాళ్లు అంగీకరించేవరకు ప్రయత్నించి సాధించింది. అప్పుడు తిరస్కరించినవాళ్ల బస్సునే ఆమె ఇప్పుడు చాకచక్యంగా నడపడం చూస్తుంటే నాకు గర్వంగా ఉంది. కుటుంబ శ్రేయస్సు కోసం తన భవిష్యత్తు త్యాగం చే సింది నా తల్లి కల్పన’ అంటూ కూతురి గొప్పతనం చెబుతాడు సుభాష్. తల్లి మంగళ మాట్లాడుతూ –‘మొదట్లో తండ్రి (సుభాష్) కల్పన వెనకాల కూర్చొని సూచనలు ఇస్తూ ఉండేవాడు. కానీ, ఎప్పుడూ తన చేతిని పట్టుకొని నేర్పలేదు’ అంటారు ఆమె. పోలీసులు సెల్ఫీలు తీసుకుంటారు! ఇక కల్పన మాట్లాడుతూ ‘ట్రాఫిక్ పోలీసులు నన్ను రద్దీ దారుల్లో నడపమని ప్రోత్సహిస్తుం టారు. ఇంకొంతమంది నాతో సెల్ఫీలు దిగి ఆసక్తిగా నా గురించి అడుగుతుంటారు’ అంటుంది. అంతేకాదు, ఇప్పుడామెకు డ్రైవింగ్ స్కూల్ పెట్టుకోవడానికి కూడా అనుమతి వచ్చింది. ‘‘ప్రయాణీకులు కొందరు బస్సు ఎక్కినప్పుడు ముందు నన్ను చూడరు. కానీ, ఆ తర్వాత నేను ఓ మహిళనని గమనించి ఆసక్తిగా చూస్తూ ఉండటాన్ని నేను నా డ్రైవింగ్ సీట్ నుంచే అద్దంలో చూసి తెలుసుకుంటుంటాను’ సంబరంగా చెబుతుంది కల్పన. కనీసం పదోతరగతి కూడా పాస్‌కాని కల్పన ఇప్పుడు ప్రైవేట్‌గా చదువుకొని పదవ తరగతి పరీక్షలు రాయాలనుకుంటోంది. ‘అప్పుడైతే ప్రభుత్వంలో డ్రైవర్ పోస్ట్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. నా తండ్రి కలనే నేను నెరవేర్చాలనుకుంటున్నాను’ అని ఉత్సాహంగా చెబుతుండటం చూస్తుంటే ముచ్చటేస్తుంది. కుటుంబానికి కష్టం వస్తే పెద్దవాళ్లు చూసుకుంటారులే అనుకోకుండా తానే కుటుంబానికి అండగా నిలబడ్డ కల్పన తన తోటి అమ్మాయిలకే కాదు, యువకులకూ రోల్‌మోడల్. – నిర్మలారెడ్డి చిలకమర్రి -
పాప కోసం బస్సు డ్రైవర్ డ్యాన్స్
-
ఇది కదా మాకు కావాల్సింది!
