Viral: నారీశక్తి.. చంటిబిడ్డతో ఆర్పీఎఫ్‌ కానిస్టేబుల్‌ | Viral RPF woman constable with baby in carrier gets mixed reactions | Sakshi
Sakshi News home page

Viral: నారీశక్తి.. చంటిబిడ్డతో ఆర్పీఎఫ్‌ కానిస్టేబుల్‌

Published Tue, Feb 18 2025 2:20 PM | Last Updated on Tue, Feb 18 2025 2:58 PM

Viral RPF woman constable with baby in carrier gets mixed reactions

నాణేనికి రెండు వైపుల మాదిరే.. సోషల్‌ మీడియాలో రెండు పార్శ్వాలు ఉంటాయి. మంచిని ఎక్కువగా చర్చించినప్పుడు మధ్యలో చెడును.. అలాగే చెడుపై ఎక్కువగా చర్చ జరిగినప్పుడు మధ్యలో మంచి ప్రస్తావననూ తెస్తుంటుంది. అయితే నెట్టింట వైరల్‌ అవుతున్న ఓ అమ్మ విషయంలోనూ ఇదే జరుగుతోంది ఇప్పుడు.

ఢిల్లీ రైల్వే స్టేషన్‌లో తొక్కిసలాట ఘటన జరిగిన మరుసటి రోజు.. అక్కడ ఓ మహిళా కానిస్టేబుల్‌ విధుల్లో ఉంది. ఆ టైంలో ఆమె తన చంటిబిడ్డతో కనిపించింది. అందుకు సంబంధించిన వీడియో.. అందంగా ఎడిట్‌ చేసిన ఆమె ఫొటో సైతం సోషల్‌ మీడియాలో విపరీతంగా వైరల్‌ అయ్యింది. చాలామంది అమ్మ గొప్పతనమంటూ ఆ ఫొటోలు స్టేటస్‌గా పెట్టుకున్నారు కూడా. మరోవైపు..

రాజకీయ ప్రముఖులు, సెలబ్రిటీలు సైతం ఈ ఫొటోకు స్పందించారు. నిజమైన భారత్‌ ఇదేనని, నారీ శక్తికి ఆమె ప్రతిరూపమంటూ కొనియాడారు.  RPF ఇండియా కూడా ఎక్స్‌ అకౌంట్‌లో ఆ వీడియోను పోస్ట్‌ చేసింది. తన విధులతో పాటు తల్లిగా బాధ్యతను విస్మరించని కానిస్టేబుల్‌ రీనా గొప్ప యోధురాలు అంటూ గర్వంగా ప్రకటించుకుంది. అదే సమయంలో  విమర్శలు మొదలయ్యాయి.

ప్రముఖ నగరాల్లో రైల్వేస్టేషన్‌లలో ఏమేరు రద్దీ ఉంటుందో చూస్తున్నదే. అలాగే ఈ మధ్య అయితే తోపులాట, తొక్కిసలాట ఘటనలూ చోటు చేసుకుంటున్నాయి. అలాంటి వారిని నియంత్రించాల్సిన బాధ్యత.. ఇలాంటి కానిస్టేబుళ్లకే ఉంటుంది. అలాంటప్పుడు ఆమె అలా తన బిడ్డ ప్రాణాలు పణంగా పెట్టి మరీ విధులు నిర్వహించాల్సిన అవసరం ఉందా? అని ప్రశ్నిస్తున్నారు. 

అలాగే.. బిడ్డల సంరక్షణ కోసం ఆ‍ర్పీఎఫ్‌ స్టేషన్‌లలో ఉండే సదుపాయాల్ని ఆమె వినియోగించుకోవాల్సిందని సూచిస్తున్నారు. మరోవైపు.. నారీశక్తి అని పిలడడంపైనా పలువురు అభ్యంతరం ‍వ్యక్తం చేస్తున్నారు. ఇలా బిడ్డతో విధులకు హాజరుకావడాన్ని అన్యాయంగా అభివర్ణిస్తున్నారు. అధికారులైనా ఈ విషయంలో చొరవ చూపాల్సిందని కామెంట్లు చేస్తున్నారు. ఇక.. బిడ్డ పెంపకం విషయంలోనూ ఆమెకు ఉన్న ఇబ్బందుల గురించీ, ఆమెపై ఉన్న బాధ్యతల గురించీ కొందరు ప్రస్తావిస్తున్నారు.

అదే సమయంలో.. ఆమెకు ఉన్న సవాళ్లను ప్రస్తావిస్తూ కొందరు పోస్టులు పెడుతుండడం గమనార్హం. అయినా సరే మహిళలు ఎక్కడా వెనుకడుగేయకుండా, ఆ సవాళ్లను లెక్కచేయకుండా ఈ పోటీ ప్రపంచంతో పోటీపడుతుండటం.. అన్నింటికి మించి అటు అమ్మగా, ఇటు ఆర్పీఫ్ కానిస్టేబుల్‌గా మెప్పించడం గొప్ప విషయమని వాదిస్తున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement