చైనాలో కురుస్తున్న వర్షాలు, ఈ కారణంగా సంభవించిన వరదలు పలు ప్రాంతాల్లో విధ్వంసం సృష్టించాయి. ఆగ్నేయ చైనాలో ఒక ఇల్లు కూలడంతో 11 మంది మృతి చెందారు. భారీ వర్షాల కారణంగా ఈ ప్రాంతమంతా జలమయమైంది.
షాంఘైలో ఓ చెట్టు కూలి స్కూటర్‌పై వెళ్తున్న డెలివరీ బాయ్‌పై పడటంతో అతను మృతిచెందాడు. చైనాను చేరుకోకముందు ఈ తుపాను ఫిలిప్పీన్స్‌లో కూడా విధ్వంసం సృష్టించింది. ఫిలిప్పీన్స్‌లో వర్షాల కారణంగా 34 మంది మృతిచెందారు. టైఫూన్ జెమీ తుపాను తైవాన్ ద్వీపంలో కూడా విధ్వంసం సృష్టించింది. ఇక్కడ మృతుల సంఖ్య 10 దాటింది.
హునాన్ ప్రావిన్స్‌లోని హెంగ్‌యాంగ్ నగర పరిధిలో కొండచరియలు విరిగిపడినట్లు రాష్ట్ర ప్రసార సంస్థ సీసీటీవీ తెలిపింది. భారీ వర్షాల కారణంగా పర్వతాల నుంచి నీరు ప్రవహించడం వల్లే కొండచరియలు విరిగిపడినట్లు వాతావరణశాఖ పేర్కొంది. ఉష్ణమండల తుఫానుతో కూడిన వర్షపాతం హునాన్ ప్రావిన్స్‌లోని ఆగ్నేయ భాగాలను తాకినట్లు చైనా వాతావరణశాఖ తెలిపింది.
More than 27,000 people in Northeast #China were evacuated and hundreds of factories were ordered to suspend production as #TyphoonGaemi brought heavy rains, the official Xinhua news agency reported on July 27.https://t.co/uIkKuknyTk
— The Hindu (@the_hindu) July 27, 2024
Comments
Please login to add a commentAdd a comment