గమ్యస్థలం రాగానే బస్సును ఆపేశాడు డ్రైవర్. ప్రయాణికులందరూ దిగుతుండగా ఓ చిన్నారి మాత్రం నేరుగా అతని దగ్గరకు వెళ్లి ముచ్చటించింది. అప్పటికే అతను మరో ట్రిప్పు వేయడం కోసం సిద్ధం కావాల్సి ఉంది. కానీ అతను ఎలాంటి చిరాకు ప్రదర్శించకుండా ఆమెతో ముచ్చట్లాడాడు. ఇక పాప తనకు ‘షేక్ ఇట్ ఆఫ్’ పాటంటే ఎంతో ఇష్టమని చెప్పింది. వెంటనే ఆయన అవునా! అయితే మనిద్దరం ఇప్పుడా పాటకు డ్యాన్స్ చేద్దాం అంటూ స్టెప్పులేయం ప్రారంభించాడు. దీంతొ ఆ చిన్నారి సంతోషంతో గెంతులు వేస్తూ పాటకు తగ్గట్టుగా కాలు కదిపింది. ఇక బస్సు డ్రైవర్ సీటు బెల్టు కూడా తీయకుండా కూర్చున్న సీటులో నుంచే డ్యాన్స్ చేయడం అందరినీ ఆకట్టుకుంది.(వైరల్: చావు అంచుల దాక వెళ్లి..) ఇదంతా 2018 నాటి సంగతి కాగా దీనికి సంబంధించిన వీడియోను 11 మిలియన్ల మందికి పైగా వీక్షించారు. తాజాగా రెక్స్ చాప్మన్ అనే వ్యక్తి ఈ వీడియోను తిరిగి పోస్ట్ చేశాడు. కొద్ది గంటల్లోనే దీన్ని వీక్షించిన వారి సంఖ్య 8 మిలియన్ల మార్క్‌ను దాటి ట్రెండింగ్‌లో నిలిచింది. దీనిపై నెటిజన్లు పలురకాలుగా స్పందిస్తున్నారు. ‘నాకంటే బాగా డ్యాన్స్ చేశాడు, సీటుబెల్టు ధరించి కూర్చున్న చోట నుంచే ఆడిపాడాడు’, ‘బెస్ట్ చెయిర్ డ్యాన్సింగ్ అవార్డు ఇవ్వాలి’ అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. ‘ఇలాంటి ప్రేమే కావాలి, ప్రపంచమంతా దానితో నిండిపోవాలి’, ‘ఇది కదా మాక్కావాల్సింది..’ అంటూ కొంతమంది మీమ్స్ ద్వారా రిప్లై ఇస్తున్నారు. (తిన్నాక తెలిస్తే వాంతి చేసుకుంటారు!) -
డ్రైవర్‌గా ఎమ్మెల్యే.. కండక్టర్‌గా ఎంపీ
మహబూబాబాద్ అర్బన్ : మహబూబాబాద్ ఎమ్మెల్యే బానోతు శంకర్‌నాయక్ ఆర్టీసీ డ్రైవర్ అవతారమెత్తారు. స్థానిక ఆర్టీసీ డిపోలో ఆదివారం ఎంపీ మాలోతు కవిత, ఎమ్మెల్యే శంకర్‌నాయక్ కలసి మేడా రం శ్రీసమ్మక్క–సారలమ్మ జాతరకు బస్సు సర్వీసులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శంకర్‌నాయక్ బస్సును బస్టాండ్ ఆవరణలో కొద్దిదూరం నడిపారు. ఎంపీ మాలోతు కవిత టికెట్లు ఇచ్చి ప్రయాణికులను ఉత్సాహపరిచారు. మేడారానికి వెళ్లే ప్రతీ భక్తుడు ఆర్టీసీ బస్సులో ప్రయాణించి సురక్షితంగా అమ్మవార్లను దర్శించుకోవాలని ఎంపీ, ఎమ్మెల్యే ఆకాంక్షించారు. -
ఆర్టీసీ బస్సు కలకలం
