
భారత్‌లో ప్రముఖ తయారీ కార్ల తయారీ సంస్థ హ్యుందాయ్ మోటార్ ఇండియా లిమిటెడ్ (హెచ్ఎంఐఎల్) సరికొత్త రికార్డ్‌లను నమోదు చేసింది. దేశీయంగా హ్యుందాయ్ క్రెటా వన్ మిలియన్ అమ్మకాల మార్కును సాధించినట్లు తెలిపింది.
2015లో మార్కెట్‌కి పరిచయమైన క్రెటా కేవలం ఎనిమిదేళ్లలోనే ఈ ఘనత సాధించింది. ఈ సమయంలో, క్రెటా భారతదేశంలో అత్యధికంగా అమ్ముడైన మిడ్‌సైజ్ ఎస్‌యూవీగా కొనసాగుతోంది. ప్రతి 5 నిమిషాలకు ఒక క్రెటా అమ్ముడవుతోంది.
ఈ సందర్భంగా సీఓఓ తరుణ్ గార్గ్ మాట్లాడుతూ..‘భారతీయ రోడ్లపై పది లక్షలకు పైగా క్రెటాతో బ్రాండ్ తన వారసత్వాన్ని కొనసాగిస్తుందని పునరుద్ఘాటించారు.
ఇటీవల లాంచ్ చేసిన కొత్త క్రెటాకు కూడా అద్భుతమైన కస్టమర్ రెస్పాన్స్ వచ్చిందని, ప్రకటించినప్పటి నుండి 60 వేల బుకింగ్స్ ను దాటిందని తెలిపారు. దేశీయ మార్కెట్ అమ్మకాలతో పాటు, ఎగుమతి మార్కెట్లో కూడా 2.80 లక్షల యూనిట్లకు పైగా క్రెటా విక్రయించినట్లు వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment