assult
-
బెంగళూరులో మహిళపై సామూహిక అత్యాచారం
బెంగళూరు: నగరంలో ఓ మహిళపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన తాజాగా వెలుగు చూసింది. ఓ హోటల్లో 33 ఏళ్ల మహిళపై కొంతమంది సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. క్యాటరింగ్ సర్వ్ చేసే మహిళపై ముగ్గురు వ్యక్తులు అత్యాచారం చేశారు. వివరాల్లోకి వెళ్తే.. జ్యోతి నివాస్ కాలేజ్ జంక్షన్ వద్ద వెయిట్ చేస్తున్న ఆ మహిళను ఓ నలుగురు కుర్రాళ్లు ఫాలో అయ్యారు. వారంతా హోటల్ తీసుకున్నామని, అక్కడకి డిన్నర్ కు భోజనం తీసుకురమ్మని చెప్పారు. దాంతో ఆమె డిన్నర్‌కు భోజనం తీసుకెళ్లగా వారు ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారు.డిన్నర్ చేసిన తర్వాత వారంతా ఆమెను లొంగదీసుకున్నట్లు ఆమె ఫిర్యాదు చేసిందని పోలీసులు పేర్కొన్నారు. ఆ హెటల్ టెర్రాస్ పై కి తీసుకెళ్లి ఆ మహిళపై సామూహిక అత్యాచారానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. ఈ విషయాన్ని బయటకు చెబితే చంపేస్తామని బెదిరించారన్నారు. ఈ ఉదయం(శుక్రవారం) ఆరు గంటలకు ఆమెను వదిలేశారన్నారు. ఈ విషయాన్ని ఆమె తన భర్తకు తెలియజేయటంతో పాటు పోలీసులకు చెప్పడంతో అసలు విషయం వెలుగు చూసింది. ఈ ఘటనలో ముగ్గుర్ని అరెస్ట్ చేసినట్లు సీనియర్ పోలీస్ అధికారి ఒకరు చెప్పారు.ఆమెపై అత్యాచారానికి పాల్పడిన నిందితులంతా వేరే రాష్ట్రాల నుంచి ఇక్కడ హోటల్లో పని చేయడానికి వచ్చిన వారిగా గుర్తించినట్లు సదరు పోలీస్ అధికారి చెప్పారు. -
జైలు నుంచి రాగానే బాలికపై..
-
వేధింపుల కేసులో ఘోరం.. తల్లిని వివస్త్ర చేసి..
భోపాల్: మధ్యప్రదేశ్‌లోని సాగర్ జిల్లాలో ఓ దళిత కుటుంబంపై దాష్టీకం జరిగింది. వేధింపుల కేసులో రాజీకి రావాలంటూ ఓ వ్యక్తిని కొందరు కొట్టి చంపారు. ఆ దాడిని అడ్డుకునేందుకు ప్రయత్నించిన అతని తల్లిని వివస్త్రని చేశారు. 'నా బిడ్డను విపరీతంగా కొట్టారు. కాపాడుకోలేకపోయా. మా ఇంటిని కూల్చివేశారు. ఇంట్లో వస్తువులన్నీ పాడు చేశారు. అడ్డుగా వెళ్లిన నన్ను వివస్త్రను చేశారు’’ అంటూ కన్నీటి పర్యంతం అయ్యింది బాధిత మహిళ. పోలీసులు వచ్చి టవల్ అందించేంతవరకు ఆమె నగ్నంగానే ఉండిపోయారు. తన వేధింపుల కేసులో రాజీకి రావాలని తమ సోదరిపై ఒత్తిడి పెంచారని బాధితురాలి సోదరి తెలిపింది. వేధింపులకు గురిచేస్తున్నారని 2019లో మృతుని సోదరి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ప్రస్తుతం ఆ కేసు కోర్టులో విచారణ జరుగుతోంది. ఈ క్రమంలో రాజీకి రావాలని కోరుతూ బాధిత కుటుంబంపై ఓ గుంపు దాడి చేసిందని పోలీసులు తెలిపారు. బాధితురాలి మరో ఇద్దరు సోదరులను వెతుకుతూ వారి బంధువుల ఇళ్లలో కూడా నిందితులు విధ్వంసం సృష్టించారు. ఇళ్లలోకి వెళ్లి బెదిరింపులకు పాల్పడ్డారు. తమ భర్తలపై దాడి చేసి, పిల్లలను చంపబోయినట్లు బాధితురాలి బంధువులు తెలిపారు. పోలీసు బలగాలు చేరేవరకు గ్రామంలో అల్లకల్లోలం సృష్టించారని స్థానికులు తెలిపారు. జిల్లా కలెక్టర్ రంగంలోకి దిగి, నిందితులను అరెస్టు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. రక్షిస్తామని బాధిత కుటుంబానికి హామీ ఇచ్చాక.. మృతునికి అంత్యక్రియలు జరిపారు. మధ్యప్రదేశ్‌లో ఈ ఏడాది ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ అంశం రాజకీయంగా దూమారం రేపింది. రాష్ట్రంలో దళితులపై దాడులు పెరిగిపోతున్నాయని ప్రతిపక్షాలు ఆరోపించాయి. దళితులకు రక్షణ కరువైందని కాంగ్రెస్ నేత మల్లిఖార్జున ఖర్గే అన్నారు. దళితులపై దాడుల్లో రాష్ట్రం ముందంజలో ఉందని చెప్పారు. ఘటనపై స్పందించిన ప్రభుత్వం దోషులపై కఠిన శిక్షలు తీసుకుంటామని చెప్పింది. ఇలాంటి దాడులకు పాల్పడితే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించింది. ఎన్నికలు జరనున్న నేపథ్యంలో నేరాలకు రాజకీయ తెరలేపుతోందని ఆరోపించింది. రెండు వర్గాల మధ్య గొడవల తీవ్ర రూపం దాల్చిన నేపథ్యంలో తాజా ఘటన జరిగిందని మంత్రి భూపేంద్ర సింగ్ తెలిపారు. ఈ విషయాన్ని కాంగ్రెస్ రాజకీయంగా ఉపయోగించుకునే కుట్ర పన్నుతోందని అన్నారు. ఇదీ చదవండి: మేకలు, పావురాలు చోరీ?.. దళిత యువకులను తలకిందులుగా వేలాడదీసి.. -
పెళ్లి రోజు మర్చిపోయిన భర్త.. ఊహించని షాకిచ్చిన భార్య
ఇటీవల భార్తభర్తల గొడవలు చాలా సిల్లీగా ఉంటున్నాయి. పైగా వాటిని పోలీస్టేషన్ల వరకు తీసుకువచ్చి పంచాయితీ పెడుతుండటం మరింత విడ్డూరం. నాలుగోడల మధ్య పరిష్కరించుకోవాల్సి చిన్నపాటి తగాదా కాస్త దాడి చేసుకునేంత వరుకు వెళ్లిపోతుండటం బాధకరం. అచ్చం అలాంటి విచిత్ర ఘటనే ముంబైలో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే.. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం.. ముంబైలో ఘట్కోపర్లో నివశిస్తున్న 32 ఏళ్ల విశాల్ నాంగ్రే అనే వ్యక్తి కొరియర్ కంపెనీలో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. అతడి భార్య కల్పన ఫుడ్ అవుట్‌లెట్‌లో పనిచేస్తోంది. అతని భార్య కల్పన ఇద్దరూ కలిసి బెగన్‌వాడిలో నివశిస్తున్నారు. ఆ జంటకు 2018లో వివాహమైంది. ఫిబ్రవరి 18 వారి పెళ్లిరోజు. ఆ విషయాన్ని నాంగ్రే మర్చిపోయాడు. ఈ విషయమై భర్తపై కోపంతో తన తల్లిదండ్రులు, సోదరడుని ఇంటికి పిలిపించి మరి గొడవకు దిగింది. అక్కడితో ఆగక ఆమె అతడిని తీవ్రంగా దుర్భాషలాడుతూ, అతడి తల్లిపై చేతివాటం చూపింది. దీంతో వివాదం కాస్త తారాస్థాయికి చేరింది. ఐతే ఆమె భర్త నాంగ్రే గాయపడిన తన తల్లిని హుటాహుటినా ఆస్పత్రికి తీసుకువెళ్లి తదనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు పోలీసులు అతడి భార్య, ఆమె తల్లిదండ్రులు, సోదరుడుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం ప్రారంభించారు. (చదవండి: మిరాకిల్ ఘటన: ఘోర కారు ప్రమాదం..బతికే ఛాన్సే లేదు! కానీ..) -
ప్రియురాలికి మరోకరితో పెళ్లి....జీర్ణించుకోలేక కత్తితో దాడి..ఆ తర్వాత
సాక్షి, మియాపూర్ (హైదరాబాద్): ప్రియురాలితో పాటు ఆమె తల్లిపై ఓ యువకుడు కత్తితో దాడి చేయడమేగాక తానూ గొంతుకోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. సీఐ తిరుపతిరావు కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి... గుంటూరుజిల్లా, ఇసుకపల్లికి చెందిన వెంకటరాజు, శోభ దంపతులకు కుమార్తె వైభవీ, కుమారుడు గోవర్ధన్ ఉన్నారు. వెంకటరాజు ముంబైలో ప్యాబ్రికేషన్ పనులు చేస్తూ అక్కడే ఉంటున్నాడు. శోభ తన కుమార్తె వైభవీ, గోవర్ధన్‌తో కలిసి మియాపూర్‌లోని న్యూ – హఫీస్‌పేట ఆదిత్య నగర్లో ఉంటోంది. కాగా అదే గ్రామానికి చెందిన సందీప్ అలియాస్ బబ్లూ వారి ఇంటి పక్కనే ఉండేవాడు. ఈ నేపథ్యంలో వారి మధ్య ఏర్పడిన పరిచయం ప్రేమకు దారితీసింది. ఈ విషయం తెలియడంతో వైభవి కుటుంబసభ్యులు ఆమెను మందలించారు. దీంతో కొన్నాళ్లుగా వైభవీ సందీప్‌ను దూరం పెడుతుంది. దీనిని జీర్ణించుకోలేని సందీప్ ప్రేమ పేరుతో వేధింపులకు పాల్పడుతున్నాడు. ఆమెకు తరచూ ఫోన్ చేసి తనతో మాట్లాడాలని లేకపోతే ఆత్మహత్య చేసుకుంటానని, చంపేస్తానని బెదిరిస్తున్నాడు. దీంతో శోభ ఇద్దరు పిల్లలతో సహా నగరానికి వలస వచ్చి న్యూ – హాపీస్‌పేట ఆదిత్యనగర్‌లో ఉంటున్నారు. కొద్ది రోజుల క్రితం వైభవికి తమ సమీప బంధువుతో పెళ్లి కుదిరింది. వచ్చే ఆదివారం వారి నిశ్చతార్థం జరిపేందుకు నిశ్చయించారు. ఈ విషయం తెలియడంతో మంగళవారం ఉదయం నగరానికి వచ్చిన సందీప్ నేరుగా వైభవి ఇంటికి వెళ్లి గొడవ పడ్డాడు. కోపంతో కూరగాయాలు కోసే కత్తితో వైభవీ, ఆమె తల్లి శోభపై దాడి చేశాడు. వైభవిని గొంతు కింద చాతీభాగంలో, తల్లి శోభను కడుపులో పొడిచాడు. ఆ తర్వాత అదే చాకుతో దీపూ గొంతుకోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. వీరి అరుపులు విన్న స్థానికులు అక్కడికి చేరుకుని రక్తం మడుగులో ఉన్న ముగ్గురిని ఆసుపత్రికి కొండాపూర్‌లోని కిమ్స్ ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి సందీప్‌ను కోఠిలోని ఈఎన్టీ ఆసుపత్రి తరలించారు. వైభవీ, తల్లి శోభలను గాంధీ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నిలకడగా సందీప్ ఆరోగ్యం ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సందీప్‌ను పోలీసులు కోఠి ఈఎన్టీ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. రోగి పరిస్థితి పరిశీలించిన ఈఎన్టీ వైద్యులు అతడి గొంతుకు ఆపరేషన్ చేశారు. ప్రస్తుతం అతడి పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉన్నట్లు ఈఎన్టీ ఆసుపత్రి వైద్యులు తెలిపారు. -
పండ్లరసంలో మద్యం కలిపి తాగించి..వృద్ధుడు అఘాయిత్యం
ఒంటరిగా చిన్నారులు కనిపిస్తే చిదిమేయాలనుకునే కామాంధులు సమాజంలో పెరిగిపోయారు. అదే కోవలో ఓ పసిమొగ్గకు మాయ మాటలు చెప్పి అఘాయిత్యానికి ఒడిగట్టిన వృద్ధుడు కడతేరిపోయాడు. బాధితురాలి కుటుంబీకులు దాడి చేసి కొట్టడంతో మృత్యువాత పడ్డాడు. ఐటీ సిటీలోని హెణ్ణూరు పరిధిలో ఈ సంఘటన చోటుచేసుకుంది. సాక్షి, బనశంకరి: మైనర్ బాలికకు పండ్లరసంలో మద్యం కలిపి తాగించి అత్యాచారానికి పాల్పడిన వృద్ధ కామాంధుడు బాలిక బంధువుల దాడిలో విగత జీవి అయ్యాడు. ఈ ఘటన బెంగళూరులో హెణ్ణూరు పోలీస్‌స్టేషన్ పరిధిలో ఆదివారం చోటుచేసుకుంది. తమిళనాడుకు చెందిన కుప్పణ్ణ (72) హతుడు. నమ్మించి ఇంట్లోకి పిలిపించి సోమవారం తూర్పు విభాగం డీసీపీ భీమాశంకర్ గుళేద్ కేసు వివరాలను వెల్లడించారు. కుప్పణ్ణ గత నాలుగేళ్లుగా హెణ్ణూరు పరిధిలోని బాబుసాపాళ్యలో ఒంటరిగా నివాసం ఉంటున్నాడు. ఇతడు తాపీ కూలీగా పనిచేసేవాడు. ఆదివారం మధ్యాహ్నం పక్కింట్లో ఉండే నాలుగేళ్ల బాలిక ఇంటిపైన ఆరేసిన దుస్తులను తీసుకురావడానికి వెళ్లింది. అక్కడే ఉన్న కుప్పణ్ణ బాలికకు జ్యూస్ ఇస్తానని చెప్పి ఇంట్లోకి పిలిపించుకున్నాడు. సరేనని వెళ్లిన బాలికకు జ్యూస్‌లో మద్యం కలిపి ఇవ్వగా తాగిన బాలిక మత్తులోకి జారుకుంది. వృద్ధుడు బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆస్పత్రి నుంచి తిరిగి వచ్చి దాడి సాయంత్రం వరకు బాలిక ఇంటికి రాకపోవడంతో కుటుంబసభ్యులు గాలించారు. కుప్పణ్ణ ఉండే ఇంటి పై అంతస్తులో బాలిక స్పృహ తప్పి ఉన్నట్లు తెలిసి బాలికను తీసుకుని ఆసుపత్రికి వెళ్లారు. అక్కడ ఏం జరిగిందో బాలిక వివరంగా చెప్పడంతో బంధువులు అగ్రహోదగ్రులయ్యారు. వెంటనే వెళ్లి కుప్పణ్ణను తీవ్రంగా కొట్టడంతో ప్రాణాలు వదిలాడు. మరోవైపు కుప్పణ్ణ తమ బాలిక మీద లైంగిక దాడి చేశాడని హెణ్ణూరుపోలీస్‌స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేశారు. సోమవారం ఉదయం పోలీసులు ఘటనాస్థలానికి వెళ్లి గమనించగా కుప్పణ్ణ శవమై ఉన్నాడు. కుప్పణ్ణ పై పోక్సోయాక్టు కేసు, బాలిక కుటుంబసభ్యులపై హత్యకేసు నమోదైందని డీసీపీ తెలిపారు. హత్య కేసులో ముగ్గురిని అరెస్టు చేశామని చెప్పారు. -
మహిళ దుస్తులు చింపి, అనుచిత దాడి...కాదు దోపిడి అంటున్న యజమాని
న్యూఢిల్లీ: ఒక క్లబ్‌లోని బౌన్సర్లు ఒక మహిళ పట్ల చాలా అనుచితంగా ప్రవర్తించారు. సదరు మహిళ బట్టలు చింపి, దారుణంగా దాడి చేశారు. దీంతో సదరు మహిళ ఇద్దరు బౌన్సర్లు తన పట్ల చాలా అనుచితంగా ప్రవర్తించారంటూ పోలీసులకు ఫిర్యాదులు చేసింది. సెప్టంబర్ 18న ఢిల్లీలోని సౌత్ ఎక్స్టెన్షన్ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం... సదరు బాధిత మహిళ నుంచి తమకు ఫోన్ కాల్ వచ్చిందని తెలిపారు. తాము సంఘటన స్థలానికి వచ్చేటప్పటికీ మహిళ దుస్తులు చిందరవందరగా ఉన్నట్లు గుర్తించామన్నారు. బాధితురాలిని చికిత్స నిమిత్తం ఎయిమ్స్ ట్రామా సెంటర్‌కి తరలించామని తెలిపారు. అలాగే సదరు క్లబ్‌లోని బౌన్సర్ల వివరాలను సేకరించడమే కాకుండా సీసీటీవీ ఫుటేజ్‌లను పరిశీలిస్తున్నట్లు తెలిపారు. బాధిత మహిళ స్నేహితులతో కలిసి క్లబ్‌కి వచ్చానని, ఎంట్రీపై వాగ్వాదం చోటు చేసుకోవడంతో బౌన్సర్లు ఈ ఘటనకు పాల్పడ్డారని ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నారు. కానీ విచారణలో క్లబ్ యజమాని సురేంద్ర్ సింగ్ చౌదరి మరో కథ చెబుతన్నాడు. తాము ప్రతినెల స్థానిక పోలీస్ సిబ్బందికి దాదాపు రూ. 5 లక్షలు చెల్లించాల్సి వస్తుందని తెలిపాడు. ఐతే తాను చెల్లించడానికి ప్రస్తుతం నిరాకరించడంతో ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని చెబుతున్నాడు. రాత్రి ఒంటి గంట సమయంలో ఇద్దరు అబ్బాయిలు, ముగ్గురు అమ్మాయిలు దురుసుగా ప్రవర్తించడమే కాకుండా పోడియం వద్ద నుంచి బలవంతంగా సుమారు రూ. 1.5 లక్షలు తీసుకుని పోలీసులకు ఫోన్ చేశారని తెలిపాడు. చచ్చిన ఆ పోలీసులు బలవంతపు వసూళ్లకు పాల్పడ్డారని, ఇవ్వకపోతే తీవ్ర పరిణామలు ఎదుర్కొవాల్సి వస్తుందని బెదిరింపులకు దిగారని వివరిస్తూ..స్పెషల్ సీపీకి లేఖ రాశాడు. అలాగే పోలీసులు తమ క్లబ్ సిబ్బందిలో ఇద్దర్నీ అదుపులోకి తీసుకున్నట్లు పేర్కొన్నాడు. అంతేగాదు సదరు క్లబ్ యజమాని తమ క్లబ్లో ఉన్న సీసీ కెమెరా ఆధారంగా దర్యాప్తు చేయాలని పోలీసులను అభ్యర్థించారు. దీంతో పోలీసులు ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు ప్రారంభించారు. (చదవండి: ఆస్పత్రిలో చేరిన కర్ణాటక మాజీ సీఎం) -
రిక్షా డ్రైవర్ పట్ల దురుసుగా ప్రవర్తించిన మహిళ: వీడియో వైరల్
ఉత్తరప్రదేశ్: చిన్నప్రమాదానికి పెద్ద రాద్ధాంతం చేసింది నోయిడాలోని ఒక మహిళ. నోయిడాలోని ఒక రిక్షా డ్రైవర్ ఆమె కారు పైకి పొరపాటున తన రిక్షాని పోనిచ్చాడు. అంతే ఒక్కసారిగా ఆమె ఆగ్రహంతో ఊగిపోయింది. సదరు రిక్షా డ్రైవర్ కాలర్ పట్టుకుని లాక్కెళ్లుతూ దుర్భాషలాడింది. ఆ తర్వాత ఆ వ్యక్తిని పదేపదే చెంపదెబ్బలు కొట్టడం ప్రారంభించింది. అతని జేబులోంచి డబ్బులు కూడా లాక్కొని అదేపనిగా చెంపదెబ్బలు కొట్టింది. ఈ ఘటనను అక్కడే ఉన్న కొంతమంది వ్యక్తులు రికార్డు చేయడంతో ఈ వీడియో నెట్టింట తెగ వైరల్‌గా మారింది. దీంతో పోలీసులు సదరు మహిళని కిరణ్ సింగ్‌గా గుర్తించి అరెస్టు చేశారు. Incident from NOIDA: A WOMAN slapped a poor e-rickshaw driver. 17 slaps in less than 90 seconds, she constantly kept abusing the poor e-rickshaw wala. #PurushAayog demands strict action against the woman for taking law in her hand !!@noidapolice#DomesticViolenceOnMen pic.twitter.com/u2VbarbNW9 — Barkha Trehan 🇮🇳 / बरखा त्रेहन (@barkhatrehan16) August 13, 2022 (చదవండి: కారుపై 'హర్ ఘర్ తిరంగ' థీమ్‌తో హల్చల్ చేస్తున్న యువకుడు) -
కోమా నుంచి కోలుకున్న దక్షిణాఫ్రికా యువ క్రికెటర్..
Mondli Khumalo Health Condition: బ్రిడ్జ్‌వాటర్‌లో గత ఆదివారం(మే 29న) దుండగుల చేతిలో తీవ్రంగా గాయపడిన దక్షిణాఫ్రికా యువ క్రికెటర్ ఖుమాలో కోమా నుంచి బయట పడ్డాడు. ఈ విషయాన్ని అతడి సహచర ఆటగాడు లాయిడ్ ఐరిష్ తెలిపాడు. మొండ్లీ ఖుమా యూకేలో కౌంటీ క్రికెట్ ఆడేందుకు వచ్చాడు. అతను నార్త్ పెర్తర్టన్కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. కాగా గత ఆదివారం తెల్లవారుజామున తన పని ముగించుకొని ఇంటికి వెళ్తున్న మొండ్లీ ఖుమాలోపై కొందరు దుండగులు విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డారు. దీంతో అతడి తలకు తీవ్ర గాయమైంది. అతడి మెదడులో రక్తం గడ్డ కట్టడంతో వైద్యులు మూడు సర్జరీలు చేశారు. "మొండ్లీ శుక్రవారం కోమా నుంచి కోలుకున్నాడు. ప్రస్తుతం అతడి ఆరోగ్యం నిలకడగా ఉంది. అతడు తన తల్లి కోసం అడుగుతున్నాడు. అదే విధంగా ఇంగ్లండ్, న్యూజిలాండ్ టెస్ట్ మ్యాచ్‌ను చూస్తున్నాడు. ఇక అతడి తదుపరి మ్యాచ్ ఎప్పుడు అని కూడా తెలుసుకోవాలనుకుంటున్నాడు. గత 24 గంటల్లో అతడు బాగా కోలుకున్నాడు అని లాయిడ్ ఐరిష్ పేర్కొన్నాడు. ఇక 20 ఏళ్ల మొండ్లీ ఖుమాలో 2018లో క్వాజులు-నాటల్ ఇన్లాండ్ తరపున టి20 అరంగేట్రం చేశాడు. 2020 అండర్-19 ప్రపంచకప్ సౌతాఫ్రికా జట్టులో ఖుమాలో చోటు దక్కించుకున్నాడు. ఇక 2020 మార్చి 7న లిస్ట్-ఏ, 2021 మార్చి 4న ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో అరంగేట్రం చేశాడు. ఐదు ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లు, రెండు లిస్ట్-ఏ మ్యాచ్‌లు, 4 టి20 మ్యాచ్‌లు ఆడాడు. చదవండి: నీ క్రీడాస్ఫూర్తికి సలామ్ నాదల్: సచిన్, రవిశాస్త్రి ప్రశంసలు -
ఫోన్ మాట్లాడేందుకు సెల్ తీశాడని.. దాడి చేసిన కానిస్టేబుల్
అనంతపురం క్రైం: అనంతపురం త్రీటౌన్ పోలీసుస్టేషన్ కానిస్టేబుల్ అన్వర్ బాషా రెచ్చిపోయాడు. అకారణంగా ఓ ప్రైవేటు ఉద్యోగిపై దాడికి పాల్పడ్డాడు. బాధితుడి కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. అనంతపురంలోని రెవెన్యూ కాలనీలో నివాసముంటున్న సుదర్శన్ రెడ్డి ఓ ప్రైవేటు సంస్థలో ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. మంగళవారం సాయంత్రం నారాయణ కళాశాలలో చదువుతున్న తన కుమారుణ్ని తీసుకుని బైక్‌పై ఇంటికి బయలుదేరాడు. సైఫుల్లా బ్రిడ్జి వద్దకు రాగానే ఓ బేకరీ వద్ద బండి ఆపి మిక్చర్ తీసుకున్నాడు. అదే సమయంలో అక్కడ త్రీటౌన్ ఎస్ఐ వెంకటేశ్వర్లు బృందం వాహనాల తనిఖీ చేస్తోంది. ఓ యువకుడి బైక్‌పై నాలుగు ఫైన్లు (చలానాలు) పెండింగ్ ఉండడంతో వాటిని చెల్లించాలని ఎస్ఐ సూచించాడు. అదే సమయంలో సుదర్శన్‌రెడ్డి ఫోన్ మాట్లాడేందుకు సెల్ తీశాడు. దీన్ని గమనించిన కానిస్టేబుల్ అన్వర్‌బాషా చెలరేగిపోయాడు. ‘ఏరా.. వీడియో తీస్తున్నావా’ అంటూ విచక్షణారహితంగా దాడి చేశాడు. తాను పలానా సంస్థలో ఉద్యోగినని చెప్పినా వినిపించుకోలేదు. అసభ్య పదజాలంతో దూషిస్తూ చెంపలపై ఇష్టానుసారంగా కొట్టాడు. కానిస్టేబుల్ అన్వర్‌బాషా తీరును అక్కడున్న వారు సైతం తప్పుబట్టారు. కొందరు పోలీసుల తీరు వివాదాస్పదం నగరంలో కొందరు పోలీసుల తీరు వివాదాస్పదమవుతోంది. ప్రజలను, మరీ ముఖ్యంగా వాహనదారులను అకారణంగా దూషించడం, కొట్టడం పరిపాటిగా మారింది. విద్యావంతులు, ఉద్యోగుల పట్ల కూడా దురుసుగా ప్రవర్తిస్తున్నారు. ప్రవర్తన హుందాగా ఉండాలని, ప్రజలతో స్నేహపూర్వకంగా మెలగాలని ఉన్నతాధికారులు పదేపదే చెబుతున్నా..వీరిలో మాత్రం మార్పు కన్పించడం లేదు. (చదవండి: చింతకాయల కోసం వెళ్లి.. చిక్కుకుపోయి.. చివరికి..) -
రష్యా సైనికుల దురాగతం... ఉక్రెయిన్ మహిళపై అత్యాచారం
Ukrainian woman recalls horror: రష్యా ఉక్రెయిన్‌పై వైమానిక దాడులతో యుద్ధం కొనసాగిస్తూనే ఉంది. ఒక పక్క శాంతి చర్చలు అంటూనే మరోపక్క యథావిధిగా దాడులకు తెగబడుతోంది. మరోవైపు పౌరులను లక్ష్యంగా చేసుకుని దాడులు జరపడం లేదంటూనే నివాసితుల ఇళ్లపై బాంబుల వర్షం కురిపించింది. ఈ నేపథ్యంలో రష్యా సైనికులు దురాగతాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఈ మేరకు ఒక ఉక్రెయిన్ మహిళ రష్యా సైనికులు తన ఇంటిపై దాడి చేశారని తెలిపింది. తొలుత తమ పెంపుడు కుక్కను చంపారని, ఆ తర్వాత తన భర్తను చంపినట్లు వెల్లడించింది. తదనంతరం రష్యా సైనికులు తన తలపై గన్‌పెట్టి తాము చెప్పినట్టు వినకపోతే చంపేస్తామని బెదిరించి ఆత్యాచారం చేశారని తెలిపింది. ఆ సమయంలో తన నాలుగేళ్ల కొడుకు భయంతో బాయిలర్ రూమ్‌లో గుక్కపెట్టి ఏడుస్తూ ఉన్నాడంటూ ఆనాటి ఘటనను గుర్తుతెచ్చుకుంటూ కన్నీటిపర్యంతమైంది. ఆ తర్వాత తాము అక్కడి నుంచి భయంతో పారిపోయామని, తన భర్త శవాన్ని కూడా అక్కడే వదిలేశామని చెప్పింది. ప్రస్తుతం అధికారులు ఆమె ఆరోపణలపై విచారణ చేపట్టారు. (చదవండి: పుతిన్ ధీమా... జెలెన్ స్కీ అభ్యర్థన) -
పూణెలో మహబూబ్‌నగర్ జిల్లా బాలుడిపై అఘాయిత్యం.. ఆపై
సాక్షి, మహబూబ్‌నగర్: మహబూబ్‌నగర్ జిల్లా గండేడ్ మండలానికి చెందిన ఓ కుటుంబం పొట్ట కూటి కోసం రాష్ట్రం కాని రాష్ట్రం వెళ్తే ప్రాణం తీశారు కొందరు. 13 ఏళ్ల దివ్యాంగ బాలుడిపై అత్యంత పాశవికంగా లైంగిక దాడి చేసి, ఆపై హత్య చేశారు. మృతదేహాన్ని గోనెసంచిలో ఉంచి చెత్తకుండీలో పడేసిన దారుణమైన ఘటన మహారాష్ట్రలో చోటుచేసుకోగా.. శనివారం స్వగ్రామంలో బాలుడి అంత్యక్రియలు పూర్తయ్యాయి. వివరాలిలా.. గండేడ్ మండలంలోని పీర్లబండ తండాకు చెందిన ఓ దంపతులకు ముగ్గురు సంతానం. ఇందులో వారి రెండో సంతానమైన బాలుడు కరణ్ (13) దివ్యాంగుడు (మూగ). దీంతో అతన్ని పాఠశాలకు పంపలేదు. ఈ దంపతులు 15 ఏళ్లుగా పూణెకు బతుకు దెరువుకోసం వెళ్లి కూలీనాలి చేసుకుంటుండేవారు. కరోనా కారణంగా రెండేళ్ల క్రితం సొంత గ్రామానికి వచ్చి, తిరిగి రెండు నెలల క్రితం పూణెకు సదరు బాలుడిని వెంట తీసుకొని వెళ్లారు. తల్లిదండ్రులు కూలి పనికి వెళితే ఈ బాలుడు ఇంటి వద్దే ఉండేవాడు. గురువారం రోజులాగే తల్లిదండ్రులు పనికి వెళ్లడంతో బాలుడు ఇంటివద్దే ఉన్నాడు. సాయంత్రం 4 గంటల సమయంలో ఇంటి పక్కనే ఉన్న యూపీకి చెందిన పుంటి, మరొక వ్యక్తి కలిసి ఈ బాలుడిని బైక్‌పై ఓ ప్రాంతానికి తీసుకెళ్లి మరో ఇద్దరితో కలిసి లైంగిక దాడికి పాల్పడ్డారు. ఈ క్రమంలో బాలుడి చేతిని విరగ్గొట్టడంతో పాటు కణత, ముఖంపై తీవ్రంగా కొట్టారు. తమ లైంగిక వాంఛ తీర్చుకున్నాక అతడిని చంపారని కుటుంబీకులు కన్నీరు మున్నీరయ్యారు. దుండగులు బాలుడి మృతదేహాన్ని గోనె సంచిలో తీసుకొచ్చి చెత్తకుండిలో వేస్తుండగా అక్కడే ఉన్న సెక్యూరిటీ గార్డు గమనించి వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. సాయంత్రం పని నుంచి ఇంటికి వచ్చిన తల్లిదండ్రులు కుమారుడు కనిపించకపోవడంతో వెతుకుతుండగా.. పోలీసులు ఈ విషయాన్ని వారికి తెలిపారు. వెళ్లి చూడగా తమ కుమారుడేనని గుర్తించి గుండెలవిసేలా రోదించారు. తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో శుక్రవారం మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబీకులకు అప్పగించారు. స్వగ్రామంలో అంత్యక్రియలు పూణె నుంచి శనివారం ఉదయం స్వగ్రామమైన పీర్లబండతండాకు బాలుడి మృతదేహాన్ని తల్లిదండ్రులు తీసుకొచ్చారు. బాలుడి మృతదేహాన్ని చూసి తండావాసుల కన్నీరుమున్నీరయ్యారు. తమ పొలంలో అంత్యక్రియలు నిర్వహించారు. ‘ ఇలాంటి ఘటన చోటుచేసుకోవడం దురదృష్టకరమని, బాధిత కుటుంబానికి డబుల్ బెడ్రూం ఇల్లు ఇవ్వడంతోపాటు అన్ని రకాలుగా ఆదుకుంటాం’ అని పరిగి ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డి పేర్కొన్నారు. శనివారం ఆయన బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. చేవెళ్ల ఎంపీ రంజిత్‌రెడ్డి ఫోన్లో మహారాష్ట్ర డీజీపీతో మాట్లాడి నిందితులను కఠినంగా శిక్షించాలని కోరారు. -
భర్త అరెస్ట్.. హాస్పిటల్లో నటి పూనమ్ పాండే
Poonam Pandeys Husband Sam Bombay Arrested: బాలీవుడ్ నటి పూనమ్ పాండేపై భర్త సామ్ బాంబే అరెస్ట్ అయ్యాడు. పూనమ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ముంబై పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. వివరాల ప్రకారం..సామ్‌బాంబే తన మొదటి భార్య అల్విరాతో మాట్లాడుతుండటంపై ఇద్దరికి వాగ్వాదం జరిగింది. ఈ గొడవలో కోపంతో ఊగిపోయిన సామ్ బాంబే..పూనమ్‌ను జుట్టు పట్టుకొని తలను గోడకు కొట్టాడు. విచక్షణరహితంగా ఆమెపై దాడి చేశాడు. దీంతో పూనమ్ తల, కళ్లు, ముఖంపై తీవ్ర గాయాలయ్యాయి. పూనమ్ ఫిర్యాదు మేరకు బాంద్రా పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. తీవ్ర గాయాలపాలైన పూనమ్ ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. కాగా రెండేళ్లు సహజీవనం అనంతరం గతేడాది సెప్టెంబర్1న పూనమ్-శామ్ బాంబే వివాహ బంధంతో ఒక్కటయ్యారు. అయితే పెళ్లయిన కొద్ది రోజులకే శామ్ బాంబే.. పూనమ్‌పై చేయి చేసుకోవడంతో పాటు విచక్షణరహితంగా దాడి చేయడంతో ఆమె గృహహింస కేసు పెట్టింది.అనంతరం భర్త క్షమాపణలు చెప్పి రాజీకి దిగడంతో వివాదం సద్దుమణిగింది. తాజాగా మరోసారి సామ్ బాంబే చేసిన దాడిలో పూనమ్ తీవ్ర గాయాలపాలైంది. ఈ సందర్భంగా ఓ మీడియా ఛానల్‌తో మాట్లాడుతూ.. 'ఇది మొదటి సారి జరిగింది కాదు. ప్రతిసారి సామ్ నన్ను కొట్టడం..ఆ తర్వాత ఏడుస్తూ క్షమాపణలు చెప్పడంతో నేను కరిగిపోయేదాన్ని. ఈసారి మాత్రం నన్ను చావబాదాడు. దాదాపు సగం హత్య చేసినంత దారుణంగా హింసించాడు. దీని వల్ల ఎన్ని రోజులు నేను హాస్పిటల్లో ఉండాల్సి వస్తుందో నాకే తెలియదు' అంటూ కన్నీటి పర్యంతం అయ్యింది. -
వైరల్ వీడియో: కన్నకొడుకు కంటే ఈ కుక్కే నయం..!
కన్న తల్లిదండ్రుల మీద దయలేని కొడుకు పుట్టినా ఒకటే.. చచ్చినా ఒకటే...! తల్లిదండ్రులను పట్టించుకోని కొడుకులు పుట్టలో పుట్టి చచ్చే చెద పురుగులతో సమానం. వారి వల్ల ఏం ప్రయోజనం లేదని వేమన మహాకవి ఏనాడో.. చెప్పాడు. అదే సరియైనదని నేటి సమాజంలో ఎన్నో ఘటనలు నిరూపిస్తూనే ఉన్నాయి. తాజాగా తమిళనాడులో జరిగిన ఘటన మానవత్వాన్ని ప్రశ్నిస్తోంది. కన్న కొడుకు కంటే పెంపుడు కుక్క నయం అని నిలదీస్తోంది. చదవండి: Afghanistan-CAA: అఫ్గాన్ నుంచి భారత్‌లోకి ఎంట్రీ.. తెరపైకి సీఏఏ చెన్నై: తమిళనాడులోని పొన్నేరిపట్టిలో ఓ వ్యక్తి డబ్బుల కోసం తన తల్లిపై దారుణంగా దాడి చేశాడు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పోలీసుల వివరాల ప్రకారం.. ‘‘నల్లమ్మల్ అనే వృద్ధురాలు తన భర్త చనిపోయిన తర్వాత పొన్నేరిపట్టిలో ఒంటరిగా నివసిస్తోంది. ఆమె అప్పటికే తన భూమిని తన కొడుకు పేరు మీద రిజిస్టర్ చేసింది. ఇక ఆ వృద్ధురాలు ఎంఎన్ఆర్ఈజీఏ పథకం కల్పించే పనులకు వెళ్లి.. దాని ద్వారా వచ్చిన సంపాదనతో జీవిస్తోంది. ఆ విధంగా నల్లమ్మల్ పైసా పైసా పోగు చేసి రూ. 3 లక్షలు ఆదా చేసింది. ఆ డబ్బుల కోసం షణ్ముగం తన తల్లిని రోడ్డుపైకి లాగుతూ ఆమె నుంచి కీలను లాక్కోవడానికి ప్రయత్నించాడు. అయితే నల్లమ్మల్ కుక్క షణ్ముగంపై దాడి చేసి ఆ వృద్దురాలిని కాపాడే ప్రయత్నం చేసింది.’’ అని తెలిపారు.కాగా ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ కావడంతో గుర్తించిన నామక్కల్ పోలీసులు కేసు నమోదు చేసి షణ్ముగంను అరెస్టు చేశారు. పరారీలో ఉన్న అతని భార్య కోసం గాలింపు చర్యలు చేపట్టారు. నల్లమ్మల్‌కు గాయాలు కావడంతో స్థానిక ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. ఈ ఘటనపై ఓ నెటిజన్ స్పందిస్తూ.. ‘‘ఇది చాలా దారుణం.. అతడు కొడుకు కాదు.. రాక్షసుడు. అతడిని వెంటనే శిక్షించాలి.’’ అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. Man brutally attacks his mother for money while her dog tries to protect her.. pic.twitter.com/rDd8MEWZ6v — Pramod Madhav♠️ (@PramodMadhav6) August 22, 2021 చదవండి: దారుణం: కన్నతల్లిపై కొడుకు, కోడలి పైశాచికత్వం.. -
కత్తులతో అమానుషంగా దాడిచేసి.. చెత్తను తినాలంటూ..
ముంబై: ముంబైలో దారుణం చోటుచేసుకుంది. జోగేశ్వరి ప్రాంతంలో ఒక వ్యక్తిపై.. ఇద్దరు రౌడిషీటర్లు దాడిచేసిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాలు.. ఈ సంఘటన జులై నెలలో జోగేశ్వరి ప్రాంతంలోని రైల్వేస్టేషన్ దగ్గర జరిగిందని తెలిపారు. దీనిలో సదరు వ్యక్తిపై ఇద్దరు రౌడిషీటర్లు ఇనుప రాడ్లు, కత్తులతో దాడిచేసి తీవ్రంగా కొట్టారు. అంతటితో ఆగకుండా.. అక్కడే ఉన్న చెత్తను తినే విధంగా అమానుషంగా ప్రవర్తించారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నిందితులిద్దరిలో ఒకరిని మాలిక్ షేక్(47).. మరొకరిని ఫహిద్ అలీ షేక్(20)లుగా గుర్తించారు. ఇప్పటికే వీరిపై.. మేఘ్వాడి పోలీస్ స్టేషన్లో పలు కేసులు ఉన్నాయని పేర్కొన్నారు. ఈ క్రమంలో, మాలిక్ షేక్‌ను పోలీసులు అదుపులోకి తీసుకోగా.. మరొ నిందితుడు ఫహిద్ అలీ షేక్ పరారీలో ఉన్నాడని పోలీసులు తెలిపారు. కాగా, పాతకక్షల నేపథ్యంలో దాడులు చేసుకుని ఉంటారని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తులో మరిన్ని విషయాలు తెలుస్తాయని పేర్కొన్నారు. -
పాత కక్షలతో తండ్రీకొడుకులపై దాడి.. మూత్రం తాగాలంటూ..
జైపూర్: రాజస్థాన్‌లోని బార్మెర్లో దారుణం చోటు చేసుకుంది. 15 మంది వ్యక్తులు కలిసి దళిత వ్యక్తిని, అతడి కొడుకుపై దాడి చేసి బలవంతంగా మూత్రం తాగించారు. పోలీసుల వివరాల ప్రకారం.. బార్మెర్లోని బిజ్రాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గోహద్ కా తాలా గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుందని తెలిపారు. కిరాణా దుకాణంలో రాయ్‌చంద్ మేఘవాల్, అతని కుమారుడు రమేష్ వస్తువులను కొనుగోలు చేస్తున్న సమయంలో దాడి జరిగినట్లు పోలీసలు పేర్కొన్నారు. ఓ 15 మంది వ్యక్తులు అకస్మాత్తుగా తండ్రీకొడుకుల పై దాడి చేసి మూత్రం తాగమని బలవంతం చేసినట్లు వెల్లడించారు. కులం పేరుతో దూషించి అవమానించినట్లు తెలిపారు. అంతే కాకుండా రాయ్‌చంద్‌పై దాడి చేయడంతో అతడి పంటిని కోల్పోగా.. రమేష్‌కు కాలు విరగడంతో పాటు చేతికి గాయాలయ్యాయి. కాగా, ప్రాధమిక చికిత్స కోసం బాధితులను చౌహతాన్‌కు తరలించి, తదుపరి చికిత్స కోసం బార్మెర్లోని ప్రభుత్వ వైద్య కళాశాలకు తరలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు ఈ కేసులో ప్రధాన నిందితుడైన ఖేత్ సింగ్ సహా 15 మందిపై కేసు నమోదు చేశారు. ఇది పాత శత్రుత్వానికి సంబంధించిన కేసుగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ కేసుకు సంబంధించి దర్యాప్తు ప్రారంభించామని, నిందితులు పరారీలో ఉన్నారని పోలీసులు తెలిపారు. -
కొత్త ట్విస్ట్: యువతికి షాకిచ్చిన జొమాటో డెలివరీ బాయ్
బెంగళూరు: గత కొద్ది రోజులుగా యువతి-జొమాటో డెలివరీ బాయ్‌ల మధ్య వివాదానికి సంబంధించిన వార్తలు వెలుగు చూస్తున్నాయి. ఫుడ్ డెలివరీ ఆలస్యం కావడంతో ఆ ఆర్డర్‌ను క్యాన్సిల్ చేసిన మహిళా కస్టమర్‌పై జొమాటో డెలివరీ బాయ్ దాడి చేశాడని ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలో సదరు డెలివరీ బాయ్ కామరాజ్‌ను బెంగళూరు పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం బెయిల్ మీద విడుదలైన కామరాజ్ సదరు యువతిపై కేసు పెట్టాడు. తనపై ఏ పోలీస్ స్టేషన్లో అయితే కేసు నమోదయ్యిందో.. అదే పీఎస్‌లో ఆమెపై కేసు పెట్టాడు. ఈ సందర్భంగా కామరాజ్ మాట్లాడుతూ.. ‘‘నేను సదరు యువతిపై ఎలాంటి దాడి చేయలేదు. డెలివరీ ఆలస్యం అయినందుకు నేను ఆమెకు క్షమాపణలు కూడా చెప్పాను. ఆర్డర్ క్యాన్సిల్ అయినందున ఫుడ్ తిరిగి ఇచ్చేయాల్సిందిగా కోరాను. కానీ ఆమె అంగీకరించలేదు. పైగా నన్ను అసభ్య పదజాలంతో దూషించింది. నా మీదకు షూ విసిరింది. ఈ క్రమంలో అనుకోకుండా తనను తానే గాయపర్చుకుంది. చివరకు నేను ఆమెపై దాడి చేశానని పోలీసులకు ఫిర్యాదు చేసింది. వాస్తవానికి ఆమె నన్ను అసభ్య పదజాలంతో దూషించి.. అవమానించింది. అందుకే ఆమెపై కేసు పెట్టాను’’ అన్నాడు. కామరాజ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు సదరు యువతి మీద ఐపీసీ 341, 355, 504 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఇదిలా ఉండగా సదరు యువతి మాత్రం ‘‘ముందు నేను డెలివరీ బాయ్‌ను తిట్టలేదు. ఫస్ట్ అతనే చాలా రూడ్‌గా ప్రవర్తించాడు. ఆ భయంలో, కంగారులో నేను అతడిని తిట్టాను. అంతే తప్ప కావాలని అతడిని దూషించలేదు.. అవమానించలేదు’’ అని తెలిపారు. ఇక ఈ వివాదంపై సోషల్ మీడియా జనాలు రెండుగా విడిపోయారు. కొందరు సదరు యువతికి మద్దతు ఇస్తుండగా.. మరికొందరు మాత్రం డెలివరీ బాయ్‌ను సపోర్ట్ చేస్తున్నారు. చదవండి: డెలివరీ బాయ్ ఏ పాపం ఎరుగడు: బాలీవుడ్ హీరోయిన్ -
పార్లమెంట్ స్పీకర్‌పై దాడి..
యెరెవాన్: వివాదాస్పదమైన నాగోర్నో-కరాబాఖ్ ప్రాంతంపై ఆధిపత్యం కోసం గత కొద్ది రోజులుగా అజర్బైజాన్, ఆర్మేనియా మధ్య భీకర పోరాటం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇరు దేశాల మధ్య కొనసాగుతన్న సైనిక ఘర్షణకు స్వస్తి పలికేందుకు గాను ఆర్మేనియా ప్రధాని నికోల్ పషిన్యన్ అజర్బైజాన్, రష్యాలతో శాంతి ఒప్పందాన్ని ప్రకటించాడు. దాంతో ఆగ్రహించిన నిరసనకారులు ఆర్మేనియన్ పార్లమెంటుపై దాడి చేసి స్పీకర్ అరరత్ మిర్జోయన్‌ను గాయపర్చారు. రష్యన్ వార్తా సంస్థ ప్రకారం.. యెరెవాన్ నగరంలోని ఆర్మేనియన్ పార్లమెంట్ బయట మంగళవారం తెల్లవారుజామున నిర్వహించిన నిరసనలలో పాల్గొన్న ఆందోళనకారుల చేతిలో స్పీకర్ మిర్జోయన్ గాయపడినట్లు తెలిపింది. ఈ విషయాన్ని ప్రధాని నికోల్ పషిన్యన్ తన ఫేస్బుక్ అకౌంట్ ద్వారా అధికారికంగా ప్రకటించారు. దాడిలో తీవ్రంగా గాయపడటంతో మిర్జోయన్‌కు ఆపరేషన్ జరిగినట్లు వెల్లడించారు. ఆయన ప్రాణానికి ఎలాంటి ప్రమాదం లేదన్నారు. ప్రధాని శాంతి ఒప్పందం ప్రకటించడంతో నిరసనకారులు యెరెవాన్ వీధుల్లో హింసాయుత చర్యలకు దిగారు. ఇందుకు సంబంధించిన వీడియోలను కొందటు ట్విట్టర్లో షేర్ చేశారు. ఇక పార్లమెంట్‌పై దాడి చేసిన నిరసనకారులందరికి శిక్ష పడుతుందని పషిన్యన్ మరో ప్రకటనలో తెలిపారు. (చదవండి: ప్రధాని సతీమణి సైన్యంలో శిక్షణ) శాంతి ఒప్పందం దేని గురించి నాగోర్నో-కరాబాఖ్ ప్రాంతంలో తలెత్తిన సైనిక ఘర్షణకు స్వస్తి పకలడానికి ఆర్మేనియా శాంతి ఒప్పందంతో ముందుకు వచ్చింది. దీన్ని కీలక పరిణామంగా పేర్కొన్నది. ఇక వీలైనంత త్వరగా యుద్ధాన్ని ముగించడానికి శాంతి ఒప్పందానికి అంగీకరించానని నాగోర్నో-కరాబాఖ్ ప్రాంత నాయకుడు అరైక్ హరుతున్యన్ ఫేస్బుక్ లైవ్‌లో తెలిపారు. ఇక తాజా ఒప్పందం ప్రకారం.. అజర్బైజాన్ ఇటీవలి పోరాటంలో ఆక్రమించిన భూభాగం దాని అధీనంలోనే ఉంటుంది. ఇక వచ్చే నెలలో ఆర్మేనియా అదనపు భూభాగాన్ని ఆక్రమిస్తుందని తెలిపింది. అంతేకాక నాగోర్నో-కరాబాఖ్లను ఆర్మేనియాతో అనుసంధానించే రహదారికి కాపలాగా రష్యన్ భద్రతా దళాలను ఉంచారని ఆర్టీ.కామ్ నివేదించింది.(చదవండి: అజర్‌బైజాన్‌పై ఆర్మేనియా క్షిపణి దాడులు!) సెప్టెంబర్ 27 న, నాగోర్నో-కరాబాఖ్ ప్రాంతంపై పట్టు కోసం ఆర్మేనియా, అజ్ర్బైజాన్ మధ్య తాజా వివాదం చెలరేగింది. నాగోర్నో-కరాబాఖ్ అజర్బైజాన్ పరిధిలోకి వస్తోంది. కాని దక్షిణ కాకసస్ పొరుగుదేశాల మధ్య తలెత్తిన యుద్ధం ముగిసినప్పటి నుంచి అంటే 1994 నుంచి ఈ ప్రాంతం ఆర్మేనియన్ దళాల నియంత్రణలో ఉంది. -
హత్రస్‌లో మరో ఘోరం!
లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని హత్రాస్‌లో బాలికపై జరిగిన హత్యాచార ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఈ ఘటన మరువక ముందే మరో ఘోరమైన ఘటన హత్రాస్‌లో చోటుచేసుకుంది. నాలుగేళ్ల బాలికపై ఆమె తరుపు బంధువులే అత్యాచారం చేశారు. బాలిక ఇంటి ముందు ఆడుకుంటుండగా అరవింద్ అనే వ్యక్తి తీసుకువెళ్లి లైంగిక దాడి చేశాడని బాలిక మామయ్య తెలిపారు. అనంతరం సాయంత్రం పూట బాలికను చూసిన తల్లిదండ్రులకు అనుమానం రావడంతో ఆమెను వైద్యులకు చూపించారు. వైద్యులు ఆమెపై అత్యాచారం జరిగినట్లు నిర్థారించారు. దీంతో బాలిక బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు. సెప్టెంబర్‌లో హత్రాస్‌లో బాలికపై ఉన్నత వర్గాలకు చెందిన యువకులు అత్యాచారానికి పాల్పడి ఘోరంగా హింసించారు. అనంతరం ఆమె మరణించడంతో దేశవ్యాప్తంగా తీవ్ర నిరసనలు వ్యక్తమైన సంగతి తెలిసిందే. చదవండి: హథ్రాస్ కేసు : గ్రామ పెద్ద సంచలన ఆరోపణలు -
వృద్ధురాలిపై అత్యాచారం..నిందితుడి అరెస్ట్
ఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో 90 ఏళ్ల వృద్ధురాలిగా అత్యాచారానికి పాల్పడిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల ప్రకారం ఢిల్లీ చావ్లాలోనా నజాఫ్‌గంజ్ ప్రాంతానికి చెందిన 37 ఏళ్ల వ్యక్తి అదే అదే ప్రాంతంలో నివసిస్తున్న వృద్ధురాలిపై లైంగికదాడికి తెగబడ్డాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. నిందుతుడిని కఠినంగా శిక్షించాలని పలువురు డిమాండ్ చేశారు. మంగళవారం ఢిల్లీ కమిషన్ ఫర్ ఉమెన్ ( డీసీడబ్ల్యూ ) చీఫ్ స్వాతి మాలివాల్ బాధిత వృద్దురాలిని పరామర్శించారు. కాగా ఘటన జరిగిన 24 గంటల్లోనే పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేయడం విశేషం. పోలీసుల చర్యను ప్రశంసిస్తూ పలువురు నెటిజన్లు ట్వీట్ చేస్తున్నారు. (ఏ తండ్రీ భరించలేడు.. నేను చచ్చిపోవాలి) अम्मा उस 33 साल के दरिंदे से भीख माँगती रही की उनको छोड़ दे! वो उसके दादी की उमर की हैं। पर हवस के नशे में डूबे हुए उस जानवर ने रेप कर सब हद पार कर दीं! कैसा समाज है हमारा? इंसानियत मर गयी है जिसके लिए 6 महीने की बेटी और 90 साल की महिला - दोनों ही सिर्फ़ एक वस्तु है। शर्मनाक! https://t.co/wleCn8wBPl — Swati Maliwal (@SwatiJaiHind) September 8, 2020 -
ఈ అవమానాన్ని భరించలేను.. అందుకే
లక్నో: ఉత్తరప్రదేశ్‌లో దారుణం చోటు చేసుకుంది. దొంగతనం చేశాడనే నేపంతో ఓ యువకుడిని చెట్టుకు కట్టేసి కొట్టారు. అవమానం భరిచలేక సదరు యువకుడు ఆత్మహత్య చేసుకుని మరణించాడు. ఈ సంఘటన రాష్ట్రంలోని బరేలీ జిల్లాలో చోటు చేసుకుంది. వివరాలు.. వాసిద్ అనే యువకుడు మాదక ద్రవ్యాలకు బానిసగా మారాడు. ఈ క్రమంలో తమ ప్రాంతలోని ప్రభుత్వ కార్యాలయంలో కొన్ని వస్తువులను దొంగిలించాడని స్థానికులు ఆరోపించారు. ఈ మేరకు అతడిని పట్టుకుని చెట్టుకు కట్టేసి దాడి చేశారు. కొందరు యువకులు జరిగే తతంగాన్ని తమ సెల్ఫోన్లలో బంధించారు. అనంతరం అతడిని పోలీస్ స్టేషన్‌కు తీసుకువెళ్లారు. వాసిద్ తమ దగ్గర నుంచి దొంగిలించిన వస్తువులను తీసుకున్నాము.. అతడి మీద ఎలాంటి కేసు ఫైల్ చేయకూడదని స్థానికులు పోలీసులకు తెలిపారు. అతడు చేసిన పనికి తామే వాసిద్‌ని శిక్షించామని.. కేసు పెట్టవద్దని కోరారు. (చదవండి: సినీ నటి ఇంట్లో బంగారం దోచేసిన నర్సు) దాడి సమయంలో వాసిద్కు చిన్న చిన్న గాయలే అయ్యాయంటున్నారు పోలీసులు. ఇందుకు సంబంధించిన వీడియోలో తీవ్రంగా గాయపడిన వాసిద్ పోలీస్ స్టేషన్లో ఓ చెక్క బెంచీ మీద కూర్చుని ఉన్నాడు. అతడి కుడి మోకాలికి గాయం అయ్యింది. బట్టలు చిరిగి పోయి ఉన్నాయి. ఇరు వర్గాల మధ్య రాజీ కుదిరిన అనంతరం వాసిద్‌ని విడిచిపెట్టారు. పోలీస్ స్టేషన్ నుంచి వెళ్లిన గంటకే వాసిద్ ఆత్మహత్య చేసుకున్నాడు. జరిగిన అవమానాన్ని భరించలేకనే అతడు చనిపోయినట్లు కుటుంబీకులు ఆరోపిస్తున్నారు. పోస్టుమార్టం నిర్వహిస్తున్నామని, దాని ఫలితాలు వెలువడిన తర్వాత చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. -
అర్థరాత్రి మెడికోకు అసభ్యకరమైన సందేశాలు
శంషాబాద్: శంషాబాద్ పట్టణంలోని వీజేఆర్ హోటల్లో విశ్రాంతి తీసుకుంటున్న మెడికోతో అసభ్యంగా ప్రవర్తించిన ముగ్గురిని ఆర్జీఐఏ పోలీసులు రిమాండ్‌కు తరలించారు. ఆర్జీఐఏ సీఐ విజయ్‌కుమార్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. కర్నాటక రాష్ట్రం బెంగళూరుకు చెందిన యువతి (24) ఉక్రెయిన్‌లో ఎంబీబీఎస్ చదువుతోంది. వందేభారత్ మిషన్‌లో భాగంగా ఏర్పాటు చేసిన విమానంలో సోమవారం రాత్రి శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకుంది. శంషాబాద్ పట్టణం నుంచి ప్రైవేటు ట్రావెల్స్ ద్వారా బెంగళూరుకు వెళ్లేందుకు జాతీయ రహదారిపై నిలబడగా.. ఆమెను గమనించిన ఆంధ్రప్రదేశ్‌లోని నంద్యాలకు చెందిన విజయ్‌కుమార్ (26) పురేందర్ కుమార్(25) శంషాబాద్ పట్టణంలోని వస్త్రవ్యాపారి పి.రామస్వామి కుమారుడు పి.ప్రవీణ్‌లు యువతితో మాటలు కలిపారు. బస్సు రావడానికి ఆలస్యమైతే పక్కనే ఉన్న వీజేఆర్ హోటల్లో గది తీసుకోవాల్సిందిగా ప్రోత్సహించారు. బస్సు రావడానికి సమయం చాలా ఉండడంతో వారి మాటలు నమ్మిన యువతి విశ్రాంతి కోసం హోటల్లో గది అద్దెకు తీసుకుంది. సదరు యువకులు అదే హోటల్లో కొన్ని రోజులుగా అద్దెకుంటున్నారు. హోటల్లో యువతి గదిలోకి వెళ్లినప్పటి నుంచి తరచూ ఆమెతో సంభాషించేందుకు యత్నించారు. అంతకుముందే ఆమె ఫోన్ నంబరు కూడా తీసుకోవడంతో యువతి ఫోన్‌కు అర్థరాత్రి సమయంలో అసభ్యకరమైన సందేశాలు పంపారు. రాత్రి 2 గంటల సమయంలో గది తలుపులు తట్టి అసభ్యకరంగా మాట్లాడడంతో అప్రమత్తమైన యువతి తన సోదరుడికి ఫోన్లో విషయం చెప్పింది. దీంతో నగరంలో ఉండే యువతి సోదరుడి స్నేహితులు ఆర్జీఐఏ పోలీసు స్టేషన్‌కు తెల్లవారుజామున చేరుకుని ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు విజయ్, పురేందర్ కుమార్, ప్రవీణ్‌లను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. వీజేఆర్ హోటల్‌పై కూడా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. -
అత్తపై అల్లుడి దాడి
ఆళ్లగడ్డ రూరల్: తన భార్యను కాపురానికి పంపలేదని అల్లుడు అత్తపై వేటకొడవలితో దాడికి పాల్పడిన ఘటన మండలంలోని చింతకొమ్మదిన్నె గ్రామంలో గురువారం చోటుచేసుకుంది. రూరల్ సీఐ సుదర్శనప్రసాద్ తెలిపిన వివరాలు.. గ్రామానికి చెందిన పెద్దక్క కూతురు తులసీని పదేళ్ల క్రితం వైఎస్సార్ జిల్లా చాపాడు మండలం సిద్దారెడ్డిపల్లె గ్రామానికి చెందిన హరిఆంజనేయులుకు ఇచ్చి వివాహం చేశారు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. కొంతకాలానికి తాగుడుకు బానిసైన హరిఆంజనేయులు భార్యపై అనుమానంతో వేధింపులకు గురిచేసేవాడు. ఈక్రమంలో మూడు రోజుల క్రితం తులసీ శుభకార్యం నిమిత్తం(సోదరుడి పెళ్లి) పుట్టినింటికి వచ్చింది. గురువారం భార్యను తీసుకెళ్లేందుకు హరిఆంజనేయులు చింతకొమ్మదిన్నెకు వచ్చాడు. మరో వారం తర్వాత పంపుతానని అత్త చెప్పి పొలానికి వెళ్లింది. దీంతో కోపోద్రిక్తుడైన అల్లుడు వెంట వెళ్లాడు ఊరి చివర వేటకొడవలితో అత్త గొంతుపై నరికి పారిపోయాడు. తీవ్రంగా గాయపడిన ఆమెను అంబులెన్స్‌లో ఆళ్లగడ్డ ప్రభుత్వ వైద్యశాలకు తీసుకెళ్లారు. ప్రాథమిక చికిత్స అనంతరం పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం నంద్యాలకు తరలించారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. -
ఆకలితో వృద్ధురాలి అరిగోస
చౌటుప్పల్ : తల్లిదండ్రుల పేరిట ఉన్న ఆస్తిని కుమారుడు తన పేరిట చేయించుకున్నాడు.. ఇప్పటికే తండ్రి చనిపోగా వృద్ధాప్యంలో ఉన్న తల్లికి బుక్కెడు బువ్వ పెట్టేందుకు నానాయాగి చేస్తున్నాడు. సూటిపోటి మాటలతో హింసిస్తున్నారు. కాలు విరగడంతో లేవలేని పరిస్థితుల్లో ఉన్న తల్లిని కుమారుడు ఏమాత్రం పట్టించుకోకపోగా, ఆయన భార్య సైతం చీదరించుకుంటుంది. మనువడు కూడా తల్లిదండ్రు ల మద్దతుతో నానమ్మపై భౌతికదాడులకు పాల్పడుతున్నాడు. ఈ క్రమంలో ఐదు రోజుల క్రితం ఇంటినుంచి బయటకు వచ్చిన వృద్ధురాలు గ్రామస్తుల వద్ద చేయిచాచి పూట గడుపుకుంది. ఈ క్రమంలో కుమార్తెను తీసుకొని మంగళవారం ఆర్డీఓ సాల్వేరు సూరజ్‌కుమార్‌ను సంప్రదించింది. ఆర్డీఓ సత్వరమే స్పందించి వృద్ధురాలికి న్యాయం జరిగేలా చర్యలు తీసుకున్నారు. వివరాల్లోకి వెళ్తే... యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండల పరిధిలోని ధర్మోజిగూడెం గ్రామానికి చెందిన సుర్కంటి రాంరెడ్డి–సత్తమ్మ దంపతులకు కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఇద్దరికి వివాహాలయ్యాయి. సుమారు ఏడేళ్ల క్రితం రాంరెడ్డి చనిపోగా, సత్తమ్మ(75) కుమారుడు మల్లారెడ్డి వద్ద ఉంటోంది. తండ్రి చనిపోయిన రెండేళ్ల తర్వాత అతని పేరిట ఉన్న మూడెకరాల వ్యవసాయ భూమిని కుమారుడు తన పేరిట పట్టా మార్చుకున్నాడు. ఆ సమయంలో తల్లి సత్తమ్మకు 30వేల రూపాయల నగదు ఇచ్చాడు. కొంత కాలం తర్వాత తల్లి వద్ద ఉన్న ఆ నగదును తీసుకున్నాడు. తల్లికి మంచినీళ్లు తాగిపిస్తున్న కుమార్తె ప్రస్తుతం సత్తమ్మకు వృద్ధాప్య పెన్షన్ వస్తుండడంతో పూట గడుపుకుంటోంది. రెండేళ్ల క్రితం సత్తమ్మకు కాలు విరగడంతో నార్కట్‌పల్లిలోని కామినేని ఆసుపత్రిలో చికిత్స పొందింది. ఆ సమయంలో కుమారుడు, కోడలు, మనుమడు కనీసం మందలివ్వలేదు. సపర్యలన్నీ కుమార్తె ప్రేమలతే చేసింది. ఇటీవల కొడుకు, కోడలు, మనువడి నుంచి చీదరింపులు, భౌతికదాడులు మొదలయ్యాయి. ఆ క్రమంలో ఐదు రోజుల క్రితం మనుమడు సత్తమ్మపై చేయి చేసుకున్నాడు. మనస్తాపం చెందిన వృద్ధురాలు ఇంటినుంచి బయటకు వచ్చి గ్రామస్తుల వద్ద అడుక్కొని పూట గడుపుకుంది. స్థానికుల ద్వారా తెలుసుకున్న సమాచారంతో కుమార్తె ప్రేమలతను తీసుకొని స్థానిక ఆర్డీఓ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్ గుత్తా వెంకట్‌రెడ్డిని సంప్రదించింది. ఆమె కు ఆయన అల్పహారం, భోజనం సమకూర్చారు. అనంతరం విషయాన్ని ఆర్డీఓ సాల్వేరు సూరజ్‌కుమార్ దృష్టికి తీసుకెళ్లారు. తక్షణమే స్పందించిన ఆర్డీఓ.. కుమారుడిని కార్యాలయానికి పిలిపించారు. తల్లి పట్ల అమానుషంగా ప్రవర్తించడం మానుకోకుంటే భూమిపట్టా రద్దు చేయిస్తామని హెచ్చరించారు. నాయనమ్మపై చేయి చేసుకుంటే స్థానిక కంపెనీలో పని చేసే మనువడు సునీల్‌రెడ్డి ఉద్యోగం తీయిస్తామన్నారు. స్పందించిన కుమారుడు మల్లారెడ్డి మరోసారి ఇలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా చూసుకుంటామని హామీ ఇచ్చాడు. -
చున్నీ లాగాడని చితకబాదిన ఎస్ఐ?
నెల్లూరు(క్రైమ్): ఏమాత్రం సంబంధం లేని విషయంలో ఎస్ఐ తన కుమారుడిని పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లి తీవ్రంగా కొట్టాడని ఆరోపిస్తూ ఓ తల్లి సోమవారం వేదాయపాలెం పోలీస్‌స్టేషన్ ఎదుట విలపించింది. సదరు ఎస్ఐపై చర్యలు తీసుకోవాలని ఆమె ఉన్నతాధికారులను కోరింది. బాధిత తల్లి, సేకరించిన సమాచారం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. వేదాయపాలెం పోలీసుస్టేషన్ పరిధిలో ఈ నెల 21వ తేదీన తెలుపురంగు స్కూటీలో వెలుతున్న యువకుడు ఓ యువతి చున్నీ పట్టుకుని లాగాడని పోలీసులకు ఫిర్యాదు అందింది. ఈ ఘటనలో అనుమానంతో ఆదివారం రాత్రి గాంధీనగర్‌కు చెందిన పవన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. తనకు ఏమీ తెలియదనీ, ఎవరి చున్నీ లాగలేదని ఆ యువకుడు చెబుతున్నా పట్టించుకోకుండా ఎస్ఐ కొట్టడంతో అస్వస్థతకు గురయ్యాడు. స్టేషన్ బయట ఉన్న కుటుంబసభ్యులను పిలిచిన పోలీసులు వెంటనే అతనిని తీసుకెళ్లాలని సూచించారు. దీంతో బాధిత కుటుంబసభ్యులు అతనిని చికిత్సనిమిత్తం జీజీహెచ్‌కు తరలించి చికిత్స చేయించారు. ఎస్ఐ వ్యవహారశైలిని నిరసిస్తూ బాధిత తల్లి, కుటుంబసభ్యులు సోమవారం వేదాయపాలెం పోలీస్‌స్టేషన్ వద్దకు చేరుకున్నారు. తన కుమారుడు ఈ నెల 21వ తేదీన నెల్లూరు నగరంలోనే లేడని పనుల కోసం బయటకు వెళ్లాడని చెబుతున్నా పోలీసులు వినకుండా తీవ్రంగా కొట్టారని బాధిత తల్లి చంద్రకళ ఆరోపించింది. ఈ ఘటనపై ఉన్నతాధికారులు స్పందించి ఆ ఎస్ఐపై చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు. ఇదే విషయాన్ని ఆమె స్థానిక వేదాయపాళెం ఇన్స్పెక్టర్ టి.వి.సుబ్బారావును సైతం కోరింది. -
కన్నతండ్రి దాష్టీకం
పశ్చిమగోదావరి, పోడూరు: పిల్లలను కంటికి రెప్పలా చూసుకోవాల్సిన కన్న తండ్రే కర్కశంగా మారి ఆరేళ్ల కూతురికి వాతలు పెట్టిన ఘటన పోడూరు మండలం అప్పన్నచెరువులో చోటు చేసుకుంది. బాలిక అమ్మమ్మ పిర్యాదుతో ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన పై పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. అప్పన్నచెరువుకు చెందిన కుసుమె ఆసిక(6)మట్టి తింటోందని తండ్రి కుసుమె కల్యాణ్ ఆ బాలికకు కాల్చి వాతలు పెట్టాడు. కన్న కూతురన్న కనికరం కూడా లేకుండా బాలిక ముఖంపై , కాలి తొడపై వాతలు పెట్టాడు. దీంతో ఆ బాలికకు ముఖం, తొడపై బొబ్బలొచ్చి గాయాలయ్యాయి. కల్యాణ్ కొన్నేళ్ల కిందట అదే గ్రామానికి చెందిన జ్ఞానకుమారిని ప్రేమ వివాహం చేసుకున్నాడు. ఇద్దరివీ పక్కపక్క ఇళ్లు. వీరికి ఇద్దరు కుమార్తెలు ఆసిక(6), ఆదర్శ(4), కుమారుడు అహరోను(3) సంతానం. కల్యాణ్ భార్య ఉపాధి నిమిత్తం 3 నెలల కిందట గల్ఫ్ దేశానికి వెళ్లింది. కల్యాణ్ మద్యానికి బానిసై ఇంటివద్దే ఖాళీగా ఉంటున్నాడు. తల్లి గల్ఫ్ వెళ్లడంతో పిల్లలు అమ్మమ్మ కొల్లి రత్నకుమారి ఇంటివద్దే ఉంటుంటారు. కాగా ఆసిక మట్టితినడంతో పాటు అల్లరి చేస్తోందని ఈ నెల 11వ తేదీన రాత్రి కల్యాణ్ తన ముగ్గురు పిల్లలను అమ్మమ్మ ఇంటి నుంచి తన ఇంటికి తీసుకెళ్లాడు. ఆ తరువాత పెద్దకుమార్తె ఆసికకు కాల్చి వాతలు పెట్టాడు. ఆసిక మరుసటి రోజు ఉదయం అమ్మమ్మ ఇంటికి వచ్చి ఏడుస్తూ విషయం చెప్పేవరకు వారికి కూడా ఈ విషయం తెలియలేదు. అప్పటికే కల్యాణ్ ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయాడు. ఈ ఘటనపై ఆసిక అమ్మమ్మ రత్నకుమారి పోడూరు పోలీస్‌స్టేషన్‌లో శుక్రవారం పిర్యాదు చేసింది. దీంతో స్థానిక ఎస్సై బి.సురేంద్రకుమార్ కేసు నమోదు చేసి బాలిక తండ్రి కల్యాణ్‌ను అరెస్టు చేసి కోర్టులో హాజరుపర్చారు. నిందితుడు కల్యాణ్‌కు కోర్టు14 రోజుల రిమాండ్ విధించినట్లు ఎస్సై సురేంద్రకుమార్ తెలిపారు. -
ఉపాధ్యాయురాలికి లైంగిక వేధింపులు
పశ్చిమగోదావరి, చింతలపూడి: విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఉపాధ్యాయుడు తన తోటి ఉపాధ్యాయురాలిని లైంగికంగా వేధిస్తున్న ఘటన పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి ప్రభుత్వ హైస్కూల్లో వెలుగు చూసింది. ఉన్నతాధికారులకు సదరు ఉపాధ్యాయురాలు ఫిర్యాదు చేయడంతో జిల్లా విద్యాశాఖాధికారిణి సీవీ రేణుక విచారణకు ఆదేశించారు. దీంతో జిల్లా విద్యాశాఖకు చెందిన ఆర్ఎంఎస్ ఏఓ ఎస్.సూర్యకుమారి, సీనియర్ అసిస్టెంట్లు కె.రాజకుమారి, కె.పావనీల ముగ్గురు సభ్యుల బృందం బుధవారం హైస్కూల్‌కు చేరుకుని ఉపాధ్యాయురాలు ఇచ్చిన ఫిర్యాదుపై విచారణ జరిపారు. వివరాలు ఇలా ఉన్నాయి.. చింతలపూడి ప్రభుత్వ హైస్కూల్లో గత 5 ఏళ్లుగా వెంకటరత్నం అనే ఉపాధ్యాయుడు పని చేస్తున్నాడు. అదే పాఠశాలలో పనిచేస్తున్న సహ ఉపాధ్యాయురాలిని గత కొద్ది నెలలుగా లైంగికంగా వేధిస్తున్నట్లు జిల్లా విద్యాశాఖాధికారికి, జిల్లా కలెక్టర్‌కు ఆ ఉపాధ్యాయురాలు ఫిర్యాదు చేసింది. దీంతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు విచారణ చేపట్టారు. పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థుల నుంచి జరిగిన సంఘటనపై వివరాలను సేకరించారు. ఈ సందర్భంగా ఏఓ సూర్యకుమారి మాట్లాడుతూ.. ఉపాధ్యాయులు, సిబ్బంది నుంచి వివరాలు సేకరించామని నివేదికను జిల్లా విద్యాశాఖాధికారికి అందజేస్తామని తెలిపారు. -
తెల్లవార్లూ బంధించి భార్యపై కానిస్టేబుల్ దాడి!
అనంతపురం సెంట్రల్: పోలీసు కానిస్టేబుల్ తన భార్యపై దాడి చేశాడనే వదంతులు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. నగరంలో ట్రాఫిక్ పోలీసుస్టేషన్లో పనిచేస్తున్న ఓ కానిస్టేబుల్ కళ్యాణదుర్గం బైపాస్ రోడ్డులో నివాసముంటున్నారు. మంగళవారం రాత్రి భార్యాభర్తల మధ్య తీవ్రస్థాయిలో గొడవ జరిగింది. దీంతో తెల్లవార్లూ ఓ గదిలో బంధించి విచక్షణారహితంగా దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది. బాధితురాలు గాయపడిన చిత్రాలు సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశారు. అయితే ఘటనపై ఎక్కడా ఫిర్యాదు రాలేదు. దీనిపై అనంతపురం డీఎస్పీ వీరరాఘవరెడ్డిని వివరణ కోరగా ఎక్కడ జరిగిందనే అంశంపై ఆరా తీస్తున్నట్లు వెల్లడించారు. ఏం జరిగిందో ఆరా తీయాలని ట్రాఫిక్ డీఎస్పీని కోరినట్లు వెల్లడించారు. కానిస్టేబుల్‌కు కౌన్సెలింగ్ ఇస్తాం ఈ అంశంపై ట్రాఫిక్ డీఎస్పీ మున్వర్‌హుస్సేన్ మాట్లాడుతూ సదరు కానిస్టేబుల్ గత ఏడాది జులై నుంచి ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్‌లో పని చేస్తున్నారన్నారు. ఇతనికి రెండు సంవత్సరాల క్రితం వివాహమైందని, రెండు నెలల క్రితం కుమార్తె పుట్టిందని తెలిపారు. అయితే తనను మానసికంగా వేధిస్తున్నాడని బాధితురాలు పోలీస్‌స్టేషన్‌కు వచ్చి మొర పెట్టుకుందన్నారు. కానిస్టేబుల్‌కు కౌన్సెలింగ్ నిర్వహించి చట్టపరంగా చర్యలు తీసుకుంటామన్నారు. -
ప్రభుత్వ ఉపాధ్యాయుల వాదులాట!
విజయనగరం, దత్తిరాజేరు: పిల్లలకు బుద్దులు చెప్పాల్సిన ఉపాధ్యాయులు తమలో తామే ఢీ అంటే ఢీ అన్నారు. నువ్వెంతంటే... నువ్వెంత! అన్న రీతిన వాదులాటకు దిగారు. పలువురు వారించినా ఎవరి మాట వినలేదు. అదో సమావేశమన్న విషయం మరచి అందరి ముందరే కొట్టుకున్నంత పని చేశారు. వివరాల్లోకి వెళ్తే.. దత్తిరాజేరు విద్యా శాఖ కార్యాలయంలో ఎంఈఓ అధ్యక్షతన ప్రధాన ఉపాధ్యాయులకు మంగళవారం వార్షిక ప్రణాళిక సమావేశం జరిగింది. సమావేశంలో వివిధ సంఘాలకు చెందిన ఉపాధ్యాయ నేతలు పాల్గొన్నారు. ఈ క్రమంలో ఒక యూనియన్‌కు చెందిన ఉపాధ్యాయుడు జీతాల విషయమై ఎందుకు ఆలస్యం చేస్తున్నారంటూ ప్రశ్నించడంతో మరో ఉపాధ్యాయుడు జోక్యం చేసుకున్నారు. ఇది కాస్త చినికిచినికి గాలివానలా మారి అక్కడ ఉన్న మిగతా ఉపాధ్యాయులు పోలీసుల వరకు వెళ్లాల్సి వచ్చింది. వీరి వివాదంలో పాత కాలం నాటి కొన్ని సంఘటనలు కారణంగా చెబుతున్నారు. గతంలో దాసుపేటలో ఉన్న ఉపాధ్యాయురాలిని అక్కడ హెచ్ఎంకు తెలియకుండా ఆకస్మికంగా బదిలీ చేయడం, అనారోగ్యం ఉన్న కె.కొత్తవలస ఉపాధ్యాయుడును దాసుపేటకు బదిలీ చేయడం వంటి విషయాల్లో వీరి మధ్య విబేధాలు నెలకొనడంతో వీరిద్దరి మధ్య రాయడానికి వీల్లేని భాషతో దుర్భాషలాడుకున్నారని అక్కడి వారు పేర్కొంటున్నారు. మరడాం ఉన్నత పాఠశాల హెచ్ఎం జోక్యం చేసుకొని వీరిని సముదాయించారని సమావేశంలో పాల్గొన్నవారు చెబుతున్నారు. ఏమైనా వీరి మధ్య మాటల యుద్ధం రాయడానికి వీల్లేని భాషలో తిట్టుకోవడంతో సర్వత్రా చర్చనీయాంశమైంది. -
కారులో గర్ల్‌ఫ్రెండ్‌పై దాడి చేశాడని చితకబాదారు
కాలిఫోర్నియా : అమెరికాలోని కాలిఫోర్నియాలో గత శుక్రవారం ఒక కన్వెన్సన్ హాల్లో ఫ్యూరీ కాంపిటీషన్ కార్యక్రమం నిర్వహించారు. ఫర్రీస్ అంటే వివిధ రకాల జంతువులను పోలిన వేషదారణతో కల్పిత పాత్రలను ధరించి కథలు, నాటకాలు నిర్వహిస్తుంటారు. ఈ సందర్భంగా ఫర్రీస్ వేషం ధరించిన ఇద్దరు వ్యక్తులు సిగరేట్ తాగేందుకని బయటకు వచ్చారు. అప్పుడే వారి ముందు ఒక నీలం రంగు కారు వెళ్లి కొంచెం దూరంలో ఆగింది. ఆ తరువాత కారులోంచి ఎవరో అరుస్తున్నట్లు శబ్దాలు వినిపించడంతో దగ్గరికి వెళ్లి చూశారు. కారులో ఒక యువకుడు తనతో పాటు ఉన్న యువతిని ఇష్టం వచ్చినట్లుగా కొడుతున్న దృశ్యాలు కనిపించాయి. దీంతో కారు డోరును తెరిచే ప్రయత్నం చేయగా అది రాకపోవడంతో లోపల ఉన్న యువతి అతన్ని నెట్టివేసి డోర్ అన్‌లాక్ చేసింది. దీంతో లోపల ఉన్న వ్యక్తిని ఇద్దరు కలిసి బయటికి లాగారు. ఆమెను ఎందుకలా కొడుతున్నావని ప్రశ్నింస్తుండగానే వారిపై దాడికి దిగాడు. దీంతో ఫర్రీస్ అతని ఈడ్చి కిందపడేసి పిడిగుద్దుల వర్షం కురింపించారు. విషయం తెలుసుకున్న మరో ఇద్దరు కూడా వీరిద్దరికి తోడయ్యి అతనిపై దాడి చేశారు. కాగా సమాచారం అందుకున్న శాన్‌జోస్ పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని వారందరిని విడిపించి అతన్ని అరెస్టు చేశారు. అరెస్టైన వ్యక్తి పేరు డెమిట్రీ హార్డ్నెట్ అని, అతనికి 22 ఏళ్ల వయసు ఉంటుందని పోలీసులు వెల్లడించారు. తన గర్ల్‌ప్రెండ్‌ను కారులో ఇష్టమొచ్చిన రీతిలో కొట్టడంతో ఫ్యూరిస్ వేషదారులు ఎందుకలా కొడుతున్నావు అని ప్రశ్నింనందుకు వారిపై దాడి చేశాడని, అందుకే తిరిగి ప్రతిదాడి చేశాడని పోలీసులు వెల్లడించారు. కాగా డెమిట్రీ హార్డ్నెట్పై గృహహింస కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. కాగా ఇదంతా వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్‌గా మారింది. ఫర్రీస్ చేసిన పనిని నెటిజన్లు తెగ మెచ్చుకుంటున్నారు. pic.twitter.com/7QVA01UYO1 — ROBBIE! 🏝️ (@robbiesets) January 18, 2020 -
ప్రేమజంటపై దాడి.. యువతిపై సామూహిక లైంగికదాడి
చెన్నై ,వేలూరు: వేలూరు కోటలోని పార్కులో మూడు రోజుల క్రితం ప్రేమజంటపై దాడి చేసి యువతిపై సామూహిక లైంగిక దాడి చేసిన కేసులో పోలీసులు పురోగతి సాధించారు. మంగళవారం ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. వీరిలో వేలూరు కస్పాలోని వసంతపురానికి చెందిన ఆడైమణి(41), శక్తివేల్(19), అజిత్(19) ఉన్నారు. వీరు రోజూ గంజాయి, మత్తు పదార్థాలు సేవించి పార్కుకు వచ్చే పర్యాటకుల వద్ద దోపిడీలకు పాల్పడేవారు. పోలీసులు నిందితులను పట్టుకోవడానికి దోపిడీలకు పాల్పడుతు న్న వారి జాబితాను తయారు చేశారు. వారిని తమదైన శైలిలో విచారించగా ముగ్గురు యువకులు దొరికారు. ఈ కేసుకి సంబంధించిన వివరాలను పోలీసులు వెల్లడించారు. ‘ఈ నెల 18వ తేది రాత్రి 9.30 గంటల సమయంలో ముగ్గురు నిందితులు గంజాయి మత్తులో కోట పార్కులో మాట్లాడుతున్నారు. ఆ సమయంలో ఓ ప్రేమ జంట కోట గాంధీ విగ్రహం వెనుక ఉన్న గేటు ఎక్కి లోనికి ప్రవేశించారు. సుమారు 200 మీట ర్ల దూరంలో చెట్టు కిందకు వెళ్లి కూర్చున్నారు. వీరిని గమనించిన నిందితులు వారిపై దాడి చేశారు. యువతి ధరించిన కమ్మలు, సెల్‌ఫోన్‌ను లాక్కున్నారు. ప్రియుడి మెడపై కత్తి పెట్టి చంపేస్తామని బెదిరించారు. అనంతరం యువతిపై లైంగికదాడికి పాల్పడ్డారు. నింతులపై గతంలోనే కేసులు.. ఇదిలా ఉండగా ఈ కేసులో అరెస్టయిన అజిత్, శక్తివేల్‌పై నార్త్ పోలీస్‌స్టేషన్‌లో పలు దారి దోపిడి కేసులున్నాయి. రెండేళ్ల నుంచే వీరు కోట పార్కుకు వచ్చే పర్యాటకుల వద్ద దోపిడీలకు పాల్పడుతున్నట్లు తెలిసింది. ఆ సమయంలో శక్తివేల్, అజిత్‌లు మైనర్లు (17) కావడంతో వారిని అరెస్ట్ చేసేందుకు కుదరలేదని పోలీసులు తెలిపారు. ప్రేమ జంటలకు అనుమతి నిరాకరణ.. ప్రేమజంటపై వేలూరు కోటలోని పార్కులో యువతిపై సామూహిక లైంగిక దాడి జరిగిన నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. పార్కులో పోలీసులు నిఘా పెట్టారు. రాత్రి సమయాల్లో జంటలు అటువైపు రాకుండా చూస్తున్నారు. -
స్తంభానికి కట్టి మహిళపై చెప్పులతో దాడి
కోహెడరూరల్(హుస్నాబాద్): పత్తి చెనులో మహిళల మధ్య జరిగిన దూషణలు.., పొలం వద్ద దారి విషయంలో తరచూ గొడవల కారణంగా ఓ మహిళను విద్యుత్ స్తంభానికి తాళ్లతో కట్టేసి చెప్పులతో దాడి చేసిన దురదృష్టకరమైన సంఘటన సిద్దిపేట జిల్లాలో వెలుగు చూసింది. ఎస్ఐ రాజ్‌కుమార్ కథనం ప్రకారం.. కోహెడ మండలం పోరెడ్డిపల్లి తండాకు చెందిన గుగులోతు జ్యోతి, లక్ష్మీపూర్ గ్రామానికి చెందిన గుగులోతు హంస, స్వరూపల వ్యవసాయ భూములు పోరెడ్డిపల్లి తండా గ్రామ పరిధిలో ఉంటాయి. ఈ క్రమంలో వ్యవసాయ బావులకు వెళ్లే రహదారిపై ఆ మహిళలు తరచూ గొడవలకు పాల్పడేవారు. ఆ కోపాన్ని మనసులో పెట్టుకున్న హంస, స్వరూప.. గురువారం సాయంత్రం ఇంటి వద్ద ఒంటరిగా ఉన్న జ్యోతిని గమనించారు. కృష్ణ అనే వ్యక్తి సాయంతో జ్యోతిని ట్రాక్టర్లో బలవంతంగా ఎక్కించుకొని లక్ష్మీపూర్‌కు తీసుకువెళ్లి స్తంభానికి కట్టి చెప్పులతో దాడిచేశారు. ఇది గమనించిన స్థానికులు 100కు కాల్ చేశారు. దీంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని నిందితులను అదుపులోకి తీసుకున్నారు. శుక్రవారం బాధితురాలి భర్త శ్రీనివాస్ ఫిర్యాదు మేరకు హంస, కృష్ణ, స్వరూప, శంకర్, కైలు, రమలపై కేసులు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. -
నోటికి ప్లాస్టర్ అంటించి, అగర్‌బత్తీలతో కాల్చి...
సాక్షి, ఉట్నూర్ రూరల్ : కంటికి రెప్పలా కాపాడాల్సిన ఓ వార్డెన్ చిన్నారులపై లైంగికదాడికి పాల్పడుతున్నాడు. అర్ధరాత్రి నిద్రలేపి మరీ ఈ అరాచకానికి ఒడిగడుతున్నాడు. ఈ కీచకపర్వం ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండల కేంద్రంలోని ఓ ప్రైవేటు పాఠశాల వసతి గృహంలో వెలుగు చూసింది. పోలీసుల కథనం ప్రకారం.. మండల కేంద్రంలోని ఓ ఇంగ్లిష్ మీడియం ఉన్నత పాఠశాల అక్కడే హాస్టల్ నిర్వహిస్తోంది. విద్యార్థులపై హాస్టల్ వార్డెన్ కొమ్ము లింగన్న లైంగిక దాడులకు పాల్పడుతున్నాడు. ఈ విషయమై విద్యార్థుల తల్లిదండ్రులు రెండు నెలల క్రితం ప్రిన్సిపాల్‌కు వివరించినట్లు సమాచారం. అయినా సదరు వార్డెన్‌లో మాత్రం మార్పు రాలేదు. దీంతో పిల్లల తల్లిదండ్రులు గురువారం పాఠశాల వద్ద ఆందోళనకు దిగారు. పిల్లలను అర్ధరాత్రి నిద్ర లేపి లైంగిక వేధింపులకు గురిచేసేవాడని, వినకపోతే నోటికి ప్లాస్టర్ అంటించి, అగర్‌బత్తీలతో కాల్చేవాడని పిల్లలు తమకు ఏడుస్తూ విన్నవించారని తల్లిదండ్రులు పేర్కొన్నారు. గతంలో ప్రిన్సిపాల్‌కు ఫిర్యాదు చేశామని, పిల్లల పరువుపోతుందని, ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని చెప్పడంతో ఆగిపోయామని తెలిపారు. అదే సమయంలో వార్డెన్ కనిపించడంతో ఆగ్రహానికి గురైన తల్లిదండ్రులు అతడిపై దాడి చేశారు. సీఐ నరేశ్, ఎస్సై అనిల్ విద్యార్థుల తల్లిదండ్రులను సముదాయించారు. వార్డెన్‌పై లైంగిక వేధింపుల కేసు నమోదు చేసినట్లు ఎస్సై అనిల్ తెలిపారు. -
ఆర్ట్స్ కాలేజీలో గొడవ.. వీడిన మిస్టరీ!
సాక్షి, అనంతపురం : అనంతపుం ఆర్ట్స్ కాలేజీలో యువకుడిపై దాడి కేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు. ఈ కేసులో దాడి చేసిన ఐదుగురు యువకులను అరెస్ట్ చేశారు. ఓ యువతి విషయంలో వివాదం వల్లే ఈ ఘర్షణ జరిగిందని.. ఈ గొడవలో కాలేజ్ విద్యార్ధులకు సంబంధం లేదని పోలీసులు స్పష్టం చేశారు. ఓ అమ్మాయి విషయంలో శివయ్య, భరత్ మధ్య విభేదాలు తలెత్తాయి. దీంతో భరత్ గ్యాంగ్ ఆర్ట్స్ కాలేజీ మైదానంలో శివయ్యపై దాడి చేసింది. భరత్, అతని స్నేహితులు మద్యం సేవించి శివయ్యను విచక్షణారహితంగా కొట్టారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ కేసులో నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టిన డీఎస్పీ పీఎన్ బాబు.. నిందితులపై రౌడీషీట్ ఓపెన్ చేస్తామని వెల్లడించారు. -
మాజీ మిస్ ఇండియాపై దాడి : ఎస్పై సస్పెండ్
కోల్‌కతా : మాజీ మిస్ ఇండియా, నటి ఉషోషి సేన్‌గుప్తా కారులో వెళ్తుండగా.. ఆకతాయిలు ఆమె వాహనంపై దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ విషయం గురించి ఫిర్యాదు చేయడానికి సమీప పోలీస్ స్టేషన్‌కు వెళ్లినప్పుడు వారు ఘటన ప్రాంతం తమ పరిధిలోకి రాదంటూ కేసు నమోదు చేయడానికి నిరాకరించారు. ఈ విషయాలన్నింటిని ఉషోషి ఫేస్బుక్ ద్వారా వెల్లడించింది. దాంతో పోలీసులు తీరు పట్ల సోషల్ మీడియాలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుంది. ఈ క్రమంలో పోలీసు ఉన్నతాధికారులు ఈ ఘటనపై స్పందించారు. సదరు చారు మార్కెట్ పోలీస్ స్టేషన్‌కు చెందిన ఎస్సై పీయూష్ కుమార్ బాల్‌ను సస్పెండ్ చేశారు. అతనితో పాటు మరో ఇద్దరు అధికారులకు షోకాజ్ నోటీసులు కూడా జారీ చేశారు. అంతేకాక ఎఫ్ఐఆర్ నమోదు చేయకపోవడం గురించి కూడా దార్యప్తు చేస్తామని ఉన్నతాధికారులు తెలిపారు. సహోద్యోగితో కలసి వెళ్తున్న ఉషోషి కారును కొందరు ఆకతాయిలు బైక్‌తో ఢీకొట్టి, కారు డ్రైవర్‌ను బయటకు లాగారు. ఈ గొడవను ఆమె ఫోన్లో రికార్డ్ చేసి కేసు నమోదుచేయాలని దగ్గర్లోని పోలీస్స్టేన్కు వెళ్లారు. ఘటనప్రాంతం తమ పరిధిలోది కాదని చెప్పడంతో ఆమె ఇంటికి తిరుగుపయనమైంది. ఈ సమంలో ఆకతాయిలు మళ్లీ వచ్చి రాళ్లతో దాడి చేశారు. కాగా, ఫేస్బుక్ పోస్టును పరిశీలించిన పోలీసులు ఏడుగురు నిందితులను అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. -
మైసూరులో దారుణం, యువతిపై గ్యాంగ్ రేప్
సాక్షి, మైసూరు: ఓ ప్రేమ జంటపై నలుగురు యువకులు దాడిచేసి.. యువతిపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన దారుణ ఘటన బుధవారం రాత్రి పర్యాటక నగరం మైసూరులో జరిగింది. మైసూరు జిల్లాలోని హెచ్డీ.కోటె హ్యాండ్ పోస్ట్ ప్రాంతానికి చెందిన శివసిద్ధు, అతని ప్రియురాలు కలిసి బుధవారం రాత్రి 10.30 గంటల సమయంలో మైసూరు సమీపంలో ఉన్న లింగాంబుధి చెరువు రింగ్ రోడ్డు వద్ద మాట్లాడుకుంటున్నారు. ఆ సమయంలో నలుగురు యువకులు వచ్చి వారిపై దాడి చేశారు. శివసిద్ధు కాళ్ల మీద పెద్ద బండరాయి వెయ్యడంతో తీవ్రంగా గాయపడ్డాడు. అనంతరం వారు యువతిపై మూకుమ్మడిగా అత్యాచారం చేసి పరారయ్యారు. కొంతసేపటికి శివసిద్ధు తేరుకుని యువతిని తీసుకుని మైసూరులోని చెలువాంబ ఆస్పత్రికి వెళ్లి అక్కడ చికిత్స పొందుతున్నారు. యువకుడికి కాలితో పాటు తలకూ గాయాలయ్యాయి. యువతికి ఎలాంటి ప్రాణాపాయం లేదని వైద్యులు చెప్పారు. ఎనిమిది పోలీస్ బృందాల ఏర్పాటు విషయం తెలుసుకున్న మైసూరు జిల్లా ఎస్పీ అమిత్‌సింగ్ ఘటనా స్థలాన్ని పరిశీలించి అనంతరం బాధితులను కలిసి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం గురువారం మీడియాతో మాట్లాడుతూ జయపుర పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారని.. దుండగుల కోసం 8 పోలీసు బృందాలను ఏర్పాటు చేసినట్టు ఎస్పీ వివరించారు. -
ప్రేమ తెచ్చిన ఉపద్రవం!
మదనపల్లె టౌన్: ఓ జంట ప్రేమ వ్యవహారం ఇరువర్గాల మధ్య ఘర్షణకు దారి తీసిన సంఘటన గురువారం రాత్రి కురబలకోట మండలంలో చోటు చేసుకుంది. పోలీసులు, బాధితుల కథనం.. కురబలకోట మండలం అంగళ్లు ఎంబీటీ రోడ్డులో ఉంటున్న వాణి, జయకుమార్ దంపతుల కుమారుడు అదే వీధికి చెందిన ఓ యువతి ప్రేమలో పడ్డారు. ఈ విషయం అమ్మాయి తల్లిదండ్రులకు తెలియడంతో వారు వాణి, జయకుమార్‌ల ఇంటిపై దాడి చేసి ఇద్దరినీ చితకబాదారు. అడ్డుకోబోయిన వాణి తల్లి శివమ్మ, సుమలతకు స్వల్పగాయాలయ్యాయి. వీరు ప్రతిఘటించడంతో దాడికి పాల్పడిన సురేష్‌బాబు, కృపాకర్‌రెడ్డి గాయపడ్డారు. ఇరువర్గాల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. గాయపడిన వారు స్థానిక జిల్లా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. -
పార్కింగ్ ఘర్షణ
సాక్షి, సిటీబ్యూరో: లోక్‌సభ ఎన్నికల పోలింగ్ సిటీలో ప్రశాంతంగా ముగిసింది. అత్యంత సమస్మాత్మంగా భావించిన ప్రాంతాలు, ప్రధాన పార్టీల ప్రాబల్యం ఉన్న ఏరియాల్లోనూ అవాంఛనీయ ఘటనలు లేకుండానే ఓటింగ్ ఘట్టం పూర్తయింది. అయితే అనేక ప్రాంతాల్లో పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు, బందోబస్తు విధుల్లో ఉన్న పోలీసుల మధ్య వాగ్వాదాలు చోటు చేసుకోవడానికి పార్కింగ్ ఒక కారణమైంది. ఓటింగ్ జరిగే రోజు పోలింగ్ కేంద్రానికి 200 మీటర్ల దూరం నుంచి నిషేధాజ్ఞలు, 144 సెక్షన్ అమలులో ఉంటాయి. దీన్ని నిర్దేశిస్తూ అధికారులు గీత కూడా గీస్తారు. సాధారణంగా ఈ ‘గీతదాటే’ అంశంలో నిత్యం పోలీసులు, అభ్యర్థుల వెంట ఉండే అనుచరులు, ఓటర్ స్లిప్పులు పంచేందుకు సిద్ధమైన పార్టీల కార్యకర్తల మధ్య తరచుగా వాగ్వాదాలు జరుగుతూ ఉంటాయి. ఈసారి దీనికి భిన్నంగా ‘గీత’ ఓటర్లకు, పోలీసులకు మధ్య ఘర్షణలకు తావిచ్చింది. ఉదయం 7 గంటలకు ముందే పోలింగ్ కేంద్రం వద్దకు వచ్చిన ఓటర్లు ఆయా ప్రాంతాలు ఖాళీగా ఉండటంతో తమ వాహనాలను ఈ గీత దాటించి ముందకు తీసుకువెళ్లారు. ఆపై బందోబస్తు పూర్తి స్థాయికి చేయడంతో పోలింగ్ కేంద్రానికి వచ్చిన వారి వాహనాలను ఈ గీత లోపలి ప్రాంతంలో పార్కింగ్ చేయడానికి పోలీసులు అంగీకరించలేదు. ఓటింగ్‌కు వచ్చే వారి కోసం ప్రత్యేక పార్కింగ్ సదుపాయాలూ కల్పించలేదు. అయితే అప్పటికే పార్క్ చేసిన వాహనాలు గీత లోపల ఉండటం, తమవి మాత్రం వద్దంటూ పోలీసులు వారిస్తుండటంతో ఓటర్లు అసహనానికి లోనయ్యారు. ఈ అంశంపైనే అనేక చోట్ల వాగ్వాదాలు చోటు చేసుకున్నాయి. పోలింగ్ ప్రారంభమైన తొలి రెండు గంటల్లో ఎదురైన పార్కింగ్ వాగ్వాదాలతో మేల్కొన్న పోలీసులు ఆ తరవాత చాలాచోట్ల ‘గీత’ దగ్గరే సిబ్బందిని ఏర్పాటు చేసి వ్యక్తిగత వాహనాలను అనుమతించలేదు. కేవలం వృద్ధులు, వికలాంగుల్ని తీసుకువస్తున్న వాటినే ముందుకు వెళ్లనిచ్చారు. ఏ లోటూ రానివ్వని కమిషనర్లు.. సాధారణంగా బందోబస్తు విధులంటే పోలీసుల గుండెల్లో రైళ్లు పరిగెడతాయి. తాగడానికి నీళ్లుండవు, తినడానికి తిండి దొరకదు, పోనీ ఉన్న పాయింట్‌ను వదిలి దాహం, ఆకలి తీర్చుకుందామంటే ఏమవుతుందో అనే సందేహం. రిపోర్ట్ చేసిన అధికారి కార్యాలయం నుంచి డ్యూటీ పాయింట్‌కు వెళ్లాలంటే నానా యాతనా పడాల్సిందే. అయితే ఈసారి మాత్రం సిబ్బందికి ఇలాంటి ఇబ్బందుకు రాకుండా హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనర్లు అంజనీకుమార్, వీసీ సజ్జనార్, మహేష్ భగవత్ ప్రత్యేక దృష్టి పెట్టారు. పోలింగ్ నేపథ్యంలో గురువారం ‘గ్రేటర్’ వ్యాప్తంగా స్థానిక పోలీసులు, కేంద్ర సాయుధ బలగాలు కలిపి దాదాపు 27 వేల మందిని వినియోగించారు. సిబ్బంది మొత్తం రిపోర్ట్ చేసిన ప్రాంతం నుంచి విధులు నిర్వర్తించాల్సిన పాయింట్‌కు చేరడానికి, అవసరమైన పక్షంలో ప్రత్యేక గస్తీలు నిర్వహించడానికి కమిషనరేట్స్లో ఉన్న వాటికి తోడు అదనంగా దాదాపు 800 వాహనాలు అద్దెకు తీసుకున్నారు. గురువారం రాత్రి నుంచి నిర్విరామంగా విధుల్లో ఉన్న ఈ సిబ్బందికి అల్పాహారం, టీ, భోజనం, తాగునీరు తదితరాలన్నింటినీ వారు విధులు నిర్వర్తిస్తున్న ప్రాంతాలకు చేరేలా జాగ్రత్తలు తీసుకున్నారు. ఈ బాధ్యతలను స్థానిక పోలీసులకు అప్పగించడంతో పాటు పర్యవేక్షణ బాధ్యతల్ని ఉన్నతాధికారులకు అప్పగించారు. పోలింగ్ నేపథ్యంలో శుక్రవారం ఉదయం 6 నుంచి విస్తృత స్థాయి బందోబస్తు ప్రారంభమైంది. రాత్రి ఈవీఎం (ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్)లు స్ట్రాంగ్‌రూమ్‌లకు చేరే వరకు ఈ ఏర్పాట్లు కొనసాగాయి. -
మహిళలను తీవ్రంగా కొట్టి బయటకు గెంటేసిన ఖాకీలు!
కష్టనష్టాలకు గురై పోలీస్ స్టేషన్‌కు వస్తే.. అక్కడ కూడా దౌర్జన్యమే జరిగింది. సభ్యసమాజం తలదించుకునేలా మహిళను, ఆమె వెంట ఉన్న యువతిని ఓ పోలీసు అధికారి అందరి ముందే తీవ్రంగా కొట్టడం అధికార దుర్వినియోగానికి పరాకాష్టగామారింది. మెట్రో సిటీలోనే ఈ అకృత్యం సంభవించడం విశేషం. సాక్షి, బెంగళూరు: ఫ్రెండ్లీ పోలీసింగ్ అనేది ప్రచారానికే పరిమితమైంది. తరచూ బాధితుల పట్ల దుందుడుకుగా వ్యవహరిస్తున్న ఖాకీలు నిజ స్వరూపాన్ని బయట పెట్టుకుంటున్నారు. ఫిర్యాదు చేయడానికి వచ్చిన మహిళలను తీవ్రంగా కొట్టి బయటకు గెంటేశారు. బెంగళూరు కుమారస్వామి లేఔట్ పోలీసు స్టేషన్ల ఏఎస్ఐ రేణుకయ్య ఈ దురాగతానికి పాల్పడ్డాడు. ఈ ఘటన మొత్తాన్ని పోలీసు స్టేషన్‌లోని వ్యక్తి ఒకరు తమ మొబైల్లో రికార్డు చేశారు. ప్రస్తుతం ఈ ఘటనపై పెను దుమారం రేగడంతో రేణుకయ్యను డీసీపీ అణ్ణామలై సస్పెండ్ చేశారు. ఏం జరిగిందంటే.. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మహిళ 11 ఏళ్ల తన కుమార్తెను తమ్మునికే ఇచ్చి పెళ్లి చేసింది. ప్రస్తుతం ఆ యువతికి 20 ఏళ్లు వచ్చాయి. గతేడాది క్రితమే సదరు యువతి భర్తను వదిలేసి బెంగళూరుకు చేరుకుంది. కుమారస్వామి లేఔట్ పోలీసు స్టేషన్ పరిధిలోని కనకపుర రోడ్డులో ఉన్న ఒక హోటల్లో పని చేస్తూ జీవిస్తోంది. ఈ విషయం తెలుసుకున్న యువతి తల్లిదండ్రులు, బంధువులు ఆమెను తీసుకెళ్లేందుకు ఈ నెల 19న నగరానికి చేరుకున్నారు. హోటల్లో ఉంటున్న యువతిని బలవంతంగా తీసుకెళ్లేందుకు ప్రయత్నించారు. ఆమె రానని మొండికేసి హోటల్ మేనేజర్‌కు విషయం తెలియజేసింది. మేనేజర్ ఈ వివాదాన్ని కుమారస్వామి లేఔట్ పీఎస్‌లో తెలిపాడు. పోలీస్‌స్టేషన్‌లో విచారణ పోలీసులు హోటల్‌కు వచ్చి వారందరినీ స్టేషన్కుతీసుకెళ్లి విచారించారు. తాను మేజర్‌నని, ఇక్కడే పని చేసుకుంటూ జీవిస్తానని తెగేసి చెప్పింది. ఆ యువతిని తమతో పంపించాలని బంధువులు పోలీసు స్టేషన్లో ఒత్తిడి చేశారు. ఈ సమయంలో పోలీసులు, బంధువుల్లోని ఒక మహిళకు మధ్య వాగ్వాదం తలెత్తింది. అమ్మాయిని తమతో పంపకుంటే ఇక్కడే పురుగుల మందు తాగి చనిపోతానని బెదిరించింది.ఈ సమయంలో స్టేషన్‌కు వచ్చిన ఏఎస్ఐ రేణుకయ్య గొడవ పడుతున్న మహిళను బండబూతులు తిడుతూ కొట్టుకుంటూ తలుపు వరకూ వచ్చాడు. మెడ పట్టుకుని బయటకు తోసేశాడు. ఆమె వెంట ఉన్న అమ్మాయిని కూడా బయటే కొట్టాడు. ఇదంతా పోలీసుల్లోనే ఒకరు సెల్ఫోన్లో వీడియో తీశారు. అది వైరల్కావడంతో ఏఎస్ఐ దాష్టీకంపై జనం మండిపడ్డారు. కొట్టడం తప్పే: డీసీపీ అణ్ణామలై పోలీసు స్టేషన్లో మహిళపై దాడి చేయడం ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పేనని బెంగళూరు దక్షిణ విభాగం డీసీపీ అణ్ణామలై తెలిపారు. ఈ కేసును సీరియస్‌గా తీసుకుని దర్యాప్తునకు ఆదేశించినట్లు చెప్పారు. రేణుకయ్యను సస్పెండ్ చేసినట్లు వెల్లడించారు. దీనిపై రాష్ట్ర మహిళ కమిషన్ కూడా సీరియస్‌గా తీసుకుంది. కమిషన్ అధ్యక్షురాలు నాగలక్ష్మి బాయి పోలీసు స్టేషన్‌కు వచ్చి వివరాలు తెలుసుకున్నారు. మహిళపై ఒక ఏఎస్ఐ ఇలా అనుచితంగా ప్రవర్తించడం చాలా తప్పు అని ఆమె విమర్శించారు. -
దయ్యం పట్టింది.. మంత్రాలతో వదిలిస్తా..
సాక్షి, కృష్ణా : మంత్రాల ముసుగులో మహిళపై అత్యాచారయత్నానికి పాల్పడ్డాడో భూతవైద్యుడు. ఈ సంఘటన కృష్ణాజిల్లాలోని జగ్గయ్యపేటలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. జగ్గయ్యపేటకు చెందిన దంపతులు అనారోగ్య సమస్యల కారణంగా అదే ప్రాంతంలోని తాయెత్తు సాయిబు దగ్గరకు వెళ్లారు. వివాహితకు దెయ్యం పట్టిందని, మంత్రాలతో దానిని వదిలిస్తానని సాయిబు వారిని నమ్మించాడు. మహిళ భర్తను గది బయటకు పంపి మంత్రాలు చదువుతూ ఆమెపై అత్యాచారయత్నం చేశాడు. దీంతో ఆమె గట్టిగా కేకలు వేస్తూ బయటకు పరుగులు తీసింది. అనంతరం బాధితురాలు పోలీస్ స్టేషన్లో సాయిబుపై ఫిర్యాదు చేసింది. మహిళ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. -
ఉపాధ్యాయుడి తిట్ల దండకం
ప్రకాశం, యద్దనపూడి (పూనూరు): పాఠశాలలోని ఓ ఉపాధ్యాయుడికి, నాన్ టీచింగ్ స్టాఫ్‌కు మధ్య జరిగిన వివాదంలో ఉపాధ్యాయుడు సిబ్బందిని అసభ్య పదజాలంతో దూషించడంతో సహచర ఉపాధ్యాయులు, పాఠశాల విద్యార్థులు బెంబేలెత్తారు. ఈ సంఘటన పూనూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మంగళవారం జరిగింది. విద్యార్థులు, తల్లిదండ్రులు, ప్రధానోపాధ్యాయుడు తెలిపిన వివరాల ప్రకారం.. పాఠశాలలో విద్యార్థులు మధ్యాహ్న భోజనం తినే సమయంలో ఓ ఉపాధ్యాయుడికి, నాన్‌టీచింగ్ స్టాఫ్‌కు ఓ కుర్చి వద్ద మెదలైన స్వల్ప వాదన చినికి చినికి గాలివానలా మారింది. సదరు ఉపాధ్యాయుడు సిబ్బందిపై కుర్చి ఎత్తి పైపైకి వెళ్లాడు. కుర్చీ ఎత్తి దౌర్జనం చేయబోవడంటంతో విషయం ఆ నోటా ఈనోటా గ్రామంలో చర్చ జరిగింది. విషయం తెలిసిన విలేకరులు నాన్ టీచింగ్ సిబ్బందిని వివరణ కోరగా అంతా చూస్తుండగా తనపై దౌర్జనం జరిగిన మాట వాస్తవమేనని తెలిపాడు. ఇదే విషయమై ప్రధానోపాధ్యాయుడు సత్యనారాయణను వివరణ కోరగా మంగళవారం తాను సెలవులో ఉన్నానని, గొడవ జరిగిన మాట వాస్తవమేనని తెలిపారు. ఈ విషయమై ఎంపీడీఓ జాకీర్‌హుస్సేన్ మాట్లాడుతూ ఉపాధ్యాయుడు దౌర్జనం గురించి గతంలోనే తన దృష్టికి వచ్చిందని, మంగళవారం జరిగిన ఘటనపై తనకు నివేదిక ఇమ్మన్ని ప్రధానోపాధ్యాయుడిని ఆదేశించానన్నారు. నివేదిక అందగానే జిల్లా అధికారులకు పంపుతానన్నారు. ఇది ఇలా ఉండగా గ్రామస్తులు విద్యార్థుల ముందే ఉపాధ్యాయుడు సంస్కార రహితంగా అసభ్య పదజాలం వాడటమేమిటని, ఇకముందు ఇలా జరగకుండా తగు చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. -
యువతిపై కళాశాల ఎండీ రాసలీలలు
సాక్షి ప్రతినిధి, చెన్నై: కోయంబత్తూరు ఎంఎన్ఎస్ కళాశాల మేనేజింగ్ డైరెక్టర్ గత రెండేళ్లుగా వేధింపులకు గురిచేస్తున్నట్టు అందులో పనిచేసే ఓ యువతి గురువారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. కోవై ఎంఎన్ఎస్ కళాశాల కళాశాల ఎండీ సుబ్రమణ్యన్ (64) అదే కళాశాలలో ఉద్యోగం చేస్తున్న ఓ యువతిపై లైంగికంగా వేధిస్తున్నట్టు తెలిసింది. ఎండీకి తెలియకుండా సదరు యువతే ఎండీ చాంబర్లో కెమెరాలను అమర్చి ఆధారాలతో సహా పోలీసులకు పట్టించింది. ఎండీ చాంబర్లో ఫిర్యాదు చేసిన విద్యార్థినితో ఎండీ అభ్యంతరకర రీతిలో, అసభ్యంగా ప్రవర్తిస్తున్న దృశ్యాలు వైరల్ అయ్యాయి. దీంతో ఆ యువతి సహ ఉద్యోగులు ఎండీ కుమారుడు, నళిని వద్ద తెలపగా, వారు విదేశాల్లో కౌగిలించుకోవడం, ముద్దులు పెట్టుకోవడం పెద్ద తప్పేమి కాదని సమర్థించడమే కాకుండా, మీ పనులు మీరు చూసుకోండి లేకుంటే ఉద్యోగాలు పోతాయని హెచ్చరించినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా కెమెరాలు పెట్టి ఎండీ రాసలీలను బహిర్గతం చేసిందుకు ఆమెను ఉద్యోగంలో నుంచి తొలగించడమే కాకుండా హెచ్చరించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఆ యువతి గురువారం తుడియలూరు పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసింది. -
11 ఏళ్ల విద్యార్థినిపై దారుణం
పాట్నా : ఐదో తరగతి విద్యార్థినిపై అరాచకానికి పాల్పడిన ఓ పాఠశాల ప్రధానోపాధ్యాయున్ని, అతనికి సహకరించిన గుమస్తాని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వివరాలు.. పాట్నాకు చెందిన పదకొండేళ్ల చిన్నారి ఓ ప్రైవేట్ పాఠశాలలో ఐదో తరగతి చదువుతోంది. ఈ క్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఆ చిన్నారిపై అకృత్యానికి పాల్పడ్డాడు. అంతటితో ఊరుకోక ఆ దృశ్యాలను వీడియో తీసి ఈ విషయం గురించి ఎవరికైనా చెబితే ఆ వీడియోలను బయటపెడతాను.. చంపేస్తాను అని బెదిరించాడు. ఇలా నెల రోజుల పాటు ఈ దారుణం కొనసాగింది. ఈ క్రమంలో సదరు బాలిక కొన్ని రోజులుగా కడుపునొప్పి, వాంతులతో బాధపడుతుండటంతో బాలిక తల్లిదండ్రులు చిన్నారిని ఆస్పత్రికి తీసుకెళ్లారు. బాలికను పరీక్షించిన వైద్యులు చిన్నారిని గర్భవతిగా నిర్ధారించారు. విస్తుపోయిన తల్లిదండ్రులు బాలికను ఆరా తీయగా ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు పాఠశాలకు వెళ్లి విచారించగా సదరు ప్రిన్సిపాల్ హోం వర్క్ చెక్ చేసే నేపంతో బాలికను తన గదికి తీసుకెళ్లి ఈ దారుణానికి ఒడిగట్టినట్లు తెలిసింది. ఇందుకు పాఠశాలలో పనిచేస్తోన్న కర్ల్క్ సాయం చేసేవాడని తేలింది. అంతేకాక ప్రిన్సిపాల్ ఫోన్లో బాలికకు సంబధించిన ఫోటోలు కూడా ఉన్నాయి. దాంతో పోలీసులు ప్రధానోపాధ్యాయున్ని, క్లర్క్‌ని అదుపులోకి తీసుకుని, స్కూల్‌ని సీజ్ చేశారు. కేవలం 1 - 5 వరకే ఉన్న ఈ పాఠశాలలో 90 మంది విద్యార్ధులు చదువుతున్నట్లు పోలీసులు తెలిపారు. -
మహిళ పట్ల అసభ్యకర ప్రవర్తన
గుంటూరు రూరల్: మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించి ఆపై ఖాకీ దుస్తులు వేసుకుని వచ్చి బెదిరింపులకు పాల్పడిన వ్యక్తిని స్థానికులు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించిన సంఘటన బుధవారం మండలంలోని తోకావారిపాలెం గ్రామంలో చోటు చేసుకుంది. సీఐ బాలమురళీకృష్ణ, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. పెద్దపలకలూరు గ్రామానికి చెందిన సాంబశివరావు అనే వ్యక్తి పక్క గ్రామమైన తోకావారిపాలేనికి చెందిన నిర్మల అనే మహిళ పట్ల మంగళవారం అర్ధరాత్రి అసభ్యంగా ప్రవర్తించాడు. ఆమె కేకలు వేయటంతో పరారయ్యాడు. ఈ సమయంలో తన ఫోన్ ఆమె ఇంట్లో పడిపోయింది. బుధవారం ఉదయం సాంబశివరావు ఖాకీ దుస్తులు ధరించి మహిళ ఇంటికి వచ్చాడు. తాను పోలీస్ డిపార్ట్మెంట్కు వ్యక్తినని మహిళను బెదిరించాడు. దీంతో స్థానికులు వచ్చి అతనిని విద్యుత్ స్తంభానికి కట్టేసి దేహ శుద్ధి చేశారు. అనంతరం నల్లపాడు పోలీస్‌స్టేషన్‌లో అప్పగించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
బస్సులో యువకుడికి దేహశుద్ధి
పంజగుట్ట: ఆర్టీసీ బస్సులో మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించిన యువకుడికి ప్రయాణికులు దేహశుద్ది చేసి పోలీసులకు అప్పగించిన సంఘటన పంజగుట్ట పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. రాణిగంజ్ డిపోకు చెందిన 49ఎం బస్సులో బుధవారం ఉదయం ఓ మహిళ ప్యాట్నీ నుంచి పంజగుట్టకు వస్తుండగా ఆమె పక్కనే కూర్చున్న తాడ్‌బండ్‌కు చెందిన జోసఫ్ (34) అనే యువకుడు ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో బాధితురాలు తోటి ప్రయాణికులతో కలిసి జోసఫ్‌ను చితకబాది పంజగుట్ట పోలీస్‌స్టేషన్‌లో అప్పగించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. -
‘అందులో ఆడవారి తప్పు కూడా ఉంటుంది’
‘డబ్య్లూసీసీ’ (వుమెన్ ఇన్ సినిమా కలెక్టివ్) అవకాశాల పేరుతో ఆడవారిని మోసం చేసేవారికి వ్యతిరేకంగా, బాధితులకు అండగా నిలబడటం కోసం ఏర్పాటు చేసిన సంస్థ. దాదాపు ప్రతి ఇండస్ట్రీకి చెందిన హీరోయిన్లు ఇందుకు మద్దతు తెలుపుతుండగా మమతా మోహన్‌దాస్ మాత్రం ఈ విషయంలో కాస్త భిన్నంగా స్పందించారు. ‘మహిళలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయంటే, అందులో స్త్రీలకు కూడా వాటా ఉంటుంది’ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒక ప్రముఖ దినపత్రికకిచ్చిన ఇంటర్వ్యూలో మమతా మహిళల పట్ల వేధింపుల గురించి స్పందిస్తూ ‘ఎవరైనా మన పట్ల అమర్యాదగా ప్రవర్తిస్తున్నా, లైంగికంగా వేధించిన లేదా అలాంటి పనులు చేయడానికి సిద్ధపడుతున్నారంటే అందులో ఎంతో కొంత మన (ఆడవారి) తప్పు కూడా ఉంటుంది. అంటే ఒకరు మనతో అలా తప్పుగా ప్రవర్తించే అవకాశం స్వయంగా మనమే వారికి ఇచ్చి ఉంటాము. అందుకే వారు ఇలాంటి పనులు చేసే ధైర్యం చేయగలుగుతున్నార’న్నారు. ఆ తర్వాత మమతా వెంటనే తన వ్యాఖ్యలపై స్పష్టతనిస్తూ ‘ఎవరో కొందరినే దృష్టిలో పెట్టుకుని నేను ఈ వ్యాఖ్యలు చేయడం లేదు. నా మాటలు అందరికి వర్తిస్తాయ’న్నారు. అంతేకాక ‘డబ్య్లూసీసీ గురించి మీ అభిప్రాయం చెప్పండ’ని అడగ్గా ‘అది ఏర్పాటైన సమయంలో నేను ఇక్కడ లేను. నేను ఇందులో భాగస్వామిని అవుతానా అని అడిగితే మాత్రం లేదనే చేప్తాను. ఎందుకంటే డబ్య్లూసీసీ గురించి నాకు ఎటువంటి అభిప్రాయం లేదన్నా’రు. నటీమణులకు ఎదురవుతున్న వేధింపులు గురించి ప్రశ్నించగా.. ‘ఇలాంటి విషయాల గురించి చర్చించాల్సింది వేధింపులు జరిగాక కాదు. అసలు ఇలాంటి సంఘటనలు జరగకముందే వీటి గురించి చర్చించాలి. ఏది ఏమైనా వేధింపులకు గురి చేసిన వారిని మాత్రం వదిలిపెట్టకూడద’న్నారు. అయితే మమతా వ్యాఖ్యలను నటి రీమా కళంగళ్ ఖండించారు. మమతను ఉద్దేశిస్తూ రీమా తన ఫేస్బుక్లో ‘ప్రియమైన మమత మోహన్ దాస్‌కు, నా సోదర సోదరీమణులకు.. మన సమాజం ఎలా తయారయ్యిందంటే వేధింపులు, అత్యాచారాలు, అపహరణ, హింస వంటి నేరాలను చాలా సాధరణంగా పరిగణిస్తుంది. అలాంటి నేరాలకు పాల్పడే వారిని రక్షిస్తోంది. అందుకే తప్పు చేసిన వారు దర్జాగా తిరుగుతున్నారు. బాధితులు మాత్రం అవమానాలను ఎదుర్కొంటున్నారు. కానీ ఈ నేరాలన్నింటికి బాధ్యత వహించాల్సింది నిందుతులు.. బాధితులు ఎంత మాత్రం కాదు. మనకు జరిగిన అన్యాయం గురించి ధైర్యంగా మాట్లాడదాం. ఒకరి కోసం ఒకరం మద్దతుగా నిలుద్దాం. ఇప్పటికైనా నిశ్శబ్దం అనే గోడను బద్దలుకొడదాం’ అంటూ పోస్ట్ చేశారు. -
స్త్రీలు–పిల్లల భద్రత భారత్‌కు భారమా?
ఈ భూమండలం మీద స్త్రీలకు భారత్ అత్యంత ప్రమాదకర దేశమని తేలింది. సంఘర్షణాత్మక ప్రాంతాలలో వున్న ఈ తీవ్రతకు ర్యాంకులు ఇచ్చే క్రమంలో థామ్సన్ రాయిటర్ ఫౌండేషన్ నిర్వహించిన సర్వేలో అఫ్గానిస్తాన్, సిరియా, సోమాలియా, యెమెన్ దేశాలు ఇండియా తర్వాతి స్థానాల్లో వున్నాయి. అంతర్జాతీయ నిపుణులు ఇచ్చిన గ్రేడింగ్‌లో ఆహార భద్రతలో నాలుగు, వివక్షలో మూడవ స్థానాల్లో మనం నిలిచాం! నిర్భయ నేరగాళ్లకు సుప్రీంకోర్టు ఉరిశిక్ష ఖరారు చేసిన నేపథ్యంలో ఇప్పుడయినా ...‘వార్ జోన్ రేప్’ మీద అధ్యయనం జరగాలి. మానవ ఇతిహాసంలో స్త్రీ మీద జరిగిన మొట్టమొదటి అత్యాచారం ఏది? అందుకు మనం ‘బైబిల్’ చూడాలి. అలా అంటే, అది మతం గురించి మాటలాడ్డం కాదు. అటు కూడా చూస్తేనే, సంక్షుభిత కాలంలో చరిత్ర – జాగ్రఫీలు మనకు మార్గదర్శనం అవుతాయి. కారణం – ‘బైబిల్ ల్యాండ్’ భారత్ ఉన్నది ఆసియాలోనే, ఒకప్పుడు ఆసియాలో జాతులు వాటి సంస్కృతులు వేర్వేరు అయినప్పటికీ, స్త్రీ పురుష సంబంధాలు మాత్రం – భౌగోళిక, శీతోష్ణస్థితి కేంద్రితంగా ఒక సారూప్యతతో వుండేవి. ఉష్ణమండలమైన ఆసియాలో ఆ తాపం ఎక్కువ. స్త్రీలు ఇంటి పనులు, పిల్ల ల్నిసాకడం, పశుపోషణ, పాడి, సాగు పనులకు చేదోడు, బావుల నుంచి నీళ్ళు తేవడం.. ఇలా ఏదో ఒక అవసరంతో ‘ఆమె’ గడప దాటి బయటకు రావడం ఇక్కడ తప్పనిసరి. ‘ఆమె’పై తొలి అత్యాచార ఘటన–రెండు భిన్నజాతులకు చెందిన సంపన్నకుటుంబాల్లో జరిగింది. దీని బాధితురాలు జేకబ్–లేయాల కుమార్తె–దీనా. ఇది చరిత్రలో మొదటి ‘రేప్’ సంఘటనగా బైబిల్లో (ఆదికాండం 34 అధ్యాయం) రికార్డు అయింది. అంతేకాదు ఇది అపారమైన హింసకు, ఒక జాతి హననానికి కారణం అయింది. జరిగింది ఇది – సంపన్నుడైన జేకబ్‌కు ఇద్దరు భార్యలు, మరో ఇద్దరు దాసీలకు కలిపి మొత్తం 12 మంది కుమారులు, ఒక కుమార్తె. కరువు వల్ల జేకబ్ కనాను చేరి, ఆ పట్టణ నాయకుడు హమోరు వద్ద భూమి కొని అక్కడ స్థిరపడతాడు. జేకబ్–లేయాల ఏకైక కుమార్తె దీనా అందమైనది. ఆమె హమోరు కూతుళ్ల వద్దకు స్నేహంగా వెళుతుంది. తమ ఇంటికి వచ్చిన దీనా మీద హమోరు కొడుకు షెకేము అత్యాచారం చేస్తాడు. ఆమెను బందీ చేసి, ఆమెను నాకిచ్చి పెళ్ళి చేయమని తన తండ్రిని జేకబ్ వద్దకు పంపుతాడు. కీ.పూ. 1929 లో నాటి ఈ సంఘటన కాలానికి –‘రాజ్యవ్యవస్థ’ గానీ, ‘న్యాయవ్యవస్థ’గానీ లేదు. అయినా ఇది జరిగింది రెండు సంపన్న కుటుంబాల్లో కనుక తక్షణ న్యాయం అమలయింది. జేకబ్ ఇద్దరు కుమారులు షిమ్యోను–లేవీలు హమోరు కుమారుడు షెకేమును చంపి తమ చెల్లెలు దీనాను వారు ఇంటికి తీసుకువస్తారు. ఒక్కడు – శారీరక వాంఛకు లోనై నిగ్రహాన్ని, విచక్షణను కోల్పోయినందుకు, అతని తెగ మొత్తం హతమవుతుంది. ఆ పట్టణం జేకబ్ స్వాధీనం అవుతుంది. కొడుకులు చేసింది చూసి హతాశుడైన తండ్రితో– ‘‘వాడు, వేశ్యతో వ్యవహరించినట్టు, మా సహోదరితో ప్రవర్తించవచ్చునా?’’ అని కొడుకులు అడుగుతారు. ఈ వ్యూహకర్త లేవీ మనవడే మోజెస్. ఈ 12 తెగలు వేర్వేరు దిక్కులకు విడిపోవడానికి ముందు, జెహోవా మానవ జాతికి ‘సివిల్ కోడ్’గా ఇచ్చిన ‘టెన్ కమాండ్ మెంట్స్’ అమలు చేయమని ఈ మోజెస్‌కు అప్పగించాడు. వాటిలో ఏడవ ఆజ్ఞ – వ్యభిచారం చేయవద్దు. అలా అది, రాజ్యం పరిధి బయట– ఒక నైతిక రుజువర్తనంగా మారింది. అయితే క్రీస్తు జీవించి ఉన్నప్పుడు కూడా జెరూసలేము పీఠాధిపతులు అదే ‘మోజెస్ లా’తో, వ్యభిచారిణిని రాళ్ళతో కొట్టి చంపాలన్నప్పుడు–జీసస్ ‘మీలో ఆ పని చేయనివాడు మొదటి రాయి వేయండి’ అనడం ద్వారా– ‘ఆజ్ఞల’ అమలులో ప్రజాస్వామీకరణను అమలులోకి తెచ్చాడు. పశ్చిమ ఆసియాలోని ‘బైబిల్ ల్యాండ్’ నుంచి, ఇప్పుడు ‘భారత్’ను వేరుచేసి చూడ్డం కుదిరే పని కాదు. ఎందుకంటే మన పైకి వచ్చిన మొఘలులు, సుల్తానులు మంగోలుల దండయాత్రలకు ముఖ ద్వారమైన ఢిల్లీది ఐదు వేల ఏళ్ల చరిత్ర. సుల్తానులు 700 ఏళ్ళు దీన్ని పాలించారు. క్రీ.శ. 1398 డిసెం బర్లో తైమూర్ ఢిల్లీని నేలమట్టం చేశాడు. జైళ్ళలో వున్న లక్ష మంది యుద్ద ఖైదీలను చంపాడు. ఆ తర్వాత మొఘలులు.. బ్రిటిష్ పాలకుల సుదీర్ఘ పాలన. దీనిని మానవ శాస్త్రం దృష్టితో చూసినప్పుడే నేటి భారతీయుల‘ప్రవర్తనా శైలి’ మూలాలు మనకు అర్థమవుతాయి. అప్పుడే, గతంలో ‘స్త్రీ’పట్ల వెల్లువెత్తిన లైంగిక కాంక్షలో వైపరీత్యాలు తెలుస్తాయి. ‘నిర్భయ’ సంఘటన తర్వాత, ఢిల్లీ అమ్మాయి, యూనివర్సిటీ ఆఫ్ కోపెన్హెగాన్లో దక్షిణ ఆసియా స్టడీస్ సెంటర్ డైరెక్టర్ రవీందర్ కౌర్ అప్పట్లో ‘సూర్యాస్తమయ భయాన్ని గెలవాలి’ శీర్షికతో ఒక వ్యాసం రాశారు. అందులో–‘‘సూర్యాస్తమయ వేళకు ఇంటికి చేరుకోవాలి, ఇది నేను 90 దశకంలో యూని వర్సిటీలో చేరినప్పుడు మా అమ్మ నా వద్ద తీసుకున్న మాట. అప్పట్లో ఇక్కడ ఆడపిల్లలు ఉన్న ప్రతి ఇంటా ఇదే పరిస్థితి’’ అంటారామె. ఎక్కడైనా యుద్ధకాలంలో పిల్లలు, స్త్రీలు దురాక్రమణదారుల తొలి లక్ష్యాలు అవుతారు. కానీ, ఆనాటి ఈ యుద్ధ ప్రాంతాలు వేల ఏళ్ల తర్వాత కూడా నాటి ‘చీకటి చరిత్ర’ ను ఇంకా వీపున మోస్తున్నాయి. 2013 ఏప్రిల్ 11న లండన్‌లో జరిగిన ‘జి–8’ దేశాల వేదిక భేటీలో–సంఘర్షణాత్మక ప్రాంతాల్లో లైంగిక హింస మీద ‘హిస్టారిక్’ పేరుతో ఒక ఒప్పం దం జరిగింది. అక్కడ – ‘‘ఇందులో ‘వార్ జోన్ రేప్’ అంశాన్ని ఈ వేదిక మీద ఉంచుతున్నాము. ఇక మీదట దీని ప్రాధాన్యత ఎంత మాత్రం తగ్గడానికి వీలులేదు. 17, 18 శతాబ్దాల నాటి బానిస వ్యాపా రం మళ్ళీ తిరిగి లైంగిక హింసగా కొత్త రూపం తీసుకుంది’’ అని ఆ వేదిక ఆందోళన వ్యక్తం చేసింది. ఇక్కడ ఈ పీడనకు బలయ్యేది– ఎస్సీ, ఎస్టీ, అల్పసంఖ్యాక వర్గాలు, సంచార జాతులే. వీరి పిల్లలు, స్త్రీల భద్రత ఆ కుటుంబాలకే కాదు, ప్రభుత్వాలకు సైతం అలవికాని పనవుతోంది. సామాన్య కుటుం బాల్లో–ఈడొచ్చిన పిల్లలు ఉంటే, వారి వల్ల ఎప్పుడు ఎటువంటి సమస్య ఇంటి మీదికి వస్తుందో అని పెద్దలు ఇప్పుడు బిక్కుబిక్కుమంటున్నారు. ఎదుగుతున్న కులాల్లో, ఆర్థిక సమస్యల తీవ్రత కొంత తగ్గినప్పటికీ, భద్రత ఇప్పుడు ఆందోళన కలిగిస్తున్న కొత్త సమస్య. అయితే ఈ పరిస్థితికి కారణమైన మూలాలను విడిచి ఇప్పటికీ ప్రభుత్వాలు వీటిని శాంతిభద్రతల అంశంగా చూడ్డం నిరాశ కలిగిస్తున్నది. వ్యాసకర్త: జాన్సన్ చోరగుడి, అభివృద్ధి–సామాజిక అంశాల వ్యాఖ్యాత మొబైల్: 98662 24828 -
టీచర్ మెడలో చెప్పుల దండ వేసి..
-
కోచింగ్ సెంటర్‌కు రావడం లేదని..
భువనేశ్వర్: విద్య వ్యాపారంగా మారిందనడానికి ఒడిషాలో ఇటీవల చోటుచేసుకున్న ఓ ఘటన సజీవ సాక్ష్యంగా నిలిచింది. తన కోచింగ్ సెంటర్లో చదువుచెప్పే టీచర్ మరో ఇన్స్టిట్యూట్లోకి మారడాన్ని జీర్ణించుకోలేని ఓ ప్రబుద్ధుడు అత్యంత అనాగరిక చర్యకు పాల్పడ్డాడు. సదరు టీచర్ మెడలో చెప్పుల దండ వేసి ఘోర అవమానం చేశాడు. ఈ ఘటన నయాగర్ జిల్లాలో మంగళవారం జరిగింది. వివరాలు.. తపన్ మహాపాత్రకు చెందిన సత్యసాయి కోచింగ్ సెంటర్లో మయాధర్ మహాపాత్ర అనే వ్యక్తి ఇంగ్లిష్ టీచర్‌గా పనిచేస్తున్నారు. గత కొంతకాలంగా తపన్ జీతం సరిగా చెల్లించడం లేదు. దాంతో మయాధర్ ఇటీవల మరో కోచింగ్ సెంటర్లో జాబ్‌లో చేరాడు. మయాధర్ వెళ్లిపోవడంతో తన కోచింగ్ సెంటర్ సరిగా నడవడం లేదని తపన్ అతనిపై పగ పెంచుకున్నాడు. మంగళవారం విధులకు బయల్దేరిన మయాధర్ను తపన్ మరో ఇద్దరు వ్యక్తులు అడ్డగించారు. అతనిపై దాడికి దిగారు. చెట్టుకు కట్టేసి చెప్పుల దండవేసి అవమానించారు. విషయం బయటపెడితే ప్రాణాలు తీస్తామని బెదిరించారు. అయితే, ఈ వ్యవహారాన్నంత ఓ యువకుడు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో వైరల్ అయింది. తనకు ఘోర అవమానం చేసిన తపన్, మరో ఇద్దరిపై మయాధర్ ఫిర్యాదు చేశాడని జిల్లా ఎస్పీ ఆశిష్‌సింగ్ వెల్లడించారు. పరారీలో ఉన్న నిందితుల కోసం గాలింపు చేపట్టామని ఎస్పీ తెలిపారు. -
బస్ డ్రైవర్ బరితెగింపు..!
సాక్షి, ముంబై: తల్లిదండ్రులతో కలిసి షిర్డీ యాత్రకు వెళ్లొస్తున్న ఆరేళ్ల బాలికపై లైంగిక దాడికి యత్నించిన వ్యక్తిని పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. నిందితుడు సోపన్ యుగేల్ (32) ముంబై ఆర్టీసీలో డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. పోలీసులు తెలిపిన వివరాలు..మలద్ ప్రాంతానికి చెందిన ఓ కుటుంబం షిర్డీ యాత్ర ముగించుకుని బుధవారం రాత్రి బస్సులో తిరుగుపయనమైంది. బస్సులో సీట్లు ఖాళీగా ఉండడంతో బాలికను ఓ సీట్లో పడుకోబెట్టారు. రాత్రి 10 గంటలకు బస్సు ఎక్కిన నిందితుడు బాలిక నిద్రిస్తున్న ముందు సీట్లో కూర్చొన్నాడు. అయితే, ఉదయం 6 గంటల సమయంలో నిద్రలేచిన బాలిక తన ప్రయివేటు భాగాల్లో నొప్పిగా ఉందని తల్లికి చెప్పింది. ఇది గమనించిన నిందితుడు అప్పటికే బస్సు నగరానికి చేరుకోవడంతో అక్కడ నుంచి జారుకున్నాడని పోలీసులు తెలిపారు. విషయం తెలుసుకున్న బాలిక తల్లిదండ్రులు కురార్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోక్సో చట్టం కింద నమోదు చేసుకున్న పోలీసులు విషయాన్ని క్రైం బ్రాంచ్ పోలీసులకు చెప్పడంతో వారు బస్సు టికెట్ ఆధారంగా నిందితున్ని అదుపులోకి తీసుకున్నారు. బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించినట్లు సదరు బస్ డ్రైవర్ విచారణలో అంగీకరించాడని పోలీసులు తెలిపారు. -
ఐపీఎస్ కూతురు డ్రైవర్‌పై దాడి
-
డ్రైవర్‌పై ఐపీఎస్ కూతురి నిర్వాకం
తిరువనంతపురం: తమ ఇంటి వద్ద కాపలాగా పనిచేస్తున్న పోలీసుపై దాడి చేసినందుకు కేరళ ఐపీఎస్ అధికారి కూతురిపై నాన్ బెయిలబుల్ కేసు నమోదైంది. పరుష పదజాలంతో దూషించడమే కాకుండా, తనపై దాడి చేశారని బాధితుడు ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఈ ఘటన గురువారం తిరువనంతపురంలో చోటుచేసుకుంది. వివరాలు.. కేరళ పోలీసు శాఖలో అసిస్టెంట్ డీజీపీగా పనిచేస్తున్న సుదేష్ కుమార్ వద్ద హోంగార్డు గవాస్కర్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. గురువారం ఉదయం సుదేష్ కుమార్ భార్యాబిడ్డలు వాకింగ్‌కు వెళ్లారు. వారిని తిరిగి ఇంటికి తీసుకెళ్లేందుకు డ్రైవర్ గవాస్కర్ కాస్త ఆలస్యంగా రావడంతో ఐపీఎస్ కూతురు అతన్ని బూతులు తిట్టారు. ఆలస్యానికి గల కారణాన్ని చెప్తున్నా వినకుండా ఆమె నానా రభస చేయడంతో.. గవాస్కర్ అసహనం వ్యక్తం చేశాడు. అనవసరంగా నోరుపారేసుకోవద్దని కోరాడు. దాంతో కోపంతో ఊగిపోయిన ఆ యువతి అతన్ని తోసేసి దాడికి దిగారు. మొబైల్ ఫోన్‌తో అతడి మెడపై బాది గాయం చేశారు. బాధితుడు జిల్లా ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. కాగా, మహిళల గౌరవానికి భంగం కలిగించాడంటూ డ్రైవర్‌పై సదరు ఏడీజీపీ కుటుంబం ఫిర్యాదు చేయడంతో అతడిపై కూడా కేసు నమోదైంది. ఈ కేసుల విచారణను డీఎస్సీ స్థాయి వ్యక్తి చేపడతారని సమాచారం. గవాస్కర్ ఘటన తర్వాత కేరళలోని పోలీసు ఉన్నతాధికారుల నివాసాల వద్ద బాధ్యతలు నిర్వహిస్తున్న అనేక మంది కింది స్థాయి సిబ్బంది తమ గోడు వెళ్లగక్కుతున్నారు. ప్రభుత్వ ఉద్యోగాల పేరుతో వాళ్ల ఇద్ద చాకిరీ చేయించుకుంటున్నారని ఆరోపిస్తున్నారు. కనీస గౌరవం లేకుండా మాట్లాడుతారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
దారుణం: చిన్నారిపై మైనర్ అకృత్యం, హత్య
నొయిడా, ఉత్తరప్రదేశ్: యూపీలో మరో దారుణం చోటుచేసుకుంది. ముక్కుపచ్చలారని మూడేళ్ల బాలికపై ఓ మైనర్ అత్యాచార యత్నం చేశాడు. ఆపై నిజం బయట పడుతుందని ఆ చిన్నారిని హతమార్చాడు. అనంతరం మృతదేహాన్ని బిస్రఖ్ ప్రాంతంలో గల దేవాలయం సమీపంలో పడేసి ఏమీ తెలియనట్లు ఇంటికి చేరుకున్నాడు. ఈ ఘటన గ్రేటర్ నొయిడాలో గురువారం చోటుచేసుకుంది. బాధితురాలి పక్కింట్లో నివాసముండే 13 ఏళ్ల మైనర్ ఈ దారుణానికి పాల్పడ్డాడు. చిన్నారి ఆచూకీ తెలియక సతమతమైన తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. స్థానికంగా ఉన్న సీసీటీవీ కెమెరాలను పరిశీలించిన పోలీసులకు కీలక సమాచారం లభించింది. శివారు ప్రాంతంలో గురువారం సాయంత్రం నిందితుడు బాలికను తీసుకొని వెళ్తున్న దృశ్యాలు కెమెరాలో రికార్డయ్యాయి. మైనర్‌ను విచారించగా నిజం ఒప్పు కున్నాడనీ, కేసు నమోదు చేశామని పోలీసులు వెల్లడించారు. నిందితుడి వద్ద పోర్న్ చిత్రాలు లభించాయని తెలిపారు. -
లైంగిక దాడి చేసి నిప్పంటించిన కిరాతకుడు
రాంచి: జార్ఖండ్‌లో దారుణం చోటుచేసుకుంది. 16 ఏళ్ల మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడి, నిప్పంటించడంతో తీవ్ర గాయాలపాలైన బాధితురాలు శుక్రవారం మరణించింది. ఈ ఘటన పాకూర్ జిల్లాలోని కాకర్‌వానా గ్రామంలో మే 4న జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం.. కాకర్‌వానా గ్రామంలో, ఇంట్లో ఒంటరిగా ఉన్న బాలికపై బచ్చన్ మండల్ అనే యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలిక సహాయం కోసం కేకలు వేయడంతో సమీపంలోని మరుగుదొడ్ల వద్దకు తీసుకెళ్లి ఆమెకు నిప్పంటించి పరారయ్యాడు. తీవ్ర గాయాలతో ఉన్న బాలికను తల్లిదండ్రులు హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. అయితే, మొదట బాధితురాలి తల్లిదండ్రులు ఆమె ఆత్మహత్యకు పాల్పడొచ్చని భావించారు. బాలిక ఆరోగ్య పరిస్థితి మెరుగు పడక పోవడంతో ఆమెను బొకారో జనరల్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ స్పృహలోకి వచ్చిన బాధితురాలు జరిగిన ఘోరాన్ని పోలీసులకు తెలిపింది. నిందితునిపై పోక్సో చట్టం, ఐపీసీలోని పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశామని పాకూర్ డీఎస్పీ శ్రావణ్ కుమార్ తెలిపారు. కాగా, నిందితునిపై చర్యలు తీసుకోవడంలో మెతక వైఖరి ప్రదర్శించిన ముసఫిర్ పోలీస్‌స్టేషన్ ఎస్హెచ్ఓ ను సస్పెండ్ చేసినట్టు అధికారులు తెలిపారు. ఇటీవల జార్ఖండ్‌లో మైనర్ బాలికపై అత్యాచారం, హత్యా ఘటన చోటుచేసుకోవడం ఇది రెండోసారి. చాత్రా జిల్లాలో జరిగిన మైనర్ బాలికపై హత్యాచార ఘటనలో ప్రమేయమున్న 15 మందిని పోలీసులు అరెస్టు చేశారు. -
ఆస్తికోసం తమ్ముడి కుటుంబంపై దాడి
చందంపేట నల్గొండ : ఆస్తుల కోసం మారుమూల గ్రామాల్లో ఘర్షణలు జరుగుతూనే ఉన్నాయి. రెండు ఎకరాల భూమి కోసం సొంత తమ్ముడు, తమ్ముడి కుమారుడు, తమ్ముడి భార్యను చంపేందుకు వెనుకాడ లేదు. వివరాల్లోకెళ్తే ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన చందంపేట మండలం చిత్రియాల గ్రామపంచాయతీ పరిధిలో చో టు చేసుకుంది. గ్రామస్తులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన రమావత్ చందు, గోప్య అన్నదమ్ములు. వీరికి తల్లిదండ్రుల ఆస్తి 25 ఎకరాలు ఉంది. తండ్రి మృతిచెందడంతో ఇరువురికి 11.5 ఎకరాల చొప్పున గతంలోనే పంచారు. రెండు ఎకరాల భూమిని తల్లి మోతి పేరున ఆమె బాగోగుల కోసం తనవద్దే ఉంచుకుంది. ఈ రెండు ఎకరాల భూమిని గోప్యకుమారుడు దేశు ఎవరికి చెప్పకుండా తన సొంతం చేసుకుని రెవెన్యూ అధికారులతో కలిసి పత్రాలు సృష్టించాడు. ఇది తెలుసుకున్న చందు కుమారుడు రమావత్ బాలు రెవెన్యూ అధికారులను వివరణ కోరగా దేశుపై భూమి రెండు ఎకరాల భూమి ఉందని చెప్పడంతో పెద్ద మనుషులను ఆశ్రయించాడు. పలుమార్లు ఇదే విషయంపై పెద్దమనుషుల సమక్షంలో పంచాయతీ కూడా నిర్వహించారు. గతంలో కూడా కేసులు అయినప్పటికీ ఈనెల 7వ తేదీన చందంపేట మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్లో చందు, రమావత్ బాలులు ఫిర్యాదు చేశారు. ఈనెల 14న ఇరువర్గాలు రావాల్సిందిగా ఎస్ఐ కబురు పెట్టారు. 8వ తేదీ సాయంత్రం సమయంలో చందు, భార్య గ్వాలి, కుమారుడు బాలు ఇంట్లో ఉన్న సమయంలో గోప్య, దేశు, తుల్చా, లక్ష్మాలు దాడి చేశారు. పరిస్థితి విషమంగా ఉండడంతో దేవరకొండ ప్రభుత్వాస్పత్రికి, అక్కడి నుంచి హైదరాబాద్‌కు తరలించారు. మేమే చేశామంటూ .. కాగా చందు కుటుంబంపై మేమే దాడి చేశామంటూ వారి కుటుంబం చనిపోయిందంటూ గోప్య, దేశు, తుల్చా, లక్ష్మాలు చందంపేట మండల కేంద్రంలోని పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయినట్లు పుకార్లు వస్తున్నాయి. గ్రామంలో దాడితో భయాందోళన వాతావరణం నెలకొంది. గతంలో కూడా వారి కుటుంబంపై దాడి జరిగిందని చిత్రియాల గ్రామస్తులు పేర్కొంటన్నారు. ఇదే విషయమై ఎస్ఐ సతీష్‌కుమార్‌ను వివరణ కోరగా తాము రైతు బంధు చెక్కుల పంపిణీ కార్యక్రమంలో బిజీగా ఉన్నామని, ఇరువర్గాల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని తెలిపారు. ఇప్పటికే విచారణ కూడా చేపట్టామని పేర్కొన్నారు. -
సెల్ఫోన్లో డాక్టర్ రహస్య చిత్రీకరణ
టీ.నగర్: చికిత్స కోసం ఆస్పత్రికి వచ్చే మహిళలను రహస్యంగా సెల్ఫోన్లో చిత్రీకరించడమే కాకుండా లైంగిక దాడి జరిపిన డాక్టర్‌ను గురువారం పోలీసులు అరెస్టు చేశారు. చెన్నై మైలాపూరు డాక్టర్ (64) సొంతగా క్లినిక్ నడుపుతున్నారు. జనరల్ ఫిజిషియన్‌గా ఉన్న ఇతని వద్దకు మహిళా పేషెంట్లు ఎక్కువగా వస్తుంటారు. తిరువళ్లూరుకు చెందిన ఒక మహిళ పుట్టినిల్లు మైలాపూర్‌లో ఉంది. ఈమెకు స్వల్పంగా అస్వస్థత ఏర్పడడంతో గురువారం డాక్టర్ వద్దకు చికిత్సకు వెళ్లారు. డాక్టర్ ఆమెను ప్రత్యేక గదికి తీసుకెళ్లి పరీక్షించారు. ఆ సమయంలో తన సెల్ఫోన్లో ఆమెను రహస్యంగా చిత్రీకరించారు. దీన్ని గమనించిన సదరు మహిళ మైలాపూరు పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు ఆస్పత్రికి వెళ్లి డాక్టర్ సెల్‌ఫోన్‌ను పరిశీలించారు. అందులో మహిళ చిత్రాలు నమోదై ఉన్నాయి. దీంతో డాక్టర్‌ను పోలీసులు గురువారం అరెస్టు చేశారు. అతని సెల్‌ఫోన్ మెమరీ కార్డును స్వాధీనం చేసుకుని పరిశీలించగా ఆస్పత్రికి వచ్చిన మహిళలను అసభ్యంగా చిత్రీకరించినట్లు కనిపించాయి. ఇలాఉండగా డాక్టర్ అనేక మంది మహిళలను అసభ్యంగా సెల్ఫోల్లో చిత్రీకరించి, వారిని బెదిరించి లొంగదీసుకునేవాడని, అనంతరం వారిపై అత్యాచారం జరిపేవాడని పోలీసుల విచారణలో తేలింది. అరెస్టయిన డాక్టర్‌కు ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. ఇందులో ఇద్దరు డాక్టర్లు కావడం గమనార్హం. -
కుటుంబ సాయంతో మైనర్‌పై లైంగిక దాడి
కాన్పూర్: అత్యాచార ఘటనలపై ఉక్కుపాదం మోపేందుకు 12 ఏళ్లలోపు చిన్నారులపై లైంగిక నేరాలకు పాల్పడిన వారికి మరణశిక్షను విధించేలా కేంద్రం పోక్సో (లైంగిక నేరాల నుంచి చిన్నారులకు రక్షణ) చట్టానికి సవరణలు చేసి వారమైనా కాకముందే ఉత్తరప్రదేశ్‌లో మరో అమానుష ఘటన చోటుచేసుకుంది. ఓ మైనర్ తన తల్లిదండ్రులు, సోదరి ఎదుటే బాలిక(13)పై అత్యాచారానికి ఒడిగట్టాడు. ఈ ఘటన ఉత్తర్‌ప్రదేశ్ దెహాత్ జిల్లాలో ఆదివారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శివలీ ప్రాంతంలో నివాసముండే 16 ఏళ్ల బాలుడు తన తల్లిదండ్రులు, సోదరి మద్ధతుతో ఆదివారం 13 ఏళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. తన కుటుంబ సభ్యులతో కలిసి బాధితురాలిని తీవ్రంగా హింసించాడనీ.. లైంగిక దాడి గురించి బయటపెడితే ప్రాణాలు తీస్తామని బెదిరించారని దెహాత్ జిల్లా డీఐజీ రతన్‌కాంత్ పాండే తెలిపారు. ఇంటికి వెళ్లిన బాధితురాలు జరిగిన ఘోరాన్ని తన తల్లిదండ్రులకు చెప్పింది. తీవ్ర గాయాలతో ఉన్న బాధితురాలిని ముందుగా జిల్లాలోని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆమె ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా మారడంతో అక్కడ నుంచి లాలా లజపతిరాయ్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. బాలిక తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు శివలీ పోలీస్ స్టేషన్లో సోమవారం కేసు నమోదైంది. విచారణ చేపట్టిన పోలీసులు మంగళవారం బాలుడిని అదుపులోకి తీసుకున్నారు. అతడి తల్లిదండ్రులను అరెస్టు చేసి జైలుకు తరలించారు. మైనర్, అతని తల్లిదండ్రులపై ఐపీసీ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశామని.. పోక్సో చట్టంలోని పలు సెక్షన్ల కింద కూడా కేసు నమోదు చేస్తామని డీఐజీ చెప్పారు. -
పసిపిల్లలపై పైశాచికం
సంగారెడ్డి క్రైం: కళ్లాకపటం ఎరుగని పసిపిల్లలపై కొంతమంది మనుషుల రూపంలో ఉన్న మృగాలు దాడికి పాల్పడుతున్నాయి. అభంశుభం ఎరుగని అమాయకులైన పిల్లలపై అఘాయిత్యానికి పాల్పడుతూ సమాజం సిగ్గుపడేలా చేస్తున్నారు కొందరు కామాంధులు. ఇటీవల పసిపిల్లలపై అఘాయిత్యాలపై దేశంలో తీవ్ర అలజడి, ఆందోళన వ్యక్తం అవుతున్న విషయం తెలిసిందే. ఉమ్మడి జిల్లాలోనూ చిన్నారులపై అఘాయిత్యాలు జరిగిన ఘటనలు ఉన్నాయి. బడుల్లో కొందరు రాబందులు.. కొందరు ఉపాధ్యాయులు కామాంధులుగా మారి పవిత్రమైన వారి వృత్తికే మచ్చతెస్తున్న ఘటనలు అనేకం. పిల్లలను సొంత బిడ్డలుగా చూడాల్సిన టీచర్లు వారిపై పశువుల మాదిరిగా ప్రవర్తిస్తున్నారు. మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో ఇటీవల విద్యార్థినులపై జరిగిన ఆకృత్యాలు ఆందోళనకు గురి చేశాయి. దురా‘గతా’లివీ.. ♦ పుల్కల్ మండలం కోర్పోల్ పాఠశాలలో ఉపాధ్యాయుడు విద్యార్థిలపై వేధింపులకు పాల్పడడంతో విషయం తెలసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు. దీంతో సదరు ఉపాధ్యాయుడిని అధికారులు సస్పెండ్ చేశారు. జిన్నారం మండలంలోని బొల్లారం ఉన్నత పాఠశాలలో ఇదే ఆరోపణలతో ఇద్దరు ఉపాధ్యాయులను, శివనగర్ పాఠశాలలో ఒక ఉపాధ్యాడు సస్పెండ్ చేశారు. ♦ తూప్రాన్ మండలంలోని ముప్పిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన ఓ కామాంధుడు ఆరు సంవత్సరాలు ఉన్న ఓ చిన్నారికి మాయమాటలు చెప్పి పాఠశాల నుంచి మధ్యాహ్నం బయటకు తీసుకెళ్లాడు. రోడ్డుకు వేసే రింగు పైపుల్లో ఆ పాపను ఆత్యచారం చేసి హత్య చేసిన ఘటన కలకలం రేపింది. ♦ ఈ ఘటనలో జిల్లా పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి అతి కొద్ది వ్యవధిలోనే కేసును ఛేదించి నిందితున్ని అదుపులోకి తీసుకున్నారు. ఆ ఘటనలో నిందుతుడు జైలు పాలయ్యాడు. సంబంధిత పాఠశాల ఉపాధ్యాయులను రాష్ట్ర విద్యాశాఖ అధికారులు సస్పెండ్ చేశారు. ఆత్మరక్షణ కోసం .... అమ్మాయిలు వ్యక్తిగత రక్షణ కోసం మార్షల్ ఆర్ట్స్‌లో కనీస పరిజ్ఞానం, పరిసరాలపై అవగాహన కలిగి ఉంటే ప్రమాదాలను ఎదుర్కొవడమే కాకుండా తప్పించుకోవచ్చని పోలీసులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. పక్కదారి పట్టిస్తున్న స్మార్ట్ ఫోన్లు.. యువతను ఆండ్రాయిడ్ ఫోన్లు పక్కదారి పట్టిస్తున్నాయన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. అమ్మాయిలపై అఘాయిత్యాలకు పాల్పడుతు న్న వారిలో ఫోన్లలో అశ్లీల దృశ్యాలను చూస్తు న్న వారే అధికంగా ఉంటున్నారని పలు సర్వేలు చెబుతున్నాయి. తల్లిదండ్రులు వారి పిల్లలను స్మార్ట్ ఫోన్లకు దూరంగా ఉంచితే మంచిది. షీ టీమ్‌లతో కొంత వరకు తగ్గుముఖం... మహిళలపై జరుగుతున్న వేధింపులు, దాడులను అరికట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం షీ టీమ్‌లను ఏర్పాటు చేసింది. బస్టాండ్లు, రైల్వే స్టేష న్లు, షాపింగ్ కాంప్లెక్స్‌లు తదితర రద్దీ ప్రాం తా ల్లో మహిళలపై వేధింపులు షీ టీమ్స్ వల్ల తగా ్గయి. సివిల్ డ్రెస్‌లో ఉంటున్న మహిళా పోలీసు లు ఆడవారితో అసభ్యంగా ప్రవర్తిస్తున్న వ్యక్తులను అదుపులోకి తీసుకున్న ఘటనలు అనేకం. కఠిన చర్యలు తీసుకుంటున్నాం బాలికలపై అత్యచారాలు, వేధింపుల కేసులో ఫోక్స్ యాక్టు కింద కఠిన చర్యలు తీసుకుంటున్నాం. ఈ విషయంలో తల్లిదండ్రులు వెనుకంజ వేసినా సంబంధిత అధికారుల చేత ఫిర్యాదులు తీసుకుంటున్నాం. జిల్లా వ్యాప్తంగా ఏ పోలీస్ స్టేషన్లో ఫోక్స్ యాక్టు కింద కేసు నమోదు అయినా ప్రత్యేక అధికారిని నియమించి కేసును ఛేదించడానికి చర్యలు తీసుకుంటున్నాం. సంగారెడ్డిని నేరరహిత జిల్లాగా తీర్చిదిద్దడానికి అన్ని విధాలుగా ప్రయత్నం చేస్తున్నాం. ప్రజలు సహకరించాలి. – సిద్దిపేట సిపి జోయెల్ డేవిస్ బాలికల భద్రతకు భరోసా సెంటర్ ఏర్పాటు జిల్లాలో బాలికలపై అత్యాచారాలు, వేధింపులను నిరోధించడానికి భరోసా సెంటర్‌ను ఏర్పాటు చేస్తాం. సమస్యాత్మక ప్రాంతాల్లో మఫ్టిలో మహిళా పోలీసులతో గస్తీ నిర్వహిస్తాం. మహిళలకు ఏలాంటి ఇబ్బందులు లేకుండా పోలీస్ స్టేషన్లకు సంబంధం లేకుండానే ఫిర్యాదు చేయడానికి వింగ్‌ను ఏర్పాటు చేస్తున్నాం. మైనర్లపై జరిగే వేధింపుల విషయంలో చాలా సీరియస్‌గా ఉన్నాం. అలాంటి ఘటనలను ఛేదించడానికి ప్రత్యేక పోలీసులను సిబ్బందిని ఏర్పాటు చేస్తున్నాం – చందనాదీప్తి మెదక్ ఎస్పీ -
పిల్లల్ని చంపేస్తానంటూ లైంగిక దాడి చేశాడు
పంజగుట్ట:నన్ను బెదిరించి లైంగికదాడికి పాల్పడ్డ వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని ఓ మహిళ వాపోయింది. పెద్దపల్లి జిల్లా మంథని మండలం గోపాల్పూర్ గ్రామానికి చెందిన బాధితురాలు గురువారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో విలేకరులతో మాట్లాడింది. తన భర్త అనారోగ్యంతో చనిపోయాడని కొద్దిరోజుల తరువాత సింగరేణి ఉద్యోగి, సింగరేణి అధికార సంఘం నాయకుడు సుంకరి ప్రతాప్ తనను పెళ్లి చేసుకుంటానని చెప్పాడన్నారు.పెళ్లి చేసుకోకుంటే తనను, తన పిల్లల్ని చంపేస్తానంటూ బెదిరించాడని వాపోయింది. ఫిబ్రవరి 20న ప్రతాప్ అతని కారులో ఆడుకుంటున్న ఐదు సంవత్సరాల తన కూతురును కారులో ఎక్కించుకొని ఫోన్ చేసి బెదిరించి వచ్చి కారులో కూర్చోవాలని బెదిరించాడని పేర్కొంది. అతను చెప్పినట్లు చేయగా కొండగట్టుకు తీసుకెళ్లి పెళ్లి చేసుకుందామని నమ్మించి సత్రంలో బంధించి లైంగికదాడి చేశాడన్నారు. అలాగే వేముల వాడ, భద్రాచలం తిప్పాడన్నారు. తరువాత గోదావరిఖనికి తీసుకెళ్లి స్నేహితుల ఇంట్లో ఉంచి డ్యూటికి వెళ్లొస్తానని చెప్పి వెళ్లిపోయాడన్నారు. న్యాయంచేయాలని వారింటికి వెళితే ప్రతాప్ కొడుకులు సుంకరి కిరణ్, సుంకరి కిశోర్ నన్ను, నా కూతురును చితకబాది రూమ్‌లో బంధించి ఈ విష యం బయటకు చెబితే చంపేస్తానని అర్థరాత్రి విడిచిపెట్టారని ఆవేదన వ్యక్తం చేసింది. పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని వాపోయింది. హైకోర్టు న్యాయవాది టీవీ నాగమణి, కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి ఇందిరా శోభన్, అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రాజారాం తదితరులు పాల్గొన్నారు. -
సూరత్ అత్యాచార కేసులో కీలక మలుపు
-
సూరత్ అత్యాచార బాధితురాలు తెలుగు బిడ్డే..!
సూరత్: గుజరాత్ రాష్ట్రం సూరత్‌లో అత్యాచారం, హత్యకు గురైన తొమ్మిదేళ్ల బాలిక ఎవరో తెలిసిపోయింది. గత పన్నెండు రోజులుగా బాలిక తల్లిదండ్రులెవరో గుర్తించేందుకు పోలీసులు చేపట్టిన ‘సోషల్ పోస్టర్’ ప్రచారం ఫలించింది. సోషల్ మీడియాలో మృతురాలి ఫోటో చూసి ఆమె తమ కూతురేనంటూ ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఓ కుటుంబం సూరత్ పోలీసులను ఆశ్రయించింది. తమ కూతురు గతేడాది అక్టోబర్‌లో అదృశ్యమైందని వారు పేర్కొన్నారు. పోలీసులు వారి వద్ద గల చిన్నారి ఆధార్ కార్డుతో మృతదేహాన్ని పోల్చి చూశారు. మృతురాలి తల్లిదండ్రులు వారేనని ప్రాథమిక నిర్ధారణకు వచ్చినట్లు వెల్లడించారు. డీఎన్ఏ పరీక్షల అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని తెలిపారు. 10 రోజుల జాప్యమెందుకు..? శరీరంపై 86 గాట్లతో సూరత్‌లోని భేస్తాన్ ప్రాంతంలో గల క్రికెట్ స్టేడియం వద్ద బాలిక మృతదేహాన్ని ఏప్రిల్ 6న పోలీసులు గుర్తించారు. దాదాపు 5 గంటల పోస్టుమార్టం అనంతరం బాలిక దాదాపు 8 రోజలు అత్యాచారానికి, ఆపై హత్యకు గురైందని తేలింది. అయితే ఫోరెన్సిక్ పరీక్షల కోసం బాలిక శరీర నమూనాలను పోలీసులు ఏప్రిల్ 6న పంపించాల్సి ఉంది. కానీ 10 రోజుల జాప్యం తర్వాత ఏప్రిల్ 16న ఫోరెన్సిక్ ల్యాబ్‌కు ఆ నమూనాలు చేరినట్లు తెలుస్తోంది. దీనిపై పోలీసుల్ని వివరణ కోరగా నమూనాలను ఏప్రిల్ 6నే పంపినట్లు చెప్పడం గమనార్హం. ఈ పది రోజుల జాప్యానికి కారణాలేమై ఉంటాయన్నది ఎన్నో పశ్నలను లేవనెత్తుతోంది. బాలిక తల్లిదండ్రులెవరో గుర్తించేందుకు అటు పోలీసులు,వ్యాపారులు స్పందించిన తీరు అమోఘం. సూరత్ ప్రాంతంలోని ప్రతి వ్యాపారి తమ వంతుగా ఆమె ఆచూకీని తెలుపుతూ వారివారి దుకాణాల ముందు ఆ చిన్నారి ఫోటోని ప్రదర్శించారు. -
‘మరణదండనే వారికి సరైన శిక్ష’
న్యూఢిల్లీ : కథువా అత్యాచార ఉదతంపై దేశవ్యాప్తంగా ఆగ్రహావేశాలు పెల్లుబికుతున్నాయి. జమ్మూకశ్మీర్‌లోని కథువా ప్రాంతానికి చెందిన అసిఫా(8)కి మాదకద్రవ్యాలు ఇచ్చి నాలుగు రోజుల పాటు పాశవికంగా అత్యాచారం చేసి చంపేశారు. ఈ ఘటన తనను తీవ్రంగా కలచివేసిందని కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి మేనకా గాంధీ అన్నారు. బాలలపై అత్యాచారానికి పాల్పడే వారికి కఠిన శిక్షలు విధించాలని చెప్పారు. ఈ మేరకు బాలలపై లైంగిక దాడుల నుంచి రక్షణ చట్టం(పీఓఎస్సీఓ)ను సవరించాలని భావిస్తున్నట్లు వెల్లడించారు. పిల్లలపై ఇలాంటి దారుణాలకు ఒడిగట్టేవారికి మరణ దండన విధించాలనే నిబంధనను నోట్‌గా కేబినేట్ ముందుకు తీసుకెళ్లనున్నట్లు వివరించారు. ఈ మేరకు ఓ వీడియోను మేనకా గాంధీ విడుదల చేశారు. కథువా లాంటి ఉదంతాలు దేశవ్యాప్తంగా జరుగుతున్నాయని విచారం వ్యక్తం చేశారు. 12 సంవత్సరాల లోపు చిన్నారులపై అత్యాచారానికి పాల్పడే మృగాళ్లకు మరణ దండనే సరైన శిక్ష అని పేర్కొన్నారు. ఈ మేరకు పోస్కో చట్టంలో సవరణలు తీసుకురావడానికి ప్రయత్నిస్తానని తెలిపారు. -
మహిళా గార్డుపై దౌర్జన్యం
ఏలూరు టౌన్ : రాష్ట్ర వ్యాప్తంగా మహిళలపై టీడీపీ నేతల దాడులు, దౌర్జన్యాలు, అరాచకాలకు పాల్పడిన సంఘటనలు కళ్ళముందు కదలాడుతూ ఉండగానే... ఏలూరు జిల్లా కేంద్ర ప్రభుత్వాసుపత్రిలో మరో అమానుష సంఘటన మంగళవారం చోటుచేసుకుంది. మహిళా విభాగంలోకిఅనుమతించలేదనే కోపంతో ప్రభుత్వాసుపత్రిలోని మహిళా సెక్యూరిటీ గార్డుపై తెలుగుదేశం పార్టీకి చెందిన జెడ్పీటీసీ సభ్యుడు దౌర్జన్యానికి దిగారు. ఏకంగా మహిళా సెక్యూరిటీ గార్డు గుండెలపై చేయివేసి గెంటివేయటంతో ఆమె హతాశురాలయ్యింది. అంతా చూస్తుండగానే ఒక ప్రజాప్రతినిధి మహిళపై చేయి వేయటంతో అక్కడివారంతా ఉలిక్కిపడ్డారు. ఏమి జరుగుతుందో అర్థంకాని పరిస్థితి ఏర్పడింది. సదరు జెడ్పీటీసీ సభ్యుడు తాను జిల్లా మంత్రి అనుంగుడనని.. నాకే చేయి అడ్డుపెడతావా అంటూ చిందులేశారు. అధికార పార్టీకి చెందిన తనకే మర్యాద లేకుండా ప్రవర్తిస్తారా అంటూ హడావుడి చేశారు. మీ సంగతి తేలుస్తానంటూ గొడవ చేసి గందరగోళం సృష్టించారు. ఆ మహిళా సెక్యూరిటీ గార్డు సహచర సిబ్బందికి, అధికారులకు, కార్మిక సంఘం నాయకులకు తనకు జరిగిన అవమానాన్ని చెప్పుకుని రోదించింది. మెడికల్ కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు కె.కృష్ణమాచార్యులు, కార్మిక సంఘం నేతలు, సెక్యూరిటీ సిబ్బంది ఆసుపత్రి వద్ద ఆందోళనకు దిగారు. మహిళల పట్ల దారుణంగా ప్రవర్తించినటీడీపీ జెడ్పీటీసీ సభ్యుడిపై చర్యలు తీసుకోవాలని, మహిళలకు ఈప్రభుత్వంలో రక్షణ లేదంటూ నినాదాలు చేశారు. దౌర్జన్యానికి కారణమేంటంటే ఏలూరు జిల్లా కేంద్ర ప్రభుత్వాసుపత్రిలో మహిళా, శిశు విభాగాన్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. ఈ విభాగంలో కేవలం మహిళలకు మాత్రమే సేవలు అందిస్తూ ఉండడంతో ఆసుపత్రి మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ ఏవీఆర్ మోహన్ మహిళా సెక్యూరిటీ గార్డులను నియమించారు. మహిళా విభాగంలోకి నిర్దేశిత సమయాల్లో మినహా పురుషులను ఎవ్వరినీ అనుమతించరు. మంగళవారం మధ్యాహ్నం సమయంలో నిడమర్రు టీడీపీ జెడ్పీటీసీ సభ్యుడు దివాకర్ లోనికి వెళుతున్నారు. ఇదే సమయంలో అక్కడి మహిళా సెక్యూరిటీ గార్డు ప్రసన్నకుమారి విధులు నిర్వర్తిస్తున్నారు. లోనికి వెళ్ళబోతున్న దివాకర్‌కు ఆమె చేయి అడ్డుగా పెట్టి ఆపింది. పురుషులు లోనికి వెళ్ళకూడదని వారించింది. దీంతో ఆగ్రహానికి గురైన జెడ్పీటీసీ సభ్యుడు మహిళా సెక్యూరిటీ గార్డు ప్రసన్నకుమారి గుండెలపై చేయివేసి ఒక్కసారిగా వెనక్కి గెంటివేశారు. తాను ఎవరో తెలుసుకోకుండా అడ్డుపడతావా అంటూ నోటికొచ్చినట్లు తిట్లు తిడుతూ లోనికి వెళ్ళిపోయారు. ఆకస్మికంగా జెడ్పీటీసీ దాడి చేయటంతో నిశ్చేష్టురాలైన ఆమె తేరుకోలేకపోయింది. తనకు జరిగిన అవమానంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ కన్నీళ్ళు పెట్టుకుంది. నాయకులే ఇలా తమపై దాడులు చేస్తే ఇక రక్షణ ఏదంటూ విలపించింది. రాయ‘బేరాలు’ : మహిళా సెక్యూరిటీ గార్డు ప్రసన్నకుమారిపై దౌర్జన్యానికి పాల్పడిన జెడ్పీటీసీ సభ్యుడు దివాకర్ సహచర సిబ్బంది, సంఘం నేతలు వచ్చేలోగానే అక్కడి నుంచి జారుకున్నారు. సీసీ టీవీ ఫుటేజ్‌లో దాడి సంఘటనలను సంఘం జిల్లా అధ్యక్షులు కృష్ణమాచార్యులు, నేతలు పరిశీలించారు. సీసీటీవీ కెమేరాల్లో నమోదైన రికార్డుల ఆధారంగా అతను ఎవరనేది గుర్తించి జెడ్పీటీసీ దివాకర్‌గా నిర్థారించుకుని ఆయనకు ఫోన్ చేశారు. కేసు పెడతామని, తీవ్రస్థాయిలో ఆందోళన చేపడతామని హెచ్చరించటంతో దిగివచ్చిన దివాకర్ రాజీమార్గంలోకి వచ్చారు. ఆసుపత్రి కాంట్రాక్టర్, ఇతర ప్రజాసంఘాల నేతలతో రాజీకి రాయబారాలు నడిపారు. క్షమాపణ చెప్పకుంటే ఆందోళన ఉధృతం ప్రభుత్వాసుపత్రిలో విధుల్లో ఉన్న మహిళా సెక్యూరిటీ గార్డు ప్రసన్నకుమారిపై నిడమర్రు జెడ్పీటీసీ సభ్యుడు దివాకర్ దౌర్జన్యానికి పాల్పడటం అత్యంత హేయమైనది. టీడీపీ ప్రభుత్వం హయాంలో రాష్ట్రంలో మహిళలపై అనేక దాడులు జరిగాయి. ఇప్పుడు ఏలూరులో టీడీపీ ప్రజాప్రతినిధి ఈ విధంగా ఆమె గుండెలపై చేయివేసి గెంటివేయటం తీవ్రమైన నేరం. ఆయన వచ్చి అందరి సమక్షంలో క్షమాపణలు చెప్పని పక్షంలో జిల్లా వ్యాప్తంగా మా పోరాటాన్ని ఉధృతం చేస్తాం.– కే.కృష్ణమాచార్యులు, సంఘం జిల్లా అధ్యక్షుడు -
మందలించాడని తండ్రిని చంపేసింది.
బీజింగ్ : హోం వర్క్ చేయకపోవడంతో పాటు, సరిగా చదవటం లేదని కూతురిని మందలించడమే ఆ తండ్రి పాలిట శాపంగా మారింది. క్షణికావేశంలో కూతురు ... కన్నతండ్రిని తిరిగిరాని లోకాలకు పంపింది. కూతురి చదువు విషయంలో అసంతృప్తిగా ఉన్న తండ్రి... కూతురితో పాటు భార్యను కొట్టేవాడు. తండ్రి వ్యవహారశైలి శృతిమించడంతో భరించలేక పోయిన కూతురు తండ్రిని కత్తితో పొడిచి చంపింది. చైనాలో చోటుచేసుకున్న ఈ సంఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాల్లోకి వెళితే చైనాకు చెందిన 44 ఏళ్ల వ్యక్తి రోజులాగే కూతురి చదవుల విషయమై ఆమెతో గొడవకు దిగాడు. ఇద్దరి మధ్య గొడవ కాస్త పెద్దది కావడంతో ఆగ్రహం చెందిన తండ్రి కూతురిని కొట్టడం ప్రారంభించాడు. అయితే అతడిని అడ్డుకునేందుకు ప్రయత్నించిన భార్యపై కూడా దాడికి దిగాడు. కళ్ల ముందే తల్లిని కొట్టడం భరించలేకపోయిన కూతురు కత్తితో తండ్రిని రొమ్ముపై పొడిచింది. దీంతో తండ్రి కుప్పకూలిపోవడంతో తేరుకున్న కూతురు అంబులెన్స్‌కు ఫోన్ చేసింది. ఆస్పత్రికి తరలించినా ప్రయత్నం లేకపోయింది. ఆస్పత్రిలో చికిత్స పోందుతూ అతను మరణించాడు. సమాచారం అందుకున్న పోలీసులు కూతుర్ని అరెస్టు చేశారు. తాను ఉద్దేశ్యపూర్వకంగా ఈ హత్య చేయలేదని, కేవలం గొడవ ఆపడానికి చేస్తున్న ప్రయత్నంలో తండ్రిపై కత్తితో దాడి చేసినట్లు ఆమె తెలిపింది. కాగా తండ్రి గణిత లెక్కల టీచర్ కావడంతో తాను ఎంత బాగా చదివినా, ఎన్ని మార్కులు వచ్చినా ఎప్పుడూ హింసించే వాడని పోలీసులకు తెలిపింది. తరుచుగా చదువు విషయమై తండ్రి తనపై చేయి చేసుకునేవాడని విచారణలో పోలీసులకు వివరించింది. -
జీజీహెచ్ అభివృద్ధి కమిటీ సభ్యుడి వీరంగం
నెల్లూరు(బారకాసు): ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి సూపరింటెండెంట్‌పై అభివృద్ధి కమిటీ సభ్యుడు బుధవారం వీరంగం సృష్టించాడు. క్షమాపణ చెప్పాలని ఉద్యోగులు నిరసనకు దిగడంతో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ఆస్పత్రి చైర్మన్, పోలీసులు జోక్యం చేసుకుని క్షమాపణ చెప్పించడంతో వివాదం సమసింది. వివరాలు...జీజీహెచ్‌లో బుధవారం జరిగిన సెమినార్ హాల్ ప్రారంభోత్సవానికి హాజరైన ఆస్పత్రి అభివృద్ధి కమిటీ సభ్యుడు మొగరాల సురేష్ మాట్లాడుతూ ఆస్పత్రిలో శానిటేషన్ బాగాలేదని, నిధులు దుర్వినియోగం అవుతున్నాయని, తనకు తెలియకుండా ఎన్నో కార్యక్రమాలు జరిగిపోతున్నాయని సూపరింటెండెంట్ రాధాకృష్ణరాజుపై విరుచుకుపడ్డారు. తాను ఏమి చెప్పినా ఎందుకు పట్టించుకోరని ప్రశ్నించారు. తాను ఆస్పత్రికి వచ్చినప్పుడు కనీసం కూర్చునేందుకు కుర్చీ కూడా లేదని, చెట్లు, మెట్ల వద్ద ఉండాలా అని మండిపడ్డారు. కమిటీ సభ్యుడిగా కాకపోయినా కనీసం జాతీయ పార్టీ జిల్లా నాయకుడిగా కూడా గౌరవించరా అంటూ ప్రశ్నించారు. అందుకు సూపరింటెండెంట్ పార్టీ పరంగా ఏమైనా ఉంటే బయట చూసుకోవాలని సూచించారు. దీంతో కోపోద్రిక్తుడైన మొగరాల తమ పార్టీనే విమర్శిస్తావాని విరుచుకుపడ్డారు. ఈ క్రమంలో ఇరువురి నడుమ మాటమాట పెరిగిపోతుండగా వైద్యాధికారులు, ఆస్పత్రి చైర్మన్ జోక్యం చేసుకుని సర్దిచెప్పారు. ఈ విషయం తెలుసుకున్న ఆస్పత్రి ఉద్యోగులు, వైద్యులు సెమినార్ హాల్ ప్రారంభోత్సవం అనంతరం మూకుమ్మడిగా ఆస్పత్రి చైర్మన్ ఛాంబర్‌కు చేరుకున్నారు. ఆస్పత్రి చైర్మన్ ఛాంబర్లో ఉన్న మొగరాలపై ధ్వజమెత్తారు. సూపరింటెండెంట్‌ను పళ్లు రాలగొడతావా, వెంటనే క్షమాపణ చెప్పి కమిటీ సభ్యుడిగా రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. దీంతో గందరగోళం నెలకొనడంతో పోలీసులు రంగప్రవేశం చేశారు. ఆస్పత్రి కమిటీ చైర్మన్ చాట్ల నరసింహారావు స్పందిస్తూ కమిటీ చైర్మన్‌గా తాను సూపరింటెండెంట్‌కు క్షమాపణ చెబుతున్నానన్నా ఉద్యోగులు ఒప్పుకోలేదు. అనుచితంగా మాట్లాడిన వారే క్షమాపణ చెప్పాలని పట్టుబట్టారు. సూపరింటెండెంట్ తనకు జరిగిన అవమానాన్ని కలెక్టర్, ఎస్పీ దృష్టికి తీసుకెళ్తానని, వారే చర్యలు తీసుకుంటారని, లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేసేందుకు సిద్ధమయ్యారు. దీంతో వివాదం ఆపకపోతే చిలికి చిలికి గాలివానలా మారే ప్రమాదం ఉందని గ్రహించిన ఆస్పత్రి చైర్మన్, పోలీసులు చర్చలు జరిపి మొగరాలతో క్షమాపణ చెప్పించారు. సూపరింటెండెంట్ చేతులతోనే ఫిర్యాదుని చించివేయించారు. దీంతో మూడు గంటల పాటు నెలకొన్న గందరగోళానికి తెరపడింది. -
సినిమాహాల్లో వివాహితపై..
పార్వతీపురం: సినిమా హాల్లో మహిళల మరుగుదొడ్డిలో దూరి మహిళపై అసభ్యకరంగా ప్రవర్తించిన ఓ స్వీపర్ సంఘటన మంగళవారం పార్వతీపురం పట్టణంలో చోటు చేసుకుంది. పట్టణ ఎస్ఐ ఎం.రాజేష్ తెలిపిన వివరాల ప్రకారం సీతానగరం మండలం సీతానగరం గ్రామానికి చెందిన తోట చైతన్య తన భార్య ఇంద్రలీల(ఇందు)తో కలసి పట్టణంలోని సౌందర్య థియేటర్లో సినిమా చూసేందుకు వెళ్లారు. చిత్రం విశ్రాంతి సమయంలో మూత్రశాలలోకి వెళ్లిన ఇందును అనుసరించిన థియేటర్ స్వీపర్ ఈశ్వరరావు ఆమెతో అసభ్యకరంగా ప్రవర్తించినట్లు ఎస్ఐ తెలిపారు. ఈ విషయాన్ని ఇందు తన భర్త చైతన్యకు తెలియజేయగా ఆయన వెళ్లి అసభ్యకరంగా ప్రవర్తించిన ఈశ్వరరావును కొట్టాడు. దీంతో ఈశ్వరరావు వారి సహచర సిబ్బందిని పిలిచి మూకుమ్మడిగా చైతన్యపై దాడి చేశారు. ఈ సంఘటనలో చైతన్యకు తీవ్ర గాయాలయ్యాయి. ఇతనిని పార్వతీపురం ఏరియా ఆస్పత్రికి తరలించి వైద్యసేవలు అందిస్తున్నారు. ఈ సంఘటనపై పట్టణ ఎస్ఐ రాజేష్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
చిన్నారిని హింసించిన మారుతండ్రికి రిమాండ్
జవహర్‌నగర్: నిన్న ప్రత్యూష.. నేడు భవాని.. అంతలోనే సంధ్య..! తల్లిదండ్రులు, బంధువుల చేతుల్లో హింసకు గురవుతున్న చిన్నారుల ఉదంతాలు వరుసగా వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా నాలుగేళ్ల చిన్నారి సంధ్యను హింసిస్తోన్న మారుతండ్రిని రంగారెడ్డి జిల్లా జవహర్ నగర్ పోలీసులు అరెస్టు చేశారు. సీఐ వెంకటగిరి తెలిపిన వివరాల ప్రకారం.. జవహర్‌నగర్‌లోని బీజేఆర్‌నగర్‌లో నివాసముండే ప్రమీల కుమార్తె సంధ్య(04)ను మారుతండ్రి ప్రశాంత్‌కుమార్ కొన్ని రోజులుగా చిత్రహింసలకు గురిచేశాడు. ఇంట్లో అల్లరి చేస్తోందని, సరిగా చదవడం లేదనే నెపంతో ఇనుప కడ్డీలు కాల్చి వాతలు పెట్టాడు. చిన్నారి అమ్మమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసుకున్న పోలీసులు ప్రమీల, ప్రశాంత్ కుమార్ల ఇంటిపై దాడిచేసి చిన్నారిని కాపాడారు. వేధింపులు, హింస విషయంలో ప్రమీల, ప్రశాంత్‌కుమార్‌ను పోలీసులు ప్రశ్నించారు. అనంతరం ప్రశాంత్‌కుమార్‌ను రిమాండుకు తరలించినట్లు సీఐ పేర్కొన్నారు.