ప్రయాణికులతో బయల్దేరిన ఆర్టీసీ బస్సు ఉన్నపళంగా అదుపుతప్పింది. రోడ్డు పక్కన ఆపిన ఆటోను, పక్కనే నిల్చొని మాట్లాడుతున్న ఇద్దరు వ్యక్తులను ఢీకొట్టడంతో వారు ఎగిరి సమీపంలోని గుంతలో పడ్డారు. ఆ ఇద్దరు వ్యక్తులు స్వల్పగాయాలతో బయటపడ్డారు. డ్రైవర్ ప్రవర్తనలో తేడా ఉండటంతో బెంబేలెత్తిపోయిన కండక్టర్, ప్రయాణికులు వారించి.. కిందకు దిగేశారు. అనంతరం ఖాళీ బస్సును డ్రైవర్ అలాగే ముందుకు పోనిచ్చి ఆగి ఉన్న లారీని వెనుకనుంచి ఢీకొట్టాడు. గుంతకల్లు రూరల్: గుంతకల్లు ఆర్టీసీ బస్టాండ్ నుంచి శుక్రవారం ఉదయం 19 మంది ప్రయాణికులతో బస్సు బయల్దేరింది. పట్టణ శివారులోని ఇండస్ట్రియల్ ఏరియా వద్ద రోడ్డు పక్కన నిలిపి ఉన్న ఆటోను ఢీకొట్టింది. పక్కనే నిలబడి స్థలాలను పరిశీలిస్తున్న రవీంద్ర, ఎర్రిస్వామి అనే ఇద్దరు వ్యక్తులు ఆటోతో పాటు ఎగిరిపోయి గుంతలో పడిపోయారు. అయితే వారు స్వల్పగాయాలతో బయటపడగా.. ఆటో మాత్రం పూర్తిగా ధ్వంసమైంది. డ్రైవర్ ఎం.ఎం.బేజ్ బస్సును నిలపకుండా ముందుకుపోనిచ్చాడు. గాయపడిన వారి వెంట వచ్చిన మరో వ్యక్తి బస్సును ఆపేందుకు బైక్‌పై వెంబడించాడు. దీన్ని గమనించిన డ్రైవర్ ఆ వ్యక్తిపైకి కూడా దూసుకుపోయేలా నడిపాడు. దీంతో ఫాలో అవుతున్న వ్యక్తి ఆగిపోయాడు. బెంబేలెత్తిన ప్రయాణికులు డ్రైవర్ ప్రవర్తనతో ప్రయాణికులు బెంబేల్తిపోయారు. కండక్టర్ కుళ్లాయప్పతో పాటు ప్రయాణికులు డ్రైవర్‌ను వారించి బస్సు ఆపి కిందకు దిగిపోయారు. బస్సును పక్కన నిలిపివేయాలని కండక్టర్ సూచించినా డ్రైవర్ వినకుండా ముందుకు దూసుకుపోయాడు. అలా వెళ్తూ మండల పరిధిలోని తిమ్మాపురం సమీపంలో రోడ్డు పక్కన నిలిపి ఉన్న లారీని వెనకనుంచి వేగంగా ఢీకొట్టాడు. దీంతో బస్సు ముందు భాగం పూర్తిగా దెబ్బతింది. బీపీ పెరిగి.. స్టీరింగ్పైఅదుపుతప్పి.. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న రూరల్ ఎస్ఐ వలిబాషా వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. డ్రైవర్ ఎం.ఎం. బేజ్‌ను అదుపులోకి తీసుకొని గుంతకల్లు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. బీపీ 190కి పెరిగిపోవడం, మెదడు నియంత్రణ కోల్పోవడంతో డ్రైవర్ ఆ విధంగా ప్రవర్తించాడని, మద్యం తాగలేదని ఎస్ఐ స్పష్టం చేశారు. హైబీపీ కారణంగా డ్రైవర్‌కు పక్షవాతం వచ్చే ప్రమాదం ఉన్నట్లు వైద్యులు తెలిపారు. దీంతో వైద్యుల సూచన మేరకు అనంతపురం పంపినట్లు చెప్పారు. -
తాత్కాలిక డ్రైవర్‌కు ఫిట్స్
సాక్షి, నిజామాబాద్: నిజామాబాద్ నుంచి కోరుట్ల వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సును నడుపుతున్న తాత్కాలిక డ్రైవర్‌కు దాస్‌నగర్ గ్రామశివారులో ఫిట్స్ రావడంతో బస్సు రోడ్డు పక్కన ఉన్న పొలాల్లోకి దూసుకెళ్లింది. అయితే ప్రయాణికులకు ఎలాంటి ప్రమాదం జరుగలేదు. శుక్రవారం కోరుట్ల డిపోకు చెందిన (టీఎస్ 02 జెడ్ 0283) బస్సు సాయంత్రం 7.30 గంటల సమయంలో నిజామాబాద్ నుంచి కోరుట్లకు బయలుదేరింది. ఇందులో 25 మంది ప్రయాణికులు ఉన్నారు. మాక్లూర్ మండలం దాస్‌నగర్ వద్దకు రాగానే బస్‌డ్రైవర్ ప్రసాద్‌కు ఫిట్స్ వచ్చాయి. దీంతో బస్సు అదుపుతప్పి పొలాల్లోకి దూసుకెళ్లింది. పొలాల్లో బస్సు నిలిచిపోయింది. డ్రైవర్ ప్రసాద్‌కు కొద్దిపాటి గాయాలు అయ్యాయి. బస్సు పొలాల్లోకి వెళ్లగానే ప్రయాణికులు ఆందోళన చెంది కేకలు వేశారు. ఓవైపు చీకటి పడింది. అత్యవసర డోర్ ద్వారా 25 మంది బస్సునుంచి బయటకు వచ్చారు. మాక్లూర్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఆర్టీసీ అధికారులకు సమాచారం అందించి వారిని మరో బస్సు కోరుట్లకు తరలించారు. డ్రైవర్‌ను జిల్లా కేంద్రం లోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి తరలించారు. ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో తాత్కాలిక డ్రైవర్‌గా ప్రసాద్ కోరుట్ల డిపోలో ఐదు రోజుల చేరాడు. ఆర్టీసీ అధికారులు హడావుడిగా అనుభవం, ఆరోగ్య సమస్యలను పరిగణనలోకి తీసుకోకుండా తాత్కాలిక డ్రైవర్లను నియమించడంతో ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయని అభిప్రాయం వ్యక్తమైంది. -
దారికొచ్చాడు
కేరళలోని ఓ ప్రాంతం. ప్రధాన రహదారి. కర్ణాటక రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థకు చెందిన బస్సు. దోవంతా నాదే అన్నట్టుగా భారీ వాహనాలకు కేటాయించిన లేన్‌ను వదిలి.. అంటే రైట్ లేన్‌ను వదిలి లెఫ్ట్లేన్లోంచి వెళ్తోంది. అయినా పట్టించుకోకుండా తమ దారిన తాము వెళ్లిపోతున్నారు చాలా మంది. ఇంతలోకే ఎర్ర రంగు టూ వీలర్ మీద రెడ్ అండ్ బ్లాక్ కాంబినేషన్ చుడీదార్, ఎర్ర రంగు హెల్మెట్ ధరించిన ఓ యువతి ఆ బస్సుకు ఎదురు వచ్చింది. బస్సు డ్రైవర్ ‘‘పక్కకు తప్పుకో అమ్మా...’’ అని అరిచాడు అసహనంగా. అంగుళం కూడా కదల్లేదు ఆమె. రోడ్డు మీద వెళ్లే వాహనదారుల దృష్టి ఆ సన్నివేశం పై పడింది. నెమ్మదిగా వేగం తగ్గించి చోద్యం చూడ్డం మొదలుపెట్టాయి. బస్సు వెనక ఆగిన వాహనాల హారన్లు మారుమోగుతున్నాయి. బస్సుకు ఎదురుగా ఉన్న ఆ టూవీలర్ కదిలితే కాని బస్సు ముందుకు కదలదు. ‘‘రాంగ్ రూట్లో ఉన్నావు.. నీ లేన్‌లోకి వెళ్లు’’ అని చెప్పకుండానే బస్సుకు ఎదురొడ్డి చెప్తోంది ఆమె. అలా అయిదు నిమిషాలు గడిచాయి. తన తప్పు, పరిస్థితి అర్థమైన బస్సు డ్రైవర్ తన లేన్‌లోకి స్టీరింగ్ వీల్‌ను తిప్పక తప్పలేదు. అలా బస్సు తన రూట్లోకి గేర్ మార్చుకోగానే తన దారిన తాను వెళ్లిపోయింది ఆ యువతి. నోటి మాట లేకుండా చేతలతో డ్రైవర్‌కి చెక్ పెట్టి పౌరురాలిగా తన కర్తవ్యాన్నీ నిర్వహించింది. గత వారం రోజులుగా సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ అవుతోంది. వీడియోలో కనిపిస్తున్న దృశ్యం తప్ప ఆ యువతి పేరు, తదితర వివరాలేవీ బయటికి రాలేదు. ఏమైనా ఆడవాళ్ల సామాజిక బాధ్యతకూ అద్దం పడుతోంది ఆ వీడియో! -
‘ఇదే యూపీ అయితే డ్రైవర్ ఆమెను కొట్టేవాడు’
తిరువనంతపురం: మనం చేస్తున్న పని సరైనదే అయినప్పుడు దేని గురించి, ఎవరి గురించి భయపడాల్సిన పనిలేదు. ఈ మాటలను నిజం చేసే సంఘటన ఒకటి కేరళలో చోటు చేసుకుంది. రాంగ్ రూట్లో వస్తోన్న ఓ బస్సుకు ఎదురుగా తన స్కూటినీ నడుపుతూ.. బస్సు కరెక్ట్ రూట్లోకి వెళ్లేలా చేసిందో మహిళ. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతుంది. వివరాలు.. ఓ మహిళ రోడ్డు మీద స్కూటితో వెళ్తుంది. ఇంతలో ఓ బస్సు రాంగ్ రూట్లో మహిళకు ఎదురుగా వచ్చింది. అయితే బస్సును చూసి ఆ మహిళ ఏ మాత్రం బెదరలేదు. అలానే ముందుకు వెళ్లసాగింది. ఇక చేసేదేం లేక ఆ బస్సు డ్రైవరే డైవర్షన్ తీసుకుని కరెక్ట్ రూట్లోకి వెళ్లాడు. ఈ మొత్తం సంఘటనను వీడియో తీసి ట్విటర్లో షేర్ చేశాడో వ్యక్తి. When you are RIGHT it gives you a very different kind of MIGHT. See Joe a lady rider down South doesn't budge an inch to give in to an erring Bus Driver. Kudos to her. @TheBikerni @IndiaWima @UrvashiPatole @utterflea @anandmahindra @mishramugdha #GirlPower #BikerLife #BikerGirl pic.twitter.com/3RkkUr4XdG — TheGhostRider31 (@TheGhostRider31) September 25, 2019 ఈ వీడియో చూసిన నెటిజన్లు సదరు మహిళ ధైర్యాన్ని మెచ్చుకుంటున్నారు. లేడీ బాస్ అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. అయితే కొందరు నెటిజన్లు మాత్రం ‘ఉత్తర భారతదేశంలో ఇలాంటి సంఘటనలు జరిగే చాన్సే లేదు. ఇదే సంఘటన యూపీలో జరిగితే ఆ బస్సు డ్రైవర్ కిందకు దిగి.. సదరు మహిళను కొట్టేవాడు. బస్సును పక్కకు తిప్పేవాడు కాదు’ అంటున్నారు. -
బస్సు డ్రైవర్‌కు గుండెపోటు.. ప్రయాణీకులు..
సాక్షి, టెక్కలి : విధుల్లో ఉన్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు డ్రైవర్ గుండెపోటుతో మృతి చెందాడు. తనకు గుండెపోటు వచ్చినా ఎంతో చాకచక్యంగా బస్సును పొలాల్లోకి తీసుకెళ్లి నిలిపివేసి ప్రయాణీకుల ప్రాణాలు కాపాడాడు. ఈ ఘటన శ్రీకాకుళం జిల్లా టెక్కలి సమీపంలో జాతీయ రహదారిపై జరిగింది. ఖమ్మం నుంచి భువనేశ్వర్ వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు టెక్కలి దగ్గరకు వచ్చే సరికి డ్రైవర్‌కు గుండెపోటు వచ్చింది. డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించి బస్సును పొలాల్లోకి దింపి మృతి చెందాడు. ఈ ఘటనలో నలుగురు ప్రయాణీకులకు స్పల్ప గాయాలు కాగా ఆస్పత్రికి తరలించారు. మిగిలిన వారు సురక్షితంగా ఉన్నారు. -
రెప్పపాటులో చావు వరకూ వెళ్లి.. బతికాడు!
తిరువనంతపురం: కళ్లముందే మృత్యు ఘడియలు నృత్యం చేసిన భయానక అనుభవం కేరళలోని ఓ వ్యక్తికి ఎదురైంది. రెప్పపాటులో మరణం అంచుకు వెళ్లి బతికి బయటపడ్డాడు ఆ యువకుడు. వివరాల్లోకి వెళితే.. కేరళ కోజికొడ్‌లోని ఎంగపుజా ప్రాంతంలో ఓ ప్రైవేట్ బస్సు డ్రైవర్ వీరంగం సృష్టించాడు. బస్‌ను ఫుట్‌పాత్‌కు దగ్గర అతివేగంగా నడిపాడు. అదే సమయంలో రోడ్డును దాటడానికి ప్రయత్నించిన ఓ స్కూటరిస్ట్ అనుకోకుండా ఒక్కసారిగా బస్సు కింద పడ్డాడు. అయితే బస్సు డ్రైవర్ వేగాన్ని నియంత్రించలేకపోవడంతో.. బస్సు.. స్కూటర్‌ను చాలా దూరం వరకు లాక్కొని పోయింది. దీంతో ఆ వ్యక్తి బస్సు టైరులో చిక్కుకున్నాడు. ఇది గమనించిన స్థానికులు డ్రైవర్‌ను అప్రమత్తం చేశారు. బస్సు కొంచం వేగం తగ్గాక అతడు అందులో నుంచి బయట పడ్డాడు. ఈ సంఘటనలో బాధితుడికి తీవ్రంగా గాయాలయ్యాయి. ఫుట్‌పాత్ మీద ఉన్న రెండు బైకులు దెబ్బతిన్నాయి. ఈ ప్రమాద దృశ్యాలు ఫుట్‌పాత్ పక్కన ఓ దుకాణంలో అమర్చిన సీసీ టీవీలో రికార్డు అయింది. తాజాగా ఈ వీడియో సోషల్ మీడియా వైరల్‌గా మారింది. కాగా కేరళలో రోజుకు సమారు 12 మంది రోడ్డు ప్రమాదాల్లో మరణిస్తున్నారని సమాచారం. ముఖ్యంగా ఈ రోడ్డు ప్రమాదాలన్ని అతి వేగం కారణం జరుగుతున్నాయని తెలుస్తోంది. -
నడుస్తున్న బస్సులో కునుకు తీసిన డ్రైవర్
కర్ణాటక, గౌరిబిదనూరు: బస్సు చలనంలో ఉండగానే డ్రైవర్ నిద్రలోకి జారుకున్నాడు. దీంతో బస్సు అదుపు తప్పింది. గమనించిన ప్రయాణికులు కేకలు వేయడంతో అదే బస్సులోని యువకుడు స్టీరింగ్ చేతపట్టి ప్రయాణికులను రక్షించాడు. ఈ ఘటన గురువారం సాయం త్రం దొడ్డబళ్లాపురం సమీపంలో చోటు చేసుకుంది. బెంగుళూరు నుంచి 40 మంది ప్ర యాణికులతో గౌరిబిదనూరు బయల్దేరిన కేఎస్ ఆర్టీసీ బస్సు దొడ్డబళ్లాపురం దాటిన అనంతరం డ్రైవర్ కండోజీ నిద్రలోకి జారుకున్నాడు. బస్సు నియంత్రణ తప్పడంతో ముం దరి సీట్లలో ఉన్న ప్రయాణికులు భయంతో గట్టిగా కేకలు వేశారు. అయినప్పటికీ డ్రైవర్ మేల్కొనలేదు. దీంతో అదే బస్సులో ప్రయాణిస్తున్న గౌరిబిదనూరుకు చెందిన ప్రశాంత రెడ్డి డ్రైవర్‌ను పక్కకు తోసి చేతిలోకి స్టీరింగ్ తీసుకొని వాహనాన్ని అదుపు చేశాడు. దీంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. అనంతరం డ్రైవర్‌ను సీట్లో పడుకోబెట్టి వాహనాన్ని బస్ డిపోలో అప్పగించాడు. డ్రైవింగ్ చేస్తున్న ప్రశాంత్‌రెడ్డి -
పడకలు లేవని ముప్పు తిప్పలు
సాక్షి,సిటీబ్యూరో: చిత్రంలో కనిపిస్తున్న ఈయన పేరు మొయిజ్. పాతబస్తీకి చెందిన ఇతడు ఓ ప్రైవేటు పాఠశాల బస్సు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఉన్నట్టుండి ఇతడి కూతురు సయిదా ఫజాబేగం(10) తీవ్ర అస్వస్థతకు గురవడంతో స్థానికం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చూపించాడు. పరీక్షించిన అక్కడి వైద్యులు నిలోఫర్‌కు రిఫర్ చేశారు. దీంతో బిడ్డను తీసుకుని రెండు రోజుల క్రితం నిలోఫర్‌కు వచ్చాడు. ఆస్పత్రిలో పడకలు ఖాళీ లేకపోవడంతో బాలికను చేర్చుకునేందుకు నిరాకరించిన వైద్యులు.. ఉస్మానియాకు తీసుకెళ్లాల్సిందిగా సూచించారు. దాంతో బిడ్డను తీసుకుని ఉస్మానియాకు వెళ్లగా ఆస్పత్రిలో చిన్నపిల్లల వైద్యులు లేరని చేర్చుకునేందుకు నిరాకరించారు. దీంతో చేసేది లేక మొయిజ్.. బాలల హక్కుల సంఘ అధ్యక్షుడు అచ్యుతరావును ఆశ్రయించాడు. బాలికకు మానవతా దృక్పధంతో చికిత్స చేయాల్సిందిగా బంజారాహిల్స్‌లోని ఓ చిన్నపిల్లల కార్పొరేట్ ఆస్పత్రి యాజమాన్యాన్ని కోరారు. తీవ్ర జాప్యం వల్ల అప్పటికే బాలిక కాలుతో పాటు మాట కూడా పడిపోయింది. ఇన్ఫెక్షన్ మరింత ముదిరింది. బాలిక కండరాల క్షీణతకు సంబంధించిన గుయిల్లిన్ బారో సిండ్రోమ్ (జీబీఎస్)తో బాధపడుతోందని, వెంటనే ఇంజక్షన్ ఇవ్వాలని, ఒక్కో ఇంజక్షన్‌కు రూ.27 వేల చొప్పున మొత్తం రూ.12.50 లక్షలకు పైగా ఖర్చవుతుందని సదరు ఆస్పత్రి యాజమాన్యం స్పష్టం చేసింది. ఆర్థిక స్తోమత లేక పోవడంతో శుక్రవారం మధ్యాహ్నం కూతురును తీసుకుని మరోసారి ఉస్మానియాకు పరుగులు తీశాడు. అప్పటికే పడకలన్నీ నిండిపోవడంతో చేర్చుకునేందుకు నిరాకరించి, మళ్లీ నిలోఫర్‌కు రిఫర్ చేశారు. దీంతో మధ్యాహ్నం ఆయన మరోసారి తన బిడ్డను నిలోఫర్‌కు తీసుకొచ్చాడు. సాయంత్రం పొద్దుపోయే వరకు ఆస్పత్రిలో చేర్చుకోలేదు. అదే మంటే పడకలు ఖాళీ లేవని చెప్పుతున్నారని, ఏం చేయాలో అర్థం కావడం లేదని బాలిక తండ్రి మొయిజ్ బోరున విలపించడం అక్కడున్న వారందరినీ కలిచివేసింది. ఒక్క మొయిజ్ మాత్రమే కాదు.. వైరల్ జ్వరాలతో బాధపడుతూ కార్పొరేట్ ఆస్పత్రుల్లో చికిత్స పొందే ఆర్థిక స్తోమత లేక ప్రభుత్వ ఆస్పత్రులకు చేరుకుంటున్న అనేక మంది సామాన్యులకు ఇదే అనుభవం ఎదురవుతోంది.