గోపేశ్వర్: ఛార్‌ధామ్ యాత్ర మొదలుకానున్న నేపథ్యంలో విచ్చేసే లక్షలాది మంది భక్తులు, సందర్శకుల సౌకర్యార్థం చేపట్టిన మౌలికసదుపాయాలు తదితర సన్నాహక కార్యక్రమాలకు మంచు అడ్డుపడుతోంది. గురువారం భద్రీనాథ్, కేదార్‌నాథ్ పర్వతప్రాంతాల్లో విపరీతంగా మంచు కురిసింది. లోయ ప్రాంతాలను వర్షం ముంచెత్తింది. ఈ ఆలయాలు కొలువుతీరిన ఛమోలీ, రుద్రప్రయాగ్ జిల్లాల్లో మంచు, వర్షం, అతిశీతల గాలులు ఉష్ణోగ్రతలను తగ్గించేస్తున్నాయని అధికారులు తెలిపారు.
మరో నాలుగు రోజుల్లో భక్తులను కేదార్‌నాథ్ ఆలయ దర్శనానికి అనుమతించనున్న ఈ తరుణంలో గుడికి వెళ్లే ట్రెక్ మార్గంలో మంచు పడుతోంది. అక్షయ తృతీయను పురస్కరించు కుని ఈనెల 22వ తేదీన గంగోత్రి, యము నోత్రి ఆలయాలు తెరుచు కోను న్నాయి. కేదార్‌నాథ్ ఆల యాన్ని 25వ తేదీన, భద్రీనాథ్ ఆలయాన్ని ఈనెల 27వ తేదీన భక్తుల సందర్శనార్థం తెరుస్తారు. లక్షలాది మంది ఛార్‌ధామ్ యాత్రకు తరలివస్తున్న ఈ సమయంలో మంచు ముంచుకురావడంపై స్థానిక అధికారులు ఆందోళన వ్యక్తంచేశారు.
Comments
Please login to add a commentAdd a comment