హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన తయారీ సంస్థ హ్యూందాయ్ భారతీయ మార్కెట్లో చిన్న ఎస్‌యూవీని త్వరలో పరిచయం చేయబోతోంది. బడ్జెట్‌లో (ప్రారంభ ధర రూ.6లక్షలు) ఏఐ3 కోడ్ పేరుతో రూపుదిద్దుకుంటున్న ఈ కారునే ఇక్కడ ప్రవేశపెట్టే అవకాశం ఉంది.
టాటా పంచ్, సిట్రోవెన్ సి3, మారుతీ సుజుకీ ఇగ్నిస్, నిస్సాన్ మాగ్నైట్, రెనో కైగర్ మోడళ్లకు ఇది పోటీనిస్తుంది. 1.2 లీటర్ ఇంజన్, 5 స్పీడ్ మాన్యువల్ లేదా ఏఎంటీతో రంగ ప్రవేశం చేయవచ్చని సమాచారం.
దేశీయ ప్యాసింజర్ వాహన రంగంలో ఎస్‌యూవీల విభాగం వేగంగా వృద్ధి చెందుతోంది. ప్రస్తుతం భారత్‌లో హ్యుండై వెన్యూ, క్రెటా, ఆల్కజార్, టక్సన్ ఎస్‌యూవీలను విక్రయిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment