టాటా మోటార్స్! మధ్య తరగతి ప్రజల కారు కలల్ని నిజం చేసేలా కొత్త కొత్త కార్లను సరికొత్త హంగులతో మార్కెట్‌కు పరిచయం చేస్తుంటుంది. అందుకే మధ్య తరగతి వాహన ప్రియులకు టాటా కంపెనీ కార్లంటే చాలా ఇష్టం. పైగా నాణ్యత విషయంలో ఎక్కడా రాజీ పడదు. కాబట్టే ఆ కంపెనీ కార్లు ఎప్పుడు విడుదల అవుతాయి? ఎప్పుడు వాటిని సొంతం చేసుకుందామా అని ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు.
అంతటి క్రేజ్ ఉన్న టాటా మోటార్స్‌కు చెందిన ‘టాటా పంచ్’ కారు చూస్తుండగానే అగ్నికి ఆహుతైంది. కారు బ్యానెట్‌లో సంభవించిన ప్రమాదంతో మొదలై చివరికి పూర్తిగా కాలిపోయింది. ఈ ప్రమాదంలో కారు యజమాని సురక్షితంగా బయటపడ్డాడు.
గుజరాత్‌కు చెందిన ప్రబల్ బోర్డియా నెల రోజుల క్రితం టాటా పంచ్ మైక్రో ఎస్‌యూవీ కారును కొనుగోలు చేశాడు. ఈ తరుణంలో అత్యసర పని నిమిత్తం ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళుతుండగా జాతీయ రహదారి మార్గంలో బోర్డియా కారులో మంటలు చెలరేగాయి.
దీంతో కారులో ప్రయాణిస్తున్న బోర్డియాతో పాటు ఇతర ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. క్షణాల్లో కారు బూడిదైంది. ఈ సందర్భంగా కారు యజమాని మాట్లాడుతూ..‘నేను నెల రోజుల క్రితం కొనుగోలు చేసిన నా టాటా పంచ్ కారు డ్రైవ్ చేస్తున్నప్పుడు బానెట్‌లో ఆటోమేటిక్‌గా మంటలు చెలరేగాయి. అదృష్టవశాత్తూ మేం ప్రాణాల్ని కాపాడుకోగలిగామని’ తెలిపారు. కారు ప్రమాదంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. మరోవైపు టాటా పంచ్ ఘటనపై టాటా మోటార్స్ యాజమాన్యం స్పందించింది.
వాహనదారుల భద్రతే ప్రాధాన్యత
ఈ ప్రమాదంపై టాటా మోటార్స్ అధికారిక ప్రకటన చేసింది. టాటా మోటార్స్ ప్రతినిధి మాట్లాడుతూ, “మేము టాటా పంచ్ ప్రమాదానికి గల కారణాల్ని తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నాం. అదృష్టవశాత్తూ ప్రయాణికులందరూ సురక్షితంగా బయటపడ్డారు. దర్యాప్తు ఏజెన్సీల సహకారంతో ఈ దురదృష్టకర సంఘటనకు కారణాలు తెలుసుకుంటాం. వాహనాలు, వాటి వినియోగదారుల భద్రతే టాటా మోటార్స్ మొదటి ప్రాధాన్యత అని తెలిపారు.
5 స్టార్ రేటెడ్ మోస్ట్ సేఫ్టీ కారు
టాటా పంచ్ భారతీయ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన ఎస్‌యూవీ. గ్లోబల్ ఎన్‌సీఏపీ క్రాష్ టెస్ట్‌లో 5 స్టార్ సేఫ్టీ రేటింగ్‌ను అందుకున్న భారతీయ మార్కెట్లో అత్యంత చవకైన కారు. ప్రమాదంపై సమగ్ర విచారణ జరిపితేనే అగ్నిప్రమాదానికి గల అసలు కారణాలు వెలుగులోకి వస్తాయి.
కారులో కూలెంట్ ఉందా
బానెట్‌లో కూలెంట్ అనేది కారు ఇంజిన్ కూలింగ్ సిస్టెమ్కు ఉపయగపడే ఓ లిక్విడ్. చలి కాలంలో.. కూలింగ్ సిస్టెమ్లోని నీరు గడ్డ కట్టకుండా ఉండేందుకు ఈ కూలెంట్ ఉపయోగపడుతుంది. బాయిలింగ్ పాయింట్‌ను కూడా పెంచుతుంది. ఇక వేసవి కాలంలో.. ఓవర్ హీటింగ్ బారి నుంచి కూడా రక్షిస్తుంది ఈ కూలెంట్. కూలెంట్ కారులో ఉన్నప్పుడు ఇంజిన్ చల్లగా ఉంటుంది. అది లేకుంటే ఇంజిన్ వేడిగా అయి రాపిడి ఎక్కువై మంటలు చెలరేగే అవకాశముంటుంది.
చదవండి👉 ఐఫోన్ 14లో కార్ క్రాష్ డిటెక్షన్ ఫీచర్.. అది ఎలా పనిచేస్తుందంటే?
Comments
Please login to add a commentAdd a comment