
అమెరికాలో టాప్ ఎలక్ట్రిక్ వాహన తయారీదారుగా ఉన్న టెస్లా సంస్థ కార్లు భారత్‌లోకి ప్రవేశించాయి. సూరత్‌కు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త లవ్జీ దాలియా టెస్లా సైబర్‌ట్రక్‌ను కొనుగోలు చేసినట్లు తెలిపారు. వారం రోజులుగా టెస్లా సైబర్‌ట్రక్ సూరత్ రోడ్లపై కనిపిస్తూ సందడి చేస్తుంది. అయితే ఈ వాహనాన్ని దుబాయ్ నుంచి దిగుమతి చేసుకున్నట్లు దాలియా కుమారుడు పీయూష్ తెలిపారు.
ధర రూ.60 లక్షలు..
లావ్జీ దాలియా కొనుగోలు చేసిన టెస్లా సైబర్‌ట్రక్ భారత్‌లోనే మొదటిదని పీయూష్ పేర్కొన్నారు. ‘మేము ఆన్‌లైన్‌లో తనిఖీ చేసిన దాని ప్రకారం, ఈ సైబర్‌ట్రక్ దేశంలోనే మొదటిది. అమెరికాలోని టెక్సాస్‌లో ఉన్న టెస్లా షోరూమ్‌లో ఆరు నెలల క్రితం ఈ కారును బుక్ చేశాం. కొద్దీ రోజుల కిందటే దీన్ని దుబాయ్‌లో డెలివరీ చేశారు. అక్కడి నుంచి భారత్ తీసుకొచ్చాం’ అని స్పష్టం చేశారు. ఈ సైబర్‌ట్రక్ వేరియంట్ ధర సుమారు రూ.60 లక్షలు ఉందని సోషల్ మీడియా ద్వారా తెలుస్తుంది.
ఇదీ చదవండి: కథన రంగంలో ఏఐ చిందులు
ఎవరీ లవ్జీ దాలియా?
‘లవ్జీ బాద్‌షా’గా పేరొందిన లవ్జీ దాలియా సూరత్‌లో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు. దాంతోపాటు వజ్రాల వ్యాపారిగా, పవర్ లూమ్ యజమానిగా లావ్జీకి గుర్తింపు ఉంది. ఆయన చేస్తున్న దాతృత్వ కార్యక్రమాలకు గుర్తింపుగా స్థానికులు తనను బాద్‌షాగా పిలుస్తున్నారు. గోపీన్ డెవలపర్స్ అనే రియల్ ఎస్టేట్ సంస్థను స్థాపించారు. లాభాపేక్ష లేని సంస్థ గోపీన్ ఫౌండేషన్ ద్వారా దాతృత్వ కార్యక్రమాలు చేస్తున్నారు. తన ఇన్‌స్టాగ్రామ్ పేజీలో ప్రధాని మోదీతో కలిసి దిగిన ఫొటోను కూడా గతంలో షేర్ చేశారు.