రంగారెడ్డి జిల్లా హకీంపేటలోని ఆర్టీసీ డిపోలో బస్సు ఢీకొని డ్రైవర్ దుర్మరణం చెందాడు.
హకీంపేట్: రంగారెడ్డి జిల్లా హకీంపేటలోని ఆర్టీసీ డిపోలో బస్సు ఢీకొని డ్రైవర్ దుర్మరణం చెందాడు. డిపోలోని మెకానిక్ బస్సును టెస్ట్ డ్రైవ్ కోసం వెనకకు తీస్తుండగా అక్కడే వాటర్ ప్లాంట్ వద్ద ఉన్న డ్రైవర్ ఫాకిరా నాయక్‌ను ఢీకొంది. ఈ సంఘటనలో అతను అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడు బొమ్మల రామారం మండలం సోలిపేట రాముని తండా వాసిగా పోలీసులు గుర్తించారు. మృతునికి భార్య, ఓ కుమార్తె, ఇద్దరు కుమారులు ఉన్నారు.
ఘటనాస్థలికి చేరుకున్న గ్రామస్తులు డిపో ముందు ఆందోళన చేపట్టారు. నిర్లక్ష్యంగా బస్సును నడిపి ఫాకిరా నాయక్ మృతికి కారణమైన ఆసిస్టెంట్ మెకానిక్ వెంకటేష్ పై చట్టరీత్యా చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు. కేసు నమోదు చేసుకున్న జవహర్ నగర్ పోలీసులు ప్రమాదానికి కారణమైన వెంకటేష్‌ను అదుపులోకి తీసుకున్నారు.