Rain
-
ఉరుములు, మెరుపులు...అధిక ఉష్ణోగ్రతలు!
సాక్షి, అమరావతి/సాక్షి, విశాఖపట్నం: రాష్ట్రంలో గురువారం భిన్న వాతావరణం కనిపించింది. పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో వర్షం కురిసింది. అదే సమయంలో ఎండ ప్రతాపాన్ని చూపించింది. రానున్న రెండు రోజులు కూడా రాష్ట్రంలో ఇదే విధంగా భిన్న వాతావరణ పరిస్థితులు నెలకొననున్నట్లు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ చెప్పారు. 5 వరకూ వానలు.. ఆ తర్వాత ఎండల తీవ్రత ఉత్తర కోస్తాంధ్ర, దానిని ఆనుకుని ఉన్న దక్షిణ ఒడిశా పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఇది సముద్ర మట్టానికి 0.9 కిమీ ఎత్తులో విస్తరించి ఉంది. దీంతో పాటు ఏపీ, తెలంగాణ, కర్ణాటక మీదుగా లోతట్టు ప్రాంతాల్లో గాలుల కలయిక ప్రాంతం ఏర్పడింది. ఈ కారణంగా సముద్రం నుంచి తేమ గాలులను తీసుకువస్తుండటంతో.. అకాల వర్షాల ప్రభావం రాష్ట్రంపై కనిపిస్తోంది. ఉపరితల ఆవర్తనం, గాలుల ప్రభావంతో..శుక్రవారం, శనివారం ఉదయం వరకూ వర్షాలు కురిసే అవకాశాలున్నాయి. రాత్రి సమయంలో రాయలసీమలో పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయని విశాఖలోని తుఫాన్ హెచ్చరికల కేంద్రం అధికారులు తెలిపారు. అనంతపురం, కర్నూలు, సత్యసాయి, అన్నమయ్య జిల్లాల్లో భారీ వర్షాలకు ఆస్కారం ఉందన్నారు. చిత్తూరు, నంద్యాల, వైఎస్సార్ కడప జిల్లాల్లో ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు పడతాయన్నారు. రాయలసీమ, దక్షిణ కోస్తా ప్రాంతాల్లో వానలు ఉంటాయనీ..గంటకు 30–40 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయన్నారు. ఉత్తరాంధ్ర తీరప్రాంతాల్లో ఎండల తీవ్రత కొనసాగుతుందని చెప్పారు. 5వ తేదీ నుంచి ఎండల తీవ్రత గరిష్టంగా ఉంటుందన్నారు. సాధారణం కంటే 3– 5 డిగ్రీలు అధికంగా పగటి ఉష్ణోగ్రతలు నమోదవుతాయని చెప్పారు. గురువారం రాళ్లపల్లిలో 84.5 మి.మీ, సానికవారంలో 77.75, ములకల చెరువులో 72, యర్రగొండపాలెంలో 72, పెదఅవుటపల్లిలో 68.75, పెరుసోమలలో 60.25 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. -
హైదరాబాద్ లో పలుచోట్ల భారీ వర్షం
-
3, 4 తేదీల్లో వర్షాలు
సాక్షి, అమరావతి: వేసవిలో అకాల వర్షాలతోపాటు పిడుగులు పడే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఈ నెల 3న రాయలసీమ, 4న ఉత్తరాంధ్ర జిల్లాల్లో కొన్నిచోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే సూచనలున్నాయని పేర్కొంది. మరోవైపు సోమవారం రాష్ట్రంలో ఎండల తీవ్రత కొనసాగింది.నంద్యాల గోస్పాడులో 40.3 డిగ్రీలు, కర్నూలు జిల్లా కమ్మరచేడులో 40.2, అనంతపురం జిల్లా నాగసముద్రంలో 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మంగళవారం శ్రీకాకుళం జిల్లాలోని 6 మండలాలు, విజయనగరం జిల్లా–6, పార్వతీపురం మన్యం జిల్లా–10, అల్లూరి సీతారామరాజు జిల్లా–3, తూర్పు గోదావరి జిల్లాలోని కోరుకొండ మండలాల్లో వడగాడ్పులు వీస్తాయని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ కూర్మనాథ్ తెలిపారు. -
KKR Vs RCB: వర్షం వల్ల మ్యాచ్ రద్దయితే పరిస్థితి?
మెగా క్రికెట్ సమరం ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) పద్దెనిమిదవ సీజన్‌కు శనివారం తెరలేవనుంది. తారల సందడితో ఈడెన్ గార్డెన్స్‌లో క్యాష్ రిచ్ లీగ్ తాజా ఎడిషన్‌ను ఆరంభించేందుకు నిర్వాహకులు సిద్ధమయ్యారు. డిఫెండింగ్ చాంపియన్ కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR)- ఇంత వరకు ఒక్కసారి కూడా ట్రోఫీ గెలవని రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB) మధ్య పోరుతో ఈ క్రీడా సంబరం మొదలుకానుంది.పొంచి ఉన్న వర్షం ముప్పుఅయితే, ఆరంభ వేడుకలతో పాటు మ్యాచ్‌కు వర్షం అడ్డుతగిలే అవకాశం ఉంది. ఆక్యూవెదర్ నివేదిక ప్రకారం కోల్‌కతాలో శనివారం భారీ వాన పడే అవకాశం ఉంది. ఉదయం 11 గంటల తర్వాత వర్షం ఎక్కువయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.దీంతో సాయంత్రం 6.20 నిమిషాల నుంచి 6.45 నిమిషాల వరకు జరగాల్సిన ప్రారంభోత్సవ వేడుకల ఏర్పాట్లు సజావుగా సాగడం కష్టమే. సాయంత్రం ఆరు గంటల తర్వాత వర్షం పడే అవకాశం 25 శాతం ఉందని ఆక్యూవెదర్ పేర్కొంది. టాస్ సమయానికి అంటే ఏడు గంటల సమయంలో పదిశాతం వర్ష సూచనలు ఉన్నట్లు తెలిపింది. ఇక రాత్రి పదకొండు గంటల తర్వాత ఇందుకు డెబ్బై శాతం ఆస్కారం ఉన్నట్లు వెల్లడించింది.రెండు రోజులుగా వానఈ నేపథ్యంలో కేకేఆర్- ఆర్సీబీ మధ్య ఐపీఎల్-2025 ఆరంభ మ్యాచ్ సాఫీగా సాగడం కష్టమే అనిపిస్తోంది. కోల్‌కతాలో గత రెండు రోజులుగా వర్షం కురుస్తూనే ఉంది. దీంతో కేకేఆర్- ఆర్సీబీ ప్రాక్టీస్ మ్యాచ్‌లకు అంతరాయం కలిగింది. మరోవైపు.. శుక్రవారం కూడా వాన పడగా.. ఈడెన్ గార్డెన్స్ గ్రౌండ్‌స్టాఫ్ కవర్లతో మైదానాన్ని కప్పి ఉంచారు.అంతేకాదు.. ఎప్పటికప్పుడు మైదానం నుంచి నీటిని క్లియర్ చేసేందుకు డ్రైనేజీ సిస్టమ్ సిద్ధంగానే ఉంది. అయితే, ఎడతెరిపిలేని వర్షం పడితే మాత్రం మ్యాచ్ జరగడం సాధ్యం కాదు. మరి వర్షం వల్ల కేకేఆర్- ఆర్సీబీ మ్యాచ్ రద్దయితే పరిస్థితి ఏమిటి?జరిగేది ఇదే..ప్లే ఆఫ్స్, ఫైనల్ మాదిరి ఐపీఎల్ గ్రూప్ దశ మ్యాచ్‌లకు రిజర్వ్ డే ఉండదు. అయితే, వర్షం వల్ల మ్యాచ్ ఆలస్యమైతే.. మ్యాచ్ ముగియడానికి నిర్ణీత సమయం కంటే అరవై నిమిషాల అదనపు సమయం ఇస్తారు.ఫలితం తేల్చేందుకు ఇరుజట్లు కనీసం ఐదు ఓవర్లపాటు బ్యాటింగ్ చేసే అవకాశం ఉంటుంది. ఈ ఐదు ఓవర్ల మ్యాచ్‌కు కటాఫ్ టైమ్ రాత్రి 10.56 నిమిషాలు. అర్ధరాత్రి 12.06 నిమిషాల వరకు మ్యాచ్‌ను ముగించేయాల్సి ఉంటుంది. ఒకవేళ వర్షం వల్ల మ్యాచ్ మరీ ఆలస్యమైతే ఓవర్ల సంఖ్యను తగ్గించే అవకాశం కూడా ఉంటుంది.ఇంత చేసినా ఫలితం తేలకుండా.. మ్యాచ్ రద్దు చేయాల్సి వస్తే ఇరుజట్లకు చెరో పాయింట్ లభిస్తుంది. అయితే, టైటిల్ రేసులో నిలిచే క్రమంలో ఈ ఒక్క పాయింట్ కూడా తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. అందుకే.. ఇటు కేకేఆర్.. అటు ఆర్సీబీ అభిమానులు మ్యాచ్ సజావుగా సాగాలని కోరుకుంటున్నారు. ఇదిలా ఉంటే.. ఐపీఎల్-2025 ఆరంభ వేడుకలో శ్రేయా ఘోషాల్, కరణ్ ఔజ్లా, దిశా పటాని తదితరులు ఆట, పాటలతో అలరించేందుకు సిద్ధమయ్యారు.చదవండి: IPL 2025: కెప్టెన్ల మార్పు.. ఎవరి జీతం ఎంత?.. అతి చవగ్గా దొరికిన సారథి అతడే!A little rain won’t stop us! 🌧 The ground’s got its cozy cover, and the drainage system will be ready to save the day 𝘒𝘺𝘶𝘯𝘬𝘪 𝘠𝘦𝘩 𝘐𝘗𝘓 𝘩𝘢𝘪, 𝘺𝘢𝘩𝘢𝘯 𝘴𝘢𝘣 𝘱𝘰𝘴𝘴𝘪𝘣𝘭𝘦 𝘩𝘢𝘪!#IPLonJioStar 👉 SEASON OPENER #KKRvRCB | SAT, 22nd March, 5:30 PM | LIVE on… pic.twitter.com/UwdonS9FeN— Star Sports (@StarSportsIndia) March 21, 2025 -
ఇరాన్ బీచ్‌లో‘బ్లడ్ రెయిన్’ : నెటిజన్లు షాక్, వైరల్ వీడియో
ఇరాన్లో జరిగిన ఒక అద్భుతమైన ప్రకృతి దృశ్యం ఒకటి వైరల్‌గా మారింది. ప్రపంచవ్యాప్తంగా నెటిజనులను ఆశ్చర్యపరిచింది. ఇరాన్లో లోని రెయిన్ బో ఐలాండ్ లో రక్తంలా ఎర్రని రంగులో వర్షం కురిసింది. ఈ భారీ వర్షం తర్వాత ఎర్రగా మెరిసే బీచ్ వీడియోలు ఇంటర్నెట్లో తెగ హల్చల్ చేస్తున్నాయి. చాలామంది దీనిని "రక్త వర్షం (Blood Rain)" అని భయపడిపోతోంటే, మరికొందరు ఈ అసాధారణ దృశ్యాన్ని చూసి ముగ్దులైపోతున్నారు. అసలు విషయం ఏమిటంటే..టూర్ గైడ్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన వీడియో ప్రకారం ఆకాశం నుంచి ధారగా కురుస్తున్న వర్షం అక్కడి కొండలపై ఎర్రటి ధూళితో చేరింది. ఆ తరువాత ఎర్ర రంగులో బీచ్‌లోకి ప్రవహిస్తోంది. మెరిసిపోయే ముదురు ఎరుపు రంగులో నీరు సముద్రంలోకి చేరుతుంది. అద్భుతమైన ఈ దృశ్యాన్ని తిలకించేందుకు ఏటా లక్షలాది మంది పర్యాటకులు ఇక్కడికి వస్తారు. View this post on Instagram A post shared by جزیره هرمز | امید بادروج (@hormoz_omid) రెయిన్ బో ఐలాండ్‌లో వర్షాన్ని టూరిస్టులు ఎంజాయ్ చేశారు. సముద్ర తీరంలోని గుట్టలపై పడిన బ్లడ్ రెయిన్ జలపాతంలా కిందకు దూకుతుంటే ఉత్సాహంగా కేరింతలు కొట్టారు. దీనిపై నెటిజన్ల కమెంట్లు వెల్లువలా వచ్చి పడ్డాయి. "ఈ దృశ్యం నిజంగా అద్భుతమైనది మరియు ప్రత్యేకమైనది.", పకృతిలోని వింతలకు ఇదొక ఉదాహరణ, "దేవునికి మహిమ ఎంత అందం. నిజానికి, దేవుడు రెండు ప్రపంచాలకూ అత్యుత్తమ చిత్రకారుడు" ఇలా ఎవరికి తోచినట్టుగా వారు కమెంట్స్ పెడుతున్నారు. What’s going on here? Alien weather phenomenon? Horror from beyond the deep? It looks like this beach is bleeding, with the rains turning blood red and oozing back out into the sea, and indeed, it’s even called the “Blood Rain”. Fortunately, it’s not actually blood.. It’s rust! pic.twitter.com/dbqMdtF7qG— briefchaatindia (@briefchaatindia) March 13, 2025 కాగా హార్ముజ్ జలసంధిలోని రెయిన్బో ద్వీపంలోని బీచ్, అధిక స్థాయిలో ఇనుము , ఇతర ఖనిజాలను కలిగి , సహజంగా ఎర్ర నేల కారణంగా ఇరాన్లో ఒక ప్రసిద్ధ పర్యాటక కేంద్రం. ఈ అగ్నిపర్వత నేలలో అధిక ఐరన్ ఆక్సైడ్ కంటెంట్ కారణంగా తీరంలో ఏడాది పొడవునా ఆకర్షణీయంగా ఉంటుంది. ఈ ఖనిజాలు భారీ ఆటుపోట్లతో కలిసి తీరప్రాంతానికి ప్రకాశవంతమైన ఎరుపు రంగును సంతరించుకుంటుంది. ఇది ఎవరో సముద్రంలో పెద్ద బకెట్‌తో ఎరుపు పెయింట్‌ను కుమ్మరించినట్టు కనిపిస్తుంది. రెయిన్ బో ఐలాండ్ ప్రాంతంలో చాలా ఏళ్ల క్రితం ఓ అగ్ని పర్వతం ఉండేదని, దాని నుంచి వెలువడిన లావా చల్లారి ఈ దీవి ఏర్పడిందని ఇరాన్ చరిత్రకారులు చెబుతున్నారు. -
ఒక్క బంతి పడకుండానే...
రావల్పిండి: ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ గ్రూప్ ‘బి’లో హోరాహోరీగా సాగాల్సిన మ్యాచ్‌పై వరుణుడు నీళ్లు చల్లాడు. దీంతో రావల్పిండిలో పసందైన క్రికెట్ విందును ఆస్వాదించాలని వచ్చిన ప్రేక్షకులకు నిరాశే మిగిలింది. రెండు పటిష్ట జట్ల మధ్య నువ్వా నేనా అన్నట్లు సాగుతుందనుకున్న సమరం సర్వత్రా ఆసక్తిని రేపింది. గెలిచిన జట్టు సెమీఫైనల్ వైపు నడిచేది. కానీ వర్షం వల్ల ఈ మ్యాచ్ ఒక్క బంతికైనా నోచుకోలేకపోయింది. తెరిపినివ్వని వానతో మైదానమంతా చిత్తడిగా మారడంతో బ్యాట్లు, బంతులతో కుస్తీ చేయాల్సిన ఆటగాళ్లు డ్రెస్సింగ్ రూమ్లకే పరిమితమయ్యారు. చివరకు చేసేదేమీ లేక ఫీల్డ్ అంప్లైర్లు క్రిస్ గఫాని (ఆస్ట్రేలియా), రిచర్డ్ కెటిల్‌బొరొ (ఇంగ్లండ్)లు అవుట్‌ఫీల్డ్‌ను పరిశీలించి మ్యాచ్ నిర్వహణ అసాధ్యమని తేల్చారు. వెంటనే మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ఇరు జట్లకు ఒక్కో పాయింట్ కేటాయించారు. గ్రూప్ ‘బి’లో దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా తమ తొలి మ్యాచ్‌ల్లో శుభారంభం చేశాయి. ఫలితమివ్వని ఈ మ్యాచ్ వల్ల గ్రూప్‌లోని ఇంగ్లండ్, అఫ్గానిస్తాన్... అన్ని జట్లు ఇప్పుడు రేసులో నిలిచినట్లయ్యింది. ఎందుకంటే మూడేసి పాయింట్లతో ఉన్న దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియాలకు మిగిలింది ఒక్కటే మ్యాచ్ కాగా... పాయింట్ల పట్టికలో ఖాతా తెరువని ఇంగ్లండ్, అఫ్గానిస్తాన్లకు రెండేసి మ్యాచ్‌లున్నాయి. చాంపియన్స్ ట్రోఫీలో నేడుఇంగ్లండ్ X అఫ్గానిస్తాన్వేదిక: లాహోర్, మధ్యాహ్నం గం. 2:30 నుంచి స్టార్ స్పోర్ట్స్, జియోహాట్‌స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం -
Aus vs SA: కీలక మ్యాచ్‌కు వర్షం అడ్డంకి.. మ్యాచ్ రద్దు
చాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy)లో కీలక మ్యాచ్‌కు వర్షం అడ్డంకిగా మారింది. గ్రూప్-‘బి’లో భాగంగా ఆస్ట్రేలియా- సౌతాఫ్రికా(Australia vs South Africa) మధ్య మంగళవారం మ్యాచ్ జరగాల్సి ఉండగా.. వరణుడి కారణంగా టాస్ ఆలస్యమైంది. రావల్పిండి(Rawalpindi)లో వర్షం కురుస్తున్న కారణంగా మైదానాన్ని కవర్లతో కప్పి ఉంచారు.టాస్ సమయానికి(భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం రెండు గంటలకు)మధ్యలో కాస్త తెరిపినివ్వగా కవర్లు తీయగా.. మళ్లీ కాసేపటికే చినుకులు పడ్డాయి. ఆకాశం మేఘావృతమై ఉంది. నల్లనిమబ్బులు కమ్ముకుని ఉండటంతో ఆసీస్- ప్రొటిస్ మ్యాచ్ సజావుగా సాగే సూచనలు కనిపించడం లేదు.ఇంగ్లండ్‌కు తలపోటుఒకవేళ వర్షం వల్ల ఈ మ్యాచ్ రద్దైతే మాత్రం ఇంగ్లండ్ సెమీస్ అవకాశాలపై ప్రతికూల ప్రభావం పడుతుంది. కాగా వన్డే టోర్నమెంట్లో గ్రూప్-‘ఎ’ నుంచి భారత్, పాకిస్తాన్, న్యూజిలాండ్, బంగ్లాదేశ్.. గ్రూప్-‘బి’ నుంచి ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, అఫ్గనిస్తాన్, ఇంగ్లండ్ పోటీపడుతున్నాయి.గ్రూప్-‘ఎ’ నుంచి రెండేసి విజయాలతో భారత్, న్యూజిలాండ్ ఇప్పటికే తమ సెమీస్ బెర్తులు ఖరారు చేసుకున్నాయి. మరోవైపు.. గ్రూప్-‘బి’లో ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా చెరో విజయంతో పాయింట్ల పట్టికలో తొలి రెండుస్థానాల్లో కొనసాగుతున్నాయి.టాప్‌లో సౌతాఫ్రికాతమ ఆరంభ మ్యాచ్‌లో సౌతాఫ్రికా అఫ్గనిస్తాన్‌ను ఏకంగా 107 పరుగులతో చిత్తు చేసింది. ఇక ఆసీస్ ఇంగ్లండ్‌పై ఐదు వికెట్ల తేడాతో గెలిచింది. ఒక్కో విజయం ద్వారా ఈ రెండు జట్లకు చెరో రెండు పాయింట్లు లభించినప్పటికీ.. నెట్ రన్‌రేటు(+2.140) పరంగా సౌతాఫ్రికా ప్రథమ స్థానం ఆక్రమించింది.ఒకవేళ మంగళవారం నాటి మ్యాచ్ వర్షం కారణంగా రద్దైతే.. నిబంధనల ప్రకారం ఇరుజట్లకు చెరో పాయింట్ లభిస్తుంది. అప్పుడు సౌతాఫ్రికా ఖాతాలో మూడు, ఆసీస్ ఖాతాలో మూడు పాయింట్లు చేరతాయి. ఇక ఇంగ్లండ్ విషయానికొస్తే.. ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయిన బట్లర్ బృందం.. తదుపరి అఫ్గనిస్తాన్, సౌతాఫ్రికాలతో తలపడనుంది. ఈ రెండు మ్యాచ్‌లలో గెలిస్తేనే ఇంగ్లండ్ సెమీస్ ఆశలు సజీవంగా ఉంటాయి.ఇందులో ఏ ఒక్కటి ఓడినా ఇతర మ్యాచ్‌ల ఫలితాలపై ఆధారపడాల్సి ఉంటుంది. ఇక సౌతాఫ్రికా తమ తదుపరి మ్యాచ్‌లో నెగ్గితే మాత్రం నేరుగా సెమీ ఫైనల్‌కు దూసుకువెళ్తుంది. ఆస్ట్రేలియా మాత్రం ఇంగ్లండ్ మాదిరి ఇతర మ్యాచ్‌ల ఫలితాలు తేలేదాకా వేచి చూడాల్సి ఉంటుంది.నాడు సెమీ ఫైనల్లోఇదిలా ఉంటే.. ఆస్ట్రేలియా- సౌతాఫ్రికా చివరగా 2023లో ఐసీసీ(వన్డే) ఈవెంట్లో తలపడ్డాయి. భారత్ వేదికగా జరిగిన వన్డే వరల్డ్‌కప్‌లో నాడు సెమీ ఫైనల్లో సౌతాఫ్రికాను 212 పరుగులకు కట్టడి చేసిన ఆస్ట్రేలియా.. ఆఖరి వరకు ఉత్కంఠగా సాగిన పోరులో మూడు వికెట్ల తేడాతో గెలిచి ఫైనల్ చేరింది. ఆఖరి పోరులో టీమిండియాపై విజయం సాధించి టైటిల్ విజేతగా అవతరించింది. కాగా చాంపియన్స్ ట్రోఫీలో ఒక మ్యాచ్‌లో విజయానికి రెండు పాయింట్లు లభిస్తాయి. మ్యాచ్ రద్దైతే ఇరుజట్లకు చెరో పాయింట్ వస్తుంది.చాంపియన్స్ ట్రోఫీ-2025కి ఆస్ట్రేలియా జట్టుస్టీవ్ స్మిత్ (కెప్టెన్), జోష్ ఇంగ్లిస్ (వికెట్ కీపర్), మాథ్యూ షార్ట్, ట్రావిస్ హెడ్, మార్నస్ లబుషేన్, అలెక్స్ కారీ, గ్లెన్ మాక్స్వెల్, బెన్ ద్వార్షుయిస్, నాథన్ ఎల్లిస్, ఆడమ్ జంపా, స్పెన్సర్ జాన్సన్, సీన్ అబాట్, ఆరోన్ హార్డీ, జేక్ ఫ్రేజర్ మెగర్క్, తన్వీర్ సంఘా.సౌతాఫ్రికా జట్టుర్యాన్ రికెల్టన్ (వికెట్ కీపర్), టెంబా బావుమా (కెప్టెన్), టోనీ డి జోర్జి, రాస్సీ వాన్ డెర్ డసెన్, ఐడెన్ మార్క్రమ్, డేవిడ్ మిల్లర్, మార్కో జాన్సెన్, వియాన్ ముల్డర్, కేశవ్ మహారాజ్, కగిసో రబడ, లుంగీ ఎంగిడి, తబ్రేజ్ షంసీ, హెన్రిచ్ క్లాసెన్, ట్రిస్టన్ స్టబ్స్, కార్బిన్ బాష్.Update: వర్షం వల్ల టాస్ పడకుండానే ఆసీస్- సౌతాఫ్రికా మ్యాచ్ రద్దుచదవండి: అతి చేయొద్దు.. ఇలాంటి ప్రవర్తన సరికాదు: పాక్ దిగ్గజం ఆగ్రహం -
మంచు దుప్పటిలో ఉత్తరాది.. 12 రాష్ట్రాలపై పొగమంచు దెబ్బ
న్యూఢిల్లీ: దేశంలోని వివిధ ప్రాంతాల్లో వాతావరణ పరిస్థితుల్లో మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఈరోజు(సోమవారం) నుండి రెండు రోజుల పాటు దేశ రాజధాని ఢిల్లీలో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. వాతావరణ శాఖ తెలిపిన వివరాల ప్రకారం ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో పొగమంచు ఏర్పడనుంది. సఫ్దర్‌జంగ్ విమానాశ్రయంలో ఈరోజు ఉదయం 7 గంటలకు దృశ్యమానత 200 మీటర్లుగా నమోదైంది. పాలంలో ఉదయం 4 గంటలకు 50 మీటర్లుగా ఉంది.జమ్ముకశ్మీర్‌లో భారీ వర్షం, హిమపాతం కారణంగా వాతావరణం(Weather)లో మార్పులు చోటుచేసుకున్నాయి. ఫలితంగా మంచు గాలులు ఉత్తర భారతదేశంలోని అనేక ప్రాంతాలను తాకాయి. దేశంలోని 12 రాష్ట్రాల్లో విపరీతంగా కురుస్తున్న పొగమంచు పలు సమస్యలను సృష్టిస్తోంది. పంజాబ్, హర్యానాలలో పొగమంచు తీవ్ర ప్రభావం చూపింది. పొగమంచు కారణంగా చోటుచేసుకున్న రోడ్డు ప్రమాదాల్లో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు.పొగమంచు కారణంగా కోల్‌కతాలో 13 విమానాల రాకపోకలకు(flight arrivals) అంతరాయం కలిగింది. హర్యానా, పంజాబ్, చండీగఢ్, బెంగాల్, బీహార్, ఒడిశా సహా 12 రాష్ట్రాలలోని వివిధ ప్రాంతాల్లో దట్టమైన పొగమంచు ఏర్పడింది. వాతావరణశాఖ తెలిపిన వివరాల ప్రకారం పంజాబ్, హర్యానా, చండీగఢ్, ఢిల్లీ, బీహార్, ఒడిశా, అస్సాం, మేఘాలయలోని వివిధ ప్రాంతాలలో సోమవారం కూడా దట్టమైన పొగమంచు కమ్ముకోనుందని వాతావరణశాఖ తెలిపింది.మంగళవారం పొగమంచు నుండి కొంత ఉపశమనం లభిస్తుందని, రాబోయే రెండు రోజుల్లో రాజస్థాన్‌లోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ(Meteorological Department) తెలిపింది. పొగమంచు కారణంగా పంజాబ్‌లోని అమృత్సర్-ఖేమ్కరన్ రహదారిపై ఒక కారు- బస్సు ఢీకొన్నాయి. అమర్‌కోట్ బస్తీ సమీపంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఇదేవిధంగా హర్యానాలోని మంగళ్‌పూర్-దరౌలి రోడ్డుపై దట్టమైన పొగమంచు కారణంగా, ఒక కారు అదుపు తప్పి చెట్టును ఢీకొంది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతిచెందారు.ఇది కూడా చదవండి: America: 10 సురక్షిత రాష్ట్రాలు.. కాల్పుల మోతకు దూరం.. ప్రాణహానికి సుదూరం -
వాన చినుకులలో వడ్డన..!
ఒకవైపు వాన చినుకులు పడుతుంటే, మరోవైపు పక్కనే వేడి వేడి టీ, పకోడీలాంటివి ఉంటే ఎంత బాగుంటుంది! ‘అయితే, అలా తినాలంటే రోజూ కుదరదు కదా!’ అని బాధపడేవారికి ఒక చక్కని వార్త. దక్షిణ కొరియా రాజధాని సియోల్ నగరంలోని సియోంగ్ ప్రాంతంలో ఉన్న ‘రెయిన్ రిపోర్ట్ క్రాయిసెంట్’ హోటల్లో ప్రతిరోజూ వానాకాలాన్ని ఆస్వాదించొచ్చు. రెస్టారెంట్ ఇంటీరియర్ మొత్తం వాతావరణ వార్తలు, వర్షం పడే దృశ్యాలతో నిండి ఉంటుంది. హోటల్లో మొత్తం నిరంతరం వాన తుంపరలు పడేలా సెట్ చేశారు. వెదురు చెట్ల చుట్టూ కుర్చీలు, బల్లలు వేసి, పాదాలకు నీటి ప్రవాహం తగిలేలా అక్కడి ఫ్లోర్‌ను సెటప్ చేశారు. ఇక పక్కనే ప్రవహించే నీటిలో నేలపై కుర్చునే వీలుంది. అంతేకాదు, కుటుంబమంతా కలసి ఎంజాయ్ చేయడానికి రెండో అంతస్తులో ఒక మినీ సినీ థియేటర్ కూడా ఉంది.సౌకర్యవంతమైన కుషన్స్‌లో పడుకొని సినిమా చూడొచ్చు. అక్కడ దొరికే మెన్యూ ఐటమ్స్‌లోని పానీయాలు, వంటకాల పేర్లన్నీ కూడా రెయిన్ రిపోర్ట్ స్టయిల్లోనే ఉంటాయి. ఉదాహరణకు ‘సన్ షైన్’, ‘క్లౌడ్’, ‘రెయిన్ డ్రాప్’ ఇలా వివిధ వాతవరణ సూచనల పేర్లతో ఉండే క్రాయిసెంట్స్, ‘రెయిన్బో మిల్క్’, ‘సెసేమ్ క్లౌడ్’, ‘వెట్ క్లౌడ్’, ‘వైట్ లాట్టే’ వంటి పానీయాలు ఉన్నాయి. బాగుంది కదా! వానాకాలాన్ని ఆస్వాదించాలంటే వెంటనే ఈ రెయిన్ రిపోర్ట్ రెస్టరెంట్‌కి వెళ్లాల్సిందే మరి. (చదవండి: ఘోస్ట్ కోసం బీస్ట్ పిరమిడ్ వాసం) -
పంటలకు వానలా నీళ్లు!
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: కాలువలు, బోరు బావుల పైప్లైన్లు వంటివి సాంప్రదాయ సాగునీటి పద్ధతులు... డ్రిప్‌లు, స్పింక్లర్లు.. ప్రస్తుతం అందుబాటులో ఉన్న సూక్ష్మ సేద్య విధానాలు.. కానీ ఇందుకు భిన్నంగా పంటలపై వాన కురిసినట్టుగా, అవసరానికి తగినట్టే నీళ్లు అందేలా ‘పివోట్ లీనియర్ ఇరిగేషన్’విధానాన్ని ఇక్రిశాట్ శాస్త్రవేత్తలు అవలంబిస్తున్నారు. విదేశాల్లో వినియోగిస్తున్న ఈ సాంకేతికతను మన దేశంలో ప్రయోగాత్మకంగా పరిశీలిస్తున్నారు. పరిశోధనల్లో భాగంగా సాగు చేస్తున్న పంటలకు ఈ విధానంలో నీళ్లు అందిస్తున్నారు. మొత్తం పొలమంతా కాకుండా... కావాల్సిన చోట మాత్రమే, అనుకున్న సమయంలో పంటలకు వర్షంలా నీళ్లు అందించగలగడం దీని ప్రత్యేకత.తక్కువ ఎత్తులో పెరిగే పంటలకు..ప్రస్తుతం ఇక్రిశాట్లో వేరుశనగ, శనగ కొత్తవంగడాలపై పరిశోధనల కోసం సాగు చేస్తున్న వ్యవసాయ క్షేత్రాల్లో ఈ‘సెంట్రల్ పివోట్ లీనియర్ ఇరిగేషన్’విధానం ద్వారా నీటిని అందిస్తున్నారు. ఇలా తక్కువ ఎత్తుండేపంటల సాగుకు ఈ విధానంతో ఎంతో ప్రయోజనం ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మీటరుకన్నా తక్కువ ఎత్తుతోనే పండే పంటలకు ఎక్కువ మేలు అని పేర్కొంటున్నారు. భారీ విస్తీర్ణంలో పంటలు వేసే భూకమతాలు, ఒకేచోట వందల ఎకరాల్లో ఒకేతరహా పంటలు సాగుచేసే భారీ వ్యవసాయ క్షేత్రాల్లో ఈ విధానాన్ని వినియోగిస్తుంటారని చెబుతున్నారు. యంత్రాలతో కూడిన పద్ధతిలో కేవలం ఒకరిద్దరు వ్యక్తులతోనే వందల ఎకరాలకు సాగునీటిని అందించవచ్చని వివరిస్తున్నారు. అభివృద్ధి చెందిన దేశాల్లోని భారీ వ్యవసాయ క్షేత్రాల్లో పివోట్లీనియర్ ఇరిగేషన్ విధానం ఎక్కువగా వినియోగిస్తున్నారని చెబుతున్నారు.ప్రయోజనాలు ఎన్నెన్నో...ఈ విధానంలో పంటలకు సాగునీరు అందించడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ విధానంలో విద్యుత్ వినియోగం కూడా తక్కువని, నీటి వృథాను తగ్గిస్తుందని.. తక్కువ నీటి వనరులతో ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేయవచ్చని వివరించారు. నీటిని పారించే కూలీల అవసరం ఉండదని.. నేల కోతకు గురికావడం వంటి నష్టాలు కూడా ఉండవని వెల్లడించారు. పంటల అవశేషాలు తిరిగి మట్టిలో కలసి కుళ్లిపోవడానికి ఈ విధానం వీలు కలి్పస్తుందని, తద్వారా ఎరువుల వినియోగం తక్కువగా ఉంటుందని వివరించారు.⇒ పొలంలో కొన్ని పదుల నుంచి వందల మీటర్ల వరకు దూరంలో రెండు భారీ రోలర్లు, వాటి మధ్య పైపులతో అనుసంధానం ఉంటుంది. ఆ పైపులకు కింద వేలాడుతున్నట్టుగా సన్నని పైపులు ఉంటాయి. వీటి చివరన నాజిల్స్ ఉంటాయి.⇒ పొలంలోని బోరు/ మోటార్ ద్వారా వచ్చే నీటిని పైపుల ద్వారా రోలర్ల మధ్యలో ఉన్న ప్రధాన పైప్‌లైన్‌కు అనుసంధానం చేస్తారు. దీనితో బోరు/మోటార్ నుంచి వచ్చే నీరు.. రెండు రోలర్ల మధ్యలో ఉన్న పైపులు, వాటికి వేలాడే సన్నని పైపుల ద్వారా ప్రయాణిస్తుంది. నాజిల్స్ నుంచి వర్షంలా పంటలపై నీరు కురుస్తుంది.⇒ ఈ రోలర్లు పొలం పొడవునా నిర్దేశించిన వేగంలో ముందుకు, వెనక్కి కదులుతూ ఉంటాయి. ఈ క్రమంలో పంటపై వర్షంలా నీరు పడుతూ ఉంటుంది.⇒ రోలర్లను రిమోట్ ద్వారా నడపవచ్చు. లేదా కంప్యూటర్, సెల్‌ఫోన్ ద్వారా కూడా ఆపరేట్ చేయవచ్చు. వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా పంటకు ఎంత పరిమాణంలో నీటిని అందించాలన్నది నియంత్రించవచ్చు.‘పివోట్ లీనియర్ ఇరిగేషన్’విధానం ఇదీ..⇒ కావాలనుకున్న చోట ఎక్కువగా, లేకుంటే తక్కువగా నీటిని వర్షంలా కురిపించవచ్చు. వేర్వేరు పంటలను పక్కపక్కనే సాగు చేస్తున్న చోట ఇది ప్రయోజనకరంగా ఉంటుంది.⇒ వ్యవసాయ క్షేత్రం విస్తీర్ణాన్ని బట్టి, ఏర్పాటు చేసుకునే పరికరాలను దీనికి అయ్యే ఖర్చు ఆధారపడి ఉంటుందని ఇక్రిశాట్ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. చిన్న, సన్నకారు రైతులు కాకుండా.. సమష్టి వ్యవసాయం చేసేందుకు ఈ విధానం మేలని పేర్కొంటున్నారు. -
ఏపీలో భారీ వర్షాలు.. ఈ జిల్లాలకు అలెర్ట్
సాక్షి, విశాఖ : బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతుంది. ఏపీ, ఉత్తర తమిళనాడు తీరాల వైపు పయనిస్తుందని వాతావారణ శాఖ అధికారులు తెలిపారు. అల్పపీడనం కారణంగా మరో రెండు రోజుల పాటు కోస్తా జిల్లాలో వర్షాలు కురవనున్నాయి. అల్లూరి,అనకాపల్లి, కాకినాడ జిల్లాలకు భారీ వర్ష సూచన జారీ చేసింది. కోనసీమ,పశ్చిమ గోదావరి, నెల్లూరు,తిరుపతి జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ విభాగం తెలిపింది. పోర్టుల్లో మూడో నంబర్ ప్రమాద హెచ్చరిక కొనసాగుతుంది. -
పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న వాయుగుండం
-
ధాన్యం వర్షార్పణం
దాచేపల్లి(పల్నాడు జిల్లా): ఆరుగాలం కష్టపడి పండించిన పంట వర్షార్పణమైంది. నడికుడి వ్యవసాయ మార్కెట్‌యార్డులోని ఫ్లాట్‌ఫారాలపై రైతులు ఆరబోసిన ధాన్యం గురువారం తెల్లవారుజామున కురిసిన వర్షానికి తడిసి ముద్దయ్యింది. పలువురు రైతులు పొలంలో పండించిన వరి పంటని యంత్రాల ద్వారా కోసి నడికుడి మార్కెట్‌యార్డుకి ఆరబోసేందుకు తీసుకొచ్చారు. సుమారు మూడు వేలకుపైగా ధాన్యపు బస్తాలను సిమెంట్ ఫ్లాట్‌ఫారాలపై రైతులు ఆరబోశారు. ఆకస్మాత్తుగా తెల్లవారుజామున వర్షం కురవడంతో ఆరబోసిన ధాన్యం మొత్తం తడిసిపోయింది. వర్షపు నీటిలో కొంత ధాన్యం కొట్టుకుపోయింది. వర్షం కురుస్తున్న సమయంలో ఇళ్ల వద్ద నుంచి రైతులు యార్డుకు చేరుకునేలోపే ధాన్యం వర్షంలో తడిసింది. వర్షపునీటిలో కొట్టుకుపోతున్న ధాన్యాన్ని రైతులు అతికష్టం మీద ఒబ్బిడి చేసుకున్నారు. ఫ్లాట్‌ఫారంపై ఉన్న ధాన్యపు బస్తాలు కూడా తడిసి ముద్దయ్యాయి. రెండు, మూడు రోజులు ఆరబోసి అమ్ముకుందామని ఆశపడిన అన్నదాత తడిసిన ధాన్యం చూసి నీరుగారిపోయాడు. యార్డులో ఆరబోసిన ధాన్యం సైతం తడిసిపోవటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. -
AP: స్థిరంగా కొనసాగుతున్న అల్పపీడనం
సాక్షి, విశాఖపట్నం: దక్షిణ అండమాన్ సముద్రంలో ఉపరితల ఆవర్తన ప్రభావంతో ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం స్థిరంగా కొనసాగుతోంది. రాబోయే 24 గంటల్లో ఇది బలపడి తీవ్ర అల్పపీడనంగా మారనుంది. అనంతరం దిశ మార్చుకుని పశ్చిమ వాయువ్య దిశగా ప్రయాణిస్తుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.18వ తేదీన ఉదయం తమిళనాడు రాష్ట్రంలో తీరం దాటే అవకాశం ఉందని వెల్లడించారు. దీని ప్రభావంతో మంగళవారం దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే సూచనలున్నాయని తెలిపారు. తీరం వెంబడి 30 నుంచి 35 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీస్తాయని.. దక్షిణ కోస్తా జిల్లాల్లోని మత్స్యకారులు ఈ నెల 18 వరకూ వేటకు వెళ్లవద్దని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. -
నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం
-
వర్షం కురిసినప్పుడు వచ్చే సువాసనను పోలిన అత్తరు గురించి తెలుసా..!
రకరకాల పెర్ఫ్యూమ్లు వాడుతంటాం కదా. తొలకరి జల్లులు పడినప్పుడు వచ్చే సువాసనను పోలిన అత్తర్ గురించి విన్నారా..!. అలాంటి అత్తరును మనదేశంలోని పెర్ఫ్యూమ్కి రాజధానిగా పిలిచే ఉత్తరప్రదేశ్‌లోని కన్నౌజ్ ప్రాంతం తయారు చేస్తుంది. నిజానికి ఈ మట్టివాసనను 'పెట్రికోర్' అంటారు. అయితే కన్నౌజ్ ప్రాంతంలో దీన్నే "మిట్టి అత్తర్" పేరుతో ఈ పెర్ఫ్యూమ్ని తయారుచేస్తున్నారు. దీన్ని పురాత భారతీయ సాంప్రదాయ పద్ధతిలో చేస్తున్నారు. చెప్పాలంటే ఇది అత్యంత శ్రమ, సమయంతో కూడిన పద్ధతి. అందుకోసం వాళ్లు ఎలాంటి కెమికల్స్ వంటి వాటిని ఉపయోగించరు. మరీ వర్షం కురిసినప్పుడు వచ్చే నేల వాసనను పోలిన అత్తరు తయారీకీ ఏం ఉపయోగిస్తారంటే..గంగా నది ఒడ్డున ఉండే మట్టిని, గులాబి రేకులు లేదా మల్లెపువ్వులతో ఈ అత్తరుని తయారు చేస్తారు. తయారీ విధానానికి ఉపయోగించే పాత్రలు సింధులోయ నాగరికత టైంలో ఉపయోగించినవి. ఈ అత్తరు తయారీ విధానం దాదాపు ఐదువేల ఏళ్ల నాటిది. కానీ ఇప్పటికీ అదే పద్ధతిలోనే అత్తరు తయారు చేయడం కన్నౌజ్ ప్రాంతవాసుల ప్రత్యేకత. అంతేగాదు తయారీ మొత్తం పర్యావరణ హితంగానే చేస్తారు. కనీసం ప్రాసెసింగ్ పద్ధతుల్లో కూడా కేవలం కట్టెల పొయ్యలతో మండిస్తారు. ఇక ప్యాకింగ్ వద్దకు వస్తే చిన్న లెదర్ బాటిల్ రూపంలో ఈ అత్తర్లను మార్కెట్లోకి తీసుకువస్తారు. అయితే ప్రస్తుతం ఈ అత్తరు తయారీ పద్ధతిని సవరించి.. బొగ్గులు, కట్టెల పొయ్యలకు ప్రత్యామ్నాయంగా పర్యావరణానికి మరింత అనుకూలమైన పద్ధతుల కోసం అన్వేషిస్తున్నట్లు ఫ్రాగ్రాన్స్ అండ్ ఫ్లేవర్ డెవలప్మెంట్ సెంటర్ ఆఫ్ ఇండియా (ఎఫ్ఎఫ్డిసి) డైరెక్టర్ శక్తి వినయ్ శుక్లా చెబుతున్నారు. శుక్లా ఈ "మిట్టి అత్తర్"ని సహజమైన డీ-మాయిశ్చరైజర్‌గా అభివర్ణిస్తున్నారు. (చదవండి: దుస్తుల నుంచి కర్రీ వాసనలు రాకూడదంటే..!) -
ఇంగ్లండ్, విండీస్‌ల ఆఖరి టి20 రద్దు
గ్రాస్ ఐలెట్ (సెయింట్ లూసియా): కరీబియన్ పర్యటనలో ఆఖరిదైన ఐదో టి20 రద్దవడంతో ఇంగ్లండ్ 3–1తో సిరీస్‌ను కైవసం చేసుకుంది. ఆదివారం అర్ధరాత్రి జరగాల్సిన మ్యాచ్ సరిగ్గా ఐదు ఓవర్లు ముగిశాక వర్షంతో ఆగిపోయింది. అప్పటికే మ్యాచ్ నిలిచే సమయానికి మొదట బ్యాటింగ్‌కు దిగిన వెస్టిండీస్ 5 ఓవర్లలో వికెట్ కోల్పోకుండా 44 పరుగులు చేసింది. ఓపెనర్లు లూయిస్ (20 బంతుల్లో 29 నాటౌట్; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు), షై హోప్ (10 బంతుల్లో 14 నాటౌట్, 3 ఫోర్లు) అజేయంగా ఉన్నారు. అయితే భారీ వర్షంతో అవుట్ ఫీల్డ్ అంతా చిత్తడిగా మారింది. తిరిగి ఆట నిర్వహించలేని పరిస్థితి తలెత్తడంతో ఫీల్డు అంపైర్లు మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ ద్వైపాక్షిక సిరీస్‌లో మొదటి మూడు టి20ల్లో వరుసగా ఇంగ్లండే గెలిచి మరో రెండు మ్యాచ్‌లు మిగిలుండగానే సిరీస్‌ను నెగ్గింది. ఈ సిరీస్‌లో 9 వికెట్లు తీసిన ఇంగ్లండ్ సీమర్ సాకిబ్ మహ్మూద్ ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ అవార్డు అందుకున్నాడు. ఈ పర్యటనలో ముందు మూడు వన్డేల సిరీస్‌ను ఆతిథ్య వెస్టిండీస్ 2–1తో కైవసం చేసుకుంది. అయితే ఈ ద్వైపాక్షిక సిరీస్‌లో ఫలితాలు వచ్చిన ఈ ఏడు మ్యాచ్‌ల్లోనూ టాస్ నెగ్గి... ఫీల్డింగ్ ఎంచుకొని, లక్ష్యాన్ని -
నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం
-
2 రోజుల పాటు దక్షిణకోస్తా, రాయలసీమకు వర్ష సూచన
సాక్షి, విశాఖపట్నం: నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం.. ప్రస్తుతం సముద్రమట్టానికి 3.6 కిమీ ఎత్తులో విస్తరించి ఉంది. దీని ప్రభావంతో మంగళవారం నాటికి అల్పపీడనం ఏర్పడే సూచనలున్నట్లు విశాఖ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ఇది అల్పపీడనంగా మారిన తర్వాత పశ్చిమ దిశగా కదులుతూ తమిళనాడు, శ్రీలంక వైపుగా పయనిస్తూ..14వ తేదీ రాత్రి లేదా 15వ తేదీ ఉదయం తీరం దాటనుందని తెలిపారు. దీని ప్రభావంతో నేడు దక్షిణకోస్తా, రాయలసీమ జిల్లాల్లో పలుచోట్ల వర్షాలు, రేపు మోస్తరు నుంచి ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు పడే అవకాశాలున్నాయని పేర్కొన్నారు. -
ఏపీలో 3 రోజులపాటు భారీ వర్షాలు
-
స్పెయిన్‌ను వణికిస్తున్న ఆకస్మిక వరదలు
మాడ్రిడ్ : భారీ వర్షానికి ఆకస్మికంగా సంభవించిన వరదలు స్పెయిన్ దేశాన్ని వణికిస్తున్నాయి. మంగళవారం తూర్పు, దక్షిణ స్పెయిన్‌లో కురిసిన భారీ వర్షం కారణంగా వరదలు సంభవించాయి. ఫలితంగా భారీ సంఖ్యలో కుటుంబాలు నిరాశ్రయిలయ్యాయి. పదుల సంఖ్యలో మరణాలు సంభవించాయి.ఓ వైపు వర్షం.. మరోవైపు వరద ధాటికి లోతట్టు ప్రాంతాల్లో జలమయమయ్యాయి. వరదల్లో చిక్కుకున్న వారి జాడ కోసం బాధిత కుటుంబ సభ్యులు అన్వేషిస్తున్నారు. బురద నీరు ముంచెత్తడంతో రైలు, విమాన ప్రయాణాలకు అంతరాయం కలిగింది.దీంతో స్పెయిన్ ఉన్నతాధికారుల ఆదేశాలతో ప్రమాదంలో చిక్కుకున్న వారిని సంరక్షించేందుకు అత్యవసర సిబ్బంది రంగంలోకి దిగారు. డ్రోన్ల సాయంతో బాధితుల్ని గుర్తించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తుండగా.. తాజాగా, పదుల సంఖ్యలో మృతదేహాల్ని గుర్తించి బాధితుల కుటుంబాలకు సమాచారం అందించే దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేశారు.ఆకస్మిక వరదలపై ప్రధాన మంత్రి పెడ్రో శాంచెజ్ దేశ ప్రజల్ని అప్రమత్తం చేశారు. ప్రయాణాల్ని వాయిదా వేసుకోవాలని ఎక్స్ వేదికగా తెలిపారు. వరద ప్రభావం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో అత్యవసర సేవలు మినహా ఇతర అన్నీ రంగాలకు చెందిన కార్యకలాపాల్ని గురువారం వరకు మూసివేయాలని ఆదేశించారు. ఇక వరద ప్రభావాన్ని అంచనా వేసేలా కేంద్ర క్రైసిస్ కమిటీ ఉన్నతాధికారులకు ప్రధాని అప్రమత్తం చేశారు. -
దానా ఎఫెక్ట్..రద్దయిన 34 రైళ్లు ఇవే
అండమాన్ సముద్రం నుంచి దూసుకొస్తున్న దానా తుపాను ముప్పు నేపథ్యంలో ఈస్ట్ కోస్ట్ రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. ఈస్ట్‌కోస్ట్ పరిధిలోని భువనేశ్వర్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్, పశ్చిమబెంగాల్‌కు సేవలందించే 34 రైళ్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ నెల 23 నుంచి ఒడిశాలోని తీర ప్రాంతాల్లో గంటకు 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, వర్షాలూ కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఇప్పటికే ఉత్తర అండమాన్ సముద్రంలో ఏర్పడిన ఆవర్తనం సోమవారం ఉదయం అల్పపీడనంగా.. 22న వాయుగుండంగా బలం పుంజుకుని బుధవారం (23న) ఇది దానా తుపానుగా మారనుందని వాతావరణ శాఖ ముందస్తు హెచ్చరికలు జారీ చేసింది. తీర్పు తీర ప్రాంతాల దానా తుఫాను పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. ఈ తరుణంలో తీర్పుతీర ప్రాంతాలకు రైల్వే సేవలందించే ఈస్ట్ కోస్ట్ రైల్వేకి చెందిన 34రైళ్లను రద్దు చేస్తున్నట్లు దక్షిణమధ్య రైల్వే నోట్‌ను విడుదల చేసింది. -
భారీ వర్షానికి బెంగళూరు అస్తవ్యస్తం
బెంగళూరు: భారతదేశపు సిలికాన్ వ్యాలీగా పేరుగాంచిన కర్నాటకలోని బెంగళూరు నగరం భారీ వర్షానికి అతలాకుతలమైంది. రోడ్లపై నీరు నిలిచిపోవడంతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. సోమవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి నగరమంతా జలదిగ్బంధంలో చిక్కుకుంది.నీటి ప్రవాహం కారణంగా పలు రహదారులును అధికారులు మూసివేశారు. బాధితులను రక్షించేందుకు అధికారులు పడవలను వినియోగిస్తున్నారు. మరోవైపు పలువురు బెంగళూరువాసులు సోషల్ మీడియాలో అధికారులపై తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. బెంగళూరులోని పలు రహదారుల్లో మోకాళ్ల లోతు మేరకు నీరు నిలిచిపోయింది. దీంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. #WATCH | Karnataka | Residents of an Apartment in Yelahanka are being rescued through boats.Due to incessant heavy rain, waterlogging can be seen at several places in Bengaluru causing problems for the residents in Allalasandra, Yelahanka pic.twitter.com/AekmTVOAlW— ANI (@ANI) October 22, 2024మీడియాకు అందిన వివరాల ప్రకారం మంగళవారం ఉదయం వరకు బెంగళూరు రూరల్ పరిధిలో 176 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. బెంగళూరు అర్బన్ ప్రాంతంలో 157 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. భారీ వర్షాల కారణంగా పలు విమాన సర్వీసులు దెబ్బతిన్నాయి. సోమవారం రాత్రి 20కి పైగా విమాన సర్వీసులు ఆలస్యమయ్యాయి. నాలుగు ఇండిగో విమానాలను చెన్నైకి మళ్లించారు. నగరంలోని పాఠశాలలకు మంగళవారం సెలవు ప్రకటించారు.ఇది కూడా చదవండి: మరోమారు 30 విమానాలకు బాంబు బెదిరింపులు -
తిరుమల ఘాట్ రోడ్డులో విరిగిపడిన కొండచరియలు
-
ఏపీకి ముంచుకొస్తున్న వాయుగుండం.. పలు జిల్లాలకు రెడ్ అలర్ట్
సాక్షి,అమరావతి: మరి కొద్ది గంటల్లో బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడనున్నట్లు అంచనా వేసింది.ఈ తరుణంలో దక్షిణ కోస్తా, రాయలసీమకు వాతావరణ శాఖ హై అలర్ట్ ప్రకటించింది. ఈనెల 17న పుదుచ్చేరి, తమిళనాడు, దక్షిణ కోస్తా దగ్గర వాయుగుండం తీరం దాటుతుందని వాతావరణ శాఖ ప్రకటించింది. నెల్లూరు, ప్రకాశం, అన్నమయ్య, చిత్తూరు, వైఎస్సార్, తిరుపతి జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. రేపు, ఎల్లుండి దక్షిణ కోస్తా, రాయల భారీ వర్షాలు , కొన్ని చోట్ల అత్యంత భారీ వర్షాలు పడనున్నాయి. ఫ్లాష్ ఫ్లడ్ సంభవించే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచనలు జారీ చేసిందిబంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడనుండటంతో మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లొద్దని ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే వేటలో ఉన్న మత్స్యకారులను వెనక్కి రావాలని స్పష్టం చేసింది. ప్రజా రవాణా, రైల్వేల రాకపోకలపై నిరంతర పర్యవేక్షణ వుండాలని వాతావారణ శాఖ సూచనలు జారీచేసింది. -
నాలుగు రోజులు భారీ వర్షాలు..
-
బంగాళాఖాతంలో అల్పపీడనం..ఏపీకి భారీ వర్ష సూచన
-
Rain Alert: రానున్న 3-4 రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు
సాక్షి,అమరావతి: రానున్న 3-4 రోజుల్లో ఏపీలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఆగ్నేయ, నైరుతి బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాగల మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురువనున్నట్లు విపత్తుల నిర్వహణ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోడియా తెలిపారు. 17 వరకు కోస్తా, రాయలసీమలో భారీవర్షాలు పడతాయని చెప్పారు. ఆదివారం కోస్తాలో పిడుగులతో కూడిన వర్షం పడే అవకాశం ఉందని, తీరం వెంబడి 40 నుండి 55 కి.మీ. వేగంతో ఈదురు గాలులు వీస్తాయని వెల్లడించారు. అల్లూరి సీతారామ రాజు, ఏలూరు, చిత్తూరు, శ్రీ సత్యసాయి, అనంతపురం జిల్లాల్లో రానున్న మూడు గంటల వ్యవధిలో ఒకటి, రెండు చోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి వర్షం పడే అవకాశం ఉందని పేర్కొన్నారు.భారీ వర్షాల కారణంగా 24 గంటలు విపత్తు నిర్వహణ శాఖ అప్రమత్తంగా ఉందని ఆర్పీ సిసోడియా తెలిపారు. జిల్లా, రాష్ట్ర స్థాయిలో కంట్రోల్ రూమ్,హెల్ప్లైన్లు ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. ఏలూరు, ప్రకాశం, పశ్చిమగోదావరి, పల్నాడు, శ్రీసత్యసాయి జిల్లాల కలెక్టర్లకు ముందస్తు చర్యలకు ఆదేశాలు జారీ చేశామని, మత్స్యకారులు వేటకు వెళ్ళవద్దని ఆర్పీ సిసోడియా విజ్ఞప్తి చేశారు. -
ఏడు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన
న్యూఢిల్లీ: తమిళనాడు, పుదుచ్చేరి సహా దేశంలోని ఏడు రాష్ట్రాల్లో ఈరోజు(శనివారం) కుండపోత వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. అక్టోబర్ 12 నుంచి 16 వరకు 10 రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.తమిళనాడు, కేరళ, కర్ణాటక, గోవా, మహారాష్ట్ర, అరుణాచల్ ప్రదేశ్, గుజరాత్‌లలో అక్టోబర్ 12న భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంటూ వాతావరణశాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. తాజా సమాచారం ప్రకారం ప్రస్తుతం తమిళనాడులోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. రాబోయే రెండు రోజుల్లో అస్సాం, మేఘాలయలో తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు కురవనున్నాయి. నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపురలో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ పేర్కొంది.నైరుతి రుతుపవనాలు గుజరాత్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, బీహార్, జార్ఖండ్‌లోని కొన్ని ప్రాంతాల నుండి దాటనున్నాయి. యూపీలోని కొన్ని చోట్ల తేలికపాటి పొగమంచు కమ్ముకుంది. అక్టోబర్ 16 వరకు ఢిల్లీలో ఆకాశం నిర్మలంగా ఉంటుందని అంచనా. దేశ రాజధానిలో గరిష్ట ఉష్ణోగ్రత 35 డిగ్రీల సెల్సియస్‌గానూ, కనిష్ట ఉష్ణోగ్రత 22 డిగ్రీల సెల్సియస్‌గానూ ఉండే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. ఇది కూడా చదవండి: ఆరు నెలల్లో 7897 కోట్ల లావాదేవీలు -
భారత్- బంగ్లా టెస్టుకు వర్షం అడ్డంకి.. మూడో రోజు ఆట కూడా డౌటే?
కాన్పూర్ వేదికగా భారత్-బంగ్లాదేశ్ మధ్య జరుగుతున్న రెండో టెస్టును వరుణుడు వెంటాడుతూనే ఉన్నాడు. వర్షం కారణంగా మూడో రోజు ఆట కూడా ప్రారంభం కాలేదు. శనివారం రాత్రి కురిసిన భారీ వర్షానికి గ్రీన్ పార్క్ మైదానం ఔట్ ఫీల్డ్ చిత్తడిగా మారింది.అయితే ప్రస్తుతం కాన్పూర్‌లో వర్షం కురవడం లేదు. దీంతో మైదానాన్ని సిద్దం చేసే పనిలో గ్రౌండ్ స్టాప్ పడ్డారు. గ్రీన్ పార్క్ స్టేడియంలో మెరుగైన డ్రైనజీ వ్యవస్ధ లేకపోవడంతో గ్రౌండ్‌ను రెడీ చేసేందుకు సిబ్బందికి కష్టతరం అవుతోంది. ఆదివారం మధ్యాహ్నం 12:00 గంటలకు అంపైర్లు పిచ్‌ను పరిశీలించనున్నారు. కాగా ఇప్పటికే రెండో రోజు(శనివారం) ఆట కనీసం బంతి పడకుండానే రద్దు అయింది. ఇప్పుడు మూడో రోజు ఆటకు కూడా భారీ వర్షం ముప్పు పొంచి ఉంది. మళ్లీ వర్షం ఏమైనా తిరుగుముఖం పడితే మూడో రోజు ఆట కూడా రద్దు అయ్యే అవకాశముంది. కాగా బంగ్లా జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 3 వికెట్లు కోల్పోయి 107 పరుగులు చేసిన సంగతి తెలిసిందే.భారత్ వర్సెస్ బంగ్లాదేశ్ రెండో టెస్టు తుదిజట్లుటీమిండియాయశస్వి జైస్వాల్, రోహిత్ శర్మ(కెప్టెన్), శుబ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, రిషభ్ పంత్(వికెట్ కీపర్), కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, ఆకాశ్ దీప్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్బంగ్లాదేశ్షాద్మన్ ఇస్లాం, జకీర్ హసన్, నజ్ముల్ హొస్సేన్ శాంటో(కెప్టెన్), మోమినుల్ హక్, ముష్ఫికర్ రహీమ్, షకీబ్ అల్ హసన్, లిటన్ దాస్(వికెట్‌కీపర్), మెహిదీ హసన్ మిరాజ్, తైజుల్ ఇస్లాం, హసన్ మహమూద్, ఖలీద్ అహ్మద్. -
యూపీ, బీహార్లలో భారీ వర్షాలు.. ఉప్పొంగుతున్న నదులు
లక్నో/పట్నా: దేశంలోని పలు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తుండగా, ఉత్తరప్రదేశ్, బీహార్లను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. పలు నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. దీంతో ప్రజలు పలు ఇబ్బందులకు గురవుతున్నారు.వాతావరణ శాఖ తాజాగా అందించిన సూచనల ప్రకారం తమిళనాడుతో పాటు పుదుచ్చేరి, కేరళ, దక్షిణ కర్ణాటక, కోస్తా కర్ణాటకలో ఈరోజు(ఆదివారం) భారీ వర్షాలు కురియనున్నాయి. ఉత్తరప్రదేశ్‌లో సగటు కంటే అధిక వర్షపాతం నమోదైన కారణంగా, పలు నదుల నీటిమట్టం పెరిగింది. ఫలితంగా పలు జిల్లాలకు వరద ముప్పు పొంచివుంది. ఐఎండీ వెల్లడించిన గణాంకాల ప్రకారం గడచిన 24 గంటల్లో ఉత్తరప్రదేశ్‌లో 27.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఏడుగురు వర్ష సంబంధిత దుర్ఘటనల్లో మృతిచెందారు. Rainfall Warning : 29th September 2024 वर्षा की चेतावनी : 29th सितंबर 2024 #rainfallwarning #IMDWeatherUpdate #stayalert #staysafe #TamilNadu #puducherry #Kerala #karnataka @moesgoi @ndmaindia @airnewsalerts @DDNewslive@KeralaSDMA @tnsdma @KarnatakaSNDMC pic.twitter.com/R5HnYKbhru— India Meteorological Department (@Indiametdept) September 28, 2024బీహార్‌లోని వాల్మీకినగర్, బీర్పూర్ బ్యారేజీల నుంచి నీటి విడుదల, కొనసాగుతున్న వర్షాల దృష్ట్యా కోసి, గండక్, గంగ నదులు ఉప్పొంగే అవకాశం ఉందని రాష్ట్ర ప్రభుత్వం వరద హెచ్చరికలు జారీ చేసింది. నేపాల్‌లో ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా సంభవించిన వరదలు, కొండచరియలు విరిగిపడిన ఘటనల్లో 66 మంది మృతిచెందారు. 60 మంది గాయపడ్డారు. నేపాల్‌లోని పలు ప్రాంతాల్లో గురువారం నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో దేశ విపత్తు అధికారులు ఆకస్మిక వరద హెచ్చరికలు జారీ చేశారు.ఇది కూడా చదవండి: నేడు ‘మూసీ’ పర్యటనకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు -
ఒక్క బంతి పడకుండానే...
భారత్, బంగ్లాదేశ్ మధ్య జరుగుతున్న రెండో టెస్టును వరుణుడు వదిలేలా లేడు. భారీ వర్షానికి తోడు వెలుతురులేమి కారణంగా తొలి రోజు 35 ఓవర్ల ఆటే సాధ్యం కాగా... శనివారం రెండో రోజు ఒక్క బంతి కూడా పడకుండానే ఆట రద్దయింది. ఉదయంనుంచి భారీ వర్షం కురుస్తుండటంతో ఆట నిర్ణీత సమయానికి ప్రారంభం కాకపోగా... లంచ్ విరామ సయమంలో వరుణుడు కాస్త శాంతించాడు. దీంతో గ్రౌండ్స్‌మెన్ మైదానాన్ని సిద్ధం చేసే పనిలో పడగా... మరోసారి వర్షం ముంచెత్తింది. ఫలితంగా అంపైర్లు రెండో రోజు ఆటను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ఆదివారం కూడా వర్ష సూచన ఉండటం అభిమానులను కలవరపెట్టే అంశం! కాన్పూర్: ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ)లో భాగంగా భారత్, బంగ్లాదేశ్ మధ్య జరుగుతున్న రెండో టెస్టుకు వర్షం అంతరాయం కొనసాగుతోంది. న్యూజిలాండ్, ఆ్రస్టేలియాతో సిరీస్‌లకు ముందు బంగ్లాదేశ్‌పై పూర్తి ఆధిపత్యం కనబరుస్తూ డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో అగ్రస్థానాన్ని మరింత పదిలం చేసుకోవాలని భావించిన టీమిండియాను కాన్పూర్‌లో వరుణుడు అడ్డుకున్నాడు. తొలి రోజు భారీ వర్షం కారణంగా కేవలం 35 ఓవర్ల ఆట సాధ్యం కాగా... శనివారం ఆ కాస్త కూడా తెరిపినివ్వలేదు. అసలు ఆటగాళ్లు మైదానంలోకి వచ్చే అవకాశమే లేకుండా వర్షం ముంచెత్తడంతో పలు సమీక్షల అనంతరం రెండో రోజు ఆటను రద్దు చేస్తున్నట్లు అంపైర్లు ప్రకటించారు. చిరుజల్లులుగా మొదలైన వర్షం ఆ తర్వాత మైదానాన్ని ముంచెత్తింది. మధ్యలో కాసేపు వరుణుడు శాంతించడంతో గ్రౌండ్స్‌మెన్ సూపర్ సాపర్లతో మైదానాన్ని సిద్ధం చేసే ప్రయత్నాలు ప్రారంభించగా... మరోసారి భారీ వాన దంచి కొట్టింది. దీంతో ఆట సాధ్యపడలేదు. వాతావరణ శాఖ సూచనల ప్రకారం ఆదివారం, సోమవారం కూడా కాన్పూర్‌లో వర్షం పడే అవకాశం ఉంది. ఇదే జరిగితే మ్యాచ్ ‘డ్రా’గా ముగియడం లాంఛనమే. తొలి రోజు ఆటలో టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్‌లో 35 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 107 పరుగులు చేసింది. కెప్టెన్ నజ్ముల్ హసన్ (31; 6 ఫోర్లు), షాద్మన్ ఇస్లామ్ (24; 4 ఫోర్లు), జాకీర్ హసన్ (0) ఔట్ కాగా... మోమినుల్ హక్ (81 బంతుల్లో 40 బ్యాటింగ్; 7 ఫోర్లు), ముషి్ఫకర్ రహీమ్ (6 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. భారత బౌలర్లలో ఆకాశ్ దీప్ 2, రవిచంద్రన్ అశ్విన్ ఒక వికెట్ పడగొట్టారు. డబ్ల్యూటీసీ 2023–25 సీజన్లో ఇప్పటి వరకు 10 మ్యాచ్‌లాడిన భారత్ అందులో 7 విజయాలు, 2 పరాజయాలు, ఒక ‘డ్రా’తో మొత్తం 71.67 విజయ శాతంతో ‘టాప్’లో కొనసాగుతోంది. 12 మ్యాచ్‌లాడిన ఆస్ట్రేలియా (62.50 విజయ శాతం) ఎనిమిది విజయాలతో రెండో స్థానంలో ఉంది. బంగ్లాదేశ్‌తో సిరీస్ అనంతరం భారత జట్టు స్వదేశంలో న్యూజిలాండ్‌తో మూడు టెస్టులు, ఆ్రస్టేలియాలో ఆ్రస్టేలియాతో 5 మ్యాచ్‌ల సిరీస్ ఆడనుంది. ఈ రెండింట్లో కూడా ఇదే జోరు కొనసాగిస్తే... టీమిండియా వరుసగా మూడోసారి డబ్ల్యూటీసీ ఫైనల్‌కు చేరడం ఖాయమే! బంగ్లాదేశ్‌తో రెండో టెస్టు వర్షం కారణంగా చివరకు ‘డ్రా’గా ముగిస్తే అది రోహిత్ బృందం డబ్ల్యూటీసీ ఫైనల్‌కు చేరే మార్గంపై స్వల్ప ప్రభావం చూపనుంది. ఈ నేపథ్యంలో ఆట సాగితే సంపూర్ణ ఆధిపత్యం కనబర్చాలని భారత జట్టు ఉవ్విళ్లూరుతోంది. -
Ind vs Ban Day 1: మొదటి రోజు 35 ఓవర్లతో సరి
వర్షం, వెలుతురులేమి కలగలిసి భారత్, బంగ్లాదేశ్ రెండో టెస్టు తొలి రోజు ఆటను అర్ధాంతరంగా ముగించాయి. తక్కువ వ్యవధిలో మూడు బంగ్లాదేశ్ వికెట్లు తీసి ఆధిక్యం ప్రదర్శించిన టీమిండియా వాన కారణంగా దానిని కొనసాగించలేకపోయింది. ఆట సాగిన 35 ఓవర్లలోనే భారత బౌలర్లను ఎదుర్కోవడంలో తమ బలహీనతను ప్రదర్శించిన పర్యాటక జట్టుకు ఆట ఆగిపోవడం తెరిపినిచ్చింది. 11 బంతుల తేడాలోనే రెండు కీలక వికెట్లు తీసిన పేసర్ ఆకాశ్‌దీప్ బౌలింగ్ ఈ సంక్షిప్త ఆటలోహైలైట్గా నిలవగా... మ్యాచ్ రెండో రోజు కూడా వర్షసూచన ఉండటం భారత అభిమానులకు నిరాశకలిగించే విషయం. కాన్పూర్: భారత్, బంగ్లాదేశ్ మధ్య రెండో టెస్టు వాన అంతరాయాలతో మొదలైంది. వర్షం కారణంగా ఉదయం ఆట గంట ఆలస్యంగా మొదలు కాగా... చివర్లో వెలుతురు మందగించడంతో నిర్ణీత సమయం కంటే గంటన్నర ముందుగానే అంపైర్లు ఆటను నిలిపివేశారు. అంతకుముందు టాస్ గెలిచిన భారత్ ఫీల్డింగ్ ఎంచుకుంది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్ మొదటి రోజు శుక్రవారం ఆట ముగిసే సమయానికి తమ తొలి ఇన్నింగ్స్‌లో 35 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 107 పరుగులు చేసింది. మోమినుల్ హక్ (40 బ్యాటింగ్; 7 ఫోర్లు), నజు్మల్ హసన్ ( 31; 6 ఫోర్లు) ఫర్వాలేదనిపించారు. ప్రస్తుతం మోమినుల్తో పాటు ముషి్ఫకర్ (6 బ్యాటింగ్) క్రీజ్‌లో ఉన్నాడు. ఆకాశ్‌దీప్‌కు 2 వికెట్లు దక్కాయి. పిచ్‌ను దృష్టిలో ఉంచుకొని టీమిండియా గత టెస్టు తుది జట్టునే కొనసాగిస్తూ ముగ్గురు పేసర్లను ఎంచుకుంది. దాంతో కాన్పూర్ కే చెందిన స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌కు సొంతగడ్డపై టెస్టు మ్యాచ్ ఆడే అవకాశం దక్కలేదు. రాణించిన మోమినుల్... పరిస్థితులు పేస్ బౌలింగ్‌కు అనుకూలంగా ఉండటంతో బంగ్లాదేశ్ ఇన్నింగ్స్‌ను జాకీర్ (0), షాద్మన్ జాగ్రత్తగా ప్రారంభించారు. బుమ్రా తన తొలి 3 ఓవర్లలో ఒక్క పరుగూ ఇవ్వలేదు. మరీ ఇబ్బంది పడిన జాకీర్ 23 బంతుల్లో సింగిల్ కూడా తీయలేకపోయాడు. ఆపై ఆకాశ్‌దీప్ తన తొలి ఓవర్లోనే అతడిని సాగనంపి భారత్‌కు తొలి వికెట్ అందించాడు.జైస్వాల్ పట్టిన క్యాచ్‌పై కాస్త సందేహం కనిపించినా... వరుస రీప్లేల తర్వాత అంపైర్లు జాకీర్‌ను అవుట్‌గా ప్రకటించారు. ఆ తర్వాత ఆకాశ్‌దీప్ మూడో ఓవర్ తొలి బంతికే షాద్మన్ వికెట్ల ముందు దొరికిపోయాడు. అంపైర్ నాటౌట్‌గా ప్రకటించినా... రివ్యూ కోరిన భారత్ ఫలితం పొందింది. ఈ దశలో నజు్మల్, మోమినుల్ కలిసి జట్టుకు ఆదుకునే ప్రయత్నం చేశారు.సిరాజ్ ఓవర్లో నజు్మల్ ఎల్బీ కోసం రివ్యూ కోరిన భారత్ ఈసారి మాత్రం ప్రతికూల ఫలితం రావడంతో ఒక రివ్యూను కోల్పోయింది. ఇద్దరు బ్యాటర్లూ కొన్ని చక్కటి షాట్లతో పరుగులు రాబట్టి సెషన్‌ను ముగించారు. లంచ్ తర్వాత తన రెండో ఓవర్లో అశ్విన్ బంగ్లాదేశ్‌ను దెబ్బ తీశాడు. చక్కటి బంతితో నజు్మల్ను ఎల్బీగా వెనక్కి పంపించాడు. బంగ్లా కెప్టెన్ రివ్యూ చేసినా లాభం లేకపోయింది. నజు్మల్, మోమినుల్ మూడో వికెట్‌కు 51 పరుగులు జోడించారు. ఆ తర్వాత భారత బౌలర్లు మరింత ఒత్తిడి పెంచారు. దాంతో మరో 6.1 ఓవర్ల పాటు మోమినుల్, ముష్ఫికర్ కొన్ని ఉత్కంఠభరిత క్షణాలను ఎదుర్కొన్నారు. ఎట్టకేలకు అనూహ్య ముగింపుతో వారికి కాస్త ఉపశమనం లభించింది. ముందుగా వెలుతురులేమితో ఆటను నిలిపివేసిన అంపైర్లు గంట పాటు వేచి చూసి తుది నిర్ణయం తీసుకున్నారు. స్కోరు వివరాలు బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్: జాకీర్ (సి) యశస్వి జైస్వాల్ (బి) ఆకాశ్‌దీప్ 0; షాద్మన్ (ఎల్బీ) (బి) ఆకాశ్‌దీప్ 24; మోమినుల్ (బ్యాటింగ్) 40; నజు్మల్ (ఎల్బీ) (బి) అశ్విన్ 31; ముష్ఫికర్ రహీమ్ (బ్యాటింగ్) 6; ఎక్స్‌ట్రాలు 6; మొత్తం (35 ఓవర్లలో 3 వికెట్లకు) 107. వికెట్ల పతనం: 1–26, 2–29, 3–80. బౌలింగ్: బుమ్రా 9–4–19–0, సిరాజ్ 7–0–27–0, అశ్విన్ 9–0–22–1, ఆకాశ్‌దీప్ 10–4–34–2. -
ముంబైని మరోసారి ముంచెత్తనున్న భారీ వర్షాలు
ముంబై : మహరాష్ట్రకు వాతావరణ శాఖ మరోసారి హెచ్చరికలు జారీ చేసింది. మరోసారి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అంచనా వేసింది. రెండ్రోజుల క్రితం భారీ వర్షాలు ముంబై నగరాన్ని ముంచెత్తాయి. ఫలితంగా పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. జనజీవనం స్తంభించి పోయింది. ఈ తరుణంలో శుక్రవారం మధ్యాహ్నం వాతావరణ శాఖ ముంబైకి మరోసారి హెచ్చరికలు జారీ చేసింది. బలమైన పశ్చిమ గాలుల కారణంగా శుక్రవారం ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. శుక్రవారం నుంచి శనివారం ఉదయం 8గంటల వరకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది.ఈ సందర్భంగా పాల్ఘర్, రాయ్‌గఢ్ పరిసర జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసినట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అంతేకాదు ముంబైలోని పలు ప్రాంతాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు, ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని తెలుస్తోంది.👉చదవండి : సీఎం సార్.. కర్మ సిద్ధాంతం అంటే ఇదే కదా -
మహిళ ప్రాణం తీసిన మ్యాన్‌హోల్ గ్రిల్స్ దొంగతనం
మ్యాన్‌హోల్ గ్రిల్స్ (మెటల్స్) దొంగతనం 45 ఏళ్ల విమల్ అనిల్ గైక్వాడ్ ప్రాణం తీసింది. భారీ వర్షాలకు గైక్వాడ్ మ్యాన్‌హోల్‌లో పడి ప్రాణాలు కోల్పోయారు. అయితే వర్షాల కారణంగా ఏర్పడే ప్రమాదాల నుంచి సురక్షితంగా ఉండేలా అధికారులు మ్యాన్‌హోల్స్‌ను మెటల్స్ను అమర్చారు. ఆ మెటల్స్ను అగంతకులు దొంగతనం చేశారు. ముంబైలో విషాదం చోటు చేసుకుంది. బుధవారం రాత్రి కురిసిన భారీ వర్షాలకు విమల్ అనిల్ గైక్వాడ్ ప్రమాదవ శాత్తూ డ్రైనేజీలో పడి మరణించారు. ఈ ఘటనలో కుటుంబానికి ఆధారమైన తన భార్య మరణానికి కారణమైన ప్రభుత్వ ఉన్నతాధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ బాధితురాలి భర్త పోలీసుల్ని ఆశ్రయించారు‘నేను అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాను. నన్ను, నా ఇంటి బాధ్యతల్ని తన చూసుకునేది. ఇంటి బాధ్యతల్ని నా భార్యనే చూసుకునేది. ఆమె మరణంతో మేం సర్వం కోల్పోయాం ’ అంటూ కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఈ సందర్భంగా తప్పు ఎవరిదైనా కఠిన శిక్ష విధించాలని డిమాండ్ చేశారు. అనిల్ గౌక్వాడ్ ఫిర్యాదుతో పోలీసులు..ఈ దర్ఘుటనలో నిర్లక్ష్యానికి పాల్పడినట్లు బృహన్ముంబయి మునిసిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) అధికారులు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. దీంతో మున్సిపల్ శాఖ.. డిప్యూటీ కమిషనర్ నేతృత్వంలో ముగ్గురు సభ్యుల ప్యానెల్‌ను ఏర్పాటు చేసి, మూడు రోజుల్లో నివేదికను కోరింది. నిన్న కురిసిన భారీ వర్షం వల్ల ఆర్థిక రాజధానిలో రైలు పట్టాలు, రోడ్లు నీట మునిగాయి. ట్రాఫిక్ నిలిచిపోయింది .14 విమానాలు దారి మళ్లించాయి. అయితే వర్షం బీభత్సం సమయంలో గైక్వాడ్ అంధేరీ ఈస్ట్‌లోని మహారాష్ట్ర ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ భవనం గేట్ నంబర్ 8 సమీపంలో పొంగిపొర్లుతున్న మ్యాన్‌హోల్‌లో పడిపోయారు. స్థానికుల సమాచారంతో పోలీసులు,అగ్నిమాపక దళ సిబ్బంది ఆమెను కూపర్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే, ఆమె అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు.కాగా, ఈ ఏడాది ముంబైలో వేర్వేరు మ్యాన్‌హోల్‌లో పడిన ఘటనల్లో కనీసం ఏడుగురు మరణించారు. నగరంలో మ్యాన్‌హోల్ మెటల్ దొంగతనాలు కూడా పెరుగుతున్నాయని, గతేడాది ముంబైలో 791 మ్యాన్‌హోల్ కవర్ దొంగతనాలు నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. -
భారీ వర్షాల ప్రభావం: ప్రధాని మోదీ పూణె పర్యటన రద్దు
న్యూఢిల్లీ: మహారాష్ట్రలో భారీ వర్షాల కారణంగా ప్రధాని నరేంద్ర మోదీ తన పూణె పర్యటనను రద్దు చేసుకున్నారు. రాష్ట్రంలోని పలు నగరాలను భారీ వర్షాలు అతలాకుతలం చేశాయి. రోడ్లపైకి నీరు చేరడంతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. ప్రధాని మోదీ ఈరోజు (గురువారం) పుణె మెట్రో రైలు ప్రారంభోత్సవంతో పాటు రూ.22,600 కోట్ల విలువైన వివిధ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయాల్సి ఉంది. అయితే భారీ వర్షాల దృష్ట్యా ప్రధాని మోదీ తన పర్యటనను రద్దు చేసుకున్నారు.భారీ వర్షాల కారణంగా పూణె, పింప్రీ చించ్వాడ్లలో పాఠశాలలు, కళాశాలలను మూసివేశారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది. కుండపోత వర్షాల కారణంగా గోవండి-మాన్‌ఖుర్ద్ మధ్య నడిచే ముంబై లోకల్ రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పుణె జిల్లాకు ఐఎండీ ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. పౌరులు అనవసరంగా ఇళ్ల నుంచి బయటకు రావద్దని, అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.జాతీయ సూపర్కంప్యూటింగ్ మిషన్ (ఎన్ఎస్ఎం) కింద సుమారు రూ. 130 కోట్లతో అభివృద్ధి చేసిన మూడు పరమ రుద్ర సూపర్ కంప్యూటర్లను జాతికి అంకితం చేసే కార్యక్రమంలో నేడు ప్రధాని పాల్గొనాల్సి ఉంది. అలాగే వాతావరణ పరిశోధనల కోసం రూపొందించిన హై పెర్ఫార్మెన్స్ కంప్యూటింగ్ (హెచ్పీసీ)సిస్టమ్‌ను కూడా ప్రధాని ప్రారంభించాల్సి ఉంది. ఈ ప్రాజెక్ట్‌కు రూ. 850 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టారు. అయితే భారీ వర్షాల కారణంగా ఈ కార్యక్రమాలన్నీ నేడు రద్దయ్యాయి.ఇది కూడా చదవండి: ముంబయిలో భారీ వర్షం.. విమానాల దారి మళ్లింపు -
ముంబైలో వర్ష బీభత్సం
ముంబై: మహరాష్ట్రలో వర్ష బీభత్సం సృష్టిస్తుంది. బుధవారం సాయంత్రం నుంచి కురుస్తున్న భారీ వర్షానికి ముంబై రోడ్లు జలమయమయ్యాయి. ట్రాఫిక్ స్తంభించిపోయింది. వర్షం కారణంగా స్పైస్‌జెట్, విస్తారాతో పాటు పలు సంస్థలు విమానాలను దారి మళ్లించాయి. వాతావరణ శాఖ బుధవారం ఉదయం ముంబైతో పాటు పొరుగు జిల్లాలకు హెచ్చరిక జారీ చేసింది. భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. వాతావరణ శాఖ హెచ్చరికల అనంతరం మధ్యాహ్నం నుంచి ముంబైలోని పలు శివారు ప్రాంతాలలో భారీ వర్ష పాతం నమోదైంది. ములుండ్ దాని పరిసరాల్లో భారీ వర్షంతో లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. వాతావరణ శాఖ అధికారి సుష్మా నాయర్ మాట్లాడుతూ, ఉత్తర కొంకణ్ నుండి దక్షిణ బంగ్లాదేశ్ వరకు దక్షిణ ఛత్తీస్‌గఢ్ దాని పరిసర ప్రాంతాలలో తుఫాను ద్రోణి నడుస్తుందని చెప్పారు. ఫలితంగా ముంబై, థానే, రాయ్‌గఢ్, రత్నగిరి జిల్లాల్లో అత్యధిక వర్షపాతం నమోదు కావడంతో పాటు ఉరుములు, మెరుపులతో కూడిన ఈదురు గాలులతో భారీ వర్షం కురుస్తుందన్నారు. ఈ వారంలో కొంకణ్, గోవాలో దీని ప్రభావం ఎక్కువగా ఉందని ఆమె వావాతవరణ శాఖ అధికారి సుష్మా నాయర్ చెప్పారు. -
మెట్రోలో వర్షం.. కంగుతిన్న ప్రయాణికులు
ముంబై: దేశంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో జనం పలు ఇక్కట్లకు గురవుతున్నారు. ఈ నేపధ్యంలో మహారాష్ట్రలోని ముంబైలో ఒక విచిత్ర ఉదంతం చోటుచేసుకుంది.ప్రయాణీకులతో నిండిన ముంబై మెట్రోలోని ఒక కోచ్‌లో అకస్మాత్తుగా వర్షం పడింది. ప్రయాణికులతో రద్దీగా ఉన్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఉదంతానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిని చూసిన వారంతా తెగ ఆశ్చర్యపోతున్నారు.కోచ్‌లో ఉన్న ఏసీ వెంట్ నుంచి అకస్మాత్తుగా నీరు బయటకు రావడాన్ని వీడియోలో స్పష్టంగా చూడవచ్చు. ఈ దృశ్యాన్ని అక్కడున్న పలువురు తమ కెమెరాల్లో బంధించారు. ఢిల్లీ మెట్రోకు సంబంధించిన అనేక వైరల్ వీడియోలు ప్రతిరోజూ సోషల్ మీడియాలో దర్శనమిస్తుంటాయి. ఇప్పుడు ఇదే రేంజ్లో ముంబై మెట్రో వీడియో వైరల్ అవుతోంది.ఈ వీడియో చూసిన కొందరు.. ‘మెట్రోలో ప్రయాణించేందుకు వారు టికెట్ తీసుకున్నారని, అయితే ఇప్పుడు వారంతా స్విమ్మింగ్ పూల్‌లో ఉన్నట్లుందని కామెంట్ చేశారు. ఈ ఘటనపై కొందరు సరదాగా కామెంట్ చేస్తుండగా, మరికొందరు మెట్రో పరిస్థితిని సీరియస్‌గా తీసుకుంటున్నారు. మెట్రో యాజమాన్యం ఈ సమస్యను పరిష్కరించాలని పలువురు యూజర్లు కోరుతున్నారు. Life in a metro ❌Rain in a metro ✅#Mumbai #MumbaiRain pic.twitter.com/B2m90FsbuW— Miss Ordinaari (@shivangisahu05) September 24, 2024ఇది కూడా చదవండి: నేడు కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు -
బంగాళాఖాతంలో నేడు అల్పపీడనం
సాక్షి, అమరావతి: బంగాళాఖాతంలో ఉన్న రెండు ఉపరితల ఆవర్తనాల ప్రభావంతో సోమవారానికి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో సోమవారం నుంచి వచ్చే నాలుగు రోజులు రాష్ట్రంలో పలుచోట్ల ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. మిగిలినచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది.కాగా, సోమవారం పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. శ్రీకాకుళం, విజయనగరం, కాకినాడ, తూర్పుగోదావరి, వైఎస్సార్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. మంగళవారం పశి్చమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, కర్నూలు, నంద్యాల, అనంతపురం, వైఎస్సార్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. -
వానమ్మ.. వాన! ఇన్ని రకాల వానలుంటాయంటే నమ్ముతారా?
నిన్నమొన్నటి దాకా వానలు దంచి కొట్టాయి. విపరీతంగా కురిసిన వానలతో ప్రజలు అష్టకష్టాలు పడ్డారు. కాస్త తెరిపిన పడ్డారో లేదో తెలంగాణాలో, హైదరబాద్‌లో మళ్లీ వానలు ఆగమేఘాలమీద దూసుకొచ్చాయి. అసలు వానలు ఎన్నిరకాలు, వాటికి ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా? నమ్మినా నమ్మకపోయినా, వివిధ రకాల వర్షాలు ఉన్నాయి. అవును. అంతేకాదు అన్ని వర్షాలు ఒకేలా ఉండవు! గాంధారి వాన –కంటికి ఎదురుగా ఉన్నది కనిపించనంత జోరుగా కురిసే వాన.మాపుసారి వాన –సాయంత్రం కురిసే వానమీసర వాన – మృగశిర కార్తెలో కురిసే వానదుబ్బురు వాన – తుప్పర / తుంపర వానసానిపి వాన – అలుకు (కళ్లాపి చల్లినంత కురిసే వాన)సూరునీల్ల వాన – ఇంటి చూరు నుంచి ధార పడేంత వానబట్టదడుపు వాన – ఒంటి మీదున్న బట్టలు తడిసేంత వానతప్పె వాన – ఒక చిన్న మేఘం నుంచి పడే వానసాలు వాన – ఒక నాగలి సాలుకు సరిపడా వానఇలువాలు వాన – రెండుసాల్లకు – విత్తనాలకు సరిపడా వానమడికట్టు వాన – బురద పొలం దున్నేటంత వానముంతపోత వాన – ముంతతోటి పోసినంత వానకుండపోత వాన – కుండతో కుమ్మరించినంత వానముసురు వాన – విడువకుండా కురిసే వానదరోదరి వాన – ఎడతెగకుండా కురిసే వానబొయ్య బొయ్య గొట్టే వాన – హోరుగాలితో కూడిన వానకోపులు నిండే వాన రోడ్డు పక్కన గుంతలు నిండేంత వనరాళ్ల వాన – వడగండ్ల వానకప్పదాటు వాన – అక్కడక్కడా కొంచెం కురిసే వానతప్పడతప్పడ వాన – టపటపా కొంచెంసేపు కురిసే వానదొంగ వాన – రాత్రంతా కురిసి తెల్లారి కనిపించని వానఏకార వాన – ఏకధారగా కురిసే వానమొదటి వాన – విత్తనాలకు బలమిచ్చే వానసాలేటి వాన – భూమి తడిసేంత భారీ వానసాలుపెట్టు వాన – దున్నేందుకు సరిపోయేంత వాన -
ఇంగ్లండ్, ఆ్రస్టేలియా మధ్య చివరి టి20 రద్దు
భారీ వర్షం కారణంగా ఇంగ్లండ్, ఆ్రస్టేలియా మధ్య ఆదివారం మాంచెస్టర్‌లో జరగాల్సిన చివరి టి20 మ్యాచ్ రద్దయింది. ఉదయం నుంచి కురుస్తున్న భారీ వర్షం కారణంగా ఆట సాధ్యం కాలేదు. దాంతో టాస్ కూడా వేయకుండా నిర్ణీత సమయానికి రెండు గంటల తర్వాత మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు అంపైర్లు ప్రకటించారు. దాంతో మూడు మ్యాచ్‌ల ఈ సిరీస్ 1–1తో సమంగా ముగిసింది. ఈ నెల 19 నుంచి ఇరు జట్ల మధ్య ఐదు మ్యాచ్‌లతో కూడిన వన్డే సిరీస్ జరుగుతుంది. -
తాజ్‌మహల్ ప్రధాన గోపురం నుంచి లీకేజీ : స్పందించిన అధికారులు
ప్రపంచంలోనే అత్యంత అందమైన భవనం తాజ్‌మహల్‌కి వర్షాల బెడద తప్ప లేదు. గత మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా, ఢిల్లీలోని ఆగ్రాలో కొలువై వున్న ప్రేమసౌథం తాజ్ మహల్ ప్రధాన గోపురం నుంచి నీరు లీకైంది. దీంతో తాజ్ మహల్ ఆవరణలో ఉద్యానవనం నీట మునిగింది. ఈ లీకేజీకి సంబంధించి 20 సెకన్ల వీడియో ఇంటర్నెట్లో వీడియో గురువారం వైరల్‌గా మారింది.అయితే, సీపేజ్ కారణంగా లీకేజీ ఉందని, పాలరాతి భవనానికి ఎలాంటి నష్టం లేదని ఆర్కియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ASI), ఆగ్రా సర్కిల్ సీనియర్ అధికారి స్పష్టం చేశారు. డ్రోన్ కెమెరా ద్వారా ప్రధాన డోమ్‌ను పరిశీలించామని ప్రమాదం ఏమీలేదని చెప్పారు. వర్షం తగ్గుముఖం పట్టిన తర్వాత చర్యలు తీసుకుంటామన్నారు.ఏఎస్ఐ సూపరింటెండింగ్ చీఫ్ రాజ్‌కుమార్ పటేల్ తెలిపారు. తోటలలో ఒకటి వర్షం నీటితో మునిగి పోయింది. దీన్ని తాజ్ మహల్‌ను సందర్శించిన పర్యాటకులు వీడియో తీశారని పేర్కొన్నారు.🇮🇳 Taj Mahal Gardens Submerged After Incessant Rain Hits India's AgraWork is ongoing to drain the water from one of the Seven Wonders of the World.pic.twitter.com/C5shcu4HZh— RT_India (@RT_India_news) September 12, 2024 తాజ్ మహల్ మొత్తం దేశానికి గర్వకారణమని వేలాది పర్యాటకులు ఆకర్షిస్తున్న ఈ ప్రదేశంలో పర్యాటక పరిశ్రమలో అనేక మందికి ఉపాధిని కల్పిస్తుందని దీనిపై సరైన జాగ్రత్తలు తీసుకోవాలని, ఇదే తమ ఏకైక ఆశాదీపమని టూర్ గైడ్ ఒకరు కోరారు. కాగా ఆగ్రాలో గత మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం కారణంగా రాజధాని నగరంలోని ప్రధాన రహదారులు, నివాస ప్రాంతాలు జలమయ మైనాయి. వర్ష కారణంగా పాఠశాలలకు సెలవు ప్రకటించారు. -
సెప్టెంబర్ 19 నుంచి నైరుతి రుతుపవనాలు వెనక్కి
న్యూఢిల్లీ: ఈనెల 19 నుంచి 25 తేదీల మధ్య నైరుతి రుతుపవనాలు వెనక్కి మళ్లడం మొదలవుతుందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. నైరుతి రుతుపవనాలు ఏటా సాధారణంగా జూన్ ఒకటో తేదీన తొలిసారిగా కేరళను తాకుతాయి. అక్కడి నుంచి విస్తరిస్తూ జూలై ఎనిమిదో తేదీకల్లా దేశమంతా చుట్టేస్తాయి. తర్వాత సెప్టెంబర్ 17వ తేదీన తిరోగమనం మొదలై అక్టోబర్ 15 కల్లా వెళ్లిపోతాయి. ఈ నైరుతి సీజన్లో దేశంలో సగటున 836.7 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. సాధారణ సగటు వర్షపాతం కంటే ఈసారి 8 శాతం ఎక్కువ నమోదవడం గమనార్హం. ఇదీ చదవండి : ఇయర్‌రింగ్స్‌తో కుట్ర..ట్రంప్-హారిస్ డిబేట్‌పై చర్చ -
Afg vs NZ: మొన్న అలా.. ఇప్పుడిలా! ఖేల్ ఖతం?
అఫ్గనిస్తాన్- న్యూజిలాండ్‌ల మధ్య జరగాల్సిన ఏకైక టెస్టుకు అడ్డంకులు కొనసాగుతూనే ఉన్నాయి. వర్షం కారణంగా మూడో రోజు ఆట కూడా.. కనీసం టాస్ పడకుండానే ముగిసిపోయింది. కాగా 2017లో టెస్టు హోదా సంపాదించిన అఫ్గన్ జట్టు.. తటస్థ వేదికలపై తమ అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడుతోంది. ఈ క్రమంలో న్యూజిలాండ్‌తో తొలిసారిగా టెస్టు ఆడేందుకు వేదికగా భారత్‌ను ఎంచుకుంది.సోమవారమే మొదలు కావాలి.. కానీభారత క్రికెట్ నియంత్రణ మండలిని సంప్రదించి తమ రాజధాని కాబూల్‌కు దగ్గరగా ఉన్న గ్రేటర్ నోయిడా స్పోర్ట్స్ కాంప్లెక్స్ స్టేడియానికి విచ్చేసింది. ఇందులో భాగంగా.. షెడ్యూల్ ప్రకారం అఫ్గన్- కివీస్ జట్ల మధ్య సోమవారం నుంచి టెస్టు మ్యాచ్ మొదలుకావాలి.. కానీ రెండు రోజుల పాటు ఆటగాళ్లు మైదానంలో దిగే పరిస్థితి లేకపోయింది. ఆట ముందుకు సాగడమే గగనమైంది.తొలి రెండు రోజులు వాన చినుకు జాడ లేకపోయినా... మైదానం మాత్రం ఆటకు సిద్ధం కాలేదు. గత రెండు వారాల క్రితం నోయిడాలో కురిసిన భారీ వర్షాల కారణంగా అవుట్ ఫీల్డ్ మొత్తం తడిగా మారింది. నీరు బయటకు వెళ్లేందుకు గ్రేటర్ నోయిడా స్పోర్ట్స్ కాంప్లెక్స్ గ్రౌండ్లో అసలు డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడమే ఇందుకు ప్రధాన కారణం.అంతర్జాతీయ టెస్టు మ్యాచ్ అపహాస్యమయ్యే దుస్థితి అదే విధంగా... మైదానాన్ని ఆటకు వీలుగా ఆరబెట్టే పరికరాలు అందుబాటులో లేకపోవడంతో ఒక అంతర్జాతీయ టెస్టు మ్యాచ్ అపహాస్యమయ్యే దుస్థితి తలెత్తింది. కేవలం నోయిడా స్టేడియంలో సరైన సౌకర్యాలు లేకపోవడం వల్లే అఫ్గనిస్తాన్ జట్టుకు భంగపాటు ఎదురవుతోంది. రెండోరోజు ఆట జరిపించేందుకు మంగళవారం మైదానంలో పదుల సంఖ్యలో గ్రౌండ్ సిబ్బంది తీవ్రంగా శ్రమించినా ఫలితం లేకపోయింది.ల్యాండ్‌స్కేప్ గడ్డి గడుల్ని తెచ్చి మైదానమంతా పరిచేందుకు చెమటోడ్చినా అవుట్‌ఫీల్డ్ పొడిబారలేదు. ఫ్యాన్లు అమర్చి మైదానం ఎండేలా కృషి చేసినా ఫలితం శూన్యం. దీంతో కనీసం మూడో రోజైనా పరిస్థితి మెరుగపడుతుందని అఫ్గన్- న్యూజిలాండ్ జట్ల ఆటగాళ్లు, అభిమానులు ఎదురుచూశారు.ఇప్పుడిక వర్షంఅయితే, ఈరోజు వర్షం కారణంగా పరిస్థితి మరింత దారుణంగా మారింది. వాన కురుస్తున్న కారణంగా అవుట్ ఫీల్డ్ మొత్తం కవర్లతో కప్పేశారు గ్రౌండ్స్‌మెన్. దీంతో మూడో రోజు కూడా ఆటను రద్దు చేస్తున్నట్లు అంపైర్లు ప్రకటించారు. ఇక మరో రెండు రోజుల పాటూ నోయిడాలో భారీ వర్షాలు కురిసే పరిస్థితి కనిపిస్తోంది. దీంతో అఫ్గన్- కివీస్ టెస్టు మొదలుకాకుండానే ముగిసిపోయే దుస్థితి నెలకొంది.చదవండి: DT 2024: భారత ‘ఎ’ జట్టులోషేక్ రషీద్.. టీమిండియాతో చేరని సర్ఫరాజ్ ఖాన్! -
రెండో రోజూ అదే పరిస్థితి
గ్రేటర్ నోయిడా: అఫ్గానిస్తాన్, న్యూజిలాండ్‌ల మధ్య జరగాల్సిన ఏకైక టెస్టుకు వింత పరిస్థితి ఎదురవుతోంది. ఇరుజట్ల మధ్య సోమవారం నుంచి టెస్టు మ్యాచ్ జరగాలి. కానీ ఆటగాళ్లు మైదానంలో దిగడం లేదు. ఆట ముందుకు సాగడమే లేదు. రెండు రోజులుగా ఇదే జరుగుతోంది. అలాగని ఈ రెండు రోజులుగా వర్షమేమీ కురవడం లేదు. వాన చినుకు జాడ లేకపోయినా... మైదానం మాత్రం ఆడేందుకు సిద్ధంగా లేదు. కొన్ని రోజుల క్రితం కురిసిన కుండపోత వర్షాల వల్ల మైదానం చిత్తడిగా మారింది. గ్రేటర్ నోయిడా స్పోర్ట్స్ కాంప్లెక్స్ గ్రౌండ్లో కురిసిన నీరు బయటకు వెళ్లేందుకు అసలు డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడం, మైదానాన్ని సన్నద్ధం చేసే పరికరాలు అందుబాటులో లేకపోవడంతో ఒక అంతర్జాతీయ టెస్టు మ్యాచ్ అపహాస్యం అవుతోంది. కేవలం ప్రతికూల పరిస్థితుల వల్లే మొదలవడం లేదు. మంగళవారం రెండోరోజు ఆట జరిపించేందుకు మైదానంలో పదుల సంఖ్యలో గ్రౌండ్ సిబ్బంది తెగ శ్రమించారు. ల్యాండ్‌స్కేప్ గడ్డి గడుల్ని తెచ్చి మైదానమంతా పరిచేందుకు చెమటోడ్చారు. ఫ్యాన్లు అమర్చి మైదానం ఎండేలా కృషి చేశారు. అయినాకూడా అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం గ్రౌండ్ సిద్ధంగా లేకపోవడంతో ఫీల్డు అంపైర్లు కుమార ధర్మసేన, షర్ఫుద్దౌలా రెండో రోజు ఆటను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. -
దేశంలో పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు
న్యూఢిల్లీ: దేశంలోని పలు రాష్ట్రాలు భారీ వర్షాలతో అతలాకుతలమవుతున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో పశ్చిమ బెంగాల్, ఒడిశా, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లోని వివిధ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ(ఐఎండీ) హెచ్చరికలు జారీచేసింది.కోస్తా ఆంధ్ర ప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాల్లో ఈరోజు(సోమవారం) భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఛత్తీస్‌గఢ్‌లోని దక్షిణ ప్రాంతంలో సోమవారం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. రానున్న మూడు రోజుల్లో ఒడిశాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రాష్ట్రంలోని ఐదు జిల్లాల్లో ఐఎండీ రెడ్ అలర్ట్ ప్రకటించింది. మత్స్యకారులు సెప్టెంబర్ 11 వరకు సముద్రంలోకి వెళ్లవద్దని వాతావరణశాఖ అధికారులు సూచించారు.ఇది చదవండి: Surat: వినాయక మండపంపై రాళ్ల దాడి.. పలువురు అరెస్ట్ -
ప్రకాశం బ్యారేజ్ కు మళ్ళీ పెరుగుతున్న వరద
-
బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం
-
#VijayawadaFloods : చెప్పలేనంత కష్టం.. చెప్పుకోలేనంత నష్టం! (ఫొటోలు)
-
వచ్చే వారం రోజులూ వర్షాలే
సాక్షి, అమరావతి/ మహారాణిపేట(విశాఖ): రాష్ట్రాన్ని వర్షాలు భయపెడుతూనే ఉన్నాయి. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో వచ్చే వారం రోజులు రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ప్రస్తుతం కోస్తాంధ్ర, యానాం పరిసర ప్రాంతాల్లో ఒక ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి ఉంది. ఇది బుధవారం అర్ధరాత్రి లేదా గురువారం ఉదయానికల్లా అల్పపీడనంగా మారే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఆ తర్వాత వాయుగుండంగా మారడానికి అవకాశాలు ఉన్నట్లు పేర్కొంది. ప్రస్తుతం ఇది ఒడిశా వైపు కదిలే సూచనలు కనిపిస్తున్నాయి. దీని ప్రభావంతో రానున్న 48 గంటల్లో ఆంధ్రప్రదేశ్, యానాం, ఉత్తర కోస్తా ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఉరుములు, మెరుపులతోపాటు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని తెలిపారు. -
Updates: మళ్లీ బుడమేరు భయం.. భారీగా చేరుతున్న వరద
Telugu States Heavy Rains Latest News Updatesబుడమేరు ముంపు బాధితులకు చేదు అనుభవంవరద ఉధృతి తగ్గడంతో ఇళ్లకు వెళ్తున్న వాళ్లను అడ్డుకున్న పోలీసులుప్రైవేట్ వాహనాలను ఎక్కడికక్కడే అడ్డుకున్న వెనక్కి పంపిస్తున్న అధికారులుఎగువన వర్షాలతో బుడమేరుకు పెరుగుతున్న వరదమరోసారి ముంచెత్తే అవకాశంవిశాఖలో భారీ వర్షంవిశాఖపట్నంలో కురుస్తున్న భారీ వర్షంతీరం వెంట బలంగా వీస్తున్న గాలులుభద్రాద్రి కొత్తగూడెంభద్రాచలం వద్ద పెరుగుతున్న గోదావరి ఉధృతికొనసాగుతున్న మొదటి ప్రమాద హెచ్చరిక44 అడుగులుకి చేరిన గోదావరి వరద గోదావరి నది నుండి 9,74,666 క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల48 అడుగులు దాటితే రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేయనున్న అధికారులువరద నష్టం వివరాలు ప్రకటించిన ఏపీ ప్రభుత్వంభారీ వర్షాలు, వరదల కారణంగా వాటిల్లిన నష్టంపై ఏపీ ప్రభుత్వం ప్రకటన రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు 32 మంది మృతి చెందారుఎన్టీఆర్ జిల్లాలో 24 మంది, గుంటూరు జిల్లాలో ఏడుగురు, పల్నాడులో ఒకరు మృతి1,69,370 ఎకరాల్లో పంట, 18,424 ఎకరాల్లో ఉద్యాన పంటలకు నష్టం 2.34లక్షల మంది రైతులు నష్టపోయారు60వేల కోళ్లు, 222 పశువులు మృతి చెందాయివరదల వల్ల 22 సబ్స్టేషన్లు దెబ్బతినగా.. 3,973 కిలోమీటర్ల మేర రహదారులు ధ్వంసమమయ్యాయి 78 చెరువులు, కాలువలకు గండ్లు పడ్డాయివరదల వల్ల మొత్తం 6,44,536 మంది నష్టపోయారు193 రిలీఫ్ క్యాంపుల్లో 42,707 మంది ఆశ్రయం పొందుతున్నారువరద బాధితులను ఆదుకునేందుకు 50 ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి6 హెలికాప్టర్లు, 228 బోట్లు పనిచేస్తున్నాయి. 317 మంది గజ ఈతగాళ్లు సహాయక చర్యల్లో పాల్గొన్నారునిజామాబాద్శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు పోటెత్తిన వరద41 గేట్లను ఎత్తి నీటిని విడుదల చేసిన అధికారులుఇన్ ఫ్లో 3.5 లక్షల క్యూసెక్కులుఔట్ ఫ్లో 3.58 లక్షల క్యూసెక్కులుప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1090 అడుగులు, 90 టీఎంసీలుప్రస్తుతం 1089 అడుగులు, 75 టీఎంసీలుపెద్దపల్లి అంతర్గాం మండలం శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్ట్ కు ఎగువన కడెం, ఎస్సారెస్పీ ప్రాజెక్టు ల నుంచి భారీగా వరద నీటి ప్రవాహంఇన్ ఫ్లో 3, 61, 885 క్యూసెక్కులు.. ఔట్ ఫ్లో 2, 44, 080 క్యూసెక్కులుప్రాజెక్ట్ పూర్తి స్థాయి సామర్థ్యం 20.175 టీఎంసీలుప్రస్తుత నిల్వ 14. 0918 టీఎంసీ లు.ప్రాజెక్ట్ కు సంబంధించిన 22 గేట్లు తెరచి సుమారు 3 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్న అధికారులుభద్రాద్రి కొత్తగూడెంకిన్నెరసాని వాగులో చిక్కుకున్న ఏడుగురుపాల్వంచ మండలం దంతెలబోర పంచాయతీ పరిధిలో కిన్నెరసాని వాగులో చిక్కుకున్న ఏడుగురువీరిలో ముగ్గురు పశువుల కాపర్లు దంతెలబోర గ్రామానికి చెందినవారుగంగాదేవిగుప్పకు చెందిన నలుగురు చేపల వేటకు వెళ్లి చిక్కుకున్నారురక్షించేందుకు ప్రయత్నిస్తున్న అధికారులుసింగ్నగర్ ఖాళీసింగ్నగర్ను ఖాళీ చేస్తున్న జనాలుఇంకా వరదలోనే ఉన్న కాలనీఫ్లై ఓవర్‌పై రద్దీమరోసారి భయపెడుతున్న బుడమేరు భారీ వర్షాల కారణంగా బుడమేరులోకి వరద ఉధృతి ఎగువన కురిసిన భారీ వర్షాలతో నందివాడలో కూడా బుడమేరు ఉగ్రరూపంవంతెనకు సమానంగా బుడమేరు ప్రవాహం గండి పడిన చోట ప్రస్తుతం బుడమేరు ప్రవాహం మూడు అడుగులకు చేరికముంపు ప్రభావిత ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలింపు బుడమేరు పరివాహాక ప్రాంతాల్లో బలహీనంగా ఉన్న గట్లకు గండి పడకుండా ఇసుక బస్తాలు ఐదు దశాబ్దాల్లో ఈ తరహా బుడమేరులో ఇతంటి ఉధృతి చూడలేదని చెబుతున్న స్థానికులు ఇప్పటికే విజయవాడను ముంచెత్తిన బుడమేరు పూర్తి కథనం కోసం క్లిక్ చేయండికృష్ణాదొంగలుగా మారిన రెవెన్యూ సిబ్బంది!అవనిగడ్డలో రెవెన్యూ ఉద్యోగుల చేతివాటంగత అర్ధరాత్రి కుటుంబ సభ్యులతో కలిసి దొంగలుగా మారిన రెవెన్యూ ఉద్యోగులు.వరద బాధితుల కోసం ఏర్పాటుచేసిన నిత్యావసర వస్తువులను అర్ధరాత్రి బైకులపై ఎత్తుకెళ్లిన రెవెన్యూ ఉద్యోగులుతూర్పుగోదావరిగోదావరిలో పెరుగుతున్న వరదధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద 9.3 అడుగుల వరద నీటిమట్టం నమోదుఆరు లక్షల 61 వేల క్యూసెక్కులు నీరు సముద్రంలో విడుదల1800 క్యూసెక్కుల నీరు డెల్టా కాలువలకు సరఫరావరద నీటిమట్టం మరింత పెరిగే అవకాశం ఉందంటున్న అధికారులుకృష్ణాతెన్నేరు లో బుడమేరు, వన్నేరు కాల్వలకు గండి.ఉధృతంగా ప్రవహిస్తున్న వరద నీరు.ప్రధాన రహదారి లోకి చేరిన వరద నీరు.జలదిగ్బంధంలో ఎస్సీ, బీసీ కాలనీలు.నీట మునిగిన పంట పొలాలు.వరద నీరు గ్రామంలోకి రాకుండా చెరువులోకి మళ్లించుకుంటున్న గ్రామస్తులు.వరద నీటి నుంచి కాపాడాలని గ్రామస్తుల ఆవేదన.పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసిన అధికారులు.కాలువలో ఆహారం!!వరద బాధితులకు అందించాల్సిన భోజనాలు రోడ్డుపాలుఆహారం కోసం ఎదురు చూపులు చూసినా వరద బాధితులకు అందని భోజనాలువరద బాధితులకు అందవలసిన భోజనాలు ఏలూరు కాలువలో హైవే పక్కన పడేసిన వైనంరూ.120 కోట్లు విరాళం ప్రకటించిన ఏపీ ఎన్టీవోఏపీలో వరద బాధితులకు సహాయార్థం భారీ విరాళం ప్రకటించిన ఎన్జీవో నేతలుఒక రోజు బేసిక్ పే ద్వారా రూ. 120 కోట్ల విరాళం ఇస్తున్నట్లు వెల్లడిఏపీ వరద నష్టం.. కేంద్రం బృందం ఏర్పాటుఏపీలో వరదల నష్టం అంచనాకు నిపుణుల బృందం ఏర్పాటుఅదనపు కార్యదర్శి నేతృత్వంలో నిపుణుల బృందాన్ని ఏర్పాటు చేసిన కేంద్ర హోంశాఖ వివరాలు వెల్లడించిన కేంద్ర మంత్రి అమిత్ షానిపుణుల బృందం ఆంధ్రప్రదేశ్‌లోని వరద ప్రభావిత ప్రాంతాలను సందర్శిస్తుందని వెల్లడిఏపీలో వరదల పరిస్థితిని మోదీ ప్రభుత్వం నిశితంగా పరిశీలిస్తోందని తెలిపిన కేంద్ర మంత్రిచంద్రబాబు తప్పిదం వల్లే.. వైఎస్ జగన్ వరద బాధితుల కోసం చంద్రబాబు ప్రభుత్వం ఏం చేయడం లేదుతన ఇంట్లోకి నీళ్లు వచ్చాయి కాబ్టటే చంద్రబాబు కలెక్టరేట్‌కు చేరారువాతావరణ శాఖ హెచ్చరికలు చేసినా.. చంద్రబాబు నిర్లక్ష్యం చేశారుఇప్పుడు వరద సహాయక చర్యల్లోనూ అలసత్వం ప్రదర్శిస్తున్నారుమా హయాంలో వరదలప్పుడు.. అప్రమత్తంగా ఉన్నాంరిలీఫ్ క్యాంపులు ముందుగానే ఏర్పాటు చేశాం.. ప్రజల్ని తరలించాంవలంటీర్లు, సచివాలయం సిబ్బంది.. బాధితులను క్యాంపులకు తరలించేవాళ్లుకానీ, ఇప్పుడు ఎక్కడా రిలీఫ్ క్యాంపులు ఏర్పాటు చేయలేదుబాధితుల్ని ఆదుకోవడం చంద్రబాబు పూర్తిగా విఫలం అయ్యారు32 మంది ప్రాణాలు కోల్పోయారు.. చంద్రబాబు క్షమాపణలు చెప్పాల్సిందేమృతులకు రూ.25 లక్షల పరిహారం, ప్రతీ ఇంటికి రూ.50 వేలు ఇవ్వాల్సిందేతాను తప్పు చేసి అధికారులను వేలెత్తి చూపిస్తున్నారుఇప్పటికైనా చంద్రబాబు తన తప్పును ఒప్పుకోవాలిబుడమేరు గేట్లు ఎత్తింది ఎవరు?చంద్రబాబు ఇంటిని కాపాడేందుకే గేట్లు ఎత్తారుఆ నీరంతా విజయవాడను ముంచెత్తిందిఎక్కువ మంది చనిపోయిన పరిస్థితి కనిపిస్తోందిసంబంధిత వార్త: చంద్రబాబు దగ్గరే తప్పు.. సీఎంగా అర్హుడేనా?: వైఎస్ జగన్కాకినాడ అల్పపీడన ప్రభావంతో ఏపీలో మొదలైన భారీర్షాలుఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో పలు చోట్ల దంచికొడుతున్న వానకోనసీమ జిల్లాలో 46.5 మి.మీ వర్షపాతం.గోదావరి నదికి పెరుగుతున్న వరద ప్రవాహంధవళేశ్వరం బ్యారేజ్ నుండి దిగువకు 6 లక్షల 61 వేల క్యూసెక్ ల నీరు విడుదల.రానున్న రెండు మూడు రోజుల్లో మరింతగా పెరిగే గోదావరి వరదకోనసీమ లంక గ్రామలను అప్రమత్తం చేస్తున్న అధికారులు.వర్షాల కారణంగా పలు లోతట్టు ప్రాంతాల్లో చేరిన వరద నీరుకాకినాడ జిల్లాలో 94.6 వర్షపాతం నమోదు.ఏలేరు ప్రాజెక్టు లో చేరుకున్న 20 tmc ల వరద నీరు.దిగువకు 1500 క్యూసెక్ ల నీరు విడుదల.పిఠాపురం, గొల్లప్రోలు, ప్రత్తిపాడు మండలల్లో పలు గ్రామాల్లో ప్రజలను అప్రమత్తం చేసిన అధికారులుతుఫాన్ హెచ్చరికల నేపసద్యంలో వేటను నిలిపివేయాలని మత్స్యశాఖ అధికారుల ఆదేశాలు. విజయవాడ వరద ప్రభావిత ప్రాంతంలో జగన్ పర్యటనవిజయవాడ వరద ప్రభావిత ప్రాంతాల్లో వైఎస్ జగన్మోహన్రెడ్డి పర్యటన. ఓల్డ్ ఆర్ఆర్ (రాజరాజేశ్వరి) పేటలో బాధితులతో మాట్లాడుతున్న జగన్సమస్యలు అడిగి తెలుసుకుంటున్న వైస్సార్సీపీ అధినేతప్రభుత్వం నుంచి ఎలాంటి సాయం అందలేదని బాధితుల ఆవేదనమొన్నీమధ్యే సింగ్‌నగర్‌లో పర్యటించిన జగన్అక్కడి వరద పరిస్థితి.. బాధితుల అవస్థలు చూసి చలించి పోయిన జగన్వరదలకు మానవ తప్పిదమే కారణమన్న జగన్నిజామాబాద్ రెంజల్ మండల కందకుర్తి వద్ద గోదావరి నది ఉధృతి తో వంతెనను అనుకోని వరద ప్రవాహంబ్రిడ్జి పై నుంచి రవాణా సదుపాయంద్దు తెలంగాణ,మహరాష్ట్ర మధ్య నిలిచిన రాకపోకలుగోదావరికి పెరుగుతున్న వదర43 అడుగులకు చేరిన నీటి మట్టంమొదటి ప్రమాద హెచ్చరిక జారీ కేంద్రం అసంతృప్తి.. తెలంగాణ సీఎస్‌కు లేఖతెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి కేంద్ర హోంశాఖ లేఖతెలంగాణ వరద నష్టం వివరాలు కేంద్రానికి పంపకపోవడం పై అసంతృప్తితెలంగాణలో వరద నష్టం వివరాలు నిర్ణీత ఫార్మాట్లో తక్షణమే పంపాలని కేంద్ర హోమ్ శాఖ సూచన1345 కోట్ల రూపాయల ఎస్ డి ఆర్ ఎఫ్ నిధులు ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం వద్ద అందుబాటులో ఉన్నాయని వెల్లడించిన కేంద్రంవరదల్లో సాయం చేసినందుకు ఇప్పటికే 12 ఎన్ డి ఆర్ ఎఫ్ దళాలు, రెండు హెలికాప్టర్లు పంపించినట్లు వెల్లడించిన కేంద్ర హోం శాఖఎస్డిఆర్ఎఫ్ నిధికి కేంద్రం వాటా నిధులు విడుదలకు తక్షణమే వివరాలు పంపాలని ఆదేశంజూన్ లో 208 కోట్ల రూపాయల విడుదలకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి వినతి రాలేదన్న కేంద్రంఇదివరకు ఖర్చు చేసిన వాటి యుటీలైజేషన్ సర్టిఫికెట్స్, వరద నష్టం వివరాలు పంపాలని కోరిన కేంద్రంవరద నష్టం వివరాలను ఎప్పటికప్పుడు రోజువారీగా పంపాలని కోరిన కేంద్ర హోంశాఖవిజయవాడ: విజయవాడకు మరో ముప్పు ఎన్టీఆర్ జిల్లాకు ఆరెంజ్ అలెర్ట్ విజయవడలో సుమారు 7 సెంమీ అతిభారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం రానున్న 24 గంటల్లో విజయవాడ పరిసర ప్రాంతాల్లో కుండపోత వాన ప్రజలు అప్రమత్తంగా ఉండాలి అప్రమత్తంగా ఉండాలి - విశాఖ వాతావరణ కేంద్రంఎన్టీఆర్ జిల్లా : బుడమేరులో కొనసాగుతున్న వరద ఉధృతికవులూరు - ఈలప్రోలు మధ్య ఉధృతంగా ప్రవహిస్తున్న బుడమేరు వరదగడచిన 24 గంటల్లో జి.కొండూరు మండలంలో 9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదుఎగువున కురిసిన వర్షాలతో కొంత పెరిగిన వరదనందివాడలో ఉధృతంగా ప్రవహిస్తున్న బుడమేరుముంపు ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలింపుబలహీనంగా ఉన్న బుడమేరు పరీవాహక గట్లకు గండి పడకుండా ఇసుక బస్తాలు వేస్తున్న ప్రజలుశ్రీశైలం :నంద్యాల శ్రీశైలం జలాశయానికి తగ్గిన వరదజలాశయం గేట్లు అన్ని మూసివేసిన అధికారులుఇన్ ఫ్లో : 1,43,199 క్యూసెక్కులుఔట్ ఫ్లో : 67,897 క్యూసెక్కులుపూర్తి స్దాయి నీటి మట్టం 885 అడుగులుప్రస్తుతం : 883.50 అడుగులుపూర్తిస్థాయి నీటి నిల్వ : 215.8070 టీఎంసీలుప్రస్తుతం : 208.7 టీఎంసీలుకుడి,ఎడమ జల విద్యుత్ కేంద్రాలలో కొనసాగుతున్న విద్యుత్ ఉత్పత్తివిజయవాడ :విజయవాడ ప్రభుత్వాసుపత్రి మార్చురీ వద్ద పడిగాపులు పడుతున్న మృతుల కుటుంబీకులువరదల కారణంగా చనిపోయిన వారి మృతదేహాలు మార్చురీకి తరలింపువరద నీటిలో ఉన్న మృతదేహాలను మార్చురీకి తీసుకురావడంలోనూ నిర్లక్ష్యంసీఎం చంద్రబాబుకు చెప్పుకుంటే కానీ మృతదేహాలను తరలించేందుకు సహకరించని వైనంప్రస్తుతం విజయవాడ ప్రభుత్వాసుపత్రి మార్చురీలో 12 మృతదేహాలురెండు రోజుల నుంచి మృతదేహాల కోసం మార్చురీవద్దే నిరీక్షిస్తున్న కుటుంబీకులుపోస్టుమార్టం ప్రక్రియ పూర్తిచేసి ఇచ్చేందుకు జాప్యం చేస్తున్న అధికారులు, పోలీసులువిజయవాడ :విజయవాడ ముంపులోనే వేలాది వాహనాలుబుడమేరు చుట్టుపక్కల ఉన్న కాలనీల్లో ఇప్పటికీ పూర్తిగా వీడని ముంపుముంపులో నుండి ఇప్పుడిప్పుడే బయట పడుతున్న వాహనాలునాలుగైదు రోజులుగా నీటిలోనే బైకులు, కారులు, ఆటోలుఒక్కొక్కటిగా బయటకు తీసి షెడ్లకు తరలిస్తున్న ఓనర్లుఎన్టీఆర్ జిల్లా:తిరువూరులో మల్లమ్మ చెరువుకు పొంచి ఉన్న ప్రమాదంభారీ వర్షాలకు కోతకు గురైన చెరువుకట్టగత రాత్రి నుండి కురుస్తున్న వర్షానికి చెరువుకు పోటెత్తుతున్న వరదనీరుచెరువు పొంగితే కట్ట పూర్తిగా తెగిపోయే అవకాశంఆందోళన చెందుతున్న ఆయకట్ట కింద ఉన్న రైతులుఇప్పటికే భారీ వరదలతో పొలాల్లో వేసిన ఇసుక మేటఅటుగా అక్కపాలెం గ్రామానికి వెళ్లే రోడ్డు వరదలకు ధ్వంసంఖమ్మం జిల్లా :మున్నేరు వరద ప్రభావిత ముంపు ప్రాంతాల్లో రెండవ రోజు ముమ్మరంగా కొనసాగుతున్న 525 మంది ట్రైనీ కానిస్టేబుళ్ల సహాయక చర్యలువర్షాల వరద ఉద్ధృతి తగ్గడంతో చురుగ్గా సాగుతున్న పారిశుద్ధ్య పనులు ఇళ్లలోకి భారీగా చేరిన బురదను వాటర్ ట్యాంకర్లు ద్వారా తొలగింపురోడ్లపై విరిగి పడిన విద్యుత్ స్తంభాలు తొలగించి పునరుద్ధరణ పనులు వేగవంతం చేస్తున్న పోలీసులువరద బాధితులకు అండగా ధంసాలపూరం,శ్రీనివాస్ నగర్, ప్రకాశ్ నగర్,రాజీవ్ గృహకల్ప, జలగం నగర్, కవిరాజ్ నగర్, బొక్కలగడ్డ ముంపు ప్రాంతాలలో స్వయంగా పర్యటించి పరిస్థితులను పర్యవేక్షించిన పోలీస్ కమిషనర్ సునీల్ దత్ ఎన్టీఆర్ జిల్లా :ఎన్టీఆర్ జిల్లా మైలవరంలోనూ వర్షాలుఅర్ధరాత్రి నుంచి మైలవరం ప్రాంతంలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షంమళ్ళీ బుడమేరుకు వరద పెరిగే అవకాశం ఉందిలోతట్టు ప్రాంతాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ప్రచారం విజయవాడ :వరద బాధితులకు వాలంటీర్లే దిక్కుఅధికారులు, పోలీసులు వెళ్లలేని చోటుకు వెళ్తున్న వాలంటీర్లుట్రాక్టర్లలో ఆహారం, మంచినీరు తీసుకుని మారుమూల ప్రాంతాలకు వాలంటీర్లునాలుగు రోజుల తర్వాత బాధితులకు అందుతున్న కాస్తంత ఆహారం, నీరుజగన్ నియమించిన వాలంటీర్లే చంద్రబాబు ప్రభుత్వానికి దిక్కువాలంటీర్లను చూసి సంతోషిస్తున్న బాధితులుఈ పని నాలుగు రోజుల క్రితమే చేస్తే తమ ఆకలి తీరేదంటున్న బాధితులుకోనసీమ జిల్లా :కొత్తపేట నియోజకవర్గంవ్యాప్తంగా తెల్లవారుజాము నుండి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షంవర్షం కారణంగా పాఠశాలలకు కాలేజీలకు సెలవు ప్రకటించిన అధికారులు ముమ్మిడివరం నియోజకవర్గంలో ఎడతెరిపిలేని భారీ వర్షం.తహిసిల్దార్ వారి కార్యాలయం మరియు పోలీస్ స్టేషన్లో చేరిన వర్షపునీరుభద్రాద్రి కొత్తగూడెం జిల్లా :భారీ వర్షాలతో కొత్తగూడెం ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్సెల్ఫీల కోసం వాగులు,వంకలు,నదులు వద్దకు వెళ్లి ప్రమాదాలకు గురి కావొద్దువరద నీటితో నిండిపోయిన రోడ్లను దాటడానికి ప్రయత్నించవద్దువర్షాల కారణంగా రోడ్లు బురదమయంగా మారాయి.వాహనాల టైర్లు జారి ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉందికావున వాహనదారులు నెమ్మదిగా తమ వాహనాలతో ప్రయాణించాలిభద్రాచలం వద్ద గోదావరి నది పెరుగుతున్నది కావున పరిసర ప్రాంత ప్రజలు అధికారుల సూచనలను పాటిస్తూ అప్రమత్తంగా ఉండాలి.జిల్లా అధికార యంత్రాంగం సూచించిన సూచనలు మేరకు ఎప్పటికప్పుడు ప్రజలు అప్రమత్తంగా ఉంటూ అధికారులకు సహకరించాలి.ఏదైనా ప్రమాదం ఎదురైతే వెంటనే డయల్ 100 కు ఫోన్ చేసి పోలీసు వారి సహాయ సహకారాలు వినియోగించుకోవాలి.జిల్లా పోలీస్ శాఖ 24/7 ప్రజలకు అందుబాటులో ఉంటుంది.ప్రజల రక్షణ కొరకు తప్పనిసరి పరిస్థితుల్లో పోలీసు వారు విధించిన ఆంక్షలును ఎవరైనా అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలు తప్పవువిజయవాడ : వరద ముంపు బాధితులకు పాల ప్యాకెట్లు, మంచినీళ్ళ బాటిల్స్ అందించిన విజయవాడ డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గతూర్పు నియోజకవర్గ ఇన్చార్జ్ దేవినేని అవినాష్ ఆదేశాలతోనే ఈ కార్యక్రమం చేస్తున్నాంవరద బాధితులను ఆదుకోవటం ప్రతి ఒక్కరి బాధ్యతవరద బాధితులను ఆదుకోవడంలో కూటమి సర్కార్ విఫలమైందిముందుచూపు చర్య లేకపోవడంతోటే విజయవాడకు విపత్తు కలిగిందిచంటి పిల్లలు మహిళలు వృద్ధులు అనేకమంది వరదలో ఇబ్బంది పడుతున్నారుతన ఇంటిని కాపాడుకొనే క్రమంలోనే విజయవాడ ను ముంచేసిన చంద్రబాబువరద బాధిత కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించి ఆదుకోవాలిప్రజలందరూ కూడా తమవంతుగా సామాజిక బాధ్యత తీసుకునే తరుణమిదినంద్యాల జిల్లా :శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద నీరుశ్రీశైలం జలాశయం 6 గేట్లు మూసివేత, 4 గేట్ల ద్వారా నీటిని విడుదల చేస్తున్న అధికారులుఇన్ ఫ్లో :1,43,199 క్యూసెక్కులుఔట్ ఫ్లో : 1,81,235 క్యూసెక్కులుపూర్తి స్దాయి నీటి మట్టం 885.00 అడుగులుప్రస్తుతం : 883.50 అడుగులుపూర్తిస్థాయి నీటి నిల్వ : 215.8070 టీఎంసీలుప్రస్తుతం : 208.7 టీఎంసీలుకుడి,ఎడమ జల విద్యుత్ కేంద్రాలలో కొనసాగుతున్న విద్యుత్ ఉత్పత్తి తూర్పుగోదావరి జిల్లా : తూర్పుగోదావరి, కోనసీమ జిల్లాలో తెల్లవారుజాము నుండి కురుస్తున్న వర్షంరౌతుల ప్రాంతాల్లో చేరిన వర్షపు నీరురాజమండ్రిలో లలితా నగర్ రైల్వే స్టేషన్ రోడ్డు , ఆల్కాట్ గార్డెన్, ఆర్యాపురం తుమ్మలోవ ప్రాంతాలు జలమయంకోనసీమలో పలు ప్రాంతాల్లో వరి చేలలో నిలిచిన వర్షపు నీరుఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురవడంతో గోదావరి, శబరి నదుల్లో పెరుగుతున్న నీటిమట్టంఏలూరు జిల్లా : అల్పపీడనం కారణంగా కురుస్తున్న భారీ వర్షాలకు ఏజెన్సీలో పొంగుతున్న వాగులుబుట్టాయిగూడెం మండలం రెడ్డి గణపవరం దగ్గర రహదారిపై ప్రవహిస్తున్న జల్లేరు వాగుకొండ వాగులు వస్తున్న కారణంగా ప్రజలు వాగులు దాటవద్దని ప్రమాదకరమని తెలిపిన అధికారులుజంగారెడ్డిగూడెం మండలం పట్టిన పాలెం వద్ద డైవర్షన్రహదారిపై జల్లేరు వాగు ప్రవహించడంతో సుమారు 20 గ్రామాలకు నిలిచిపోయిన రాక పోకలు.వైజాగ్ : ఏపీలో మరోసారి భారీ నుంచి అతిభారీ వర్షాలు బంగాళాఖాతంలో అల్పపీడనం క్రమంగా బలపడే అవకాశం తుఫానుగా మారే ఛాన్స్ వెదర్ బులిటెన్ పూర్తి వివరాలు వెల్లడించనున్న వాతావరణ శాఖఅల్లూరి సీతారామరాజు జిల్లా: చింతూరు ఏజెన్సీ వ్యాప్తంగా అడపాదడపా వర్షాలుఎగువ ప్రాంతంలో వర్షాలకు కూనవరం శబరి-గోదావరి నదుల సంగమం వద్ద పెరుగుతున్న గోదావరి నీటిమట్టంచింతూరు ఐటీడీఏ కార్యాలయంలో ఫ్లడ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటుజిల్లా కలెక్టర్ పర్యవేక్షణలో వరద సహాయక చర్యలు చేపట్టేందుకు రంగం సిద్ధండాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా :పి గన్నవరం నియోజకవర్గంలో ఎడతెరిపి లేని వర్షంఇబ్బంది పడుతున్న వాహనదారులుభారీ వర్షం కారణంగా జిల్లాలోని విద్యా సంస్థలకు సెలలు ప్రకటించిన కలెక్టర్ మహేష్ కుమార్తెలుగు రాష్ట్రాలకు చిరంజీవి భారీ విరాళం :రెండు తెలుగు రాష్ట్రాల సీఎం రిలీఫ్ ఫండ్ కు కోటి రూపాయల విరాళాన్ని ప్రకటించిన మెగాస్టార్ చిరంజీవితెలుగు రాష్ట్రాల్లో వరద ప్రభావం వల్ల ప్రజలకు కలిగిన, కలుగుతున్న కష్టాలు నన్ను కలిచివేస్తున్నాయి పదుల సంఖ్యలో అమాయక ప్రాణాలు కోల్పోవడం ఎంతో విషాదకరంతెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల నిర్దేశంలో రెండు ప్రభుత్వాలు శాయశక్తులా పరిస్థితిని మెరుగు పరచడానికి కృషి చేస్తున్నాయిమనందరం ఏదో విధంగా సహాయక చర్యల్లో పాలుపంచుకోవాల్సిన అవసరం వుందిరెండు రాష్ట్రాల లో ప్రజల ఉపశమనానికి తోడ్పాటుగా నా వంతు కోటి రూపాయలు (ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్‌కు చెరో 50 లక్షలు) విరాళంగా ప్రకటిస్తున్నానుఈ విపత్కర పరిస్థితులు తొందరగా తొలగిపోవాలని, ప్రజలంతా సురక్షితంగా ఉండాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను కామారెడ్డి జిల్లా :నిజాం సాగర్ ప్రాజెక్టులోకి కొనసాగుతున్న వరదఇన్ ఫ్లో 39.157 క్యూసెక్కులుపూర్తిస్థాయి నీటి మట్టం 1405 అడుగులు, 17 టీఎంసీలుప్రస్తుత నీటిమట్టం 1403అడుగులు, 14 టీఎంసీలునిజామాబాద్ జిల్లా :శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు పోటెత్తిన వరద41 గేట్లను ఎత్తి నీటిని విడుదల చేసిన అధికారులుఇన్ ఫ్లో 2.81 లక్షల క్యూసెక్కులుఔట్ ఫ్లో 1.75 లక్షల క్యూసెక్కులు ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1090 అడుగులు, 90 టీఎంసీలుప్రస్తుతం 1089 అడుగులు, 74 టీఎంసీలువిజయవాడ : గోదావరికి స్వల్పంగా పెరుగుతున్న వరదఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరికభద్రాచలం వద్ద 42.2 అడుగుల నీటి మట్టంధవళేశ్వరం వద్ద ప్రస్తుత ఇన్ ఫ్లో 3,05,043, ఔట్ ఫ్లో 3,12,057 లక్షల క్యూసెక్కులుప్రభావిత 6 జిల్లాల అధికార యంత్రంగాన్ని అప్రమత్తం చేసిన విపత్తుల సంస్థగోదావరి పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. రోణంకి కూర్మనాధ్, మేనేజింగ్ డైరెక్టర్, విపత్తుల నిర్వహణ సంస్థజయశంకర్ భూపాలపల్లి జిల్లా :కాలేశ్వరం వద్ద మొదటి ప్రమాద హెచ్చరికకు చేరువలో ఉధృతంగా గోదావరిగోదావరి పుష్కర ఘాట్ల వద్ద 11.710 మీటర్ల ఎత్తులో ప్రవహిస్తున్న ఉభయ నదులుమేడిగడ్డ లక్ష్మీ బ్యారేజీకి కొనసాగుతున్న వరదమేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ 85 గేట్లు ఎత్తి 8,85,620 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల ఇన్ ప్లో ఔట్ ఫ్లో 8,85,620 క్యూసెక్కులులక్ష్మీ బ్యారేజ్ పూర్తిస్థాయి నీటినిలువ సామర్థ్యం 16.17 టీఎంసీలుభద్రాద్రి కొత్తగూడెం జిల్లా : భద్రాచలం వద్ధ కొనసాగుతున్న గోదావరి ఉధృతిమోదటి ప్రమాద హెచ్చరికకి చేరువలో గోదావరి ప్రవాహంఈరోజు ఉదయానికి 42.2 అడుగులకి చేరుకున్న గోదావరి నీటి మట్టం43 అడుగులు దాటితే మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేయనున్న అధికారులు ఇప్పటికే నియోజకవర్గంలోని ముంపు గ్రామలతో పాటు , భద్రాచలం పట్టణం ప్రజల్ని అప్రమత్త చేసిన అధికారులుఎటువంటి ఇబ్బంది తలేత్తకుండా ముందస్తు సహాయక చర్యలకి ఆదేశించిన జిల్లా కలెక్టర్విజయవాడ :వరదల్లో బయటపడ్డ మృతదేహాలుమల్లిపాముల వర్ధన్(18)మాత సన్యాసి అప్పుడు(85)గుంజ రమణ(48)వజ్రాల కోటేశ్వరరావు(41)కె దూరగారవు(16)కె వెంకట రమణారెడ్డి(50)నాగ దుర్గారావు(33)పలిశెట్టి చంద్రశేఖర్(32)కొడాలి యశ్వంత్(20)మరో నాలుగు గుర్తు తెలియని మృతదేహాలు లభ్యంవిజయవాడ :వరద బాధితులకు అండగా వైఎస్సార్సీపీలక్ష పాల ప్యాకెట్లు ,రెండు లక్షల వాటర్ బాటిళ్లు సిద్ధంవరద ప్రాంతాల్లో పంపిణీ చేసేందుకు ట్రాక్టర్లు,ప్రొక్లెయిన్ల ద్వారా పంపించిన మాజీ ఎమ్మెల్యేలు వెలంపల్లి శ్రీనివాస్ , మల్లాది విష్ణువిజయవాడ :విజయవాడలో వరద విషాదంనిన్న 12 మృత దేహాలు వరదల్లో లభ్యం32 కి చేరిన వరద మరణాలుఇంకా ముంపులోనే పలు కాలనీలువరద తగ్గుతున్న చోట ఎవరికి వారే బయటకు వస్తున్న బాధితులుఇళ్ళు, వాహనాలు వదిలేసి బిక్కు బిక్కుమంటు వచ్చేస్తున్న వరద బాధితులు విజవాడ : ఇంకా వరద ముప్పులోనే విజయవాడఎన్టీఆర్ జిల్లా స్కూళ్లకు సెలవు జిల్లాలో కురుస్తున్న వర్షాలు, వరద ఉధృతి బుధవారం జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు సెలవుజిల్లా కలెక్టర్ జి.సృజన ప్రకటనపెద్దపల్లి జిల్లా:శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్ట్ కు ఎగువన కడెం, ఎస్సారెస్పీ ప్రాజెక్టు ల నుంచి భారీగా వరద నీటి ప్రవాహంఇన్ ఫ్లో 4, 72, 428 క్యూసెక్కులుఔట్ ఫ్లో 4, 59, 912 క్యూసెక్కులుప్రాజెక్ట్ పూర్తి స్థాయి సామర్థ్యం 20.175 టీఎంసీలుప్రస్తుత నిల్వ 14. 5606 టీఎంసీ లు.ప్రాజెక్ట్ కు సంబంధించిన 32 గేట్లు తెరచి సుమారు 5 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్న అధికారులునది పరివాహక గ్రామాల ప్రజలు, మత్స్యకారులు, పశువుల కాపరులు జాగ్రత్తగా ఉండాలని అధికారుల హెచ్చరికలుపెద్దపల్లి- మంచిర్యాల జిల్లాలను కలుపుతూ శ్రీ పాద ఎల్లంపల్లి ప్రాజెక్టుపై ఉన్న రహదారిపై నుంచి రాకపోకలు నిలిపివేసిన అధికారులుపెద్దపల్లి జిల్లా :రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో నాలుగు రోజుల నుండి భారీగా కురుస్తున్న వర్షాలురామగుండం రీజియన్ లోని నాలుగు ఓసీపీలలో నిలిచిపోయిన బొగ్గు ఉత్పత్తి, రవాణానేటికీ సుమారు 2 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తికి ఆటంకంప్రాజెక్టు క్వారీ పని స్థలాలలో భారీగా నిలిచిన వరద నీరు, బురదతో కదలని భారీ యంత్రాలు -
International Day of Charity observed: వరదెత్తిన కష్టాల్లో కరుణే ప్రదానం
ఖమ్మం గుమ్మంలో వరద. బెజవాడ కంటిలో బుడమేరు ΄పొంగు. ఆకలి ఆర్తనాదాలు తెలుగువారిని చుట్టుముట్టాయి. ఈ సమయంలో సాయం చేసే చేతులే కాదు దాతృత్వం చూపే గుండెలూ కావాలి. నోట్ బుక్స్ తడిసిపోయిన ఒక చిన్నారికి స్కూల్ బ్యాగ్‌తో మొదలు గుడిసె కూలిన ఒక పేదవాడికి చిన్న ఆసరా వరకూ దాతృత్వంతో సాయం చేయవచ్చు. ప్రభుత్వాలు చేసే పనులు ప్రభుత్వాలు చేస్తాయి. మనుషులం మనం. ఇవ్వడం తెలిసినవాళ్లం. ఇది ఇవ్వాల్సిన సమయం.‘దానం చేయడం వల్ల ఎవరూ పేద కాబోరు’ అంటుంది ఆనీ ఫ్రాంక్ అనే యూదు బాలిక. ‘ఎంత దానం ఇస్తున్నావన్నది కాదు... ఎంత ప్రేమగా దానం ఇస్తున్నావన్నదే ముఖ్యం‘ అంది మదర్ థెరిసా. ‘దానమీయని వాడు ధన్యుండుగాడయ’ అన్నాడు వేమన. ‘దానం చేయనివారు భూమికి పెద్ద భారం’ అన్నాడు శ్రీనాథుడు. ‘పిట్టకు చారెడు గింజలు... చెట్టుకు చెంబుడు నీళ్లు... ఇవి అందించడానికి మించిన మానవ జన్మకు పరమార్థం ఏముటుంది’ అంటుంది ఓ కథలోని బామ్మ. దానం మనిషి గుణం. ముఖ్యంగా సాటి మనిషి కష్టకాలంలో ఉన్నప్పుడు దానం చేయడానికి తప్పకుండా ముందుకు రావాలి.మనది దానకర్ణుడి నేలమనది దాన కర్ణుడి నేల. ఒకసారి కృష్ణుడు కర్ణుడిని చూడటానికి వెళితే ఆ సమయానికి అతను స్నానానికి సిద్ధమవుతూ రత్నాలు ΄÷దిగిన గిన్నెలో నూనె తలకు రాసుకుంటున్నాడట. కృష్ణుడు ఆ గిన్నె చూసి ‘కర్ణా.. గిన్నె చాలా బాగుంది ఇస్తావా’ అనగానే ఎడమ చేతిలో ఉన్న గిన్నెను ‘తీసుకో’ అని అదే చేత్తో ఇచ్చేశాడట కర్ణుడు. కృష్ణుడు ఆశ్చర్యపోయి ‘అదేమిటి కర్ణా... ఎడమ చేత్తోనే ఇచ్చేశావు’ అనంటే కర్ణుడు ‘అంతే కృష్ణా. దానంలో ఆలస్యం కూడదు. నువ్వు అడిగాక ఎడమ చేతిలో నుంచి కుడి చేతిలోకి మారేలోపు నా మనసు మారొచ్చు. లేదా నాకు మృత్యువు సమీపించవచ్చు. అందుకే ఇచ్చేశాను’ అన్నాడట. లోకంలో ఎందరో చక్రవర్తులు పుట్టి ఉంటారు, గిట్టి ఉంటారు. కాని దానం కోసం నిలిచిన శిభి, బలి చక్రవర్తులే ఇన్ని వేల ఏళ్ల తర్వాత కూడా శ్లాఘించబడుతున్నారు.వరదల్లో అన్నం పెట్టిన తల్లితూర్పు గోదావరి జిల్లాలోని లంకలగన్నవరంలో తరచూ వరదల చేత లేదంటే ΄÷లాలు పండకపోవడం చేత జనం ఆకలితో అల్లాడుతుంటే వారి కోసమని అన్నదానం మొదలెట్టి ఆంధ్రుల అన్నపూర్ణగా కొలవబడుతున్న తల్లి డొక్కా సీతమ్మ (1841–1909)ను ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి. మన దగ్గర ఉన్నది అవసరమున్న వారికి పంచడం వల్ల కలిగే తృప్తి, దొరికే ఆశీర్వచనం దైవికమైనవి. దానాల్లోకెల్లా శ్రేష్ఠమైనది అన్నదానం అంటారు. ఇవాళ వరదల్లో చిక్కుకున్నవారి కోసం అన్నదానం చేయవలసినవారే కావాల్సింది.స్పందించే హృదయంమనిషి హృదయానికి ఉన్న గొప్ప లక్షణం స్పందించే గుణం. అదే మానవత్వ గుణం. కరుణ, కనికరం, దయ, సానుభూతి ఇవన్నీ సాటి మనిషి కోసం సాయపడమంటాయి. సాయంలో ఉన్నతమైనది దాతృత్వం. కొందరు అడగకపోయినా దానం చేస్తారు. కొందరు అడిగినా చేయరు. ఉండి కూడా చేయరు. ఒకప్పుడు పెద్ద పెద్ద ఘటనలు జరిగితే సినిమా హీరోలతో మొదలు సామాన్యుల వరకూ స్పందించేవారు. కనీసం నూట పదహార్లు పంపే పేదవారు కూడా ఉండేవారు. ఇవాళ దానం కోసం ప్రొత్సహించే వ్యక్తులు లేరు. తామే తార్కాణంగా నిలవాలని కూడా అనుకోవడం లేదు. వేల కోట్లు ఉన్నవారు కూడా రూపాయి విదల్చకపోతే ఆ సంపదకు అర్థం ఏమిటి?లక్ష సాయాలుఇవాళ తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్లలో వరద బీభత్సంగా ఉంది. పిల్లలకు పుస్తకాల దగ్గర నుంచి వృద్ధులకు మందుల వరకు అన్నీ కావాలి. వంట పాత్రలు నాశనమయ్యాయి. స్టవ్‌లు పాడయ్యాయి. ఇళ్లు కూలిన వారు ఎందరో. పశువులు కొట్టుకుని పోయాయి. చేతి వృత్తుల పరికరాలు, ఉపాధి సామాగ్రి అంతా పోయింది. జనం రోడ్డున పడ్డారు. వీరి కోసం ఎన్ని వేల మంది సాయానికి వస్తే అంత మంచిది. సరిౖయెన చారిటీ సంస్థలకు విరాళాలు ఇచ్చి సాయం అందగలిగేలా చూడటం అందరి విధి. లేదా ముఖ్యమంత్రుల సహాయనిధికే విరాళం ఇవ్వొచ్చు. మన దగ్గర డబ్బు లేకపోతే సమయం అయినా దానం ఇవ్వొచ్చు. సమయం వెచ్చించి సహాయ కార్యక్రమాల్లో పాల్గొన్నా చాలు. నేడు ‘అంతర్జాతీయ దాతృత్వ దినోత్సవం’ సందర్భంగా చంద్రునికో నూలుపోగైనా ఇద్దామని సంకల్పిద్దాం. -
విజయవాడలో ఎవరైనా వచ్చి కాపాడండి: బిగ్‌బాస్ తేజ
విజయవాడ వరద ప్రభావిత ప్రాంతంలో ఉన్న అపార్టుమెంట్ వాసుల కష్టాలు వర్ణనాతీతంగా ఉన్నాయి. ముంపునకు గురైన బాధితులు ఆపన్న హస్తం కోసం హాహాకారాలు చేస్తున్నారు. వరద ప్రాంతాల్లోని అపార్టుమెంట్ల సెల్లార్లు పూర్తిగా మునిగిపోయి కార్లు, ద్విచక్ర వాహనాలు కాగితం పడవల్లా తేలియాడుతున్నాయి. పైఅంతస్తుల్లో ఉన్న వారంతా రెండ్రోజులుగా గడప దాటే పరిస్థితి లేక అల్లాడిపోతున్నారు. ప్రభుత్వ సాయం అందక చాలామంది అల్లాడిపోతున్నారు. తమ వీధుల వెంట వెళ్తున్న వార్ని గుండెలవిసేలా పిలుస్తూ.. తమను ఆదుకోండి అంటూ ఆర్తిగా కోరుతున్నారు.ఇలాంటి ఇబ్బందులు పడుతున్న ఒక కుటుంబాన్ని కాపాడాలని బిగ్‌బాస్ ఫేమ్ టేస్టీ తేజా కోరారు. ఈ క్రమంలో ఒక వీడియోను కూడా ఆయన పంచుకున్నారు. పసిపిల్లలు,మహిళలు,వృద్ధులు వరద ప్రభావిత ప్రాంతంలో చిక్కుకుపోయామని వీడియోలో బాధితుడు తెలిపాడు. ఏపీ ప్రభత్వం లేదా విజయవాడలోని ఎవరైన తమను కాపాడాలని కోరారు. రెండు రోజులుగా పిల్లలకు పాలు, ఆహారం కూడా లేదని వాపోయారు. చాలామంది అధికారులకు మెసేజ్ చేసినా ఫలితం లేదని ఆయన తెలిపారు. దయచేసి తమను కాపాడాలని వారు వేడుకున్నారు. టేస్టీ తేజా షేర్ చేసిన ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. View this post on Instagram A post shared by Tasty Teja (@tastyteja) -
బంగాళాఖాతంలో మరో తుఫాన్
-
ఆంధ్రప్రదేశ్‌కు పొంచి ఉన్న మరో ముప్పు
సాక్షి, అమరావతి : భారీ వర్షంతో ఆంధ్రపద్రశ్కు భారీ ముంపు పొంచి ఉంది. రాష్ట్రంలో మరోసారి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.రాష్ట్రంలో మరోసారి భారీ వర్షాలు కురవనున్నాయి. రానున్న 48గంటల్లో బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనుంది. ఉత్తర అండమాన్ సమీపంలో ఏర్పడనున్న ఈ అల్పపీడనం క్రమంగా తుఫానుగా మారే అవకాశం ఉంది.ఈ తుఫాను ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా తీరం దాటుతుందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. వాయిగుండం సృష్టించిన విలయం మరువకముందే మరో తుఫాను గండం ముంచుకొస్తుండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. -
ఫిలిప్పీన్స్‌ను ముంచెత్తిన వరదలు
మనీలా: ఉత్తర ఫిలిప్పీన్స్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో పలు ప్రాంతాల్లో వరదలు పోటెత్తడంతో అధికారులు ముందస్తు జాగ్రత్తగా పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. వరదల కారణంగా ప్రభుత్వం పలు కార్యక్రమాలను వాయిదా వేసుకుంది. వరద ముంపు ప్రాంతాల్లోని ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని ప్రభుత్వం హెచ్చరికలు జారీచేసింది. ఉష్ణమండల తుఫాను యాగీ మనీలాకు ఆగ్నేయంగా ఉన్న కామరైన్స్ నోర్టే ప్రావిన్స్‌లోని విన్జోన్స్ పట్టణ తీరాన్ని తాకింది.వాతావరణశాఖ తెలిపిన వివరాల ప్రకారం గంటకు 75 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచనున్నాయి. పర్వత ప్రాంతాలలో కొండచరియలు విరిగిపడే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. తూర్పు కామరైన్స్ సుర్ ప్రావిన్స్‌లోని నాగా పట్టణంలో విద్యుదాఘాతంతో ఒకరు మృతిచెందినట్లు పోలీసులు తెలిపారు. మనీలాతో సహా దేశంలోని అత్యధిక జనాభా కలిగిన ప్రాంతమైన లుజోన్‌లో టైఫూన్ హెచ్చరికలు జారీ అయ్యాయి. తుఫాను వాతావరణం కారణంగా పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాలు మూసివేశారు. రాజధానికి సమీపంలో ఉన్న మరికినా నదిలో నీటిమట్టం పెరిగిన దృష్ట్యా స్థానికులను హెచ్చరిస్తూ అధికారులు సైరన్ మోగించారు.ఉత్తర సమర్ ప్రావిన్స్‌లోని కోస్ట్ గార్డు సిబ్బంది రెండు గ్రామాలకు చెందిన 40 మందిని రక్షించారు. తుఫాను కారణంగా పలు ఓడరేవుల్లో షిప్పింగ్‌ను తాత్కాలికంగా నిలిపివేశారు. తుఫాను వాతావరణం కారణంగా పలు దేశీయ విమానాల రాకపోకలను రద్దుచేశారు. -
Jamnagar: ఎక్కడ చూసినా.. బురద, దుర్వాసన
జామ్‌నగర్: గుజరాత్‌లోని పలు జిల్లాల్లో కురుస్తున్న వర్షాలకు జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. ముఖ్యంగా జామ్‌నగర్‌లో పరిస్థితి మరింత అధ్వాన్నంగా తయారయ్యింది. వర్షాలు కాస్త తగ్గుముఖం పట్టిన నేపధ్యంలో మీడియా బృందం జామ్ నగర్లో పర్యటించింది. జామ్‌నగర్‌లో వరదలు, వర్షాల కారణంగా ఇప్పటివరకు ఏడుగురు మృతిచెందారు. 500కు పైగా పశువులు ప్రాణాలు కోల్పోయాయి.వర్షాల అనంతం జామ్‌నగర్‌లోని తీన్ బత్తి చౌక్ ప్రాంతంలోని బద్రీ కాంప్లెక్స్ బేస్మెంట్లో నీరు నిలిచిపోయి, బురద పేరుకుపోయింది. విపరీతమైన దుర్వాసన కూడా వస్తోంది. కాంప్లెక్స్‌లో వర్షాలకు ముద్దయిన సరుకులను సంబంధిత దుకాణాల యజమానులు ట్రాక్టర్లలో ఎక్కించుకుని తీసుకువెళుతున్నారు.ఇక్కడకు కొద్ది దూరంలో ఉన్న మదీనా మసీదు సమీపంలో కూడా ఇటువంటి పరిస్థితే కనిపించింది. రోడ్లన్నీ బురదమయంగా మారాయి. గుంతల్లో నీరు నిలిచిపోయింది. కొన్ని స్వచ్ఛంద సంస్థలు బాధితులకు నిత్యావసర సరుకులను అందిస్తున్నాయి. మీడియాను చూసిన అక్కడి మహిళలు తమను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని వేడుకున్నారు.ఘాచీ కి ఖడ్కీలో వర్షాల అనంతరం పరిస్థితి మరింత ఘోరంగా తయారయ్యింది. దీంతో స్థానికులు తమ ఇళ్లను వదిలి ఇతర ప్రాంతాలకు వలస వెళ్లారు. ఈ ప్రాంతమంతా చెత్తాచెదారంతో నిండిపోయింది. రోడ్లపై అడుగుతీసి అడుగువేయలేనంతగా బురద పేరుకుపోయింది. -
అభిమానులను ఉద్దేశిస్తూ చిరంజీవి ట్వీట్
తెలుగు రాష్ట్రాల్లో రెండు రోజులుగా ఎడతెరిపి లేని అతి భారీ వర్షాలు పడుతున్నాయి. దీంతో ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. శుక్రవారం రాత్రి నుంచి కుండపోతగా కురుస్తున్న వర్షాలకు ముఖ్యంగా ఏపీలోని కోస్తా జిల్లాలు వణికిపోయాయి. అదేరీతిలో హైదరాబాద్ వంటి మహానగరం కూడా వర్షపు నీటితో జలమయం అయింది. భారీ వర్షాల వల్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని చిరంజీవి తాజాగా ట్వీట్ చేశారు. అత్యవసరమైతే తప్ప ఎవరూ బయటకు రావొద్దని ఆయన కోరారు.'తెలుగు రాష్ట్రాల్లో వరద ప్రభావం చాలా ఎక్కువగా ఉంది. పలు గ్రామాలు, జాతీయ రహదారులు నీటితో మునిగిపోయాయి. ఇటువంటి పరిస్థితుల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. మీ కుటుంబ సభ్యుడిగా నా మనవి ఒక్కటే.. అత్యవసరం అయితే తప్ప ఎవరు ఇంటి నుంచి బయటకు రావద్దు. వైరల్ ఫీవర్ వంటివి వచ్చే ప్రమాదం ఉండటం వల్ల అందరూ అప్రమత్తంగా ఉండాలి. ఇటువంటి విపత్తులు వచ్చినప్పుడు ప్రజలకు, బాధితులకు మా అభిమానులు ఎల్లప్పుడూ అండగా ఉంటూ వస్తున్నారు. ఇప్పుడూ అభిమానులంతా అండగా ఉంటారని ఆశిస్తున్నాను' అని చిరు పేర్కొన్నారు.బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం వల్ల భారీగా వర్షాలు పడుతున్నాయి. అయితే, ఆదివారం తెల్లవారుజామున 2.30 గంటలకు కళింగపట్నం వద్ద తీరం దాటింది. దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లోని చాలా చోట్ల వర్షాలు పడుతున్నాయి.తెలుగు రాష్ట్రాల్లో వరద ప్రభావం చాలా ఎక్కువగా ఉంది. పలు గ్రామాలు, జాతీయ రహదారులు నీటితో మునిగిపోయాయి. ఇటువంటి పరిస్థితుల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.మీ కుటుంబ సభ్యుడిగా నా మనవి ఒక్కటే... అత్యవసరం అయితే తప్ప ఎవరు ఇంటి నుంచి బయటకు రావద్దు. వైరల్ ఫీవర్ వంటివి వచ్చే ప్రమాదం ఉండటం…— Chiranjeevi Konidela (@KChiruTweets) September 1, 2024 -
తెలుగు రాష్ట్రాల్లో మూడు రోజుల పాటు విస్తారంగా వర్షాలు
-
గమ్మత్తు.. ఆరడుగుల వాన
-
#HeavyRains : తెలంగాణ అంతటా వర్ష బీభత్సం (ఫొటోలు)
-
ఎంత కష్టం.. ఎంత నష్టం టమాఠా
అనంతపురం అగ్రికల్చర్: ఉమ్మడి చిత్తూరు జిల్లా తర్వాత అనంతపురం టమాట సాగుకు పెట్టింది పేరు. ఏటా ఖరీఫ్‌లో 35 వేల ఎకరాలు, రబీలో 20 వేల ఎకరాలు వెరసి 55 వేల ఎకరాల్లో రైతులు టమాట పండిస్తున్నారు. ఎకరాకు సగటున 15 టన్నుల దిగుబడితో ఏటా 6.5 లక్షలకు పైగా మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తోంది. ఇక్కడ పండించే టమాట ఎక్కువగా కోల్‌కతా, నాగ్‌పూర్, ఢిల్లీ, మధ్యప్రదేశ్‌తో పాటు తెలంగాణ, కర్ణాటక, తమిళనాడుకు ఎగుమతి అవుతోంది.వార్షిక టర్నోవర్ రూ.400 కోట్లకు పైగా ఉన్నట్లు ఉద్యానశాఖ నివేదిక వెల్లడిస్తోంది. సాధారణ పద్ధతితో ఎకరా టమాట సాగుకు రూ.40 వేల నుంచి రూ.50 వేలు ఖర్చు అవుతుండగా ట్రెల్లీస్ (కట్టెలు) విధానంలో రూ.80 వేల నుంచి రూ.లక్ష వరకు పెట్టుబడి పెడుతున్నారు. కనగానపల్లి, రామగిరి, తనకల్లు, కళ్యాణదుర్గం, బ్రహ్మసము్ర దం, కుందుర్పి, శెట్టూరు, రాయదుర్గం, ముదిగుబ్బ, నల్లచెరువు, ఓడీ చెరువు, కదిరి, పెనుకొండ, అమడగూరు, బత్తలపల్లి, ధర్మవరం, చెన్నేకొత్తపల్లి, గుంతకల్లు, కూడేరు, అనంతపురం, రాప్తాడు, శింగనమల ప్రాంతాల్లో సాగు అధికంగా ఉంది.మార్కెట్ మాయాజాలంఅనంతపురం నగర శివారు కక్కలపల్లి వద్ద కమీషన్ ఏజెంట్లు, కొనుగోలుదారులు, దళారులు పెద్ద ఎత్తున మండీలు నిర్వహిస్తున్నారు. ఉమ్మడి జిల్లా నలుమూలల నుంచి 70 నుంచి 80 శాతం మంది రైతులు అమ్మకాలకు ఇక్కడికే వస్తుంటారు. కిలో కనీసం రూ.10 నుంచి రూ.12 పలికితేకానీ పెట్టుబడులు వచ్చే పరిస్థితి లేదని రైతులు చెబుతున్నారు. కూలీల ఖర్చు, రవాణా, ట్రేల బాడుగ, కమీషన్ ఖర్చులు అధికంగా ఉండటంతో టమాట రైతులకు నష్టాలు తెచ్చిపెడుతున్నాయి. అయితే ఒక్కసారైనా మంచి ధరలు పలికితే బయట పడతామనే ఆశతో రైతన్నలు టమాట సాగునే నమ్ముకున్నారు. ఇదే అదనుగా దళారులు వారి నుంచి తక్కువ ధరకు కొనుగోలు చేసి సొమ్ము చేసుకుంటున్నారు. బయట మార్కెట్లో కిలో రూ.20 వరకు విక్రయిస్తున్నా టమాటా రైతుకు తీవ్ర నిరాశే ఎదురవుతోంది. ప్రస్తుతం మండీకి రోజూ 4 వేల మెట్రిక్ టన్నుల నుంచి 4,800 మెట్రిక్ టన్నుల వరకు సరుకు వస్తోంది. ‘నో సేల్’ కింద పెట్టిన టమాటాలను చేసేదేమీ లేక రైతులు పారబోసి ఉత్త చేతులతో ఇంటి దారి పడుతున్న దుస్థితి నెలకొంది. సోమవారం 15 కిలోల బాక్సు గరిష్ట ధర రూ.330 పలికింది. చాలా వాటిని బాక్సు రూ.150 నుంచి రూ.200 లోపే కొంటున్నారు. ఇక సీ గ్రేడ్ టమాటాలు రూ.100 వరకు పలుకుతున్నాయి. ‘నో సేల్’ వాటికి కనీస ధర కూడా ఇవ్వకుండా మండీ నిర్వాహకులు, వ్యాపారులు మానవత్వం లేకుండా వ్యవహరిస్తున్నారు.రగిలిన రైతన్నలురాప్తాడు రూరల్: నాణ్యత సాకుతో టమాటాలు కొనుగోలు చేయకపోవటాన్ని నిరసిస్తూ రైతన్నలు సోమవారం అనంతపురం రూరల్ మండలం కక్కలపల్లి మండీ వద్ద ఆందోళనకు దిగారు. సమీపంలోని 44వ నంబరు జాతీయ రహదారిపైకి చేరుకుని బైఠాయించడంతో వందలాది వాహనాలు నిలిచిపోయాయి. మరోవైపు లోడింగ్ కోసం బయటి వాహనాలు కాకుండా స్థానికంగా బాడుగకు తీసుకోవాలంటూ లారీ అసోసియేషన్ ప్రతినిధులు కూడా ఆందోళన నిర్వహించారు. అనంతరం పోలీసుల చొరవతో ఆందోళన విరమించారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం గోళ్ల గ్రామానికి చెందిన యువ రైతు చిన్ని క్రిష్ణ 160 ట్రేల టమాటాను అనంతపురం శివారులోని కక్కలపల్లి మండీకి తెచ్చాడు.నాణ్యత వంకతో వేలంపాట దారులు సరుకు కొనడానికి ఇష్టపడలేదు. దీంతో ఏం చేయాలో రైతుకు పాలు పోలేదు. చాలాసేపు ఎదురుచూసి చివరకు ట్రేలను మళ్లీ వాహనంలో ఎక్కించి బయట పారబోశాడు. రిక్త హస్తంతో ఇంటికి చేరాడు. ఎకరాకు రూ.50 వేల చొప్పున రూ.1.50 లక్షల వరకు పెట్టుబడి పెట్టినట్లు రైతు నిర్వేదం వ్యక్తం చేశారు. -
హైదరాబాద్‌లో భారీ వర్షం
సాక్షి,హైదరాబాద్ : హైదరాబాద్‌లో వర్షం దంచి కొట్టింది.. సోమవారం మధ్యాహ్నం కుండ పోతగా వర్షం కురిసింది. దీంతో పలు ప్రాంతాలు జలమయ్యాయి. ముఖ్యంగా, రాజేంద్ర నగర్, మణికొండ, గండిపేట, జూబ్లీహిల్స్, బంజరాహిల్స్, సికింద్రాబాద్, నాంపల్లి, మెహిదిపట్నం, టోలీచౌకి ప్రాంతాల్లో భారీ వర్షం పడింది. దీంతో ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ అవ్వడంతో వాహనదారులు తీవ్రం ఇబ్బందులు పడ్డారు. పలు చోట్ల రోడ్లపై నడుములోతు నీళ్లు నిలిచిపోవడంతో ద్విచక్ర వాహనాలు మొరాయించాయి.హైదరాబాద్‌లో వర్షం పడడంతో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. మధ్యాహ్నం వరకు తీవ్రంగా ఎండ కాసింది. ఉక్కపోతతో జనం ఉక్కిరిబిక్కిరయ్యారు. అంతలోనే భారీ వర్షం కమ్ముకొచ్చింది. తొలుత చిరుజల్లులు మొదలయ్యాయి. ఆకాశానికి చిల్లు పడిందా అన్నట్లుగా భారీ వర్షం కురిసింది. రోడ్లపైన ఉన్నవాళ్లు ఎక్కడైనా తలదాచుకుందామా అనుకునేలోపు పూర్తిగా తడిచిపోయారు. దీనికి తోడు ఓ వైపు ట్రాఫిక్ జామ్, రోడ్లపై భారీగా నిలిచిపోయిన నీళ్లతో ప్రత్యక్షంగా నరకం చూసినంత పనైంది. మరోవైపు నగరంలో మరో రెండు మూడు గంటల్లో భారీగా వర్షం పడే అవకాశం ఉందని జారీ చేసిన హెచ్చరికలతో జీహెచ్ఎంసీ అధికారులు అప్రమత్తమయ్యారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలించే ప్రయత్నం చేస్తున్నారు. -
ఈరోజు ఎన్ని లీటర్లు వాన పడింది??
ఏంటీ ఏదో తేడాగా ఉంది అని అనిపిస్తోందా.. అవును మరి.. ఎప్పుడూ ఇన్ని మిల్లీ మీటర్లు లేదా ఇన్ని సెంటీమీటర్లలో వర్షం పడింది అని మాత్రమే మనం వింటుంటాం కదా.. అయితే.. కచి్చతంగా ఎంత పడిందన్న విషయం ఎలా తెలుస్తుంది? సింపుల్‌గా చెప్పాలంటే.. వర్షం పడినప్పుడు ఒక చదరపు మీటర్ స్థలంలో ఒక లీటర్ నీళ్లు నిలిస్తే.. ఒక మిల్లీమీటర్ వాన పడినట్లు.. అదే పది లీటర్ల నీళ్లు నిలిస్తే.. ఒక సెంటీమీటర్ అన్నమాట. అసలు వానను శాస్త్రవేత్తలు ఎలా లెక్కేస్తారో తెలుసా?ప్రత్యేక పరికరాలతో.. సాధారణంగా వాన నీటి లెక్కలను తేల్చేందుకు ప్రత్యేకంగా పరికరాలు ఉంటాయి. వాటిని ఆరుబయట ప్రదేశాల్లో నిటారుగా ఉండేలా అమర్చుతారు. వాటిపై మిల్లీమీటర్లు, సెంటీమీటర్ల లెక్కలు ఉంటాయి. వర్షం పడినప్పుడు అందులో చేరే నీటి స్థాయిని చూసి.. ఎంత వాన పడిందో చెప్తారు. కానీ వానకు మామూలు లెక్క ఏమిటంటే.. సమతలంగా ఉన్న ఒక చదరపు మీటర్ స్థలంలో ఒక లీటర్ నీళ్లు నిలిస్తే.. ఒక మిల్లీమీటర్ వాన అన్నమాట. ఈ లెక్కకు కొన్ని రూల్స్ ఉన్నాయి. కాంక్రీట్, ప్లాస్టిక్, ఏదైనా లోహంతో చేసినది అయినా సరే.. కచి్చతంగా చదరపు మీటర్ విస్తీర్ణం ఉండాలి. ఎక్కువ తక్కువలు, వంపు లేకుండా కచ్చితంగా సమతలంగా ఉండాలి. చుట్టూ ఖాళీ ప్రదేశం ఉండాలి. వాన నీరు పడేందుకు ఎలాంటి అడ్డంకీ ఉండకూడదు.కురిసిన సమయాన్ని బట్టి తీవ్రత..ఎన్ని సెంటీమీటర్లు వాన అన్నది మాత్రమేకాకుండా ఎంత సమయంలో కురిసింది అన్నదాన్ని బట్టి.. వర్షం తీవ్రతను అంచనా వేస్తారు. ఉదాహరణకు ఒక రోజంతా అంటే 24 గంటల్లో ఆరు సెంటీమీటర్ల వానపడితే.. అది మోస్తరు వర్షం కిందే లెక్క. అదే ఒకట్రెండు గంటల్లోనే ఆరు సెంటీమీటర్లు పడితే కుంభవృష్టి కురిసినట్టే. ఇలా జరిగితే నీరంతా ఒక్కసారిగా చేరి వరదలు వస్తాయి. ప్రమాదాలు జరిగేందుకు ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. -
వాయవ్య బంగాళాఖాతంలో అల్పపీడనం
సాక్షి, విశాఖపట్నం: వాయవ్య బంగాళాఖాతం, పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్‌కు ఆనుకుని ఉన్న ప్రాంతాల మీద అల్పపీడనం కొనసాగుతోంది. దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టానికి 4.5 కిమీ ఎత్తు వరకు విస్తరించి ఉత్తర వాయవ్య దిశగా కదులుతోంది. ఈ అల్పపీడనం రానున్న రెండు రోజుల్లో తీవ్ర అల్పపీడనంగా మారి.. తదుపరి రెండు రోజుల్లో వాయుగుండంగా బలపడనుంది. అనంతరం.. బెంగాల్, జార్ఖండ్ పరిసర ప్రాంతాల మీదుగా ప్రయాణించే అవకాశాలున్నాయి. ఈ వాయుగుండం ప్రభావం బెంగాల్, ఒడిశా, బంగ్లాదేశ్‌పై ఎక్కువగా ఉంటుంది. ఏపీపై ఎలాంటి ప్రభావం చూపదని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. మరోవైపు.. ఆగ్నేయ అరేబియా సముద్రం, దానిని ఆనుకుని ఉన్న దక్షిణ కేరళ తీరం మీదుగా ఏర్పడిన ఉపరితల ఆవర్తనం సముద్రమట్టానికి 5.8 కిమీ ఎత్తులో విస్తరించి ఉంది. అదేవిధంగా.. ఉపరితల ద్రోణి కర్ణాటక, కొమొరిన్ ప్రాంతాల మీదుగా కొనసాగుతోంది. వీటి ప్రభావంతో రాయలసీమలో నేడు ఒకట్రెండు చోట్ల భారీ వర్షం కురిసే సూచనలున్నాయని అధికారులు తెలిపారు. రాబోయే రెండు రోజులు కోస్తా, రాయలసీమల్లో అక్కడక్కడా తేలికపాటి నుంచి ఓ మోస్తరు వానలు పడే అవకాశాలున్నాయని వెల్లడించారు. అయితే.. వాయుగుండం తేమగాలుల్ని తీసుకుపోవడం వల్ల మరో మూడు రోజుల పాటు ఉక్కపోత కొనసాగుతుందని అధికారులు చెబుతున్నారు. -
పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు.. జనజీవనం అస్తవ్యస్తం
దేశంలోని పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. పర్వత ప్రాంతాలు మొదలుకొని మైదాన ప్రాంతాల వరకు అన్నిచోట్లా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. పలు నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. గత రెండు రోజులుగా ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో ఎడతెరిపిలేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి.రాజస్థాన్‌లో కురుస్తున్న కుండపోత వర్షాలకు సంభవించిన పలు ప్రమాదాలలో మరో ఎనిమిది మంది మృతి చెందారు. గడచిన రెండు రోజుల్లో 22 మంది వర్ష సంబంధిత ప్రమాదాల్లో మృతిచెందారు. కరౌలి, హిందౌన్లలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. డ్యామ్‌లు, నదులు పొంగిపొర్లడంతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. విపత్తు సహాయక దళాలు కరౌలి, హిందౌన్‌లలో 100 మందిని రక్షించి సురక్షిత ప్రాంతాలకు తరలించాయి.హిమాచల్ ప్రదేశ్‌లో గత వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు పలుచోట్ల కొండచరియలు విరిగిపడుతున్నాయి. ఆకస్మిక వరదల కారణంగా రెండు జాతీయ రహదారులతో సహా మొత్తం 197 రోడ్లు మూసుకుపోయాయి. బీహార్‌లో గంగా నది సహా అన్ని ప్రధాన నదుల నీటిమట్టం పెరిగింది. రాజధాని పట్నాలో గంగ, పున్పున్ నదులు ప్రమాదకర స్థాయికి మించి ప్రవహిస్తున్నాయి. గంగా నదికి ఆనుకుని ఉన్న ప్రాంతాల్లోకి వరద నీరు వచ్చి చేరింది.గంగానది నీటిమట్టం పెరగడంతో ముంగేర్, భాగల్పూర్, పట్నా తీర ప్రాంతాలు జలమయమయ్యాయి. ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. కర్ణాటక రాజధాని బెంగళూరులో కురుస్తున్న వర్షాల కారణంగా జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. వరదల కారణంగా లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. -
ఢిల్లీ: భారీ వర్షంతో మొదలైన వీకెండ్..
దేశరాజధాని ఢిల్లీలో భారీవర్షాలతో వారాంతం మొదలయ్యింది. గురువారం ఆకాశం మేఘావృతమైనప్పటికీ అక్కడక్కడ చిరుజల్లులు మాత్రమే కురిశాయి. అయితే శుక్రవారం సాయంత్రం నుంచి కురుస్తున్న వర్షం ఢిల్లీ-ఎన్సీఆర్లోని జనానికి ఊరటనిచ్చింది. వర్షం కారణంగా పలు చోట్ల రోడ్లపై ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దీంతో జనం అవస్థలు పడ్డారు. రోడ్లపై నీరు నిలవడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి. ముఖ్యంగా రాజోరీ గార్డెన్, ఠాగూర్ గార్డెన్, తిలక్ నగర్, సుభాష్ నగర్, వికాస్పురి, ఠాగూర్ గార్డెన్ తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసి రోడ్డపై నీరు నిలిచింది. వాక్‌వే స్టాండ్ లెవల్ వరకు నీరు నిండిపోవడంతో వాహనాలు నిదానంగా వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది.వాతావరణ శాఖ అంచనాల ప్రకారం ఆగస్టు 15 వరకు ఢిల్లీలో తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు, కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఢిల్లీలో మరికొన్ని రోజుల పాటు చినుకులు పడే అవకాశం ఉంది. 10, 11 తేదీలకు వాతావరణశాఖ ఎల్లో అలర్ట్ ప్రకటించింది. నోయిడా, ఘజియాబాద్, ఫరీదాబాద్‌లలో ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.ఔటర్ ఢిల్లీలోని ప్రేమ్ నగర్లో శుక్రవారం సాయంత్రం చెరువులో మునిగి ఇద్దరు చిన్నారులు మృతిచెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ప్రేమ్ నగర్ పరిధిలోని రాణి ఖేడా గ్రామానికి చెందిన నలుగురు చిన్నారులు చెరువు వద్దకు వెళ్లారు. వారిలో ఇద్దరు చిన్నారులు నీటి లోతుల్లోకి వెళ్లిన కారణంగా మృతి చెందారు. -
ఒక్కసారిగా మారిన వాతావరణం.. ఢిల్లీలో ఏకధాటిగా వర్షం
న్యూ ఢిల్లీ : దేశ రాజధానిలో ఢిల్లీలో వాతావారణం ఒక్కసారిగా మారింది. దీంతో పలు ప్రాంతాల్లో ఏకధాటిగా వర్షం కురుస్తోంది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. దీంతో ఢిల్లీ మున్సిపల్ శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. అవసరమైతే తప్ప బయటకు రావొద్దని లోతట్టు ప్రాంతాల ప్రజల్ని అప్రమత్తం చేస్తున్నారు.రాబోయే కొద్ది గంటల్లో నగరంలోని ప్రీత్ విహార్, ఐటీవో, అక్షరధామ్‌తో పాటు ప్రదేశాలలో ఒక మోస్తరు నుండి భారీ వర్షాలు, ఒక మోస్తరు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ కార్యాలయం అంచనా వేసింది. ప్రస్తుతం, మధ్య, దక్షిణ, ఉత్తర ఢిల్లీలోని కొన్ని ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. భారత వాతావరణ శాఖ ప్రకారం, ఢిల్లీలో గరిష్ట ఉష్ణోగ్రత 34 డిగ్రీల సెల్సియస్ వద్ద స్థిరపడుతుందని అంచనా. కనిష్ట ఉష్ణోగ్రత 26.6 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. తేమ స్థాయి 85 శాతంగా నమోదైందని ఐఎండీ తెలిపింది. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ విభాగంలో 59 రీడింగ్‌తో సంతృప్తికరమైన కేటగిరీలో కొనసాగింది.ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ( ఏఐక్యూ)సున్నా 50 మధ్య ఉన్న ఏఐక్యూ ఉంటే మంచిది. 51 నుంచి 100 మధ్య ఉంటే సంతృప్తికరమైనది. 101 నుంచి 200 మధ్య ఉంటే ఫర్వాలేదని , 201 మధ్య 300 తక్కువ ప్రమాదం అని, 301 నుంచి 400 మధ్య ఉంటే మరింత ప్రమాదమని, 401 నుంచి 500 మధ్య ఉంటే మరింత తీవ్రమైనదని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. -
ఢిల్లీలో భారీ వర్షాలు.. పలు ప్రాంతాలు జల దిగ్బంధం..
ఢిల్లీలో పలు ప్రాంతాల్లో భారీ ఎత్తున వర్షం కురుస్తోంది. భారీ వర్షంతో లుటియన్స్ ఢిల్లీ,కాశ్మీర్ గేట్, ఓల్డ్ రాజేంద్రనగర్‌తో సహా పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లపైకి వరద నీరు చేరడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. పలు ప్రాంతాల్లో తీవ్ర ట్రాఫిక్ అంతరాయం కలుగుతోంది. వచ్చే 2 గంటల్లో ఢిల్లీలో 3 నుంచి 5 సెంటీ మీటర్ల మేర వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.ఢిల్లీలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా తెలిపారు. సాధారణంగా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, కోచింగ్ సెంటర్లతో సహా నీటి ఎద్దడి ఉన్న ప్రాంతాల్లో సమస్యలను ప్రత్యేకంగా పరిష్కరించాలని సూచించారు. అంతకు ముందు, ఉత్తర ఢిల్లీ, సెంట్రల్ ఢిల్లీ, న్యూఢిల్లీ, దక్షిణ ఢిల్లీ, ఆగ్నేయ ఢిల్లీ, తూర్పు ఢిల్లీ, ఎన్సీఆర్లోని ఇతర ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు, ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. -
Monal Gajjar: వర్షంలో బిగ్‌బాస్ బ్యూటీ ఆటలు (ఫోటోలు)
-
చైనాలో భారీ వర్షాలు.. 11 మంది మృతి
చైనాలో కురుస్తున్న వర్షాలు, ఈ కారణంగా సంభవించిన వరదలు పలు ప్రాంతాల్లో విధ్వంసం సృష్టించాయి. ఆగ్నేయ చైనాలో ఒక ఇల్లు కూలడంతో 11 మంది మృతి చెందారు. భారీ వర్షాల కారణంగా ఈ ప్రాంతమంతా జలమయమైంది.షాంఘైలో ఓ చెట్టు కూలి స్కూటర్‌పై వెళ్తున్న డెలివరీ బాయ్‌పై పడటంతో అతను మృతిచెందాడు. చైనాను చేరుకోకముందు ఈ తుపాను ఫిలిప్పీన్స్‌లో కూడా విధ్వంసం సృష్టించింది. ఫిలిప్పీన్స్‌లో వర్షాల కారణంగా 34 మంది మృతిచెందారు. టైఫూన్ జెమీ తుపాను తైవాన్ ద్వీపంలో కూడా విధ్వంసం సృష్టించింది. ఇక్కడ మృతుల సంఖ్య 10 దాటింది.హునాన్ ప్రావిన్స్‌లోని హెంగ్యాంగ్ నగర పరిధిలో కొండచరియలు విరిగిపడినట్లు రాష్ట్ర ప్రసార సంస్థ సీసీటీవీ తెలిపింది. భారీ వర్షాల కారణంగా పర్వతాల నుంచి నీరు ప్రవహించడం వల్లే కొండచరియలు విరిగిపడినట్లు వాతావరణశాఖ పేర్కొంది. ఉష్ణమండల తుఫానుతో కూడిన వర్షపాతం హునాన్ ప్రావిన్స్‌లోని ఆగ్నేయ భాగాలను తాకినట్లు చైనా వాతావరణశాఖ తెలిపింది. More than 27,000 people in Northeast #China were evacuated and hundreds of factories were ordered to suspend production as #TyphoonGaemi brought heavy rains, the official Xinhua news agency reported on July 27.https://t.co/uIkKuknyTk— The Hindu (@the_hindu) July 27, 2024 -
Weather Update: 9 రాష్ట్రాలకు భారీ వర్ష సూచన
దేశంలోని పలు ప్రాంతాల్లో రుతుపవనాలు చురుకుగా కదులుతున్నాయి. ఈ నేపధ్యంలో భారత వాతావరణశాఖ (ఐఎండీ) ఈరోజు (మంగళవారం) తొమ్మిది రాష్ట్రాలకు భారీ వర్ష సూచన జారీ చేసింది. సోమవారం ఢిల్లీలోని కొన్ని ప్రాంతాల్లో వర్షం కురిసింది.మరో ఐదు రోజుల పాటు ఢిల్లీలో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ అంచనావేసింది. ఈరోజు ఢిల్లీలో గరిష్ట ఉష్ణోగ్రత 35 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 29 డిగ్రీల సెల్సియస్‌గా ఉండవచ్చని తెలిపింది. వాతావరణ శాఖ తెలిపిన వివరాల ప్రకారం ఈరోజు (మంగళవారం)9 రాష్ట్రాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ జాబితాలో ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, మహారాష్ట్ర, గుజరాత్, మధ్యప్రదేశ్, గోవా, పంజాబ్, హర్యానా, రాజస్థాన్ ఉన్నాయి. దీంతో పాటు జార్ఖండ్, కర్ణాటక, ఛత్తీస్‌గఢ్, పశ్చిమ బెంగాల్, అస్సాం, హిమాచల్ ప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయ, నాగాలాండ్, మణిపూర్ రాష్ట్రాల్లో కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది. -
Telangana: మరో రెండ్రోజులు వానలే..
సాక్షి, హైదరాబాద్: కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఒడిశాతీరం చిలికా సరస్సు వద్ద కేంద్రీకృతమైన వాయుగుండం బలహీనపడి అల్పపీడనంగా మారింది. రానున్న ఆరు గంటల్లో ఇది మరింత బలహీనపడే అవకాశం ఉన్నట్టు వెల్లడించింది. జైసాల్మయిర్, కోట, గుణ, మాండ్ల, అంతర్గత ఒడిశా దాని సమీపంలోని ఛత్తీస్‌గఢ్ ప్రాంతంలో ఉపరితల ద్రోణి కేంద్రీకృతమై ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇది తూర్పు, మధ్య బంగాళాఖాతం ప్రాంతం వరకు కొనసాగుతున్నట్టు వివరించింది.రానున్న రెండు రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, కొన్నిచోట్ల తేలికపాటి వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ వివరించింది. ఆదివారం రాష్ట్రంలో సగటున 3.32 సెంటీమీటర్ల వర్షం కురిసింది. అత్యధికంగా నిజామాబాద్ జిల్లాలో 8.81, జగిత్యాల జిల్లాలో 7.01, నిర్మల్ జిల్లాలో 6.92, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 6.83 సెంటీమీటర్ల వర్షం కురిసింది. నల్లగొండ, గద్వాల జిల్లాలు మినహాయిస్తే రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో మోస్తరు వర్షాలు నమోదయ్యాయి. ఈ సీజన్లో ఇప్పటివరకు 23.39 సెంటీమీటర్ల వర్షం కురవాల్సి ఉండగా, ఆదివారం నాటికి 36.43 సెంటీమీటర్ల వర్షం కురిసింది. సీజన్లో ఇప్పటివరకు సాధారణ వర్షపాతం కంటే 33శాతం అధికంగా వానలు నమోదయ్యాయి. -
ఢిల్లీలో కుండపోత వర్షం.. రోడ్లన్నీ జలమయం
దేశరాజధాని ఢిల్లీలో భారీవర్షం కురుస్తోంది. దీంతో రోడ్లన్నీ జలమయంగా మారాయి. ఫలితంగా వాహనదారులు, పాదచారులు పడరాని పాట్లు పడుతున్నారు. భారత వాతావరణశాఖ జూలై 22 నుంచి 24 వరకు ఢిల్లీకి ఎల్లో అలర్ట్ జారీ చేసింది.ఈ సమయంలో ఆకాశం మేఘావృతమై ఉంటుంది. గరిష్ట ఉష్ణోగ్రత 33 నుండి 34 డిగ్రీలు, కనిష్ట ఉష్ణోగ్రత 26 నుండి 28 డిగ్రీల మధ్య ఉండవచ్చు. జూలై 25, 26 తేదీల్లో కూడా తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ సమయంలో గరిష్ట ఉష్ణోగ్రత 34, కనిష్ట ఉష్ణోగ్రత 26 నుండి 27 డిగ్రీల మధ్య ఉండవచ్చు.గత కొన్ని రోజులుగా ఢిల్లీ-ఎన్సీఆర్లో విపరీతమైన వేడి వాతావరణానికి తోడు కాలుష్య తీవ్రత కూడా అధికంగా ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో ఈరోజు ఉదయం కురిసిన వర్షం ప్రజలకు ఉపశమనం కలిగించింది. ఢిల్లీ-ఎన్సీఆర్లో చిన్నపాటి వర్షం కురిసినా రోడ్లన్నీ చెరువులుగా మారుతుంటాయి. -
కృష్ణాలో నిలకడగా..
సాక్షి, అమరావతి/రాయచూరు రూరల్: పశ్చిమ కనుమల్లో కురుస్తున్న వర్షాలతో కృష్ణా ప్రధాన పాయలో వరద నిలకడగా కొనసాగుతోంది. గురువారం కర్ణాటకలోని ఆల్మట్టి డ్యామ్‌లోకి 72,286 క్యూసెక్కులు చేరుతోంది. దీంతో 14 గేట్లను ఒక అడుగు మేర ఎత్తి 65,580 క్యూసెక్కులు దిగువకు విడుదల చేస్తున్నారు. నారాయణపూర్ డ్యామ్‌లోకి 68,797 క్యూసెక్కులు చేరుతుండగా.. దిగువకు 46,329 క్యూసెక్కులు వదులుతున్నారు. ఎగువ నుంచి వరద ప్రవాహం వస్తుండటంతో జూరాల ప్రాజెక్టులో తెలంగాణ విద్యుదుత్పత్తి చేస్తూ 25,174 క్యూసెక్కులు దిగువకు వదులుతోంది. ఈ జలాలు శుక్రవారానికి శ్రీశైలానికి చేరుకోనున్నాయి. శ్రీశైలం ప్రాజెక్టు ఎడమ కేంద్రంలో తెలంగాణ సర్కారు విద్యుదుత్పత్తి కొనసాగిస్తోంది. ఇందుకోసం 7,064 క్యూసెక్కులను దిగువకు తరలిస్తుండటంతో శ్రీశైలంలో నీటి నిల్వ 32.37 టీఎంసీలకు తగ్గిపోయింది. శ్రీశైలం నుంచి తరలిస్తున్న జలాలతో నాగార్జున సాగర్‌లోకి 23,851 క్యూసెక్కులు వస్తున్నాయి. దీంతో సాగర్‌లో నీటి నిల్వ 123.34 టీఎంసీలకు చేరుకుంది. ఇక కృష్ణా ప్రధాన ఉప నది తుంగభద్ర బేసిన్లో భారీ వర్షాలు కురుస్తుండటంతో వరద ఉద్ధృతి పెరిగి తుంగభద్ర డ్యామ్‌లోకి 82,491 క్యూసెక్కులు చేరుతున్నాయి. ఇక్కడ నీటి నిల్వ 46.80 టీఎంసీలకు చేరుకుంది. శుక్రవారం తుంగభద్ర డ్యామ్‌లోకి లక్ష క్యూసెక్కులకు పైగా ప్రవాహం వస్తుందని కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) అంచనా వేసింది.గోదావరిలో పెరుగుతూ..పోలవరం వద్దకు 2.30 లక్షల క్యూసెక్కుల వరదసాక్షి, అమరావతి/ధవళేశ్వరం: పరీవాహక ప్రాంతం (బేసిన్)లో విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో గోదావరిలో వరద ప్రవాహం పెరుగుతోంది. గురువారం పోలవరం ప్రాజెక్టులోకి 2.30 లక్షల క్యూసెక్కులు చేరుతోంది. దీంతో ప్రాజెక్టు 48 గేట్ల ద్వారా వచ్చిన జలాలను వచ్చినట్లు దిగువకు వదిలేస్తున్నారు. గురువారం సాయంత్రం 6 గంటలకు ధవళేశ్వరం బ్యారేజ్‌లోకి 2,31,161 క్యూసెక్కులు చేరుతుండటంతో నీటి మట్టం 8.3 అడుగులకు చేరుకుంది. గోదావరి డెల్టా కాలువలకు 7,200 క్యూసెక్కులు వదులుతూ మిగతా 2,23,961 క్యూసెక్కులను బ్యారేజ్ 175 గేట్ల ద్వారా సముద్రంలోకి వదిలేస్తున్నారు. ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ వద్ద నీటిమట్టం శుక్రవారం మరింత పెరిగే అవకాశం ఉందని ఇరిగేషన్ అధికారులు అంచనా వేస్తున్నారు. ఎగువన భద్రాచలంలో నీటిమట్టం గురువారం సాయంత్రం 18.20 అడుగులకు చేరింది.పాపికొండల విహార యాత్రకు బ్రేక్బుట్టాయగూడెం: పాపికొండల విహార యాత్ర తాత్కాలికంగా నిలిచిపోయింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తుండటం, తుఫాన్ హెచ్చరికలు, గోదావరి నదికి వరద తాకిడి పెరగడం వల్ల యాత్రికుల భద్రతను దృష్టిలో ఉంచుకొని విహార యాత్రను తాత్కాలికంగా నిలిపివేసినట్టు పర్యాటక శాఖ అధికారులు ప్రకటించారు. భారీ వర్షాల కారణంగా పోలవరం ప్రాజెక్టు ఎగువన గోదావరి ప్రవాహం భారీగా పెరుగుతోంది. భద్రాచలం వద్ద గురువారం సాయంత్రానికి 22 అడుగుల వరకు పెరిగినట్టు అధికారులు ప్రకటించారు. -
ఏపీలో దంచికొడుతున్న వానలు..(ఫొటోలు)
-
17 రాష్ట్రాల్లో దంచికొట్టుడు వానలు
దేశం అంతటా వివిధ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. తాజాగా గోవాలోని రైల్వే సొరంగ మార్గంలోకి నీరు చేరడంతో కొంకణ్ రైల్వే రూట్లో రాకపోకలు నిలిచిపోయాయి. మరోవైపు ఉత్తరాఖండ్‌లోని చమోలీ జిల్లాలోని పాతాళగంగ లాంగ్సీ టన్నెల్ సమీపంలో భారీగా కొండచరియలు విరిగిపడటంతో బద్రీనాథ్ జాతీయ రహదారిని మూసివేశారు. రానున్న మూడు, నాలుగు రోజుల పాటు 17 రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.బీహార్, హిమాలయ, పశ్చిమ బెంగాల్, సిక్కిం, మేఘాలయలో భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తూ భారత వాతావరణ శాఖ (ఐఎండీ) రెడ్ అలర్ట్ జారీచేసింది. తూర్పు ఉత్తరప్రదేశ్, తూర్పు మధ్యప్రదేశ్, గోవాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. అదేవిధంగా జూలై 12-14 మధ్య మహారాష్ట్ర, కోస్టల్ కర్ణాటకలో భారీ వర్ష సూచనను అందిస్తూ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. పంజాబ్, హర్యానా, చండీగఢ్, ఢిల్లీలో జులై 11-13 వరకు ఉరుములు, మెరుపులతో కూడిన కుండపోత వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ హెచ్చరించింది. ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరప్రదేశ్, జమ్ముకశ్మీర్, లడఖ్, తూర్పు రాజస్థాన్ సహా దక్షిణ భారతదేశంలోని కొన్ని రాష్ట్రాల్లో రానున్న ఐదు రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.హిమాచల్ ప్రదేశ్ రాజధాని సిమ్లా, మండీ, కాంగ్రా, కిన్నౌర్, కులు జిల్లాల్లో భారీ వర్షాల కారణంగా 28 రోడ్లపై ట్రాఫిక్ స్తంభించింది. 32 విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు, 16 నీటి సరఫరా ప్రాజెక్టులు నిలిచిపోయాయి. అసోంలోని 26 జిల్లాల్లో 17 లక్షల మందికి పైగా ప్రజలు వరదల ప్రభావానికి గురయ్యారు. రాష్ట్రంలో వరదల కారణంగా ఇప్పటి వరకు 84 మంది మృతి చెందారు. కొండచరియలు విరిగిపడటం, తుఫాను కారణంగా 13 మంది ప్రాణాలు కోల్పోయారు. కజిరంగా నేషనల్ పార్క్‌లో వరదల కారణంగా తొమ్మిది ఖడ్గమృగాలు సహా మొత్తం 159 వన్యప్రాణులు ప్రాణాలు కోల్పోయాయి. -
పొంచివున్న వర్ష బీభత్సం.. పలు రాష్ట్రాలు అప్రమత్తం
న్యూఢిల్లీ: దేశంలోని పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. దేశ ఆర్ధిక రాజధాని ముంబైతో పాటు పలు ప్రాంతాలకు వాతావరణశాఖ భారీ వర్ష సూచనలు జారీ చేసింది. వర్షాల కోసం వేచిచూస్తున్న జనానికి ఉపశమనం కలగడంతోపాటు ప్రతీరోజు వర్షాలు కురిసే అంచనాలున్నాయి. ఇప్పటికే వర్షాలు కురుస్తున్న రాష్ట్రాల్లో నదులు, కాలువలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. बिहार में 10-12 जुलाई, 2024 के दौरान अलग-अलग स्थानों पर भारी (64.5-115.5 मिलीमीटर) वर्षा से बहुत भारी (115.5-204.4 मिलीमीटर) वर्षा होने की संभावना है। Bihar is likely to get isolated heavy (64.5-115.5 mm) to very heavy rainfall (115.5-204.4 mm) during 10th-12th July, 2024. pic.twitter.com/Q3lsEOWQLK— India Meteorological Department (@Indiametdept) July 8, 2024భారత వాతావరణశాఖ తెలిపిన వివరాల ప్రకారం జూలై 8 నుంచి 12 వరకూ హిమాలయప్రదేశ్, పశ్చిమబెంగాల్, సిక్కిం, బీహార్, అరుణాచల్‌ప్రదేశ్, అసోం, మేఘాలయ తదితర రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురియనున్నాయి. అదేవిధంగా జూలై 12 వరకూ జార్ఖండ్, నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపుర తదితర రాష్టాల్లో భారీ వర్షాలు కురియనున్నాయి.మరోవైపు భారీ వర్షాల కారణంగా బీహార్‌లోని పలు నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ఈ నేపధ్యంలో రాష్ట్రంలోని పూర్వ్ చంపారణ్, గోపాల్‌గంజ్, పశ్చిమ చంపారణ్ తదితర ప్రాంతాల్లోని పరిస్థితులను ముఖ్యమంత్రి నితీష్ కుమార్ అధికారులతో సమీక్షించారు. భారీ వర్ష సూచనల నేపధ్యంలో ముంబై, ఠాణె, నవీ ముంబైతో పాటు రత్నగిరి, సింధుదుర్గ్ తదితర గ్రామీణ ప్రాంతాల్లో విద్యాలయాలకు సెలవులు ప్రకటించారు.तटीय कर्नाटक में 08 जुलाई, 2024 को अलग-अलग स्थानों पर भारी (64.5-115.5 मिलीमीटर) से बहुत भारी वर्षा (115.5-204.4 मिलीमीटर) के साथ अत्यंत भारी वर्षा (>204.4 मिलीमीटर) होने की प्रबल संभावना है। pic.twitter.com/7iaS8uRXCl— India Meteorological Department (@Indiametdept) July 8, 2024 -
రెండో టి20 వర్షార్పణం
చెన్నై: భారీ వర్షం కారణంగా భారత్, దక్షిణాఫ్రికా మహిళల క్రికెట్ జట్ల మధ్య ఆదివారం రెండో టి20 మ్యాచ్ రద్దయింది. భారత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకోగా... తొలుత బ్యాటింగ్‌కు దిగిన దక్షిణాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 177 పరుగులు సాధించింది. తజీ్మన్ బ్రిట్స్ (39 బంతుల్లో 52; 6 ఫోర్లు, 1 సిక్స్), అనెక్ బోష్ (32 బంతుల్లో 40; 6 ఫోర్లు) రాణించారు. భారత బౌలర్లలో పూజా వస్త్రకర్, దీప్తి శర్మ రెండు వికెట్ల చొప్పున తీశారు. దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ ముగియగానే వర్షం మొదలైంది. రాత్రి 10 దాటినా వాన తగ్గుముఖం పట్టకపోవడంతో అంపైర్లు మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. తొలి టి20లో నెగ్గిన దక్షిణాఫ్రికా 1–0తో ఆధిక్యంలో ఉంది. చివరిదైన మూడో టి20 మ్యాచ్ మంగళవారం జరుగుతుంది. స్కోరు వివరాలు దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్: లౌరా వొల్వార్ట్ (సి) రాధా యాదవ్ (బి) పూజా వస్త్రకర్ 22; తజీ్మన్ బ్రిట్స్ (స్టంప్డ్) ఉమా ఛెత్రి (బి) దీప్తి 52; మరిజన్ కాప్ (సి) సజన (బి) దీప్తి శర్మ 20; అనెక్ బోష్ (బి) శ్రేయాంక 40; చోల్ టైరన్ (సి అండ్ బి) రాధా యాదవ్ 12; నదినె డి క్లెర్క్ (సి) సజన (బి) పూజా వస్త్రకర్ 14; డెర్సెక్సన్ (నాటౌట్) 12; ఎలీజ్ మార్క్స్ (నాటౌట్) 1; ఎక్స్‌ట్రాలు 4; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 177. వికెట్ల పతనం: 1–43, 2–75, 3–113, 4–131, 5–164, 6–164. బౌలింగ్: పూజా వస్త్రకర్ 4–0–37–2, సజన సజీవన్ 1–0–13–0, అరుంధతి రెడ్డి 4–0–37–0, శ్రేయాంక పాటిల్ 4–0–37–1, రాధా యాదవ్ 3–0–31–1, దీప్తి శర్మ 4–0–20–2. -
రాజస్థాన్‌లో భారీ వర్షాలు.. జనజీవనం అస్తవ్యస్తం
రుతు పవనాల రాకతో గత మూడు నాలుగు రోజులుగా రాజస్థాన్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపధ్యంలో కోటా జిల్లా నుంచి మధ్యప్రదేశ్‌కు వెళ్లే రహదారి తెగిపోయింది. ఇక్కడి పార్వతి నది ఉప్పొంగుతుండటంతో రోడ్డుపై నీటి ప్రవాహం కొనసాగుతోంది. ఫలితంగా షియోపూర్, గ్వాలియర్ రహదారిలో రాకపోకలు నిలిచిపోయాయి. జనజీవనం అస్తవ్యస్తంగా మారింది.ఇక్కడికి సమీప గ్రామీణ ప్రాంతాల్లోని చెరువులు, కుంటలు పొంగిపొర్లుతున్నాయి. మోకాళ్లలోతు నీటి మధ్య వివిధ గ్రామాల ప్రజలు కాలం వెళ్తదీస్తున్నారు. టోంక్ జిల్లాలో భారీ వర్షం కారణంగా బిసల్పూర్ డ్యామ్ నీటిమట్టం 310.09 ఆర్ఎల్ మీటర్లకు చేరుకుంది. వరద ముప్పు పొంచివున్న నేపధ్యంలో విద్యాలయాలకు సెలవు ప్రకటించారు.జైపూర్‌లోని వాతావరణ కేంద్రం తెలిపిన వివరాల ప్రకారం మేవార్ ప్రాంతంలో జూలై 8 నుండి 10 వరకు భారీ వర్షాలు కురియనున్నాయి. మిగిలిన ప్రాంతాల్లో రానున్న రెండు మూడు రోజుల పాటు తేలికపాటి వర్షాలు కురియనున్నాయి. జులై 10 నాటికి రుతుపవనాలు మరింత బలపడతాయని, అప్పడు మరోసారి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. -
మూత తెరిచినా మునగం
వానాకాలం మొదలైంది.. కాస్త గట్టి వర్షం పడటంతో రోడ్లపై నీళ్లు నిలిచాయి.. ఆ నీరు వేగంగా పోయేందుకు కొన్నిచోట్ల మ్యాన్‌హోల్స్ తెరిచారు.. ఆ నీళ్లలోంచే, ఆ మ్యాన్‌హోల్స్ దగ్గరి నుంచే జనం అటూఇటూ నడిచి వెళ్లారు.. కానీ ఎవరికీ ఏ ప్రమాదమూ జరగలేదు.ఎందుకంటే..అక్కడ మ్యాన్‌హోల్ ఉందని స్పష్టంగా కనిపిస్తోంది. ఒకవేళ పట్టుజారినా అందులో పడిపోకుండా గ్రిల్స్ అడ్డంగా ఉన్నాయి. కాసేపటికి నీరంతా వెళ్లిపోయింది. మ్యాన్‌హోల్‌పై పెట్టేసిన మూత ఎల్ఈడీలతో వెలుగుతోంది. ప్రభుత్వం చేపట్టిన రక్షణ చర్యలన్నీ పూర్తయితే.. నిపుణుల సూచనలన్నీ అమల్లోకి వస్తే.. జరిగేది ఇదే.కానీ మ్యాన్‌హోల్స్ వద్ద రక్షణ చర్యలు ఇంకా పూర్తవలేదు.. వానల తీవ్రత పెరుగుతున్నా పనుల వేగం పెరగడం లేదనే విమర్శలు వస్తున్నాయి. డీప్ మ్యాన్‌హోల్స్‌కు గ్రిల్స్ ఏర్పాటును వేగవంతం చేయాలని.. జపాన్‌లో అనుసరిస్తున్న తరహాలో మ్యాన్‌హోల్స్ మూతలపై ఎల్ఈడీ లైట్లు ఏర్పాటు చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇవి అమలైతే.. ‘మ్యాన్‌హోల్‌లో పడి వ్యక్తి మృతి’వంటి ఘటనలు ఇకపై వినకుండా ఉంటామని అంటున్నారు.సాక్షి, హైదరాబాద్: వానాకాలం ప్రారంభమైంది. కాస్త గట్టిగా చినుకులు పడినప్పుడల్లా.. డ్రైనేజీ, నాలాలు ఉప్పొంగడం.. రోడ్లపై, కాలనీల్లో నీళ్లు చేరడం మొదలైంది. జీహెచ్ఎంసీ, జల మండలి ఎన్ని చర్యలు తీసుకున్నా.. రోడ్ల మీది చెత్త డ్రైనేజీల్లో చేరి పూడుకుపోవడంతో నీటి ప్రవాహానికి ఇబ్బందిగా మారుతోంది. అలాంటి సమయాల్లో మ్యాన్‌హోల్స్ మూతలు తెరిచి, నీరు పోయేలా చేస్తుండటం ప్రమాదకరంగా మారుతోంది. కొన్నిసార్లు అయితే.. ఎక్కడ మ్యాన్‌హోల్స్ ఉన్నాయి? ఎక్కడ రోడ్డు ఉందనేది తెలియని పరిస్థితి ఉంటోంది. ఏదో పనిమీద బయటికి వెళ్లినవారు, ఉద్యోగులు, స్కూళ్లు, కాలేజీల విద్యార్థులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఇంటిబాట పట్టాల్సిన దుస్థితి. తెరిచి ఉన్న మ్యాన్‌హోల్స్‌లో పడి జనం మృత్యువాతపడిన ఘటనలూ ఎన్నో.150కి పైగానే వాటర్ ల్యాగింగ్ పాయింట్స్మహానగరం పరిధిలో వాన నీరు నిలిచిపోయే సుమారు 150కుపైగా పాయింట్లుæ ఉన్నట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. అందులో 50 వరకు ప్రమాదకర ప్రాంతాలు ఉన్నట్టు అధికారవర్గాలు చెప్తున్నాయి. ప్రధానంగా ఎల్బీనగర్, చాదర్ ఘాట్, సింగరేణి కాలనీ, బాలాపూర్, మల్లేపల్లి, మైత్రీవనం, పంజగుట్ట, ఖైరతాబాద్, లక్డీకాపూల్, ఛే నంబర్, మెట్టుగూడ, వీఎస్టీ, ముషీరాబాద్, బాలానగర్, మూసాపేట, బోరబండ, మియాపూర్, కొండాపూర్ తదితర ప్రాంతాల్లో నీరు నిలిచే ప్రాంతాలు ఎక్కువ. ఇలాంటి చోట్ల నిలిచిన నీళ్లు త్వరగా వెళ్లిపోయేందుకు మ్యాన్‌హోల్స్ మూతలు తీస్తుండటం.. ప్రమాదాలకు దారి తీస్తోంది. మరికొన్ని చోట్ల వాహనాల రాకపోకలతో మ్యాన్‌హోల్స్ ఓపెనింగ్స్ దెబ్బతిన్నాయి, మూతలు పగిలిపోయాయి. అలాంటి చోట వాననీరు నిలిచి.. పాదచారులు ప్రమాదాల బారినపడుతున్నారు. వాహనాలు కూడా వాటిలో పడి దెబ్బతింటున్నాయి.జపాన్‌లో మ్యాన్‌హోల్స్‌కు ఎల్ఈడీ లైట్లు జపాన్‌లోని టోక్యో సిటీలో మ్యాన్‌హోల్స్ మూతలపై ప్రత్యేకంగా కార్టూన్ డిజైన్లతో ఎల్ఈడీ లైట్లను ఏర్పాటు చేశారు. సౌర విద్యుత్ సాయంతో రీచార్జి అయ్యే ఈ లైట్లు.. రోజూ సాయంత్రం 6 గంటల నుంచి అర్ధరాత్రి 2 గంటల వరకు వెలుగుతూ ఉంటాయి. ఆయా ప్రాంతాల్లో మ్యాన్‌హోల్స్ ఉన్నాయని సులువుగా గుర్తించి, జాగ్రత్త పడేందుకు వీటితో చాన్స్ ఉంటుంది. అంతేగాకుండా రకరకాల డిజైన్లు, రంగులతో కార్టూన్ క్యారెక్టర్లు కనిపిస్తూ అందంగా కూడా ఉంటున్నాయి. ఇలా మన దగ్గర కూడా మ్యాన్‌హోల్స్‌పై ఎల్ఈడీలు ఏర్పాటు చేస్తే బాగుంటుందని కొందరు సూచిస్తున్నారు. రాత్రిపూట మ్యాన్‌హోల్స్ సులువుగా కనబడితే.. ప్రమాదాలు తప్పుతాయని అంటున్నారు.జలమండలి రక్షణ చర్యలువరదల ముంపుతో ఢిల్లీ, ముంబై లాంటి పరిస్థితి హైదరాబాద్‌లో ఏర్పడకుండా జలమండలి ముందస్తు చర్యలు చేపట్టింది. సీవరేజీ ఓవర్ ఫ్లో, మ్యాన్‌హోల్స్ నిర్వహణపై సీరియస్‌గా దృష్టిపెట్టింది. నగరవ్యాప్తంగా వాటర్ ల్యాగింగ్ పాయింట్లు, లోతైన మ్యాన్‌హోల్స్‌ను గుర్తించింది. మ్యాన్‌హోల్స్‌కు సేఫ్టీ గ్రిల్స్ బిగించడంతోపాటు అత్యంత ప్రమాదకరమైనవని తెలిపేలా.. మ్యాన్‌హోల్స్‌కు ఎరుపు రంగు వేసి, హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేస్తోంది.కొన్ని వాటర్ ల్యాగింగ్ పాయింట్ల వద్ద ప్రత్యేకంగా సిబ్బందిని నియమించి పరిస్థితిని పర్యవేక్షించేలా చర్యలు చేపట్టింది. నగరవ్యాప్తంగా 63వేలకుపైగా డీప్ మ్యాన్ హోల్స్ ఉండగా.. ఇప్పటివరకు 25 వేల వరకు మ్యాన్‌హోల్స్‌పై సేఫ్టీ గ్రిల్స్ బిగించినట్టు అధికారులు చెప్తున్నారు. ప్రధాన రహదారుల్లో ఉన్న వాటిని కవర్స్‌తో సీల్ చేసి, ఎరుపు రంగు పెయింట్ వేస్తున్నామని.. ఎప్పటికప్పుడు మ్యాన్‌హోల్స్ నుంచి పూడిక, వ్యర్థాలను తోడేసేందుకు ఎయిర్‌టెక్ యంత్రాలను అందుబాటులో ఉంచినట్టు వివరిస్తున్నారు. ఇప్పటికే వానాకాలం మొదలైన నేపథ్యంలో.. ఈ రక్షణ చర్యలను మరింత వేగవంతం చేయాల్సి ఉందని నగర ప్రజలు కోరుతున్నారు.రంగంలోకి ఈఆర్టీ, ఎస్పీటీలువర్షాల నేపథ్యంలో ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (ఈఆరీ్ట), సేఫ్టీ ప్రొటోకాల్ టీమ్ (ఎస్పీటీ)లను జలమండలి రంగంలోకి దింపింది. క్షేత్రస్థాయిలో పనిచేసే సిబ్బందికి రక్షణ పరికరాలతోపాటు వాహనాలను కేటాయించింది. వాననీరు నిలిచిన చోట వాహనాల్లో ఉండే జనరేటర్లు, మోటార్లతో నీటిని తోడేస్తారు. ఎయిర్‌టెక్ యంత్రాలతో మ్యాన్‌హోల్స్ నుంచి తీసిన వ్యర్థాల (సిల్ట్)ను ఎప్పటికప్పుడు తొలగిస్తారు. మరోవైపు మ్యాన్‌హోళ్లను ఎప్పటికప్పుడు పర్యవేక్షించడానికి ప్రతి సెక్షన్Œ నుంచి సీవర్ ఇన్స్పెక్టర్ నేతృత్వంలో బృందాలను ఏర్పాటు చేశారు. వారు రోజూ ఉదయాన్నే తమ పరిధిలోని ప్రాంతాలకు వెళ్లి పరిస్థితి పర్యవేక్షిస్తారు. వాటర్ ల్యాగింగ్ పాయింట్లను ఎప్పటికప్పుడు క్లియర్ చేస్తారు.మ్యాన్‌హోల్స్ తెరిస్తే క్రిమినల్ కేసులువాన పడుతున్న సమయంలో, నీళ్లు నిలిచినప్పుడు.. అధికారుల అనుమతి లేకుండా మ్యాన్‌హోల్స్ మూతలను తెరవకూడదని జలమండలి స్పష్టం చేసింది. ఇష్టమొచి్చనట్టు తెరిచిపెడితే క్రిమినల్ కేసులు పెట్టాల్సి ఉంటుందని హెచ్చరించింది. ఎక్కడైనా మ్యాన్‌హోల్ మూత ధ్వంసమైనా, తెరిచి ఉంచినట్లు గమనించినా.. జలమండలి నంబర్ 155313కు ఫోన్‌చేసి సమాచారం ఇవ్వవచ్చని సూచించింది. నాలాలపై నిర్లక్ష్యంతో.. మహానగర పరిధిలోని పలుచోట్ల నాలాలు ప్రమాదకరంగా మారాయి. నిబంధనల ప్రకారం.. రెండు మీటర్ల కన్నా తక్కువ వెడల్పున్న నాలాలను క్యాపింగ్ (శ్లాబ్ లేదా ఇతర పద్ధతుల్లో పూర్తిగా కప్పి ఉంచడం) చేయాలి. రెండు మీటర్ల కన్నా వెడల్పున్న నాలాలకు రిటైనింగ్ వాల్ కట్టాలి. లేదా ఫెన్సింగ్ వేయాలి. కానీ గ్రేటర్ సిటీ పరిధిలో సగానికిపైగా చిన్న నాలాలకు క్యాపింగ్ లేదు. పెద్ద ఓపెన్ నాలాలకు రిటైనింగ్ వాల్/ ఫెన్సింగ్ లేకుండా పోయాయి. గతంలో వేసిన క్యాపింగ్, ఫెన్సింగ్ భారీ వర్షాలతో దెబ్బతిన్నాయి. దీనితో వాన పడినప్పుడు నాలాల్లో పడి ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. గత ఐదేళ్లలో సుమారు 15 మందికిపైగా నాలాల్లో పడి చనిపోవడం గమనార్హం. వానాకాలం మొదలైన నేపథ్యంలో యుద్ధ ప్రాతిపదికన క్యాపింగ్, ఫెన్సింగ్ వేయడం.. బారికేడ్లు, హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయడం వంటి చర్యలు తీసుకోవాలని సామాజిక వేత్తలు కోరుతున్నారు.మ్యాన్‌హోల్స్‌కు రక్షణ కవచాలు వర్షాకాలంలో మ్యాన్‌హోల్స్‌తో ఎలాంటి ప్రమాదాలు సంభవించకుండా ముందస్తు రక్షణ చర్యలు చేపట్టాం. మ్యాన్‌హోల్స్‌కు సేఫ్టీ గ్రిల్స్ ఏర్పాటు చేస్తున్నాం. డీప్ మ్యాన్‌హోల్స్‌కు ఎరుపు రంగు వేసి అత్యంత ప్రమాదకరమైనవని తెలిసేలా హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశాం. వాటర్ ల్యాగింగ్ పాయింట్లను గుర్తించి ఎప్పటికప్పుడు క్లియర్ చేసేలా చర్యలు చేపట్టాం. వర్షం పడే సమయంలో కింది స్థాయి సిబ్బంది నుంచి మేనేజర్ వరకు వారి పరిధిలోని ఫీల్డ్‌లో ఉండేలా ఆదేశాలు జారీ చేశాం.డ్రైనేజీలు, నాలాలు క్లీన్‌గా ఉంచాలి డ్రైనేజీలు, నాలాలు క్లీన్‌గా ఉంచాలి. వాటిలో పూడికను ఎప్పటికప్పుడు తొలగించాలి. వాన నీరు సైతం సాఫీగా వెళ్లే విధంగా మార్గం ఉండాలి. వాటిలో పూడిక పేరుకుపోవడంతో వర్షం పడినప్పుడు నీరు వెళ్లక రోడ్లన్నీ జలమయం అవుతున్నాయి. ప్రమాదాలు సంభవిస్తున్నాయి. మురుగు నీటి వ్యవస్ధను పర్యవేక్షించే యంత్రాంగం యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలి. నిరంతరం పూడికతీత పనులు కొనసాగించాలి. వర్షాకాలంలో ప్రత్యేకంగా దృష్టి సారించాలి.సిటీలో సీవరేజీ నెట్వర్క్, మ్యాన్ హోల్‌ల లెక్క ఇదీ..జీహెచ్ఎంసీ పరిధిలో సీవరేజీ నెట్వర్క్: 5,767 కి.మీశివారు మున్సిపాలిటీల పరిధిలో : 4,200 కి.మీ మొత్తం మ్యాన్‌హోల్స్: 6,34,919 డీప్ మ్యాన్‌హోల్స్: 63,221 వీటిలో జీహెచ్ఎంసీ పరిధిలో..: 26,798 శివారు మున్సిపాలిటీల పరిధిలో..: 36,423 -
పిడుగు ముద్దాడ బోయింది
వానలో తడవాలని పిల్లలకు ఉంటుంది. జల్లుల్లో వాళ్లు కేరింతలు కొడితే ముద్దొస్తారు. మరి పిడుగుకు ముద్దొస్తే? తృటిలో ప్రాణాలు తప్పిపోయాయి. వానలో పిల్లలు జాగ్రత్త.బిహార్‌లోని సీతామర్హిలో ఒకమ్మాయి వానలో టెర్రస్ మీద సరదాగా కేరింతలు కొడుకుతుంటే తల్లి అది ఫోన్లో వీడియో తీయసాగింది. మనం అనుకుంటాం వాతావరణం ఆహ్లాదంగా ఉందని. కాని మెరుపులు, పిడుగులు ఎలా మెరిసి ఉరుముతాయో తెలియదు కదా. ఇక్కడ ఆ అమ్మాయికి కొద్ది దూరంలోనే పిడుగు పడింది. క్షణాల్లో ఆ అమ్మాయి లోపలికి పరిగెత్తింది. అమ్మాయి, తల్లి క్షేమమేగాని గురి సూటిగా ఉండి ఉంటే? అందుకే జాగ్రత్త. ఇకపై వానలు... ఉరుములు... పిడుగులు.. -
రానున్న రెండ్రోజులు తేలికపాటి వానలు
సాక్షి, హైదరాబాద్: పశ్చి మ మధ్య బంగాళాఖాతం, దాన్ని ఆనుకుని ఉన్న వాయవ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం ప్రభావంతో శుక్రవారం ఉత్తర ఒడిశా తీరం వద్ద వాయవ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడినట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఇది సముద్ర మట్టం నుంచి సగటున 5.8 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. దీంతో రాష్ట్రంలో రానున్న రెండ్రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, ఉత్తర, తూర్పు ప్రాంత జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది. ప్రస్తుతం వాతావరణంలో నెలకొన్న మార్పుల ప్రభావంతో ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పతనమయ్యాయి. శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా గరిష్ట ఉష్ణోగ్రతలు 2 డిగ్రీల నుంచి 4 డిగ్రీలు తక్కువగా నమోదయ్యాయి. శుక్రవారం రాష్ట్రంలో నమోదైన ఉష్ణోగ్రతలు పరిశీలిస్తే గరిష్ట ఉష్ణోగ్రత రామగుండంలో 33.7 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత మెదక్‌లో 21.4 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. -
వాయవ్య బంగాళాఖాతంలో అల్పపీడనం
సాక్షి, విశాఖపట్నం: వాయవ్య బంగాళాఖాతంలో శుక్రవారం అల్పపీడనం ఏర్పడింది. దీనికనుబంధంగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఈ అల్పపీడనం రానున్న 2 రోజులు వాయవ్య దిశగా పయనించనుంది. ఫలితంగా వచ్చే 3 రోజులు కోస్తాంధ్ర, రాయలసీమల్లో వర్షాలకు అవకాశమున్నట్లు భారత వాతావరణ విభాగం తెలిపింది. -
హైదరాబాద్‌లో భారీ ట్రాఫిక్ జామ్!
సాక్షి,హైదరాబాద్ : హైదరబాద్ కురిసిన వర్షాల కారణంగా నగరంలోని పలు ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామైంది. ఐకియా సర్కిల్ దగ్గర వర్షం తర్వాత ఆఫీస్ ముగియడంతో వాహనాలు ఒక్కసారిగా రోడ్లపైకి వచ్చాయి. దీంతో రోడ్డుకు ఇరువైపులా వాహనాలు నిలిచిపోయాయి.బయో డైవర్సిటీ మాదాపూర్ వరకు ట్రాఫిక్ ఆగిపోవడంతో వాహనదారులు చుక్కలు చూస్తున్నారు. ట్రాఫిక్‌ను క్లియర్ చేసేందుకు ట్రాఫిక్ పోలీసులు రంగంలోకి దిగారు. ఐటీ ఉద్యోగులు దశలవారీగా ప్రత్యామ్నాయ మార్గాల్లో తమ తమ గమ్య స్థానాలకు వెళ్లాలని సూచిస్తున్నారు పోలీసులు.సైబరాబాద్ పరిధిలో అటు గచ్చిబౌలి మొదులుకుని గచ్చిబౌలి, మాదాపూర్ బయో డైవర్సిటీ సిగ్నల్,ఐకియా, హైటెక్ సిటీ ఫ్లైఓవర్,జేఎన్టీయూ ఫ్లైఓవర్లో భారీగా ట్రాఫిక్ జామ్ కనిపిస్తోంది. గంటపాటు ఎడతెరిపిలేకుండా వర్షం కురియడంతో వాహనాలన్నీ ఎక్కడికక్కడా నిలిచిపోయాయని పోలీసులు చెబుతున్నారు.వర్షం తగ్గగానే ఒక్కసారిగా వాహనాలన్నీ రోడ్డెక్కాయి. ముందుకు కదల్లేని పరిస్థితి నెలకొంది. నానక్ రామ్ గూడా మొదులుకుని గచ్చిబౌలీ, బయోడైవర్సిటీ ట్రాఫిక్ నిలిచిపోయింది. ఫలితంగా మాదాపూర్ వెళ్లాలన్నా.. ఇటు జేఎన్టీయూ వెళ్లాలన్నా ఐకియా సిగ్నల్ మీది నుంచి వెళ్లాల్సి ఉంది. ప్రత్యామ్నాయ మార్గం లేకపోవడంతో ఆ మార్గంలో ట్రాఫిక్ స్తంభించడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.ఈ తరుణంలో నగర ప్రజలు అవసరమైతే తప్ప బయటకు రావొద్దని జీహెచ్ఎంసీ అధికారులు సూచిస్తున్నారు. పోలీసులు సైతం ఉద్యోగులు ఓ గంట ఆలస్యంగా ఆఫీస్‌ల నుంచి ఇంటికి వెళ్లాలని విజ్ఞప్తి చేస్తున్నారు. -
కేరళలో భారీ వర్షాలు.. విద్యాసంస్థల మూసివేత
కేరళను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. ఈ నేపధ్యంలో వాతావరణశాఖ పలు హెచ్చరికలు, సూచనలు జారీ చేసింది. నైరుతి రుతుపవనాలు కేరళ మీదుగా మరికొన్ని రోజులు కొనసాగనున్నాయని తెలిపింది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు.మహారాష్ట్ర-కేరళ తీరాల వెంబడి సముద్ర మట్టంలో ద్రోణి ఏర్పడిందని వాతావరణశాఖ అధికారులు పేర్కొన్నారు. మధ్య గుజరాత్ పరిసర ప్రాంతాలలోనూ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని తెలిపారు. కేరళ తీరంలో గంటకు 35 కిలోమీటర్ల నుంచి 45 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉన్నందున మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లవద్దని అధికారులు సూచించారు. వాతావరణశాఖ హెచ్చరికల నేపధ్యంలో కేరళలోని ఆరు జిల్లాల్లో పాఠశాలలను మూసివేశారు. పతనంతిట్ట, కొట్టాయం, అలప్పుజ, ఇడుక్కి, ఎర్నాకుళం, వయనాడ్‌లలో గత రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి. -
నేడు, రేపు విస్తారంగా వానలు!
సాక్షి, విశాఖపట్నం: రాష్ట్రంలో గురువారం, శుక్రవారం విస్తారంగా వర్షాలు కురుస్తాయని బుధవారం భారత వాతావరణ విభాగం (ఐఎండీ) వెల్లడించింది. అక్కడక్కడా భారీ వర్షాలు పడతాయని తెలిపింది. గంటకు 30–40 కి.మీల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. ఉరుములు, మెరుపులతో పాటు పిడుగులు పడే ప్రమాదం ఉందని విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరించింది. కాగా ప్రస్తుతం మధ్య గుజరాత్ ప్రాంతంలో ఆవర్తనం కొనసాగుతోంది. తూర్పు విదర్భ వరకు ద్రోణి విస్తరించి ఉంది. వీటి ప్రభావంతో కోస్తాంధ్ర, రాయలసీమల్లో వచ్చే ఐదు రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, గురువారం, శుక్రవారం కోస్తాంధ్రలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం తెలిపింది. గురు, శుక్రవారాల్లో శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు, కృష్ణా జిల్లాల్లో ఒకట్రెండు చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. అలాగే గురువారం పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం, అనకాపల్లి, కాకినాడ, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి, వైఎస్సార్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోనూ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించింది. శుక్రవారం పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, శ్రీకాకుళం, అనకాపల్లి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లోనూ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలకు ఆస్కారం ఉందని వెల్లడించింది. కాగా బుధవారం అనకాపల్లి జిల్లా కొక్కిరాపల్లిలో 7.4 సెం.మీ, పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడలో 7.01 సెం.మీ, శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్లలో 6.08 సెం.మీ వర్షం కురిసింది. -
గోశాలలో గోవుల గోస
వేములవాడ అర్బన్: వేములవాడ రాజన్న గోశాలలో వసతులు కరువయ్యాయి. భక్తుల విశ్వాసంగా నిలిచే కోడెమొక్కుల కోడెలకు కనీస సౌకర్యాలు లేవు. వానకు తడుస్తూ.. ఎండకు ఇబ్బందిపడుతూ ఆరుబయటే ఉంటున్నాయి. చిన్నపాటి వర్షానికే బురదమయమవుతున్న నేలపైనే పడుకుంటున్నాయి. కనీస వసతులు లేక భక్తులు అందించే కోడెలు గోశాలలో ఇబ్బంది పడుతున్నాయి. కనీసం గోవులు నిల్చోలేని పరిస్థితులు అక్కడ ఉన్నాయి. కోడెమొక్కుల ద్వారా అత్యధిక ఆదాయం వస్తున్నా గోశాలలో మాత్రం వసతుల కల్పనపై ఆలయ అధికారులు దృష్టి పెట్టడం లేదు. రూ.కోట్లు వస్తున్నా..వేములవాడ రాజన్న ఆలయానికి వచ్చే భక్తులు కోడెమొక్కులు చెల్లిస్తుంటారు. కోడె మొక్కు టికెట్ ధర రూ.200 ఉంది. అలాగే కోడెమొక్కుల ద్వారా స్వామికి వచ్చే ఆదాయం ఏడాదికి దాదాపు రూ.22 కోట్ల వరకు ఉంటుంది. ఇంత ఆదాయం వస్తున్నా గోశాలలో మాత్రం సౌకర్యాలు లేవు. గోశాలల్లోని కోడెల సంరక్షణకు ఏటా రూ.2 కోట్ల వరకు వెచ్చిస్తున్నా, ఈ నిధులతో ఎలాంటి సౌకర్యాలు కలి్పంచలేకపోతున్నారు. వసతికి మించిన కోడెలు..రాజన్న ఆలయానికి రెండు గోశాలలు ఉన్నాయి. గుడి చెరువు కట్ట కింద ఉన్న గోశాలలో 150 కోడెలు, 20 ఆవులు ఉన్నాయి. రాజన్నకు మొక్కులు చెల్లించే కోడెలను, ఆవులను ఉంచుతారు. తిప్పాపూర్‌లో రెండో గోశాల ఉంది. ఇక్కడ 300 కోడెల కోసం రేకులòÙడ్డు వేశారు. కానీ ఆరు నెలల క్రితం కోడెలను రిజి్రస్టేషన్ ఉన్న గోశాలకు ఇవ్వకుండా..అధికారులను తప్పుదోవ పట్టించి తీసుకెళ్లడంతో అప్పటి నుంచి ఇతర గోశాలలకు రాజన్న కోడెలు, ఆవులను ఇవ్వడం లేదు. కోడెలను తిప్పాపూర్ గోశాలలోనే సంరక్షిస్తున్నా రు. ఇక్కడ 300 కోడెలకు వసతి ఉండగా..ప్రస్తుతం 1,600 కోడెలు ఉన్నా యి. దీంతో చిన్నపాటి వర్షానికే గోశాల బురదమయం కావడంతో కోడెలు కనీసం పడుకునే పరిస్థితి లేదు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఒక చోట, రాత్రి నుంచి తెల్లారేవరకు మరో చోట కోడెలను ఉంచుతున్నారు.తడిస్తే వ్యాధుల బారినపడే అవకాశం ఉంది వర్షాకాలంలో పశువులు, ఆవులతో జాగ్రత్తగా ఉండాలి. వర్షంలో తడిస్తే బలహీనమై వ్యాధుల బారినపడే అవకాశం ఉంది. కాళ్లు మెత్తబడి డెక్కల్లో పుండ్లు అవుతాయి. సరిగా తినలేకపోతాయి. ఎప్పటికప్పుడు పేడ తియ్యకపోతే ఏదైనా ఒక్క ఆవుకు రోగం వస్తే అన్ని ఆవులకు సంక్రమించే అవకాశం ఉంది. బురద ఎక్కువైతే కాలు జారి కిందపడే అవకాశాలు ఉన్నాయి. – ప్రశాంత్‌రెడ్డి, మండల పశువైద్యాధికారి, వేములవాడ త్వరలోనే అందిస్తాంభక్తులు అందించిన కోడెలను తిప్పాపూర్ గోశాలలో సంరక్షిస్తున్నాము. గోశాలలో పరిమితికి మించి కోడెలు ఉన్నాయి. ఆలయ అధికారులతో కమిటీ నియామకానికి కలెక్టర్‌కు ఫైల్ పంపించాం. కమిటీ ఆదేశాలతో కోడెలను రైతులకు, రిజిస్ట్రేషన్ ఉన్న గోశాలలకు అందిస్తాం. వారం రోజుల్లోగా ఆదేశాలు వస్తాయని అనుకుంటున్నాం. – శ్రీనివాస్, రాజన్న ఆలయ ఏఈవో -
ముందుకు కదలని రుతుపవనాలు..
-
నిరాశపరచనున్న నైరుతి రుతు పవనాలు.. సాధారణ వర్షపాతం
-
హైదరాబాద్ లో పలు చోట్ల కుండపోత వాన
-
సమస్య ఉంటే ఈ నంబర్లకు కాల్ చేయండి
సాక్షి, హైదరాబాద్: ఈదురుగాలులతో కూడిన వర్షానికి తరచూ ఫీడర్లు ట్రిప్పవుతున్నాయి. చెట్ల కొమ్మలు విరిగి పడుతుండటంతో వైర్లు తెగుతున్నాయి. విద్యుత్ స్తంభాలు, డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లు నేలకూలుతున్నాయి. దీనితో గంటల తరబడి సరఫరా నిలిచిపోతోంది. అలాంటి సమయంలో వినియోగదారులు 1912 కాల్ సెంటర్/ మొబైల్‌యాప్‌లో/ స్థానిక లైన్మన్లకు సమాచారం ఇచ్చినా స్పందించడం లేదనే ఫిర్యాదులు ఉన్నాయి. ఈ క్రమంలో విద్యుత్ సరఫరాలో అంతరాయాలకు ఆస్కారం ఇవ్వకూడదనే ఉద్దేశంతో సర్కిళ్ల వారీగా ప్రత్యేక కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేశారు.సర్కిల్ పేరు ఫోన్ నంబర్ హైదరాబాద్ సెంట్రల్ 9491629047 హైదరాబాద్ సౌత్ 9491628269 సికింద్రాబాద్ 9491629380 బంజారాహిల్స్ 9491633294 సైబర్‌సిటీ 9493193149 రాజేంద్రనగర్ 7382100322 సరూర్‌నగర్ 7901679095 హబ్సిగూడ 9491039018 మేడ్చల్ 7382618971 వికారాబాద్ 9493193177విద్యుత్ సరఫరా, తలెత్తుతున్న సాంకేతిక సమస్యలు, చేపట్టిన అభివృద్ధి పనులపై గతంలో నెలకోసారి రివ్యూలు నిర్వహించేవారు. ప్రస్తుతం రోజు ఉదయం 8.30 గంటలకే టెలికాన్ఫరెన్స్ ద్వారా సమీక్షిస్తున్నాం. బ్రేక్ డౌన్లు, గృహజ్యోతి దరఖాస్తులు, సేవల్లో లోపాలపై ఆన్లైన్లో అందుతున్న ఫిర్యాదులపై చర్చిస్తున్నాం. అంతర్గత సామర్థ్యం పెంపు, నష్టాల నియంత్రణపైనా చర్యలు చేపట్టాం. అత్యవసర పరిస్థితుల్లో సీజీఎంలు, ఎస్ఈలు, డీఈలు, ఏడీ ఈలు, ఏఈలు, జూనియర్ లైన్మెన్లు, ఆరి్టజన్లు అంతా అందుబాటులో ఉండేలా ఆదేశాలిచ్చాం. అర్ధరాత్రి, భారీ వర్షాలను సైతం లెక్క చేయకుండా లైన్ల పునరుద్ధరణ పనులు చేపడుతున్నాం. బ్రేక్‌డౌన్, ఇతర అంతరాయాలను చాలా వరకు తగ్గించాం.సరఫరా మెరుగుపడాలంటే ఏం చేయాలి? ⇒ విద్యుత్ స్తంభాల పాలిట ఉరితాళ్లుగా మారిన టీవీ, ఇంటర్నెట్ కేబుళ్లను తక్షణమే తొలగించాలి. ⇒ లైన్ టు లైన్ తనిఖీలు చేపట్టి అనధికారిక కనెక్షన్లను తొలగించాలి. అంతర్గత భారీ నష్టాల నుంచి సంస్థను గట్టెక్కించాలి. ⇒ ఏబీ స్విచ్‌ల నాణ్యతను పరిశీలించాలి. సరఫరాలో హెచ్చుతగ్గుల నియంత్రణ, షార్ట్ సర్క్యూట్ల నియంత్రణ కోసం ఎర్తింగ్ సిస్టంను పకడ్బందీగా ఏర్పాటు చేయాలి. ⇒ చెట్లు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో భూగర్భ కేబుళ్లు, ఎయిర్ బంచ్డ్ కేబుళ్లు ఏర్పాటు చేస్తే.. ఈదురుగాలులతో సరఫరా నిలిచే సమస్య తలెత్తదు. ⇒ భూగర్భ విద్యుత్ కేబుళ్ల ఏర్పాటు కోసం ప్రత్యేకంగా డక్ట్ సిస్టం ఏర్పాటు చేయాలి. ⇒ డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్ల చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలి. అక్కడి చెత్తను ఎప్పటికప్పుడు తొలగించడం ద్వారా అగ్ని ప్రమాదాలను నివారించొచ్చు. ⇒ ఏఈలు, ఏడీఈలు కేవలం కొత్త కనెక్షన్ల జారీ, మీటర్ రీడింగ్లపైనే దృష్టి సారిస్తున్నారు. వారు సాంకేతిక అంశాలపైనా దృష్టి సారించేలా చర్యలు చేపట్టాలి. ⇒ కోర్‌సిటీలో ఇప్పటికీ నిజాం కాలం నాటి లైన్లే ఉన్నాయి. చాలాచోట్ల ఒకే స్తంభం నుంచి ఎల్టీ, హెచ్‌టీ లైన్లు వెళ్తున్నా యి. ప్రమాదాలను నివారించేందుకు వీటిని వేరు చేయాలి. ⇒ కొందరు జూనియర్ లైన్మన్లు.. అనధికారికంగా ఎలాంటి అనుభవం, అవగాహన లేని ప్రైవేటు వ్యక్తులను అసిస్టెంట్లుగా నియమించుకుని.. వారితో పనులు చేయిస్తున్నారు. అలాంటి వారిని గుర్తించి, చర్యలు తీసుకోవడం ద్వారా సాంకేతిక సమస్యలు తలెత్తకుండా చూడొచ్చు. -
కరెంట్.. గాల్లో దీపం
సాక్షి, హైదరాబాద్: వారం రోజుల క్రితం ఈదురుగాలితో కూడిన వర్షానికి చెట్ల కొమ్మలు విరిగి పడి తీగలు తెగిపోవడంతో.. బోడుప్పల్, నారపల్లి, చెంగిచెర్ల, పీర్జాదిగూడలో కరెంటు సరఫరా నిలిచిపోయింది. గంటల తరబడి సరఫరా పునరుద్ధరించకపోవడంతో స్థానికులు ఆగ్రహంతో సమీపంలోని సబ్‌స్టేషన్‌ను ముట్టడించారు.పదిరోజుల కింద వాటర్‌బోర్డు ఆధ్వర్య ంలో మంచినీటి పైపులైన్ కోసం రాత్రిపూట తవ్వకాలు చేపట్టగా.. మయూరినగర్ సబ్‌స్టేషన్‌కు విద్యుత్ సరఫరా చేసే 33/11 కేవీ అండర్‌గ్రౌండ్ కేబుల్ దెబ్బతింది. ఆ సబ్‌స్టేషన్ పరిధిలోని ప్రాంతాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.పదిహేను రోజుల క్రితం బాచుపల్లిలోని 33/11కేవీ అండర్‌గ్రౌండ్ కేబుల్‌లో అకస్మాత్తుగామంటలు చెలరేగాయి. పలు ఫీడర్ల పరిధిలోని కాలనీలకు పది గంటలకుపైగా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దీనితో స్థానికులు సబ్‌స్టేషన్ ముట్టడించి నిరసన వ్యక్తం చేశారు.క్షేత్రస్థాయిపై అవగాహన లేక..తెలంగాణ ఏర్పాటు తర్వాత హైదరాబాద్ నగరం శరవేగంగా విస్తరిస్తోంది. నెలకు కనీ సం 2,500 కొత్త కనెక్షన్లు వచ్చి చేరుతున్నాయి. పదేళ్ల క్రితం 1,800 నుంచి 2,200 మెగావాట్లు ఉన్న విద్యుత్ డిమాండ్.. ప్రస్తుతం 3,900 నుంచి 4,000 మెగావాట్లు దాటింది. డిమాండ్ మేరకు సరఫరా వ్యవస్థను మెరుగుపర్చేందుకు చర్యలు చేపట్టినా.. అంతరాయాలు మాత్రం ఆగడం లేదు. క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న చాలా మంది ఇంజనీర్లకు లైన్లపై సరైన అవగాహన లేకపోవడంతో.. అత్యవసర పరిస్థితుల్లో తలెత్తిన సాంకేతిక లోపాలను గుర్తించలేకపోతున్నారనే విమర్శ ఉంది.ఎవరైనా స్థానికులు ఫలానా చోట వైరు తెగిందనో? ట్రాన్స్ఫార్మర్ పేలిందనో? విద్యుత్ స్తంభం నేల కూలిందనో ఫోన్‌చేసి చెప్తేగానీ సమస్యను గుర్తించలేని పరిస్థితి. అంతేకాదు లైన్ల నిర్వహణ, పునరుద్ధరణ పనుల కోసం ఏటా రూ.వంద కోట్లకుపైగా ఖర్చు చేస్తున్నారు. అయినా ఇబ్బందులు తప్పడం లేదు.సంస్కరణలు చేపట్టినా.. సద్దుమణగని సమస్యలుపరిపాలనలో సౌలభ్యం, విద్యుత్ సమస్యల సత్వర పరిష్కారం కోసం డిస్కం వేర్వేరు (ఆపరేషన్స్, సీబీడీ లైన్స్ వింగ్, కన్స్ట్రక్షన్ అండ్ ప్రాజెక్ట్స్) విభాగాలను ఏర్పాటు చేసింది. ఆపరేషన్స్ ఏఈ బిల్లింగ్, రెవెన్యూ వసూళ్లకే పరిమితం అయ్యేవారు. ఏదైనా విపత్తు జరిగితే పరిష్కార బాధ్యతను సీబీడీ గ్యాంగ్ నిర్వర్తించేది. ఇక కొత్త సబ్స్టేషన్లు, లైన్ల విస్తరణ, భూగర్భ కేబుళ్ల ఏర్పాటు వంటి పనులను మాస్టర్ ప్లాన్ విభాగం చూసుకునేది.ఇలా ఎవరి పరిధిలో వాళ్లు ఉండటంతో.. విపత్తుల సమయంలో బ్రేక్‌డౌన్స్, సరఫరా పునరుద్ధరణ విషయంలో ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వచి్చంది. ముషారఫ్ ఫారూఖీ సీఎండీగా బాధ్యతలు స్వీకరించాక.. సంస్థలో పలు సంస్కరణలు తీసుకొచ్చారు. ఆపరేషన్స్ ఏఈలకు కూడా అంతరాయాలను పరిష్కరించే బాధ్యత అప్పగించారు. గతంలో లైన్ల పునరుద్ధరణకు లైన్ క్లియర్ (ఎల్సీ) పేరుతో గంటల తరబడి కరెంట్ సరఫరా నిలిపేసేవారు. ప్రస్తుతం ఆ విధానానికి స్వస్తి చెప్పారు. అయినా అంతరాయాల సమస్య తగ్గడం లేదు. ...గ్రేటర్ హైదరాబాద్ నగరంలో తరచూ జరుగుతున్న విద్యుత్ అంతరాయాలకు చిన్న ఉదాహరణలివి. చిన్న వాన పడినా చాలు.. నగరంలోని పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోతోంది. కొన్నిచోట్ల గంటలకు గంటలు అంతరాయం కలుగుతోంది. విద్యుత్ వ్యవస్థలు సరిగా లేకపోవడానికి తోడు అధికారులు, సిబ్బంది విధుల నిర్వహణలో నిర్లక్ష్యం, నాసిరకం కేబుళ్లు, ఏబీ స్విచ్‌లు, ఇన్సులేటర్లు, కండక్టర్లు, లోపభూయిష్టమైన ఎర్తింగ్ సిస్టం, స్తంభాలకు వేలాడుతున్న టీవీ, ఇంటర్నెట్ కేబుళ్లు.. వెరసి విద్యుత్ సరఫరాలో సమస్యలకు కారణం అవుతున్నాయి. ఈ విషయంలో తగు చర్యలు తీసుకోవాలని నగరవాసులు కోరుతున్నారు.చినుకు పడితే చీకటే..రాజేంద్రనగర్ డివిజన్ బుద్వేల్‌లో తరచూ కరెంటు సమస్య వస్తోంది. చినుకుపడితే చాలు చీకటి అవుతోంది. అంతరాయాలు లేకుండా చూడాలని పలుమార్లు అధికారులకు విన్నవించినా సమస్య పరిష్కారం కాలేదు. కాలనీల్లో వీధిలైట్లు వెలగడం లేదు. ఇంట్లో కరెంట్ లేక ఉక్కపోత, దోమలతో కంటిమీద కునుకు లేకుండా పోతోంది. – సదానంద్, బుద్వేల్ -
రానున్న రెండ్రోజులు ఉత్తర జిల్లాల్లో వర్షాలు
సాక్షి, హైదరాబాద్: రాయలసీమ నుంచి పశ్చిమ, మధ్య బంగాళాఖాతం మీదుగా ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. ఇది సముద్రమట్టం నుంచి సగటున 3.1 కిలోమీటర్ల నుంచి 5.8 కిలోమీటర్ల మధ్యలో ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో రానున్న రెండ్రోజులు రాష్ట్రంలోని ఉత్తర, తూర్పు ప్రాంత జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని సూచించింది. శనివారం రాష్ట్రంలో గరిష్ట, కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణ స్థితిలోనే నమోదయ్యాయి. గరిష్ట ఉష్ణోగ్రత నల్లగొండలో 39.5 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత మెదక్‌లో 22.4 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. రానున్న రెండ్రోజులు కూడా రాష్ట్రంలో సాధారణ ఉష్ణోగ్రతలే నమోదవుతాయని వాతావరణ శాఖ సూచించింది. -
భారత్ పోరు వర్షార్పణం
లాడర్‌హిల్: టి20 ప్రపంచకప్‌లో టీమిండియా జైత్రయాత్రను వరుణుడు అడ్డుకున్నాడు. గ్రూప్ ‘ఎ’లో భారత్ ఆఖరి లీగ్ మ్యాచ్ వర్షార్పణమైంది. శనివారం కెనడాతో జరగాల్సిన మ్యాచ్ రద్దయ్యింది. భారత కాలమానం ప్రకారం ముందుగా రాత్రి 7.30 గంటలకు తొలిసారి మైదానాన్ని పరిశీలించారు. మైదానం సిద్ధం కాకపోవడంతో టాస్ ఆలస్యమైంది. అయితే ఆ తర్వాతా పరిస్థితి మెరుగుపడలేదు. చివరి సారిగా రాత్రి 9 గంటలకు పిచ్, అవుట్ ఫీల్డ్‌ను పూర్తి స్థాయిలో సమీక్షించిన ఫీల్డు అంపైర్లు ఇక ఆట జరిగే పరిస్థితి లేదని తేల్చేశారు. మరో సమీక్షకు తావు లేకుండా మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో ఇరు జట్లకు చెరో పాయింట్ దక్కింది. గ్రూప్ దశలో ఆడిన నాలుగు మ్యాచ్‌లు గెలిచి సంపూర్ణ విజయం సాధించే అవకాశం రాకపోయినా... ఇదివరకే సూపర్–8కు చేరిన భారత్ 7 పాయింట్లతో గ్రూప్ ‘ఎ’ టాపర్‌గా నిలిచింది. కెనడా లీగ్ దశలో ఐర్లాండ్‌పై ఏకైక విజయాన్ని అందుకుంది. ఇక ఈ మెగా ఈవెంట్లో భారత ఆటగాళ్ల ప్రదర్శన సంతృప్తికరమనే చెప్పొచ్చు. కోహ్లి (1, 4, 0) మూడు మ్యాచ్‌ల్లోనూ నిరాశపరిచినా... దీన్ని భూతద్దంలో చూడాల్సిన పనిలేదు. సూపర్–8లో అతను కీలక ఇన్నింగ్స్‌లు ఆడతాడని టీమ్ మేనేజ్మెంట్ భావిస్తోంది. కెపె్టన్ రోహిత్ ఒక అర్ధ సెంచరీ బాదగా, రిషభ్ పంత్ వన్‌డౌన్‌లో మెరుగ్గా ఆడాడు. ఐర్లాండ్, పాక్‌లతో విఫలమైన హిట్టర్లు సూర్యకుమార్ యాదవ్, శివమ్ దూబేలిద్దరు అమెరికాతో జరిగిన పోరులో టచ్‌లోకి వచ్చారు. ఇక బౌలింగ్‌లో అనుభవజు్ఞడైన బుమ్రా, హార్దిక్, సిరాజ్‌లతో పాటు అర్‡్షదీప్ రాణించాడు. స్పిన్నర్లు ఫర్వాలేదనిపించారు. దీంతో విజయాల జట్టును మార్చకుండానే బరిలోకి దిగింది. సూపర్–8లోనూ ఇదే పంథా కొనసాగించే అవకాశాలే ఉన్నాయి. గ్రూప్ ‘ఎ’ నుంచి భారత్‌తో పాటు అమెరికా ముందంజ వేయగా, గత రన్నరప్ పాక్ లీగ్ దశతోనే సరిపెట్టుకుంది. టి20 ప్రపంచకప్‌లో నేడుఆ్రస్టేలియా X స్కాట్లాండ్ వేదిక: గ్రాస్ ఐలెట్; ఉ.గం.6.00 నుంచి పాకిస్తాన్ X ఐర్లాండ్ వేదిక: లాడర్‌హిల్; రాత్రి గం. 8 నుంచిస్టార్ స్పోర్ట్స్, హాట్ స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారంసూపర్–8లో భారత్ మ్యాచ్లుజూన్ 20 – అఫ్గానిస్తాన్‌తో (బ్రిడ్జ్‌టౌన్) జూన్ 22 – బంగ్లాదేశ్ (లేదా) నెదర్లాండ్స్‌తో (నార్త్‌సౌండ్) జూన్ 24 – ఆ్రస్టేలియాతో (గ్రాస్ ఐలెట్) -
భారత్-కెనడా మ్యాచ్ వర్షార్పణం..
India vs canada live updates: భారత్-కెనడా మ్యాచ్ వర్షార్పణం..టీ20 వరల్డ్‌కప్-2024లో భాగంగా ఫ్లోరిడా వేదికగా భారత్-కెనడా మధ్య జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దైంది. వర్షం తగ్గుముఖం పట్టినప్పటికి ఔట్ ఫీల్డ్ చిత్తడిగా మారడంతో అంపైర్లు మ్యాచ్‌ను రద్దు చేశారు. టాస్ పడకుండానే ఈ మ్యాచ్ వర్షార్పణమైంది. దీంతో ఇరు జట్లకు చెరో పాయింట్ లభించింది. అయితే ఇప్పటికే భారత్ సూపర్-8కు అర్హత సాధించిన సంగతి తెలిసిందే.ఔట్ ఫీల్డ్ చిత్తడి..భారత్-కెనడా మ్యాచ్ టాస్ మరింత ఆలస్యం కానుంది. వర్షం తగ్గుముఖం పట్టినప్పటికి ఔట్ ఫీల్డ్ చిత్తడి మారింది. గ్రౌండ్ స్టాప్ మైదానాన్ని సిద్దం చేసే పనిలో పడ్డారు. భారత కాలమానం ప్రకారం రాత్రి 09:00 గంటలకు అంపైర్లు పిచ్‌ను పరిశీలించనున్నారు.టాస్ ఆలస్యం..టీ20 వరల్డ్‌కప్-2024 గ్రూపు-ఎలో భాగంగా ఫ్లోరిడా వేదికగా భారత్-కెనడా జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌కు వరుణుడు ఆటంకం కలిగించాడు. మ్యాచ్ జరిగే ఫ్లోరిడా స్టేడియం పరిసర ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది.దీంతో పిచ్‌ను కవర్లతో కప్పి ఉంచారు. స్టేడియం ఔట్ ఫీల్డ్ మొత్తం చిత్తడిగా మారింది. ఈ క్రమంలో భారత కాలమానం ప్రకారం 07:30 గంటలకు పడాల్సిన టాస్ ఆలస్యం కానుంది. ఇక ఇప్పటికే ఈ మెగా టోర్నీలో భారత్ సూపర్-8కు అర్హత సాధించిన సంగతి తెలిసిందే. ఈ మెగా ఈవెంట్లో ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ టీమిండియా ఘన విజయం సాధించింది.ఈ మెగా ఈవెంట్లో ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ టీమిండియా ఘన విజయం సాధించింది. మరోవైపు కెనడా ఆడిన మూడు మ్యాచ్‌ల్లో కేవలం ఒక్క విజయం మాత్రమే నమోదు చేసింది. -
అమెరికా ముందుకు... పాక్ ఇంటికి
లాడర్‌హిల్ (ఫ్లోరిడా): టి20 ప్రపంచ కప్‌లో అత్యంత కీలక ఫలితం! తొలిసారి ప్రపంచ కప్‌లో పాల్గొన్న ఆతిథ్య అమెరికా జట్టు సూపర్–8 దశకు అర్హత సాధించింది. గ్రూప్ ‘ఎ’లో శుక్రవారం అమెరికా, ఐర్లాండ్ మధ్య జరగాల్సిన లీగ్ మ్యాచ్ భారీ వర్షం కారణంగా రద్దయింది. దాంతో ఈ గ్రూప్ నుంచి భారత్ (6 పాయింట్లు), అమెరికా (5 పాయింట్లు) ముందంజ వేశాయి. ఆడిన 3 మ్యాచ్‌లలో ఒకటే గెలిచిన 2009 చాంపియన్ పాకిస్తాన్ లీగ్ దశలోనే నిష్క్రమించింది. గత రెండు టి20ల్లో వరల్డ్ కప్‌లలో వరుసగా సెమీఫైనల్, ఫైనల్ వరకు చేరిన పాక్ ఈసారి పేలవ ప్రదర్శనతో కుప్పకూలింది. భారత్‌తో పాటు అమెరికా చేతిలో ఓడిన ఆ జట్టు కెనడాపై మాత్రం గెలవగలిగింది. ఈ గ్రూప్‌లో బలహీన కెనడాపై నెగ్గిన అమెరికా... పాక్‌పై సంచలన విజయం సాధించి తమ అవకాశాలు మెరుగుపర్చుకుంది. తాజా ఫలితంతో ఆదివారం ఐర్లాండ్‌తో తమ చివరి మ్యాచ్ ఆడకుండానే వరల్డ్ కప్‌లో పాక్ ఆట ముగిసింది. లాడర్‌హిల్‌లో గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు శుక్రవారం కూడా తెరిపినివ్వలేదు. నిర్ణీత సమయం నుంచి దాదాపు మూడు గంటల సుదీర్ఘ సమయం పాటు వేచి చూసినా ఫలితం లేకపోయింది. వర్షం తగ్గినా మ్యాచ్ కోసం మైదానాన్ని సిద్ధం చేయడం సాధ్యం కాలేదు. పదే పదే తనిఖీల తర్వాత కనీసం 5 ఓవర్ల ఆట అయినా నిర్వహించాలని ఆశించినా... మళ్లీ చినుకులు మొదలయ్యాయి. దాంతో అంపైర్లు మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ఆతిథ్య జట్టు హోదాలో బరిలోకి దిగి సూపర్–8కు చేరడం ద్వారా అమెరికా 2026 టి20 వరల్డ్ కప్‌కు కూడా నేరుగా అర్హత సాధించింది. -
దక్షిణాదిన వానలు.. ఉత్తరాదిన ఎండలు
దేశంలో విభిన్నమైన వాతావరణ పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఉత్తరాదిన ఎండలు మండిపోతుంటే.. దక్షిణాది రాష్ట్రాల్లో మాత్రం విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. వరుణుడు పలకరించడంతో తెలుగు రాష్ట్రాల్లో వెదర్ కాస్త చల్లబడింది. మొన్నటి వరకూ దేశవ్యాప్తంగా ఎండలు దంచికొట్టాయి. ఉత్తరం, దక్షిణం అనే తేడా లేకుండా ఉష్ణోగ్రతలు ఠారెత్తించాయి. అయితే రుతుపవనాలు పలకరించాక, వాతావరణం మారింది. ఉత్తరాదిన భానుడి భగభగలు కొనసాగుతుంటే.. దక్షిణాదిన మాత్రం వర్షాలు పడుతున్నాయి. వేడి, ఉక్కపోత నుంచి ప్రజలకు ఉపశమనం లభించింది.మరో మూడు రోజులపాటు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ విభాగం హెచ్చరించింది. రేపు, ఎల్లుండి కోస్తాంధ్రలో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఇటు తెలంగాణలోనూ నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నట్టు ఐఎండీ వెల్లడించింది. పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. రుతుపవనాల ప్రభావంతో కేరళలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. 8 జిల్లాలకు ఎల్లో అలర్ట్, 2 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీచేసింది ఐఎండీ.వర్షాలతో దక్షిణాది చల్లబడినా.. ఉత్తర భారతంలోని పలు రాష్ట్రాల్లో వేడి వాతావరణం కొనసాగుతోంది. భానుడి భగభగలు సెగలు పుట్టిస్తున్నాయి. వేడి గాలులు వీస్తున్నాయి. ఢిల్లీ, హరియాణా, ఉత్తరప్రదేశ్, బీహార్, ఛత్తీస్‌గఢ్‌లోని పలు జిల్లాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రాజధాని ఢిల్లీలో సోమవారం ఉష్ణోగ్రత 46 డిగ్రీల సెల్సియస్ దాటింది. రానున్న రోజుల్లో ఇది 47 డిగ్రీలకు చేరుకుంటుందని భారత వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది. ఎల్లో అలర్ట్ ఇష్యూ చేసింది.హీట్‌వేవ్, నీటి సంక్షోభంతో ఉక్కిరిబిక్కిరి అవుతోన్న దేశ రాజధానిపై మరో పిడుగు పడింది. మంగళవారం మధ్యాహ్నం నుంచి భారీగా విద్యుత్ కోతలను ఎదుర్కొంటోంది. ఉత్తర్‌ప్రదేశ్ మండోలాలోని పవర్ గ్రిడ్‌లో అగ్నిప్రమాదం జరగడంతో ఢిల్లీ వాసులకు కరెంట్ కష్టాలు మొదలయ్యాయి. నగరానికి ఈ గ్రిడ్ నుంచి 1500 మెగావాట్ల ఎలక్ట్రిసిటీ సరఫరా అవుతుంది. మొత్తంగా ఉత్తరాది ప్రజలు ఇటు ఉష్ణోగ్రతలు, అటు ఉక్కపోతలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. -
తెలంగాణ వ్యాప్తంగా నైరుతి రుతుపవనాలు
-
ఇక పిడుగుల మోతతో వానలు
సాక్షి, విశాఖపట్నం/అనంతపురం (అగ్రికల్చర్): రాష్ట్రంలో పిడుగులు మోత మోగించనున్నాయి. రానున్న ఐదు రోజులు ఇవి దడ పుట్టించనున్నాయి. రెండు మూడు మినహా మిగిలిన జిల్లాల్లో పిడుగులు ప్రభావం చూపనున్నాయి. మరోవైపు రాష్ట్రంలో అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురవనున్నాయి. ప్రస్తుతం సముద్ర మట్టానికి 3.1, 5.8 కి.మీ. మధ్య ఉన్న గాలుల కోత, షీర్ జోన్ కొనసాగుతున్నాయి. ఫలితంగా బుధ, గురువారాల్లో అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం, కోనసీమ, తూర్పు, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి, వైఎస్సార్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. శుక్రవారం శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి, వైఎస్సార్, అన్నమయ్య, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలకు ఆస్కారం ఉందని పేర్కొంది. అదే సమయంలో వానలు, ఉరుములు, మెరుపులతోపాటు పిడుగులు కూడా సంభవిస్తాయంది. ‘అనంత’లో వర్షాలుజిల్లాలో వర్షాలు కొనసాగుతున్నాయి. సోమవారం రాత్రి నుంచి మంగళవారం ఉదయం వరకు జిల్లాలోని 29 మండలాల పరిధిలో వర్షం కురిసింది. ఉరవకొండలో 29.6 మి.మీ, పామిడిలో 20.4 మి.మీ, వజ్రకరూరులో 20.2 మి.మీ, గార్లదిన్నెలో 20 మి.మీ. చొప్పున వర్షపాతాలు నమోదయ్యాయి. పెద్దవడుగూరు, శింగనమల, గుంతకల్లు, యాడికి, పుట్లూరు, యల్లనూరు, గుత్తి, రాయదుర్గం, అనంతపురం, బుక్కరాయసముద్రం, ఆత్మకూరు, నార్పల తదితర మండలాల్లో మోస్తరు వర్షం కురిసింది. -
హైదరాబాద్‌లో మళ్లీ వాన
సాక్షి, హైదరాబాద్: హైదారబాద్‌లో ఒక్కసారిగా మారిన వాతావరణం దట్టంగా మేఘాలు కమ్ముకొని మళ్లీ పలుచోట్ల వర్షం కురుస్తోంది. పంజాగుట్ట, బంజారాహిల్స్ ప్రాంతాల్లో వాన పడుతోంది. రంగారెడ్డిలోని వికారాబాద్‌లో మోస్తరు నుంచి భారీ వర్షం కురుస్తోంది. వర్షంతో పలు చోట్ల ట్రాఫిక్ జామ్ చోటు చేసుకుంది. -
పిడుగుపాట్లకు 9 మంది మృతి
సాక్షి నెట్వర్క్: రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో గురువారం పిడుగుపాట్లకు గురై 9 మంది మృతిచెందారు. మరికొందరు గాయపడ్డారు. పలుచోట్ల పశువులు సైతం మృత్యువాతపడ్డాయి. మృతుల్లో ఎక్కువ మంది వ్యవసాయ పనుల్లో నిమగ్నమైన రైతులు, కూలీలే ఉన్నారు. వర్షం కురుస్తున్న వేళ చెట్ల కింద తలదాచుకుందామని వెళ్లిన వారిపై ఎక్కువగా పిడుగులు పడటంతో ప్రాణాలు పోగొట్టుకున్నారు. వ్యవసాయ పనుల కోసం వెళ్లి.. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం డొంగర్‌గామ్ గ్రామానికి చెందిన దంపతులు అనక సంతోష్ (27), స్వప్న (24) వ్యవసాయ పనులు చేస్తుండగా వర్షం కురవడంతో టేకు చెట్టు కింద ఉన్న గుడిసెలో తలదాచుకున్నారు. చెట్టుపై పిడుగు పడటంతో అక్కడికక్కడే మృతిచెందారు. » మెదక్ జిల్లా హవేళిఘణాపూర్ మండల పరిధిలోని శమ్నాపూర్ గ్రామానికి చెందిన శెట్టబోయిన సిద్ధయ్య (50), అదే గ్రామానికి చెందిన ఓరుగంటి దుర్గమ్మ, రాజయ్య కుమారుడు నందు (22) గుడిసెపై కప్పేందుకు అవసరమైన పొరుక కోసం గ్రామ సమీపంలోని దుర్గమ్మగుట్టపైకి బుధవారం మధ్యాహ్నం వెళ్లారు. ఉరుములు, మెరుపులు రావడంతో ఓ చెట్టు కింద నిల్చోగా పిడుగుపడి సిద్ధయ్య, నందు మృతిచెందారు. » నిర్మల్ జిల్లా దిలావర్పూర్ మండలం కాల్వ గ్రామానికి చెందిన రైతు మూడపెల్లి ప్రవీణ్ (28) పొలంలో జీలుగ విత్తనాలు చల్లుతుండగా అతనికి సమీపంలో పిడుగు పడింది. దీంతో కుప్పకూలిన అతన్ని నిర్మల్‌లోని ఆస్పత్రికి తరలిస్తుండగా మరణించాడు. » నిర్మల్ జిల్లాలోని తానూరు మండలం ఎల్వత్ గ్రామంలో మంగీర్‌వాడ్ శ్రీ(10) అనే బాలుడు తన తాతతో కలిసి మేకలను మేపేందుకు అడవికి వెళ్లి తిరిగొస్తుండగా పిడుగుపాటుకు అక్కడికక్కడే మృతిచెందాడు. రెండు మేకలు మృత్యువాతపడ్డాయి. » సంగారెడ్డి జిల్లా కోహీర్ మండలంలోని పీచేర్యాగడి గ్రామానికి చెందిన శివరాంపురం గోపాల్ వ్యవసాయ పనులు చేసేందుకు పొలానికి వెళ్లాడు. వర్షం కురుస్తుండటంతో చెట్టు కిందకు వెళ్లగా పిడుగుపడి ప్రాణాలు కోల్పోయాడు. » నాగర్‌కర్నూల్ జిల్లా వెల్దండ మండలం పెద్దాపూర్‌కు చెందిన కొమ్మరెక్క జంగమ్మ (40), ఆమె భర్త కృష్ణయ్య, తల్లి ఈదమ్మ పొలంలో పత్తి విత్తనాలు విత్తుతుండగా వర్షం కురుస్తోందని చెట్టు కిందకు వెళ్లారు. పిడుగు పడటంతో జంగమ్మ మృతిచెందగా మిగిలిన ఇద్దరినీ స్థానికులు కల్వకుర్తి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించడంతో కోలుకుంటున్నారు. » మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం పీర్లతండాకు చెందిన డలావత్ గేమ్యనాయక్ (60) పొలాల సమీపంలో గొర్రెలను మేపి ఇంటికి తిరిగొస్తుండగా పిడుగుపాటుకు గురై కన్నుమూశాడు. -
తెలంగాణ రాష్ట్రమంతా నైరుతి
సాక్షి, హైదరాబాద్: నైరుతి రుతుపవనాలు చురుకుగా కదులుతున్నాయి. ఈనెల 3న రాష్ట్రంలోని ప్రవేశించిన నైరుతి రుతుపవనాలు.. రెండ్రోజుల్లో ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా కు విస్తరించినట్లు వాతావరణ శాఖ తెలిపింది. ప్రస్తుతం తెలంగాణ లోని నారాయణపేట, ఆంద్రప్రదేశ్‌లోని నర్సాపూర్ గుండా రుతుపవనాలు కదులుతున్నట్లు చెప్పింది. 3 రోజుల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరిస్తాయని, కదలికలు ఇదే తరహాలో ఉంటే వారం రోజుల్లో రాష్ట్రంలోని దాదాపు అన్ని ప్రాంతాలకు వ్యాపిస్తాయని అంచనా వేస్తోంది. రుతుపవనాల రాకతో రాష్ట్రంలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. పగటి పూట కొంతసేపు గరిష్ట ఉష్ణోగ్రతలు భారీగా నమోదవుతున్నప్ప టికీ.. ఆశాశం మేఘావృతం కావడంతో క్రమంగా ఉష్ణోగ్రతల తీవ్రత తగ్గుతూ వస్తోంది. సాయంత్రానికి పూర్తిగా చల్లని వాతావరణం ఏర్పడుతోంది. రెండు రోజులు రాష్ట్రంలో ఉష్ణో గ్రతలు సాధారణం, అంతకంటే తక్కువగా నమోదు కావొచ్చని ఆ శాఖ అంచనా వేసింది. నిజామాబాద్‌లో గరిష్ట ఉష్ణోగ్రత: దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్, ఉత్తర తమిళనాడు తీరం వద్ద పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం బుధవారం నైరుతి బంగాళాఖాతం ప్రాంతాలలో కేంద్రీకృతమై ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఇది దక్షిణ ఆంధ్రప్రదేశ్, దాని పరిసర ప్రాంతాలలో సముద్ర మట్టం నుంచి సగటున 3.1 కిలోమీటర్ల నుంచి 4.5 కిలోమీటర్ల ఎత్తులో కేంద్రీకృతమై ఉన్నట్లు వివరించింది. దీని ప్రభావంతో రాష్ట్రంలోని తూర్పు, ఉత్తర ప్రాంతాల్లోని పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, కొన్నిచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు నమోదు కావొచ్చని పేర్కొంది. బుధవారం రాష్ట్రంలోని ప్రధాన నగరాలను పరిశీలిస్తే నిజామాబాద్‌లో 40.1 డిగ్రీ సెల్సీయస్ గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. ఇక కనిష్ట ఉష్ణోగ్రత మెదక్‌లో 22.5 డిగ్రీ సెల్సీయస్‌గా నమోదైంది. -
ఫ్లాష్ ఫ్లాష్ తెలంగాణ ఎలో అలెర్
-
ఆంధ్రప్రదేశ్ లో ప్రవేశించిన నైరుతి రుతుపవనాలు
-
‘నైరుతి’ వచ్చేసింది
సాక్షి, అమరావతి/సాక్షి, విశాఖపట్నం/యడ్లపాడు/: నైరుతి రుతు పవనాలు రాష్ట్రంలోకి ముందుగానే ప్రవేశించాయి. ఇవి శనివారం రాత్రి రాయలసీమను తాకినట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. మరో రెండ్రోజుల్లో అవి రాష్ట్రమంతా శరవేగంగా విస్తరించే అవకాశమున్నట్లు స్పష్టంచేసింది. సాధారణంగా రుతు పవనాలు ఐదో తేదీ తర్వాత రాష్ట్రంలోకి ప్రవేశిస్తాయి. ఈసారి వాతావరణ పరిస్థితులు అనుకూలించడంతో ముందుగానే ప్రవేశించాయి. దీంతో రాయలసీమలోని అనంతపురం, అనంతరం నెల్లూరు జిల్లాను తాకడంతో ఆయా ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి.ఇవి ఒకట్రెండు రోజుల్లో దక్షిణ కోస్తా, ఉత్తర కోస్తాల్లోకి విస్తరించనున్నాయి. నైరుతి రుతుపవనాలు దూకుడుగా ఉన్నందున రెండు మూడ్రోజుల్లోనే రాష్ట్రవ్యాప్తంగా పూర్తిస్థాయిలో విస్తరించేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) వెల్లడించింది. అలాగే, పశ్చిమ మధ్య, వాయవ్య బంగాళాఖాతాల్లోకి కూడా ఇవి వ్యాపించనున్నట్లు తెలిపింది. ఈ రుతు పవనాలు మధ్య అరేబియా సముద్రంలోని కొన్ని ప్రాంతాలు, లక్షద్వీప్, కేరళ, తమిళనాడు, కర్ణాటకలోని కొన్ని ప్రాంతాలు, నైరుతి బంగాళాఖాతంలోని పలు ప్రాంతాలకు విస్తరించినట్లు వాతావరణ శాఖ తెలిపింది.మరోవైపు.. దక్షిణ కోస్తాంధ్ర, ఉత్తర తమిళనాడు ప్రాంతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతుండడంతో పలుచోట్ల తేలికపాటి వర్షాలు పడుతున్నాయి. ఇక వైఎస్సార్, అన్నమయ్య జిల్లాల్లో శనివారం రాత్రి ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. వైఎస్సార్ జిల్లా సిద్దవటంలో అత్యధికంగా 30.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అలాగే, అన్నమయ్య జిల్లాల్లోని రాయచోటి, రాజంపేట, కోడూరు, తంబళ్లపల్లి, పీలేరు, మదనపల్లె నియోజకవర్గాల్లో ఓ మోస్తరు వర్షాలు కురిశాయి. దీంతో ఆయా ప్రాంతాల్లో పండ్ల తోటలు దెబ్బతిన్నాయి. నేడు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు..శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, వైఎస్సార్, శ్రీ సత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో సోమవారం అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. అలాగే, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఉరుములు, పిడుగులతో కూడిన వర్షం పడేటప్పుడు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది.పొలాల్లో పనిచేసే రైతులు, వ్యవసాయ కూలీలు, పశు–గొర్రెల కాపరులు చెట్లు, పోల్స్, టవర్స్ కింద, బహిరంగ ప్రదేశాల్లో ఉండకూడదని సూచించింది. ఆదివారం సా.5 గంటల నాటికి తూర్పుగోదావరి జిల్లా అనపర్తిలో 53.7 మిల్లీమీటర్లు, కోనసీమ జిల్లా ముమ్మిడివరంలో 47.7, చిత్తూరు జిల్లా పుంగనూరులో 33, కాకినాడ జిల్లా గండేపల్లిలో 23.2, అల్లూరి జిల్లా అనంతగిరిలో 22, కాకినాడ జిల్లా పెదపూడిలో 20.2 మిల్లీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది.పిడుగుపాటుకు నలుగురు మృత్యువాత..ఆదివారం కురిసిన వర్షాల్లో పిడుగులు పడి ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో ఇద్దరు మత్స్యకారులు.. పల్నాడు జిల్లా యడ్లపాడు మండలం ఉన్నవ గ్రామంలో ఇద్దరు రైతులు మృత్యువాత పడ్డారు. విశాఖ ఫిషింగ్ హార్బర్లో పడవలో ఉన్న దుమ్ము పోలిరాజు అనే యువకుడు పిడుగు పడి అక్కడికక్కడే మరణించగా.. పరవాడ మండలం ముత్యాలమ్మపాలెంలో బోటు తనిఖీకి వెళ్లిన కంబాల ముత్యాలు అనే మరో మత్స్యకారుడు కూడా పిడుగుపడి చనిపోయాడు. ఆదివారం ఉదయం ఉమ్మడి విశాఖ జిల్లాలో గంటకు పైగా ఉరుములు, మెరుపులు, పిడుగులు జనాన్ని భయకంపితులను చేశాయి.మరోవైపు.. పల్నాడు జిల్లా యడ్లపాడు మండలం ఉన్నవ గ్రామంలో ఇద్దరు రైతులు కూడా పిడుగులకు బలయ్యారు. పొలాల్ని సాగుకు సిద్ధంచేసుకోవాలని వెళ్లిన పెద్ది చినవీరయ్య (58), చిరుతల శ్రీనివాసరావు (51) పిడుగుపాటుకు గురై మృతిచెందారు. ఉ.5.30 గంటల ప్రాంతంలో పొలానికి వెళ్లిన వీరు అకస్మాత్తుగా ఉరుములు, మెరుపులతో వర్షం ప్రారంభమైంది. దీంతో సమీపంలోని వేప చెట్టు కిందకు వెళ్లగా అప్పుడే పెద్ద శబ్దంతో అదే చెట్టుపై పిడుగు పడింది. ఇద్దరూ అక్కడికక్కడే మరణించారు. -
హైదరాబాద్ కూల్.. కూల్.. పలకరించిన చిరుజల్లులు
సాక్షి, హైదరాబాద్: నగరంలో వర్షం కురుస్తోంది. ఆదివారం సాయంత్రం నుంచి పలు ప్రాంతాల్లో చిరుజల్లులు పడుతున్నాయి. బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, గచ్చిబౌలి, చందానగర్, మియాపూర్, మాదాపూర్, అమీర్‌పేట్, పంజాగుట్ట, ఎస్ఆర్ నగర్, బోరబండ, ఎర్రగడ్డ, భరత్ నగర్, సనత్ నగర్, సికింద్రాబాద్, పద్మారావు నగర్, సీతాఫల్ మండి, తార్నాక, ఉప్పల్‌లో వర్షం కురుస్తోంది. వర్షంతో పలుచోట్ల కాలనీలు నీట మునగగా ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఈదురు గాలులతో కూడిన వర్షాలు వల్ల పలుచోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది.ఉపరితల ఆవర్తనం కారణంగా తెలంగాణలో వచ్చే నాలుగు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో కుండపోత వర్షం కురిసింది. 13 జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశముందని పేర్కొంది. భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం నల్గొండ సూర్యాపేట రంగారెడ్డి వికారాబాద్ సంగారెడ్డి మహబూబ్‌గర్ నాగర్ కర్నూల్ వనపర్తి నారాయణపేట జోగులాంబ గద్వాల జిల్లాల్లో పలు చోట్ల వర్షం కురిసింది. -
నైరుతి వచ్చేసింది.. వారం రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లోకి..
-
కేరళను ముంచెత్తిన భారీ వర్షాలు
-
గాలి బీభత్సం.. తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఈదురు గాలులతో కూడిన వర్షం
సాక్షి, నెట్వర్క్: హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో ఆదివారం ఈదురుగాలులతో కూడిన వర్షం బీభత్సం సృష్టించింది. ముఖ్యంగా పలు ప్రాంతాల్లో పెనుగాలులు వీచాయి. దీంతో అనేకచోట్ల ఇళ్ల పైకప్పులు ఎగిరిపోయాయి. భారీ వృక్షాలు నేలకొరిగాయి. విద్యుత్ స్తంభాలు పడిపోయాయి. మేడ్చల్ మల్కాజిగిరి, హైదరాబాద్, నాగర్‌కర్నూల్, నిజామాబాద్, ఆదిలాబాద్, ఉమ్మడి నల్లగొండ, సిద్దిపేట, వికారాబాద్ తదితర జిల్లాల్లో గాలివాన హడలెత్తించింది. వేర్వేరు ఘటనల్లో మొత్తం 13 మంది మృత్యువాత పడ్డారు. ఒక్క నాగర్‌కర్నూల్ జిల్లాలోనే ఏడుగురు మరణించారు. మరోవైపు తగ్గేదేలే అన్నట్టు పలు ప్రాంతాల్లో ఎండలు మండిపోయాయి. 45 డిగ్రీ సెల్సీయస్‌కు మించి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉక్కపోతతో ప్రజలు అల్లాడిపోయారు. నాగర్‌కర్నూల్ జిల్లాలో విషాదం నాగర్‌కర్నూల్ జిల్లాలో అకాల వర్షాలు పెను విషాదం నింపాయి. ఆదివారం సాయంత్రం వేర్వేరు ఘటనల్లో ఏడుగురు మృతి చెందారు. తాడూరుకు చెందిన రైతు బెల్లె మల్లేష్ (38) గ్రామ శివారులోని తన సొంత పొలంలో రేకుల షెడ్ నిర్మిస్తున్నాడు. ఈ క్రమంలో ఆదివారం సాయంత్రం మల్లేష్, పెద్దకొత్తపల్లి మండలం ముష్టిపల్లికి చెందిన కూలీలు చెన్నమ్మ (45), రాములు (53) షెడ్‌పై పని చేస్తుండగా ఈదురుగాలులతో కూడిన వర్షానికి షెడ్ ఒక్కసారిగా కుప్ప కూలిపోయింది. దీంతో ఈ ముగ్గురు, అదే సమయంలో తండ్రి వద్దకు వచి్చన మల్లేష్ కూతురు అనూష (12) అక్కడికక్కడే చనిపోయారు. అక్కడే పనిచేస్తున్న మరో నలుగురు.. చిన్న నాగులు, పార్వతమ్మ, బి.రాజు, రాజు తీవ్రంగా గాయపడ్డారు. వీరిని నాగర్‌కర్నూల్ జనరల్ ఆస్పత్రికి తరలించారు. అయితే పార్వతమ్మ పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తీసుకెళ్లారు. మరోవైపు నాగర్‌కర్నూల్ మండలంలోని మంతటి గేట్ వద్ద ఈదురు గాలుల ప్రభావంతో రేకుల షెడ్‌పై ఉన్న రాయి వచ్చి వికారాబాద్ జిల్లా బషీర్‌బాగ్ మండలం నలవెల్లి గ్రామానికి చెందిన క్రూజర్ వాహన డ్రైవర్ వేణుగోపాల్ (38)కు తగలడంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. వేణుగోపాల్ కిరాయికి శ్రీశైలం వెళ్లి తిరిగి వస్తుండగా ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. ఇక ఇదే జిల్లాలోని తెలకపల్లికి చెందిన దండు లక్ష్మణ్ (12), మారేపల్లికి చెందిన వెంకటయ్య (52) పొలంలో పిడుగుపాట్లకు గురై మరణించారు. ఇలావుండగా కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా పెంచికల్పేట్ మండలం కొండపల్లి గ్రామంలో శనివారం రాత్రి ఎడ్ల బండిపై పిడుగు పడింది. ఈ ఘటనలో రెండు దుక్కిటెడ్లు మృతిచెందగా రైతు ఎల్కరి సత్తన్నకు గాయాలయ్యాయి. ఇద్దరు మిత్రుల విషాదాంతం మేడ్చల్ జిల్లా కీసరలో ఈదురుగాలులకు భారీ వృక్షం విరిగి మోటార్ సైకిల్‌పై పడటంతో దానిపై ఉన్న యాదాద్రి జిల్లా బొమ్మలరామారం మండల కేంద్రానికి చెందిన నాగిరెడ్డి రాంరెడ్డి (60), అదే మండలంలోని దన్రెడ్డిగూడెంలో ఉంటున్న ఏపీలోని తూర్పు గోదావరిజిల్లాకు చెందిన ధనుంజయ్ (46) అనే ఇద్దరు స్నేహితులు మరణించారు. శామీర్‌పేటలో ఉన్న తమకు తెలిసిన వారికి మామిడికాయలు ఇచ్చేందుకు వెళ్తుండగా..కీసర మండలం తిమ్మాయిపల్లి గ్రామ సమీపంలో ఈ దుర్ఘటన జరిగినట్లు స్థానిక పోలీసులు తెలిపారు. గోడలు కూలి బాలుడు, వ్యాపారి మృతి హైదరాబాద్‌లోని మియాపూర్, ఓల్డ్ హాఫిజ్‌పేట సాయినగర్‌లో ఆదివారం గాలివానకు గోడ కూలి పడటంతో అబ్దుల్ సమద్ (3) మృతి చెందాడు. డ్రై క్లీనింగ్ చేయడంతో పాటు రోడ్ల ప్రక్కన దుస్తులను అమ్ముకుంటూ జీవించే యూపీకి చెందిన నసీముద్దీన్ కనోదియా, షబానా దంపతుల కుమారుడు సమద్ ఆదివారం సాయంత్రం రేకుల గదిలో నిద్రిస్తుండగా, పక్కనే ఉన్న రఫీయుద్దీన్ బిల్డింగ్‌పై నుండి ఇటుక గోడకూలి రేకులపై పడింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన సమద్‌ను స్థానిక ఆస్పత్రికి తరలించగా అప్పటికే మరణించినట్లు వైద్యులు ప్రకటించారు. మరో ఘటనలో ఓ భవనం పై నుండి ఇటుక గోడకూలి ద్విచక్రవాహనంపై వెళ్తున్న వ్యాపారి రషీద్ (45)పై పడటంతో తీవ్రంగా గాయపడిన అతను స్థానిక ఆస్పత్రిలో చికిత్స పొదుతూ మరణించాడు. ఈ దుర్ఘటన కూడా ఆదివారం మియాపూర్ ఓల్డ్ హాఫిజ్పేటలోని సాయినగర్ కాలనీలోనే చోటు చేసుకుంది. నగరంలోని ఎల్బీనగర్, వనస్థలిపురం, ఉప్పల్, ఘట్కేసర్ ప్రాంతాల్లో కూడా గాలివాన బీభత్సం సృష్టించింది. హయత్‌నగర్ ఆర్టీసీ డిపోలో పెద్ద వృక్షం కూలిపడటంతో బస్సు ధ్వంసమైంది. కోళ్లఫారం గోడ కూలి ఇద్దరు మృతి సిద్దిపేట జిల్లా ములుగు మండలం క్షీరసాగర్‌లో ఆదివారం సాయంత్రం ఈదురు గాలులతో కూడిన వర్షానికి కోళ్ల ఫారం గోడకూలడంతో ఇద్దరు దుర్మరణం చెందారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. తూప్రాన్ మండలం ఘన్‌పూర్‌కు చెందిన గంగ గౌరిశంకర్ (30), గంగ మాధవి, విభూతి శ్వేత, ఇంద్రజ, చంద్రిక, చంద్రాయణగుట్టకు చెందిన భాగ్యమ్మ(40) క్షీరసాగర్ గ్రామంలోని శ్రీనివాస్ ఇంటికి చుట్టం చూపుగా వచ్చారు. అంతా కలిసి సరదాగా పొలంలోని బావి వద్దకు వెళ్లారు. తిరిగి వస్తుండగా వర్షం కురవడంతో తల దాచుకునేందుకు దారిలో ఉన్న ఓ కోళ్ల ఫారం వద్దకు వెళ్లారు. గాలుల ధాటికి ఫారం గోడ కూలి వీరిపై పడింది. ఈ ఘటనలో గంగ గౌరిశంకర్, భాగ్యమ్మ అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మరో నలుగురు మాధవి, శ్వేత, ఇంద్రజ, చంద్రిక తీవ్రంగా గాయపడ్డారు.అంతర్రాష్ట్ర రహదారిపై రాకపోకలకు అంతరాయం ఉమ్మడి నిజామాబాద్ జిల్లా పరిధిలో రుద్రూర్, బాన్సువాడ, బీర్కూర్ మండలాల్లో ఆదివారం ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసింది. రుద్రూర్లో కారుపై, అంబం శివారులో ఆటో, రెండు బైకులపై చెట్లు విరిగిపడ్డాయి. బాన్సువాడలోని కల్కి చెరువు కట్టపై ఉన్న హైమాస్ట్ విద్యుత్ స్తంభంతో పాటు పలు కరెంటు స్తంభాలు పడిపోయాయి. ఆదిలాబాద్ జిల్లా తాంసి మండలంలోని పలు గ్రామాల్లో కూడా ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. హస్నాపూర్ గ్రామ సమీపంలో అంతర్రాష్ట్ర రహదారిపై భారీ వృక్షం పడిపోవడంతో 3 గంటల పాటు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో పలు ఇళ్లు, కోళ్ల ఫారాల రేకులు లేచిపోయాయి. కరెంట్ స్తంభాలు, చెట్లు నేలకూలాయి. ధర్మారెడ్డి పల్లి గ్రామంలోని ఐకేపీ కేంద్రంలో కాంటా చేసిన వెయ్యి బస్తాల ధాన్యం పాక్షికంగా తడిసింది. కొండమల్లేపల్లి మండ లం గుమ్మడవెల్లిలో పిడుగుపాటుకు 2 గడ్డివాములు దగ్ధమ య్యాయి. వికారాబాద్ జిల్లాలో గాలివానకు పలు ప్రాంతాల్లో రహదారులు, ఇళ్లపై చెట్లు విరిగి పడ్డాయి. విద్యుత్ స్తంభాలు నేల కూలాయి. పరిగి మండల పరిధి రూప్సింగ్ తండాలో పిడుగుపాటుకు ఓ ఎద్దు మృత్యువాత పడింది. -
హైదరాబాద్‌లో పలుచోట్ల వర్షం
సాక్షి, హైదరాబాద్: నగరంలో పలుచోట్ల వర్షం కురుస్తోంది. ఎల్బీ నగర్, దిల్సుఖ్నగర్, హయత్ నగర్, నాగోల్, బీఎన్ రెడ్డి నగర్, వనస్థలిపురం, అబ్దుల్లాపూర్‌మెట్, బోడుప్పల్, తార్నాక, సికింద్రాబాద్, నాచారం, హబ్సిగూడలో వర్షం పడుతోంది. కొన్ని ప్రాంతాల్లో ఒక్కసారిగా వాతావరణం చల్లబడి మబ్బులు కమ్ముకున్నాయి. వర్షం కారణంగా పలుచోట్ల ట్రాఫిక్ జామ్ అయింది.వనస్థలిపురంలో గాలి వాన బీభత్సం సృష్టించింది. గణేష్ దేవాలయం ప్రాంగణంలోని భారీ మర్రి చెట్టు రోడ్డుపై పడటం తో పలు కార్లు ధ్వంసం అయ్యాయి. భారీ ఈదురు గాలులకు పలు కాలనీలు, పార్క్‌ల్లో చెట్లు విరిగిపడ్డాయి. డీఆర్ఎఫ్ బృందం, జీహెచ్ఎంసీ సిబ్బంది చెట్లను తొలగిస్తున్నారు. -
తుపానుగా మారిన వాయుగుండం
సాక్షి, విశాఖపట్నం/సాక్షి నెట్వర్క్: తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం గంటకు 12 కి.మీ. వేగంతో ఉత్తరం వైపు కదులుతూ ఉత్తర బంగాళాఖాతం మీదుగా శనివారం రాత్రి సమయంలో తుపానుగా మారింది. దీనికి రెమల్ అని నామకరణం చేశారు. రెమల్ అంటే అరబిక్ భాషలో ఇసుక అని అర్థం. తుపాను క్రమంగా ముందుకు కదులుతూ ఆదివారం ఉదయానికి ఈశాన్య బంగాళాఖాతంలో తీవ్ర తుపానుగా మారనుందని వాతావరణ కేంద్రం వెల్లడించింది.ఆదివారం అర్ధరాత్రి సాగర్ ద్వీపం, ఖేపుపరా మధ్య బంగ్లాదేశ్‌ని ఆనుకుని ఉన్న పశి్చమ బెంగాల్ వద్ద తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. తీరం దాటే సమయంలో గంటకు 110–120 కిలోమీటర్ల వేగంతో.. గరిష్టంగా 135 కి.మీ. వేగంతో బలమైన గాలులు వీచే అవకాశాలున్నాయని వెల్లడించారు. మరోవైపు.. నైరుతి రుతుపవనాలు నైరుతి బంగాళాఖాతంలోని మరికొన్ని ప్రాంతాలు, ఆగ్నేయ బంగాళాఖాతంలోని మిగిలిన భాగాలు, మధ్య బంగాళాఖాతంలోని మరికొన్ని భాగాలు, ఈశాన్య బంగాళాఖాతంలో కొన్ని ప్రాంతాలకు విస్తరించాయి.ఆదివారం నాటికి నైరుతి బంగాళాఖాతం, మధ్య బంగాళాఖాతంలోని మరికొన్ని ప్రాంతాలు, ఈశాన్య బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాలకు విస్తరించనున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ నెల 31లోగా కేరళ తీరాన్ని తాకే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయని పేర్కొంది. రాగల రెండు రోజుల్లో ఏపీలోని కోస్తా, రాయలసీమ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. రెండు రోజుల తర్వాత మళ్లీ రాష్ట్రంలో పొడి వాతావరణం ఏర్పడుతుందని తెలిపారు.పలుచోట్ల జల్లులు.. అక్కడక్కడా వర్షాలుమన రాష్ట్రంపై తుపాను ప్రభావం లేకపోయినా.. రాజస్థాన్, విదర్భ, తెలంగాణ మీదుగా బంగాళాఖాతం వరకు విస్తరించి ఉన్న ఉపరితల ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో పలుచోట్ల వర్షాలు కురుస్తున్నాయి. తిరుపతి జిల్లా వాకాడు మండలంలోని తూపిలిపాలెం సముద్ర తీరంలో భీకరమైన శబ్దాలతో అలలు ఎగసి పడుతున్నాయి. తీరంలో చీకట్లు కమ్ముకున్నాయి. శ్రీకాకుళం జిల్లాలో పలుచోట్ల మోస్తరు వర్షం కురిసింది. కవిటి మండలంలో కురిసిన వర్షానికి లోతట్టు ప్రాంత ఇళ్లలో నీరు చేరింది. గుంటూరు జిల్లా వ్యాప్తంగా చిరు జల్లులు పడ్డాయి. తెనాలిలో తెల్లవారుజాము నుంచి ఈదురు గాలులతో వర్షం కురిసింది. ఉమ్మడి అనంతపురం జిల్లాలో శుక్రవారం రాత్రి నుంచి శనివారం ఉదయం వరకు పలుచోట్ల వర్షాలు కురిశాయి.అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలంలో అత్యధికంగా 86.4 మి.మీ. భారీ వర్షం కురిసింది. శ్రీసత్యసాయి జిల్లాలోని 18 మండలాల్లో వర్షం కురిసింది. అత్యధికంగా మడకశిర మండలంలో 72.2 మి.మీ. వర్షపాతం నమోదైంది. ఉమ్మడి కృష్ణా జిల్లా అంతటా ఓ మోస్తరు వర్షం కురిసింది. జిల్లా వ్యాప్తంగా 41.4 మి.మీ. వర్షపాతం నమోదైంది. విజయవాడ నగరంలోనూ జోరు వాన కురిసింది. పల్నాడు జిల్లాలో శనివారం అక్కడక్కడా చిరు జల్లులు కురిశాయి. జిల్లా మొత్తం చల్లటి వాతావరణం ఏర్పడింది. నరసరావుపేటలో తెల్లవారుజామున మోస్తరు వర్షం కురిసింది.చిలకలూరిపేట, పెదకూరపాడు, సత్తెనపల్లి పట్టణం, గ్రామాల్లో జల్లులు పడ్డాయి. ఉమ్మడి పశి్చమగోదావరి జిల్లాలో పలుచోట్ల చెదురుమదురు వర్షాలు కురిశాయి. ఆకాశం మేఘావృతమై వాతావరణం చల్లబడింది. ఏలూరు, జంగారెడ్డిగూడెం, ఏజెన్సీ ప్రాంతం, నూజివీడు, కైకలూరు, ఆచంట, మొగల్తూరు, నరసాపురం తదితర ప్రాంతాల్లో తుంపర్ల వర్ష కురిసింది. కర్నూలు జిల్లాలో విస్తారంగా వర్షాలు కురిశాయి. దేవనకొండలో 62.2 మి.మీ. వర్షపాతం నమోదైంది. -
తెలుగు రాష్ట్రాలకు చల్లని కబురు..
-
పెన్నాలో అన్ని నీళ్లా?
సాక్షి, అమరావతి: వర్షఛాయ (రెయిన్ షాడో) ప్రాంతంలో పురుడుపోసుకుని ప్రవహించే పెన్నానదిలో 75 శాతం లభ్యత ఆధారంగా ఏటా 210.12 టీఎంసీల నీటి ప్రవాహం ఉందని కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) తాజాగా తేల్చింది. 1985 నుంచి 2015 వరకు పెన్నానది పరీవాహక ప్రాంతం (బేసిన్)లో వర్షపాతం, ప్రవాహాల ఆధారంగా నీటిలభ్యతపై సీడబ్ల్యూసీ అధ్యయనం చేసింది. ఏటా పెన్నా బేసిన్లో కురిసే వర్షపాతం పరిమాణం 1,412.58 టీఎంసీలని లెక్కగట్టింది.వరద జలాలతో కలుపుకొంటే ఏటా 389.16 టీఎంసీల ప్రవాహం ఉంటుందని తేల్చింది. కానీ.. పెన్నాలో ఆ స్థాయిలో నీటిలభ్యత లేదని సాగునీటి రంగ నిపుణులు తేల్చి చెబుతున్నారు. బేసిన్లో 30 ఏళ్ల వర్షపాతం, ప్రవాహాల ఆధారంగా నీటిలభ్యతను లెక్కగట్టడం శాస్త్రీయం కాదంటున్నారు. వందేళ్లు లేదా కనీసం 50 ఏళ్ల వర్షపాతం, ప్రవాహాల ఆధారంగా చేసే అధ్యయనానికే శాస్త్రీయత ఉంటుందని స్పష్టం చేస్తున్నారు. అప్పటికీ ఇప్పటికీ ఇదీ తేడా..పెన్నాలో నీటిలభ్యతపై 1993లో సీడబ్ల్యూసీ తొలిసారి అధ్యయనం చేసింది. 1944–45 సంవత్సరం నుంచి 1983–84 వరకు బేసిన్లో 40 ఏళ్ల వర్షపాతం, ప్రవాహాల ఆధారంగా అప్పట్లో నీటిలభ్యత లెక్కగట్టింది. వరద జలాలతో కలుపుకొంటే పెన్నాలో 223.18 టీఎంసీల లభ్యత ఉంటుందని తేల్చింది. పెన్నా బేసిన్ 55,213 చదరపు కిలోమీటర్లుగా పేర్కొంది. తాజాగా సీడబ్ల్యూసీ పెన్నా బేసిన్లో 1985–2015 మధ్య అంటే 30 ఏళ్లలో కురిసిన వర్షపాతం, ప్రవాహాల ఆధారంగా నీటి లభ్యత లెక్కగట్టింది. వరద జలాలతో కలిపితే 389.16 టీఎంసీల ప్రవాహం ఉంటుందని తేల్చింది.75 శాతం లభ్యత ఆధారంగా చూస్తే నదిలో 210.12 టీఎంసీలు ఉంటుందని పేర్కొంది. కానీ బేసిన్ మాత్రం 54,905 చదరపు కిలోమీటర్లకు తగ్గినట్లు గుర్తించింది. 1993తో పోలిస్తే బేసిన్ విస్తీర్ణం 308 చదరపు కిలోమీటర్లు తగ్గింది. పెన్నా బేసిన్లో 1944–84తో పోల్చితే 1985–2015 మధ్య వర్షపాతం అధికంగా ఉండటంవల్లే నీటిలభ్యత పెరిగిందని సీడబ్ల్యూసీ పేర్కొంది. దీన్ని సాగునీటిరంగ నిపుణులు కొట్టిపారేస్తున్నారు. కేవలం 30 ఏళ్ల వర్షపాతం, ప్రవాహాలను ఆధారంగా తీసుకోవడాన్ని తప్పుపడుతున్నారు. అధ్యయనం పరిధిని తగ్గించుకోవడం వల్లే నీటిలభ్యత పెరిగిందని, ఇది అశాస్త్రీయమని స్పష్టం చేస్తున్నారు. పెన్నా బేసిన్ ఇదీ..కర్ణాటకలో వర్షఛాయ ప్రాంతమైన చిక్‌బళ్లాపూర్ జిల్లా నందికొండల్లోని చెన్నకేశవ పర్వతశ్రేణుల్లో పుట్టిన పెన్నానది.. రాష్ట్రంలో వర్షాభావ ప్రాంతాలైన శ్రీసత్యసాయి, అనంతపురం, వైఎస్సార్, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాల మీదుగా 597 కిలోమీటర్లు ప్రవహించి ఊటుకూరు వద్ద బంగాళాఖాతంలో కలుస్తుంది. ఎడమవైపు నుంచి జయమంగళ, కుందేరు, కుడివైపు నుంచి సగిలేరు, చిత్రావతి, పాపాఘ్ని, చెయ్యేరు ఉపనదులు పెన్నాలో కలుస్తాయి. పెన్నా బేసిన్లో 400 నుంచి 800 మిల్లీమీటర్ల వర్షపాతం కురుస్తుంది. ఈ బేసిన్ విస్టీర్ణం 54,905 చదరపు కిలోమీటర్లని సీడబ్ల్యూసీ తాజాగా తేల్చింది. ఇది దేశ భౌగోళిక విస్తీర్ణంలో 1.67 శాతానికి సమానం. -
వర్ష సూచన: తెలంగాణలో ఇవాళ, రేపు మోస్తరు వర్షాలు
-
KKR Vs RR: వర్షంతో కోల్‌కతా, రాజస్తాన్ మ్యాచ్ రద్దు
గువాహటి: ఈ ఐపీఎల్ సీజన్లో లీగ్ దశలోని చివరి మ్యాచ్ వర్షంతో రద్దయ్యింది. కోల్‌కతా నైట్‌రైడర్స్, రాజస్తాన్ రాయల్స్‌ల మధ్య జరగాల్సిన మ్యాచ్‌కు వాన అడ్డుగా నిలిచింది. రాత్రి పదిన్నరకు వర్షం తెరిపినిచ్చినట్లే కనిపించడంతో మైదానం పరిస్థితుల్ని పరిశీలించిన ఫీల్డు అంపైర్లు అనిల్ చౌదరి, సాయిదర్శన్ ఎట్టకేలకు 7 ఓవర్ల మ్యాచ్‌ను నిర్వహించేందుకు నిర్ణయం తీసుకున్నారు. వెంటనే టాస్ కూడా వేయగా... కోల్‌కతా టాస్ నెగ్గి ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో ఆటగాళ్లు బరిలోకి దిగడమే తరువాయి అని ప్రేక్షకులు వేయికళ్లతో ఎదురుచూడగా ... మళ్లీ వానొచ్చి మ్యాచ్ రాతను మార్చింది. కటాఫ్ సమయం రాత్రి 10.56 గంటలకు చేసేదేమీ లేక అంపైర్లు మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో రాజస్తాన్, కోల్‌కతా చెరో పాయింట్‌తో సరిపెట్టుకున్నాయి. ఈ సీజన్లో రద్దయిన నాలుగో మ్యాచ్ ఇది. దీంతో ఇప్పటికే అగ్రస్థానాన్ని ఖాయం చేసుకున్న నైట్‌రైడర్స్‌కు ఏ నష్టం లేదు. కానీ వారం క్రితం దాకా ‘టాప్’లో కొనసాగిన రాజస్తాన్ ఇప్పుడు మూడో స్థానానికి పడిపోయింది. హైదరాబాద్, రాజస్తాన్ జట్లు 17 పాయింట్లతో సంయుక్తంగా రెండో స్థానంలో నిలిచినా... మెరుగైన రన్‌రేట్ కారణంగా హైదరాబాద్‌కు రెండో స్థానం ఖరారైంది. ఆఖరి పోరులో నెగ్గి కనీసం రెండో స్థానంలో నిలిచి క్వాలిఫయర్–1, ఓడితే క్వాలిఫయర్–2 ఆడాల్సిన రాజస్తాన్ చివరకు రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో ఎలిమినేటర్‌లో పోరాడాల్సిన పరిస్థితి వచి్చంది. -
ఏపీలో మరో 7 రోజులు భారీ వర్షాలు
-
తెలంగాణాలో మరో 3 రోజులు వర్షాలు
-
తెలంగాణలో రైతుల్ని నిండా ముంచిన అకాల వర్షం
-
కొనసాగుతున్న ఉపరితల ద్రోణి..
-
కుండపోత వర్షం హైదరాబాద్ జలమయం
-
హోరు జల్లులు, వంకాయ ముంత మసాలా ఎపుడైనా తిన్నారా?
మండే ఎండలనుంచి ఉపశమనం కలిగేలా వర్షం పడితే భలే హాయిగాఉంటుంది కదా. మరి ఈ చల్లని వాతావరణానికి తగ్గట్టుగా ఏ మిర్చి బజ్జీనో, వేడి వేడిగా ఉల్లిపాయ పకోడీనో, లేదంటే కారం కారంగా మరమరాలతో చేసిన ముంత మసాలానో తింటే ఇంకా బావుంటుంది. అయితే వంకాయ ముంత మసాలా ఎపుడైనా తిన్నారా? దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇన్‌స్టాలో వైరల్‌గా మారింది. చక్కగా నవనవలాడే వంకాయలను నూనెలో వేయించి, ఆ తరువాత ముందుగానే మెత్తగా, చేతిజారుగా కలుపుకొని ఉంచుకున్న శనగపిండలో ముంచి నూనెలో బజ్జీలా వేయించాడు. తరువాత ఆ వంకాయ బజ్జీ పొట్ట చీల్చి కొద్దిగా మసాలా, సన్నగా తరిగిన కొత్తిమీర, ఉల్లిపాయ ముక్కల్ని కూరాడు. పైన నిమ్మరసం చల్లి, దాన్ని మళ్లీ ముక్కలుగా కట్ చేసి, కొత్తిమీర, వేయించిన వేరు శనగపప్పు,మిక్సర్ యాడ్ చేసి అందించాడు. అయితే నెటిజన్లు భిన్నంగా స్పందించారు. భయ్యా, వంకాయల్లో పురుగులుంటాయిగా.. చూడకుండా వేయించేస్తే ఎలా అంటూ ప్రశ్నించారు.అన్ని వంకాయలు తినడానికి శుభ్రంగా ఉండవు, ఎప్పుడూ కట్ చేసి, పురుగులో ఉన్నాయో లేదో చెక్ చేయాలి. వంకాయ క్యాలీఫ్లవర్లో ఉండే కీటకాలు కొన్నిసార్లు పైకి కనిపించవు.. శభ్రంగా కడగాలి కూడా అంటూ కమెంట్ చేశారు. View this post on Instagram A post shared by Mehul Hingu (@streetfoodrecipe) నిజమే కదా... ఏ కూరలైనా వండుకునేముందుకు శభ్రంగా కడగాలి. లేదంటే పురుగు మందు అవశేషాలు మన కడుపులోకి చేరతాయి. అలాగే పురుగులను కూడా చెక్ చేసుకోవాలి. ఈ జాగ్రత్తలను పాటిస్తూ, ఈ వంకాయ ముంత మసాలాను ఒకసారి ట్రై చేయండి! -
ఏపీకి వాతావరణ శాఖ వర్ష సూచన
-
మూడు రోజులు వానలే
సాక్షి, విశాఖపట్నం: దక్షిణ అంతర్గత కర్ణాటక, దాని పరిసర ప్రాంతాలపై సముద్ర మట్టానికి 1.5 కి.మీ. ఎత్తులో ఉపరితల ఆవర్తనం ఆవరించి ఉంది. మరోవైపు రాష్ట్రంపైకి దక్షిణ, నైరుతి దిశ నుంచి గాలులు వీస్తున్నాయి. వీటి ఫలితంగా ఇప్పటికే రాష్ట్రంలో వర్షాలు కురుస్తున్నాయి. ఇవి రానున్న 3 రోజులపాటు కొనసాగనున్నాయి.ఉత్తర, దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమల్లో అక్కడక్కడా వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) ఆదివారం తెలిపింది. అదే సమయంలో పిడుగులు సంభవించే అవకాశం ఉందని పేర్కొంది. గంటకు 30–40 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది. కాగా ఆదివారం ఉదయం నుంచి రాత్రి వరకు అనపర్తి (తూర్పు గోదావరి)లో 3.1, ఆలమూరు (కోనసీమ) 3, పరవాడ (అనకాపల్లి) 2.6, మంగళగిరి (గుంటూరు)లో 2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. -
ఢిల్లీలో హఠాత్తుగా మారిన వాతావరణం.. ఈదురు గాలులతో అతలాకుతలం!
దేశ రాజధాని ఢిల్లీలో శుక్రవారం రాత్రి వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఈదురుగాలులు చుట్టుముట్టడంతో జనం తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ముఖ్యంగా పాదచారులు, ద్విచక్ర వాహనదారులు పలు అవస్థలకు లోనయ్యారు. పలుచోట్ల చెట్లు నేలకూలడంతో పాటు ట్రాఫిక్ జామ్ అయింది. కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ అంతరాయం ఏర్పడింది. శని, ఆదివారాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.తుఫాను, వర్షం, బలమైన గాలుల కారణంగా ఢిల్లీ-ఎన్సీఆర్లో వాతావరణం ఊహించని విధంగా మారింది. ఈదురు గాలుల ధాటికి పలుచోట్ల చెట్లు కూలిపోయి, రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఇటువంటి వాతావరణ పరిస్థితుల్లో ఢిల్లీ నుంచి తొమ్మిది విమానాలను జైపూర్‌కు మళ్లించారు. బలమైన గాలుల కారణంగా నోయిడాలోని సెక్టార్ 58లో ఒక భవనం మరమ్మత్తు కోసం ఏర్పాటు చేసిన షట్టరింగ్ కూలిపోయింది. దీంతో పలు కార్లు దెబ్బతిన్నాయి. #WATCH | Noida, Uttar Pradesh: Several cars were damaged after a shuttering installed to repair a building in Sector 58 of Noida blew off due to gusty winds hitting the National Capital & the adjoining areas. pic.twitter.com/lz7F2WuX9q— ANI (@ANI) May 10, 2024 శనివారం(ఈరోజు) గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. అలాగే తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. గరిష్ట ఉష్ణోగ్రత 39 డిగ్రీల సెల్సియస్‌గా ఉండవచ్చు. కనిష్ట ఉష్ణోగ్రతలు 29 డిగ్రీల సెల్సియస్‌కు చేరే అవకాశం ఉంది.రాజధానిలో గాలి దిశలో మార్పు కారణంగా శుక్రవారం ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (ఏక్యూఐ) 180 వద్ద నమోదైంది. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెటియోరాలజీ (ఐఐటీఎం) తెలిపిన వివరాల ప్రకారం శుక్రవారం తూర్పు నుంచి ఆగ్నేయ దిశగా గంటకు సగటున ఎనిమిది నుంచి 12 కిలోమీటర్ల వేగంతో గాలి వీచింది. -
హీట్‌వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
ఢిల్లీ: దేశంలోని ప్రధాన నగరాల్లో ఎండ తీవ్రత రోజు రోజుకి భారీగా పెరుగుతోంది. ప్రజలు భానుడి వేడి తట్టుకోలేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఈ తరుణంలో భారత వాతావరణ శాఖ తీవ్రమైన వేడిగాలులు త్వరలో తగ్గుముఖం పట్టబోతున్నాయని ఓ శుభవార్త చెప్పింది.తూర్పు, దక్షిణ ద్వీపకల్ప భారతదేశంలో వేడిగాలులు తగ్గుముఖం పట్టబోతున్నాయి. తూర్పు ప్రాంతానికి ఈ రోజులో ఉపశమనం లభించవచ్చు. దక్షిణాది రాష్ట్రాలు కూడా త్వరకలోనే వేడి తీవ్రతలు తగ్గుతాయని ఐఎండీ పేర్కొంది. మే 10 వరకు ఈ ప్రాంతాలలో ఉరుములు, గాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు సమాచారం.గత నెల నుంచి భారతదేశంలో పలు ప్రాంతాల్లో తీవ్రమైన వేడిగాలులు వ్యాపించడంతో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల కంటే ఎక్కువ అవుతున్నాయి. ఏప్రిల్ చివరి రోజున కోల్‌కతాలో 43 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది, కోల్‌కతాలో దశాబ్దాలుగా ఇంతటి ఉష్ణోగ్రత నమోదు కాలేదు.రాబోయే ఐదు రోజుల్లో గుజరాత్, రాజస్థాన్, పశ్చిమ మధ్యప్రదేశ్‌లను ఉష్ణోగ్రతలు తగ్గుతాయని, ఈశాన్య రాష్ట్రాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. మేఘాలయలోని ఖాసీ-జైంతియా హిల్స్ ప్రాంతంలో నిన్నటి నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్షాల కారణంగా అనేక ఇళ్లు దెబ్బతిన్నాయి. 400 మందికి పైగా ప్రజలు నష్టపోయినట్లు.. మరో 48 గంటల పాటు ఈ వర్షం కొనసాగుతుందని వాతావరణ సఖ పేర్కొంది. -
జమ్ముకశ్మీర్‌లో భారీ వర్షాలు.. జనజీవనం అతలాకుతలం!
జమ్ము కశ్మీర్లో కురుస్తున్న భారీ వర్షాలు జనజీవనాన్ని అస్తవ్యస్తం చేస్తున్నాయి. దీనికితోడు కొండ ప్రాంతాల్లో భారీగా మంచు కురుస్తుండటంతో జనం తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. భారీ వర్షాల నేపధ్యంలో రాష్ట్రంలో పదుల సంఖ్యలో ఇళ్లు కూలియాయి. బారాముల్లా, కిష్త్వార్, రియాసి జిల్లాలు భారీ వర్షాలకు అతలాకుతలమయ్యాయి.కిష్త్వార్ జిల్లాలో భారీ వర్షాల కారణంగా 12 ఇళ్లు దెబ్బతిన్నాయి. దీని గురించి ప్రభుత్వ అధికారిక ప్రతినిధి మాట్లాడుతూ గత నాలుగు రోజులుగా ఈ ప్రాంతంలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రభుత్వ రెస్క్యూ టీమ్ అప్రమత్తమయ్యిందన్నారు. మంగళవారం కూడా పలు ప్రాంతాల్లో మంచు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. దీంతో నేడు (మంగళవారం) కశ్మీర్లో పాఠశాలలను మూసివేశారు.కశ్మీర్లో జరగాల్సిన ప్రభుత్వ జూనియర్ అసిస్టెంట్ పరీక్ష వాయిదా పడింది. జమ్ము-శ్రీనగర్ హైవేలోని శిథిలాలు తొలగించే వరకు ఈ రహదారిపై ప్రయాణాలు సాగించవద్దని అధికారులు ప్రయాణికులకు సూచించారు. భారీ వర్షాల నేపధ్యంలో కిష్త్వార్ జిల్లాలో రెడ్ అలర్ట్ ప్రకటించారు. రియాసిలోని దోడా, రాంబన్, గులాబ్‌గఢ్‌లలో నదులు, వాగుల్లో నలుగురు కొట్టుకుపోగా, వారిలో ఇద్దరి మృతదేహాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కొండచరియలు విరిగిపడటం, ఇళ్లు కూలిపోవడం తదితర ఘటనల్లో12 మంది చిన్నారులతో సహా 22 మంది గాయపడ్డారు. -
భానుడి భగభగ: మరో ఐదు రోజులు హీట్‌వేవ్
న్యూఢిల్లీ: రానున్న ఐదు రోజుల పాటు తూర్పు, దక్షిణ భారతాల్లో హీట్‌వేవ్ కొనసాగుతుందని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) తెలిపింది. పశ్చిమబెంగాల్, ఒడిషా తీర ప్రాంతాలతో పాటు సిక్కిమ్, కర్ణాటకలో భానుడు నిప్పులు కురిపించనున్నట్లు ఐఎండీ వెల్లడించింది.బీహార్, జార్ఖండ్, ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతం, రాయలసీమ, తెలంగాణలోనూ హీట్‌వేవ్ ప్రభావం ఉంటుందని తెలిపింది. పశ్చిమబెంగాల్‌కు మాత్రం ఐఎండీ రెడ్అలర్ట్ ఇచ్చింది. అన్ని వయసుల వారు ఎండల పట్ల అప్రమత్తంగా ఉండాలని కోరింది. అయితే దేశంలోని ఈశాన్య ప్రాంతాలతో పాటు మరికొన్ని ప్రాంతాల్లో అక్కడక్కడ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. -
Delhi-NCR Rain: హీట్‌వేవ్ నుంచి ఊరట.. ఢిల్లీలో భారీ వర్షం
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ వాసులకు మండు వేసవి నుంచి ఉపశమనం లభించింది. మంగళవారం(ఏప్రిల్23) సాయంత్రం ఢిల్లీలో భారీ వర్షం కురిసింది. పలు ప్రాంతాల్లో భారీ వర్షంతో పాటు బలమైన గాలులు వీచాయి. హీట్‌వేవ్‌తో వేడెక్కిన వాతావరణం ఒక్కసారిగా వర్షం పడటంతో చల్లబడింది. వర్షం పడుతున్న దృశ్యాలను ఢిల్లీ వాసులు ఆనందంతో సోషల్ మీడియాలో షేర్ చేశారు. ప్రస్తుతం దేశంలో హీట్‌వేవ్ కొనసాగుతోందని వాతావరణ శాఖ తెలిపింది. -
AP: ఆగని భగభగలు.. 46 డిగ్రీల దిశగా ఉష్ణోగ్రతలు
సాక్షి, విశాఖపట్నం: రాష్ట్రంలో భానుడి భగభగలు కొనసాగుతున్నాయి. రోజురోజుకు మరింత తీవ్రరూపం దాలుస్తున్నాయి. పలుచోట్ల 42 నుంచి 45 డిగ్రీలకుపైగా అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. సాధారణంకంటే 3–6 డిగ్రీలు అధికంగా ఇవి రికార్డవుతుండడంతో అనేక మండలాల్లో తీవ్ర వడగాడ్పులు, వడగాడ్పులు వీస్తున్నాయి. జనాన్ని బెంబేలెత్తిస్తున్నాయి. బుధవారం అత్యధికంగా వైఎస్సార్ జిల్లా కొంగలవీడులో 45.3 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. పెద్దదేవళాపురం (నంద్యాల జిల్లా) 44.9, రావికమతం (అనకాపల్లి), రామభద్రపురం (విజయనగరం), దొనకొండ (ప్రకాశం), మంగనెల్లూరు (తిరుపతి)ల్లో 44.1 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. 16 జిల్లాల్లో 43 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 67 మండలాల్లో తీవ్ర వడగాడ్పులు, 125 మండలాల్లో వడగాడ్పులు వీచాయి. గురువారం 76 మండలాల్లో తీవ్ర వడగాడ్పులు, 214 మండలాల్లో వడగాడ్పులు వీయనున్నాయి. విజయనగరం జిల్లాలో 22, పార్వతీపురం మన్యం 13, శ్రీకాకుళం 12, అనకాపల్లి 11, పల్నాడు 7, అల్లూరి సీతారామరాజు 4, కాకినాడ 3, తూర్పు గోదావరి 2, ఎన్టీఆర్ 2 మండలాల్లో తీవ్ర వడగాడ్పులు వీచే అవకాశాలున్నాయి. ప్రకాశం 24, గుంటూరు 17, తూర్పు గోదావరి 17, పల్నాడు 16, ఎన్టీఆర్ 14, శ్రీకాకుళం 14, కృష్ణా 13, కాకినాడ 12, బాపట్ల 12, ఎస్పీఎస్సార్ నెల్లూరు 11, అల్లూరి సీతారామరాజు 11, ఏలూరు 9, తిరుపతి 7, కోనసీమ 7, అనకాపల్లి 6, విజయనగరం 5, విశాఖ పట్నం 3, పశ్చిమ గోదావరి 3 మండలాల్లోను, పార్వతీపురం మన్యం, నంద్యాల, వైఎస్సార్ జిల్లాల్లో ఒక్కో మండలంలోను వడగాడ్పులు వీచే అవకాశాలున్నాయి. శుక్రవారం 47 మండలాల్లో తీవ్ర వడగాడ్పులు, 229 మండలాల్లో వడగాడ్పులు వీస్తాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. మూడురోజులు తేలికపాటి వర్షాలు మరోవైపు గల్ఫ్ ఆఫ్ మన్నార్ నుంచి దక్షిణ తెలంగాణ వరకు తమిళనాడు, రాయలసీమల మీదుగా వ్యాపించి ఉన్న ద్రోణి సగటు సముద్రమట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతోంది. దీని ప్రభావంతో రానున్న మూడురోజులు కోస్తాంధ్ర, రాయలసీమల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) బుధవారం నివేదికలో తెలిపింది. అదే సమయంలో ఉరుములు, మెరుపులతో పాటు పిడుగులు కూడా సంభవించవచ్చని పేర్కొంది. అందువల్ల ఆయా ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. గురువారం అల్లూరి సీతారామరాజు, తూర్పు గోదావరి, కర్నూలు, నంద్యాల, వైఎస్సార్, అన్నమయ్య, చిత్తూరు జిల్లాలు, శుక్రవారం ప్రకాశం, అనంతపురం, శ్రీసత్యసాయి, వైఎస్సార్, అన్నమయ్య, చిత్తూరు జిల్లాలు, శనివారం అల్లూరి సీతారామరాజు, కాకినాడ జిల్లాల్లో ఈ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ వివరించింది. -
Dubai Floods: దుబాయ్‌లో వర్ష బీభత్సం.. అంతటా అల్లకల్లోలం!
వర్ష బీభత్సానికి ఎడారి దేశం దుబాయ్ విలవిలలాడిపోతోంది. కేవలం గంటన్నర వ్యవధిలో అంటే 90 నిమిషాల్లో.. ఏడాదిలో కురవాల్సిన వర్షమంతా ఒకేసారి కురిసింది. May Allah protect Dubai and all Muslim Ummah! pic.twitter.com/DBULtsnODg — Allah Islam Quran (@AllahGreatQuran) April 17, 2024 భారీ వర్షానికి తోడు వేగంగా వీచిన ఈదురు గాలులకు చెట్లు నేల కూలాయి. కుండపోత వర్షానికి రోడ్లన్నీ జలమయంగా మారాయి. మాల్స్ అన్నీ నీటితో నిండిపోయాయి. Dubai is experiencing serious flood disaster, but who added the screaming and gunshots sound to the video 🤦 pic.twitter.com/TYteXtM4dT — Lawrence I. Okoro ( Sir Law ) (@LawrenceOkoroPG) April 17, 2024 దుబాయ్ ఎయిర్ పోర్టులోనూ వర్ష బీభత్సం ప్రత్యక్షంగా కనిపించింది. దీంతో విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. బయటి రోడ్లను చూస్తే అవి చెరువులను తలపించాయి. రైల్వే వ్యవస్థ చాలావరకూ దెబ్బతింది. సబ్ వేలన్నీ నీట మునిగాయి. రోడ్లపై నిలిపివుంచిన కార్లు నీటిలో కొట్టుకుపోయాయి. pic.twitter.com/zdHha4kaYv — Taswar Sial (@TaswarSial) April 17, 2024 దుబాయ్ తీరాన్ని తాకిన తుఫాను కారణంగా ఈ ప్రకృతి విలయం సంభవించింది. భారీ వర్షాల కారణంగా పోటెత్తిన వరదలతో యూఏఈ అంతటా జన జీవనం స్తంభించింది. స్కూళ్లకు సెలవులు ప్రకటించారు. ప్రైవేట్ ఉద్యోగులకు ఆయా సంస్థలు వర్క్ ఫ్రం హోం వెసులుబాటును కల్పించాయి. Scenes of current Dubai weather pic.twitter.com/z7rGzUtlIB — Science girl (@gunsnrosesgirl3) April 16, 2024 ఫుజైరా ఎమిరేట్స్‌లో దుబాయ్‌కి మించిన వర్షపాతం నమోదయ్యింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా ప్రపంచంలోనే అతిపెద్ద షాపింగ్ మాల్ అయిన మాల్ ఆఫ్ ఎమిరేట్స్ లోపలికి నీరు ప్రవేశించింది. నీటి ఒత్తిడికి మాల్ పైకప్పు భాగాలు ఊడి కింద పడ్డాయి. గత 75 ఏళ్లలో ఎప్పుడూ ఇంతటి భారీ వర్షాలు కురియలేదని అధికారులు తెలిపారు. The torrents in Oman are worse than in Dubai. No jokes..pic.twitter.com/O6DGA8sFMe — Henry Kabogo 💧 ❄ 🇰🇪 (@Kabogo_Henry) April 17, 2024 రోడ్లపై భారీగా నిలిచిన నీటిని అధికారులు ట్రక్కుల్లో నింపి క్లియర్ చేస్తున్నారు. మరోవైపు దేశవ్యాప్తంగా రాగల 48 గంటల్లో భారీ వర్షాలు కురియవచ్చని పేర్కొంటూ జాతీయ వాతావరణ కేంద్రం రెడ్ అలర్ట్ జారీ చేసింది. ప్రజలు ఎంతో అప్రమత్తంగా ఉండాలని, అత్యవసర పరిస్థితుల్లో తప్ప బయటకు రాకూడదని హెచ్చరించింది. -
మూడు రోజులు తేలికపాటి వర్షాలు
సాక్షి, విశాఖపట్నం: రాయలసీమపై మంగళవారం నుంచి ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఇది సముద్ర మట్టానికి 1.5 కి.మీ. ఎత్తు వరకు విస్తరించి ఉంది. దీని ప్రభావంతో రానున్న మూడు రోజులు కోస్తాంధ్ర, రాయలసీమల్లో తేలికపాటి వర్షాలతో పాటు ఉరుములు, మెరుపులు, పిడుగులు సంభవించే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) తెలిపింది. మరోవైపు వచ్చే మూడు రోజులు కోస్తాంధ్ర రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో 44నుంచి 46 డిగ్రీల వరకు పగటి ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని, దీనివల్ల పలుచోట్ల వడగాడ్పులు, తీవ్ర వడగాడ్పులు వీస్తాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. కొవిలంలో 45.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు మంగళవారం రాష్ట్రంలో అత్యధికంగా శ్రీకాకుళం జిల్లా కొవిలంలో 45.4 ఉష్ణోగ్రత రికార్డయింది. తుమ్మికపల్లి (విజయనగరం)లో 45.2, రావికమతం (అనకాపల్లి)లో 45.1, మక్కువ (పార్వతీపురం మన్యం)లో 44.4, గోస్పాడు (నంద్యాల)లో 44.3 డిగ్రీల చొప్పున నమోదయ్యాయి. 88 మండలాల్లో తీవ్ర వడగాడ్పులు, 89 మండలాల్లో వడగాడ్పులు వీచాయి. కాగా.. బుధవారం 46 మండలాల్లో తీవ్ర వడగాడ్పులు, 175 మండలాల్లో వడగాడ్పులు వీయనున్నాయి. వీటిలో శ్రీకాకుళం జిల్లాలో 12, విజయనగరం 18, పార్వతీపురం మన్యం 12, విశాఖపట్నం 2, అనకాపల్లి 2, కాకినాడ 2 మండలాల్లో తీవ్ర వడగాడ్పులు, శ్రీకాకుళం జిల్లాలో 11, విజయనగరం 6, పార్వతీపురం మన్యం 3, అల్లూరి సీతారామరాజు 12, విశాఖపట్నం 3, అనకాపల్లి 15, కాకినాడ 15, కోనసీమ 9, తూర్పు గోదావరి 18, పశ్చిమ గోదావరి 18, ఏలూరు 13, కృష్ణా 10, ఎన్టీఆర్ 6, గుంటూరు 15, పల్నాడు 22, బాపట్ల 2, ప్రకాశం 8, ఎస్పీఎస్సార్ నెల్లూరు 1, తిరుపతి జిల్లాలో 3 మండలాల్లో వడగాడ్పులు వీస్తాయి. తీవ్ర వడగాడ్పులకు అవకాశం గురువారం శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, ఏలూరు, ఎన్టీఆర్, పల్నాడు జిల్లాల్లోను, శుక్రవారం శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో, ఈనెల 20న అల్లూరి సీతారామరాజు, ఎన్టీఆర్, బాపట్ల, పల్నాడు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తీవ్ర వడగాడ్పులకు ఆస్కారం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ వివరించింది. తీవ్ర వడగాడ్పుల దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఎండలు, వడగాడ్పుల బారిన పడకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. -
చల్లటి కబురు చెప్పిన వాతావరణ శాఖ..
-
దుబాయ్‌లో వర్షం ఎలా పడుతుందో తెలుసా..!
భారత్‌లో వర్షం కోసం మనం ఎదురూ చూడాల్సిన పరిస్థితి ఉండదు. కాలానుగుణంగా వర్షాలు పడుతూనే ఉంటాయి. మన దేశంలో కూడా కొన్ని వానలు కురవని ప్రాంతాలు ఉన్నాయి. అయితే మరీ అస్సలు పడకుండా మాత్రం ఉండదు. అయితే దుబాయ్‌లాంటి అరబ్ దేశాల్లో అస్సలు వర్షాలూ పడవనే విషయం ఎంతమందికి తెలుసు. అక్కడ ఏడాదంతా వేడి వాతావరణంతో పొడిపొడిగా ఉంటుందట. నీటి సమస్య కూడా ఎక్కువే. మరి అలాంటి ప్రదేశాల్లో వర్షం లేకపోవడం కారణంగా వ్యవసాయాధారిత పంటలు కూడా ఏమి ఉండవు. అందుకని వర్షం పడేలా వాళ్లు ఏం చేస్తారో తెలుసా..! ఆయా దేశాల్లో వర్షాలు పడకపోవడంతో కృత్రిమ వర్షం సృష్టిస్తారు. దీన్ని క్లౌడ్ సీడింగ్ అని పిలుస్తారు. వర్షం లేదా మంచు ఏర్పడటాన్ని ప్రోత్సహించడానికి పదార్థాలను గాలిలోకి వెదజల్లి వర్షం పడేలా చేస్తారు. ఈ విధానంలో సిల్వర్ అయోడైడ్, పొటాషియం అయోడైడ్ లేదా డ్రై ఐస్ వంటి పదార్థాలతో మేఘాలను విత్తడం జరుగుతుంది. ఇవి నీటి బిందువులు చుట్టూ ఏర్పడటానికి కేంద్రకాలుగా పనిచేస్తాయి. ఈ కణాలకు తేమను ఆకర్షించే గుణం ఉండటం వల్ల పెద్దగా వర్షంలా పడేందుకు దారితీస్తాయి. ఈ పద్ధతి వర్షం లేదా మంచును ఉత్పత్తి చేయని మేఘాలలో వర్షపాతాన్ని ప్రేరేపిస్తాయి. అయితే దీన్ని దశాబ్దాలుగా ప్రయోగం చేస్తున్నప్పటికీ.. వాతారణ పరిస్థితులు, కారకాల కారణంగా ఒక్కోసారి ప్రభావం మారుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కూడా ఈ విధానంలోనే వర్షం పడేలా చేస్తుంది. అక్కడ అధికారులు నీటి కొరత సవాళ్లను పరిష్కరించేందుకు ఈ వ్యూహాత్మక విధానాన్ని ఉపయోగిస్తుంటోంది. ఈ క్లౌడ్ సీడింగ్ టెక్నాలజీని ఎక్కువగా పర్షియన్ గల్ఫ్ ప్రాంతాల్లోనే ఉపయోగిస్తారు. అక్కడ తీవ్రమైన వేడి వాతావరణం దృష్ట్యా నీటి కొరత ఎక్కువగా ఉంటుంది. దీన్ని పరిష్కరించేందుకు యూఏఈ శాస్త్రవేత్తలు ఈ క్లౌడ్ సీడింగ్ అనే టెక్నాలజీని ఉపయోగించారు. అందుకోసం వారు దేశ వాతావరణంపై చాలా అప్రమత్తమైన నిఘా ఉంచుతారు. ఈ క్లౌడ్ సీడింగ్ పద్ధతితో పొడి వాతావరణ పరిస్థితుల్లో 30% నుంచి 35%, ఎక్కువ తేమతో కూడిన వాతావరణంలో 10% నుంచి 15% వరకు వర్షపాతాన్ని పెంచగలవని శాస్త్రవేత్తల చెబుతున్నారు. ఈ పద్ధతిలోనే దుబాయ్‌లో వర్షం పడేలా చేసిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. మీరు కూడా ఓ లుక్కేయండి. This is Dubai's artificial rain which happens because of cloud seeding pic.twitter.com/O5Uqcf4xC7 — Historic Vids (@historyinmemes) April 8, 2024 (చదవండి: యుద్ధ భయంతో పడవ ఎక్కితే..నడి సంద్రంలో ఇంజన్ ఫెయిల్..!) -
మండే ఎండల్లో వర్ష సూచన: వాతావరణ శాఖ
న్యూఢిల్లీ: రోజురోజుకి భానుడి భగభగలు ఎక్కువైపోతున్నాయి. ఢిల్లీ, ముంబై, హైదరాబాద్ నగరాల్లో వేడి అంతకంతకు పెరిగిపోతోంది. ఈ తరుణంలో భారత వాతావరణ శాఖ (IMD) దేశంలోని రానున్న రెండు రోజుల్లో కొన్ని ప్రాంతాల్లో వేడిగాలులు వీస్తాయని, మరి కొన్ని ప్రాంతాల్లో వర్షం పడుతుందని వెల్లడించింది. ఒడిశా, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, విదర్భ, ఉత్తర కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, యానాం, రాయలసీమ, తెలంగాణలలో ఈరోజు, రేపు వేడిగాలుల ఎక్కువగా ఉండే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. తమిళనాడు, పుదుచ్చేరి, కేరళ, అస్సాం, మేఘాలయ, నాగాలాండ్, మణిపూర్, త్రిపుర, అరుణాచల్ ప్రదేశ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్‌లోని కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ ఏడాది దేశంలో గరిష్ట ఉష్ణోగ్రత సాధారణం కంటే ఎక్కువగా నమోదవుతుందని ఐఎండీ ఇటీవల అంచనా వేసింది. ఏప్రిల్ ప్రారంభం నుంచి దేశంలోని చాలా ప్రాంతాల్లో 40 నుంచి 42 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని, దీని కారణంగా హీట్ స్ట్రోక్ ప్రమాదం పెరిగిందని ఇప్పటికే పేర్కొన్నారు. -
వర్షం కురిస్తే ట్యాక్స్ కట్టాల్సిందే..!
బ్రిటిష్ పాలనలో చాలా రకాల పన్నులు వేసేవారు. ఇప్పటికీ వారి పాలనలో ప్రవేశపెట్టిన ఆదాయపు పన్ను, ఇంటిపన్ను, టోల్ వంటి అనేక ట్యాక్స్‌లు సామాన్యుల భారంగా మారుతున్నాయి. మనిషి తయారుచేసిన ఉత్పత్తులు, వాటికి అందించే సేవలపై ట్యాక్స్లుండడం సహజం. అయితే విచిత్రంగా ప్రకృతి ప్రసాదించే వర్షానికి సైతం పన్ను చెల్లించే పరిస్థితి ఏర్పడింది. బహుశా ఇప్పటి వరకు ప్రపంచంలో ఎక్కడా ఈ విధానం లేదు. మొట్టమొదటిసారిగా కెనడాలో వచ్చే నెల నుంచి రెయిన్ ట్యాక్స్ అమలు కానున్నట్లు తెలిసింది. ఈ మేరకు కొన్ని మీడియా సంస్థలు కథనాలు ప్రచురించాయి. అసలు కెనడా ప్రభుత్వం ప్రకృతి సహజంగా ప్రసాదించే వర్షంపై ప్రజలపై ఎందుకు ట్యాక్స్ విధిస్తుందో ఈ కథనంలో తెలుసుకుందాం. మీడియా కథనాల ప్రకారం..టొరంటో నగరంతోపాటు దాదాపు కెనడా మొత్తం తుపాను నీటి నిర్వహణ ప్రభుత్వానికి పెద్ద సమస్యగా మారింది. కెనడాలో మార్చి నుంచి మే నెల వరకు వర్షంతో పాటు మంచు కురుస్తుంది. భూఉపరితలం, చెట్లు, మొక్కల ద్వారా గ్రహించబడని వర్షపునీరు బయట రోడ్లపై ప్రవహిస్తుంటుంది. అయితే ఆదేశంలో నేల కనిపించకుండా ఇళ్లు, రోడ్లు, కార్యాలయాలు.. అలా దాదాపు అంతా కాంక్రీటుమయం కావడంతో నీటి నిర్వహణ సవాలుగా మారుతోంది. కెనడాలో తుపాన్లు ఎక్కువగా వస్తూంటాయి. అది సమస్యను మరింత పెంచుతోంది. దాంతో ప్రజల రోజువారీ కార్యకలాపాలు చాలా దెబ్బతింటున్నాయి. ఆ పరిస్థితుల్లో స్థానికుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ఓ నిర్ణయం తీసుకుంది. నీటి వినియోగదారులు, ఆసక్తిగల పార్టీల సహకారం, ఎన్జీఓలతో తుపాను నీటి నిర్వహణను పరిష్కరించడానికి ప్రభుత్వం ‘స్మార్ట్ వాటర్ ఛార్జ్, వాటర్ సర్వీస్ ఛార్జ్ కన్సల్టేషన్ ప్రోగ్రామ్’ను ప్రారంభించింది. అందుకు అవసరమయ్యే ఆర్థిక భారాన్ని ప్రజలే భరించాలనే ఉద్దేశంతో రెయిన్ట్యాక్స్ను విధించనున్నట్లు తెలిసింది. కెనడాలో అధికభాగం రాతినేలలే. దాంతో వర్షపునీరు నేలలో ఇంకేందుకు చాలా సమయం పడుతుంది. చిన్నపాటి వర్షం కురిసినా డ్రెయిన్ వాటర్‌తో నాలాలు పొంగిపోర్లుతుంటాయి. ఈ సమస్యను ‘రన్ఆఫ్’ అంటారు. దీన్ని అధిగమించేందుకు ప్రభుత్వం ప్రత్యేక మురుగునీటి పారుదల వ్యవస్థ స్మార్ట్ వాటర్ ఛార్జ్‌ను ప్రారంభించింది. ఈ విధానం ద్వారా సేకరించిన అదనపు నీటిని బయటకు తీస్తారు. దానికి అయ్యే ఖర్చులను రెయిన్‌ట్యాక్స్ ద్వారా భర్తీ చేస్తారు. వర్షపు పన్ను ఒక్కో ప్రాంతానికి ఒక్కో విధంగా ఉంటుంది. ఎక్కువ భవనాలు ఉన్న చోట ఎక్కువ రన్ఆఫ్ ఉంటుంది. అందువల్ల అక్కడ వర్షం పన్ను కూడా ఎక్కువ విధిస్తారు. ఈ పన్ను కేటగిరీలో ఇళ్లు, పార్కింగ్ స్థలాలు, కాంక్రీటుతో చేసిన అనేక ప్రదేశాలు ఉన్నాయి. కెనడాలో విధించే వ్యక్తిగత పన్నులు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. ప్రపంచంలో అత్యధిక వ్యక్తిగత పన్ను విధించే దేశాల విభాగంలో కెనడా ఉంటుంది. తాజాగా వర్షపు పన్ను ప్రజలపై మరింత భారంమోపేలా ఉందని స్థానికులు అభిప్రాయపడుతున్నట్లు కొన్ని మీడియా కథనాల ద్వారా తెలిసింది. అయితే అద్దె ఇళ్లలో నివసించే వారిపై ఈ పన్ను విధిస్తారా లేదా అనేది ఇంకా స్పష్టం కాలేదు. ఇదీ చదవండి: మొబైల్ యూజర్లకు చేదువార్త.. త్వరలో రీఛార్జ్ ప్లాన్ల పెంపు..? ఎంతంటే.. కెనడా ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా చాలా మంది నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. నగరంలో భవనాలు, కార్యాలయాలు, హోటళ్లు, రెస్టారెంట్లు, అనేక ఇతర ప్రదేశాలు ఉన్నాయి. టొరంటో ప్రజలు ఇప్పటికే నీటిపై పన్ను చెల్లిస్తున్నారు. ఇందులో తుపాను నీటి నిర్వహణ ఖర్చు కూడా ఉందని కొందరు చెబుతున్నారు. నీటి పన్నుతోపాటు ప్రత్యేకంగా రెయిన్‌ట్యాక్స్ విధించడంపట్ల ప్రజల నుంచి విమర్శలు వస్తున్నట్లు మీడియా కథనాల ద్వారా తెలుస్తుంది. -
Colors of Politics: నెహ్రూ నుంచి మోదీ వరకూ..
హోలీకి భారత రాజకీయాలకు మధ్య సంబంధం ఎంతో ప్రత్యేకమైనది. మొఘల్ చక్రవర్తులు, బ్రిటీష్ పాలకులు కూడా హోలీ వేడుకల్లో పాల్గొన్నారు. దేశ మొదటి ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రూ హోలీ సందర్భంగా ప్రజల కోసం తన నివాసం తీన్ మూర్తి భవన్ తలుపులు తెరిచేవారు. నాటి ప్రధాని ఇందిరా గాంధీ, అటల్ బిహారీ వాజ్‌పేయి కూడా ఢిల్లీ ప్రజలతో కలిసి హోలీ వేడుకలు చేసుకున్నారు. ఎన్నికల సంవత్సరంలో జరిగే హోలీ వేడుకలు రాజకీయాలకు మరింత ఉత్సాహాన్ని అందిస్తున్నాయి. తీన్ మూర్తి భవన్ గతంలో నాటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ నివాసంగా ఉండేది. అప్పటి అమెరికా అధ్యక్షుడు జాన్ ఎఫ్ కెన్నెడీ భార్య జాక్వెలిన్ భారత్‌లో జరిగిన హోలీ వేడుకల్లో పాల్గొన్నారు. నాటి దౌత్యవేత్త బీకే నెహ్రూ తన ఆత్మకథ ‘నైస్ గైస్ ఫినిష్ సెకండ్’లో జాక్వెలిన్ హోలీ వేడుకల్లో పాల్గొన్న విషయాన్ని ప్రస్తావించారు. హోలీ వేడుల్లో నెహ్రూ.. 1962లో కెన్నెడీ భార్య జాక్వెలిన్ తొమ్మిది రోజుల వ్యక్తిగత పర్యటన నిమిత్తం భారతదేశానికి వచ్చారు. అయితే ఆమె హోలీ రోజు తిరుగు ప్రయాణమయ్యారు. ఆరోజు ఆమె జవహర్లాల్ నెహ్రూకు వీడ్కోలు చెప్పడానికి తీన్ మూర్తి భవన్‌కు వెళ్లారు. ఆమె ఆరోజున ఫ్యాషన్ దుస్తులు ధరించారు. అక్కడ ఉన్న నాటి అమెరికన్ అంబాసిడర్ గాల్‌బ్రైత్ కుర్తా పైజామా ధరించి వచ్చారు. బికె నెహ్రూ తెలిపిన వివరాల ప్రకారం ప్రధాని నెహ్రూ హోలీ వేడుకలను ఎంతో ఇష్టపడేవారు. జాక్వెలిన్ తీన్ మూర్తి భవన్‌కు చేరుకోగానే వివిధ రంగులలో గులాల్ నింపిన చిన్న గిన్నెలను వెండి ట్రేలో ఆమె ముందుకు తీసుకువచ్చారు. నెహ్రూ.. జాక్వెలిన్ నుదుటిపై గులాల్ రాశారు. అక్కడే ఉన్న ఇందిరా గాంధీ కూడా జాక్వెలిన్‌కు రంగులు పూశారు. అనంతరం నెహ్రూ.. పాలం విమానాశ్రయంలో జాక్వెలిన్ కెన్నెడీకి వీడ్కోలు పలికారు. దేశ తొలి ప్రధాని నెహ్రూతో పాటు తొలి రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్రప్రసాద్ కూడా హోలీ ఆడేవారు. తీన్ మూర్తి భవన్లో హోలీని జరుపుకునే ఈ ప్రక్రియ 1963 వరకు కొనసాగింది. 1964లో నెహ్రూ అస్వస్థతకు గురయ్యారు. ఆ సంవత్సరం అక్కడ హోలీ జరగలేదు. 1964లో ఆయన మరణానంతరం ప్రధానమంత్రి నివాసంలో హోలీ వేడుకలు నిలిచిపోయాయి. ఇందిర నివాసంలో.. ఇందిరా గాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు సఫ్దర్‌జంగ్ రోడ్‌లోని ఆమె ప్రభుత్వ నివాసంలో హోలీ వేడుకలు జరిగేవి. ఆరోజు వచ్చిన అతిథులందరికీ ప్రత్యేక వంటకాలు వడ్డించేవారు. తరువాతి కాలంలో రాజీవ్ గాంధీ, సోనియా గాంధీలు తమ ఇంట్లో హోలీ ఆడేవారు. పలువురు కాంగ్రెస్ నేతలు వారి నివాసానికి చేరుకుని హోలీ వేడుకల్లో పాల్గొనేవారు. వాజపేయి, మోదీల రంగుల కేళి అటల్ బిహారీ వాజపేయి దేశ ప్రధాని అయ్యాక ఆయనకు గులాల్ పూయడానికి చాలా మంది ఆయన నివాసానికి వెళ్లేవారు. ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోదీ నాటి ప్రధాని వాజపేయి సమక్షంలో హోలీ వేడుకలు చేసుకున్న ఉదంతం 1999లో జరిగింది. వాజ్‌పేయి తన నివాసంలో హోలీ మిలన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. దీనిలో మిత్రపక్షాలే కాకుండా బీజేపీ నేతలు కూడా పాల్గొన్నారు. నాడు నేటి ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. నాడు వాజ్‌పేయి, మోదీ పరస్పరం రంగులు పూసుకున్నారు. అప్పటి కేంద్ర మంత్రి విజయ్ గోయల్ కూడా ఈ వేడుకల్లో పాల్గొన్నారు. అద్వానీ ఇంట్లో నీళ్లతో హోలీ మాజీ ఉప ప్రధాని లాల్ కృష్ణ అద్వానీ ఇంట్లో నీళ్లతో హోలీ ఆడేవారు. నాటి రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం హోలీ వేడుకలను మానసిక వికలాంగ చిన్నారుల మధ్య జరుపుకునేవారు. ఇందులో రంగులు, గులాల్ బదులు పూలు జల్లుకునేవారు. ఢిల్లీలోని కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అధికారిక నివాసంలో కూడా హోలీ వేడుకలను ఉత్సాహంగా జరుగుతుంటాయి. పాత ఢిల్లీ వీధుల్లో ఉరిమే ఉత్సాహం పాత ఢిల్లీ వీధుల్లో హోలీ వేడుకలు ఘనంగా జరుగుతుంటాయి. ఇందులో అధికార, ప్రతిపక్షాలకు అతీతంగా నేతలంతా ఒకరినొకరు కలుసుకుని హోలీ శుభాకాంక్షలు తెలుపుకుంటారు. నేటి ప్రధాని నరేంద్ర మోదీ కూడా హోలీ వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొంటారు. తాజాగా ఆయన దేశ ప్రజలకు హోలీ శుభాకాంక్షలు తెలిపారు. అందరి జీవితాల్లో నూతన చైతన్యం, ఉత్సాహం వెల్లివిరియాలని ఆయన ఆకాంక్షించారు. -
తెలుగు రాష్ట్రాలకు చల్లటి కబురు
-
తెలుగు రాష్ట్రాల్లో వింత వాతావరణం వచ్చే నాలుగు రోజులూ..
-
Delhi: ఢిల్లీలో భారీ వర్షం..
ఢిల్లీ-ఎన్సీఆర్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఈరోజు (శనివారం) ఉదయం నుంచి భారీ వర్షం పడుతోంది. ఘజియాబాద్, నోయిడా, గ్రేటర్ నోయిడా, గురుగ్రామ్ సహా ఎన్సీఆర్ ప్రాంతాల్లో ఎడతెగని వర్షం కురుస్తోంది. ఢిల్లీ-ఎన్సీఆర్లో పిడుగులు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఉత్తరప్రదేశ్‌లో మార్చి 2 న వర్షం, వడగళ్ల వాన కురిసే అవకాశం ఉంది. లక్నో, బిజ్నోర్, మీరట్, బరేలీ, రాంపూర్, రాయ్ బరేలీ, గోరఖ్‌పూర్ సహా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో శనివారం ఆకాశం మేఘావృతమై ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉంది. బీహార్, జార్ఖండ్, రాజస్థాన్‌లలో జల్లులు కురిసే అవకాశం ఉంది. హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్‌లోని కొన్ని ప్రాంతాల్లో మంచు కురుస్తుంది. Nowcast-1 Fresh scattered thunderclouds are developing all over #Delhi & #Ncr and #Haryana region to bring on/off spells of light-mod rains with isol heavy burst w/ #hailstorm followed by gusty winds upto 20-50km/h in #Delhi,#Gurgaon,#Ghaziabad, #Noida in next 3 hrs#DelhiRains https://t.co/k1ykuNUpLy pic.twitter.com/zKKl3CkLcJ — IndiaMetSky Weather (@indiametsky) March 2, 2024 వాతావరణ శాఖ సూచనల ప్రకారం శనివారం ఢిల్లీ-ఎన్‌సిఆర్‌లో బలమైన గాలులతో కూడిన ఓ మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉంది. దీంతో వాతావరణం చల్లగా మారనుంది. మార్చి 2న పశ్చిమ హిమాలయ ప్రాంతంలో మెరుపులు, బలమైన గాలులతో పాటు తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు, మంచు కురిసే అవకాశం ఉంది. పంజాబ్, హర్యానాలో గంటకు 40 నుండి 50 కి.మీ వేగంతో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. మార్చి 2న ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, ఉత్తర మధ్యప్రదేశ్‌లలో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. Temperature is going to drop today 🥶I just kept warm clothes in bed 🙄#Delhirains pic.twitter.com/K62B7dpJ1E — Kritika vaid (@KritikaVaid91) March 2, 2024 And it's raining here in Delhi.. #DelhiRains pic.twitter.com/RruuQbouRL — Ankit Sinha (@imasinha) March 2, 2024 -
India vs South Africa 2nd T20: వరుణుడు కరుణిస్తేనే...
పోర్ట్ట్ ఎలిజబెత్: వచ్చే ఏడాది టి20 ప్రపంచకప్‌కు ముందు అందుబాటులో ఉన్న ఈ కొన్ని అంతర్జాతీయ మ్యాచ్‌లతో జట్టును సిద్ధం చేసుకోవాలని ఇటు భారత్, అటు దక్షిణాఫ్రికాలు చూస్తుంటే ప్రతికూల వాతావరణం పెను సమస్యగా మారింది. తొలి మ్యాచ్ వర్షంలో కోట్టుకుపోగా... ఇప్పుడు రెండో టి20కి కూడా వానముప్పు ఉండటం ఇరుజట్లకు ఇబ్బందిగా మారింది. జట్లకే కాదు... మ్యాచ్‌ల్ని అస్వాదించాలనుకున్న అభిమానులకు, రూ.కోట్లు గడించాలనుకున్న దక్షిణాఫ్రికా బోర్డు (సీఎస్ఏ)కు కూడా ఈ వాతావరణ పరిస్థితులు కొత్త సమస్యలు తెచ్చిపెడతాయి. కాబట్టి ఆలస్యంగా మొదలవనున్న రెండో మ్యాచ్‌కు వర్షం తెరిపినివ్వాలని అంతా కోరుకుంటున్నారు. కనీసం కుదించిన ఓవర్ల మ్యాచ్ జరిగినా మెరుపుల టి20ని చూడొచ్చని ఆశిస్తున్నారు. టాస్ పడితే... డర్బన్‌లో కనీసం టాస్ కూడా పడలేదు. ఈ మ్యాచ్‌లో బరిలోకి దిగబోయే జట్లు టాస్ పడి ఆటకు బాట పడాలని గట్టిగా కోరుకుంటున్నారు. ఆసీస్‌తో సొంతగడ్డపై యువభారత్‌ను నడిపించిన సూర్యకుమార్‌కు ఈ సిరీస్‌లో ఇటు బ్యాటింగ్, అటు బౌలింగ్‌లో పలువురు అనుభవజు్ఞలు శుబ్‌మన్ గిల్, రవీంద్ర జడేజా, సిరాజ్‌లు జతవడంతో టీమిండియా క్లీన్‌స్వీప్ లక్ష్యంగా బరిలోకి దిగింది. ఆ్రస్టేలియాపై అదరగొట్టిన రింకూ సింగ్, జితేశ్ శర్మ, రవి బిష్ణోయ్‌లు కూడా తమ ప్రదర్శన కొనసాగించాలనుకుంటున్నారు. కానీ వరుణుడు మాత్రం కరుణించడం లేదు. మరోవైపు దక్షిణాఫ్రికా జట్టు కొత్త ముఖాలు మాథ్యూ బ్రీట్జ్కె, బర్గర్లను పరీక్షించాలనుకుంటే కుదరడం లేదు. దీంతో బవుమా లేని జట్టులో మార్క్రమ్ తన మార్క్ చూపించేందుకు అవకాశం చిక్కడం లేదు. మ్యాచ్ రోజు వానపడినా... మ్యాచ్ సమయానికల్లా తెరిపినిస్తే బాగుంటుంది. ఇదే జరిగితే ఇరుజట్లలోని యువ ఆటగాళ్లంతా కొండంత ఊరట పొంది ఆటపై దృష్టిపెడతారు. తమ సత్తా చాటుకునేందుకు వారంతా సిద్ధంగా ఉన్నారు. -
ప్రపంచంలో ఇప్పటివరకు వర్షం కురవని ఊరు!ఎక్కడ ఉందంటే..
ఈ భూమ్మీద ఒక్కో చోట ఒక్కో వాతావరణం కనిపిస్తుంది. కొన్ని చోట్ల ఎండలు మండిపోతే, మరికొన్ని చోట్ల నెలల తరబడి వర్షం కురుస్తుంది. ఇంకొన్ని చోట్ల అయితే విపరీతంగా చలి కమ్మేస్తుంది. ఇలా ఒక్కో ప్రాంతంలో వాతవరణ పరిస్థితి ఒక్కోలా ఉంటుంది. కానీ అసలు వర్షమే కురవని గ్రామం ఈ భూమ్మీద ఉంటుందని మీకు తెలుసా? మరి ఆ గ్రామం ఎక్కడ ఉంది? అన్నది తెలియాలంటే ఈ స్టోరీ చదివేయండి. వర్షం మానవాళి మనుగడకు ఎంతో ముఖ్యమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఏది ఎక్కువైనా, ఏది తక్కువైనా కష్టమే. కానీ ఈ ఊర్లో మాత్రం ఇప్పటివరకు అసలు వర్షం ఊసే లేదు. ప్రపంచంలో వర్షం పడని ప్రాంతం ఇదే. ఆ గ్రామం పేరు ‘అల్-హుతైబ్’. ఇది యెమెన్ రాజధాని సనాకు పశ్చిమాన ఉంది. భూ ఉపరితలానికి 3,200 మీటర్ల ఎత్తులో ఎర్రటి రాతి కొండపై ఉంది. ఈ గ్రామం ఉంది. ఇక్కడ ఉదయం సూర్యుడు ఉదయించగానే వాతావరణం వేడుక్కిపోతుంది. సాయంత్రం కాగానే విపరీతమైన చలి కమ్మేస్తుంది. ఈ ఊర్లో అసలు ఎప్పుడూ వర్షం పడకపోవడానికి కారణం.. గ్రామం మేఘాలు పేరుకుపోని ఎత్తులో ఉండడమే. సాధారణంగా ఘాలు భూమి నుంచి రెండు కిలోమీటర్ల ఎత్తులో ఉంటాయి. ఈ ఊరు ఏకంగా భూమికి మూడు కిలో మీటర్ల ఎత్తులో ఉంటుంది. మేఘాల కన్నా ఎత్తులో ఈ గ్రామం ఉంది కాబట్టే ఇక్కడ ఎప్పుడూ వర్షం కురవదు.అందుకే ప్రపంచంలోనే ‘డ్రై సిటీ’గా దీనికి పేరుంది. ఇక్కడ అల్ బోహ్రా ( అల్ ముఖర్మ ) తెగలకు చెందిన ప్రజలు ఎక్కువగా ఉంటారు. వీరిని యెమెన్ కమ్యూనిటీస్‌గా పిలుస్తారు. మరి వర్షం లేకుండా అక్కడి ప్రజలు ఎలా బతుకున్నారు అని సందేహమా? ఇక్కడి నీటి సమస్యలు తీర్చడానికి మొబైల్ ట్యాంకర్లతో ప్రతిరోజూ నీటిని సరఫరా చేస్తారట. ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే.. ఈ ప్రాంతానికి ఎక్కువగా టూరిస్టులు వస్తుంటారు. మేఘాల కంటే ఎత్తులో ఉండటంతో ఈ వింతైన గ్రామం పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తోంది. కొండ కింది భాగంలో చిన్న చిన్న జలపాతాలు కూడా ఎంతో ఆకట్టుకుంటాయి. చేతికి తాకే దూరంలో మేఘాలు, ఇక్కడి ప్రజల లైఫ్‌స్టైల్ టూరిస్టులను ఆకట్టుకుంటున్నారు. అంతేకాకుండా అల్ హుతైబ్ కొండపై ‘క్వాట్’ అనే ఆకర్షణీయమైన మొక్కలను ఎక్కువగా పండిస్తారు. Hutaib village in Haraz. Some of the best #Yemen coffee made here. Sipping on hot cup to the sound of birds and literally being above the clouds..priceless. So much to lose, and next to nothing to gain by current ugly war. Need cooler heads and compromise for any chance of peace. pic.twitter.com/264McKUgaF — Hisham Al-Omeisy هشام العميسي (@omeisy) September 18, 2019 -
చెన్నైని వదలని వర్షాలు..మళ్లీ అలర్ట్ ఇచ్చిన ఐఎండీ
చెన్నై: మిచౌంగ్ తుపాను ప్రభావం నుంచి ఇంకా కోలుకోని చెన్నై నగరానికి వాతావరణ శాఖ మరో బ్యాడ్ న్యూస్ చెప్పింది. రానున్నఐదు రోజుల్లో చెన్నై, పాండిచ్చేరిలో భారీ వర్షాలు కురవచ్చని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) తెలిపింది. నగరంలో స్కూళ్లు,కాలేజీలు శుక్రవారం కూడా మూసివేయనున్నారు. మిచౌంగ్ తుపాను కారణంగా చెన్నైలో 20 మంది మృత్యువాత పడ్డారు. మిచౌంగ్ తుపాను ఏపీలో తీరం దాటినప్పటికీ చెన్నైలోనూ తీవ్ర నష్టం జరిగింది. ఇప్పటికీ కురుస్తున్న వర్షాల వల్ల చెన్నైలో తుపాను సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోంది. ఇతర జిల్లాల నుంచి 9 వేల మంది అధికారులను చెన్నైలో సహాయక చర్యలకుగాను ప్రభుత్వం ప్రత్యేకంగా నియమించింది. చెన్నైతో పాటు నీలగిరి,కోయంబత్తూరు, తిరుప్పూర్, దిండిగల్, థేనీ,పుదుక్కొట్టై, తంజావూరు జిల్లాల్లోనూ భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇదీచదవండి..సహజీవనం ప్రమాదకరమైన జబ్బు -
తెలంగాణలో పలు జిల్లాలకు భారీ వర్షసూచన.. తగ్గిన ఉష్ణోగ్రతలు
సాక్షి, హైదరాబాద్: నైరుతి బంగాళాఖాతంలో కొనసాగిన అతి తీవ్ర తుపాను మంగళవారం సాయంత్రం తుపానుగా దక్షిణ ఆంధ్రప్రదేశ్‌లోని బాపట్ల ప్రాంతంలో తీరం దాటింది. ఆ తర్వాత క్రమంగా బలహీన పడినట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. ఫలితంగా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో మంగళవారం ఉదయం నుంచి రాత్రి వరకు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు నమోదయ్యాయి. రాష్ట్రంలో సగటున 3 సెంటీమీటర్ల వర్షం కురిసింది. అత్యధికంగా భద్రాద్రి కొత్తగుడెం జిల్లా అశ్వారావుపేటలో ఏకంగా 13.1 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అదే జిల్లా దమ్మపల్లి, ముల్కలపల్లి, ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో భారీ నుంచి అతి భారీ వర్షాలు, కొన్ని చోట్ల అత్యంత భారీ వర్షాలు కూడా నమోదయ్యాయి. ఆ జిల్లాల్లో భారీ వర్షాలు! వాతావరణ పరిస్థితుల దృష్ట్యా బుధవారం కూడా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు నమోదయ్యే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ సూచించింది. మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగుడెం జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు నమోదు కావొచ్చని హెచ్చరించింది. ఉమ్మడి అదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, నల్లగొండ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాల నమోదుకు అవకాశం ఉన్నట్లు వివరించింది. తగ్గిన ఉష్ణోగ్రతలు తుపాను ప్రభావంతో వాతావరణంలో నెలకొన్న మార్పులతో ఉష్ణోగ్రతలు భారీగా పతనమయ్యాయి. గత రెండ్రోజుల వరకు రాష్ట్రంలో సాధారణం కంటే 2 డిగ్రీల మేర అధిక ఉష్ణోగ్రతలు నమోదు కాగా... మంగళవారం సాధారణం కంటే రెండు డిగ్రీలు తక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. బుధ, గురు వారాల్లో ఇదే తరహాలో తక్కువ ఉష్ణోగ్రతలు నమోదు కావొచ్చని వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు. మంగళవారం రాష్ట్రంలో నమోదైన ఉష్ణోగ్రతలు పరిశీలిస్తే గరిష్ట ఉష్ణోగ్రత అదిలాబాద్‌లో 28.3 డిగ్రీ సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత హకీంపేట్‌లో 18.7 డిగ్రీ సెల్సియస్‌గా నమోదైంది. ఉష్ణోగ్రతలు తగ్గడంతో చలి తీవ్రత పెరిగే అవకాశం ఉంది. వరి, పత్తి పంటలకు నష్టం ♦ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో భారీ వర్షం ♦ నేల కొండపల్లిలో గుడిసె కూలి భార్యాభర్తలు మృతి ♦ సింగరేణిలో నిలిచిన బొగ్గు ఉత్పత్తి.. ♦ నేడు కూడా విద్యాసంస్థలకు సెలవు సాక్షి నెట్వర్క్, ఖమ్మం, నేలకొండపల్లి: తుపాను ప్రభావంతో ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా భారీ వర్షం కురుస్తోంది. సోమవారం సాయంత్రం మొదలైన వాన మంగళవారం తగ్గుముఖం పట్టినా మళ్లీ సాయంత్రం పెరిగింది. రాత్రి పొద్దుపోయే వరకు జిల్లావ్యాప్తంగా భారీగా వర్షం కురుస్తూనే ఉంది. దీంతో వరి, పత్తి పంటలకు నష్టం వాటిల్లగా కల్లాల్లో ఆరబోసిన ధాన్యం తడవడంతో రైతులు కాపాడుకోవడానికి నానా తిప్పలు పడుతున్నారు. కొన్నిచోట్ల రహదారులపై చెట్లు విరిగిపడడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. వర్షాల కారణంగా ఖమ్మం, భద్రాద్రి జిల్లాల్లో విద్యాసంస్థలకు మంగళ, బుధవారాలు సెలవు ప్రకటించారు. మరోపక్క కలెక్టరేట్లలో కంట్రోల్‌రూంలు ఏర్పాటుచేసిన అధికారులు సహాయక చర్యల్లో నిమగ్నమయ్యారు. ఇప్పటికే అన్ని ప్రాంతాలకు బోట్లు సమకూర్చడంతో పాటు గజ ఈతగాళ్లను సిద్ధం చేశారు. భద్రాచలానికి 20 మందితో కూడిన ఎన్డీఆర్ఎఫ్ బృందం, పది మందితో కూడిన ఇతర అధికారులు చేరుకుని సహాయక చర్యలు చేపట్టేందుకు సిద్ధమయ్యా రు. సింగరేణి ఓసీల్లో నీరు నిలవడంతో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. రెండు నిండు ప్రాణాలను బలితీసుకున్న వర్షం రోజంతా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షంతో గోడలు నాని పూరిగుడిసె కూలడంతో ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం చెరువు మాధారం గ్రామానికి చెందిన నూకతోటి పుల్లారావు(40) – లక్ష్మి (30) దంపతులు మృత్యువాత పడ్డారు. మట్టిపెళ్లలు మీద పడడంతో అక్కడిక్కడే మృతి చెందారు. అప్పటివరకు చుట్టుపక్కల వారితో మాట్లాడి ఆ దంపతులు ఇంట్లోకి వెళ్లగా.. ఒక్కసారిగా శబ్దం రావటంతో స్థానికులు వెంటనే స్పందించారు. 108కు సమాచారం ఇవ్వగా అక్కడి చేరుకున్న సిబ్బంది అప్పటికే భార్యాభర్తలు మృతి చెందినట్లు నిర్ధారించారు. వ్యవసాయ కూలీ పనులు చేసుకుని జీవనం సాగించే నిరుపేద దంపతులు అకాల వర్షంతో మృతి చెందడం గ్రామస్తుల్లో విషాదాన్ని నింపింది. -
తెలంగాణ పోలింగ్‌కు వరుణగండం?
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు వరుణగండం పొంచి ఉన్నట్లు తెలుస్తోంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర వాయుగుండంగా మారింది. దీంతో తెలంగాణలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు, మరికొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలకు కురవొచ్చని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. తెలంగాణలో అంతటా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడొచ్చని వాతావరణ శాఖ చెబుతోంది. దక్షిణ తెలంగాణలో ఈ ప్రభావం ఎక్కువగా ఉండొచ్చని అంచనా వేస్తోంది. అదే జరిగితే.. వరుణుడి ప్రతాపం నడుమ ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు క్యూ కడతారా? అనే ఉత్కంఠ నెలకొంది. ఇదిలా ఉంటే.. తెలంగాణ ఎన్నికల కోసం బుధ, గురువారాలను విద్యాసంస్థలకు సెలవు ప్రకటించింది తెలంగాణ ప్రభుత్వం. అలాగే ఈసీ సూచనతో ఉద్యోగులకు వేతనంతో కూడిన సెలవు ప్రకటించింది కార్మికశాఖ. ఇదీ చదవండి: ఆగం కావొద్దు.. జాగ్రత్తగా ఓటెయ్యాలె! -
ఢిల్లీలో భారీ వర్షం.. విమానాల రాకపోకలకు అంతరాయం!
దేశరాజధాని ఢిల్లీలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. సోమవారం సాయంత్రం బలమైన ఉరుములతో కూడిన భారీ వర్షం కురిసింది. ఇటువంటి ప్రతికూల వాతావరణం కారణంగా ఢిల్లీ విమానాశ్రయంలో విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఈ పరిస్థితుల నేపధ్యంలో 16 విమానాలను దారి మళ్లించారు. ఈ విషయాన్ని ఢిల్లీ ఎయిర్‌పోర్టు అధికారి ఒకరు వెల్లడించారు. ఈ విమానాలను సాయంత్రం 6 నుంచి 8 గంటల మధ్య మళ్లించినట్లు ఆ అధికారి తెలిపారు. జైపూర్‌కు పది, లక్నోకు మూడు, అమృత్‌సర్‌కు రెండు, అహ్మదాబాద్‌కు ఒక విమానాన్ని పంపినట్లు పేర్కొన్నారు. ఐదు ఎయిర్ ఇండియా విమానాలను ఇతర ప్రాంతాలకు పంపినట్లు మరో అధికారి తెలిపారు. వీటిలో సిడ్నీ నుంచి వస్తున్న విమానాన్ని జైపూర్‌కు పంపించారు. ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రతికూల వాతావరణం, విమాన ట్రాఫిక్ కారణంగా గౌహతి నుండి ఢిల్లీకి విస్తారా విమానం యూకే 742ను జైపూర్‌కు మళ్లించినట్లు ఆ సంస్థ మీడియాకు తెలిపింది. ఢిల్లీ విమానాశ్రయంలో విమాన ట్రాఫిక్ కారణంగా విమాన కార్యకలాపాలు దెబ్బతిన్నాయని ఇండిగో ఎయిర్‌లైన్ తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో తెలియజేసింది. విమాన ప్రయాణికులు సహాయం కోసం తమ అధికారులను సంప్రదించాలని తెలియజేసింది. కాగా వర్షాలు కురుస్తున్న నేపధ్యంలో ఢిల్లీలో కాలుష్యం కొంతమేర తగ్గవచ్చని అంచనా. ఢిల్లీ-ఎన్సీఆర్లో కాలుష్యం కారణంగా ఆకాశంలో పొగమంచు కమ్ముకుంది. మంగళవారం ఢిల్లీలో వాతావరణం మేఘావృతమై ఉంటుందని భారత వాతావరణ విభాగం (ఐఎండి) శాస్త్రవేత్త ఆర్కె జెనామణి తెలిపారు. ఇది కూడా చదవండి: గుజరాత్లో అకాల వర్షాలు.. #6ETravelAdvisory : Flight operations to/from #Delhi are impacted due to heavy rain. You may keep a tab on your flight status by visiting https://t.co/TQCzzykjgA. For any assistance, feel free to DM. — IndiGo (@IndiGo6E) November 27, 2023 -
వర్షంలో శరద్‌పవార్ స్పీచ్..సెంటిమెంట్ ఏంటంటే..
ముంబై: నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ) చీఫ్ శరద్‌పవార్ మళ్లీవర్షంలో తడుస్తూ స్పీచ్ ఇచ్చారు. నవీముంబైలో పార్టీ బహిరంగసభ జరుగుతున్నపుడు చిరుజల్లులు పడ్డాయి. ఈ వర్షంలోనే పవార్ తన ప్రసంగాన్నికంటిన్యూ చేశారు. ఇందులో ప్రత్యేకత ఏంటంటే వర్షంలో తడుస్తూ పవార్ చేసిన ప్రసంగం వెనుక ఒక సెంటిమెట్ ఉంది. 2019లో జరిగిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా సతారా నియోజకవర్గంలో పవార్ ప్రచారం నిర్వహిస్తున్నారు. పవార్ ప్రసంగిస్తుండగానే బోరున వర్షం పడింది. పక్కనున్న పార్టీ వ్యక్తి ఒకతను గొడుగు తీసుకురాగా పవార్ వద్దన్నారు. 83 ఏళ్ల పవార్ భారీ వర్షంలోనే తన ప్రసంగాన్ని కొనసాగించారు. ఈ ఫొటోలు, వీడియోలు అప్పట్లో ఎన్నికల సందర్భంగా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఆ ఎన్నికల్లో పార్టీ సాధించిన విజయం వెనుక ఈ ఫొటోల పాత్ర కూడా ఉందని చాలా మంది భావిస్తుంటారు. అందుకే మళ్లీ పవార్ వర్షంలో స్పీచ్ ఇవ్వడంపై సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. ‘మన ప్లాన్‌ను ఇక్కడ వర్షం డిస్ట్రబ్ చేసింది. అయినా మనం వెనుకడుగువేసే వాళ్లం కాదు. అంత ఈజీగా మనం దేనికి లొంగేవాళ్లం కాదు. భవిష్యత్తులోనూ మనం మన పోరాటాన్ని కొనసాగించాలి’ అని నవీముంబై సభలో శరద్‌పవార్ వ్యాఖ్యానించారు. అయితే ఈ వ్యాఖ్యలు తన మేనల్లుడు అజిత్ పవార్‌ను ఉద్దేశించి చేసినవేననే ప్రచారం జరుగుతోంది. 40 మంది ఎమ్మెల్యేలతో కలిసి ఎన్సీపీని చీల్చి బీజేపీ-శివసేన సంకీర్ణ ప్రభుత్వంలో చేరిన అజిత్ పవార్ ప్రస్తుతం మహారాష్ట్ర డిప్యూటీసీఎంగా ఉన్న విషయం తెలిసిందే. అక్కడితో ఆగకుండా ఎన్సీపీ పార్టీ, సింబల్ కూడా తనవేనని ఆయన ఎన్నికల కమిషన్‌లో క్లెయిమ్ చేశారు. ఇదీచదవండి...క్లాస్‌మేట్‌ను 108సార్లు పొడిచారు..కారణమిదే.. -
దేశంలోని పలు రాష్ట్రాలకు వర్షసూచన
దక్షిణ భారతదేశంలోని రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపధ్యంలో దేశంలోని పలు రాష్ట్రాలకు వాతావరణ శాఖ మరోసారి వర్ష హెచ్చరిక జారీ చేసింది. నవంబర్ 28న దేశంలోని పలు రాష్ట్రాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తర భారతదేశంలోని పలు రాష్ట్రాల్లో చలి మరింతగా పెరగనుంది. వాతావరణ శాఖ సూచనల ప్రకారం మహారాష్ట్ర, గోవా, కొంకణ్‌తో పాటు అనేక ప్రాంతాల్లో అక్కడక్కడా వర్షాలు కురిసే అవకాశం ఉంది. దీంతో పాటు తమిళనాడు, కేరళ, లక్షద్వీప్‌లలో కూడా వర్షాలు కురవనున్నాయి. రాజధాని ఢిల్లీలో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో నవంబర్ 27న ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. నవంబర్ 27న పశ్చిమ యూపీలోని పలు జిల్లాలు, తూర్పు యూపీలో ఒకటి రెండు చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలావుండగా శనివారం రాజధాని ఢిల్లీలోని కొన్ని ప్రాంతాలలో గాలి నాణ్యత మెరుగుపడింది. అయితే ఇది ఇప్పటికీ ‘తీవ్రమైన’, ‘చాలా పేలవమైన’ విభాగంలోనే ఉంది. ఆదివారం నుండి వాతావరణ పరిస్థితులు మెరుగుపడతాయని గాలి నాణ్యతకు సంబంధించిన సమాచారం అందించే ఏజెన్సీలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి. ఇది కూడా చదవండి: 26/11 తరువాత ముంబై రైల్వే స్టేషన్ల పరిస్థితి ఇదే.. -
TS: నేడు, రేపు పలుచోట్ల వానలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. గురువారం రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి వానలు కురిశాయి. రాష్ట్రానికి తూర్పు, ఆగ్నేయ దిశల నుంచి వస్తున్న బలమైన గాలుల ప్రభావం ఫలితంగా నెలకొన్న మార్పులతో ఈ వానలు కురుస్తున్నట్లు వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. రానున్న రెండ్రోజులు కూడా రాష్ట్రమంతటా ఇదే తరహాలో వాతావరణం ఉంటుందని అంచనా వేస్తున్నారు. వానల కారణంగా వాతావరణం మరింత చల్లబడింది. దీంతో చలితీవ్రత వేగంగా పెరిగింది. సాధారణం కంటే తక్కువగా.. రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు పతనమయ్యాయి. సాధారణం కంటే తక్కువగా కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. గురువారం రాష్ట్రంలో సాధారణం కంటే 2 డిగ్రీల వరకు తక్కువ ఉష్ణోగ్రత నమోదైంది. రామగుండంలో గరిష్ట ఉష్ణోగ్రత 29.6 డిగ్రీల సెల్సియస్‌గా, మెదక్‌లో కనిష్ట ఉష్ణోగ్రత 17 డిగ్రీల సెల్సియస్‌గా నమోదయింది. అలాగే నల్లగొండలో కనిష్ట ఉష్ణోగ్రత 18.4 డిగ్రీలు నమోదు కాగా, ఇక్కడ సాధారణం కంటే 2 డిగ్రీలు తగ్గింది. దాదాపు అన్ని ప్రాంతాల్లోనూ కనిష్ట ఉష్ణోగ్రతలు తక్కువగా నమోదయ్యాయి. శుక్ర, శనివారాల్లోనూ ఉష్ణోగ్రతలు తక్కువగా నమోదు కావొచ్చని వాతావరణ శాఖ తెలిపింది. -
ఆ రెండు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన.. ఆరెంజ్ అలర్ట్ జారీ!
చెన్నై: తమిళనాడు, కేరళకు భారీ వర్ష సూచన ఉందని భారత వాతావరణశాఖ తెలిపింది. వారం పాటు నిర్వరామంగా వర్షాలు కురుస్తాయని హెచ్చరికలు చేసింది. తమిళనాడులోని రామనాథపురం జిల్లాకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. మరో ఎనిమిది జిల్లాల్లో ఎల్లో అలర్ట్‌ను ప్రకటించింది. తమిళనాడులోని తిరువళ్లూరు జిల్లాలో ఇప్పటికే భారీ వర్షం కురవగా.. కన్యాకుమారి, రామనాథపురం, తిరునల్వేళి, తూత్తుకూడి జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని చెన్నైలోని ప్రాంతీయ వాతావరణ కేంద్రం వెల్లడించింది. చెన్నైలో మాత్రం సాధారణ వర్షపాతం నమోదైతుందని వెల్లడించింది. కేరళలోని అలప్పుజ, కొట్టాయం, ఎర్నాకులం, కోజికోడ్ జిల్లాల్లో ఆదివారం భారీ వర్షం కురిసింది. తమిళనాడులోని తిరువారూరు జిల్లాలో అత్యధికంగా 11 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అతి భారీ వర్ష సూచనతో విపత్తు నిర్వహణ అధికారులు అప్రమత్తమయ్యారు. తమిళనాడులోని నాలుగు జిల్లాల్లో 400 మందితో విపత్తు నిర్వహణ బృందాలను ఏర్పాటు చేశారు. రెస్క్యూ ఆపేషన్ కోసం చెన్నైలో మరో 200 మంది సిబ్బందిని నిలిపి ఉంచారు. ఈశాన్య రుతుపవనాల కారణంగా తమిళనాడులో ఎడతెరిపిలేకుండా వర్షాలు కురుస్తున్నాయి. లోతట్టు ప్రాంతాల్లోకి భారీగా వరదనీరు చేరడంతో జనం పలు అవస్థలు పడుతున్నారు. కొన్నిచోట్ల చెట్లు కూలడంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలుగుతోంది. ఇదీ చదవండి: 80 వేల కిలోల గంటను బిగిస్తుండగా ప్రమాదం.. ఇద్దరు మృతి