Creta
-
దిగ్గజ కంపెనీలన్నీ ఒకేచోట: అబ్బురపరుస్తున్న కొత్త వెహికల్స్ (ఫోటోలు)
-
'క్రెటా ఈవీ' రేంజ్ ఎంతో తెలిసిపోయింది: సింగిల్ ఛార్జ్‌తో..
ప్రముఖ వాహన తయారీ సంస్థ 'హ్యుందాయ్ మోటార్' (Hyundai Motor) దేశీయ మార్కెట్లో 'క్రెటా' (Creta) కారును ఎలక్ట్రిక్ రూపంలో లాంచ్ చేయడానికి సన్నద్ధమవుతోంది. దీనిని కంపెనీ త్వరలో జరగనున్న భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పో 2025లో ఆవిష్కరించనుంది. కాగా అంతకంటే ముందే సంస్థ దీని రేంజ్ వివరాలను వెల్లడించింది.మార్కెట్లో అడుగుపెట్టనున్న కొత్త 'హ్యుందాయ్ క్రెటా ఈవీ' (Hyundai Creta EV) 51.4 కిలోవాట్, 42 కిలోవాట్ బ్యాటరీ ఫ్యాక్స్ పొందనుంది. 51.4 కిలోవాట్ బ్యాటరీ ఒక సింగిల్ ఛార్జితో 473 కిమీ రేంజ్ అందించగా.. 42 కిలోవాట్ బ్యాటరీ 390 కిమీ రేంజ్ అందిస్తుందని సమాచారం. ఈ కారు 7.9 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం అవుతుంది.హ్యుందాయ్ క్రెటా ఈవీ మార్కెట్లో లాంచ్ అయిన తరువాత.. మారుతి సుజుకి ఈ విటారా, మహీంద్రా బిఈ 6, టాటా కర్వ్ ఈవీ, ఎంజీ జెడ్ఎస్ ఈవీ, టయోటా అర్బన్ క్రూయిజర్ ఈవీ వంటి వాటికి ప్రధాన ప్రత్యర్థిగా ఉంటుంది. అయితే ఈ కారు ధర ఎంత వుంటుందనేది అధికారికంగా వెల్లడి కాలేదు. అయితే దీని ప్రారంభ ధర రూ.22 లక్షలు ఉండొచ్చని అంచనా.చూడటానికి కొంత స్టాండర్డ్ మోడల్ మాదిరిగా అనిపించినప్పటికీ.. హ్యుందాయ్ క్రెటా ఈవీ అప్డేటెడ్ డిజైన్ పొందుతుంది. బ్రాండ్ లోగో వద్ద ఛార్జింగ్ పోర్ట్, కొత్త సైడ్ ప్రొఫైల్, అప్డేటెడ్ రియర్ ఎండ్ వంటివన్నీ ఇందులో గమనించవచ్చు. మొత్తం మీద ఇది మార్కెట్లో దాని ప్రత్యర్థులకు గట్టి పోటీ ఇవ్వనుంది. -
తళుక్కున మెరిసే హ్యుందాయ్ క్రెటా కొత్త ఎడిషన్
హ్యుందాయ్ ఇండియా క్రెటా నైట్ (Creta Knight) ఎడిషన్‌ను విడుదల చేసింది. ఇప్పటికే ఉన్న కొన్ని క్రెటా వేరియంట్లకు ఇది కాస్మెటిక్ అప్‌గ్రేడ్. హ్యుందాయ్ క్రెటా నైట్ ఎడిషన్ ధరలు రూ.14.51 లక్షల (ఎక్స్-షోరూమ్) నుండి ప్రారంభమవుతాయి. ఇందులో 1.5 ఎంపీఐ పెట్రోల్, డీజిల్ ఇంజిన్ ఆప్షన్లలో పలు వేరియంట్లు ఉన్నాయి.బ్లాక్ కలర్ ఎక్స్టీరియర్, కాంట్రాస్ట్ రెడ్ బ్రేక్ కాలిపర్లతో బ్లాక్ అల్లాయ్ వీల్స్, మ్యాటీ లోగో, బ్లాక్ అవుట్ సైడ్ రియర్ వ్యూ మిర్రర్, బ్లాక్ స్పాయిలర్ వంటివి క్రెటా నైట్ ఎడిషన్ అప్డేట్లలో ప్రధానంగా ఉన్నాయి. ఇంటీరియర్స్ పూర్తిగా బ్లాక్ అప్హోల్స్స్టరీ, స్టీరింగ్ వీల్‌పై లెదర్-ర్యాప్, గేర్ నాబ్‌తో అప్డేట్ చేశారు. మెటల్ పెడల్స్‌తో పాటు బ్రాస్ కలర్ ఇన్సర్ట్లు ఉన్నాయి.సాధారణ కలర్ ఆప్షన్స్ మాత్రమే కాకుండా, కొనుగోలుదారులు రూ.5,000 అదనంగా చెల్లించి టైటాన్ గ్రే మ్యాటీ కలర్ వాహనాన్ని, రూ. 15,000 చెల్లించి డ్యూయల్ టోన్ కలర్స్‌ను ఎంచుకునే అవకాశం కూడా ఉంది.కొత్త ఎడిషన్ ధరలుహ్యుందాయ్ క్రెటా 1.5 పెట్రోల్CRETA Knight S(O) MT: రూ. 14.51 లక్షలుCRETA Knight S(O) CVT: రూ. 16.01 లక్షలుCRETA Knight SX (O) MT: రూ. 17.42 లక్షలుCRETA Knight SX (O) CVT: రూ. 18.88 లక్షలుహ్యుందాయ్ క్రెటా 1.5 డీజిల్CRETA Knight S(O) MT: రూ. 16.08 లక్షలుCRETA Knight S(O) AT: రూ. 17.58 లక్షలుCRETA Knight SX (O) MT: రూ. 19 లక్షలుCRETA Knight SX (O) AT: రూ. 20.15 లక్షలు -
హ్యుందాయ్ క్రెటా ఈవీ వచ్చేస్తోంది!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన తయారీ సంస్థ హ్యుందాయ్ మోటార్ ఇండియా క్రెటా ఎలక్ట్రిక్ వెహికల్‌ను తీసుకొస్తోంది. 2025 జనవరి–మార్చి మధ్య ఈ మోడల్ దేశీ రోడ్లపై పరుగులు తీస్తుందని కంపెనీ ప్రకటించింది. ఒకసారి చార్జింగ్‌తో 550 కిలోమీటర్లు ప్రయాణించే సామర్థ్యంతో క్రెటా ఈవీ రూపుదిద్దుకుంటోందని సమాచారం. ధర రూ. 22–26 లక్షల మధ్య ఉంటుంది. హ్యుందాయ్ ఇండియా పబ్లిక్ ఇష్యూకు వస్తున్న సంగతి తెలిసిందే. సెబీకి దాఖలు చేసిన పత్రాల ప్రకారం భారత్‌లో నాలుగు ఈవీలను ప్రవేశపెట్టాలన్నది సంస్థ ప్రణాళిక. వీటిలో మాస్ మార్కెట్ మోడల్‌తోపాటు హైఎండ్, ప్రీమియం ఈవీలు సైతం ఉన్నాయి. ఈవీ విభాగంలో కంపెనీ ప్రస్తుతం దేశంలో అయానిక్ 5, కోనా ఎలక్ట్రిక్ విక్రయిస్తోంది. పబ్లిక్ ఇష్యూ ద్వారా 17.5 శాతం వాటా విక్రయించాలన్నది సంస్థ లక్ష్యం. తద్వారా రూ.25,000 కోట్లు సమీకరించనుంది. దక్షిణ కొరియాకు చెందిన హ్యుందాయ్.. బ్యాటరీ ఈవీ, హైబ్రిడ్ ఈవీ, ప్లగ్–ఇన్ హైబ్రిడ్ ఈవీ, మైల్డ్ హైబ్రిడ్ ఈవీ, ఫ్యూయల్ సెల్ ఈవీలను తయారు చేస్తోంది. ఎలక్ట్రిక్ వెహికల్స్ వ్యాపారం కోసం కంపెనీ గతేడాది తమిళనాడులో రూ.20,000 కోట్ల పెట్టుబడిని ప్రకటించింది. చెన్నై ప్లాంటును ఈవీలు, ఎస్‌యూవీల తయారీ కేంద్రంగా తీర్చిదిద్దనున్నారు. -
రూ.16.8 లక్షల ఎస్‌యూవీని ఆవిష్కరించిన ప్రముఖ కంపెనీ
ప్రముఖ కార్ల తయారీ సంస్థ హ్యుందాయ్ మధ్యశ్రేణి ఎస్యూవీ క్రెటా ఎన్‌లైన్‌ను ఇటీవల ఆవిష్కరించింది. ప్రారంభ ధర రూ.16.82 లక్షలు(ఎక్స్‌షోరూం). ఎన్8, ఎన్10 వేరియంట్లలో ఇది లభించనుందని తెలిపింది. రూ.25,000తో బుకింగ్‌లను ప్రారంభించినట్లు కంపెనీ నిర్వాహకులు తెలిపారు. ఎన్‌లైన్ శ్రేణిలో ఇప్పటికే ఐ20 హ్యాచ్‌బ్యాక్, కాంపాక్ట్ ఎస్యూవీ వెన్యూ ఉన్నాయి. ఎన్ లైన్, ప్రామాణిక మోడల్ వాహనాల మధ్య డిజైన్‌లో పలు మార్పులుంటాయి. కొత్త 18 అంగుళాల డ్యూయల్ టోన్ అలాయ్‌వీల్స్, రెడ్ ఫ్రంట్, రేర్ బ్రేక్ కాలిపర్స్, గ్రిల్‌పై ఎన్ లైన్ బాడ్జింగ్ పలు డిజైన్ సంబంధిత మార్పులుంటాయి. ఎన్ లైన్ వినియోగదార్ల సగటు వయసు 36 ఏళ్లుగా ఉందని కంపెనీ సీఓఓ తరుణ్ గార్గ్ తెలిపారు. ఇదీ చదవండి: ఈ–స్కూటర్‌కు రూ.10,000 వరకు ఆర్థిక ప్రోత్సాహకం! -
సేల్స్ బీభత్సం.. భారత్‌లో ప్రతి 5 నిమిషాలకు అమ్ముడు పోయే కారు ఇదే!
భారత్‌లో ప్రముఖ తయారీ కార్ల తయారీ సంస్థ హ్యుందాయ్ మోటార్ ఇండియా లిమిటెడ్ (హెచ్ఎంఐఎల్) సరికొత్త రికార్డ్లను నమోదు చేసింది. దేశీయంగా హ్యుందాయ్ క్రెటా వన్ మిలియన్ అమ్మకాల మార్కును సాధించినట్లు తెలిపింది. 2015లో మార్కెట్‌కి పరిచయమైన క్రెటా కేవలం ఎనిమిదేళ్లలోనే ఈ ఘనత సాధించింది. ఈ సమయంలో, క్రెటా భారతదేశంలో అత్యధికంగా అమ్ముడైన మిడ్‌సైజ్ ఎస్‌యూవీగా కొనసాగుతోంది. ప్రతి 5 నిమిషాలకు ఒక క్రెటా అమ్ముడవుతోంది. ఈ సందర్భంగా సీఓఓ తరుణ్ గార్గ్ మాట్లాడుతూ..‘భారతీయ రోడ్లపై పది లక్షలకు పైగా క్రెటాతో బ్రాండ్ తన వారసత్వాన్ని కొనసాగిస్తుందని పునరుద్ఘాటించారు. ఇటీవల లాంచ్ చేసిన కొత్త క్రెటాకు కూడా అద్భుతమైన కస్టమర్ రెస్పాన్స్ వచ్చిందని, ప్రకటించినప్పటి నుండి 60 వేల బుకింగ్స్ ను దాటిందని తెలిపారు. దేశీయ మార్కెట్ అమ్మకాలతో పాటు, ఎగుమతి మార్కెట్లో కూడా 2.80 లక్షల యూనిట్లకు పైగా క్రెటా విక్రయించినట్లు వెల్లడించారు. -
ఎలక్ట్రిక్ వెర్షన్లో రానున్న హ్యుందాయ్ క్రెటా.. లాంచ్ ఎప్పుడంటే?
భారతీయ ఆటోమొబైల్ మార్కెట్ ఎలక్ట్రిక్ వాహన రంగంవైపు దూసుకెళ్తున్న సమయంలో హ్యుందాయ్ కంపెనీ దేశీయ విఫణిలో మరో ఎలక్ట్రిక్ కారుని విడుదల చేయడానికి సన్నద్ధమవుతోంది. ఇప్పటికే కంపెనీ విడుదల చేయనున్న ఈ లేటెస్ట్ మోడల్ టెస్టింగ్ కూడా మొదలైపోయింది. ఇంతకీ హ్యుందాయ్ కంపెనీ లాంచ్ చేయనున్న ఎలక్ట్రిక్ కారు ఏది? ఇండియన్ మార్కెట్లో ఎప్పుడు అరంగేట్రం చేయనుందనే మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. కోనా (Kona) ఎలక్ట్రిక్ కారుతో మంచి అమ్మకాలు పొందుతున్న హ్యుందాయ్ తన క్రెటా SUV ని కూడా ఎలక్ట్రిక్ రూపంలో విడుదల చేయడానికి సన్నద్ధమైపోయింది. ఈ ఎలక్ట్రిక్ కారు 2025 నాటికి మార్కెట్లో విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం. కాగా ఇప్పుడు ఎలాంటి క్యామోఫేజ్ లేకుండానే పలుమార్లు టెస్టింగ్ దశలో కనిపించింది. (ఇదీ చదవండి: ఆనంద్ మహీంద్రా గురించి ఆసక్తికర విషయాలు - డోంట్ మిస్!) దేశీయ విఫణిలో హ్యుందాయ్ క్రెటా ఎలక్ట్రిక్ కారు విడుదలైన తరువాత MG ZS EVకి ప్రధాన ప్రత్యర్థిగా ఉంటుంది. ఈ కొత్త ఎలక్ట్రిక్ కారు చూడటానికి సాధారణ క్రెటా మాదిరిగా కనిపించినప్పటికీ తప్పకుండా కొన్ని మార్పులు పొందనుంది. ఇందులో ఎటువంటి మార్పులు జరిగాయనేదానికి సంబంధించిన అధికారిక వివరాలు ఇంకా వెల్లడి కాలేదు. కానీ కోనా ఎలక్ట్రిక్ ఆధారంగా ఇది తయారయ్యే అవకాశం ఉందని, ఇది 400 కంటే ఎక్కువ కిమీ రేంజ్ అందిస్తుందని భావిస్తున్నారు. (ఇదీ చదవండి: ఒక్కసారిగా రూ. 171 తగ్గిన ఎల్పీజీ గ్యాస్ ధరలు.. కొత్త ధరలు ఎలా ఉన్నాయంటే?) హ్యుందాయ్ కంపెనీ అమ్మకాల్లో క్రెటా పాత్ర చాలా ప్రధానమైనది, కావున ఇది ఎలక్ట్రిక్ కారు రూపంలో విడుదలైతే మరిన్ని మంచి అమ్మకాలు పొందే అవకాశం ఉంటుంది. ఇలాంటి అప్డేటెడ్ న్యూస్ ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి సాక్షి బిజినెస్ చూస్తూ ఉండండి, ఈ కథనంపై మీ అభిప్రాయాలను, సలహాలను తప్పకుండా మాతో పంచుకోండి. -
2022లో మోస్ట్ పాపులర్ కారు, బైక్.. మీకు తెలుసా?
భారతదేశంలోని ప్రముఖ ఆటోమొబైల్ ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్ డ్రూమ్ “ఇండియా ఆటోమొబైల్ ఇకామర్స్ రిపోర్ట్ 2022” పేరుతో వార్షిక నివేదికను విడుదల చేసింది. ఈ నివేదికల ప్రకారం కార్ల విభాగంలో హ్యుందాయ్ క్రెటా, బైక్స్ విభాగంలో బజాజ్ పల్సర్ దేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన వాహనాలుగా గుర్తింపు పొందాయి. మన దేశంలో ప్యాసింజర్ వాహనాల అమ్మకాలు విపరీతంగా పెరుగుతున్నాయి. దీని కారణంగా ఇండియా ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆటోమొబైల్ మార్కెట్‌గా కీర్తి పొందగలిగింది. దేశంలో ప్రస్తుతం కొరియన్ కంపెనీ కార్ల హవా జోరుగా సాగుతోంది. 2022లో ఎక్కువ అమ్మకాలు పొందిన, ఎక్కువమంది కొనుగోలుదారుల మనసుదోచిన కారుగా క్రెటా నిలిచింది. ఆ తరువాత స్థానంలో మారుతి సుజుకి బ్రెజ్జా, ఇన్నోవా క్రిస్టా నిలిచాయి. 2022లో లగ్జరీ కార్ల విభాగంలో మెర్సిడెస్ బెంజ్ ఈ-క్లాస్ ఎక్కువ ప్రజాదరణ పొందిన కారుగా గుర్తింపు పొందగా, తరువాత స్థానంలో జీప్ కంపాస్, బెంజ్ సీ క్లాస్, బీఎండబ్ల్యూ5 సిరీస్ చేరాయి. ద్విచక్ర వాహన విభాగంలో బజాజ్ పల్సర్ ఎక్కువ ప్రజాదరణ పొందిన బైకుగా మొదటి స్థానంలో నిలిచి రికార్డ్ బద్దలు కొట్టింది. ఆ తరువాత స్థానాల్లో హీరో స్ప్లెండర్ ప్లస్, బజాజ్ పల్సర్ ఎన్ఎస్, టీవీఎస్ అపాచీ ఆర్టీఆర్, హోండా సీబీ షైన్ వంటివి నిలిచాయి. లగ్జరీ బైక్స్ సెగ్మెంట్లో రాయల్ ఎన్ఫీల్డ్ ఇంటర్‌సెప్టర్, హార్లీ డేవిడ్సన్ స్ట్రీట్ 750, కవాసాకీ నింజా జెడ్ఎక్స్-10ఆర్ వంటివి ఎక్కువ అమ్మకాలు పొందినట్లు నివేదికల ద్వారా తెలిసింది. -
ఎగుమతుల్లో హ్యుందాయ్ సంచలనం
ఆటోమొబైల్ రంగంలో హ్యుందాయ్ క్రెటా సంచలనం సృష్టించింది. భారత్ నుంచి ఒక ఏడాదిలో రికార్డు స్థాయి యూనిట్ల ఎగుమతితో సరికొత్త రికార్డు నెలకొల్పింది. హ్యుందాయ్ క్రెటా 2021కిగానూ మోస్ట్ ఎక్స్‌పోర్టెడ్ ఎస్యూవీ ఘనత దక్కించుకుంది. అంతకు ముందు ఏడాదితో పోలిస్తే పెరుగుదల 26.17 శాతం నమోదు కావడం విశేషం. మొత్తం 32, 799 యూనిట్లు ఓవర్సీస్కి ఎగుమతి అయ్యాయి. 2020లో యూనిట్ల సంఖ్య 25,995 యూనిట్లుగా ఉంది. ఇక 2021లో హ్యుందాయ్ మోటార్ ఇండియా మొత్తంగా 42, 238 ఎస్‌యూవీల ఎగుమతితో సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. ఇందులో క్రెటా గ్రాండ్తో పాటు వెన్యూ మోడల్స్ కూడా ఉన్నాయి. వెన్యూ 7,698 యూనిట్లు, క్రెటా గ్రాండ్ 1,741 యూనిట్లు ఎగుమతి అయ్యాయి. క్రెటా, ఐ20, వెర్నా, అల్కాజర్ మోడల్స్‌ను ఎంపిక చేసిన మార్కెట్లలోకి వదిలింది హ్యుందాయ్ ఇండియా. సౌతాఫ్రికాతో పాటు పెరూ, డొమినికా రిపబ్లికా, చాద్, ఘనా, లావోస్‌కు సైతం ఎన్ లైన్, ఎల్పీజీ వేరియెంట్లను ఎగుమతి చేసింది. -
SUV: గేర్ మార్చిన మారుతి.. వేగం పెంచిన టాటా
ముంబై: దేశీయంగా స్పోర్ట్ యుటిలిటీ వాహనాలకు (ఎస్యూవీ) డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో కార్ల తయారీ దిగ్గజాలు ఈ విభాగంపై ప్రత్యేకంగా దృష్టి పెడుతున్నాయి. ప్రస్తుతం కొరియన్ దిగ్గజం హ్యుందాయ్ ఆధిపత్యం ఉన్న ఈ సెగ్మెంట్లో తమ మార్కెట్ వాటాను మరింత పెంచుకునేందుకు మారుతీ సుజుకీ, టాటా మోటార్స్ వంటి సంస్థలు వ్యూహాలు రచిస్తున్నాయి. మారుతీ సుజుకీ (ఎంఎస్ఐఎల్) కొత్తగా పలు ఎస్‌యూవీలను ఆవిష్కరించేందుకు సన్నాహాలు చేసుకుంటోంది. ఇందులో భాగంగా కొత్త హంగులతో సరికొత్త బ్రెజాను ఆవిష్కరించే ప్రయత్నాల్లో కంపెనీ ఉన్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఆ తర్వాత మరో మూడు కార్లను ఆవిష్కరించవచ్చని పేర్కొన్నాయి. వీటిలో ఒకటి బ్రెజాకు ప్రత్యామ్నాయ ప్రీమియం కాంపాక్ట్ ఎస్యూవీ ఉండవచ్చని వివరించాయి. టాటా మోటర్స్ కూడా ఈ సెగ్మెంట్లో దూకుడు పెంచుతోంది. 2020లో కంపెనీ ఉత్పత్తుల పోర్ట్‌ఫోలియోలో ఎస్‌యూవీల వాటా 37 శాతంగా ఉండగా 2021లో ఇది 52 శాతానికి పెరిగింది. ఇక అక్టోబర్‌లో నెక్సాన్, పంచ్ మోడల్స్ భారీగా అమ్ముడవడంతో (రెండూ కలిపి 18,549 వాహనాలు) ఎస్యూవీ మార్కెట్లో అగ్ర స్థానం కూడా దక్కించుకుంది. పుష్కలంగా నిధులు ఉండటం, కొత్త ఆవిష్కరణలపై మరింతగా దృష్టి పెడుతుండటం ఎస్యూవీ సెగ్మెంట్లో టాటా మోటార్స్‌కు సానుకూలాంశాలని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. వాహన విక్రయాల్లో 38 శాతం వాటా.. వాహన విక్రయాల్లో ఎస్‌యూవీల వాటా గత కొన్నాళ్లుగా గణనీయంగా పెరిగింది. 2016లో మొత్తం వాహన విక్రయాల్లో ప్యాసింజర్ వాహనాల వాటా 51 శాతంగాను, ఎస్‌యూవీల వాటా 16 శాతంగాను నమోదైంది. అదే 2021కి వచ్చేసరికి ఎస్‌యూవీల వాటా 38 శాతానికి ఎగిసింది. హ్యాచ్‌బ్యాక్ సెగ్మెంట్‌కు (40 శాతం వాటా) ఇది దాదాపు సరిసమానం కావడం గమనార్హం. 2020లో ఎస్‌యూవీల మార్కెట్ వాటా 29 శాతంగా ఉంది. ఇంత వేగంగా వృద్ధి చెందుతున్నందునే ఈ విభాగంపై కంపెనీలు ప్రత్యేకంగా దృష్టి పెడుతున్నాయి. గత మూడేళ్లలో 50 పైగా కొత్త మోడల్స్‌ను లాంచ్ చేశాయి. వీటిల్లో హ్యుందాయ్‌కి చెందిన క్రెటా అత్యధికంగా 1,25,437 యూనిట్లు అమ్ముడై బెస్ట్ సెల్లర్‌గా నిల్చింది. వ్యూహరచనలో మారుతీ .. ఎస్యూవీ విభాగంలో పోటీ తీవ్రతరమవుతుండటంతో మారుతీ సుజుకీ వృద్ధి అవకాశాలపైనా ప్రభావం పడుతోంది. లాభదాయకత అధికంగా ఉండే ఈ విభాగంలో కంపెనీకి పెద్ద స్థాయిలో మోడల్స్ లేకపోవడం ప్రతికూలంగా ఉంటోంది. విటారా బ్రెజా, ఎస్–క్రాస్ మినహా స్పోర్ట్ యుటిలిటీ విభాగంలో.. ముఖ్యంగా మిడ్–ఎస్యూవీ సెగ్మెంట్లో కంపెనీకి మరే ఇతర మోడల్స్ లేవని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. ఎంట్రీ స్థాయి ఎస్యూవీ మోడల్స్‌లో బ్రెజా దాదాపు అగ్రస్థానంలో కొనసాగుతున్నప్పటికీ, బోలెడన్ని కొత్త మోడల్స్‌తో తీవ్ర పోటీ ఉన్న మధ్య స్థాయి ఎస్యూవీ విభాగంపై మరింతగా దృష్టి పెట్టాల్సి ఉందని మారుతీ వర్గాలు తెలిపాయి. కాంపాక్ట్ ఎస్‌యూవీల వైపు కస్టమర్లు మొగ్గు చూపుతుండటంతో ప్యాసింజర్ వాహనాల విభాగంలో మారుతీ దాదాపు 540 బేసిస్ పాయింట్ల మేర మార్కెట్ వాటా కోల్పోయిందని విశ్లేషకులు తెలిపారు. ఈ నేపథ్యంలోనే మారుతీ తన వ్యూహాలకు మరింతగా పదును పెడుతోందని వివరించారు. పెద్ద పరిమాణంలో ఉత్పత్తి చేయగలగడం, కొత్త ఉత్పత్తులను తయారు చేసేందుకు కావాల్సిన స్థాయిలో నిధులు, సాంకేతికత మొదలైనవన్నీ చేతిలో ఉండటం మారుతీకి సానుకూలాంశాలని పేర్కొన్నారు. హ్యుందాయ్ ఆధిపత్యం.. స్పోర్ట్ యుటిలిటీ వాహనాల విభాగంలో హ్యుందాయ్ అగ్రస్థానంలో కొనసాగుతోంది. కంపెనీ వాహన విక్రయాల్లో సగభాగం దీన్నుంచే ఉంటోంది. ఇప్పటికే వెన్యూ, క్రెటా, అల్కజర్, టక్సన్, కోనా ఈవీ అనే అయిదు వాహనాలతో హ్యుందాయ్ ఆధిపత్యం చెలాయిస్తోంది. వీటికి తోడుగా టక్సన్‌లో ప్రీమియం వెర్షన్‌ను, మరో ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని ప్రవేశపెట్టేందుకు కంపెనీ కసరత్తు చేస్తోంది. ఫ్రంట్ రూఫ్, కనెక్టెడ్ కార్లు, వాహనంలో మరింత స్థలం, సౌకర్యాలు కల్పించడంపై ప్రధానంగా దృష్టి పెడుతున్నట్లు హ్యుందయ్ ఇండియా వర్గాలు తెలిపాయి. గత కొన్నాళ్లుగా పలు ఎస్‌యూవీలు వచ్చినప్పటికీ క్రెటా తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తోందని వివరించాయి. హ్యుందాయ్ గ్రూప్‌లో భాగమైన కియా కూడా ఇటీవలే టాప్ 5 ఆటోమొబైల్ సంస్థల లిస్టులోకి చేరింది. సెల్టోస్, సోనెట్ మోడల్స్ ఇందుకు తోడ్పడ్డాయి. కియా ఎస్యూవీ సెగ్మెంట్‌పైనే దృష్టి పెడుతోంది. సెడాన్, హ్యాచ్‌బ్యాక్ విభాగంలోకి ప్రవేశించే యోచన లేదనేది కంపెనీ వర్గాల మాట. చదవండి: ఎలక్ట్రిక్ కార్ల అమ్మకాల్లో దుమ్ములేపుతున్న టాటా మోటార్స్..! -
హ్యుందాయ్ కెట్రాలో కొత్త మోడల్... తగ్గిన ధర
ఇండియా ఆటోమొబైల్ సెక్టార్లో స్పొర్ట్ప్ యూటిలిటీ వెహికల్ సెగ్మెంట్లో గట్టి పోటీ నెలకొంది. ఈ పోటీని తట్టుకునేందుకు కొత్త ఫీచర్లను జోడిస్తునే ధర తగ్గించి సంచలన నిర్ణయం తీసుకుంది హ్యుందాయ్. అధునాతన ఫీచర్లు, తక్కువ ధరతో క్రెటా ఎస్ఎక్స్ ఎగ్జిక్యూటివ్ వేరియంట్‌ను సైలెంట్‌గా మార్కెట్లోకి తెచ్చింది. క్రెటా ఎగ్జిక్యూటివ్ ఎంట్రీ లెవల్ ఎస్యూవీ మార్కెట్లో తిరుగులేదని ఆధిపత్యం చలాయిస్తోంది హ్యుందాయ్ క్రెటా మోడల్. క్రెటా ఎస్, హైఎండ్‌లో క్రెటా ఎస్ఎక్స్ వేరియంట్ల అమ్మకాలు జోరుమీదున్నాయి. అయితే ఇతర కంపెనీల నుంచి పోటీ ఎక్కువ కావడంతో మార్కెటింగ్ స్ట్రాటజీని మార్చింది హ్యుందాయ్. క్రెటా ఎస్, కెట్రా ఎస్ఎక్స్ వేరియంట్ల కలయికతో క్రెటా ఎస్ఎక్స్ ఎగ్జిక్యూటివ్‌ని హంగు ఆర్భాటం లేకుండా ప్రవేశపెట్టింది. పైగా క్రెటా ఎస్‌ఎక్స్‌తో పోల్చితే ఎస్ఎక్స్ ఎగ్జిక్యూటివ్ కారు ఎక్స్ షోరూం ధరలో రూ. 78,000 తక్కువకే ఇది లభిస్తోంది. లేటెస్ట్ ఫీచర్స్ క్రెటా ఎస్ఎక్స్ ఎగ్జిక్యూటివ్ వేరియంట్లో యాంటెన్నా, స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్, బ్లూటూత్ మైక్, యూఎస్బీ పోర్టులు వంటి ఫీచర్లు అందించింది. అయితే మ్యూజిక్ సిస్టమ్‌ని ఇన్‌బిల్ట్‌గా కాకుండా యాక్సెసరీగా అందివ్వనుంది. మరోవైపు ఎస్ఎక్స్ వేరియంట్లలో ఉన్న డోర్ హ్యాండిల్ క్రోమ్, రియర్ వ్యూ మానిటర్, వాయిస్ కంట్రోల్ సిస్టమ్, బర్గ్లర్ అలారమ్ వంటి ఫీచర్లు ఎగ్జిక్యూటివ్‌లో లేవు. అయితే ఎక్కువ మంది ఇష్టపడే సన్‌రూఫ్, వైర్లెస్ సేవలు అందించే యాపిల్ కార్ప్లే, ఆండ్రాయిడ్ వంటి ఆటో ఫీచర్లు అందించింది. క్రెటా ఎస్ఎక్స్ ఎగ్జిక్యూటివ్ వేరియంట్లో 1.5 లీటర్ పెట్రోలు / డీజిల్ ఇంజన్ అమర్చారు. చదవండి: ఎలక్ట్రిక్ వాహన ప్రియులకు గుజరాత్ ప్రభుత్వం గుడ్ న్యూస్ -
ఆల్న్యూ క్రెటా అమ్మకాల జోరు
సాక్షి, ముంబై: గడిచిన ఏడాది కాలంలో తన పాపులర్ ఎస్యూవీ ఆల్-న్యూ ‘క్రెటా’ వాహనాలు 1.21 లక్షలు అమ్ముడైనట్లు హ్యుందాయ్ మోటార్స్ కంపెనీ తెలిపింది. సరికొత్త వెర్షన్లో ఆల్–న్యూ క్రెటా కిందటేడాది మార్చిలో విడుదలైంది. ఈ మోడల్ దేశంలో కంపెనీ ఎస్యూవీ విభాగానికి తలమానికంగా నిలిచింది. భారత ఆటో పరిశ్రమలో ఒక ఏడాదిలో అత్యధికంగా అమ్ముడైన ఎస్‌యూవీగా ఆల్-న్యూ క్రెటా రికార్డును నమోదు చేసినట్లు హ్యుందాయ్ డైరెక్టర్ తరుణ్ గార్గ్ తెలిపారు. మన్నికైన తయారీ, ఆకర్షణీయమైన ఫీచర్లను కలిగిన మోడళ్లను కస్టమర్లు ఎల్లప్పుడూ ఆదరిస్తారనేందుకు క్రెటా విక్రయాలే నిదర్శనమని గార్గ్ పేర్కొన్నారు. ఇక 2015 జూలైలో విడుదలైన క్రెటా కార్ల అమ్మకాలు ఇప్పటి వరకు భారత్‌లో 5.8 లక్షలు, అంతర్జాతీయ మార్కెట్లో 2.16 లక్షలకు చేరుకున్నాయి. -
లాక్డౌన్లో హ్యుందాయ్ క్రెటా రికార్డు
సాక్షి,ముంబై: హ్యుందాయ్ మోటార్ ఇండియా లిమిటెడ్ (హెచ్ఎంఐఎల్)కు చెందిన ప్రముఖకారు క్రెటా కొత్త వెర్షన్ బుకింగ్‌లలో దూసుకుపోతోంది. ఈ ఏడాది మార్చిలో లాంచ్ చేసిన క్రెటా వెర్షన్ కారు రికార్డు స్థాయి బుకింగ్‌లను సాధించి మార్కెట్ లీడర్‌గా నిలిచింది. క్రెటా కొత్త వెర్షన్‌కు 55 వేల బుకింగ్‌లు వచ్చాయని కంపెనీ బుధవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపింది. (హ్యుందాయ్ క్రెటా @ రూ. 9.9 లక్షలు) 2020 మే-జూన్ నెలల్లో అత్యధిక అమ్మకాలను సాధించి ఎస్యూవీ విభాగంలో టాప్‌లో ఉందని హెచ్ఎంఐఎల్ తెలిపింది. 2015 లో ప్రారంభించినప్పటి నుంచి ఇండస్ట్రీలో బెంచ్ మార్క్‌గా నిలిచిందనీ, ఇది 4.85 లక్షలకు పైగా విలువైన కస్టమర్లను సాధించిందని హెచ్ఎంఐఎల్ డైరెక్టర్ (సేల్స్, మార్కెటింగ్ అండ్ సర్వీస్) తరుణ్ గార్గ్ చెప్పారు. కొత్త వెర్షన్ ద్వారా కంపెనీ మరోసారి ఈ విభాగంలో ఎస్యూవీ విభాగంలో తన ఆధిపత్యాన్ని నెలకొల్పిందన్నారు. కేవలం నాలుగు నెలల్లో 55,000 బుకింగ్‌లు, 20,000 మందికి పైగా కస్టమర్లను సాధించిందన్నారు. ఈ కష్టకాలంలో కూడా భారతదేశం అంతటా ఆదరణకు నోచుకోవడం తమ ఎస్యూవీ పనితీరుకు నిదర్శనమని గార్గ్ వెల్లడించారు. 1.5 లీటర్ డీజిల్ ఇంజన్, 1.5 లీటర్ పెట్రోల్ ఇంజన్, 1.4 లీటర్ జిడిఐ టర్బో పెట్రోల్ ఇంజన్ ఆప్షన్లలో హ్యుందాయ్ క్రెటా 2020 మార్కెట్లో అందుబాటులో ఉన్న సంగతి తెలిసిందే. (మారుతికి షాక్ : టాప్ సెల్లింగ్ కార్ ఇదే!) -
మారుతికి షాక్ : టాప్ సెల్లింగ్ కార్ ఇదే!
సాక్షి, ముంబై : భారతదేశపు అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకికి హ్యుందాయ్ షాకిచ్చింది. హ్యుందాయ్ క్రెటా అత్యధికంగా అమ్ముడైన కారుగా నిలచింది. దీంతో ఇప్పటిదాకా ఈ జాబితాలో టాప్ లో నిలిచిన మారుతిని వెనక్కి నెట్టివేసింది. 2020 మేలో అత్యధికంగా అమ్ముడైన కారుగా హ్యుందాయ్ క్రెటా స్థానాన్ని దక్కించుకుంది. (వాహన అమ్మకాలు రివర్స్‌గేర్‌లోనే..) హ్యుందాయ్ కొత్తగా ప్రారంభించిన క్రెటా 2020, మే నెలలో 3212 యూనిట్ల విక్రయాలతో భారతదేశంలో అత్యధికంగా అమ్ముడైన కారుగా అవతరించింది. కాగా మారుతి సుజుకి ఎర్టిగా (ఎంపీవీ) రెండవ స్థానంలో నిలిచింది. అయితే అమ్మకాల పరంగా ఆల్టో, డిజైర్ , స్విఫ్ట్ వంటి మోడళ్లతో పోలిస్తే ఎర్టిగా ఎక్కువ ఆదరణను నోచుకుంది. (మారుతి కూడా : బై నౌ.. పే లేటర్) కాగా కరోనా వైరస్, లాక్ డౌన్ కారణంగా ఆటో మొబైల్ పరిశ్రమ అమ్మకాలు పూర్తిగా పడిపోయి కుదేలైన సంగతి తెలిసిందే. సడలించిన నిబంధనలతో తిరిగి కార్యక్రమాలను ప్రారంభించినప్పటికీ విక్రయాలు ఇంకా వేగం పుంజుకోలేదు. ఈ క్రమంలోనే మారుతీ సుజుకీ విక్రయాల్లో ఏకంగా 89శాతం తగ్గుదల నమోదైంది. గతేడాది మే నెల 1,25,552 యూనిట్ల విక్రయాలతో పోలిస్తే గత నెలలో 13,888 యూనిట్లను మాత్రమే విక్రయించింది. -
హ్యుందాయ్ క్రెటా @ రూ. 9.9 లక్షలు
న్యూఢిల్లీ: ప్రముఖ వాహన తయారీ కంపెనీ హ్యుందాయ్ మోటార్ ఇండియా (హెచ్ఎంఐఎల్) తాజాగా తన పాపులర్ ఎస్యూవీ ‘క్రెటా’ కారులో అధునాతన వెర్షన్‌ను సోమవారం మార్కెట్లో ప్రవేశపెట్టింది. పెట్రోల్, డీజిల్ వెర్షన్లలో అందుబాటులోకి వచ్చిన ఈ నూతన కారు ధరల శ్రేణి రూ. 9.9 లక్షలు – 17.2 లక్షలుగా కంపెనీ ప్రకటించింది. ఈ సందర్భంగా కంపెనీ ఇండియా ఎండీ, సీఈఓ ఎస్ ఎస్ కిమ్ మాట్లాడుతూ.. ‘ఈ విభాగంలోని లోపాలను అధిగమించి, అత్యాధునిక వాహనాన్ని మార్కెట్లోకి తీసుకుని రావడం కోసం చాలా జాగ్రత్తగా అధ్యయనం చేశాం. సాధ్యాసాధ్యాలను పరిశీలించి కొత్త మోడల్ అందుబాటులో ఉంచాం. ఇక మల్టీ–సీటర్ హై ఆక్యుపెన్సీ వెహికల్ తయారీలో పట్టు సాధించడంలో భాగంగా త్వరలోనే మల్టీ–పర్పస్ వెహికల్ (ఎంపీవీ)ని తీసుకురావాలని యోచిస్తున్నాం’ అని వెల్లడించారు. -
హాట్ ఇంటీరియర్స్‌తో ఆల్ న్యూ హ్యుందాయ్ క్రెటా..
సాక్షి, న్యూఢిల్లీ : ఈనెలలో భారత్‌లో లాంఛ్ కానున్న ఆల్ న్యూ హ్యుందాయ్ క్రెటా ఇంటీరియర్స్‌ను కంపెనీ వెల్లడించింది. మరో వారంలో లాంచింగ్‌కు సిద్ధమైన వాహనాన్ని ఆఫ్‌లైన్‌తో పాటు ఆన్‌లైన్‌లోనూ రూ 25,000 చెల్లించి బుక్ చేసుకోవచ్చు. భిన్న ఇంజన్, గేర్‌బాక్స్ కాంబినేషన్‌తో కూడిన న్యూ హ్యుందాయ్ క్రెటా ఈ, ఈఎక్స్, ఎస్, ఎస్ఎక్స్, ఎస్ఎక్స్ (ఓ) విభాగాల్లో లభిస్తోంది. న్యూ హ్యుందాయ్ క్రెటా నలుపు మరియు లేత గోధుమరంగు రంగులతో సరికొత్త డ్యూయల్-టోన్ క్యాబిన్‌తో ఆకర్షణీయంగా రూపొందింది. ఎయిర్-కాన్ వెంట్స్, డోర్ హ్యాండిల్స్ చుట్టూ సొగసైన క్రోమ్ ఇన్సర్ట్లు ఉన్నాయి. తొలిసారి హ్యుందాయ్ క్రెటాకు ఫ్లాట్-బాటమ్ స్టీరింగ్ వీల్ లభిస్తోంది.ఇంకా ప్రత్యేకతల విషయానికి వస్తే రిమోట్ ఇంజిన్ స్టార్ట్, రియర్ సీట్ హెడ్రెస్ట్ కుషన్, బోస్ సౌండ్ సిస్టమ్ మరియు రెండు-దశల వెనుక సీటు రిక్లైనింగ్ ఫంక్షన్‌తో అందుబాటులోకి రానుంది. రెండవ తరం హ్యుందాయ్ క్రెటా ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ కోసం 7 అంగుళాల డిస్ప్లేతో,10.25-అంగుళాల సమాంతర టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, బ్లూలింక్ స్మార్ట్‌వాచ్ యాప్, పనోరమిక్ సన్‌రూఫ్, వెంటిలేటెడ్ సీట్లు, ఎలక్ట్రిక్ పార్కింగ్ బ్రేక్, యాంబియంట్ లైటింగ్ టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ (టిపిఎంఎస్), రియర్ వ్యూ మానిటర్ వంటి ఫీచర్లతో రూపొందింది. బీఎస్ 6 ప్రమాణాలతో ఆల్ న్యూ హ్యుందాయ్ క్రెటా కస్టమర్ల ముందుకు రానుంది. చదవండి : ఆటో ఎక్స్పో: కార్ల జిగేల్.. జిగేల్ -
హ్యుందాయ్ క్రెటా విక్రయాల జోరు
న్యూఢిల్లీ: ప్రముఖ వాహన తయారీ కంపెనీ ‘హుల్యందాయ్ మోటార్ ఇండియా’.. తన పాపులర్ ఎస్యూవీ ‘క్రెటా’ విక్రయాలు 5 లక్షల మైలురాయిని దాటినట్లు ప్రకటించింది. 2015 జూలైలో విడుదలైన ఈకారు అమ్మకాలు ఇప్పటివరకు భారత్‌లో 3.7 లక్షలు, అంతర్జాతీయ మార్కెట్లో 1.4 లక్షలకు చేరుకున్నాయి. బుధవారం నాటికి మొత్తంగా 5 లక్షలుగా నమోదయ్యాయి. కారు మార్కెట్లోకి విడుదలైన నాలుగేళ్లలోనే ఈ స్థాయి అమ్మకాలు నమోదయ్యాయని సేల్స్ హెడ్ వికాస్ జైన్ అన్నారు. -
మార్కెట్లోకి హ్యుందాయ్ క్రెటా ఏటీ వేరియంట్
న్యూఢిల్లీ: ప్రముఖ వాహన కంపెనీ హ్యుందాయ్ మోటార్ ఇండియా తన కాంపాక్ట్ ఎస్యూవీ ‘క్రెటా’లో కొత్తగా ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ పెట్రోల్ ఆప్షన్ వేరియంట్‌ను మార్కెట్లోకి తీసుకువచ్చింది. దీని ధర రూ.12.87 లక్షలు (ఎక్స్ షోరూమ్ ఢిల్లీ). ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్స్, రియర్ పార్కింగ్ కెమెరా, సెన్సార్స్, స్మార్ట్కీ వంటి తదితర ప్రత్యేకతలు ఉన్నట్లు కంపెనీ తెలిపింది. కాగా హ్యుందాయ్ ఇప్పటికే డీజిల్ ఆప్షన్లో ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ వేరియంట్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది. దీని ధర రూ.14.5 లక్షలుగా (ఎక్స్ షోరూమ్ ఢిల్లీ) ఉంది. కంపెనీ అలాగే అన్ని క్రెటా వేరియంట్లలోనూ డ్యూయెల్ ఎయిర్ బ్యాగ్స్ ఫీచర్‌ను ప్రవేశపెట్టింది.