న్యూఢిల్లీ: దేశంలోని వివిధ ప్రాంతాల్లో వాతావరణ పరిస్థితుల్లో మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఈరోజు(సోమవారం) నుండి రెండు రోజుల పాటు దేశ రాజధాని ఢిల్లీలో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. వాతావరణ శాఖ తెలిపిన వివరాల ప్రకారం ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో పొగమంచు ఏర్పడనుంది. సఫ్దర్‌జంగ్ విమానాశ్రయంలో ఈరోజు ఉదయం 7 గంటలకు దృశ్యమానత 200 మీటర్లుగా నమోదైంది. పాలంలో ఉదయం 4 గంటలకు 50 మీటర్లుగా ఉంది.
జమ్ముకశ్మీర్‌లో భారీ వర్షం, హిమపాతం కారణంగా వాతావరణం(Weather)లో మార్పులు చోటుచేసుకున్నాయి. ఫలితంగా మంచు గాలులు ఉత్తర భారతదేశంలోని అనేక ప్రాంతాలను తాకాయి. దేశంలోని 12 రాష్ట్రాల్లో విపరీతంగా కురుస్తున్న పొగమంచు పలు సమస్యలను సృష్టిస్తోంది. పంజాబ్, హర్యానాలలో పొగమంచు తీవ్ర ప్రభావం చూపింది. పొగమంచు కారణంగా చోటుచేసుకున్న రోడ్డు ప్రమాదాల్లో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు.
పొగమంచు కారణంగా కోల్‌కతాలో 13 విమానాల రాకపోకలకు(flight arrivals) అంతరాయం కలిగింది. హర్యానా, పంజాబ్, చండీగఢ్, బెంగాల్, బీహార్, ఒడిశా సహా 12 రాష్ట్రాలలోని వివిధ ప్రాంతాల్లో దట్టమైన పొగమంచు ఏర్పడింది. వాతావరణశాఖ తెలిపిన వివరాల ప్రకారం పంజాబ్, హర్యానా, చండీగఢ్, ఢిల్లీ, బీహార్, ఒడిశా, అస్సాం, మేఘాలయలోని వివిధ ప్రాంతాలలో సోమవారం కూడా దట్టమైన పొగమంచు కమ్ముకోనుందని వాతావరణశాఖ తెలిపింది.
మంగళవారం పొగమంచు నుండి కొంత ఉపశమనం లభిస్తుందని, రాబోయే రెండు రోజుల్లో రాజస్థాన్‌లోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ(Meteorological Department) తెలిపింది. పొగమంచు కారణంగా పంజాబ్‌లోని అమృత్‌సర్-ఖేమ్కరన్ రహదారిపై ఒక కారు- బస్సు ఢీకొన్నాయి. అమర్‌కోట్ బస్తీ సమీపంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఇదేవిధంగా హర్యానాలోని మంగళ్‌పూర్-దరౌలి రోడ్డుపై దట్టమైన పొగమంచు కారణంగా, ఒక కారు అదుపు తప్పి చెట్టును ఢీకొంది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతిచెందారు.
ఇది కూడా చదవండి: America: 10 సురక్షిత రాష్ట్రాలు.. కాల్పుల మోతకు దూరం.. ప్రాణహానికి సుదూరం
Comments
Please login to add a commentAdd a comment