
సాక్షి, ముంబై: తల్లిదండ్రులతో కలిసి షిర్డీ యాత్రకు వెళ్లొస్తున్న ఆరేళ్ల బాలికపై లైంగిక దాడికి యత్నించిన వ్యక్తిని పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. నిందితుడు సోపన్ యుగేల్ (32) ముంబై ఆర్టీసీలో డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. పోలీసులు తెలిపిన వివరాలు..మలద్ ప్రాంతానికి చెందిన ఓ కుటుంబం షిర్డీ యాత్ర ముగించుకుని బుధవారం రాత్రి బస్సులో తిరుగుపయనమైంది. బస్సులో సీట్లు ఖాళీగా ఉండడంతో బాలికను ఓ సీట్లో పడుకోబెట్టారు. రాత్రి 10 గంటలకు బస్సు ఎక్కిన నిందితుడు బాలిక నిద్రిస్తున్న ముందు సీట్లో కూర్చొన్నాడు.
అయితే, ఉదయం 6 గంటల సమయంలో నిద్రలేచిన బాలిక తన ప్రయివేటు భాగాల్లో నొప్పిగా ఉందని తల్లికి చెప్పింది. ఇది గమనించిన నిందితుడు అప్పటికే బస్సు నగరానికి చేరుకోవడంతో అక్కడ నుంచి జారుకున్నాడని పోలీసులు తెలిపారు. విషయం తెలుసుకున్న బాలిక తల్లిదండ్రులు కురార్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోక్సో చట్టం కింద నమోదు చేసుకున్న పోలీసులు విషయాన్ని క్రైం బ్రాంచ్ పోలీసులకు చెప్పడంతో వారు బస్సు టికెట్ ఆధారంగా నిందితున్ని అదుపులోకి తీసుకున్నారు. బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించినట్లు సదరు బస్ డ్రైవర్ విచారణలో అంగీకరించాడని పోలీసులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment