
హ్యుందాయ్ మోటార్ ఇండియా లిమిటెడ్ (HMIL) కంపెనీకి చెందిన క్రెటా కారు అమ్మకాల్లో దూసుకెళ్తోంది. ఈ కారు వరుసగా రెండో నెల కూడా మంచి అమ్మకాలను పొందినట్లు సంస్థ వెల్లడించింది.
హ్యుందాయ్ క్రెటా గత నెలలో (2025 ఏప్రిల్) మొత్తం 17016 యూనిట్ల అమ్మకాలను నమోదు చేసినట్లు కంపెనీ వెల్లడించింది. ఈ అమ్మకాలు ఏప్రిల్ 2024తో పోలిస్తే.. 10.2 శాతం ఎక్కువ. కాగా ఈ కారును 2025 జనవరి నుంచి ఏప్రిల్ వరకు 69914 మంది కొనుగోలు చేశారు.
హ్యుందాయ్ క్రెటా
భారతదేశంలో ఎక్కువమందికి ఇష్టమైన కారుగా నిలిచిన హ్యుందాయ్ క్రెటా మంచి డిజైన్, అప్డేటెడ్ ఫీచర్స్ కలిగి మూడు ఇంజన్ ఎంపికలతో వస్తుంది. అవి 1.5-లీటర్ పెట్రోల్, 1.5-లీటర్ డీజిల్, 1.5-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజిన్లు. ట్రాన్స్‌మిషన్స్.. ఎంచుకునే ఇంజిన్లను లేదా వేరియంట్‌ను బట్టి మారుతూ ఉంటాయి. ఈ కారు ప్రస్తుతం ఇండియన్ మార్కెట్లో ఎలక్ట్రిక్ రూపంలో కూడా అందుబాటులో ఉంది. ఇది ఒక ఫుల్ ఛార్జితో 390 కిమీ కంటే ఎక్కువ రేంజ్ అందిస్తుంది.
ఇదీ చదవండి: జర్మన్ బ్రాండ్ కీలక నిర్ణయం: మరోసారి పెరిగిన కార్ల ధరలు