మందలించాడని తండ్రిని చంపేసింది. | Girl Killed Father In Row Over Schoolwork | Sakshi
Sakshi News home page

క్షణికావేశంలో తండ్రిని చంపేసింది..

Published Fri, Mar 23 2018 8:04 PM | Last Updated on Fri, Nov 9 2018 4:53 PM

Girl Killed Father In Row Over Schoolwork - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

బీజింగ్‌ :  హోం వర్క్‌ చేయకపోవడంతో పాటు, సరిగా చదవటం లేదని కూతురిని మందలించడమే ఆ తండ్రి పాలిట శాపంగా మారింది. క్షణికావేశంలో కూతురు ... కన్నతండ్రిని తిరిగిరాని లోకాలకు పంపింది. కూతురి చదువు విషయంలో అసంతృప్తిగా ఉన్న తండ్రి... కూతురితో పాటు భార్యను కొట్టేవాడు. తండ్రి వ్యవహారశైలి శృతిమించడంతో భరించలేక పోయిన కూతురు తండ్రిని కత్తితో పొడిచి చంపింది. చైనాలో చోటుచేసుకున్న ఈ సంఘటన ఆలస్యంగా వెలుగుచూసింది.  

వివరాల్లోకి వెళితే చైనాకు చెందిన 44 ఏళ్ల వ్యక్తి రోజులాగే  కూతురి చదవుల విషయమై ఆమెతో గొడవకు దిగాడు. ఇద్దరి మధ్య గొడవ కాస్త పెద్దది కావడంతో ఆగ్రహం చెందిన తండ్రి కూతురిని కొట్టడం ప్రారంభించాడు. అయితే అతడిని అడ్డుకునేందుకు ప్రయత్నించిన భార్యపై కూడా దాడికి దిగాడు. కళ్ల ముందే తల్లిని కొట్టడం భరించలేకపోయిన కూతురు కత్తితో తండ్రిని రొమ్ముపై పొడిచింది. దీంతో తండ్రి కుప్పకూలిపోవడంతో తేరుకున్న కూతురు అంబులెన్స్‌కు ఫోన్‌ చేసింది. ఆస్పత్రికి తరలించినా ప్రయత్నం లేకపోయింది.

ఆస్పత్రిలో చికిత్స పోందుతూ అతను మరణించాడు. సమాచారం అందుకున్న పోలీసులు కూతుర్ని అరెస్టు చేశారు. తాను ఉద్దేశ్యపూర్వకంగా ఈ హత్య చేయలేదని, కేవలం గొడవ ఆపడానికి చేస్తున్న ప్రయత్నంలో తండ్రిపై కత్తితో దాడి చేసినట్లు ఆమె తెలిపింది. కాగా తండ్రి గణిత లెక్కల టీచర్‌ కావడంతో తాను ఎంత బాగా చదివినా, ఎన్ని మార్కులు వచ్చినా ఎప్పుడూ హింసించే వాడని పోలీసులకు తెలిపింది. తరుచుగా చదువు విషయమై తండ్రి తనపై చేయి చేసుకునేవాడని విచారణలో పోలీసులకు వివరించింది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement