
ఢిల్లీ రైల్వే స్టేషన్‌లో తొక్కిసలాట ఘటన జరిగిన మరుసటి రోజు.. అక్కడ ఓ మహిళా కానిస్టేబుల్ విధుల్లో ఉంది. ఆ టైంలో ఆమె తన చంటిబిడ్డతో కనిపించింది. అందుకు సంబంధించిన వీడియో, ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అయ్యాయి. ఇది అమ్మ గొప్పతనం, గొప్ప యోధురాలు, నారీశక్తి అంటూ కొందరు నెటిజన్లు ప్రశంసించగా, మరికొందరూ అలాంటి పరిస్థితుల్లో డ్యూటీకి రావాలా అంటూ విమర్శించారు. అయితే అచ్చం ఇలానే ఓవల్ కార్యాలయంలో అమెరికా కొత్త అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో టెక్ బిలియనీర్ ఎలోన్ మస్క్ తన నాలుగేళ్ల కుమారుడితో మీడియా ముందు సమావేశం అయ్యిన సంగతి తెలిసిందే. ఇక్కడ ఇద్దరు తల్లిదండ్రులు పనిప్రదేశానికి తమ బిడ్డలతోనే వచ్చారు. కానీ ఈ ఇద్దరి పేరెంట్స్ పట్ల సమాజ దృక్పథంలో ఎందుకు ఇంత వ్యత్యాసం..?. వాస్తవికత ఏంటీ..? అంటే..
ఇద్దరు తల్లిదండ్రులు తమ పిల్లలను పనితీసుకువచ్చారు. ఆమెది శారీరకంగా అలిసిపోయే ఉద్యోగం. పైగా ఆమెకు నానీలను(టేక్‌కేర్‌లను) పెట్టుకునేంత సామర్థ్యం లేదు. అలాగే సెలవులు దొరకడం కూడా సాధ్యం కాదు. తప్పనిసరి పరిస్థితుల్లో ఆమె తన చంటిబిడ్డను ఛాతీకి కట్టుకుని విధులకు హాజరైంది.
ఆమె తల్లిగా తన బాధ్యతల తోపాటు విధి నిర్వహణను సమర్థవంతంగా నిర్వర్తించింది. అయితే సమాజం పాపం ఎవరు లేరేమో ఆమెకు. అందుకే ఇంతలా కష్టపడుతుందంటూ ఆమె పట్ల సానుభూతి కురింపించేస్తారు. అలాగే ఆమె బిడ్డను డ్యూటీకి తీసుకురావడం అన్నది పెద్ద హాట్‌టాపిక్‌గా మారిపోతుంది.
అదే మరో పేరెంట్.. టెక్ బిలియనీర్ విషయానికి వస్తే..ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన వ్యక్తులలో ఒకరైన ఎలోన్ మస్క్ తన కుమారుడు ఎక్స్‌ని ఓవల్ కార్యాలయానికి తీసుకువచ్చాడు. అతనేం కొడుకుని పనిప్రదేశానికి తీసుకురావాల్సిన గత్యంతరం లేదు. మంచి టేక్‌కేర్‌లు, సంరక్షకులతో కొడుకు బాగోగులు చూసుకునే సామర్థ్యం అతనికి ఉంది.
అయితే అతను ఇలా కొడుకుని దేశా అధ్యుకుడితో జరిగే మీడియా సమావేశానికి తీసుకురావాల్సిన అవసరం ఏంటీ..? అని ఆలోచిస్తే దాన్ని చాలామంది ఇమేజ్ బిల్డింగ్ స్టంట్‌గా వ్యవహరిస్తారు. ఫేమస్ అవ్వడానికి వార్తల్లో నిలచేందుకు పలువురు ప్రముఖులు చేసే స్టంట్‌లాంటిది ఇది.
అయితే ఇక్కడ సమాజం దృక్పథం కూడా ఎలాన్ మస్క్ కొడుకుతో ఓవెల్ ఆఫీస్‌కి ఎందుకు వచ్చాడని ప్రశ్నించదు. మస్క్‌కి అతను ఎన్నో కొడుకు, ఎంత వయసు అంటూ ఆరాలు తీస్తూ..గ్రేట్ నాన్న అని కితాబులిచ్చేస్తారు ఇతడికి. అదే సామాన్య ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ అయిన మహిళా ఉద్యోగి విషయంలో మాత్రం సులభంగా ప్రశ్నలు సంధించడం, విమర్శించడం చకచక జరిగిపోతాయి.
ఇక్కడ మనిషి హోదా, పలుకుబడిని బట్టి వారిని చూసే తీరు మారుతుందనడానికి ఈ సంఘటనే ఉదాహరణ. అందుకే డబ్బు ఉన్నవాడు నోరు పెంచినా, కోప్పడినా పర్లేదు. పేదవాడి కోపం పెదవికే చేటు మంచిది అన్న సామెత వచ్చింది కాబోలు. మనిషిని మనిషిగా గుర్తించగలిగితే అంతరాలనేవే ఉండవని ఎన్నో మంచి మాటలు వల్లించేస్తుంటారు కొందరూ. గానీ ఆచరణలో మాత్రం అందరి బుద్ధి ఒకటే అన్నట్లుగా ఉంది.
ఇక ఈ ఆర్పీఎఫ్ మహిళ కానిస్టేబుల్‌ది త్యాగంతో కూడిన బతుకు పోరాటం, మరొకరిది అటెన్షన్, ఉనికి కోసం చేసే స్టంట్. ఎలా అయితే ఫోకస్ అయితే సెంటర్ ఆఫ్ ఎంట్రాక్షనే కదా అని అనకండి..ఎందుకంటే ఎందరో తల్లులు ఇలా పోరాడుతూ అనారోగ్యాలు కొనితెచ్చుకుంటున్నవారు చాలామంది ఉన్నారు. వారికి సహాయం, జాలీ, సానుభూతి వంటివి చూపవల్సిన అవసరం లేదు గానీ ఆడిపోసుకోకుండా ఉంటే చాలు.
(చదవండి: టెక్ మిలియనీర్ బ్రయాన్ జాన్సన్ డైట్‌లో గరం మసాలా, స్టీల్ డబ్బాల్లో..)
Comments
Please login to add a commentAdd a comment