ప్రపంచంలోనే అత్యంత అందమైన భవనం తాజ్‌మహల్‌కి వర్షాల బెడద తప్ప లేదు. గత మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా, ఢిల్లీలోని ఆగ్రాలో కొలువై వున్న ప్రేమసౌథం తాజ్ మహల్ ప్రధాన గోపురం నుంచి నీరు లీకైంది. దీంతో తాజ్ మహల్ ఆవరణలో ఉద్యానవనం నీట మునిగింది. ఈ లీకేజీకి సంబంధించి 20 సెకన్ల వీడియో ఇంటర్నెట్‌లో వీడియో గురువారం వైరల్‌గా మారింది.
అయితే, సీపేజ్ కారణంగా లీకేజీ ఉందని, పాలరాతి భవనానికి ఎలాంటి నష్టం లేదని ఆర్కియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ASI), ఆగ్రా సర్కిల్ సీనియర్ అధికారి స్పష్టం చేశారు. డ్రోన్ కెమెరా ద్వారా ప్రధాన డోమ్‌ను పరిశీలించామని ప్రమాదం ఏమీలేదని చెప్పారు. వర్షం తగ్గుముఖం పట్టిన తర్వాత చర్యలు తీసుకుంటామన్నారు.
ఏఎస్‌ఐ సూపరింటెండింగ్ చీఫ్ రాజ్‌కుమార్ పటేల్ తెలిపారు. తోటలలో ఒకటి వర్షం నీటితో మునిగి పోయింది. దీన్ని తాజ్ మహల్‌ను సందర్శించిన పర్యాటకులు వీడియో తీశారని పేర్కొన్నారు.
🇮🇳 Taj Mahal Gardens Submerged After Incessant Rain Hits India's Agra
Work is ongoing to drain the water from one of the Seven Wonders of the World.
pic.twitter.com/C5shcu4HZh— RT_India (@RT_India_news) September 12, 2024
తాజ్ మహల్ మొత్తం దేశానికి గర్వకారణమని వేలాది పర్యాటకులు ఆకర్షిస్తున్న ఈ ప్రదేశంలో పర్యాటక పరిశ్రమలో అనేక మందికి ఉపాధిని కల్పిస్తుందని దీనిపై సరైన జాగ్రత్తలు తీసుకోవాలని, ఇదే తమ ఏకైక ఆశాదీపమని టూర్ గైడ్ ఒకరు కోరారు. కాగా ఆగ్రాలో గత మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం కారణంగా రాజధాని నగరంలోని ప్రధాన రహదారులు, నివాస ప్రాంతాలు జలమయ మైనాయి. వర్ష కారణంగా పాఠశాలలకు సెలవు ప్రకటించారు.
Comments
Please login to add a commentAdd a comment