brand ambassador
-
బిగ్‌బీను వెనక్కి నెట్టిన కెప్టెన్ కూల్
ఏదైనా ఉత్పత్తులను తయారు చేసిన తర్వాత వాటిని ప్రజల్లోకి తీసుకెళ్లి, ఆదరణ పొందేలా చేసేది ప్రచారాలే. తమ వ్యాపారాలను మరింత మందికి చేరువ చేసేందుకు చాలామంది విభిన్న ప్రచారపంథాను ఎంచుకుంటారు. కొందరు ఫ్లెక్సీలపై అందరికీ కనిపించేలా తమ ఉత్పత్తుల గురించి తెలియజేస్తే.. ఇంకొందరు టీవీల్లో అడ్వర్టైజ్ ఇస్తారు. ఇలా చాలామంది విభిన్న పద్ధతులను అనుసరిస్తుంటారు. అయితే, దాదాపు అన్ని ప్రచార హోర్డింగ్‌లపై ప్రముఖుల ఫొటోలను మాత్రం కామన్‌గా చూస్తూంటాం. ఓ క్రికెటర్, సినీ యాక్టర్, మోడల్.. ఇలా మన సమాజంలో బాగా పేరున్న వారిని కార్పొరేట్ కంపెనీలు తమ బ్రాండ్ ఎండార్స్‌మెంట్‌కు వాడుతుంటాయి. అందుకు కొంత పారతోషికం చెల్లిస్తుంటాయి. భారత్‌లో గతేడాదితో పోలిస్తే తమ బ్రాండ్ ప్రమోషన్లు పెరిగిన వ్యక్తుల వివరాలను టామ్ మీడియా రిసెర్చ్ విడుదల చేసింది. ఈ సంస్థ యూఎస్ఏ నీల్సెన్, యూకే కాంటర్ సంయుక్త భాగస్వామ్యంతో ఈ వివరాలు ప్రకటించింది.ఇదీ చదవండి: రైల్వే ‘ఎం1’ కోచ్ గురించి తెలుసా..?ఈ లిస్ట్‌లో గతేడాది టాప్‌లో నిలిచిన బిగ్‌బీ అమితాబ్ బచ్చన్ (40 బ్రాండ్లకు ఎండార్స్మెంట్)ను ఈసారి కెప్టెన్ కూల్‌గా పేరున్న ఎంఎస్ ధోనీ(42 బ్రాండ్లకు ఎండార్స్మెంట్) వెనక్కినెట్టారు. -
జార్ఖండ్ ఎన్నికలకు బ్రాండ్ అంబాసిడర్‌గా ఎమ్ఎస్ ధోనీ
రాంచీ: జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలకు భారత క్రికెట్ మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని బ్రాండ్ అంబాసిడర్‌గా నియమితులయ్యారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఎంఎస్ ధోనీ ఫోటోను ఉపయోగించేందుకు ఎన్నికల కమిషన్ అనుమతి ఇచ్చిందని చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ కె.రవికుమార్ వెల్లడించారు. ‘‘తన ఫోటోను ఉపయోగించుకోవడానికి ఎన్నికల కమిషన్‌కు మహేంద్ర సింగ్ ధోనీ అంగీకారం తెలిపారు. ఇతర వివరాల కోసం మేము ఆయనతో సంప్రదింపులు జరుపుతున్నాం. మహేంద్ర సింగ్ ధోని ఓటర్ల సమీకరణకు కృషి చేస్తారు’’ అని జార్ఖండ్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ కె.కుమార్ అన్నారు. స్వీప్ (సిస్టమాటిక్ ఓటర్స్ ఎడ్యుకేషన్ అండ్ ఎలక్టోరల్ పార్టిసిపేషన్) కార్యక్రమం కింద ఓటర్లలో అవగాహన పెంచేందుకు ధోనీ కృషి చేయనున్నారు. ముఖ్యంగా ఓటర్లకు.. ఎక్కువ సంఖ్యలో ఓటు వేయాలనే ఉత్సాహాన్ని పెంచేందుకు ధోనీ విజ్ఞప్తిని, ప్రజాదరణను వినియోగించుకోవాలని ఎన్నికల సంఘం భావిస్తోంది. జార్ఖండ్ అసెంబ్లీలోని 81 స్థానాలకు నవంబర్ 13, నవంబర్ 20న రెండు దశల్లో ఎన్నికలు జరగనుండగా, నవంబర్ 23న ఫలితాలు వెలువడనున్నాయి. -
బ్రాండ్ అంబాసిడర్‌గా రాజమౌళి.. రూ.8,500 కోట్లు టార్గెట్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఎలక్ట్రానిక్స్ తయారీ దిగ్గజం సోనీ ఇండియా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.8,500 కోట్ల టర్నోవర్ లక్ష్యంగా చేసుకుంది. 2023–24లో కంపెనీ రూ.6,353 కోట్లు సాధించింది. ఎక్స్‌పీరియా స్మార్ట్‌ఫోన్స్, వయో ల్యాప్టాప్స్ విభాగాలతో కలిపి 2014–15లో సోనీ ఇండియా రూ.11,000 కోట్ల ఆదాయం సముపార్జించింది.సంస్థకు అతి పెద్ద మార్కెట్ల పరంగా యూఎస్, చైనా, జపాన్ తర్వాత నాల్గవ స్థానంలో భారత్ నిలిచింది. స్మార్ట్ టీవీ, ఆడియో, డిజిటల్ ఇమేజింగ్ ఉత్పత్తులు ప్రస్తుత వృద్ధిని నడిపిస్తున్నాయని సోనీ ఇండియా ఎండీ సునీల్ నయ్యర్ తెలిపారు. వృద్ధి ఇలాగే కొనసాగితే భారత ర్యాంకు మరింత మెరుగుపడుతుందని చెప్పారు. సగటు విక్రయ ధరను పెంచే లక్ష్యంగా పనిచేస్తున్నట్టు వెల్లడించారు.ప్రీమియం ఉత్పత్తుల వైపు మార్కెట్ మళ్లుతున్న నేపథ్యంలో సోనీ ఇండియాకు ఈ అంశం కలిసి వస్తుందన్నారు. చిత్ర దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి చేతుల మీదుగా ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత 2024 బ్రావియా 9, 8, 7, 3 సిరీస్‌ను సోమవారమిక్కడ విడుదల చేసిన సందర్భంగా మీడియాతో మాట్లాడారు.ఈ సిరీస్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా రాజమౌళి వ్యవహరిస్తారని కంపెనీ ప్రకటించింది. స్మార్ట్ టీవీల విభాగంలో 20% విలువ వృద్ధి ఆశిస్తున్నట్టు తెలిపారు. 55 అంగుళాలు ఆపైన విభాగంలో ఆధిపత్యం కొనసాగిస్తున్నామని అన్నారు. 75 అంగుళాలు ఆపైన సెగ్మెంట్లో 50% పైన వృద్ధి సాధిస్తున్నామని వివరించారు. టీవీల వ్యాపారంలో మార్కెటింగ్‌పైన రూ.300 కోట్లు ఖర్చు చేస్తున్నట్టు పేర్కొన్నారు. రూ.15,000లకుపైగా ఖరీదు చేసే సౌండ్‌బార్స్ విభాగంలో 53% వాటాతో అగ్రస్థానంలో ఉన్నట్టు తెలిపారు. -
DPL 2024: వీరేంద్ర సెహ్వాగ్‌కు కీలక బాధ్యతలు...
ఢిల్లీ ప్రీమియర్ లీగ్ అరంగేట్ర సీజన్‌కు ఢిల్లీ అండ్ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ అన్ని రకాల ఏర్పాట్లు చేస్తోంది. ఈ తొట్టతొలి ఎడిషన్ ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 8 వరకు జరగనుంది. ఈ లీగ్‌లోని అన్ని మ్యాచ్‌లు ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా జరగనుంది. ఈ లీగ్‌లో ఫస్ట్‌క్లాస్ క్రికెటర్లతో భారత స్టార్ క్రికెటర్లు రిషబ్ పంత్, ఇషాంత్ శర్మ, నవదీప్ సైనీ భాగం కానున్నారు.డీపీఎల్ బ్రాండ్ అంబాసిడర్‌గా సెహ్వాగ్..ఇక ఇది ఇలా ఉండగా.. ఢిల్లీ ప్రీమియర్ లీగ్ ప్రారంభ సీజన్ బ్రాండ్ అంబాసిడర్‌గా భారత మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్‌ను డీడీసీఎ నియమించింది. శుక్రవారం ఢిల్లీలో జరిగిన గ్రాండ్ ఈవెంట్లో డీడీసీఎ తమ నిర్ణయాన్ని ప్రకటించింది. ఈ కార్యక్రామానికి సెహ్వాగ్ సైతం హాజరయ్యాడు. కాగా ఢిల్లీ నుంచే భారత జట్టుకు సెహ్వాగ్ ప్రాతినిథ్యం వహించాడు. ఇక ఢిల్లీలోని అత్యుత్తమ ప్రతిభావంతులైన యువ క్రికెటర్లను ఒకే గొడుగు కిందకు తీసుకురావాలని డీడీసీఏ లక్ష్యంగా పెట్టుకుంది. ఈ నేపథ్యంలో ఢిల్లీ ప్రీమియర్ లీగ్‌ను డీడీసీఎ ప్రారంభించనుంది. లీగ్ ప్రారంభ ఎడిషన్‌లో ఆరు ఫ్రాంచైజీలు భాగం కానున్నాయి. సౌత్ ఢిల్లీ సూపర్ స్టార్స్, పురాణి డిల్లీ 6, సెంట్రల్ ఢిల్లీ కింగ్స్, నార్త్ ఢిల్లీ స్ట్రైకర్స్, వెస్ట్ ఢిల్లీ లయన్స్, ఈస్ట్ ఢిల్లీ రైడర్స్ జట్లు మొత్తం రూ. 49.65 కోట్ల రూపాయలకు విక్రయించబడ్డాయి. -
మరో కంపెనీకి ప్రచారకర్తగా మహేశ్‌బాబు
ఇన్నర్‌వేర్, ఔటర్వేర్ ఉత్పత్తులు తయారుచేస్తున్న డాలర్ ఇండస్ట్రీస్ కంపెనీ ప్రముఖ నటుడు మహేశ్‌బాబును దక్షిణ భారతదేశంలో ప్రచారకర్తగా నియమించుకున్నట్లు ప్రకటించింది. సౌత్ఇండియాలో మరింత విస్తరించేందుకు ఈ నియామకం ఎంతో ఉపయోగపడుతుందని కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ వినోద్ కుమార్ గుప్తా తెలిపారు.ఈ సందర్భంగా కంపెనీ ఎండీ మాట్లాడుతూ..‘2027 నాటికి దక్షిణ భారతదేశంలో కొత్తగా 50 విక్రయ కేంద్రాలు నెలకొల్పనున్నాం. హొజైరీ (ఇన్నర్‌వేర్, ఔటర్వేర్) ఉత్పత్తుల ప్రచారకర్తగా ప్రిన్స్ మహేశ్‌బాబును నియమించుకోవడం సంతోషంగా ఉంది. ఇది సంస్థకు ఎంతో ఉపయోగపడుతుంది. కంపెనీ మొత్తం ఆదాయంలో దక్షిణాది వాటా 8 శాతంగా ఉంది. దీన్ని 20 శాతానికి తీసుకెళ్లేలా లక్ష్యాన్ని నిర్ణయించుకున్నాం. రాబోయే రెండేళ్లలో సంస్థ మొత్తం ఆదాయాన్ని రూ.2,000 కోట్లకు పెంచేలా ప్రయత్నిస్తున్నాం’ అని చెప్పారు.ఇదీ చదవండి: ప్రపంచంలోనే అత్యధిక వేతనం ఆయనకే..ఎంతో తెలుసా..?మహేశ్‌బాబు ఇప్పటికే జొయాలుక్కాస్, రాయాల్స్టాగ్, మహీంద్రా ట్రాక్టర్స్, టాటా స్కై, మౌంటేన్ డ్యూ, టీవీఎస్ మోటార్..వంటి కంపెనీలకు ప్రచారకర్తగా ఉన్నారు. -
శ్రీటీఎంటీ స్టీల్ బ్రాండ్ అంబాసిడర్‌గా బుమ్రా
ముంబై: శ్రీటీఎంటీ స్టీల్ ఉత్పత్తుల తయారీ సంస్థ దేవశ్రీ ఇస్పాత్ తాజాగా భారతీయ క్రికెటర్, ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రాను తమ బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించుకుంది. గత 50 ఏళ్లుగా ఉక్కు రంగంలో కార్యకలాపాలు సాగిస్తున్నామని కంపెనీ ఎండీ ప్రకాశ్ గోయెంకా తెలిపారు. నాణ్యత, విశ్వసనీయతకు అత్యంత ప్రాధాన్యమిచ్చే తమ బ్రాండ్‌కి బుమ్రా సముచిత ప్రచారకర్త కాగలరని ఆయన పేర్కొన్నారు. శ్రీటీఎంటీతో జట్టు కట్టడంపై బుమ్రా సంతోషం వ్యక్తం చేశారు. -
వరల్డ్‌కప్ ట్రోఫీతో ఫోజులిచ్చిన యువరాజ్.. ఫోటోలు వైరల్
క్రికెట్ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న టీ20 వరల్డ్‌కప్-2024కు మరో ఐదు వారాల్లో తెరలేవనుంది. జూన్ 1 నుంచి అమెరికా, వెస్టిండీస్‌ల వేదికగా ఈ మెగా టోర్నీ ఆరంభం కానుంది. కాగా ఈ మెగా ఈవెంట్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా టీమిండియా లెజెండ్ యువరాజ్ సింగ్ ఎంపికైన సంగతి తెలిసిందే.ఈ క్రమంలో ఇటీవలే మియామీ గ్రాండ్ ప్రిక్స్‌లో సందడి చేసిన యువరాజ్.. వరల్డ్‌కప్ ట్రోఫితో ఫోటోలకు ఫోజులిచ్చాడు. రేసింగ్ ట్రాక్‌పై వరల్డ్‌కప్ ట్రోఫితో యువీ ఫోటోలు దిగాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలను యువరాజ్ తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశాడు.ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. కాగా 2007లో జరిగిన మొదటి టీ20 ప్రపంచకప్‌లో భారత్ తరఫున ప్రాతినిధ్యం వహించిన యువీ.. టైటిల్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. ఈ టోర్నీలోనే ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో స్టువార్ట్ బ్రాడ్ బౌలింగ్‌లో యువరాజ్ ఆరు బంతులకు ఆరు సిక్సర్లు బాదాడు. ఇప్పటికి టీ20 వరల్డ్‌కప్ అంటే యువరాజ్ సింగ్ కోసం ప్రతీ ఒక్కరూ చర్చించుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే యువీని ఐసీసీ బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించింది. యువీ.. ఉసెన్ బోల్ట్‌తో కలిసి ప్రపంచవ్యాప్తంగా నిర్వహించే వరల్డ్‌కప్ ప్రచార కార్యక్రమాల్లో పాల్గొననున్నాడు. -
BJP: రామనామమే ఎన్నికల బాణం!
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్రంలో ముచ్చటగా మూడోసారి విజయకేతనాన్ని ఎగురవేసేందుకు అస్త్రశ్రస్తాలన్నీ సంధిస్తున్న కాషాయ దళం..హిందీ రాష్ట్రాలతో సహా అనేక రాష్ట్రాల్లో అయోధ్య రామమందిర నిర్మాణ అంశాన్ని ప్రచారాస్త్రంగా మారుస్తోంది. ఎన్నికల షెడ్యూల్ ప్రకటనకు ముందునుంచే రాముడే ఈసారి తమ ఎన్నికల బ్రాండ్ అంబాసిడర్ అని ప్రకటించిన బీజేపీ నేతలు..ఇప్పుడే రాముడి చిత్రాలనే ముందుపెట్టి, రామరాజ్యం నినాదాలిస్తూ, హిందూత్వ ఎజెండాతో ఎన్నికల పోరును పరుగులు పెట్టిస్తున్నారు. ప్రతిపక్షాలపై రామబాణాన్ని ఎక్కుపెట్టి దమ్ముంటే తమ విజయాన్ని ఆపాలని సవాల్ విసురుతున్నారు. హిందీ బెల్ట్‌లో ‘రాముడే’ అజెండా.. అయోధ్యలో రామమందిరంలో ఈ ఏడాది జనవరిలో రామ్‌లల్లా ప్రాణప్రతిష్ట సమయంలోనే లోక్‌సభ ఎన్నికలపై ‘జై శ్రీరామ్’ నినాదం తీవ్ర ప్రభావం చూపుతుందనే వ్యాఖ్యానాలు మొదలయ్యాయి. దేశంలోని 80 శాతం హిందువుల భావోద్వేగాలతో ముడిపడిన రామమందిర నిర్మాణాన్ని పూర్తి చేయడం ద్వారా హిందూత్వ భావజాలం పట్ల తనకున్న నిబధ్దతను బీజేపీ రుజువు చేసుకుందనే వాదనలు, విశ్లేషణలు వచ్చాయి. ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి రావాలన్న ఆహా్వనాన్ని కాంగ్రెస్ సహా మెజార్టీ ప్రతిపక్షాలు తిరస్కరించడం దీనికి మరింత రాజకీయాన్ని పులిమాయి. ఈ అంచనాలకు తగ్గట్లుగానే ప్రస్తుతం హిందీ భాష మాట్లాడే రాష్ట్రాల్లో రాముడే ఎన్నికల ప్రచారాస్త్రంగా మారాడు. ముఖ్యంగా ఉత్తర్‌ప్రదేశ్, బిహార్, జార్ఖండ్, హరియాణా, హిమాచల్‌ప్రదేశ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో రామాలయం, రామరాజ్యం అన్న అంశాల చుట్టూ రాజకీయం నడుస్తోంది. ఈ రాష్ట్రాల్లో మొత్తంగా 218 లోక్‌సభ స్థానాలుండగా, గత ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగానే 166 స్థానాలను గెలుపొందించింది. ఒక్క యూపీలోనే 80 స్థానాలకు గానూ ఒంటిరిగా, 62, మిత్రపక్షాలతో కలిసి 64 సీట్లు సాధించింది. ప్రస్తుత ఎన్నికల్లో యూపీలో సొంతంగా 70 సీట్లు సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. దీన్ని సాధించే క్రమంలో హిందుత్వ భావాజాలన్ని మరింత విస్తృతం చేసే క్రమంలో 80 లోక్‌సభ నియోజకవర్గాల్లో ఒక్కో నియోజకవర్గం నుంచి కనీసంగా 10 వేల మందికి ఉచితంగా అయోధ్య రాముడి దర్శనం కలి్పంచింది. ప్రత్యేక రైళ్లు, బస్సులు ఏర్పాటు చేసి వృధ్దులు, మహిళలు, యువతను పెద్ద ఎత్తున ఆకర్షించింది. దర్శనం అనంతరం భక్తుల తిరుగు ప్రయాణ ఏర్పాట్లతో పాటు, వారి వారి ప్రాంతాలకు తిరిగి రాగానే స్థానిక ప్రజలు స్వాగతం పలికేలా, ఈ సందర్భంగా ప్రసాదం, అక్షింతల వితరణ జరిపేలా కార్యక్రమాలు నిర్వహించింది. ఈ తరహా కార్యక్రమాలనే హిందీ భాష మాట్లాడే అన్ని రాష్ట్రాల నుంచి కొనసాగించి సుమారు 2 కోట్ల మంది భక్తులకు ఉచితంగా రాముడి దర్శనం కలి్పంచింది. ఇది ప్రస్తుత ఎన్నికల్లో తీవ్ర ప్రభావం చూపుతోంది. దీనికి తోడు యావత్ భారతావణిని విశేషంగా అలరించి రామాయణం టీవీ సీరియల్ ఫేమ్ అరుణ్ గోవిల్‌ను మీరట్ నుంచి రంగంలోకి దింపడమే గాక, ప్రధాని మోదీ తన తొలి ఎన్నికల ప్రచార సభను అక్కడి నుంచే ఆరంభించి, తన ప్రచారాస్త్రం రాముడని చెప్పకనే చెప్పారు. ఇక మధ్యప్రదేశ్‌లో బీజేపీ హిందుత్వ కార్డును ఎదుర్కోవడానికి కాంగ్రెస్ అగ్రనేత కమల్‌నాథ్ తనను తాను హనుమంతుడి భక్తుడిగా ప్రకటించుకుంటూ ముందుకు వెళుతున్నారు. ఎక్కడ రామాలయం కనిపిస్తే అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. చత్తీస్‌గఢ్‌లో బీజేపీ ప్రచారాన్ని తట్టుకునేందుకు తమ ప్రభుత్వ హయాంలోనే రామాయణ, కౌసల్య ఉత్సవాలను ఘనంగా నిర్వహించామని,. రాముడు, సీత బసచేసిన అన్ని ప్రదేశాలను అభివృద్ధి చేసే లక్ష్యంతో రామ్ వాన్ గమన్ టూరిజం సర్క్యూట్‌ను ప్రారంభించామని కాంగ్రెస్ ప్రచారం చేసుకుంటోంది. మిగతా రాష్ట్రాల్లోనూ ఆయనే.. హిందీ మాట్లాడే రాష్ట్రాలతో పాటు పశి్చమబెంగాల్, తమిళనాడు, తెలంగాణ, మహారాష్ట్రలోనూ రాముడి ఆలయం, రామరాజ్యం చుట్టూతే ఎన్నికలు ప్రదక్షిణం చేస్తున్నాయి. రాముడి ఆలయ ప్రారంభోత్సవానికి ముందు ప్రధాని మోదీ తమిళనాడు రామేశ్వరంలోని శ్రీరామనాధస్వామి ఆలయం, శ్రీరంగంలోని రంగనాధ స్వామి ఆలయం, ధనుష్‌కోఠి ఆలయాలను దర్శించారు. హిందూత్వ అజెండాతో బీజేపీ ప్రచారాన్ని ముందు పెట్టడంతో అక్కడి అధికార డీఎంకే దీన్ని ఎదుర్కొనేందుకు సనాతన ధర్మానికి తాము వ్యతిరేకమని ప్రచారం చేస్తోంది. ఆ పార్టీ నేత డి.రాజా ఒకడుగు ముందుకేసి ‘జై శ్రీరామ్ నినాదాన్ని తమిళనాడు అంగీకరించదు. బీజేపీ ఐడియాలజీ ఇక్కడ పనిచేయదు’ అని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలను బీజేపీ తప్పుపట్టి తన స్టైల్లో ప్రచారం చేస్తోంది. ఇక పశి్పమ బెంగాల్లో ప్రచారం అంతా రాముడి చుట్టూ తిరుగతోంది. రామనవమి సందర్భంగా ప్రతి వార్డు, బూత్, మండల, జిల్లా కేంద్రాల్లో ర్యాలీలు, హనుమాన్ మందిరాల్లో పూజలు సహా రాష్ట్ర వ్యాప్తంగా 5 వేల కార్యక్రమాలు నిర్వహించింది. బీజేపీ చేస్తున్న ప్రచార హోరుకు తలొగ్గిన ఆ రాష్ట్ర ప్రభుత్వం తొలిసారి రామనవమికి సెలవుగా ప్రకటించింది. మొత్తం మీద రామనామమే ఎన్నికల బాణంగా బీజేపీ తమ ప్రచారాన్ని పరుగులు పెట్టిస్తోంది. -
నారి వారియర్
మంజు వారియర్....పేరులోనే కాదు ఆమె వేసే ప్రతి అడుగులో సాహసం ఉంటుంది. కళకు సామాజిక స్పృహ జోడించి ముందుకు వెళుతోంది. యాక్టర్, రైటర్, డ్యాన్సర్, బ్రాండ్ అంబాసిడర్, ప్రొడ్యూసర్, సోషల్ యాక్టివిస్ట్‌గా బహుముఖ ప్రజ్ఞను సొంతం చేసుకుంది... కేరళలోని తిరువనంతపురం కల్పాక అపార్ట్మెంట్ కాంప్లెక్స్‌లోని మహిళా సభ్యులు సొంతంగా కూరగాయలు పండించడం ప్రారంభించారు. అందరూ ఆశ్చర్యపోయేలా పెద్ద వెజిటెబుల్ గార్డెన్‌ను సృష్టించారు. ‘కల్పాక క్వీన్స్’గా పేరు గాంచారు. వెజిటెబుల్ గార్డెన్ సృష్టించడానికి కల్పాక క్వీన్స్‌కు ‘హౌ వోల్డ్ ఆర్ యూ’ అనే సినిమా స్ఫూర్తి ఇచ్చింది. సమాజాన్ని సినిమా ప్రభావితం చేస్తుందా? సినిమాను సమాజం ప్రభావితం చేస్తుందా?... అనే చర్చ మాట ఎలా ఉన్నా సమాజంపై సినిమా చూపే ప్రభావం తక్కువేమీ కాదు. మంచి లక్ష్యానికి మంచి సినిమా వెన్నుదన్నుగా నిలుస్తుంది. మంజు వారియర్ రీఎంట్రీ మూవీ ‘హౌ వోల్డ్ ఆర్ యూ’ ఈ కోవకు చెందిన సినిమానే. మంజు వారియర్ ఈ సినిమాలో నిరూపమ రాజీవ్ అనే పాత్ర పోషించింది. నిరూపమ రాజీవ్ అనే వివాహిత టెర్రస్ ఫార్మింగ్‌కు సంబంధించిన ప్రయాణం సినిమా మూల కథ. ‘స్త్రీలు తమలో ఉన్న శక్తి సామర్థ్యాలపై దృష్టి సారించి వెలికి తీస్తే ఎన్నో అద్భుతాలు సాధించవచ్చు అని చెప్పడానికి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి’ అంటుంది వారియర్. ‘హౌ వోల్డ్ ఆర్ యూ’ సినిమా విడుదలైన తరువాత మంజు వారియర్ ఎక్కడికి వెళ్లినా మహిళలు దగ్గరికి వచ్చి ‘మీ సినిమా స్ఫూర్తితో టెర్రస్ ఫార్మింగ్ మొదలు పెట్టాం’ అని చెప్పేవాళ్లు. ఆర్గానిక్ ఫార్మింగ్ ప్రాజెక్ట్ ‘కుటుంబశ్రీ’కి బ్రాండ్ అంబాసిడర్‌గా ఎంతో మంది మహిళలను ఆర్గానిక్ ఫార్మింగ్ వైపు నడిపిస్తోంది మంజు వారియర్. పదిహేడు సంవత్సరాల వయసులో ‘సాక్ష్యం’ సినిమాతో మలయాళ చిత్రసీమలోకి అడుగు పెట్టిన వారియర్ ‘తూవల్’ ‘కొట్టరం’ ‘సల్లాపం’...మొదలైన సినిమాలతో నటిగా మంచి పేరు తెచ్చుకుంది. చిత్రసీమలోకి రావడానికి ముందు దూరదర్శన్ సీరియల్స్‌లో నటించింది. జెండర్–ఈక్వాలిటీని దృష్టిలో పెట్టుకొని కేరళ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ‘జెండర్ పార్క్’ ప్లాట్‌ఫామ్ బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్న వారియర్ క్యాన్సర్ పేషెంట్ల కోసం హెయిర్ డొనేషన్ డ్రైవ్‌లను నిర్వహిస్తుంటుంది. ‘చతర్ముఖం’ అనే మలయాళం సినిమాతో నిర్మాతగా తొలి అడుగు వేసింది మంజు. అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో ఈ చిత్రానికి అద్భుతమైన స్పందన వచ్చింది. ‘సినిమా నిర్మాణంలో రిస్క్‌లు, బాధ్యతలు ఉంటాయి. నా చుట్టుపక్కల వాళ్ల సహకారంతో నిర్మాతగా ఎలాంటి సవాళ్లు, ఒత్తిడి ఎదుర్కోలేదు. ‘కాయట్టం’ సినిమాకు సహనిర్మాతగా ఉన్నప్పుడు చిత్ర నిర్మాణం గురించి సీరియస్‌గా ఆలోచించడం మొదలు పెట్టాను. నా జీవితంలో ఏది ప్లాన్ చేసుకోలేదు. ఆ సమయానికి ఏది ఆసక్తిగా ఉంటే అది చేస్తూ పోయాను. సినిమా నిర్మాణాన్ని నా జీవితంలో కొత్త ప్రయోగంగా భావిస్తాను’ అంటుంది మంజు వారియర్. క్లాసికల్ డ్యాన్సర్‌గా మంజు వారియర్ తెచ్చుకున్న పేరు తక్కువేమీ కాదు. స్కూల్లో చదువుకుంటున్న రోజుల నుంచి వారియర్ నాట్యప్రతిభ గురించి ప్రముఖ నాట్యకారుడు ఎన్వీ క్రిష్ణన్‌కు తెలుసు. ‘మంజు గిఫ్టెడ్ డ్యాన్సర్. మన దేశంలోని అద్భుతమైన భరతనాట్య కళాకారులలో ఆమె ఒకరు’ అంటాడు క్రిష్ణన్. భరతనాట్యంలో పేరు తెచ్చుకున్న మంజు వారియర్ తన కూతురు మీనాక్షి డ్యాన్స్ టీచర్ గీతా పద్మకుమారన్ నుంచి కూచిపూడి నాట్యం నేర్చుకుంది. ‘వారియర్‌కు కూచిపూడి నేర్పడం ఒక అద్భుత అనుభవం. తక్కువ సమయంలోనే డ్యాన్స్ నేర్చుకుంది. అద్భుతమై ఎక్స్ప్రెషన్స్ ఆమె సొంతం’ అంటుంది గీత. ‘సల్లాపం’ అనే పుస్తకంతో రైటర్‌గా కూడా తన ప్రతిభ చాటుకుంది వారియర్. ‘సల్లాపం’ తన జ్ఞాపకాల సమాహారం. వీణ వాయించడం నేర్చుకున్న వారియర్ ఎన్నో వీడియోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. మంజు వారియర్ బహుముఖ ప్రతిభకు మరోసారి ఫిదా అయ్యారు అభిమానులు. సంతోషమే నా బలం ప్రాజెక్ట్ సక్సెస్ అయినా ఫెయిల్ అయినా... ఫలితంతో సంబంధం లేకుండా ఎప్పుడూ సంతోషంగా ఉండడానికే ప్రయత్నిస్తాను. సంతోషమే నా బలం. నా జీవితంలో ఎప్పుడూ ఏది ప్లాన్ చేసుకోలేదు. అయితే మంచి విషయాలు నా దారిలో ముందుకు వచ్చి కనిపిస్తాయి. వాటితో కలిసి ప్రయాణిస్తాను. సాహిత్య కార్యక్రమాల్లో మాట్లాడడానికి ముందు నేను ఎక్కడికి వెళ్తున్నానో, ఏం చెప్పబోతున్నానో, ప్రేక్షకులు ఎలా స్పందిస్తారో... ఇలా రకరకాలుగా ఆలోచిస్తుంటాను. – మంజు వారియర్ -
కోపికో కాఫీ క్యాండీ బ్రాండ్ అంబాసిడర్‌గా ధోని
హైదరాబాద్: కోపికో కాఫీ క్యాండీ బ్రాండ్ తన అంబాసిడర్‌గా క్రికెటర్ మహీంద్ర సింగ్ ధోనిని నియమించుకుంది. ఇండియాలోని క్యాండీ కేటగిరీలో అగ్రస్థానంలో ఉన్న ‘కోపికో కాఫీ’ స్థాయిని మరింత బలోపేతం చేసేందుకు త్వరలో చేపట్టే ప్రచార కార్యక్రమాల్లో ధోని పాల్గొంటారని కంపెనీ తెలిపింది. కోపికో కాఫీ తనను ప్రచారకర్తగా ఎన్నుకోవడం పట్ల ధోని సంతోషం వ్యక్తం చేశారు. ప్రపంచంలోనే నంబర్ వన్ కాఫీ క్యాండీతో కలిసి పనిచేసే అవకాశం దక్కడం గొప్ప గౌరవంగా భావిస్తున్నానని ధోని పేర్కొన్నారు. -
జ్యువెల్లరీ సంస్థకు అంబాసిడర్‌గా శోభిత ధూళిపాళ
హైదరాబాద్: జ్యువెలరీ సంస్థ భీమా జ్యువెల్స్ ప్రముఖ నటి శోభిత ధూళిపాళను తమ సంస్థ బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించుకుంది. ఈ సందర్భంగా ఆమె నటించిన ‘మేడ్ టు సెలబ్రేట్ యు’ టీవీ వాణిజ్య ప్రకటన విడుదల చేశారు. ‘‘మా బ్రాండ్ ప్రచారానికి శోభితను ఎంపిక చేసుకోవడం సంతోషంగా ఉంది. భీమా బ్రాండ్‌కు ఆమె మరింత గుర్తింపు తీసుకొస్తుంది’’ అని సంస్థ ఎండీ అభిõÙక్ బిందుమాధవ్ అన్నారు. అత్యంత విశ్వసనీయ బ్రాండ్లలో ఒకటైన భీమా జ్యువెల్స్‌కు ప్రచారకర్తగా వ్యవహరించడం సంతోషం కలిగిస్తుందని శోభిత అన్నారు. -
ఎస్బీఐ కస్టమర్లకు మరింత దగ్గర కానున్న ఎంఎస్ ధోనీ!
దేశంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) క్రికెట్ లెజెండ్ మహేంద్ర సింగ్ ధోనీ (MS Dhoni)తో చేతులు కలిపింది. మిస్టర్ కూల్‌ను తమ అధికారిక బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించుకున్నట్లు ప్రకటించింది. ఎస్బీఐ బ్రాండ్ అంబాసిడర్‌గా ధోని వివిధ మార్కెటింగ్, ప్రమోషనల్ క్యాంపెయిన్లలో కీలక పాత్ర పోషిస్తారని బ్యాంక్ ఒక ప్రకటనలో తెలిపింది. ఒత్తిడితో కూడిన పరిస్థితులలోనూ ప్రశాంతంగా ఉంటూ స్పష్టమైన ఆలోచన, వేగంగా నిర్ణయం తీసుకోవడంలో ఎంఎస్ ధోనీ ప్రసిద్ధి చెందారు. ఆయనతో భాగస్వామ్యం దేశవ్యాప్తంగా ఉన్న తమ కస్టమర్లు, వాటాదారులతో మరింత కనెక్ట్ అవ్వడానికి ఉపకరిస్తుందని ఎస్బీఐ పేర్కొంది. "సంతృప్త కస్టమర్‌గా ఎస్బీఐతో ధోని అనుబంధం ఆయన్ను మా బ్రాండ్ నైతికతకు పరిపూర్ణ స్వరూపంగా చేస్తుంది. ఈ భాగస్వామ్యంతో, విశ్వాసం, సమగ్రత, అచంచలమైన అంకితభావంతో దేశానికి, కస్టమర్లకు సేవ చేయాలనే మా నిబద్ధతను బలోపేతం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం" అని ఎస్బీఐ ఛైర్మన్ దినేష్ ఖారా పేర్కొన్నారు. -
Shiseido: మహాలక్ష్మి మహా ఘనత
‘శ్రీ’ సినిమాతో తెలుగు సినీ పరిశ్రమకు పరిచయం అయిన తమన్నా భాటియా ఆ తరువాత ఎన్నో హిట్ చిత్రాల్లో నటించింది. ‘మిల్కీ బ్యూటీ’గా పేరు గాంచింది. ‘100 పర్సంట్ లవ్’ సినిమాలో వీర వెంకట సత్య సాయి నాగ దుర్గ శేష అవతార సీతా మహాలక్ష్మి’ పాత్రతో ఫస్ట్ క్లాస్ మార్కులు కొట్టేసింది. తాజాగా మన మహాలక్ష్మి సరికొత్త రికార్డ్ సృష్టించింది. జపాన్‌కు చెందిన ప్రసిద్ధ బ్యూటీ అండ్ కాస్మెటిక్స్ మల్టీ నేషనల్ కంపెనీ ‘షిసైడో’కు ఫస్ట్ ఇండియన్ బ్రాండ్ అంబాసిడర్‌గా అరుదైన అవకాశాన్ని చేజిక్కించుకుంది. ఈ ఘనత గురించి తమన్నాను ఆకాశానికి ఎత్తుతూ ఆమె అభిమానులు సోషల్ మీడియాలో పోస్ట్‌లు పెడుతున్నారు. ‘అందంతో పాటు ఆత్మవిశ్వాసం ఉండాలి’ అంటుంది తమన్నా. ఆమె విజయపరంపరకు ఇదే ప్రధాన కారణం అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు కదా. -
గ్రీన్ప్లై బ్రాండ్ అంబాసిడర్‌గా జూనియర్ ఎన్టీఆర్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: హానికారక ఉద్గారాలను తగ్గించే జీరో ఎమిషన్ ప్లైవుడ్ ఉత్పత్తులకు ప్రచారకర్తగా నటుడు జూనియర్ ఎన్టీఆర్‌ను నియమించుకున్నట్లు గ్రీన్ప్లై ఇండస్ట్రీస్ (జీఐఎల్) సీఈవో మనోజ్ తుల్సియాన్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయనతో కొత్త వాణిజ్య ప్రచార ప్రకటనలను రూపొందించినట్లు చెప్పారు. ప్రస్తుతం దేశీయంగా ప్లైవుడ్ పరిశ్రమ 4.5 బిలియన్ డాలర్ల స్థాయిలో ఉండగా, అందులో సంఘటిత రంగం వాటా 30 శాతం వరకు ఉంటుందని సోమవారమిక్కడ విలేకరుల సమావేశంలో తెలిపారు. గత ఆర్థిక సంవత్సరంలో తమ ఆదాయం రూ. 1,800 కోట్లుగా ఉండగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ. 2,200 కోట్ల వరకు అంచనా వేస్తున్నట్లు మనోజ్ చెప్పారు. ప్రస్తుతం తమకు గుజరాత్, ఉత్తర్‌ప్రదేశ్‌లో ఎండీఎఫ్, ప్లైవుడ్ తయారీ ప్లాంట్లు ఉన్నాయని తెలిపారు. టర్కీకి చెందిన సంస్థతో జాయింట్ వెంచర్‌గా ఏర్పాటు చేస్తున్న ప్లాంటు వచ్చే ఏడాది వ్యవధిలో అందుబాటులోకి రాగలదని మనోజ్ చెప్పారు. -
ప్లే ప్యూర్: బీజీఎంఐ బ్రాండ్ అంబాసిడర్‌గా రణ్వీర్ సింగ్
Ranveer Singh BGMI బ్యాటిల్‌గ్రౌండ్స్ మొబైల్ ఇండియా (బీజీఎంఐ) గేమింగ్‌కు ప్రచారకర్తగా బాలీవుడ్ నటుడు రణ్వీర్ సింగ్‌ను నియమించుకున్నట్లు క్రాఫ్టాన్ ఇండియా వెల్లడించింది. గేమింగ్ థ్రిల్ ,సూపర్ స్టార్ రణ్వీర్ సింగ్ కరిష్మా రెండూ కలిపి దేశవ్యాప్తంగా మిలియన్ల మంది గేమర్లకు ఉన్నతమైన అనుభవాన్ని అందించడమే కంపెనీ లక్ష్యం. దేశవ్యాప్తంగా ఉన్న గేమింగ్ ఔత్సాహికులకోసం ఆకర్షణీయమైన కంటెంట్‌ను తీసుకురావడానికి ఈ సహకారం ఒక కొత్త మార్గాన్ని అందిస్తుందని, గేమింగ్ ఎంటర్టైన్మెంట్ కొత్త శకాన్ని ప్రారంభించనున్నామని తెలిపింది. యూజర్లను కట్టిపడేసే అనుభూతిని అందించే గేమ్‌లను రూపొందించడంపై మరింతగా దృష్టి పెడుతున్నట్లు క్రాఫ్టాన్ ఇండియా సీఈవో షాన్ హ్యునిల్ సోన్ తెలిపారు. దేశీ గేమింగ్ కమ్యూనిటీని కలిసేందుకు క్రాఫ్టాన్ భాగస్వామ్యం మంచి అవకాశం కాగలదని రణ్వీర్ సింగ్ పేర్కొన్నారు. -
సెంచురీ మ్యాట్రెసెస్ అంబాసిడర్‌గా పీవీ సింధు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వచ్చే మూడేళ్లలో ఎక్స్‌క్లూజివ్ స్టోర్స్ (ఈబీవో) సంఖ్యను 1,000కి చేర్చుకోనున్నట్లు సెంచురీ మ్యాట్రెసెస్ ఈడీ ఉత్తమ్ మలానీ తెలిపారు. ప్రస్తుతం 500 ఉండగా మరో 500 స్టోర్స్ ప్రారంభించనున్నట్లు వివరించారు. తెలంగాణలో 100 ఈబీవోలు ఉన్నాయని, ఈ ఏడాది చివరికి 200కు పెంచుకుంటున్నామన్నారు. మరోవైపు, దేశీయంగా మ్యాట్రెస్‌ల మార్కెట్ రూ. 10,000 కోట్లుగా ఉండగా సంఘటిత రంగ వాటా 40శాతం అని, ఇందులో తమకు 10% వాటా ఉందని, దీన్ని మూడేళ్లలో 20 శాతానికి పెంచుకోనున్నామని వివరించారు. బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధును సంస్థ బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించుకున్న సందర్భంగా మంగళవారమిక్కడ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మలానీ ఈ విషయాలు చెప్పారు. ఆదాయాలకు సంబంధించి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 35 శాతం వృద్ధి అంచనా వేస్తున్నట్లు చెప్పారు. ఆరోగ్యకరమైన స్లీప్ సొల్యూషన్స్ అందిస్తూ సెంచురీ అందరీ నమ్మకాన్ని చూరగొందని సింధు తెలిపారు. -
ఆ యాడ్‌తో బాద్షాకి చిక్కులు
ముంబై: బాలీవుడ్ బాద్షా షారూక్ ఖాన్ చిక్కుల్లో ప డ్డారు. ఒక ఆన్లైన్ గేమింగ్ యాప్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించినందుకు ఆయన ఇల్లు ముట్టడికి కొందరు విఫలయత్నం చేశారు. ఆన్లైన్ జూదాన్ని ప్రోత్సహించేలా షారూక్ వ్యవహరించడం వారికి మింగుడు పడడం లేదు. అన్‌టచ్ ఇండియా ఫౌండేషన్‌కు చెందిన కొందరు బాంద్రాలోని షారూక్ ఇంటి బయట నిరసనలకు దిగడానికి చేసిన ప్రయత్నాన్ని పోలీసులు అడ్డుకున్నారు. షారూక్ ఇంటికి గట్టి భద్రత ఏర్పాటు చేసి కొందరు యువకుల్ని అదుపులోనికి తీసుకున్నారు. ఏ23 అనే ఆన్లైన్ రమ్మీ పోర్టల్‌కి బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్న షారూక్ ఇటీవల దానికి సంబంధించిన ఒక వాణిజ్యప్రకటన(యాడ్)లో నటించారు. ఆ యాడ్‌లో ‘పదండి కలిసి ఆడదాం’ అని షారూక్ వ్యాఖ్యానిస్తారు. ఈ అడ్వర్టయిజ్‌మెంట్‌పై అన్‌టచ్ యూత్ పౌండేషన్ తీవ్ర స్థాయిలో మండిపడింది. జంగ్లీ రమ్మీ, జూపీ వంటి ఆన్లైన్ గేమింగ్ యాప్స్ యువతని పక్కదారి పట్టిస్తున్నాయని అన్‌టచ్ ఇండియా ఫౌండేషన్ విమర్శించింది. -
ఇన్ఫీ బ్రాండ్ అంబాసిడర్‌గా స్వైటెక్
న్యూఢిల్లీ: ఐటీ సేవల దేశీ దిగ్గజం ఇన్ఫోసిస్.. గ్లోబల్ బ్రాండ్ అంబాసిడర్‌గా అంతర్జాతీయ మహిళా టెన్నిస్ స్టార్ ఇగా స్వైటెక్‌ను నియమించుకుంది. కొన్నేళ్ల పాటు అమల్లో ఉండే ఈ భాగస్వామ్యం ద్వారా సంస్థ డిజిటల్ ఇన్నోవేషన్‌ను ప్రమోట్ చేయడంతోపాటు.. ప్రపంచవ్యాప్తంగా మహిళలకు స్ఫూర్తినివ్వనుంది. అంతేకాకుండా సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, మ్యాథ్స్(ఎస్టీఈఎం–స్టెమ్)లలో వెనుకబడిన మహిళల కోసం ప్రోగ్రామ్‌లను సృష్టించనున్నట్లు ఇన్ఫోసిస్ తెలియజేసింది. మహిళా సాధకులపై స్వైటెక్ అత్యంత ప్రభావశీలిగా నిలుస్తుందని ఇన్ఫోసిస్ సీఈవో సలీల్ పరేఖ్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. స్వైటెక్‌తో కలిసి ఇన్ఫోసిస్ యువతకు ప్రధానంగా మహిళలకు స్ఫూర్తినిచ్చే పనులు చేపట్టనున్నట్లు తెలియజేశారు. భవిష్యత్‌కు కీలకమైన స్టెమ్‌లో ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకునేవిధంగా ప్రోత్సాహాన్నివ్వనున్నట్లు వివరించారు. 22ఏళ్ల స్వైటెక్ నాలుగుసార్లు గ్రాండ్ స్లామ్ టైటిళ్లను సొంతం చేసుకోవడంతోపాటు.. 2022 ఏప్రిల్ నుంచి ప్రపంచ నంబర్ వన్ టెన్నిస్ క్రీడాకారిణిగా నిలుస్తున్నట్లు ఇన్ఫోసిస్ తెలియజేసింది. -
ఇన్ఫోసిస్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రపంచ నం.1 టెన్నిస్ ప్లేయర్
న్యూఢిల్లీ: ఐటీ సేవల దిగ్గజం ఇన్ఫోసిస్‌కు, ఆ సంస్థకే చెందిన డిజిటల్ ఇన్నోవేషన్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా అంతర్జాతీయ టెన్నిస్ స్టార్ రఫేల్ నాదల్ నియమితులయ్యారు. మూడేళ్ల పాటు ఈ భాగస్వామ్యం అమల్లో ఉంటుంది. ఈ సందర్భంగా ఇన్ఫీ, నాదల్ కోచింగ్ టీమ్ కలిసి కృత్రిమ మేధ ఆధారిత మ్యాచ్ అనాలిసిస్ టూల్‌ను అభివృద్ధి చేయనున్నాయని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. వ్యక్తులు, వ్యాపార దిగ్గజాలు ఎప్పటికప్పుడు మారే పరిస్థితులకు అనుగుణంగా తమను తాము మల్చుకుంటూ, ముందుకు ఎలా సాగాలనేది తెలుసుకునేందుకు నాదల్ చక్కని నిదర్శనమని సంస్థ సీఈవో సలిల్ పరేఖ్ తెలిపారు. ఇన్ఫోసిస్ డిజిటల్ రంగంలో తనకున్న అనుభవంతో టెన్నిస్ క్రీడకు కూడా సేవలు అందించే తీరు తనకు నచ్చిందని నాదల్ పేర్కొన్నారు. -
డైసన్ హెయిర్ కేర్ టెక్నాలజీస్ ప్రచారకర్తగా దీపికా పదుకొనే
హైదరాబాద్: గ్లోబల్ టెక్నాలజీ సంస్థ డైసన్ హెయిర్ కేర్ టెక్నాలజీస్ తన బ్రాండ్ అంబాసిడర్‌గా నటి దీపికా పదుకొనేను నియమించుకుంది. ప్రస్తుత రోజుల్లో ప్రతి ఒక్కరికి శిరోజాల సంరక్షణపై కనీస అవగాహన అవసరం. ఆరోగ్యకరమైన హెయిర్ స్టైల్ కోసం ఎప్పటికప్పుడు నూతన ఆవిష్కరణలను చేస్తున్న డైసన్‌కు బ్రాండ్ అంబాసిడర్ వ్యవహరిస్తుండటం సంతోషంగా ఉందని దీపికా అన్నారు. ‘‘మా బ్రాండ్‌కు దీపికా మరింత గుర్తింపు తీసుకొస్తుంది. అధునాతన కేశాలంకరణ పరికరాల మార్కెట్‌ను మరింత విస్తరించుకునేందుకు ఆమెకు ఉన్న ఆకర్షణ మాకు కలిసొస్తుంది’’ అని డైసన్ ఇండియా ఎండీ అంకిత్ జైన్ తెలిపారు. -
జూనియర్ ఎన్టీఆర్ మరోసారి..
హైదరాబాద్: ప్రపంచ వ్యాప్తంగా 11 దేశాల్లో 320 షోరూమ్‌లతో 6వ అతిపెద్ద జ్యువెలరీ రిటైలర్‌గా ప్రఖ్యాతిగాంచిన మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా జూనియర్ ఎన్టీఆర్ కొనసాగనున్నారు. సంబంధిత పత్రాలపై ఆయన సంతకాలు చేశారు. సంస్థ ప్రచార చిత్రాలతో ఆయన వినియోగదారులను ఆకట్టుకోనున్నారు. బ్రాండ్ అంబాసిడర్‌గా జూనియర్ ఎన్టీఆర్ రెండో ఇన్నింగ్స్‌తో మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ 30వ వార్షికోత్సవాలకు మరింత శోభ చేకూరనుందని సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. ప్రముఖ జ్యువెలరీ రిటైలర్‌తో భాగస్వామ్యం కొనసాగడం సంతోషంగా ఉందని జూనియర్ ఎన్టీఆర్ పేర్కొన్నారు. కాగా, దేశ వ్యాప్తంగా ఆరాధించే సినీ తారల్లో ఒకరైన జూనియర్ ఎన్టీఆర్‌తో తమ సంస్థ అనుబంధం కొనసాగడం వల్ల.. ప్రపంచవ్యాప్తంగా నంబర్ 1 రిటైలర్ జ్యువెలరీ బ్రాండ్‌గా నిలవాలనే తమ ఆశయం త్వరలోనే నెరవేరుతుందన్న విశ్వాసం మరింత బలపడుతోందని మలబార్ గ్రూప్ చైర్మన్ ఎంపీ అహ్మద్ తెలిపారు. కస్టమర్లకు ప్రపంచ స్థాయి ఆభరణాల షాపింగ్ అనుభూతితో పాటు పారదర్శకత, ఆభరణాల డిజైన్‌లో వైవిధ్యం, నైపుణ్యం తదితర అంశాలకు సంబంధించి తమ నిబద్ధతను పునరుద్ఘాటిస్తున్నట్లు వెల్లడించారు. ఇదీ చదవండి: అవును.. భారత్‌కు టెస్లా వచ్చేస్తోంది! స్పష్టం చేసిన ఎలాన్ మస్క్ -
హార్దిక్ పాండ్యాకు అరుదైన గౌరవం - అదేంటంటే?
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన తయారీ సంస్థ హ్యుందాయ్ మోటార్ ఇండియా.. వచ్చే నెలలో భారత మార్కెట్లోకి రానున్న కాంపాక్ట్ ఎస్యూవీ ఎక్స్టర్ ప్రచారకర్తగా క్రికెటర్ హార్దిక్ పాండ్యాను నియమించుకుంది. టాటా మోటార్స్ పంచ్, సిట్రియోన్ సీ3 మోడళ్లకు ఎక్స్టర్ పోటీ ఇవ్వనుంది. బ్రాండ్ ప్రచారాన్ని పాండ్యా విస్తృతం చేస్తారని, హ్యుందాయ్ ఎక్స్టర్ను మిల్లేనియల్స్, జనరేషన్ జడ్‌కు అనుసంధానం చేయడంలో సహాయపడతారని విశ్వసిస్తున్నట్టు సంస్థ తెలిపింది. -
టెక్నో పెయింట్స్ ప్రచారకర్తగా మహేశ్ బాబు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: పెయింట్స్ తయారీలో ఉన్న టెక్నో పెయింట్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా సినీ నటుడు మహేశ్‌బాబు నియమితులయ్యారు. ‘యూత్ ఐకాన్‌గా మహేశ్‌బాబు బ్రాండ్ ఇమేజ్ సంస్థ విస్తరణకు దోహదం చేస్తుంది. దేశీయ పెయింట్స్ రిటైల్‌లో సుస్థిర స్థానం సంపాదించాలన్న మా లక్ష్యం నెరవేరుతుందన్న ధీమా ఉంది’ అని టెక్నో పెయింట్స్‌ను ప్రమోట్ చేస్తున్న ఫార్చూన్ గ్రూప్ ఫౌండర్ ఆకూరి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ‘ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో రూ.12,000 కోట్ల పెయింట్స్ పరిశ్రమలో 12–18 నెలల్లో 25% వాటాను లక్ష్యంగా చేసుకున్నాం. 5,000 కేంద్రాల్లో మా ఉత్పత్తులను చేరుస్తాం. వుడ్ అధెసివ్, టైల్ ప్రైమర్, వుడ్ పాలిష్, వాటర్ ప్రూఫింగ్ కాంపౌండ్స్‌ను కొత్తగా ప్రవేశపెట్టాం. అన్ని జిల్లాల్లో డిపోలు, సెంట్రల్ వేర్ హౌజ్‌లను ఏర్పాటు చేస్తున్నాం’ అని వివరించారు. -
డ్యూరోఫ్లెక్స్‌తో బ్రాండ్ అంబాసిడర్‌గా విరాట్ కోహ్లీ (ఫొటోలు)
-
మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ ప్రచారకర్తగా నటి అలియా భట్
హైదరాబాద్: మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ తన ప్రచారకర్తగా బాలీవుడ్ నటి అలియా భట్‌ను నియమించుకుంది. సంస్థ 30 ఏళ్ల వేడుకల సందర్భంగా అలియాతో జట్టు కట్టినట్లు గ్రూప్ చైర్మన్ ఎం.పీ. అహ్మద్ తెలిపారు. ‘‘అందం, అభినయంతో సినీ ప్రేక్షకుల్ని రంజింపచేస్తున్న అలియా.., సామాజిక మాధ్యమాల ద్వారా విస్తృతంగా ప్రచారం చేసి సంస్థ ఉత్పత్తులను కస్టమర్లకు మరింత చేరువ చేస్తుంది. మా లక్ష్యాల సాధనకు నటిగా, వ్యక్తిగా ఆమె మరింత బలాన్ని చేకూరుస్తుంది’’ అని అహ్మద్ విశ్వాసం వ్యక్తం చేశారు. అనిల్ కపూర్, కరీనా కపూర్, కార్తీ వంటి నటీనటులు బ్రాండ్ ప్రచాకర్తలుగా ఉన్న మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ కుటుంబంలోకి చేరుతున్నందుకు సంతోషంగా ఉందని అలియా అన్నారు.