TATA Punch Micro SUV Launch in India, Full Specs & Features In Telugu - Sakshi
Sakshi News home page

Tata Punch Micro SUV Launch: ఫీచర్స్‌, ధర ఎంతంటే

Published Mon, Oct 18 2021 1:01 PM | Last Updated on Tue, Oct 19 2021 12:48 PM

Tata Punch Micro SUV Launch in India Full Specs Features  - Sakshi

ప్రముఖ దేశీయ ఆటోమొబైల్‌ దిగ్గజం టాటా మోటార్స్‌ ఎట్టకేలకు 'టాటా పంచ్‌ మైక్రో ఎస్‌యూవీ'ని విడుదల చేసింది. గత కొద్ది కాలంగా కార్‌ మార్కెట్‌లో టాటా పంచ్‌ ఎస్‌యూవీ వెహికల్‌ ఆసక్తికరంగా మారింది. అందుకు కారణం యూకేకి చెందిన ఓ స్వచ్ఛంద సంస్థ న్యూ కార్‌ అసెస్‌మెంట్‌ ప్రోగ్రాం(ఎన్‌సీఏపీ)ను నిర్వహిస్తుంది. క్యాంపెయిన్‌లో భాగంగా మనదేశంలో 'సేఫర్‌ కార్స్‌ ఫర్‌ ఇండియా' పేరుతో పలు కార్లపై టెస్టులు నిర్వహిస్తుంది. ఆ టెస్టుల్లో కార్ల సేఫ్టీని బట్టి  స్టార్‌ రేటింగ్‌ను అందిస్తుంది. తాజాగా నిర్వహించిన సేఫర్‌ కార్స్‌ క్యాంపెయినింగ్‌లో టాటా పంచ్‌ కారు 5 స్టార్‌ రేటింగ్‌ను సొంతం చేసుకుంది. 

టాటా పంచ్‌ మైక్రో ఎస్‌యూవీ ఫీచర్లు 
పిల్లల సేప్టీ విషయంలో 4 స్టార్ రేటింగ్ పొందిన టాటా పంచ్‌ మైక్రో ఎస్‌యూవీలో 7అంగుళాల టచ్‌ స్క్రీన్‌, ఆపిల్‌ కార్‌ ప్లే, ఆండ్రాయిడ్‌ ఆటో సపోర్ట్‌తో పాటు ఐఆర్‌ఏ కనెక్టివిటీ సూట్‌, స్మూత్‌ ఎంట్రీ అండ్‌ ఎగ్జిట్‌ కోసం 90 డిగ్రీల ఓపెన్‌ డోర్స్‌, ఆటోమెటిక్‌ క్లైమెట్‌ కంట్రోల్‌,క్రూయిస్‌ కంట్రోల్‌, కూలెడ్‌ గ్లోవీ బాక్స్‌, 4స్పీకర్స్‌, ఆటో సెన్సింగ్‌ వైపర్స్‌, ఆటో హెడ్‌ లైట్స్‌ ఫీచర్స్‌తో అందుబాటులోకి వచ్చింది. 

టాటా పంచ్‌ ధర
ఇండియాలో విడుదలైన టాటా పంచ్‌ ప్రారంభ ధర రూ.5.49లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) అందుబాటులో ఉంది. ఈ ధర 2021,డిసెంబర్‌ 31వరకు అలాగే కొనసాగుతుందని టాటామోటార్స్‌ ప్రతినిధులు తెలిపారు.ఇక అడిషనల్‌గా అందుబాటులో ఉన్న ఏఎంటీ (ఆటోమేటెడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్) సౌకర్యం కావాలనుకుంటే అదనంగా మరో రూ.60వేలు ఖర్చు చేయాల్సి ఉంటుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement