RPF Constable
-
మహిళ ప్రాణాలు కాపాడిన కానిస్టేబుల్ సోనాలి.. ప్రయాణీకుల ప్రశంస
సాక్షి, వరంగల్: ఓ మహిళ ప్రాణాలను ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ సోనాలి మాల్కే కాపాడారు. వరంగల్ రైల్వేస్టేషన్లో రైలు నుంచి దిగుతుండగా ఓ మహిళ ప్లాట్‌ప్లామ్, రైలు మధ్య పడిపోయింది. ఈ సమయంలో ప్లాట్‌పామ్‌పై విధుల్లో ఉన్న సోనాలి ఆమెను సమయ స్ఫూర్తితో కాపాడింది. దీంతో, ఆమెను ఉన్నాతాధికారులు ప్రశంసించారు. వివరాల ప్రకారం.. మణుగూరు ఎక్స్‌ప్రెస్ రైలు మణుగూరు నుండి సికింద్రాబాద్‌కు వెళ్తుండగా ట్రైన్ వరంగల్ రైల్వేస్టేషన్‌కు వచ్చింది. ఈ క్రమంలో రైలు ప్లాట్‌ఫామ్‌పై ఆగే సమయంలో ట్రైన్ స్లో కావడంతో ఓ మహిళ రైలు దిగే ప్రయత్నం చేసింది. దీంతో, ప్లాట్‌ఫామ్, రైలుకు కింద ఇరుక్కుపోయింది. ఈ సమయంలో అక్కడే విధుల్లో ఉన్న ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ సోనాలి మాల్కే వెంటనే స్పందించింది. సదరు మహిళను రైలు నుంచి దూరంగా లాగడంతో ప్రమాదం తప్పింది. అయితే, దీనికి సంబంధించిన దృశ్యాలు స్టేషన్లో ఉన్న సీసీ కెమెరాలు రికార్డు అయ్యాయి. ఇక, సదరు మహిళను ప్రాణాలకు తెగించి కాపాడాని కానిస్టేబుల్ సోనాలి మాల్కేను ఆర్పీఎఫ్ ఉన్నతాధికారులు, ప్రయాణికులు అభినందించారు. ఇది కూడా చదవండి: రోడ్డుపై నిమ్మకాయలతో హిజ్రాతో పూజలు.. ఎస్ఐ చేసిన పనికి షాక్‌లో ప్రయాణీకులు -
ఆర్పీఎఫ్లో ఉద్యోగాలకు ఫేక్ నోటిఫికేషన్!
సాక్షి, హైదరాబాద్: రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్‌లో కానిస్టేబు ల్ ఉద్యోగాల పేర కేటుగాళ్లు నిరుద్యోగులను బురిడీ కొట్టించే ప్రయత్నం చేశారు. మామూలు మాటలు చెబితే అభ్యర్థులు నమ్మరన్న ఉద్దేశంతో, ఫేక్ నోటిఫికేషన్‌ను సృష్టించి సామాజిక మాధ్యమాల్లో సర్క్యులేట్ చేశారు. దీంతో పెద్ద సంఖ్యలో అభ్యర్థులు వీరి వలలో పడినట్లు తెలుస్తోంది. తాజాగా దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో రైల్వే కార్యాలయాలకు అభ్యర్థులు వచ్చి, దరఖాస్తులు ఎప్పటినుంచి అందుబాటులో ఉంటాయో వాకబు చేయటం ప్రారంభించారు. దీంతో గుట్టు రట్టయింది. దరఖాస్తు ఆప్షన్ రాకపోవడంతో.. రైల్వేలో ఉద్యోగాల పేర మోసగాళ్లు భారీ ఎత్తున డబ్బులు వసూలు చేస్తున్న ఘటనలు తరచూ వెలు గు చూస్తున్నాయి. వీరితో స్టడీ సెంటర్ల నిర్వాహకు లు కొందరు చేతులు కలుపుతున్నారు. ఉద్యోగాల కోసం అభ్యర్థుల నుంచి కేటుగాళ్లు డబ్బులు వసూ లు చేస్తుంటే, వారికి పరీక్ష కోసం శిక్షణ పేరుతో స్టడీ సెంటర్ల నిర్వాహకులు దందా నడుపుతున్నారు. ఇలాంటి సమయంలో తాజా గా 19,800 ఆర్పీఎఫ్ కానిస్టేబుళ్ల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ అయిందంటూ ఆర్పీఎఫ్ పేరుతో ఓ ప్రకటన సామాజిక మాధ్యమాల్లో ప్రత్యక్షమైంది. కొన్ని పత్రికల్లో కూడా ఈ ప్రకటన ప్రచురితమైంది. దీంతో ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న వేల మందిలో ఆశలు రేకెత్తాయి. దీంతో కేటుగాళ్లు ఉద్యోగాలిప్పిస్తామంటూ దందా ప్రారంభించారు. చాలా ప్రాంతాల్లో అభ్యర్థుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నట్టు తెలిసింది. ఈ క్రమంలో రోజులు గడుస్తున్నా ఆన్లైన్లో దరఖాస్తులు అప్లోడ్ చేసే ఆప్షన్ వెలువడకపోవడంతో అభ్యర్థుల్లో అనుమానాలు మొదలయ్యాయి. రైల్వే కార్యాలయాలకు వెళ్లి వాకబు చేయటం ప్రారంభించటంతో ఈ వ్యవహారం వెలుగు చూసింది. ప్రస్తుతం ఎలాంటి రిక్రూట్‌మెంటూ లేదు తామెలాంటి రిక్రూట్మెంట్ ప్రస్తుతం చేపట్టడం లేదని, అది నకిలీ ప్రకటన అంటూ అధికారులు వెల్లడించారు. సాధారణంగా రైల్వే ఉద్యోగాల భర్తీ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు(ఆర్ఆర్బీ), రైల్వే రిక్రూట్మెంట్ సెల్ (ఆర్ఆర్సీ) ద్వారా జరుగుతుంది. కానీ ఆర్పీఎఫ్ ఉద్యోగాలు వీటి ద్వారా కాకుండా ప్రత్యేక కమిటీ ఆధ్వర్యంలో కొనసాగుతుంది. ప్రస్తుతం రైల్వే బోర్డు అలాంటి కమిటీ ఏదీ ఏర్పాటు చేయలేదు. కానీ ఏకంగా 19,800 కానిస్టేబుల్ పోస్టుల భర్తీ పేరుతో భారీ అక్రమాలకు తెరతీయటం రైల్వేలో దుమారం రేపుతోంది. దీని వెనుక ఉన్నవారి కోసం రైల్వే పోలీసులు వేట ప్రారంభించినట్లు ఓ ఉన్నతాధికారి తెలిపారు. సోషల్ మీడియా ప్రకటనలు నమ్మొద్దు రైల్వేలో ఎలాంటి ఉద్యోగ భర్తీ కసరత్తు మొదలైనా ఆర్ఆర్బీ, ఆర్ఆర్సీ, రైల్వే బోర్డు ఆధ్వర్యంలోని ప్రత్యేక కమిటీలు నోటిఫికేషన్ జారీ చేస్తాయి. ఇవన్నీ రైల్వే అ«దీకృత వెబ్సైట్ల ద్వారా మాత్రమే వెల్లడవుతాయి. సోషల్ మీడియాలో వచ్చే ఫేక్ నోటిఫికేషన్ల విషయంలో అభ్యర్థులు జాగ్రత్తగా ఉండాలి. కేటుగాళ్లు వాటిని సృష్టించి మోసగించే ప్రమాదం ఉందన్న విషయాన్ని గుర్తించాలి. – దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్ఓ రాకేశ్ -
కదులుతున్న రైలు ఎక్కబోయి కిందపడ్డ తల్లీకూతురు.. తృటిలో..
ముంబై: ప్లాట్‌ఫాంపై కదులుతున్న రైలు ఎక్కబోయి తల్లీకూతురు కిందపడ్డారు. అక్కడే ఉన్న రైల్వే పోలీసు, ఓ ప్యాసెంజర్ వీళ్లిద్దరిని ప్రాణాపాయం నుంచి తప్పించారు. ముంబైలోని వాసాయ్ రోడ్ రైల్వే స్టేషన్లో సోమవారం రాత్రి ఈ ఘటన జరిగింది. ఇందుకు సంబంధించిన వీడియోను రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ ట్విట్టర్లో షేర్ చేసింది. Prompt action by #RPF Constable Tejaram saved a mother-daughter duo from a major accident in nick of time at Vasai Road railway station while they tried to board a moving train. Your safety is our greatest concern.#MissionJeewanRaksha #BeResponsie #BeSafe @rpfwr1 @rpfwrbct pic.twitter.com/lTUhu2rNOX — RPF INDIA (@RPF_INDIA) December 13, 2022 తల్లీకూతురును రక్షించిన కానిస్టేబుల్ తేజారామ్‌ను ఆర్పీఎఫ్ ప్రశంసించింది. ఈ ఘటనలో ఇద్దరికీ ఎలాంటి గాయాలు కాలేదని పేర్కొంది. తమ ప్రాణాలు కాపాడినందుకు రైల్వే కానిస్టేబుల్ తేజారామ్‌కు తల్లీకూతురు కృతజ్ఞతలు చెప్పారు. చదవండి: పెళ్లి రద్దు.. రూ.50 లక్షలు ఇవ్వాలని బ్లాక్మెయిల్ చేసిన అమ్మాయి.. -
మానవత్వం: మమతమ్మా... నీ మేలు మరువనమ్మా!
సమైక్య భావన స్ఫూర్తి గురించి చెప్పడానికి... పెద్ద పెద్ద సిద్ధాంతాలే అక్కర్లేదు. చిన్న సంఘటనలు చాలు! ఆరోజు ఏమైందంటే... థానే (ముంబై)లోని దివ రైల్వేస్టేషన్, ప్లాట్‌ఫామ్ నంబర్:1 ఎప్పటిలాగే ఆ ఉదయం రైలు బండ్ల శబ్దాలు, ప్రయాణికుల అరుపులు, కేకలతో ౖరైల్వేస్టేషన్ సందడిగా ఉంది. తిత్వాల ప్రాంతానికి చెందిన నజ్‌మింజహాన్ తన భర్త ఫసిముద్దీన్తో కలిసి ప్లాట్‌ఫామ్ పైకి వచ్చింది.ఆమె గర్భిణి. రొటీన్–చెకప్‌లో భాగంగా నాయర్ హాస్పిటల్ వెళ్లడానికి రైల్వేస్టేషన్‌కు వచ్చింది. కొద్దిసేపటి తరువాత... ఆమెకు పురిటినొప్పులు మొదలయ్యాయి. భర్త ఆందోళన పడుతున్నాడు. అందరూ ఆశ్చర్యంగా చూస్తున్నారు గానీ ఏం చేయాలో ఎవరికీ పాలుపోవడంలేదు. ‘ఎవరో ఒకరు ఆమెను హాస్పిటల్‌కు తీసుకెళతారులే’ అని ఎవరికి వారు అనుకుంటున్నట్లుగా ఉంది పరిస్థితి. కొందరు మాత్రం రైల్వే అధికారులకు ఫోన్ చేశారు. హుటాహుటిన రైల్వే అధికారులతోపాటు అక్కడికి వచ్చింది ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ మమత దంగి. నొప్పులు ఎక్కువయ్యాయి. ప్లాట్‌ఫామ్‌పై ఉన్న మహిళా రైల్వే ఉద్యోగులు, మహిళా ప్రయాణికులతో మాట్లాడి వారిని నజ్‌మింజహాన్ దగ్గరకు తీసుకువచ్చింది మమత. అందుబాటులో ఉన్న వస్తువులతో మేక్‌షిఫ్ట్ క్లాత్ కర్టెన్ను తయారుచేసింది. అందరిలో ఉత్కంఠ! ఏమవుతుందో ఏమో!! ఎవరి ఇష్ట దైవాన్ని వారు ప్రార్థిస్తున్నారు. వారి ప్రార్థనలు ఫలించాయి. నజ్‌మింజహాన్ పండంటి బిడ్డకు జన్మనిచ్చింది... ‘హమ్మయ్య’ అనుకున్నారు జనాలు. ‘ఆమె మీ ఇంటి అమ్మాయే అనుకోండి... ఒకసారి రండి.... ప్లీజ్... చేతులెత్తి దండం పెడతాను’ అనే మమత మాటలు ప్రయాణికులను కదిలించాయి. ఆ తరువాత...తల్లీబిడ్డలను దివలోని ఒక ప్రైవెట్ హాస్పిటల్లో చేర్పించారు. తల్లీబిడ్డలను హాస్పిటల్లో చేర్పించడానికి ప్రయాణికులు కొందరు తమ ప్రయాణాలు మానుకొని మరీ హాస్పిటల్‌కు వచ్చారు. ఇప్పుడు తల్లీబిడ్డలు ఇద్దరూ క్షేమంగా ఉన్నారు. ‘ఇలాంటి దృశ్యాలను సినిమాల్లో చూస్తుంటాం. నిజజీవితంలో చూడడం ఇదే మొదటిసారి. నిజానికి ఆరోజు నేను అర్జంటుగా వేరే చోటుకు వెళ్లాలి. ట్రైన్ వచ్చే సమయం అయింది. అయితే మమత మాటలు నన్ను కదిలించాయి. నా పని, ప్రయాణం గురించి పట్టించుకోకుండా ఆమెతోపాటు వెళ్లాను’ అంటుంది సహాయక కార్యక్రమంలో పాల్గొన్న గాయత్రి. సెంట్రల్ రైల్వే చీఫ్ పీఆర్వో శివాజీ సతారా మమత కృషిని ప్రత్యేకంగా ప్రశంసించారు. -
వైరల్: ఒక్క క్షణం ఆలస్యమైతే ఆ గర్భిణీ పరిస్థితి ఏమయ్యేదో !
కదులుతున్న రైలు ఎక్కడం, దిగడం చేయకూడదన్న విషయం తెలిసిందే. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్న కింద పడిపోయే ప్రమాదం ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉంటుంది. ఇప్పటికే చాలా వరకు కదులుతున్న రైలు ఎక్కబోతూ లేదా దిగబోతూ కలిగిన ప్రమాదాలకు గురైన వీడియోలు చూశాం. తాజాగా అలాంటి ఘటనే మహారాష్ట్రలో చోటుచేసుకుంది. ముంబై సమీపంలోని వందన అనే 21 ఏళ్ల గర్భిణీ తన భర్త, పాపతో కలిసి కల్యాణ్ రైల్వేస్టేషనుకు చేరుకుంది. వారు గోరఖ్ పూర్ వెళ్లే రైలు ఎక్కాల్సి ఉంది. అయితే అనుకోకుండా వేరే రైలు ఎక్కారు. వారు ఎక్కిన రైలు తప్పు అని తెలిసి దిగే సమయానికి రైలు కదలటం ప్రారంభించింది. చదవండి: ‘అయ్యయ్యో వద్దమ్మా.. సుఖీభవ!’ శరత్‌పై దాడి దీంతో అంతే ఏం చేయాలో తెలియక అయోమయంలో దిగడానికి ప్రయత్నించారు. కదులుతున్న రైలు నుంచి దిగే క్రమంలో ప్లాట్ ఫాం మీద పడబోయింది. సరిగ్గా అదే సమయంలో స్టేషన్లో విధుల్లో ఉన్న రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్పీఎఫ్) కానిస్టేబుల్ ఎస్ఆర్ ఖండేకర్ మహిళను పట్టుకొని బయటకు లాగేసరికి ప్రాణాలతో బయట పడింది. ఈ ఘటన సోమవారం ఉదయం చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి. చదవండి: సైలెంట్ అయిపోయిన డుగ్గుడుగ్గు బండి సైలెన్సర్స్ ఈ వీడియోను ముంబైలోని సెంట్రల్ రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ శివాజీ సుతార్ తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది. దీనిపై నెటిజన్లు స్పందిస్తూ.. మహిళను కాపాడిన ఎస్ఆర్ ఖండేకర్ రియల్ హీరో అంటూ ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. అలాగే ఒకవేళ పోలీస్ అధికారి లేకుంటే ఏమయ్యేది అని, రైలు ఎక్కే.. దిగే సమయంలో జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. Railway Protection Force (RPF) staff Shri S R Khandekar saved the life of a pregnant woman who had slipped while attempting to de-board a moving train at Kalyan railway station today. Railway appeals to passengers not to board or de-board a running train.@RailMinIndia pic.twitter.com/68imlutPaY — Shivaji M Sutar (@ShivajiIRTS) October 18, 2021 -
ప్లాట్ ఫామ్, రైలు మధ్యలో మహిళ, క్షణాల్లో స్పందించిన కానిస్టేబుల్
సాక్షి, హైదరాబాద్: హడావిడిగా కదులుతున్న రైలు ఎక్కే క్రమంలో జారిపోయి, తృటిలో ప్రాణాపాయం నుంచి బయటపడిన మరో ఘటన వెలుగులోకి వచ్చింది. అక్కడే ఉన్న రైల్వే కానిస్టేబుల్ వేగంగా స్పందించి ఆ మహిళను వెనక్కిలాగడంతో పెద్ద ప్రమాదం తప్పింది. దీంతో ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ దినేష్ సింగ్‌ను ప్రశంసిస్తున్నారు. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వీడియోను సౌత్ సెంట్రల్ రైల్వే ట్వీట్ చేసింది. సికింద్రాబాద్ రైల్వె స్టేషన్ నుంచి బయలు దేరుతున్న ఎమ్ఎమ్ఆర్ స్పెషల్ రైలు ఎక్కేందుకు నసిమా బేగం అనే మహిళ పరిగెత్తుకుంటూ వచ్చింది. అయితే అదే సమయంలో రైలు కదలినప్పటికీ, పరుగున వెళ్లి ఎక్కేందుకు ప్రయత్నించింది. ఈ క్రమంలో పట్టు కోల్పోయి ప్లాట్ ఫామ్, రైలు మధ్యలో పడబోయింది. అయితే అక్కడే విధుల్లో ఉన్న దినేష్ ఆమెను ప్లాట్‌ఫాం మీదకు లాగేశారు. ఈ దృశ్యాలు అక్కడున్న సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి. మరోవైపు రైలులో ఉన్నవారు చైన్ లాగడంతో రైలు ఐదు నిమిషాల పాటు నిలిచిపోయింది. ఆ మహిళను క్షేమంగా తిరిగి రైలు ఎక్కించారు. నసిమాను కాపాడిన కానిస్టేబుల్‌ను తోటి ప్రయాణీకులు, నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. అలాగే సకాలంలో స్పందించి మహిళ ప్రాణాలు కాపాడారంటూ సౌత్ సెంట్రల్ రైల్వే కూడా దినేష్‌ను అభినందించింది. Timely & Daring #LifeSaving act by RPF staff Aged woman passenger tried to board moving train at Secuderabad stn fell in the gap btwn coach & platform and was being dangerously dragged. On duty RPF constable Sri.Dinesh Singh acted immediately, pulled lady out & saved her life. pic.twitter.com/Me4z0SA7ZW — South Central Railway (@SCRailwayIndia) July 31, 2021 -
ఎప్పుడు.. ఎలా.. ఎవరికి..
కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. చాపకింద నీరులా వైరస్ వ్యాపిస్తోంది. ఎక్కడ, ఎవరికి, ఎలా సోకుతుందో తెలియనంత దారుణంగా పరిస్థితులు మారాయి. జిల్లాలో పలుచోట్ల సోమవారం కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. పెద్దాపురం, కాజులూరు, రాయవరం మండలం చెల్లూరు, కాకినాడ సిటీ, రూరల్, రాజమహేంద్రవరం, తాళ్లరేవు, కాట్రేనికోన మండలం తదితర ప్రాంతాల్లో పాజిటివ్ కేసులు వచ్చాయి. ముఖ్యంగా జనసమూహం అధికంగా ఉండే ప్రాంతాల ద్వారానే కరోనా వ్యాపిస్తోందని, ప్రజలు అప్రమత్తంగా లేకపోతే కేసులు మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు. సాక్షి, పెద్దాపురం: కరోనా మహమ్మారి పెద్దాపురం పట్టణాన్ని వణికిస్తోంది. ఈనెల 18న మాగంటి వారివీధికి చెందిన బ్యాంక్ ఉద్యోగికి పాజిటివ్ రావడంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. అతడితో కలసిన మిరపకాలయ వీధి, మాగంటి వారి వీధికి చెందిన సుమారు 80 మందికి వైద్య సిబ్బంది ఆధ్వర్యంలో కరోనా వైద్య పరీక్షలు నిర్వహించగా సోమవారం వారిలో ఏడుగురు బ్యాంకు ఉద్యోగి కుటుంబ సభ్యులకు, స్థానిక ప్రభుత్వ కార్యాలయంలో విధులు నిర్తర్తిస్తున్న సామర్లకోటకు చెందిన మహిళకు, మేదరవీధికి చెందిన 26 ఏళ్ల యువకుడికి, పెద్దాపురం బొమ్మలగుడి వీధిలో ఇద్దరికి, పద్మనాభ కాలనీకి చెందిన 17 ఏళ్ల బాలుడికి పాజిటివ్‌గా నిర్ధారౖణెంది. దీంతో పట్టణంలో కరోనా కేసులు 18కు చేరాయి. ఆర్పీఎఫ్ కానిస్టేబుల్‌కు కరోనా పాజిటివ్ తుని: తునికి చెందిన ఆర్పీఎఫ్ కానిస్టేబుల్‌కు కరోనా పాజిటివ్ వచ్చిందని మున్సిపల్ కమిషనర్ బి.ప్రసాదరాజు సోమవారం తెలిపారు. లాక్డౌన్ సడలించిన తర్వాత డ్యూటీలో భాగంగా శ్రామిక రైలులో మహారాష్ట్ర వెళ్లి వచ్చాడన్నారు. కోవిడ్ లక్షణాలు కనిపించడంతో కాకినాడలో రక్తనమూనా సేకరించి పరీక్ష నిర్వహించగా పాజిటివ్ వచ్చిందన్నారు. తుని రైల్వే క్వార్టర్స్‌లో నివాసం ఉండడంతో ఆ ప్రాంతాన్ని అధికారులు రెడ్‌జోన్‌గా ప్రకటించారు. తుని పట్టణంలో ఇది కరోనా పాజిటివ్ ఆరో కేసు కావడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. చదవండి: ఫోన్ స్విచ్చాఫ్ చేసిన ఎస్సై చెల్లూరులో 85కు చేరిన పాజిటివ్ కేసులు రాయవరం: మండలంలోని చెల్లూరు శివారు సూర్యారావుపేటలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఈనెల రెండో తేదీన రెండు పాజిటివ్ కేసులు రాగా.. ఆ సంఖ్య సోమవారానికి 85కు చేరింది. ఇంకా 200 మందికి నిర్వహించిన పరీక్షల ఫలితాలు రావాల్సి ఉంది. జి.మామిడాడ టు సూర్యారావుపేట పెదపూడి మండలం జి.మామిడాడ గ్రామం ఇప్పటి వరకు అత్యధిక కేసులు నమోదైన ప్రాంతంగా ఉంది. జి.మామిడాడ తర్వాత అన్ని ఎక్కువ కేసులు నమోదైన ప్రాంతంగా ప్రస్తుతం సూర్యారావు పేట నిలిచింది. గ్రీన్జోన్లో ఉన్న రాయవరం మండలం ఒక్కసారిగా రికార్డులకెక్కింది. సూర్యారావుపేటకు చెందిన కుటుంబం జి.మామిడాడలో జరిగిన వివాహ వేడుకలకు వెళ్లడంతో అక్కడి నుంచి కాంటాక్ట్ కేసులు ఇక్కడ పెరిగాయి. పలు కుటుంబాలు పాజిటివ్ కేసుల బారిన పడ్డాయి. పుల్లేటికుర్రులో మరో మూడు పాజిటివ్ కేసులు అంబాజీపేట: పుల్లేటికుర్రులో శివారు ప్రాంతంలో ఆదివారం నిర్వహించిన కరోనా పరీక్షల్లో ముగ్గురికి సోమవారం పాజిటివ్ వచ్చినట్టు ముక్కామల వైద్యాధికారిణి కేవై దేవికుమారి తెలిపారు. ఈ నెల 20న భార్య, భర్తలకు పాజిటివ్ వచ్చిన విషయం తెలిసిందే. వీరితో పాటు వారి కుమారులిద్దరికి, కోడలికి పాజిటివ్ వచ్చిందన్నారు. అల్లవరం: మండలం ఓడలరేవులో మూడు పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మిలటరీపేటలో మహిళకు పాజిటివ్ కాట్రేనికోన: కందికుప్ప పంచాయతీ మిలటరీపేటలో తొలి పాజిటివ్ కేసు నమోదైంది. మిలటరీపేటకు చెందిన 55 ఏళ్ల మహిళ గర్భకోశ వ్యాధితో బాధపడుతోంది. శస్త్ర చికిత్స కోసం ముమ్మిడివరంలో ప్రైవేటు ఆసుపత్రికి వెళ్లగా పాజిటివ్‌గా నిర్ధారణైంది. తాళ్లరేవు: కోరంగి పంచాయతీ పెదబొడ్డు వెంకటాయపాలెం గ్రామానికి చెందిన 53 ఏళ్ల వ్యక్తికి కరోనా పాజిటివ్ వచ్చిందని మండల వైద్యాధికారి బి.మాలకొండయ్య తెలిపారు. కాకినాడ, రాజమహేంద్రవరం సిటీ : కాకినాడ సిటీ, రూరల్‌లో కూడా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. రాజమహేంద్రవంలో సోమవారం ఒక్క రోజే 22 కేసులు నమోదయ్యాయి. కాజులూరులో మరో 29 కేసులు కాజులూరు: మండలంలో సోమవారం కొత్తగా మరో 29 కరోనా కేసులు నమోదయ్యాయి. ఆర్యావటంలో గత బుధవారం తొలిసారిగా ఓ బాలింతకు కరోనా సోకింది. వైద్యాధికారులు ఆమెతో కాంటాక్ట్ అయిన వారిలో గత గురువారం 59 మందికి, శుక్రవారం 40 మందికి పరీక్షలు నిర్వహించారు. సోమవారం రిపోర్టు రాగా ఇందులో తొలిరోజు పరీక్షలు నిర్వహించిన 59 మందిలో ఎనిమిది మందికి, అదే విధంగా శుక్రవారం నమూనాలు సేకరించిన 40 మందిలో 21 మందికి పాజిటివ్ వచ్చంది. దీంతో బాలింత మహిళతో కలసి ఆర్యావటంలో కరోనా బాధితుల సంఖ్య 30కి చేరింది. కాగా పాజిటివ్ వచ్చిన వారిలో ఒకరు 60 ఏళ్ల వృద్ధురాలు ఉండగా మిగిలిన వారిలో అత్యధికులు ఎనిమిదేళ్ల నుంచి 15 ఏళ్ల వయసు గల చిన్నారులు ఉండడం ఆందోళనకలిగిస్తోంది. -
రియల్ హీరో అనిపించుకున్న కానిస్టేబుల్
-
రియల్ హీరో అనిపించుకున్న కానిస్టేబుల్
భోపాల్ : అచ్చం సినిమా సీన్ తరహాలో పరిగెడుతున్న రైలులో పాల కోసం గుక్కపట్టి ఏడుస్తున్న ఒక నాలుగేళ్ల చిన్నారికి పాల పాకెట్‌ను అందించి రియల్ హీరోగా మారాడు ఒక ఆర్పీఎఫ్ కానిస్టేబుల్. ఆ కానిస్టేబుల్ మానవతా దృక్పథానికి కేంద్ర మంత్రి పీయుష్ గోయల్ కూడా ముగ్దులయ్యారు. వివరాల్లోకి వెళితే.. 33ఏళ్ల ఇందర్ సింగ్ యాదవ్ మధ్యప్రదేశ్‌లోని భోపాల్ రైల్వే స్టేషన్లో ఆర్పీఎఫ్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. లాక్డౌన్ నేపథ్యంలో వలసకూలీల కోసం బెల్గాం నుంచి గోరఖ్‌పూర్‌కు వెళుతున్న శ్రామిక్ రైలు అక్కడికి చేరుకుంది. అదే రైలులో హసీన్ హష్మి తన భార్య షరీఫ్ హష్మి, నాలుగేళ్ల చిన్నారితో కలిసి గోరఖ్‌పూర్‌లోని సొంతూరుకు వెళుతున్నాడు. అప్పటికే పాల కోసం నాలుగేళ్ల చిన్నారి గుక్క పట్టి ఏడుస్తున్నాడు. మధ్యలో రెండు మూడు రైల్వే స్టేషన్లలో రైలు ఆగినా వారికి పాలు దొరకలేదు. (విషాదం : కళ్ల ముందే సముద్రంలో కలిసిపోయాయి) ఈ విషయాన్ని అక్కడే ఉన్న ఇందర్ సింగ్‌కు చెప్పి తమకు సహాయం చేయాలని అర్థించారు. వెంటనే స్పందించిన ఇందర్ సింగ్ రైల్వే స్టేషన్ బయటకు పరిగెత్తి ఒక షాపులో పాలపాకెట్‌ను కొని మళ్లీ పరిగెత్తుకొచ్చాడు. కానీ అప్పటికే రైలు కదిలిపోయింది. కానీ ఇందర్ సింగ్ మాత్రం ఒక్కక్షణం కూడా ఆలోచించకుండా రైలు వెంట పరిగెడుతూ చివరికి ఎలాగోలా షరీఫ్ హష్మికి కిటికీలోంచి పాలపాకెట్‌ను అందించాడు. ఈ వీడియో రైల్వే స్టేషన్‌లోని సీసీటీవీ ఫుటేజీలో రికార్డయింది.ఇప్పుడు ఇందర్ సింగ్ రియల్ హీరోగా మారిపోయాడు. (పైలట్ తప్పిదం వల్లే ఆ ఘోర ప్రమాదం) ఈ వీడియోనూ చూసిన కేంద్ర మంత్రి పియూష్ గోయల్ ఇందర్ సింగ్ నిజమైన హీరో అంటూ ట్విటర్ వేదికగా పొగడ్తలతో ముంచెత్తాడు. ' ఇందర్ సింగ్ ఇవాళ తన మానవత్వాన్ని చాటుకున్నాడు. పాలకోసం గుక్కపట్టి ఏడుస్తున్న నాలుగేళ్ల చిన్నారి ఆకలి తీర్చేందుకు అతను చేసిన సాహసం నిజంగా అభినందించదగ్గది. కదులుతున్నరైలు వెంబడి పరిగెడుతూ చివరికి చిన్నారి తల్లికి పాలపాకెట్ అందించి గొప్ప మనుసును చాటుకున్నాడు.. ఇందర్ సింగ్' అంటూ పేర్కొన్నాడు. కాగా ఈ ఘటన మే 31న చోటుచేసుకుంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. -
కదులుతున్న రైలు ఎక్కబోయి..
-
వైరల్: వెంట్రుకవాసిలో బతికి బయటపడ్డారు..
భువనేశ్వర్: ఓ మహిళా ప్రయాణికురాలిని ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ కాపాడిన ఘటన శనివారం ఒడిశాలో చోటు చేసుకుంది. భువనేశ్వర్ రైల్వే స్టేషన్లో ఓ మహిళా ప్రయాణికురాలు కదులుతున్న రైలు ఎక్కబోయింది. అప్పటికే జనం నిండుగా ఉండటంతో ఆమెకు రైలు ఎక్కడం వీలుకాకపోగా రైలుకు, ప్లాట్‌ఫామ్‌కు మధ్యలో ఉన్న గ్యాప్‌లో ఆమె పడబోయింది. ఇది గమనించిన ఓ ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ వెంటనే పరిగెత్తుకొచ్చి ఆమెను బయటకు పట్టుకుని బయటకు లాగాడు. దీంతో పెద్ద ప్రమాదమే తప్పిందని అక్కడి జనాలు ఊపిరి పీల్చుకున్నారు. ఇక ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారగా.. ప్రయాణికురాలు చేసిన పనికి నెటిజన్లు చీవాట్లు పెడుతున్నారు. ‘కొంచెం కూడా చూసుకోనక్కర్లేదా.. అక్కడ ఎవరూ లేకపోయుంటే ఆమె పరిస్థితి ఏమయ్యేదో ఊహించడానికే భయంకరంగా ఉంది’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. (‘పుల్వామా’పై రాజకీయ దాడి) మరోవైపు కానిస్టేబుల్ చూపిన చొరవకు జేజేలు పలుకుతున్నారు. ‘మహిళ ప్రాణాలను కాపాడిన రియల్ హీరో’ అంటూ ఆకాశానికి ఎత్తుతున్నారు. ఇక సుమారు ఇలాంటి ఘటనే ముంబైలోని బైసుల్లా రైల్వే స్టేషన్లోనూ జరిగింది. ఓ వ్యక్తి రైల్వే ట్రాక్‌ను దాటడానికి ప్రయత్నిస్తుండగా అదే సమయంలో ఎదురుగా రైలు వచ్చింది. ఇది గమనించిన తోటి ప్రయాణికులు ఆయనను ప్లాట్‌ఫామ్ మీదకు లాగారు. దీంతో అప్రమత్తమైన మోటార్‌మెన్ సైతం రైలును కూతవేటు దూరంలో ఆపేశాడు. ఇక ఈ వీడియోపై నెటిజన్లు స్పందిస్తూ సదరు వ్యక్తి భాద్యతారాహిత్యంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాగా ఈ రెండు ఘటనలు ఫిబ్రవరి 15నే జరగడం గమనార్హం.(బీచ్‌లో బికినీ వేసుకుందని) (క్షణాల్లో కాపాడారు.. తృటిలో బయటపడ్డాడు) #WATCH Mumbai: People and security personnel at Byculla Railway Station saved a man who was crossing the railway track while a train was coming on the same track. Also, the motorman had stopped the train immediately. #Maharashtra pic.twitter.com/cGRoY9wh2L — ANI (@ANI) February 15, 2020 -
మహిళను కాపాడిన ఆర్పీఎఫ్ కానిస్టేబుల్
సికింద్రాబాద్: కదులుతున్న రైలు నుంచి కిందపడబోయిన మహిళను ఆర్పీఎఫ్ హెడ్ కానిస్టేబుల్ సైఫుద్దీన్ అప్రమత్తతకు మెచ్చిన ఉన్నతాధికారులు శనివారం అభినందించారు. ఈ నెల 18న సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ నుంచి దానాపూర్ ఎక్స్‌ప్రెస్ రైలు కదులుతుండగా అందులోంచి ఒక మహిళ దిగేందుకు ప్రయత్నించింది. రైలులో తమ బంధువులను ఎక్కించి తిరిగి సదరు మహిళ దిగే క్రమంలో రైలు వేగం పుంజుకుంది. ఫుట్‌పాత్ మీద కాలువేయబోయిన మహిళ బోగీ నుంచి జారి బోగీ, ప్లాట్‌ఫామ్ మధ్యన పడబోయింది. అదే ప్లాట్‌ఫామ్‌పై విధులు నిర్వహిస్తున్న ఆర్పీఎఫ్ హెడ్‌కానిస్టేబుల్ మహిళ జారిపడుతున్న బోగీ వద్దకు పరుగున వెళ్లి ఆమెను పట్టుకుని ప్లాట్‌ఫామ్ మీదకు లాక్కొచ్చాడు. దీంతో రైలుబోగీ, ప్లాట్‌ఫామ్ అంచున నలిగిపోవాల్సిన మహిళ సురక్షితంగా బయటపడింది. సీసీ పుటేజీల ద్వారా సైఫుద్దీన్ అప్రమత్తతను గుర్తించిన అధికా రులు అతన్ని అభినందించారు. -
రన్నింగ్ ట్రైన్లో నుంచి కిందపడినా..
సాక్షి, చెన్నై : మృత్యవు అంచువరకు వెళ్లొచ్చాడో యువకుడు. రైల్వే ప్రొటక్షన్ ఫోర్స్(ఆర్పీఎఫ్) కానిస్టేబుల్ వేగంగా స్పందించడంతో పెను ప్రమాదం తప్పింది. రన్నింగ్ ట్రైన్ ఎక్కుతూ ప్రమాదవ శాత్తూ పడిపోయిన ఓ ప్రయాణికుడిని ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ కాపాడారు. ఈ సంఘటన చెన్నై ఎగ్మోర్ స్టేషన్లో చోటుచేసుకుంది. స్టేషన్ నుంచి రైలు బయలుదేరుతుండగా జనరల్ బోగీలోకి ఎక్కడానికి ఓ యువకుడు ప్రయత్నించాడు. అయితే అదుపుతప్పడంతో కదులుతున్న రైలు, ప్లాట్ ఫామ్ మధ్యలో పడి పోతుండగా అక్కడే ఉన్న ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ సుమన్ అతన్ని లాగేశాడు. వెంటనే స్పందించి అతన్ని లాగివేయడంతో ప్రమాదం తప్పింది. ఈ సంఘటన అక్కడే ఉన్న సీసీటీవీ కెమెరాలో రికార్డయింది. యువకుడిని కాపాడిన సుమన్‌ను అందరూ అభినందిస్తున్నారు. -
రన్నింగ్ ట్రైన్లో నుంచి కిందపడినా..
-
పదివేల రైల్వే జాబ్స్
రైల్వే భద్రతా బలగాల్లో ఉద్యోగాల సైరన్ మోగింది. చాలా రోజుల తర్వాత రైల్వేలో యూనిఫాం ఉద్యోగాలకు ప్రకటన వెలువడింది. రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్పీఎఫ్), రైల్వే ప్రొటెక్షన్ స్పెషల్ ఫోర్స్ (ఆర్పీఎస్ఎఫ్)ల్లో ఎస్ఐ, కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి భారత రైల్వేశాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. రాష్ట్ర స్థాయి ఉద్యోగాలతో పోల్చుకుంటే చాలా తక్కువ శ్రమతో ఈ ఉద్యోగాలు దక్కించుకోవచ్చు. కంప్యూటర్ ఆధారిత పరీక్ష (సీబీటీ), ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్, ఫిజికల్ ఎఫీషియెన్సీ టెస్ట్‌లలో రాణిస్తే చాలు నెలకు రూ.35 వేలకు పైగా వేతనంతో ఎస్ఐ కొలువు వరిస్తుంది. అదే విధంగా కేవలం పదో తరగతి ఉత్తీర్ణతతోనే కానిస్టేబుల్ ఉద్యోగాన్ని చేజిక్కించుకునే సువర్ణావకాశం అభ్యర్థులకు లభించింది. కానిస్టేబుల్ పోస్టులకు ఎంపికైతే నెలకు రూ. 21,700 జీతం అందుతుంది. ఈ నేపథ్యంలో పరీక్ష విధానం, సిలబస్, సన్నద్ధత వ్యూహాలపై ఫోకస్.. నోటిఫికేషన్ వివరాలు విద్యార్హత: కానిస్టేబుల్‌కు పదో తరగతి; ఎస్ఐకు గ్రాడ్యుయేషన్. వయసు: 2018, జూలై 1 నాటికి 18– 25 ఏళ్ల మధ్య ఉండాలి. గరిష్ట వయోపరిమితిలో బీసీలకు మూడేళ్లు; ఎస్సీ, ఎస్టీలకు అయిదేళ్లు సడలింపు ఉంటుంది. నిర్దేశిత శారీరక ప్రమాణాలు ఉన్న అభ్యర్థులే దరఖాస్తు చేయడానికి అర్హులు. దరఖాస్తు రుసుం : రూ.500. ఎస్సీ, ఎస్టీ, ఎక్స్‌సర్వీస్‌మెన్, మహిళలు, మైనార్టీలు, ఈబీసీ అభ్యర్థులకు రూ.250 ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ : 2018, జూన్ 1 నుంచి జూన్ 30. కంప్యూటర్ ఆధారిత పరీక్ష తేదీ: 2018, సెప్టెంబర్/అక్టోబర్. వెబ్సైట్: www.indianrailways.gov.in ఆర్పీఎఫ్, ఆర్పీఎస్ఎఫ్ కానిస్టేబుల్ ఖాళీలు: 8619 (పురుషులకు 4403, మహిళలకు 4216. సబ్ ఇన్స్పెక్టర్ ఖాళీలు: 1120 (పురుషులకు 819, మహిళలకు 301. సిలబస్ ఒకటే.. కానిస్టేబుల్ ఉద్యోగాలకు పదో తరగతి ఉత్తీర్ణత అర్హత కాగా, ఎస్ఐ ఉద్యోగాలకు డిగ్రీ పూర్తిచేసిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే ఈ రెండు పరీక్షలకు నిర్వహించే కంప్యూటర్ ఆధారిత పరీక్ష (సీబీటీ)కు ఒకే సిలబస్ పేర్కొనడంతో అభ్యర్థులకు ప్రిపరేషన్ సులువు కానుంది. పరీక్షలో ప్రశ్నల కాఠిన్యత స్థాయిలో మాత్రం వ్యత్యాసం తప్పనిసరిగా ఉంటుంది. కానిస్టేబుల్ పరీక్ష పేపర్ పదో తరగతి స్థాయిలో, ఎస్ఐ పేపర్ డిగ్రీ స్థాయిలో ఉంటుంది. దీన్ని గుర్తించి సన్నద్ధత వ్యూహాన్ని రూపొందించుకోవాలి. సన్నద్ధత సులువు.. కానిస్టేబుల్, ఎస్ఐ సీబీటీలో పేర్కొన్న సిలబస్‌లో మూడు అంశాలు ఉన్నాయి. అవి.. జనరల్ అవేర్నెస్, అర్థమెటిక్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ ఉన్నాయి. వీటిలో జనరల్ అవేర్నెస్ సెక్షన్‌కు ఎక్కువ వెయిటేజీ ఇచ్చారు. కంప్యూటర్ ఆధారిత పరీక్షకు మొత్తం 120 మార్కులు (120 ప్రశ్నలు) కేటాయిస్తే వీటిలో 50 మార్కులను జనరల్ అవేర్‌నెస్‌కు కేటాయించారు. అర్థమెటిక్, రీజనింగ్ విభాగాలకు 35 మార్కుల చొప్పున ఇచ్చారు. మొత్తం 90 నిమిషాల వ్యవధిలో ప్రశ్నలకు సమాధానాలు గుర్తించాల్సి ఉంటుంది. నిబంధనల ప్రకారం కనీసం 35 శాతం అర్హత మార్కులు పొందడం తప్పనిసరి. ఎస్సీ, ఎస్టీ కేటగిరీల అభ్యర్థులు కనీసం 30 శాతం మార్కులు సాధించాలి. కంప్యూటర్ ఆధారిత పరీక్షలో మెరిట్ జాబితా ప్రకారం కేటగిరీల వారీగా పదిరెట్ల మందికి ఫిజికల్ ఎఫీషియెన్సీ టెస్ట్ (పీఈటీ), ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ (పీఎంటీ)లకు పిలుపు అందుతుంది. జనరల్ అవేర్నెస్ మొత్తం 120 ప్రశ్నల్లో జనరల్ అవేర్నెస్ నుంచి 50 ప్రశ్నలు ఉండటంతో ఈ విభాగం విజయంలో కీలక పాత్ర పోషిస్తుందని చెప్పొచ్చు. రుణాత్మక మార్కులు ఉండడం, ప్రతి తప్పు సమాధానానికి 1/3 మార్కులు కోత విధిస్తుండటంతో జనరల్ అవేర్నెస్ సెక్షన్‌కు ప్రాధాన్యం ఏర్పడింది. మొత్తంగా పరీక్షకు 90 నిమిషాల సమయం మాత్రమే ఇవ్వడంతో అభ్యర్థులకు టైం మేనేజ్మెంట్ కీలకం కానుంది. జనరల్ అవేర్నెస్ సెక్షన్‌లోని ప్రశ్నలకు తక్కువ సమయంలోనే సమాధానాలు గుర్తించేందుకు వీలుంటుంది. దీనివల్ల మిగిలిన అర్థమెటిక్, రీజనింగ్ విభాగాలకు ఎక్కువ సమయం కేటాయించడానికి అవకాశం లభిస్తుంది. జనరల్ అవేర్నెస్ సెక్షన్లో మన చుట్టూ జరుగుతున్న పరిణామాలపై అభ్యర్థులకు ఉన్న అవగాహనతో పాటు చరిత్ర, రాజ్యాంగం, పరిపాలన వ్యవస్థ, ఆర్థిక వ్యవస్థ, పర్యావరణం, భౌగోళిక స్థితిగతులు, సైన్స్, సంస్కృతి తదితర అంశాలపై అభ్యర్థుల పరిజ్ఞానాన్ని పరిశీలించే విధంగా ప్రశ్నలు ఉంటాయి. ఇక సమకాలీన అంశాలపై కూడా అభ్యర్థులు ఎక్కువగా దృష్టిసారించాలి. వివిధ దేశాల అధ్యక్షులు, అంతర్జాతీయ సంబంధాలు, దేశాల కరెన్సీలు, వార్తల్లోని వ్యక్తులు తదితర సమకాలీన అంశాలు తెలుసుకోవాలి. వీటితో పాటు శాస్త్ర సాంకేతిక రంగంలో చోటుచేసుకున్న సంఘటనలు, డిఫెన్స్ టెక్నాలజీ, సైనిక విన్యాసాలు, తాజాగా క్రీడల్లో చెప్పుకోదగిన పరిణామాలు, బడ్జెట్ ముఖ్య అంశాలు, కేంద్ర ప్రభుత్వం చేపట్టిన పథకాలు వాటి లక్ష్యాలను స్పష్టంగా తెలుసుకోవాలి. సెప్టెంబర్ – అక్టోబర్‌లో కంప్యూటర్ ఆధారిత పరీక్ష ఉంటుంది కాబట్టి ఫిబ్రవరి – మార్చి నుంచి కరెంట్ అఫైర్స్ చదువుకోవాలి. ప్రిపరేషన్‌కు ఆరో తరగతి నుంచి పదో తరగతి వరకు పుస్తకాలను ఉపయోగించుకోవాలి. రోజూ ఏదైనా ఒక ప్రామాణిక పేపర్ చదువుతూ సొంతంగా నోట్స్ రాసుకోవాలి. రిఫరెన్స్: ప్రామాణిక దినపత్రిక, మ్యాగజైన్. www.sakshieducation.com అర్థమెటిక్ 35 ప్రశ్నలు ఉండే ఈ విభాగంలో ఆరు నుంచి పదో తరగతి వరకు ఉన్న మ్యాథమెటిక్స్ పుస్తకాల్లోని అర్థమెటిక్ చాప్టర్లలోని ప్రాథమిక భావనలు, సమస్యలను అధ్యయనం చేయాలి. డెసిమల్స్, ఫ్రాక్షన్స్, కసాగు, గసాభా, నిష్పత్తి–అనుపాతం, శాతాలు, మెన్సురేషన్, కాలం–పని, కాలం–దూరం, చక్రవడ్డీ, బారువడ్డీ, లాభనష్టాలు, ఆల్జీబ్రా తదితర అంశాల నుంచి ప్రశ్నలు వస్తాయి. అభ్యర్థులు సంఖ్యా వ్యవస్థపై పట్టు సాధించడం తప్పనిసరి. కూడికలు, తీసివేతలు, భాగహారాలు, గుణకారాలు, శాతాలు వంటి ప్రాథమిక అర్థమెటిక్ అంశాలకు సంబంధించిన సమస్యలకు వేగంగా, కచ్చితమైన సమాధానాలు ఇచ్చేలా ప్రాక్టీస్ చేయాలి. ఎక్కాలు, వర్గాలు – వర్గమూలాలు, ఘనమూలాలపై పట్టు సాధించడం ద్వారా సమస్యలను వేగంగా సాధించొచ్చు. రిఫరెన్స్: ఆర్ఎస్ అగర్వాల్, అరిహంత్ పబ్లికేషన్స్, కిరణ్ పబ్లికేషన్స్ పుస్తకాలు ఉపయోగపడతాయి. వీటితో పాటు ‘ఇండియాబిక్స్’ వెబ్‌సైట్‌ను ప్రాక్టీస్‌కు ఉపయోగించుకోవచ్చు. జనరల్ ఇంటెలిజెన్స్, రీజనింగ్ సులువైన సెక్షన్ ఇది. అభ్యర్థులు తమ ఆలోచనలపై స్పష్టంగా ఉంటూ సమస్య పరిష్కారానికి తార్కికంగా ఆలోచించగలరా లేదా అని తెలుసుకోవడానికి, మేధస్సును అంచనా వేయడానికి రీజనింగ్ ఉపయోగపడుతుంది. తార్కికంగా ఆలోచించే వారికి సులువైన విభాగమిదే. అనాలజీస్; సిమిలారిటీస్, డిఫరెన్సెస్; స్పేషియల్ విజువలైజేషన్, స్పేషియల్ ఓరియెంటేషన్, ప్రాబ్లం సాల్వింగ్ అనాలిసిస్, కోడింగ్–డీకోడింగ్, అర్థమెటికల్ రీజనింగ్, రిలేషన్స్, ఆడ్‌మాన్ అవుట్, సింబల్స్, నొటేషన్స్, వెన్ చిత్రాలు, బ్లడ్ రిలేషన్స్, సీటింగ్ అరేంజ్మెంట్, డైరెక్షన్స్, స్టేట్మెంట్–కన్‌క్లూజన్, డెసిషన్ మేకింగ్, సిలాయిజం తదితర విభాగాల నుంచి ప్రశ్నలు వస్తాయి. రిఫరెన్స్: ఆర్ఎస్ అగర్వాల్. ప్రాక్టీస్ ప్రధానం 90 నిమిషాల్లో 120 ప్రశ్నలకు సమాధానాలు గుర్తించాలి కాబట్టి విజయంలో టైమ్ మేనేజ్మెంట్ కీలక పాత్ర పోషిస్తుంది. వేగంగా, కచ్చితత్వంతో సమాధానాలు గుర్తించాలంటే ప్రాక్టీస్‌కు మించిన మార్గం మరొకటి లేదు. రైల్వే పరీక్షల్లో గత ప్రశ్నపత్రాల్లోని ప్రశ్నలు చాలా వరకు పునరావృతమవుతున్నాయి. దీన్ని దృష్టిలో ఉంచుకొని ప్రీవియస్ పేపర్లను ప్రాక్టీస్ చేయాలి. జనరల్ అవేర్‌నెస్‌లో ప్రధానంగా జనరల్ సైన్స్, ఆధునిక భారతదేశ చరిత్ర, పాలిటీ బేసిక్స్‌పై దృష్టిసారించాలి. 90 శాతం ప్రశ్నలు బేసిక్‌గా, యావరేజ్‌గా, లాజిక్‌గా వస్తున్నాయి. దీన్ని దృష్టిలో ఉంచుకొని, తొలుత బేసిక్ కాన్సెప్టులపై పట్టు సాధించాలి. ఆ తర్వాతే అందుబాటులో ఉన్న సమయాన్ని బట్టి లోతుగా అధ్యయనం చేయాలి. అర్థమెటిక్‌లో సంఖ్యా వ్యవస్థ, సింప్లిఫికేషన్స్, శాతాలు, నిష్పత్తులు, వడ్డీ అంశాలు ముఖ్యమైనవి. రీజనింగ్‌లో సీటింగ్ అరేంజ్మెంట్, ఆల్ఫాబెటికల్ టెస్ట్, కోడింగ్–డీకోడింగ్, బ్లడ్‌రిలేషన్స్, ర్యాంకింగ్స్ తదితర అంశాలు ముఖ్యమైనవి. – ఎ.సత్యనారాయణ, డైరెక్టర్, గ్రేట్ ఇన్స్టిట్యూట్. -
మెరుపు వేగంతో ప్రాణాలు కాపాడాడు
సాక్షి, ముంబై : మెరుపు వేగంతో, సాహసం ప్రదర్శించిన ఆర్పీఎఫ్ కానిస్టేబుల్, ఓ బాలుడి ప్రాణాలు కాపాడి హీరో అయ్యాడు. రన్నింగ్ ట్రెయిన్ నుంచి కింద పడిపోయిన బాలుడిని పట్టాల మధ్య పడిపోకుండా రక్షించాడు. ముంబైలోని నైగావ్ రైల్వే స్టేషన్లో ఫ్రిబ్రవరి 2న ఈ ఘటన చోటు చేసుకుంది. సెకన్ల వ్యవధిలో చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి వైరల్ అవుతోంది. ఏడేళ్ల బాలుడు తన తల్లితో కలిసి రైలు ఎక్కేందుకు సిద్ధమయ్యాడు. అంతలో రైలు కదలగా.. తల్లి ఎక్కేసింది. అయితే తల్లిని అనుసరించే క్రమంలో పిల్లాడు కిందపడిపోయాడు. ఫ్లాట్‌ఫామ్‌కు, రైలుకు మధ్య అతను ఇరక్కుపోగా.. అది గమనించిన సునీల్ నాపా అనే ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ మెరుపు వేగంతో పరిగెత్తుకుంటూ చాకచక్యంగా అతన్ని పక్కకు లాగాడు. ఆ బాలుడిని గమనించి ముందు కంపార్ట్మెంట్లో ఉన్న మరో వ్యక్తి సైతం కింద పడటం వీడియోలో గమనించవచ్చు. స్టేషన్లో ఉన్న సీసీ ఫుటేజీలో ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు రికార్డయ్యాయి. ప్రాణాలకు తెగించి మరీ బాలుడి ప్రాణాలు కాపాడిన సునీల్ నాపాపై అధికారులు, ప్రయాణికులు ప్రశంసలు కురిపిస్తున్నారు. -
మెరుపు వేగంతో వెళ్లి బాలుడి ప్రాణాలు కాపాడాడు
-
బ్రిడ్జిపైనుంచి పడి కానిస్టేబుల్ మృతి
అనంతపురం జిల్లా గుత్తి సమీపంలోని ఉప్పవంక వద్ద విధినిర్వహణలో ఉన్న ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ సుధాకర్(50) బ్రిడ్జిపైనుంచి ప్రమాదవశాత్తూ పడి మృతిచెందాడు. ఈ సంఘటన శనివారం వేకువజామున జరిగింది. ఉదయం బ్రిడ్జి కింద శవం పడి ఉండటాన్ని చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. -
డబ్బులివ్వలేదని...
రైలు నుంచి ప్రయాణికులను తోసేసిన ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ వారణాసి: డబ్బులడిగితే ఇవ్వలేదని ఓ ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ ప్రయాణికులపై దాష్టీకానికి పాల్పడ్డాడు. కదులుతున్న రైలు నుంచి ఇద్దరిని బయటకు తోసేశాడు. వారిలో మహిళ మరణించగా, ఆమె సోదరుడు గాయపడ్డాడు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ దుర్ఘటన మంగళవారం రాత్రి వారణాసి రైల్వే స్టేషన్లో చోటుచేసుకుంది. మృతురాలు పశ్చిమ బెంగాల్‌లోని బిర్భూమ్ జిల్లాకు చెందిన రీతా పాల్(25)గా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనకు పాల్పడిన ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ శరద్చంద్ర దూబేను పోలీసులు అరెస్టు చేశారు. తన 18 నెలల కూతురు కాజల్, సోదరుడు జయ్‌దేవ్, మామ మానిక్ పాల్‌లతో కలిసి భర్తను కలవడానికి రీతా పాల్ దుర్గియానా ఎక్స్‌ప్రెస్‌లో హౌరా నుంచి కాన్పూర్‌కు బయలుదేరింది. వారున్న బోగీలోకి ప్రవేశించిన కానిస్టేబుల్ దూబే వారి టికెట్లను పరిశీలించాడు. జనరల్ బోగీ టికెట్లతో స్లీపర్ బోగీలో ప్రయాణిస్తుండటాన్ని తప్పుపట్టి డబ్బులిమ్మని బలవంతం చేశాడు. డబ్బులివ్వడానికి నిరాకరించిన వారు జనరల్ బోగీలో సీట్లు ఖాళీ లేక ఇక్కడ కూర్చున్నామన్నారు. అంతకు ముందే వేరే కానిస్టేబుల్ వచ్చి రూ. 50 జరిమానా వసూలు చేశాడని చెప్పారు. అయినా వినిపించుకోని దూబే కదులుతున్న రైలు నుంచి పాల్, జయ్దేవ్లను బయటకు తోసేశాడు. రీతా పాల్‌ను స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించగా ఆమె ఆ రాత్రే మరణించింది. -
రైల్వేయార్డులో మహిళపై సామూహిక అత్యాచారం
విజయవాడ: విజయవాడ రైల్వే యార్డులో ఒక మహిళపై సామూహిక అత్యాచారం జరిగింది. అత్యాచారం చేసినవారిలో ఒక ఆర్పిఎఫ్(రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్) కానిస్టేబుల్ కూడా ఉన్నాడు. ఆ మహిళపై ఒక కానిస్టేబుల్, మరో యువకుడు కలసి సామూహికంగా అత్యచారం చేశారు. బాధితురాలి బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.