Kedarnath
-
శివనామస్మరణలతో కేదార్నాథ్ తలుపులు మూసివేత
రుద్రప్రయాగ: శివనామస్మరణల మధ్య చార్ధామ్లలో ఒకటైన కేదార్నాథ్ ధామ్ తలుపులను ఈరోజు (ఆదివారం) మూసివేశారు. శీతాకాలంలో ప్రతీయేటా ఈ తంతు కొనసాగుతుంటుంది. ఈరోజు తెల్లవారుజామున 4 గంటల నుంచి కేదార్‌నాథ్‌లో మహాశివునికి ఘనంగా పూజలు జరిగాయి. ఉదయం 8.30 గంటలకు ఆలయ తలుపులను మూసివేశారు. ఇకపై కేదారనాథుడు ఉఖిమఠ్‌లో ఆరు నెలల పాటు దర్శనం ఇవ్వనున్నారు. భయ్యా దూజ్ సందర్భంగా ఈ రోజున తలుపులు మూసివేశారు. ఈ సందర్భంగా పంచముఖి విగ్రహాన్ని సంచార విగ్రహ డోలీలో కొలువుదీర్చారు. అనంతరం ఈ విగ్రహం ఉఖిమఠ్‌లోని ఓంకారేశ్వర్‌కు ఊరేగింపుగా తరలిస్తారు. ఈ ఏడాది 16 లక్షల మంది యాత్రికులు కేదార్నాథ్ ధామ్‌ను సందర్శించుకున్నారు. #WATCH | Uttarakhand: The portals of Shri Kedarnath Dham closed for the winter season today at 8:30 am. The portals were closed with Vedic rituals and religious traditions amidst chants of Om Namah Shivay, Jai Baba Kedar and devotional tunes of the Indian Army band.(Source:… pic.twitter.com/vCg2as6aJ7— ANI (@ANI) November 3, 2024కేదార్‌నాథ్‌ను ఇక్కడ చివరిసారిగా దర్శనం చేసుకునేందుకు వేలాదిగా భక్తులు తరలివచ్చారు. ఆలయ ప్రాంగణాన్ని 10 క్వింటాళ్ల పూలతో అలంకరించారు. ఈరోజు కేదార్‌నాథ్‌లోని పంచముఖి విగ్రహాన్ని మొబైల్ విగ్రహం డోలీ ద్వారా ఉఖిమత్‌కు పంపనున్నారు. నిన్ననే(శనివారం) గంగోత్రి ధామ్ తలుపులు మూసివేశారు. ఉత్తరకాశీ జిల్లాలో ఉన్న ఉత్తరాఖండ్‌లోని నాలుగు ధామాలలో ఒకటైన గంగోత్రిలో గంగమ్మను పూజిస్తారు. ఇది కూడా చదవండి: త్వరలో నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభం -
రేపటి నుంచి కేదార్నాథ్ ఆలయం మూసివేత
చార్‌ధామ్‌గా ప్రసిద్ది చెందిన హిందూ పుణ్యక్షేత్రాలైన గంగోత్రి, యుమునోత్రి, బద్రీనాథ్, కేదార్నాథ్ ఆలయాల తలుపులు మూతపడనున్నాయి. చలికాలం రావడంతో అక్కడి వాతావరణ పరిస్థితుల దృష్ట్యా నాలుగు ఆలయాలను ఆరు నెలలపాటు మూసివేయానున్నారు. ఆ తర్వాత మళ్లీ వేసవికాలంలో చార్ధామ్ యాత్ర కొనసాగుతుంది.కాగా ఈ ఏడాది మే 10వ తేదీన ప్రారంభం అయిన చార్ధామ్ యాత్ర ముగింపు దశకు చేరుకోగా.. ఈ నాలుగు ధామాలలో ఒకటైన గంగోత్రి ధామ్ తలుపులను శనివారం మధ్యాహ్నం 12.14 గంటలకు మూసివేశారు. చార్‌ధామ్‌లో కీలకమైన కేదార్నాథ్ ఆలయాన్ని ఈ నెల 3వ తేదీన ఉదయం 8.30 గంటలకు మూసివేయనున్నట్లు అధికారులు తెలిపారు. మరోవైపు యమునోత్రి ధామ్ తలుపులు మూసివేసేందుకు కూడా అధికారులు సిద్ధం చేస్తున్నారు. ఇక విష్ణువు కొలువైన బద్రీనాథ్ ధామ్‌ను నవంబర్ 17వ తేదీన రాత్రి 9.07 గంటలకు మూసివేయనున్నారు. -
ఒకటిన బద్రీనాథ్, కేదార్‌నాథ్‌లో దీపావళి వేడుకలు
డెహ్రాడూన్: దీపాల పండుగ దీపావళిని దేశవ్యాప్తంగా అక్టోబర్ 31న జరుపుకోనుండగా, ఉత్తరాఖండ్‌లోని బద్రీనాథ్, కేదార్‌నాథ్‌లలో నవంబర్ ఒకటిన జరుపుకుంటున్నారు. తాజాగా దీపావళి పండుగను నవంబర్ 1న జరుపుకోవాలని బద్రీనాథ్-కేదార్నాథ్ ఆలయ కమిటీ ఉత్తర్వులు జారీ చేసింది.ఈ మేరకు ఉత్తరాఖండ్ అంతటా నవంబర్ ఒకటిన దీపావళి వేడుకలు జరుపుకోనున్నారు. బద్రీనాథ్ ధామ్‌కు చెందిన పండితుడు రాధా కృష్ణ తప్లియాల్ తెలిపిన వివరాల ప్రకారం ఈసారి అమావాస్య రెండు రోజుల పాటు వచ్చింది. ప్రదోష కాలం తరువాత కూడా అమావాస్య ఉంటుంది. అందుకే నవంబర్ ఒకటిన మహాలక్ష్మి పూజ చేయాల్సి ఉంటుంది. దీపావళి పండుగను కూడా అదే రోజు చేసుకోవాల్సి ఉంటుంది.నిజానికి ఉత్తరాఖండ్ ప్రభుత్వం ముందుగా నవంబర్ 1న దీపావళి సెలవు ప్రకటించింది. అయితే తరువాత దానిని సవరించి అక్టోబర్ 31న సెలవు ప్రకటించింది. తిరిగి ఇప్పుడు దీపావళి అధికారిక సెలవుదినం నవంబర్ ఒకటిగా పేర్కొంది. బద్రీనాథ్, కేదార్నాథ్ ఆలయాల్లో నవంబర్ ఒకటిన దీపావళి వేడుకలు జరగనున్నాయి. దేశవ్యాప్తంగా వెలువడిన 250 పంచాంగాలలో 180 పంచాంగాలలో నవంబర్ ఒకటిన దీపావళిని జరుపుకోవాలని తెలియజేశాయని, అందుకే ఉత్తరాఖండ్‌లో నవంబర్ ఒకటిన దీపావళి జరుపుకుంటున్నట్లు రాష్ట్రానికి చెందిన జ్యోతిష్య నిపుణులు తెలిపారు.ఇది కూడా చదవండి: వరల్డ్ ట్రేడ్ సెంటర్లో దీపావళి వెలుగులు -
ఆధ్యాత్మిక బాటలో హీరోయిన్.. పర్వతాల్లో ధ్యానం చేస్తూ!
బాలీవుడ్ భామ సారా అలీఖాన్ ఆధ్యాత్మిక బాటపట్టింది. ఇటీవల ముంబయిలో దివాళీ బాష్‌లో మెరిసిన ముద్దుగుమ్మ కేదార్నాథ్ ఆలయాన్ని సందర్శించింది. ఉత్తరాఖండ్‌లోని కేదార్నాథ్ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించింది. దీనికి సంబంధించిన ఫోటోలను తన ఇన్‌స్టా ద్వారా పంచుకుంది. కొండల మధ్య ధ్యానం చేస్తున్న ఫోటోలు వైరల్‌గా మారాయి. గతంలోనూ సారా అలీఖాన్ తన ఫ్రెండ్ జాన్వీ కపూర్‌తో కలిసి కేదార్నాథ్ సందర్శించింది.కాగా.. సారా అలీ ఖాన్ ప్రస్తుతం రొమాంటిక్ చిత్రం మెట్రో ఇన్డినోలో కనిపించనుంది. ఈ మూవీలో ఆదిత్యరాయ్ కపూర్, ఫాతిమాసనా షేక్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అనురాగ్ బసు దర్శకత్వం వహించిన ఇది నవంబర్ 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆ తర్వాత అక్షయ్ కుమార్ చిత్రం స్కై ఫోర్స్‌లో నటించనుంది. ఈ మూవీ వచ్చే ఏడాది థియేటర్లలో సందడి చేయనుంది. View this post on Instagram A post shared by Sara Ali Khan (@saraalikhan95) -
కేదారేశ్వరుని సేవలో కన్నప్ప టీమ్.. వీడియో వైరల్!
టాలీవుడ్ హీరో మంచు విష్ణు ప్రస్తుతం కన్నప్ప సినిమాను తెరకెక్కించడంలో బిజీగా ఉన్నారు. ఈ చిత్రాన్ని తన డ్రీమ్ ప్రాజెక్ట్‌గా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీని షూటింగ్‌ను విదేశాల్లో చిత్రీకరించారు. కన్నప్పలో ప్రభాస్‌తో పాటు పలువురు స్టార్ నటులు కనిపించనున్నారు. మోహన్ బాబు నిర్మిస్తున్న ఈ చిత్రానికి ముఖేష్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్ షూటింగ్ దాదాపు చివరి దశకు చేరుకుంది. ఈ ఏడాది డిసెంబర్లో పాన్ ఇండియాలో విడుదల చేయడానికి కన్నప్ప టీమ్ సన్నాహాలు చేస్తోంది.తాజాగా కన్నప్ప టీమ్ ఆలయాల సందర్శనకు బయలుదేరింది. మంచువిష్ణు, మోహన్ బాబుతో సహా పలువురు చిత్రబృంద సభ్యులు బద్రినాథ్, కేదార్నాథ్ ఆలయాలను దర్శించుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. శివుని భక్తుడైన కన్నప్ప మూవీ సక్సెస్ కావాలని కేదారాశ్వరుని ఆశీస్సులు తీసుకున్నట్లు తెలుస్తోంది.కాగా.. ఇప్పటికే కన్నప్ప టీజర్ రిలీజ్ కాగా.. అభిమానుల నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. విడుదలైన కొన్ని గంటల్లోనే అత్యధి వ్యూస్ సాధించింది. విష్ణు మంచు యాక్షన్ సీన్స్, యుద్ధ సన్నివేశాలు, అక్షయ్ కుమార్, ప్రభాస్ క్లోజప్ షాట్స్, హై ప్రొడక్షన్ వ్యాల్యూస్, స్టన్నింగ్ విజువల్స్, అదిరిపోయే పర్ఫార్మెన్స్ లతో ప్రేక్షకులని అలరించింది. ఈ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్, ప్రభాస్, మోహన్ లాల్, శరత్ కుమార్, మోహన్ బాబు, బ్రహ్మానందం, కాజల్ అగర్వాల్ వంటి స్టార్స్ ఇందులో నటిస్తున్నారు.Seeking blessings for an epic tale! @ivishnumanchu and team #Kannappa’s sacred journey to #Kedarnathॐ and #Badrinathॐ. #HarHarMahadevॐ@themohanbabu @mukeshvachan @arpitranka_30 @24FramesFactory @avaentofficial @KannappaMovie #TeluguFilmNagar pic.twitter.com/nHwehDTfO7— Telugu FilmNagar (@telugufilmnagar) October 25, 2024 -
కేదార్‌నాథ్‌ను సందర్శించిన మంచు విష్ణు,మోహన్‌బాబు (ఫొటోలు)
-
కేదార్‌నాథ్‌లో చిక్కుకున్న విజయనగరం యాత్రికులు
విజయనగరం క్రైమ్: చార్ధామ్ యాత్రకు వెళ్లి ప్రతికూల వాతావరణం కారణంగా కేదార్నాథ్ ఆలయం ప్రాంతంలో కొండపై విజయనగరం జిల్లాకు చెందిన భక్తులు చిక్కుకుపోయారు. ఢిల్లీకి చెందిన సదరన్ ట్రావెల్స్ ద్వారా ఇటీవల చార్ధామ్ యాత్రకు ఆంధ్రప్రదేశ్ నుంచి సుమారు 30 మంది వెళ్లారు. వీరిలో విజయనగరం జిల్లాకు చెందిన నలుగురు ఉన్నారు. రెండు రోజులుగా అక్కడ భారీ వర్షాలు కురుస్తుండడం, వాతావరణం అనుకూలించకపోవడంతో భక్తులు కొండలపైనే నిలిచిపోయారు. జిల్లాకు చెందిన నలుగురిలో గొట్టాపు త్రినాథరావు దంపతులు గురువారం హెలికాప్టర్లో కొండ కిందకు వచ్చేశారు. డిప్యూటీ తహసీల్దార్ కొట్నాన శ్రీనివాసరావు, ఆయన భార్య హేమలత ఇంకా కేదార్నాథ్ కొండపైనే ఉన్నారు. కేదార్నాథ్ ఆలయం ప్రాంతంలో వాతావరణం అనుకూలంగా లేదని హెలికాప్టర్ ప్రయాణం నిలిపివేశారని, తాము కొండపైనే బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నట్లు స్థానిక విలేకరులకు వారు శుక్రవారం ఫోన్లో తెలిపారు. భోజన, వసతి లభించక ఇబ్బందులు పడుతున్నట్లు ఆవేదన వ్యక్తంచేశారు. ఈ విషయం కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్నాయుడు దృష్టికి వెళ్లడంతో ఆయన అక్కడి అధికారులతో మాట్లాడారు. శుక్రవారం కొంత మేరకు వాతావరణం సహకరించడంతో రెండు హెలికాప్టర్లు మాత్రమే కేదార్నాథ్ ఆలయం వద్దకు వెళ్లగలిగాయని, అయితే వాటిలో ఏపీ వారికి అవకాశం ఇవ్వకపోవడంతో కొండపైనే ఉండిపోయారని తెలిసింది. -
Kedarnath: మట్టిపెళ్లల్లో కూరుకుపోయి నలుగురు మృతి
డెహ్రాడూన్: ఉత్తరాఖండ్‌లోని కేదార్నాథ్ యాత్రా మార్గంలో పెద్ద ప్రమాదం జరిగింది. సోన్‌ప్రయాగ్ -గౌరీకుండ్ మధ్య మట్టిపెళ్లలు విరిగిపడ్డాయి. వీటి కింద పలువురు కూరుకుపోయారు. ఇప్పటి వరకు నాలుగు మృతదేహాలను వెలికితీశామని అధికారులు తెలిపారు. శిథిలాల కింద చిక్కుకున్న ముగ్గురిని ఎన్డీఆర్ఎఫ్ బృందం రక్షించింది. ఈ ప్రమాదం గురించి తెలియగానే ఎస్డీఆర్ఎఫ్ బృందం సంఘటనా స్థలానికి చేరుకుని రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించింది. మట్టిపెళ్లల్లో చిక్కుకున్న ముగ్గురిని రక్షించారు. నాలుగు మృతదేహాలను వెలికి తీశారు. పలు విపత్తుల కారణంగా యాత్రకు అడుగడుగునా ఆటంకాలు ఎదురవుతున్నాయి. కాగా పరిస్థితులు కాస్త అనుకూలించడంతో యాత్ర మళ్లీ వేగం పుంజుకుంది. అయితే తాజా ఘటన తర్వాత అధికార యంత్రాంగం మరోసారి అప్రమత్తమైంది. స్థానిక పోలీసులు కూడా సంఘటనా స్థలంలో ఉంటూ, సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. -
కేదార్నాథ్ విపత్తు: 18 రోజులు దాటినా లభించని 17 మంది ఆచూకీ
ఉత్తరాఖండ్‌లోని కేదార్‌నాథ్‌లో భారీ వర్షాల కారణంగా ఘోర విపత్తు సంభవించింది. ఈ ఘటన జరిగి 18 రోజులు దాటినా ఈ విపత్తులో చిక్కుకున్న 17 మంది జాడ ఇంకా తెలియరాలేదు. సహాయక చర్యలు చేపడుతున్న రెస్క్యూ టీమ్‌కు ఇప్పటి వరకూ ఏడు మృతదేహాలు లభ్యమయ్యాయి. వీటిలో ఆరు మృతదేహాలను గుర్తించారు. కాగా ఈ విపత్తులో 23 మంది గల్లంతైనట్లు సోన్‌ప్రయాగ్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది.నేటికీ ఆచూకీ తెలియని 17 మందిలో యాత్రికులతో పాటు స్థానికులు కూడా ఉన్నారు. వీరి ఆచూకీ కోసం గౌరీకుండ్-కేదార్నాథ్ కాలినడక మార్గంలో సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది. జూలై 31న రాత్రి భారీ వర్షాలకు కొండచరియలు విరిగిపడటంతో కేదార్నాథ్ నడక మార్గం రాళ్లతో మూసుకుపోయింది. ఈ సమయంలో చాలా మంది ఆ రహదారిలో చిక్కుకుపోయారు. నాటి నుంచి రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. తాజాగా లించోలిలో శిథిలాలు, రాళ్ల కింద ముగ్గురు మృతదేహాలను కనుగొన్నారు. వీరిని ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్ నివాసితులు సుమిత్ శుక్లా (21), చిరాగ్ గుప్తా (20), న్యూ మాండ్లోయ్ నివాసి నిఖిల్ సింగ్ (20)గా గుర్తించారు. ఈ మృతదేహాలకు జిల్లా ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం బంధువులకు అప్పగించారు. -
Kedarnath: ఒక రోజంతా బండరాళ్లలో.. చివరికి వచ్చాడిలా
ప్రకృతి విపత్తులో చిక్కుకున్న అతను బండరాళ్ల కింద ఇరుక్కుపోయాడు. సహాయం కోసం రాత్రంతా అరుస్తూనే ఉన్నాడు. ఏమాత్రం ధైర్యం కోల్పోకుండా ఆపన్నహస్తాల కోసం కొన్ని గంటపాటు ఎదురు చూశాడు. చివరికి అతని నిరీక్షణ ఫలించింది.ప్రస్తుతం కేదార్నాథ్ ధామ్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. గత బుధవారం సాయంత్రం చీకటిపడ్డాక కేదార్నాథ్ నడకమార్గంలో వెళుతున్న చమోలీ జిల్లాకు చెందిన గిరీష్ చమోలీ ఊహించని విధంగా బండరాళ్ల మధ్య ఇరుక్కుపోయాడు. అప్పటి నుంచి సహాయం కోసం అరుస్తూనే ఉన్నాడు. శుక్రవారం ఉదయం రెస్క్యూ ఆపరేషన్ నిర్వహిస్తున్న ఏడీఆర్‌ఎఫ్ సైనికులు గిరీష్ ఆర్తనాదాలను విన్నారు. అతనిని రక్షించేందుకు ఆ బండరాళ్లను పగలగొట్టే పని మొదలు పెట్టారు. తొమ్మిది గంటల పాటు శ్రమించి వారు గిరీష్‌ను సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు.గిరీష్ తనకు ఎదురైన అనుభవాన్ని మీడియాకు చెబుతూ ‘బుధవారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. బయటకట్టి ఉన్న మా గుర్రాన్ని కాపాడుకునేందుకు నేను నిర్వహిస్తున్న దుకాణం నుంచి ఆ గుర్రం ఉన్న చోటుకు వెళ్లాను. ఇంతలో బండరాళ్ల కింద చిక్కుకుపోయాను. అయితే ఊపిరి పీల్చుకునేందుకు ఎటువంటి ఇబ్బంది ఎదురుకాలేదు. నా శరీరమంతా బండరాళ్ల కింద చిక్కుకుపోయింది. సహాయం కోసం రాత్రంతా అరుసూనే ఉన్నాను. నా గొంతు విని రెస్క్యూ సిబ్బంది నన్ను కాపాడారు’ అని తెలిపాడు. కాగా గిరీష్‌కు చికిత్స అందించేందుకు ఎస్డీఆర్ఎఫ్ కమాండెంట్ మణికాంత్ అతనిని హెలికాప్టర్లో ఆసుపత్రికి తరలించారు. -
కేదార్‌నాథ్‌లో సాగుతున్న సహాయక చర్యలు
రుద్రప్రయాగ్/సిమ్లా: ఉత్తరాఖండ్‌లోని కేదార్‌నాథ్‌లో చిక్కుకుపోయిన తీర్థయాత్రికుల కోసం మూడు రోజులుగా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకు 10,500 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. కేదార్నాథ్, భింబలి, గౌరీకుండ్ల్లో చిక్కుకుపోయిన మరో 1,500 మందిని బయటకు తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. వారంతా సురక్షితంగానే ఉన్నారని స్పష్టం చేసింది. యాత్రికులను తరలించేందుకు వైమానిక దళం చినూక్, ఎంఐ–17 హెలికాప్టర్లను శుక్రవారం రంగంలోకి దించింది. పర్వత మార్గంలో కుండపోతగా కురిసిన వర్షాల కారణంగా పలువురు గల్లంతైనట్లు వస్తున్న వార్తలను అధికారులు ఖండించారు. శుక్రవారం లించోలిలో ప్రాణాలు కోల్పోయిన వ్యక్తిని యూపీలోని సహరాన్‌పూర్‌కు చెందిన శుభమ్ కశ్యప్‌గా గుర్తించారు. భారీ వర్షాల కారణంగా గౌరీకుండ్–కేదార్నాధ్ ట్రెక్కింగ్ మార్గంలో 25 మీటర్ల మేర రహదారి కొట్టుకుపోయింది. అడ్డంకులను తొలగించి, రహదారిని పునరుద్ధరించే వరకు వేచి ఉండాలని రుద్రప్రయాగ్ యంత్రాంగం యాత్రికులను కోరింది.హిమాచల్‌లో ఆ 45 మంది కోసం గాలింపుహిమాచల్ ప్రదేశ్‌లోని కులు, సిమ్లా, మండి జిల్లాల్లో వరద బీభత్సంలో గల్లంతైన 45 మంది కోసం గాలింపు కొనసాగుతోంది. మండి జిల్లా రాజ్బన్ గ్రామంలో రాతి కింద చిక్కుకున్న వ్యక్తిని గుర్తించారు. కులు జిల్లా సమెజ్ గ్రామంలో గల్లంతైన పోయిన 30 మంది కోసం డ్రోన్ల సాయంతో గాలిస్తున్నారన్నారు. శ్రీఖండ్ మహాదేవ్ ఆలయంలో చిక్కిన 300 మంది, మలానాలో చిక్కుకున్న 25 మంది పర్యాటకులు క్షేమంగా ఉన్నారని అధికారులు చెప్పారు. -
కేదార్‌నాథ్‌లో చిక్కుకున్న తెలుగు యాత్రికులు
సాక్షి, ఢిల్లీ: ఉత్తరాఖండ్ కేదార్‌నాథ్‌లో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. కేదార్నాథ్ వరదలలో తెలుగు యాత్రికులు చిక్కుకున్నారు. క్లౌడ్ బరస్ట్, భారీ వర్షాల కారణంగా నడక మార్గం దెబ్బతింది. దాదాపు 1,300 మంది యాత్రికులు కేదార్నాథ్, భీంబాలి, గౌరీకుండ్‌లలో చిక్కుకుపోయారని, వారు సురక్షితంగా ఉన్నారని అధికారులు వెల్లడించారు. గౌరీకుండ్ - కేదార్నాథ్ మధ్య 13 చోట్ల మార్గం ధ్వంసమైంది. దీంతో ఎక్కడికక్కడ పలువురు యాత్రికులు చిక్కుకుపోయారు.యాత్రికులను హెలీకాప్టర్లతో సహాయ బృందాలు తరలిస్తున్నాయి. సహాయ చర్యలకు ప్రతికూల వాతావరణం విఘాతం కలిగిస్తోంది. స్థానికులకే ప్రాధాన్యతనివ్వడంతో దూరప్రాంత యాత్రికులు అక్కడే నిలిచిపోయారు. ఆహారం, నీరు అందక యాత్రికులు ఇబ్బందులు పడుతున్నారు. కేదార్నాథ్ స్వర్గ రోహిణి కాటేజిలో పలువురు తెలుగు యాత్రికులు ఉన్నారు. సహాయం కోరుతూ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కు మెసేజ్ చేశారు. ఆయన ఉత్తరాఖండ్ అధికార యంత్రాంగంతో మాట్లాడారు. వారిని సురక్షితంగా బయటకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తామని జిల్లా కలెక్టర్ తెలిపారు.#WATCH | Uttarakhand | Joint search and rescue operations of NDRF & SDRF are underway in Rudraprayag to rescue the pilgrims stranded in Kedarnath and adjoining areas." pic.twitter.com/BOTfOEyaBP— ANI (@ANI) August 3, 2024 -
కేదార్‌నాథ్‌లో చిక్కుకున్న భక్తులు.. కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్
ఉత్తరాఖండ్‌లో ప్రకృతి విలయతాండవం చేస్తోంది. బాధితులను రక్షించేందుకు వైమానిక దళానికి చెందిన చినూక్, ఎంఐ 17 హెలికాప్టర్లు రంగంలోకి దిగాయి. కేదార్నాథ్ మార్గంలో చిక్కుకుపోయిన 6,980 మందికి పైగా యాత్రికులకు రక్షించారు. ఇంకా 1,500 మందికి పైగా భక్తులు, స్థానికులు ఇప్పటికీ పలు ప్రాంతాల్లో చిక్కుకుపోయారు. వీరిలో 150 మంది తమ కుటుంబాలను సంప్రదించలేని స్థితిలో ఉన్నారు.సోన్‌ప్రయాగ్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ డాక్టర్ విశాఖ అశోక్ భదానే మాట్లాడుతూ భారీ వర్షాల కారణంగా ఇప్పటివరకు ఒక యాత్రికుడు మృతిచెందారు. కేదార్నాథ్ మార్గంలో చిక్కుకున్న 150 మందికి పైగా కుటుంబ సభ్యులు ఈ ప్రాంతంలో మొబైల్ కనెక్టివిటీ లేకపోవడంతో తమ కుటుంబసభ్యులను సంప్రదించలేకపోతున్నారని ఆయన తెలిపారు.కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి ధామితో టెలిఫోన్లో మాట్లాడారు. విపత్తు అనంతరం జరుగుతున్న రెస్క్యూ ఆపరేషన్ గురించి అడిగి తెలుసుకున్నారు. సహాయక చర్యలకు అన్ని విధాలా సహకరిస్తామని హామీ ఇచ్చారు. ప్రస్తుతం ఎయిర్ ఫోర్స్ హెలికాప్టర్ల సాయంతో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. శుక్రవారం 599 మందిని విమానంలో, 2,380 మందిని కాలినడకన సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు అధికారులు తెలిపారు. -
కేదార్నాథ్ యాత్రలో విషాదం.. ముగ్గురు మృతి
ఉత్తరాఖండ్‌లోని కేదార్‌నాథ్‌లో ప్రమాదం చోటుచేసుకుంది. ఇక్కడి నడక మార్గంలో నేటి ఉదయం (ఆదివారం) ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. కొండలపై నుంచి పడిన రాళ్ల కారణంగా ముగ్గురు యాత్రికులు మృతిచెందగా, పలువురు శిథిలాల కింద చిక్కుకుపోయినట్లు తెలుస్తోంది.ఇప్పటి వరకూ శిథిలాల నుంచి ముగ్గురు యాత్రికుల మృతదేహాలను బయటకు తీశారు. ఈ ప్రమాదంలో మరో ఎనిమిది మంది గాయపడ్డారు. వీరంతా మహారాష్ట్రకు చెందిన వారని సమాచారం. ఈ ప్రమాదంపై ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి విచారం వ్యక్తం చేశారు. కేదార్నాథ్ యాత్రా మార్గం సమీపంలో కొండపై నుండి పడుతున్న రాళ్ల కారణంగా కొందరు యాత్రికులు మృతిచెందారన్న వార్త చాలా బాధ కలిగిందని సీఎం పేర్కొన్నారు. ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయన్నారు. ప్రమాదంలో గాయపడిన వారికి వెంటనే మెరుగైన వైద్యం అందించాలని సీఎం అధికారులకు సూచనలు జారీ చేశారు.జిల్లా విపత్తు నిర్వహణ అధికారి నందన్ సింగ్ రాజ్వార్ మాట్లాడుతూ ఆదివారం ఉదయం 7.30 గంటలకు కేదార్నాథ్ యాత్రా మార్గంలోని చిర్బాసా సమీపంలోని కొండపై నుండి పడిన భారీ రాళ్ల కారణంగా యాత్రికులు సమాధి అయినట్లు తమకు సమాచారం అందిందని తెలిపారు. వెంటనే ఎన్డిఆర్ఎఫ్, డిడిఆర్, వైఎంఎఫ్ అడ్మినిస్ట్రేషన్ బృందంతో సహా యాత్రా మార్గంలోని భద్రతా సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారన్నారు. రెస్క్యూ టీమ్ శిథిలాల నుంచి ముగ్గురి మృతదేహాలను బయటకు తీసిందని, గాయపడిన ఎనిమిది మందిని ఆస్పత్రికి తరలించారని తెలిపారు. -
కేదార్నాథ్ బీజేపీ ఎమ్మెల్యే శైలా రాణి మృతి
ఉత్తరాఖండ్‌లోని ప్రముఖ పుణ్యక్షేత్రం కేదార్నాథ్ బీజేపీ ఎమ్మెల్యే శైలా రాణి రావత్ మరణించారు. డెహ్రాడూన్‌లోని మ్యాక్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి తుదిశ్వాస విడిచారు. ప్రస్తుతం ఆమె వయసు 68 ఏళ్లు. వెన్నెముక గాయం కారణంగా ఇటీవలే ఆసుపత్రిలో చేరిన ఆమెకు వైద్యులు వెంటిలేటర్‌పై చికిత్స అందించారు. అయితే ఆరోగ్యం క్షీణించడంతో ప్రాణాలు కోల్పోయినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.కాగా శైలారాణి రావత్.. 2012లో కాంగ్రెస్ టికెట్‌పై తొలిసారిగా కేదార్నాథ్ స్థానం నుంచి ఉత్తరాఖండ్ అసెంబ్లీకి ఎన్నికయ్యారు. అయితే, 2016లో ఉత్తరాఖండ్ మాజీ ముఖ్యమంత్రి హరీష్ రావత్‌పై 10 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేశారు. వారిలో ఆమె కూడా ఉన్నారు. ఆ తర్వాత 2017లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయారు. 2022లో బీజేపీ తరపున పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు. -
చార్ధామ్ యాత్రలో సరికొత్త రికార్డులు
డెహ్రాడూన్: ప్రస్తుతం ఉత్తరాఖండ్‌లో కొనసాగుతున్న చార్ధామ్ యాత్ర సరికొత్త రికార్డులను నెలకొల్పుతోంది. మే 10న ఈ యాత్ర ప్రారంభం కాగా, గడచిన 50 రోజుల్లో 30 లక్షల మంది చార్‌ధామ్‌ను సందర్శించుకున్నారు. గంగోత్రి, యమునోత్రి, కేదార్నాథ్ ఆలయాలను మే 10న తెరిచారు. మే 12న బద్రీనాథ్ తలుపులు తెరిచారు.గత ఏడాది ఏప్రిల్ 22న చార్ధామ్ యాత్ర ప్రారంభం కాగా 2023, జూన్ 30 నాటికి 30 లక్షల మంది నాలుగు ధామాలను దర్శించుకున్నారు. అయితే ఈసారి 50 రోజుల వ్యవధిలోనే 30 లక్షల మంది చార్‌ధామ్‌ను దర్శించుకున్నారు. చార్ధామ్లలో ఇప్పటివరకూ అత్యధిక సంఖ్యలో భక్తులు కేదార్‌నాథ్‌ను దర్శించుకున్నారు. 10 లక్షల ఆరు వేలమంది కేదార్‌నాథ్‌ను దర్శించుకున్నారు. బద్రీనాథ్‌ను ఎనిమిది లక్షల 20వేల మంది దర్శించుకున్నారు.గంగోత్రిని ఇప్పటివరకూ నాలుగు లక్షల 98వేల మంది దర్శించుకున్నారు. అలాగే యమునోత్రిని నాలుగు లక్షల 70 వేల మంది సందర్శించుకున్నారు. 2023లో చార్‌ధామ్‌ను 56 లక్షల మంది భక్తులు సందర్శించుకున్నారు. ఈసారి ఆ రికార్డులు దాటవచ్చనే అంచనాలున్నాయి. -
కేదార్‌నాథ్‌లో మంచు వరద
డెహ్రాడూన్: ఉత్తరాఖండ్‌లోని కేదార్నాథ్ గాంధీ సరోవర్ ప్రాంతంలో ఆదివారం(జూన్30) ఉదయం మంచు వరద పోటెత్తింది. ‘కేదార్నాథ్ దామ్ వెనుకాల ఉన్న మంచుపర్వతం దగ్గర ఉదయం 5 గంటలకు మంచు వరద వచ్చింది. మంచు వరద వల్ల ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టాలు జరగలేదు. పర్వతం మీద నుంచి మంచు కిందికి వచ్చింది. ఇది కేదార్‌నాథ్‌లో అలజడికి కారణమైంది’అని రుద్రప్రయాగ్ సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ విశాఖ అశోక్ తెలిపారు. కాగా, బ్రదినాథ్, కేదార్నాథ్, గంగోత్రి, యమునోత్రిలను కలిపి చార్దామ్ యాత్రా సర్క్యూట్‌గా పిలుస్తారు. -
చార్‌ధామ్‌లో భక్తుల నిలువు దోపిడీ
ఉత్తరాఖండ్‌లో చార్ధామ్ యాత్ర కొనసాగుతోంది. రోజూ వేల సంఖ్యలో భక్తులు యాత్రలో పాల్గొంటున్నారు. తాజాగా సోషల్ మీడియాలో కేదార్నాథ్ యాత్రలో వ్యాపారుల నిలువు దోపిడీకి సంబంధించిన ఒక వీడియో వైరల్‌గా మారింది. మరోవైపు కేదార్నాథ్ మార్గంలో ట్రాఫిక్ జామ్ పెద్ద సమస్యగా పరిణమించింది.వైరల్ అయిన ఆ వీడియోలో ఓ వ్యక్తి కేదార్‌నాథ్‌లోని ఆహార పదార్థాల ధరలను తెలియజేశాడు. సాధారణంగా పర్వత ప్రాంతాల్లో వివిధ వస్తువులు, ఆహార పదార్థాల ధరలు అధికంగానే ఉంటాయి. అయితే చార్ధామ్ యాత్ర సందర్భంగా ఆహార పదార్థాల ధరలను అమాంతం పెంచేయడం భక్తులకు భారంగా మారింది. సాధారణ రోజులలో రూ. 10కి దొరికే టీ రూ. 30కి, రూ. 20కి లభించే వాటర్ బాటిల్ రూ. 100కు విక్రయిస్తున్నారు. అలాగే కాఫీ ధరను రూ. 50కి పెంచేశారు. శీతల పానీయాల ధరలను కూడా విపరీతంగా పెంచారు. ఇతర ఆహార పదార్థాల ధరలను కూడా రెట్టింపు చేశారు.ఈ వీడియోలో వ్యాపారులను వివిధ వస్తువుల ధరలను అడిగిన ఆ వ్యక్తి వాటి ధరలు ఎందుకు పెరిగాయో కూడా తెలిపాడు. ఆయా వస్తువులను కింది నుంచి పైకి తీసుకువచ్చేందుకు రవాణా ఖర్చులు అధికమవుతున్నాయని తెలిపాడు. అయితే వైష్ణోదేవి యాత్రలో ఇంత భారీ ఖర్చులు ఉండవని కూడా పేర్కొన్నాడు. -
తెరుచుకున్న కేదార్నాథ్ ఆలయం
పవిత్ర చార్ధామ్ యాత్ర ప్రారంభమైంది. ఆరునెలల తర్వాత కేదార్నాథ్ క్షేత్ర ద్వారాలు తెరుచుకున్నాయి. తొలిరోజే దాదాపు 16వేలమంది భక్తులు పరమేశ్వరుడిని దర్శించుకున్నారు. కేదార్నాథ్తోపాటే గంగోత్రి, యమునోత్రిలోనూ భక్తుల దర్శనాలు ఆరంభమయ్యాయి.దేవభూమి ఉత్తరాఖండ్ హరహర మహాదేవ్ నామస్మరణతో మారుమోగింది. ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాల్లో ఒకటైన ప్రసిద్ధ కేదార్నాథ్ ఆలయం తెరుచుకుంది. అక్షయ తృతీయనాడు.. భజనలు, సంకీర్తనల మధ్య క్షేత్ర ద్వారాలు తెరిచారు అధికారులు. దాదాపు 40 క్వింటాళ్ల పూలతో ఆలయాన్ని సుందరంగా అలంకరించారు. హెలికాఫ్టర్ల నుంచి పూల వర్షం కురిపించారు.కేదార్నాథ్ తలుపులు తెరుచుకోవడంతో.. పవిత్ర చార్ధామ్ యాత్ర మొదలైంది. ఆరునెలలపాటు మూసి ఉన్న ద్వారాలు తెరుచుకునే సమయంలో.. దేవాలయ ప్రాంగణం జై కేదార్ నినాదాలతో మారుమోగింది. దాదాపు 16 వేలమంది భక్తులు తొలిరోజు కేదారీశ్వరుని దర్శనానికి వచ్చారు. వేలాదిమంది భక్తులతోపాటు ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి.. సతీసమేతంగా కేదారనాథుడిని దర్శించుకున్నారు. తొలి పూజలో పాల్గొన్నారు.కేదార్నాథ్, బద్రినాథ్, గంగోత్రి, యమునోత్రి క్షేత్రాలను కలిపి చార్ధామ్ యాత్రగా పిలుస్తారు. కేదారధామంతోపాటే గంగోత్రి, యమునోత్రి ఆలయ ద్వారాలు భక్తుల కోసం తెరుచుకున్నాయి. పరమపవిత్రంగా భావించే చార్ధామ్ యాత్ర గంగోత్రి దర్శనంతో ప్రారంభమవుతుంది. గంగోత్రి, యమునోత్రి తర్వాత కేదారనాథుని దర్శించుకుంటారు భక్తులు. చివరగా బద్రినాథ్ ధామం చేరుకుని యాత్రను ముగిస్తారు. భూమిపై వైకుంఠంగా పరిగణించే బద్రీనాథ్ క్షేత్ర ద్వారాలు ఈనెల 12న ఉదయం 6 గంటలకు తెరుచుకోనున్నాయి.ఏటా లక్షలమంది భక్తులు చార్ధామ్ యాత్రకు తరలివస్తుంటారు. గతేడాది రికార్డు స్థాయిలో 55 లక్షలమంది రిజిస్ట్రేషన్ చేసుకోగా.. ఈసారి యాత్ర ప్రారంభం నాటికే 22.15 లక్షల మంది భక్తులు తమ పేర్లు నమోదు చేసుకున్నారు. రానున్న రోజుల్లో ఈ సంఖ్య మరింత పెరగనుంది. మరోవైపు ఉత్తరాఖండ్‌లో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో చార్ధామ్ యాత్రకు పటిష్ట ఏర్పాట్లు చేసింది ఉత్తరాఖండ్ ప్రభుత్వం. -
తెరుచుకున్న కేదార్నాథ్ ఆలయ తలుపులు.. మోదీ పేరుమీద మొదటి పూజ
డెహ్రాడూన్: భారతదేశంలోని పవిత్ర పుణ్యక్షేత్రాలలో ఒకటైన కేదార్నాథ్ ఆలయం తలుపులు ఈ రోజు ఓపెన్ చేశారు. ఆరు నెలల విరామం తరువాత ఆలయ తలుపులు తెరిచి పూజలు నిర్వహించారు. మొదటి పూజ ప్రధాని నరేంద్ర మోడీ పేరు మీద నిర్వహించినట్లు ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి పేర్కొన్నారు.ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి సమక్షంలో ఆలయ తలుపులు తెరిచి భక్తులందరికీ స్వాగతం పలికారు. చార్ధామ్ తీర్థయాత్రకు బయలుదేరే వారందరికీ సురక్షితమైన, సంతృప్తికరమైన ప్రయాణం కోసం ప్రార్థనలు చేశారు.దేశం నలుమూలల నుంచి మాత్రమే కాకుండా ఇతర దేశాల నుంచి కూడా భక్తులు, యాత్రికులు ఈ తీర్థ యాత్ర కోసం వేచి ఉంటారు. ఈ కారణంగానే చాలామంది భక్తులు పెద్ద ఎత్తున దర్శనం కోసం వచ్చారు. వారందరికీ నా శుభాకాంక్షలు సీఎం ధామి శుభాకాంక్షలు తెలిపారు.నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయినప్పటి నుంచి బాబా కేదార్ ఆలయ పునరాభివృద్ధికి సంబంధించిన పనులు మూడు దశల్లో జరుగుతున్నాయి, ప్రాజెక్టును త్వరగా పూర్తి చేయడానికి తాము కృషి చేస్తున్నట్లు ధామి పేర్కొన్నారు. చలికాలంలో ఆరు నెలల విరామం తరువాత దైవ దర్శనానికి ఆలయ తలుపు తెలిచారు. అయితే బద్రీనాథ్ ఆలయ తలుపులు మే 12న ఓపెన్ చేస్తారు.#WATCH | Rudraprayag: After the opening of the doors of Shri Kedarnath Dham temple, Uttarakhand CM Pushkar Singh Dhami says, "Devotees and pilgrims keep waiting for this Yatra. That holy day arrived day and the doors opened. Devotees have arrived here in large numbers. All… pic.twitter.com/dC50GyXSTC— ANI (@ANI) May 10, 2024 -
Lok sabha elections 2024: దేవభూమిలో ఈసారీ... కమల వికాసమే!
హిమాలయ పర్వత సిగలో బద్రీనాథ్, కేధార్నాథ్ వంటి ప్రముఖ హిందూ పుణ్యక్షేత్రాలకు నెలవైన ‘దేవభూమి’ ఉత్తరాఖండ్. 2000 సంవత్సరంలో ఉత్తరప్రదేశ్ నుంచి విడిపోయి ఉత్తరాంచల్‌గా ఏర్పాటైన ఈ రాష్ట్రం పేరు 2006లో ఉత్తరాఖండ్గా మారింది. ఇక్కడి రాజకీయాల్లో ప్రధానంగా బీజేపీ, కాంగ్రెసే చక్రం తిప్పుతున్నాయి. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో కీలకంగా నిలిచిన ఉత్తరాఖండ్ క్రాంతి దళ్ (యూకేడీ), బహుజన సమాజ్ పార్టీ (బీఎస్పీ) కూడా కాస్త ప్రభావం చూపుతున్నాయి. పదేళ్లుగా ఉత్తరాఖండ్ పూర్తిగా కాషాయమయమైంది. అటు అసెంబ్లీలో, ఇటు లోక్‌సభ ఎన్నికల్లోనూ బీజేపీ హవాయే నడుస్తోంది. గత రెండు లోక్‌సభ ఎన్నికల్లో క్లీన్‌స్వీప్ చేసిన కమలనాథులు ఈసారి హ్యాట్రిక్ కోసం ఉవ్విళ్లూరుతున్నారు. ఈసారి ఎలాగైనా సత్తా చాటాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది. ఉత్తరాఖండ్ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటైన నాటి నుంచి బీజేపీ, కాంగ్రెస్ మధ్య అధికారం చేతులు మారింది. 2012 నుంచీ మాత్రం రాష్ట్రం బీజేపీ గుప్పిట్లోనే ఉంది. 2002లో కొత్త రాష్ట్రంలో జరిగిన తొలి అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీ తివారీ సారథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం పగ్గాలు చేపట్టింది. ఉత్తరప్రదేశ్‌కు మూడుసార్లు సీఎంగా చేసిన ఆయన రెండు రాష్ట్రాల్లోనూ సీఎం పదవి చేపట్టిన తొలి, ఏకైక నేతగా చరిత్ర సృష్టించారు. 2007లో ఉత్తరాఖండ్‌లో మళ్లీ బీజేపీ అధికారం దక్కించుకుంది. 2012 ఎన్నికల్లో కాంగ్రెస్ అత్యధిక స్థానాలు గెలుచుకుంది. బీఎస్పీ, యూకేడీ, స్వతంత్రుల మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. విజయ్ బహుగుణ, హరీశ్ రావత్ రూపంలో ఆ ఐదేళ్లలో ఇద్దరు సీఎంలను మార్చింది. కాంగ్రెస్ ఎమ్మెల్యేల తిరుగుబాటు, రాష్ట్రపతి పాలన, సుప్రీంకోర్టు ఆదేశాలతో రావత్ విశ్వాస పరీక్షలో నెగ్గడం వంటి నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. 2014 లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలోని మొత్తం 5 సీట్లను దక్కించుకున్న బీజేపీ 2017 అసెంబ్లీ ఎన్నికల్లోనూ బంపర్ మెజారిటీతో అధికారంలోకి వచి్చంది. మొత్తం 70 సీట్లలో ఏకంగా 57 స్థానాలను కొల్లగొట్టింది! 2019 లోక్‌సభ ఎన్నికల్లోనూ కాషాయ పార్టీ మరోసారి క్లీన్‌స్వీప్ చేసింది. 2022 అసెంబ్లీ ఎన్నికల్లో కాస్త మెజారిటీ తగ్గినప్పటికీ 47 సీట్లతో మళ్లీ అధికారాన్ని నిలబెట్టుకుంది. 19 సీట్లతో కాంగ్రెస్ కాస్త పుంజుకుంది. ఈసారి లోక్‌సభ ఎన్నికల్లో పూర్వ వైభవం కోసం వ్యూహరచన చేస్తోంది. రాష్ట్రంలోని 5 ఎంపీ సీట్లలో ఒకటి ఎస్సీ రిజర్వుడు స్థానం. సర్వేలు ఏం చెబుతున్నాయి... రాష్ట్రంలో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో పూర్తి ఆధిపత్యంతో బీజేపీ మంచి జోరు మీదుంది. అయోధ్య రామమందిర నిర్మాణం, హిందుత్వ, మోదీ ఫ్యాక్టర్, అభివృద్ధి నినాదాలతో హోరెత్తిస్తోంది. కాంగ్రెసేమో ఇండియా కూటమి దన్నుతో మొత్తం ఐదు స్థానాల్లో సింగిల్‌గా పోటీ చేస్తోంది. ధరల పెరుగుదల, నిరుద్యోగం, కార్పొరేట్లతో మోదీ సర్కారు కుమ్మక్కు వంటివాటిని ప్రచారా్రస్తాలుగా చేసుకుంది. కులగణన, సంక్షేమ పథకాలు, యువతకు ఉద్యోగాలు వంటి హామీలను గుప్పిస్తోంది. అయితే సర్వేలు మాత్రం బీజేపీకే జై కొడుతున్నాయి. ఈసారి కూడా 5 సీట్లూ గెలుచుకుని హ్యాట్రిక్ కొడుతుందని అంచనా వేస్తున్నాయి. – సాక్షి, నేషనల్ డెస్క్ -
బికనీర్‌వాలా చైర్మన్ అగర్వాల్ కన్నుమూత
న్యూఢిల్లీ: స్వీట్స్, స్నాక్స్ బ్రాండ్ బికనీర్‌వాలా చైర్మన్ కేదార్నాథ్ అగర్వాల్ (86) సోమవారం కన్నుమూశారు. ‘కాకాజీ’ అంటూ అంతా ఆప్యాయంగా పిల్చుకునే అగర్వాల్ మరణం తమకు తీరని లోటని సంస్థ డైరెక్టరు, ఆయన కుమారుడు రాధే మోహన్ అగర్వాల్ తెలిపారు. ఢిల్లీ వీధుల్లో ఒకప్పుడు రసగుల్లాలు, భుజియా వంటి తినుబండారాలను విక్రయించిన అగర్వాల్.. అంచెలంచెలుగా బికనీర్‌వాలాతో దేశ, విదేశాల్లోనూ కార్యకలాపాలు విస్తరించే స్థాయికి ఎదిగారు. ప్రస్తుతం భారత్‌తో పాటు అమెరికా, న్యూజిలాండ్, సింగపూర్, నేపాల్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) తదితర దేశాల్లో 60 పైచిలుకు అవుట్‌లెట్స్ ఉన్నాయి. -
Kedarnath: ఎదురుపడ్డ సోదరులు.. రాహుల్, వరుణ్‌గాంధీ అప్యాయ పలకరింపు
న్యూఢిల్లీ: వాళ్లిద్దరూ సోదరులే... కాకపోతే దశాబ్దాలుగా ఎడముఖం పెడముఖమే. ఇద్దరూ రాజకీయనేతలే. పార్లమెంటు సభ్యులే. కానీ పార్టీలు మాత్రం వేర్వేరు. అలాంటి ఇద్దరు అన్నదమ్ములు అకస్మాత్తుగా.. అనుకోకుండానే ఒకరికొకరు తారసపడితే? ఇలాంటి అపురూపమైన ఘట్టమే మంగళవారం ఉత్తారఖండ్‌లోని కేదార్‌నాథ్‌లో ఆవిషృతమైంది. ఆ అన్నదమ్ములు ఎవరో కాదు.. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ కుమారుడు రాహుల్ గాంధీ.. ఇందిరగాంధీ రెండో కోడలైన మేనకా గాంధీ కుమారుడు వరుణ్ గాంధీ! కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మూడు రోజులుగా రాహుల్ గాంధీ కేదార్‌నాథ్‌లోనే ఉంటున్నారు. అయితే మంగళవారం వరుణ్ గాంధీ తన కుటుంబంతో కలిసి కేదార్‌నాథ్‌లో శివుడిని దర్శించుకునేందుకు వచ్చారు. ఈ సమయంలోనే ఇద్దరు సోదరులు ఒకరికొకరు ఎదురయ్యారు. కేదార్నాథ్ ఆలయాన్ని దర్శించుకున్న తరువాత ఆలయం బయట ఇద్దరు నేతలు కలుసుకొని కొద్దసేపు ఆప్యాయంగా పలకరించుకున్నారు. అయితే ఈ సమావేశం చాలా తక్కువ సమయం జరిగిందని సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. వీరిద్దరి సంభాషణలో రాజకీయాల గురించి చర్చ జరగలేదని తెలిపాయి. వరుణ్ కుమార్తెను చూసి రాహుల్ సంతోషం వ్యక్తం చేసినట్లు సమాచారం. पवित्र देवभूमि की यात्रा हमेशा की तरह अद्भुत एवं अविस्मरणीय रही। ऋषियों के तपोबल से उन्मुक्त हिमालय की गोद में आकर ही मन मस्तिष्क एक नयी ऊर्जा से भर गया। साथ ही परिवार समेत बाबा केदार और भगवान बद्री विशाल के दर्शन करने का सौभाग्य भी मिला। प्रभु सभी का कल्याण करें। 🙏 pic.twitter.com/aSKzj4xUI1 — Varun Gandhi (@varungandhi80) November 8, 2023 కాగా రాహుల్ వరుణ్ ఇద్దరూ సోదరులే అయినప్పటికీ బహిరంగంగా కలిసి కనిపించడం చాలా అరుదు. అయితే ఉన్నట్టుండి ఈ ప్రత్యర్థి పార్టీ ఎంపీలు ఎదురుపడటం, సమావేశమవడం ప్రాధాన్యత సంతరించుకుంది. రాహుల్‌తో భేటీ కావడంతో వరుణ్ త్వరలోనే పార్టీ మారే అవకాశాలు ఉన్నట్లు పుకార్లు వినిపిస్తున్నాయి. దీనికి తోడు వరుణ్ గాంధీ ఆ మధ్య కాలంలో బీజేపీ పార్టీలో యాక్టివ్‌గా కనిపించడం లేదు. పార్టీ ముఖ్య సమావేశాల్లో ఆయన కనిపించడం లేదు. అంతేగాక కొత్త వ్యవసాయ చట్టాలు, లఖింపూర్ ఖేరీ ఘటన సహా పలు కీల అంశాలపై కేంద్ర ప్రభుత్వాన్ని బహరింగానే ప్రశ్నిస్తూ వస్తున్నారు. ఇవన్నీ చూస్తుంటే ఆయన బీజేపీకి గుడ్‌బై చెప్పి, కాంగ్రెస్‌లో చేరనున్నారనే సందేహాలకు బలాన్ని చేకూర్చుతున్నాయి. ఇక సంజయ్ గాంధీ, మేనకాగాంధీల కుమారుడు అయిన వరుణ్ గాంధీ ప్రస్తుతం ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఫిలిభిత్ నుంచి బీజేపీ ఎంపీగా ఉన్నారు. అయితే గతేడాది వరుణ్ గాంధీ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారనే వార్తలు వస్తున్నాయని..ఆయన్నుపార్టీలోకి ఆహ్వానిస్తారా అని రాహుల్‌కు ఓ మీడియా సమావేశంలో ప్రశ్న ఎదురైంది. దీనికి వయనాడ్ ఎంపీ మాట్లాడుతూ.. కాంగ్రెస్‌లోకి ఎవరినైనా ఆహ్వానిస్తామని తెలిపారు. అయితే వరుణ్ బీజేపీ/ ఆర్ఎస్ఎస్ భావజాలాన్ని మాత్రం ఎన్నడూ సమర్థించనని స్పష్టం చేశారు. -
యూట్యూబర్ ఎఫెక్ట్.. కేదార్నాథ్ ఆలయంలో మొబైల్ ఫోన్లు నిషేదం..
డెహ్రాడూన్: సోషల్ మీడియాలో క్రేజ్ సంపాదించుకోవడం కోసం ఇటీవల ఒక యూట్యూబర్ పవిత్ర పుణ్యక్షేత్రమైన కేదార్నాథ్ ఆలయ ప్రాంగణంలో తన ప్రేమను ప్రపోజ్ చేసిన సంఘటన ఆలయ వర్గాలను విస్మయానికి గురి చేసింది. దీంతో ఆలయంలో ఇటువంటి సంఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా కఠిన చర్యలకు ఉపక్రమించింది శ్రీ కేదార్నాథ్ బద్రీనాథ్ ఆలయ కమిటీ. కొద్దిరోజుల క్రితం విశాఖ ఫల్స్ నుంగే అనే ఒక యూట్యూబర్ తన ఫాలోవర్ల మెప్పు కోసం ఉత్రాఖండ్ లోని కేదార్ నాథ్ ఆలయంలో మోకరించి తనకు బాయ్ ఫ్రెండుకు తన ప్రేమను తెలియజేసి ఆ వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. మెప్పు పొందడం సంగతి అటుంచితే దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. ఆలయంలో పిచ్చి పనులేంటని కామెంట్లు కూడా పోటెత్తాయి. ఈ ఓవరాక్షన్ భరించలేకపోతున్నామని నెటిజన్లు అత్యధిక సంఖ్యలో ఆమెను ఏకిపారేశారు. ఈ సంఘటన జరిగిన కొద్ది వారాలకు శ్రీ కేదార్నాథ్ బద్రీనాథ్ ఆలయ కమిటీ సమావేశమై పవిత్ర పుణ్యక్షేత్రంలో ఇలాంటి సంఘటనలు మళ్ళీ పునరావృతం కాకుడదని ఆలయ ప్రాంగణంలో మొబైల్ ఫోన్లను నిషేధిస్తున్నట్లు ప్రకటించింది. ఈ సందర్బంగా శ్రీ కేదార్నాథ్ బద్రీనాథ్ ఆలయ కమిటీ అధ్యక్షుడు అజయ్ అజేంద్ర మాట్లాడుతూ.. కేదార్నాథ్ ఆలయానికి వచ్చే యాత్రికులు నిండైన దుసులు ధరించాలని, గతంలో కొంతమంది ఇష్టానుసారంగా దుస్తులు ధరించి ఫోటోలు, వీడియోలు తీసుకున్నారని చెబుతూ.. అది సరైన పద్దతి కాదన్నారు. మళ్ళీ ఇటువంటి సంఘటనలు పునరావృతమైతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. బద్రీనాథ్ లో కూడా మొబైల్ ఫోన్లను నిషేధించే విషయమై ఆలోచిస్తున్నామని న్నారు. ఇది కూడా చదవండి: టూరిస్టులతో గుంజీలు తీయించిన రైల్వే పోలీసులు -
వీళ్లు మనుషులేనా! కేదార్నాథ్ యాత్రలో దారుణం.. బలవంతంగా గంజాయి తాగించి..
ఉత్తరాఖండ్‌ను దేవభూమి అంటారు. చార్ధామ్ యాత్ర కోసం వేలాది మంది భక్తులు ఉత్తరాఖండ్‌లోకి వెళుతుంటారు. పుణ్యక్షేత్రాల్లో ఈ స్థలానికి ప్రత్యేక గుర్తింపు కూడా ఉంది. అయితే గత కొన్ని రోజులుగా కేదార్నాథ్ అధ్యాత్మికతతో కాకుండా పలు కారణాలతో వార్తల్లో నిలుస్తోంది. తాజాగా ఇద్దరు యువకులు గుర్రానికి బలవంతంగా గంజాయి తాగించేందుకు ప్రయత్నిస్తున్న వీడియో వైరల్‌గా మారింది. వివరాల్లోకి వెళితే.. కేదార్నాథ్ యాత్రలో యాత్రికులు ఎక్కువగా గుర్రాలను ఉపయోగిస్తారు. గుర్రపు స్వారీ చేసేవారు, శక్తి లేని వారు కొండపైకి వెళ్లేందుకు గుర్రపు సవారిని ఎంచుకుంటారు. దీంతో గుర్రపు స్వారీ, గుర్రపు నిర్వాహకులు ఆదాయాన్ని పొందుతున్నారు. ఇదిలా ఉండగా ప్రస్తుతం నెట్టంట వైరల్‌గా మారిన వీడియోలో.. ఇద్దరు యువకులు గుర్రం నోరు పట్టుకున్నారు. ఒకరు గుర్రం ముక్కు రంధ్రాలను మూసేశారు. మరొక యువకుడు గుర్రానికి గంజాయిని నాసిక రంధ్రం ద్వారా బలవంతంగా తాగించేందుకు ప్రయత్నిస్తున్నాడు. గుర్రపు యజమాని గుర్రానికి ఈ విధంగా మత్తు మందు ఇస్తే భక్తుల ప్రాణాలకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంది. దీంతో యాత్రికుల భద్రతపై ప్రజల్లో అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ వీడియోని చూసిన నెటిజన్లు పలువురు ఘాటుగా స్పందించారు. వీళ్లు మనుషులేనా.. ఇది అమానుషమైన ఘటనని, జంతువులను ఇంత దారుణంగా హింసించే నిందితులను వీలైనంత త్వరగా అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. దీనిపై ఉత్తరాఖండ్ పోలీసులు స్పందిస్తూ.. గుర్రంతో బలవంతంగా గంజాయి తాగిస్తున్న వైరల్ వీడియోను మేము చూశాం. వీడియోలోని వ్యక్తులను గుర్తించి చర్యలు తీసుకుంటామని" చెప్పారు. #Uttrakhand Some people are making a horse smoke weed forcefully at the trek of Kedarnath temple.@uttarakhandcops @DehradunPolice @RudraprayagPol @AshokKumar_IPS should look into this matter and find the culprit behind thispic.twitter.com/yyX1BNMiLk — Himanshi Mehra 🔱 (@manshi_mehra_) June 23, 2023 చదవండి: ఇకపై బస్సు డ్రైవర్, కండక్టర్ల ఫోన్లు చెకింగ్.. ఎందుకంటే..? -
హెలికాప్టర్ వద్ద సెల్ఫీ తీసుకుంటుండంగా..అంతలోనే..
ఓ అధికారి హెలికాప్టర్ వద్ద సెల్ఫీ తీసుకునే యత్నంలో టెయిల్ రోటర్ బ్లేడ్ పరిధిలోకి వచ్చాడు. దీంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటన ఉత్తరాఖండ్‌లో చోటు చేసుకుంది. ఉత్తరాఖండ్‌లోని కేదార్‌నాథ్‌లో హెలికాప్టర్ బయట సెల్ఫీ దిగేందుకు ప్రయత్నించిన ఓ ప్రభుత్వాధికారి మృత్యువాత పడ్డారు. బాధితుడిని జితేంద్ర కుమార్ సైనీగా గుర్తించారు అధికారులు. అతడు ఉత్తరాఖండ్ సివిల్ ఏవియేషన్ డెవలప్మెంట్ అథారిటీకి ఫైనాన్షియల్ కంట్రోలర్‌గా పనిచేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ ప్రమాదం కేదార్నాథ్ ధామ్‌లోని హెలిప్యాడ్ వద్ద జరిగింది. సైనీ సెల్ఫీ దిగేందుకు ప్రయత్నిస్తున్నసమయంలో అనుకోకుండా హెలికాప్టర్ టెయిల్ రోటర్ బ్లేడ్ పరిధిలోకి వచ్చాడు. దీంతో సైనీ అక్కడికక్కడే కుప్పకూలి మృతి చెందాడు. అక్షయ తృతియ సందర్భంగా భక్తుల చార్ధామ్ యాత్ర కోసం అని గంగోత్రి, యమునోత్రి పోర్టల్‌లను ప్రారంభించిన ఒక రోజు తర్వాత ఈ అనూహ్య సంఘటన జరిగింది. కాగా తీర్థ యాత్ర కోసం ఇప్పటికే 16 లక్షల మంది యాత్రికులు నమోదు చేసుకున్నారు. ఐతే కేదార్నాథ్ దేవాలయాన్ని ఏప్రిల్ 25న బద్రీనాథ్‌ను ఏప్రిల్ 27న తెరవనున్నారు. (చదవండి: చార్ధామ్ యాత్ర ప్రారంభం) -
Char Dham Yatra: ‘ఛార్‌ధామ్’కు మంచు తిప్పలు
గోపేశ్వర్: ఛార్‌ధామ్ యాత్ర మొదలుకానున్న నేపథ్యంలో విచ్చేసే లక్షలాది మంది భక్తులు, సందర్శకుల సౌకర్యార్థం చేపట్టిన మౌలికసదుపాయాలు తదితర సన్నాహక కార్యక్రమాలకు మంచు అడ్డుపడుతోంది. గురువారం భద్రీనాథ్, కేదార్నాథ్ పర్వతప్రాంతాల్లో విపరీతంగా మంచు కురిసింది. లోయ ప్రాంతాలను వర్షం ముంచెత్తింది. ఈ ఆలయాలు కొలువుతీరిన ఛమోలీ, రుద్రప్రయాగ్ జిల్లాల్లో మంచు, వర్షం, అతిశీతల గాలులు ఉష్ణోగ్రతలను తగ్గించేస్తున్నాయని అధికారులు తెలిపారు. మరో నాలుగు రోజుల్లో భక్తులను కేదార్నాథ్ ఆలయ దర్శనానికి అనుమతించనున్న ఈ తరుణంలో గుడికి వెళ్లే ట్రెక్ మార్గంలో మంచు పడుతోంది. అక్షయ తృతీయను పురస్కరించు కుని ఈనెల 22వ తేదీన గంగోత్రి, యము నోత్రి ఆలయాలు తెరుచు కోను న్నాయి. కేదార్నాథ్ ఆల యాన్ని 25వ తేదీన, భద్రీనాథ్ ఆలయాన్ని ఈనెల 27వ తేదీన భక్తుల సందర్శనార్థం తెరుస్తారు. లక్షలాది మంది ఛార్‌ధామ్ యాత్రకు తరలివస్తున్న ఈ సమయంలో మంచు ముంచుకురావడంపై స్థానిక అధికారులు ఆందోళన వ్యక్తంచేశారు. -
ప్రాణాలు తోడేస్తున్న నిర్లక్ష్యం
ఉత్తరాఖండ్‌లోని కేదార్‌నాథ్‌లో మంగళవారం పైలెట్‌తో సహా ఏడుగురి మరణానికి దారితీసిన హెలికాప్టర్ ప్రమాదం ఎన్నో ప్రశ్నలు రేకెత్తిస్తోంది. కేదార్నాథ్ నుంచి గుప్తకాశీ వెళ్తుండగా ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. హెలికాప్టర్‌ను దించాల్సిన ప్రాంతంలో దట్టమైన మంచు అలుముకుని ఉన్నదని పైలెట్ గ్రహించి, వెనక్కి మళ్లించేందుకు ప్రయత్నించినప్పుడు దాని వెనుక భాగం నేలను తాకడంతో ప్రమాదం జరిగిందంటున్నారు. కేదార్నాథ్ గగనంలో హెలికాప్టర్ల సందడి మొదలై పదిహేనేళ్లు దాటుతోంది. ఏటా మే నెల మధ్యనుంచి అక్టోబర్ నెలాఖరు వరకూ సాగే చార్ధామ్ యాత్ర సీజన్లో హెలికాప్టర్లు ముమ్మరంగా తిరుగుతాయి. కేదార్నాథ్, బద్రీనాథ్, గంగోత్రి, యమునోత్రిలలోని క్షేత్రాలను భక్తులు సందర్శిస్తారు. ఇతర ప్రయాణ సాధనాల విషయంలో ఎవరికీ అభ్యంతరం లేదు. హెలికాప్టర్ల వినియోగమే వద్దని ఆదినుంచీ పర్యావరణవేత్తలు సూచిస్తున్నారు. ప్రశాంతతకు మారుపేరైన హిమవన్నగాలతో నిండిన సున్నితమైన పర్యావరణ ప్రాంతం కేదార్నాథ్. ఇక్కడ హెలికాప్టర్ల రొద వన్య ప్రాణులకు ముప్పు కలిగిస్తుందనీ, వాతావరణంలో కాలుష్యం పెరుగుతుందనీ పర్యావరణవేత్తల అభియోగం. తక్కువ ఎత్తులో ఎగురుతూ చెవులు చిల్లులుపడేలా రొద చేస్తూ పోయే హెలికాప్టర్ల తీరుపై స్థానికులు సైతం తరచు అధికారులకు ఫిర్యాదులు చేస్తున్నారు. వాటి చప్పుడు తీవ్ర భయాందోళనలు కలిగిస్తోందనీ, పిల్లల చదువులకు కూడా వాటి రాకపోకలు ఆటంకంగా మారాయనీ చెబుతున్నారు. అయినా వినే దిక్కూ మొక్కూ లేదు. హెలికాప్టర్లు నడిపే సంస్థలకు లాభార్జనే తప్ప మరేమీ పట్టదు. అందుకే లెక్కకుమించిన సర్వీసులతో హడావిడి పెరిగింది. పర్యావరణ ఉల్లంఘనలు జరుగుతున్నాయని ఫిర్యాదులు వస్తున్నా పట్టించుకోని అధికారులు కనీసం హెలికాప్టర్ల భద్రతనైనా సక్రమంగా పర్యవేక్షిస్తున్న దాఖలాలు లేవు. తాజా దుర్ఘటనలో మరణించిన పైలెట్ అనిల్ సింగ్‌కు ఆర్మీలో 15 ఏళ్ల అనుభవం ఉంది. అయితే మొదట్లో హెలికాప్టర్లు నడిపినా మిగిలిన సర్వీసంతా విమానాలకు సంబంధించిందే. అలాంటివారు కొండకోనల్లో హెలికాప్టర్లు నడపాలంటే అందుకు మళ్లీ ప్రత్యేక శిక్షణ పొందటం తప్పనిసరి. పైగా వాతావరణంలో హఠాత్తుగా మార్పులు చోటుచేసుకునే కేదార్నాథ్ వంటిచోట్ల సింగిల్ ఇంజిన్ హెలికాప్టర్లు నడపాలంటే ఎంతో చాకచక్యత, ఏకాగ్రత అవసరమవుతాయి. ఆ ప్రాంతంలో అంతా బాగుందనుకునేలోగానే హఠాత్తుగా మంచుతెర కమ్ముకుంటుంది. హెలికాప్టర్ నడిపేవారికి ఏమీ కనబడదు. అదృష్టాన్ని నమ్ముకుని, దైవంపై భారం వేసి ముందుకు కదిలినా, వెనక్కిరావడానికి ప్రయత్నించినా ముప్పు పొంచివుంటుంది. ఆ ప్రాంతం గురించి, అక్కడ హెలికాప్టర్ నడిపేటపుడు ప్రత్యేకించి పరిగణనలోకి తీసుకోవాల్సిన అంశాల గురించి క్షుణ్ణంగా తెలిసినవారైతేనే ఈ అవరోధాలను అధిగమించగలుగుతారు. ముఖ్యంగా 600 మీటర్ల (దాదాపు 2,000 అడుగులు) కన్నా తక్కువ ఎత్తులో హెలికాప్టర్లు నడపరాదన్న నిబంధన ఉంది. కానీ చాలా హెలికాప్టర్లు 250 మీటర్ల (820 అడుగులు)లోపు ఎత్తులోనే దూసుకుపోతున్నాయని స్థానికులు తరచూ ఫిర్యాదు చేస్తున్నారు. ఇప్పుడు ప్రమాదం జరిగిన హెలికాప్టర్ సైతం తక్కువ ఎత్తులో ఎగురుతున్నందునే వెనక్కు మళ్లుతున్న క్రమంలో దాని వెనుక భాగం అక్కడున్న ఎత్తయిన ప్రదేశాన్ని తాకి మంటల్లో చిక్కుకుంది. ఈ సీజన్లో ఇంతవరకూ 14 లక్షలమందికిపైగా యాత్రికులు కేదార్‌నాథ్‌ను సందర్శించగా అందులో దాదాపు లక్షన్నరమంది తమ ప్రయాణానికి హెలికాప్టర్లను ఎంచుకున్నారు. ఈ ప్రాంతంలో హెలికాప్టర్ల వినియోగాన్ని నిషేధించాలని కొందరు పర్యావరణవేత్తలు అయిదేళ్ల క్రితం జాతీయ హరిత ట్రిబ్యునల్‌ను ఆశ్రయించినప్పుడు దాన్ని తోసిపుచ్చిన ట్రిబ్యునల్... వాటి నియంత్ర ణకు చర్యలు తీసుకోవాలని సూచించింది. అవి నిర్దేశిత ఎత్తులో ఎగిరేలా చూడాలనీ, సర్వీసుల సంఖ్యపై కూడా పరిమితులు విధించాలనీ ఆదేశించింది. కానీ ఎవరికి పట్టింది? మన దేశంలో పారిశ్రామిక ప్రాంతాల్లో, వాణిజ్య ప్రాంతాల్లో, నివాస ప్రాంతాల్లో శబ్ద కాలుష్యం ఏయే స్థాయిల్లో ఉండాలో నిర్దేశించారు. ఈ శబ్దకాలుష్యానికి సంబంధించిన నిబంధనల్లో పగలు, రాత్రి వ్యత్యాసాలున్నాయి. కానీ విషాదమేమంటే దేశానికే ప్రాణప్రదమైన హిమశిఖర ప్రాంతాల్లో శబ్దకాలుష్యం పరిమితులు ఏమేరకుండాలో నిబంధనలు లేవు. అక్కడ తిరిగే హెలికాప్టర్ల వల్ల ధ్వని కాలుష్యం సగటున 70 డెసిబుల్స్ స్థాయిలో, గరిష్ఠంగా 120 డెసిబుల్స్ స్థాయిలో ఉంటున్నదని పర్యావరణవేత్తల ఆరోపణ. దీనిపై నిర్దిష్టమైన నిబంధనలు రూపొందించాల్సిన అవసరం లేదా? పుణ్యక్షేత్రాలు సందర్శించుకోవాలనుకునేవారినీ, ఆ ప్రాంత ప్రకృతిని కళ్లారా చూడాలని తహతహలాడే పర్యాటకులనూ ప్రోత్సహించాల్సిందే. ఇందువల్ల ప్రభుత్వ ఆదాయం పెరగటంతోపాటు స్థానికులకు ఆర్థికంగా ఆసరా లభిస్తుంది. అయితే అంతమాత్రంచేత పర్యావరణ పరిరక్షణ, ప్రయాణికుల భద్రత విషయంలో రాజీపడే ధోరణి మంచిది కాదు. పర్వత ప్రాంతాల్లో హెలికాప్టర్లు నడపటంలో అనుభవజ్ఞులైనవారిని మాత్రమే పైలెట్లుగా అనుమతించటం, తగిన ఎత్తులో హెలి కాప్టర్లు రాకపోకలు సాగించేలా చూడటం, అపరిమిత శబ్దకాలుష్యానికి కారణమయ్యే హెలికాప్టర్ల వినియోగాన్ని అడ్డుకోవటం తక్షణావసరం. ఈ విషయంలో సమగ్రమైన నిబంధనలు రూపొందిం చటం, అవి సక్రమంగా అమలయ్యేలా చూడటం ఉత్తరాఖండ్ ప్రభుత్వ బాధ్యత. -
ఉత్తరాఖండ్ క్రాష్: భార్యకు చివరి కాల్లో ఆ పైలట్..
ముంబై: ఉత్తరాఖండ్ ఘోర విమాన ప్రమాదంలో పైలట్లు, యాత్రికులు మృత్యువాత పడ్డారు. ప్రతికూల వాతావరణంతోనే మంగళవారం ఉదయం ఈ ప్రమాదం జరిగి ఉంటుందని అధికారులు ఓ అంచనాకి వచ్చారు. అయితే.. ప్రమాదానికి ముందు కల్నల్(రిటైర్డ్), పైలట్ అనిల్ సింగ్(57) భార్యతో మాట్లాడిన మాటలు భావోద్వేగానికి గురి చేస్తున్నాయి. తూర్పు ఢిల్లీకి చెందిన అనిల్ సింగ్.. కుటుంబంతో పాటు ముంబై(మహారాష్ట్ర) అంధేరీలోని ఓ హౌజింగ్ సొసైటీలో గత పదిహేనుళ్లుగా ఉంటున్నారు. ఆయనకు భార్య షిరిన్ ఆనందిత, కూతురు ఫిరోజా సింగ్ ఉన్నారు. భార్య షిరిన్ ఫిల్మ్ రైటర్.. గ్రామీ అవార్డులకు నామినేట్ అయ్యారు కూడా. ఇక కూతురు ఫిరోజా.. మీడియాలో పని చేస్తోంది. అయితే.. ప్రమాదం కంటే ముందు రాత్రి అంటే సోమవారం రాత్రి ఆయన తన భార్యకు ఫోన్ చేసి పలు జాగ్రత్తలు సూచించినట్లు ఆనందిత తెలిపారు. ఆనందిత మాట్లాడుతూ.. గత రాత్రి ఆయన మాకు ఫోన్ చేశారు. ఫిరోజాకు ఆరోగ్యం బాగోలేదని ఆరా తీశారు. బిడ్డ జాగ్రత్త అంటూ ఫోన్ పెట్టేశారు. అవే ఆయన చివరి మాటలు అని కన్నీటి పర్యంతం అయ్యారు. ఇక ఇది ప్రమాదంగానే భావిస్తున్నామని, కుట్ర కోణంతో ఫిర్యాదు చేసే ఆలోచనలో లేమని ఆమె వెల్లడించారు. కూతురితో పాటు ఢిల్లీలో జరగబోయే భర్త అంత్యక్రియలకు ఆమె బయలుదేరారు. 2021 నవంబర్‌లో మహారాష్ట్ర గడ్చిరోలిలో జరిగిన భారీ ఎన్కౌంటర్లో గాయపడ్డ పోలీస్ సిబ్బందిని తరలించడంలో అనిల్ సింగ్ కీలకంగా వ్యవహరించారు. మరోవైపు మంగళవారం ఉదయం పదకొండున్నర గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. స్థానికంగా ఉండే ఆర్యన్ ఏవియేషన్‌కు చెందిన చాపర్ బెల్ 407(VT-RPN) కేదర్నాథ్ ఆలయం నుంచి గుప్తకాశీకి యాత్రికులను తీసుకెళ్లే క్రమంలో దేవ దర్శిని(గరుడ్ ఛట్టి) వద్ద ప్రమాదానికి గురైంది. ప్రతికూల వాతావరణంతో కొండ ప్రాంతాల్లో అది పేలిపోయి ప్రమాదానికి గురై ఉంటుందని రుద్రప్రయాగ జిల్లా డిజాస్టర్ మేనేజ్మెంట్ అధికారులు భావిస్తున్నారు. మరోవైపు ఈ దుర్ఘటనపై డీజీసీఏ తోపాటు ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో సైతం దర్యాప్తు చేపట్టింది. -
కేదార్‌నాథ్‌లో కూలిన హెలికాప్టర్.. ఏడుగురు దుర్మరణం
దెహ్రాదూన్: ఉత్తరాఖండ్‌లోని కేదార్‌నాథ్‌లో ఘోర ప్రమాదం సంభవించింది. యాత్రికులను తీసుకెళ్తున్న ఓ హెలికాప్టర్ కుప్పకూలిపోయింది. ఈ దుర్ఘటనలో ఏడుగురు దుర్మరణం చెందారు. మృతుల్లో ఇద్దరు పైలట్లు, ఐదుగురు యాత్రికులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. మృతదేహాలను స్వాధీనం చేసుకుని సహాయక చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ఐదుగురు యాత్రికులతో గుప్తకాశీలోని ఫటా హెలిప్యాడ్ నుంచి కేదార్నాథ్ వెళ్లేందుకు బయలుదేరిన హెలికాప్టర్ కొద్దిసేపటికే కుప్పకూలింది. వెంటనే మంటలు అంటుకోవటంతో ఇద్దరు పైలట్లు, ఐదుగురు యాత్రికులు మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. కేదార్‌నాథ్‌కు సుమారు రెండు కిలోమీటర్ల దూరంలోని గరుడ ఛట్టీ ప్రాంతంలో హెలికాప్టర్ ప్రమాదానికి గురైనట్లు వెల్లడించారు. ఈ దుర్ఘటనపై పౌర విమానయాన శాఖ మంత్రి జోతిరాదిత్య సిందియా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వంతో ఎప్పటికప్పుడు వివరాలు తెలుసుకుంటున్నామని, పరిస్థితులను పరిశీలిస్తున్నట్లు ట్వీట్ చేశారు. ఢిల్లీకి చెందిన ఆర్యాన్ విమానయాన సంస్థ బెల్ 407 హెలికాప్టర్ వీటీ-ఆర్పీఎన్ ప్రమాదానికి గురైనట్లు డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ తెలిపింది. ఇదీ చదవండి: కశ్మీర్లో మళ్లీ పౌరులపై దాడులు.. నాలుగు రోజుల్లో ముగ్గురి హత్య -
చార్ధామ్ దేవస్థానం బోర్డు రద్దు
డెహ్రాడూన్: ఉత్తరాఖండ్‌లో రెండేళ్ల క్రితం నుంచి విధులు నిర్వర్తిస్తున్న చార్ధామ్ దేవస్థానం బోర్డును రద్దుచేయాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు చార్ధామ్ దేవస్థానం బోర్డు చట్టాన్ని ఉపసంహరిం చుకుంటున్నట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి మంగళవారం ప్రకటించారు. ఈ నిర్ణయంపై పూజారులు హర్షం వ్యక్తంచేశారు. మాజీ ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్ రావత్ హయాంలో 2019లో ఈ బోర్డును ఏర్పాటుచేశారు. ప్రఖ్యాత ఆలయాలు కేదార్నాథ్, బద్రీనాథ్, గంగోత్రి, యమునోత్రిసహా 51 ప్రముఖ ఆలయాల పాలనా వ్యవహారాలను ఈ బోర్డు చూసుకుంటోంది. అయితే తమ సంప్రదాయ హక్కులను ఈ బోర్డు ఉల్లంఘిస్తోందని, పూజారులు మొదట్నుంచీ బోర్డు ఏర్పాటును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. దీంతో తాజాగా మనోహర్ కంత్ ధ్యాని నేతృత్వంలో అత్యున్నత స్థాయి కమిటీ ఈ సమస్యలపై అధ్యయనం చేసి నివేదికను సీఎం పుష్కర్ ధామికి ఆదివారం అందజేసింది. అన్ని సమస్యలను పరిగణనలోకి తీసుకుని, కమిటీ సిఫార్సుల మేరకు బోర్డును రద్దు చేస్తున్నట్లు సీఎం మంగళవారం చెప్పారు. ప్రభుత్వంపై ఒత్తిడి కారణంగానే ఇది సాధ్యమైందని పూజారులు సంతోషం వ్యక్తంచేశారు. ‘సాగు చట్టాల రద్దు తరహాలోనే ఈ సారీ బీజేపీ సర్కార్ దురహంకారం ఓడిపోయింది. వచ్చే ఎన్నికల్లో ఓటమి భయంతోనే ప్రభుత్వం వెనక్కి తగ్గింది. ఇది ముమ్మాటికీ పూజారుల విజయం’ అని ఉత్తరాఖండ్‌లో కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ముఖ్యమంత్రి హరీశ్ రావత్ వ్యాఖ్యానించారు. -
కేదార్నాథ్, యమునోత్రి ఆలయాలు మూసివేత
డెహ్రాడూన్: హిమాలయాల్లో ఉన్న ప్రఖ్యాత కేదార్నాథ్, యమునోత్రి ఆలయాలను శనివారం మూసివేశారు. ఈ ఆలయాలను భారీగా మంచుపడే శీతాకాలంలో ఏటా మూసివేస్తుంటారు. సంప్రదాయబద్ధంగా పూజలు నిర్వహించిన అనంతరం కేదార్నాథ్ ఆలయ ద్వారాలను శనివారం ఉదయం 8 గంటలకు, యమునోత్రి ఆలయాన్ని మధ్యాహ్నం 12 గంటలకు మూసివేసినట్లు చార్‌థామ్ దేవస్థానం బోర్డ్ తెలిపింది. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారని పేర్కొంది. శీతాకాల బసకోసం ఆయా ఆలయాల్లోని బాబా కేదార్, మాత యమున విగ్రహాలను అందంగా అలంకరించిన పల్లకిలో ఉఖిమఠ్, ఖర్సాలీ ఆలయాలకు ఊరేగింపుగా తీసుకెళ్లినట్లు తెలిపింది. గంగోత్రి ఆలయం శుక్రవారం మూతపడగా, బద్రీనాథ్ ఆలయ ద్వారాలను ఈ నెల 20వ తేదీన మూసివేస్తారు. -
చార్ధామ్ యాత్రను మరో కుంభమేళాగా మార్చొద్దు: హైకోర్టు
సాక్షి, న్యూఢిల్లీ: ప్రపంచాన్ని కుదిపేసిన కరోనా మహమ్మారి మరోసారి అన్ని రంగాలపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తోంది. గతేడాది కరోనా కారణంగా కుదేలైన పర్యాటక రంగం గాడిన పడుతుందనుకున్న సమయంలో, గత కొన్ని రోజులుగా కరోనా పాజిటివ్ కేసుల్లో గణనీయ వృద్ధి కనిపించడంతో దేశవ్యాప్తంగా ప్రజలు భయాందోళనలో ఉన్నారు. ఈ ప్రభావం ఈ ఏడాది జరుగబోయే చార్ధామ్ యాత్రపై పడింది. మే 14 న అక్షయ తృతీయ రోజున యమునోత్రి ధామ్, మే 15 న గంగోత్రి ధామ్ తెరుచుకున్న అనంతరం చార్ధామ్ యాత్ర అధికారికంగా భక్తుల కోసం ప్రారంభమౌతుంది. అదే సమయంలో మే 17 న కేదార్నాథ్, మూడవ కేదార్ తుంగ్నాథ్, మే 18న బద్రీనాథ్ ధామ్ ద్వారా లు భక్తుల కోసం తెరుచుకోనున్నాయి. దీంతో ఈసారైనా పర్యాటక రంగం గాడిన పడుతుందని భావించిన స్థానిక వ్యాపారులకు తాజా పరిస్థితులు మరో ఏడాది దిక్కుతోచని స్థితిలోకి నెట్టేశాయి. ఇప్పటికే చార్ధామ్ యాత్రలో పాల్గొనాలనుకున్న భక్తులు, పర్యాటకులు గఢ్వాల్ మండల్ వికాస్ నిగమ్ (జిఎంవిఎన్) ఏర్పాటు చేసిన హోమ్ స్టే, హట్స్, కాటేజీలు, రెస్టారెంట్లకు సంబంధించిన బుకింగ్స్ ఒక్కటొక్కటిగా రద్దు చేసుకుంటున్నారు. ఊగిసలాటలో భక్తులు కేదర్‌ఘాటితో సహా ఇతర ప్రాంతాల్లో ఈ ఏడాది చార్ధామ్ యాత్రకు సంబంధించిన సన్నాహాలు ప్రారంభమయ్యాయి. కానీ మహమ్మారి వారి ఆశలను దెబ్బతీసింది. గఢ్వాల్ మండల్ వికాస్ నిగం వద్ద జరిగిన సుమారు మూడు కోట్ల బుకింగ్స్‌లో, గత ఒక వారంలో ఎనిమిది లక్షల బుకింగ్స్ రద్దు అయ్యాయి. అంతేగాక కేదర్‌ఘాటి, తుంగ్నాథ్ ఘాటి, మద్మాహేశ్వర్ ఘాటిల్లో హోమ్ స్టే ఆపరేటర్లకు చెందిన సుమారు రెండు లక్షల బుకింగ్‌లు సైతం రద్దు చేసుకున్నారు. వీటితోపాటు జీఎంవీఎన్ కార్యాలయానికి తమ బుకింగ్‌ను పోస్ట్‌పోన్ చేయాలనే భక్తుల మెయిల్స్ ప్రతీరోజు 15 నుంచి 20 వస్తున్నాయని అధికారులు తెలిపారు. ఏప్రిల్, మే, జూన్ నెలలకు సంబంధించిన బుకింగ్స్ ఒక్కటొక్కటిగా రద్దు అవుతున్నాయి. అయితే కరోనాకు సంబంధించి గత 15 రోజుల్లో తలెత్తిన పరిస్థితుల కారణంగా, చార్ధామ్ యాత్ర ప్రారంభంపై భక్తుల్లో సందేహాలు ఉన్నాయని గౌరికుండ్ ట్రేడ్ అసోసియేషన్ భావిస్తోంది. విధివిధానాలు ప్రచురించండి దేశంలో పెరుగుతున్న కోవిడ్–19 కేసులను దష్టిలో ఉంచుకొని చార్ధామ్ యాత్రకు సంబంధించి అనుసరించాల్సిన విధానాలను వెంటనే ప్రకటించాలని ఉత్తరాఖండ్ హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. చార్ధామ్ యాత్రను మరో కుంభ్‌మేళాలా మార్చేందుకు అనుమతించలేమని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్, జస్టిస్ అలోక్ కుమార్ వర్మ ధర్మాసనం వ్యాఖ్యానించింది. హైకోర్టు లో దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాలను విచారిస్తూ ఆ ఆదేశాలు జారీచేసింది. -
ఎక్కడా చూసి ఉండరు.. ఇండియాలోనే సాధ్యం!
డెహ్రాడూన్: మీరెప్పుడైనా మెట్లపై నుంచి ట్రాక్టర్ నడపడం చూశారా? ఇలాంటివి సినిమాల్లోనే కదా.. అది కూడా గ్రాఫిక్స్‌తో చేస్తారు కానీ నిజజీవితంలో అది అసాధ్యం కదా అని అనుకుంటున్నారా? కానీ కేదార్నాథ్ ఆలయం మెట్లపై ఇది సాధ్యం చేశారు కొందరు యువకులు. ఆలయ నిర్మాణ పనుల కోసం ఉపయోగించే భారీ యంత్రాలను ట్రాక్టర్‌పై ఉంచి తీసుకెళ్లారు. వారికి సహాయంగా మరికొంతమంది ట్రాక్టర్‌ను మెట్లపై బ్యాలెన్స్ చేశారు. దీనికి సంబంధించిన వీడియోను ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఆఫీసర్ సుశాంత నందా ఆదివారం ట్విటర్లో షేర్ చేసినప్పటి నుంచి సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. ఇలాంటివి ఇండియాలోనే సాధ్యం అంటూ ఓ క్యాప్షన్‌ను కూడా జత చేశారు నందా. ఇప్పటికే ఈ వీడియోను 72,000 మంది చూశారు. అయితే ఈ వీడియోకి సంబంధించి చాలామంది పొడగ్తల వర్షం కురిపించగా, ఆలయ మెట్లపై అంత భారీ యంత్రాలను ఇలా తీసుకెళ్తే మెట్లు పాడవుతాయంటూ కొంత మంది అభ్యంతరం తెలిపారు. ఒకవేళ ప్రమాదవశాత్తూ ఏదైనా జరిగి ట్రాక్టర్ దొర్లితే వారి ప్రాణాలకే ముప్పు అంటూ మరికొందరు ట్వీట్ చేశారు. (‘మనోభావాలు దెబ్బతింటే మన్నించండి’ ) ఈ ట్రాక్టర్ తయారీసంస్థ లింక్డ్ ఇన్ కంపెనీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రామన్ మిట్టల్ స్పందిస్తూ.. మా చిన్న ట్రాక్టర్ అసాధ్యమనుకున్న పనిని సుసాధ్యం చేస్తున్నందుకు గర్వంగా ఉంది. స్థానిక సమస్యలకు సృజనాత్మక పరిష్కారం చూపారు ఆ యువకులు అంటూ ప్రశంసించారు. 2013లో సంభవించిన వరదల దాటికి కేదార్నాథ్ ఆలయం స్వల్పంగా దెబ్బతింది. 2017లో ఆలయ పునర్నిర్మాణానికి ప్రధానికి మోదీ శంకుస్థాపన చేశారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్ రావత్‌తో ఆలయ పునర్నిర్మాణం, అభివృద్ధి తదితర అంశాలను ప్రధాని మోదీ సమీక్షించారు. కేదార్నాథ్, బద్రీనాథ్ వంటి పుణ్యక్షేత్రాలను మరింత అభివృద్ధి చేయాలని వాతావరణ మార్పులకు అనుగుణంగా తీర్చిదిద్దాలని ఈ సందర్భంగా మోదీ సూచించారు. (ఛత్తీస్‌గఢ్ సీఎంపై మండిపడ్డ ఒమర్ అబ్దుల్లా ) -
ఇండియాలోనే ఇలాంటివి సాధ్యం!
-
తెరుచుకున్న కేదార్నాథ్ ఆలయం
డెహ్రడూన్ : ఆరు నెలల పాటు మంచుతో కప్పబడిన కేథర్నాథ్ ఆలయం బుధవారం ఉదయం 6:10 గంటలకు తిరిగి తెరుచుకుంది. ఏటా ఆలయాన్ని సందర్శించేందుకు లక్షలాది మంది భక్తజన సందోహం తరలివస్తారు. కానీ కరోనా కారణంగా ఈ సంవత్సరం భక్తులెవరినీ అనుమతించలేదు. తాత్కాలిక ఆలయం దర్శనం రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఆలయ ప్రధాన పూజారి సహా అతికొద్దిమంది సమక్షంలో ఉదయం విగ్రహాన్ని ఆలయానికి తీసుకువచ్చారు. ( ‘కేదార్‌నాథ్‌తో నాకు ప్రత్యేక అనుబంధం’ ) చార్ధామ్ యాత్రలో అతి ముఖ్యమైన డోలి యాత్రలో నిజానకి భక్తుల రద్దీ విపరీతంగా ఉంటుంది. కానీ ఈసారి ఆ సందడి లేదు. చార్ధామ్ యాత్రలో యమునోత్రి ఆలయంతో ప్రారంభించి వరుసగా గంగోత్రి, కేదార్నాథ్, బద్రినాథ్ ఆలయాలను దర్శించేందుకు ప్రతి సంవత్సరం దేశ, విదేశాల నుంచి లక్షల మంది భక్తులు యాత్రలో పాల్గొంటారు. కానీ ఈసారి భక్త జన కోలాహాలం లేకుండానే తంతు పూర్తిచేశారు ఆలయ అర్చకులు. ఐదుగురు పండితులు కేథర్నాథ్ ఆలయానికి పంచముఖీ స్వామిని పల్లకిలో తీసుకువచ్చారు. Uttarakhand: Portals of the Kedarnath temple were opened at 6:10 am today. 'Darshan' for the devotees is not allowed at the temple as of now. https://t.co/v4Cj8RQja9 pic.twitter.com/jn5vUBN42N — ANI (@ANI) April 29, 2020 అత్యంత మంచుతో నిండిన ప్రాంతం అయినప్పటికీ పండితులు చెప్పులు లేకుండానే యాత్ర కొనసాగించారు. సాధారణంగా హిందూ పంచాగం ప్రకారం తీర్థయాత్రలు తేదీలు ఫిబ్రవరిలో శివరాత్రి సందర్భంగా నిర్ణయిస్తారు. కానీ ఈ సంత్సరం కరోనా కట్టడి నేపథ్యంలో అన్ని తీర్థయాత్రలను రద్దు చేస్తూ నిర్ణయించారు. కొన్ని ప్రముఖ ఆలయాలకు అనుమతి ఉన్నా భక్తులను దర్శనానికి అనుమతించరు. -
ఈ ఫోటోలో ఉన్న నటిని గుర్తుపట్టారా..?
ఈ ఫోటోలో ఉన్న నటిని గుర్తు పట్టారా..? స్టార్ వారసులిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి తొలి సినిమాతోనే నటిగా మంచి మార్కులు సాధించిన బ్యూటీ ఈమె. ఆమె ఎవరో కాదు, సైఫ్ అలీఖాన్ ముద్దుల తనయ సారా అలీఖాన్. సినీ ప్రముఖుల వారసులు ఇండస్ట్రీలోకి వచ్చేందుకు తమని తాము ఎంతో మార్చుకుంటారు. అలా సారా అలీఖాన్ కూడా తనని తాను సరికొత్తగా ఆవిష్కరించుకున్న తరువాతే తెరంగేట్రం చేశారు. గత ఏడాది రిలీజ్ అయిన కేథార్నాథ్, సింబా సినిమాలతో ఆకట్టుకున్న సారా ప్రస్తుతం కూలీ నెంబర్ 1తో పాటు ఇంతియాజ్ అలీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలతో బిజీగా ఉన్నారు. తాజాగా ఈ భామ తన ఇన్స్టాగ్రామ్ పేజ్‌లో ఓ ఫోటోను షేర్ చేశారు. ఆ ఫోటోతో పాటు ‘నన్ను ఎవరూ విసిరేయలేని రోజుల్లోని ఫోటో’ అంటూ కామెంట్ చేశారు. తల్లి అమృతా సింగ్‌తో కలిసి దిగిన ఈ ఫోటోలో సారాను చూసి అభిమానులు షాక్ అవుతున్నారు. భారీకాయంతో ఉన్న సారాను ఈ ఫోటోలో గుర్తుపట్టడం కూడా కష్టమే. ఇండస్ట్రీలోకి రాక ముందు సారా 90 కేజీలకు పైగా బరువు ఉండేవారు. ఒబెసిటీ కారణంగా ఆమె ఆరోగ్యసమస్యలను కూడా ఎదుర్కొన్నారు. అయితే హీరోయిన్గా ప్రూవ్ చేసుకోవాలన్న పట్టుదలతో సరైన ఆహార నియమాలు పాటిస్తూ, క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తూ నాజుగ్గా రెడీ అయ్యారు. తన పాత రోజుల్ని గుర్తు చేసుకుంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో సారా షేర్ చేసిన ఈ ఫోటో ఇప్పుడు వైరల్ అవుతోంది. View this post on Instagram Throw🔙 to when I couldn’t be thrown🔙☠️🙌🏻🎃🐷🦍🍔🍕🍩🥤↩️ #beautyinblack A post shared by Sara Ali Khan (@saraalikhan95) on Sep 4, 2019 at 1:54am PDT -
నా ముందున్న లక్ష్యం అదే : మోదీ
డెహ్రాడూన్ : హిమాలయాల్లో కొలువుదీరిన పుణ్యక్షేత్రం కేదార్‌నాథ్‌తో తనకు ప్రత్యేకమైన అనుబంధం ఉందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఈ ఆధ్యాత్మిక క్షేత్రాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేయడమే తన ముందున్న లక్ష్యమని పేర్కొన్నారు. ఈ క్రమంలో ప్రకృతి, పర్యావరణానికి హాని కలగకుండా తగు చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. ఆలయ సందర్శన, ధ్యానం అనంతరం మోదీ విలేకరులతో మాట్లాడుతూ..‘ కేదార్‌నాథ్‌తో నాకు ప్రత్యేక అనుబంధం ఉంది. 2013లో సంభవించిన పెను విషాదం తర్వాత ఈ పుణ్యక్షేత్రాన్ని పునరుద్ధరించేందుకు మాస్టర్ ప్లాన్ రూపొందించాను. మీరు విదేశాలను సందర్శించడంలో నాకు ఎటువంటి అభ్యంతరం లేదు. కానీ అంతకంటే ముందు దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఒక్కసారైనా పర్యటించండి’ అని ప్రజలకు విఙ్ఞప్తి చేశారు. అదే విధంగా లోక్‌సభ ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో ప్రతీ ఒక్కరు ఓటు హక్కు వినియోగించుకోవాలని ట్విటర్ వేదికగా కోరారు. ఈ దఫా రికార్డు స్థాయిలో పోలింగ్ నమోదు కావాలని ఆకాంక్షించారు. కాగా శనివారం ఉదయమే ప్రధాని మోదీ కేదార్‌నాథ్‌కు వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా బూడిద రంగు సంప్రదాయ దుస్తులు ధరించిన ఆయన.. హిమాచల్ సంప్రదాయ టోపీ పెట్టుకుని కాషాయరంగు కండువాను నడుముకు చుట్టుకున్నారు. సుమారు అర్ధగంట పాటు ఆలయంలో మోదీ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే మందాకినీ నదీ సమీపంలో ఉన్న ఈ 11,755 అడుగుల ఎత్తుగల కేదార్నాథ్ పుణ్యక్షేత్రంలో ప్రదక్షిణలు చేశారు. ఇక లోక్‌సభ చివరి విడత పోలింగ్‌కు ఒక రోజు ముందు ప్రధాని.. ఆలయాల సందర్శన ఆసక్తికరంగా మారింది. కేదార్‌నాథ్‌తో పాటుగా బద్రీనాథ్ ఆలయాన్ని కూడా మోదీ సందర్శించనున్నారు. ఈ క్రమంలో ఆదివారం ఆయన బద్రీనాథ్‌కు పయనం కానున్నారు. -
కేదార్‌నాథ్‌లో మోదీ పూజలు
-
కేధార్‌నాథుడిని దర్శించుకున్న మోదీ
-
కేధార్‌నాథుడిని దర్శించుకున్న మోదీ
కేధార్నాథ్ : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కేధార్‌నాథుడిని సందర్శించుకున్నారు. ప్రత్యేక హెలికాప్టర్లో శనివారం ఉదయం ఇక్కడకు చేరుకున్న ఆయన ఆలయానికి చేరుకుని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధాని ప్రత్యేక వస్త్రధారణలో స్వామివారిని దర్శించుకున్నారు. ఇక ఉత్తరాఖండ్‌లో రెండు రోజుల పర్యటన సందర్భంగా ప్రధాని మోదీ ఆదివారం బద్రీనాథ్ వెళ్లనున్నారు. రేపు సాయంత్రం ఆయన తిరిగి ఢిల్లీ చేరుకుంటారు. సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
తెరుచుకున్న కేదార్నాధ్ ఆలయం
-
కేధార్నాథ్కు పోటెత్తిన భక్తులు
ఉత్తరాఖండ్: ఆరు నెలల అనంతరం కేధార్నాథ్ ఆలయం గురువారం తెరుచుకుంది. దీంతో భక్తులు పెద్ద ఎత్తున స్వామివారి దర్శనం కోసం తరలి వచ్చారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఇప్పటికే ఉత్తరాఖండ్ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. మరోవైపు రేపటి నుంచి బద్రీనాథ్ ఆలయ దర్శనం ప్రారంభం కానుంది. కాగా చార్ధామ్ యాత్రలో భాగంగా భక్తులు యమునోత్రి ఆలయంతో ప్రారంభించి వరుసగా గంగోత్రి, కేదార్నాథ్, బద్రినాథ్ ఆలయాలను దర్శిస్తారు. ప్రతి సంవత్సరం దేశ వ్యాప్తంగా లక్షల మంది భక్తులు యాత్రలో పాల్గొంటారు. భారీ హిమపాతం కారణంగా ఈ నాలుగు ఆలయాలను అక్టోబర్–నవంబర్ మాసాల్లో మూసివేసి మళ్లీ ఏప్రిల్– మే నెలల్లో తిరిగి తెరుస్తారు. ఇక అక్షయ తృతీయ పర్వదినాన్ని పురస్కరించుకొని మంగళవారం గంగోత్రి, యమునోత్రి ఆలయాలను తెరిచి ప్రత్యేక పూజలు చేశారు. అంతకు ముందు గంగ, యమునా దేవతల విగ్రహాలను ముకాభా, కర్సాలీ నుంచి తీసుకొచ్చి పునఃప్రతిష్టించారు. ఈ సందర్భంగా ఆలయాలకు భక్తులు పోటెత్తారు. -
ప్రారంభమైన చార్ధామ్ యాత్ర
ఉత్తర కాశీ: ఉత్తరాఖండ్‌లో చార్ధామ్ యాత్ర మంగళవారం ప్రారంభమైంది. అక్షయ తృతీయ పర్వదినాన్ని పురస్కరించుకొని మంగళవారం గంగోత్రి, యమునోత్రి ఆలయాలను తెరిచి ప్రత్యేక పూజలు చేశారు. అంతకు ముందు గంగ, యమునా దేవతల విగ్రహాలను ముకాభా, కర్సాలీ నుంచి తీసుకొచ్చి పునఃప్రతిష్టించారు. ఈ సందర్భంగా ఆలయాలకు భక్తులు పోటెత్తారు. కేదార్నాథ్ ఆలయాన్ని ఈ నెల 9న, బద్రీనాథ్ ఆలయాన్ని 10న తెరవనున్నారు. చార్ధామ్ యాత్రలో భాగంగా భక్తులు యమునోత్రి ఆలయంతో ప్రారంభించి వరుసగా గంగోత్రి, కేదార్నాథ్, బద్రినాథ్ ఆలయాలను దర్శిస్తారు. ప్రతి సంవత్సరం దేశ వ్యాప్తంగా లక్షల మంది భక్తులు యాత్రలో పాల్గొంటారు. భారీ హిమపాతం కారణంగా ఈ నాలుగు ఆలయాలను అక్టోబర్–నవంబర్ మాసాల్లో మూసివేసి మళ్లీ ఏప్రిల్– మే నెలల్లో తిరిగి తెరుస్తారు. -
ఇంటికి చేర్చాడు
చంచల్ వయసు ఇప్పుడు 17 ఏళ్లు. కేదార్నాథ్ (ఉత్తరాఖండ్) వరదల్లో తప్పిపోయినప్పుడు ఆమె వయసు పన్నెండు. చంచల్ 2013లో తల్లిదండ్రులతో కలిసి కేదార్నాథ్ యాత్రకు వెళ్లింది. ఆ సమయంలో ప్రకృతి విలయ తాండవం చేసినప్పుడు చెట్టుకొకరు పుట్టకొకరు అయ్యారు. చంచల్ తండ్రి వరదల్లో చనిపోయాడు. తల్లి నీటిలో కొట్టుకుపోయి.. కొన్నాళ్లు భర్త కోసం, కూతురి కోసం అక్కడక్కడే వెదికి, చివరికి అధికారుల సహకారంతో ఇంటికి వెళ్లిపోయింది. చంచల్ మాత్రం ఎవరికీ కనిపించలేదు! ఏమైపోయిందో తెలీదు. ఇన్నాళ్లకు ఇప్పుడు ఆమె రాకతో ఆలీఘర్‌లో (ఉత్తర ప్రదేశ్)లో వాళ్లు నివాసం ఉండే బన్నాదేవి ప్రాంతంలో సందడి మొదలైంది. చంచల్ తాతగారు హరీష్ చంద్, అమ్మమ్మ శకుంతలాదేవి సంతోషాన్ని ఎవరూ పట్టలేకపోతున్నారు. తల్లయితే చంచల్ని తన చేతుల్లోంచి అసలే వదిలిపెట్టడం లేదు. ‘అంతా ఆ కేదారనాథుడి దయ’ అంటోంది. ఇంతకీ ఏం జరిగింది? పన్నెండేళ్ల వయసుకు పిల్లలు తెలివిగానే ఉంటారు. అయితే చంచల్‌కు మానసిక ఎదుగుదల సరిగా లేకపోవడంతో తానెవరో, ఎక్కడి నుంచి వచ్చిందో చెప్పలేకపోతున్న స్థితిలో జమ్మూ నుంచి కేదార్నాథ్ వచ్చినవారు, తిరిగి జమ్మూ వెళుతూ చంచల్ని కూడా తమతో తీసుకెళ్లి అక్కడి అనాథాశ్రమంలో చేర్పించారు. ఈ ఐదేళ్లలోనూ మానసికంగా కొంత వికసించిన చంచల్.. తరచు అలీఘర్ గురించి మాట్లాడుతుండడం గమనించిన ఆశ్రమం నిర్వాహకులు ఆమె నుంచి మరికొన్ని వివరాలు రాబట్టి అలీఘర్ సిటీ లెజిస్లేటర్‌కు సమాచారం ఇచ్చారు. ఆయన ఈ సంగతిని ఒక ఎన్జీవోకు చెప్పారు. ఆ ఎన్జీవోలు బన్నాదేవి ప్రాంతంలోని చంచల్ కుటుంబ సభ్యులను గుర్తించారు. తర్వాత అలీఘర్ పోలీసుల సహాయంతో చంచల్ తన ఇంటికి చేరింది. -
వరదల్లో తప్పిపోయింది.. ఐదేళ్ల తర్వాత తిరిగొచ్చింది
లక్నో : 2013లో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కేదార్‌నాథ్‌ను వరదలు ముంచెత్తిన సమయంలో తప్పిపోయిన అలీగఢ్ బాలిక.. దాదాపు ఐదేళ్ల తర్వాత కుటుంబ సభ్యులను కలుసుకుంది. ఈ నేపథ్యంలో మనమరాలిని ఇన్నేళ్లుగా క్షేమంగా కాపాడి, ప్రస్తుతం తమ దగ్గరికి చేర్చిన స్వచ్ఛంద సంస్థలకు ఆమె బామ్మాతాతయ్యలు ధన్యవాదాలు తెలిపారు. అసలేం జరిగిందంటే... ఉత్తరప్రదేశ్‌లోని అలీగఢ్‌కు చెందిన చంచల్ అనే మానసిక వికలాంగురాలు 2013లో తన తల్లిదండ్రులతో కలిసి కేదార్నాథ్ యాత్రకు వెళ్లింది. ఆ సమయంలో ప్రకృతి సృష్టించిన బీభత్సానికి కేదార్‌నాథ్‌లో తీవ్ర విషాదం నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో వివిధ రాష్ట్రాలకు చెందిన ఎంతో మంది భక్తులు మృత్యువాత పడ్డారు. ఈ ఘటనలో చంచల్ కుటుంబం చెల్లాచెదురైంది. ఆమె తండ్రి మరణించగా.. ఆమె తల్లి మాత్రం క్షేమంగా ఇంటికి చేరుకుంది. ఈ నేపథ్యంలో జమ్మూలోని ఓ అనాథాశ్రమ నిర్వాహకులు చంచల్‌ను(17) చేరదీసి.. ఐదేళ్లుగా ఆమె బాగోగులు చూసుకుంటున్నారు. మానసిక వికలాంగురాలైన చంచల్ తన స్వస్థలం గురించిన పూర్తి వివరాలు వాళ్లకు చెప్పలేకపోయింది. అయితే ఎప్పుడైనా అలీగఢ్‌కు సంబంధించిన విషయాల గురించి చర్చించినపుడు మాత్రం ఆమెలో ఉత్సాహం కనిపించేది. ఈ విషయాన్ని గమనించిన నిర్వాహకులు.. ఆ దిశగా చంచల్ కుటుంబం గురించి తెలుసుకునేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఈ క్రమంలో అలీగఢ్‌కు చెందిన ఓ స్వచ్ఛంద సంస్థను సంప్రదించి చంచల్ వివరాలు తెలియపరిచారు. చివరికి పోలీసుల సాయంతో ఆమెను కుటుంబ సభ్యులకు అప్పగించారు. -
నంబర్ 2
సైఫ్ అలీఖాన్ కూతురు సారా అలీఖాన్ అనే ట్యాగ్ ఇక ఆమెకు అవసరం లేదు. ఎందుకంటే ఆమె కథానాయికగా నటించిన ‘కేదార్నాథ్’ చిత్రం విడుదలైంది. సారా నటనకు మంచి మార్కులు పడ్డాయి. ఇప్పుడు సారా నంబర్ 2. ఒక్క సినిమా రిలీజైతేనే నంబర్ 2 ఏంటి? అని ఆశ్చర్యపోకండి. ఆమె నంబర్ 2గా నిలిచింది గూగుల్ సెర్చ్‌లో అన్నమాట. ఈ ఏడాది నెటిజన్లు అత్యధికంగా వెతికిన బాలీవుడ్ కథానాయికల్లో సారా నంబర్ టూ. ఫస్ట్ ప్లేస్‌లో ప్రియాంకా చోప్రా నిలిచారు. ఇక రణ్వీర్ సింగ్, సారా అలీఖాన్ జంటగా రోహిత్ శెట్టి దర్శకత్వంలో రూపొందిన ‘సింబా’ చిత్రం ఈ నెల 28న విడుదల కానుంది. తెలుగు హిట్ ‘టెంపర్’కు ఇది హిందీ రీమేక్. -
మహిళా నిర్మాత అరెస్టు
సాక్షి, ముంబై : చీటింగ్ కేసులో సినిమా నిర్మాత ప్రేరణ అరోరాను ముంబై పోలీసులు అరెస్టు చేశారు. ఆర్థిక నేరాలకు పాల్పడిన నేపథ్యంలో డిసెంబరు 10 వరకు ఈఓడబ్ల్యూ(ఎకనమిక్ అఫెన్సెస్ వింగ్) కస్టడీ పొడగించినట్లు పేర్కొన్నారు. వివరాలు... క్రిఆర్జ్ ఎంటరేన్‌మెంట్ అధినేత ప్రేరణ అరోరా పలు చిత్రాల హక్కులు ఇప్పిస్తానంటూ తన వద్ద 32 కోట్ల రూపాయలు తీసుకున్నారని ఫిల్మ్ మేకర్ వషు భగ్నానీ ఆరోపించారు. అయితే ప్రస్తుతం ఈ సినిమాలకు సంబంధించిన హక్కులు వేరే వ్యక్తులకు బదలాయించి తనను మోసం చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఫనేకాన్, బట్టి గుల్ చాలు మీటర్ వంటి చిత్రాల హక్కులు తనకు దక్కకుండా చేశారని, తనతో పాటుగా మరికొంత మందిని కూడా ప్రేరణ ఇలాగే మోసం చేశారంటూ ఆయన ఆరోపించారు. ఈ నేపథ్యంలో ముంబై ఈఓడబ్ల్యూ పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. కాగా ప్రేరణ అరోరాపై గతంలో కూడా ఇలాంటి ఆరోపణలు వచ్చాయి. జాన్ అబ్రహం చిత్రం పరమాణు, సుశాంత్ సింగ్ రాజ్‌పుత్- సారా అలీఖాన్ జంటగా తెరకెక్కిన కేదార్నాథ్ వంటి సినిమాల హక్కుల విషయంలో కూడా ఆమెపై పలు చీటింగ్ కేసులు నమోదయ్యాయి. -
‘కేదార్నాథ్’ ట్రైలర్ విడుదల
-
ఆకట్టుకుంటున్న ‘కేదార్నాథ్’ ట్రైలర్
బాలీవుడ్ స్టార్ కిడ్ సారా అలీఖాన్(సైఫ్ అలీఖాన్- అమృతా సింగ్ కుమార్తె)ను సిల్వర్ స్క్రీన్కు పరిచయం చేస్తూ తెరకెక్కుతోన్న సినిమా కేదార్నాథ్. 2013లో చార్ధామ్ ప్రాంతంలో ముఖ్యంగా కేదార్‌నాథ్‌లో వచ్చిన వరదల నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాకు అభిషేక్ కపూర్ దర్శకుడు. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ హీరోగా నటిస్తున్న ఈ సినిమా ట్రైలర్‌ను సోమవారం విడుదల చేసింది మూవీ యూనిట్. కేదార్నాథ్ యాత్ర ప్రాశస్త్యాన్ని వర్ణిస్తూ మొదలైన ట్రైలర్ సారా- సుశాంత్‌ల పరిచయం, వారి ప్రేమ గురించి తెలిసిన పెద్దలు తీసుకున్న నిర్ణయం తదితర అంశాలతో ఆసక్తికరంగా సాగుతుంది. ఆలయ పరిసరాలను వరద ముంచెత్తడం, సహాయక చర్యలకు సంబంధించిన విజువల్స్‌తో ట్రైలర్ ఆకట్టుకుంటోంది. హిందూ యువతి- ముస్లిం యువకుడి ప్రేమకథగా తెరకెక్కుతున్న ఈ సినిమాను డిసెంబర్ 7న విడుదల చేయనున్నారు. -
ఆ సినిమాను విడుదల కానివ్వం
ముంబై : బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్, సారా అలీఖాన్ జంటగా అభిషేక్ కపూర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘కేదార్నాథ్’ . ఈ సినిమాకు సంబంధించిన అఫిషియల్ టీజర్ ఇదివరకే విడుదలై మంచి ఆదరణ పొందింది. 2013 సంవత్సరంలో చోటుచేసుకున్న ఉత్తరాఖండ్ చారదామ్ వరదల నేపథ్యంతో సాగే ప్రేమ కథగా సినిమా తెరకెక్కింది. ఈ చిత్రం డిసెంబర్ 7వ తేదీన విడుదలకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో సినిమాపై కేదార్నాథ్(తీర్థ్ పురోహిత్) ఆలయ పూజారులు మండిపడుతున్నారు. హిందూ మతాన్ని కించపరిచేలా సినిమా ఉందని, సినిమా విడుదల చేస్తే ఊరుకోమంటున్నారు. సినిమా ‘లవ్ జీహాదీ’ని ప్రోత్సహించేలా ఉందని వారు ఆరోపిస్తున్నారు. సినిమాను విడుదల కానివ్వమని, ఒక వేళ విడుదల చేయాలని చూస్తే ఆందోళనలు చేపడతామని హెచ్చరిస్తున్నారు. రుద్రప్రయాగలో కొంతమంది నిరసనకారులు సినిమాకు వ్యతిరేకంగా ఆందోళన చేపట్టారు. -
డిసెంబర్ 7న ‘కేదార్నాథ్’
బాలీవుడ్ సీనియర్ హీరో సైఫ్ అలీఖాన్ కుమార్తె సారా అలీఖాన్‌ను వెండితెరకు పరిచయం చేస్తూ తెరకెక్కిస్తున్న సినిమా కేదార్నాథ్. 2013లో ఉత్తరాదిని, ముఖ్యంగా కేదార్నాథ్ ప్రాంతంలో వచ్చిన వరదల నేపథ్యంలో తెరకెక్కిన ఈసినిమాకు అభిషేక్ కపూర్ దర్శకుడు. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ హీరోగా నటిస్తున్న ఈ సినిమా టీజర్ రిలీజ్ అయ్యింది. ఆలయ పరిసరాల్లో భారీగా నీరు చేరటం సహాయక చర్యలకు సంబంధించిన విజువల్స్‌తో టీజర్‌ను థ్రిల్లింగ్ గా కట్ చేశారు. ప్రేమ కథగా తెరకెక్కుతున్న ఈ సినిమాను గౌడీకుండ్ నుంచి కేదార్నాథ్ మధ్య ప్రాంతంలో చిత్రీకరించారు. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈసినిమా డిసెంబర్ 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. -
సైఫ్ కూతురు మోసం చేసింది
బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ తనయ సారా అలీ ఖాన్ కోర్టు మెట్లేక్కనున్నారు. ‘కేదర్నాథ్’ సినిమా డేట్స్ విషయంలో గొడవలు రావడంతో సదరు చిత్ర యూనిట్ సారా మీద కోర్టులో దావా వేసింది. ముంబై హైకోర్టు నేడు(శుక్రవారం) ఈ విషయాన్ని విచారించనుండటంతో సారా, తండ్రి సైఫ్ అలీఖాన్‌తో కలిసి కోర్టుకు హజరవ్వనున్నట్లు సమాచారం. వివరాల్లోకి వెళ్తే... సారా అలీఖాన్ కేదార్నాథ్ సినిమా ద్వారా బాలీవుడ్‌కు పరిచయమవ్వాల్సిందన్న విషయం తెలిసిందే. అభిషేక్ కపూర్ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రం కోసం 2018 జూన్ వరకూ సారా డేట్స్ ఇచ్చారు. అయితే నిర్మాతకు, దర్శకుడికి మధ్య వివాదాలు రావడంతో ఈ సినిమా నిర్మాణం ఆగిపోయింది. దాంతో సారా, రోహిత్ శెట్టి తెరెక్కిస్తున్న ‘సింబా’(టెంపర్ రీమేక్) సినిమా కోసం డేట్లు అడ్జస్ట్ చేశారు. అదే సమయంలో మరో నిర్మాత దొరకటంతో అటకెక్కిందనుకున్న కేదార్నాథ్ షూటింగ్ తిరిగి ప్రారంభం అయ్యింది. దీంతో తిరిగి షూటింగ్‌కు హజరవ్వాల్సిందిగా సారాను చిత్ర యూనిట్ కోరింది. కానీ ఆమె మేనేజర్ మాత్రం సింబా షూటింగ్ పూర్తయ్యాకే కేదర్నాథ్ చిత్రీకరణలో పాల్గొంటారని తేల్చి చెప్పారు. దీంతో కేదర్నాథ్ మేకర్లు సారా మీద కోర్టులో దావా వేసాడు. కోర్టు బయటే వివాదం పరిష్కరించుకునేందుకు సైఫ్ చేసిన ప్రయత్నాలు ఫలించలేదని తెలుస్తోంది. ఈ పిటిషన్ విచారణకు ముంబై హై కోర్టు ఎస్ జే కథ్వాలా నేతృత్వంలో బెంచ్‌ను ఏర్పాటు చేసింది. -
తెరుచుకున్న కేదార్నాథ్ ఆలయం
డెహ్రాడూన్: కేదార్నాథ్ ఆలయం తెరుచుకుంది. ఈ రోజు ఉదయం భక్తుల సందర్శనార్థం ఆలయాన్ని తెరిచారు. సంవత్సరంలో ఈ ఆలయం ఆరు నెలలు మూసి ఉంచడం, ఆరు నెలలు తెరిచి ఉంచడం చేస్తారన్న సంగతి తెలిసిందే. భక్తుల సందర్శనార్థం ప్రత్యేకమైన ఏర్పాట్లు చేశామని ఆలయ నిర్వాహకులు తెలిపారు. చార్ధామ్ యాత్రలో భాగంగా కేదార్నాథ్ ఆలయాన్ని ఈ ఆరునెలల్లో లక్షల మంది సందర్శిస్తారు. భక్తుల తాకిడితో ఆ ప్రాంతం అంతా కోలాహలంగా ఉంటుంది. భక్తుల కోసం వైద్య, విద్యుత్, నీటి సదుపాయాలను ఏర్పాటు చేసినట్లు ఉత్తరాఖండ్ సీఎం త్రివేంద్రసింగ్ పేర్కొన్నారు. మళ్లీ నవంబర్‌లో ఈ ఆలయాన్ని మూసివేస్తారు. -
కుప్పకూలిన వాయుసేన హెలికాప్టర్
కేదార్నాథ్, ఉత్తరాఖండ్ : భారతీయ వాయుసేనకు చెందిన ఎంఐ-17 హెలికాప్టర్ ఉత్తరాఖండ్‌లో కుప్పకూలింది. ఈ ఘటనలో హెలికాప్టర్లో ఉన్న నలుగురు గాయాలపాలయ్యారు. ల్యాండింగ్ సమయంలో ఐరన్ గిర్డర్‌ను హెలికాప్టర్‌ను బలంగా తాకడంతో మంటలు చెలరేగాయి. రవాణా అవసరాలకు వినియోగించే ఎంఐ-17 హెలికాప్టర్‌ను కేదార్నాథ్ హెలిప్యాడ్ వద్ద ల్యాండ్ చేస్తుండంగా ఐరన్ గిర్డర్‌కు తగిలి ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. -
15 కోట్ల భారీ ఆఫర్ వద్దన్నాడు.. ఎందుకో తెలుసా!
సాక్షి, ముంబయి: బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఓ భారీ ఆఫర్‌ను వదులుకున్నాడట. ఏకంగా రూ.15 కోట్ల డీల్ తనకు రాగా సుశాంత్ సున్నితంగా ఆ ఆఫర్‌ను తిరస్కరించడంతో వార్తల్లో వ్యక్తిగా నిలిచాడు. టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ బయోపిక్ ‘ఎంఎస్ ధోని: అన్‌టోల్డ్ స్టోరీ’లో ధోని పాత్రలో కనిపించిన సుశాంత్ ప్రేక్షకులను మెప్పించాడు. ఈ బయోపిక్ తర్వాత సుశాంత్‌కు ప్రకటనల నిమిత్తం ఆఫర్లు రాగా కొన్ని చేయగా, మరికొన్నింటిని తిరస్కరించాడు. ఫెయిర్‌నెస్ క్రీమ్ యాడ్ కంపెనీ తమ సంస్థకు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తే రూ.15 కోట్లు ఇస్తామన్న ఆఫర్‌ను వద్దనుకున్నట్లు సుశాంత్ తెలిపాడు. భారీగా డబ్బులు ఇస్తామన్నా తన మనసు అందుకు ఒప్పుకోలేదన్నాడు. ‘ఫెయిర్‌నెస్ క్రీమ్ సంస్థలకు ప్రచారం కల్పించి తప్పుడు సందేశాన్ని సమాజానికి అందించాలనుకోలేదు. కొన్ని వర్గాలు, జాతుల వారి మనోభావాలను దెబ్బతీసే ప్రకటనలు చేయకపోవడమే అత్యుత్తమం. అభయ్ డియోల్, షారుక్ ఖాన్, షాహిద్ కపూర్, జాన్ అబ్రహం, దీపికా పదుకొనే, సోనమ్ కపూర్, ప్రియాంక చోప్రా లాంటి స్టార్లు గతంలో ఫెయిర్‌నెస్ క్రీమ్స్ ప్రకటనలను వ్యతిరేకించారని’ సుశాంత్ గుర్తుచేశాడు. చివరగా రాబ్తా మూవీలో కనిపించిన సుశాంత్.. ప్రస్తుతం డ్రైవ్, చందమామ దూర్కే మూవీతో పాటు సైఫ్ అలీ ఖాన్ కూతురు సారా అలీ ఖాన్ బాలీవుడ్‌కు ఎంట్రీ ఇస్తున్న ‘కేదార్నాథ్’మూవీ షూటింగ్‌లతో బిజీగా ఉన్నాడు. -
రూ ఏడు కోట్లతో కేదార్నాథ్ సెట్
సాక్షి,ముంబయి: బాలీవుడ్లో ప్రతిష్టాత్మక ప్రాజెక్టుగా తెరకెక్కుతున్న కేదార్నాథ్ కోసం చిత్ర మేకర్లు భారీగా ఖర్చు చేస్తున్నారు. సైఫ్ అలీఖాన్ కుమార్తె సారా అలీ, సుశాంత్ సింగ్ రాజ్పుట్ జంటగా తెరకెక్కుతున్న కేదార్నాథ్ మూవీ ఇప్పటికే హిమాలయాల్లో కొంత భాగం షూటింగ్ పూర్తి చేసుకుంది.కేదార్నాథ్ టెంపుల్‌ను ప్రతిబింబించేలా ప్రస్తుతం ముంబయి ఫిల్మ్‌సిటీలో భారీ సెట్‌ను ఏర్పాటు చేశారు. వరదలకు సంబంధించిన సన్నివేశాలను ఈ సెట్లో తెరకెక్కించనున్నారు. దీనికోసం భారీ వాటర్ ట్యాంకర్లను సిద్ధం చేశారు. ఈ సెట్ నిర్మాణానికి నిర్మాతలు రూ ఏడు కోట్లు వెచ్చించినట్టు సమాచారం. వరద ముంపు సన్నివేశాల చిత్రీకరణ కోసం నటీనటులు, చిత్ర బృందానికి నిపుణులతో శిక్షణ ఇప్పించారు. సైఫ్ అలీఖాన్, అమృతాసింగ్‌ల కుమార్తె సారాకు ఇదే తొలిచిత్రం కావడంతో కేదార్‌నాథ్‌పై బాలీవుడ్ దృష్టిసారించింది. -
కేదార్‌పురికి శ్రీకారం
-
కేదార్‌నాథ్‌లో రాష్ట్రపతి పర్యటన
డెహ్రాడూన్ : రాఫ్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆయన కుటుంబ సభ్యులు ఆదివారం ఉత్తరాఖండ్‌లోని కేదార్నాథ్, బద్రీనాథ్ ఆలయాలను దర్శించారు. ఉత్తరాఖండ్ గవర్నర్ కేకే పాల్, ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్ రావత్‌లు కూడా రాష్ట్రపతితో కలిసి ఆలయాలను దర్శించారు. కేదార్‌నాథ్‌లో పరమశివుడికి దర్శించుకునేందుకు వచ్చిన రాష్ట్రపతికి ఆలయ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ అధికారి సంప్రదాయల ప్రకారం స్వాగతం పలికారు. స్వామివారి దర్శనం చేసుకున్న ఆరాష్ట్రతి రామ్‌నాథ్ కోవింగ్ ప్రత్యేకంగా రుద్రాభిషేకం చేయించుకున్నారు. అనంతరం బద్రీనాథ్ వెళ్లిన ఆయన శ్రీమన్నారాయణుడిని దర్శించికుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా హిమాలయాల్లో ప్రత్యేకంగా లభించి ఒక గంధపు మొక్కను రాష్ట్రపతి భవన్లో నాటేందుకు కోవింద్ సతీమణి ప్రత్యేకంగా తీసుకున్నారు. -
సంప్రదాయ వైద్యం నిర్లక్ష్యం
గత ప్రభుత్వాలపై ప్రధాని మోదీ విమర్శ - ఆయుర్వేద మందులకు కొత్త ప్యాకింగ్‌తో ఆదరణ లభిస్తుందని వెల్లడి - పతంజలి యోగ్ పీఠ్‌లో ఆధునిక పరిశోధన కేంద్రం ప్రారంభం - మోదీకి ‘రాష్ట్ర రుషి’ బిరుదు ప్రదానం హరిద్వార్: ఆయుర్వేదం వంటి సంప్రదాయ భారత వైద్య విధానాలను గత ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేశాయని ప్రధాని నరేంద్ర మోదీ విమర్శించారు. సంప్రదాయ వైద్య వ్యవస్థ లను, యోగా వంటి ఆరోగ్య విధానాలను ప్రోత్సహించడానికి స్వాతంత్య్రానికి ముందు, తర్వాత తగినంత కృషి జరగలేదన్నారు. ఆయన బుధవారమిక్కడ యోగా గురువు బాబా రాందేవ్‌కు చెందిన పతంజలి యోగ్ పీఠ్‌లో అత్యాధునిక పరిశోధన కేంద్రాన్ని ప్రారంభించారు. ‘స్వాతంత్య్రానికి పూర్వం మనది బానిస దేశం కనుక మన సంప్రదాయ వైద్య, ఆరోగ్య వ్యవస్థలను మరుగుపరచారు. దురదృష్టవశాత్తూ స్వాతంత్య్రం తర్వాతా ప్రభుత్వాలు వీటి విశిష్టతలను విస్మరించా యి’ అని అన్నారు. ఆయుర్వేద ఔషధాలకు ఆధునిక ప్యాకింగ్, క్లినికల్ పరీక్షల కోసం యోగ్‌పీఠ్‌లో కొత్త సంస్థను ఏర్పాటు చేశారని, ఉత్తమ ఆరోగ్యసంరక్షణ దిశగా ఇది ఒక ముందడుగు అని ప్రధాని పేర్కొన్నారు. ఇందులో ఆధునిక లేబొరేటరీ ఉందని, భారత సంప్రదాయ చికిత్సా విధానాలకు దీనిద్వారా విస్తృత ఆమోదం లభిస్తుందన్నారు. పాత పద్ధతుల వల్ల ఆయుర్వేద మందులకు ఆద రణ లభించడం లేదని, వాటిని కొత్త పద్ధతు ల్లో ప్యాక్ చేస్తే ప్రపంచం సంతోషంగా స్వీకరి స్తుందన్నారు. పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేసినందుకు, యోగాను ప్రపంచం లోని ప్రతి ఇంటికి చేరువ చేసినందుకు రాందేవ్‌ను అభినందిస్తు న్నానని అన్నారు. రాందేవ్ సహాయకుడు ఆచార్య బాలకృష్ణ రూపొందిం చిన ‘వరల్డ్ హెర్బ్ ఎన్సైక్లోపీడియా’ను ప్రధాని ఆవిష్కరించారు. దేశంలో లభించే 70వేల మూలికల వివరాలు ఇందులో ఉన్నాయి. కార్యక్రమంలో రాందేవ్.. మోదీకి ‘రాష్ట్ర రుషి’ బిరుదును ప్రదానం చేశారు. పరిశుభ్రమైన, శక్తిమంతమైన, సమైక్య భారత నిర్మాణానికి అవిశ్రాంతంగా కృషి చేస్తున్నందుకు ఈ బిరుదు ఇచ్చామని, ఆదర్శవంతమైన ఆయన నాయ కత్వంలో దేశం సుసంపన్నమవుతుందని రాందేవ్ కొనియాడారు. ఈ గౌరవం తనను ఆశ్చర్యానికి గురిచేసిందని మోదీ అన్నారు. ‘ఈ దేశంలోని 125 కోట్ల మంది ప్రజలే నాకు స్ఫూర్తి. వారి ఆశీర్వాద బలంపై ఉన్నంత నమ్మకం నాపైన నాకు లేదు’ అని అన్నారు. తానే బూట్లు విప్పుకుని.. వీఐపీ సంస్కృతి పోవాలని ఇటీవల చెప్పిన మోదీ కేదార్నాథ్ ఆలయంలో దాన్ని ఆచరించి చూపారు. ఆయన గుడి లోకి వెళ్లే ముందు ఒకచోట కూర్చుని తన బూట్లను తానే విప్పుకున్నారు. ఆ సమయంలో ఒక వ్యక్తి సాయం చేస్తానని ముందుకురాగా, ప్రధాని సున్నితంగా వద్దని తిరస్కరించారు. మీడియాకు బలమైన మద్దతు ప్రపంచ పత్రికా స్వేచ్ఛ దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ బుధవారం మీడియాకు బలమైన మద్దతు ప్రకటిం చారు. ప్రజాస్వామ్యానికి కీలకమైన మీడియా స్వేచ్ఛగా, శక్తిమంతంగా ఉండేందుకు మన బలమైన మద్దతును ఈ రోజు పునరుద్ఘాటించాలని ట్వీట్ చేశారు. ప్రస్తుతం సోషల్ మీడియా క్రియాశీలక మాధ్యమంగా మారి, పత్రికాస్వేచ్ఛకు శక్తినిస్తోందని పేర్కొన్నారు. కేదార్‌నాథ్‌లో మోదీ పూజలు డెహ్రాడూన్: ఉత్తరాఖండ్‌లోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కేదార్నాథ్ ఆలయంలో ప్రధాని మోదీ బుధవారం పూజలు నిర్వహించారు. హిమాలయాల్లోని ఈ గుడిని శీతాకాల విరామం తర్వాత బుధవారమే తెరవగా మోదీ తొలిభక్తుడిగా శివుణ్ని సేవించారు. గత 28 ఏళ్లలో దేశ ప్రధాని ఒకరు ఈ ఆలయాన్ని సందర్శించడం ఇదే తొలిసారి. రాష్ట్ర గవర్నర్ కే.కే. పాల్, ముఖ్యమంత్రి త్రివేంద్రసింగ్ రావత్‌తో కలసి వచ్చిన మోదీ కేదారేశ్వరుడికి రుద్రాభిషేకం జరిపించారు. పూజారులు ఆయనకు ఒక శాలువా, రుద్రాక్ష తదితరాలను కానుకగా సమర్పించారు. గుడి బయటికి వచ్చిన ప్రధాని ప్రజలకు నవ్వుతూ అభివాదం చేశారు. తొలిరోజు ఆలయాన్ని సందర్శించిన 4 వేల మంది భక్తులు ప్రధానిని చూసేందుకూ ఉత్సాహం ప్రదర్శించారు.2013నాటి వరదల్లో కొండలపైనుంచి దొర్లిపడి గుడివెనక నిలిచిపోయిన ‘భీమ్శిల’ను కూడా ప్రధాని దర్శించారు. ఈ శిల ఆలయానికి నష్టం కలగకుండా కాపాడిందని ప్రతీతి. గుడిలో గంటసేపున్న ప్రధాని హెలిప్యాడ్ వద్దకు తిరిగి వెళ్తూ మధ్యలో ఓ సైనికుడి చేతిలోని చిన్నారిని భుజం తట్టారు. వారిద్దరితో కాసేపు ముచ్చటించారు. కేదార్నాథ్పర్యటన తర్వాత మోదీ హరిద్వార్‌కు వెళ్లారు. -
‘చార్ధామ్ యాత్ర’
గంగోత్రి, యమునోత్రి, బద్రీనాథ్, కేదార్నాథ్ ఈ నాలుగు పుణ్యక్షేత్రాలను ఒకేసారి సందర్శించుకొని రావటాన్ని ‘చార్ధామ్ యాత్ర’ అంటారు. సంవత్సరంలో ఆరు నెలల పాటు దేవతలు పూజిస్తారని పేరొందిన ఈ నాలుగు ఆలయాలను మిగిలిన ఆరు నెలల కాలంలో మానవులు సందర్శించుకోవచ్చు. ఎంతో మహిమాన్వితమైన ఈ ఆలయాల ద్వారాలు ప్రతి సంవత్సరం మే మొదటి వారంలో తెరుస్తారు. తిరిగి నవంబర్‌లో దీపావళి పర్వదినం తర్వాత మూసివేస్తారు. ఈ నాలుగు ఆలయాలూ ఉత్తరాఖండ్ రాష్ట్రంలోనే ఉన్నాయి. గంగానది, యమునా నది జన్మస్థలాలను గంగోత్రి, యుమునోత్రి అంటారు. అలాగే బద్రీనాథ్‌లో శ్రీ మహావిష్ణువు, కేదార్‌నాథ్‌లో శివుడు స్వయంభువుగా వెలిసినట్టు పురాణాలు చెబుతున్నాయి. జీవిత కాలంలో ఒక్కసారైనా వెళ్లితీరాలని కోరుకునే యాత్ర. వెళ్లే మార్గం సంక్లిష్టమైనదైనా ప్రకృతి సోయగాలలో ప్రశాంతతను పొందాలని ఆకాంక్షించే యాత్ర. హిమాలయ పర్వత శ్రేణులలో వెలసిన ఆరాధ్య దైవాలను దర్శించి, తరించాలని తపించే యాత్ర. అదే, అతిపవిత్రమైన చార్ ధామ్ యాత్ర. యమునోత్రి చార్ధామ్ యాత్రలో మొదటగా దర్శించుకునే ధామం (క్షేత్రం) యమునోత్రి. యమునానది జన్మస్థలంలోనే యమునాదేవి ఆలయం ఉంది. యమునానది ప్రాశస్త్యం గురించి ఒక్కో పురాణం ఒక్కో కథను వివరిస్తున్నాయి. ప్రముఖంగా చెప్పుకునేది – సూర్యదేవుడి అర్ధాంగి ఛాయాదేవి. వీరికి యముడు, యమున సంతానం. ఛాయాదేవికి కూతురైన యమున మీద ఒకానొక సమయంలో ఆగ్రహం కలిగి భూలోకంలో పడి ఉండమని శపించిందట. దాంతో యమున భూలోకంలో నదిగా అవతరించిందట. గంగోత్రి చార్ధామ్ యాత్రలో సులువుగా చేరుకోగలిగే ప్రాంతం గంగోత్రి. ఈ నది జన్మస్థలం ఉత్తరాఖండ్‌లోని ఉత్సర కాశీ జిల్లాలో ఉన్న ప్రముఖ పుణ్యక్షేత్రం. సముద్రమట్టానికి 3,750 మీటర్ల ఎత్తులో హిమాలయ పర్వత శ్రేణులలో ఉంది. నదులన్నింటిలో గంగానది పరమపవిత్రమైనదిగా పూజలందుకుంటోంది. భగీరథుడి తపఃఫలంగా ఉద్భవించిన గంగ 18 కిలోమీటర్ల దూరం ప్రయాణించి గోముఖం అనే చోట నేల మీదకు దూకుతుంది. గోముఖం నుండి గంగోత్రి చేరే వరకు ఈ ప్రవాహంలోని నీటికి ఎక్కడా మానవ స్పర్శ అంటదు. అందువల్లే తమిళ నాడు రామేశ్వరంలోని లింగేశ్వరస్వామికి నిత్యాభిషేకం గంగోత్రి నీటితోనే చేస్తారు. కేదార్నాథ్ అత్యున్నతమైన ద్వాదశ జ్యోతిర్లింగాలలో మొదటిది కేదార్నాథ్. వైశాఖమాసంలో అంటే ఏప్రిల్ ఆఖరి వారం లేదా మే నెల మొదటి వారంలో తెరుస్తారు. తిరిగి అక్టోబరు నెల ఆఖరి వారం లేదా నవంబరు మొదటి వారంలో మూసివేస్తారు. నరనారాయణులు కేదారనాథుని అనుమతి తీసుకొని, బదరీనాథ్‌లో తపస్సు చేశారని స్థలపురాణం చెబుతోంది. బద్రీనాథ్ జగద్గురు ఆదిశంకరుల వారు నెలకొల్పిన ఈ క్షేత్రంలో అన్ని తీర్థాలలోని సమస్త దేవతలూ నివసిస్తారనీ నమ్మకం. ఈ ఆలయంలో వైశాఖం నుండి కార్తీక మాసం వరకు మానవులు, మార్గశిరం నుండి చైత్రమాసం చివరి వరకు నారద మహర్షి స్వామికి పూజలు చేస్తారని కథనాలు. గర్భాలయంలో ఉత్సవమూర్తితో పాటు స్వామి ఎడమవైపున నరనారాయణులు శ్రీదేవి– భూదేవి, నారదుడు, ఉద్ధవుడు.. కుడివైపున కుబేరుడు, గరుత్మంతుడు కొలువుదీరి ఉన్నారు. పితరులకు ఇక్కడ పిండ ప్రదానం చేస్తే వారికి మోక్షం సిద్ధిస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి. చార్ధామ్ యాత్రలో RVటూర్స్ –ట్రావెల్స్ గత 15 ఏళ్లుగా కొన్ని వేలమందికి చార్ధామ్ యాత్ర దర్శనాన్ని అందించి అనతి కాలంలోనే తెలుగువారి ఆత్మీయ ట్రావెల్స్‌గా పేరొందిన RVటూర్స్ – ట్రావెల్స్ ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రత్యేక ప్యాకేజీలతో సకల సదుపాయాలతో అనుభవజ్ఞులైన టూర్ మేనేజర్లతో చార్ధామ్ దర్శన భాగ్యాన్ని కల్పిస్తోంది. మీరు కూడా చార్ధామ్ యాత్ర చేయాలనుకుంటే RVటూర్స్ – ట్రావెల్స్ వారిని సంప్రదించగలరు. -
నా పేరు లుగ్డీదేవి... మా ఆయన పేరు కేదార్నాథ్
శాంతిదేవి 1926 డిసెంబర్లో ఢిల్లీలో పుట్టింది. 1930లో అంటే నాలుగేళ్ల వయసు నుంచి తన గతజన్మ విషయాలను చెప్పడం మొదలుపెట్టింది. మహాత్మాగాంధీ సైతం ఈ కేస్ పట్ల శ్రద్ధ తీసుకొని శోధించమని కమిషన్‌కు సిఫారస్ చేశారు. 1936లో కమిషన్ రిపోర్ట్ ఆధారంగా బాల్చంద్ నహతా అనే వ్యక్తి ‘పునర్జన్మ కీS పర్యాలోచన’ అనే పేరుతో పుస్తకం తీసుకొచ్చారు. ఆ తర్వాత కాలంలో విదేశాల నుంచి వచ్చిన పలువురు ప్రముఖులు శాంతిదేవిని ఇంటర్వూ్య చేశారు. పత్రికలలో ప్రముఖంగా వ్యాసాలు రాశారు. ఆమె కథనం ఇలా ఉంది.. శాంతిదేవి నాలుగేళ్ల వయసులో తల్లిదండ్రులతో ‘నా సొంత ఇల్లు మధురలో ఉంది..’ అని చెబుతుండేది. తల్లితండ్రులు మొదట్లో ఆమె మాటలను పట్టించుకోలేదు. ఆరేళ్ల వయసులో ఆమె ఇంట్లో నుంచి వెళ్లిపోయి మధురకు చేరుకుంది. ఎలాగో తంటాలు పడి ఆమెను వెతుక్కొచ్చారు తల్లీతండ్రి. స్కూల్‌కి వెళితే టీచర్లు, ప్రిన్సిపల్‌తో ‘మధురలోని ఓ ప్రాంతానికి చెందిన మాండలికంలో మాట్లాడేది శాంతిదేవి. తన భర్త కేదార్నాథ్ అని, అతను ఒక చిన్న వ్యాపారి అని, తన పేరు లుగ్డీదేవి అని, తొమ్మిదేళ్ల క్రితం తనకు ఓ కొడుకు పుట్టాడని, వాడు పుట్టిన పది రోజులకు జబ్బు చేసి తను మరణించానని చెప్పింది. వాళ్లు ఆమె చెప్పిన అడ్రెస్‌కు ఈ విషయం తెలియజేశారు. కేదార్నాథ్ ఢిల్లీ వచ్చారు. అతనితో పాటు ఉన్న కొడుకును శాంతిదేవి వెంటనే గుర్తుపట్టింది. కేదార్నాథ్ భార్యగా ఉన్నప్పుడు తను ఏమేం పనులు చేసేది వివరించింది. కమిషన్ సభ్యులు ఆ తర్వాత శాంతిదేవిని తీసుకొని మధుర వెళ్లారు. అక్కడ లుగ్డీదేవి తాతతో సహా చాలా కుటుంబాలను గుర్తించింది. వారి యోగక్షేమాలు అడిగింది. మరణశయ్య మీద ఉన్న తనకు కేదార్నాథ్ ఎన్నో ప్రమాణాలు చేశాడని, అవన్నీ అతను నిర్లక్ష్యం చేశాడని చెప్పింది. చనిపోవడానికి కొన్ని రోజులు ముందు తను భూమిలో దాచిన డబ్బును తవ్వి తీసుకొచ్చి ఇచ్చింది. తిరిగి తన తల్లిదండ్రుల వద్దకు చేరుకుంది. కమిషన్ సభ్యులు శాంతిదేవికి ఇది ‘పునర్జన్మ ’అని రిపోర్ట్ ఇచ్చారు. శాంతిదేవి యుక్తవయసు వచ్చినా పెళ్లి చేసుకోలేదు. 1950లో అమెరికన్ సైకాలజిస్ట్ ‘ఐయాన్ స్టీవెన్సన్ శాంతిదేవి విషయం తెలుసుకొని ఇంటర్వూ్య చేయడంతో ఆమె పునర్జన్మ కథ ప్రపంచవ్యాప్తం అయ్యింది. ప్రపంచవ్యాప్తంగా 3000 మంది గతజన్మ అనుభవాల మీద పరిశోధనలు చేసిన స్టీవెన్‌సన్‌కి మరణానికి ముందు లుగ్డీదేవి అనుభవించిన కష్టం, శాంతిదేవి చెప్పిన విషయాలు ఒకేలా ఉండటం ఆశ్చర్యపరిచాయి. 1987 డిసెంబర్ 27న ఆమె చనిపోవడానికి నాలుగు రోజులు ముందు శాంతిదేవిని కలిసి, ఇంటర్వూ్య చేసిన కె.ఎస్.రావత్ ఆమె కథనాన్ని తిరిగి ప్రచురించారు. -
అస్తిపంజరాలు లభించిన మాట నిజమే
డెహ్రాడూన్: మూడేళ్ల క్రితం ప్రకృతి విపత్తుతో విలవిలలాడిన కేదార్నాథ్ ఆలయం వద్ద అనేక అస్తిపంజరాలు లభించిన మాట నిజమేనంటూ ఉత్తరాఖండ్ ప్రభుత్వం అంగీకరించింది. ముఖ్యమంత్రి హరీశ్‌రావత్ ఈ విషయమై సోమవారం మీడియాతో మాట్లాడుతూ ‘మొత్తం 31 అస్తిపంజరాలు దొరికాయి. అందులో 21 అస్తిపంజరాలకు అంత్యక్రియలు నిర్వహించాం. మిగతా ఎనిమిది మృతదేహాలకు మంగళవారం చేస్తాం’ అని చెప్పారు. దీనితో నాకేమీ సంబంధం లేదు. నాకు ముందు అధికారంలో ఉన్న విజయ్ బహుగుణ గాలింపు చర్యలను నిలిపివేశారు. గాలింపు చర్యలు చేపట్టలేదంటూ ఇల్లెక్కి అరిచేవాళ్లంతా ఈ విషయమై ఆయననే నిలదీయాలి’ అని అన్నారు. కేదార్నాథ్ ఆలయం సమీపంలో అనేక అస్తిపంజరాలు లభ్యమయ్యాయంటూ వార్తలు రావడం తెలిసిందే. 2013లో ఏకబిగిన కుండపోతగా వర్షం కురియడంతో అనేక భవనాలు కూలిపోయి ప్రవాహంలో కొట్టుకుపోయాయి. ఈ నేపథ్యంలో కొంతమంది తమ ప్రాణాలను కాపాడుకోవడం కోసం కొండ పైభాగానికి వెళ్లారు. అయితే అక్కడ ఆహారం, నీరు దొరకకపోవడంతో చనిపోయి ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు. -
యాత్రాదర్శిని ట్రావెల్స్ మోసం...
మిర్యాలగూడ: ప్రైవేట్ ట్రావెల్స్ మోసాలతో నల్లగొండ జిల్లా యాత్రికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి నెలకొంది. మిర్యాలగూడకు చెందిన యాత్రికులను యాత్రాదర్శిని ట్రావెల్స్ కేదార్నాథ్ యాత్రకు తీసుకువెళ్లింది. అనూహ్యంగా రెండు రోజుల కిందట హరిద్వార్‌లో యాత్రికులను ట్రావెల్స్ సిబ్బంది వదిలేసి వెళ్లిపోయారు. దీంతో వారు అక్కడ ఇబ్బందులు ఎదుర్కోంటున్నారు. ట్రావెల్స్ తీరుపై బంధువులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
కేధార్ నాథ్లో ఆలయ పునరుద్థరణ పనులు
-
900 మంది యాత్రికులను రక్షించిన సైన్యం
న్యూఢిల్లీ: ఉత్తరాఖండ్ వరదల్లో చిక్కుకున్న దాదాపు 900 మంది యాత్రికులను ఎన్డీఆర్ఎఫ్(నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్) బృందాలు రక్షించాయి. ఇంకా వరదల్లో చిక్కుకున్న వారి సంఖ్య వేలల్లో ఉండటంతో ప్రభుత్వం తన కార్యచరణను ముమ్మరం చేసింది. రేపు ఉదయానికి కల్లా అన్ని రోడ్డు మార్గాలను సరి చేసి బాధితులను రక్షించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆ రాష్ట్ర సీఎం హరీష్ రావత్ తెలిపారు. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, జమ్మూ - కశ్మీర్ రాష్ట్రాల్లో ఒక్కసారిగా వర్షం కురవడంతో నదులు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నాయి. గంగానది ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది. బద్రీనాథ్, హేమకుండ్ తదితర ప్రాంతాల్లో తొమ్మిదివేల మంది యాత్రికులు చిక్కుకున్నట్లు చమోలీ జిల్లా కలెక్టర్ అశోక్ కుమార్ స్పష్టం చేశారు. శనివారం నాటికి మరింత మందిని హెలికాప్టర్ల ద్వారా సురక్షితమైన ప్రాంతాలకు తరలిస్తామన్నారు. ఉత్తరాఖండ్ లో సంభవించిన వర్ష బీభత్సానికి కేదార్ నాథ్ లోయలో ఆరు బ్రిడ్జిలు కొట్టుకుపోగా, రుద్రప్రయోగ్, చమోలీ జిల్లాల్లో కొండ చరియలు విరిగిపడ్డాయి. బద్రీనాథ్ దారిలో చిక్కుకుపోయిన యాత్రికులను జోషిమఠ్ కు తరలించారు. బద్రీనాథ్ యాత్రకు వెళ్లి వరదల్లో చిక్కుకున్న వారిలో కొంతమంది తెలుగు యాత్రికులు ఉన్నారు. అనంతపురం, కర్ణాటక కు చెందిన 130 యాత్రికులు వరదల్లో చిక్కుకుని నానా ఇబ్బందులు పడుతున్నారు. వరదల్లో చిక్కుకున్న వారిలో అనంతపురం, బెళగుప్ప, కదిరి, హిందూపురం, తనకల్లు, మడకశిర ప్రాంతాలకు చెందిన యాత్రికులు ఉన్నారు. 100 మీటర్ల రహదారి తెగిపోవడంతో నాలుగు రోజులుగా యాత్రికులు అవస్థలు వర్ణనాతీతంగా ఉన్నాయి. -
ఆ ఒక్క బ్రిడ్జీ కొట్టుకుపోయింది...
డెహ్రాడూన్: భారీ వర్షాలతో ముంచెత్తుతున్న వరదలు కేధార్నాధ్కు వెళ్లే మార్గంలోని బ్రిడ్జిని ధ్వంసం చేశాయి. మందాకిని నదిపై ఉన్న ఈ వంతెన వరద ఉధృతికి కొట్టుకుపోయింది. దీంతో అక్కడివారి పరిస్థితి ప్రశ్నార్థకంగా మారింది. కేదార్ నాథ్‌కు వెళ్లే మార్గంలోని సోన్ ప్రయాగ్, గౌరీ కుంద్ మధ్య ఈ బ్రిడ్జి ఉంది. గత రెండు రోజులుగా ఎడతెరిపిలేని వర్షాల కారణంగా పర్వత పాద ప్రాంతాల్లో నీటి ప్రవాహం ఎక్కువైంది. ముఖ్యంగా కేధార్ నాధ్ వెళ్లే మార్గంలోని మందాకిని నది ఉప్పొంగుతోంది. ఈ నది పై ఉన్న బ్రిడ్జి ద్వారానే వాహనాల రాకపోకలు జరుగుతుంటాయి. అయితే, ఉన్నట్లుండి బ్రిడ్జి కూలిపోయి వరదల్లో కొట్టుకుపోవడంతో అధికారులు ఉలిక్కిపడ్డారు. సమయానికి బ్రిడ్జిపై ఎవరూ లేకపోవడంతో ప్రాణనష్టం చోటుచేసుకోలేదు. దీంతో ఆ మార్గంలో రవాణా రాకపోకలు స్తంభించగా యాత్రికులు నిలిచిపోయారు. -
భారీ వర్షాలతో చార్ ధామ్ యాత్రకు బ్రేక్
లక్నో/డెహ్రాడూన్: భారీ వర్షాల కారణంగా చార్ధామ్ యాత్రలకు బ్రేక్ పడింది. వర్షాల కారణంగా కొండ చరియలు విరిగిపడుతుండటంతోపాటు దిగువ ప్రాంతాల్లో వరదలు వస్తున్న నేపథ్యంలో చార్ ధామ్ యాత్రికుల ప్రయాణాలను గురువారం ఎక్కడికక్కడ నిలిపేశారు. బద్రీనాథ్, కేదర్నాథ్, యమునోత్రి, గంగోత్రిలను కలిపి చార్ ధామ్ అంటారనే విషయం తెలిసిందే. ప్రతి ఏడాది ఈ నాలుగు ప్రాంతాల్లోని దైవాలను దర్శించుకునేందుకు భారీ సంఖ్యలో భక్తులు వస్తుంటారు. ఇప్పటికే చమోలీ జిల్లాలో భారీ వర్షాలు వస్తున్న నేపథ్యంలో బద్రీనాథ్ క్షేత్రానికి బయలు దేరిన దాదాపు పదివేల మంది ఎక్కడికక్కడ నిలిచిపోయారు. గత పన్నెండుగంటలుగా ఏమాత్రం తెరపునివ్వకుండా వర్షం కురుస్తుందని, అది తగ్గిన తర్వాత తిరిగి యాత్రలకు అనుమతిస్తామని ఉత్తరాఖండ్ ప్రభుత్వం తెలిపింది. అప్పటివరకు యాత్రికులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని రకాల వసతులు ఏర్పాటుచేస్తున్నట్లు వెల్లడించింది. -
రెండేళ్ల తర్వాత పాదం బయటకు
డెహ్రాడూన్: జల ప్రళయం సంభవించి దాదాపు రెండేళ్ల తర్వాత కేదార్నాథ్ ఆలయం వద్ద మరోసారి చనిపోయినవారి అవశేషాలు బయటపడ్డాయి. ఓ వ్యక్తి కాలిబాగం ఆలయ ప్రాంగణంలో బయటపడింది. ప్రధాన ఆలయానికి 50 మీటర్ల దూరంలో కొందరు స్థానికులు శిథిలాలను తొలగిస్తుండగా ఇది కనిపించింది. 2013 జూన్ నెలలో హిమాలయ పర్వత పాద ప్రాంతాలను గంగా ప్రళయం ముంచెత్తిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో వేల మంది చనిపోగా వారిలో చాలామంది మృతదేహాలు కూడా ఆచూకీ లేకుండా పోయాయి. దాదాపు యాబై నుంచి అరవై అడుగుల మేర రాళ్లురప్పలు బురద మట్టి పేరుకు పోయింది. దీన్నంతటిని ప్రస్తుతం తొలగిస్తున్నారు. శనివారం దాదాపు 50 అడుగుల లోతు మేర తవ్వకాలు జరుపుతుండగా కాలిభాగం బయటపడింది. దానికి డీఎన్ఏ పరీక్ష చేసి అనంతరం దహనం చేశారు. -
'భయం పొగొట్టడానికే కేధరినాథ్ యాత్ర'
-
కేదార్నాథ్ యాత్రికులకు మొబైల్లో వాతావరణం
డెహ్రాడూన్: కేదార్నాథ్ యాత్రికులకు అత్యాధునిక సౌకర్యం అందుబాటులోకి రానుంది. హిమాలయ పర్వతాల్లో కొలువైన కేదార్‌నాథుడి దర్శనం కోసం వెళ్లే భక్తులు అక్కడి వాతావరణానికి సంబంధించిన సమాచారాన్ని తమ మొబైల్ ఫోన్ ద్వారా తెలుసుకోవచ్చు. 2013లో ఒక్కసారిగా వచ్చిన భారీ వరదలకు వేలాది మంది యాత్రికులు కొట్టుకుపోయిన విషయం తెలిసిందే. గత అనుభవం నేపథ్యంలో ఉత్తరాఖండ్ ప్రభుత్వం రుద్రప్రయాగ్ జిల్లా భౌగోళిక స్వరూపాన్ని డిజిటల్ మ్యాపింగ్ చేసింది. ఈ డిజిటల్ మ్యాప్ అప్లికేషన్‌ను రుద్రప్రయాగ్ జిల్లా కలెక్టర్ రాఘవ్ లాంగర్ మంగళవారం ప్రారంభించనున్నారు. దీని సాయంతో భక్తులు వాతావరణంలో ఆకస్మిక మార్పులు, రోడ్ల పరిస్థితి గురించి తాజా సమాచారాన్ని మొబైల్ ద్వారా తెలుసుకోవచ్చు. -
హిందీ కవి కేదార్‌నాథ్‌కు జ్ఞాన్‌పీఠ్ పురస్కారం
జాతీయం హోమీబాబా నివాసం వేలం భారత అణు ఇంధన కార్యక్రమ పితామహుడు హోమీ జే బాబాకు చెందిన మూడంతస్తుల భవనం మెహ్రాన్ గిర్‌ను జూన్ 18న వేలం వేశారు. దక్షిణ ముంబైలోని మలబార్ హిల్ ప్రాంతంలో సముద్రానికి అభిముఖంగా ఉన్న ఈ బంగళా రూ. 372 కోట్లకు అమ్ముడుపోయింది. అయితే కొన్నవారి వివరాలను గోప్యంగా ఉంచారు. దీనికి ప్రస్తుతం కస్టోడియన్‌గా ఉన్న నేషనల్ సెంటర్ ఫర్ పెర్ఫామింగ్ ఆర్ట్స్ (ఎన్సీపీఏ) ఈ వేలాన్ని నిర్వహించింది. అయితే ఈ బార్క్ శాస్త్రవేత్తలు ఈ నిర్ణయాన్ని నిరసిస్తూ బాంబే హైకోర్టులో ప్రజాహిత వ్యాజ్యం దాఖలు చేశారు. దీన్ని చారిత్రక కట్టడంగా ప్రకటించాలని కోరుతున్నారు. ప్రపంచ చారిత్రక స్థలంగా రాణీ కీ వావ్ గుజరాత్‌లోని పఠాన్ పట్టణంలో ఇటీవల బయటపడ్డ రాణీ కీ వావ్ బావిని ప్రపంచ వారసత్వ స్థలాల జాబితాలో చేరుస్తూ దోహాలో జూన్ 22న వరల్డ్ హెరిటేజ్ కమిటీ ఆమోదించింది. ఏడు భూగర్భ అంతస్తులున్న ఈ బావికి యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్‌లో చోటు కల్పించింది. సిద్దార్థ జైసింగ్ అనే రాజు 11వ శతాబ్దంలో ఈ బావిని నిర్మించాడు. ఇందులో గంగాదేవి ఆలయం ఉంది. అలాగే హిమాచల్ ప్రదేశ్‌లో కులూ జిల్లాలో గల గ్రేట్హిమాలయన్ నేషనల్పార్క్కు కూడా చోటు లభించింది. ప్రస్తుతం ఆమోదించిన ప్రదేశాలతో కలిసి ప్రపంచ వారసత్వ ప్రదేశాల జాబితా 1001కు చేరింది. చత్తీస్‌గఢ్, ఉత్తరప్రదేశ్ గవర్నర్ల రాజీనామా చత్తీస్‌గఢ్ రాష్ట్ర గవర్నర్ శేఖర్‌దత్ జూన్ 18న తన రాజీనామాను రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీకి అందజేశారు. ఆయన పదవీకాలం జనవరి 2015లో ముగియాల్సి ఉంది. శేఖర్‌దత్ జనవరి 23, 2010లో చత్తీస్‌గఢ్ గవర్నర్‌గా నియమితులయ్యారు. జూన్ 17న ఉత్తరప్రదేశ్ గవర్నర్ బి.ఎల్.జోషి కూడా రాజీనామా చేశారు. పీఎస్‌యూల్లో 25 శాతం వాటా ప్రజలకే: సెబీ ప్రభుత్వ యాజమాన్యంలోని నమోదిత కంపెనీలన్నింటిలో ప్రజలకు కనీసం 25 శాతం షేర్లు (మినిమమ్ పబ్లిక్ షేర్ హోల్డింగ్-ఎంపీఎస్) ఉండాలని సెక్యూరిటీస్ అండ్ ఎక్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా(సెబీ) నిర్దేశించింది. ఈ మేరకు ఆ వాటాలను మూడు సంవత్సరాలలో విక్రయించాలని జూన్ 19న న్యూఢిల్లీలో జరిగిన బోర్డు సమావేశంలో నిర్ణయించింది. దీంతో స్టాక్ ఎక్స్ఛేంజీల్లో నమోదై ఉన్న 36 ప్రభుత్వ రంగ సంస్థలలో షేర్ల విక్రయానికి వీలు కలిగింది. తద్వారా సుమారు రూ. 60 వేల కోట్ల వరకు ప్రభుత్వం సమీకరించడానికి వీలవుతుందని సెబీ చైర్మన్ యు.కె. సిన్హా వివరించారు. రాష్ట్రీయం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ తొలి స్పీకర్‌గా కోడెల ఆంధ్రప్రదేశ్ తొలి శాసనసభ స్పీకర్‌గా డాక్టర్ కోడెల ప్రసాదరావు (టీడీపీ), డిప్యూటీ స్పీకర్‌గా మండలి బుద్ధ ప్రసాద్ (టీడీపీ) ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ధర్మవరం పట్టుచీరకు జాతీయ గుర్తింపు అనంతపురం జిల్లా ధర్మవరం చేనేత పట్టు వస్త్రాలు, పావడాలకు భారత ప్రభుత్వం నుంచి భౌగోళిక గుర్తింపు పత్రం లభించింది. ధర్మవరంలో తయారైన పట్టుచీరలను ఇతర ప్రాంతాల వారు కొనుగోలు చేసి తమ లోగోలను అతికించి విక్రయించేవారు. వాటికి తావివ్వకుండా ప్రభుత్వం ఇక్కడి పట్టుచీరల నాణ్యత, కళలను గుర్తించి జాతీయ పత్రం ఇవ్వడం శుభపరిణామం. తెలంగాణ తొలి అడ్వొకేట్ జనరల్‌గా రామకృష్ణారెడ్డి తెలంగాణ తొలి అడ్వొకేట్ జనరల్‌గా కె. రామకృష్ణారెడ్డి జూన్ 23న బాధ్యతలు స్వీకరించారు. అదే విధంగా తెలంగాణ తొలి అదనపు అడ్వొకేట్ జనరల్‌గా జె. రామచంద్రరావు కూడా బాధ్యతలు చేపట్టారు. తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్‌గా టాటా తెలంగాణలో పెట్టుబడులు ఆకర్షించడానికి టాటాగ్రూప్ బ్రాండ్ అంబాసిడర్‌గా ఉంటుందని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు జూన్ 23న ప్రకటించారు. అంతర్జాతీయ సంస్థలను ఆకర్షించే విధంగా తెలంగాణ రాష్ట్రాన్ని తీర్చిదిద్దే చర్యలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేసీఆర్ తెలిపారు. అంతర్జాతీయం ఐరాస మానవ హక్కుల హైకమిషనర్‌గా జీద్ అల్ -హుస్సేన్ ఐక్యరాజ్య సమితి మానవహక్కుల కొత్త హైకమిషనర్‌గా జోర్డాన్ యువరాజు జీద్ అల్ - హుస్సేన్ నియామకానికి సమితి సర్వ ప్రతినిధిసభ జూన్ 16న ఆమోదం తెలిపింది. ఈయన ఈ పదవిని చేపట్టిన తొలి ముస్లిం, అరబ్. హుస్సేన్ ప్రస్తుతం ఐక్యరాజ్య సమితిలో జోర్డాన్ రాయబారిగా ఉన్నారు. సెప్టెంబర్ 1న హుస్సేన్ మానవహక్కుల హైకమిషనర్‌గా బాధ్యతలు చేపడతారు. ప్రస్తుతం దక్షిణాఫ్రికాకు చెందిన నవీ పిల్లే ఈ పదవిలో కొనసాగుతున్నారు. జీద్ అల్ -హుస్సేన్‌కు శాంతి స్థాపన, అంతర్జాతీయ న్యాయ రంగాల్లో అనుభవం ఉంది. అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు (ఐసీసీ) ఏర్పాటులో ప్రధాన పాత్ర పోషించారు. 51 మిలియన్లకు చేరిన ప్రపంచ కాందిశీకులు 2013 చివరినాటికి పోరాటాలు, సంక్షోభాల వల్ల నిరాశ్రయులైన కాందిశీకులు అత్యధికంగా 51.2 మిలియన్లకు చేరినట్లు ఐక్యరాజ్యసమితి కాందిశీకుల సంస్థ జూన్ 20న పేర్కొంది. ఈ సంఖ్య గతేడాది కంటే ఆరు మిలియన్లు ఎక్కువ. రెండో ప్రపంచ యుద్ధం తరువాత వీరి సంఖ్య అత్యధిక స్థాయికి చేరింది. సిరియా సంక్షోభం వల్ల ఈ సంఖ్య పెరిగిపోయిందని నివేదికలో పేర్కొంది. స్విస్ బ్యాంకుల్లో అక్రమసంపదగల దేశాల జాబితాలో భారత్‌కు 58 వ స్థానం స్విట్జర్లాండ్ సెంట్రల్ బ్యాంకింగ్ అథారిటీ 2013 సంవత్సరపు అధికారిక గణాంకాలను జూన్ 22న విడుదల చేసింది. ఈ లెక్కల ప్రకారం స్విస్ బ్యాంకుల్లో అక్రమంగా నిల్వ ఉన్న సంపద గల దేశాల జాబితాలో భారత్ 58వ స్థానంలో ఉంది. గతేడాది భారత్ 70వ స్థానంలో ఉండేది. స్విస్ బ్యాంకుల్లో ఉన్న ప్రపంచ సంపద 1.6 ట్రిలియన్ డాలర్లలో భారత్ వాటా కేవలం 0.15 శాతం. ఈ మొత్తం సంపద రూ. 14వేల కోట్లు. కాగా అగ్రస్థానంలో 20 శాతం వాటాతో యునెటైడ్ కింగ్డమ్, తరువాత స్థానాల్లో అమెరికా, వెస్టిండీస్, జర్మనీ ఉన్నాయి. క్రీడలు బంగ్లాదేశ్ మాజీ కెప్టెన్‌పై ఎనిమిదేళ్ల నిషేధం బంగ్లాదేశ్ క్రికెట్ ఆటగాడు, మాజీ కెప్టెన్ మహమ్మద్ ఆష్రాఫుల్‌పై ఆ దేశ క్రికెట్ బోర్డు ఎనిమిదేళ్ల నిషేధం విధించింది. ఆష్రాఫుల్తోపాటు ఢాకా గ్లాడియేటర్స్ జట్టు యజమాని పిహబ్ చౌదరి పదేళ్ల నిషేధానికి గురయ్యాడు. మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పడినట్లు నేరాన్నిఅంగీకరించినందుకు ఆష్రాఫుల్‌పై బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు జూన్ 18న క్రమశిక్షణ ఉల్లంఘన కింద చర్యలను తీసుకుంది. షూటర్ జీతూకు స్వర్ణం స్లొవేనియాలోని మారిబోర్‌లో జరుగుతున్న ఐఎస్ఎస్ఎఫ్ ప్రపంచకప్‌లో భారత ఆటగాడు జీతూరాయ్ స్వర్ణం సాధించాడు. ఎయిర్ పిస్టల్ విభాగం ఫైనల్ రౌండ్లో 200.8 పాయింట్లతో స్వర్ణం కైవసం చేసుకున్నాడు. ఈ పతకంతో పాటు ఇంతకు ముందే ప్రీ పిస్టల్‌లో రజతం సాధించిన జీతూ ప్రపంచకప్‌లో రెండు పతకాలు సాధించిన తొలి భారతీయుడిగా రికార్డులకెక్కాడు. అత్యుత్తమ బౌలింగ్ రికార్డు నెలకొల్పిన స్టువర్ట్ బిన్నీ వన్డే క్రికెట్లో భారత బౌలర్ స్టువర్ట్ బిన్నీ అత్యుత్తమ బౌలింగ్ రికార్డు నెలకొల్పాడు. బంగ్లాదేశ్‌లోని మిర్పూర్లో జూన్ 17న భారత్, బంగ్లాదేశ్‌ల మధ్య జరిగిన రెండో వన్డేలో నాలుగు పరుగులకు ఆరు వికెట్లు తీసి సంచలనం సృష్టించాడు. ఇప్పటివరకు ఉన్న అనిల్‌కుంబ్లే రికార్డును అధిగమించాడు. కుంబ్లే 1993లో వెస్టిండీస్‌పై కోల్‌కతాలో 12 పరుగులకు 6 వికెట్లు తీసిన రికార్డు ఇప్పటివరకు ఉంది. ఫిడే వరల్డ్ రాపిడ్ చెస్ విజేత మాగ్నస్ కార్లస్ ప్రపంచ నంబర్‌వన్ చెస్ ఆటగాడు మాగ్నస్ కార్లస్ ఫిడే వరల్డ్ రాపిడ్ చెస్ చాంపియన్‌షిప్‌ను కైవసం చేసుకున్నాడు. చెస్ క్లబ్ ఆఫ్ దుబాయ్‌లో జూన్ 18న జరిగిన పోటీల్లో మాగ్నస్ 15 పాయింట్లకు గాను 11 పాయింట్లు గెలిచి విజేతగా నిలిచాడు. ఈ టోర్నమెంట్‌ను ప్రపంచ చెస్ ఫెడరేషన్ నిర్వహించడం ఇది మూడోసారి. ఆస్ట్రియా గ్రాండ్ ప్రి విజేత రోస్‌బర్గ్ ఆస్ట్రియా గ్రాండ్ ప్రిలో మెర్సిడెస్ డ్రైవర్ జర్మనీకి చెందిన నికో రోస్‌బర్గ్ విజేతగా నిలిచాడు. జూన్ 22న 71 ల్యాప్‌ల రేసును రోస్‌బర్గ్ 27 నిమిషాల 54.976 సెకన్లలో పూర్తిచేసి అగ్రస్థానంలో నిలిచాడు. ఈ సీజన్లో రోస్బర్గ్కు ఇది మూడో విజయం. కాగా ఇదే జట్టుకు చెందిన లూయీస్ హామిల్టన్ రెండో స్థానాన్ని దక్కించుకున్నాడు. సైన్స్ అండ్ టెక్నాలజీ ఆకాశ్ క్షిపణి ప్రయోగం విజయవంతం ఆకాశ్ క్షిపణి శక్తి, సామర్థ్యాల నిర్ధారణకు సైన్యం నిర్వహించిన ఆఖరు పరీక్ష విజయవంతమైంది. దీంతో సైన్యం అమ్ముల పొదిలో చేరేందుకు ఈ క్షిపణి సిద్ధమైంది. రక్షణ రంగ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీఓ) రూపొందించిన ఆకాశ్‌ను జూన్ 18న సరిహద్దు దగ్గర పరీక్షించారు. గగనతలంలో 30 మీటర్ల ఎత్తులో ఎగురు తున్న బన్షీ అనే చిన్న మానవరహిత వాహనాన్ని తక్కువ ఎత్తులోనే ఎగిరివెళ్లి ఆకాశ్ ధ్వంసం చేసింది. దీంతో సబ్ సోనిక్ క్రూయిజ్ క్షిపణులను సైతం ఆకాశ్ ధ్వంసం చేయగలదని రుజువైంది. ఆకాశ్ 30 కి.మీ దూరంలో, 18 కి.మీ ఎత్తులో ఉన్న లక్ష్యాలను చేదించగలదు. సుఖోయ్ నుంచి అస్త్ర పరీక్ష గగనతలం నుంచి గగనతలంలోని లక్ష్యాలను ధ్వంసం చేయగల అస్త్ర క్షిపణిని సుఖోయ్ 30 ఎంకేఐ యుద్ధ విమానం నుంచి భారత వాయుసేన విజయవంతంగా పరీక్షించింది. జూన్ 20న గోవా సమీపంలోని నావికాదళ స్థావరంపై క్షిపణి నియంత్రణ, మార్గదర్శకత్వంపై ఆకాశంలో 6 కి.మీల ఎత్తులో ఈ పరీక్షలను రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ నిర్వహించింది. అవార్డులు నార్వే మాజీ ప్రధానికి ఆసియా నోబెల్ నార్వే మాజీ ప్రధాని గ్రో హార్లేమ్ బ్రంట్ ల్యాండ్‌కు ఆసి యా నోబెల్‌గా పేర్కొనే తాంగ్ ప్రైజ్ లభించింది. సుస్థిర అభివృద్ధి-అమలు, నాయకత్వం, నవకల్పనలకు గాను అవార్డుల కమిటీ ఆమెను ఎంపిక చేసింది. బ్రంట్‌లాండ్ గతంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ డెరైక్టర్ జనరల్, ఐక్యరాజ్యసమితి పర్యావరణ, అభివృద్ధి ప్రపంచ కమిషన్ అధిపతిగా పనిచేశారు. పారితోషికంలో నోబెల్ కంటే విలువైన తాంగ్ తొలి బహుమతిని బ్రంట్ ల్యాండ్‌కు ప్రకటించారు. ఈ బహుమతి మొత్తం విలువ రూ. 10 కోట్లు. తాంగ్ ప్రైజ్ వ్యవస్థాపకుడు తైవాన్ దేశానికి చెందిన డాక్టర్ శామ్యూల్ ఇన్. రెండేళ్లకు ఓసారి ఈ అవార్డును ప్రకటిస్తారు. మురళీమనోహర్‌జోషికి రష్యా పురస్కారం భారతీయ జనతాపార్టీ సీనియర్ నాయకుడు మురళీ మనోహర్ జోషి రష్యా అత్యున్నత పౌర పురస్కారంగా పిలిచే ఆర్డర్ ఆఫ్ ఫ్రెండ్షిప్ను అందుకున్నారు. ఈ పురస్కారాన్ని రష్యా విదేశీయులకు అందిస్తోంది. భారత్‌లో జూన్ 18,19 తేదీల్లో పర్యటించిన రష్యా ఉప ప్రధాని దిమిత్రీ రోగోజిన్ అవార్డును జోషీకి అందజేశారు. భారత శాస్త్రవేత్తకు ప్రపంచ ఆహార పురస్కారం భారత్‌లో పుట్టి అమెరికాలో స్థిరపడిన సంజయ రాజారామ్ అనే వృక్షశాస్త్రవేత్త ప్రతిష్ఠాత్మక ప్రపంచ ఆహార పురస్కారం -2014కు ఎంపికయ్యారు. రాజారామ్ గోధుమ రకాలను సంకరీకరణం చేసి, విశిష్ట జన్యు లక్షణాలు గల అధిక ఉత్పత్తినిచ్చే గోధుమలను సృష్టించారు. ఆయన అభివృద్ధి చేసిన 480 గోధుమ రకాలను 51 దే శాల్లో విడుదల చేశారు. ఉత్తర ప్రదేశ్‌లో పుట్టిన రాజారామ్ మెక్సికోలో స్థిరపడ్డారు. హరిత విప్లవ పితామహుడు నార్మన్ బోర్లాగ్‌తో కలిసి ఆయన పనిచేశారు. ప్రపంచ ఆహార పురస్కారాన్ని 1986లో నార్మన్‌బోర్లాగ్ నెలకొల్పారు. ఈ అవార్డును రాజారామ్ అక్టోబర్‌లో అందుకోనున్నారు. హిందీ కవి కేదార్‌నాథ్‌కు జ్ఞాన్‌పీఠ్ 2013 సంవత్సరానికి ప్రతిష్ఠాత్మక జ్ఞాన్‌పీఠ్ పురస్కారం (49వది) ప్రముఖ హిందీకవి కేదార్నాథ్ సింగ్‌కు ప్రకటించారు. ఉత్తరప్రదేశ్‌లోని బలియాలో జన్మించిన 80 ఏళ్ల కేదార్నాథ్ కవిత లతోపాటు పలు వ్యాసాలు, కథలు రాశారు. అభీ బిల్కుల్ అభీ, యహ సే దేఖో రచనలు ఆయనకు పేరు తెచ్చిపెట్టారు. ఈ అవార్డుకు ఎంపికైన హిందీ రచయితల్లో కేదార్నాథ్ పదో వ్యక్తి. అవార్డు కింద రూ. 11 లక్షల నగదు, ప్రశంసాపత్రం అందిస్తారు. 1965 నుంచి ఈ అవార్డును ప్రదానం చేస్తున్నారు. 2012 సంవత్సరానికి రావూరి భరద్వాజకు ఈ పురస్కారం లభించింది. సల్మాన్ రష్దీకి పెన్‌పింటర్ ప్రైజ్ భారత సంతతికి చెందిన ప్రముఖ రచయిత సల్మాన్ రష్దీ 2014 సంవత్సరానికి ప్రతిష్ఠాత్మకమైన పెన్ పింటర్ ప్రైజ్ కు ఎంపికయ్యారు. సాహిత్యసేవ, భావ ప్రకటనకు ఇచ్చిన మద్దతుకుగాను ఈ బహుమతి లభించింది. ఈ మేరకు అవార్డులను ప్రదానం చేసే రైటర్ చారిటీ ఇంగ్లిష్ పెన్ అనే సంస్థ జూన్ 20న లండన్‌లో ప్రకటించింది. ఈ బహుమతిని 2009లో నోబెల్ అవార్డు గ్రహీత, ప్రముఖ ఆంగ్ల నాటక రచయిత హెరాల్డ్ పింటర్ జ్ఞాపకార్థం నెలకొల్పారు. -
కేదర్నాథ్ యాత్రలో విరిగిపడిన కొండచరియలు
డెహ్రాడూన్: కొండచరియలు కూలిపడటంతో కేదార్నాథ్ యాత్రకు అవరోధం ఏర్పడింది. భారీ వర్షాల కారణంగా ఉత్తరాఖండ్‌లోని రుద్రప్రయాగ్ వద్ద శనివారం కొండచరియలు కూలిపడటంతో కేదార్నాథ్ వైపు వెళ్లే తిల్వాడా-గుప్తకాశీ మార్గం మూసుకుపోయింది. కొండచరియలు పడటం వల్ల ఎవరికీ గాయాలు కాకున్నా, వాతావరణ పరిస్థితుల దష్ట్యా రాష్ట్రప్రభుత్వం కేదార్నాథ్ యాత్రను నిలిపివేసింది. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ మార్గంలో ముందుకు సాగడం ప్రమాదంతో కూడుకున్నదని, వాతావరణం మెరుగుపడేంత వరకు ఎలాంటి రిస్కు తీసుకోదలచుకోలేదని ఉత్తరాఖండ్ రాష్ట్ర ప్రభుత్వ అధికారి ఒకరు చెప్పారు. ఇలాగే, వాతావరణ పరిస్థితి అనుకూలించకపోవడంతో పదిరోజుల కిందట కూడా కేదార్నాథ్ యాత్రకు అవరోధం ఏర్పడింది. అయితే, యాత్రికుల భద్రత కోసం తగిన ఏర్పాట్లన్నీ చేసినట్లు ఉత్తరాఖండ్ ప్రభుత్వం ప్రకటించింది. -
ఉత్తరాఖండ్ లో మరిన్ని విపత్తులు వచ్చే అవకాశం!
న్యూఢిల్లీ: ఉత్తరాఖండ్ ప్రాంతంలో మరిన్ని విపత్తులు సంభవించేందుకు ఆస్కారముందని ఐఏఎఫ్ అధికారి ఒకరు హెచ్చరించారు. గత జూన్‌లో ఉత్తరాఖండ్‌లో భీకరమైన రీతిలో వరదలు సంభవించి భారీ ఎత్తున ప్రాణనష్టం వాటిల్లిన సందర్భంగా.. గాలింపు, సహాయ, పునరావాస చర్యలు చేపట్టడంలో కీలకపాత్ర పోషించిన ఎయిర్ వైస్ మార్షల్ ఎస్ఆర్కే నాయర్ సోమవారమిక్కడ ఒక సెమినార్లో మాట్లాడుతూ ఈ హెచ్చరిక చేశారు. ‘‘విపరీతంగా కురిసిన వర్షాల కారణంగా కేదార్నాథ్ ఎగువన ఉన్న భారీ హిమానీనద సరస్సు కరిగిపోయి నీరంతా ఒక్క ఉదుటన దిగువకు ప్రవహించి తీవ్రమైన బీభత్సం సృష్టించింది. ఇటువంటి హిమానీనద సరస్సులు ఈ ప్రాంతంలో మరిన్ని ఉన్నాయి. కాబట్టి భవిష్యత్తులో ఇటువంటి విపత్తులు సంభవించేందుకు ఆస్కారం ఉంది’’ అని ఆయన వివరించారు. ఈ నేపథ్యంలో ఎటువంటి విపత్తు సంభవించినా తగిన విధంగా ఎదుర్కొనేందుకు, సత్వర సహాయ చర్యలు చేపట్టేందుకు వీలుగా కీలకమైన ప్రాంతాల్లో హెలికాప్టర్ల కోసం ఇంధనంతో సహా సహాయ సామగ్రిని సైతం తగిన మొత్తంలో నిల్వ చేసి ఉంచాల్సిన అవసరం ఎంతయినా ఉందని నాయర్ సూచించారు. -
కేదార్నాథ్ యాత్ర పునఃప్రారంభం
గోపేశ్వర్: మూడు నెలల వ్యవధి తర్వాత హిమాలయ క్షేత్రాలైన కేదార్నాథ్, బద్రీనాథ్ ఆలయాలకు శనివారం నుంచి యాత్రలు పునఃప్రారంభమయ్యాయి. తొలి బృందంలో రెండువందల మంది యాత్రికులు ఈ రెండు ఆలయాలను సందర్శించుకున్నారు. ఈ ఏడాది జూన్‌లో సంభవించిన వరదల్లో భారీ ప్రాణనష్టం సంభవించిన దరిమిలా, ఈ క్షేత్రాలకు రాకపోకలు నిలిచిపోయిన సంగతి తెలిసిందే. వరదలు తగ్గుముఖం పట్టిన తర్వాత ఈ క్షేత్రాల్లో పునర్నిర్మాణ పనులు చేపట్టారు. కొత్తగా నిర్మించిన కట్టడాలపై ఒత్తిడి ఎక్కువగా ఉండకుండా కేదార్నాథ్ ఆలయానికి రోజుకు వంద మంది యాత్రికులను మాత్రమే అనుమతిస్తున్నామని అధికారులు చెప్పారు. కేదార్నాథ్ ఆలయాన్ని శనివారం దర్శించుకున్న వారిలో కేంద్ర జలవనరుల శాఖ మంత్రి హరీష్ రావత్ ఉన్నారు. కాగా, యాత్రల కోసం గుప్తకాశీలో రోజూ యాత్రికుల నమోదు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు చౌహాన్ తెలిపారు. యాత్రికుల భోజన వసతుల కోసం గౌరీకుండ్-కేదార్నాథ్ మార్గంలోని భీమబలి, లెంచౌనీలలో ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు. కేదార్నాథ్-బద్రీనాథ్ ఆలయాలకు వచ్చే యాత్రికుల కోసం ఉచిత భోజన వసతి సౌకర్యాలు కల్పిస్తున్నట్లు బద్రీనాథ్-కేదార్నాథ్ ఆలయ సమితి ప్రధాన కార్యనిర్వాహక అధికారి బీడీ సింగ్ తెలిపారు. -
1 నుంచి కేదార్నాథ్ యాత్ర పునఃప్రారంభం
ఉత్తరాఖండ్‌లో జూన్‌లో సంభవించిన భారీ వర్షాలు, వరదల తాకిడికి మరుభూమిగా మారిన ప్రసిద్ధ కేదార్నాథ్ పుణ్యక్షేత్రం పునరుద్దరణ పనులు పూర్తికావస్తున్నాయి. వచ్చే నెల 1 నుంచి కేదార్నాథ్ యాత్ర పునఃప్రారంభం కానున్నట్టు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి విజయ్ బహుగుణ గురువారం చెప్పారు. కాగా ఈ ప్రాంతంలో రహదారుల పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని తొలుత పరిమిత సంఖ్యలోనే భక్తులను అనుమతించనున్నట్టు బహుగుణ తెలిపారు. వరదలకు ధ్వంసమైన రోడ్లు ఇంకా పునర్నిర్మాణ దశలో ఉన్నాయి. వరదల తాకిడికి కేదార్‌నాథ్‌తో పాటు ఇతర పర్యాటక ప్రాంతాల్లో భారీ ప్రాణ, ఆస్తి నష్టం జరిగిన సంగతి తెలిసిందే. -
మట్టి దిబ్బల కింద 1.9 కోట్ల మనీ!
డెహ్రాడూన్: మృతదేహాల కోసం వెతుకుతుంటే.. రూ.కోట్ల మనీ దొరికింది.. వరద విలయంలో ఉత్తరాఖండ్‌లోని కేదార్నాథ్ ఆలయ పరిసరాలు శవాల దిబ్బగా మారడం తెలిసిందే. మృతదేహాల కోసం మట్టి దిబ్బల కింద గత వారం గాలిస్తుండగా ఆలయ సమీపంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు చెందిన లాకర్ దొరికింది. వరదల్లో ఆలయం పక్కనున్న ఎస్బీఐ ఆఫీసు నుంచి ఇది కొట్టుకుపోయింది. చివరికి ఇలా దొరికింది. డెహ్రాడూన్ నుంచి వచ్చిన ఎస్బీఐ అధికారులు శనివారం దాన్ని తెరచి అందులో ఉండాల్సిన రూ.1.9 కోట్లు సురక్షితంగా ఉన్నట్లు గుర్తించారు. -
కేదార్‌నాథ్‌లో బయటపడ్డ రూ.1.90 కోట్ల నగదు
డెహ్రాడూన్: ప్రకృతి విలయానికి మరుభూమిగా మారిన ప్రసిద్ధ కేదార్నాథ్ ఆలయం వెలుపల కోటి 90 లక్షల రూపాయల నగదు గల బ్యాంక్ లాకర్ బయటపడింది. వరదల ధాటికి దెబ్బతిన్న ఉత్తరాఖాండ్‌లోని ఈ పుణ్యక్షేత్రం పునరుద్ధరణ చర్యల్లో భాగంగా బురద, బండరాళ్లను తొలగిస్తుండగా ఈ నెల 11న దీన్ని కనుగొన్నారు. భారతీయ స్టేట్ బ్యాంక్‌కు చెందిన లాకర్‌గా గుర్తించినట్టు ఓ సినీయర్ పోలీస్ అధికారి ఒకరు ఆదివారం చెప్పారు. వెంటనే డెహ్రాడూన్ ఎస్బీఐ అధికారులను ఈ సమాచారాన్ని చేరవేశారు. పోలీసులు, బ్యాంక్ అధికారుల సమక్షంలో శనివారం ఈ లాకర్‌ను తెరవగా భారీ మొత్తం ఉన్నట్టు గుర్తించారు. ఈ నగదును ఎస్బీఐ చీఫ్ మేనేజర్ అనూప్ లంబాకు అప్పగించినట్టు రుద్రప్రయాగ ఎస్సీ వరీందర్ జీత్ సింగ్ చెప్పారు. చమోలీ జిల్లాలోనూ ఇటీవల ౩౩ లక్షల రూపాయల గల బ్యాంక్ లాకర్‌ను కనుగొన్నారు. భారీ వర్షాలు, వరదల ధాటికి కేదార్నాథ్ తదితర ప్రాంతాల్లో భారీ ప్రాణ, ఆస్తి నష్టం జరిగిన సంగతి తెలిసిందే. ఈ విపత్తులో ఎస్బీఐ కార్యాలయం ఉన్న భవనం ధ్వంసమైంది. -
కేదార్నాథ్ ఆలయంలో పూజలు ప్రారంభం
కేదార్నాథ్ : ప్రకృతి ప్రకోపానికి విలవిలలాడిన కేదార్నాథ్ ఆలయంలో తిరిగి పూజలు ప్రారంభం అయ్యాయి. ఉత్తరాఖండ్‌లో సంభవించిన భారీ వరదలు ప్రఖ్యాత శైవక్షేత్రాన్నిఅతలాకుతలం చేయడమేగాక, వందలాది భక్తులు, స్థానికులను బలిగొన్న విషయం తెలిసిందే. ఈక్రమంలోనే పూజాధికాలకు దూరమైన కేదార్‌నాథ్‌లో మళ్లీ 86 రోజుల తర్వాత బుధవారం నుంచి ప్రార్థనలు మొదలయ్యాయి. పవిత్ర, పాపపరిహార కార్యక్రమాల అనంతరం పూజారులు, ఆలయ కమిటీ అధికారులతో కూడిన 24మంది సభ్యుల బృందం సమక్షంలో ప్రార్థనలు పునరుద్దరణ జరిగాయి. కాగా కేదార్నాథ్ ఆలయ పూజలకు ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి విజయ్ బహుగుణ తన కేబినెట్ సహచరులతో హాజరయ్యేందుకు బయల్దేరినా వాతావరణం అనుకూలంగా లేకపోవటంతో డెహ్రాడూన్లోనే నిలిచిపోవల్సి వచ్చింది. కాగా ఆలయంలో చాలారోజులు తర్వాత జరుగుతున్న నేపథ్యంలోనే ఈ ప్రార్థనలు జరుగుతున్నాయే తప్ప భక్తులు సందర్శించే స్థాయి పూజలు ఇవి కావని, వరదల ధాటికి పూర్తిగా దెబ్బతిన్న రోడ్లు బాగుపరచాల్సి ఉందని అధికారులు తెలిపారు. ఇదిలావుంటే వరద బీభత్సంలో ప్రాణాలు కోల్పోయినవారి మృతదేహాలను ఖననం చేయడంలో భాగంగా జరుగుతున్న కూంబింగ్ ఆపరేషన్ ప్రార్థనల నిమిత్తం నిలిపివేస్తున్నామని, ప్రార్థనలయ్యాక తిరిగి ప్రారంభిస్తామని ఉత్తరాఖండ్ డిజిపి సత్యవ్రత్ బన్సాల్ తెలిపారు. ప్రాగరుర్చట్టి, రంబారా ప్రాంతాల్లో ఇంకా మృతదేహాల ఖననం చేయాల్సి ఉందన్నారు. -
కేదార్ లోయలో 64 మృతదేహాలు లభ్యం
భారీ వర్షాలు, కొండచరియలు విరిగి పడటంతో ప్రకృతి విలయతాండవం చేసిన ఉత్తరాఖండ్ రాష్ట్రంలో మరో 64 మృతదేహాలు బయటపడ్డాయి. వాతావరణం కాస్త సాధారణ స్థితికి చేరుకోవడంతో గత కొన్ని రోజులుగా అక్కడ పరిసరాలను పరిశుభ్రం చేసే పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ క్రమంలో, కేదార్ లోయ ప్రాంతంలో చెల్లాచెదురుగా పడి ఉన్న 64 మృతదేహాలను కనుగొన్నారు. వాటికి అంత్యక్రియలు కూడా పూర్తి చేసినట్లు ఓ సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. జూన్ నెలలో ప్రకృతి ఉత్పాతం సంభవించినప్పుడు భయంతో కొండల మీదకు ఎక్కినవారే ఇలా మృత్యువాత పడి ఉంటారని అధికారులు భావిస్తున్నారు. విపరీతమైన చలి కారణంగానే వీరంతా చనిపోయి ఉండొచ్చని ఇన్స్పెక్టర్ జనరల్ ఆర్ఎస్ మీనా తెలిపారు. గడిచిన రెండు రోజుల్లో మొత్తం 64 మృతదేహాలకు రాంబాడా, కేదార్నాథ్ ప్రాంతాల మధ్యలో దహన క్రియలు పూర్తి చేసినట్లు ఆయన చెప్పారు. పర్వత ప్రాంతాలలో చిక్కుకున్న మృతదేహాలను గుర్తించేందుకు తమ ఆపరేషన్లు కొనసాగుతున్నాయని, ఇంతకుముందు వాతావరణం బాగోని కారణంగా అక్కడకు వెళ్లలేకపోయామని ఆయన చెప్పారు. వాతావరణం సహకరిస్తే, మరికొన్ని రోజుల పాటు ఈ కార్యక్రమం కొనసాగుతుందని, ప్రధానంగా జంగల్ ఛత్తి, రాంబాడా, గౌరీగావ్, భీమ్బాలి ప్రాంతాల్లో ఈ గాలింపు ఉంటుందన్నారు. ఈ ప్రాంతాల్లోనే ఎక్కువ మంది మృత్యువాత పడి ఉండొచ్చని అంచనా. వాతావరణం బాగుపడటంతో పాటు.. సెప్టెంబర్ 11వ తేదీన ఈ ప్రాంతంలో పూజలు పునఃప్రారంభం కావాల్సి ఉండటం కూడా అధికారులు త్వరపడటానికి కారణంగా కనిపిస్తోంది. ప్రస్తుతానికి బహిరంగ ప్రదేశాల్లో ఉన్న మృతదేహాలనే బయటకు తీస్తున్నాం తప్ప శిథిలాల కింద చిక్కుకుపోయినవాటి గురించి ఇంకా ఎలాంటి చర్యలు చేపట్టలేదని డీజీ మీనా తెలిపారు. డీజీపీ సత్యవ్రత బన్సల్‌తో కలిసి ఆయన కేదార్నాథ్ ప్రాంతంలో పర్యటించారు. దాదాపు 30 మంది పోలీసు, ఎన్డీఆర్ఎఫ్ బలగాలు ప్రస్తుతం అక్కడ సహాయ కార్యకలాపాల్లో ఉన్నాయి.