సాక్షి, ముంబై : భారతదేశపు అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకికి హ్యుందాయ్ షాకిచ్చింది. హ్యుందాయ్ క్రెటా అత్యధికంగా అమ్ముడైన కారుగా నిలచింది. దీంతో ఇప్పటిదాకా ఈ జాబితాలో టాప్ లో నిలిచిన మారుతిని వెనక్కి నెట్టివేసింది. 2020 మేలో అత్యధికంగా అమ్ముడైన కారుగా హ్యుందాయ్ క్రెటా స్థానాన్ని దక్కించుకుంది. (వాహన అమ్మకాలు రివర్స్‌గేర్‌లోనే..)
హ్యుందాయ్ కొత్తగా ప్రారంభించిన క్రెటా 2020, మే నెలలో 3212 యూనిట్ల విక్రయాలతో భారతదేశంలో అత్యధికంగా అమ్ముడైన కారుగా అవతరించింది. కాగా మారుతి సుజుకి ఎర్టిగా (ఎంపీవీ) రెండవ స్థానంలో నిలిచింది. అయితే అమ్మకాల పరంగా ఆల్టో, డిజైర్ , స్విఫ్ట్ వంటి మోడళ్లతో పోలిస్తే ఎర్టిగా ఎక్కువ ఆదరణను నోచుకుంది. (మారుతి కూడా : బై నౌ.. పే లేటర్)
కాగా కరోనా వైరస్, లాక్ డౌన్ కారణంగా ఆటో మొబైల్ పరిశ్రమ అమ్మకాలు పూర్తిగా పడిపోయి కుదేలైన సంగతి తెలిసిందే. సడలించిన నిబంధనలతో తిరిగి కార్యక్రమాలను ప్రారంభించినప్పటికీ విక్రయాలు ఇంకా వేగం పుంజుకోలేదు. ఈ క్రమంలోనే మారుతీ సుజుకీ విక్రయాల్లో ఏకంగా 89శాతం తగ్గుదల నమోదైంది. గతేడాది మే నెల 1,25,552 యూనిట్ల విక్రయాలతో పోలిస్తే గత నెలలో 13,888 యూనిట్లను మాత్రమే విక్రయించింది.
Comments
Please login to add a commentAdd a comment