SUV cars
-
బుల్లి ఎస్‌యూవీలు.. భలే జోరు!
దేశంలో స్పోర్ట్స్ యుటిలిటీ వెహికల్స్ (ఎస్‌యూవీల) క్రేజ్ ఓ రేంజ్లో ఉంది! ఒకపక్క, కార్ల అమ్మకాల్లో మందగమనం నెలకొన్నప్పటికీ.. మైక్రో ఎస్‌యూవీలు మాత్రం దుమ్మురేపుతున్నాయి. కస్టమర్లు చిన్న కార్లు/ హ్యాచ్‌బ్యాక్‌ల నుంచి అప్‌గ్రేడ్ అవుతుండటంలో వాటి సేల్స్ అంతకంతకూ తగ్గుముఖం పడుతున్నాయి. మరోపక్క, చిన్న ఎస్‌యూవీల సెగ్మెంట్ తగ్గేదేలే అంటూ టాప్ గేర్‌లో దూసుకుపోతోంది! – సాక్షి, బిజినెస్ డెస్క్గత కొంతకాలంగా దేశంలో ప్యాసింజర్ కార్ల అమ్మకాలు స్లో ట్రాక్‌లో వెళ్తున్నాయి. డీలర్ల వద్ద నిల్వలు పేరుకుపోతుండటంతో కంపెనీలు భారీ డిస్కౌంట్లు ప్రకటిస్తూ వాటిని ఎలాగైనా వదిలించుకునేందుకు నానాతిప్పలు పడాల్సి వస్తోంది. అయితే, చిన్న ఎస్‌యూవీలు దీనికి మినహాయింపు. హాట్ కేకుల్లా సేల్ అవుతూ దేశీ మార్కెట్లో అవి భారీ వాటాను కొల్లగొడుతున్నాయి. రూ.10 లక్షల వరకు ధర ఉన్న మైక్రో ఎస్‌యూవీలకు డిమాండ్ ఓ రేంజ్లో ఉంది. ముఖ్యంగా హ్యుందాయ్ ఎక్స్టర్, టాటా పంచ్ ఈ సెగ్మెంట్లో టాప్ లేపుతున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరం తొలి నాలుగు నెలల్లో (2024–25, ఏప్రిల్–జూలై) వీటి అమ్మకాలు 72 శాతం దూసుకెళ్లగా... మొత్తం దేశీయ ప్యాసింజర్ వాహన విక్రయాల్లో కేవలం 1.8 శాతం వృద్ధి మాత్రమే నమోదు కావడం దీనికి నిదర్శనం. ఈ నాలుగు నెలల్లో 1,75,350 (11 శాతం వృద్ధి) చిన్న ఎస్‌యూవీలు అమ్ముడవడం విశేషం. మరోపక్క, చిన్నకార్లు/హ్యాచ్బ్యాక్స్ సేల్స్‌లో 17 శాతం (69,936 యూనిట్లు) తగ్గుదల నమోదైంది. చిన్న ఎస్‌యూవీల కేటగిరీలోకి ఎక్స్టర్, పంచ్‌తో పాటు కాంపాక్ట్ మోడల్స్ అయిన మారుతీ బ్రెజా, హ్యుందాయ్ వెన్యూ, టాటా నెక్సాన్ ఎంట్రీ వేరియంట్లు ఉంటాయి. క్యూ కడుతున్న కంపెనీలు... ఈ సెగ్మెంట్ శరవేగంగా దూసుకుపోతుండటంతో ఇతర కార్ల దిగ్గజాలు సైతం ఇందులోకి అడుగుపెట్టేందుకు తహతహలాడుతున్నాయి. కియా మోటార్స్ తన తొలి మైక్రో ఎస్యూవీ ‘క్లావియా’ను తీసుకొచ్చే ప్లాన్‌లో ఉండగా.. హ్యుందాయ్ మరో కాంపాక్ట్ ఎస్యూవీ ‘బేయాన్’తో మార్కెట్ షేర్‌ను మరింత పెంచుకోవాలనుకుంటోంది. మారుతీ సుజుకీ ఫ్రాంక్స్‌తో ఈ విభాగంలో పోటీ పడుతోంది. ఇక ఫోక్స్‌వ్యాగన్ గ్రూప్ కంపెనీ స్కోడా సైతం వచ్చే ఏడాది ఆరంభంలో తొలి కాంపాక్ట్ ఎస్యూవీ కైలాక్‌ను ప్రవేశపెట్టడం ద్వారా ఈ సెగ్మెంట్లోకి దూకనుంది. ప్రస్తుతం మైక్రో ఎస్‌యూవీల విభాగంలో పంచ్, ఎక్స్టర్ హవా కొనసాగుతుండటంతో మారుతీ కూడా ఈ విభాగంపై కన్నేసింది. కాంపాక్ట్ ఎస్యూవీ బ్రెజా కంటే తక్కువ ధరలో ప్రత్యేకంగా కొత్త మోడల్‌ను మారుతీ రూపొందిస్తోందని, రెండేళ్లలో రోడ్డెక్కనున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.మారుతున్న ట్రెండ్... హ్యాచ్బ్యాక్స్, సెడాన్ కార్లతో పోలిస్తే మరింత విశాలమైన స్పేస్, దృఢమైన రూపంతో ఆకర్షణీయంగా ఉండటంతో దేశంలో ఎస్‌యూవీల క్రేజ్ కేకపుట్టిస్తోంది. దీనికితోడు ఎంట్రీ లెవెల్ మైక్రో ఎస్‌యూవీలు అందుబాటు ధరల్లో లభిస్తుండటం వల్ల గ్రామీణ కొనుగోలుదారులు కూడా వీటికే సై అంటున్నారని, దీంతో చిన్న ఎస్‌యూవీలకు డిమాండ్ విపరీతంగా పెరుగుతోంది. ‘ఈ ఏడాది అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న విభాగంగా మైక్రో ఎస్వీయూల సెగ్మెంట్ అవతరించింది. ధర విషయానికొస్తే ఎక్స్టర్ వంటి చిన్న ఎస్‌యూవీలు కొన్ని హ్యాచ్‌బ్యాక్‌లతో సమానమైన ధరకే లభిస్తున్నాయి. దీనికితోడు పరిశ్రమలో తొలిసారిగా సన్‌రూఫ్, డాష్‌క్యామ్, 6 ఎయిర్‌బ్యాగ్‌ల వంటి వినూత్న ఫీచర్లు చిన్న ఎస్‌యూవీల్లోనూ ఉండటం కూడా కస్టమర్లు వీటి వెంట పడటానికి మరో ప్రధాన కారణం. నచి్చన ఫీచర్లు, డిజైన్ ఉంటే రేటెక్కువైనా కొనేందుకు వెనుకాడటం లేదు’ అని హ్యుందాయ్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ తరుణ్ గార్గ్ పేర్కొన్నారు. 2024 తొలి 8 నెలల్లో మైక్రో ఎస్‌యూవీల సేల్స్ 86% దూసుకెళ్లగా... మొత్తం ఎస్యూవీ విభాగం విక్రయాల వృద్ధి 19 శాతంగా ఉంది. -
ఎస్‌యూవీల రారాజు ఇదే..
దేశంలో ఎస్‌యూవీలకు ఆదరణ ఇటీవల బాగా పెరుగుతోంది. భారతీయులు కొంటున్న పాసింజర్ వాహనాల్లో దాదాపుగా సగం ఎస్‌యూవీలే ఉంటున్నాయి. కస్టమర్లలో ఉన్న డిమాండ్‌కు అనుగుణంగా అన్ని ప్రముఖ ఆటోమొబైల్ మేకర్లు ఎప్పటికప్పుడు సరికొత్త మోడల్ ఎస్‌యూవీలను కస్టమర్లకు పరిచయం చేస్తున్నాయి.దేశీయ వాహన తయారీ సంస్థ మహీంద్రా & మహీంద్రా 2024-25 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికానికి తన ఆర్థిక ఫలితాలను ప్రకటించింది. ఈ త్రైమాసికంలో 14 శాతం వృద్ధితో 2.12 లక్షల వాహనాల అమ్మకాలను సాధించింది. ఇందులో 1.24 లక్షల వాహనాలు ఎస్‌యూవీలు ఉన్నాయి. ఉత్పత్తి సామర్థ్యం కూడా గణనీయంగా పెరిగింది. నెలవారీ ఉత్పత్తి 49,000 యూనిట్లను నుంచి ఈ సంవత్సరం చివరి నాటికి 64,000 యూనిట్లకు పెంచుతోంది కంపెనీ.దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న ఎస్‌యూవీలలో మహీంద్రా అగ్రగామిగా నిలిచింది. మొత్తం ఎస్యూవీ మార్కెట్లో మహీంద్రా ఎస్‌యూవీల వాటా 21.6 శాతంగా ఉంది. ఇతర విభాగాల్లోనూ మహీంద్రా లీడ్‌లో ఉంది. 50.9 శాతం మార్కెట్ వాటాతో ఎల్సీవీ (లైట్ కమర్షియల్ వెహికల్), 44.7 శాతం వాటాతో ట్రాక్టర్లు, 43.4 శాతం వాటాతో ఎలక్ట్రిక్ 3-వీలర్లతో సహా అనేక ఇతర విభాగాలలో వాహనాలను అత్యధికంగా విక్రయిస్తోంది. దీంతో కంపెనీ మొత్తం త్రైమాసిక ఆదాయం 10 శాతం పెరిగింది. అయితే నికర లాభం మాత్రం 6 శాతం పడిపోయింది.ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న థార్ 5-డోర్ వాహనాన్ని ఆగస్టు 15 స్వాతంత్య్ర దినోత్సవం రోజున ఆవిష్కరించడానికి మహీంద్రా సిద్ధమవుతోంది. దీనికి సంబంధించి ఇప్పటికే పలు టీజర్లు, ట్రైలర్లు వచ్చాయి. ఈ వాహనానికి థార్ రోక్స్ అని పేరు పెట్టింది కంపెనీ. దీని ప్రారంభ ధర సుమారు రూ.14 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉండవచ్చని అంచనా. -
రీల్స్ పిచ్చి పీక్స్‌కు.. సముద్రంలో కార్లతో ఇరుక్కపోయిన యువకులు
కొంతమందిలో సోషల్ మీడియా పిచ్చి రోజురోజుకీ పెరిగిపోతుంది. చిన్నపిల్లల నుంచి ముసలివాళ్ల వరకు సోషల్ మీడియా వాడకం విపరీతంగా పెరిగిపోవటంతో.. ఆ క్రేజ్‌ను ఉపయోగించుకుని ఓవర్ నైట్ స్టార్ కావాలని పిచ్చి పిచ్చి ప్రయత్నాలన్నీ చేస్తున్నారు. త్వరగా ఫేమస్ అయిపోవాలని, తమ వీడియోలు వైరల్ అవ్వాలని కొన్నిసార్లు ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. ఇలాంటి చేష్టలు చేయకూడదని ఎంతమంది చెప్పినా తమ ప్రవర్తనలో మార్పు తెచ్చుకోవడం లేదు. తాగా ఇలాంటి ఘటనలో మరొకటి వెలుగు చూసింది.ఇన్స్టాగ్రామ్ రీల్స్ కోసం కొంతమంది యువకులు తమ కారును సముద్రంలోకి నడిపి ప్రమాదంలో చిక్కుకున్నారు. ఈ ఘటన గుజరాత్‌లోని కచ్ సముద్ర తీరంలో జరిగింది. ఇద్దరు యుకులు రీల్స్ కోసం తమ రెండు మహీంద్రా థార్ ఎస్యూవీ కారులను ముంద్రా సముద్ర తీరంలోకి పోనిచ్చారు. నీరు లోతు పెరగడం, అలల కారణంగా రెండు వాహనాలు దాదాపు నీటిలో మునిగిపోయాయి. దీంతో యువకులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.రెడ్, వైట్ మహీంద్రా థార్ వాహనాలను నీటిలో నుంచి బయటకు తీయడానికి చాలా కష్టపడ్డారు. కానీ వారి ప్రయత్నాలు ఫలించలేదు. స్థానికుల సహాయంతో ఎట్టకేలకు వాహనాలను నీటిలో నుంచి బయటకు తీశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో, కచ్ పోలీసులు ఇద్దరిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. రెండు ఎస్వీలను స్వాధీనం చేసుకున్నామని, చట్టపరమైన చర్యలు ప్రారంభించామని పోలీసు అధికారి తెలిపారు.Gujarat: In an attempt to make a reel, two young men drove 2 Thar vehicles into the deep waters near the seashore in Mundra, Kutch due to which both vehicles get stuck in the water. With the help of locals, both vehicles were retrieved, also Kutch police filed an FIR against the… pic.twitter.com/m9YR0ByK7b— IANS (@ians_india) June 23, 2024 -
ఘోర ప్రమాదం.. గాల్లో పల్టీలు కొట్టిన కారు.. అయిదుగురి మృతి
చెన్నై: తమిళనాడులో బుధవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మధురై సమీపంలో ఓ కారు బీభత్సం సృష్టించింది. విరుధ్ నగర్-మధురై జాతీయ రహదారిపై అతివేగంతో దూసుకొచ్చిన ఎస్యూవీ కారు తొలుత నెమ్మదిగా వెళ్తున్న ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టి అదుపుతప్పింది. అనంతరం ఎడమ వైపున్న డివైడర్‌ను బలంగా ఢీకొట్టి గాల్లో పలుమార్లు పల్టీలు కొట్టింది. దెబ్బకు ఏకారు కంగా నాలుగు లేన్ల హైవేకు అవతలి వైపు సర్వీస్ లైన్లో ఎగిరిపడింది. ప్రమాద దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి. ప్రమాదం దాటికి సంఘటనా స్థలంలో భారీగా దుమ్ము పేరుకుపోయింది. ఈ ఘటనలో అయిదుగురు అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. వీరిలో నలుగురు ఒకే కుటుంబానికి చెందిన వారు. వీరంతా ముధురైలోని విల్లుపురానికి చెందినవారుగా గుర్తించారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. #WATCH | Tamil Nadu: Five people, including four members of the same family from Madurai's Villapuram, were killed when a speeding SUV collided with a moped at Sivarakottai near Tirumangalam on the Virudhunagar-Madurai highway: Madurai district SP Arvind (CCTV footage source:… pic.twitter.com/kFCzEvttJW — ANI (@ANI) April 10, 2024 -
రూ.16.8 లక్షల ఎస్‌యూవీని ఆవిష్కరించిన ప్రముఖ కంపెనీ
ప్రముఖ కార్ల తయారీ సంస్థ హ్యుందాయ్ మధ్యశ్రేణి ఎస్యూవీ క్రెటా ఎన్‌లైన్‌ను ఇటీవల ఆవిష్కరించింది. ప్రారంభ ధర రూ.16.82 లక్షలు(ఎక్స్‌షోరూం). ఎన్8, ఎన్10 వేరియంట్లలో ఇది లభించనుందని తెలిపింది. రూ.25,000తో బుకింగ్‌లను ప్రారంభించినట్లు కంపెనీ నిర్వాహకులు తెలిపారు. ఎన్‌లైన్ శ్రేణిలో ఇప్పటికే ఐ20 హ్యాచ్‌బ్యాక్, కాంపాక్ట్ ఎస్యూవీ వెన్యూ ఉన్నాయి. ఎన్ లైన్, ప్రామాణిక మోడల్ వాహనాల మధ్య డిజైన్‌లో పలు మార్పులుంటాయి. కొత్త 18 అంగుళాల డ్యూయల్ టోన్ అలాయ్‌వీల్స్, రెడ్ ఫ్రంట్, రేర్ బ్రేక్ కాలిపర్స్, గ్రిల్‌పై ఎన్ లైన్ బాడ్జింగ్ పలు డిజైన్ సంబంధిత మార్పులుంటాయి. ఎన్ లైన్ వినియోగదార్ల సగటు వయసు 36 ఏళ్లుగా ఉందని కంపెనీ సీఓఓ తరుణ్ గార్గ్ తెలిపారు. ఇదీ చదవండి: ఈ–స్కూటర్‌కు రూ.10,000 వరకు ఆర్థిక ప్రోత్సాహకం! -
ఘోర ప్రమాదం.. కొంపముంచిన ఓవర్టేక్.. ఏడుగురి మృత్యువాత
భువనేశ్వర్: ఒడిశాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డుపై అతివేగంతో వెళ్తున్న ఓ కారు ఆటోను, బైక్‌ను బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో ఏడుగురు ప్రాణాలు కోల్పోగా.. దాదాపు 13 మంది గాయపడ్డారు. మొత్తం రెండు బైక్‌లు, ఒక ట్రాక్టర్, ఎస్‌యూవీకారు, ఆటోరిక్షా ధ్వంసమయ్యాయి. కోరాపుట్ జిల్లాలోని బోరిగుమ్మ ప్రాంతంలో శుక్రవారం జరిగింది. ప్రమాద దృశ్యాలు సీసీటీవీ ఫుటేజీలో రికార్డయ్యాయి. బోరిగుమ్మలో సింగిల్ రోడ్డుపై ఒక వైపు నుంచి ఎస్యూవీ కారు, ఆటో రిక్షా వస్తున్నాయి. ఎస్యూవీ వేగంగా దూసుకొచ్చి ఆటోరిక్షాను ఓవర్‌టెక్ చేసేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో డ్రైవర్ వాహనంపై నియంత్రణ కోల్పోవడంతో ఆటోతోపాటు ఎదురుగా వస్తున్న బైక్‌ను ఢీకొట్టింది. ఘటన అనంతరం ఎస్యూవీ కారు అక్కడి నుంచి పరారయ్యింది. ఆటో బోల్తా పడటంతో అందులోని 15 మంది ప్రయాణికులు రోడ్డుపై డిపోయారు. వీరిలో ఇద్దరు అక్కడికక్కడే మరణించాడు. అప్రమత్తమైన స్థానికులు క్షతగాత్రులను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతున్న 13 మందిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు చెప్పారు. వారిని కోరాపుట్‌లోని ఓ మెడికల్ కాలేజీకి తరలించినట్లు వివరించారు. ఈ ఘటనపై ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ స్పందించారు. ఈ ప్రమాదంలో మరణించిన వారి కుటుంబ సభ్యులకు మూడు లక్ష చొప్పున నష్టపరిహారం ప్రకటించారు. చదవండి: బిహార్ పాలిటిక్స్.. నితీశ్ సర్కారు కీలక నిర్ణయం Seven people were killed in an #accident in #Odisha’s Borigumma earlier today. Who is in fault in this video?? 😭😭pic.twitter.com/dE8NBX9CfP — Sann (@san_x_m) January 27, 2024 -
హాట్ కేకుల్లా అమ్ముడవుతున్న మారుతీ గ్రాండ్ విటారా కార్లు!
ప్రముఖ ఆటోమొబైల్ దిగ్గజం మారుతీ సుజికి విడుదల చేసిన కార్లు సరికొత్త రికార్డులను నమోదు చేస్తున్నాయి. ఆ సంస్థ మార్కెట్‌కి పరిచయం చేసిన మారుతీ గ్రాండ్ విటారా ఏడాదిలోనే లక్ష కార్లు అమ్ముడు పోయాయి. అంచనా ప్రకారం.. నెలకు సుమారు 8,333 కార్లను విక్రయాలు జరిగాయి. తద్వారా దేశీయంగా మిడ్ సైజ్ ఎస్యూవీ విభాగంలో వేగంగా వేగంగా సేల్స్ జరిగిన కార్ల జాబితాలో గ్రాండ్ విటారా చోటు దక్కించుకోవడం గమనార్హం. ప్రత్యర్ధులకు పోటీగా ఇతర ఆటోమొబైల్ సంస్థలకు పోటీగా మారుతి మిడ్ సైజ్ ఎస్యూవీ కార్లను డిజైన్ చేసింది. ఈ వేరియంట్లో టయోటా అర్బన్ క్రూయిజర్ హైరిడర్, హోందయ్ క్రెటా, కియా సెల్టోస్, హోండా ఎలివేట్, స్కోడా కుషాక్, వోక్స్‌వేగన్ టైగన్, సిట్రోయెన్ సీ3 ఎయిర్‌క్రాస్, ఎంజీ ఆస్టర్లు ఉన్నాయి. అయితే, బలమైన హైబ్రిడ్ పవర్‌ట్రెయిన్‌ను అందించిన ఎస్‌యూవీలలో హైరైడర్, గ్రాండ్ విటారాలు మాత్రమే ఉన్నాయి. ఇ-సీవీటీ ట్రాన్స్‌మిషన్‌తో కూడిన గ్రాండ్ విటారా ఇంటెలిజెంట్ ఎలక్ట్రిక్ హైబ్రీడ్ వేరియంట్ లీటరుకు 27.97 కి.మీల మైలేజ్ ఇస్తుందని కంపెనీ పేర్కొంది. ఈ సందర్భంగా, మారుతీ సుజుకి ఇండియా ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శశాంక్ శ్రీవాస్తవ మాట్లాడుతూ,‘గత ఏడాది విడుదలైన గ్రాండ్ విటారా ఎస్యూవీ ఔత్సాహికులకు కొత్త డ్రైవింగ్ అనుభూతిని అందిస్తూ కొత్త శకానికి నాంది పలికింది. ఎస్యూవీ వేరియంట్లో 22 శాతం వాటాతో మారుతి సుజికి వేగంగా వృద్ది సాధించిందని అన్నారు. గ్రాండ్ విటారా ధర గ్రాండ్ విటారా ధర ప్రస్తుతం రూ. 10.70 లక్షల నుండి రూ. 19.99 లక్షల వరకు ఉంది (రెండు ధరలు, ఎక్స్-షోరూమ్). -
హోండా ఎలివేట్ వచ్చేసింది
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన తయారీ సంస్థ హోండా కార్స్ ఇండియా భారత మార్కెట్లోకి మధ్యస్థాయి ఎస్యూవీ ఎలివేట్ ప్రవేశపెట్టింది. ఎలివేట్‌కు భారత్ తొలి మార్కెట్ కాగా, ఈ మోడల్ ద్వారా కంపెనీ మధ్యస్థాయి ఎస్‌యూవీల్లోకి ఎంట్రీ ఇచ్చింది. ధర ఎక్స్‌షోరూంలో రూ.10.99–15.99 లక్షలు ఉంది. 121 పీఎస్ పవర్, 145 ఎన్ఎం టార్క్‌తో 6–స్పీడ్ మాన్యువల్, 7–స్పీడ్ సీవీటీ ట్రిమ్స్‌లో 1.5 లీటర్ ఐ–వీటీఈసీ పెట్రోల్ ఇంజన్ పొందుపరిచారు. లీటరుకు మైలేజీ మాన్యువల్ ట్రిమ్ 15.31, సీవీటీ 16.92 కిలోమీటర్లు అని కంపెనీ తెలిపింది. అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టంతో తయారైంది. 6 ఎయిర్‌బ్యాగ్స్, లేన్ వాచ్ కెమెరా, ఎల్రక్టానిక్ స్టెబిలిటీ, ట్రాక్షన్ కంట్రోల్‌తో వెహికిల్ స్టెబిలిటీ అసిస్ట్, హిల్ స్టార్ట్ అసిస్ట్, మల్టీ యాంగిల్ రేర్ వ్యూ కెమెరా, 458 లీటర్ల కార్గో స్పేస్, 7 అంగుళాల హెచ్డీ ఫుల్ కలర్ టీఎఫ్టీ మీటర్ క్లస్టర్, 10.25 అంగుళాల ఐపీఎస్ హెచ్డీ ఎల్సీడీ టచ్ స్క్రీన్ డిస్ప్లే ఆడియో, డ్రైవ్ వ్యూ రికార్డింగ్ వంటి హంగులు ఉన్నాయి. హ్యుందాయ్ క్రెటా, మారుతీ సుజుకీ గ్రాండ్ విటారా, కియా సెల్టోస్, టయోటా అర్బన్ క్రూజర్ హైరైడర్‌కు పోటీనిస్తుంది. అయిదు ఎస్‌యూవీలు: భారత్‌లో 2030 నాటికి అయిదు ఎస్‌యూవీలను ప్రవేశపెట్టనున్నట్టు హోండా కార్స్ ఇండియా ప్రెసిడెంట్, సీఈవో టకూయా సుముర తెలిపారు. ‘భారత ప్యాసింజర్ కార్ల పరిశ్రమలో ఎస్‌యూవీల వాటా ఏడాదిలో 43 నుంచి 48 శాతానికి చేరింది. ఈ విభాగం కంపెనీకి చాలా కీలకం కానుంది. ఎలివేట్ చేరికతో కంపెనీకి కొత్త కస్టమర్లు తోడు కానున్నారు. ఎస్యూవీ విభాగంలో లేకపోవడంతో చాలా కోల్పోయాం. అందుకే ఎలివేట్‌ను పరిచయం చేయడం గొప్పగా భావిస్తున్నాం’ అని వివరించారు. రాజస్తాన్‌లోని ప్లాంటు సామర్థ్యాన్ని పెంచామని, ప్రస్తుతం రోజుకు 660 యూనిట్లు ఉత్పత్తి చేయగలమని చెప్పారు. జూలై నుంచి ఎలివేట్ బుకింగ్స్ ప్రారంభం అయ్యాయి. -
కొత్త కారు కొనేవారికే కష్టమే! జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయంతో..
సాధారణంగా ఎప్పటికప్పుడు వాహన తయారీ సంస్థలు తన ఉత్పత్తుల ధరలను పెంచుతూనే ఉంటాయి. ముడిసరుకుల ధరల కారణంగా.. ఇతరత్రా కారణాలు చూపిస్తూ ఏడాదికి కనీసం ఒక్క సారైనా పెంచుతుందన్న విషయం అందరికి తెలిసిందే. కాగా తాజాగా జరిగిన జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలతో మల్టీ యుటిలిటీ వెహికల్స్ (MUV), క్రాస్ఓవర్ యుటిలిటీ వెహికల్స్ (XUV) ధరలు పెరిగినట్లు స్పష్టంగా తెలిసింది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. మంగళవారం జరిగిన 50వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో కొత్త కారు కొనాలనుకునే వారికి జీఎస్టీ కౌన్సిల్ పెద్ద షాక్ ఇచ్చింది. ఎంపిక చేసిన మోడళ్ల మీద జీఎస్టీ సెస్ పెంచుతున్నట్లు అధికారికంగా ప్రకటించింది. కావున ఇప్పుడు కొత్త ఎమ్‌యూవీ కార్లను కొనుగోలు చేసేవారు ఎక్కువ ధరలు చెల్లించాల్సి వస్తుందని తెలుస్తోంది. 28 శాతం జీఎస్టీ ఉండగా.. దీనిపైన 22 శాతం సెస్ విధించారు. దీంతో వాహన ధరలకు రెక్కలొచ్చాయి. (ఇదీ చదవండి: షాకిచ్చిన ఇన్ఫోసిస్.. తీవ్ర నిరాశలో ఉద్యోగులు - కారణం ఇదే!) ఎస్యూవీ అంటే పొడవు 4 మీటర్ల కంటే ఎక్కువ ఉండటమే కాకుండా.. ఇంజిన్ కెపాసిటీ 1500 సీసీ కంటే ఎక్కువ ఉండాలి. గ్రౌండ్ క్లియరెన్స్ కూడా 170 మీమీ కంటే ఎక్కువ ఉండాలి. ఇవన్నీ ఉన్న కార్లు మాత్రమే ధరల పెరుగుదల అందుకుంటాయని తెలుస్తోంది. గతంలో సెస్ అనేది 20 శాతంగా ఉండేది. ఇది తాజాగా రెండు శాతం పెరిగి సెస్ 22 శాతానికి చేరింది. ధరల పెరుగుదల సామాన్య ప్రజల మీద ఎక్కువ ప్రభావం చూపించే అవకాశం ఉందని భావిస్తున్నాము. -
ఎస్‌యూవీలకే డిమాండ్
న్యూఢిల్లీ: ఎస్‌యూవీలకు బలమైన డిమాండ్‌తో దేశీయ ప్యాసింజర్ వెహికిల్స్ రంగంలో మే నెలలో విక్రయాల జోరు సాగింది. మారుతీ సుజుకీ ఇండియా, హ్యుందాయ్ మోటార్ ఇండియా, మహీంద్రా అండ్ మహీంద్రా, టయోటా కిర్లోస్కర్ మోటార్ బలమైన హోల్‌సేల్ అమ్మకాలను నమోదు చేశాయి. టాటా మోటార్స్, కియా, ఎంజీ మోటార్ ఇండియా వంటి ఇతర తయారీ సంస్థలు సైతం విక్రయాల్లో వృద్ధి సాధించాయి. అగ్రశ్రేణి సంస్థ మారుతీ సుజుకీ ఇండియా మొత్తం దేశీయ ప్యాసింజర్ వాహనాల విక్రయాలు 15 శాతం పెరిగి 1,43,708 యూనిట్లుగా నమోదయ్యాయి. ఆల్టో, ఎస్–ప్రెస్సోతో కూడిన మినీ కార్ల అమ్మకాలు 30 శాతం తగ్గి 12,236 యూనిట్లకు పడిపోయాయి. స్విఫ్ట్, సెలెరియో, ఇగ్నిస్, బాలెనో, డిజైర్ వంటి మోడళ్ల విక్రయాలు 5 శాతం పెరిగి 71,419 యూనిట్లకు చేరాయి. బ్రెజ్జా, గ్రాండ్ విటారా, ఎర్టిగాతో సహా యుటిలిటీ వాహనాల సేల్స్ 65 శాతం అధికమై 46,243 యూనిట్లకు చేరాయి. గత నెలలో కంపెనీ రెండంకెల అమ్మకాల వృద్ధికి ఎస్‌యూవీలు క్రెటా, వెన్యూ ఆజ్యం పోశాయని హ్యుందాయ్ ఇండియా సీవోవో తరుణ్ గర్గ్ తెలిపారు. టాటా మోటార్స్ అంతర్జాతీయ వ్యాపారంతో సహా ప్యాసింజర్ ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు 66% వృద్ధితో 5,805 యూనిట్లుగా ఉన్నాయి. గత ఏడాది ఇదే కాలంలో 3,505 యూనిట్లు విక్రయించామని కంపెనీ తెలిపింది. -
కొత్త కారు కొనాలనుకుంటున్నారా ? బడ్జెట్ ధరలో
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన తయారీ సంస్థ హ్యూందాయ్ భారతీయ మార్కెట్లో చిన్న ఎస్‌యూవీని త్వరలో పరిచయం చేయబోతోంది. బడ్జెట్లో (ప్రారంభ ధర రూ.6లక్షలు) ఏఐ3 కోడ్ పేరుతో రూపుదిద్దుకుంటున్న ఈ కారునే ఇక్కడ ప్రవేశపెట్టే అవకాశం ఉంది. టాటా పంచ్, సిట్రోవెన్ సి3, మారుతీ సుజుకీ ఇగ్నిస్, నిస్సాన్ మాగ్నైట్, రెనో కైగర్ మోడళ్లకు ఇది పోటీనిస్తుంది. 1.2 లీటర్ ఇంజన్, 5 స్పీడ్ మాన్యువల్ లేదా ఏఎంటీతో రంగ ప్రవేశం చేయవచ్చని సమాచారం. దేశీయ ప్యాసింజర్ వాహన రంగంలో ఎస్‌యూవీల విభాగం వేగంగా వృద్ధి చెందుతోంది. ప్రస్తుతం భారత్‌లో హ్యుండై వెన్యూ, క్రెటా, ఆల్కజార్, టక్సన్ ఎస్‌యూవీలను విక్రయిస్తోంది. -
షాకింగ్ ఘటన: అందరూ చూస్తుండగానే అగ్నికి ఆహుతైన కారు!
టాటా మోటార్స్! మధ్య తరగతి ప్రజల కారు కలల్ని నిజం చేసేలా కొత్త కొత్త కార్లను సరికొత్త హంగులతో మార్కెట్‌కు పరిచయం చేస్తుంటుంది. అందుకే మధ్య తరగతి వాహన ప్రియులకు టాటా కంపెనీ కార్లంటే చాలా ఇష్టం. పైగా నాణ్యత విషయంలో ఎక్కడా రాజీ పడదు. కాబట్టే ఆ కంపెనీ కార్లు ఎప్పుడు విడుదల అవుతాయి? ఎప్పుడు వాటిని సొంతం చేసుకుందామా అని ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. అంతటి క్రేజ్ ఉన్న టాటా మోటార్స్‌కు చెందిన ‘టాటా పంచ్’ కారు చూస్తుండగానే అగ్నికి ఆహుతైంది. కారు బ్యానెట్లో సంభవించిన ప్రమాదంతో మొదలై చివరికి పూర్తిగా కాలిపోయింది. ఈ ప్రమాదంలో కారు యజమాని సురక్షితంగా బయటపడ్డాడు. గుజరాత్‌కు చెందిన ప్రబల్ బోర్డియా నెల రోజుల క్రితం టాటా పంచ్ మైక్రో ఎస్యూవీ కారును కొనుగోలు చేశాడు. ఈ తరుణంలో అత్యసర పని నిమిత్తం ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళుతుండగా జాతీయ రహదారి మార్గంలో బోర్డియా కారులో మంటలు చెలరేగాయి. దీంతో కారులో ప్రయాణిస్తున్న బోర్డియాతో పాటు ఇతర ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. క్షణాల్లో కారు బూడిదైంది. ఈ సందర్భంగా కారు యజమాని మాట్లాడుతూ..‘నేను నెల రోజుల క్రితం కొనుగోలు చేసిన నా టాటా పంచ్ కారు డ్రైవ్ చేస్తున్నప్పుడు బానెట్‌లో ఆటోమేటిక్‌గా మంటలు చెలరేగాయి. అదృష్టవశాత్తూ మేం ప్రాణాల్ని కాపాడుకోగలిగామని’ తెలిపారు. కారు ప్రమాదంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. మరోవైపు టాటా పంచ్ ఘటనపై టాటా మోటార్స్ యాజమాన్యం స్పందించింది. వాహనదారుల భద్రతే ప్రాధాన్యత ఈ ప్రమాదంపై టాటా మోటార్స్ అధికారిక ప్రకటన చేసింది. టాటా మోటార్స్ ప్రతినిధి మాట్లాడుతూ, “మేము టాటా పంచ్ ప్రమాదానికి గల కారణాల్ని తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నాం. అదృష్టవశాత్తూ ప్రయాణికులందరూ సురక్షితంగా బయటపడ్డారు. దర్యాప్తు ఏజెన్సీల సహకారంతో ఈ దురదృష్టకర సంఘటనకు కారణాలు తెలుసుకుంటాం. వాహనాలు, వాటి వినియోగదారుల భద్రతే టాటా మోటార్స్ మొదటి ప్రాధాన్యత అని తెలిపారు. 5 స్టార్ రేటెడ్ మోస్ట్ సేఫ్టీ కారు టాటా పంచ్ భారతీయ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన ఎస్యూవీ. గ్లోబల్ ఎన్సీఏపీ క్రాష్ టెస్ట్‌లో 5 స్టార్ సేఫ్టీ రేటింగ్‌ను అందుకున్న భారతీయ మార్కెట్లో అత్యంత చవకైన కారు. ప్రమాదంపై సమగ్ర విచారణ జరిపితేనే అగ్నిప్రమాదానికి గల అసలు కారణాలు వెలుగులోకి వస్తాయి. కారులో కూలెంట్ ఉందా బానెట్‌లో కూలెంట్ అనేది కారు ఇంజిన్ కూలింగ్ సిస్టెమ్కు ఉపయగపడే ఓ లిక్విడ్. చలి కాలంలో.. కూలింగ్ సిస్టెమ్లోని నీరు గడ్డ కట్టకుండా ఉండేందుకు ఈ కూలెంట్ ఉపయోగపడుతుంది. బాయిలింగ్ పాయింట్‌ను కూడా పెంచుతుంది. ఇక వేసవి కాలంలో.. ఓవర్ హీటింగ్ బారి నుంచి కూడా రక్షిస్తుంది ఈ కూలెంట్. కూలెంట్ కారులో ఉన్నప్పుడు ఇంజిన్ చల్లగా ఉంటుంది. అది లేకుంటే ఇంజిన్ వేడిగా అయి రాపిడి ఎక్కువై మంటలు చెలరేగే అవకాశముంటుంది. చదవండి👉 ఐఫోన్ 14లో కార్ క్రాష్ డిటెక్షన్ ఫీచర్.. అది ఎలా పనిచేస్తుందంటే? -
ఎస్‌యూవీలపై మారుతీ సుజుకీ గురి
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన తయారీ దిగ్గజం మారుతీ సుజుకీ స్పోర్ట్స్ యుటిలిటీ వెహికిల్స్ (ఎస్యూవీ) విభాగంపై దృష్టిసారించింది. ఈ సెగ్మెంట్లో 2023–24లో 33 శాతం వాటా చేజిక్కించుకోవడం ద్వారా తొలి స్థానాన్ని కైవసం చేసుకోవాలని లక్ష్యంగా చేసుకుంది. ప్రస్తుతం బ్రెజ్జా, గ్రాండ్ వితారా ఎస్‌యూవీలను కంపెనీ విక్రయిస్తోంది. మార్చి నుంచి జిమ్నీ, ఫ్రాంక్స్ మోడళ్లు రోడ్డెక్కనున్నాయి. జిమ్నీ ఇప్పటికే 17,500 యూనిట్లు, ఫ్రాంక్స్ 8,500 యూనిట్ల బుకింగ్స్‌ను కైవసం చేసుకోవడం విశేషం. భారత ప్యాసింజర్ వాహన రంగంలో స్పోర్ట్స్ యుటిలిటీ వెహికిల్స్ వాటా 42.5 శాతం ఉంది. 2022–23లో ఇది 45 శాతానికి చేరుతుందన్న అంచనాలు ఉన్నాయి. ఈ విభాగంలో మారుతీ సుజుకీ వాటా 11.5 శాతం. మొత్తం ప్యాసింజర్ వాహన పరిశ్రమలో సంస్థకు ఏకంగా 45 శాతం వాటా ఉంది. దీనిని 50 శాతానికి పెంచుకోవాలని కంపెనీ కృతనిశ్చయంతో ఉంది. 2023 జనవరిలో ఎస్‌యూవీల విపణిలో మారుతీ సుజుకీ 15 శాతం వాటా దక్కించుకుంది. స్పోర్ట్స్ యుటిలిటీ వెహికిల్స్ విభాగంలో 2021–22లో టాటా మోటార్స్‌కు 18 శాతం, మహీంద్రా అండ్ మహీంద్రాకు 15 శాతం వాటా ఉన్నట్టు సమాచారం. -
భారత్‌లో బీఎండబ్ల్యూ కొత్త కారు.. ధర రూ.1.22 కోట్లు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: లగ్జరీ కార్ల తయారీలో ఉన్న జర్మనీ సంస్థ బీఎండబ్ల్యూ తాజాగా ఎక్స్7 ఎస్‌యూవీని భారత్‌లో ప్రవేశపెట్టింది. ధర రూ.1.22 కోట్ల నుంచి ప్రారంభమవుతుంది. పెట్రోల్, డీజిల్ వేరియంట్లలో లభిస్తుందని కంపెనీ ఒక ప్రకటనలో పేర్కొంది. చెన్నై ప్లాంటులో ఈ కార్లను తయారు చేస్తున్నారు. 3 లీటర్ 6 సిలిండర్ ఇంజన్ పొందుపరిచారు. గంటకు 100 కిలోమీటర్ల వేగాన్ని పెట్రోల్ వర్షన్ 5.8 సెకన్లలో, డీజిల్ వర్షన్ 5.9 సెకన్లలో అందుకుంటుందని కంపెనీ ప్రకటన తెలిపింది. -
కేంద్రం సంచలన నిర్ణయం..! ఆ కార్ల తయారీ నిలిపివేత?
త్వరలో కేంద్రం రియల్ డ్రైవింగ్ ఎమిషన్ (ఆర్డీఈ) నిబంధనల్ని అమలు చేయనుంది?. దీంతో భారత్‌లో వచ్చే ఏడాది ఏప్రిల్ నుంచి కొన్ని కంపెనీలకు చెందిన కార్లు, ఎస్‌యూవీలు కనుమరుగు కానున్నట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. కొత్త ఉద్గార నిబంధనలు డ్రైవింగ్ సమయంలో కార్ల నుంచి విడుదలయ్యే ఎన్ఓఎక్స్ వంటి కాలుష్య కారకాల్ని కొలవడం, వేగం వృద్ధి, క్షీణతలో తరచూగా వచ్చే మార్పులను పరిణగలోకి తీసుకోనున్నాయి. ఈ కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చిన తర్వాత, కార్ల తయారీదారులు తమ ఇంజిన్లను తక్కువ ఉద్గారాలకు అప్‌గ్రేడ్ కావాల్సి ఉంటుంది. ఇంజన్ అప్డేషన్ ప్రక్రియ ఖరీదైంది. కాబట్టే దేశీయ ఆటోమొబైల్ మార్కెట్లో పలు కంపెనీల 27 డీజిల్ కార్లు, ఎస్‌యూవీల కార్యకలాపాల్ని నిలివేసే అవకాశం ఉంది. ఆర్డీఈ నిబంధనల ప్రకారం వాహనాలు డ్రైవింగ్ సమయంలో విడుదలయ్యే ఉద్గార స్థాయిలను గుర్తించేలా పరికరాన్ని కలిగి ఉండాలి. ఉద్గార ప్రమాణాలకు అనుగుణంగా ఉత్ప్రేరక కన్వర్టర్లు, ఆక్సిజన్ సెన్సార్ల వంటి క్లిష్టమైన భాగాలను పరికరం పర్యవేక్షిస్తుంది. కార్మేకర్లు క్రాంక్‌షాఫ్ట్ పొజిషన్లు, థొరెటల్, ఇంజన్ ఉష్ణోగ్రతను స్కాన్ చేయడానికి వాహనాల సెమీకండక్టర్లను అప్‌గ్రేడ్ చేయాల్సి ఉంటుంది. కార్లు, ఎస్‌యూవీలలో ఇంధనం మండే స్థాయిని నియంత్రించడానికి ప్రోగ్రామ్డ్ ఫ్యూయల్ ఇంజెక్టర్లను కూడా అమర్చాలి. అన్ని డీజిల్ ఇంజిన్లు ఉద్గారాల నియంత్రణ ఖరీదైన 'సెలెక్టివ్ క్యాటలిటిక్ రిడక్షన్' (ఎస్ఈఆర్) సాంకేతికతకు మారవలసి ఉంటుంది. కాబట్టి, డీజిల్ కార్ల ధర గణనీయంగా పెరుగుతుంది. కార్ల తయారీకి భారీగా ఖర్చు చేయడం, తయారీ ఖర్చు.. కార్ల ధరల్ని పెంచడం.. పెరిగిన ధరలతో వాటి డిమాండ్ పడిపోవడం వంటి పరిణామలత నేపథ్యంలో సంస్థలు కార్ల తయారీని, అమ్మకాల్ని నిలివేయనున్నాయి. వాటిలో హోండా సిటీ 4వ జెన్, సిటీ 5వ జెన్ (డీజిల్), అమేజ్ (డీజిల్), జాజ్ డబ్ల్యూఆర్ -వీ, మరాజు, అల్ట్రాస్ జీ4, కేయూవీ 100, మహీంద్రా, హ్యుందాయ్, స్కోడా ఒక్కొక్కటి రెండు మోడళ్లను నిలిపివేయనున్నట్లు సమాచారం. హ్యుందాయ్ ఐ20, వెర్నా డీజిల్ మోడళ్లను ఉత్పత్తి చేయడాన్ని నిలిపివేస్తే, స్కోడా ఆక్టావియా, సూపర్బ్ కార్లు మార్కెట్లో కనుమరుగు కానున్నాయి. టాటా ఆల్ట్రోజ్ (డీజిల్), రెనాల్ట్ క్విడ్ 800, నిస్సాన్ కిక్స్, మారుతి సుజుకి ఆల్టో 800 నిలిపివేయనున్న జాబితాలో ఉన్నాయి. చదవండి👉 టోల్‌ప్లాజా, ఫాస్టాగ్ కథ కంచికి..ఇక కొత్త పద్ధతిలో టోల్ వసూళ్లు! -
అదిరే లుక్‌తో కొత్త ఎలక్ట్రిక్ ఎస్యూవీ.. ఒకసారి చార్జింగ్ చేస్తే 500 కి.మీ
న్యూఢిల్లీ: ఎలక్ట్రిక్ మొబిలిటీ స్టార్టప్ ప్రవేగ్ డైనమిక్స్ తాజాగా డిఫై పేరుతో ఎస్‌యూవీని ఆవిష్కరించింది. ఎక్స్‌షోరూంలో ధర రూ.39.5 లక్షలు. డెలివరీలు వచ్చే ఏడాది మూడవ త్రైమాసికం నుంచి ఉంటాయి. 800 యూనిట్లకు బుకింగ్స్ నమోదయ్యాయని కంపెనీ తెలిపింది. ఒకసారి చార్జింగ్ చేస్తే 500 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చని వివరించింది. బెంగళూరు ప్లాంటులో ఏటా 6,000 బ్యాటరీ ప్యాక్స్ తయారు చేస్తున్నట్టు వెల్లడించింది. వీర్ పేరుతో ఆఫ్–రోడ్ మిలిటరీ వర్షన్ ఎస్‌యూవీని కంపెనీ అభివృద్ధి చేసింది. చదవండి: భారీ షాక్, మరో రంగానికి చెందిన వేలాది మంది ఉద్యోగుల తొలగింపు -
పండుగ జోష్: టాప్‌గేర్‌లో వాహన విక్రయాలు
ముంబై: పండుగ సీజన్ కలిసిరావడంతో అక్టోబర్‌లో ఆటో అమ్మకాలు పెరిగాయి. ఎస్యూవీ, మిడ్ సిగ్మెంట్, ఎంట్రీ లెవల్ కార్లకు భారీగా డిమాండ్ పెరగడంతో పాసింజర్ వాహన విక్రయాలు గణనీయమైన వృద్ధిని సాధించాయి. మారుతీ సుజుకీ, టాటా మోటార్స్, మహీంద్రా-మహీంద్రా, కియా మోటార్స్, హోండా కార్స్ ఇండియా చెప్పుకొదగిన స్థాయిలో అమ్మకాలు జరిపాయి. అయితే ఇదే నెలలో ద్విచక్ర విక్రయాలు విక్రయాలు అంతంత మాత్రంగానే నమోదయ్యాయి. హీరో మోటోకార్ప్, బజాజ్ ఆటో, హోండా మోటోసైకిల్ అండ్ స్కూటర్ ఇండియా, టీవీఎస్ మోటార్ విక్రయాలు నిరాశపరిచాయి. ♦ మారుతీ సుజుకీ ఇండియా దేశీయ విక్రయాలు అక్టోబర్‌లో 1,67,520కు చేరాయి. గతేడాది అక్టోబర్ అమ్మకాలు 1,38,335తో పోలిస్తే 21 శాతం పెరిగాయి. ♦ హ్యుందాయ్ మోటార్ ఇండియా విక్రయాలు 43,556 నుంచి 33% వృద్ధితో 58,006 యూనిట్లకు చేరాయి. ♦ టాటా మోటార్స్ అమ్మకాలు 15 శాతం వృద్దిని సాధించి 78,335 యూనిట్లు అమ్ముడయ్యాయి. గతేడాది ఇదే ఆగస్టులో 67,829 యూనిట్లు అమ్ముడయ్యాయి. -
భారత్‌కు నిస్సాన్ గ్లోబల్ మోడల్స్.. చూస్తే వావ్ అనాల్సిందే!
న్యూఢిల్లీ: వాహన తయారీలో ఉన్న జపాన్ సంస్థ నిస్సాన్.. అంతర్జాతీయంగా విక్రయిస్తున్న స్పోర్ట్స్ యుటిలిటీ వెహికిల్స్‌ను (ఎస్యూవీ) భారత మార్కెట్లో పరిచయం చేయాలని నిర్ణయించింది. ప్రస్తుతం దేశంలో మాగ్నైట్, కిక్స్ మోడళ్లు అందుబాటులో ఉన్నాయి. ఎక్స్–ట్రయల్, జూక్, కష్కాయ్ మోడళ్లు రంగ ప్రవేశం చేయనున్నాయి. ఎక్స్–ట్రయల్, కష్కాయ్ వాహనాలను ఇక్కడి మార్కెట్లో విడుదల చేయడంపై సాధ్యాసాధ్యాలను అధ్యయనం చేస్తున్నట్టు కంపెనీ ప్రకటించింది. భారత రోడ్లపై ఈ రెండు మోడళ్ల పరీక్ష మొదలైందని వెల్లడించింది. భారతీయ రోడ్లు, విభిన్న భూభాగాలకు ఈ వాహనాలు అనుకూలమా కాదా అన్న అంశంపై ప్రత్యేకంగా దృష్టి సారించి.. వినియోగదారుల అవసరాలను తీర్చగల సామర్థ్యాన్ని ఈ పరీక్షలు అంచనా వేస్తాయని కంపెనీ తెలిపింది. పరీక్షలు పూర్తి అయ్యాక సానుకూల ఫలితాలు వస్తే తొలుత ఎక్స్–ట్రయల్ ఎంట్రీ ఇవ్వనుంది. ఆ తర్వాత కష్కాయ్ కూడా రోడ్డెక్కనుంది. ఉద్గారాలను బట్టి పన్ను..: వాహనాల పొడవు, ఇంజన్ పరిమాణం కంటే ఉద్గారాల ఆధారంగా ప్రయాణికుల వాహనాలపై పన్ను విధించడాన్ని భారతదేశం పరిగణించాలని నిస్సాన్ మోటార్ ఇండియా ఎండీ రాకేష్ శ్రీవాస్తవ అన్నారు. ‘ఆటోమొబైల్స్ ద్వారా వాయు కాలుష్యాన్ని అరికట్టడానికి హైబ్రిడ్ల వంటి బహుళ సాంకేతికతలను కూడా పరిగణనలోకి తీసుకోవాలి. ఉద్గారాల స్థాయిని బట్టి వేర్వేరు పన్ను స్లాబ్‌లు ఉండాలి. ప్రభుత్వం ఇప్పటికే నాలుగు మీటర్ల లోపు, నాలుగు మీటర్ల కంటే పొడవు, ఇంధనం పరంగా భిన్నమైన పన్ను నిర్మాణాన్ని కలిగి ఉంది. జీఎస్టీ విధానం ప్రకారం కార్లపై 28 శాతం పన్నుతోపాటు సెస్ విధిస్తున్నారు. 4 మీటర్ల కంటే పొడవు ఉండే కార్లు, ఎస్‌యూవీలకు 50 శాతం, హైబ్రిడ్ వాహనాలకు 43 శాతం, ఎలక్ట్రిక్ వెహికిల్స్‌కు 5 శాతం జీఎస్టీ ఉంది. చదవండి: ఆ కారు క్రేజ్ వేరబ్బా, రెండేళ్లు వెయిటింగ్.. అయినా అదే కావాలంటున్న కస్టమర్లు! -
ఆ కారు క్రేజ్ వేరబ్బా, రెండేళ్లు వెయిటింగ్.. అయినా అదే కావాలంటున్న కస్టమర్లు!
భారత ఆటోమొబైల్ రంగంలో మహీంద్రా కంపెనీకి ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ఇటీవల మహీంద్రా ఎక్స్యువి 700 లాంచ్ చేసిన నిమిషాల్లోనే రికార్డు బుకింగ్స్ సొంతం చేసుకోవడమే అందుకు ఉదాహరణ. ప్రస్తుతం ట్రెండ్‌కి అనుగుణంగా మహీంద్రా ఎలక్ట్రిక్ వాహన రంగంలోనూ దూసుకెళ్లేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. ఈ క్రమంలో సరికొత్త ఎలక్ట్రిక్ కార్లను తీసుకువస్తోంది. ఈ సంస్థ నుంచి మార్కెట్లోకి విడుదలయ్యే కార్ల క్రేజ్ గురించి కూడా చెప్పక్కర్లేదు. అందుకే అధిక కస్టమర్లు మహీంద్రా వాహనాల వైపే మొగ్గు చూపుతుంటారు. నేపథ్యంలో స్కార్పియో, XUV700 వంటి కొన్ని మోడళ్లపై 24 నెలలకు పైగా వేచి చూడాల్సిన పరిస్థతి ఏర్పడింది. అయినా వీటికి డిమాండ్ మాత్రం తగ్గడం లేదట. కాగా కంపెనీ మార్కెట్లోకి తీసుకువచ్చిన కొత్త కొత్త మోడళ్లు ఇందుకు ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. మహీంద్రా స్కార్పియో ఎన్ ఇటీవల విడుదల చేసిన మహీంద్రా స్కార్పియో N దాని ప్రీమియం, ఫీచర్-రిచ్ ప్యాకేజీతో ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంది. SUVలోని Z8, Z6 వేరియంట్లకు విపరీతమైన డిమాండ్ ఉంది. ఎంతలా అంటే కస్టమర్లు ఈ వాహనం కావాలంటే 24 నెలల వరకు వేచి చూడాల్సి వస్తోంది. మరోవైపు Z8L దాదాపు 20 నెలల వెయిటింగ్ పీరియడ్ ఉంది. ఇతర వేరియంట్లు మార్కెట్లో తక్కువ వెయిటింగ్ పీరియడ్‌ను కలిగి ఉన్నాయి. మహీంద్రా XUV700 మహీంద్రా XUV700కి కూడా మార్కెట్లో డిమాండ్ నడుస్తోంది. ఇటీవల విడుదలైన ఈ కారు అమ్మకాలలో దూసుకుపోతోంది. ఈ SUV మీద ప్రస్తుతం కస్టమర్లు ఎంచుకునే వేరియంట్‌పై ఆధారపడి 18 నెలల వరకు వెయిటింగ్ పీరియడ్ కలిగి ఉంది. అయితే పెట్రోల్ వెర్షన్లతో పోల్చినప్పుడు డీజిల్ మోడల్లకు ఎక్కువ డిమాండ్ ఉంది. స్కార్పియో, ఎక్స్‌యూవీ 700 వంటి మోడళ్లకు ఏకంగా 2 సంవత్సరాల వరకు వెయిటింగ్ పీరియడ్ ఉంది. ఈ రెండు కార్లు భారతదేశంలో బాగా ప్రాచుర్యం పొందాయి. అయితే ఈ వెయిటింగ్ పీరియడ్ అనేది కేవలం ఎంపిక చేసిన వేరియంట్లకు మాత్రమే వర్తిస్తుందని గుర్తించుకోవాలి. చదవండి: ఐఫోన్ కొనుగోలుదారులకు గుడ్‌న్యూస్.. భారీ డిస్కౌంట్లతో ఫ్లిప్‌కార్ట్ బంపరాఫర్! -
మహీంద్రా ఈ–ఎస్‌యూవీలకు జియో–బీపీ చార్జింగ్ నెట్వర్క్
న్యూఢిల్లీ: ఆటోమొబైల్ దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా (ఎంఅండ్ఎం) ప్రవేశపెట్టబోయే ఎలక్ట్రిక్ ఎస్‌యూవీల కోసం చార్జింగ్ నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేయనున్నట్లు జియో–బీపీ వెల్లడించింది. ముందుగా 16 నగరాల్లో ఎంఅండ్ఎం డీలర్షిప్ నెట్‌వర్క్‌లు, వర్క్‌షాప్‌లలో డీసీ ఫాస్ట్ చార్జర్లను ఇన్స్టాల్ చేయనున్నట్లు తెలిపింది. ఎంఅండ్ఎం ఇటీవలే తమ తొలి ఎలక్ట్రిక్ ఎస్యూవీ – ఎక్స్‌యూవీ400ను ఆవిష్కరించింది. త్వరలో మరిన్ని వాహనాలను ప్రవేశపెట్టనుంది. దేశీ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్–బ్రిటన్‌కు చెందిన బీపీ కలిసి ఇంధనాల రిటైలింగ్ కోసం జాయింట్ వెంచర్‌గా జియో–బీపీని ఏర్పాటు చేశాయి. -
ఎస్‌యూవీల్లోకి హోండా రీఎంట్రీ: వచ్చే ఏడాది కొత్త మోడల్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన తయారీలో ఉన్న జపాన్ సంస్థ హోండా కార్స్.. భారత ప్యాసింజర్ కార్ల మార్కెట్లో 50 శాతం వాటా కలిగి ఉన్న స్పోర్ట్స్ యుటిలిటీ వెహికిల్ (ఎస్యూవీ) విభాగంలోకి తిరిగి ప్రవేశించేందుకు సిద్ధమవుతోంది. తద్వారా ఇక్కడి విపణిలో వ్యాపారం తిరిగి వృద్ధి బాటలోకి వస్తుందని హోండా కార్స్ ఇండియా ఆశిస్తోంది. ఎస్యూవీ విభాగంలో ఉత్పత్తుల కొరత అమ్మకాల పరిమాణం, మార్కెట్ వాటా తగ్గడానికి దారితీసింది. కొత్త ఎస్యూవీ మోడల్ అభివృద్ధి దాదాపు పూర్తి అయింది. ప్రస్తుతం ఈ కారు తుది మెరుగులు దిద్దుకుంటోంది. ఎస్‌యూవీలైన సీఆర్-వి, బీఆర్-వి, మొబిలియో మోడళ్ల ఉత్పత్తిని ఇప్పటికే కంపెనీ నిలిపివేసింది. డబ్ల్యూఆర్-వి, జాజ్ ఎస్‌యూవీలతోపాటు నాల్గవ తరం సిటీ సెడాన్ మోడళ్లు 2023 మార్చి నుంచి కనుమరుగు కానున్నాయి. ప్రస్తుతం భారత్‌లో సెడాన్స్ అయిన సిటీ హైబ్రిడ్, అయిదవతరం సిటీ, కాంపాక్ట్ సెడాన్ అమేజ్ కార్ల అమ్మకాలపైనే కంపెనీ ఆధారపడింది. నిష్క్రమించే ఆలోచనే లేదు.. హోండా అంతర్జాతీయంగా 2030 నాటికి 30 ఎలక్ట్రిక్ కార్లను ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. ఏటా 20 లక్షల ఈ–కార్లు తయారు చేయాలన్నది సంస్థ లక్ష్యం. వ్యాపార పునర్వ్యవస్థీకరణలో భాగంగా కొన్ని మోడళ్ల ఉత్పత్తిని నిలిపివేసింది. ప్రపంచవ్యాప్తంగా ఎలక్ట్రిక్ మొబిలిటీ వైపు వెళ్లాలని హోండా నిర్ణయించుకుంది. భారత్‌తో సహా కొన్ని దేశాల్లో ప్లాంట్లు మూతపడ్డాయి. ఇప్పుడు పటిష్ట స్థితిలో ఉన్నట్టు కంపెనీ వెల్లడించింది. ‘నాల్గవ అతిపెద్ద కార్ల మార్కెట్ అయిన భారత్ నుంచి నిష్క్రమించే ఆలోచనే లేదు. రెండు దశాబ్దాలుగా కార్య కలాపాలు సాగించాం. తప్పుకోవడానికి కారణమే లేదు. ఇక్కడ కొనసాగుతాం’ అని స్పష్టం చేసింది. -
జనవరిలో మహీంద్రా తొలి ఎలక్ట్రిక్ ఎస్యూవీ.. మరో రికార్డ్ క్రియేట్ చేస్తుందా!
చెన్నై: గత కొంత కాలంగా కస్టమర్లు ఎలక్ట్రిక్ వాహనాల వైపు మొగ్గు చూపుతున్నారు. దీంతో ఆటోమొబైల్ దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా (ఎంఅండ్ఎం) ఎలక్ట్రిక్ వాహన రంగంలోనూ దూసుకెళ్లేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. అందులో భాగంగా మహీంద్రా ఎక్స్‌యూవీ 400 (Mahindra XUV 400) ఎలక్ట్రిక్ ఎస్యూవీ మోడల్ లుక్‌ని విడుదల చేసింది. అనంతరం తమ తొలి ఎలక్ట్రిక్ స్పోర్ట్స్ యుటిలిటీ వాహనం ఎక్స్‌యూవీ 400ను వచ్చే ఏడాది జనవరిలో ప్రవేశపెట్టనున్నట్లు ప్రకటించింది. 2022 డిసెంబర్లో టెస్ట్ డ్రైవ్‌లు, 2023 జనవరి తొలి వారం నుంచి బుకింగ్స్ ప్రారంభిస్తామని కంపెనీ ఈడీ (ఆటో, వ్యవసాయ రంగాలు) రాజేష్ జెజూరికర్ తెలిపారు. ఇదిలా ఉండగా గతంలో మహీంద్రా తన ఎక్స్యువి700 ఎస్యూవి కారు బుకింగ్స్ తెరిచిన కేవలం గంట లోపు 25,000 మంది బుకింగ్ చేసి ఓ రికార్డ్ క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సారి మహీంద్రా ఎక్స్‌యూవీ 400 బుకింగ్స్‌లో పాత రికార్డ్ బ్రేక్ చేసే అవకాశం ఉన్నట్లు మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. మహీంద్రా కూడా ఈ కారుపై హైప్ క్రియేట్ చేసేందకు సెప్టంబర్ 8 సాయంత్రం 7.30 ఎక్స్‌యూవీ 400 కారు లుక్కు సంబంధించిన వీడియోని విడుదల చేసింది. ఈ వీడియో చూశాక కొంతకాలంగా ఈ విభాగంలో ఆధిపత్యం చెలాయిస్తున్న టాటా నెక్సాన్ SUV వంటి వాటికి గట్టి పోటినే ఇచ్చేలా కనిపిస్తుంది. చదవండి: రూ.17వేల కోట్ల నష్టం.. ఇలా అయితే గాల్లోకి ఎగరడం కష్టమే! -
ప్రత్యర్థులకు ధీటుగా మహీంద్రా ఎలక్ట్రిక్ కారు.. సింగిల్ చార్జ్‌తో 400 కి.మీ ప్రయాణం!
దేశంలోని ఆటోమొబైల్ రంగంలో మహీంద్రా కంపెనీ కార్లకు ఓ క్రేజ్ ఉంది. ఇటీవల మహీంద్రా ఎక్స్యువి 700 రికార్డు బుకింగ్స్ కావడమే అందుకు ఉదాహరణ. ప్రస్తుతం ట్రెండ్‌కి అనుగుణంగా మహీంద్రా కంపెనీ ఎలక్ట్రిక్ వాహన రంగంలోనూ దూసుకెళ్లేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. ఈ క్రమంలో సరికొత్త ఎలక్ట్రిక్ కార్లను తీసుకురాబోతుంది. అందుకు భాగంగానే మహీంద్రా ఎక్స్‌యూవీ 400 (Mahindra XUV 400) ఎలక్ట్రిక్ ఎస్యూవీ మోడల్ లుక్‌ని విడుదల చేసింది. అయితే మహీంద్రా ఈ కారు విడుదలకు ముందే, టీజర్లతో కారుపై మరింత హైప్ క్రియేట్ చేస్తోంది. మహీంద్రా ఎక్స్‌యూవీ 400తో కొంతకాలంగా ఈ విభాగంలో ఆధిపత్యం చెలాయిస్తున్న టాటా నెక్సాన్ SUV వంటి వాటికి గట్టి పోటినే ఇచ్చేలా కనిపిస్తుంది. అయితే ఈ ఈవీ(EV) గురించి కంపెనీ పూర్తి వివరాలు తెలపాల్సి ఉంది. సమాచారం ప్రకారం.. కొత్త మహీంద్రా XUV 400 ఎలక్ట్రిక్ SUV ధర సుమారు రూ. 14 లక్షలు (ఎక్స్-షోరూమ్) ఉంటుందని అంచనా. లుక్స్ పరంగా చూస్తే.. మహీంద్రా ఎక్స్‌యూవీ 400.. ఇంటిగ్రేటెడ్ డీఆర్ఎల్లు, క్లోజ్డ్-ఆఫ్ ఫ్రంట్ గ్రిల్‌తో కూడిన కొత్త హెడ్లైట్లతో పూర్తిగా రీడిజైన్ చేసినట్లు తెలుస్తోంది. సింగిల్ ఫ్రంట్-వీల్-డ్రైవ్ ఎలక్ట్రిక్ మోటారుతో 150హార్స్ పవర్, రెండు బ్యాటరీ ఆప్షన్స్ ఉండే అవకాశం ఉంది. ఒక సారి ఛార్జింగ్‌పై 400కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చ . 4.2 మీటర్లు పొడవు, XUV 300తో పోలిస్తే స్పేస్ పెద్దదని తెలుస్తోంది. ఆరు ఎయిర్ బ్యాగ్‌లు. వాటర్ ప్రూప్ బ్యాటరీ ప్యాక్, ప్రతీ చక్రానికి డిస్క్ బ్రేకులు, రియర్ వ్యూ కెమరా ఇతర ఫీచర్లు ఉంది. దీని టాప్ స్పీడ్ గంటకు 160 కి.మీ కాగా 8.3 సెకన్లకు 100 కి.మీ వేగాన్ని అందుకుంటుంది. చదవండి: టీవీఎస్ అపాచీ కొత్త మోడల్.. ఆహా అనేలా ఫీచర్లు, స్టైలిష్ లుక్ అదిరిందయ్యా! -
ఘోర ప్రమాదం.. లోయలోకి కారు దూసుకెళ్లి 8 మంది మృతి
శ్రీనగర్: జమ్ముకశ్మీర్‌లోని కిష్ట్వారా జిల్లాలో మంగళవారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ ఎస్యూవీ కారు అదుపుతప్పి భారీ లోయలోకి దూసుకెళ్లింది. ఈ దుర్ఘటనలో 8 మంది ప్రయాణికులు మృతి చెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఎస్యూవీ కారు.. చింగమ్ ప్రాంతం నుంచి ఛత్రూకు వెళ్తోందని అధికారులు తెలిపారు. మంగళవారం మధ్యాహ్నం 3.15 గంటల ప్రాంతంలో బొండా గ్రామానికి సమీపంలో ప్రమాదానికి గురైనట్లు వెల్లడించారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని, ఐదుగురు ప్రయాణికులు అక్కడిక్కడే మృతి చెందగా.. మరో ముగ్గురు ఆసుపత్రికి తరలించే క్రమంలో చనిపోయినట్లు చెప్పారు. మరో ముగ్గురిని ఆసుపత్రికి తరలించామని, ప్రస్తుతం వారి పరిస్థితి విషమంగా ఉందన్నారు. మరోవైపు.. కారు లోయలో పడి 8 మంది మృతి చెందిన సంఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్. ప్రమాదం జరగటం దురదృష్టకరమన్నారు. అన్ని విధాల అవసరమైన సాయం అందిస్తామన్నారు. ఇదీ చదవండి: ఎక్కడికి పోతావు చిన్నవాడా? పరారైన వరుడిని వెంబడించి పట్టుకున్న వధువు -
మూడేళ్లలో సగం ఎస్‌యూవీలే
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశంలో స్పోర్ట్ యుటిలిటీ వెహికల్స్ (ఎస్యూవీ) హవా నడుస్తోంది. అభివృద్ధి చెందిన మార్కెట్లలో ఎస్‌యూవీల వాటా 35–38 శాతం ఉంటే.. భారత్‌లో ఇది 42 శాతమని బీవైడీ ఇండియా ఎలక్ట్రిక్ ప్యాసింజర్ వెహికిల్స్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ సంజయ్ గోపాలకృష్ణన్ తెలిపారు. భారత్‌లో సంస్థ మూడవ షోరూం మోడీ బీవైడీని హైదరాబాద్‌లో శుక్రవారం ప్రారంభించిన సందర్భంగా సాక్షి బిజినెస్ బ్యూరోతో మాట్లాడారు. మూడేళ్లలో ఎస్‌యూవీల వాటా 50 శాతానికి చేరుతుందన్నారు. హ్యాచ్‌బ్యాక్‌ల ధరలోనే రూ. 6–7 లక్షల నుంచే ఈ మోడళ్లు లభ్యం కావడం ఈ స్థాయి అమ్మకాలకు కారణమని చెప్పారు. ఆయనింకా ఏమన్నారంటే.. ధర ప్రాధాన్యత కాదు.. ప్యాసింజర్ వెహికల్స్ విషయంలో హైదరాబాద్ విభిన్న మార్కెట్. ఇక్కడి మార్కెట్లో ఏం జరుగుతుందో అంచనా వేయలేం. గడిచిన అయిదేళ్లలో హైదరాబాద్ విపణి గణనీయంగా వృద్ధి చెందింది. విక్రయాల పరంగా ఢిల్లీ, బెంగళూరు తర్వాత భాగ్యనగరి టాప్‌లో నిలిచింది. కారు కొనుగోలు నిర్ణయం విషయంలో ఒకప్పుడు ధర ప్రామాణికంగా ఉండేది. ప్రాధాన్యత క్రమంలో ఇప్పుడు బ్రాండ్, ఎక్స్టీరియర్స్, ఇంటీరియర్స్, ఫీచర్స్, సేఫ్టీ తర్వాత ధర నిలిచింది. దేశవ్యాప్తంగా జూలైలో ప్యాసింజర్ కార్లు 2,50,972 యూనిట్లు అమ్ముడయ్యాయి. ఈ ఏడాది 50,000 యూనిట్లు.. దేశంలో సగటున నెలకు అన్ని బ్రాండ్లవి కలిపి 3,500 ఎలక్ట్రిక్ కార్లు అమ్ముడవుతున్నాయి. ఈ ఏడాది జూలై నాటికి 26,000 యూనిట్లు రోడ్డెక్కాయి. 2022లో దేశవ్యాప్తంగా 50,000 ఎలక్ట్రిక్ కార్లు అమ్ముడవుతాయని అంచనా. ప్యాసింజర్ వాహన రంగంలో ఈవీల వాటా 2 శాతమే. ఇది 2030 నాటికి 30 శాతానికి చేరనుంది. ఇక ఎలక్ట్రిక్ ప్యాసింజర్ వాహన విక్రయాల్లో టాప్–1 ర్యాంక్ కోసం హైదరాబాద్, బెంగళూరు పోటీపడుతున్నాయి. ఈ–ప్యాసింజర్ వెహికల్స్‌లో దక్షిణాది వాటా 50–60 శాతంగా ఉంది. కస్టమర్లు తమ రెండవ కారుగా ఈవీని కొనుగోలు చేస్తున్నారు.