
సాక్షి, ముంబయి: బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఓ భారీ ఆఫర్‌ను వదులుకున్నాడట. ఏకంగా రూ.15 కోట్ల డీల్ తనకు రాగా సుశాంత్ సున్నితంగా ఆ ఆఫర్‌ను తిరస్కరించడంతో వార్తల్లో వ్యక్తిగా నిలిచాడు. టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ బయోపిక్ ‘ఎంఎస్ ధోని: అన్‌టోల్డ్ స్టోరీ’లో ధోని పాత్రలో కనిపించిన సుశాంత్ ప్రేక్షకులను మెప్పించాడు. ఈ బయోపిక్ తర్వాత సుశాంత్‌కు ప్రకటనల నిమిత్తం ఆఫర్లు రాగా కొన్ని చేయగా, మరికొన్నింటిని తిరస్కరించాడు.
ఫెయిర్‌నెస్ క్రీమ్ యాడ్ కంపెనీ తమ సంస్థకు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తే రూ.15 కోట్లు ఇస్తామన్న ఆఫర్‌ను వద్దనుకున్నట్లు సుశాంత్ తెలిపాడు. భారీగా డబ్బులు ఇస్తామన్నా తన మనసు అందుకు ఒప్పుకోలేదన్నాడు. ‘ఫెయిర్‌నెస్ క్రీమ్ సంస్థలకు ప్రచారం కల్పించి తప్పుడు సందేశాన్ని సమాజానికి అందించాలనుకోలేదు. కొన్ని వర్గాలు, జాతుల వారి మనోభావాలను దెబ్బతీసే ప్రకటనలు చేయకపోవడమే అత్యుత్తమం. అభయ్ డియోల్, షారుక్ ఖాన్, షాహిద్ కపూర్, జాన్ అబ్రహం, దీపికా పదుకొనే, సోనమ్ కపూర్, ప్రియాంక చోప్రా లాంటి స్టార్లు గతంలో ఫెయిర్‌నెస్ క్రీమ్స్ ప్రకటనలను వ్యతిరేకించారని’ సుశాంత్ గుర్తుచేశాడు. చివరగా రాబ్తా మూవీలో కనిపించిన సుశాంత్.. ప్రస్తుతం డ్రైవ్, చందమామ దూర్‌కే మూవీతో పాటు సైఫ్ అలీ ఖాన్ కూతురు సారా అలీ ఖాన్ బాలీవుడ్‌కు ఎంట్రీ ఇస్తున్న ‘కేదార్‌నాథ్’మూవీ షూటింగ్‌లతో బిజీగా ఉన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment