టాటా కార్లకు బ్రాండ్‌ అంబాసిడర్‌గా ‘ఛావా’ హీరో | Vicky Kaushal Joins The Tata Motors Family as Brand Ambassador | Sakshi
Sakshi News home page

టాటా కార్లకు బ్రాండ్‌ అంబాసిడర్‌గా ‘ఛావా’ హీరో

Published Sun, Mar 23 2025 6:08 PM | Last Updated on Sun, Mar 23 2025 6:08 PM

Vicky Kaushal Joins The Tata Motors Family as Brand Ambassador

న్యూఢిల్లీ: బాలీవుడ్‌ నటుడు విక్కీ కౌశల్‌ను బ్రాండ్‌ అంబాసిడర్‌గా నియమించుకున్నట్లు ఆటోమొబైల్‌ దిగ్గజం టాటా మోటర్స్‌ వెల్లడించింది. తమ ప్యాసింజర్, ఎలక్ట్రిక్‌ వాహనాల శ్రేణి ప్రచారానికి ఆయన తోడ్పడనున్నట్లు తెలిపింది.

ఐపీఎల్‌ సీజన్‌ సందర్భంగా కొత్త టాటా కర్వ్‌ ప్రచార కార్యక్రమంతో ఈ భాగస్వామ్యం ప్రారంభమవుతుందని వివరించింది. ఇందుకోసం 20 సెకన్ల నిడివితో ‘టేక్‌ ది కర్వ్‌’ పేరిట ప్రకటనలు రూపొందించినట్లు సంస్థ పేర్కొంది.

ఈ నేపథ్యంలో టాటా మోటర్స్‌ తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్ పేజీలో ఒక రీల్‌ను కూడా పోస్ట్ చేసింది. ఇందులో కౌశల్ కంపెనీ తాజా కారు కర్వ్‌ను ప్రమోట్ చేస్తూ కనిపించాడు. ఈ పోస్ట్ లో "ఉత్తమ కథలు ట్విస్ట్ లతో నిండి ఉంటాయి.. విక్కీ కౌశల్‌తో టాటా మోటార్స్ కొత్త శకానికి స్వాగతం'' అంటూ రాసుకొచ్చింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement