
ప్రముఖ కార్ల తయారీ సంస్థ హ్యుందాయ్ మధ్యశ్రేణి ఎస్‌యూవీ క్రెటా ఎన్‌లైన్‌ను ఇటీవల ఆవిష్కరించింది. ప్రారంభ ధర రూ.16.82 లక్షలు(ఎక్స్‌షోరూం). ఎన్8, ఎన్10 వేరియంట్లలో ఇది లభించనుందని తెలిపింది. రూ.25,000తో బుకింగ్‌లను ప్రారంభించినట్లు కంపెనీ నిర్వాహకులు తెలిపారు.
ఎన్‌లైన్ శ్రేణిలో ఇప్పటికే ఐ20 హ్యాచ్‌బ్యాక్, కాంపాక్ట్ ఎస్‌యూవీ వెన్యూ ఉన్నాయి. ఎన్ లైన్, ప్రామాణిక మోడల్ వాహనాల మధ్య డిజైన్‌లో పలు మార్పులుంటాయి. కొత్త 18 అంగుళాల డ్యూయల్ టోన్ అలాయ్‌వీల్స్, రెడ్ ఫ్రంట్, రేర్ బ్రేక్ కాలిపర్స్, గ్రిల్‌పై ఎన్ లైన్ బాడ్జింగ్ పలు డిజైన్ సంబంధిత మార్పులుంటాయి. ఎన్ లైన్ వినియోగదార్ల సగటు వయసు 36 ఏళ్లుగా ఉందని కంపెనీ సీఓఓ తరుణ్ గార్గ్ తెలిపారు.
ఇదీ చదవండి: ఈ–స్కూటర్‌కు రూ.10,000 వరకు ఆర్థిక ప్రోత్సాహకం!
Comments
Please login to add a commentAdd a comment